రాయల్‌ వెడ్డింగ్‌లో మేఘన్‌కు లోటు... | Meghan Markle Father Will Not Attending Her Wedding | Sakshi
Sakshi News home page

రాయల్‌ వెడ్డింగ్‌లో మేఘన్‌కు లోటు...

Published Wed, May 16 2018 9:51 AM | Last Updated on Wed, May 16 2018 9:53 AM

Meghan Markle Father Will Not Attending Her Wedding - Sakshi

హాలీవుడ్‌ నటి మేఘన్‌ మార్కెల్‌ (ఫైల్‌ ఫొటో)

లాస్‌ ఏంజెల్స్‌ : బ్రిటన్‌ రాకుమారుడు ప్రిన్స్‌ హ్యారీ, హాలీవుడ్‌ నటి మేఘన్‌ మార్కెల్‌ల వివాహం జరగనున్న విషయం తెలిసిందే. ఇరు కుటుంబాలకు ఎంతో ప్రత్యేకమైన ఈ వేడుకలో మేఘన్‌ను మాత్రం ఓ లోటు వెంటాడనుంది. ఈ నెల(మే) 19న లండన్‌లో అత్యంత వైభవంగా జరిగే పెళ్లి వేడుకకు మేఘన్‌ తండ్రి థామస్‌ మార్కెల్‌ హాజరుకావడం లేదని ఓ వెబ్‌సైట్‌ పేర్కొంది. గత వారం గుండె నొప్పితో ఆస్పత్రిలో చేరిన మేఘన్‌ తండ్రి థామస్‌ను ప్రస్తుతం డాక్టర్లు విశ్రాంతి తీసుకోవాల్సిందిగా హెచ్చరించారు. 74 ఏళ్ల థామస్‌కు బుధవారం హార్ట్‌ సర్జరీ జరగనున్న నేపథ్యంలో ఆస్పత్రి నుంచి కదలకూడదని వైద్యులు చెప్పడంతో కూతురు పెళ్లికి హాజరుకాలేకపోతున్నారు. ప్రస్తుతం ఆయన మెక్సికోలోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.

ఈ నేపథ్యంలో కొన్ని రోజుల క్రితం మేఘన్ సవతి సోదరుడు రాసిన లేఖ మరోసారి చర్చనీయాంశమైంది. 'మేఘన్ మార్కెల్ మీకు తగిన వధువు కాదు. ఆమె నిజ స్వరూపం మీకు తెలియదు. ఆమె మా నాన్నను ఒంటరిగా మెక్సికోలో వదిలేసి వెళ్లిపోయింది. మేఘన్‌ను నటిని చేసేందుకు నాన్న ఎన్నో కష్టాలు పడ్డారు. అప్పులు కూడా చేశారు. ఆమె నటి అయిన తర్వాత కూడా నాన్న అప్పులు తీర్చలేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఎక్కడి నుంచి ఈ స్థాయికి వచ్చిందో మేఘన్ మరిచి పోయింది. నటి అయ్యాక కుటుంబం కష్టాలు తీర్చాల్సిన బాధ్యతలను గాలికొదిలేసిన మేఘన్.. ఉన్నత కుటుంబంలో వ్యక్తి అయ్యాక ఎలా ఉంటుందో మీరు ఆలోచించుకోవాలి. పెళ్లికి రావాలంటూ తెలియని వారికి కూడా ఆహ్వానాలు పంపుతోంది. కానీ మా కుటుంబంలో ఒక్కరికీ కూడా వివాహ ఆహ్వానం అందలేదని’ అతడు లేఖలో పేర్కొన్నాడు.
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement