British royal family
-
హ్యారీకి రాజకుటుంబం.. పుట్టినరోజు శుభాకాంక్షలు
బ్రిటన్ యువరాజు హ్యారీకి బ్రిటన్ రాజ కుటుంబం జన్మదిన శుభాకాంక్షలు తెలిపింది. ఆదివారం ఆయన 40వ జన్మదినం సందర్భంగా బర్త్ డే కేక్ ఎమోజీతో మెరిసిపోతున్న హ్యారీ ఫోటోను పంచుకుంది. ‘‘డ్యూక్ ఆఫ్ ససెక్స్‌కు 40 వ పుట్టినరోజు శుభాకాంక్షలు’’క్యాప్షన్‌ను జత చేసింది. ప్రిన్స్, ప్రిన్సెస్ ఆఫ్ వేల్స్ కూడా ఈ ఫొటోను షేర్ చేస్తూ శుభాకాంక్షలు తెలిపారు. 2021 తరువాత రాజకుటుంబం ఖాతా నుంచి హ్యారీకి వచి్చన మొట్టమొదటి బహిరంగ పుట్టినరోజు సందేశం ఇది. డ్యూక్ అండ్ డచెస్ ఆఫ్ ససెక్స్ 2020 జనవరిలో రాయల్ డ్యూటీలను వదులుకుంటున్నట్లు ప్రకటించారు. ఆర్థికంగా స్వతంత్రంగా జీవించేందుకు వీలుగా రాజకుటుంబం క్రియాశీలక విధుల నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటించారు. కాలిఫోరి్నయాలోని శాంటా బార్బరా సమీపంలోని మాంటెసిటోలో నివాసం ఉంటున్నారు. నెట్‌ఫ్లిక్స్, స్పాటిఫై సంస్థలతో ఒప్పందాలు కుదుర్చుకున్నారు. – లండన్ -
కోర్టు బోనులో నిలబడనున్న బ్రిటన్ రాకుమారుడు.. 130 ఏళ్లలో తొలిసారి!
లండన్: బ్రిటన్ రాజు చార్లెజ్-III రెండో కుమారుడు ప్రిన్స్ హ్యారీ కోర్టు ఎదుట హాజరుకానున్నారు. ఓ వార్తా సంస్థపై హ్యారీతోపాటు ఇతర ప్రముఖులు వేసిన కేసు విచారణలో భాగంగా లండన్ హైకోర్టులో బోనులో(విట్నెస్ బాక్స్) నిలబడి సాక్ష్యం చెప్పనున్నారు. దీంతో 1890 నుంచి గత 130 సంవత్సరాల్లో కోర్టులో సాక్ష్యం చెప్పిన తొలి బ్రిటన్ రాజకుటుంబీకుడిగా హ్యారీనే కావడం విశేషం. కాగా ప్రిన్స్ హ్యారీతోపాటు సినిమా, క్రీడా రంగానికి చెందిన దాదాపు 100 మందికిపైగా ప్రముఖులు బ్రిటిష్‌కు చెందిన మిర్రర్ గ్రూప్ న్యూస్ పేపర్స్‌పై లండన్ కోర్టులో దావా వేశారు.జర్నలిస్టులు, వారు నియమించిన ప్రైవేట్ ఇన్వెస్టిగేటర్లు భారీ స్థాయిలో ఫోన్ హ్యాకింగ్‌కు పాల్పడ్డారని, మోసపూరితంగా వ్యక్తిగత వివరాలను పొందడంతోపాటు ఇతర అక్రమ చర్యలకు పాల్పడ్డారని ఆరోపిస్తూ కోర్టులో కేసు ఫైల్ చేశారు. 1991 నుంచి 2011 వరకు సదరు పత్రిక విస్తృతంగా చట్టవిరుద్ధమైన కార్యకలాపాలకు పాల్పడిందని పిటిషన్లో పేర్కొన్నారు. దీనిపై మే 10న విచారణ ప్రారంభం అయ్యింది. ఇందులో భాగంగా సోమవారం నుంచి మూడు రోజులపాటు తన నిర్ధిష్ట కేసు విచారణలో భాగంగా హ్యారీ సాక్ష్యం ఇవ్వనున్నారు. అయితే 1870లో విడాకుల కేసులో ఎడ్వర్డ్ VII కోర్టుకు సాక్షిగా హాజరయ్యారు. అనంతరం 20 ఏళ్లకు కార్డ్ గేమ్‌పై కేసు విచారణలో మరోసారి కోర్టుకు హాజరయ్యారు. అయితే ఈ రెండు ఆయన రాజు కావడానికి ముందే జరిగాయి. అప్పటి నుంచి ఇప్పటి వరకు బ్రిటన్ రాజకుటుంబానికి చెందిన వ్యక్తి కోర్టుకు హాజరై సాక్ష్యం చెప్పడం ఇదే తొలిసారి. చదవండి: పాకిస్తాన్, చైనాతో పోలిస్తే ఆ విషయంలో భారత్ చాలా బెటర్.. -
నా భార్యకు రాజకుటుంబం క్షమాపణ చెప్పాలి
లండన్: బ్రిటన్ రాజకుటుంబం నుంచి క్షమాపణకు తన భార్య మేఘన్ మెర్కెల్ అర్హురాలని ఆమె భర్త ప్రిన్స్ హ్యారీ తేల్చిచెప్పారు. తన భార్యను మానసికంగా వేధింపులకు గురిచేశారని, ఆమెకు క్షమాపణ చెప్పాలని రాజకుటుంబాన్ని డిమాండ్ చేశారు. ఆయన తాజాగా డెయిలీ టెలిగ్రాఫ్ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు అంశాలను ప్రస్తావించారు. బ్రిటిష్ మీడియా తన భార్య మెర్కెల్‌ను అనవసరంగా ట్రోల్ చేస్తోందని విమర్శించారు. తన వదిన కేట్ మిడిల్టన్ పట్ల జనంలో సానుకూలత పెంచాలన్నదే మీడియా యత్నమని ఆరోపించారు. రాజకుటుంబాన్ని ముక్కలు చేయాలన్న ఉద్దేశం తనకు లేదన్నారు. రెండు పుస్తకాలకు సరిపడా సమాచారం తన వద్ద ఉందని, అదంతా బయటపెట్టి తన తండ్రిని, సోదరుడిని ఇబ్బంది పెట్టాలని తాను కోరుకోవడం లేదని చెప్పారు. తనకు, తండ్రికి, సోదరుడికి మధ్య జరిగిన విషయాలన్నీ బయటపెడితే వారు తనను ఎప్పటికీ క్షమించబోరని అన్నారు. తండ్రి, సోదరుడు తన పట్ల దారుణంగా వ్యవహరించారని, అయినప్పటికీ వారిని క్షమించడానికి సిద్ధంగా ఉన్నానని వెల్లడించారు. వారితో కూర్చొని మాట్లాడాలని అనుకుంటున్నట్లు తెలిపారు. తాను వారి నుంచి కేవలం జవాబుదారీతనం, తన భార్యకు క్షమాపణను మాత్రమే కోరుకుంటున్నానని ప్రిన్స్ హ్యారీ స్పష్టం చేశారు. ఆయన ఇటీవలే తన ఆత్మకథ ‘స్పేర్’ను విడుదల చేశారు. ఇందులో పలు సంచలన విషయాలను బయటపెట్టారు. రాజకుటుంబంలో తనకు ఎదురైన చాలా అవమానాలను ‘స్పేర్’ పుస్తకంలో చేర్చలేదని ప్రిన్స్ హ్యారీ చెప్పారు. -
మా అమ్మ పార్థివ దేహం వద్ద... కరువుదీరా ఏడ్వలేకపోయా
లండన్: బ్రిటన్ రాచ కుటుంబంపై ప్రిన్స్ హ్యారీ (38) విమర్శలు, ఆరోపణల పరంపర కొనసాగుతూనే ఉంది. ప్రేమకు ప్రతిరూపమైన తన తల్లి డయానా చనిపోతే కనీసం కరువుదీరా ఏడవలేకపోయానని మంగళవారం విడుదల కానున్న తన స్వీయచరిత్ర ‘స్పేర్’లో ఆయన వాపోయారు. రాచ కుటుంబపు కఠినమైన నైతిక కట్టుబాట్లే అందుకు కారణమని ఆరోపించారు. ‘‘ఏం జరిగినా ఏడవకూడదన్నది రాజకుటుంబంలో అలిఖిత నియమం. ఇలాంటి వాటిని చిన్నతనం నుంచే రుద్దీ రుద్దీ నా హృదయాన్ని బండబార్చారు. దాంతో మా అమ్మ చనిపోయి అంతులేని శూన్యాన్ని మిగిల్చినా ఆ దుర్భర ఆవేదనను బయట పెట్టే స్వేచ్ఛ కూడా లేకపోయింది. దాన్నంతటినీ గుండెల్లోనే అదిమి పెట్టి మా అమ్మ కడసారి చూపు కోసం భారీగా తరలివచ్చిన అభిమానులను నవ్వుతూ పలకరించాల్సి వచ్చింది. కానీ వారిలో ఎవరితో కరచాలనం చేసినా అరచేతులన్నీ తడితడిగా తగిలాయి. అవన్నీ వారి కన్నీళ్లతో తడిశాయని అర్థమై చాలా సిగ్గుపడ్డా. ఆ వీడియోలను ఇప్పుడు చూసినా సిగ్గేస్తుంటుంది’’ అన్నారు. -
డ్రగ్స్ తీసుకున్నా: హ్యారీ
లండన్: బ్రిటన్ రాచ కుటుంబంపై రాజు చార్లెస్–2 చిన్న కుమారుడు ప్రిన్స్ హ్యారీ సంచలన ఆరోపణల పరంపర కొనసాగుతూనే ఉంది. అన్న ప్రిన్స్ విలియంతో తన బంధం ఎప్పుడూ సమస్యాత్మకంగానే సాగిందంటూ త్వరలో విడుదలవనున్న తన ఆత్మకథలో బయట పెట్టారాయన. ‘‘2021లో ఒకసారి మేమిద్దరం మా నాన్న సమక్షంలోనే తలపడ్డాం. మీరిలా కొట్టుకుని నా చివరి రోజులను దుర్భరంగా మార్చకండంటూ ఆయన మమ్మల్ని విడదీశాడు’’ అని వివరించారు. ‘‘రాచ కుటుంబీకుల పెళ్లిళ్లు జరిగే వెస్ట్‌మినిస్టర్ అబేలోని సెయింట్ పాల్స్ కెథడ్రెల్లో మెగన్, నేను ఒక్కటయ్యేందుకు కూడా విలియం ఒప్పుకోలేదు’’ అన్నారు. రాచరికపు జీవితపు ఒత్తిడిని తట్టుకోలేకు ఒక దశలో డ్రగ్స్‌కు అలవాటు పడ్డట్టు చెప్పారు! ‘‘17 ఏళ్ల వయసులో తొలిసారిగా కొకైన్ వాడా. అంత థ్రిల్లింగ్‌గా ఏమీ అన్పించలేదు. తర్వాత ఎలన్ కాలేజీలో చదువుతున్న సమయంలో బాత్రూంలో గంజా తాగాను. కాలిఫోర్నియాకు వెళ్లినప్పుడు మ్యాజిక్ మష్రూమ్స్ వంటివి టేస్ట్ చేశా. 17 ఏళ్లప్పుడే వయసులో నాకంటే పెద్దావిడతో తొలి లైంగికానుభవం రుచి చూశా’’ అని వివరించారు. ‘‘12 ఏళ్ల వయసులో నా తల్లి డయానాను ప్రమాదంలో కోల్పోవడం బాధించింది. నిద్ర పోతున్న నన్ను లేపి నాన్న ఆ వార్త చెప్పారు. కానీ కనీసం నన్ను దగ్గరికి కూడా తీసుకుని ఓదార్చలేదు. మరణించిన నా తల్లితో ఎలాగైనా మాట్లాడేందుకు ‘శక్తులున్న’ ఒక మహిళను ఆశ్రయించా’’ అని చెప్పుకొచ్చారు. కెమిల్లాను పెళ్లి చేసుకోవాలని తండ్రి భావించినప్పుడు వద్దని తాను, విలియం బతిమాలామన్నారు. హ్యారీ బయట పెట్టిన ఈ అంశాలపై వ్యాఖ్యానించేందుకు రాజ కుటుంబం తిరస్కరించింది. -
ప్రముఖ నటితో నిద్రించానని చెప్తే రూ.50 లక్షలు ఇస్తామని ఆఫర్!
Simon Rex: ప్రిన్స్ హ్యారీతో వివాహమయ్యాక బ్రిటన్ రాచకుంటుంబంలో జాతి వివక్షను ఎదుర్కొంది నటి మేఘన్ మార్కెల్. వివాహం తరువాత రాచకుటుంబంలోకి వెళ్లిన తనకు ఆదరణ కన్నా అవమానాలే ఎక్కువ ఎదురయ్యాయి. దీనికితోడు బ్రిటన్‌లోని ఓ వర్గం మీడియా కూడా ఈ జంటకు వ్యతిరేకంగా కథనాలు ప్రసారం చేసింది. దీంతో మానసిక వేదనను భరించలేక ఒకానొక సమయంలో ఆత్మహత్య కూడా చేసుకోవాలనుకున్నానని గతంలో ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది మేఘన్. అయితే పెళ్లికి ముందు కూడా ఆమెను దెబ్బ కొట్టడానికి ప్రయత్నించినట్లు తెలుస్తోంది. ప్రిన్స్ హ్యారీని పెళ్లాడటానికి ముందు ఆమె ప్రతిష్టను దెబ్బతీయడానికి బ్రిటన్‌లోని ఓ వర్గం మీడియా దిగజారి ప్రవర్తించిందని నటుడు సిమన్ రెక్స్ వెల్లడించాడు. ఆమెతో ఒక రాత్రంతా ఉన్నట్లు చెప్తే రూ.50 లక్షలు ఇస్తామని ఆఫర్ చేశారని తెలిపాడు. నిజానికి తనకు ఆ సమయంలో డబ్బులు చాలా అవసరం ఉన్నాయని, కానీ అందుకోసం ఇలాంటి తప్పుడు ప్రచారం చేయలేనని సదరు ఆఫర్‌ను తిరస్కరించినట్లు పేర్కొన్నాడు. చదవండి: The Kashmir Files: అప్పుడే వంద కోట్లు, అవాక్కవుతున్న బాలీవుడ్! ఈ విషయం తెలుసుకున్న మేఘన్.. 'ఇంకా మంచి మనుషులు ఉన్నారని తెలిసినందుకు సంతోషంగా ఉంది' అంటూ అతడికి కృతజ్ఞతలు తెలుపుతూ ఒక లేఖ పంపిందట. దాన్ని ఫ్రేమ్ కట్టించుకుని ఇప్పటికీ ఇంట్లో భద్రంగా దాచుకున్నానని చెప్పాడు సిమన్. కాగా మేఘన్, సిమన్ 2005లో వచ్చిన కట్స్ బ్యాక్ సిరీస్‌లో ఒక్క ఎపిసోడ్‌లోనే కలిసి నటించారు. నటిగా విశేషాదరణ సంపాదించుకున్న మేఘన్ 2018లో ప్రిన్స్ హ్యారీని పెళ్లి చేసుకున్నాక సినిమాలకు గుడ్‌బై చెప్పింది. ఆ తర్వాత కుటుంబంతో విభేదాల కారణంగా ప్రిన్స్ హ్యారీ దంపతులు రాజకుటుంబం నుంచి బయటకు వచ్చేసిన విషయం తెలిసిందే! వీరికి కొడుకు ఆర్చీ, కూతురు లిల్లీ డయానా సంతానం. చదవండి: వ్యాపారవేత్తకు కారు అమ్మిన స్టార్ హీరోయిన్! -
ఆత్మహత్య చేసుకోవాలనుకున్నా
-
ఆత్మహత్య చేసుకోవాలనుకున్నా
లాస్ ఏంజెలిస్/లండన్: ప్రిన్స్ హ్యారీతో వివాహమయ్యాక బ్రిటన్ రాచకుటుంబంలో ఎన్నో కష్టాలు, అవమానాలు, బాధలను అనుభవించానని ఆఫ్రికన్ అమెరికన్ నటి మేఘన్ మార్కెల్ వెల్లడించారు. చాలా ఒంటరితనం అనుభవించానని, తన మానసిక వేదనకు పరిష్కారం లేదనిపించిందని, ఒకానొక సమయంలో ఆత్మహత్య చేసుకోవాలని కూడా ఆలోచించానని వెల్లడించారు. ఇక జీవించాలనుకోవడం లేదని హ్యారీతో కూడా చెప్పానన్నారు. ఈ విషయంలో వైద్య సహాయం పొందేందుకు కూడా అవకాశం కల్పించలేదని, దానివల్ల రాజకుటుంబ పరువుప్రతిష్టలకు భంగం కలుగుతుందని చెప్పారని ఆవేదన వ్యక్తం చేశారు. ఒక చాట్ షోలో పలు సంచలన విషయాలను ఆమె ప్రఖ్యాత అమెరికన్ టీవీ హోస్ట్ ఓప్రా విన్ఫ్రేతో పంచుకున్నారు. అమెరికాలో సీబీఎస్ నెట్వర్క్ చానల్లో ఆదివారం ఆ కార్యక్రమం ప్రసారమైంది. కుటుంబంతో విభేదాల కారణంగా గత సంవత్సరం మార్చిలో ప్రిన్స్ హ్యారీ దంపతులు, తమ ఏడాది కుమారుడు ఆర్చీతో కలిసి రాజకుటుంబం నుంచి బయటకు వచ్చేశారు. కాలిఫోర్నియాలో నివాసం ఉంటున్నారు. ఓప్రా విన్ఫ్రే కార్యక్రమంలో మేఘన్ భర్త ప్రిన్స్ హ్యారీ కూడా పాల్గొని, పలు రాచకుటుంబ రహస్యాలను వెల్లడించారు. వివాహం తరువాత కొత్తగా రాచకుటుంబంలోకి వెళ్లిన తనకు కొద్ది రోజుల తరువాత ఆదరణ కన్నా అవమానాలే ఎక్కువ ఎదురయ్యాయని మేఘన్ తెలిపారు. గర్భవతిగా ఉన్నప్పుడు ఊహించని స్థాయిలో దారుణమైన వివక్షను ఎదుర్కొన్నానన్నారు. నలుపురంగులో పుడితే ఎలా..? ‘పుట్టబోయే చిన్నారి రంగు గురించి రాచకుటుంబం మాట్లాడుకుంది. నేను నలుపు కనుక బిడ్డ కూడా నలుపు రంగులోనే పుడితే ఎలా?’అని వారు ఆలోచించారని తెలిపారు. పుట్టబోయే బిడ్డకు రాజకుటుంబం నుంచి లభించే ‘ప్రిన్స్’హోదా ఇవ్వకూడదని నిర్ణయించారని, అందువల్ల రాజకుటుంబ సభ్యులకు లభించే భద్రత కూడా అందదని తేల్చేశారని వివరించారు. ఈ విషయాలను హ్యారీ తనతో పంచుకున్నారని, వాటిని జీర్ణించుకోవడం తమకు కొన్నాళ్ల పాటు సాధ్యం కాలేదని తెలిపారు. అయితే, బిడ్డ రంగు గురించిన వ్యాఖ్యలు ఎవరు చేశారన్న విషయాన్ని మేఘన్ వెల్లడించలేదు. వారి పేరు చెబితే.. వారి ప్రతిష్టకు భారీగా భంగం కలుగుతుందని వ్యాఖ్యానించారు. ఆ విషయమై తనతో రాజకుటుంబ సభ్యులు జరిపిన సంభాషణను తాను కూడా బయట పెట్టాలనుకోవడం లేదని హ్యారీ కూడా స్పష్టం చేశారు. కుటుంబం నుంచి దూరంగా వచ్చేసిన తరువాత తన ఫోన్ కాల్స్‌ను కూడా తన తండ్రి ప్రిన్స్ చార్లెస్ స్వీకరించలేదని హ్యారీ తెలిపారు. అంతకుముందు, నానమ్మ ఎలిజబెత్ రాణితో మూడు సార్లు, తండ్రి ప్రిన్స్ చార్లెస్‌తో రెండు సార్లు మాత్రం మాట్లాడానన్నారు. ‘నా కుటుంబం కోసం ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది. ఇలాంటి పరిస్థితి రావడం బాధాకరమే. కానీ తప్పదు. నేను, నా భార్య మేఘన్, కుమారుడు ఆర్చీల మానసిక ఆరోగ్యం కోసం రాజ కుటుంబానికి దూరం కావాలన్న నిర్ణయం తీసుకున్నాను’అని హ్యారీ వివరించారు. అవన్నీ అవాస్తవాలు.. బకింగ్హమ్ ప్యాలెస్ నుంచి బయటకు వచ్చిన తరువాత ఆర్థికంగా చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నానని, రాజకుటుంబం నుంచి డబ్బులు రావడం ఆగిపోయిందని హ్యారీ వివరించారు. ఆ సమయంలో తన తల్లి ప్రిన్సెస్ డయానా తన కోసం దాచిన ఆస్తులే తమను ఆదుకున్నాయన్నారు. తమ వివాహం తరువాత రాజకుటుంబం తనకు, తన భర్తకు సరైన భద్రతను కూడా కల్పించలేదని మేఘన్ ఆరోపించారు. రాయల్ వెడ్డింగ్ సందర్భంగా ఫ్లవర్ గర్ల్ డ్రెసెస్ విషయంలో తన తోటి కోడలు, ప్రిన్స్ విలియం భార్య, డచెస్ ఆఫ్ కేంబ్రిడ్జ్ కేథరిన్(కేట్) మిడిల్టన్ తన కారణంగా కన్నీళ్లు పెట్టుకున్నారన్న వార్తలను ఓప్రా విన్ఫ్రే ప్రస్తావించగా.. అవన్నీ అవాస్తవాలని మేఘన్ తెలిపారు. ‘నిజానికి జరిగింది వేరే. ఆ ఘటనతో నేనే ఏడ్చాను. ఆ తరువాత కేట్ నన్ను క్షమాపణలు కూడా కోరింది’అని వెల్లడించారు. ‘నిజానికి రాయల్ వెడ్డింగ్‌కు మూడు రోజుల ముందే మాకు వివాహం జరిగింది. అది మాకు మాత్రమే ప్రత్యేకమైన ప్రైవేట్ విషయం’అని మేఘన్ పేర్కొన్నారు. వివాహమైన మొదట్లో బాగానే చూసుకున్నారని, ఆ తరువాతే వారిలో మార్పు వచ్చిందని మేఘన్ వివరించారు. ‘మొదట్లో నేనేం చేయాలో, ఎలా ప్రవర్తించాలో కూడా నాకు అర్థమయ్యేది కాదు’అన్నారు. ఎలిజబెత్ రాణితో తనకు ఇప్పటికీ సత్సంబంధాలు ఉన్నాయని, ప్రిన్స్ ఫిలిప్ ఇటీవల అస్వస్థతకు గురైనప్పుడు ఆమెకు ఫోన్ చేసి మాట్లాడానని వివరించారు. ‘రాజకుటుంబ క్రియాశీల బాధ్యతల నుంచి తప్పుకుని ఎలిజబెత్ రాణిని బాధపెట్టారా?, ఆమెకు చెప్పకుండా ఆ నిర్ణయం తీసుకున్నారా?’అన్న ప్రశ్నకు.. ఈ విషయమై నానమ్మకు, తనకు మధ్య పలుమార్లు చర్చ జరిగిందని హ్యారీ వెల్లడించారు. నానమ్మ అంటే తనకు ఎంతో గౌరవమన్నారు. పాప పుట్టబోతోంది రెండో సంతానంగా తమకు పాప పుట్టబోతోందని ప్రిన్స్ హ్యారీ, మేఘన్‌లు వెల్లడించారు. ‘ఫస్ట్ కుమారుడు. ఇప్పుడు పాప. ఇంతకన్నా ఏం కావాలి? మేం నలుగురం. మాతో పాటు రెండు కుక్కలు. ఇదే మా కుటుంబం’అని హ్యారీ ఆనందంగా వివరించారు. టాక్‌షోలో ఓప్రా విన్ఫ్రే మొదట మేఘన్‌తో కాసేపు మాట్లాడిన తరువాత, వారితో హ్యారీ జతకలిశారు. -
ఆయన 20 కోట్లు వదులుకుంటారా!?
బ్రిటీష్ రాచరిక వ్యవస్థ నుంచి తప్పుకొని ఆర్థికంగా స్వతంత్రంగా బతకాలని నిర్ణయించుకున్నట్లు ప్రకటించిన ప్రిన్స్ హ్యారీ దంపతులు అందుకు కట్టుబడి జీవిస్తారా? అన్న సంశయం ఇప్పుడు ప్రిన్స్ విలియమ్స్ దగ్గరి నుంచి సామాన్య మానవుడి వరకు కలుగుతోంది. ఇప్పటి వరకు హ్యారీ దంపతుల కోసం ఏటా 8.3 కోట్ల రూపాయలను, వారి ప్రయాణాలకు 5.5 కోట్ల రూపాయలను, వారి వసతులకు 16.5 కోట్ల రూపాయలను ఎస్టేట్ చెల్లిస్తోంది. అంటే ఏటా వారికి 20 కోట్ల రూపాయలపైనే ఖర్చు అవుతోంది. ఇవి కాకుండా దుస్తులు, ఇతర అవసరాల కోసం చేస్తే ఖర్చులు కూడా రాచరిక వ్యవస్థ నుంచే వస్తాయి. ఇదంతా కూడా బ్రిటీష్ పౌరులు పన్నుల పేరిట రాచరిక వ్యవస్థకు చెల్లిస్తున్న సొమ్మే. (చదవండి: ప్రిన్స్ హ్యారీ, మేఘన్ ఉండే బంగ్లా ఇదే!) ప్రిన్స్ హ్యారీ దంపతులు ఆర్థికంగా స్వతంత్రంగా బతకడం అంటే ఈ సొమ్మును పూర్తిగా వదులు కోవాల్సి ఉంటోంది. ఆ దేశ పౌరులు ప్రిన్స్ హ్యారీ దంపతుల నిర్ణయాన్ని ప్రశంసిస్తూ ప్రజల పన్ను డబ్బులను వదులుకోవాలని కోరుతున్నారు. ప్రిన్స్ విలియమ్స్ మాత్రం హ్యారీ దంపతులకు నచ్చచెప్పేందుకు ఇప్పటికీ ప్రయత్నిస్తున్నారు. రాచరిక హోదాను వదులు కోవడం వల్ల హ్యారీ తల్లి డయానా, కారు ప్రమాదంలో అకాల మరణం పాలయ్యిందని కూడా హెచ్చరిస్తున్నారు. ఇంటి నుంచి వెళ్లిపోయి తల్లి చేసిన తప్పు చేయరాదంటూ నచ్చ చెబుతున్నారు. అన్నా వదినల కారణంగా రాచరిక కుటుంబానికి హ్యారీ దంపతులు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నారుకానీ, డబ్బులు తెచ్చే హోదాకు దూరంగా ఉండాలని కాదని హ్యారీ సన్నిహితులు చెబుతున్నారు. హ్యారీ రాచరిక పదవులను వదులుకుంటున్నట్లు చెప్పారుకానీ, రాచరిక హోదాను కాదని వారంటున్నారు. చదవండి: తప్పంతా మేఘన్ మీదకు నెడుతున్నారు.. -
ప్రిన్స్ హ్యారీ, మేఘన్ ఉండే బంగ్లా ఇదే!
బ్రిటీష్ రాచరిక కుటుంబం జీవితం నుంచి విడిపోయి తాము స్వతంత్రంగా బతకాలని నిర్ణయించుకున్నట్లు ప్రిన్స్ హ్యారీ, ఆయన భార్య మేఘన్ మార్కే ప్రకటించి సంచలనం సష్టించిన విషయం తెల్సిందే. హ్యారీ దంపతులు తమ కుమారుడితో కలిసి క్రిస్మస్, నూతన సంవత్సర వేడుకలను బ్రిటీష్ కొలంబియాలోని విక్టోరియాలో నీటి ఒడ్డునున్న ప్యాలెస్ లాంటి బంగ్లాలో గడిపారు. ఇక ముందు జీవితం ఆ బంగ్లాలోనే గడపాలని నిర్ణయించుకున్నట్లు తెల్సింది. దాదాపు 18 మిలియన్ డాలర్లు విలువచేసే ఆ బంగ్లాను వారు రష్యాకు చెందిన ఓ బిలియనీర్ నుంచి కొనుగోలు చేసినట్లు తెల్సింది. ఈ విషయాన్ని ధ్రువీకరించడానికి హ్యారీ దంపతులు, వారి ప్రతినిధి నిరాకరించారు. ఆ రష్యా వ్యాపారి కంట్రీ క్లబ్లో షేర్ హోల్డర్ అవడం వల్ల కంట్రీ క్లబ్ పేరుతో ఆ భవనాన్ని విక్రయించినట్లు తెలుస్తోంది. బ్రిటన్‌లో కొత్త చట్టం ప్రకారం ఆస్తులు అమ్మినప్పుడు కచ్చితంగా దాని వెల ఎంతో ప్రకటించి అంత మొత్తానికి పన్ను చెల్లించాలి. ఆ పన్నును తప్పించుకునేందుకే రష్యా వ్యాపారి కంట్రీ క్లబ్ ద్వారా ఆ భవనాన్ని విక్రయించినట్లు తెలుస్తోంది. మొత్తం 11,416 చదరపు అడుగులు విస్తీర్ణం కలిగిన ప్రధాన బంగ్లాలో ఐదు బెడ్ రూమ్‌లు, ఎనిమిది బాత్ రూమ్‌లు, ఓ హాలు, కిచెన్ ఉన్నాయి. దానికి వెలుపల అతిథుల కోసం 2,349 చదరపు అడుగుల విస్తీర్ణంలో మూడు బెడ్ రూమ్‌లు, రెండు బాత్ రూములు గల చిన్న భవనం ఒకటి ఉంది. చదవండి: తప్పంతా మేఘన్ మీదకు నెడుతున్నారు.. -
తప్పంతా మేఘన్ మీదకు నెడుతున్నారు..
ఇరాన్లో యుద్ధ మేఘాలు. ఇండియాలో పౌరసత్వ నిరసనలు. అగ్రరాజ్యాల్లో పర్యావరణ ఉద్యమాలు. ఒక్కోదేశం ఒక్కో సమస్యతో సతమతమౌతోందిప్పుడు. బ్రిటన్ ప్రజలు మాత్రం వీటన్నిటికీ భిన్నమైన ఒక హటాత్పరిణామంతో నివ్వెర పోయి రెండు రోజులుగా రాజప్రాసాదం వైపే చూస్తున్నారు. మనవడు ప్రిన్స్ హ్యారీ తన నానమ్మ క్వీన్ ఎలిజబెత్‌తో ఓ మాటైనా చెప్పకుండా భార్యతో కలిసి ఇంట్లోంచి బయటికి వెళ్లిపోతున్నట్లు ప్రకటించడమే ఇందుకు కారణం. స్వాతంత్య్రం కోసం ఎన్నో దేశాలు బ్రిటన్‌పై పోరాడి స్వేచ్ఛను సాధించుకు న్నట్లే.. స్వతంత్రంగా జీవించడం కోసం ప్రిన్స్ హ్యారీ.. రాయల్ ఫ్యామిలీ నుంచి వెళ్లిపోతున్నారా?! ఊరంతా తెలిశాక మనకు తెలిసే విషయం ఒకటి ఉంటుంది. మన ఇంటి విషయం! అబ్బాయి బయటేదో ఘనకార్యం చేసి ఉంటాడు. కాలనీ అంతా తెలిశాకే మనకు తెలుస్తుంది. అమ్మాయి ఎవర్నో ప్రేమిస్తుంటుంది. పొరుగూళ్లో బంధువులందరికీ తెలిశాకే, ఆ కబురు మన ఊళ్లో బస్ దిగి, మన ఇంటికి వస్తుంది. నమ్మకం మనకు మన అబ్బాయి మీద, అమ్మాయి మీద. ఆ నమ్మకాన్ని నమ్మకంగా ఉంచడానికి కావచ్చు.. తెలిసినవాళ్లు, తెలియనివాళ్లు విషయాన్ని దాచి ఉంచీ ఉంచీ ఇక చెప్పకపోతే నమ్మకద్రోహం చేసినట్లవుతుందని మనకు చెప్పేస్తుంటారు. ఇళ్లన్నీ ఒక్కటే. రాజుగారి ఇల్లయినా, పేదవాడి ఇల్లయినా! మనుషులంతా ఒక్కటే. గ్రేట్ బ్రిటన్‌లో ఉన్నా, పూర్ కంట్రీలో ఉన్నా! అందుకే.. మనవడు హ్యారీ, అతడి భార్య.. ఇల్లొదిలి వెళ్లిపోతున్నారనే విషయం అందరికీ తెలిశాక ఆఖర్న గానీ ఎలిజబెత్ రాణిగారికి తెలియలేదు. అప్పట్నుంచీ ఆమె మనసు మనసులో లేదు. నేనేం తక్కువ చేశాను అని ఆమె విలపిస్తున్నారు తప్పితే, వాళ్లేం ఎక్కువ కోరుకుంటున్నారోనని ఆలోచించడానికి కూడా ఆమెకు మనస్కరించడం లేదు. వెళ్లిపోతున్నారు.. వెళ్లిపోతున్నారు.. ఇదే ఆమె హృదయాన్ని పిండేస్తోంది. బుధవారం సాయంత్రం వరకు అంతా ప్రశాంతంగానే ఉంది. క్రిస్మస్ వేడుకల కోసం వారం ముందే శాండ్రింగ్ హామ్ ఎస్టేట్‌కి వెళ్లిన రాణిగారు మూడు వారాలు గడిచిపోతున్నా అక్కడే ఉండిపోడానికి కారణాలు ఏమైనా.. ఇప్పుడామె హుటాహుటిన బకింగ్‌హామ్ రాజప్రాసాదానికి తిరిగి వచ్చే ఏర్పాట్లలో ఉన్నారు. రాయల్ ఫ్యామిలీలోంచి వెళ్లిపోవాలని మనవడు హ్యారీ, అతడి భార్య కలిసి తీసుకున్న నిర్ణయంగా బ్రిటన్ పత్రికల్లో వస్తున్న వార్తలు.. తిరుగు ముఖానికి ఆమెను తొందర పెడుతున్నాయి. ‘కనీసం వాళ్లు రాణిగారికి చెప్పనైనా లేదు’ (దే డిడిన్ట్ ఈవెన్ టెల్ ద క్వీన్) అని ‘డైలీ మిర్రర్’ తన మొదటి పేజీ నిండా పెట్టిన హెడ్డింగ్ ఆమెను మరింతగా బాధిస్తుండవచ్చు. ప్యాలెస్ తలుపులు తెరుచుకోగానే గుమ్మం ముందు పడి కనిపించే అనేక తుంటరి పత్రికల్లో అదీ ఒకటి. ఈ భార్యాభర్తలిద్దరూ తాము ఇల్లొదిలి వెళ్లిపోతున్నట్లు రాణిగారికి మాట మాత్రంగానైనా చెప్పకపోవడం నిజమే. పైగా ఆ విషయాన్ని వాళ్లు తామిద్దరూ కొత్తగా ప్రారంభించిన వెబ్సైట్ లో బహిరంగ పరచడం ఆ వృద్ధ ప్రాణాన్ని మరింత అలసటకు గురి చేసినట్లు కనిపిస్తోంది. ‘హ్యారీ మొన్న క్రిస్మస్కి కూడా పొడిపొడిగానే మాట్లాడాడు. అది కూడా ఫోన్లో. అప్పుడైనా నేను అతడి అంతరంగాన్ని గ్రహించ వలసింది’’ అని రాణిగారు పొడి బారుతున్న గొంతుతో అన్నట్లు.. ఎప్పుడూ ఆమెను కనిపెట్టుకుని ఉండే వ్యక్తిగత సంరక్షకులు ఒకరు.. తనను పట్టి పీడిస్తున్న మీడియా ప్రతినిధులకు తప్పనిసరై వెల్లడించారు. భార్య మేఘన్ మార్కెల్‌తో ప్రిన్స్ హ్యారీ ‘‘మా కాళ్లపై మేము నిలబడాలని భావిస్తున్నాం. స్వతంత్రంగా జీవించాలని అనుకుంటున్నాం. మాకొక గుర్తింపు కోసం ఆశపడుతున్నాం. మేము బయటికి రావడం వల్ల రాచ కుటుంబం నుంచి వారసత్వంగా మాకు సంక్రమించవలసిన వాటన్నిటినీ కోల్పోతామని తెలుసు. అయినా అందుకు సిద్ధపడుతున్నాం’’ అని ప్రిన్స్ హ్యారీ, మేఘన్ కలసి చేసిన ఆ ప్రకటన ఎలిజబెత్ రాణి మనసులోనే కాదు, బ్రిటన్ ప్రజల్లోనూ కలవరం రేపుతోంది. ‘కలిసి ఉన్న ఒక గొప్ప కుటుంబం ముక్కలు కాబోతోందే! ఈ విలయాన్ని, విపత్తును నివారించలేకపోతున్నామే.. ఎలా దేవుడా..’ అని ఆ కుటుంబాన్ని తరతరాలుగా అభిమానించే వారు విలవిలలాడుతున్నారు. వారిలో కొందరైతే తమ మనసులో ఉన్న దానిని ఏమాత్రం దాచుకునే ప్రయత్నం చేయడం లేదు. ‘‘ఈ దుస్థితికి మూల కారణం హ్యారీ భార్య మేఘన్. ఆ మహాతల్లి వల్లే ఇదంతా జరుగుతోంది. హ్యారీ భార్యా విధేయుడైపోయి, కుటుంబాన్ని కాదనుకున్నాడు. కనీసం రాణి గారికి కూడా చెప్పి చేయడం లేదంటే ఏమనుకోవాలి?’’ అని తప్పంతా మేఘన్ మీదకు నెడుతున్నారు. ఇంట్లోంచి వెళ్లిపోవాలని నిర్ణయించుకోవడం తప్పయినా ఒప్పయినా.. ఇంటికి పెద్దయిన రాణిగారికి చెప్పకపోవడం మాత్రం తప్పే. ప్రస్తుతం రాణిగారు, రాణిగారి భర్త; రాణిగారి కొడుకు, కూతురు; కొడుకు సంతానం, కూతురి సంతానం; వారి జీవిత భాగస్వాములు; వారి సంతానంలో కొందరు.. మొత్తం 24 మంది ‘రాయల్’ టైటిల్ ఉన్నవాళ్లున్నారు. మిగతా ఇంకా ఉన్నారు కానీ, వాళ్లంతా టైటిల్స్ లేనివాళ్లు. ఇప్పుడు బయటికి వెళ్లిపోతున్న హ్యారీ, మేఘన్ సొంతంగా బతకడం కోసం రాయల్ టైటిల్‌ని కూడా వదులుకోబోతున్నారు. బ్రిటన్‌లోని విండ్సర్‌లో ఫ్రాగ్మోర్ కాటేజ్ హ్యారీ పేరు మీద ఉంది. దాన్ని మాత్రం ఉంచుకుంటారు. అప్పుడప్పుడు అక్కడికి వచ్చి పోతుండటానికి. ఇకనుంచీ ఈ దంపతులు ఉండటమైతే బ్రిటన్ కాదు. కెనడా. 2018 మే లో హ్యారీ, మేఘన్‌ల వివాహం జరిగింది. వారికిప్పుడు ఎనిమిది నెలల కొడుకు. పేరు మౌంట్‌బ్యాటన్. సింహాసనాన్ని అధిష్టించే వారసత్వపు వరసలో అతడిది ఏడవ స్థానం. అంతఃపురంలో తమ స్థానాలన్నిటినీ వదులుకుని వెళ్తున్న ప్రిన్స్ హ్యారీ దంపతులకు ఆ కుటుంబ సభ్యుల హృదయాలలో మాత్రం స్థానం ఎప్పటికీ ఉంటుంది. అది కాదనుకున్నా పోయేది కాదు. కాదని వెళ్లిపోయినా విడిచి పెట్టేదీ కాదు. గతంలో! కింగ్ ఎడ్వర్డ్ VIII వాలిస్ సింప్సన్‌తో ఎనిమిదవ ఎడ్వర్డ్ ఇప్పుడు ప్రిన్స్ హ్యారీ బయటికి వెళ్తున్నట్లే.. బ్రిటన్ రాజ కుటుంబపు పూర్వీకుడైన ఎనిమిదవ ఎడ్వర్డ్ మహారాజు కూడా తను ప్రేమించిన యువతి కోసం ప్యాలెస్‌ను వదులుకున్నవారే! ప్యాలెస్‌తో పాటు తన సింహాసనాన్ని కూడా! అమెరికన్ వితంతువు అయిన వాలిస్ సింప్సన్‌ను ప్రేమించిన ఎడ్వర్డ్.. ఆమెను పెళ్లి చేసుకోవడానికి అడ్డుగా ఉన్నందుకు కిరీటాన్ని సైతం కాదనుకున్నారు. ‘‘నేనీ భారాన్ని మోయలేకపోతున్నాను. నేను ప్రేమించిన వ్యక్తి సహాయం, సహకారం లేకుండా ఈ రాజ్యాధికారానికి న్యాయం చేకూర్చలేను’’ అని రాజైన కొద్ది నెలలకే బహిరంగంగా ప్రకటించి పక్కకు తప్పుకున్నారు. ఆ మర్నాడే ఎడ్వర్డ్ తమ్ముడు ప్రిన్స్ ఆల్బర్ట్ బ్రిటన్‌కు రాజయ్యాడు. ప్రిన్స్ ఫిలిప్ ఎలిజబెత్ (ప్రస్తుత రాణి)తో ప్రిన్స్ ఫిలిప్ రెండవ ఎలిజబెత్ రాణి (హ్యారీ నానమ్మ) భర్త ఫిలిప్‌ది కూడా ఇలాంటి పరిత్యాగ ప్రేమ కథే. అయితే రివర్స్‌లో. అతడిది గ్రీసు, డెన్మార్క్‌ల రాచ కుటుంబం. ఎలిజబెత్‌ను చేసుకోవడం కోసం తన సొంత రాజ్యాన్ని వదులుకుని బ్రిటన్ కుటుంబంలో సభ్యుడు అయ్యారు. -
బ్రిటన్ రాజ దంపతుల ‘న్యూక్లియర్ బాంబు’ ట్విటర్ గగ్గోలు
లండన్ బ్రిటన్ ప్రిన్స్ హ్యారీ రాజ దంపతులు సంచలన నిర్ణయం తీసుకున్నారు. సీనియర్ రాయల్స్ హోదా నుంచి తప్పుకోవాలని నిర్ణయించారు. ఈ మేరకు ప్రిన్స్ హ్యారీ, ఆయన భార్య మేఘన్ బ్రిటన్ రాణి ఎలిజబెత్‌కు ఓ లేఖ రాశారు. సుదీర్ఘంగా చర్చించిన తర్వాతే ఈ నిర్ణయం తీసుకున్నామనీ, తాము నార్త్ అమెరికాకు వెళ్లి ఆర్థికంగా స్వతంత్రంగా జీవించాలనుకుంటున్నామని తెలిపారు. ఈ మేరకు హ్యారీ భార్య మేఘన్ ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక పోస్ట్ పెట్టారు. విరామం కోసం ఆరు వారాల పాటు కెనడా వెళ్లి తిరిగి వచ్చిన జంటఈ ప్రకటన చేయడం విశేషం డ్యూక్ అండ్ డచెస్ ఆఫ్ సస్సెక్స్ ప్రిన్స్ హ్యారీ, అతని భార్య మేఘన్ నిర్ణయంపై సోషల్‌మీడియాలో దుమారం రేగింది. ఎవరితో సంప్రదించకుండా, ఆకస్మికంగా నిర్ణయం తీసుకున్నారనీ, తద్వారా బ్రిటిష్ రాజ కుటుంబంలో గందరగోళాన్ని సృష్టిస్తున్నారని ట్విటర్లో, ఇన్‌స్టాగ్రామ్‌లో వ్యాఖ్యానించారు. గతరాత్రి వారిద్దరూ న్యూక్లియర్ బాంబు పేల్చారని మరొకరు కమెంట్ చేశారు. వారు ఆర్థికంగా నిలదొక్కుకోవాలని ఆశిస్తున్నాను. అయినా...వారు భరించగలరా ట్వీట్లు, హాస్యోక్తులు, వ్యంగ్యచిత్రాల వరద పారుతోంది. మరోవైపు ఇది రాచకుటుంబానికి చెందినవ్యవహారమని బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ పేర్కొన్నారు. కాగా గతేడాది బ్రిటీష్ రాచకుటుంబంలో ఏర్పడిన విభేదాలే దీనికి కారణమని అభిప్రాయం ప్రధానంగా వినిపిస్తోంది. ప్రిన్స్ హ్యారీ దంపతులు రాచకుటుంబంలో పెద్దలను ఎవర్నీ సంప్రదించకుండానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు బకింగ్‌హామ్ ప్యాలెస్ పేర్కొంది. ఈ పరిణామంపట్ల క్వీన్ఎలిజబెత్, ప్రిన్స్ చార్లెస్ నిరాశకు గురైనట్లు తెలుస్తోంది. హ్యారీ ప్రకటనపై స్పందించిన బ్రిటన్ రాణి ఎలిజబెత్-2..ఇది చాలా కఠినతరమైన సమస్యన్నారు. స్వతంత్రంగా జీవించాలనే వారి కోరికను అర్ధం చేసుకున్నానని..కానీ దీనిపై నిర్ణయం తీసుకునేందుకు సమయం పడుతుందని పేర్కొన్నారు. View this post on Instagram “After many months of reflection and internal discussions, we have chosen to make a transition this year in starting to carve out a progressive new role within this institution. We intend to step back as ‘senior’ members of the Royal Family and work to become financially independent, while continuing to fully support Her Majesty The Queen. It is with your encouragement, particularly over the last few years, that we feel prepared to make this adjustment. We now plan to balance our time between the United Kingdom and North America, continuing to honour our duty to The Queen, the Commonwealth, and our patronages. This geographic balance will enable us to raise our son with an appreciation for the royal tradition into which he was born, while also providing our family with the space to focus on the next chapter, including the launch of our new charitable entity. We look forward to sharing the full details of this exciting next step in due course, as we continue to collaborate with Her Majesty The Queen, The Prince of Wales, The Duke of Cambridge and all relevant parties. Until then, please accept our deepest thanks for your continued support.” - The Duke and Duchess of Sussex For more information, please visit sussexroyal.com (link in bio) Image © PA A post shared by The Duke and Duchess of Sussex (@sussexroyal) on Jan 8, 2020 at 10:33am PST -
రాయల్ వెడ్డింగ్‌లో మేఘన్‌కు లోటు...
లాస్ ఏంజెల్స్ : బ్రిటన్ రాకుమారుడు ప్రిన్స్ హ్యారీ, హాలీవుడ్ నటి మేఘన్ మార్కెల్‌ల వివాహం జరగనున్న విషయం తెలిసిందే. ఇరు కుటుంబాలకు ఎంతో ప్రత్యేకమైన ఈ వేడుకలో మేఘన్‌ను మాత్రం ఓ లోటు వెంటాడనుంది. ఈ నెల(మే) 19న లండన్‌లో అత్యంత వైభవంగా జరిగే పెళ్లి వేడుకకు మేఘన్ తండ్రి థామస్ మార్కెల్ హాజరుకావడం లేదని ఓ వెబ్సైట్ పేర్కొంది. గత వారం గుండె నొప్పితో ఆస్పత్రిలో చేరిన మేఘన్ తండ్రి థామస్‌ను ప్రస్తుతం డాక్టర్లు విశ్రాంతి తీసుకోవాల్సిందిగా హెచ్చరించారు. 74 ఏళ్ల థామస్‌కు బుధవారం హార్ట్ సర్జరీ జరగనున్న నేపథ్యంలో ఆస్పత్రి నుంచి కదలకూడదని వైద్యులు చెప్పడంతో కూతురు పెళ్లికి హాజరుకాలేకపోతున్నారు. ప్రస్తుతం ఆయన మెక్సికోలోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ నేపథ్యంలో కొన్ని రోజుల క్రితం మేఘన్ సవతి సోదరుడు రాసిన లేఖ మరోసారి చర్చనీయాంశమైంది. 'మేఘన్ మార్కెల్ మీకు తగిన వధువు కాదు. ఆమె నిజ స్వరూపం మీకు తెలియదు. ఆమె మా నాన్నను ఒంటరిగా మెక్సికోలో వదిలేసి వెళ్లిపోయింది. మేఘన్‌ను నటిని చేసేందుకు నాన్న ఎన్నో కష్టాలు పడ్డారు. అప్పులు కూడా చేశారు. ఆమె నటి అయిన తర్వాత కూడా నాన్న అప్పులు తీర్చలేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఎక్కడి నుంచి ఈ స్థాయికి వచ్చిందో మేఘన్ మరిచి పోయింది. నటి అయ్యాక కుటుంబం కష్టాలు తీర్చాల్సిన బాధ్యతలను గాలికొదిలేసిన మేఘన్.. ఉన్నత కుటుంబంలో వ్యక్తి అయ్యాక ఎలా ఉంటుందో మీరు ఆలోచించుకోవాలి. పెళ్లికి రావాలంటూ తెలియని వారికి కూడా ఆహ్వానాలు పంపుతోంది. కానీ మా కుటుంబంలో ఒక్కరికీ కూడా వివాహ ఆహ్వానం అందలేదని’ అతడు లేఖలో పేర్కొన్నాడు. -
పెళ్లి ఆపేయ్.. రాయల్ ఫ్యామిలీ చారిత్రక తప్పిదం!
లండన్: ఓవైపు బ్రిటన్ రాకుమారుడు ప్రిన్స్ హ్యారీ, హాలీవుడ్ నటి మేఘన్ మార్కెల్‌ల వివాహానికి రాజకుటుంబీకులు ఏర్పాట్లు చేస్తుండగా.. మరోవైపు పెళ్లి ఆపేయాలంటూ వచ్చిన లేఖ కలకలం రేపుతోంది. ప్రిన్స్ హ్యారీకి ఆ లేఖ రాసింది మరెవరో కాదు.. మేఘన్ మార్కెల్ సవతి సోదరుడు థామస్ మార్కెల్. ఇప్పటికీ మించి పోయిందేంలేదు.. పెళ్లి ఆపేస్తే మీ కుటుంబానికి మంచిదంటూ హ్యారీని థామస్ హెచ్చరించాడు. ఈ నెల 19న లండన్‌లోని విండ్సర్ క్యాజిల్‌లో జరగబోయే రాయల్ వెడ్డింగ్‌కు ఇప్పటికే ఆహ్వానాలు అందజేశారు. కానీ ఈ నేపథ్యంలో మేఘన్ సోదరుడు రాసిన లేఖ చర్చనీయాంశమైంది. 'మేఘన్ మార్కెల్ మీకు తగిన వధువు కాదు. ఆమె నిజ స్వరూపం మీకు తెలియదు. ఆమె మా నాన్నను ఒంటరిగా మెక్సికోలో వదిలేసి వెళ్లిపోయింది. మేఘన్‌ను నటిని చేసేందుకు నాన్న ఎన్నో కష్టాలు పడ్డారు. అప్పులు చేశారు. ఆమె నటి అయిన తర్వాత కూడా నాన్న అప్పులు తీర్చలేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పెళ్లికి రావాలంటూ తెలియని వారికి కూడా ఆహ్వానాలు పంపుతోంది. కానీ మా కుటుంబంలో ఒక్కరికీ కూడా వివాహ ఆహ్వానం అందలేదు. ఒక వేళ ఆమెను మీ ఇంటి సభ్యురాలిగా చేసుకుంటే రాజకుటుంబం గౌరవ, మర్యాదలు మంటకలిసిపోతాయి. పెళ్లితో రెండు కుటుంబాలు దగ్గరవుతాయి. కానీ ఇక్కడ అలా జరగడం లేదు. మా కుటుంబానికి మేఘన్ చాలా దూరంగా ఉంటోంది. ఎక్కడి నుంచి ఈ స్థాయికి వచ్చిందో మేఘన్ మరిచి పోయింది. ఆమె ఎప్పటికీ నాకు చెల్లెలే. కానీ తన కుటుంబాన్ని, సన్నిహితులను వదిలేసుకుంది. ఎందుకంటే.. మేం సినిమా నిర్మాతలం కాదు. నటి అయ్యాక కుటుంబం కష్టాలు తీర్చాల్సిన బాధ్యతలను గాలికొదిలేసిన మేఘన్.. ఉన్నత కుటుంబంలో వ్యక్తి అయ్యాక ఎలా ఉంటుందో మీరు ఆలోచించుకోవాలని' అని మేఘన్ సోదరుడు థామస్ ప్రిన్స్ హ్యారీకి రాసిన లేఖలో పేర్కొన్నారు. -
బెస్ట్ ఫ్రెండ్ పెళ్లి
‘పెళ్లయ్యాక నువ్వు మొత్తం మారిపోయావు!’ అనే మాటలు బాగా వినిపిస్తుంటాయి స్నేహితుల మధ్య. నిజమే మరి! పెళ్లైపోతే ప్రియారిటీలు, ప్రపంచాలూ మారిపోతాయి. హాలీవుడ్ స్టార్ హీరోయిన్ మేఘన్ మార్కెల్ పెళ్లి చేసుకోబోతోంది. మే 19న పెళ్లి. అదీ ప్రిన్స్ హ్యారీతో. బ్రిటీష్ రాయల్ ఫ్యామిలీలో పెళ్లంటే అది ఆషామాషీ వ్యవహారం కాదు. ప్రపంచ దేశాల పెద్దలంతా ఈ వేడుక కోసం ఎదురుచూస్తున్నారు. సినిమాల్లో సూపర్స్టార్డమ్ అనుభవించిన మేఘన్, పెళ్లి తర్వాత సినిమాలకు పూర్తిగా దూరమవుతున్నట్టు చెప్పింది. దీంతో ఆమెను ఫ్యాన్స్ ఇప్పట్నుంచే మిస్ అవుతూంటే, బెస్ట్‌ఫ్రెండ్ ప్రియాంక చోప్రా కూడా అంతే మిస్ అవుతున్నట్టు కనిపిస్తోంది. ఇండియన్ సినిమాలో సూపర్‌స్టార్ అనిపించుకొని ఇప్పుడు హాలీవుడ్‌లోనూ మెప్పిస్తోన్న ప్రియాంకా చోప్రా, మేఘన్ మార్కెల్ ఎప్పట్నుంచో మంచి ఫ్రెండ్స్. ‘నాకు బెస్ట్‌ఫ్రెండ్ లాంటిది మేఘన్’ అని చెప్తుంది ప్రియాంక. తాజాగా మేఘన్ పెళ్లి చేసుకోబోతోందంటే ప్రియాంక కూడా ఎమోషనల్ అయిపోతోంది. ఆమెకు స్వయంగా ఒక లెటర్ కూడా రాసి పంపింది. ‘ ‘బిర్యానీ, పౌటిన్లు తింటూ లెక్కలేనని కబుర్లు చెప్పుకునేవాళ్లం. ఈ మధ్యలోనే తనేంటో తెలుసుకోవడం ఎంత బాగుండేదో! ప్రపంచం గురించి, మనుషుల గురించి, చాలా విషయాల గురించి ఆలోచిస్తుంది మేఘన్. ఈ ప్రిన్సెస్‌కి ఇప్పుడు ప్రిన్స్ దొరికేశాడు. తన ప్రేమ జీవితం, పెళ్లి జీవితం అద్భుతంగా ఉండాలి. తనెప్పుడూ హ్యాపీగా ఉండాలి.’’ అంటూ ప్రియాంక రాసిన ఈ లెటర్ వాళ్లిద్దరి క్యూట్ ఫ్రెండ్షిప్ను చెప్పకనే బలంగా చెప్పేస్తోంది. ఈ ఇద్దరి ఫ్రెండ్షిప్, మేఘన్ పెళ్లి తర్వాత కూడా ఇంతే క్యూట్‌గా ఉండిపోవాలని, మనమూ కాస్త సరదాగా, ఇంకాస్త ఇష్టంగా కోరుకుందాం!! -
మగ బిడ్డకు జన్మనిచ్చిన యువరాణి కేట్
లండన్: బ్రిటన్ యువరాజు విలియమ్ భార్య, యువరాణి కేట్ మిడిల్టన్ మూడో బిడ్డకు జన్మనిచ్చారు. లండన్‌లోని కెన్సింగ్టన్ ప్యాలెస్‌లో సోమవారం ఉదయం మగ బిడ్డ పుట్టినట్లు ప్యాలెస్ వర్గాలు వెల్లడించాయి. తల్లీ, బిడ్డలు ఇద్దరూ క్షేమంగా ఉన్నట్లు తెలిపాయి. ఇప్పటికే రాజ దంపతులకు నాలుగేళ్ల రాకుమారుడు జార్జ్, రెండేళ్ల రాకుమారి చార్లెట్లు ఉన్నారు. ఇప్పుడు పుట్టిన రాకుమారుడి పేరు ఇంకా ఖరారు చేయలేదు. బ్రిటిష్ సింహాసనం అధిష్టించే వారిలో నూతన రాకుమారుడు ఐదో వారసుడు. -
రాజకుటుంబంలో బాబు పుట్టాడోచ్!
లండన్: బ్రిటన్ రాజకుటుంబంలోకి మరో బుల్లి వారసుడు వచ్చాడు. ప్రిన్స్ విలియమ్ సతీమణి కేట్ మిడిల్టన్ సోమవారం పండంటి మగశిశువుకు జన్మనిచ్చారు. లండన్‌లోని సెయింట్ మెరీ ఆస్పత్రిలో కేట్ మూడో బిడ్డను ప్రసవించారు. తల్లి, బిడ్డ ఇద్దరూ ఆరోగ్యంగా ఉన్నారని రాయల్ ప్యాలెస్ ఒక ప్రకటనలో తెలిపింది. ప్రిన్స్, కేట్ దంపతులకు బాబు జార్జ్, పాప చార్లెట్.. ఉన్నారు. మూడో బిడ్డను ప్రసవించే సమయంలో కేట్ పక్కన ప్రిన్స్ కూడా ఉన్నారని మీడియా తెలిపింది. కేట్ తాజాగా జన్మనిచ్చిన శిశువు బ్రిటన్ రాణి క్విన్ ఎలిజబేత్ ఆరో మునిమనవడు కాగా.. బ్రిటన్ సింహాసనం అధిరోహించబోయేవారిలో ఐదో వ్యక్తిగా ఉండనున్నాడు. -
అసలు విషయం అప్పుడు చెప్పింది!!
హాలీవుడ్ స్టార్ మేఘన్ మార్కల్ ఇంకో ఐదు నెలల్లో ప్రిన్స్ హ్యారీని పెళ్లి చేసుకొని బ్రిటీష్ రాయల్ ఫ్యామిలీ మెంబర్ కానుంది. నవంబర్ 27న హ్యారీ ఉంగరం తొడిగి ప్రపోజ్ చేశాక మేఘన్ నటనకు దూరమైపోయింది. అప్పటికే బాగా పాపులర్ అయిన ‘సూట్స్’ టీవీ సిరీస్ నుంచి బయటకొచ్చేసింది. ఇకపై సినిమాలు చేయనని మాట కూడా ఇచ్చేసింది. అలాగే అదేమీ కష్టంగా తీసుకుంటున్న నిర్ణయం కాదని, సినిమాలకు దూరమవ్వడం ఒక కొత్త జీవితం మొదలుపెట్టడానికే అని చెప్పుకొచ్చింది. ఇంతవరకూ బాగానే ఉంది కానీ, హ్యారీతో మేఘన్ ప్రేమలో ఉన్న విషయం తెలియని రోజుల్లో జేమ్స్‌బాండ్ 25వ సినిమాకు ఆమెను హీరోయిన్గా అనుకున్నారట. అనుకోవడమేంటీ? ఆమెనే బాండ్ భామ అని ఫిక్స్ చేసుకొని, అడిగేసారట! సరిగ్గా అప్పుడు చెప్పింది మేఘన్.. అసలు విషయం. ఇంకేముంది.. ‘బాండ్ 25’ టీమ్ వేరొకర్ని ఎంపిక చేసే పనిలో పడిపోయింది. ప్రపంచవ్యాప్తంగా తిరుగులేని మూవీ సిరీస్‌లో ఒకటైన జేమ్స్‌బాండ్ సిరీస్‌లో వస్తోన్న 25వ సినిమా కావడంతో ఇంకా టైటిల్ కూడా ఫిక్స్ అవ్వని బాండ్ 25పై ఇప్పట్నుంచే భారీ అంచనాలున్నాయి. డేనియల్ క్రెయిగ్ జేమ్స్‌బాండ్‌గా నటిస్తోన్న ఈ సినిమా 2019 నవంబర్‌లో విడుదలవుతుంది. -
బ్రిటిష్ రాయల్ ఫ్యామిలీలో ఓ గే..
లండన్: బ్రిటన్ రాణి ఎలిజబెత్ సమీప బంధువు (కజిన్) లార్డ్ ఐవర్ మౌంట్‌బాటెన్ సంచలన విషయం చెప్పాడు. తాను గే అని ఆయన వెల్లడించాడు. ప్రఖ్యాత బ్రిటిష్ రాయల్ ఫ్యామిలీలో ఇలా గే అని చెప్పిన తొలి వ్యక్తి మౌంట్‌బాటెనే. ఆయనకు మాజీ భార్య పెనెలొపె థామ్సన్ (పెన్నీ) ద్వారా ముగ్గురు సంతానం కలిగారు. లైంగికంగా తాను సమస్యలు ఎదుర్కొన్నానని, ప్రస్తుతం ఓ ఎయిర్‌లైన్ క్యాబిన్ సర్వీసెస్ డైరెక్టర్ జేమ్స్ కోయ్లెతో కలసి సంతోషంగా ఉన్నానని చెప్పాడు. ఇప్పుడు నిజమైన జీవితాన్ని గడుపుతున్నాని తెలిపాడు. తనకు పెళ్లికాకముందే తాను గే అనే విషయాన్ని పెన్నీకి చెప్పానని వెల్లడించాడు. తాను ఉభయ సంపర్కుడినని (బై సెక్సువల్) పెన్నీకి చెప్పానని, ఆమె ఈ విషయాన్ని అర్థం చేసుకుందని చెప్పాడు. క్వీన్ విక్టోరియాకు మౌంట్‌బాటెన్ మునిముని మనవడు అవుతాడు. -
బ్రిటన్ రాజులనూ వదలని లలిత్ మోదీ
లండన్: మనీ లాండరింగ్ సహా తీవ్రమైన ఆర్థిక నేరారోపణలు ఎదుర్కొంటున్న ఐపీఎల్ మాజీ చైర్మన్ లలిత్ మోదీ.. బ్రిటన్ రాజకుంటుబాన్ని వదలలేదు. బ్రిటన్ రాజు చార్లెస్, ఆయన సోదరుడు ఆండ్రూ పేర్లు వాడుకుని యూకే హోం మంత్రిత్వ శాఖ కార్యాలయం నుంచి లలిత్ మోదీ ట్రావెట్ డాక్యుమెంట్లు పొందినట్టు 'ద సండే టైమ్స్' వెల్లడించింది. క్వీన్ ఎలిజబెత్ రెండో కుమారుడైన ఆండ్రూతో ఉన్న పరిచయాన్ని ఉపయోగించుకుని లలిత్ ప్రయాణ పత్రాలు పొందారని తెలిపింది. ట్రావెల్ డాక్యుమెంట్స్ తన చేతికి రావడానికి కొన్ని రోజుల ముందే ఆండ్రూను మోదీ కలిశారని వెల్లడించింది. లలిత్ మోదీకి బ్రిటన్ ట్రావెల్ డాక్యుమెంట్స్ అందేందుకు సుష్మా స్వరాజ్, అంతకుముందు బ్రిటన్ ఇమ్మిగ్రేషన్ విషయంలో వసుంధర రాజే సహకరించారన్న వార్తలు వెలుగులోకి రావడంతో భారత్ లో రాజకీయ దుమారం లేచిన విషయం తెలిసిందే.