నన్ను సంపేయ్‌ సారు‌: ఈ బుడ్డోడు మామూలోడు కాడు | A Boy Funny conversation With Doctor Telugu | Sakshi
Sakshi News home page

నన్ను సంపేయ్‌ సారు, సంపేయ్‌: ఈ బుడ్డోడు మామూలోడు కాడు

Published Fri, Sep 18 2020 3:13 PM | Last Updated on Sat, Sep 19 2020 1:22 PM

A Boy Funny conversation With Doctor Telugu - Sakshi

చాలా మంది డాక్టర్‌  దగ్గరకు వెళ్లాలంటే భయపడుతూ ఉంటారు. ఎక్కడ ఇంజక్షన్‌ చేస్తుంటారో అని. ఇక ఫిజిషియన్‌ దగ్గరకు వెళ్లి ఏదైనా  నొప్పులకు చికిత్స తీసుకోవాలంటే చుక్కలు కనిపించాల్సిందే. డాక్టర్‌ ఆయింట్‌మెంట్‌ రాసి మర్థన చేస్తుంటే రకరకాల రంగులు కళ్లముందు కనిపిస్తాయి. ఇక పెద్ద వాళ్లయితే ఎంతో కొంత ఓపిక పడతారు. కానీ ఈ వీడియోలో కనిపిస్తున్న బుడ్డోడు మాత్రం నొప్పిని తట్టుకోలేక డాక్టర్‌ను బురిడి కొట్టించడానికి రకరకాల ప్రయత్నాలు చేశాడు. డాక్టర్‌ ఆ పిల్లోడికి చికిత్స చేస్తున్నప్పుడు ఆ పిల్లాడు చేసిన అల్లరి అందరికి నవ్వు తెప్పిస్తోంది. ఒక బుడ్డోడు చేతికి ఫిజిథెరిపీ కోసం డాక్టర్‌  దగ్గరకు వచ్చాడు. డాక్టర్‌ ఆ పిల్లాడి చేయి పట్టుకొని ఆయింట్‌మెంట్‌ రాస్తూ గట్టిగా రుద్దుతున్నారు.

ఆ నొప్పి భరించలేని  పిల్లాడు నొప్పి పుడుతుంది సారు,  మీ కాళ్లు మోక్కుతా, మీకు పుణ్యముంటుంది అంటూ పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతూ బతిమిలాడుతుంటే పక్కనున్నవారు మాత్రం ఆ పిల్లాడి మాటలు విని పకపక నవ్వుకున్నారు. సంపేయ్‌ సారు నన్ను సంపేయ్‌ ఆ పక్కన ఉన్న కత్తెరతో నన్ను సంపేయ్‌ సారు అని డాక్టర్‌ను అడిగాడు ఆ బుడ్డోడు. మీరందరూ మంచోళ్లు నన్ను విడిచిపెట్టండి సారు అంటూ, నొప్పి ఒకచోట ఉంటే ఉన్న చోట కాకుండా వేరే చోట చెబుతూ డాక్టర్‌ నుంచి తప్పించుకునే ప్రయత్నం  చేశాడు. ఇప్పుడు ఆ వీడియో చూసిన ప్రతి ఒక్కరు ఈ బుడ్డోడు మాములోడు కాదంటూ కామెంట్స్‌ చేస్తున్నారు. వీడియో చూస్తున్నంత సేపు నవ్వుతూనే ఉంటున్నారు. మీరు కూడా ఆ బుడ్డోడి బాధేంటో ఒకసారి ఈ వీడియోలో చూసేయండి. అంతటితో ఆగకుండా వెళ్లిపోతాడోమో అని బాబుతో పాటు వచ్చిన వ్యక్తి చెయ్యి పట్టుకుంటే ఆగు నువ్వు ఆగు నేను ఎక్కడికి పోను అంటూ అడ్డుగా ఉన్న కాలు తీయమని డాక్టర్‌ను కోరాడు. డాక్టర్‌ గారు మీరు చాలా మంచి వాళ్లు అంటూ ఆ బాధలోనూ డాక్టర్‌ను పొగుడుతూ మస్క కొట్టించాలని చూశాడు. 

చదవండి: వైరల్‌ వీడియో.. స్మూత్‌గా తప్పించాడు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement