సాక్షి, బంజారాహిల్స్(హైదరాబాద్): కరోనా సెకండ్‌వేవ్‌తో మూతపడిన సినిమా థియేటర్లు శుక్రవారం నుంచి తెరచుకోనున్నాయి. గురువారం థియేటర్లను శానిటైజ్ చేశారు. కోవిడ్ మార్గదర్శకాలకు అనుగుణంగా ప్రభుత్వం ఇచ్చిన సూచనలు పాటిస్తూ సింగిల్ స్క్రీన్ థియేటర్లను మాత్రమే తెరవనున్నారు. కరోనా లాక్‌డౌన్‌తో గతేడాది మార్చి 14వ తేదీన థియేటర్లను మూసేశారు.
కరోనా తగ్గుముఖం పట్టిన నేపథ్యంలో గతేడాది డిసెంబర్ 4న థియేటర్లు తెరిచేందుకు ప్రభుత్వం అనుమతినిచ్చింది. ఈ ఏడాది ఏప్రిల్ నుంచే కరోనా సెకండ్‌వేవ్ విశ్వరూపం దాల్చి జనజీవనాన్ని అతలాకుతలం చేసింది. దీంతో ఈ ఏడాది మే 1 నుంచి మళ్లీ మూతపడ్డాయి. కోవిడ్ తగ్గుముఖం పట్టడంతో ప్రభుత్వం సినిమా హాళ్లను తెరిచేందుకు మళ్లీ అనుమతినిచ్చింది. శుక్రవారం నగరంలోని 60 శాతం థియేటర్లు తెరచుకోనున్నాయి. మరో మూడు వారాల్లోగా 100 శాతం థియేటర్లను తెరవనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment