
సాక్షి, హైదరాబాద్ : కరోనా వైరస్ వ్యాప్తిని నియంత్రించేందుకు విధించిన లాక్‌డౌన్‌కు ప్రజలందరూ సహకరించాలని మేయర్ బొంతు రామ్మోహన్ విజ్ఞప్తి చేశారు. ఆదివారం ఖైరత్‌బాద్‌లో ఆయన పర్యటించారు. పారిశుద్ధ్య నిర్వహణ స్ప్రేయింగ్‌ను పరిశీలించారు. ఆ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. నగర ప్రజల కోసం మొబైల్ మార్కెట్ల ద్వారా కూరగాయలను అందిస్తున్నామని తెలిపారు. నిరాశ్రయులయిన వారిని గుర్తించి భోజన, నివాస వసతులు కల్పించామని వెల్లడించారు. పారిశుద్ధ్య కార్మికుల ఆరోగ్యం కోసం మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామన్నారు. విదేశాల నుంచి వచ్చిన వారి ఆరోగ్య పరిస్థితులు ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నాని చెప్పారు.