![A women Fan Of Naga Chaitanya Cries at Theatre while Thandel Screening](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/10/tha.jpg.webp?itok=vH7cyq2Q)
అక్కినేని హీరో నాగచైతన్య ఇటీవలే తండేల్ మూవీతో ప్రేక్షకుల ముందుకొచ్చారు. చందు మొండేటి దర్శకత్వం వహించిన ఈ పాన్ ఇండియా సినిమా ఫిబ్రవరి 7న ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. ఈ మూవీలో చైతూ సరసన నేచురల్ బ్యూటీ సాయిపల్లవి హీరోయిన్‌గా నటించింది. తొలి రోజే ఈ మూవీ పాజిటివ్ టాక్ రావడంతో వసూళ్ల పరంగా దూసుకెళ్తోంది. దీంతో తండేల్ టీమ్ విజయవాడ కనకదుర్గమ్మను దర్శించుకుంది. ఈ మూవీ సక్సెస్ కావడంతో సంబురాల్లో మునిగిపోయారు.
అయితే ఈ మూవీ చూసిన ఓ మహిళ అభిమాని తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. సినిమాలో నాగచైతన్యకు సంబంధించిన ఓ సీన్ ప్లే అవుతుండగా ఏడుపును ఆపుకోలేకపోయారు. వెక్కి వెక్కి మరీ ఏడుస్తూ కనిపించారుయ దీనికి సంబంధించిన వీడయో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీన్ని బట్టి చూస్తే తండేల్ ఆడియన్స్‌కు ఎమోషనల్‌గా ఎంతలా కనెక్ట్ అయిందో అర్థమవుతోంది.
కాగా.. ఈ సినిమాను మత్స్యకారుల బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కించారు. నిజ జీవితంలో జరిగిన సంఘటనల ఆధారంగా రూపొందించారు. శ్రీకాకుళం జిల్లాకు చెందిన కొంతమంది మత్స్యకారులు పాకిస్తాన్ కోస్ట్ గార్డుల చేతికి చిక్కారు. ఆ తర్వాత జరిగిన పరిణామాలతో ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. రియల్ లవ్ స్టోరీ కావడంతో ప్రేక్షకులకు మరింత ఎమోషనల్‌గా కనెక్ట్ అయింది.
ఎన్ని ట్యాంక్ నీలు ఉన్నాయ్ అమ్మ..🥹🥹
Proud of you Anna #NagaChaitanya 🧎
థియేటర్స్ తీసుకొచ్చి మరి యేడిపిస్తునవ్
Actor @chay_akkineni ❤️🤌#Thandel #ThandelJaathara #ThandelRaju pic.twitter.com/8jzlo8j5J6— 𝗖𝗵𝗮𝘆-𝗦𝗮𝗶 ⛓️ (@SaiNavabathula) February 9, 2025
Comments
Please login to add a commentAdd a comment