వర్మకే ఏడుపొచ్చింది!
వర్మకే ఏడుపొచ్చింది!
Published Mon, Mar 13 2017 8:10 PM | Last Updated on Tue, Sep 5 2017 5:59 AM
వివాదాలకు కేరాఫ్ అడ్రస్‌గా పేరొందిన విలక్షణ దర్శకుడు రాంగోపాల్ వర్మ సైతం ఏడ్చారు. ఈ విషయాన్ని ఆయనే తన ఫేస్‌బుక్ పేజీలో వెల్లడించారు. తాను పెద్దగా భావోద్వేగాలు కలిగిన వ్యక్తిని కాకపోయినా.. ఒక ఇంటర్వ్యూలో బిగ్ బీ అమితాబ్ బచ్చన్ తన గురించి చెప్పిన విషయాలు చదివి.. కన్నీళ్లపర్యంతమయ్యానని పేర్కొన్నారు.
ఆయన విశ్వాసాన్ని నిలబెట్టుకునేస్థాయిలో తాను ఉండాలని ఆశిస్తున్నట్టు పేర్కొన్నారు. అమితాబ్‌తో సుభాష్ కే ఝా ఇటీవల జరిపిన ఓ ఇంటర్వ్యూలోని తన గురించి ఆయన చెప్పిన వివరాలను వర్మ ఫేస్‌బుక్‌లో పోస్టు చేశారు. నిత్యం అస్థిరంగా ఉండే వర్మతో మీరు ఎందుకు సినిమాలు చేస్తున్నారంటూ సుభాష్ అడిగిన ప్రశ్నకు అమితాబ్ దీటుగా బదులిచ్చారు. వర్మను ప్రశంసల్లో ముంచెత్తారు. వర్మది అవిశ్రాంతమైన సృజనాత్మకత అని, ఎప్పుడూ కొత్తదనాన్ని చూపేందుకు అవిశ్రాంతంగా ప్రయత్నిస్తూ ఉంటాడని, అతని సృజనాత్మకతలో భాగంగా ఉండటం అదృష్టంగా, ఒక చాలెంజ్‌గా భావిస్తానంటూ బిగ్ బీ కొనియాడారు.
Advertisement
Advertisement