చాలా మంది డాక్టర్ దగ్గరకు వెళ్లాలంటే భయపడుతూ ఉంటారు. ఎక్కడ ఇంజక్షన్ చేస్తుంటారో అని. ఇక ఫిజిషియన్ దగ్గరకు వెళ్లి ఏదైనా నొప్పులకు చికిత్స తీసుకోవాలంటే చుక్కలు కనిపించాల్సిందే. డాక్టర్ ఆయింట్‌మెంట్ రాసి మర్థన చేస్తుంటే రకరకాల రంగులు కళ్లముందు కనిపిస్తాయి. ఇక పెద్ద వాళ్లయితే ఎంతో కొంత ఓపిక పడతారు. కానీ ఈ వీడియోలో కనిపిస్తున్న బుడ్డోడు మాత్రం నొప్పిని తట్టుకోలేక డాక్టర్‌ను బురిడి కొట్టించడానికి రకరకాల ప్రయత్నాలు చేశాడు. డాక్టర్ ఆ పిల్లోడికి చికిత్స చేస్తున్నప్పుడు ఆ పిల్లాడు చేసిన అల్లరి అందరికి నవ్వు తెప్పిస్తోంది. ఒక బుడ్డోడు చేతికి ఫిజిథెరిపీ కోసం డాక్టర్ దగ్గరకు వచ్చాడు. డాక్టర్ ఆ పిల్లాడి చేయి పట్టుకొని ఆయింట్‌మెంట్ రాస్తూ గట్టిగా రుద్దుతున్నారు.