bonthu rammohan
-
కాంగ్రెస్‌లోకి మాజీ మేయర్ బొంతు?
కుషాయిగూడ(హైదరాబాద్): తెలంగాణ ఉద్యమనేత, గ్రేటర్ హైదరాబాద్ మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ ఆదివా రం ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఇటీవల బీఆర్ఎస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతోపాటు పలువురు కీలక నేతలు ముఖ్యమంత్రిని కలుస్తుండటం చర్చనీయాంశంగా మారింది. విద్యార్థి నాయకుడిగా తెలంగాణ ఉద్యమంలో కీలక భూమిక పోషించిన రామ్మోహన్‌కు తెలంగాణ ప్రభుత్వ ఏర్పాటు అనంతరం చాలాకాలం వరకు ఎలాంటి పదవులు దక్కలేదు. బొంతు అసంతృప్తిని గుర్తించిన అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ ఆయనను జీహెచ్ఎంసీ ఎన్నికల బరిలో నిలిపి తెలంగాణ ఏర్పడిన అనంతరం గ్రేటర్ హైదరాబాద్ మొదటి మేయర్‌గా అవకాశం కల్పించారు. అనంతరం తన సతీమణి బొంతు శ్రీదేవిని చర్లపల్లి కార్పొరేటర్‌గా గెలిపించుకున్నారు. మేయర్‌గా కొనసాగుతూ ఉప్పల్ నియోజకవర్గం ఎమ్మెల్యే స్థానంపై బొంతు కన్నేశారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో సిట్టింగ్ ఎమ్మెల్యే బేతి సుభాష్‌రెడ్డి, ప్రస్తుత ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డిలు కూడా ఉప్పల్ స్థానం కోసం పోటీపడగా కేసీఆర్ బండారికే టికెట్ ఖారారు చేశారు. పార్టీ టికెట్ ఇవ్వలేదని మనస్తాపం చెంది కొన్ని రోజులపాటు మౌనంగా ఉన్న రామ్మోహన్‌తో కేసీఆర్, కేటీఆర్ మాట్లాడి సర్దిచెప్పారు. త్వరలో జరగబోయే లోక్‌సభ ఎన్నికల్లో సికింద్రాబాద్, మల్కాజిగిరి పార్లమెంట్ స్థానాల్లో ఏదైనా ఒకచోట పోటీ చేసే అవకాశం కల్పించాలని బీఆర్ఎస్ పెద్దలను బొంతు కోరినప్పటికి టికెట్ దక్కే చాన్స్ కనిపించడం లేదు. ఈ నేపధ్యంలోనే ఆయన ముఖ్యమంత్రిని కలిసినట్లు సమాచారం. ఈ పరిణామాల నేపథ్యంలో త్వరలోనే ఆయన కాంగ్రెస్ గూటికి చేరడం ఖాయమని స్పష్టమవుతోంది. సోమవారం తన మనసులో మాటను మీడియాకు వెల్లడించనున్నట్లు సమాచారం. -
బీఆర్ఎస్కు బిగ్ షాక్.. సీఎం రేవంత్‌తో బొంతు రామ్మోహన్ భేటీ
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్‌పై కాంగ్రెస్ ఫోకస్ పెట్టింది. నగరంలో పట్టు పెంచుకోవడానికి ఆపరేషన్ ఆకర్ష్ వేగవంతం చేసింది. ఇప్పటికే మాజీ డిప్యూటీ మేయర్ బాబా ఫసియోద్దిన్ కాంగ్రెస్‌లో చేరగా, తాజాగా.. సీఎం రేవంత్‌రెడ్డితో మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ భేటీ అయ్యారు. ఆయన పార్టీ మారతారని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఉత్కంఠ నెలకొంది. కాగా, సీఎం రేవంత్‌ను కలుస్తున్న బీఆర్ఎస్ నేతల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. బీఆర్ఎస్పై బొంతు రామ్మోహన్ కొంతకాలంగా అసంతృప్తిగా ఉన్న సంగతి తెలిసిందే. కాగా, అసెంబ్లీ ఎన్నికల్లో బొంతు రామ్మోహన్ బీఆర్ఎస్ నుంచి ఉప్పల్ నియోజకవర్గ టికెట్ ఆశించి భంగపడ్డారు. అనూహ్యంగా ఆ నియోజకవర్గ టికెట్‌ను బండారు లక్ష్మారెడ్డికి కేటాయించడంతో బొంతు రామ్మోహన్‌లో అసంతృప్తి రగిలింది. ప్రస్తుతం మరోసారి బీఆర్ఎస్ నుంచి పార్లమెంట్ టికెట్ ఆశిస్తున్నట్లు సమాచారం. లోక్‌సభ సీటు కూడా దక్కే అవకాశం లేకపోవడంతో పార్టీ మారాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. ఈ క్రమంలోనే సీఎం రేవంత్ రెడ్డితో భేటీ అయినట్లు సమాచారం. ఇదీ చదవండి: ఏఐసీసీకి తెలంగాణ సేఫ్ జోన్‌గా మారిందా? -
బీఆర్ఎస్ నుంచి ఎంపీగా పోటీ చేస్తా
కుషాయిగూడ: తాను బీఆర్ఎస్ పార్టీని వీడనున్నట్లు వస్తున్న వార్తల్లో వాస్తవం లేదని మాజీ మేయర్ బొంతు రాంమోహన్ స్పష్టం చేశారు. ఈ మేరకు ఆయన శనివారం ఓ ప్రకటన విడుదల చేశారు. తాను మల్కాజిగిరి లేదా సికింద్రాబాద్ ఎంపీ స్థానానికి బీఆర్ఎస్ నుంచి పోటీ చేసేందుకు ఆసక్తితో ఉన్నట్లు పేర్కొన్నారు. ఈ విషయాన్ని ఇప్పటికే పార్టీ అధ్యక్షుడు కేసీఆర్, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, హరీ‹Ùరావుల దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు. ఒకే కుటుంబానికి చెందిన వారికి కాకుండా ఉద్యమ నాయకులు, పార్టీ అభ్యున్నతి కోసం అహరి్నశలు కష్టపడ్డవారికి ఎంపీ టికెట్ ఇవ్వాలని ఆయన కోరారు. నగర మేయర్‌గా గ్రేటర్ అభివృద్దితో పాటు పార్టీ బలోపేతానికి కృషి చేశానన్నారు. అధిష్టానం తనకు ఎంపీగా పోటీ చేసే అవకాశం కలి్పస్తుందన్న ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు. -
ఎమ్మెల్యే టికెట్లపై తేల్చేసిన కేసీఆర్, తగ్గేదేలే! అంటున్న బొంతు?
ముందస్తు ఎన్నికల ఊహాగానాల నేపథ్యంలో గ్రేటర్ హైదరాబాద్ గులాబీ కోటలో గ్రూపులు బయల్దేరుతున్నాయి. టిక్కెట్లు ఆశించేవారు గళం విప్పుతున్నారు. సిటింగ్ ఎమ్మెల్యేలకే సీట్లు అని గులాబీ బాస్ ప్రకటించిన తర్వాత కూడా ఆశావహులు ఆగడంలేదు. తమ ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. దీంతో కొన్ని సెగ్మెంట్లలో నాయకులు కులాలవారీగా విడిపోతున్నారు. గ్రేటర్‌లోని ఓ నియోజకవర్గంలో గులాబీ పార్టీ గ్రూపుల గురించి చూద్దాం. గులాబీ ముళ్లు హైదరాబాద్ మహానగరంలోని ఉప్పల్ నియోజకవర్గంలోని గులాబీ పార్టీలో గ్రూప్ కలహాలు మితిమీరుతున్నాయి. పార్టీలో కొత్తగా కులాల కుంపట్లు రాజుకుంటున్నాయి. లోకల్ ఎమ్మెల్యే భేతి సుభాష్ రెడ్డి వర్సెస్ గ్రేటర్ హైదరాబాద్ మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ అన్నట్లుగా రాజకీయాలు సాగుతున్నాయి. రాష్ట్రంలో ముందస్తు ఎన్నికల వేడి రాజుకోవడంతో ఎవరికి వారు టికెట్ల కోసం ప్రయత్నాలు తీవ్రం చేశారు. మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ ఈ సారి ఎలాగైనా ఉప్పల్ టికెట్ సాధించాలని ప్రగతి భవన్ నుంచే చక్రం తిప్పుతున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ అసెంబ్లీలో అడుగు పెట్టాలని ఆయన ఉవ్విళ్ళూరుతున్నారు. (చదవండి: సీబీఐ విచారణ తర్వాత తొలిసారి స్పందించిన కవిత) రాజకీయాల మధ్య కులం ఉప్పల్ లో మాజీ మేయర్ బొంతు దూకుడును కట్టడి చేయాలని అక్కడి ఎమ్మెల్యే భేతి సుభాష్ రెడ్డి పావులు కదుపుతున్నారు. మాజీ మేయర్ సతీమణి బొంతు శ్రీదేవి నియోజకవర్గ పరిధిలోని చర్లపల్లిలో కార్పొరేటర్ గా ఉన్నారు. పుట్టినరోజు వేడుకలు, ఇతర కార్యక్రమాల పేరుతో నియోజకవర్గంలో బొంతు దంపతులు చేస్తున్న హడావిడిని ఎమ్మెల్యే భరించలేకపోతున్నారట. ఇరు వర్గాల మధ్య గొడవ ముదురుతుండటంతో... కార్పొరేటర్, మాజీ మేయర్ సతీమణి బొంతు శ్రీదేవి మీడియాకు ఎక్కారు. కార్పొరేటర్ గా ఉన్న తనను కులం పేరుతో ఎమ్మెల్యే అవమానిస్తున్నారని ఆమె ఆరోపించారు. మూడేళ్ళుగా భరిస్తున్నానని ఇంక భరించలేనని అంటున్నారు కార్పొరేటర్ శ్రీదేవి. ఉప్పల్ ఎమ్మెల్యే తనను చంపిస్తానని కూడా బెదిరిస్తున్నాడని ఆరోపించారామె. దీంతో వీరిద్దరి పంచాయతీ కాస్తా మున్సిపల్ మంత్రి కేటీఆర్ దగ్గరకు వెళ్ళింది. (చదవండి: ఉండేదెవరు.. పోయేదెవరు..?.. గులాబీ బాస్ ఏం చేయబోతున్నారు?) సిట్టింగ్ హామీ ఏమవుతుంది? కార్పొరేటర్ బొంతు శ్రీదేవి ఆరోపణల్ని ఎమ్మెల్యే భేతి సుభాష్‌రెడ్డి తీవ్రంగా ఖండించారు. కేవలం సానుభూతి కోసమే ఆమె తనపై ఆరోపణలు చేస్తున్నారని ఎమ్మెల్యే అంటున్నారు. సిటింగ్‌లకే సీట్లని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించిన తర్వాత కూడా కొందరు ఆశావహులు తమ ప్రయత్నాలు ఆపలేదు. పరిస్థితిని బట్టి సిటింగ్‌లను కాదని వేరేవారికి టిక్కెట్లు ఇచ్చిన సందర్భాలు గత ఎన్నికల్లో కూడా ఉన్నాయి. దాన్ని దృష్టిలో ఉంచుకునే ఏమో తనకూ బీసీ కోటాలో ఛాన్స్ తగులుతుందేమో అనుకుంటూ మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ గట్టిగా ప్రయత్నిస్తున్నారు. మరోవైపు ఉప్పల్ టికెట్ కోసం బండారి లక్ష్మారెడ్డి కూడా ప్రయత్నాలు చేసుకుంటున్నారు. రెడ్డి సామాజిక వర్గం కోణంలో భేతి సుభాష్ రెడ్డి.. బండారి లక్ష్మారెడ్డి ఒక్కటయ్యారని.. బీసీ నేతలు ఆరోపిస్తున్నారు. అయితే ఉప్పల్ పంచాయితీ ప్రగతి భవన్‌కు చేరింది. ఇక పార్టీ నాయకత్వం ఎటువంటి నిర్ణయం తీసుకుంటారనేది ప్రస్తుతానికి సస్పెన్స్‌గా మారింది. -పొలిటికల్ ఎడిటర్, సాక్షి డిజిటల్ feedback@sakshi.com -
ఉద్యమ గడ్డపై వికసించిన ప్రేమ
కుషాయిగూడ: ‘ఉస్మానియా యూనివర్సిటీ వేదికగా మా ప్రేమ చిగురించింది. 2001లో నేను ఉస్మానియా ఓయూ ఆర్ట్స్ కళాశాలలో పీజీ చేస్తున్న సమయంలో బొంతు రామ్మోహన్ ఏబీవీపీ నేతగా తెలుసు. ఎలాంటి పరిచయంలేదు. అప్పుడు ఆయన యూనివర్సిటీలో ఎల్ఎల్ఎం చదువుతున్నారు. మొదట్లో ఆర్ట్స్ కళాశాల వద్ద మా సీనియర్లు నన్ను ర్యాగింగ్ చేసినప్పుడు బాధపడిన నా సున్నిత మనస్తత్వం ఆయనకు చాలా నచ్చిందట. అప్పటి నుంచి నన్ను నిత్యం గమనిస్తుండేవారట. ఏడాది తర్వాత ఫ్రెషర్స్ డే సందర్భంగా తన మనసులో మాట చెప్పారు. చదువు పూర్తికాగానే పెద్దలతో మాట్లాడి వివాహం చేసుకుంటానన్నారు. పెద్దలు మా పెళ్లికి నిరాకరించారు. తప్పని పరిస్థితుల్లో పెద్దలను ఎదిరించి 2004 ఫిబ్రవరి 7న రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నాం. అనంతరం మార్చి12న అందరి సమక్షంలో జూబ్లీహిల్స్ పెద్దమ్మ ఆలయంలో శ్రాస్తోక్తంగా వివాహం చేసుకున్నాం. మాకు ఇద్దరు కుమార్తెలు. బొంతు రామ్మోహన్ గ్రేటర్ మేయర్‌గా పనిచేశారు. ప్రస్తుతం ఆయన ప్రాతినిధ్యం వహించిన చర్లపల్లి డివిజన్ కార్పొరేటర్‌గా ఎన్నికయ్యాను’ అని తన స్వీట్ మెమొరీస్‌ను నెమరు వేసుకున్నారు బొంతు శ్రీదేవి. చదవండి: ఐ లవ్యూ చెప్పకపోతే ఏం పోయింది! -
తిరుమల సాక్షిగా.. కేటీఆర్ సీఎం: మేయర్
సాక్షి, తిరుపతి : తిరుమల శ్రీవారిని మంగళవారం పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. ఉదయం వీఐపీ దర్శనంలో జార్ఖండ్ మంత్రి మిథిలేష్ కూమార్ ఠాకూర్, క్రికెటర్ శ్రీశాంత్, శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బియ్యపు మదుసుదన్ రెడ్డి, హైదరాబాద్ మేయర్ బొంతు రామ్మోహన్‌లు స్వామివారిని దర్శించుకున్నారు. స్వామివారి దర్శనం అనంతరం ఆలయ అర్చకులు ఆశీర్వదించి తీర్ధప్రసాదాలు అందచేసారు. అనంతరం ఆలయం వెలుపల మేయర్ బొంతు రామ్మోహన్ మీడియాతో మాట్లాడుతూ.. సమయం వచ్చినప్పుడు కేటీఆర్ సీఎం అవుతారని అన్నారు. భగవంతుని కృపతో సందర్భం వచ్చినప్పుడు కేటీఆర్ సీఎం అవుతారనేది నా వ్యక్తిగత అభిప్రాయం అని పేర్కొన్నారు. టీఆర్ఎస్ పార్టీ సమిష్టి నిర్ణయంతోనే కేటీఆర్ సీఎం అవుతారని స్పష్టం చేసారు. బంగారు తెలంగాణ సాధనకు మరింత శక్తిని ప్రసాదించాలని శ్రీవారిని ప్రార్థించానని అన్నారు. -
ఒకే కులం–ఒకే సంఘం..
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని వెనుకబడిన సామాజిక వర్గాల్లో ఒకటైన మున్నూరు కాపు సంఘాలు ఒక్కతాటిపైకి వచ్చాయి. ఇప్పటివరకు విడివిడిగా కార్యకలాపాలు నిర్వహించిన పలు సంఘాలు హైదరాబాద్ లోయర్ ట్యాంక్‌బండ్‌లోని బలిజ, కాపు, మున్నూరు కాపు సంఘ కార్యాలయం వేదికగా ఏకమ య్యాయి. ఒకే కులం–ఒకే సంఘం.. నినాదం తో ఆదివారం నిర్వహించిన ఈ రాష్ట్ర సదస్సుకు మంత్రి గంగుల కమలాకర్, మాజీ ఎంపీ, కాంగ్రెస్ నేత వి.హనుమంతరావుతో పాటు పలువురు ముఖ్యులు హాజరయ్యారు. సదస్సు ప్రారంభంలో సావిత్రిబాయి పూలే జయంతి సందర్భంగా ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం మంత్రి గంగుల మాట్లాడుతూ రాష్ట్రంలోని మున్నూరు కాపు కులస్తులు ఇప్పటివరకు వివిధ సంఘాలుగా విడిపోయి ఉండ టం వల్లనే సామాజికవర్గం అభివృద్ధి వేగంగా జరగలేదని, ఇప్పు డు ఒకే సంఘంగా సమష్టిగా ముందుకు సాగాలని నిర్ణయం తీసుకోవడం శుభపరిణామమని అన్నారు. ఇప్పటివరకు రాష్ట్రంలో ని అన్ని పార్టీలు బీసీలను ఓటు బ్యాంకుగా మాత్రమే వాడుకున్నాయని, రాష్ట్రం ఏర్పాటైన తర్వాతే బీసీ కులాలకు 5 ఎకరాల స్థలం, రూ.5 కోట్ల నిధులు ఇచ్చి వారి ఆత్మగౌరవాన్ని కాపాడేందుకు సీఎం కేసీఆర్ కృషి చేశారని చెప్పారు. మున్నూరు కాపుల అభివృద్ధి కోసం సీఎంతో మాట్లాడి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. త్రి సభ్య కమిటీ ఏర్పాటు సదస్సులో భాగంగా మున్నూరు కాపు నేతలు పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. రాష్ట్రంలోని అన్ని కాపు సంఘాలను రద్దు చేసి వాటి స్థానంలో త్రిసభ్య కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీ ద్వారా మూడు నెలల్లో గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు కమిటీలను నియమించి, రాష్ట్ర కమిటీ కోసం ఎన్నికలు నిర్వహించాలని నిర్ణయించారు. ఎన్నికలు పూర్తయ్యేంతవరకు మున్నూరు కాపు మహాసభ రాష్ట్ర కన్వీనర్‌గా పుటం పురుషోత్తం వ్యవహరిస్తారు. ఎన్నికల అధికారిగా జె.డి.లక్ష్మీనారాయణను నియమించగా, సంఘం బైలాస్‌ను టీఎస్పీఎస్సీ మాజీ సభ్యుడు సి.విఠల్ వివరించారు. రిటైర్డ్ ఐజీ సుంకరి బాలకిషన్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో జీహెచ్ఎంసీ మేయ ర్ బొంతు రామ్మోహన్, నేతలు వద్దిరాజు రవిచం ద్ర, వి.ప్రకాశ్, డాక్టర్. కొండా దేవయ్య, మీసాల చంద్రయ్య, దేవన్న, గాలి అనిల్‌కుమార్, కొత్త లక్ష్మ ణ్, జిల్లాల అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు. చదవండి: (ఐటీ ఉద్యోగులు స్కై వాక్ చేస్తూ ఆఫీస్‌లకు..) సావిత్రిబాయి స్ఫూర్తితోనే గురుకులాలు: గంగుల సాక్షి, హైదరాబాద్: సావిత్రిబాయి పూలేను ఆదర్శంగా తీసుకుని రాష్ట్ర ప్రభుత్వం గురుకుల విద్యా సంస్థలను స్థాపించిందని బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ పేర్కొన్నారు. మహిళల విద్యాభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం పెద్ద పీట వేసిందని, కొత్తగా ఏర్పాటు చేసిన గురుకుల విద్యా సంస్థల్లో సగానికిపైగా బాలికల కోసమే కేటాయించిందని వెల్లడించారు. విద్యార్థుల సంఖ్యకు తగినట్లుగా గురుకులాలను అభివృద్ధి చేస్తామన్నారు. సావిత్రిబాయి పూలే జయంతిని పురస్కరించుకొని ఆదివారం మంత్రి క్యాంపు కార్యాలయంలో ఆమె చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. -
హైదరాబాద్: పంచతత్వ పార్క్ ప్రారంభించిన మంత్రి కేటీఆర్
-
శాంతించవమ్మా.. గంగమ్మా
సాక్షి, హైదరాబాద్: బంగాళాఖాతంలో అల్పపీడనం కొనసాగుతోంది. అల్పపీడనానికి అనుబంధంగా 7.6 కిలోమీటర్ల ఎత్తు వరకు ఆవర్తనం విస్తరిస్తోంది. ఉత్తర ఈశాన్యంగా పయనిస్తూ బలపడి వాయుగుండంగా మారనుంది. ఒడిశా-బెంగాల్ తీరంలో కేంద్రీకృతమయ్యే అవకాశం ఉన్నట్లు వాతావారణ కేంద్రం తెలిపింది. దాని ప్రభావంతో కోస్తాంధ్ర, తెలంగాణ, రాయలసీమలో పలు చోట్ల భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. మూసీకి పూజలు: పురానాపూల్ వద్ద మూసీకి హైదరాబాద్ మేయర్ బొంతు రామ్మోహన్ బుధవారం శాంతి పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో గంగమ్మ తల్లికి ఆయన పట్టువస్త్రాలు సమర్పించారు. శాంతి పూజలో మంత్రులు మహమూద్ అలీ, తలసాని శ్రీనివాస్‌యాదవ్ పాల్గొన్నారు. అనంతరం దర్గాలో మేయర్, మంత్రులు చాదర్ సమర్పించనున్నారు. లాలాపేటలో మంత్రి కేటీఆర్ భాగ్యనగరంలో గత కొన్ని రోజలుగా కురుస్తున్న వర్షాలకు పలు ప్రాంతాలు నీట మునిగాయి, లోతట్టు పాంత్రాలో ఉన్న కాలనీలు జలమయం అయ్యాయి. ఈ నేపథ్యంలో సికింద్రాబాద్ లాలాపేటలో మంత్రి కేటీఆర్ పర్యటించారు. బాధితుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అదే విధంగా ఆయన బాధితులకు రూ.10వేల ఆర్థిక సాయం అందజేశారు. -
సుమేధ మృతి: మంత్రి కేటీఆర్‌పై ఫిర్యాదు
సాక్షి, హైదరాబాద్: ఓపెన్ నాలాలో పడి మృతి చెందిన సుమేధ కపూరియా (12) తల్లిదండ్రులు సోమవారం నేరేడ్మెట్ పోలీసులను కలిశారు. ప్రభుత్వం, జీహెచ్ఎంసీ అధికారుల నిర్లక్ష్యం మూలంగానే తమ బిడ్డ ప్రాణాలు కోల్పోయిందని పేర్కొంటూ.. మున్సిపల్‌శాఖ మంత్రి కేటీఆర్, నగర మేయర్ బొంతు రామ్మోహన్, జీహెచ్ఎంసీ కమిషనర్, జోనల్ కమిషనర్, స్థానిక కార్పొరేటర్, సంబంధిత ఏఈ, డీఈలపై కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. వీరందరిపై ఐపీసీ సెక్షన్ 304 ప్రకారం కేసు నమోదు చేయాలని ఈ మేరకు లిఖితపూర్వకంగా ఫిర్యాదు సమర్పించారు. కాగా, నేరేడ్మెట్లోని కాకతీయ నగర్లో నివాసముండే అభిజిత్, సుకన్య దంపతుల కుమార్తె సుమేధ గత గురువారం సాయంత్రం సైకిల్ తొక్కుకుంటూ బయటికెళ్లింది. దీన్‌దయాళ్ నగర్‌లోని ఓపెన్ నాలాలో ప్రమాదవశాత్తూ పడి మరణించింది. వరద ఉధృతికి బాలిక మృతదేహం బండచెరువుకు కొట్టుకొచ్చింది. (చదవండి: ‘ఆ ప్రాంతంలో ఒక్క సీసీ కెమెరా కూడా లేదు’) (చదవండి: ఉసురు తీసిన నాలా) -
అత్యాధునిక వసతులతో శ్మశానవాటిక
సాక్షి, హైదరాబాద్: అత్యాధునిక వసతులతో అభివృద్ధి చేస్తున్న బేగంపేట్ స్మశానవాటిక పనులను జీహెచ్ఎంసీ మేయర్ బొంతు రామ్మోహన్.. ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, జోనల్ కమిషనర్ శ్రీనివాస్‌రెడ్డిలతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆదివారం ఆయన మాట్లాడుతూ.. '5 ఎకరాల విస్తీర్ణంవున్న ఈ స్మశానవాటికలో నిర్మాణ, శిథిలాల వ్యర్థాలను తొలగించి 150 లారీలలో తరలించారు. అలాగే 50 లారీల తుమ్మ, ఇతర కంప చెట్లను తొలగించారు. అభివృద్ధిలో భాగంగా అంతర్గత రోడ్లు, నీడనిచ్చే చెట్ల మొక్కలు, పూల మొక్కలను క్రమపద్ధతిలో నాటుతున్నారు. (శవాలపైనా కాసులవేట!) ఒక వైపు బేగంపేట్ ఎయిర్ పోర్ట్ కాంపౌండ్ వాల్ ఉండగా.. అభివృద్ధిలో భాగంగా రోడ్డు వైపు కాంపౌండ్ వాల్ నిర్మించారు. ప్రస్తుతం మూడున్నర ఎకరాల్లో అభివృద్ధి చేస్తున్నారు. నాలుగు దహన వాటికల ఫ్లాట్ ఫార్మ్స్, దింపుడుకల్లం, పార్కింగ్, సీటింగ్, స్నానపు గదుల వసతులు కల్పిస్తున్నారు. తదుపరి విద్యుత్ దహనవాటికను నిర్మించనున్నారు. ఈ దహన వాటికకు ఎదురుగా హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ స్థలంలో ఇప్పటికే చెట్లు ఏపుగా, దట్టంగా పెరిగాయి. ఈ స్మశాన వాటికలో చేపట్టిన అభివృద్ధి, సుందరీకరణ పనులతో మరో ఆరు నెలల్లో ఆహ్లాదకరమైన స్మశానవాటికగా మారనుంది' అని మేయర్ బొంతు రామ్మోహన్ పేర్కొన్నారు. -
హైదరాబాద్ మేయర్ బొంతు రామ్మోహన్‌కు కరోనా పాజిటివ్
-
జీహెచ్ఎంసీ మేయర్‌కు కరోనా పాజిటివ్
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణలో కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. ముఖ్యంగా జీహెచ్ఎంసీ పరిధిలో కరోనా కేసులు ఉధృతి ఎక్కువగా ఉంది. నగరంలో ఇప్పటికే పలువురు అధికారులు కూడా కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే. తాజాగా జీహెచ్ఎంసీ మేయర్ బొంతు రామ్మోహన్‌కు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ఆయనకు కరోనా లక్షణాలు లేకపోయినప్పటికీ తాజాగా నిర్వహించిన పరీక్షల్లో కరోనా సోకినట్టుగా తేలింది.(వైరల్ వీడియో: శారద.. నీకు సెల్యూట్) అయితే రామ్మోహన్ కుటుంబ సభ్యులకు మాత్రం కరోనా నెగిటివ్ వచ్చింది. దీంతో మేయర్ బొంతు రామ్మోహన్ హోం క్వారంటైన్లో ఉండి చికిత్స పొందుతన్నారు. కాగా, కొద్ది రోజుల కిందట మేయర్ కారు డ్రైవర్‌కు కరోనా పాజిటివ్‌గా తెలిసిందే. ఆ సమయంలో ఆయనకు కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. నెగిటివ్ వచ్చింది.(కరోనా : చేదు వార్త వినిపించిన టీ సర్కార్) -
నిరాడంబరంగా మంత్రి కేటీఆర్ జన్మదిన వేడుకలు
-
తెలంగాణలో రాజకీయ నేతలకు కరోనా భయం
-
ఊపిరి పీల్చుకున్న మేయర్ కుటుంబం..
సాక్షి, హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ బొంతు రామ్మోహన్‌తో పాటు అయన కుటుంబ సభ్యులకు కరోనా నెగెటివ్‌గా నిర్దారణ అయినట్లు వైద్యులు తెలిపారు. తన కారు డ్రైవర్‌కు కరోనా సోకడంతో శుక్రవారం మేయర్ మరోసారి కరోనా పరీక్షలు చేయించుకున్న విషయం తెలిసిందే. పరీక్షల్లో నెగెటివ్‌గా రావడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. గతంలో కూడా ఆయనకు కరోనా పరీక్షలు చేయగా నెగెటివ్‌గా తేలింది. (మరోసారి మేయర్‌కు పరీక్షలు) గురువారం మేయర్ పేషీలోని మరో ఇద్దరికి కరోనా పాజిటివ్ రావడంతో వైద్యులు బొంతు రామ్మోహన్‌కు మరోసారి పరీక్షలు చేశారు. మేయర్‌తో పాటు ఆయన కుటుంబసభ్యులంతా హోం క్వారంటైన్లో ఉన్నారు. కాగా, మేయర్ పేషీ సహ బల్దియా ప్రధాన కార్యాలయంలో వారంలో మొత్తం 3 కరోనా పాజిటివ్ కేసులు వెలుగు చూసిన నేపథ్యంలో అధికారుల నుంచి దిగువస్థాయి సిబ్బంది వరకు భయాందోళనలకు గురవుతున్నారు. ప్రధాన కార్యాలయంలో విధులు నిర్వహించే వారిలో దాదాపు సగం మంది మాత్రమే హాజరవుతున్నారు. (పది కోట్ల మందికి కరోనా ముప్పు!) -
మరోసారి మేయర్‌కు పరీక్షలు
సాక్షి, హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ బొంతు రామ్మోహన్ శుక్రవారం మరోసారి కరోనా పరీక్షలు చేయించుకున్నారు. ఇప్పటికే ఆయనకు పరీక్షలు చేయగా నెగెటివ్ వచ్చింది. ఆ తర్వాత ఆయన పేషీలోని మరో ఇద్దరికి కరోనా పాజిటివ్ రావడంతో వైద్యులు మేయర్‌కు మరోసారి పరీక్షలు చేశారు. మేయర్‌తో పాటు ఆయన కుటుంబసభ్యులంతా హోం క్వారంటైన్లో ఉన్నారు. కాగా, మేయర్ పేషీ సహ బల్దియా ప్రధాన కార్యాలయంలో వారంలో మొత్తం 3 కరోనా పాజిటివ్ కేసులు వెలుగు చూసిన నేపథ్యంలో అధికారుల నుంచి దిగువస్థాయి సిబ్బంది వరకు భయాందోళనలకు గురవుతున్నారు. ప్రధాన కార్యాలయంలో విధులు నిర్వహించే వారిలో శుక్రవారం దాదాపు సగం మంది మాత్రమే హాజరయ్యారు. -
జీహెచ్ఎంసీ మేయర్ డ్రైవర్‌కు కరోనా
సాక్షి, హైదరాబాద్: జీహెచ్ఎంసీ మేయర్ బొంతు రామ్మోహన్ కారు డ్రైవర్ కరోనా బారిన పడ్డాడు. గురువారం నిర్వహించిన పరీక్షల్లో అతడికి కరోనా పాజిటివ్‌గా నిర్దారణ అయినట్లు వైద్యులు వెల్లడించారు. విధుల్లో భాగంగా ఈరోజు ఉదయం నుంచి మేయర్‌తో పాటే ఆ వ్యక్తి ఉన్నాడు. ఈ నేపథ్యంలో అప్రమత్తమైన అధికార యంత్రాంగం అతడు ఎవరెవరిని కలిశాడన్న దానిపై ఆరా తీస్తున్నారు. డ్రైవర్‌కు కరోనా అని తేలడంతో మేయర్ కుంటుంబం హోం క్వారంటైన్లోకి వెళ్లిపోయింది. రేపు మేయర్‌తో పాటు అతడి కుటుంబ సభ్యులకు కరోనా పరీక్షలు నిర్వహించనున్నారు. (వధువు తండ్రి, చెల్లికి వైరస్.. పెళ్లికి బ్రేక్) కాగా, నాలుగు రోజుల క్రితమే బొంతు రామ్మోహన్‌కు కరోనా పరీక్షలు నిర్వహించగా నెగటివ్ అని తేలిన విషయం తెలిసిందే. స్పెషల్ శానిటేషన్ డ్రైవ్ ప్రారంభోత్సవం సందర్భంగా నగరంలోని ఓ హోటల్లో మేయర్ టీ తాగారు. అయితే అంతకుముందే ఆ టీ దుకాణంలో పనిచేసే మాస్టర్‌కు కరోనా సోకినట్లు తేలింది. విషయం తెలుసుకున్న అధికారులు.. వైద్యులకు సమాచారం ఇవ్వడంతో ముందస్తు జాగ్రత్తగా పరీక్షలు నిర్వహించారు. పరీక్షల్లో నెగటివ్ రావడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. -
జీహెచ్ఎంసీ మేయర్‌కు కరోనా పరీక్షలు
సాక్షి, హైదరాబాద్ : జీహెచ్ఎంసీ మేయర్ బొంతు రామ్మోహన్‌కు వైద్యులు కరోనా పరీక్ష నిర్వహించారు. పరీక్షల్లో నెగెటివ్‌గా తేలినట్లు వైద్యులు తెలిపారు. ఇటీవల స్పెషల్ శానిటేషన్ డ్రైవ్ ప్రారంభోత్సవం సందర్భంగా నగరంలోని ఓ హోటల్ మేయర్ టీ తాగారు. అయితే అంతకుముందే ఆ టీ దుకాణంలో పనిచేసే మాస్టర్‌కు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. విషయం తెలుసుకున్న అధికారులు.. వైద్యులకు సమాచారం ఇవ్వడంతో ముందస్తు జాగత్తగా పరీక్షలు నిర్వహించారు. పరీక్షల్లో నెగెటివ్‌గా రావడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. కాగా వైరస్ నియంత్రణకు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో చేపట్టిన చర్యలను మేయర్ క్షేత్ర స్థాయిలో పర్యవేక్షిస్తున్న విషయం తెలిసిందే. -
ఆఖరికి ‘ఆపిల్ ’ అలా..
సాక్షి, సిటీబ్యూరో: ఎంతోకాలంగా ఆపిల్ ఐఫోన్‌తో ట్రింగురంగా అందామనుకున్న స్టాండింగ్ కమిటీ సభ్యులు దిగిపోయే రెండు రోజుల ముందు ఆమోదించేసుకోవడం బాగుండదనుకున్నారో, లేక ప్రజల నుంచి విమర్శలు వెల్లువెత్తుతాయనుకున్నారో కానీ దానికి సంబంధించిన ‘బాల్’ను కమిషనర్ ‘కోర్టు’లో వేశారు. సరైన నిర్ణయం తీసుకోవాల్సిందిగా జీహెచ్ఎంసీ కమిషనర్ డీఎస్ లోకేశ్‌కుమార్‌కు స్టాండింగ్ కమిటీ సభ్యులు సూచించారు.జీహెచ్ఎంసీ కమిషనర్‌కు రూ.2 కోట్ల వరకు నిధుల మంజూరుకు అధికారం ఉన్న విషయాన్నిప్రస్తావిస్తూ నిర్ణయాధికారాన్నిఆయనకు వదిలేశారు. కరోనాతరుణంలో ప్రజల సమస్యలు కాకుండా దీన్ని ఆమోదించుకుంటే బాగుండదని కాబోలు తమ మీదకు రాకుండా వ్యవహరించారు. అదో క్రేజ్ .. స్టాండింగ్ కమిటీ సమావేశానికి రూ.2 కోట్ల నుంచి రూ.3 కోట్ల పనుల వరకు మంజూరు చేసే అధికారం ఉండటంతో తమ వార్డుల్లో అవసరమైన పనులు చేయించుకునేందుకు స్టాండింగ్ కమిటీ సభ్యులకు అవకాశం ఉంటుంది. తమ పరిధిలో కావాలనుకున్న పెద్ద పనుల్ని చేయించుకోవచ్చు. ఇవన్నీ ఒక ఎత్తయితే.. లక్ష రూపాయలకు తక్కువ కాని ఐఫోన్లు, ఐపాడ్ల వంటివి పొందుతుండటం జీహెచ్ఎంసీలో ఆనవాయితీగా వస్తోంది. స్టాండింగ్ కమిటీ సభ్యులు ఆ మాత్రం కొనుక్కోలేని వాళ్లేంకారు. కానీ.. అదో క్రేజ్. స్టాండింగ్ కమిటీ సభ్యుడిగా ఐఫోన్ కానీ, ఐప్యాడ్ కానీ, మరేదైనా కానీ ఆ మోజే వేరు. అందుకే పాపం లాక్డౌన్ కారణంగా మూడునెలల పాటు సమావేశాలు జరగకుండా కత్తెర పడ్డా.. లాక్డౌన్ సడలింపులతో ఎట్టకేలకు చివరి సమావేశం జరుపుకునేందుకు అవకాశం లభించగా, దాన్నయినా తీపి గుర్తుగా మిగుల్చుకోవాలనుకున్నారు. కానీ.. ఎక్కడో, ఏదో తేడా కొట్టింది. 15 మంది స్టాండింగ్ కమిటీ సభ్యులు, మరో ఇద్దరు ముఖ్య ప్రజాప్రతినిధులకు వెరసి మొత్తం 17 ఆపిల్ ఐఫోన్లకు(11 ప్రోమాక్స్ మోడల్) రూ.21,34,900 అంచనా వ్యయంతో అజెండాలో ఉంచినప్పటికీ.. తామే ఆమోదించుకుంటే బాగోదని కాబోలు నిర్ణయాన్ని కమిషనర్‌కు అప్పగించారు. త్వరలోనే గుట్టుచప్పుడు కాకుండా అందుకుంటారో.. లేక వదిలేసినట్లో కాలమే చెబుతుంది. 33 తీర్మానాలు ఇవే.. ♦ మేయర్ బొంతు రామ్మోహన్ అధ్యక్షతన జరిగిన స్టాండింగ్ కమిటీ సమావేశంలో ఈ ఒక్క అంశం తప్ప మిగతా 33 తీర్మానాలను ఆమోదించారు. ♦ ఆస్తిపన్ను పాతబకాయిల వడ్డీలో 80 శాతం మాఫీ కోసం.. గత (2019–20) ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వేతర భవనాలకు సంబంధించి ఆస్తిపన్నుల పాతబకాయిలు, వాటిపై వడ్డీలు కలిపి రూ.2,495 కోట్ల 62 లక్షలు జీహెచ్ఎంసీకి రావాల్సి ఉండగా, రూ.1,394 కోట్ల 72 లక్షలు మాత్రమే వసూలైంది. వసూళ్లు పెంచుకునేందుకు పాతబకాయిలపై వడ్డీలో 80 శాతం వరకు వన్‌టైం ఆమ్నెస్టి స్కీమ్ కింద(వన్ టైమ్ సెటిల్మెంట్) కింద 80 శాతం మాఫీ చేసేందుకు ప్రభుత్వానికి నివేదించేందుకు తీర్మానం. ప్రస్తుత కోవిడ్ పరిస్థితుల్ని, జీహెచ్ఎంసీ ఆర్థిక పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని ఈ తీర్మానం చేశారు. ♦ 201 బస్షెల్టర్ల పునర్నిర్మాణానికి 4 ప్యాకేజీలుగా టెండర్లు.. ♦ 221 జంక్షన్లలోని ట్రాఫిక్ సిగ్నల్స్ నిర్వహణ కాంట్రాక్ట్ పొడిగింపు. కొత్తగా 155 జంక్షన్లలో ట్రాఫిక్ సిగ్నల్స్ ఏర్పాటు. ♦ రోడ్డు విస్తరణకు ఎల్బీనగర్ మెట్రోస్టేషన్ వద్ద సేకరించిన దేవాలయ ఆస్తులతో షాపులు కోల్పోయిన వారికి వనస్థలిపురంలో కొత్తగా నిర్మించిన మోడల్ మార్కెట్లో టెండర్ ప్రక్రియలో షాపుల కేటాయింపు. ♦ జీహెచ్ఎంసీ కాల్ సెంటర్ 040 211 11 111 సేవలు మరో మూడు సంవత్సరాలకు పొడిగింపు. ఆ ప్రాంతాలను పరిశుభ్రంగా చేసేందుకు... స్టాండింగ్ కమిటీ సమావేశం సందర్భంగా మేయర్ బొంతు రామ్మోహన్ మాట్లాడుతూ రోడ్ల పక్కన, మీడియంలో నిర్మించిన విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ల వద్ద నిర్మాణ వ్యర్థాలు, గడ్డి, చెత్తాచెదారం నిండి ఉంటుందని, స్పెషల్ శానిటేషన్ డ్రైవ్‌లో కొద్దిసేపు విద్యుత్ సరఫరాను నిలిపివేసి ఆ ప్రాంతాలను పరిశుభ్రంగా చేసేందుకు చొరవ తీసుకోవాలని అధికారులకు, కార్పొరేటర్లకు విజ్ఞప్తి చేశారు. నిల్వ ఉన్న నీటిలోనే కాకుండా రోజూ వినియోగించే నీళ్ల డ్రమ్ములు, కూలర్లలో కూడా దోమల గుడ్లు(లార్వా)లు ఉంటాయని, ఆ నీటిని తొలగించి పొడిగా ఆరబెట్టినప్పుడే లార్వాలు చనిపోతాయని తెలిపారు. దోమల నివారణకు నిర్వహించే ఫాగింగ్, యాంటి లార్వా ఆపరేషన్లను మానిటరింగ్ చేసేందుకు వార్డుల వారీగా ఏ కాలనీలో ఏ రోజు పనులు చేస్తారో షెడ్యూల్‌ను రూపొందించి కాలనీలను మ్యాపింగ్ చేసి ప్రకటించాలని అధికారులను ఆదేశించారు. ఫాగింగ్, యాంటి లార్వా స్ప్రేయింగ్ కార్యక్రమాలకు కార్పొరేటర్ల ధ్రువీకరణ పొందాలని స్పష్టం చేశారు. 29న స్టాండింగ్ కమిటీ ఎన్నికలు ♦ ప్రస్తుత స్టాండింగ్ కమిటీ కాలపరిమితి పూర్తికానుండటంతో కొత్త స్టాండింగ్ కమిటీ ఎన్నికకు ఈ నెల 5న ఎన్నికల నోటిఫికేషన్ వెలువరిస్తున్నట్లు జీహెచ్ఎంసీ కమిషనర్ డీఎస్ లోకేశ్‌కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 10 నుంచి 18వ తేదీ వరకు ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 3గంటల వరకు కార్యాలయ పనిదినాల్లో జీహెచ్ఎంసీ ఎన్నికల విభాగం అదనపు కమిషనర్ నామినేషన్లు స్వీకరిస్తారని తెలిపారు. జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలోని మూడో అంతస్తులో ఉన్న ఎన్నికల విభాగం అదనపు కమిషనర్ కార్యాలయంలో నామినేషన్లు స్వీకరిస్తారని తెలిపారు. దాఖలైన నామినేషన్ల వివరాలను ఈ నెల 19న ప్రకటించనున్నట్లు తెలిపారు. ఈ నెల 20న ఉదయం 11 గంటల నుంచి 12గంటల వరకు నామినేషన్ల స్క్రూట్నీ జరుగుతుందని, అనంతరం సక్రమంగా ఉన్న నామినేషన్లను ప్రకటించనున్నట్లు తెలిపారు. ఈ నెల 23వ తేదీ మధ్యాహ్నం 3గంటల వరకు నామినేషన్లను ఉపసంహరించుకోవచ్చని తెలిపారు. అదేరోజు పోటీలో ఉన్న అభ్యర్థుల జాబితా వెల్లడిస్తామన్నారు. ఈ నెల 29వ తేదీ ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 3గంటల వరకు జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో పోలింగ్ జరుగుతుందని తెలిపారు. అనంతరం కౌంటింగ్ నిర్వహించి ఎన్నికైన స్టాండింగ్ కమిటీ సభ్యులను ప్రకటించనున్నట్లు కమిషనర్ తెలిపారు. చెట్లు కూలినా.. నీటి నిల్వలున్నా.. కాల్ చేయొచ్చు..040–29555500 వర్షాకాలంలో ఎక్కడైనా చెట్లు కూలిపోయినా.. నీటి నిల్వలు పేరుకున్నా.. ఇతరత్రా ఏ అత్యవసర పరిస్థితి ఎదురైనా వెంటనే స్పందించేందుకు వీలుగా జీహెచ్ఎంసీ ఈవీడీఎం విభాగం ప్రత్యేక కాల్‌సెంటర్ ఫోన్ నెంబర్ 040 29555500ను అందుబాటులోకి తెచ్చింది. ప్రజలు ఈ సదుపాయాన్ని వినియోగించుకోవాల్సిందిగా ఈవీడీఎం డైరెక్టర్ విశ్వజిత్ కాంపాటి ట్విట్టర్లో పేర్కొన్నారు. 24 గంటల పాటు ఇది పనిచేస్తుందన్నారు. పాత బకాయిల వడ్డీ మాఫీకి తీర్మానం ♦ మున్సిపల్ మంత్రి బుధవారం నిర్వహించిన సమీక్ష సమావేశంలో పాతబకాయిల వడ్డీ మాఫీకి సంబంధించి ప్రబుత్వానికి ప్రతిపాదనలు పంపించాలనే ఆదేశాలకు అనుగుణంగానే జీహెచ్ ఎంసీ స్టాండింగ్ కమిటీ ఈ తీర్మానం చేసింది. ♦ ఆస్తిపన్ను పాతబకాయిలపై వడ్డీ 20 శాతం చెల్లిస్తే సరిపోతుంది. ♦ జీహెచ్ఎంసీ లెక్కల మేరకు 2019–20 ఆర్థిక సంవత్సరం వరకు పాతబకాయిలు పేరుకుపోయిన ప్రభుత్వేతర భవనాలు 5,64,294 ఉన్నాయి. ♦ వీటికి సంబంధించిన ఆస్తిపన్ను బకాయిలు రూ.1477.86 కోట్లు కాగా.. వడ్డీ బకాయిలు రూ.1017.76 కోట్లు ఉన్నాయి. ♦ మొత్తం రూ.2,495.62 కోట్లు ♦ ప్రస్తుతం ఈ తీర్మానాన్ని ప్రభుత్వం త్వరలోనే ఆమోదించే అవకాశం ఉంది. తద్వారా పాతబకాయిదారులకు ప్రయోజనం చేకూరుతుది. -
‘హైదరాబాద్‌ను 17 జోన్లుగా విభజించాం’
సాక్షి, హైదరాబాద్ : హైదరాబాద్ నగరాన్ని 17 జోన్లుగా విభజించామని మంత్రి తలసాని పేర్కొన్నారు. మంగళవారం కరోనాపై మంత్రి తలసాని, నగర మేయర్ బొంతురామ్మోహన్ సమీక్ష సమావేశం నిర్వహించారు. లాక్డౌన్ అమలు, ప్రజలకు నిత్యావసర వస్తువులకు ఇబ్బంది లేకుండా తీసుకోవాల్సిన చర్యలపై చర్చలు జరిపారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. జీహెచ్ఎంసీ పరిధిలో లక్షా 80 వేల మంది వలస కార్మికులు ఉన్నారన్నారు. 36 వేల మంది వలస కార్మికులకు బియ్యం, నగదు అందించామన్నారు. వేరు వేరు మార్గాల ద్వారా వలస కార్మికులకు సహాయం అందిస్తున్నామని పేర్కొన్నారు. సోడియం హైపోక్లోరైడ్ స్ప్రె చేస్తున్నామని, కార్పొరేటర్లు, ఎమ్మెల్యేలు కోఆర్డినేట్ చేస్తున్నారని తెలిపారు. కరెంట్, పారిశుద్ధ్యం ఇబ్బంది లేకుండా చూస్తున్నామని, రోడ్లు, ఫ్లై ఓవర్ నిర్మాణ పనులు ముమ్మరంగా సాగుతున్నాయన్నారు. వలస కార్మికులను ఆదుకుంటామని మంత్రి పేర్కొన్నారు. -
మేయర్ బొంతు రామ్మోహన్‌తో స్పెషల్ ఇంటర్వ్యూ
-
లాక్‌డౌన్‌కు ప్రజలు సహకరించాలి
సాక్షి, హైదరాబాద్ : కరోనా వైరస్ వ్యాప్తిని నియంత్రించేందుకు విధించిన లాక్‌డౌన్‌కు ప్రజలందరూ సహకరించాలని మేయర్ బొంతు రామ్మోహన్ విజ్ఞప్తి చేశారు. ఆదివారం ఖైరత్‌బాద్‌లో ఆయన పర్యటించారు. పారిశుద్ధ్య నిర్వహణ స్ప్రేయింగ్‌ను పరిశీలించారు. ఆ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. నగర ప్రజల కోసం మొబైల్ మార్కెట్ల ద్వారా కూరగాయలను అందిస్తున్నామని తెలిపారు. నిరాశ్రయులయిన వారిని గుర్తించి భోజన, నివాస వసతులు కల్పించామని వెల్లడించారు. పారిశుద్ధ్య కార్మికుల ఆరోగ్యం కోసం మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామన్నారు. విదేశాల నుంచి వచ్చిన వారి ఆరోగ్య పరిస్థితులు ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నాని చెప్పారు. -
‘అన్నపూర్ణ’ పథకం అద్భుతం
-
నయా జమానా!
సాక్షి, హైదరాబాద్: ‘సరళంగా భవన నిర్మాణ అనుమతులు.. నిర్ణీత విస్తీర్ణం వరకు అసలు అనుమతులే అవసరం లేకపోవడం..వంటి కొత్త పురపాలక చట్టంలోని కీలకాంశాలన్నింటినీ పొందుపరచడంతోపాటు నగర అవసరాలకు తగిన విధంగా మరిన్ని సరళీకరణలతో జీహెచ్ఎంసీ చట్టాన్ని మారుస్తాం.’ అని పురపాలక శాఖ మంత్రి కె.తారకరామారావు తెలిపారు. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు మార్గదర్శనంలో అమల్లోకి వచి్చన కొత్త పురపాలకచట్టంలోని అన్ని కీలకాంశాలు జీహెచ్ఎంసీ చట్టంలోనూ ఉంటాయన్నారు. కొత్త జీహెచ్ఎంసీ చట్టాన్ని మార్చిలో జరుగనున్న బడ్జెట్ సమావేశాల్లో ఆమోదం కోసం పంపుతామన్నారు. హైదరాబాద్ నగర ప్రజలకు మరింత సదుపాయంగా, పారదర్శక పాలన అందించేందుకు జీహెచ్ఎంసీ చట్టాన్ని మార్చనున్నట్లు తెలిపారు. మునిసిపల్ చట్ట స్ఫూర్తిని, అందులోని నిబంధనలు యధాతథంగా జీహెచ్ఎంసీ చట్టంలోనూ ఉండాలని పురపాలకశాఖ అధికారులను ఆదేశించారు. శనివారం మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల కేంద్రంలో అధికారులతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జీహెచ్ఎంసీ చట్టంలో పొందుపర్చాల్సిన అంశాలపై పురపాలకశాఖ ముఖ్యకార్యదర్శి అరి్వంద్‌కుమార్, జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేశ్‌కుమార్‌లకు పలుఆదేశాలు జారీ చేశారు. సరళంగా భవన నిర్మాణ అనుమతులతోపాటు వేగవంతంగా పౌరసేవలు, అధికారులు మరింత బాధ్యతాయుతంగా వ్యవహరించడం, ప్రజాప్రతినిధుల బాధ్యతల పెంపు వంటి కీలకాంశాలను చట్టంలో పొందుపర్చాలని సూచించారు. ప్రస్తుత జీహెచ్ఎంసీ చట్టాన్ని సమూలంగా మార్చేందుకు, కొత్త పురపాలక చట్టంతో సమానంగా మార్పులకు అవసరమైన ప్రక్రియను వెంటనే చేపట్టాలని ఆదేశించారు. ముఖ్యంగా త్వరలో టీఎస్ బీపాస్ అమల్లోకి రానుండటంతో అలాంటి విధానం జీహెచ్ఎంసీ చట్టంలోనూ ఉండాలన్నారు. ఆమేరకు అవసరమైన మార్పులు చేయాలని సూచించారు. జీహెచ్ఎంసీతో పాటు హెచ్ఎండీఏ పరిధిలోనూ భవననిర్మాణ అనుతుల్ని సరళీకరిస్తామని పేర్కొన్నారు. వేగంగా.. పారదర్శకంగా ఎన్నో సేవలు.. కొత్త చట్టం ద్వారా ప్రజలకు అనేక సేవలు మరింత వేగంగా, పారదర్శకంగా అమలవుతాయన్నారు. ఈ సందర్భంగా జీహెచ్ఎంసీలో జరుగుతున్న పనుల గురించి అడిగి తెలుసుకున్నారు. జోనల్ కమిషనర్లు మరింత చొరవతో వినూత్న ఆలోచనలతో సరికొత్త పథకాలను చేపట్టాలని ఆదేశించారు. ఎస్సార్డీపీ, ప్రైవేట్ ఏజెన్సీలతో రోడ్ల నిర్వహణ, డబుల్బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణం వంటి పనులతోపాటు పారిశుధ్య నిర్వహణ, పచ్చదనం పెంపు వంటి కార్యక్రమాలపైనా ప్రత్యేక శ్రద్ధ చూపాలన్నారు. ముఖ్యంగా టాయిలెట్ల నిర్మాణం, జంక్షన్ల అభివృద్ది, బస్తీ దవాఖానాల ఏర్పాటు వంటి ప్రాథమిక కార్యక్రమాలకు ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. ఇలాంటి వాటి కోసం ప్రత్యేక ఐటీ డ్యాష్ బోర్డు ఏర్పాటు చేయాలని సూచించారు. దీని ద్వారా ఆయా కార్యక్రమాల పురోగతిని నిరంతరం సమీక్షిస్తామని తెలిపారు. ఎప్పటికప్పుడు లక్ష్యాలను నిర్దేశించుకుంటూ, సిబ్బందిని సమన్వయం చేసుకుంటూ ముందుకు పోవాలన్నారు. సమావేశంలో నగర మేయర్ బొంతు రామ్మోహాన్, డిప్యూటీ మేయర్ బాబా ఫసియుద్దీన్, జీహెచ్ఎంసీ వివిధ విభాగాల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. పనుల జాప్యంపై ఆగ్రహం.. సీఆర్ఎంపీ పనులు కుంటుతుండటం. ఎస్సార్డీపీ పనుల్లో జాప్యంపై ప్రాజెక్టులు, టౌన్‌ప్లానింగ్ విభాగాలపై అసహనం వ్యక్తం చేశారు. స్లిప్, లింక్‌రోడ్ల పనులు ఏప్రిల్ 15లోగా పూర్తికావాలని ఆదేశించారు. ఒక ప్రాజెక్టుకు సంబంధించిన భూసేకరణ నోటీసులన్నీ ఒకేరోజు జారీ చేయాలని తద్వారా త్వరితంగా అవసరమైన చర్యలు తీసుకోవచ్చునన్నారు. సీఆర్ఎంపీ రోడ్లకు సంబంధించి జోనల్ కమిషనర్లు, ఇంజినీర్లు తగిన కార్యాచరణతో జాప్యానికి తావులేకుండా పనులు వేగిరం పూర్తిచేయాలన్నారు. ఎప్పటికప్పుడు క్షేత్రస్థాయి తనిఖీలు చేస్తూ తగిన చర్యలు తీసుకోవాలన్నారు. వివిధ పనులపై సమీక్ష.. జోన్‌కు నాలుగు మహాప్రస్థానాలు నిరి్మంచాలని, సీజనల్ వ్యాధుల నిరోధానికి క్యాలెండర్కనుగుణంగా కార్యాచరణ రూపొందించాలని, పుట్‌పాత్‌లు, బస్òÙల్టర్లు, శ్మశానవాటికలు, హెచ్ఆర్డీసీఎల్ పనులు, పారిశుధ్యం, నాలాల డీసిలి్టంగ్, చెరువులపరిరక్షణ,సుందరీకరణ, వెండింగ్జోన్లు,ఇంకుడు గుంతలు, సీఅండ్‌డీ వేస్ట్ రీసైక్లింగ్,కొత్త డంపింగ్‌యార్డులు, చెత్త రవాణా వాహనాలు తదితర అంశాల గురించి తొలుత సమీక్షించారు. -
సీఎంకు ‘గ్రీన్’ గిఫ్ట్
సాక్షి, హైదరాబాద్: ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ‘గ్రీన్’గిఫ్ట్ ఇచ్చేందుకు నగరం సిద్ధమైంది. సోమవారం సీఎం 66వ పుట్టినరోజు సందర్భంగా నగరంలో ఒక్క రోజే జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో 2.5 లక్షలు, హెచ్ఎండీఏ పరిధిలో 20 వేల మొక్కలు నాటేందుకు అధికారు లు కార్యాచరణ సిద్ధం చేశారు. జీహెచ్ఎంసీ లోని 150 వార్డులతో పాటు ఔటర్ రింగు రోడ్డు సమీపంలోని కండ్లకోయ జంక్షన్, ఎన్పీఏ హుడాపార్క్, సంజీవయ్య పార్క్‌లో సైతం ఆక్సిజన్‌ను విస్తృతంగా అందించే మొక్కలను నాటేందుకు హెచ్ఎండీఏ ఏర్పాట్లు చేసింది. సోమవారం ఉదయం 9 గంటలకు రాజ్యసభ సభ్యులు సంతోష్ కుమార్, రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్‌లు బల్కంపేట ఎల్లమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం అక్కడే మొక్కను నాటుతారు. అనంతరం నెక్లెస్ రోడ్లో ఏర్పాటు చేసే హెల్త్ క్యాంప్‌ను స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి ప్రారంభిస్తారు. ఫొటో ఎగ్జిబిషన్‌ను ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్‌కుమార్, ప్రభుత్వ పథకాల ఎల్ఈడీ ప్రదర్శనను హోంమంత్రి మహమూద్ అలీ ప్రారంభించిన అనంతరం ఎంపీ కేశవరావు కేక్ కట్ చేస్తారు. జల విహార్‌లో ఒగ్గుడోలు, గుస్సాడీ తదితర సాంస్కృతిక కార్యక్రమాలను ఏర్పాటు చేశారు. లలిత కళా తోరణంలో కేసీఆర్ ఆకృతిలో కూర్చుని బెలూన్లు ఎగురవేస్తున్న కవలలు 2.5 లక్షల మొక్కలు.. సీఎం కేసీఆర్ పుట్టినరోజు సందర్భంగా నగరవ్యాప్తంగా 150 వార్డులలో సోమవారం మొక్కలు నాటనున్నట్లు మేయర్ బొంతు రామ్మోహన్ ఒక ప్రకటనలో తెలిపారు. అందుకు అనుగుణంగా 36 నర్సరీల నుంచి 2 లక్షల 50 వేల మొక్కలను తరలించి అన్ని వార్డులలో అందుబాటులో ఉంచినట్లు తెలిపారు. నగర డిప్యూటీ మేయర్ బాబా ఫసియొద్దీన్ ఆధ్వర్యంలో సోమవారం ఉదయం 6 గంటలకు పాతబస్తీలోని జామే నిజామియాలో, ఆరున్నర గంటలకు నాంపల్లిలోని యూసిఫైన్ దర్గా ఆవరణలో, 7 గంటలకు సయ్యద్ సాహెబ్ రహముల్లా దర్గా ఆవరణలో, మొక్కలు నాటే కార్యక్రమం ఉంటుంది. రైస్‌మిల్లులు కళకళ సీఎం కేసీఆర్ దూరదృష్టితో రాష్ట్రంలో పంటల సాగు, విస్తీ ర్ణం, దిగుబడులు భారీగా పెరిగి రైస్‌మిల్లులకు ఏడాదంతా కలిసి వచ్చిం దని తెలంగాణ రైస్ మిల్లర్స్ అసోసియేషన్ పేర్కొంది. అసోసియేషన్ అధ్యక్షుడు గంపా నాగేందర్ ఆదివారం ఇక్కడ విలేకరులతో మాట్లాడుతూ 2014–15లో తెలంగాణాలో సివిల్ సప్లయిస్ కార్పొరేషన్ ద్వారా 24 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు చేస్తే, 2018–19లో 70 లక్షల టన్నులను కొనుగోలు చేశారన్నారు. విద్యుత్ కోతలు లేకపోవటంతో ఏడాది మొత్తంగా మిల్లులు కళకళలాడుతున్నాయని, దీనికి ప్రతిఫలంగా సోమవారం కేసీఆర్ బర్త్‌డే వేడుకలను ప్రతి రైస్‌మిల్లులో ఘనంగా నిర్వహించాలని నిర్ణయించినట్లు తెలిపారు. వెన్నతో కేసీఆర్ శిల్పం – ఎక్సెల్ కాలేజ్ విద్యార్థుల రూపకల్పన నాగోలు: ముఖ్యమంత్రి కేసీఆర్ 66వ జన్మదినం సందర్భంగా ఎల్బీనగర్లోని ఎక్సెల్ కాలేజ్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ నిర్వాహకులు దూగుంట్ల నరేష్, ఎం.నవకాంత్ ఆధ్వర్యంలో విద్యార్థులు వెన్నతో శిల్పాన్ని రూపొందించారు. కల్నరీ ఆర్ట్స్‌లో భాగంగా దీనిని తయారుచేశారు. ఎమ్మెల్సీ యెగ్గె మల్లేశం, బేవరేజ్ కార్పొరేషన్ చైర్మన్ దేవీ ప్రసాద్, ఎంబీసీ కార్పొరేషన్ చైర్మన్ తాడూరి శ్రీనివాస్, టీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి గట్టు రాంచంద్రరావు ఆదివారం ఈ విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఎంపీ సంతోష్‌కుమార్ పిలుపు మేరకు విద్యార్థులు మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ సోషల్ మీడియా కోఆర్డినేటర్ జగన్ తదితరులు పాల్గొన్నారు. 66 కిలోల బియ్యంతో.. గజ్వేల్ రూరల్: కేసీఆర్ జన్మదినం సందర్భంగా గజ్వేల్ పట్టణానికి చెందిన రామకోటి భక్తసమాజం వ్యవస్థాపకుడు రామకోటి రామరాజు 66 కిలోల బియ్యంతో కేసీఆర్ ముఖచిత్రాన్ని రూపొందించారు. పట్టణంలోని ప్రగతి సెంట్రల్ స్కూల్ ఆవరణలో 5 రోజుల పాటు కష్టపడి 66 కిలోల బియ్యంతో 16 అడుగుల భారీ చిత్రాన్ని అందంగా తీర్చిదిద్దారు. గతేడాది కేసీఆర్ జన్మదినం నాడు వడ్లతో ఆయన రూపాన్ని చిత్రీకరించగా.. ఈసారి బియ్యంతో కేసీఆర్ ముఖచిత్రాన్ని రూపొందించినట్లు రామరాజు తెలిపారు. -
ఆర్టీసీకి నిధులపై నిలదీసిన రేవంత్‌రెడ్డి
సాక్షి, హైదరాబాద్ : శనివారం నగరంలో జరిగిన జీహెచ్ఎంసీ కౌన్సిల్ మీటింగ్ వాడివేడిగా జరిగింది. జీహెచ్ఎంసీ కార్యాలయంలో మేయర్ బొంతు రామ్మోహన్ అధ్యక్షతన ప్రారంభమైన ఈ సమావేశానికి మల్కాజ్గిరి ఎంపీ రేవంత్‌రెడ్డి, ఎల్బీనగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి, ఎమ్మెల్సీలు రాంచందర్‌రావు, ఎమ్మెస్ ప్రభాకర్, కమిషనర్ లోకేష్ కుమార్, జోనల్ కమిషనర్లు, కార్పొరేటర్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నగరంలో ఎక్కడ చూసినా చెత్త, చెదారంతో నిండిఉండడంతో దోమలు వ్యాప్తి చెంది ప్రజలకు తీవ్ర జ్వరాలు వస్తున్నాయని కార్పొరేటర్లు ఆరోపించారు. డల్లాస్ లేదు, ఇస్తాంబుల్ లేదు. ఆటో నగర్ డంపింగ్ యార్డుతో జనాలు రోగాల బారిన పడుతున్నారని స్థానిక కార్పొరేటర్ నిలదీశారు. ఎంపీ రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ.. ఆర్టీసీ ఆర్థిక అంశాలలో జీహెచ్ఎంసీ పాత్ర పరోక్షంగా ఉందని విమర్శించారు. ఆర్టీసీకి సంవత్సరం వారీగా ఎంత మొత్తంలో నిధులు విడుదల చేశారు? ఇంకా ఎన్ని ఇవ్వాలి? జీహెచ్ఎంసీ ఆర్టీసీకి నిధులు ఇవ్వాలని నిబంధన ఉందా? లేక దయాదాక్షిణ్యాల మీద ఇవ్వాలా? అనే విషయాలపై స్పష్టతనివ్వాలని డిమాండ్ చేశారు. మరోవైపు కూకట్పల్లి ప్రాంతంలో మురికివాడలు పల్లెటూర్ల కంటే దారుణంగా ఉన్నాయని సభ దృష్టికి తీసుకొచ్చారు. -
గ్రీన్ చాలెంజ్ స్వీకరించిన అనసూయ
బంజారాహిల్స్: రాజ్యసభ సభ్యుడు జోగినిపల్లి సంతోష్ కుమార్ మొదలుపెట్టిన గ్రీన్ చాలెంజ్ దిగ్విజయంగా కొనసాగుతోంది. ఇందులో భాగంగా జీహెచ్ఎంసీ మేయర్ బొంతు రామ్మోహన్ ఇచ్చిన గ్రీన్ చాలెంజ్‌ను ప్రముఖ నటి, యాంకర్ అనసూయ స్వీకరించారు. ఈ మేరకు శనివారం కేబీఆర్ పార్క్ ముందు జీహెచ్ఎంసీ ఏరియాలో మూడు మొక్కలు నాటారు. ఆ తర్వాత తన కొడుకుతో పాటు యాంకర్ సుమ కనకాల, నటులు అడవి శేషు, ప్రియదర్శి, డైరెక్టర్ వంశీ పైడిపల్లిని తలా మూడు మొక్కలు నాటాలని ఆమె కోరారు. ఈ సందర్భంగా గ్రీన్ చాలెంజ్‌లో ప్రతి ఒక్కరూ పాల్గొనాలని అనసూయ పిలుపునిచ్చారు. (చదవండి : మాజీ మంత్రికి క్షమాపణలు చెప్పిన అనసూయ) -
ప్రశాంతంగా గణేశ్ నిమజ్జనం ప్రక్రియ
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ మహా నగరం మత సామరస్యానికి ప్రతీకగా నిలుస్తోందని నగర మేయర్ బొంతు రామ్మోహన్ అన్నారు. గణేష్ నిమజ్జనాలు విజయవంతంగా ముగిసిన సందర్భంగా శుక్రవారం జీహెచ్ఎంసీలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజలు, అధికారులు, ప్రజాప్రతినిధులు సహకారంతోనే గణేష్ ఉత్సవాలు ప్రశాంతంగా ముగిశాయని తెలిపారు. మిగిలిన పండుగల కన్నా గణేష్ ఉత్సవాలు..నిమజ్జనాలు ప్రత్యేకంగా సాగుతాయన్నారు. అన్ని మతాలకు చెందిన వారు పరస్పర సహకరించుకుంటూ ఆనందంగా జరుపుకుంటారని చెప్పారు. పోలీసు, హెచ్ఎండిఏ, వాటర్ బోర్డు, విద్యుత్, ఇరిగేషన్, టూరిజం తదితర విభాగాలు సమన్వయంతో పనిచేసి గణపతి ఉత్సవాలను విజయవంతంగా సాగేలా చేశాయన్నారు. మెట్రో, ఎంఎంటిఎస్,ఆర్టీసీ మెరుగైన రవాణా సదుపాయాలు కల్పించాయని అభినందించారు. పరస్పర సహకారంతోనే.. గణేష్ నిమజ్జనాలు విజయవంతం అయ్యేందుకు జీహెచ్ఎంసీ అన్ని సందర్భాల్లోనూ మంచి సహకారం అందించిందని నగర సీపీ అంజనీకుమార్ అన్నారు. నగర మౌలిక సదుపాయాల విషయంలో పరస్పర సహకారం ఎంతో అవసరమని చెప్పారు. ప్రతి నిమిషం సమన్వయంతోనే నిమజ్జన ప్రక్రియను ప్రశాంతంగా పూర్తి చేశామన్నారు. ప్రజలు కూడా సహకరించారని తెలిపారు. గతంలో కొన్ని ఇబ్బందులు కలిగాయని..ఈ సారి చిన్నపాటి అసౌకర్యం కూడా లేకుండా ప్రశాంతంగా ఉత్సవాలు ముగిశాయన్నారు. అన్ని విభాగాలు పూర్తి సహకారం.. గత నెలరోజులుగా నిమజ్జనానికి ఏర్పాట్లు చేయడంతో జీహెచ్ఎంసీ నిమగ్నమైందని..అన్ని విభాగాలు పూర్తి సహకారం అందించాయని జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేశ్ అన్నారు. ప్రధానంగా పారిశుద్ధ్యం విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నామన్నారు. -
ఖైరతాబాద్ వినాయకుడిని అక్కడ నిమజ్జనం చేస్తాం
సాక్షి, ఖైరతాబాద్: పోలీసు బందోబస్తు మధ్య వినాయక నిమజ్జనాన్ని నిర్వహిస్తామని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. ఖైరతాబాద్ గణేశ్ పనులను సోమవారం ఆయన క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. 65వ సంవత్సరం జరుగుతున్న వినాయక ఉత్సవాలకు అన్ని శాఖల సమన్వయంతో ఏర్పాట్లు చేస్తామని పేర్కొన్నారు. ఇతర రాష్ట్రాల నుంచి కూడా భక్తులు పెద్దఎత్తున తరలి వస్తారు కనుక ట్రాఫిక్ మళ్లింపు చేపడతామన్నారు. కరెంట్ ఇబ్బందులు లేకుండా అధికారులు జాగ్రత్తలు తీసుకుంటున్నారని తెలిపారు. సీఎం కేసీఆర్ చెప్పినట్టుగా రాష్ట్రంలో అన్ని మతాల పండుగలు అద్భుతంగా జరుగుతున్నాయని ఆనందం వ్యక్తం చేశారు. వినాయక నిమజ్జనం రోజు ప్రజలు సహకరించాలని కోరారు. నగర మేయర్ బొంతు రామ్మోహన్ మాట్లాడుతూ.. ఖైరతాబాద్ వినాయకుడి దగ్గర అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. దర్శనం చేసుకునేందుకు వచ్చే లక్షలాది మంది భక్తులకు భద్రత కల్పిస్తామని హామీ ఇచ్చారు. హుస్సేన్‌సాగర్‌లో లోతైన ప్రాంతంలో ఖైరతాబాద్ వినాయకుడి నిమజ్జనం జరుగుతుందన్నారు. నగరంలోని వినాయకుల నిమజ్జనం కోసం 32 కొలనులు ఏర్పాటు చేస్తున్నామని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో నగర మేయర్ బొంతు రామ్మోహన్, ఎమ్మెల్యే దానం నాగేందర్, పోలీసు శాఖ, ఆర్&బీ, జీహెచ్ఎంసీ, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. -
దోమల నివారణకు డ్రోన్ టెక్నాలజీ
సాక్షి, హైద్రాబాద్ : నగరంలో ఆధునాతన టెక్నాలజీ ఉపయోగించి చెరువులు, నాలాల సుందరీకరణ పనులు చేపడుతున్నామని మేయర్ బొంతు రామ్మోహన్ తెలిపారు. శుక్రవారం మియాపూర్ గుర్నాధం చెరువులో దోమల నివారణకు డ్రోన్ టెక్నాలజీతో యాంటీ లార్వా మందు పిచికారీ పనులను జీహెచ్ఎంసీ చేపట్టింది. ఈ కార్యక్రమానికి మేయర్‌తోపాటు ఎమ్మెల్యే గాంధీ, కార్పొరేటర్లు మేక రమేష్, నాగేందర్ యాదవ్ పాల్గొన్నారు. మేయర్ మాట్లాడుతూ సిబ్బందికి వీలుకాని చోట డ్రోన్లతో మందుల పిచికారీ, గుర్రపు డెక్క తొలగింపునకు చర్యలు తీసుకుంటున్నామని, రానున్న రోజుల్లో నగరమంతా ఇదే టెక్నాలజీ ఉపయోగిస్తామని తెలిపారు. -
ఫోన్ లిఫ్ట్ చేయమని చెప్పండి: రేవంత్‌రెడ్డి
సాక్షి, హైదరాబాద్ : నగర మేయర్ బొంతు రామ్మోహన్ అధ్యక్షతన జీహెచ్ఎంసీ సర్వసభ్య సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి ఎంపీ రేవంత్ రెడ్డి, ఎమ్మెల్సీ నవీన్ రావు, జీహెచ్ఎంసీ కమిషనర్ దానకిషోర్, డిప్యూటి మేయర్ ఫసియొద్దిన్, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు హాజరైయ్యారు. ముందుగా దివంగత కేంద్ర మంత్రులు జైపాల్ రెడ్డి, సుష్మా స్వరాజ్, ముఖేష్ గౌడ్లతో పాటు ప్రమాదంలో మరణించిన ఇద్దరు బల్దియా ఉద్యోగుల ఆత్మ శాంతి కోసం రెండు నిమిషాలు మౌనం పాటించారు. అనంతరం ప్రారంభమైన సమావేశంలో ఎంపీ రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. అధికారులకు ముందు ఫోన్ లిఫ్ట్ చేయమని చెప్పాలని, కనీసం ప్రోటోకాల్ పాటించాలని మేయర్‌కు సూచించారు. అధికారులను సరెండర్ చేసే అధికారం సభకు ఉందని, సభ్యులు ఆ విశిష్ట అధికారాలను పాటించాలని తెలిపారు. బక్రీద్, గణేష్ నిమజ్జనం వంటి పండుగల ముందే సమావేశాలు ఎందుకు నిర్వహించడం లేదని ప్రశ్నించారు. గచ్చిబౌలిలో ఎమ్మార్ ప్రాపెర్టీ అక్రమ నిర్మాణలపై చర్యలు తీసుకోవాలని కోరారు. నగరంలో ఎక్కడచూసినా గుంతలే కనిపిస్తున్నాయని, వాటితో ప్రజలు ఇబ్బందులకు అనేక గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రాంతీయ సమస్యలను వెంటనే పరిష్కరించారాలని హెచ్చరించారు. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ వంటి ప్రదేశాలు బాగుంటాయని అందరూ అనుకుంటున్నారు, కానీ అవి కూడా ప్రస్తుతం అధ్వానంగా మారాయని పేర్కొన్నారు. నగరంలో ముఖేష్ గౌడ్, జైపాల్ రెడ్డి, సుష్మా స్వరాజ్ విగ్రహాలను ఏర్పాటు చేయడానికి నిర్ణయం తీసుకోవాలని సూచించారు. కమిషనర్ దానకిషోర్ మాట్లాడుతూ.. కొంతమంది అధికారులు పని ఒత్తిడివల్ల కలవకపోయి ఉండవచ్చని అయితే అందరూ తప్పనిసరిగా ప్రజాప్రతినిధులను కలవాలని తెలిపారు. నగరంలో డెంగ్యూ కేసులు ఎక్కువయ్యాయని, వాటి నివారణకు చర్యలు చేపడతామన్నారు. -
ఇద్దరు జీహెచ్ఎంసీ ఉద్యోగులు మృతి
సాక్షి, హైదరాబాద్ : జీహెచ్ఎంసీలో ప్రమాదం చోటుచేసుకుంది. ఎంజీబీఎస్ కేంద్రంలో చెత్త తరలిస్తుండగా ప్రమాదవశాత్తు ఇద్దరు ఉద్యోగులు మంగళవారం మృతి చెందారు. జీహెచ్ఎంసీ ప్రభుత్వ ఉద్యోగి హెల్పర్ ఆరీఫ్, అవుట్ సోర్సింగ్ ఉద్యోగి హాజిఖాన్.. విధుల్లో ఉండగా భారీ వాహనం ఒక్కసారిగా వెనుకకు రావడంతో ఈ ఘటన సంభవించింది. ఈ దుర్ఘటనపై మేయర్ బొంతు రామ్మోహన్, కమిషనర్ దానకిషోర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు రూ. 2 లక్షల ఎక్స్‌గ్రేషియాను ప్రకటించినట్లు తెలిపారు. మృతుల కుటుంబాలను ఆదుకుంటామని హామీ ఇచ్చిన మేయర్.. ప్రభుత్వ ఉద్యోగి ఆరీఫ్ కుటుంబంలో ఒకరికి ఉద్యోగం కల్పిస్తామని వెల్లడించారు. అంతేగాక ఇరు కుటుంబాలకు పింఛను సదుపాయం కల్పిస్తామని మేయర్ భరోసానిచ్చారు. -
సహకారంతోనే ‘మహా’ కల సాకారం
గ్రేటర్ హైదరాబాద్ అభివృద్ధికి అనుగుణంగా నగర సుందరీకరణకు, సకల వసతి సౌకర్యాల కల్పనకు బల్దియా పూనుకుంది. ఆ క్రమంలోనే అనేక ప్రణాళికలను రచించి కార్యరూపం ఇస్తూ ప్రజల భాగస్వామ్యంతో ప్రగతిని సాధిస్తూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల అవార్డులను, రివార్డులను, మన్ననలను సైతం పొందింది. అనుకూల పరిస్థితులను అభివృద్ధిపరచుకుంటూ ప్రతికూల పరిస్థితులపై విశ్లేషణ చేసుకుంటూ ప్రజల వద్ద నుంచి సమయానుకూలంగా సూచనలు, సలహాలు స్వీకరిస్తూ అభివృద్ధి పథంలో అడుగులు వేసేందుకు మహానగర పాలక సంస్థ తీసుకుంటున్న ప్రతి నిర్ణయం నగర అభివృద్ధి సూచికలను దాటుతూ మన్ననలు పొందుతుందనడంలో సందేహమే లేదు. రాష్ట్ర ముఖ్యమంత్రి, దార్శనికులు కేసీఆర్ మార్గదర్శకంలో నగర అభివృద్ధికి కావలసిన ప్రణాళికలను బల్దియా స్టాండింగ్ కమిటీలో చర్చించి జీహెచ్ఎంíసీ నిర్ణయం తీసుకుంటుంది. సమన్వయంతో, నిర్దేశిత లక్ష్యాలను ఏర్పాటు చేసుకుంటూ... ఆ లక్ష్యాలను అధిగమిస్తూ నగరాన్ని ఉన్నతి వైపు నడిపించేందుకు జీహెచ్ఎంసీ పాలకమండలి చిత్తశుద్ధితో కృషి చేస్తున్నది. కోటి జనాభాకుపై గల మహానగర అభివృద్ధిలో ఒడిదుడుకులు ఉండటం సహజం. భవన నిర్మాణ వ్యర్థ పదార్థాలు రహదారులపై వేయడం, బహిరంగ మల మూత్ర విసర్జన, తడి పొడి చెత్తలౖకై ప్రత్యేక వ్యవస్థలను ఏర్పాటు చేసినప్పటికీ సవ్యంగా వాటిని సద్వినియోగపరచుకోకుండా, నిర్లక్ష్యంగా, ఆలస్యంగా రోడ్లమీద పడ వేయడంపై నగరవాసుల్లో చైతన్యం తెచ్చేందుకు అనేక రకాల వినూత్న కార్యక్రమాలను చేపట్టడం జరిగింది. మరింత మార్పుకు దోహదం చేసే విధంగానే ఉల్లం ఘనలకు జరిమానాలు విధించడం జరుగుతుంది. అయితే ఇది జీహెచ్ఎంసీ ఆదాయాన్ని పెంచేందుకు ఎంతమాత్రం కాదు. నగర ప్రజలకు నిరంతర మంచినీటి సరఫరా అందించాలనే ముఖ్యమంత్రి ఆశయానికి అనుగుణంగా వందల కోట్లు వ్యయంతో వందలాది కిలోమీటర్ల దూరం నుంచి నీటిని తీసుకొస్తూ నగర ప్రజల దాహార్తిని తీర్చేందుకు అందిస్తున్న నీటిని సైతం వృథా చేస్తున్న తీరు మరింత బాధాకరం. హైదరాబాద్ నగరాన్ని గ్లోబల్ సిటీగా రూపొందించాలన్న యువ నాయకులు కె.టి.రామారావు ఆశయాలకు అనుగుణంగా నగర రహదారులపై ఎగుడుదిగుడులను, మ్యాన్‌హోల్‌లను, క్యాచ్పి ట్లను, స్లూయిట్స్ను అధిగమించేందుకు బల్దియా ప్రణాళిక రచించింది. ట్రాఫిక్ జాంలను తగ్గించేందుకు ఫ్లైఓవర్లను అండర్‌పాస్ నిర్మాణాలను, ఎస్ఆర్డీపీ కింద నిర్వహించడం. దుర్గం చెరువుపై ఆధునిక టెక్నాలజీతో ప్రపంచంలోనే మొట్టమొదటి రోపింగ్ బ్రిడ్జిని ఏర్పాటుచేయడం తద్వారా ప్రజలకు మూడున్నర కిలోమీటర్ల దూరం తగ్గనుంది. డ్రైనేజీల్లో పేరుకుపోయిన మురికి, వ్యర్థ పదార్థాల నిర్మూలనకు పని చేసే యంత్రాలను సైతం తెప్పించింది. విజిలెన్స్, ఎన్ఫోర్స్మెంట్, మేనేజ్మెంట్లను ఏర్పాటు చేయడం ద్వారా అవినీతిపరుల ఆట కట్టించడంతోపాటు, నిబంధనలకు నీళ్లు వదులుతూ ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్న పబ్బులు, బార్ అండ్ రెస్టారెంట్లు, హోటల్స్ భరతం పట్టించడంలో జీహెచ్ఎంసీ విజయాన్ని సాధించింది. రైట్ టు వాక్ అనే హక్కును అనుసరించి హైదరాబాద్ నగరంలో దేశంలోనే మరే నగరంలో లేని విధంగా 15 వేల ఫుట్‌పాత్‌లపై ఆక్రమణలను తొలగించాం. నగరంలో ప్రమాదాలు సంభవించినప్పుడు. డిజాస్టర్ మేనేజ్మెంట్ డైరెక్టరేట్ సమర్థవంతంగా విధులను నిర్వహిస్తూ నగరవాసుల మన్ననలను పొందుతోంది. మన నగరం విశ్వ నగరంగా రూపుదిద్దుకోవాలంటే ప్రజలు, అధికారులు కలసికట్టుగా, సమన్వయంతో పనిచేయాలి. ఇందుకు ప్రజల సహకారం కూడా తోడవ్వాలని కోరుతున్నా. -బొంతు రామ్మోహన్ వ్యాసకర్త నగర మేయర్, గ్రేటర్ హైదరాబాద్ -
సమన్వయంతోనే అభివృద్ధి
పోచారం: మున్నూరుకాపులు మరింత అభివృద్ధి సాధించాలంటే..కులస్తులంతా సమన్వయంతో పనిచేయాలని నగర మేయర్ బొంతు రామ్మోహన్ పిలుపునిచ్చారు. మేడ్చల్ జిల్లా ఘట్కేసర్ మండలం అన్నోజిగూడ శివాస్ ఫంక్షన్ హాల్లో శనివారం జరిగిన మున్నూరుకాపు రాష్ట్ర సర్వసభ్య సమావేశంలో ఆయన మాట్లాడుతూ..బహుజన కులాల్లో వ్యవసాయాన్ని వృత్తిగా చేపట్టిన వారిలో మున్నూరుకాపులే అధికంగా ఉన్నారని, సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన రైతు సంక్షేమ కార్యక్రమాల ద్వారా వారంతా లబ్ధి పొందుతారన్నారు. రాజ్యాధికారంలో వెనుకబాటే.. వ్యవసాయాధారిత వృత్తులకు మున్నూరుకాపులే మూలమని, పటేల్, పట్వారీ వ్యవస్థకు వీరే రూపురేఖలు దిద్దారని నీటి పారుదల చైర్మన్ వీరమల్ల ప్రకాశ్ వివరించారు. ఆ వ్యవస్థలు రద్దవడంతో మున్నూరుకాపులు రాజ్యాధికారంలో వెనకబడ్డారన్నారు. బీసీలను బ్యాక్వర్డ్ క్యాస్ట్ అనేకంటే బహుజన క్లాస్‌గా పిలవాలని, ఈ మార్పునకు తెలంగాణ నాంది కావాలన్నారు. 1 కోటి 25 లక్షల ఎకరాలకు నీళ్లు ఇచ్చే దిశగా తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తోందని, దీంతో నిరాదరణకు గురైన గొలుసుకట్టు చెరువులకు పూర్వవైభవం రాబోతుందని వివరించారు. మన కులం నుండి 9 మంది ఎమ్మెల్యేలు ఎన్నిక కావడం శుభపరిణామమన్నారు. 33 జిల్లాల ప్రతినిధులు ఐక్యవేదిక గా ఏర్పడటం సంతోషంగా ఉందన్నారు. రమేశ్ హజారే మాట్లాడుతూ..సీఎం కేసీఆర్ ఆశిస్తున్న బంగారు తెలంగాణ నిర్మాణంలో మున్నూరు కాపులు కూడా భాగస్వాములు కావాలని ఆకాంక్షించారు. డాక్టర్ పర్వతం వెంకటేశ్వర్లు రాసిన మున్నూరు కాపుల చరిత్ర–సంస్కృతి పుస్తకం, సంఘం ప్రత్యేక సంచిక, క్యాలెండర్ ఆవిష్కరించారు. అనంతరం పలు తీర్మానాలు ఆమోదించారు. రైతులకు సన్మానం ఈ సమావేశానికి హాజరైన రైతులను మున్నూరు కాపు సంఘం ఘనంగా సన్మానించింది. మున్నూరు కాపుల ఆత్మగౌరవ భవన నిర్మాణానికి ఐదెకరాల స్థలాన్ని, రూ.ఐదు కోట్లను కేటాయించిన సీఎం కేసీఆర్‌కు సమావేశం కృతజ్ఞతలు తెలిపింది. అనంతరం మున్నూరు కాపు సంఘం రాష్ట్ర అధ్యక్షుడిగా సర్దార్ పుటం పురుషోత్తంను సమావేశంలో ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సమావేశం ప్రారంభించేముందు కశ్మీర్ ఉగ్రదాడిలో అమరులైన జవాన్లకు నివాళి అర్పిస్తూ రెండు నిమిషాలు మౌనం పాటించారు. ఈ సమావేశంలో మాజీ ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్, బీసీ కార్పొరేషన్ చైర్మన్ టి.శ్రీనివాస్, గడ్డిఅన్నారం మార్కెట్ కమిటీ చైర్మన్ పుట్టం పురుషోత్తం తదితరులు పాల్గొన్నారు. తీర్మానాలు: - 18 శాతం ఉన్న మున్నూరు కాపులను రాజకీయంగా, సామాజికంగా, ఆర్థికంగా ప్రోత్సహించాలని తీర్మానించారు. - మున్నూరుకాపు విద్యార్థి వసతి గృహాన్ని దేవాదాయ శాఖ పరిధి నుండి తొలగించాలన్నారు. - ఈ కులానికి కేటాయించిన 5 ఎకరాలు, 5 కోట్ల రూపాయలను రెట్టింపు చేయాలని కోరారు. - ప్రతి జిల్లాలో 2 ఎకరాల స్థలం కేటాయించి, అందులో బాలబాలికలకు హాస్టల్, కల్యాణ మంటపం ఏర్పాటు చేయాలని తీర్మానించారు. -
ఇరాన్ సదస్సుకు మేయర్‌కు ఆహ్వానం
సాక్షి, హైదరాబాద్: ఇరాన్‌లోని ముషాద్‌నగరంలో ‘భూ సంబంధిత, ఆర్థిక విధానాలు, మున్సిపల్ పాలన బాధ్యతలు’ అంశంపై నవంబర్ 27 నుంచి 30 వరకు నిర్వహించే సదస్సుకు హాజరుకావాలని మేయర్ బొంతు రామ్మోహన్‌ను ఇరాన్ కాన్సులేట్ జనరల్ మహ్మద్ హెగ్బిన్ ఘోమి కోరారు. హెగ్బిన్ ఘోమి శుక్రవారం మేయర్‌తో జీహెచ్ఎంసీ కార్యాలయంలో భేటీ అయ్యారు. ఇరాన్ లోని ఇస్ఫాన్లో నవంబర్ 22, 24ల్లో జరిగే ఇస్ఫాన్డే ఉత్సవాలకూ మేయర్‌ను ఆహ్వానించారు. మేయర్ రామ్మోహన్ మాట్లాడుతూ, హైదరాబాద్, ఇరాన్ దేశాల మధ్య శతాబ్దాలుగా చారిత్రక, సాంస్కృతిక బంధం ఉందన్నారు. హైదరాబాద్‌లో ఇరాన్ సంస్కృతి, జీవన విధానం బలంగా ఉందని, చివరి నిజాం ఉస్మాన్ అలీఖాన్ హయాంలో ఇది మరింత బలోపేతంగా ఉండేదన్నారు. రాష్ట్రంలో ఎన్నికలు జరగనున్నందున ప్రభుత్వం నుంచి అనుమతి పొందాల్సి ఉందన్నారు. హెగ్బిన్ ఘోమికి చార్మినార్‌ను బహూకరించి దుశ్శాలువతో మేయర్ రామ్మోహన్ çసన్మానించారు. -
‘రోడ్ల మరమ్మతులకు 79 బృందాలు’
సాక్షి, హైదరాబాద్ : హైదరాబాద్ మహానగరంలోని రోడ్ల మరమ్మతులు, గుంతల పూడ్చివేత యుద్ద ప్రాతిపదికన చేపట్టడానికి తీసుకోవాల్సిన చర్యలపై మేయర్ బొంతు రామ్మోహన్ మంగళవారం సమీక్ష సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో జీహెచ్ఎంసీ, హెచ్ఆర్డీసీ ఇంజనీర్లతో పాటు, జెఎన్టీయూ, ఉస్మానియా యూనివర్సిటీలకు చెందిన ప్రొఫెసర్లు కూడా పాల్గొన్నారు. మేయర్ మాట్లాడుతూ.. ‘హైదరాబాద్ నగరంలో మొత్తం 9 వేల కిలోమీటర్ల మేర రహదారులు ఉండగా వీటిలో ప్రధానంగా 320 కి.మీ రోడ్లను హెచ్ఆర్డీసీఎల్ నిర్వహిస్తోంది. గతేడాది జూలై 1వ తేదీ నుంచి నేటి వరకు నగరంలోని రోడ్లపై 3,141 గుంతలు ఏర్పడ్డాయి. వీటిలో 772 గుంతలను పూడ్చాం. మిగిలిన వాటిని రెండు రోజుల్లో పూడ్చివేస్తాం. 2017 జూన్ 1 నుంచి 2018 జూన్ 30 వరకు 50,100 పాట్‌హోల్స్‌ను పూడ్చివేశాం. రోడ్ల మరమ్మతులకు ప్రత్యేంగా 79 ఇన్స్టాంట్ రిపేర్ టీమ్‌లను ఏర్పాటు చేశాం. వర్షకాలంలో దెబ్బతిన్న రోడ్లను మరమ్మతులు చేయడం, గుంతలు పూడ్చడానికి త్రిముఖ వ్యుహం అవలంభించబోతున్నాం. ప్రతిరోజు ఇంజనీర్లు తమ ప్రాంతాల్లో సంబంధిత ప్రజా ప్రతినిధులతో కలిసి రోడ్లను తనిఖీ చేసేలా చర్యలు తీసుకుంటాం. దెబ్బతిన్న రోడ్లను వెంటనే మరమ్మతులు చేస్తాం. జలమండలి, మెట్రోరైలుతో పాటు వివిధ పనుల నిమిత్తం తవ్విన రోడ్లను వెంటనే పునరుద్దరించాలని కోరాం. నిరంతర వర్షాల కారణంగా సీసీ రోడ్ల నిర్మాణం చేపట్టనున్నాం. వచ్చే మూడు నెలలు కీలక సమయం కానున్నందున.. ఎల్ అండ్ టీ, వాటర్ బోర్డు, బీఎస్ఎన్ఎల్ ఇతర విభాగాల ఇంజనీర్లతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి తవ్వకాలు, గుంతల పూడ్చివేతపై ప్రత్యేక కార్యచరణ రూపొందించుతామ’ని తెలిపారు. -
బీఎస్ఈలో జీహెచ్ఎంసీ లిస్టింగ్
సాక్షి, హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో అభివృద్ధి పనుల కోసం బాండ్ల జారీ ద్వారా రూ.200 కోట్లు సమీకరించిన గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ ఎంసీ) గురువారం బాంబే స్టాక్ ఎక్సే్చంజ్ (బీఎస్ఈ)లో అధికారికంగా లిస్ట్ అయింది. ఎస్ఆర్డీపీ (వ్యూహాత్మక రహదారుల అభివృ ద్ధి పథకం)లో భాగంగా మల్టీలెవెల్ ఫ్లై ఓవర్లు, ఎక్స్‌ప్రెస్ కారిడార్లు వంటి అభివృద్ధి పనుల కోసం రూ.1,000 కోట్లు సమీకరించాలని నిర్ణయించిన జీహెచ్ఎంసీ.. తొలివిడతగా రూ.200 కోట్లు సేకరించింది. ఈ బాండ్లను బీఎస్ఈలో లిస్ట్ చేశారు. జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఉత్సవ కార్యక్రమంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్కే జోషి, మేయర్ బొంతు రామ్మోహన్ కలసి గంట (గాంగ్) మోగించడం ద్వారా దీనిని అధికారికంగా ప్రకటించారు. జీహెచ్ఎంసీ సరికొత్త ఒరవడి: సీఎస్ బాండ్ల ద్వారా నిధుల సేకరణతో దేశంలోనే జీహెచ్ఎంసీ సరికొత్త ఒరవడికి శ్రీకారం చుట్టిందని, ప్రభుత్వాలపై ఆధారపడకుండా సొంతంగా నిధులు సమీకరణలో మిగతా స్థానిక సంస్థలకు ఆదర్శప్రాయంగా నిలిచిం దని సీఎస్ ఎస్కే జోషి ప్రశంసించారు. ఈ నిధులతో చేపట్టే పనులను సరైన ప్రణాళిక, అమలు చర్యలతో నిర్ణీత వ్యవధిలో పూర్తిచేయాలని సూచించారు. బాండ్ల మార్కెట్లో ప్రవేశం స్థానిక సంస్థలకు కష్టమైన పని అని.. జీహెచ్ఎంసీ దాన్ని విజయవంతంగా సాధించిందని ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణారావు అభినందించారు. ఈ నిధులతో ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా అభివృద్ధి పనులు పూర్తిచేయాలన్నారు. పారదర్శకత, స్వయం సమృద్ధి విధానాలతో జీహెచ్ఎంసీ దేశంలో రెండో స్థానంలో నిలిచిందని, బాండ్ల కోసం ఎలక్ట్రానిక్ బిడ్డింగ్ కాగానే చైనాలోని బీజింగ్ వంటి ప్రాంతాల నుంచి జీహెచ్ఎంసీ గురించి ఆరా తీశారని బీఎస్ఈ లిమిటెడ్ చీఫ్ (బిజినెస్ ఆపరేషన్స్) నీరజ్ కుల్క్షేత్ర తెలిపా రు. అప్పు తీసుకోవడాన్ని చాలామంది తప్పు గా భావిస్తారని, బాండ్ల ద్వారా నిధుల సమీకరణ పరపతితో కూడుకున్న పని అని జీహెచ్ఎంసీ కమిషనర్ బి.జనార్దన్‌రెడ్డి అన్నారు. మౌలిక వసతుల కోసమే.. హైదరాబాద్‌లో రోజురోజుకూ పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా మౌలిక సదుపాయాలు మెరుగుపరిచేందుకే బాండ్ల ద్వారా నిధులు సేకరించామని మేయర్ బొంతు రామ్మోహన్ చెప్పారు. అన్ని రంగాల్లో హైదరాబాద్ ముందంజలో ఉన్నందున పెట్టుబడులు పెట్టేందుకు ప్రపంచవ్యాప్తంగా ఆసక్తి చూపుతున్నారని పేర్కొన్నారు. దేశంలోని నాలుగువేల పైచీలుకు స్థానిక సంస్థల్లో జీహెచ్ఎంసీ మాత్రమే ఆర్థిక స్థిరత్వంతో ‘ఏఏ స్టేబుల్’ర్యాంకు సాధించిందని తెలిపారు. -
శ్మశానంలో మందు కొడుతున్న యువత
-
మేయర్ వెళ్లేసరికి మందేస్తూ యువకులు.. షాక్
సాక్షి, హైదరాబాద్ : నగరంలోని ఓ ప్రముఖ శ్మశాన వాటికలో దూరి మందు కొడుతున్న యువకులను చూసి నగర మేయర్ బొంతు రామ్మోహన్ షాకయ్యారు. అనంతరం వారిని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకొని అరెస్టు చేయించి వారికి షాకిచ్చారు. ఈ సంఘటన గురువారం సాయంత్రం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. పంజాగుట్ట హిందూ శ్మశాన వాటిక అభివృద్ధి పనులు పరిశీలించేందుకు నగర మేయర్ బొంతు రామ్మోహన్ అక్కడికి వచ్చారు. ఆ సమయంలో కొంతమంది యువకులు సమాధులను టేబుళ్లుగా మార్చుకొని దర్జాగా మందుకొడుతూ కనిపించి మేయర్‌ను అవాక్కయ్యేలా చేశారు. వారిని చూసి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన ఆయన వెంటనే వారిని అదుపులోకి తీసుకోని స్టేషన్‌కు తరలించి కేసులు నమోదు చేయాలని ఆదేశించారు. ఇంత జరుగుతుంటే ఏం చేస్తున్నారని పోలీసులను ప్రశ్నించారు. కాగా, మందు కొడుతున్న యువకుల్లో ఒకరు ఆ వార్డు సభ్యురాలు జయలక్ష్మీ కుమారుడు కూడా ఉండటం గమనార్హం. 21 ఏళ్ల లోపు వారికి వైన్స్లలో మద్యం ఇవ్వకపోవడం, మద్యం షాపుల్లో కూర్చొనివ్వకపోవడం చేస్తున్న కారణంగా కొంతమంది యువకులు ఇలా స్మశానాలను సైతం ఆశ్రయించి మందుకొడుతున్నట్లు తెలుస్తోంది. దీంతోపాటు శ్మశానాల భద్రతలోపం కూడా ఇందుకు కారణంగా చెప్పవచ్చు. -
నగరంలో మేయర్ బైక్ ర్యాలీ
హైదరాబాద్: నగరంలోని కవాడిగూడ, గాంధీనగర్ డివిజన్లో అధికారులు, కార్పొరేటర్లతో కలిసి మేయర్ బొంతురామ్మోహన్ మంగళవారం ఉదయం బైక్ ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో డీసీ ముకుందరెడ్డి, ఏఎంహెచ్‌వో భార్గవ్‌నారాయణ, కార్పోరేటర్లు లాస్యనందిత, పద్మానరేశ్లు పాల్గొన్నారు. రోడ్లపై నీటిని వదలొద్దని, గృహనిర్మాణాల వ్యర్థాలను వేయవద్దని ప్రజలకు అవగాహన కల్పించారు. రోడ్లపై గుంతలు, వాటర్ లీకింగ్ పాయింట్లను సరిచేయాలని మేయర్ అధికారులకు ఆదేశించారు. సిటీ సెంట్రల్ లైబ్రరీని పరిశీలించిన మేయర్ విదార్థుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. విద్యార్థుల కోసం అదనంగా రీడింగ్ షెడ్లు, తాగునీటి కోసం ఏటీడబ్ల్యూ, టాయ్లెట్లు ఏర్పాటు చేయాలని అధికారులకు ఆదేశించారు. -
ప్రతి 5 వేల జనాభాకు ఒక బస్తీ దవాఖానా: బొంతు
సాక్షి, న్యూఢిల్లీ: హైదరాబా ద్లో ప్రతి 5 వేల మంది జనాభాకు ఒక బస్తీ దవాఖా నాను ఏర్పాటు చేయాలని యోచిస్తున్నట్లు జీహెచ్ఎంసీ మేయర్ బొంతు రామ్మోహన్ తెలిపారు. గురువారం ఢిల్లీలో జరిగిన మేయర్ల సదస్సులో పాల్గొనేందుకు వచ్చిన బొంతు రామ్మోహన్ ఢిల్లీ ప్రభుత్వం ఆధ్వర్యంలో నడుస్తున్న మోహల్లా క్లినిక్‌లను సందర్శించి వాటి పనితీరును పరిశీలించారు. పీపీపీ విధానంలో చేపడుతున్న ఈ క్లీనిక్‌లను హైదరాబాద్‌లో చేపట్టేందుకు అవసరమైన చర్యలు తీసుకోనున్నట్లు తెలిపారు. దీనికి సంబంధించి త్వరలోనే సంబంధిత అధికారులతో సమావేశం నిర్వహించి ప్రతి 5 వేల మంది ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా బస్తీ దవాఖానాల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. హైదరాబాద్‌లో చెత్త నుంచి విద్యుత్ ఉత్పత్తి చేసే ప్లాంటును ఏర్పాటు చేస్తున్న నేపథ్యంలో ఢిల్లీలో ఇప్పటికే ఏర్పాటు చేసిన 23 మెగావాట్ల సామర్థ్యం కలిగిన పవర్‌ప్లాంట్‌ను మేయర్ ఆధ్వర్యంలో జీహెచ్ఎంసీ కమిషనర్ బి.జనార్దన్‌రెడ్డి, రామగుండం, కొత్తగూడెం, ఖమ్మం మేయర్ల బృందం సందర్శించింది. ఈ ప్లాంట్‌లో అవలంబిస్తున్న కొత్త విధానాలను, సాంకేతిక పద్ధతులను హైదరాబాద్ ప్లాంట్‌లో కూడా అమలు చేస్తామని ఆయన తెలిపారు. -
శ్రీవారిని దర్శించుకున్న తెలంగాణ ప్రముఖులు
తిరుమల: శ్రీ వెంకటేశ్వరస్వామి వారిని పలువురు ప్రముఖులు మంగళవారం దర్శించుకున్నారు. తెలంగాణ ప్రభుత్వ సాంస్కృతిక సలహాదారు రమణాచారి, జీహెచ్ఎంసీ మేయర్ బొంతు రామ్మోహన్ తెల్లవారుజామున వీఐపీ దర్శన సమయంలో శ్రీవారి సేవలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రులు, కుటుంబ సభ్యులతో కలిసి మంగళవారం సాయంత్రం తిరుమలకు చేరుకుంటారని, బుధవారం ఉదయం వీఐపీ దర్శన సమయంలో శ్రీవారిని దర్శించుకుంటారని తెలిపారు. అలాగే తెలంగాణ రాష్ట్రం తరపున మొక్కుకున్న ప్రకారం రూ. 5 కోట్ల విలువైన స్వర్ణాభరణ కానుకలను సీఎం సమర్పించనున్నట్లు చెప్పారు. అక్కడి నుంచి తిరుచానూరు వెళ్లి పద్మావతి అమ్మవారిని కూడా దర్శించుకుంటారన్నారు. -
స్వచ్ఛ సర్వేక్షణ్కు జీహెచ్ఎంసీ సన్నద్ధం
హైదరాబాద్: స్వచ్ఛ సర్వేక్షణ్ కార్యక్రమానికి గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ సన్నద్ధం అయింది. స్వచ్ఛ సర్వేక్షణ్ అవగాహన కార్యక్రమం శుక్రవారం ఎల్బీ స్టేడియంలో జరగనుంది. జీహెచ్ఎంసీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జీహెచ్ఎంసీ మేయర్, కమిషనర్ మీడియా సమావేశంలో మాట్లాడారు. స్వచ్ఛతపై నగర పౌరుల్లో మరింత అవగాహన పెంచాల్సి ఉందని,. స్వచ్ఛ హైదరాబాద్ కింద ఉత్తమ సేవలు అందించిన వారిని తగు రీతిలో సన్మానిస్తామని మేయర్ బొంతు రామ్మోహన్ తెలిపారు. ఈ సందర్భంగా జీహెచ్ఎంసీ మేయర్ జనార్దన్ రెడ్డి మాట్లాడుతూ స్వచ్ఛతను ఒకరోజు, ఒక వారానికే పరిమితం చేయొద్దని, నిరంతరం కొనసాగాలని అన్నారు. ఈసారి స్వచ్ఛభారత్ ర్యాంకుల్లో కేంద్రం 500 నగరాలను పరిగణనలోకి తీసుకోనుందని, స్వచ్ఛభారత్‌లో గతంలో హైదరాబాద్‌కు వచ్చిన ర్యాంకును నిలబెట్టుకోవాలని అన్నారు. స్వచ్ఛ సర్వేక్షన్-2017 కింద 'వాహ్... హైదరాబాద్' కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమానికి కేంద్రమంత్రులు వెంకయ్య నాయుడు, బండారు దత్తాత్రేయ, రాష్ట్రమంత్రి కేటీఆర్, పలువురు క్రీడా, సినీ ప్రముఖులు హాజరు కానున్నారు. ఈ సందర్భంగా స్వచ్ఛ హైదరాబాద్ కార్యక్రమంపై ఫోటో ఎగ్జిబిషన్ నిర్వహించనున్నారు. -
యాచక రహిత నగరమే ధ్యేయం
ఎల్బీనగర్: బిచ్చగాళ్లు లేని నగరంగా తీర్చిదిద్దేందుకు బృహత్తర ప్రణాళికలు సిద్ధం చేశామని మేయర్ బొంతు రాంమోహన్ తెలిపారు. ఎల్బీనగర్ సర్కిల్ పరిధిలోని జీహెచ్ఎంసీ అమ్మానాన్న అనాథాశ్రమం ఆధ్వర్యంలో శనివారం నిర్వహించిన బెగ్గర్ ఫ్రీ సిటీ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ మతిస్థిమితం లేని వారికి సేవలు చేస్తున్న అమ్మానాన్న ఫౌండేషన్ చైర్మన్ గట్టు శంకర్‌ను అభినందించారు. ప్రభుత్వ సలహాదారు వేణుగోపాలచారి మాట్లాడుతూ బెగ్గర్స్ పునరావాసానికి గ్రేటర్ పరిధిలో ప్రణాళికలు సిద్ధం చేస్తే కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు ఇప్పించేందుకు కృషి చేస్తానని పేర్కొన్నారు. మహేశ్వరం ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి మాట్లాడుతూ బిచ్చగాళ్ల నిర్మూలనకు తాను మేయర్‌గా ఉన్న సమయంలో అనేక ప్రయత్నాలు చేశానన్నారు. ఈస్ట్ జోనల్ కమిషనర్ రఘుప్రసాద్ మాట్లాడుతూ జీహెచ్ఎంసీ పరిధిలో మానసిక వికలాంగులు, నిజమైన బెగ్గర్లను గుర్తించి అమ్మానాన్న ఫౌండేషన్ కు అప్పగిస్తామన్నారు. కార్యక్రమంలో వినోద్కోట్ల, యూసీడీ అడిషనల్ కమిషనర్ భాస్కరాచారి, డీసీలు పంకజ, శ్రీనివాస్‌రెడ్డి, శ్రీనివాసరావు, కార్పొరేటర్లు ముద్రబోయిన శ్రీనివాసరావు, సామ రమణారెడ్డి, అనితా దయాకర్‌రెడ్డి, సామ తిరుమల్‌రెడ్డి, జిన్నారం విఠల్‌రెడ్డి, కొప్పుల విఠల్‌రెడ్డి, జిట్టా రాజశేఖర్‌రెడ్డి, రమావత్ పద్మానాయక్, రాధా ధీరజ్‌రెడ్డి -
'అక్రమకట్టడం అని ఇటీవలే నోటీస్ ఇచ్చాం'
-
'అక్రమకట్టడం అని ఇటీవలే నోటీస్ ఇచ్చాం'
హైదరాబాద్: నానక్‌రాం గూడలో కుప్పకూలిన భవనానికి సరైన అనుమతులు లేవని మేయర్ బొంతు రామ్మోహన్ అన్నారు. కూలిన భవనం అక్రమకట్టడం అని ఇటీవలే నోటీసులు కూడా ఇచ్చామని మేయర్ తెలిపారు. నిర్మాణంలో నాణ్యతా ప్రమాణాలు పాటించలేదని..భవన ప్రమాదానికి కారణమైన బిల్డర్ సత్యనారాయణ సింగ్ పై చర్యలు తీసుకుంటామని బొంతు రామ్మోహన్ స్పష్టం చేశారు. -
కుప్పకూలిన భవనం: పెరుగుతున్న మృతుల సంఖ్య
-
కూలిన బతుకులు
నగరంలో కుప్పకూలిన ఏడంతస్తుల భవనం.. 16 మంది మృతి చెందినట్లుగా అనుమానం నిర్మాణంలో ఉండగానే భారీ ప్రమాదం భవనంలోనే 14 కుటుంబాలకు చెందిన 30 మంది కూలీలు! వేగంగా కొనసాగుతున్న సహాయక చర్యలు కేవలం 260 గజాల్లోనే ఏడంతస్తుల భవనం లోపభూయిష్టంగా, ఎలాంటి అనుమతులూ లేకుండానే నిర్మాణం భవన యజమాని సత్తూ సింగ్ పెద్ద గుడుంబా డాన్! సాక్షి, హైదరాబాద్ నిర్మాణంలో ఉన్న ఓ ఏడంతస్తుల భవనం ఒక్కసారిగా కుప్పకూలింది.. ఆ నిర్మాణంలోనే పనిచేస్తున్న పలువురు కూలీల కుటుంబాలను బలితీసుకుంది. హైదరాబాద్‌లోని నానక్‌రామ్‌గూడలో గురువారం రాత్రి 9.10 గంటల సమయంలో జరిగిన ఈ దుర్ఘటనలో 16 మంది మృతి చెందినట్లు తెలుస్తోంది. మరింత మంది శిథిలాల కింద చిక్కుకుపోయినట్లు భావిస్తున్నారు. భవన శిథిలాల కింద ఓ మహిళ, ఓ చిన్నారి ఆర్తనాదాలు వినిపిస్తున్నాయని సహాయక సిబ్బంది చెబుతున్నారు. వారిని శిథిలాల నుంచి బయటకు తీసేందుకు రెస్క్యూ టీమ్ తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఇంకా సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. టోలిచౌకి ప్రాంతానికి చెందిన తుల్జాపూర్ సత్యనారాయణ సింగ్ ఈ భవనం యజమాని. ఆయన కేవలం 260 గజాల స్థలంలో ఏకంగా జీప్లస్ 6 (ఏడు అంతస్తులు)తో పాటు పైన పెంట్‌హౌస్ కూడా నిర్మిస్తున్నారు. 2015 సెప్టెంబర్ నుంచి ఈ భవన నిర్మాణం కొనసాగుతోందని, నిర్మాణంలోని ఆ భవనంలోనే జిల్లాల నుంచి వచ్చిన 14 కుటుంబాలకు చెందిన 30 మంది కూలీలు నివసిస్తున్నారని తెలుస్తోంది. ప్రమాద సమయంలో వారంతా భవనంలోనే ఉన్నారని, కొన్ని కుటుంబాలకు చెందిన చిన్న పిల్లలు కూడా ఉన్నారని స్థానికులు చెబుతున్నారు. శిథిలాల కింద చిక్కుకున్న వారు చేస్తున్న ఆర్తనాదాలు అక్కడున్న అందరినీ కలచి వేస్తున్నాయి. ఫొటోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి ప్రమాద విషయం తెలిసిన వెంటనే పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు అక్కడికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టాయి. శిథిలాల కింద ఉన్నవారిని రక్షించేందుకు జేసీబీలు, క్రేన్లతో ప్రయత్నిస్తు న్నారు. భవనం వద్దకు వెళ్లేదారి ఇరుకుగా ఉండడంతో సహాయక చర్యలకు ఇబ్బంది ఎదురవుతోందని పోలీసులు చెబుతున్నారు. ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ, మంత్రులు నాయిని, పద్మారావు, ఎమ్మెల్యే అరికె పూడి గాంధీ, రాచకొండ పోలీస్ కమిషనర్ సందీప్ శాండిల్య, డిప్యూటి మేయర్ బాబా ఫసియుద్దీన్ తదితరులు ఘటనా స్థలికి చేరుకుని సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు. క్షతగాత్రులకు తక్షణ వైద్యం అందిం చేందుకు సమీప ఆసుపత్రుల నుంచి అంబులెన్స్‌లను రప్పించారు. ఎందుకు కూలిపోయింది? లోపభూయిష్టంగా నిర్మాణం చేపట్టడం వల్లే భవనం కూలిపోయిందని కొందరు స్థానికులు చెబుతుండగా... ఆ భవనానికి వెనుక మరో భవన నిర్మాణం కోసం బాంబులతో పేల్చి సెల్లార్ గుంత తీస్తుండడమే ప్రమాదానికి కారణమని మరికొందరు చెబుతున్నారు. ఎటువంటి అనుమతులు లేకుండా, కనీస జాగ్రత్తలు తీసుకోకుండా భవనాన్ని నిర్మిస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. కాగా సత్యనారాయణసింగ్ భవనం కుప్పకూలిపోవడంతో.. ఆ ధాటికి పక్కనే ఉన్న తుల్జాపూర్ వీరేంద్రసింగ్‌కు చెందిన రెండస్తుల భవనం బీటలు వారి, కొంత మేర దెబ్బతిన్నది. వీరేంద్రసింగ్ కుమార్తెలకు స్వల్ప గాయాలయ్యాయి. విచారం వ్యక్తం చేసిన సీఎం కేసీఆర్ నానక్‌రామ్‌గూడలో భారీ భవంతి కుప్పకూలడంపై ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న ఆయన హైదరాబాద్ పోలీస్ కమిషనర్, జీహెచ్ఎంసీ కమిషనర్లతో ఫోన్లో మాట్లాడారు. వేగంగా సహాయక చర్యలు చేపట్టాలని ఆదేశించారు. అవసరమైతే ఎన్డీఆర్ఎఫ్ బృందాలను వినియోగించుకోవాలని సూచించారు. కారకులపై చర్యలు తీసుకుంటాం ‘‘అనుమతుల్లేని, అక్రమ నిర్మాణాలపై కఠిన చర్యలు తీసుకుంటున్నాం. అయినా కొత్త బిల్డర్లు వచ్చి ఇష్టారాజ్యంగా కొత్త భవనాలు నిర్మిస్తున్నారు. ప్రమాదానికి కారకులైన వారిని వదిలిపెట్టం. అనుమతుల్లేని నిర్మాణా లను ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించేది లేదు..’’ –బొంతు రామ్మోహన్, జీహెచ్ఎంసీ మేయర్ తక్షణ వైద్యసాయానికి చర్యలు ‘‘కూలిన భవనంలో చిక్కుకున్న క్షతగాత్రులకు తక్షణ వైద్యసాయం అందించేందుకు చర్యలు చేపట్టాం. సమీపంలోని ఆసుపత్రులను అప్రమత్తం చేసి అంబులెన్సులు రప్పించాం. వీలైనంతవ రకు ప్రాణనష్టం జరగకుండా చర్యలు తీసుకుంటాం..’’ జనార్దన్‌రెడ్డి, జీహెచ్ఎంసీ కమిషనర్ యజమాని గుడుంబా డాన్! నానక్‌రామ్‌గూడలో కుప్పకూలిన భవనం యాజమాని తుల్జారాం సత్యనారాయణసింగ్ అలియాస్ సత్తూ సింగ్ ఆ ప్రాంతంలో గుడుంబా డాన్ అని తెలిసింది. కూలిన భవనానికి ఎదురుగా సత్తు సింగ్‌కు ఆరు అంతస్తుల మరో భవనం ఉంది. అతను రెండు దశాబ్దాలుగా ఆ ప్రాంతంలో గుడుంబా అక్రమ వ్యాపారం చేస్తున్నాడని తెలిసింది. ఇక కూలిపోయిన భవనానికి జీహెచ్ఎంసీ నుంచి ఎలాంటి నిర్మాణ అనుమతులూ లేవు. గుడుంబా అ క్రమ వ్యాపారం నిర్వహిస్తుండగా కేసులు నమోదు చేసిన పోలీస్ అధికారులపై సత్తూ సింగ్ ఎన్నోసార్లు మానవ హక్కుల కమిషన్‌ను ఆశ్రయించాడు. సత్తూసింగ్ కుమారుడు అనిల్‌సింగ్ జీహెచ్ఎంసీ ఎ న్నికల్లో గచ్చిబౌలి కార్పొరేటర్ స్థానానికి స్వతంత్య్ర అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయాడు. -
బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటాం: మేయర్
హైదరాబాద్: నగరంలోని నానక్ రాంగూడాలో నిర్మాణంలో ఉన్న భవనం కూలిపోవడం స్థానికంగా కలకలం రేపింది. ఈ ప్రమాదానికి కారణమైన బాధ్యులపై పూర్తిస్థాయిలో చర్యలు తీసుకుంటామని జీహెచ్ఎంసీ మేయర్ బొంతు రాంమోహన్ అన్నారు. సమాచారం అందుకున్న వెంటనే సహాయక చర్యలను చేపట్టామని చెప్పారు. బాధ్యులు ఎవరైనా ఉపేక్షించేది లేదని, ఎన్ని కుటుంబాలు ఉన్నాయన్న దానిపై స్పష్టత లేదన్నారు. ఆ భవనం సత్తుసింగ్ అనే వ్యక్తికి చెందినదని అధికారులు భావిస్తున్నారు. వాచ్ మెన్ కుటుంబం, మరో నాలుగు కార్మికుల కుటుంబాలు ఇందులో నివసిస్తున్నాయి. బాధితులకు ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్పత్రిలో ఎక్కడ ట్రీట్ మెంట్ తీసుకున్నా ఆర్థిక సాయం అందించడానికి సిద్ధంగా ఉన్నామని మేయర్ చెప్పారు. టౌన్ ప్లానింగ్ సిబ్బంది, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు సహాయక చర్యలు ఘటనాస్థలానికి చేరుకుని జేసీబీలతో సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు. టౌన్ ప్లానింగ్ అధికారులు కొందరు పర్మిషన్ ఐదు అంతస్తులకు తీసుకుంటే.. కట్టేది మాత్రం అంతకంటే ఎక్కువ అంతస్తులని, అధికారుల కళ్లుగప్పి అక్కడక్కడా ఇలాంటి నిర్మాణాలు జరుగుతున్నాయని తెలిపారు. వీటిని అరికట్టేందుకు చర్యలు తీసుకుంటాం. ఫిల్మ్ నగర్ సొసైటీలో ఇటీవల ఓ భవనం కూలిన ఘటనపై చర్యలు తీసుకోనందున ఇదే తరహాలో నిర్మాణంలో ఉన్న భవనాలు కూలిపోతున్నాయని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అయితే ఫిల్మ్ నగర్ సొసైటీ క్లబ్ వారికి ఇప్పటివరకూ మళ్లీ నిర్మాణం చేపట్టేందుకు పర్మిషన్ ఇవ్వలేదని మేయర్ రాంమోమన్ మీడియాకు వివరించారు. -
అర్థరాత్రి మంత్రి, మేయర్ తనిఖీలు
హైదరాబాద్ : జీహెచ్ఎంసీ పరిధిలో కొనసాగుతున్న రోడ్డు పనులను ఆర్అండ్బీ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు, మేయర్ బొంతు రామ్మోహన్ శుక్రవారం అర్థరాత్రి స్వయంగా పరిశీలించారు. కూకట్పల్లి వైజంక్షన్ నుంచి మియాపూర్ వరకు వేస్తున్న తారు రోడ్డు పనుల్లో నాణ్యతను వారు తనిఖీలు చేశారు. పనులను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. నగరంలోని జాతీయ రహదారి అభివృద్ధికి రూ.28 కోట్లను కేటాయించినట్లు తెలిపారు. -
జీహెచ్ఎంసీలో మేజర్ రోడ్ల విభాగం రద్దు
సాక్షి, సిటీబ్యూరో: జీహెచ్ఎంసీలో మేజర్ రోడ్ల విభాగాన్ని రద్దు చేశారు. ఈ విభాగంలో పనిచేస్తున్న ఎస్ఈ, ఇద్దరు ఈఈలతో సహా దాదాపు 25మంది ఇంజినీర్లను ఇతర విభాగాల్లో నియమించనున్నారు. గత సంవత్సరం ఎన్నికల ముందు నగరంలోని ప్రధాన రహదారుల పనుల్ని త్వరితంగా పూర్తిచేసేందుకు మేజర్ రోడ్ల విభాగాన్ని కొత్తగా ఏర్పాటు చేశారు. దాదాపు రూ.300 కోట్ల మేర పనుల్ని ఆ విభాగం పూర్తిచేసింది. తాజా పరిస్థితులు, అవసరాల దృష్ట్యా దాన్ని రద్దు చేసినట్లు తెలిసింది. మేయర్ తనిఖీలు.. నగరంలోని పలు ప్రాంతాల్లో నిర్వహిస్తున్న రోడ్ల మరమ్మతులు, గుంతల పూడ్చివేతలను నగర మేయర్ బొంతు రామ్మోహన్ బుధవారం ఆకస్మిక తనిఖీ చేశారు. నగరంలో దాదాపు 190కి పైగా ప్రత్యేక బృందాలతో పెద్దఎత్తున రోడ్ల మరమ్మతుల పనులు చేస్తున్నారు. కాప్రా సర్కిల్లో పనుల తీరును ఆయన పరిశీలించారు. -
ఎల్బీ స్టేడియంలో బతుకమ్మ సంబరాలు
సాక్షి,సిటీబ్యూరో: తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబించే బతుకమ్మ పండుగను విశ్వవ్యాప్త గుర్తింపు లభించేలా అత్యంత ఘనంగా నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో జీహెచ్ఎంసీ అందుకు తగ్గ ఏర్పాట్లు చేస్తోంది. ఎల్బీ స్టేడియంలో అక్టోబర్ 8న భారీ స్థాయిలో బతుకమ్మ పండుగ చేసేందుకు గ్రేటర్ పరిధిలోని స్వయం సహాయక సంఘాల బృందాల సమాఖ్య ప్రతినిధులతో గురువారం జీహెచ్ఎంసీలో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఇందులో మేయర్ బొంతు రామ్మోహన్‌తో పాటు పర్యాటక, సాంస్కృతిక శాఖ కార్యదర్శి బుర్రా వెంకటేశం, పర్యాటక సంస్థ ఎండీ క్రిస్టినా చోంగ్తు, జీహెచ్ఎంసీ అడిషనల్ కమిషనర్ భాస్కరాచారి, సాంస్కృతిక శాఖ డైరెక్టర్ హరికృష్ణ పాల్గొన్నారు. ఎల్బీ స్టేడియంలో 20 అడుగుల ఎత్తయిన బతుకమ్మ చుట్టూ పదివేల మంది మహిళలు బతుకమ్మ ఆడతారని అందుకు పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నట్లు వారు తెలిపారు. దాదాపు 50వేల మంది ప్రత్యక్షంగా వీక్షించే అవకాశం ఉందన్నారు. ఈ వేడుకలో 500 మంది విదేశీ మహిళలు కూడా పాల్గొనడం ప్రత్యేకత అని మేయర్ తెలిపారు. ఇక్కడ జరిగే బతుకమ్మ పండుగతో నగరానికి గుర్తింపుతో పాటు పర్యాటకుల సంఖ్య కూడా పెరుగుతుందన్నారు. వచ్చే ఏడాది పండుగకు 50వేల మంది విదేశీయులు ప్రత్యక్షంగా తిలకించేలా ఏర్పాట్లు చేస్తామన్నారు. ప్రత్యేక ఆకర్షణగా పుట్టిల ప్రదర్శన.. ట్యాంక్‌బండ్ పరిసరాల్లో అక్టోబర్ 9న మహిళలు భారీసంఖ్యలో స్వచ్ఛందంగా బతుకమ్మ ఆడతారని, ఇందుకోసం ఏర్పా ట్లు చేస్తున్నట్లు మేయర్ రామ్మోహన్ తెలి పారు. అదేరోజు రాత్రి హుస్సేన్‌సాగర్‌లో 300 పుట్టిల ప్రదర్శన ఉంటుందన్నారు. విద్యుత్ కాంతుల వర్ణాలతో పుట్టిల ప్రదర్శన ప్రత్యేక ఆకర్షణ అన్నారు. ట్యాంక్‌బండ్‌పై తెలంగాణ వంటకాలతో స్టాల్స్ ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు. -
నాలా ఆక్రమణలు సహించం కూల్చేస్తాం
గచ్చిబౌలి: నాలాలపై ఉన్న అక్రమ నిర్మాణాలతోపాటు ఎఫ్టీఎల్, చెరువులు, కాలనీల్లోని అక్రమ నిర్మాణాలన్నీ కూల్చివేస్తామని జీహెచ్ఎంసీ కమిషనర్ బి జనర్ధాన్ రెడ్డి స్పష్టం చేశారు. మాదాపూర్‌లోని దుర్గం చెరువు నుంచి రాయదుర్గంలోని మల్కంచెరువు వరకున్న నాలా చుట్టూరా ఉన్న నిర్మాణాలను, షౌగౌస్ హోటల్‌కు చెందిన వంటసామగ్రి భద్ర పరిచే గోడౌన్ కూల్చివేతను మేయర్ బొంతు రామ్మోహన్ తో కలిసి ఆయన బుధవారం పరిశీలించారు. ఈ సందర్భంగా కమిషనర్ జనార్ధన్ రెడ్డి మాట్లాడుతూ వరదలొచ్చినప్పుడు జనం పడే కష్టాలను ప్రత్యక్షంగా చూశామన్నారు. నగరంలోని అక్రమ నిర్మాణాలపై వివక్ష లేకుండా తొలగిస్తామని ఆయన స్పష్టం చేశారు. నగరంలో ఇటీవల కురిసిన వర్షాలకు 117 రోడ్లు దెబ్బతిన్నాయని, 180 కిలోమీటర్ల రోడ్లపై గుంతలు ఏర్పడ్డాయని గుర్తించామన్నారు. రోడ్ల పరిస్థితిపై రాష్ట్ర ప్రభుత్వానికి ?సవివరమైన నివేదికను అందించడం జరుగుతుందన్నారు.వర్షపునీటితో నిల్వ ఉండే ప్రాంతాలు, గుంతలు ఏర్పడిన రోడ్లను గుర్తించి వాటిని సిమెంట్ కాంక్రీట్‌తో పూడ్చివేసి రాకపోకలు సాఫీగా సాగేలా చేస్తామన్నారు. ఉద్యోగులు, విద్యార్థులు అంతా కార్ పూలింగ్‌పై దృస్టి సారించాలని ఆయన కోరారు. నిర్మాణాలన్నీ కూల్చాల్సిందే : మేయర్ నాలాల ఆక్రమణలు, నిర్మాణాల నేపథ్యంలో డ్రామా కంపెనీలా చేయవద్దని, నాలా దగ్గరలో ఉన్న అన్ని నిర్మాణాలను వెంటనే కూల్చివేయాలని మేయర్ బొంతు రామ్మోహన్ అధికారులకు ఆయన స్పష్టం చేశారు. నాలా, చెరువులు, కుంటల వద్ద పట్టా భూములున్నవారు వ్యవసాయం చేసుకోవాలని, నిర్మాణాలను చేపట్టరాదని ఆయన స్పష్టం చేశారు. నాలా సమీపంలో నూతనంగా నిర్మాణం చేస్తున్న భారీ భవనంను చూస్తూ ఈ నిర్మాణాలను వెంటనే ఆపివేయాలని, వీటికి ఇచ్చిన అనుమతులను త్వరలో రద్దు చేస్తామన్నారు. శేరిలింగంపల్లి తహశీల్దార్ మధుసుధన్ శేరిలింగంపల్లి సర్కిల్ ?–11 డీసీ మనోహర్, ఏసీపీ కృష్ణమోహన్ , డీఈ కిష్టప్ప, ఇతర అధికారులు పాల్గొన్నారు. -
గణేష్ నిమజ్జనంలో ఎలాంటి అపశ్రుతులు జరగలేదు
-
నిమజ్జన రోజు ప్రజలు సహకరించాలి
-
వైవాకు హాజరైన మేయర్ రాంమ్మోహన్
ఉస్మానియా యూనివర్సిటీ: నగర మేయర్ బొంతు రామ్మోహన్ శనివారం ఉస్మానియా యూనివర్సిటీని సందర్శించారు. పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ విభాగంలో పీహెచ్డీ చేస్తున్న ఆయన తన ఫైనల్ వైవా నిమిత్తం ఓయూకు వచ్చినట్లు సమాచారం. అనంతరం రీసెర్చ్ సెంటర్ ఫర్ అర్భన్ అండ్ రూరల్ ఎన్విరాన్మెంటల్ స్టడీస్ భవనం ఆవరణలో హరితహారంలో భాగంగా మొక్కలు నాటారు. కార్యక్రమంలో ఓయూ వీసీ ప్రొ. రామ్‌చంద్రం, గోపాల్‌రెడ్డి, మోహన్‌రావు తదితరులు పాల్గొన్నారు. -
నగరానికే హీరో ఈ వెంకటయ్య
సాక్షి,సిటీబ్యూరో: జీహెచ్ఎంసీ పారిశుధ్య కార్మికుడు వెంకటయ్యకు జాతీయస్థాయిలో లభించిన అత్యున్నత పురస్కారం జీహెచ్ఎంసీ కార్మికులందరికీ వర్తిస్తుందని మేయర్ బొంతు రామ్మోహన్ అన్నారు. రాజేంద్రనగర్ సర్కిల్లో పనిచేస్తున్న వెంకటయ్యను బుధవారం జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో సన్మానించారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ వెంకటయ్యను ఆదర్శంగా తీసుకుని అంకితభావంతో విధుల్ని నిర్వహించాలని కోరారు. పారిశుధ్య కార్మికులు,సిబ్బందిని ప్రోత్సహించేందుకు స్వాతంత్య్ర దినోత్సవం, గణతంత్ర దినోత్సవాల సందర్భంగా అవార్డులు అందజేసే అంశాన్ని పరిశీలిస్తామన్నారు. జీహెచ్ఎంసీ కమిషనర్ డా.బి.జనార్దన్‌రెడ్డి మాట్లాడుతూ, ఈ పురస్కారం హైదరాబాద్ నగరానికి లభించిన పురస్కారంగా పరిగణిస్తున్నామన్నారు. వెంకటయ్యకు డ్యూక్ బిస్కెట్ కంపెనీ యాజమాన్యం రూ. 25వేల నగదును అందజేయగా, అవార్డు అందుకునేందుకు న్యూఢిల్లీ వెళ్లేందుకు మైలార్దేవులపల్లి కార్పొరేటర్ విమాన ప్రయాణ చార్జీలు అందించేందుకు ముందుకు రావడం అభినందనీయమన్నారు. ఈ సందర్భంగా వెంకటయ్యను శాలువ, పుష్పగుచ్ఛాలతో ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో అడిషనల్ కమిషనర్లు రామకృష్ణారావు, కెనెడి, శంకరయ్య, భాస్కరాచారి, సౌత్‌జోన్ కమిషనర్ శ్రీనివాసరెడ్డి, రాజేంద్రనగర్ డిప్యూటీ కమిషనర్ దశరథ్ తదితరులు పాల్గొన్నారు. ఉత్తమ కార్మికులను సన్మానించండి ప్రతినెల మొదటి శనివారం నిర్వహిస్తున్న గుడ్ ప్రాక్టీసెస్డేలో భాగంగా క్షేత్రస్థాయిలో బాగా పనిచేసే పారిశుధ్య కార్మికులు, ఎస్ఎఫ్ఏలు, ఇతర ఉద్యోగులను గుర్తించి సన్మానించడం ద్వారా వారిని ప్రోత్సహించాలని కమిషనర్ జనార్దన్‌రెడ్డి జోనల్, డిప్యూటీ కమిషనర్లకు సూచించారు. పారిశుధ్య కార్యక్రమాల అమలుపై బుధవారం అధికారులతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఆగస్టు 15 లోగా సర్కిళ్లలో గరిష్ట స్థాయిలో వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణాన్ని పూర్తిచేయాలని ఆదేశించారు. -
భవన నిర్మాణానికి అనుమతి లేదు
-
'బోనాల ఉత్సవాలను అధికారికంగా నిర్వహిస్తాం'
హైదరాబాద్: నగరంలో బోనాల ఉత్సవాలపై తెలంగాణ రాష్ట్ర హోంశాఖ మంత్రి నాయిని నరసింహరెడ్డి గురువారం సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్ష సమావేశానికి మేయర్ బొంతు రామ్మోహన్, కార్పొరేటర్లు తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా నాయిని మాట్లాడుతూ.. బోనాల ఉత్సవాలను అధికారికంగా నిర్వహిస్తామన్నారు. బోనాల ఏర్పాట్లకు తెలంగాణ ప్రభుత్వం రూ. 5 కోట్లు కేటాయించినట్టు నాయిని వెల్లడించారు. -
నగరంలో పర్యటించిన మేయర్
హైదరాబాద్ : జీహెచ్ఎంసీ మేయర్ బొంతు రామ్మోహన్ బుధవారం హైదరాబాద్ నగరంలో పర్యటించారు. నగరంలోని కొత్తగూడ, కొండాపూర్ ప్రాంతాల్లోని రహదారుల పరిస్థితిని ఆయన పరిశీలించారు. సదరు ప్రాంతంలో ట్రాఫిక్, రహదారి పరిస్థితిని ఆయన వెంట ఉన్న ఉన్నతాధికారులతో చర్చించారు. అలాగే, కేబీఆర్ పార్కు వద్ద వన్‌వే ఏర్పాటుపై కూడా తీసుకోవాల్సిన చర్యలపై ఉన్నతాధికారులకు మేయర్ బొంతు రామ్మోహన్ పలు సూచనలు చేశారు. -
'ఇంకుడుగుంతలు లేకుంటే నల్లా కలెక్షన్ ఇవ్వం
హైదరాబాద్: ఇంకుడుగుంతలు లేకుంటే ఇంటికి అనుమతి, నల్లా కనెక్షన్ ఇవ్వమని హైదరాబాద్ మేయర్ బొంతు రామ్మోహన్ చెప్పారు. శనివారం నగరంలోని సోమాజీగూడ ప్రెస్ క్లబ్లో ఇంకుడుగుంతను తవ్వి నీటి సంరక్షణ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా రామ్మోహన్ మాట్లాడుతూ.. రెండు కొత్త జలాశయాలు పూర్తయితే నగరంలో మంచినీటి సమస్య తీరినట్టేనని అన్నారు. ఇంటి నెంబర్ల కోసం డిజిటల్ నెంబరింగ్ విధానం అమలు చేయనున్నట్టు చెప్పారు. -
నగరంలో మేయర్ ఆకస్మిక పర్యటన
హైదరాబాద్: నగర మేయర్ బొంతు రామ్మోహన్ శనివారం సాయంత్రం నగరంలోని కొన్ని ప్రాంతాల్లో ఆకస్మికంగా పర్యటించారు. వనస్థలిపురం బీఎన్‌రెడ్డి నగర్లో కలియదిరిగిన ఆయన స్థానికులను సమస్యలు అడిగి తెలుసుకున్నారు. సరూర్‌నగర్, గడ్డి అన్నారం, చైతన్యపురి డివిజన్లోని పలుకాలనీల్లో కూడా ఆయన పర్యటించారు. మురుగు కాల్వలు, డ్రెయినేజీ వ్యవస్థను పరిశీలించారు. వరదలు వచ్చినప్పుడు ముంపునకు గురయ్యే ప్రాంతాల్లో ప్రజలతో మాట్లాడారు. సమస్య శాశ్వత పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఆయన వెంట స్థానిక కార్పొరేటర్లు, అధికారులు ఉన్నారు. -
నగరంలో మేయర్ అర్థరాత్రి తనిఖీలు
సికింద్రాబాద్: హైదరాబాద్ నగర మేయర్ బొంతు రామ్మోహన్ శుక్రవారం అర్ధరాత్రి నగరంలోని పలు ప్రాంతాలలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. సికింద్రాబాద్‌లోని మోండా మార్కెట్లో కలియతిరిగారు. స్థానికుల నుంచి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అలాగే, ఆర్టీసీ క్రాస్‌రోడ్డులో, నారాయణగూడలో జీహెచ్ఎంసీ పారిశుద్ధ్య కార్మికులతో బొంతు రామ్మోహన్ మాట్లాడ్డారు. ఈ సందర్భంగా వారి ఇబ్బందులను ఆయన స్వయంగా అడిగి తెలుసుకున్నారు. పారిశుద్ధ్య విభాగంలో పెద్ద ఎత్తున అక్రమాలు జరుగుతున్నట్టు ఈ సందర్భంగా మేయర్ దృష్టికి వచ్చినట్లు సమాచారం. అయితే మేయర్ మరో రెండు రోజులు నగరంలోని వివిధ ప్రాంతాల్లో ఇలాగే అర్థరాత్రుళ్లు తనిఖీలు నిర్వహించనున్నారని అధికారులు తెలిపారు. -
'కేసీఆర్ భగీరథ ప్రయత్నానికి అండగా నిలబడదాం'
హైదరాబాద్ : తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ చేపట్టిన వాటర్ గ్రిడ్ భగీరథ ప్రయత్నానికి అండగా నిలబడదామని నగర ప్రజలకు హైదరాబాద్ మేయర్ బొంతు రామ్మెహన్ పిలుపు నిచ్చారు. మంగళవారం ప్రపంచ నీటి దినోత్సవాని పురస్కరించుకుని కేబీఆర్ పార్క్ వద్ద నీటి అవగాహనపై ఏర్పాటు చేసిన ర్యాలీని ఆయన ప్రారంభించారు. కేబీఆర్ పార్కు నుంచి జూబ్లీహిల్స్ చెక్‌పోస్ట్ వరకు ఈ ర్యాలీని నిర్వహించారు. ఈ సందర్భంగా బొంతు రామ్మోహన్ మాట్లాడుతూ... నీటిని రక్షించడంపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ముందుకురావాలని స్వచ్ఛంద సంస్థలకు బొంతు రామ్మోహన్ పిలుపు నిచ్చారు. నీటి పొదుపుగా వాడుకుంటూ భవిష్యత్తులో నీటి యుద్ధాలు జరగకుండా జాగ్రత్తపడదామని అన్నారు. ఈ కార్యక్రమంలో రాజకీయ, సినీ ప్రముఖులతోపాటు నగర ప్రజలు భారీ సంఖ్యలో హాజరయ్యారు. -
హైకోర్టు చీఫ్ జస్టిస్‌ను కలిసిన మేయర్
హైదరాబాద్ : జీహెచ్ఎంసీ మేయర్ బొంతు రామ్మోహన్ ఆదివారం హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దిలీప్ బి.భోంస్లేను కలిశారు. బంజారాహిల్స్‌లోని దిలీప్ బి.భోసలే నివాసంలో ఆయనను...మేయర్ మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. గ్రేటర్ మేయర్‌గా బాధ్యతలు స్వీకరించిన అనంతరం బొంతు రామ్మోహన్ ...పలువురు ప్రముఖుల్ని కలుస్తున్న విషయం తెలిసిందే. శనివారం ఆయన ...రాష్ట్ర గవర్నర్ నరసింహన్‌ను కలిశారు. -
నేడు మేయర్‌గా బాధ్యతలు
హైదరాబాద్: హైదరాబాద్ గ్రేటర్ మేయర్‌గా బొంతు రామ్మోహన్ శుక్రవారం బాధ్యతలు చేపట్టనున్నారు. నేడు మధ్యాహ్నం 12.40గంటల ప్రాంతంలో ఆయన బాధ్యతలు స్వీకరిస్తారు. ఈ కార్యక్రమానికి డిప్యూటీ సీఎం మహమూద్ అలీ, హోమంత్రి నాయిని నరసింహారెడ్డి, మంత్రులు పద్మారావు, తలసాని శ్రీనివాస్ యాదవ్ తదితరులు హాజరుకానున్నారు. గ్రేటర్ హైదరాబాద్ కొత్త మేయర్‌గా బొంతు రామ్మోహన్ ఏకగ్రీవంగా ఎన్నికైన విషయం తెలిసిందే. గురువారం గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ సమావేశంలో మేయర్‌గా రామ్మోహన్‌ను, డిప్యూటీ మేయర్‌గా బాబా ఫసియుద్దీన్లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో భారీ మెజార్టీ సాధించిన టీఆర్ఎస్ మేయర్, డిప్యూటీ మేయర్ పదవులు రెండింటినీ కైవసం చేసుకుంది. జీహెచ్ఎంసీలోని మొత్తం 150 డివిజన్లలో టీఆర్ఎస్ 99 సీట్లు గెలుచుకున్న సంగతి తెలిసిందే. -
నగర ప్రథమ పౌరుడెవరో...
హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) మేయర్ పీఠాన్ని ఎవరు అధిరోహించబోతున్నారు. ఇప్పుడు అందరి నోళ్లలో దీనిపైనే చర్చ. జీహెచ్ ఎంసీ ఎన్నికల్లో చరిత్రలో ఎప్పుడూ లేనంత భారీ మెజారిటీతో విజయం సాధించిన టీఆర్ఎస్ మేయర్ అభ్యర్థిని మాత్రం ఇంతవరకు ప్రకటించలేదు. దీనిపై ఇప్పటికే రకరకాల ఊహాగానాలు సాగుతున్నా... టీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు మదిలో ఏముందో ఎవరికీ అంతుబట్టడం లేదు. నగర ప్రథమ పౌరుడు ఎవరవుతారన్న విషయం సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఈ నెల 11 వ తేదీన మేయర్ ఎన్నిక నిర్వహించడానికి అధికారులు ఏర్పాట్లు చేశారు. ఆరోజున మేయర్ తో పాటు డిప్యూటీ మేయర్ ఎన్నికను కూడా పూర్తి చేయనున్నారు. ఎన్నికల ఫలితాలు రావడానికి ముందు నుంచే గ్రేటర్ మేయర్ స్థానాన్ని కైవసం చేసుకోవడానికి టీఆర్ఎస్ ప్రణాళికా బద్ధంగా, పకడ్బందీ వ్యూహంతో పనిచేసింది. టీఆర్ఎస్ కు సంపూర్ణ మెజారిటీ రాని పక్షంలో ఎంఐఎం మద్దతుతో మేయర్ స్థానాన్ని కైవసం చేసుకోవాలన్న ఆలోచన చేసినట్టు కేసీఆర్ చేసిన వ్యాఖ్యలతోనే స్పష్టమైంది. అదీ సాధ్యం కాని పరిస్థితి ఉంటే హైదరాబాద్ మున్సిపల్ (స్థానిక సంస్థ) లో ఎక్స్ అఫిషియే సభ్యుల ద్వారా మేయర్ పీఠం దక్కించుకోవాలని భావించింది. అయితే అందరి అంచనాలకు తలకిందులు చేస్తూ టీఆర్ఎస్ కు భారీ మెజారిటీ దక్కడంతో ఇప్పుడు ఆ పార్టీ ఎవరి మద్దతు లేకుండానే మేయర్ సీటును దక్కించుకోనుంది. ఎంఐఎంను మిత్రపక్షం చేసుకుని మేయర్ స్థానాన్ని గెలుచుకునే పరిస్థితి తలెత్తి ఉంటే మేయర్ అభ్యర్థి ఎంపిక విషయంలో ఒకరకమైన వ్యూహం, ఎక్స్ అఫీషియో సభ్యుల మద్దతు కూడా అవసరమైన పరిస్థితి ఏర్పడి ఉంటే మరో రకమైన వ్యూహంతో ముందుకెళ్లాలని టీఆర్ఎస్ నాయకత్వం ప్రణాళిక రచించింది. ఇప్పుడు ఇతరుల మద్దతు అవసరం లేకుండానే స్వతంత్రంగా అభ్యర్థిని ఎంపిక చేసుకునే బలం సమకూరడంతో ఆ పార్టీ నాయకత్వం ఆచితూచి వ్యవహరిస్తున్నట్టు తెలుస్తోంది. మేయర్ అభ్యర్థి ఎవరన్న విషయం ఆ ఎన్నిక రోజు వరకు సస్పెన్స్ కొనసాగే అవకాశాలు కనబడుతున్నాయి. మేయర్ అభ్యర్థి ఎంపిక విషయంలో పూర్తిగా ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయిస్తారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఎన్నికలకు వెళ్లే రోజున ఉన్న పరిస్థితి ఇప్పుడు లేనందున మేయర్, డిప్యూటీ మేయర్ ల ఎంపిక పూర్తిగా కేసీఆర్ ఆలోచనను బట్టే ఉంటుంది. మేయర్‌గా రామ్మోహన్ మేయర్ పదవికి చర్లపల్లి డివిజన్ నుంచి కార్పొరేటర్ గా ఎన్నికైన బొంతు రామ్మోహన్ పేరు బలంగా వినిపిస్తోంది. రామ్మోహన్ కార్పొరేటర్ గా పోటీ పెట్టిన సందర్భంగానే ఆయన పేరు మేయర్ పదవి ఇస్తామని సూత్రప్రాయంగా పార్టీ నాయకత్వం తెలిపిందని పార్టీ నేతలు చెబుతున్నారు. మేయర్ పదవి ఎంపిక కోసం ఎంఐఎం మద్దతు తీసుకోవలసిన అవసరం ఏర్పడి ఉంటే డిప్యూటీ మేయర్ పదవిని ఎంఐఎం కు ఇచ్చే పరిస్థితి తలెత్తేది. ఇప్పుడా పరిస్థితి లేనందున డిప్యూటీ మేయర్ పదవి కూడా టీఆర్ఎస్ అభ్యర్థిని ఎంపిక చేయనున్నారు. ప్రస్తుతం ఎన్నికైన కార్పొరేటర్లలో ముస్లిం మైనారిటీకి చెందిన వ్యక్తికి డిప్యూటీ మేయర్ పదవి ఇస్తారని తెలుస్తోంది. ఏ లెక్క చూసినా... మేయర్ పీఠం దక్కించుకోవడానికి గ్రేటర్ పరిధిలోని మొత్తం 150 డివిజన్లలో ఎక్స్ అఫీషియో సభ్యులను పరిగణలోకి తీసుకోకుంటే... 76 డివిజన్లు ఉంటే సరిపోతుంది. అయితే టీఆర్ఎస్ అనూహ్యంగా 99 డివిజన్లతో తిరుగులేని మెజారిటీ సాధించిన విషయం తెలిసిందే. 150 మంది డివిజన్ల కార్పొరేటర్లతో పాటు ఎక్స్అఫీషియో సభ్యులుగా మరో 67 మంది సభ్యులు ఓటు హక్కు కలిగి ఉన్నారు. వారికి పరిగణలోకి తీసుకున్న తర్వాత కూడా టీఆర్ఎస్ కు బంపర్ మెజారిటీ ఉంది. లోక్ సభ సభ్యులు, రాజ్యసభ సభ్యులు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు మొత్తం కలిపి ప్రస్తుతం జీహెచ్ఎంసీలో 67 మంది ఎక్స్అఫీషియో సభ్యులు ఉండగా, వారిలో టీఆర్ఎస్ కు 35, ఎంఐఎంకు 10, టీడీపీకి 7, కాంగ్రెస్ కు 8, బీజేపీకి 7 ఓట్లున్నాయి. ఇంతకాలం టీఆర్ఎస్ కు 34 మంది సభ్యులు మాత్రమే ఉన్నప్పటికీ తాజాగా మంగళవారం టీడీపీకి చెందిన కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేక్ కూడా టీఆర్ఎస్ లో చేరడంతో ఆ పార్టీ బలం 35 కు పెరిగింది. మొత్తం 150 డివిజన్లతో పాటు 67 మంది ఎక్స్ అఫీషియో సభ్యులతో కలిపి 217 మంది ఓటర్లలో 134 ఓట్లు టీఆర్ఎస్ ఖాతాలో ఉన్నాయి. ఈ లెక్క తీసుకున్నా టీఆర్ఎస్ ఎవరి మద్దతు లేకుండా మేయర్, డిప్యూటీ మేయర్ స్థానాలను దక్కించుకోగలదు. లోక్ సభ సభ్యులు 1. కొత్త ప్రభాకర్ రెడ్డి (టీఆర్ఎస్) 2. సీహెచ్ మల్లారెడ్డి (టీడీపీ) 3. బండారు దత్తాత్రేయ (బీజేపీ) 4. అసదుద్దీన్ ఓవైసీ (ఏఐఎంఐఎం) రాజ్యసభ సభ్యులు 5. కేవీపీ రామచంద్రరావు (కాంగ్రెస్) 6. వి. హనుమంతరావు (కాంగ్రెస్) 7. రాపోలు ఆనంద భాస్కర్ (కాంగ్రెస్) 8. సీఎం రమేష్ (టీడీపీ) 9. గరికపాటి మోహన్ రావు (టీడీపీ) 10. కే కేశవరావు (టీఆర్ఎస్) 11. పాల్వాయి గోవర్ధన్ రెడ్డి (కాంగ్రెస్) 12. జైరాం రమేష్ (కాంగ్రెస్) 13. ఎం.ఏ. ఖాన్ (కాంగ్రెస్) 14. కె. చిరంజీవి (కాంగ్రెస్) ఎమ్మెల్సీలు 15. పల్లా రాజేశ్వర్ రెడ్డి (టీఆర్ఎస్) 16. కే. యాదవ రెడ్డి (టీఆర్ఎస్) 17. ఎస్. రాములు నాయక్ (టీఆర్ఎస్) 18. కె. స్వామిగౌడ్ (టీఆర్ఎస్) 19. మహమ్మద్ సలీమ్ (టీఆర్ఎస్) 20. నాయిని నర్సింహారెడ్డి (టీఆర్ఎస్) 21. మహ్మద్ మహమూద్ అలీ (టీఆర్ఎస్) 22. పాతూరి సుధాకర్ రెడ్డి (టీఆర్ఎస్) 23. వి.భూపాల్ రెడ్డి (టీఆర్ఎస్) 24. సుంకరి రాజు (టీఆర్ఎస్) 25. కె.జనార్థన్ రెడ్డి (టీఆర్ఎస్) 26. ఆర్ భూపతి రెడ్డి (టీఆర్ఎస్) 27. పి.సతీష్ కుమార్ (టీఆర్ఎస్) 28. కర్నె ప్రభాకర్ (టీఆర్ఎస్) 29. వి.గంగాధర్ గౌడ్ (టీఆర్ఎస్) 30. డి.రాజేశ్వరరావు (టీఆర్ఎస్) 31. పి.రవీందర్ (టీఆర్ఎస్) 32. కసిరెడ్డి నారాయణరెడ్డి (టీఆర్ఎస్) 33. బి.వెంకటేశ్వర్లు (టీఆర్ఎస్) 34. మాదిరెడ్డి శ్రీనివాసరెడ్డి (టీఆర్ఎస్) 35. నేతి విద్యాసాగర్ (టీఆర్ఎస్) 36. పట్నం నరేందర్ రెడ్డి (టీఆర్ఎస్) 37. టి.భాను ప్రసాద్ (టీఆర్ఎస్) 38. నారదాసు లక్ష్మణరావు (టీఆర్ఎస్) 39. ఎంఎస్ ప్రభాకర్ (కాంగ్రెస్ - టీఆర్ఎస్ లో చేరారు) 40. మహ్మద్ అలీ షబ్బీర్ (కాంగ్రెస్) 41. సయ్యద్ అల్తాఫిదర్ రజ్వీ (ఏఐఎంఐఎం) 42. సయ్యద్ అమీనుల్ హసన్ జాఫ్రీ (ఏఐఎంఐఎం) 43. ఎన్. రామచందర్ రావు (బీజేపీ) ఎమ్మెల్యేలు 44. కె. లక్ష్మణ్ (బీజేపీ) 45. జి. కిషన్ రెడ్డి (బీజేపీ) 46. చింతల రామచంద్రారెడ్డి (బీజేపీ) 47. టి. రాజాసింగ్ (బీజేపీ) 48. ఎన్వీఎస్సెస్ ప్రభాకర్ (బీజేపీ) 49. మాగంటి గోపీనాధ్ (టీడీపీ) 50. కేపీ వివేకానంద (టీడీపీ - టీఆర్ఎస్ లో చేరారు) 51. ఆర్ కృష్ణయ్య (టీడీపీ) 52. టి. ప్రకాశ్ గౌడ్ (టీడీపీ) 53. అరికెపూడి గాంధీ (టీడీపీ) 54. జాఫర్ హుస్సేన్ (ఏఐఎంఐఎం) 55. కౌసర్ మొయినుద్దీన్ (ఏఐఎంఐఎం) 56. అహ్మద్ బిన్ అబ్దుల్లా బలాల (ఏఐఎంఐఎం) 57. సయ్యద్ అహ్మద్ పాషా ఖాద్రీ (ఏఐఎంఐఎం) 58. అక్బరుద్దీన్ ఓవైసీ (ఏఐఎంఐఎం) 59. ముంతాజ్ అహ్మద్ ఖాన్ (ఏఐఎంఐఎం) 60. మహ్మద్ మౌజం ఖాన్ (ఏఐఎంఐఎం) 61. టి.పద్మారావు (టీఆర్ఎస్) 62. జి.మహిపాల్ రెడ్డి (టీఆర్ఎస్) 63. చింతల కనకా రెడ్డి (టీఆర్ఎస్) 64. తలసాని శ్రీనివాస యాదవ్ (టీడీపీ- టీఆర్ఎస్ లో చేరారు) 65. జి. సాయన్న (టీడీపీ - టీఆర్ఎస్ లో చేరారు) 66. ఎం. కృష్ణారావు (టీడీపీ - టీఆర్ఎస్ లో చేరారు) 67. ఎల్విస్ స్టీఫెన్ సన్ (టీఆర్ఎస్ - నామినేటెడ్ మెంబర్) పార్టీ కార్పొరేటర్లు ఎక్స్-అఫీషియో సభ్యులు మొత్తం టీఆర్ఎస్ 99 35 134 ఎంఐఎం 44 10 54 కాంగ్రెస్ 02 08 10 టీడీపీ 01 07 08 బీజేపీ 04 07 11 మొత్తం 150 67 217 మేయర్ ఎన్నిక బహిష్కరిద్దామా గ్రేటర్ మేయర్ పదవి టీఆర్ఎస్ ను వరించడం ఖాయమైన నేపథ్యంలో ఆ ఎన్నికలో పాల్గొనాలా లేదా అన్న మీమాంసలో టీడీపీ నేతలున్నారు. ఈ విషయంలో బీజేపీ వాదన భిన్నంగా ఉన్నట్టు తెలుస్తోంది. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఈవీఎంలపై అనుమానాలు వ్యక్తం చేస్తూ ఫిర్యాదు చేసిన నేపథ్యంలో కాంగ్రెస్ నేతలు సైతం మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికలో పాల్గొనాలా లేదా ఇంకా తేల్చుకోలేదని తెలిసింది. -
ఎవరో... వారెవరో!
జీహెచ్ఎంసీ మేయర్, డిప్యూటీ మేయర్ అభ్యర్థులపై తొలగని ఉత్కంఠ బొంతు రాంమోహన్ చుట్టే తిరుగుతున్న చర్చలు డిప్యూటీ మేయర్ మైనారిటీకి.. ఎన్నిక రోజే అభ్యర్థులను ప్రకటించే ఛాన్స్ సిటీబ్యూరో: జీహెచ్ఎంసీ మేయర్ ఎవరన్న ఉత్కంఠ..మరికొన్ని రోజులు కొనసాగనుంది. ఈనెల 11న ఉదయాన్నే మేయర్, డిప్యూటీ మేయర్ల స్థానాలకు అభ్యర్థులను ప్రకటించే ఛాన్స్ ఉండటంతో ‘ఎవరా..మేయర్ అభ్యర్థి’ అంటూ అధికార టీఆర్ఎస్లో చర్చలు జోరందుకున్నాయి. బీసీ జనరల్ అభ్యర్థులకు కేటాయించిన మేయర్ స్థానం కోసం పలు విధాల పరిశీలన అనంతరం ఇద్దరి పేర్ల చుట్టే చర్చలు తిరుగుతున్నాయి. అందులో చర్లపల్లి డివిజన్ నుండి కార్పొరేటర్‌గా గెలిచిన బొంతు రాంమోహన్ ఒకరైతే, మరొకరు బంజరాహిల్స్ డివిజన్ నుండి విజయం సాధించిన గద్వాల విజయలక్ష్మి. ఇందులో టీఆర్ఎస్ ఆవిర్భావం నుండి క్రియాశీలకంగా వ్యవహరిస్తూ విద్యార్థి, యువజన విభాగాల అధ్యక్ష బాధ్యతలు నిర్వహిస్తూ, పార్టీ అధినేత కేసీఆర్‌తో పాటు కేటీఆర్‌కు కూడా నమ్మకస్తునిగా పేరొందిన బొంతు రాంమోహన్ వైపే పార్టీ మొగ్గు చూపే అవకాశం ఉందని పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. మున్సిపల్ పరిపాలనా బాధ్యతలు కేటీఆర్‌కు అప్పచెప్పిన దృష్ట్యా, ఆయనతో సులువుగా కలిసిపోయే వ్యక్తులుండటమే ఉత్తమమన్న అభిప్రాయాన్ని వారు వ్యక్తం చేస్తున్నారు. మరో వైపు ఎంపీ కేశవరావు కూతురు గద్వాల విజయలక్ష్మి సైతం మేయర్ పీఠంపై ఆశలు పెంచుకున్నారు. ఎక్కువ కాలం అమెరికాలో ఉండివచ్చిన ఆమె ఉన్నత విద్యావంతురాలు కూడా. అయితే తెలంగాణ కేబినెట్లో మహిళలెవరూ లేకపోవటం, హైదరాబాద్ బ్రాండ్‌ను విశ్వవ్యాప్తం చేసే దిశగా విశాల దృక్పథం ఉన్న వ్యక్తి కావటంతో ఆమె పేరును అంత సులువుగా తీసేసే అవకాశం లేదన్న మరో వాదన వినిపిస్తుంది. అయితే ఈ విషయంలో తనంత తానుగా వెళ్లి మేయర్ అభ్యర్థిపై చర్చించకూడదని, ఎంపీ కేశవరావు నిర్ణయించినట్లు సమాచారం. పార్టీ ఎవరిని నిర్ణయించినా తాను సమర్థించాలన్న నిర్ణయంతో ఆయన ఉన్నట్లు తెలుస్తోంది. మైనారిటీకి డిప్యూటీ మేయర్ ఎన్నికలకు ముందు తమకు ఎంఐఎం మిత్రపక్షమని ప్రకటించిన టీఆర్ఎస్ ప్రస్తుతం సంపూర్ణ మెజారిటీ ఉన్నందున ఆ పార్టీని దూరం పెట్టే అవకాశమే ఉందని సమాచారం. తమ పార్టీ తరపున గెలిచిన ఆరుగురు మైనారిటీ కార్పొరేటర్లలో ఒకరిని డిప్యుటీ మేయర్‌గా ఎంపిక చేసే అవకాశం ఉంది. వారిలో బోరబండ కార్పొరేటర్ బాబా ఫసీయుద్దీన్, కొండాపూర్ కార్పొరేటర్ హమీద్ పటేల్ పేర్లు ప్రచారంలోకి వచ్చాయి. సీఎంను కలిసిన రాంమోహన్, విజయలక్ష్మి కార్పొరేటర్లు బొంతు రాంమోహన్, గద్వాల విజయల క్ష్మిలు ఆదివారం సీఎం కేసీఆర్‌ను కలిసి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా మేయర్ ఎన్నికకు సంబంధించిన చర్చలేవీ రాలేదని సమాచారం. -
పునర్నిర్మాణంలో.. భాగస్వాములు కావాలి
ఉద్యోగులకు సీఎం చంద్రశేఖరరావు పిలుపు అందుబాటులోకి పార్టీ మొబైల్ యాప్ సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ పునర్నిర్మాణం లో ఉద్యోగులు భాగస్వాములు కావాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు పిలుపునిచ్చా రు. సచివాలయంలో శుక్రవారం ఆయన తెలంగాణ సచివాలయ ఉద్యోగుల అసోసియేషన్ డైరీ, క్యాలెండర్, టేబుల్ క్యాలెండర్‌ను ఆవిష్కరించిన సందర్భంగా ఉద్యోగులను ఉద్దేశించి మాట్లాడారు. ఆవిష్కరణలో అసోసియేషన్ అధ్యక్షుడు యం.నరేందర్‌రావు, ప్రధాన కార్యదర్శి జి.లక్ష్మీనారాయణ పాల్గొన్నారు. పార్టీ మొబైల్ యాప్ ఆవిష్కరణ: తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) యువజన విభాగం ఆధ్వర్యంలో రూపొందించిన పార్టీ డైరీని, మొబైల్ యాప్‌ను సీఎం కేసీఆర్ సచివాలయంలో శుక్రవారం ఆవిష్కరించారు. మొబైల్ యాప్‌లో ప్రభుత్వ అధికారులు, కార్యాలయాల వివరాలు, పార్టీ, మీడియా, అత్యవసర విభాగాల ఫోన్ నెంబర్లు, తదితర సమాచారం పొందు పరిచారు. కార్యక్రమంలో యువజన విభాగం అధ్యక్షుడు బొంతు రామ్మోహన్, రాష్ట్ర కో ఆర్డినేటర్ ధర్మేందర్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి సతీష్‌రెడ్డి పాల్గొన్నారు. కరీంనగర్ జిల్లా పరిషత్ డైరీని కూడా సీఎం ఈ సందర్భంగా ఆవిష్కరించారు. జెడ్పీ చైర్మన్ తుల ఉమ, మంత్రులు ఈటెల రాజేందర్, కె.తారకరామా రావు, టి. హరీశ్‌రావు, పార్లమెంటరీ కార్యదర్శి వి. సతీష్ పాల్గొన్నారు. రాష్ట్రోపాధ్యాయ సంఘం (ఎస్టియు) డైరీని సైతం సీఎం చంద్రశేఖర్‌రావు ఆవిష్కరించారు. తెలంగాణ రాష్ట్ర సీపీఐ కార్యద ర్శి చాడ వెంకటరెడ్డి, ఎస్టీ అధ్యక్షుడు రాజిరెడ్డి, ప్రధాన కార్యదర్శి భుజంగరావు, సీనియర్ జర్నలిస్టు శ్రీనివాస్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.