బ్రిటన్ యువరాజు హ్యారీకి బ్రిటన్ రాజ కుటుంబం జన్మదిన శుభాకాంక్షలు తెలిపింది. ఆదివారం ఆయన 40వ జన్మదినం సందర్భంగా బర్త్ డే కేక్ ఎమోజీతో మెరిసిపోతున్న హ్యారీ ఫోటోను పంచుకుంది. ‘‘డ్యూక్ ఆఫ్ ససెక్స్‌కు 40 వ పుట్టినరోజు శుభాకాంక్షలు’’క్యాప్షన్‌ను జత చేసింది. ప్రిన్స్, ప్రిన్సెస్ ఆఫ్ వేల్స్ కూడా ఈ ఫొటోను షేర్ చేస్తూ శుభాకాంక్షలు తెలిపారు.
2021 తరువాత రాజకుటుంబం ఖాతా నుంచి హ్యారీకి వచి్చన మొట్టమొదటి బహిరంగ పుట్టినరోజు సందేశం ఇది. డ్యూక్ అండ్ డచెస్ ఆఫ్ ససెక్స్ 2020 జనవరిలో రాయల్ డ్యూటీలను వదులుకుంటున్నట్లు ప్రకటించారు. ఆర్థికంగా స్వతంత్రంగా జీవించేందుకు వీలుగా రాజకుటుంబం క్రియాశీలక విధుల నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటించారు. కాలిఫోరి్నయాలోని శాంటా బార్బరా సమీపంలోని మాంటెసిటోలో నివాసం ఉంటున్నారు. నెట్‌ఫ్లిక్స్, స్పాటిఫై సంస్థలతో ఒప్పందాలు కుదుర్చుకున్నారు.
– లండన్
Comments
Please login to add a commentAdd a comment