లండన్: బ్రిటన్ రాచ కుటుంబంపై ప్రిన్స్ హ్యారీ (38) విమర్శలు, ఆరోపణల పరంపర కొనసాగుతూనే ఉంది. ప్రేమకు ప్రతిరూపమైన తన తల్లి డయానా చనిపోతే కనీసం కరువుదీరా ఏడవలేకపోయానని మంగళవారం విడుదల కానున్న తన స్వీయచరిత్ర ‘స్పేర్’లో ఆయన వాపోయారు. రాచ కుటుంబపు కఠినమైన నైతిక కట్టుబాట్లే అందుకు కారణమని ఆరోపించారు. ‘‘ఏం జరిగినా ఏడవకూడదన్నది రాజకుటుంబంలో అలిఖిత నియమం. ఇలాంటి వాటిని చిన్నతనం నుంచే రుద్దీ రుద్దీ నా హృదయాన్ని బండబార్చారు.
దాంతో మా అమ్మ చనిపోయి అంతులేని శూన్యాన్ని మిగిల్చినా ఆ దుర్భర ఆవేదనను బయట పెట్టే స్వేచ్ఛ కూడా లేకపోయింది. దాన్నంతటినీ గుండెల్లోనే అదిమి పెట్టి మా అమ్మ కడసారి చూపు కోసం భారీగా తరలివచ్చిన అభిమానులను నవ్వుతూ పలకరించాల్సి వచ్చింది. కానీ వారిలో ఎవరితో కరచాలనం చేసినా అరచేతులన్నీ తడితడిగా తగిలాయి. అవన్నీ వారి కన్నీళ్లతో తడిశాయని అర్థమై చాలా సిగ్గుపడ్డా. ఆ వీడియోలను ఇప్పుడు చూసినా సిగ్గేస్తుంటుంది’’ అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment