లండన్: బ్రిటన్ రాజు చార్లెజ్-III రెండో కుమారుడు ప్రిన్స్ హ్యారీ కోర్టు ఎదుట హాజరుకానున్నారు. ఓ వార్తా సంస్థపై హ్యారీతోపాటు ఇతర ప్రముఖులు వేసిన కేసు విచారణలో భాగంగా లండన్ హైకోర్టులో బోనులో(విట్‌నెస్ బాక్స్) నిలబడి సాక్ష్యం చెప్పనున్నారు. దీంతో 1890 నుంచి గత 130 సంవత్సరాల్లో కోర్టులో సాక్ష్యం చెప్పిన తొలి బ్రిటన్ రాజకుటుంబీకుడిగా హ్యారీనే కావడం విశేషం.
కాగా ప్రిన్స్ హ్యారీతోపాటు సినిమా, క్రీడా రంగానికి చెందిన దాదాపు 100 మందికిపైగా ప్రముఖులు బ్రిటిష్‌కు చెందిన మిర్రర్ గ్రూప్ న్యూస్ పేపర్స్‌పై లండన్ కోర్టులో దావా వేశారు.జర్నలిస్టులు, వారు నియమించిన ప్రైవేట్ ఇన్వెస్టిగేటర్‌లు భారీ స్థాయిలో ఫోన్ హ్యాకింగ్‌కు పాల్పడ్డారని, మోసపూరితంగా వ్యక్తిగత వివరాలను పొందడంతోపాటు ఇతర అక్రమ చర్యలకు పాల్పడ్డారని ఆరోపిస్తూ కోర్టులో కేసు ఫైల్ చేశారు.
1991 నుంచి 2011 వరకు సదరు పత్రిక విస్తృతంగా చట్టవిరుద్ధమైన కార్యకలాపాలకు పాల్పడిందని పిటిషన్‌లో పేర్కొన్నారు. దీనిపై మే 10న విచారణ ప్రారంభం అయ్యింది. ఇందులో భాగంగా సోమవారం నుంచి మూడు రోజులపాటు తన నిర్ధిష్ట కేసు విచారణలో భాగంగా హ్యారీ సాక్ష్యం ఇవ్వనున్నారు.
అయితే 1870లో విడాకుల కేసులో ఎడ్వర్డ్ VII కోర్టుకు సాక్షిగా హాజరయ్యారు. అనంతరం 20 ఏళ్లకు కార్డ్ గేమ్‌పై కేసు విచారణలో మరోసారి కోర్టుకు హాజరయ్యారు. అయితే ఈ రెండు ఆయన రాజు కావడానికి ముందే జరిగాయి. అప్పటి నుంచి ఇప్పటి వరకు బ్రిటన్ రాజకుటుంబానికి చెందిన వ్యక్తి కోర్టుకు హాజరై సాక్ష్యం చెప్పడం ఇదే తొలిసారి.
చదవండి: పాకిస్తాన్, చైనాతో పోలిస్తే ఆ విషయంలో భారత్ చాలా బెటర్..
Comments
Please login to add a commentAdd a comment