Theatre
-
పుష్ప-2 చూద్దామని థియేటర్‌కు వెళ్లారు.. తీరా పోస్టర్ చూస్తే!
అల్లు అర్జున్ పుష్ప-2 సినిమాకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ నెల 5న థియేటర్లలోకి వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్‌ను షేక్ చేస్తోంది. విడుదలైన మొదటి రోజు నుంచే రికార్డుల ప్రభంజనం సృష్టిస్తోంది. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా రూ.1500 కోట్లకు పైగా వసూళ్లతో దూసుకెళ్తోంది. ఇప్పటికే హిందీలో ఇండియన్ సినీ చరిత్రలో లేని రికార్డులు క్రియేట్ చేసింది. హిందీ బాక్సాఫీస్ వద్ద అత్యధిక నెట్ వసూళ్లు సాధించిన చిత్రంగా పుష్ప-2 నిలిచింది.సినిమా రిలీజైన రోజు నుంచి నార్త్‌లో పుష్ప-2 ఓ రేంజ్ వసూళ్లు రాబడుతోంది. దక్షిణాది కంటే హిందీలోనే భారీ వసూళ్లు రాబట్టింది. దీంతో హిందీలో పుష్పరాజ్ హవా ఇప్పటికీ కొనసాగుతోంది. దీంతో ముందుగానే పుష్ప-2 ప్రదర్శించే థియేటర్లలో టికెట్స్ ముందుగానే బుక్ అవుతున్నాయి.పుష్ప-2కు బదులు బేబీ జాన్..తాజాగా పుష్ప-2 మూవీ చూడాలని టికెట్ బుక్ చేసుకున్న ఫ్యాన్స్‌కు నిరాశ ఎదురైంది. షో టైమ్‌కు థియేటర్‌కు వెళ్తే అక్కడా పుష్ప-2 బదులుగా బాలీవుడ్ మూవీ బేబీ జాన్ ప్రదర్శించారు. దీంతో థియేటర్ యాజమాన్యంపై బన్నీ ఫ్యాన్స్ ఆగ్రహం చేశారు. థియేటర్ ముందే తమ ఆవేదనను వ్యక్తం చేశారు. దీనికి సంబంధించిన వీడియోను ప్రముఖ సినీ క్రిటిక్ కమల్ ఆర్ ఖాన్ (కేఆర్కే) తన ట్విటర్లో పోస్ట్ చేశారు. ఈ వీడియో నెట్టింట తెగ వైరలవుతోంది.కాగా.. వరుణ్ ధావన్ నటించిన బాలీవుడ్ మూవీ బేబీ జాన్ థియేటర్లలో విడుదలైంది. ఈ చిత్రంలో కీర్తి సురేశ్ హీరోయిన్గా నటించింది. ఈ చిత్రానికి అట్లీ కథను అందించగా.. కలీస్ దర్శకత్వం వహించారు. ఈ మూవీని విజయ్ సినిమా తేరీ రీమేక్‌గా తెరకెక్కించారు.Many theatres are forcing people to watch film #BabyJohn while they bought tickets for film #Pushpa2! Distributor Anil Thadani should take strict action against such theatres. While Ppl should file case against fraud @bookmyshow in consumer court. pic.twitter.com/yMRsrPm52k— KRK (@kamaalrkhan) December 25, 2024 -
పుష్ప-2 మూవీ వీక్షించిన దర్శకధీరుడు.. ఏ థియేటర్లో చూశాడంటే?
డిసెంబర్ 5న థియేటర్లలోకి వచ్చిన పుష్పరాజ్ బాక్సాఫీస్ వద్ద అదరగొడుతున్నాడు. కేవలం నాలుగు రోజుల్లోనే రూ.829 కోట్ల వసూళ్లతో సినీ చరిత్రలో సరికొత్త రికార్డ్ నెలకొల్పాడు. ఈ ఊపు చూస్తుంటే ఐదు రోజుల్లోనే రూ.1000 కోట్లు సాధించేలా కనిపిస్తోంది. మరోవైపు నార్త్‌లోనూ పుష్ప-2 హవా కొనసాగుతోంది. తొలి రోజు నుంచే హిందీలో వరుస రికార్డులతో దూసుకెళ్తోంది పుష్ప-2. కేవలం హిందీలోనే నాలుగు రోజుల్లో రూ.339 నెట్ వసూళ్లు సాధించింది. దీంతో బాక్సాఫీస్ వద్ద తిరుగులేని రికార్డ్స్ సృష్టిస్తోంది.అయితే తాజాగా ఈ మూవీ దర్శకధరుడు ఎస్ఎస్ రాజమౌళి వీక్షించారు. హైదరాబాద్‌లోని ఓ థియేటర్‌కు వెళ్లిన సినిమా నుంచి బయటికి వస్తోన్న వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. ఈ వీడియోను ఓ నెటిజన్ ట్విటర్లో షేర్ చేశారు. అది కాస్తా వైరల్ కావడంతో ఫ్యాన్స్ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. వీడియో చూస్తే బాలనగర్‌లోని విమల్ థియేటర్లో పుష్ప-2 వీక్షించినట్లు తెలుస్తోంది.కాగా.. రాజమౌళి ప్రస్తుతం ప్రిన్స్ మహేశ్ బాబుతో ఓ సినిమాను తెరకెక్కించనున్నారు. అమెజాన్ అడవులో నేపథ్యంలో అడ్వంచర్ చిత్రంగా ఈ మూవీని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన కథ సిద్ధ కాగా.. వచ్చే ఏడాది సెట్స్ పైకి వెళ్లే అవకాశముంది. ఈ మూవీ కోసం ఇప్పటికే లోకేషన్స్ వేటలో ఉన్నారు టాలీవుడ్ డైరెక్టర్ రాజమౌళి. Director rajamouli sir watched #Pushpa2 🔥@alluarjun #Pushpa2TheRule pic.twitter.com/qlzzp8IEHn— AlluBabloo Mithun (@allubabloo18) December 9, 2024 -
కుప్పంలో సీజ్ ది థియేటర్
చిత్తూరు, సాక్షి: సీఎం చంద్రబాబు ప్రాతినిథ్యం వహిస్తున్న కుప్పంలో.. అల్లు అర్జున్ ఫ్యాన్స్‌కి కోపమొచ్చింది. తమ అభిమాన నటుడి సినిమా ప్రదర్శించకుండా అధికారులు ఓ థియేటర్‌ను సీజ్ చేయడంపై రగిలిపోతున్నారు. స్థానికంగా ఓ నేతకు చెందిన రెండు థియేటర్లలో పుష్ప 2 చిత్రం ప్రదర్శిస్తున్నారు. అయితే.. ఎన్వోసీ సర్టిఫికెట్ లేకుండా సినిమా ప్రదర్శిస్తున్నారంటూ అధికారులు షోలను అర్ధాంతరంగా నిలిపివేయించి మరీ తాళాలు వేశారు. దీంతో అభిమానులు తీవ్ర నిరాశకు గురయ్యారు. లైసెన్సు రెన్యూవల్ చేసుకోకుండా థియేటర్ రన్ చేస్తున్నారని అధికారులు చెబుతుండగా.. ఇది కక్ష సాధింపు చర్యలో భాగమై ఉండొచ్చంటూ ఫ్యాన్స్ వాదిస్తున్నారు. మరోవైపు వారాంతం కావడంతో కొత్త సినిమా చూద్దామని థియేటర్‌కు వస్తున్న ప్రేక్షకులు.. గేటుకు తాళాలు చూసి నిరాశతో వెనుదిరుగుతున్నారు. ఇదీ చదవండి: టార్గెట్ అల్లు అర్జున్.. రాజకీయ సెగ! -
అమెరికాలో... భారతీయ జానపద కథలకు జీవం
అమెరికాలోని కథా డ్యాన్స్ థియేటర్లో ప్రాచీన భారతీయ జానపద కథలను కథక్ డ్యాన్స్‌లో లయలుగా చేర్చి నృత్యకారులు అబ్బురపరుస్తున్నారు. కథక్ నృత్యం జానపద కథల జ్ఞానాన్ని తెలియజేస్తుంది. కథా డ్యాన్స్ థియేటర్లో ‘పంచతంత్ర, ది డ్యాన్సింగ్ టేల్స్ ఆఫ్ విజ్డమ్‘ను ప్రదర్శిస్తున్నారు. ఈ విధంగా విదేశాలలో భారత శాస్త్రీయ నృత్య రూపమైన కథక్ ద్వారా ప్రాచీన భారతీయ జానపద కథలకు జీవం పోస్తుంది.‘ఈ థియేటర్ ప్రారంభంలో నా మనుగడే ప్రశ్నార్థకంగా ఉండేది. భారతదేశం నుండి వచ్చిన నేను నా సంస్కృతికి ప్రాతినిధ్యం వహించడం లేదు ఎప్పుడూ బాధగా అనిపించేది. మన పొరుగువారిని కలుసుకోవాలంటే కళలను మించిన మార్గం లేదు. దీంతో 1987లో మా ఇంటి నేలమాళిగలో కథా థియేటర్ కంపెనీని ప్రారంభించాను’ అంటూ కథా డ్యాన్స్ థియేటర్ వ్యవస్థాపకుడు, క్రియేటివ్ డైరెక్టర్ రీటా ముస్తాఫీ తొలి రోజుల ప్రయత్నాలను వివరిస్తారు. ముస్తాఫీ, కథక్ క్లిష్టమైన ఫుట్‌వర్క్, హై–స్పీడ్ స్పిన్‌లు, రిథమిక్ ప్యాటర్న్లు, సాంస్కృతిక విభజనలను తగ్గించడానికి, కథలను చెప్పడానికి ఉపయోగిస్తూ వచ్చారు. జంతు కథల ఆధారంగా! ఇప్పుడు వారాంతాల్లో కథక్ నృత్య ప్రదర్శన ద్వారా నైతిక పాఠాలను బోధిస్తున్నారు. అందుకు, సంస్కృతంలో 2,000 ఏళ్ల క్రితం రాసిన జంతు కథల ఆధారంగా నృత్యాన్ని రూపొందించారు. ‘సింహం, నక్క, చిరుత, కాకి‘ కథలో మొదటిది... ఒక సింహం ఒంటెను వేటాడాలనే ఉద్దేశ్యంతో ఉన్నప్పటికీ దాని ప్రాణాలను విడిచిపెట్టాలని నిర్ణయించుకుంటుంది. ఆ సమయంలో నిజమైన నాయకత్వంలో దయ ఉంటుందని తెలుసుకుంటుంది. రెండవ కథ... ‘ది ఎలిఫెంట్ అండ్ ది మౌజ్‘లో, ఏనుగులు ఎలుకల సమూహాన్ని తొక్కడం మానుకుంటాయి. ఎలుకలు తరువాత ఏనుగులను వేటగాళ్ల ఉచ్చు నుండి రక్షిస్తాయి. శక్తి పరిమాణంతో సంబంధం లేకుండా పరస్పర గౌరవం విలువను ప్రదర్శిస్తాయి. చివరి కథ... ‘ది ఫిష్ అండ్ ది ఫ్రాగ్‘లో, అతి విశ్వాసం ఉన్న చేపలను సమీపంలోని కుటుంబం గురించి కప్ప హెచ్చరిస్తే, అవి విస్మరిస్తాయి. ఫలితంగా వాటిని ఆ కుటుంబం పట్టుకోవడంలో జాగ్రత్త, అవగాహన ప్రాముఖ్యతను నొక్కి చెబుతుంది. ‘‘ఇవి నేను ఎదిగే సమయంలో విన్న కథలు. నా పిల్లలూ ఆ కథలను వింటూ పెరిగారు, ఇప్పుడు నా మనవరాళ్లు కూడా వాటిని చదువుతున్నారు. ఈ కథలు అర్థవంతమైనవి ఎందుకంటే అవి దయగా, తెలివిగా, ధైర్యంగా ఎలా ఉండాలో నేర్పుతాయి’ అని ముస్తాఫీ వివరిస్తారు. ఒక చోట చేర్చే నృత్యంసెయింట్ లూయిస్ పార్క్‌లోని థియేటర్ డ్యాన్స్ స్కూల్ నుండి కథా డ్యాన్స్ థియేటర్ ప్రొఫెషనల్ కంపెనీకి చెందిన 42 మంది డ్యాన్సర్లు, అప్రెంటిస్‌లు, 8 నుండి 12 సంవత్సరాల వయస్సు గల 20 మంది పిల్లలను ఈ నృత్యం ఒకచోట చేర్చుతుంది. న్యూ ఢిల్లీకి చెందిన కాస్ట్యూమ్ డిజైనర్ మైత్రేయి పహారీ, 50కి పైగా దుస్తులు, 30 మాస్క్‌లను రూపొందించారు, కల్పిత కథల జంతు పాత్రలను డ్యాన్సర్లు ధరిస్తారు. ఈ ప్రదర్శనలో సంజుక్త మిత్రా పెయింటింగ్‌లు, మిన్నియాపాలిస్కు చెందిన నిర్మాత జె.డి. స్టీల్, భారతీయ స్వరకర్త జయంత బెనర్జీ స్వరపరిచిన ఒరిజినల్ స్కోర్, కల్పిత కథల ద్వారా ప్రేక్షకులకు మార్గనిర్దేశం చేసే ఆంగ్ల వాయిస్ ఓవర్, కథనం కూడా ఉంటాయి. -
వేట్టయాన్‌కు ఊహించని రెస్పాన్స్.. మేకర్స్ కీలక నిర్ణయం!
సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన తాజా చిత్రం వేట్టయాన్. దసరా సందర్బంగా ఈనెల 10న థియేటర్లలోకి వచ్చింది. టీజీ జ్ఞానవేల్ డైరెక్షన్లో వచ్చిన ఈ సినిమాకు మొదటి రోజే మిక్స్డ్ టాక్‌ను సొంతం చేసుకుంది. దీంతో తొలిరోజు కలెక్షన్లపై ప్రభావం చూపింది. అయినప్పటికీ ఫస్ట్ రోజే రూ.30 కోట్ల నెట్ వసూళ్లు సాధించింది. ది గోట్(రూ. 44 కోట్లు) తర్వాత సెకండ్ ప్లేస్‌లో నిలిచింది.అయితే రజనీకాంత్ వేట్టైయాన్కు ఆడియన్స్ నుంచి ఊహించని రెస్పాన్స్ వస్తోంది. దీంతో మేకర్స్ కీలక నిర్ణయం తీసుకున్నారు. వెట్టయాన్ కోసం మరిన్ని థియేటర్లను దేశవ్యాప్తంగా అందుబాటులోకి తీసుకురావాలని నిర్ణయించారు. దీంతో దేశంలోని కీలక రాష్ట్రాల్లో అదనపు స్క్రీన్లలో వేట్టయాన్ ప్రదర్శించనున్నారు. ఈ విషయాన్న చిత్ర నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ ఒక ప్రకటన ద్వారా వెల్లడించింది.ఈ చిత్రం రికార్డు స్థాయిలో వసూళ్లు సాధిస్తోందని.. తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, కేరళ, మహారాష్ట్రతో పాటు ఇతర రాష్ట్రాల డిస్ట్రిబ్యూటర్లు అదనపు స్క్రీన్స్ కావాలని డిమాండ్ చేస్తున్నారని తెలిపారు. కాగా..టీజే జ్ఞానవేల్ దర్శకత్వం వహించిన వేట్టయాన్ యాక్షన్ చిత్రంలో అమితాబ్ బచ్చన్, రానా దగ్గుబాటి, ఫహద్ ఫాసిల్, మంజు వారియర్, అభిరామి, దుషార విజయన్, రితికా సింగ్ కీలక పాత్రలు పోషించారు. -
ఇకపై బెనిఫిట్ షోలు, అదనపు ఆటలు ప్రదర్శించం: విజయేందర్ రెడ్డి
ఇతర రాష్ట్రాలు, దేశాల తరహాలోనే టాలీవుడ్లో కూడా ఎగ్జిబిటర్లకు నిర్మాతలు పర్సంటేజీలు ఇవ్వాలని తెలంగాణ థియేటర్ల సంఘం అధ్యక్షుడు విజయేందర్ రెడ్డి డిమాండ్ చేశారు. అద్దె ప్రతిపాదికన ఇక నుంచి సినిమాలు ప్రదర్శించబోమని స్పష్టం చేశారు. బుధవారం హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన తెలంగాణ ఫిల్మ్ ఎగ్జిబిటర్ల మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. మల్టీఫ్లెక్స్ తరహాలోనే నిర్మాతలు పర్సంటెజీలు చెల్లిస్తేనే సినిమాలను ప్రదర్శిస్తామని, లేదంటే థియేటర్ల మూత తప్పదని హెచ్చరించారు. ‘నిర్మాతలు పర్సంటేజీలు చెల్లించకపోతే సింగిల్ స్క్రీన్ థియేటర్ల మూత తప్పదు. గత పదేళ్లలో 2 వేల సింగిల్ స్క్రీన్ థియేటర్లు మూసివేశారు. కొంత మంది డిస్టిబ్యూటర్లు సినిమా వ్యాపారాన్ని జూదంగా మార్చారు. బెనిఫిట్ షో లు, అదనపు ఆటలతో మోసాలకు పాల్పడుతున్నారు. ఇక నుంచి బెనిఫిట్ షోలు, అదనపు ఆటలు ప్రదర్శించం. అన్ని సినిమాలను పర్సంటేజీ విధానంలోనే ఆడిస్తాం. జులై 1 వరకు తెలుగు సినీ నిర్మాతలకు గడువు ఇస్తున్నాం. ఆ లోపు నిర్మాతలు ఓ మంచి నిర్ణయం తీసుకుంటారని ఆశిస్తున్నాం. కల్కీ, పుష్ప2, గేమ్ చేంజర్ , భారతీయుడు చిత్రాలను మాత్రం పాత పద్దతిలోనే ప్రదర్శిస్తాం’ అని విజయేందర్ రెడ్డి అన్నారు. కాగా, తెలంగాణలో సింగిల్ స్క్రీన్ సినిమా థియేటర్స్ కొన్ని రోజులు మూసేస్తున్నామని ప్రకటించిన సంగతి తెలిసిందే. థియేటర్స్ కి ప్రేక్షకులు రావట్లేదని, ఎక్కువగా నష్టాలు వస్తునాయని చెబుతూ పది రోజులు వరకు థియేటర్స్ మూసేస్తామని ప్రకటించారు. ప్రస్తుతం తెలంగాణలోని చాలా సింగిల్ స్క్రీన్ థియేటర్లు క్లోజ్ అయ్యే ఉన్నాయి. మే 25 ఈ థియేటర్స్ ఓపెన్ అవుతాయని సమాచారం.తెలంగాణ ఫిల్మ్ చాంబర్ కీలక నిర్ణయంనైజాం ఏరియాలో సింగిల్ స్క్రీన్ థియేటర్లలో సినిమా ప్రదర్శనల విషయంలో ఎగ్జిబిటర్లకు వాటాలపై తెలంగాణ ఫిల్మ్ చాంబర్ ప్రతిపాదనలు సిద్దం చేసింది. వాటాల ప్రతిపాదనలను తెలుగు నిర్మాతలకు తెలంగాణ ఫిల్మ్ చాంబర్ ప్రతిపాదనలు పంపించింది. -
ఆ థియేటర్లలో బొమ్మ పడదు
సాక్షి, హైదరాబాద్: థియేటర్ల మూసివేత విషయం ఎగ్జిబిటర్ల అసోసియేషన్ సమష్టి నిర్ణయం కాదని... నష్టాలను మూటకట్టుకోవడం ఇష్టం లేకనే ఈ నిర్ణయం తీసుకున్నామని సింగిల్ స్క్రీన్ థియేటర్ల యజమానులు చెబుతున్నారు. కొత్త సినిమాలు వచ్చేవరకు అంటే...శుక్రవారం నుంచి కనీసం పదిరోజులపాటు ఏ బొమ్మా పడదు. జనవరి తర్వాత జూన్ వరకు పెద్ద హీరోల సినిమాలు ఒక్కటి కూడా విడుదల కావడం లేదని, చిన్న సినిమాలు వచ్చినా.. అవి ప్రేక్షక ఆదరణ లేని కారణంగా రోజు అయ్యే వ్యయంలో కనీసం పదిశాతం ఆదాయం కూడా రావడం లేదని ఎగ్జిబిటర్ చారి ‘సాక్షి’తో మాట్లాడుతూ చెప్పారు. మల్టీప్లెక్స్‌లకు పర్సెంటేజీ రూపంలో లాభాలు సినిమా డిస్ట్రిబ్యూటర్లు కూడా మల్టీప్లెక్స్‌లకు ఒక విధంగా, సింగిల్ థియేటర్లను మరోలా చూస్తున్నారన్న వాదన కూడా ఎగ్జిబిటర్ల నుంచి వినిపిస్తోంది. మల్టీప్లెక్స్‌లో ఒక సినిమా వారంరోజులు నడిస్తే..వచ్చే ఆదాయంపై పర్సెంటేజీ రూపంలో లాభాలు ఇస్తుంటే.. సింగిల్ థియేటర్లకు అయితే కేవలం అద్దె ప్రాతిపదికన డబ్బు చెల్లిస్తున్నారని, అద్దె చెల్లించడానికి వచ్చే ఆదాయం కంటే తక్కువ కలెక్షన్లు వచి్చనప్పుడు పర్సెంటేజీ లెక్కన తీసుకోమంటున్నారని థియేటర్ల యజమానులు చెబుతున్నారు. పెద్ద హీరోల సినిమాలు రావడానికి చాలా సమయం పడుతుండడంతో.. థియేటర్లకు ప్రేక్షకులు రావడం తగ్గుతోందని, దానికితోడు ఓటీటీల్లోనూ సినిమాలు వస్తుండడంతో.. థియేటర్లకు ఆదరణ తగ్గుతోందని అందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్టు సుదర్శన్ థియేటర్ యజమాని గోవింద్‌రాజు తెలిపారు. అది ఎగ్జిబిటర్ల వ్యక్తిగత నిర్ణయం.. రెండువారాలపాటు సింగిల్ స్క్రీన్ థియేటర్లలో సినిమాల ప్రదర్శన నిలిపివేయాలన్న నిర్ణయంతో తెలంగాణ స్టేట్ ఫిలిం చాంబర్స్ ఆఫ్ కామర్స్‌కు ఎలాంటి సంబంధం లేదని అధ్యక్షుడు సునీల్‌నారంగ్, కార్యదర్శి కె.అనుపమ్‌రెడ్డి స్పష్టం చేశారు. చిత్రసీమ అపెక్స్ బాడీకి నోటీసు ఇవ్వలేదు..తెలంగాణ, ఏపీలోని కొన్ని ప్రాంతాల్లో థియేటర్లలో సినిమాల ప్రదర్శన నిలిపివేయాలన్న నిర్ణయానికి చిత్ర పరిశ్రమ అపెక్స్బాడీలైన తెలుగు చలనచిత్ర వాణిజ్య మండలి, నిర్మాతల మండలి, తెలంగాణ చలన చిత్ర వాణిజ్య మండలికి గాని ఎలాంటి నోటీసులు ఇవ్వలేదని చలనచిత్ర వాణిజ్య మండలి కార్యదర్శి టి. ప్రసన్నకుమార్ తెలిపారు. ప్రేక్షకులు లేని కారణంగా ప్రదర్శనలు రద్దు చేయడమైందని గతంలోనూ బోర్డులు పెట్టేవారని ఆయన గుర్తు చేశారు. -
సినిమా లవర్స్‌కి షాక్..2వారాలు థియేటర్స్ బంద్..
-
మే 17 నుంచి సినిమా థియేటర్లు మూసివేత
కరోనా తర్వాత మళ్లీ సినిమా థియేటర్లు మూత పడనున్నాయి. దీంతో సినిమా అభిమానులు షాక్ అవుతున్నారు. అయితే, ఈసారి కరోనా వల్ల థియేటర్లు మూత పడటం లేదు. కొత్త సినిమాలు విడుదల కాకపోవడంతో ఇలాంటి సమస్య వచ్చింది. థియేటర్ యజమానులకు సమ్మర్లో ఇలాంటి ఇబ్బందులు రావడంతో కాస్త నిరుత్సాహానికి గురౌతున్నారు.వేసవి శెలవులలో లెక్కలేనన్ని సినిమాలు విడుదల అవుతాయి. ప్రేక్షకులతో థియేటర్స్ అన్నీ నిండిపోతాయి.. కానీ ఈ ఏడాదిలో అలాంటి సందడి లేకపోవడంతో హైదరాబాద్‌లోని సింగిల్ స్క్రీన్ థియేటర్స్ అన్నీ మే 17 నుంచి పదిరోజులపాటు మూసివేయనున్నారు. సినిమాలు విడుదల లేకపోవడంతో థియేటర్లు నడపడం భారం కావడం వల్లే ఈ నిర్ణయం తీసుకున్నారు. కనీసం విద్యుత్ బిల్లులు కూడా చెల్లించలేని పరిస్థితి వచ్చినట్లు తెలుస్తోంది.థియేటర్స్ బంద్‌పై ఎగ్జిబిటర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ రియాక్షన్తెలంగాణలో థియేటర్స్ బంద్‌పై తెలంగాణ ఎగ్జిబిటర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ విజయేందర్ రెడ్డి స్పందించారు. థియేటర్స్ బంద్ కావడానికి కారణం చిన్న సినిమాలకు కలెక్షన్స్ లేకపోచడం పెద్ద సినిమాలు రిలీజ్ కాకపోవడమని ఆయన అన్నారు. ప్రతి రోజు థియటర్స్ ఖర్చులు భరించలేకే తాత్కాలికంగా సింగిల్ థియేటర్స్ మూసివేయాల్సి వచ్చిందన్నారు. కేవలం ఖర్చులు భరించలేకే బంద్ చేయాల్సి వచ్చింది. కానీ, మరే ఇతర కారణాలు ఏమి లేవన్నారు. నిర్మాతలు ముందుకు వచ్చి మెయింటెనెన్స్ భరిస్తామని చెబితే థియేటర్స్ ఓపెన్ చేస్తామని విజయేందర్ రెడ్డి అన్నారు. -
జయప్రద జైలు శిక్షరద్దు చేసిన సుప్రీంకోర్టు
న్యూఢిల్లీ: తన సినిమా థియేటర్లో పనిచేసిన ఉద్యోగులకు ఈఎస్ఐ కంట్రిబ్యూషన్ చెల్లించని కేసులో సీనియర్ నటి జయప్రదకు పడిన ఆరు నెలల జైలు శిక్షను సుప్రీంకోర్టు రద్దు చేసింది. జస్టిస్ అభయ్ ఓకా, ఉజ్జల్ భూయాన్ నేతృత్వంలోని ధర్మాసనం ఈ మేరకు తీర్పు వెలువరించింది. థియేటర్ యాజమాన్యం రూ. 9లక్షల80వేలను ఈఎస్ఐ కంట్రిబ్యూషన్ కింద జమ చేసినందున కోర్టు శిక్షను రద్దు చేసింది. చెన్నైలోని జయప్రదకు చెందిన సినీ థియేటర్లో జయప్రద, ఆమె ఇద్దరు సోదరులు వాటాదారులుగా ఉన్నారు. ఈ థియేటర్ 10 ఏళ్ల క్రితమే మూతపడింది. అయితే ఈ థియేటర్లో పనిచేసిన ఉద్యోగుల జీతాల నుంచి ఈఎస్ఐ పేరుతో కోతలు విధించి తమ వద్ద జమ చేయలేదని ఈఎస్ఐకార్పొరేషన్(ఈఎస్ఐసీ) కేసు పెట్టింది. ఈ కేసును విచారించిన చెన్నైలోని మెట్రోపాలిటన్ కోర్టు గత ఏడాది ఆగస్టులో జయప్రదకు ఆరు నెలల జైలు శిక్ష విధించింది. అనంతరం ఈ కేసులో ఆమె అప్పీల్‌కు వెళ్లగా సుప్రీంకోర్టులో ఊరట లభించింది. ఇదీ చదవండి..ఈడీ విచారణకు కేజ్రీవాల్ మరోసారి డుమ్మా -
టాలీవుడ్ ప్రిన్స్ సందడి.. ఆ హిట్ సినిమా చూసేందుకే!
గుంటూరు కారం మూవీతో సంక్రాంతికి ప్రేక్షకులను అలరించాడు ప్రిన్స్ మహేశ్ బాబు. త్రివిక్రమ్- మహేశ్ కాంబోలో వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మిక్స్డ్ టాక్ తెచ్చుకుంది. ఈ సినిమాలో శ్రీలీల, మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా కనిపించారు. గుంటూరు కారం తర్వాత సినిమాలకు కాస్తా గ్యాప్ ఇచ్చిన ప్రిన్స్.. తదుపరి చిత్రంలో దర్శకధీరుడు రాజమౌళితో జతకట్టనున్నారు. ఇప్పటికే వీరిద్దరి కాంబోలో వస్తోన్న సినిమాకు స్క్రిప్ట్ రెడీగా ఉన్నట్లు రచయిత విజయేంద్ర ప్రసాద్ ప్రకటించారు. ఈ ఏడాదిలోనే షూటింగ్ ప్రారంభం అవుతుందని గతంలోనే ప్రకటించిన విషయం తెలిసిందే. తాజాగా మహేశ్ బాబు హైదరాబాద్‌లో సినిమా థియేటర్లో సందడి చేశారు. ఇటీవల రిలీజైన మలయాళ డబ్బింగ్ హిట్ సినిమా ప్రేమలు చిత్రాన్ని ఏఎంబీ మల్టీప్లెక్స్‌లో వీక్షించారు. తన భార్య నమ్రతా శిరోద్కర్‌తో కలిసి థియేటర్‌కు వచ్చారు. సినిమా చూసి వెళ్తున్న వీడియోను అభిమానులు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. కాగా.. ప్రేమలు చిత్రాన్ని రాజమౌళి తనయుడు కార్తికేయ తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. #TFNExclusive: Super 🌟 @urstrulyMahesh along with #NamrataShirodkar spotted near AMB Cinemas!📸#MaheshBabu #GunturKaaram #SSMB29 #TeluguFilmNagar pic.twitter.com/X1SJYekSt4 — Telugu FilmNagar (@telugufilmnagar) March 10, 2024 -
థియేటర్ లో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ రచ్చ
-
హనుమాన్ మూవీ చూస్తూ వింతగా ప్రవర్తించిన మహిళ
పెద్ద సినిమాల మధ్య చిన్న మూవీ విడుదలైంది. ఆ భారీ బడ్జెట్ చిత్రాల కలెక్షన్ల తుపానులో అది కొట్టుకుపోతుందనుకున్నారంతా! కానీ ఇక్కడ సీన్ రివర్సయింది. ఈ చిన్న సినిమా ముందు పెద్ద సినిమాలు వెలవెలబోయాయి. ఏ మూవీ గురించే చెప్తున్నామో ఈపాటికే అర్థమైపోయుంటుంది. రూ.50 కోట్లతో తెరకెక్కిన హనుమాన్ ఐదు రెట్ల కన్నా ఎక్కువ లాభాలు సంపాదించింది. ఇంకా వసూళ్లు రాబడుతూనే ఉంది. పూనకంతో ఊగిపోయిన మహిళ ప్రశాంత్ వర్మ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో తేజ సజ్జ హీరోగా నటించాడు. సంక్రాంతికి విడుదలైన ఈ మూవీ ఇప్పటికీ పలుచోట్ల విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఈ క్రమంలో ఓ చోట ఆసక్తికర సంఘటన జరిగింది. థియేటర్లో హనుమాన్ సినిమా చూస్తున్న ఓ మహిళ హనుమాన్ చాలీసా మొదలవగానే పూనకమొచ్చినట్లుగా ఊగిపోయింది. గట్టిగా కేకలు వేస్తూ మెలికలు తిరిగింది. పక్కన ఉన్నవాళ్లు ఆమెను పట్టుకుని సాధారణ స్థితికి తీసుకువచ్చే ప్రయత్నం చేశారు. కానీ ఆమె సీటులో కూర్చోలేక అరుస్తూ వింతగా ప్రవర్తించింది. వీడియో వైరల్ ఈ ఘటన ఉప్పల్‌లోని ఏషియన్ మాల్లో జరిగినట్లు తెలుస్తోంది. ఈ మహిళ వింత ప్రవర్తనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కొందరు ఆమెకు హనుమాన్ పూనాడని అంటుండగా, మరికొందరు ఆమెలో దుష్ట శక్తి ఏదో ఉన్నట్లుంది, అందుకే చాలీసా రాగానే అలా ప్రవర్తించిందని కామెంట్లు చేస్తున్నారు. కొద్దిమంది మాత్రం 'అదంతా ఏం కాదు.. తనకు ఫిట్స్ వచ్చినట్లుంది, లేదంటే ఏదో అనారోగ్య సమస్య ఉన్నట్లుంది' అని అభిప్రాయపడుతున్నారు. What you have cooked @PrasanthVarma You should see this 🙇🙇#HanuMan pic.twitter.com/Ry9KyIA0jA — AA Cult 🐉🪓 (@1_bunnyfreak) January 29, 2024 చదవండి: బర్రెలక్కకు రైతుబిడ్డతో పెళ్లా..? ఆ ఫోటోలు ఏంటి? -
సంక్రాంతి సినిమాల పంచాయతీ సెటిలైందా ?
-
దేశవ్యాప్తంగా పెరుగుతున్న హోం థియేటర్ ట్రెండ్
భారీ తెర.. 4కే నాణ్యతతో దృశ్యాలు.. నలువైపుల నుంచి ప్రతిధ్వనించే సరౌండ్ సౌండ్ సాంకేతికత.. చీకటి పరుచుకున్న పెద్ద హాల్లో చల్లగా తాకే ఏసీ గాలి... ఒకేసారి వందలాది మందితో కలసి సౌకర్యవంతమైన సీట్లలో కూర్చొని చూసే వీలు.. దీనికితోడు ఈలలు, చప్పట్లతో హోరెత్తించే అభిమానులు... ఇదీ మల్టిప్లెక్స్‌లు లేదా థియేటర్లలో సినీ వీక్షకులకు కలిగే అనుభూతి. మరి ఇదే భారీతనం ఇంట్లోనే లభిస్తే..! అవును.. ప్రజలు ఇప్పుడు క్రమంగా థియేటర్‌ను ఇంటికే తెచ్చేసుకుంటున్నారు. ఈ హోం థియేటర్ ట్రెండ్ దేశవ్యాప్తంగా చిన్న పట్టణాలకూ పాకుతోంది. – సాక్షి, హైదరాబాద్ మార్కెట్లో భారీ తెరల టీవీలు అందుబాటులో ఉన్నప్పటికీ ఆడియో నాణ్యత విషయంలో పరిమితులు నెలకొన్నాయి. కానీ అదే హోం థియేటర్లో ఇటువంటి అడ్డంకులు ఏవీ ఉండవు. నచి్చన సైజులో స్క్రీన్, ఖరీదైన సౌండ్ సిస్టంను ఏర్పాటు చేసుకొనే వెసులుబాటు ఉంటోంది. దీనికితోడు నచి్చన సమయంలో కుటుంబ సభ్యులు, స్నేహితుల మధ్య సరదాగా గడుపుతూ థియేటర్ ముందు కాలక్షేపం చేసే సౌలభ్యం కలుగుతోంది. ఇక అనుభూతి అంటారా.. ఎంత చెట్టుకు అంత గాలి అన్నట్టు.. మీరు ఖర్చు చేసినదాన్నిబట్టి థియేటర్ ఎక్స్‌పీరియెన్స్ మారుతుంది. పెరిగిన డిమాండ్.. మూడు గదుల కంటే ఎక్కువ సామర్థ్యం ఉన్న అపార్ట్మెంట్లు, విల్లాల్లో నిర్మాణ సంస్థలు సైతం ప్రత్యేకంగా హోం థియేటర్ కోసం ఏర్పాట్లు చేస్తున్నాయంటే వాటికి ఉన్న ప్రాధాన్యత ఏమిటో అర్థం చేసుకోవచ్చు. ఏటా భారత్‌లో సుమారు 1,25,000 హోం థియేటర్లు ఏర్పాటవుతుండటం విశేషం. ఇందులో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ వాటా దాదాపు 5,000 యూనిట్లుగా ఉంటోంది. ఓటీటీల రాకతో...: దేశంలో ఓటీటీలకు పెద్దగా ఆదరణ లేనప్పుడు హోం థియేటర్ విభాగం వృద్ధి కేవలం 20 శాతంగానే ఉండేది. కరోనా మహమ్మారి వ్యాప్తి తర్వాత ఏకంగా ఏటా 50 శాతం వృద్ధి నమోదవుతోంది. ఇప్పుడు స్థానిక భాషల్లోనూ ఓటీటీల్లో కంటెంట్ ఇబ్బడిముబ్బడిగా పెరిగింది. హోం థియేటర్లో సినిమాలను 50 శాతం మంది చూస్తుంటే స్పోర్ట్స్‌ను 25 శాతం, వెబ్ సిరీస్‌లను 25 శాతం మంది వీక్షిస్తున్నారట. ఖర్చు ఎంతంటే..: మెట్రో, ప్రథమ శ్రేణి నగరాల్లో సంపన్నులు 15–30 సీట్ల సామర్థ్యంగల లగ్జరీ హోం థియేటర్లను కోరుకుంటున్నారు. ఇందుకోసం రూ. 50 లక్షలు మొదలుకొని రూ. 3 కోట్ల వరకు ఖర్చు చేస్తున్నారు. మొత్తం పరిశ్రమలో ఈ విభాగం వాటా 5 శాతం ఉంటోంది. అలాగే 6–12 సీట్ల సామర్థ్యం ఉన్న హోం థియేటర్ల వాటా 25 శాతంగా ఉంది. వాటికి అయ్యే వ్యయం రూ. 15–50 లక్షల శ్రేణిలో ఉంది. ఇక ఎకానమీ విభాగంలో రూ. 5–15 లక్షల వ్యయంలో 4–10 సీట్లతో హోం థియేటర్లను ప్రజలు ఏర్పాటు చేసుకుంటున్నారు. రూ.7 కోట్ల ఖరీదు చేసే స్పీకర్లు.. ప్రస్తుతం డాల్బీ అటా్మస్, ఆరో 3డీ, డీటీఎస్ ఎక్స్ ఆడియో ఫార్మాట్స్ ఉన్నాయి. హోం థియేటర్ కోసం ఇళ్లలో స్క్రీన్ తప్పనిసరి కాదు. కానీ థియేటర్ ఫీల్ కావాలంటే మాత్రం స్క్రీన్ ఏర్పాటు చేసుకోవాల్సిందే. లేజర్ ప్రొజెక్టర్ల వైపు మార్కెట్ మళ్లుతోంది. వాటి ధర రూ. 2.5 లక్షలు మొదలుకొని రూ. 1.5 కోట్ల వరకు ఉంది. మంచి స్పీకర్లు రూ. 50 వేల నుంచి రూ. 2 కోట్ల వరకు దేశంలో లభిస్తున్నాయి. జర్మనీ బ్రాండ్ అయిన టైడల్ ఆడియో రెండు స్పీకర్ల ధర రూ. 7 కోట్ల వరకు ఉంది. ఆంప్లిఫయర్ ధర రూ. 1.5–20 లక్షలు, ప్రాసెసర్ ధర రూ. 50 వేలు మొదలుకొని రూ. 35 లక్షల దాకా పలుకుతోంది. అకౌస్టిక్స్ కోసం వాడే మెటీరియల్నుబట్టి థియేటర్ ఎక్స్‌పీరియెన్స్ ఆధారపడి ఉంటుంది. కరోనా తర్వాత పెరిగిన ప్రాధాన్యం కరోనా వ్యాప్తి తర్వాత ప్రజలు ఎంటర్టైన్మెంట్కు అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నారు. కాబట్టే హోం థియేటర్లకు డిమాండ్ పెరిగింది. ప్రైవసీ కోరుకొనే వాళ్లకు హోం థియేటర్ చక్కని పరిష్కారం. సంప్రదాయ థియేటర్‌ను మించి హోం థియేటర్ ఎక్స్‌పీరియెన్స్ ఉంటుంది. ఆడియో క్వాలిటీ 100 శాతంపైగా మెరుగ్గా ఉంటుంది. నీటి తుంపర, సీటు కదలడం వంటి స్పెషల్ ఎఫెక్ట్స్ సైతం ఏర్పాటు చేసుకోవచ్చు. మేము ఇప్పటివరకు 2 వేలకుపైగా హోం థియేటర్లను ఏర్పాటు చేశాం. – ముడిమెల వెంకట శేషారెడ్డి, ఎండీ, వెక్టర్ సిస్టమ్స్ -
The Little Theatre: వందలాది పిల్లల అమ్మ
‘ఆరంభ శూరత్వం’ చాలామందిలో కనిపిస్తుంది. అయితే చెన్నైకి చెందిన అయేషా మేడమ్‌లో అది మచ్చుకైనా కనిపించదు. మూడు దశాబ్దాల క్రితం నాటకరంగంలోకి అడుగు పెట్టిన అయేషా పిల్లల్లో సృజనాత్మక కళల వికాసానికి ‘ది లిటిల్ థియేటర్’ ప్రారంభించింది. కాలంతో పాటు నడుస్తూ కొత్త ఆలోచనలు జత చేస్తూ థియేటర్‌ను ఎప్పటికప్పుడు క్రియాశీలంగా, నిత్యనూతనంగా నిర్వహిస్తోంది. మూడు దశాబ్దాల క్రితం ‘క్షేత్రస్థాయిలో ప్రజలతో కలిసి పనిచేయాలని ఉంది’ అని తన మనసులో మాటను తండ్రి దగ్గర బయట పెట్టింది అయేషా. ఆయన ప్రోత్సాహకరంగా మాట్లాడారు. అలా తండ్రి–కూతురు ఆలోచనల్లో నుంచి వచ్చిందే ది లిటిల్ థియేటర్ ట్రస్ట్. ఆరంభంలో ఉన్న ఉత్సాహం ఆ తరువాత చాలామందిలో కరుగుతూ పోతుంది. కాని మూడు దశాబ్దాలు దాటినా ‘ది లిటిల్ థియేటర్’ ఉత్సాహం. సృజన శక్తి రవ్వంత కూడా తగ్గలేదు. ‘ఇంకా కొత్తగా ఏం చేయవచ్చు’ అని ఆలోచిస్తూ వెళుతోంది ది లిటిల్ థియేటర్. కళలు, ఆరోగ్యాన్ని మేళవించి 2015లో చెన్నైలోని ప్రభుత్వ పిల్లల ఆసుపత్రిలో ‘హాస్పిటల్ క్లౌన్స్’ను పరిచయం చేసింది లిటిల్ థియేటర్. కీమో థెరపీ చేయించుకునే పిల్లలకు ‘క్రియేటివ్ థెరపీ’ అందిస్తోంది. ‘లిటిల్ థియేటర్’ ద్వారా ఏడాది పొడవునా సృజనాత్మక వర్క్‌షాప్‌లు నిర్వహిస్తున్నారు. రెండు నుంచి నాలుగు సంవత్సరాల పిల్లల కోసం ప్రత్యేక వర్క్‌షాప్‌లు నిర్వహిస్తున్నారు. క్యాంప్ ఫైర్ కథల కార్యక్రమం ప్రతి నెల జరుగుతుంది. కోవిడ్ కల్లోల సమయంలో ‘లిటిల్ థియేటర్’ ఆన్‌లైన్‌లోకి వచ్చింది. మల్టీ–కెమెరా సెటప్‌తో షోలను ఎడిట్ చేసి అప్లోడ్ చేసేవారు. యూట్యూబ్ చానల్ ద్వారా ఎంతోమందికి చేరువ అయింది. వన్స్ అపాన్ ఏ టైమ్ తన ఇద్దరు పిల్లల గురించి ఆలోచిస్తూ ‘పిల్లలకు క్లాసు, హోంవర్క్ తప్ప మరో వ్యాపకం లేకుండా ఉంది’ అని నిట్టూర్చింది అయేషా. విదేశాల్లో ఉన్నత చదువు చదివిన అయేషా అక్కడ పిల్లల సృజనాత్మక వికాసానికి ఎన్నో వేదికలు ఉన్న విషయాన్ని గుర్తు చేసుకుంది. ఇక్కడ వాటి కొరత ఉంది అని గ్రహించి ‘ది లిటిల్ థియేటర్’కు శ్రీకారం చుట్టింది. తనకు ఆరేళ్ల వయసు ఉన్నప్పుడు తల్లితో ‘నాకు వందలాది పిల్లలు పుడతారు’ అని చెప్పింది చిన్నారి అయేషా. కూతురు మాట విని తల్లి పెద్దగా నవ్వింది. ఆ జ్ఞాపకాన్ని గుర్తు చేసుకుంటూ ‘నా మాట నిజమైంది. ఇప్పుడు నాకు వందలాది పిల్లలు. ది లిటిల్ థియేటర్‌కు దగ్గరైన వాళ్లందరూ నా పిల్లలే’ అంటుంది అయేష. స్కూల్ ముగిసిన తరువాత పిల్లల కోసం నాటకానికి సంబంధించిన ప్రాథమిక విషయాలను పరిచయం చేసే కార్యక్రమాల నుంచి కుండల తయారీ వర్క్‌షాప్‌ల వరకు ఎన్నో నిర్వహించింది ది లిటిల్ థియేటర్. ‘ది లిటిల్ థియేటర్’ ట్రస్టు ప్రతి సంవత్సరం వందలాది మంది నిరుపేద పిల్లలకు సహాయపడుతుంది. ప్రస్తుతం అడ్మినిస్ట్రేషన్‌కు సంబంధించిన బాధ్యతలు చూస్తున్న అయేషా థియేటర్‌కు సంబంధించి సృజనాత్మక కార్యకలాపాలను మాత్రం యువతరానికే అప్పగించింది. ‘ప్రతిభావంతులైన యువతరానికి సృజనాత్మక బాధ్యతలు అప్పగిస్తే కంటెంట్‌లో కొత్తదనం కనిపిస్తుంది. సంస్థ మరింత ముందు వెళుతుంది’ అంటుంది అయేషా. ‘నాటకరంగంలోకి అడుగు పెట్టి ఎన్నో సంవత్సరాలు అవుతుంది కదా, నేర్చుకున్నది ఏమిటి?’ అనే ప్రశ్నకు జవాబు ఆమె మాటల్లోనే... ‘నాటకరంగంలోకి అడుగుపెట్టి మూడు దశాబ్దాలు దాటింది. అయినప్పటికీ నేర్చుకోవాల్సింది ఇంకా ఎంతో ఉంది అనిపిస్తుంది. నాటకరంగానికి సంబంధించి ఎప్పటికప్పుడు ఆన్లైన్ కోర్సులలో చేరుతుంటాను. నేను నేర్చుకున్నదాన్ని లిటిల్ థియేటర్‌కు తీసుకువస్తుంటాను’ అంటోంది అయేషా. క్రియేటివ్ థెరపీ హాస్పిటల్ వాతావరణంలో గాంభీర్యం, విషాదం, నిర్వేదం మిళితమై కనిపిస్తుంటాయి. ఈ వాతావరణాన్ని మార్చడానికి ఆస్పత్రిలో చేరిన పిల్లల్లో హుషారు తెప్పించడానికి, వారి పెదవులపై నవ్వులు మెరిపించడానికి చెన్నైలోని ప్రభుత్వ పిల్లల ఆస్పత్రిలో ది లిటిల్ థియేటర్ ‘క్రియేటివ్ థెరపీ’ నిర్వహిస్తోంది. కథల కార్యక్రమం నుంచి తోలుబొమ్మలాట వరకు రకరకాల సృజనాత్మక కళలలో పేషెంట్లుగా ఉన్న పిల్లలను కలుపుకుంటూ వారిని కొత్త ప్రపంచంలోకి తీసుకువెళతారు. ‘క్రియేటివ్ థెరపీ’ కోసం హాస్పిటల్లో ఒక స్టూడియో ఏర్పాటు చేశారు. ఈ ఏసీ స్టూడియోలో పెర్ఫార్మెన్స్ లైట్లు, సౌండ్ సిస్టమ్స్, డిజిటల్ టీవీ స్క్రీన్, వర్క్‌షాప్‌కు సంబంధించి రకరకాల వస్తువులు ఉంటాయి. హాస్పిటల్‌లోని పిల్లల దిగులును దూరం చేయడంలో క్రియేటివ్ థెరపీ సత్ఫలితాలు ఇచ్చింది. హాస్పిటల్‌లోని పిల్లల కోసం షెల్ఫ్‌ల నిండా బట్టలు, బొమ్మలు, కలరింగ్ బుక్స్... మొదలైనవి ఏర్పాటు చేశారు. ఇతర హాస్పిటల్స్ కూడా పిల్లల కోసం ‘ఆర్ట్ థెరపీ’ని మొదలుపెట్టాయి. అడయార్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ రకరకాల పూల మొక్కలు, ప్లే పార్క్, పిట్టగూళ్లతో పేషెంట్ల కోసం ‘హ్యాపీ ప్లేస్’ను ప్రారంభించింది. మా అదృష్టం ‘చదువే కాదు మా పిల్లలకు కళలు కూడా కావాలి’ అంటున్న తల్లిదండ్రుల పరిచయం నిజంగా మా అదృష్టం. ‘చదువు తప్ప మా పిల్లలకు ఏమీ అవసరం లేదు’ అని వారు అనుకొని ఉంటే ది లిటిల్ థియేటర్ ఇంత దూరం వచ్చేది కాదు. ఎంతోమందికి స్ఫూర్తిగా నిలిచేది కాదు. డబ్బున్న కుటుంబం, డబ్బు లేని కుటుంబం అని తేడా లేకుండా పిల్లలందరూ కళలతో మమేకం కావాలి. మనిషి సంపూర్ణ మానవుడిగా మారడానికి కళలు ఉపయోగపడతాయి. – అయేషా, ఫౌండర్, ది లిటిల్ థియేటర్ -
ఓటీటీలో 20 సినిమాలు.. ఆ హిట్ సినిమా ఉచితం కాదు!
ప్రతి వారంలో శుక్రవారం వస్తోందంటే చాలు సినీ ప్రియులకు పండగే. ఒకవైపు థియేటర్ రిలీజ్‌తో పాటు ఓటీటీల్లో ఏయే సినిమాలు రిలీజ్ అవుతున్నాయనే ఆసక్తి ఉంటుంది. తమ అభిమాన హీరోల చిత్రాలు ఓటీటీకి ఎప్పుడొస్తాయా అని ఎదురు చూస్తుంటారు. అలాంటి వారికోసమే సినిమాలు, వెబ్ సిరీస్‌లు అలరించేందుకు వచ్చేస్తున్నాయి. ఇప్పటికే కొన్ని స్ట్రీమింగ్ అవుతుండగా.. గురు, శుక్రవారాల్లో మరిన్నీ సందడి చేయనున్నాయి. ఓటీటీలతో పాటు పంజా వైష్ణవ్ తేజ్, శ్రీలీల నటించిన ఆదికేశవ, శ్రీకాంత్, శివాని రాజశేఖర్ నటించిన కోటబొమ్మాళి పీఎస్, కోలీవుడ్ స్టార్ హీరో విక్రమ్ నటించిన ధృవనక్షత్రం థియేటర్లలో సందడి చేయనున్నాయి. నెట్‌ఫ్లిక్స్ లియో- (తెలుగు డబ్బింగ్ సినిమా)- నవంబర్- 24 స్క్విడ్ గేమ్: ద ఛాలెంజ్ (తెలుగు డబ్బింగ్ సిరీస్) - నవంబరు 22 మై డామెన్ (జపనీస్ సిరీస్) - నవంబరు 23 పులిమడ (మలయాళ సినిమా) - నవంబరు 23 ఏ నియర్లీ నార్మల్ ఫ్యామిలీ (స్వీడిష్ సిరీస్) - నవంబరు 24 ఐ డోన్ట్ ఎక్స్పెక్ట్ ఎనీవన్ టూ బిలీవ్ మీ (స్పానిష్ మూవీ) - నవంబరు 24 లాస్ట్ కాల్ ఫర్ ఇస్తాంబుల్ (టర్కిష్ చిత్రం) - నవంబరు 24 గ్రాన్ టరిష్మో (ఇంగ్లీష్ సినిమా) - నవంబరు 24 ద మెషీన్ (ఇంగ్లీష్ సినిమా) - నవంబరు 26 అమెజాన్ ప్రైమ్ ఎల్ఫ్ మీ (ఇటాలియన్ సినిమా) - నవంబరు 24 ది విలేజ్ (తమిళ వెబ్ సిరీస్) - నవంబరు 24 ఒపెన్ హైమర్ (ఇంగ్లీష్ సినిమా) - నవంబరు 22(రెంట్- RS.149) అమెజాన్ మినీ టీవీ స్లమ్ గల్ఫ్ (హిందీ సిరీస్) - నవంబరు 22 డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ ఫర్గో: సీజన్ 5 (ఇంగ్లీష్ సిరీస్) - నవంబరు 21 జీ5 ద ఆమ్ ఆద్మీ ఫ్యామిలీ: సీజన్ 4 (హిందీ సిరీస్) - నవంబరు 24 జియో సినిమా ద గుడ్ ఓల్డ్ డేస్ (తెలుగు సిరీస్) - నవంబరు 23 బుక్ మై షో UFO స్వీడన్ (స్వీడిష్ మూవీ) - నవంబరు 24 సోనీ లివ్ చావెర్ (మలయాళ సినిమా) - నవంబరు 24 సతియా సోతనాయ్ (తమిళ మూవీ) - నవంబరు 24 ఆపిల్ ప్లస్ టీవీ హన్నా వడ్డింగ్‌హమ్: హోమ్ ఫర్ క్రిస్మస్ (ఇంగ్లీష్ ఫిల్మ్) - నవంబరు 22 -
ఆ టోకెన్‌తో థియేటర్లో జీవితాంతం ఉచితంగా సినిమాలు
ఓల్డ్ ఈజ్ గోల్డ్ అని అంటారు. చాలామంది పాత వస్తువులను జాగ్రత్తగా దాచేందుకు ఇష్టపడతారు. అయితే కొన్నేళ్ల తర్వాత అవి బయట పడినప్పుడు వాటిని చూసినవారు తెగ ఆశ్యర్యపోతుంటారు. అయితే ఇప్పుడు మనం తెలుసుకునేది దీనికి భిన్నం. 1766 నాటి ‘థియేటర్ టోకెన్’ ఇప్పుడు బ్రిటన్‌లో వేలం వేస్తున్నారు. దీని ప్రత్యేకత ఏమిటంటే ఆ టొకెన్ ఉంటే థియేటర్లో రోజూ సినిమాలను ఉచితంగా చూడవచ్చు. అయితే ఈ టోకెన్ కొనుగోలు చేయాలంటే భారీగా సొమ్ము చెల్లించాలివుంటుంది. గార్డియన్ తెలిపిన వివరాల ప్రకారం బ్రిటన్‌లోని బ్రిస్టల్ ఓల్డ్ విక్ థియేటర్‌ను నిర్మించివారు ముందుగా 50 ప్రత్యేకమైన టోకెన్లు తయారు చేశారు. ఈ టోకెన్లు కలిగినవారు థియేటర్లో ప్రదర్శించే ప్రతీ సినిమాను ఉచితంగా చూడవచ్చని ఆ టోకెన్లపై రాసి ఉంది. 250 ఏళ్లపాటు దాచివుంచిన ఈ టోకెన్లు ఇటీవల బయటపడ్డాయి. ఇప్పుడు వీటిని వేలం వేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. థియేటర్ ప్రారంభ సమయంలో ఈ 50 టోకెన్లను తయారు చేశారు. కొందరు వాటిని వినియోగించారు. మరికొందరు విక్రయించారు. ఈ నేపధ్యంలో అనేక నకిలీ టోకెన్లు కూడా తయారయ్యాయట. విల్ట్‌షైర్‌లోని హెన్రీ ఆల్డ్రిడ్జ్ అండ్ సన్ వేలం హౌస్‌లో ఈ టోకెన్లు విక్రయిస్తున్నట్లు వేలం హౌస్ ప్రతినిధి మీడియాకు తెలిపారు. 1766లో థియేటర్ వాటాదారు విలియం జోన్స్‌కు టోకెన్ నంబర్ 35ను జారీ చేసినట్లు రికార్డులు చెబుతున్నాయి. 1815 నాటికి ఇది ప్రముఖ బ్రిస్టల్ బ్లూ గ్లాస్ తయారీదారు అయిన జాన్ వాధమ్ దగ్గరకు చేరింది. ఈ టోకెన్ ఇప్పటికీ ఈ కుటుంబం వద్ద ఉంది. మరో టోకెన్ అష్టన్ కోర్ట్‌కు చెందిన స్మిత్ కుటుంబం దగ్గరుంది. వేలం నిర్వహిస్తున్న సంస్థ ఒక టోకెన్ ధరను 2,500 పౌండ్లు అంటే సుమారు రూ. 2.51 లక్షలుగా నిర్ణయించింది. బ్రిస్టల్ ఓల్డ్ విక్ థియేటర్ ప్రతినిధి మాట్లాడుతూ మేము ఈ టోకెన్ల వినియోగానికి అనుమతిస్తాం. వారికి జీవితాంతం ఉచితంగా సినిమాలు చూసే అవకాశాన్ని కల్పిస్తాం. కాగా ఈ థియేటర్‌ను ‘థియేటర్ రాయల్’ అని పిలుస్తారు దీనిని కింగ్ స్ట్రీట్‌లో 1764-1766 మధ్య కాలంలో నిర్మించారు. ఇది కూడా చూడండి: 21 ఏళ్లకు యాసిడ్ బాధితురాలికి న్యాయం! -
థియేటర్ మొత్తం మంటలు, సినిమా చూస్తూ నిమగ్నమైన ప్రేక్షకులు
టెక్నాలజీ ఇప్పుడు కొత్త పుంతలు తొక్కుతుంది. రకరకాల వింతలు, అద్భుతాలతో మనిషి చేస్తున్న ప్రయత్నాలు కొన్నిసార్లు బెడిసికొట్టేలా చేస్తున్నాయి. తాజాగా 5డీ ఎఫెక్ట్‌తో థియేటర్లో ఫైర్ సీన్‌కి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారడంతో టెక్నాలజీ ఓవర్ డోస్‌పై మరోసారి చర్చనీయాంశమైంది. ఇప్పటివరకు మనకు 2డీ, 3డీ,4డీ సినిమాల గురించి తెలుసు. ఇది భారీ విజువల్ ఎఫెక్ట్స్‌తో తెరపై వండర్స్ క్రియేట్ చేసేలా చేస్తుందన్న విషయం తెలిసిందే. ఈ ఎఫెక్ట్స్‌తో సినిమాలోని పాత్రలూ, దృశ్యాలు మనల్నీ మమేకం చేసేలా చేస్తాయి. అక్కడ జరుగుతున్న సీన్స్ నిజంగా మనచుట్టూ జరుగుతున్నాయేమో అనుకునేలా విజువల్స్‌లో కనిపిస్తాయి. స్క్రీన్‌పై సినిమా చూస్తున్నప్పుడు ప్రేక్షకులు ఆ ఫీల్‌ని ఎంజాయ్ చేసేలా చేస్తుంది. సినిమాలో వర్షం పడినా, మంచు కురిసినా..చూసే ప్రేక్షకులకు కూడా కొన్ని సాంకేతిక పద్ధతులతో ఆ ఫీలింగ్ కలిగించేలా చేస్తుంది. ఇప్పుడు 5డీ థియేటర్లు ఒక అడుగు ముందుకేసి ఆడియెన్స్‌కు ఆ ఫీల్‌ను మరింత దగ్గర చేసింది. కానీ మితిమీరిన టెక్నాలజీ వాడకంతో కొన్నిసార్లు ఇబ్బందులు తప్పవు అనేలా గుర్తుచేస్తుంది ఈ వైరల్ వీడియో. 5డీ ఎక్స్ స్క్రీన్‌తో సినిమా థియేటర్లో ప్రేక్షకులు మూవీని ఎంజాయ్ చేస్తుండగా సడెన్‌గా ఓ ఫైర్ యాక్సిడెంట్‌కి సంబంధించిన సీన్ పడింది. అంతే క్షణాల్లో థియేటర్ మొత్తం అంటుకున్నట్లు కనిపించింది. ఇది చూసిన ప్రేక్షకులు కూడా భలే థ్రిల్‌గా ఫీల్ అయ్యారు. అయితే ఇది రియల్ ఫైర్ యాక్సిడెంట్ కాకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. అయితే ఈ వీడియో వైరల్ కావడంతో నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. 5డీ ఎఫెక్ట్ బాగానే ఉంది కానీ, నిజంగానే ఒకవేళ అగ్ని ప్రమాదం జరిగితే పరిస్థితి ఏంటి? ప్రేక్షకుల ప్రాణాలతో ఇలా చెలగాటం ఆడొద్దంటూ థియేటర్ ఓనర్స్‌పై గుర్రమంటున్నారు. మరోవైపు టెక్నాలజీని మితిమీరి వాడితే అనర్థాలే తప్పా మరొకటి ఉండదు. స్పేస్, వాటర్ వరకు ఓకే కానీ ఇలా నిప్పుతో చెలగాటం ఏంటి అంటూ కామెంట్స్ చేస్తున్నారు. This is how people die. If a theater does somehow manage to go up in flames, people will think it's the 5D cinema effects. — JDM is the Shiz! (Scarface) (@FloatyRedHead23) October 13, 2023 My issue is what if a real fire broke out? This kind of stuff is awesome but desensitizes the mind and creates a loss of reaction time. — Cosmic-books 🇨🇦 (@foerster_bryan) October 13, 2023 -
లియో ట్రైలర్ .. వారందరికీ షాకిచ్చిన సెన్సార్ బోర్డ్!
దళపతి విజయ్, లోకేశ్ కనగరాజ్ కాంబినేషన్లో వస్తోన్న చిత్రం లియో. ఈ చిత్రంలో త్రిష హీరోయిన్గా నటిస్తోంది. ఇటీవలే ఈ మూవీకి సంబంధించిన ట్రైలర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. ప్రస్తుతం ఈ ట్రైలర్ యూట్యూబ్‌లో రికార్డ్ స్థాయిలో దూసుకెళ్తోంది. అయితే ఈ ట్రైలర్లో విజయ్ చెప్పిన ఓ డైలాగ్ అభిమానులకు షాక్‌కు గురి చేసింది. ఆ బూతుపదం ఉండడంపై సోషల్ మీడియాలోనూ పెద్దఎత్తున చర్చ జరిగింది. కానీ.. ఆ డైలాగ్‌ను అలాగే ఉంచడంపై డైరెక్టర్ లోకేశ్ వివరణ కూడా ఇచ్చారు. (ఇది చదవండి: ఈడీ ముందుకు హాజరైన హీరో నవదీప్.. బ్యాంకు లావాదేవీలపై ప్రశ్నలు) అయితే ఈ ట్రైలర్ విడుదల రోజు చెన్నైలోని కొన్ని థియేటర్లలో ప్రదర్శించారు. దీంతో తాజాగా ఆ థియేటర్లకు సెన్సార్ బోర్డు లీగల్ నోటీసులు జారీ చేసింది. అభ్యంతరమైన పదాలతో ట్రైలర్‌ను అలాగే చూపించారంటూ సెన్సార్ బోర్డు థియేటర్లకు లీగల్ నోటీసులు పంపింది. నిబంధనల ప్రకారం అలాంటి ట్రైలర్‌ను పబ్లిక్‌లో ప్రదర్శించకూడదని నోటీసుల్లో పేర్కొంది. దీనిపై వివరణ ఇవ్వాలంటూ యాజమాన్యాలను కోరింది. కాగా.. ఈ చిత్రంలో బాలీవుడ్ నటుడు సంజయ్ దత్, గౌతమ్ మేనన్, మిస్కిన్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. భారీ అంచనాల మధ్య ఈ సినిమా అక్టోబర్ 19న ప్రేక్షకుల ముందుకు రానుంది. -
ఏం చిక్కొచ్చి పడింది! అటు చూస్తే.. జవాన్!.. ఇటు చూస్తే.. ఆఫీస్..!
అటు చూస్తే జవాన్ ఇటు చూస్తే ఆఫీస్...అటు చూస్తే బాదం హల్వా ఇటు చూస్తే సేమ్యా ఇడ్లీ... అని శ్రీశ్రీ అన్నట్టుగా ఆ బెంగుళూరు ఐ.టి ఉద్యోగికి కూడా సంకటం వచ్చింది. ఒకవైపు జవాన్ రిలీజ్. మరోవైపు సాఫ్ట్వేర్ డ్యూటీ. చివరకు అతను రెండూ చేశాడు. వైరల్ అయ్యాడు. బెంగళూరులోనే ఇటువంటివి జరుగుతుంటాయి. మొన్నా మధ్య ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగి ర్యాపిడో బైక్ వెనుక కూచుని ఆఫీస్‌కు వెళుతూ ట్రాఫిక్‌లో చిక్కుకుపోతే బైక్ మీదే ల్యాప్‌టాప్ తెరిచి లాగిన్ అయ్యి డ్యూటీ మొదలెట్టేశాడు. భారీ ట్రాఫిక్ వల్ల క్యాబుల్లో ఎక్కగానే ల్యాప్‌టాప్‌లు తెరిచే వాళ్లూ అక్కడ ఎక్కువే. ఇప్పుడు ఒక ఉద్యోగి ఏకంగా సినిమా హాల్లోనే ల్యాప్‌టాప్ తెరిచాడు. ఏం చేస్తాడు మరి? షారూక్ ఖాన్ ఫ్యాన్. ఫస్ట్ డే ఫస్ట్ షో. సరిగ్గా ఆ టైమ్‌కే లాగిన్ అవ్వాలి. అందుకని థియేటర్లో ల్యాప్‌టాప్‌లో వేళ్లు టిక్కుటక్కుమంటుంటే కళ్లు సినిమాకు అంకితం అయ్యాయి. వెనుక కూచున్న ఒక వ్యక్తి ఇది ఫొటో తీసి ఇన్‌స్టాలో పెడితే లక్షల కొద్దీ వ్యూస్ వచ్చాయి. ‘బెంగళూరులో ఇక పని చేయకుండా వదిలేసిన చోటు ఏదీ లేదు’ అని కామెంట్లు చేస్తూ ఏడవలేక నవ్వుతున్నారు. When #Jawan first day is important but life is #peakbengaluru. Observed at a #Bangalore INOX. No emails or Teams sessions were harmed in taking this pic.@peakbengaluru pic.twitter.com/z4BOxWSB5W — Neelangana Noopur (@neelangana) September 8, 2023 (చదవండి: కాలం కలిసి వస్తే డంప్‌యార్డ్ కూడా నందనవనం అవుతుంది!) -
సినిమా చూసేందుకు వెళ్లి మృత్యుఒడిలోకి.. ఏమైందంటే?
లక్నో: ఇటీవలి కాలంలో గుండెపోటు కారణంగా చూస్తుండగానే అకస్మాత్తుగా ఎంతోమంది చనిపోయారు. ఉన్నట్టుండి కూర్చున్న, నిలుచున్న చోటే కుప్పకూలిన ఘటనలు ఎన్నో ఘటనలు సోషల్ మీడియాలో చనిపించాయి. తాజాగా అలాంటి ఘటనే ఉత్తరప్రదేశ్‌లో చోటుచేసుకుంది. సినిమా చూసేందుకు థియేటర్‌కు వెళ్లిన వ్యక్తి ఆకస్మాత్తుగా గుండెపోటు రావడంతో ఉన్నచోటే కుప్పకూలి మృతిచెందాడు. వివరాల ప్రకారం.. యూపీలోని లఖింపుర్‌ఖేరీలో సినిమా చూసేందుకు వెళ్తున్న ఓ యువకుడు సినిమా హాలులో నడుస్తుండగానే కుప్పకూలిపోయాడు. కాగా, ఇటీవల విడుదలైన గదర్ -2 సినిమాను చూసుందుకు థియేటర్లోకి వస్తున్న 35 ఏళ్ల వ్యక్తి గుండెపోటుతో మృతిచెందాడు. శనివారం రాత్రి 7.43 గంటల సమయంలో ఒక్కసారిగా ఫ్లోర్‌పై కుప్పకూలి ప్రాణాలు కోల్పోయాడు. దీనికి సంబంధించిన దృశ్యాలు థియేటర్లో ఉన్న సీసీ టీవీ కెమెరాలో రికార్డు అయ్యాయి. ఈ ఘటనలో మృతిచెందిన వ్యక్తిని అక్షత్ తివారీగా గుర్తించారు. प्रदेश के लखीमपुर खीरी के एक मॉल में चलते–चलते एक युवक को हर्ट अटैक आ गया, युवक नीचे गिरा और मर गया।#lakhimpurkheri pic.twitter.com/jmQpfWvO9w — Aviral Singh (@aviralsingh15) August 28, 2023 అయితే, తివారీ.. థియేటర్ వద్ద ఫోన్లో ఎవరితోనో మాట్లాడుతూ సినిమా హాలు మెట్లు ఎక్కి పైకి వచ్చాడు. అనంతరం.. ఓ స్టాల్ వద్దకు చేరుకోగానే ఒక్కసారిగా నేలపై కుప్పకూలిపోయాడు. ఆ సమయంలో అతడి ముందు ఇద్దరు యువకులు నడుస్తున్నట్టుగా సీపీ టీవీ వీడియోలో రికార్డు అయ్యింది. అతడు కుర్చీల వద్ద పడిపోవడాన్ని గమనించిన మరికొందరు కూడా అక్కడికి చేరుకున్నారు. ఈ క్రమంలో వెంటనే తివారీని ఆసుపత్రికి తరలించారు. తివారీని పరిశీలించిన వైద్యులు అప్పటికే మృతిచెందినట్టు తెలిపారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఇది కూడా చదవండి: విమానంలో అద్భుతం.. పసిబిడ్డ ప్రాణాలు కాపాడిన ఎయిమ్స్ డాక్టర్లు -
ప్రభాస్ ఫ్యాన్స్ వీరంగం.. థియేటర్ అద్దాలు ధ్వంసం!
హైదరాబాద్‌లో ప్రభాస్ ఫ్యాన్స్ హంగామా చేశారు. ఆర్టీసీ క్రాస్ రోడ్డులోని థియేటర్లో వీరంగం సృష్టించారు. సుదర్శన్ థియేటర్లో యోగి రీరిలీజ్ సందర్భంగా ఈ సంఘటన చోటు చేసుకుంది. రెచ్చిపోయిన ప్రభాస్ ఫ్యాన్స్ టాకీస్‌లోని స్క్రీన్‌తో పాటు ఫర్నీచర్, అద్దాలు ధ్వంసం చేశారు. (ఇది చదవండి: షారూక్ ఖాన్‌పై డైరెక్టర్ సంచలన కామెంట్స్..!) థియేటర్‌పై కూల్‌డ్రింక్ బాటిళ్లతో ఫ్యాన్స్ దాడి చేయడంతో అద్దాలు ధ్వంసమైనట్లు తెలుస్తోంది. అయితే దీనిపై థియేటర్ యాజమాన్యం పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు సమాచారం. ఇప్పటికే ఇద్దరిని చిక్కడపల్లి పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. మరో ముగ్గురు నిందితులు పరారీలో ఉండగా వారికోసం గాలిస్తున్నారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. (ఇది చదవండి: జిలేబి సినిమా రివ్యూ) Frustrated Prabhas fans are damaging theatre property because #Rogi4K failed to cross even the parking collections of previous re-releases. The cost of theatre damage is greater than the overall collections collected by ROGI till now."pic.twitter.com/eNO1XiYiw3 — HNE Official™ (@urstrulyHNE) August 18, 2023 -
Jailer Movie Release Fans Celebration: రజనీకాంత్ ‘జైలర్’మూవీ విడుదల.. అభిమానుల సందడి (ఫోటోలు)
-
థియేటర్లో యాంకర్ రచ్చ రచ్చ.. భర్తతో కలిసి!
ప్రముఖ యాంకర్, బిగ్‌బాస్ ఫేం లాస్య గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అప్పట్లో యాంకర్ రవితో జతకట్టి బుల్లితెరపై అలరించిన భామ.. ఆ తర్వాత మంజునాథ్‌ను ప్రేమ పెళ్లి చేసుకుంది. పెళ్లి తర్వాత లాస్య యాంకరింగ్ గుడ్‌బై చెప్పిన లాస్య.. గృహిణిగా ఇంటి బాధ్యతలు చూసుకుంటుంది. ఇటీవలే రెండో బిడ్డకు జన్మనివ్వగా.. ఈ జంటకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. అలాగే యూట్యూబ్ చానల్‌ను రన్ చేస్తుంది. ఇటీవల రెండో బిడ్డకు జన్మనిచ్చిన లాస్య సోషల్ మీడియాలో ఎప్పుడు చురుక్కుగ్గానే ఉంటోంది. ఎప్పటికప్పుడు ఫోటోలు, వీడియోలు షేర్ చేస్తూ అలరిస్తోంది. (ఇది చదవండి: నీ భార్యగా గర్వపడుతున్నా.. భర్తపై యాంకర్ లాస్య ఎమోషనల్ పోస్ట్) తాజాగా లాస్య తన ఇన్‌స్టాలో షేర్ చేసిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. తన భర్తతో కలిసి థియేటర్లో హంగామా చేసింది. ఈ జంట మరింత రొమాంటిక్‌గా అందరి ముందే రెచ్చిపోయారు. ఆమె భర్త మంజునాథ్ థియేటర్లోనే లాస్యకు మరోసారి ప్రపోజ్ చేస్తూ రచ్చ చేశారు. ఇదంతా సూర్య హీరోగా నటించిన సూర్య సన్ఆఫ్ కృష్ణన్ రీ-రిలీజ్ థియేటర్లో జరిగింది. ఆ చిత్రంలోని సీన్‌ను అనుకరిస్తూ లాస్య చేసిన హంగామా చూసిన ఫ్యాన్స్ సైతం క్రేజీ కామెంట్స్ చేశారు. (ఇది చదవండి: 'ఆ గొంతు ఎప్పటికీ వినిపిస్తూనే ఉంటుంది'.. మెగాస్టార్ ఎమోషనల్ ట్వీట్ ) View this post on Instagram A post shared by Lasya Manjunath (@lasyamanjunath)