సాక్షి, హైదరాబాద్ : జీహెచ్‌ఎంసీలో ప్రమాదం చోటుచేసుకుంది. ఎంజీబీఎస్ కేంద్రంలో చెత్త తరలిస్తుండగా ప్రమాదవశాత్తు ఇద్దరు ఉద్యోగులు మంగళవారం మృతి చెందారు. జీహెచ్‌ఎంసీ ప్రభుత్వ ఉద్యోగి హెల్పర్ ఆరీఫ్, అవుట్ సోర్సింగ్ ఉద్యోగి హాజిఖాన్.. విధుల్లో ఉండగా భారీ వాహనం ఒక్కసారిగా వెనుకకు రావడంతో ఈ ఘటన సంభవించింది.
ఈ దుర్ఘటనపై మేయర్ బొంతు రామ్మోహన్, కమిషనర్ దానకిషోర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు రూ. 2 లక్షల ఎక్స్‌గ్రేషియాను ప్రకటించినట్లు తెలిపారు. మృతుల కుటుంబాలను ఆదుకుంటామని హామీ ఇచ్చిన మేయర్.. ప్రభుత్వ ఉద్యోగి ఆరీఫ్ కుటుంబంలో ఒకరికి ఉద్యోగం కల్పిస్తామని వెల్లడించారు. అంతేగాక ఇరు కుటుంబాలకు పింఛను సదుపాయం కల్పిస్తామని మేయర్ భరోసానిచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment