cry
-
అదిరిపోయిన ఎన్నికల ఫలితాలు.. ఏడ్చేసిన డీకే శివకుమార్
బెంగళూరు: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయదుందుబి మోగించడంతో పీసీసీ చీఫ్ డీకే శివకుమార్ భావోద్వేగానికి లోనయ్యారు. మీడియాతో మాట్లాడుతూ కన్నీటి పర్యంతమయ్యారు. కాంగ్రెస్‌కు విజయాన్నందించి తమపై విశ్వాసం ఉంచిన కర్ణాటక ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. పార్టీ విజయం కోసం శ్రమించిన ప్రతిఒక్కరిని అభినందించారు. కార్యకర్తల కష్టానికి తగిన ఫలితం దక్కిందన్నారు. కలసికట్టుగా పనిచేస్తే కాంగ్రెస్ కచ్చితంగా విజయం సాధిస్తుందని ఎన్నికలకు ముందే తాను చెప్పానని, అందరం సషష్టిగా కృషి చేయడం వల్లే అద్భుత ఫలితాలు వచ్చాయని డీకే చెప్పారు. సిద్ధరామయ్య సహా విజయానికి కృషి చేసిన కాంగ్రెస్ పార్టీలోని ప్రతి నాయకుడికి, కార్యకర్తకు కృతజ్ఞతలు తెలిపారు. అలాగే బీజేపీ తనపై తప్పుడు కేసులు మోపి జైల్లో పెట్టినప్పుడు సోనియా గాంధీ తనను చూసేందుకు వచ్చారని గుర్తు చేసుకుని డీకే ఏమోషనల్ అయ్యారు. తాను ఎలాంటి బెదిరింపులకు లొంగకుండా జైలుకెళ్లేందుకు సిద్ధపడ్డానని పేర్కొన్నారు. తనకు అండగా నిలిచిన గాంధీ కుటుంబానికి కృతజ్ఞతలు తెలిపారు. కర్ణాటకలో ఎలాగైనా కాంగ్రెస్‌ను అధికారంలోకి తీసుకొస్తామని సోనియా, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలకు చెప్పామని, ఇప్పుడు ప్రజల తీర్పు తమవైపే ఉండటం ఎంతో ఆనందంగా ఉందన్నారు. #WATCH | Karnataka Congress President DK Shivakumar gets emotional on his party's comfortable victory in state Assembly elections pic.twitter.com/ANaqVMXgFr — ANI (@ANI) May 13, 2023 కాగా.. కనకపుర స్థానం నుంచి వరుసగా నాలుగోసారి గెలుపొందారు డీకే శివకుమార్. సీఎం పగ్గాలు ఆయన చేపడతారనే ప్రచారం కూడా జరుగుతోంది. అయితే దీనిపై కాంగ్రెస్ అధిష్టానం ఇప్పటివరకు ఎలాంటి ప్రకటన చేయలేదు. పూర్తి ఫలితాల తర్వాత దీనిపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే.. కర్ణాటక ముఖ్యమంత్రి ఎవరు? Follow https://t.co/Fg8UHp5DxE for #KarnatakaElection #KarnatakaElectionResults #KarnatakaElections2023 latest updates — Sakshi TV Official (@sakshitvdigital) May 13, 2023 మొత్తం 224 అసెంబ్లీ స్థానాలున్న కర్ణాటక అసెంబ్లీలో మెజార్టీకి 113 స్థానాలు అవసరం. ప్రస్తుతం కాంగ్రెస్ 130 స్థానాలకుపైగా మెజార్టీతో దూసుకుపోతోంది. బీజేపీ కేవలం 65 స్థానాలకే పరిమితమైంది. జేడీఎస్ కేవలం 21 స్థానాల్లో ఆదిక్యం కనబరుస్తోంది. చదవండి: కాంగ్రెస్ విజయానికి కారణమైన 6 మంత్రాలివే.. -
బీజేపీ అవమానంపై షెట్టర్ భార్య కంటతడి
బెంగళూరు: బీజేపీ టికెట్ నిరాకరణతో నొచ్చుకున్న.. కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి జగదీష్ షెట్టర్ కాంగ్రెస్ పార్టీలోకి మారిపోయిన సంగతి తెలిసిందే. ఏఐసీసీ ప్రెసిడెంట్ మల్లికార్జున ఖర్గేతో పాటు కర్ణాటక కీలక నేతల సమక్షంలో ఆయన ఇవాళ కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. అయితే.. పార్టీ మారిన గంటల వ్యవధిలోనే ఆయన సొంత నియోజకవర్గం హుబ్బలి-ధార్వాడ్‌కు చేరుకోగా.. అక్కడ ఆయనకు ఊహించని రీతిలో ఘనస్వాగతం లభించింది. జగదీష్ షెట్టర్ భార్య శిల్ప ఆయన్ని హత్తుకుని కంటతడి పెట్టగా.. మద్దతుదారులు పెద్ద ఎత్తున్న షెట్టర్ నిర్ణయాన్ని అభినందిస్తూ పెద్ద ఎత్తున్న నినాదాలు చేశారు. ఆ సమయంలో ఆయన ఆమెను ఓదారుస్తూ భావోద్వేగానికి లోనయ్యారు. అంతకు ముందు ఆమె మీడియాతో మాట్లాడుతూ.. బీజేపీ కోసం తన భర్త ఎంతో కష్టపడ్డారని, కానీ పార్టీ మాత్రం తన భర్తని ఘోరంగా అవమానించిందని వాపోయారామె. Video Credits: Public TV టికెట్ నిరాకరణ మాత్రమే కారణం కాదని.. బీజేపీ తన పట్ల వ్యవహరించిన తీరు కూడా తాను పార్టీ వీడేందుకు ఓ కారణమైందని జగదీష్ షెట్టర్ చెప్తున్నారు. ఒక సీనియర్ నేతగా బీజేపీ నాకు టికెట్ ఇస్తుందని భావించా. కానీ, నాకు అందుకు నిరాకరించింది. ఈ పరిణామం నాకు దిగ్భ్రాంతి కలిగించింది. కనీసం నన్ను పార్టీ మారకూడదని సముదాయించేందుకు కూడా ఎవరూ ముందుకు రాలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. వరుసగా ఆరుసార్లు ఎమ్మెల్యేగా నెగ్గిన జగదీష్ శివప్ప షెట్టర్.. లింగాయత్ వర్గానికి చెందిన బలమైన నేత. కర్ణాటకకు 15వ ముఖ్యమంత్రిగా(2012-13 మధ్య) పని చేశారు. రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబం ఈయనది. న్యాయవాద వృత్తిలో 20 ఏళ్లు కొనసాగి.. ఆపై రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. అసెంబ్లీ స్పీకర్‌గా, ఆపై యడియూరప్ప కేబినెట్లో మంత్రిగా పని చేశారు. కర్ణాటక బీజేపీ సంక్షోభంతో 2012 నుంచి ఏడాదిపాటు ముఖ్యమంత్రిగా కొనసాగారు. 2013 కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలకు బీజేపీ సీఎం అభ్యర్థిగా నిల్చున్న ఆయన.. పార్టీ నైతిక ఓటమి తర్వాత ప్రతిపక్ష నేతగా కొనసాగారు. -
మొక్కలు కూడా ఏడుస్తాయ్! సాయం చేయమంటూ అరుస్తాయ్!
మనుషుల్లానే మొక్కలు కూడా ఒత్తిడికి గురైతే ఏడుస్తాయట. తమ ఆవేదనను శబ్దాల రూపంలో వెళ్లగక్కుతాయట. అయితే వాటిని మనం వినలేం! అని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. తాజా అధయనాల్లో పరిశోధకులు ఈ విషయాన్ని వెల్లడించారు. పరిశోధనల్లో మొక్కలు ఒకదానితో ఒకటి సంభాషించుకుంటాయని తేలిందని కూడా చెప్పారు. ఈ మేరకు ఇజ్రాయెల్‌కి చెందిన టెల్ అవీవ్ విశ్వవిద్యాలయంలోని పరిశోధకులు ఒత్తిడికి గురైతే సహాయం కోసం మొక్కలు అరుస్తాయని కనుగొన్నారు. దీని కోసం టొమాటో, పొగాకు వంటి మొక్కలను గ్రీన్హౌస్ లోపల ఉంచి పరిశోధన చేసినప్పుడూ.. అవి డీహైడ్రేట్ అయ్యి ఏడుపు రూపంలో శబ్దాలను విడుదల చేయడం గమనించారు. ప్రతి మొక్క ఒత్తిడిని ఎదుర్కొన్నప్పుడూ ఒక్కో రకమైన నిర్ధిష్ట శబ్ద రూపంలో ధ్వనిని ప్రదర్శించాయని చెప్పారు. మానవులు గబ్బిలాలు, కీటకాలు, ఎలుకలు వంటి వివిధ జంతువుల శబ్దాన్ని వినగలరు. మహా అయితే 16 కిలో హెర్ట్జ్ వరకు మాత్రమే మానవులు వినగలరు. పరిశోధనలో మెక్కలు 10 సెంటీమీటర్ల పరిధిలో ఉన్న 20 నుంచి 250 పౌనఃపున్యాల శబ్దాలను అందుకుంటాయని అల్ట్రాసోనిక్ మైక్రోఫోన్ల ద్వారా గుర్తించారు. మొక్కలకు తగు మోతాదు నీరు అందనప్పుడూ, లేదా కొమ్మలకు/కాండానికి గాయాలైనప్పుడు వాటి నుంచి ఏడుపు రూపంలో శబ్దాలు రావడాన్ని గుర్తించినట్లు తెలిపారు. మొక్కలు విడుదల చేసే శబ్దాలను గబ్బిలాలు, ఎలుకలు, కీటకాలు వంటివి గుర్తించగలవని, అవి మొక్కల నుంచి సంబంధిత సమాచారాన్ని కూడా పొందగలవని పరిశోధకుడు లిలాచ్ హడానీ చెప్పుకొచ్చారు. (చదవండి: రెండో పెళ్లి కావలి అంటూ పోలీస్టేషన్లో వధువు హల్చల్! మద్యంమత్తులో ఊగిపోయి..) -
బోరుమన్న ఫిజిక్స్ వాలా మాజీ టీచర్లు! నాటకం బాగుందన్న నెటిజన్లు!
ప్రముఖ ఎడ్టెక్ సంస్థ ఫిజిక్స్ వాలాను వీడిన ముగ్గురు టీచర్లు తమపై వచ్చిన ఆరోపణలకు వివరణ ఇస్తూ సానుభూతి కోసం ఏడుస్తూ పెట్టిన ఓ వీడియో ప్రస్తుతం బాగా వైరల్ అయింది. వారి ఏడుపు టీవీ నాటకంలా ఉందని నెటిజన్లు ఓ రేంజ్లో విమర్శలు చేశారు. ఇదీ చదవండి: Get 1 Electric Scooter: రూ.38 వేలకే ఎలక్ట్రిక్ స్కూటర్.. భారీ డిస్కౌంట్! ‘ఫిజిక్స్ వాలా’లో పనిచేస్తున్న తరుణ్ కుమార్, మనీష్ దూబే, సర్వేష్ దీక్షిత్ అనే ముగ్గురు టీచర్లు.. సంస్థ వ్యవస్థాపకుడు అలఖ్ పాండేతో విభేదాల కారణంగా ఇటీవల ఆ సంస్థను విడిచి బయటకు వెళ్లారు. అయితే అడ్డా247 అనే సంస్థ నుంచి రూ.5 కోట్లు తీసుకుని ‘ఫిజిక్స్ వాలా’ను వీడినట్లు ఆ సంస్థ కెమిస్ట్రీ టీచర్ తమపై ఆరోపణలు చేశారని ముగ్గురూ పేర్కొన్నారు. ఇదీ చదవండి: గ్యాస్ వినియోగదారులకు ఊరట.. ధరల పరిమితిపై కేంద్రం పరిశీలన! రాజీనామా తర్వాత ముగ్గురు ఉపాధ్యాయులు ఇప్పుడు సంకల్ప్ అనే పేరుతో వారి సొంత యూట్యూబ్ ఛానెల్‌ని ప్రారంభించారు. ఫిజిక్స్ వాలాపై విమర్శలు చేస్తూ తమ ఛానెల్లో ఓ వీడియో పెట్టారు. తమపై ఆరోపణలు చేయడంపై విరుచుకుపడ్డారు. ఓ దశలో బోరుమంటూ ఏడ్చేశారు. అయితే వీరికి కొంతమంది నెటిజన్లు సానుభూతి తెలపగా ఇదంతా టీవీ నాటకం లాగా ఉందని చాలామంది విమర్శలు చేశారు. ఈ వీడియోను కేవలం ఒక్కరోజులోనే 2.1 మిలియన్ల మంది వీక్షించారు. -
మండపంలోనే బోరున ఏడ్చేసిన వధూవరులు.. వీడియో వైరల్!
పెళ్లి.. పేరుకి రెండు అక్షరాలైన దీని బంధం మాత్రం నూరేళ్లు ఉంటుంది. వివాహం ద్వారా ఇద్దరు వ్యక్తులు.. మూడు ముళ్ల బంధంతో.. నలుగురి సమక్షంలో ఒకటై జీవితాంతం జీవిస్తారు. అందుకే జీవితంలో ఇదొక మధురమైన క్షణంగా భావిస్తుంటారు. అంతటి ప్రత్యేక రోజు కనుకే పెళ్లి మండపంలో ఆనందంతో పాటు కాస్త హడావుడి, కాస్త గందరగోళం వాతావరణం ఉంటుంది. ఇటీవల వివాహ వేదికలపై ఏదో ఒక వింత ఘటనలు జరగడం చూస్తూనే ఉన్నాం. తాజాగా ఓ పెళ్లి వేదికపై మరో వింత ఘటన చోటు చేసుకుంది. ఒకటే ఏడుపు... పెళ్లంటేనే సందడి. బంధు మిత్రుల హడావుడి, మర్యాదలు, ఆత్మీయుల కలయికలు ఇలాంటి వాటితో అక్కడ వాతావరణమంతా పండుగను తలపిస్తుంది. వధూవరుల తరపు కుటుంబ సభ్యులకు ఈ సమయంలో వారి ఆనందాన్ని అవధులు ఉండవు. ఇక కొన్ని సందర్భాల్లో అయితే మాంగళ్య ధారణ జరిగే సమాయానికి వధూవరులు కుటుంబసభ్యుల కళ్లలో ఆనందాన్ని కన్నీళ్ల రూపంలో బయటపెడుతుంటారు. ఇటీవల ఓ పెళ్లిలో.. వధూవరులు ఇద్దరూ వేదికపైనే ఏడ్వడం ప్రారంభించారు. వారిద్దరూ కలిసి ఒకటై జీవితాన్ని ప్రారంభించబోతున్నాం అనే ఆనందం కాస్త కన్నీళ్లుగా మారి బయటపడ్డాయి. ఇద్దరు ఒకరి నొకరు చూసుకుంటూ ఏడ్వడం ఆ వీడియోలో కనిపిస్తోంది. దీనంతటిని వీడియో తీసి నెట్టింట్లో షేర్ చేయడంతో వైరల్‌గా మారింది. రిసెప్షన్ వేదికపై ఉండగానే ఈ ఘటన చోటుచేసుకుంది. View this post on Instagram A post shared by 𝗪𝗲𝗱𝗱𝗶𝗻𝗴_𝗰𝗼𝘂𝗽𝗹𝗲❤ (@wedding_couple_photography_20) -
మా అమ్మ పార్థివ దేహం వద్ద... కరువుదీరా ఏడ్వలేకపోయా
లండన్: బ్రిటన్ రాచ కుటుంబంపై ప్రిన్స్ హ్యారీ (38) విమర్శలు, ఆరోపణల పరంపర కొనసాగుతూనే ఉంది. ప్రేమకు ప్రతిరూపమైన తన తల్లి డయానా చనిపోతే కనీసం కరువుదీరా ఏడవలేకపోయానని మంగళవారం విడుదల కానున్న తన స్వీయచరిత్ర ‘స్పేర్’లో ఆయన వాపోయారు. రాచ కుటుంబపు కఠినమైన నైతిక కట్టుబాట్లే అందుకు కారణమని ఆరోపించారు. ‘‘ఏం జరిగినా ఏడవకూడదన్నది రాజకుటుంబంలో అలిఖిత నియమం. ఇలాంటి వాటిని చిన్నతనం నుంచే రుద్దీ రుద్దీ నా హృదయాన్ని బండబార్చారు. దాంతో మా అమ్మ చనిపోయి అంతులేని శూన్యాన్ని మిగిల్చినా ఆ దుర్భర ఆవేదనను బయట పెట్టే స్వేచ్ఛ కూడా లేకపోయింది. దాన్నంతటినీ గుండెల్లోనే అదిమి పెట్టి మా అమ్మ కడసారి చూపు కోసం భారీగా తరలివచ్చిన అభిమానులను నవ్వుతూ పలకరించాల్సి వచ్చింది. కానీ వారిలో ఎవరితో కరచాలనం చేసినా అరచేతులన్నీ తడితడిగా తగిలాయి. అవన్నీ వారి కన్నీళ్లతో తడిశాయని అర్థమై చాలా సిగ్గుపడ్డా. ఆ వీడియోలను ఇప్పుడు చూసినా సిగ్గేస్తుంటుంది’’ అన్నారు. -
జీవించే హక్కుంది.. ప్రజలను బతకనివ్వండి.. కన్నీరుపెట్టిన ఎంపీ..
సాక్షి, న్యూఢిల్లీ: పశ్చిమ బెంగాల్లో చోటుచేసుకున్న బీర్బమ్ కాల్పుల ఘటన దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తోంది. ఈ ఘటనలో 8 మంది సజీవ దహనం అయ్యారు. తాజాగా ఈ ఘటన పార్లమెంట్లో చర్చనీయాంశంగా మారింది. బీజేపీ ఎంపీ రూపా గంగూలీ ఈ ఘటనపై రాజ్యసభలో మాట్లాడుతూ ఉద్వేగానికిలోనై ఒక్కసారిగా కన్నీరు పెట్టుకున్నారు. జీరో అవర్‌లో భాగంగా ఆమె శుక్రవారం రాజ్యసభలో మాట్లాడుతూ.. బెంగాల్‌ను ఆదుకోవాలని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ క్రమంలో బెంగాల్లో జరిగిన బీర్బమ్ హింస గురించి ప్రస్తావించారు. బెంగాల రాష్ట్రంలో దారుణ హత్యలు జరుగుతున్నాయని ఈ నేపథ్యంలో పశ్చిమ బెంగాల్లో రాష్ట్రపతి పాలన విధించాలని ఆమె డిమాండ్ చేశారు. అక్కడ కేవలం 8 మంది మాత్రమే మరణించారని, ఎక్కువ మంది చనిపోలేదని మమత సర్కార్‌పై పరోక్షంగా విమర్శలు గుప్పించారు. మరోవైపు ఆమె ఈ విషయంపై మాట్లాడుతున్న సమయంలో తృణముల్ కాంగ్రెస్ ఎంపీలు సభలో గందరగోళం సృష్టించారు. అయినప్పటికీ ఆమె మాట్లాడుతూనే అటాప్పీ రిపోర్ట్ ప్రకారం.. చనిపోయిన వారిని మొదట దారుణంగా కొట్టారని ఆ తర్వాత సామూహిక హత్యలు చోటుచేసుకున్నాయని రూపా గంగూలీ ఆరోపించారు. భారత్‌లో బెంగాల్ భాగమని, అక్కడ జీవించే హక్కు ఉందని, మేం బెంగాల్లో పుట్టామని, అక్కడ పుట్టడం తప్పుకాదు అని, మహాకాళి భూమి అని ఆమె ఆవేశంగా మాట్లాడుతూ భావోద్వేగంతో కన్నీరుపెట్టుకున్నారు. అయితే, గత సోమవారం తృణమూల్ కాంగ్రెస్‌కు చెందిన బర్షాల్ గ్రామ పంచాయతీ ఉప ప్రధాన్ భాదు షేక్ హత్య జరిగింది. ఈ ఘటన జరిగిన కొద్దిగంటలకే బోగ్టూయి గ్రామంలో హింస చెలరేగింది. దాదాపు డజను ప్రత్యర్థుల ఇళ్లకు కొందరు వ్యక్తులు నిప్పుపెట్టారు. ఈ ఘటనలో 8మంది సజీవదహనం అయ్యారు. తృణమూల్ బ్లాక్ ప్రెసిడెంట్ అనరుల్ హుస్సేన్ సహా 23మందిని పోలీసులు అరెస్టు చేశారు. మరోవైపు.. బీర్బమ్ సజీవదహనాల కేసులో కోల్కత్తా హైకోర్టు కీలక ఆదేశాలు జారీచేసింది. కేసు విచారణను సీబీఐకి అప్పగిస్తూ శుక్రవారం తీర్పు వెలువరించింది. #WATCH | BJP MP Roopa Ganguly broke down in Rajya Sabha over Birbhum incident, demanded President's rule in West Bengal saying, "Mass killings are happening there, people are fleeing the state... it is no more liveable..." pic.twitter.com/EKQLed8But — ANI (@ANI) March 25, 2022 -
ఆ రోజు ఆటోలో కూర్చోని బాగా ఏడ్చాను: కృతి సనన్
టాలీవుడ్లో ‘వన్.. నేనోక్కడినే’ తో సూపర్ స్టార్ మహేశ్ బాబు సరసన జతకట్టింది కృతి సనన్. ఆ తర్వాత బాలీవుడ్‌కు మాకాం మార్చిన ఈ అమ్మడు అక్కడ బిజీ హీరోయిన్గా మారిపోయింది. బీ టౌన్లో స్టార్ హీరోల సరసన నటిస్తూ ఈ భామ భారీ మొత్తంలోనే రెమ్యూనరేషన్ తీసుకుంటోంది. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో కృతి తాను మోడలింగ్ చేస్తున్నప్పటి విషయాలను పంచుకుంది. తన మొదటి ర్యాంప్ వ్యాక్ షోలో ఏదో పొరపాటు విషయమై కొరియోగ్రాఫర్ తన పట్ల చాలా అసభ్యంగా ప్రవర్తించాడని చెప్పుకొచ్చింది. ఆ షో ముగింపులో దాదాపు 20 మోడళ్ల ముందు ఆ కొరియోగ్రాఫర్ తనని తిట్టాడని చెప్పింది కృతి. ఆ తర్వాత తను ఆటోలో కూర్చుని ఆ విషయాన్ని తలుచుకుని ఏడవటం మొదలుపెట్టి.. అక్కడి నుంచి ఇంటికి వెళ్లి వాళ్ల అమ్మతో చెప్పి బాధపడినట్లు తెలిపింది. దీంతో ఆమె కృతిసనన్‌తో.. ఈ వృత్తిలో నువ్వు రాణించగలవో లేదో నాకు తెలీదు గానీ ముందు నువ్వు మానసికంగా మరింత బలంగా ఉండాలి. నీ మీద నీకు నమ్మకం ఉండాలంటూ ధైర్యం చెప్పిందని అప్పటి విషయాలని గుర్తుచేసుకుంది కృతి. ప్రస్తుతం ఈ అమ్మడు చేతిలో బోలెడు సినిమాలు ఉన్నాయి. ఇటీవలే ఈ నటి బచ్చన్ పాండే షూటింగ్ పూర్తి చేసింది. ఇందులో అక్షయ్ కుమార్ సరసన నటించింది. గణపత్‌లో టైగర్ ష్రాఫ్ సరసన నటిస్తుండగా, వరుణ్ ధావన్‌తో కలిసి నటిస్తున్న ‘భేదియా’ చిత్రం కోసం షూట్ కూడా చేసింది. ‘హమ్ దో హుమారే దో’ లో కూడా నటిస్తోంది. చదవండి: Street Light Movie: పగలంతా పెద్ద మనుషులు, రాత్రి అయితే..? -
నవ్వు మాత్రమే కాదు.. ఏడుపూ మంచిదే.. !
నవ్వినా ఏడ్చినా కన్నీళ్లే వస్తాయన్నాడు మనసు కవి ఆత్రేయ. జైవిక భావోద్వేగాలలో ఏడుపు కూడా ఒకటి. ఎక్కువ ఆనందం లేదా బాధ కలిగినా వెంటనే కళ్ళలోంచి నీళ్లు ఉబికి వస్తుంటాయి. అయితే బాధతో వచ్చే కన్నీళ్లనే ఏడుపు అనడం పరిపాటి. ఏడుపంటే బాధకు చిహ్నం అనుకుంటాం కానీ, ఏడవడం వల్ల కూడా ఎన్నో లాభాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. టెక్నాలజీ ఎంత వేగంగా అభివద్ధి చెందుతుందో మనిషి కూడా అంతేవేగంగా దాన్ని అందిపుచ్చుకునేందుకు ఉవిళ్లూరుతున్నాడు. ఈక్రమంలో ఉరుకులుపరుగుల జీవనంతో తీవ్రమైన ఒత్తిడికి గురవుతున్నాడు. కాస్త స్ట్రెస్‌ను తగ్గించుకునేందుకు వ్యాయామం, లాఫర్ యోగా వంటివి ప్రయత్నించి సేదతీరుతున్నాడు. ఈ క్రమంలో మనిషి ఆరోగ్యానికి నవ్వు ఎంతముఖ్యమో ఏడుపు కూడా అంతే ముఖ్యమని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఏడవడం వల్ల లాభలేంటో చూద్దాం.. ఎక్కువ సమయం మనం దేనిగురించైనా బాధపడుతూ ఏడిస్తే మన మెదడులో ఆక్సిటోసిన్, ఎండార్ఫిన్ అనే ఫీల్ గుడ్ రసాయనాలు విడుదల కావడంతో శారీరక, మానసిక భావోద్వేగాలకు సంబంధించిన మార్పులు కలుగుతాయి. ఈ రసాయనాలతో శరీరానికి నొప్పిని తట్టుకునే సామర్థ్యం పెరుగుతుంది. ఏడవడం వల్ల మెదడు శరీర ఉష్ణోగ్రతలు సంతులితంగా ఉంటాయి. దీంతో మనం సమన్వయంతో ఆలోచించగలుగుతాం ∙అప్పుడప్పుడు ఏడవటం ద్వారా మన బి.పి కూడా కంట్రోల్ అవుతుంది. దీంతో గుండె సంబంధిత సమస్యలు ఏవీ దరిచేరవు. కళ్ల నుంచి నీరు కారడం వల్ల కంటికి అనేక ప్రయోజనాలు ఉన్నాయి. ఇవి మన కళ్లల్లో ఉండే దుమ్ము, మలినాలు బయటకు పోగొడతాయి. కన్నీళ్లలో ఉండే ఐసోజైమ్‌లు .. క్రిములు, బ్యాక్టీరియాల నుంచి కన్నుకు రక్షణ కల్పిస్తాయి. కన్నీళ్లు రావడం వల్ల చెడు ఆలోచనలు దూరం కావడంతోపాటు, మానసిక ప్రశాంతత కలిగి పాజిటివ్ ఆలోచనల వైపు దృష్టి మరులుతుంది. కన్నీళ్లు మూడు రకాలుగా ఉంటాయి. మొదటిది: బాసల్ టియర్స్... నిమిషానికి ఒకటి నుంచి రెండు మైక్రోలీటర్ల వరకు ఉత్పత్తి అయ్యే ఈ కన్నీళ్లు కళ్లను తేమగా ఉంచడంతోపాటు ఇన్ఫెక్షన్ల నుంచి కాపాడతాయి. రెండోది: రెప్లెక్స్ టియర్స్..ఉల్లిపాయలు కోసినప్పుడు, కళ్లల్లో దుమ్మూధూళి పడ్డప్పుడు కళ్ల మంటను తగ్గించడానికి ఉపయోగపడతాయి. మూడోది: ఎమోషనల్ టియర్స్..ఇది ఎక్కువగా భావోద్వేగాలకు గురైనప్పుడు కళ్లనుంచి నీరు ఉబికి వస్తుంది. దీని వల్ల మానసిక ఒత్తిడి దూరమవుతుంది. ఇదండీ కన్నీళ్ల కథ! -
నన్ను సంపేయ్ సారు: ఈ బుడ్డోడు మామూలోడు కాడు
-
నన్ను సంపేయ్ సారు: ఈ బుడ్డోడు మామూలోడు కాడు
చాలా మంది డాక్టర్ దగ్గరకు వెళ్లాలంటే భయపడుతూ ఉంటారు. ఎక్కడ ఇంజక్షన్ చేస్తుంటారో అని. ఇక ఫిజిషియన్ దగ్గరకు వెళ్లి ఏదైనా నొప్పులకు చికిత్స తీసుకోవాలంటే చుక్కలు కనిపించాల్సిందే. డాక్టర్ ఆయింట్మెంట్ రాసి మర్థన చేస్తుంటే రకరకాల రంగులు కళ్లముందు కనిపిస్తాయి. ఇక పెద్ద వాళ్లయితే ఎంతో కొంత ఓపిక పడతారు. కానీ ఈ వీడియోలో కనిపిస్తున్న బుడ్డోడు మాత్రం నొప్పిని తట్టుకోలేక డాక్టర్‌ను బురిడి కొట్టించడానికి రకరకాల ప్రయత్నాలు చేశాడు. డాక్టర్ ఆ పిల్లోడికి చికిత్స చేస్తున్నప్పుడు ఆ పిల్లాడు చేసిన అల్లరి అందరికి నవ్వు తెప్పిస్తోంది. ఒక బుడ్డోడు చేతికి ఫిజిథెరిపీ కోసం డాక్టర్ దగ్గరకు వచ్చాడు. డాక్టర్ ఆ పిల్లాడి చేయి పట్టుకొని ఆయింట్మెంట్ రాస్తూ గట్టిగా రుద్దుతున్నారు. ఆ నొప్పి భరించలేని పిల్లాడు నొప్పి పుడుతుంది సారు, మీ కాళ్లు మోక్కుతా, మీకు పుణ్యముంటుంది అంటూ పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతూ బతిమిలాడుతుంటే పక్కనున్నవారు మాత్రం ఆ పిల్లాడి మాటలు విని పకపక నవ్వుకున్నారు. సంపేయ్ సారు నన్ను సంపేయ్ ఆ పక్కన ఉన్న కత్తెరతో నన్ను సంపేయ్ సారు అని డాక్టర్‌ను అడిగాడు ఆ బుడ్డోడు. మీరందరూ మంచోళ్లు నన్ను విడిచిపెట్టండి సారు అంటూ, నొప్పి ఒకచోట ఉంటే ఉన్న చోట కాకుండా వేరే చోట చెబుతూ డాక్టర్ నుంచి తప్పించుకునే ప్రయత్నం చేశాడు. ఇప్పుడు ఆ వీడియో చూసిన ప్రతి ఒక్కరు ఈ బుడ్డోడు మాములోడు కాదంటూ కామెంట్స్ చేస్తున్నారు. వీడియో చూస్తున్నంత సేపు నవ్వుతూనే ఉంటున్నారు. మీరు కూడా ఆ బుడ్డోడి బాధేంటో ఒకసారి ఈ వీడియోలో చూసేయండి. అంతటితో ఆగకుండా వెళ్లిపోతాడోమో అని బాబుతో పాటు వచ్చిన వ్యక్తి చెయ్యి పట్టుకుంటే ఆగు నువ్వు ఆగు నేను ఎక్కడికి పోను అంటూ అడ్డుగా ఉన్న కాలు తీయమని డాక్టర్‌ను కోరాడు. డాక్టర్ గారు మీరు చాలా మంచి వాళ్లు అంటూ ఆ బాధలోనూ డాక్టర్‌ను పొగుడుతూ మస్క కొట్టించాలని చూశాడు. చదవండి: వైరల్ వీడియో.. స్మూత్‌గా తప్పించాడు -
‘వాడి ఏడుపు వినలేకపోయాను.. అందుకే’
వాషింగ్టన్ : అమ్మా ఆకలి.. అమ్మా కడుపు నొప్పి అంటూ నోరు విప్పి చెప్పలేని పసిప్రాయం. తమకు ఏం జరిగినా ఏడుపు ద్వారానే వెల్లడిస్తారు చిన్నారులు. కానీ ఏడుపే ఆ చిన్నారి పాలిట యమపాశమయ్యింది. ఏడుస్తున్న బిడ్డను సముదాయించాల్సిన తల్లి కాస్తా బిడ్డను కడతేర్చింది. విషాదమేంటంటే ఇంటర్నెట్లో వెతికి మరి బిడ్డను చంపింది ఈ కసాయి తల్లి. ఈ విచారకర సంఘటన అమెరికాలో చోటు చేసుకుంది. అరిజోనా(19) అనే యువతి నెల రోజుల క్రితం ఓ మగబిడ్డకు జన్మనిచ్చింది. కానీ దురదృష్టావశాత్తు ఆ చిన్నారి పుట్టుకతోనే అనారోగ్యంతో జన్మించాడు. దాంతో ఆ పసివాడు ఎప్పుడు ఏడుస్తూనే ఉండేవాడు. అయితే పిల్లాన్ని సముదాయించాల్సిన తల్లి కాస్తా ఆ చిన్నారి ఏడుపు వినలేక బాత్‌టబ్‌లో ముంచి చంపేసింది. అనంతరం ఆ పసివాడి మృతదేహాన్ని ఓ బ్యాగ్‌లో కుక్కి సమీపంలోని పార్క్‌లో వదిలేసి వచ్చింది. తర్వాత ఏం తెలియనట్లు తన బిడ్డను ఎవరో కిడ్నాప్ చేశారంటూ పోలీసులకు ఫోన్ చేసింది. కేసు నమోదు చేసి విచారణ చేపట్టిన పోలీసలకు అరిజోనా మీద అనుమానం రావడంతో నిలదీశారు. అందుకు అరిజోనా తన కుమారుడు జారీ నీళ్లతొట్టిలో పడి చనిపోయాడని బుకాయించింది. కానీ ఆమె సెల్‌ఫోన్ పరిశీలించిన పోలీసులు అరిజోనానే హంతకురాలిగా గుర్తించారు. బిడ్డను చంపడానికి ముందు అరిజోనా ఇంటర్నెట్లో ‘అనుమానం రాకుండా చంపడం ఎలా.. కేసు నుంచి తప్పించుకునే మార్గాలు ఏంటి’ అనే అంశాల గురించి సర్చ్ చేసింది. దాంతో అరిజోనాను అరెస్ట్ చేసి విచారించిగా అసలు విషయం బయటకొచ్చింది. కొడుకు ఏడుపు వినలేక తానే ఆ చిన్నారిని బాత్‌టబ్‌లో ముంచి చంపేసినట్లుగా అరిజోనా నేరం అంగీకరించింది. నా కొడుకుకు సంబంధించి ఏ అచ్చటా.. ముచ్చటా చూడలేదు. ఈ నేరం చేసిన నా భార్యను జీవితాంతం జైలులోనే ఉంచాలి. అప్పుడే ఆమెకు నా బిడ్డ పడిన వేధన అర్థమవుతుంది అంటూ చిన్నారి తండ్రి విలపిస్తున్నాడు. -
బాల్యాన్ని చిదిమేస్తున్నారు..
దేశంలో పసికూనలపై అఘాయిత్యాలకు కశ్మీర్‌లోని కతువా ఘటన ప్రత్యక్ష ఉదాహరణ. జమ్మూకాశ్మీర్‌లోని కతువాలో ఎనిమిదేళ్ళ పసికూనపై జరిగిన అత్యాచారం కానీ, గుజరాత్‌లు తీవ్రమైన గాయాలతో బయటపడ్డ తొమ్మిదేళ్ళ చిన్నారి అత్యాచారం కేసు సహా ఉత్తర ప్రదేశ్, ఒరిస్సాల్లో ఈ మధ్యే వెలుగులోకి వచ్చిన ఇద్దరు చిన్నారుల అత్యాచారం కేసుల నేపథ్యంలో ఇటీవలి కాలంలో మైనర్ బాలికలపై అత్యాచారం కేసులను పరిశీలిస్తే మన దేశంలో మైనర్ బాలికలపై అత్యాచారాలు 500 శాతం పెరిగినట్టు తేలింది. గత పదేళ్ళలో మైనర్ బాలికల మీద అత్యాచారాలు 500 శాతం పెరిగినట్టు చైల్డ్ రైట్స్ అండ్ యు (సిఆర్‌వై) నిర్వహించిన తాజా పరిశోధన తేల్చింది. సిఆర్‌వై సంస్థ నిర్వహించిన ఈ సర్వేలో మన దేశంలో 2006లో 18,967 మంది మైనర్ బాలికలు అత్యాచారాల బారిన పడితే 2016కి వచ్చేసరికి అంటే కేవలం పదేళ్ళలో 106,958 మంది మైనర్ బాలికలపై అత్యాచారాలు జరిగినట్టు తేలింది. ఇందులో 50 శాతానికిపైగా నేరాలు కేవలం ఐదు రాష్ట్రాల్లో నమోదైనవే. ఉత్తర ప్రదేశ్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఢిల్లీ, పశ్చిమబెంగాల్ రాష్ట్రాల్లోనే చిన్నారులపై 50 శాతం అత్యాచార కేసులు నమోదైనట్టు క్రై(సిఆర్‌వై) చిల్డ్రన్ రైట్స్ అండ్ యు అనే సంస్థ వెల్లడించింది. చిన్నారులపై అత్యాచారాల్లో ఉత్తర ప్రదేశ్ ప్రథమ స్థానంలో ఉండడం ఆ రాష్ట్రంలో చిన్నారులకున్న రక్షణని ప్రశ్నార్థకంగా మార్చింది. మైనర్ బాలికలపై అత్యాచారాలు జరిగినట్టు నమోదైన కేసుల్లో 15 శాతం ఉత్తరప్రదేశ్‌లోనూ, మహారాష్ట్రలో 14 శాతం, మధ్యప్రదేశ్‌లో 13శాతం జరిగినట్టు నేర పరిశోధనా గణాంకాలు వెల్లడించాయి. 2016 నేషనల్ క్రైం రికార్డ్స్ బ్యూరో గణాంకాల ప్రకారం 2015తో పోలిస్తే మన దేశంలో చిన్నారులపై నేరాల సంఖ్య 14 శాతం పెరిగింది. అదేవిధంగా దేశంలో 2016 ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రం సెక్సువల్ అఫెన్స్(పోక్సో) యాక్ట్ ప్రకారం పరిశీలిస్తే చిన్నారులపై జరుగుతోన్న నేరాల్లో మూడొంతులు లైంగిక పరమైనవే. ఈ గణాంకాల ప్రకారం మన దేశంలో ప్రతి 15 నిముషాలకు ఒక పసికూన లైంగిక నేరాల బారిన పడుతోంది. గత ఐదేళ్లలోనే చిన్నారులపై లైంగిక నేరాలు 300 శాతం పెరగడం ప్రమాదం తీవ్రతని ప్రతిబింబిస్తోంది. -
వర్మకే ఏడుపొచ్చింది!
వివాదాలకు కేరాఫ్ అడ్రస్‌గా పేరొందిన విలక్షణ దర్శకుడు రాంగోపాల్ వర్మ సైతం ఏడ్చారు. ఈ విషయాన్ని ఆయనే తన ఫేస్బుక్ పేజీలో వెల్లడించారు. తాను పెద్దగా భావోద్వేగాలు కలిగిన వ్యక్తిని కాకపోయినా.. ఒక ఇంటర్వ్యూలో బిగ్ బీ అమితాబ్ బచ్చన్ తన గురించి చెప్పిన విషయాలు చదివి.. కన్నీళ్లపర్యంతమయ్యానని పేర్కొన్నారు. ఆయన విశ్వాసాన్ని నిలబెట్టుకునేస్థాయిలో తాను ఉండాలని ఆశిస్తున్నట్టు పేర్కొన్నారు. అమితాబ్‌తో సుభాష్ కే ఝా ఇటీవల జరిపిన ఓ ఇంటర్వ్యూలోని తన గురించి ఆయన చెప్పిన వివరాలను వర్మ ఫేస్బుక్లో పోస్టు చేశారు. నిత్యం అస్థిరంగా ఉండే వర్మతో మీరు ఎందుకు సినిమాలు చేస్తున్నారంటూ సుభాష్ అడిగిన ప్రశ్నకు అమితాబ్ దీటుగా బదులిచ్చారు. వర్మను ప్రశంసల్లో ముంచెత్తారు. వర్మది అవిశ్రాంతమైన సృజనాత్మకత అని, ఎప్పుడూ కొత్తదనాన్ని చూపేందుకు అవిశ్రాంతంగా ప్రయత్నిస్తూ ఉంటాడని, అతని సృజనాత్మకతలో భాగంగా ఉండటం అదృష్టంగా, ఒక చాలెంజ్‌గా భావిస్తానంటూ బిగ్ బీ కొనియాడారు. -
మాకు దిక్కెవరు బిడ్డా..
♦ కోలుకోని రాంసింగ్ తండా అంతా నిర్మానుష్యం ♦ పెళ్ళయిన ఇంట చావు డప్పులు ♦ బాధిత కుటుంబాల్లో ఆర్తనాదాలు ♦ దేవుడు కనికరం చూపలేదని శాంతిబాయి రోదన ♦ అమ్మేదంటూ అమాయకంగా అడుగుతున్న చిన్నారులు ‘దేవుడా మాకిదే గోస... మాపై కని కరం లేదెందుకు?... మా ఇంట్లోళ్లం దరిని తీసుకుపోయినవు.. ఈ తండా కు మా నాయన పేరే పెట్టుకున్నం... మా కుటుంబానికే ఇంత అన్యాయం చేస్తావా?... అంటూ రాంసింగ్ తండాకు చెందిన దన్జీరాం భార్య శాంతిబాయి రోదించిన తీరు అందరిని కలిచివేసింది. ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు మృత్యువాత పడడంతో శాంతిబాయి తల్లడిల్లిపోయింది. భర్త,కొడుకు, కూతు రు, ఇద్దరు మరుదులను కోల్పో యి దుఃఖసాగరంలో మునిగిపోయింది. ఘటనను తలచుకుంటూ కన్నీరుమున్నీరైంది. - కంగ్టి కంగ్టి: దెగుల్‌వాడి దేవ్లా తండా ఘటన నింపిన విషాదం నుంచి ఇంకా రాంసింగ్ తండా కోలుకోలేదు. మూడు రోజులైనా ఇంకా విషాదఛాయలు వీడలేదు. తండా మొత్తం మూగబోయింది. ఆదివారం వివాహ తంతును పూర్తిచేసుకుని ఆనందంతో ఇంటికి బయలు దేరిన పెళ్లి బృందం మరో ఐదు నిమిషాల్లో పచ్చని పందిరికి చేరుకుంటామనేలోపు ఘోరం జరిగిపోయింది. విద్యుత్ వైర్లు లారీని తగలడంతో విద్యుదాఘాతానికి ఏడుగురు అక్కడిక్కడే ప్రాణాలు వదిలిన విషయం తెల్సిందే. పెళ్లయిన పది గంటల్లోపే తండాలో పెడబొబ్బలు, చావు డప్పులు మోగడం ప్రతిఒక్కరిని తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. పెళ్లిబృందం లారీకి విద్యుత్ తీగలు తగలడంతో చోటుచేసుకున్న ఘటనలో ఏడుగురు ప్రాణాలు విడిచారు. అందులో చౌకన్పల్లి రాంసింగ్ తండాకు చెందిన ఆరుగురు మృత్యువాత పడ్డారు. అందులో ఐదుగురు ఒకే కుటుంబానికి చెందిన వారుండడం అందరిని కలిచివేసింది. తమ తండ్రి పేరుతో ఉన్న రాంసింగ్‌తండాలో తమ కుటుంబానికే ఇంతటి అన్యాయం ఎందుకు జరిగిందంటూ నూతన వరుడు శివాజీ తల్లి, దన్జీరాం భార్య శాంతిబాయి రోదించింది. భగవాన్ హమాపర్ థోడాభీ ఛాయాభీ రకాడోకోని (దేవుడికైనా మాపై కనికరం ఎందుకు రాలేదు) అంటూ పెడబొబ్బులు పెట్టింది. హమ్కూ జీవా?(తామెలా బతకాలి?), బగర్వాలి వసరేర్ ఛోరి ఛిచాబర్(అనాథలుగా మిగిలిన పిల్లలు), ఏ య్యాడీ కన్నాఅయిచ్చీ(అమ్మా... ఎప్పుడోస్తావూ..) రోదించింది. షాక్ నుంచి తేరుకోని వధూవరులు... దన్జీరాంతోపాటు ఆ కుటుంబానికి చెందిన నలుగురు మృత్యువాత పడడంతో ఇంటిల్లిపాదిని అనాథలను చేసింది. దన్జీరాంతోపాటు సోదరులు రాములు, వినోద్, కొడుకు శ్రీను, కూతురు కిస్సీబాయి ప్రాణాలు కోల్పోయారు. అదే తండాకు చెందిన రవి అలియాస్ లవ్ మరణించాడు. ఈ ఘటనతో నూతన వధూవరులు అర్చన, శివాజీ ఇంకా ఆ షాక్ నుంచి తేరుకోలేదు. సోదరుడి పెళ్లికోసం వచ్చి.. కిస్సీబాయి కర్ణాటక నుంచి సోదరుడు శివాజీ పెళ్లి కోసం వచ్చి ఊహించని రీతిలో ప్రాణాలు విడిచింది. పెద్దవడ్గాంకు చెందిన దేవ్యాతో కిస్సీబాయికి తొమ్మిదేళ్ల క్రితం వివాహం జరిగింది. వలస జీవులుగా జీవితాన్ని గడుపుతున్న వీరిలో పెను విషాదం చోటుచేసుకొంది. వీరికి అస్సీబాయి(8), సోనాబాయి(6), జగ్రాం(4), రాధా(2) పిల్లలున్నారు. ఈ ఘటనలో తల్లి ప్రాణాలు కోల్పోవడంతో అమాయక కూతురు సోనాబాయి తల్లి శవం ముందు నిలబడి చేతులు చాచి... ‘ఏ య్యాడీ క న్నాఆయిచ్ఛీ’ అంటూ ఏడ్వడంతో అక్కడున్న వారిని కలిచివేసింది. వరుడి బాబాయిల మృత్యువాత... బతుకుదెరువు కోసం పట్నం బాట పట్టి గప్‌చుప్‌లు అమ్ముకొంటూ జీవనం సాగిస్తున్న వరుడు శివాజీ బాబాయిలు రాములు, వినోద్‌లు కూడా మృత్యువాత పడ్డారు. వీరు పెళ్లికి రెండ్రోజుల ముందే రాంసింగ్ తండాకు చేరుకున్నారు. మూడో రోజే విద్యుదాఘాతానికి బలయ్యారు. రాములుకు భార్య మరోనిబాయి, కూతురు పూజ, కుమారులు యువరాజ్(8వ త రగతి), సచిన్ (ఆరోతరగతి) ఉన్నారు. వినోద్‌కు భార్య సోనాబాయి, కూతురు పవిత్ర(5 నెలలు), కుమారుడు కార్తీక్(3) ఉన్నారు. భర్త వినోద్‌ను కోల్పోయిన సోనాబాయి రోదనలు మిన్నంటాయి. దన్జీరాం కుటుంబంలో మిగిలింది వీరే... దన్జీరాంతోపాటు ఆయన కుమారుడు శ్రీను, కూతురు కిస్సీబాయి, ఇద్దరు సోదరులు రాములు, వినోద్ మరణించారు. అయితే ఈ కుటుంబంలో దన్జీరాం భార్య శాంతిబాయి, ముగ్గురు కుమారులు సంతోష్, అశోక్, శివాజీ, కూతురు పూలీబాయి మాత్రమే మిగిలారు. నిశ్చితార్థం రోజే రవి అంత్యక్రియలు.. ఇదే తండాకు చెందిన బాబూసింగ్ కుమారుడు రవి(లవ్)కి నిశ్చితార్థం జరగాల్సిన రోజే అంత్యక్రియలు జరపాల్సి వచ్చింది. సోమవారం నిశ్చితార్థం జరగాల్సి ఉన్నందున శివాజీ పెళ్లికి వెళ్లొద్దని వారించినా వినలేదు. సాయంత్రం వరకు వస్తానని రవి తన తండ్రికి నచ్చజెప్పి వెళ్లాడు. అంతలోనే తిరిగిరాని లోకాలకు చేరుకున్నాడు. రవికి ఐదుగురు అన్నలు, ఒక తమ్ముడు ఉన్నారు. పెళ్లి పీటలు ఎక్కాల్సిన సమయంలో.. ఖేడ్ మండలం హంగిర్గా(కే) శ్యామాతండాకు చెందిన అశోక్ కు ఈ మధ్యే నిశ్చితార్థమైంది. పెళ్లి పీటలు ఎక్కాల్సిన వాడు మమ్మల్ని వదిలిపోయాడని తల్లిదండ్రులు రోదిస్తున్నారు. -
ఏడ్చినా సంతోషంగా ఉండొచ్చట!
లండన్: ఏదైనా విషయంలో బాధ కలిగి ఏడవాలినిపిస్తే వెంటనే ఏడ్చేయండి. అంతేకానీ బాధను దిగమింగుకుని మనసులో దాచుకుంటే అది మరింత ఎక్కువవుతుంది. అయితే మనసారా కన్నీళ్లు పెట్టుకోవడం వల్ల ఆ బాధ నుంచి త్వరగా బయటపడొచ్చని, అనంతరం మనసు ప్రశాంతంగా ఉంటుందని తాజా అధ్యయనంలో వెల్లడైంది. నెదర్లాండ్స్‌కు చెందిన టిల్బర్గ్ యూనివర్సిటీ నిపుణులు 60 మందిపై అధ్యయనం జరిపి ఈ విషయాలు వెల్లడించారు. దీనిలో భాగంగా పరిశోధనలో పాల్గొన్న వారికి బాధకలిగించే చిత్రాలను 90 నిమిషాలపాటు ప్రదర్శించారు. వీరిలో ఆ చిత్రాలను చూస్తూ 28 మంది వెంటనే ఏడ్చేశారు. మరో 32 మంది మాత్రం కన్నీళ్లు పెట్టుకోకుండా లోలోపలే బాధపడ్డారు. చిత్రాలు చూసిన అనంతరం ఏడ్చిన వారి మూడ్ మారిపోగా, ఏడవకుండా ఉన్న వారి మూడ్‌లో ఎలాంటి మార్పూ లేకపోవడాన్ని శాస్త్రవేత్తలు గుర్తించారు. సినిమా చూడకముందు ఎలాంటి ఆనందమైన మూడ్‌లో ఉన్నారో ఏడ్చినవారు అదే మూడ్‌కు చేరుకోగా, ఏడ్వని వారు మాత్రం తిరిగి ఆ స్థితికి రావడానికి కొంచెం సమయం తీసుకున్నారు. ఈ పరిశోధనను బట్టి ఏదైనా బాధ కలిగితే వెంటనే ఏడ్వడం ద్వారా తిరిగి మామూలు స్థితికి రావొచ్చని, లేకుంటే దాని ప్రభావం ఎక్కువ సేపు ఉంటుందని పరిశోధకులు తెలిపారు. -
'ఢిల్లీలో ప్రతిరోజు 14 మంది పిల్లలు మాయం'
దేశ రాజధాని ఢిల్లీలో సగటున ఒకరోజులో 14 మంది పిల్లలు మాయమవుతున్నట్టు చైల్డ్ రిలీఫ్ అండ్ యూ (సీఆర్ వై) వెల్లడించింది. 2012 సంవత్సరంలో 4086, 2011లో 5004, 2011 లో 2161 మంది పిల్లలు కనిపించకుండా పోయినట్టు తెలిపారు. పిల్లలు తప్పి పోయినట్టు కేసు నమోదు చేసినా పోలీసు అధికారులు సరిగా స్పందించడలేదని.. ఎప్పుడైనా..ఎవరైనా పిల్లలు తప్పిపోయనట్టు సమాచారం అందిస్తే.. తగు చర్యలు తీసుకోవాలని నేషనల్ కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్ (ఎన్ సీపీసీఆర్) సభ్యురాలు నైనా నాయక్ సూచించారు. పిల్లలను వెతకడానికి కుటుంబ సభ్యులు అందించిన సమాచారాని కేసు దర్యాప్తుకు వినియోగించుకోవాలని నైనా తెలిపారు. తప్పిపోయినట్టు ఇచ్చిన సమాచారంపై వివిధ శాఖల్లో వివిధ రకాలుగా గణాంకాలు ఉన్నాయని.. జోనల్ ఇంటిగ్రేటెడ్ పోలీస్ నెట్ వర్క్, నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో (ఎన్ సీఆర్ బీ) మధ్య సరియైన అవగాహన లేదని.. ఆమె తెలిపారు. పిల్లల సంరక్షణపై అధికారుల వద్ద సరియైన ప్రణాళిక లేదని అన్నారు. గతంలో పిల్లలు తప్పిపోయారని పలువురు తల్లితండ్రులు ఫిర్యాదు చేసినా.. పోలీసు అధికారులు స్పందించకపోగా, లంచం ఇవ్వాలని డిమాండ్ చేశారని నైనా తెలిపింది.