Prince Harry
-
హ్యారీకి రాజకుటుంబం.. పుట్టినరోజు శుభాకాంక్షలు
బ్రిటన్ యువరాజు హ్యారీకి బ్రిటన్ రాజ కుటుంబం జన్మదిన శుభాకాంక్షలు తెలిపింది. ఆదివారం ఆయన 40వ జన్మదినం సందర్భంగా బర్త్ డే కేక్ ఎమోజీతో మెరిసిపోతున్న హ్యారీ ఫోటోను పంచుకుంది. ‘‘డ్యూక్ ఆఫ్ ససెక్స్‌కు 40 వ పుట్టినరోజు శుభాకాంక్షలు’’క్యాప్షన్‌ను జత చేసింది. ప్రిన్స్, ప్రిన్సెస్ ఆఫ్ వేల్స్ కూడా ఈ ఫొటోను షేర్ చేస్తూ శుభాకాంక్షలు తెలిపారు. 2021 తరువాత రాజకుటుంబం ఖాతా నుంచి హ్యారీకి వచి్చన మొట్టమొదటి బహిరంగ పుట్టినరోజు సందేశం ఇది. డ్యూక్ అండ్ డచెస్ ఆఫ్ ససెక్స్ 2020 జనవరిలో రాయల్ డ్యూటీలను వదులుకుంటున్నట్లు ప్రకటించారు. ఆర్థికంగా స్వతంత్రంగా జీవించేందుకు వీలుగా రాజకుటుంబం క్రియాశీలక విధుల నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటించారు. కాలిఫోరి్నయాలోని శాంటా బార్బరా సమీపంలోని మాంటెసిటోలో నివాసం ఉంటున్నారు. నెట్‌ఫ్లిక్స్, స్పాటిఫై సంస్థలతో ఒప్పందాలు కుదుర్చుకున్నారు. – లండన్ -
ప్రిన్స్ హ్యారీ, భార్య మేఘన్‌ల మధ్య విభేదాలు తలెత్తాయా?
బ్రిటన్ రాజు చార్లెస్ III చిన్న కుమారుడు ప్రిన్స్ హ్యారీ, అతడి భార్య మేఘన్ మర్క్లేల మధ్య విభేదాలు తలెత్తాయా? అందుకే వారిద్దరి మధ్య దూరం ఏర్పడిందా? అంటే అవుననే అంటున్నాయి అంతర్జాతీయ మీడియా సంస్థలు.అందుకు ఊతం ఇచ్చేలా మేఘన్ తన జీవితం ‘తాను అనుకున్నట్లుగా లేదని’, కాబట్టే ఆమె ఆందోళన చెందుతోందని నివేదికలు వెలుగులోకి వచ్చాయి.ప్రముఖ ఆథర్ టామ్ క్విన్ ఓ మీడియా ఛానెల్‌తో మాట్లాడుతూ.. ప్రిన్స్ హ్యారీ, అతడి భార్య మేఘన్ మార్క్లేల మధ్య దూరం పెరిగిపోతుంది. మేఘన్ తాను కోరుకున్నట్లు తన జీవితం లేదని బాధపడుతోంది. ఎందుకంటే తనకు మీడియా అటెన్షన్ అంటే బాగా ఇష్టం. అయితే ఇటీవల కాలంలో పలు సర్వేలు హ్యారీని,మేఘన్‌ను పెద్దగా పట్టించుకోవడం లేదనే రిపోర్ట్‌లపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారని తెలిపారు. దీనికి తోడు 2020లో హ్యారీ దంపతులు రాజకుంటుంబ సభ్యలు హోదాను వదులుకుని అమెరికాలో కాలిఫోర్నియాలో సెటిల్ అయ్యారు. అయినప్పటికీ మొదట్లో కాలిఫోర్నియాలో హ్యారీ దంపతులకు అపూర్వ ఆదరణ లభించిందని, సినీరంగానికి చెందిన (హాలీవుడ్) ప్రముఖులు వారితో స్నేహం కోసం క్యూకట్టినట్లు పలు మీడియా రిపోర్ట్లు వెలుగులోకి వచ్చాయి. అయినప్పటికీ, వారి ప్రజాదరణ తగ్గుముఖం పట్టిందని సర్వేలు హైలెట్ చేశాయి. మేఘనా మార్క్లే ‘అమెరికాలో రివేరా ఆర్చర్డ్’ అనే ఆహార ఉత్పత్తుల బ్రాండ్‌ను లాంచ్ చేశారు. ఆ సమయంలో ఆమె కన్నీటి పర్యంతరమయ్యారు. ఎందుకంటే ఆమె రివే ఆర్చర్డ్స్ ఆహార ఉత్పత్తులు చాలా ఖరీదైనవి. కానీ వాటిల్లో అంత నాణ్యత లేదనే విమర్శలు వెల్లువెత్తాయి. ఆ విమర్శల్ని తాను తట్టుకోలేకపోయారు. అమెరికాలో మేఘన్ విలాసవంతమైన జీవనశైలిపై ఎప్పుడూ విమర్శలు వస్తుంటాయి. ఈ అంశం ఆమెకు అస్సలు మింగుడు పడడం లేదు. ఈ వరుస పరిణామాలు తాను అనుకున్నట్లు తన జీవితం లేదని మేఘన బాధపడుతుందని ఆథర్ టామ్ క్విన్ చెప్పారు. దీనికి తోడు ప్రిన్స్ హ్యారీని మేఘన్‌ను విసిగిస్తుందనే ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. హ్యారీకి యూకేలోని తన స్నేహితులు అంటే చాలా ఇష్టం. వారిని కలుసుకునేందుకు ప్రయత్నాలు చేస్తుండేవారు. కానీ హ్యారీ వారిని కలుసుకోవడం మేఘన్‌కు అస్సలు ఇష్టం ఉండదు. బహుశా ఈ తరహా వ్యక్తిగత భేదాభిప్రాయాల కారణంగా ప్రిన్స్ హ్యారీ అతడి భార్య మేఘన్ మర్క్లేల మధ్య దూరం పెరిగిపోతుందని పరోక్షంగా అభిప్రాయం వ్యక్తం చేశారు. -
‘మీడియా దాడితో ఈ క్షణం దాకా బాధపడుతున్నా!’
లండన్: బ్రిటన్ రాజకుటుంబంలో వందేళ్ల తర్వాత ఓ కీలక పరిణామం జరిగింది. సుమారు 130 ఏళ్ల తర్వాత.. తొలిసారి ఈ రాజకుటుంబానికి చెందిన ఓ వ్యక్తి కోర్టుకు హాజరయ్యారు. అతనే ప్రిన్స్ హ్యారీ(38). కింగ్ ఛార్లెస్ రెండో తనయుడు. ఫోన్ హ్యాకింగ్‌కు సంబంధించిన కేసులో ఓ వార్తా సంస్థకు వ్యతిరేకంగా మంగళవారం కోర్టు బోనులో నిలబడి సాక్ష్యం చెప్పాడు హ్యారీ. మీడియా దాడితో నేను జీవితాంతం బాధపడుతున్నా. కొన్ని టాబ్లాయిడ్లు, ఛానెల్స్, వెబ్సైట్లు.. తమ చేతులకు రక్తపు మరకలు అంటించుకుని తిరుగుతున్నాయి. వాళ్ల నిరంతర టీఆర్పీ రేటింగ్.. రీడర్‌షిప్‌ల దాహార్తికి నన్ను ఇబ్బంది పెడుతూ వస్తున్నారు. అది నేటి వరకు.. ఈ క్షణం దాకా కూడా.. అంటూ తీవ్ర అసహనం వ్యక్తం చేశారాయన. తనను చెడ్డొడిగా చూపిస్తూ బ్రిటన్ మీడియా లాభపడుతోందంటూ ఆరోపించారాయన. ప్రత్యక్ష సాక్షి హోదాలో కోర్టు బోనెక్కిన ప్రిన్స్ ఛార్లెస్.. ఎవరైనా ఈ మీడియా పిచ్చికి అడ్డుకట్ట వేయకముందే వాళ్ల టైపింగ్ వేళ్లను ఎంత రక్తం ముంచేస్తుందో అంటూ తనపై వస్తున్న కథనాలపై ఆందోళన వ్యక్తం చేశారాయన. ప్లేబాయ్ ప్రిన్స్, ఫెయిల్యూర్, డ్రాప్‌అవుట్, మోసగాడు, తాగుబోతు, ఏమాత్రం బాధ్యత లేని వ్యక్తి.. ఇలా ఆ మీడియా తనపై అల్లిన కథనాల జాబితా పెద్దదేనంటూ కోర్టుకు తెలిపారాయన. టీనేజర్‌గా ఉన్నప్పుడు, ట్వంటీస్‌లో ఉన్నప్పుడు.. మీడియా నీచమైన రాతలను తాను చూడాల్సి వచ్చిందంటూ ఆవేదన వ్యక్తం చేశారాయన. ఇదిలా ఉంటే.. బ్రిటన్‌కు చెందిన మిర్రర్ గ్రూప్ రాజకుటుంబం సహా అనేక మంది ప్రముఖుల వ్యక్తిగత విషయాలను సేకరించేందుకుగానూ చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడిందనే ఆరోపణలు ఉన్నాయి. అందులో ఒకటే ఈ ఫోన్ హ్యాకింగ్ కేసు. ప్రిన్స్ హ్యారీతో పాటు పలువురు ప్రముఖులు ఈ వ్యవహారంపై సదరు మీడియా హౌజ్‌ను కోర్టుకు లాగారు. ఇక రాజకుటుంబానికి దూరంగా.. తన భార్య మేఘన్ మర్కెల్, పిల్లలతో కలిసి అమెరికాలో ఉంటున్నాడు ప్రిన్స్ హ్యారీ. సోమవారమే లండన్ చేరుకున్నప్పటికీ.. భారత కాలమానం ప్రకారం ఈ ఉదయం న్యాయస్థానంలో హాజరు అయ్యారు. తన వ్యక్తిగత వివరాలను సేకరించేందుకు మిర్రర్ గ్రూప్ ఉపయోగించిన మోసపూరిత పద్ధతుల కారణంగా తన జీవితం ఎలా అతలాకుతలం అయ్యిందో హ్యారీ.. న్యాయమూర్తికి వివరించారు. చట్టవ్యతిరేకంగా సేకరించిన వివరాలతో.. 140 ఆర్టికల్స్‌ను ప్రచురించారని, ఒకానొక టైంలో ప్రైవేట్ ఇన్వెస్టిగేటర్లను సైతం ఉపయోగించారని హ్యారీ కోర్టుకు వివరించారు. 130 ఏళ్ల కిందట ఆయన.. బ్రిటన్ రాజకుటుంబానికి చెందిన వ్యక్తులు కోర్టుకు హాజరవ్వడం 130 ఏళ్లలో ఇదే తొలిసారి. అంతకుముందు 1870లో ఓ విడాకుల కేసుకు సంబంధించి ఎడ్వర్డ్ VII కోర్టుకు హాజరై సాక్ష్యం చెప్పారు. ఆ తర్వాత 1891లో ఓ గ్యాంబ్లింగ్ కేసులోనూ ఇంగ్లీష్ హైకోర్టుకు వెళ్లి సాక్ష్యమిచ్చారు. అయితే, ఆయన రాజు కాకమునుపే ఈ రెండూ జరిగాయి. -
కోర్టు బోనెక్కి సాక్ష్యం చెప్పనున్న ప్రిన్స్ హ్యారీ
లండన్: బ్రిటన్ రాజు చార్లెస్ –3 చిన్న కుమారుడు ప్రిన్స్ హ్యారీ సాక్ష్యం ఇవ్వడానికి వచ్చే వారంలో కోర్టుకు హాజరుకానున్నారు. రాజకుటుంబానికి చెందినవారు ఇలా కోర్టు బోనెక్కడం 130 ఏళ్లలో ఇది తొలిసారి. డైలీ మిర్రర్, సండే మిర్రర్ వంటి వార్తా పత్రికల ప్రచురణ సంస్థ మిర్రర్ గ్రూప్ న్యూస్‌పేపర్స్ (ఎంజీఎన్) సెలిబ్రిటీల వ్యక్తిగత అంశాలను సేకరించడం కోసం చట్ట విరుద్ధంగా ఫోన్ ట్యాపింగ్‌కు పాల్పడిందన్న ఆరోపణలున్నాయి. ఈ ఆరోపణలపై 100 మంది సెలిబ్రిటీలతో పాటు ప్రిన్స్ హ్యారీ కూడా మిర్రర్ గ్రూప్‌పై కోర్టులో పిటిషన్ వేశారు. ఈ కేసును విచారిస్తున్న లండన్ హైకోర్టులో ప్రిన్స్ హ్యారీ హాజరై ఫోన్ ట్యాంపింగ్‌పై సాక్ష్యం ఇవ్వనున్నారు. గతంలో 1870లో ఎడ్వర్డ్–7 ఒక విడాకుల కేసులో సాక్ష్యమిచ్చారు. -
కోర్టు బోనులో నిలబడనున్న బ్రిటన్ రాకుమారుడు.. 130 ఏళ్లలో తొలిసారి!
లండన్: బ్రిటన్ రాజు చార్లెజ్-III రెండో కుమారుడు ప్రిన్స్ హ్యారీ కోర్టు ఎదుట హాజరుకానున్నారు. ఓ వార్తా సంస్థపై హ్యారీతోపాటు ఇతర ప్రముఖులు వేసిన కేసు విచారణలో భాగంగా లండన్ హైకోర్టులో బోనులో(విట్నెస్ బాక్స్) నిలబడి సాక్ష్యం చెప్పనున్నారు. దీంతో 1890 నుంచి గత 130 సంవత్సరాల్లో కోర్టులో సాక్ష్యం చెప్పిన తొలి బ్రిటన్ రాజకుటుంబీకుడిగా హ్యారీనే కావడం విశేషం. కాగా ప్రిన్స్ హ్యారీతోపాటు సినిమా, క్రీడా రంగానికి చెందిన దాదాపు 100 మందికిపైగా ప్రముఖులు బ్రిటిష్‌కు చెందిన మిర్రర్ గ్రూప్ న్యూస్ పేపర్స్‌పై లండన్ కోర్టులో దావా వేశారు.జర్నలిస్టులు, వారు నియమించిన ప్రైవేట్ ఇన్వెస్టిగేటర్లు భారీ స్థాయిలో ఫోన్ హ్యాకింగ్‌కు పాల్పడ్డారని, మోసపూరితంగా వ్యక్తిగత వివరాలను పొందడంతోపాటు ఇతర అక్రమ చర్యలకు పాల్పడ్డారని ఆరోపిస్తూ కోర్టులో కేసు ఫైల్ చేశారు. 1991 నుంచి 2011 వరకు సదరు పత్రిక విస్తృతంగా చట్టవిరుద్ధమైన కార్యకలాపాలకు పాల్పడిందని పిటిషన్లో పేర్కొన్నారు. దీనిపై మే 10న విచారణ ప్రారంభం అయ్యింది. ఇందులో భాగంగా సోమవారం నుంచి మూడు రోజులపాటు తన నిర్ధిష్ట కేసు విచారణలో భాగంగా హ్యారీ సాక్ష్యం ఇవ్వనున్నారు. అయితే 1870లో విడాకుల కేసులో ఎడ్వర్డ్ VII కోర్టుకు సాక్షిగా హాజరయ్యారు. అనంతరం 20 ఏళ్లకు కార్డ్ గేమ్‌పై కేసు విచారణలో మరోసారి కోర్టుకు హాజరయ్యారు. అయితే ఈ రెండు ఆయన రాజు కావడానికి ముందే జరిగాయి. అప్పటి నుంచి ఇప్పటి వరకు బ్రిటన్ రాజకుటుంబానికి చెందిన వ్యక్తి కోర్టుకు హాజరై సాక్ష్యం చెప్పడం ఇదే తొలిసారి. చదవండి: పాకిస్తాన్, చైనాతో పోలిస్తే ఆ విషయంలో భారత్ చాలా బెటర్.. -
ప్రిన్స్ హ్యారీ దంపతుల్ని వేటాడిన కెమెరాలు!.. కొద్దిలో తప్పిన ప్రమాదం
న్యూయార్క్: అమెరికాలో ఓ దాతృత్వ కార్యక్రమానికి వెళ్లొస్తున్న బ్రిటన్ రాచకుటుంబానికి చెందిన ప్రిన్స్ హ్యారీ, భార్య మెఘాన్, అత్త డోరియా రాగ్లాండ్లను మీడియా ఫొటోగ్రాఫర్లు ఫొటోల కోసం వెంబడించారు. ఇది పాతికేళ్ల క్రితం హ్యారీ తల్లి ప్రిన్సెస్ డయానాను పారిస్‌లో కెమెరామెన్లు వాహనాల్లో వెంబడించడం అది విషాదాంతమవడాన్ని గుర్తుచేసింది. ‘ఆరు వాహనాల్లో మీడియా వ్యక్తులు ఏకంగా రెండు గంటలపాటు హ్యారీ వాహనాన్ని వెంబడించారు. మంగళవారం రాత్రి జరిగిన ఈ ఘటనలో పలు వాహనాలు దాదాపు గుద్దుకున్నంత పని జరిగింది. ఈ ఘటనలో పలు వాహనాలు, పాదచారులు, ఇద్దరు న్యూయార్క్ పోలీసు అధికారులు చాలా ఇబ్బంది పడ్డారు’ అని హ్యారీ అధికార ప్రతినిధి బుధవారం వెల్లడించారు. ఘటన తర్వాత పోలీస్ రక్షణలో వారు వెళ్తున్న ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో ప్రత్యక్షమయ్యాయి. అయితే అధికారికంగా ఈ ఘటనపై ఎలాంటి ఫిర్యాదు అందలేదని న్యూయార్క్ పోలీసు విభాగం ప్రకటించింది. లండన్‌లో బ్రిటన్ రాజుగా చార్లెస్ పట్టాభిషేకÙకం తర్వాత దాదాపు నెలరోజుల తర్వాత తొలిసారిగా ఈ జంట మీడియా కంటపడటంతో మీడియా అత్యుత్సాహం చూపి ఉంటుందని వార్తలొచ్చాయి. చదవండి: అమెరికాలో అదృశ్యమైన ఎన్ఆర్ఐ లహరి మృతి -
రాజుగా చార్లెస్–3 పట్టాభిషేకం.. మేఘన్-హ్యారీ రాకపై కీలక ప్రకటన
లండన్: బ్రిటన్ రాజుగా చార్లెస్–3 పట్టాభిషేక సంబరానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి. లండన్‌లోని వెస్ట్‌మినిస్టర్ అబేలో శనివారం ఆయనకు సంప్రదాయబద్ధంగా కిరీటధారణ చేయనున్నారు. ఇప్పుడు లాంఛనంగా పట్టాభిషేక కార్యక్రమం నిర్వహించనున్నారు. భారత కాలమానం ప్రకారం సాయంత్రం 4.30 గంటలకు ఈ కార్యక్రమం జరుగుతుంది. అయితే, చార్లెస్–3 పట్టాభిషేకం సందర్బంగా అందరి ఫోకస్ రాజకుటుంబం మీదే ఉంది. ఈ నేపథ్యంలో, రాచరికాన్ని వదులుకున్న చార్లెస్ రెండో కుమారుడు ప్రిన్స్ హ్యారీ, ఆయన భార్య మేఘన్ మార్కెల్ ఈ కార్యక్రమానికి వస్తారా..? లేదా? అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. కాగా, ఈ విషయంపై బకింగ్ హామ్ ప్యాలెస్ శనివారం ఉదయం కీలక ప్రకటన చేసింది. పట్టాభిషేక మహోత్సవానికి హ్యారీ వస్తున్నట్లు తెలిపింది. అయితే మేఘన్ మాత్రం హాజరుకావడం లేదని అధికారికంగా ప్రకటించింది. ‘రాజు పట్టాభిషేక మహోత్సవానికి డ్యూక్ ఆఫ్ ససెక్స్ ప్రిన్స్ హ్యారీ హాజరవుతారు.. కానీ, ప్రిన్స్ ఆర్కీ, ప్రిన్సెస్ లిలిబెట్‌తో కలిసి డచెస్ ఆఫ్ ససెక్స్ మేఘన్ మార్కెల్ కాలిఫోర్నియాలోనే ఉండిపోతారు అని ప్యాలెస్ ఒక ప్రకటనలో తెలిపింది’. ఇదిలా ఉండగా.. మేఘన్-హ్యారీ దంపతులకు ఇద్దరు సంతానం. ఆర్కీ, లిలిబెట్. అయితే, రాజు సింహాసనాన్ని అధిష్టించే వారసుల జాబితాలో ఆర్కీ ఆరోస్థానంలో ఉన్నారు. కింగ్ చార్లెస్ పట్టాభిషేకం రోజునే ఆ చిన్నారికి నాలుగేండ్లు పూర్తవుతాయి. ఇక, రాజకుటుంబంతో విభేధాల కారణంగా చార్లెస్ రెండో కుమారుడు ప్రిన్స్ హ్యారీ , ఆయన భార్య మేఘన్ మార్కెల్ రాజరికాన్ని వదులుకున్నారు. ఈ క్రమంలో బ్రిటన్ రాజకుటుంబంతో ప్రిన్స్ హ్యారీకి విభేధాలు వచ్చిన విషయం తెలిసిందే. భార్య ప్రేమ, వివాహ బంధం కోసం రాచరికాన్ని వదులుకున్న ప్రిన్స్ హ్యారీ బ్రిటన్ రాజకుటుంబానికి దూరమయ్యారు. ప్రస్తుతం అతను భార్య, పిల్లలతో అమెరికాలో స్థిరపడ్డారు. మరోవైపు.. చార్లెస్–3 పట్టాభిషేక వేడుకలో పాల్గొనేందుకు వివిధ దేశాల అధినేతలు, దేశ విదేశీ అతిథులు లండన్‌కు చేరుకుంటున్నారు. భారత ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖడ్ దంపతులు శుక్రవారం లండన్‌కు చేరుకున్నారు. బ్రిటిష్ ఎంపైర్ మెడల్(బీఈఎం) స్వీకరించినవారిని ఈ పట్టాభిషేకానికి ఆహ్వానించారు. ఇలా ఆహ్వానం అందుకున్న వారిలో భారత సంతతికి చెందిన పాకశాస్త్ర ప్రవీణురాలు మంజు మాల్హీ కూడా ఉన్నారు. పట్టాభిషేకం సందర్భంగా జరిగే సైనిక పరేడ్‌లో బ్రిటిష్ సైనికులతోపాటు కామన్వెల్త్ దేశాల జవాన్లు కూడా పాల్గొంటారు. 7,000 మంది జవాన్లతో జరిగే కవాతు కనువిందు చేయనుంది. Prince Harry will be attending the #coronation today, but Meghan Markle has remained in California with their children.https://t.co/LfDJkI6e7i pic.twitter.com/PQYLkr68tI — Newsweek (@Newsweek) May 6, 2023 ఇది కూడా చదవండి: వీడియో: రష్యా ప్రతినిధి కవ్వింపు.. ఉక్రెయిన్ ఎంపీ పంచ్‌ల వర్షం -
Prince Harry: మాటల్లేవ్.. మాట్లాడుకోవడాల్లేవ్
లండన్: బ్రిటన్ రాజకుటుంబంలోని విభేధాలు మరోసారి తెర మీదకు వచ్చాయి. మే 6వ తేదీన జరగబోయే కింగ్ ఛార్లెస్ Charles III పట్టాభిషేకం కోసం ఘనంగా ఏర్పాట్లు జరుగుతున్న క్రమంలో.. ప్రిన్స్ హ్యారీ రాక గురించి ఆసక్తి నెలకొంది. అయితే అయిష్టంగానే ఆయన ఈ కార్యక్రమానికి హాజరు కానున్నారని తెలుస్తోంది. తండ్రి ఛార్లెస్ పిలుపు మేరకు ప్రిన్స్ హ్యారీ పట్టాభిషేకానికి హాజరు అవుతారని, కానీ, వెంటనే అక్కడి నుంచి వెళ్లిపోతారని రాజకుటుంబానికి దగ్గరగా ఉన్న వ్యక్తులు చెబుతున్నారు. ప్రిన్సెస్ డయానా దగ్గర బట్లర్‌గా పని చేసిన పాల్ బరెల్.. ప్రస్తుతం రాజకుటుంబంలోని వ్యవహారాలను చూసుకుంటున్నారు. ఆయన తాజా పరిణామాలపై స్పందించారు. ఛార్లెస్, విలియమ్-హ్యారీల మధ్య సయోధ్య ఇప్పట్లో జరగకపోవచ్చు. పట్టాభిషేక కార్యక్రమంలో వాళ్ల మధ్య కనీసం మాటలు కూడా ఉండకపోవచ్చు అని ఆయన అభిప్రాయపడ్డారు. తండ్రిపై గౌరవంతో.. డ్యూక్ ఆఫ్ సస్సెక్స్ హోదాలో కేవలం ముఖం చూపించేందుకు మాత్రమే హ్యారీ అక్కడికి వెళ్లే అవకాశం ఉంది. అంతేగానీ ఆ కుటుంబంలో మళ్లీ కలిసిపోవడానికి ఎంత మాత్రం కాదు అని పేర్కొన్నారు పాల్. ఇక మూడు రోజులు పాటు జరిగే పట్టాభిషేక మహోత్సవంలో కేవలం సింహాసనాన్ని అధిష్టించే కార్యక్రమం నాడు మాత్రమే ప్రిన్స్ హ్యారీ హాజరయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అంతేకాదు 24 గంటలు గడవక ముందే ఆయన యూకేను విడిచి పెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. అంతేకాదు పట్టాభిషేక సమయంలో ముందు వరుసలో కాకుండా.. దూరంగా ఎక్కడో పదో వరుసలో ఆయన కూర్చుంటారని సమాచారం. అయితే ఆయన భార్య మేఘన్ మార్కే హాజరుపై మాత్రం స్పష్టత లేదు. క్వీన్ ఎలిజబెత్-2 మరణం అనంతరం రాజుగా పగ్గాలు చేపట్టిన ఛార్లెస్-3.. ఇప్పుడు ఎనిమిది నెలల తర్వాత పట్టాభిషేకం జరుపుకోబోతున్నారు. బ్రిటిష్ సామ్రాజ్యానికి ఆయన 40వ చక్రవర్తి. ఆయన రెండో భార్య క్యామిల్లా యూకే రాణిగా బాధ్యతలు చేపట్టనుంది. అయితే.. పూర్తిస్థాయి మహారాణి హోదా కాదు. ఆ తరహా హోదాతో కూడిన క్వీన్ కాన్సోర్ట్ మాత్రమే. అంటే నామమాత్రపు మహారాణిగా బకింగ్హమ్ ప్యాలెస్‌లో ఆమె నివసించనున్నారు. రాజకుటుంబంలో ఏం జరిగింది? భార్యలు రాజేసిన చిచ్చు భగ్గున మండి.. -
నా భార్యకు రాజకుటుంబం క్షమాపణ చెప్పాలి
లండన్: బ్రిటన్ రాజకుటుంబం నుంచి క్షమాపణకు తన భార్య మేఘన్ మెర్కెల్ అర్హురాలని ఆమె భర్త ప్రిన్స్ హ్యారీ తేల్చిచెప్పారు. తన భార్యను మానసికంగా వేధింపులకు గురిచేశారని, ఆమెకు క్షమాపణ చెప్పాలని రాజకుటుంబాన్ని డిమాండ్ చేశారు. ఆయన తాజాగా డెయిలీ టెలిగ్రాఫ్ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు అంశాలను ప్రస్తావించారు. బ్రిటిష్ మీడియా తన భార్య మెర్కెల్‌ను అనవసరంగా ట్రోల్ చేస్తోందని విమర్శించారు. తన వదిన కేట్ మిడిల్టన్ పట్ల జనంలో సానుకూలత పెంచాలన్నదే మీడియా యత్నమని ఆరోపించారు. రాజకుటుంబాన్ని ముక్కలు చేయాలన్న ఉద్దేశం తనకు లేదన్నారు. రెండు పుస్తకాలకు సరిపడా సమాచారం తన వద్ద ఉందని, అదంతా బయటపెట్టి తన తండ్రిని, సోదరుడిని ఇబ్బంది పెట్టాలని తాను కోరుకోవడం లేదని చెప్పారు. తనకు, తండ్రికి, సోదరుడికి మధ్య జరిగిన విషయాలన్నీ బయటపెడితే వారు తనను ఎప్పటికీ క్షమించబోరని అన్నారు. తండ్రి, సోదరుడు తన పట్ల దారుణంగా వ్యవహరించారని, అయినప్పటికీ వారిని క్షమించడానికి సిద్ధంగా ఉన్నానని వెల్లడించారు. వారితో కూర్చొని మాట్లాడాలని అనుకుంటున్నట్లు తెలిపారు. తాను వారి నుంచి కేవలం జవాబుదారీతనం, తన భార్యకు క్షమాపణను మాత్రమే కోరుకుంటున్నానని ప్రిన్స్ హ్యారీ స్పష్టం చేశారు. ఆయన ఇటీవలే తన ఆత్మకథ ‘స్పేర్’ను విడుదల చేశారు. ఇందులో పలు సంచలన విషయాలను బయటపెట్టారు. రాజకుటుంబంలో తనకు ఎదురైన చాలా అవమానాలను ‘స్పేర్’ పుస్తకంలో చేర్చలేదని ప్రిన్స్ హ్యారీ చెప్పారు. -
మా అమ్మ పార్థివ దేహం వద్ద... కరువుదీరా ఏడ్వలేకపోయా
లండన్: బ్రిటన్ రాచ కుటుంబంపై ప్రిన్స్ హ్యారీ (38) విమర్శలు, ఆరోపణల పరంపర కొనసాగుతూనే ఉంది. ప్రేమకు ప్రతిరూపమైన తన తల్లి డయానా చనిపోతే కనీసం కరువుదీరా ఏడవలేకపోయానని మంగళవారం విడుదల కానున్న తన స్వీయచరిత్ర ‘స్పేర్’లో ఆయన వాపోయారు. రాచ కుటుంబపు కఠినమైన నైతిక కట్టుబాట్లే అందుకు కారణమని ఆరోపించారు. ‘‘ఏం జరిగినా ఏడవకూడదన్నది రాజకుటుంబంలో అలిఖిత నియమం. ఇలాంటి వాటిని చిన్నతనం నుంచే రుద్దీ రుద్దీ నా హృదయాన్ని బండబార్చారు. దాంతో మా అమ్మ చనిపోయి అంతులేని శూన్యాన్ని మిగిల్చినా ఆ దుర్భర ఆవేదనను బయట పెట్టే స్వేచ్ఛ కూడా లేకపోయింది. దాన్నంతటినీ గుండెల్లోనే అదిమి పెట్టి మా అమ్మ కడసారి చూపు కోసం భారీగా తరలివచ్చిన అభిమానులను నవ్వుతూ పలకరించాల్సి వచ్చింది. కానీ వారిలో ఎవరితో కరచాలనం చేసినా అరచేతులన్నీ తడితడిగా తగిలాయి. అవన్నీ వారి కన్నీళ్లతో తడిశాయని అర్థమై చాలా సిగ్గుపడ్డా. ఆ వీడియోలను ఇప్పుడు చూసినా సిగ్గేస్తుంటుంది’’ అన్నారు. -
డ్రగ్స్ తీసుకున్నా: హ్యారీ
లండన్: బ్రిటన్ రాచ కుటుంబంపై రాజు చార్లెస్–2 చిన్న కుమారుడు ప్రిన్స్ హ్యారీ సంచలన ఆరోపణల పరంపర కొనసాగుతూనే ఉంది. అన్న ప్రిన్స్ విలియంతో తన బంధం ఎప్పుడూ సమస్యాత్మకంగానే సాగిందంటూ త్వరలో విడుదలవనున్న తన ఆత్మకథలో బయట పెట్టారాయన. ‘‘2021లో ఒకసారి మేమిద్దరం మా నాన్న సమక్షంలోనే తలపడ్డాం. మీరిలా కొట్టుకుని నా చివరి రోజులను దుర్భరంగా మార్చకండంటూ ఆయన మమ్మల్ని విడదీశాడు’’ అని వివరించారు. ‘‘రాచ కుటుంబీకుల పెళ్లిళ్లు జరిగే వెస్ట్‌మినిస్టర్ అబేలోని సెయింట్ పాల్స్ కెథడ్రెల్లో మెగన్, నేను ఒక్కటయ్యేందుకు కూడా విలియం ఒప్పుకోలేదు’’ అన్నారు. రాచరికపు జీవితపు ఒత్తిడిని తట్టుకోలేకు ఒక దశలో డ్రగ్స్‌కు అలవాటు పడ్డట్టు చెప్పారు! ‘‘17 ఏళ్ల వయసులో తొలిసారిగా కొకైన్ వాడా. అంత థ్రిల్లింగ్‌గా ఏమీ అన్పించలేదు. తర్వాత ఎలన్ కాలేజీలో చదువుతున్న సమయంలో బాత్రూంలో గంజా తాగాను. కాలిఫోర్నియాకు వెళ్లినప్పుడు మ్యాజిక్ మష్రూమ్స్ వంటివి టేస్ట్ చేశా. 17 ఏళ్లప్పుడే వయసులో నాకంటే పెద్దావిడతో తొలి లైంగికానుభవం రుచి చూశా’’ అని వివరించారు. ‘‘12 ఏళ్ల వయసులో నా తల్లి డయానాను ప్రమాదంలో కోల్పోవడం బాధించింది. నిద్ర పోతున్న నన్ను లేపి నాన్న ఆ వార్త చెప్పారు. కానీ కనీసం నన్ను దగ్గరికి కూడా తీసుకుని ఓదార్చలేదు. మరణించిన నా తల్లితో ఎలాగైనా మాట్లాడేందుకు ‘శక్తులున్న’ ఒక మహిళను ఆశ్రయించా’’ అని చెప్పుకొచ్చారు. కెమిల్లాను పెళ్లి చేసుకోవాలని తండ్రి భావించినప్పుడు వద్దని తాను, విలియం బతిమాలామన్నారు. హ్యారీ బయట పెట్టిన ఈ అంశాలపై వ్యాఖ్యానించేందుకు రాజ కుటుంబం తిరస్కరించింది. -
నా అన్న కాలర్ పట్టి కొట్టాడు: ప్రిన్స్ హ్యారీ
శాక్రమెంటో: బ్రిటన్ రాజకుటుంబంలో కుటుంబ కలహాలు సమసిపోయి అంతా సర్దుకుంటుందనుకుంటున్న సమయంలో.. మరో పరిణామం చోటు చేసుకుంది. డ్యూక్ ఆఫ్ సస్సెక్స్, ప్రిన్స్ హ్యారీ సంచలనాలకు తెర తీశాడు. తన ఆత్మకథ ‘స్పేర్’ ద్వారా బయటి ప్రపంచానికి రాజ‘కుటుంబ’ కలహాలను పూసగుచ్ఛినట్లు వివరించేందుకు సిద్ధమయ్యాడు. ఈ క్రమంలో తన అన్న, ప్రిన్స్ ఆఫ్ వేల్స్ అయిన విలియమ్ తనపై భౌతిక దాడికి దిగాడని, అందుకు తన భార్య మేఘన్ మార్కెల్ కారణమని చెబుతూ పెద్ద షాకే ఇచ్చాడు. ది గార్డియన్ కథనం ప్రకారం.. స్పేర్ ఆత్మకథలోని ఆరో పేజీలో ప్రిన్స్ హ్యారీ ఈ విషయాన్ని తెలియజేశాడు. మేఘన్ మార్కెల్ విషయంలో తన అన్నతో తనకు వాగ్వాదం జరిగిందని, పట్టరాని కోపంతో విలియమ్ తనపై దాడికి దిగాడని హ్యారీ అందులో పేర్కొన్నాడు. మేఘన్ స్వభావాన్ని ఉద్దేశించి విలియమ్ అనుచిత వ్యాఖ్యలు చేశాడు. అయితే.. తన భార్య గురించి తప్పుగా మాట్లాడొద్దంటూ ఆమెకు మద్దతుగా హ్యారీ ఏదో సర్ది చెప్పబోయాడట. ఈ క్రమంలో సహనం కోల్పోయిన విలియమ్ పట్టరాని కోపంతో ఊగిపోయాడు. హ్యారీ గల్లా పట్టుకుని.. మరో చేత్తో మెడలో గొలసును లాగిపడేశాడు. హ్యారీని నేలకేసి కొట్టాడు. కింద.. కుక్కకు భోజనం పెట్టే పాత్ర తగిలి హ్యారీ వీపుకు గాయమైంది. కష్టంగానే పైకి లేచిన ప్రిన్స్ హ్యారీ.. బయటకు వెళ్లిపోమని విలియమ్ మీదకు అరిచాడు. కోపంగానే విలియమ్ గది నుంచి బయటకు వెళ్లిపోయాడు. ఈ పరిణామంతా చాలా వేగంగానే జరిగింది. ఈ ఘటనలో హ్యారీ వీపునకు అయిన గాయం మానడానికి నెలలు పట్టింది అని ఆ కథనం ఆ పేజీ సారాంశాన్ని తెలిపింది. ఇంకా ఈ బుక్.. ఎన్నో ఆసక్తికరమైన, రాజకుటుంబం నుంచి దిగ్భ్రాంతికరమైన విషయాలను వెలుగులోకి తేనుందని గార్డియన్ కథనం పేర్కొంది. జనవరి 10వ తేదీన స్పేర్ మార్కెట్లోకి రీలీజ్ కానుంది. గత సెప్టెంబర్‌లో తల్లి క్వీన్ ఎలిజబెత్-2 మరణం, ఈ మే నెలలో తండ్రి కింగ్ ఛార్లెస్-3కి పట్టాభిషేకం దరిమిలా.. మధ్యలో ఈ అన్నదమ్ముల ఘర్షణ గురించి వెలుగులోకి రావడం, అదీ హ్యారీ ఆత్మకథ ద్వారా కావడం ఇక్కడ గమనార్హం. కలిసిపోతారనుకున్న అన్నదమ్ములను.. ఆ ఆత్మకథ మరింత దూరం చేసేలా కనిపిస్తోంది!. 2020లో రాజరికాన్ని, బ్రిటన్ వదిలేసి హ్యారీ-మార్కెల్ జంట కాలిఫోర్నియాకు వెళ్ల స్థిరపడింది. ఆ సమయం నుంచే ఆ అన్నదమ్ముల మధ్య గ్యాప్ వచ్చింది. అయితే.. 2021లో ఈ ఆలుమగలు ఓప్రా విన్ఫ్రే ఇంటర్వ్యూలో పలు సంచలన విషయాలు వెల్లడించడం ద్వారా రాజకుటుంబంలోని అన్నదమ్ములు, వాళ్ల వాళ్ల భార్యల మధ్య కలహాలు వెలుగులోకి రావడం మాత్రమే కాదు.. ప్రపంచవ్యాప్తంగా విస్తృతంగా చర్చనీయాంశంగా మారాయి కూడా. -
ఎలిజబెత్-2 అంత్యక్రియల్లో ప్రిన్స్ హ్యరీ తీరుపై నెటిజన్ల ఫైర్
లండన్: బ్రిటన్ రాణి ఎలిజబెత్-2 అంత్యక్రియలు సోమవారం అశ్రునయనాల మధ్య జరిగిన విషయం తెలిసిందే. రాజకుటుంబంలోని సభ్యులందరితో పాటు 2,000 మంది అతిథులు, విదేశీ ప్రతినిధులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. అయితే రాణి అంత్యక్రియల్లో ఆమె మనవడు, కింగ్ చార్లెస్-3 చిన్న కుమారుడు ప్రిన్స్ హ్యారీ వ్యవహరించిన తీరుపై నెటిజన్ల నుంచి విమర్శలు వస్తున్నాయి. రాణి భౌతికకాయం వెస్ట్‌మినిస్టర్ అబెలో ఉన్నప్పుడు ఆమెకు నివాళిగా అందరూ జాతీయ గీతం 'గాడ్ సేవ్ ద కింగ్'ను ఆలపించారు. అయితే డేగ కళ్లున్న కొందరు ఈ సమయంలో ప్రిన్స్ హ్యారీని వీడియో తీశారు. ఆయన పెదాలు కదపనట్లు, జాతీయ గీతం ఆలపించనట్లు అందులో కన్పించింది. ఇందుకు సంబంధించిన వీడియోను ఓ వ్యక్తి ట్విట్టర్లో షేర్ చేయగా నెటిజన్ల నుంచి మిశ్రమ స్పందన వచ్చింది. Prince Harry not singing the national anthem 👀 #queensfuneral pic.twitter.com/laNk5JMZ6R — Kieran (@kierknobody) September 19, 2022 ప్రిన్స్ హ్యారీ.. రాణికి మీరిచ్చే మర్యాద ఇదేనా? అని ఓ యూజర్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. మరొకొందరు మాత్రం ప్రిన్స్ హ్యారీకి మద్దతుగా నిలిచారు. ఆయన జాతీయ గీతాన్ని ఆలపించారని, పెదాలు కదిలాయని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు. మరొకరేమో.. జాతీయ గీతం మారింది కాబట్టి ఆయనకు కష్టంగా అన్పించిందేమో ఓ సారి అవకాశం ఇచ్చిచూద్దాం అన్నాడు. మరో నెటిజన్.. ఈ కార్యక్రమంలో ఇంకా చాలా మంది ప్రిన్స్ హ్యారీలాగే ప్రవర్తించారని, కింగ్ చార్లెస్ కూడా పెదాలు కదపలేదన్నారు. వాళ్లను పట్టించుకోకుండా ఈయనపైనే ఎందుకుపడ్డారని ప్రశ్నించాడు. మరికొందరు మాత్రం తీవ్రమైన బాధలో ఉన్నప్పుడు నోట మాటరాదని, అందుకే ప్రిన్స్ హ్యారీ జాతీయ గీతాన్ని ఆలపించలేకపోయి ఉండవచ్చని ఆయనకు అండగా నిలిచారు. ఇందులో తప్పుపట్టాల్సింది ఏమీ లేదని చెప్పుకొచ్చారు. దీన్ని సీరియస్‌గా తీసుకోవద్దని సూచించారు. చదవండి: బ్రిటన్ రాణి అంత్యక్రియలు పూర్తి.. ప్రపంచ దేశాల అధినేతలు హాజరు -
హ్యారీకి అవమానం
లండన్: రాణి అస్తమయం నేపథ్యంలో విభేదాలు పక్కన పెట్టి దగ్గరవుతున్నారని భావించిన రాకుమారులు విలియం, హ్యారీ మధ్య దూరాన్ని మరింతగా పెంచే ఉదంతం తాజాగా చోటుచేసుకుంది. ఇది హ్యారీకి తీరని అవమానం కూడా మిగిల్చిందట. రాణి ఎలిజబెత్–2 మనవలు, మనవరాళ్లు శనివారం రాత్రి ఆమె భౌతికకాయాన్ని సందర్శించి నివాళులర్పించారు. విలియంతో పాటు హ్యారీ కూడా రాజు చార్లెస్–3 ప్రత్యేక అనుమతితో ఈ సందర్భంగా సైనిక దుస్తులు ధరించారు. కానీ వాటిపై ఉండాల్సిన రాణి అధికార చిహ్నమైన ‘ఈఆర్’ను తొలగించారు. పెద్ద కుమారుడైన యువరాజు విలియం సైనిక దుస్తులపై మాత్రం ఈఆర్ చిహ్నం అలాగే ఉంచారు. ఈ అవమానాన్ని తట్టుకోలేక హ్యారీకి గుండె పగిలినంత పనైందట. తండ్రితోనూ సోదరునితోనూ హ్యారీకి సత్సంబంధాలు లేవన్న విషయం తెలిసిందే. రాచకుటుంబం అభ్యంతరాలను కాదని ఆయన అమెరికా నటి మెగన్ మార్కెల్‌ను పెళ్లాడినప్పటినుంచీ విభేదాలు మరింతగా పెరిగాయి. ఈ నేపథ్యంలో హ్యారీ దంపతులు రాచరిక హోదా వదులుకున్నారు. దాంతో ఆయన సైనిక దుస్తులు ధరించే అర్హత కోల్పోయారు. ‘‘నాయనమ్మ అంత్యక్రియల సందర్భంగా ప్రత్యేక అనుమతితో వాటిని ధరిస్తే ఇంతటి అవమానం జరిగిందంటూ హ్యారీ కుమిలిపోయారు. ఇదంతా ఉద్దేశపూర్వకంగానే చేసిన పనేనని భావిస్తున్నారు. ఎందుకంటే సైనిక దుస్తులు ధరించే అర్హత లేని ఎలిజబెత్–2 కుమారుడు ప్రిన్స్ ఆండ్రూ సైనిక దుస్తులపై కూడా అధికార చిహ్నాన్ని యథాతథంగా కొనసాగించారు. కేవలం తన దుస్తులపై మాత్రమే తొలగించడం హ్యారీకి మరింత మనస్తాపం కలిగించింది’’ అని ఆయన మిత్రున్ని ఉటంకిస్తూ సండే టైమ్స్ కథనం పేర్కొంది. అంతేకాదు, ఆదివారం రాత్రి బకింగ్‌హాం ప్యాలెస్‌లో దేశాధినేతలకు చార్లెస్–3 అధికారిక విందు కార్యక్రమానికి కూడా హ్యారీ దంపతులను దూరంగా ఉంచారు. గురువారం హ్యారీ 38వ పుట్టిన రోజు. ఆ సందర్భంగా మెగన్తో కలిసి కార్లో వెళ్తుండగా విలియం తన ముగ్గురు పిల్లలను స్కూలు నుంచి కార్లో తీసుకొస్తూ ఎదురయ్యారు. ఇద్దరూ కార్ల అద్దాలు దించుకుని క్లుప్తంగా మాట్లాడుకుని ఎవరి దారిన వారు వెళ్లిపోయారట. -
Queen Elizabeth 2: ఏడుస్తున్న చిన్నారిని కౌగిలించుకున్న మేఘన్.. వీడియో వైరల్
లండన్: బ్రిటన్ రాణి ఎలిజబెత్ 2 గురువారం మరణించిన తర్వాత ఆమెకు నివాళులు అర్పించేందుకు వేల మంది విండ్సోర్ కాస్టిల్‌కు తరలివెళ్లారు. రాణి మనవడు ప్రిన్స్ హ్యారీ, అతని భార్య మేఘన్ మార్కెల్, మరో మనవడు ప్రిన్స్ విలియమ్, అతని భార్య కేట్ మిడిల్టన్ కలిసి ఈ కోటకు వెళ్లారు. రాణికి సంతాపం తెలిపేందుకు వచ్చినవారికి ధన్యవాదాలు తెలిపి వారితో కాసేపు ముచ్చటించారు. అయితే హ్యారీ భార్య మేఘన్.. కోట బయట ఏడుస్తున్న ఓ టీనేజర్‌ను ఆప్యాయంగా పలకరించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. ఆ బాలికతో మేఘన్ మాట్లాడిన తీరును నెటిజన్లు కొనియాడుతున్నారు. ఈ వీడియోలో ప్రిన్స్ హ్యారీ కోట బయట ఉన్నవారితో మాట్లాడుతుండగా.. నలుపు రంగు దుస్తుల్లో ఉన్న అతని భార్య మేఘన్ ఓ టీనేజర్ దగ్గరకు వెళ్లింది. ఏడుస్తున్న ఆ చిన్నారిని నీ పేరేంటని అడిగింది. అందుకు ఆ బాలిక అమెల్కా అని బదులిచ్చింది. నీపేరు చాలా బాగుందని చెప్పిన మేఘన్.. రాణికి నివాళులు అర్పించేందుకు వచ్చినందుకు కృతజ్ఞతలు చెప్పింది. మూడు గంటలుగా వారంతా వేచి చూస్తున్నారని తెలిసి ధన్యవాదాలు తెలిపింది. అంతేకాదు ఏడుస్తున్న అమెల్కాను దగ్గరకు తీసుకుని కౌగిలించుకుంది. ఈ వీడియోను ఓ వ్యక్తి మొదట టిక్‌టాక్‌లో షేర్ చేశాడు. ఆ తర్వాత అది వైరల్‌గా మారింది. View this post on Instagram A post shared by MEMEZAR • Comedy and Culture (@memezar) 2018లో ప్రేమ పెళ్లి చేసుకున్న హ్యారీ, మేఘన్ దంపతులకు ఇద్దరు పిల్లలు. 2021 మార్చి నుంచి వీరు రాజకుటుంబానికి దూరంగా అమెరికాలోని నివసిస్తున్నారు. రాణి మరణానికి ముందు అనుకోకుండా వారు బ్రిటన్‌లోనే ఉన్నారు. దీంతో కుటంబసభ్యులతో వెళ్లి రాణికి నివాళులు అర్పించారు. రాణి మరణంతో హ్యారీ, మేఘన్ మళ్లీ రాజకుటుంబానికి దగ్గరయ్యే అవకాశాలున్నాయని సన్నిహితవర్గాలు భావిస్తున్నాయి. చదవండి: బ్రిటన్ రాణి ఆ రోజే చనిపోతుందని ముందే చెప్పాడు.. ఇప్పుడు కింగ్ చార్లెస్ -
ఎడింబర్గ్‌కు రాణి భౌతికకాయం.. రాకుమారుల ఐక్యత!
లండన్: రాణి ఎలిజబెత్–2 చివరియాత్ర లాంఛనంగా మొదలైంది. రాణి భౌతికకాయాన్ని ఆమె తుదిశ్వాస విడిచిన బాల్మోరల్ కోట నుంచి ఆదివారం స్కాట్లండ్ రాజధాని ఎడింబర్గ్‌లోని రాణి అధికారిక నివాసం హోలీ రుడ్‌హౌస్ ప్యాలెస్‌కు తరలించారు. ఈ సందర్భంగా తమ రాణిని కడసారి చూసుకునేందుకు ప్రజలు దారికిరువైపులా వేలాదిగా బారులు తీరారు. శవపేటికతో కూడిన వాహన కాన్వాయ్ వారి నివాళుల మధ్య ఆరు గంటల పాటు ప్రయాణించి ఎడింబర్గ్ చేరింది. రాణి భౌతికకాయాన్ని సోమవారం మధ్యాహ్నం దాకా ఎడింబర్గ్‌లో ప్రజల సందర్శనార్థం ఉంచుతారు. అనంతరం మంగళవారం విమానంలో లండన్‌కు తరలిస్తారు. వెస్ట్‌మినిస్టర్ ప్యాలెస్‌లో నాలుగు రోజుల పాటు ప్రజల సందర్శనార్థం ఉంచుతారు. అనంతరం 19న అంత్యక్రియలు జరుగుతాయి. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌తో పాటు పలువురు ప్రపంచ దేశాధినేతలు పాల్గొననున్నారు. రాకుమారుల ‘ఐక్యత’ విభేదాల వార్తల నేపథ్యంలో దివంగత రాణి మనవలు, కింగ్ చార్లెస్–3 కుమారులు ప్రిన్స్ విలియం, ప్రిన్స్ హ్యారీ దంపతులు శనివారం కలసికట్టుగా ప్రజలకు కన్పించారు. విండ్సర్ ప్యాలెస్ నుంచి నలుగురూ కలిసే బయటికొచ్చారు. బయట రాణికి నివాళులు అర్పించేందుకు గుమిగూడిన ప్రజలతో కాసేపు కలివిడిగా గడిపారు. మరోవైపు, సోమవారం రాజ దంపతులు వెస్ట్‌మినిస్టర్ హాల్లో పార్లమెంటు ఉభయ సభల సమావేశంలో పాల్గొని రాణికి నివాళులర్పిస్తారు. ఇదీ చదవండి: కడసారి చూపునకు కూడా రానివ్వలేదా? -
రాణి కడసారి చూపునకు... మెగన్‌ను రానివ్వలేదు!
లండన్: బ్రిటన్ నూతన రాజు చార్లెస్–3 కుటుంబంలో కొన్నేళ్లుగా నెలకొన్న విభేదాలు రాణి ఎలిజబెత్–2 అస్తమయం సందర్భంగా మరోసారి తెరపైకి వచ్చాయి. చార్లెస్, ఆయన పెద్ద కుమారుడు ప్రిన్స్ విలియంతో చిన్న కుమారుడు ప్రిన్స్ హ్యారీకి చాలా ఏళ్లుగా సత్సంబంధాలు లేని విషయం తెలిసిందే. రాజకుటుంబం అభ్యంతరాలను పట్టించుకోకుండా అమెరికా నటి మెగన్ మార్కెల్‌ను హ్యారీ పెళ్లాడటంతో విభేదాలు బాగా ముదిరాయి. తర్వాతి పరిణామాల నేపథ్యంలో హ్యారీ దంపతులు సంచలన రీతిలో రాజరిక హోదానే వదులుకునేందుకు దారితీశాయి. ఈ నేపథ్యంలో గురువారం స్కాట్లండ్‌లోని బాల్మోరల్ కోటలో మృత్యుశయ్యపై ఉన్న రాణిని చూసేందుకు మెగన్ రావడానికి వీల్లేదని చార్లెస్ పట్టుబట్టారట. హ్యారీ దంపతులు గురువారం లండన్‌లోనే ఉన్నారు. రాణి కడసారి చూపుకు వారిద్దరూ బాల్మోరల్ బయల్దేరుతున్నట్టు తెలియగానే చార్లెస్ నేరుగా హ్యారీకి ఫోన్ చేసి, ‘‘అతి కొద్దిమంది రక్త సంబంధీకులం తప్ప ఎవరూ రావడం లేదు. కేట్ మిడిల్టన్ (విలియం భార్య) కూడా రావడం లేదు. కాబట్టి మెగన్ రాక అస్సలు సరికాదు’’ అని చెప్పినట్టు సమాచారం. దాంతో హ్యారీ ఒంటరిగానే వెళ్లి నాయనమ్మకు నివాళులు అర్పించారు. గురువారమే మొదటిసారిగా కొత్త స్కూల్‌కు వెళ్తున్న తన ఇద్దరు పిల్లల కోసం మిడిల్టన్ లండన్‌లోనే ఉండిపోయారు. ముందునుంచీ విభేదాలే విలియం, హ్యారీ సోదరుల మధ్య ఏనాడూ పెద్దగా సఖ్యత లేదు. తండ్రితో, అన్నతో మనస్ఫర్ధలను పలుమార్లు టీవీ ఇంటర్వ్యూల్లో హ్యారీ బాహాటంగానే వెల్లడించారు. అప్పటికే పెళ్లయి విడాకులు తీసుకున్న అమెరికా నటి అయిన మెగన్తో తన ప్రేమాయణం వారికి నచ్చకపోయినా పట్టించుకోలేదు. గొడవల నేపథ్యంలో హ్యారీ దంపతులు రాచరిక హోదాను వదులుకుని రెండేళ్లుగా అమెరికాలోని కాలిఫోర్నియాలో ఉంటున్నారు. 2021లో ప్రఖ్యాత అమెరికా టాక్ షో హోస్ట్ ఓప్రా విన్ఫ్రేకు వారిచ్చిన ఇంటర్వ్యూ పెను సంచలనం సృష్టించింది. రాజ కుటుంబీకుల జాత్యహంకార వ్యాఖ్యలు, ప్రవర్తన తననెంతగానో గాయపరిచాయంటూ మెగన్ తీవ్ర ఆరోపణలు చేసింది. ‘‘పెళ్లికూతురుగా ముస్తాబవుతున్న సమయంలో మిడిల్డన్ నన్ను సూదుల్లాంటి మాటలతో తీవ్రంగా గాయపరిచింది. తట్టుకోలేక ఒక దశలో ఆత్మహత్య చేసుకోవాలని కూడా అనుకున్నా’’ అంటూ దుయ్యబట్టింది. ఈ ఆరోపణలు, మొత్తంగా బ్రిటన్ రాచరిక వ్యవస్థపైనే ఆమె ఎక్కుపెట్టిన పదునైన విమర్శలు అప్పట్లో పెను దుమారం రేపాయి. రాజ కుటుంబానికి మాయని మచ్చగా మిగల్చడమే గాక వారి హృదయాల్లో మంటలు రేపాయి. అన్నదమ్ముల మధ్య విభేదాలను మరింత పెంచాయి. తల్లిదండ్రులుగా చార్లెస్, కెమిల్లా పూర్తిగా విఫలమయ్యారంటూ హ్యారీ కూడా దుయ్యబట్టారు. తండ్రి అయితే తన ఫోన్ కూడా ఎత్తడం మానుకున్నారని ఆరోపించారు. ఒకవైపు రాణి ఎలిజబెత్ భర్త ఫిలిప్ మరణించిన దుఃఖంలో ఉన్న రాజ కుటుంబాన్ని ఈ ఆరోపణలు మరింత కుంగదీశాయి. ఆ సమయంలో నిండుచూలాలిగా ఉన్న మెగన్ ఫిలిప్ అంత్యక్రియల్లో కూడా పాల్గొనలేదు. అయితే హ్యారీతో పాటు మెగన్‌ను కూడా రాణి ఎంతో ఇష్టపడేవారనే చెబుతారు. మెగన్ అమెరికా వెళ్లి రాణి అంత్యక్రియల సమయానికి లండన్ తిరిగొస్తారని సమాచారం. దూరమైన కుటుంబీకులను విషాద సమయాలు దగ్గర చేస్తాయంటారు. బ్రిటిష్ రాజ కుటుంబం విషయంలో అది నిజమవుతుందో లేదో అంత్యక్రియల నాటికి స్పష్టత వస్తుంది. -
బ్రిటన్ రాణి మరణానికి ముందు ఇంత జరిగిందా?
లండన్: బ్రిటన్ రాణి ఎలిజబెత్-2 గురువారం కన్నుమూసిన విషయం తెలిసిందే. అయితే ఆమె చనిపోవడానికి ముందు రాజకుటుంబ నివాసం బల్మోరల్ కాస్టిల్లో జరిగిన విషయాలపై బ్రిటీష్ మీడియా ఆసక్తికర కథనాలు ప్రచురించింది. ఎలిజబెత్ కుమారుడు ప్రిన్స్ చార్లెస్ తన చిన్న కూమారుడు హ్యారీకి ఓ విషయం తేల్చిచెప్పినట్లు పేర్కొంది. ఎలిజబెత్‌ను చివరి క్షణాల్లో చూసేందుకు హ్యారీ తన భార్య మెర్కెల్‌ను తీసుకురావద్దని చార్లెస్ చెప్పారని వెల్లడించింది. 'మహారాణి చనిపోయే ముందు అతి తక్కువ మంది దగ్గరి బంధువులే పరిమిత సంఖ్యలో ఆమెతో పాటు ఉంటున్నారు. ఇలాంటి బాధాకరమైన సమయంలో మెర్కెల్‌ను ఇక్కడకు తీసుకురావడం సరికాదు. అందుకే ఆమెను తీసుకురావొద్దు' అని ప్రిన్స్ చార్లెస్ తన కుమారుడు హ్యారితో చెప్పినట్లు ది సన్, స్కై న్యూస్ వార్తా సంస్థలు తెలిపాయి. ఈ కారణంతోనే గురువారం ఎలిజబెత్ చనిపోవడానికి ముందు హ్యారీనే బల్మోరల్ క్యాస్టిల్కు చివరగా చేరుకున్నట్లు తెలుస్తోంది. ఆమె మరణాంతరం శుక్రవారం రోజు క్యాస్టిల్‌ను వీడిన తొలి వ్యక్తి కూడా హ్యారీనే అని సమాచారం. దీంతో బ్రిటన్ రాజకుటుంబంలో వివాదాలు మరోసారి చర్చనీయాంశమయ్యాయి. నానమ్మతో అన్యోన్యంగా.. గతంలో ఎలిజబెత్ ఆమె మనవడు హ్యారీల మధ్య అత్యంత సన్నిహిత సంబంధాలు ఉండేవి. ఇద్దరూ ఎంతో అన్యోన్యంగా ఉండేవారు. 2016లో బరాక్ ఒబామా, మిచేలీ ఒబామా దివ్యాంగుల కోసం ఇన్విక్టస్ గేమ్స్ కాంపిటీషన్‌ను ప్రారంభించినప్పుడు ఎలిజబెత్, హ్యారీల రియాక్షన్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ గేమ్స్‌కు హ్యారీనే ప్రమోటర్‌గా వ్యవహరించారు. ఇంటర్వ్యూలో సంచలన ఆరోపణలు.. అయితే అమెరికాకు చెందిన మేఘన్‌ను ప్రేమించి పెళ్లి చేసుకున్న తర్వాత హ్యారికి రాజకుటుంబంతో సంబంధాలు బలహీనపడ్డాయి. ఈ దంపతులు 2021 మార్చిలో ఓప్రా విన్ఫ్రేకు ఇంటర్వ్యూ ఇచ్చినప్పుడు మేఘన్ సంచలన ఆరోపణలు చేశారు. రాజకుటుంబంలో తాను జాతివివక్షను ఎదుర్కొన్నట్లు చెప్పారు. అది భరించలేక తనకు ఆత్మహత్య చేసుకోవాలనే ఆలోచనలు కూడా వచ్చాయని పేర్కొన్నారు. అంతేకాదు తాను గర్భవతిగా ఉన్నప్పుడు తనకు పుట్టబోయే బిడ్డ ఏ రంగులో ఉంటాడా? అని రాజకుటుంబంలో చర్చించుకునేవారని తెలిపారు. మేఘన్ తల్లి నల్లజాతీయురాలు కాగా.. తండ్రి శ్వేతజాతీయుడు. అప్పటి నుంచి మరింత దూరం ఈ ఇంటర్వ్యూ అనంతరం రాజకుటుంబంపై ప్రపంచవ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తాయి. అయితే బకింగ్‌హామ్ ప్యాలెస్ వీటిని తోసిపుచ్చింది. మేఘన్ ఆరోపణలు ఆందోళన కల్గించాయని పేర్కొంది. అప్పటినుంచి హ్యారీ దంపతులకు రాజకుటుంబంతో సంబంధాలు తెగిపోయాయి. ఇద్దరూ ఆమెరికాలో నివాసముంటున్నారు. తమకు రాజకుటుంబం హోదా వద్దని ప్రకటించారు. అయితే తల్లి మృతి అనంతరం కొత్త రాజుగా బాధ్యతలు చేపట్టిన కింగ్ చార్లెస్ తన మొదటి ప్రసంగంలో హ్యారీ, మేఘన్‌ల గురించి ప్రస్తావించారు. విదేశాలో నివసిస్తున్న ఈ ఇద్దరిపై కూడా తనకు ప్రేమ ఉందని పేర్కొన్నారు. అయితే ఎలిజబెత్-2 మరణానికి ముందు హ్యారీ బ్రిటన్‌లోనే ఉన్నారు. అయితే ఇది యాదృచ్చికమే అని బ్రిటీష్ మీడియా సంస్థలు తెలిపాయి. చదవండి: తీవ్ర దుఃఖంలో ఉన్న కింగ్ చార్లెస్‌కు ముద్దు పెట్టిన మహిళ -
అగ్గి రాజేసిన భార్యలు.. ఆ అన్నదమ్ములు మళ్లీ ఒక్కటయ్యేనా?
రాజకుటుంబంలో మునుపెన్నడూ చూడని పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఊహించలేనంతగా కుటుంబంలో మనస్పర్థలు తారాస్థాయికి చేరుకున్నాయి. దివంగత ప్రిన్సెస్ ఆఫ్ వేల్స్ డయానాకు పుట్టిన బిడ్డలిద్దరూ.. తిరిగి మునుపటిలా అనోన్యంగా పలకరించుకునే పరిస్థితులు కనిపించడం లేవు. అందుకు కారణం భార్యాలు రాజేసిన చిచ్చే కారణమనే చర్చ నడుస్తోంది అక్కడ. తల్లి ప్రిన్సెస్ డయానా(బ్రిటిష్ రాజ కుటుంబానికి చెందిన ప్రిన్స్ చార్లెస్ మొదటి భార్య) చనిపోయి పాతికేళ్లు గడుస్తున్నాయి. ఆమె సంతానం ప్రిన్స్ విలియమ్(40), హ్యారీ(37)ల మధ్య మనస్పర్థలు మాత్రం ఏళ్లు గడుస్తున్నా సమసిపోవడం లేదు. మెగ్జిట్(రాయల్ డ్యూటీస్ నుంచి ప్రిన్స్ హ్యారీ, ఆయన భార్య మేఘన్ తప్పుకుంటున్నట్లు ప్రకటించడం) తర్వాత ఈ ఇద్దరూ మాట్లాడుకోవడం కనిపించింది లేదు. విలియం.. రాయల్ స్థాపనను స్వీకరించి.. మరిన్ని బాధ్యతలను చేపట్టి హుందాగా ముందుకెళ్తున్నాడు. ఇక హ్యారీ ఏమో కాలిఫోర్నియాలో జీవితం కోసం రాజ సంప్రదాయాలను తిరస్కరించి, భార్యతో కలిసి రాజప్రసాద వ్యవహారాలపై సంచలన ఆరోపణలు చేశాడు. ► అన్నదమ్ముల వైరం చాలా దూరం వెళ్లిందని, వాళ్లు తిరిగి కలుసుకోవడం అనుమానమేనని రాజ కుటుంబ వ్యవహారాలపై తరచూ స్పందించే రిచర్డ్ ఫిట్జ్‌విలియమ్స్ పేర్కొన్నాడు. పరిస్థితులనేవి ఎలా మారిపోయాయో ఆయన పాత సంగతుల్ని గుర్తు చేస్తూ మరీ చెప్తున్నారాయన. ► 1997 ఆగష్టు 31వ తేదీన 36 ఏళ్ల వయసులో డయానా రోడ్డు ప్రమాదంలో మరణించారు. అప్పటికి విలియమ్ వయసు 15, హ్యారీ వయసు 12. ► ఇద్దరూ ఎటోన్ బోర్డింగ్ స్కూల్లో చదువుకున్నారు. విలియమ్ పైచదువులకు యూనివర్సిటీ వెళ్లగా.. హ్యారీ మాత్రం మిలిటరీ ట్రైనింగ్ తీసుకున్నాడు. ► తన ప్రియురాలు కేట్ మిడెల్టన్తో 2011లో విలియమ్ వివాహం జరిగే నాటికి.. ఈ అన్నదమ్ముల అనుబంధం చాలా బలంగా ఉండిపోయింది. ► ఈ అన్నదమ్ముల వల్లే రాజకుటుంబం బలోపేతం అయ్యిందంటూ చర్చ కూడా నడిచింది. కానీ.. ► హ్యారీ 2018లో మేఘన్‌ను వివాహం చేసుకోవడం, భార్య కోసం రాజరికాన్ని వదులుకోవడంతో పరిస్థితులు తారుమారు అయ్యాయి. ► రాజకుటుంబంలో చెలరేగిన అలజడి.. అంతర్గతంగా ఏం జరిగిందో బయటి ప్రపంచానికి ఓ స్పష్టత లేకుండా పోయింది. కానీ, అప్పటి నుంచి ఆ అన్నదమ్ముల మధ్య సంబంధాలు బెడిసికొట్టాయి. ► ఏడాది తర్వాత ఓ ఇంటర్వ్యూలో ‘మా అన్నదమ్ముల దారులు వేరంటూ’ హ్యారీ చేసిన ప్రకటన సంచలనంగా మారింది. ► ఆపై హ్యారీ, మేఘన్‌లు రాజరికాన్ని వదిలేసుకుంటూ.. అమెరికాకు వెళ్లిపోవడంతో ఇంటి పోరు రచ్చకెక్కింది. ► ఓఫ్రా విన్ఫ్రే ఇంటర్వ్యూలో.. మేఘన్, కేట్ మీద సంచలన ఆరోపణలు చేసింది. ఈ ఆరోపణలపై విస్తృత స్థాయిలో చర్చ కూడా నడిచింది. ► తన తల్లి డయానాను వెంటాడిన పరిస్థితులే తన భార్యకూ ఎదురుకావడం ఇష్టం లేదంటూ హ్యారీ చేసిన వ్యాఖ్యలు రాజకుటుంబంలో కలహాల తీవ్రతను బయటపెట్టాయి. ► ఓఫ్రా విన్ఫ్రే ఇంటర్వ్యూలో భార్యాభర్తలిద్దరూ చేసిన వ్యాఖ్యలపై ప్రిన్స్ విలియమ్ స్పందించాడు. తమదేం రేసిస్ట్ ఫ్యామిలీ కాదంటూ ఆరోపణల్ని ఖండించాడు. ► చాలాకాలం ఎడమొహం పెడమొహం తర్వాత.. 2021 జులైలో కెన్సింగ్టన్ ప్యాలెస్ బయట డయానా విగ్రహావిష్కరణ కార్యక్రమానికి ఈ ఇద్దరు అన్నదమ్ములు హాజరయ్యారు. దీంతో ‘ఒక్కటయ్యారంటూ’ కథనాలు వచ్చాయి. ► అయితే.. ఓఫ్రా విన్ఫ్రే ఇంటర్వ్యూలో సోదరుడు, అతని భార్య చేసిన వ్యాఖ్యలపై ప్రిన్స్ విలియమ్ తీవ్రంగానే నొచ్చుకున్నట్లు ఉన్నాడు. అందుకే ఆ తర్వాత సోదరుడిని కలుసుకున్నప్పటికీ ముఖం చాటేస్తూ వచ్చాడు. ► ఆ ప్రభావం జూన్ 2022 క్వీన్ ఎలిజబెత్ 2 ప్లాటినం జూబ్లీ వేడుకల్లో స్పష్టంగా కనిపించింది. ► ఏ కార్యక్రమంలోనూ ఈ ఇద్దరు అన్నదమ్ములు మాట్లాడుకోలేదు. ► హ్యారీ, మేఘన్‌లు ఈ సెప్టెంబర్‌లో యూకే వెళ్లనున్నారు. రాణి విండ్సోర్ ఎస్టేట్‌లో బస చేయనున్నారు. ఇది ప్రిన్స్ విలియమ్ కొత్త ఇంటికి దగ్గర్లోనే ఉండడం గమనార్హం. ► ఇక ప్రిన్స్ విలియమ్ కూడా ఎర్త్‌షాట్ ప్రైజ్ సమ్మిట్ కోసం సెప్టెంబర్‌లోనే కాస్త వ్యవధితో న్యూయార్క్‌కు వెళ్తున్నాడు. ఆ సమయంలో హ్యారీని కలిసే అవకాశాలు కనిపించడం లేదు. ► అయితే ఈ పర్యటనలోనూ విలియమ్-హ్యారీ కలిసే అవకాశాలు కనిపించడం లేదు. అయితే ఎంత మనస్పర్థలు నెలకొన్నప్పటికీ ఈ ఇద్దరూ కలుస్తారనే ఆశాభావంలో ఉన్నారు రాజకుటుంబ బాగోగులు కోరుకునేవాళ్లు. -
Shilpa Yarlagadda: పింక్ రింగ్ శిల్ప!
తాజాగా టైమ్ మ్యాగజీన్ కవర్ ఫోటో మీద ప్రిన్స్ హారీ మేఘనా మెర్కెల్ జంట ఆకర్షణీయంగా కనిపించింది. అయితే వీరిద్దరూ ధరించిన డ్రెస్‌లు, ఆభరణాలలో ముఖ్యంగా మెర్కెల్ వేలికి తొడిగిన ‘డ్యూయెట్ పింక్ డైమండ్ రింగు’ ప్రత్యేకంగా ఉండడంతో చూపరుల దృష్టిని ఆకర్షిస్తోంది. ఒక మహిళ మరొకరికి మద్దతు ఇస్తోంది అని చెప్పే ‘పింక్ వాగ్దానం’కు గుర్తుగా ఈ రింగును రూపొందించినట్లుగా ఆ ఉంగరాన్ని డిజైన్ చేసిన సంస్థ ‘శిఫాన్’ చెబుతోంది. రింగు బాగా పాపులర్ అవ్వడంతో రింగును రూపొందించిన డిజైనర్ శిల్పా యార్లగడ్డ పేరు కూడా ప్రముఖంగా వినిపిస్తోంది. శిల్ప పేరు తెరమీదకు రావడానికి ఒక పింక్ డైమండ్ రింగేగాక, చిన్న వయసులోనే డైమండ్ జ్యూవెలరీ స్టార్టప్‌ను ప్రారంభించి విజయవంతమైన ఎంట్రప్రెన్యూర్‌గా రాణిస్తూ, తనకు వచ్చిన లాభాల్లో కొంత భాగాన్ని ఔత్సాహిక ఎంట్రప్రెన్యూర్లను ప్రోత్సహించడానికి వినియోగించడం మరో కారణం. ఒక పక్క తన చదువు ఇంకా పూర్తికాలేదు. కానీ తను ఒక సక్సెస్ ఫుల్ ఎంట్రప్రెన్యూర్‌గా రాణిస్తూ.. తనలాంటి ఎంతోమందికి చేయూతనివ్వడమే లక్ష్యంగా పనిచేస్తోంది శిల్పా యార్లగడ్డ. శిఫాన్ అమెరికాలోని సిలికాన్ వ్యాలీలో పెరిగిన శిల్పా యార్లగడ్డ భారత సంతతికి చెందిన అమ్మాయి. శిల్ప హైస్కూల్లో ఉన్నప్పుడు నాసా, మైక్రోసాఫ్ట్ రీసెర్చ్‌లలో ఇంటర్న్‌షిప్ చేసింది. అప్పుడు కంప్యూటర్ సైన్స్ చదవాలనుకుంది. ఈ క్రమంలోనే హార్వర్డ్ యూనివర్సిటీలో ఎమ్ఐటీ మొదటి ఏడాది చదివేటప్పుడు.. తన చుట్టుపక్కల ఉన్న జ్యువెలరీ సంస్థలన్నీ పురుషులే నిర్వహించడం చూసేది. ఈ రంగంలోకి మహిళలు కూడా అడుగుపెట్టాలి అని భావించి... వివిధ రకాల ఆభరణాలను ఎలా తయారు చేయాలి? తక్కువ ఖర్చులో మన్నిక కలిగిన ఆభరణాల తయారీ ఎలా... అనే అంశాలపై గూగుల్‌లో త్రీవంగా వెతికేది. త్రీడీ ప్రింటింగ్ ద్వారా తక్కువ ఖర్చులో అందమైన జ్యూవెలరీ తయారు చేయవచ్చని తెలుసుకుని స్నేహితులతో కలిసి 2017లో డైమండ్స్‌కు బాగా పేరున్న న్యూయార్క్‌లో ‘శిఫాన్’ పేరిట జ్యూవెలరీ స్టార్టప్‌ను ప్రారంభించింది. శిఫాన్ ప్రారంభానికి ‘అన్‌కట్ జెమ్స్’ సినిమా కూడా శిల్పకు ప్రేరణ కలిగించింది. వజ్రాలతో తయారు చేసిన సింగిల్ పీస్ జ్యూవెలరీని విక్రయించడం ప్రారంభించింది. 2 018లో ఎమ్మీ అవార్డుల కార్యక్రమంలో స్టైలిస్ట్ నికోల్ కిడ్మ్యాన్స్ క్లైంట్ శిఫాన్ సంస్థ రూపొందించిన రింగ్ ధరించి రెడ్ కార్పెట్‌పై నడవడంతో అప్పుడు శిఫాన్కు మంచి గుర్తింపు వచి్చంది. అప్పటి నుంచి శిఫాన్ డైమండ్ జ్యూవెలరీ విక్రయాలు పెరిగాయి. డ్యూయెట్ హూప్స్.. గతేడాది నవంబర్‌లో ‘డ్యూయెట్ హూప్స్’ పేరుమీద రెండో జ్యూవెలరీని ప్రారంభించింది శిల్పా యార్లగడ్డ. ఆదర్శవంతమైన దంపతుల కోసం ప్రత్యేకంగా రూపొందించిన పింక్ డైమండ్ రింగును అందుబాటులోకి తీసుకొచ్చారు. పింక్ డైమండ్ రింగు స్పైరల్ ఆకారంలో అడ్జెస్టబుల్‌గా ఉంటుంది. మొదట ఒక పెద్ద సైజులో డైమండ్, దాని తరువాత చిన్న డైమండ్ ఉండడం ఈ రింగు ప్రత్యేకత. ఈ మోడల్ రింగును ఆమెరికా మాజీ అధ్యక్షుడు ఒబామా సతీమణి మిషెల్ ఒబామా, టెన్నిస్ దిగ్గజం సెరెనా విలియమ్స్ ధరించడంతో ఆ మోడల్ బాగా పాపులర్ అయింది. అయితే ఈ పింక్ రింగును అమ్మగా వచ్చే ఆదాయంలో యాభై శాతం డబ్బును ‘స్టార్టప్ గర్ల్ ఫౌండేషన్’కు శిల్ప అందిస్తోంది. ఇప్పటికే పెప్పర్, ఇటెర్నెవా, కిన్షిప్, సీ స్టార్ వంటి కంపెనీలకు నిధులు సమకూర్చింది. కాగా పింక్ రింగ్ ధర 155 డాలర్ల నుంచి 780 డాలర్లు ఉండడం విశేషం. ప్రస్తుతం గ్రాడ్యుయేషన్ ఫైనలియర్ చదువుతోన్న శిల్ప తన చదువు పూర్తయ్యాక పూర్తి సమయాన్ని శిఫాన్ కోసం కేటాయించనుంది. కాలం తిరిగి రాదు జ్యూవెలరీ తయారీ పరిశ్రమ మహిళలకు సంబంధించినది. కానీ ఈ పరిశ్రమలన్నీ పురుషులే నిర్వహిస్తున్నారు. అందుకే ఈ రంగంలో ఎక్కువమంది మహిళలు రావాలనుకున్నాను. ఈ క్రమంలోనే స్టార్టప్ గర్ల్ ఫౌండేషన్లకు నిధులు సమకూర్చి ప్రోత్సహిస్తున్నాను. ఒక పక్క చదువుకూంటూ మరోపక్క ఒక కంపెనీ స్థాపించి దాని ఎదుగుదలకు కృషిచేయడం సవాలుతో కూడుకున్నది. కానీ ‘జీవితంలో ఏదైనా తిరిగి తెచ్చుకోవచ్చు గానీ కరిగిపోయిన కాలాన్ని వెనక్కు తెచ్చుకోలేం’ అని ఒకరిచి్చన సలహా నా మనస్సుకు హత్తుకోవడంతో ఈ రెండూ చేయగలుగుతున్నాను. చదవండి: Mystery: న్యోస్ సరస్సు.. రాత్రి రాత్రే ఆ ఊళ్లన్నీ శ్మశానాలైపోయాయి! -
తల్లిదండ్రులైన హ్యారీ దంపతులు.. బుజ్జాయి పేరేమిటంటే!
కాలిఫోర్నియా: రాచరికాన్ని వదులుకుని సామాన్య జీవితం గడుపుతున్న ప్రిన్స్ హ్యారీస్, మేఘన్ మార్కెల్ దంపతులు ఆనందడోలికల్లో తేలిపోతున్నారు. చుట్టుముట్టిన కష్టాల నడుమ వారింట్లో బోసి నవ్వులు విరబూశాయి. మేఘన్-హ్యారీ దంపతులు ముద్దులొలికే పసిపాపకి తల్లిదండ్రులయ్యారు . జూన్ 4న కాలిఫోర్నియాలోని శాంట బార్బరా కాటేజ్ హాస్పటిల్‌లో మేఘన్ మార్కెట్ ప్రసవించింది. అప్పుడు హ్యరీ కూడా అక్కడే ఉన్నారు. వారి పేర్ల కలయికతో హ్యారీ, మేఘన్ జీవితాల్లోకి వచ్చిన చిన్నారికి లిల్లీ డయానా అని పేరు పెట్టుకున్నారు. ఈ పేరు వెనక పెద్ద కథే ఉంది. ప్రస్తుతం బ్రిటిష్ రాజకుటుంబ మహారాణి ఎలిజబెత్ చిన్నప్పటి ముద్దుపేరు లిల్లీబెట్. అలాగే రాచరికపు ఆంక్షలను ఎదిరించి చనిపోయిన తన హ్యారీ తల్లి పేరు డయానా. వీరిద్దరి గౌరవార్థం తన కూతురికి లిల్లీబెట్ డయాన మౌంట్‌బాటెన్ విండ్సర్ గా పేరు పెట్టారు. హ్యారీ- మేఘన్‌లకు ఇంతకు ముందు ఆర్చీ అనే కొడుకు 2019లో జన్మించాడు. -
అమ్మను చంపేశారు.. తనను కూడా వదలరా?: హ్యారీ
లండన్: ‘‘అమ్మ అంత్యక్రియల నాడు నాకు వినిపించిన గుర్రాల గిట్టల శబ్దం నుంచి.. కారులో నేను అమ్మతో ప్రయాణిస్తుండగా.. మమ్మల్ని వెంటాడిన ఫోటోగ్రాఫర్ల వరకు ప్రతి జ్ఞాపకం నన్ను ఇంకా వెంటాడుతూనే ఉంది.. అమ్మను కోల్పోయిన బాధ ఇప్పటికి నన్ను కలచివేస్తూనే ఉంది’’ అంటూ ప్రిన్స్ హ్యారీ భావోద్వేగానికి గురయ్యారు. ఇక అమ్మలాగే.. నా భార్యను కూడా కోల్పోతాననే భయంతోనే రాచకుంటుంబాన్ని విడిచిపెట్టి వెళ్లానని తెలిపాడు హ్యారీ. ఒక కొత్త టీవీ డాక్యుమెంటరీ సిరీస్ ది మీ యూ కాన్ట్ సీలో తన మనోవేదనను వెల్లడించారు హ్యారీ. హ్యారీ మాట్లాడుతూ.. ‘‘మా అమ్మ తెల్ల జాతీయుడు కానీ మరో వ్యక్తితో రిలేషన్లో ఉన్న నాటి నుంచి.. ఆమె మరణం వరకు ఫోటోగ్రాఫర్లు తనను వెంబడిస్తూనే ఉన్నారు. చివరకు ఏం జరిగిందో అందరికి తెలుసు. ఆమె మరణించిన తర్వాత కూడా వదల్లేదు. ఇప్పుడు తను(మేఫన్) చనిపోయే వరకు కూడా ఆగరు.. చరిత్ర పునరావృతం చేయాలని మీరు భావిస్తున్నారా’’ అంటూ ఆవేదనకు గురయ్యాడు. ఇది ఇలానే కొనసాగితే.. నా జీవితంలో మరో స్త్రీని కోల్పోయే అవకాశం ఉంది. అందుకే రాజ కుటుంబం నుంచి బయటకు వచ్చాను’’ అన్నాడు హ్యారీ. హ్యారీ, అతని అమెరికన్ భార్య మేఘన్ మార్కెల్ గురించి బ్రిటిష్ పత్రికలలో జాత్యహంకార వార్తలు వెలువడ్డాయి. అలానే సోషల్ మీడియాలో కూడా ఆమె గురించి తప్పుడు ప్రచారం జరిగింది. ఇక మేఘన్ మొదటిసారి గర్భవతిగా ఉన్నప్పుడు బ్రిటన్‌లో ఆమెకు ఎదురైన చేదు అనుభవాల వల్ల ఆత్మహత్య చేసుకోవాలని భావించిందని తెలిపాడు హ్యారీ. ఈజిప్టుకు చెందిన తన ప్రియుడు డోడి ఫయేద్‌తో కలిసి ప్రయాణిస్తున్న కారును ఛాయాచిత్రకారులు వెంబడించడంతో పారిస్‌లో జరిగిన ప్రమాదంలో యువరాణి డయానా 1997 లో 36 ఏళ్ళ వయసులో మరణించింది. ఆ సమయంలో హ్యారీకి 12 సంవత్సరాలు. ఈ డాక్యుమెంటరీలో, హ్యారీ తన సోదరుడు విలియం, తండ్రి ప్రిన్స్ చార్లెస్, మామ చార్లెస్ స్పెన్సర్‌తో కలిసి లండన్ వీధుల గుండా డయానా శవపేటిక వెనుక నడుస్తున్న నాటి అనుభవాలను గుర్తు చేసుకున్నాడు. ‘‘నేను ఆ దారి వెంబడి నడుస్తున్నాను.. నాకు గుర్రాల గిట్టల శబ్దం వినిపిస్తుంది.. నేను నా శరీరాన్ని విడిచిపెట్టి.. బయటకు వచ్చినట్లు అనిపించింది. ఉక్కిరిబిక్కిరి అయ్యాను’’ అంటూ నాటి అనుభవాలను గుర్తు చేసుకున్నాడు హ్యారీ. ‘‘ఈ బాధను నేను దాదాపు 20 ఏళ్ల పాటు అణిచిపెట్టుకున్నాను.. తాగుడుకు అలవాటు పడ్డాను. కెమరాలు చూస్తే నాకు చాలా కోపం వస్తుంది. వీరు ఓ నిస్సహాయ మహిళను ఆమె తన కారు వెనక సీటులో మరణించే వరకు వెంటాడారు. ఆ సమయంలో నేను నా తల్లికి సాయం చేయలేకపోయాను.. మా అమ్మకు న్యాయం జరగలేదు.. నా బాల్యంలో మా అమ్మ విషయంలో ఏదైతే జరిగిందో.. దాని గురించి నాకు ఇప్పటికి కోపం వస్తుంది. ఇప్పుడు నాకు 36 ఏళ్లు.. కానీ ఇప్పుడు కెమరాలు చూసినా.. వారు నన్ను వెంటాడుతున్నట్లు ఆందోళనకు గురవుతాను. కెమరాల క్లిక్, ఫ్లాష్ చూస్తే.. నా రక్తం మరిగిపోతుంది’’ అన్నాడు హ్యారీ. ‘‘మేఘన్‌ను కలిసే వరకు నేను ఈ బాధ అనుభవించాను. ఆ తర్వాతే నేను థెరపీ తీసుకోవడం ప్రారంభించాను. ఇక మా బంధం కొనసాగితేనే.. నేను నా గతాన్ని ఎదుర్కోగలనని అనిపించింది. అందుకే తనను వివాహం చేసుకున్నాను అన్నాడు. ఈ విషయాలన్నింటిని హ్యారీ తన మీ యూ కాన్ట్ సీ సిరీస్‌లో తెలిపారు. అమెరికన్ టాక్ షో హోస్ట్ ఓప్రా విన్ఫ్రేతో కలిసి హ్యారీ నిర్మించిన "మీ యూ కాన్ట్ సీ" సిరీస్ ఆపిల్ టీవీ + లో శుక్రవారం విడుదలైంది. చదవండి: మేఘన్ జాతివివక్ష ప్రకంపనలు -
మా కుటుంబం ‘జూ’లా అనిపించేది: బ్రిటన్ యువరాజు
లండన్: బ్రిటన్ యువరాజు హ్యారీ తన కుటుంబంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. గురువారం 'ఆర్మ్ చెయిర్ ఎక్స్ పర్ట్' పాడ్ క్యాస్ట్ ఇంటర్వ్యూలో ఆయన తన వ్యక్తిగత జీవితంలోని పలు విషయాలను ఈ సందర్భంగా పంచుకున్నారు. బాధలు, కట్టుబాట్లు నుంచి విముక్తి కోసమే రాజ కుటుంబం బంధాలను తెంచుకుని అమెరికాకు వెళ్లినట్లు ఆయన చెప్పారు. ఇప్పుడే కాదు తన 20 ఏళ్ళ వయసులో అనేక సందర్భాల్లో ఆయన తన రాజ జీవితాన్ని విడిచిపెట్టాలనే ఆలోచన చాలా సార్లు వచ్చినట్లు చెప్పుకొచ్చారు. 2020 ప్రారంభంలో రాజ కుటుంబం తనను ఆర్థికంగా చాలా ఇబ్బందులు పెట్టినట్లు హ్యారీ తెలిపాడు. తన తల్లి వదిలివెళ్లిన డబ్బుతోనే ఆ సమయంలో ఎటువంటి ఆర్థిక సమస్య రాకుండా చూసుకున్నట్లు తెలిపారు. రాజ కుటుంబంలో అలవాట్లు, పద్ధతులు తనకి పెద్దగా నచ్చేవి కాదని ఒక్కోసారి అక్కడ వాళ్లతో జీవించడం జంతుప్రదర్శనశాలలో ఉన్నట్లు అనిపించేదని అన్నారు. తమ పెంపకం విషయంలో తన తండ్రి ఎన్ని కష్టాలు పడ్డాడో, రాచబిడ్డల్లా తమను పెంచేందుకు ఎంత ఆవేదన అనుభవించిన రోజులను గుర్తు చేసుకుని బాధని వ్యక్తం చేశాడు. ఇలాంటి పెంపకాన్ని తన పిల్లలకు ఇవ్వకూడదన్న ఉద్దేశంతోనే భార్యాపిల్లలతో అమెరికాకు వచ్చేశానని ఆయన వివరించారు. ప్రస్తుతం మేఘన్ తో కలిసి ఆయన లాస్ఏంజిలిస్ కు సమీపంలోని మోంటేసిటోలో నివసిస్తున్నారు. అయితే, తన పిల్లల విషయంలో మాత్రం తన తండ్రి చేసిన తప్పే చేయకూడదనే ఈ నిర్ణయం తీసుకున్నానని వివరించారు. ( చదవండి: వైరల్: అతడిపై ‘థూ’ అని ఉమ్మింది.. యుద్ధం మొదలైంది! ) -
ప్రిన్స్ ఫిలిప్ మృతి: అంత్యక్రియలకైనా వస్తాడా.. లేదా?
లండన్: బ్రిటన్ రాణి ఎలిజబెత్-2 భర్త ప్రిన్స్ ఫిలిప్ (99) శుక్రవారం ఉదయం మరణించిన సంగతి తెలిసిందే. ఈ విషయాన్ని బకింగ్‌హామ్ ప్యాలెస్ ట్విట్టర్ ద్వారా వెల్లడించింది. గత కొద్ది కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ప్రిన్స్ ఫిలిప్ చికిత్స పొందుతూ మృతి చెందారు. ఈ క్రమంలో ప్రస్తుతం బ్రిటన్ పౌరులతో పాటు ప్రపంచవ్యాప్తంగా రాజకుంటుంబాన్ని అభిమానించే వారి మదిలో ఒకటే ప్రశ్న మెదులుతుంది. ప్రిన్స్ ఫిలిప్ మనవడు ప్రిన్స్ హ్యారి తాతను కడసారి చూడటానికి అయినా వస్తాడా.. లేదా అనే దాని మీదే చర్చ జరుగుతోంది. అంతరంగిక విబేధాల వల్ల ప్రిన్స్ హ్యారీ-మేఘన్ మార్కెల్లు గత కొద్ది కాలంగా రాచ కుటుంబానికి దూరంగా ఉంటున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో గత నెలలో ప్రఖ్యాత అమెరికన్ టీవీ హోస్ట్ ఓప్రా విన్ఫ్రే టాక్ షోలో ప్రిన్స్ హ్యారీ-మేఘన్ మార్కెల్లు తాము అంతఃపురంలో అనుభవించిన కష్ట నష్టాల గురించి ప్రపంచానికి వెల్లడించారు. జాతి వివక్షను ఎదుర్కొన్నానని.. మీడియా తనపై తప్పుడు కథల ప్రచారం చేసిందని.. ఒకానొక సమయంలో ఆత్మహత్య చేసుకోవాలని భావించినట్లు మేఘన్ తెలిపారు. ఇక వీరి ఇంటర్వ్యూ ప్రసారానికి ముందే ప్రిన్స్ ఫిలిప్ ఆస్పత్రిలో చేరారు. ఆయన ఆరోగ్య పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని తాతను పరామర్శించాల్సిందిగా బకింగ్‌హామ్ ప్యాలేస్ హ్యారీకి సందేశం పంపింది. కారణాలు తెలియదు కానీ ప్రిన్స్ హ్యారీ మాత్రం తాతగారిని చూడటానికి రాలేదని సమాచారం. మరి ఇప్పుడు అంత్యక్రియలకు అయినా హాజరవుతాడా లేదా అనే ప్రశ్న బ్రిటన్ జనాలను తొలచివేస్తుంది. అయితే దీని గురించి రెండు నెలల క్రితమే ది రాయల్ అజ్బర్వర్ అనే పత్రిక ‘‘అంత్యక్రియలకు హాజరైనప్పుడు ప్రిన్స్ హ్యారీని బ్రిటన్ ప్రజలు బహిరంగంగానే తూలనాడే ప్రమాదాన్ని నివారించడం కోసం హ్యారీని, ఆయన భార్యను ఎక్కడ కూర్చోబెట్టాలన్న దానిపైన కూడా సమాలోచనలు జరుగుతున్నాయి’’ అని ప్రచురించడం గమనార్హం. ప్రస్తుతం హ్యారీ-మేఘన్ మార్కెల్లు అమెరికాలో నివాసం ఉంటున్నారు. చదవండి: వివక్షపై యుద్ధారావం ఆ ఇంటర్వ్యూ -
వివక్షపై యుద్ధారావం ఆ ఇంటర్వ్యూ
తమను వేధింపులకు గురిచేశారని మేఘన్, హ్యారీలు చేసిన ఆరోపణపై అమెరికా, బ్రిటన్ దేశాల్లోని ఛాందసవాదులు మూసపోసిన రీతిలో స్పందించారు. ఒకప్పటి బ్రిటిష్ సామ్రాజ్య పౌరులుగా భారతీయులం బ్రిటిష్ రాజరికంతో ప్రేమ-ద్వేషంతో కూడిన సంబంధంతో ఉంటాం. హ్యారీ, మేఘన్ వంటి గాథలను టీవీ తెరలపై ఆసక్తికరంగా తిలకించడానికి సిద్ధపడతాం కానీ ఈ దంపతులిరువురూ ఎదుర్కొన్న వివక్ష, కపటత్వం వంటివాటిని ఏమాత్రం పట్టించుకోం. అయితే జాత్యహంకారం, స్త్రీ ద్వేషం, వర్గాధిక్యత, చర్మపురంగు వంటి వాటిపట్ల ఆత్రుత వంటివి మన ఇళ్లను కూడా ఇప్పుడు సమీపిస్తున్నాయి. మనలోని ఇదే అలవాట్లను మనం గుర్తించకపోతే, మారకపోతే మనల్ని మనం మోసం చేసుకున్నవారిమవుతాం. బ్రిటన్ రాజరికం జాతివివక్షా భావాలతో నిండిపోయి ఉందంటూ ప్రముఖ టీవీ హోస్ట్ ఓప్రా విన్ఫ్రేకు ఇచ్చిన ఇంటర్వూ్యలో మేఘన్ మర్కెల్, హ్యారీ విండ్సార్ ఆరోపించడంతో బ్రిటిష్ రాజరికంపై బాంబు పేలినట్లయింది. ఆ ఇంటర్వూ్యపై వెంటనే ఆరోపణలు, ప్రత్యారోపణలు వెల్లువెత్తాయి. అయితే ఒక విషయం మాత్రం స్పష్టంగా బయటపడింది. అదేమిటంటే, స్త్రీ ద్వేషం, జాతి వివక్ష బ్రిటిష్ రాజరికంతో ముడిపడి ఉన్నాయి. ఈ వాస్తవాన్ని బ్రిటిష్ మీడియా మరింత సంక్లిష్టం చేసిపడేస్తోంది. హ్యారీ, మేఘన్‌లు నిష్కపటమైన, స్వచ్ఛమైన రీతిలో ఓప్రాకు ఇచ్చిన ఆ ఇంటర్వూ్య మనందరి కళ్లు తెరిపించింది. అది బ్రిటిష్ మీడియాను, పవిత్రమైనదిగా భావించే బ్రిటిష్ రాజ రికాన్ని ప్రకంపింపచేసిందన్నది వాస్తవం. అంతకంటే ముఖ్యమైన విషయం ఏమిటంటే మొత్తం వివాదం నుంచి బ్రిటిష్ రాణిని జాగ్రత్తగా తప్పించి వేయడమే. రాణి సలహాదారులూ రాచరిక వ్యవస్థే దీనంతటికీ కారణమని మీడియా తేల్చేసింది. యువరాణులు, యువరాజుల జిగేల్మనిపించే ఆహార్యం, ఊపిరి పీల్చుకోనివ్వకుండా చేసేటటువంటి డిజైనర్ దుస్తులు, డైమండ్లు, పాపరాజీ వర్ణించే అద్భుతమైన వారి వివాహ గాథలను దాటి ముందుకు చూస్తే, జాతులను, సహజ వనరులను, ప్రపంచవ్యాప్తంగా స్థానికులను కొల్లగొట్టి మరీ సముపార్జించుకున్న క్రూరమైన స్వీయ సంపద విభ్రమ విలాసాలు బ్రిటిష్ రాచరికం సొత్తుగా ఉన్నాయని మనందరికీ తెలుసు. ఇప్పుడంటే ఆధునిక రాజరికం వాస్తవాధికారం లేని ముదివగ్గును తలపిస్తోంది కానీ ఎలిజబెత్ రాణి పట్ల చెరగని అనుకూలత కారణంగా ఆ గత వైభవాన్ని జనం గుర్తు చేసుకుంటూ ఉంటారు. 1979లో, బ్రిటిష్-జమైకన్ సాంస్కృతిక సిద్ధాంతకర్త స్టూవర్ట్ హాల్ కాకతాళీయంగా ఇదే బీబీసీకి ఇచ్చిన ఇంటర్వూ్యలో బ్రిటిష్ టెలివిజన్ ప్రసారాల్లో జాతి వివక్ష కొనసాగింపు గురించి మొత్తుకున్నారు. బ్రిటన్‌లో నివసిస్తున్న నల్లజాతి, ఆసియన్ కమ్యూనిటీ ప్రజల పట్ల జాతివివక్షా వైఖరిని సాధారణీకరించేలా వీరి వ్యాఖ్యలు ఉండేవి. బహుళ జాతి జనాభాతో పెరుగుతూ వచ్చిన బ్రిటన్‌లో జాతి వివక్షా ధోరణులను వ్యాప్తి చేయడానికి హాస్యాన్ని ఎక్కువగా వినియోగించేవారని రచయిత, పరిశోధకురాలు రైనా జేడ్ పార్కర్ తెలిపారు. మీడియా పాక్షిక దృష్టి కారణంగా కలిగిన ప్రభావాలను పరీక్షించడానికి ప్రయత్నించిన స్టూవర్ట్ హాల్ ఇలాంటి ప్రభావం వ్యక్తిగత దాడికిందే పరిగణించాలి తప్ప దీన్ని ఒక వ్యవస్థాగత సమస్యగా భావించవద్దని అప్పట్లోనే చెవ్పేవారన్నారు. వ్యవస్థలో సంస్థాగతంగా జాత్యహంకారం, స్త్రీ ద్వేషం ఉనికిలో ఉన్న విషయాన్ని అంగీకరించడాన్ని తిరస్కరించడానికి ఇది ఒక ప్రామాణిక వంచనాత్మకమైన ఎత్తుగడ అని హాల్ చెప్పారు. మిశ్రమజాతికి చెందిన మేఘన్ మర్కెల్ బ్రిటన్ యువరాజును అద్భుత గాథలోలాగా పెళ్లాడి, బ్రిటిష్ రాజవంశంలో భాగమైనప్పుడు బ్రిటిష్ టాబ్లాయిడ్లు, ప్రెస్, సామాజిక మీడియా ఫోరంలు ఇదే వివక్షను ప్రదర్శించడం గమనార్హం. పైగా యునైటెడ్ కింగ్డమ్ లోని టాబ్లాయిడ్లు, శ్వేత జాతి మీడియా పండితులు, విశ్లేషకులు ఒక పద్ధతి ప్రకారం ఆమెను పొట్టచీల్చి మరీ పేగులు బయటకు లాగేవిధంగా వ్యవహరించారు. మేఘన్ తోటి కోడలు కేట్‌ను ఏడిపించింది! మేఘన్ రాణిమందిరం సిబ్బందిని వేధింపులకు గురిచేసింది! వేధించే పెళ్లికూతురు మేఘన్... ఇలాంటి ఎన్నెన్నో ఆరోపణలతో బ్రిటిష్ మీడియా యువరాణితో ఆటాడుకుంది. అమెరికన్ టెలివిజన్ దివా విన్ ప్రేకి ఇచ్చిన ఆ సంచలనాత్మక ఇంటర్వూ్యలో మేఘన్, హ్యారీలు ప్రధానారోపణ చేశారు. మేఘన్పట్ల అన్యాయంగా ప్రవర్తించింది బ్రిటిష్ మీడియా మాత్రమే కాదనీ, ఆమె నివసించే విండ్సార్ మందిరం కూడా ఆమెకు ఏమాత్రం సహాయం చేయలేదని వీరు చెప్పారు. పైగా ఈ వేధింపులో హౌస్ ఆఫ్ విండ్సార్ కూడా అస్పష్టరీతిలో పాల్గొన్నదని మేఘన్ దంపతులు చెప్పారు. ఈ ఆరోపణ బాంబులాగా పేలింది. డయానా గాథలో వెల్లడైన అంశాలు కూడా దీనిముందు సరిపోవని చెప్పాల్సి ఉంటుంది. చరిత్ర తనకు తానే పునరావృతం చేసుకుంటుంది అని హ్యారీ సరిగ్గానే వర్ణించారు. తమ మాతృమూర్తి డయానా తనకు ఎదురైన చేదు అనుభవాల ఫలితంగా ఒంటరితనంలో కూరుకుపోవలసి వస్తే తాము మాత్రం కలిసికట్టుగా తమ సమస్యను పరిష్కరించుకోగలిగినందుకు తామెంతో అదృష్టవంతులమని అందుకు తానెంతో సంతోషపడుతున్నానని హ్యారీ చెప్పారు. ప్రజల అభిమానం చూరగొన్న యువరాణి డయానాను అప్పట్లో వేటాడారు, వెంటాడారు, ఒంటరిని చేసిపడేశారు. అదే సమయంలో ఆమెను ఆరాధించారు, ఆదర్శమూర్తిని చేశారు. అయితే మేఘన్ కూడా డయానా ఎదుర్కొన్న సవాళ్ల బారిన పడినప్పటికీ, అదనంగా తమపై మోపిన జాతివివక్ష, వర్ణవివక్షకు సంబంధించిన భారాలను కూడా మేఘన్ ఎదుర్కొన్నారు. మధ్యతరగతిలో పుట్టి పెరిగిన మేఘన్ తర్వాత తన సొంత కృషితో, హక్కుతో నటిగా, సోషల్ మీడియా స్టార్‌గా, సెలబ్రిటీగా తన్ను తాను మలుచుకుంది. తన యువరాజుతో కలిసి మరుగుజ్జు శ్వేతజాతి కుటుంబంలోకి ప్రవేశించినప్పుడు ఈ వివక్షలన్నింటినీ ఆమె అనుభవించింది. మేఘన్ ఎదుర్కొన్న సమస్య సరిగ్గా తన మాతృమూర్తిని వేధించిన పరిస్థితితో సమానమైందని హ్యారీ పేర్కొన్నాడు. అమెరికా, బ్రిటన్ మీడియా ఈ ఉదంతంపై ఊహించిన వైఖరులనే చేపట్టాయి. తమకుతాముగా ప్రవాసంలోకి వెళ్లిన దంపతులపై అమెరికా మీడియా కేంద్రీకరించగా, బ్రిటన్ ప్రెస్ కొన్ని మినహాయింపులను పక్కనబెడితే, తమకెంతో ప్రేమాస్పదమైన రాజకుటుంబంపై ఇన్ని ఆరోపణలు చేస్తారా అంటూ రెచ్చిపోయింది. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, అమెరికాలోని ఛాందసవాద వ్యాఖ్యాతలు సైతం మోర్గన్ వంటి రాజరికం సానుభూతిపరులతో జట్టు కలవడమే. రాజమందిరంలోకి ప్రవేశించాక తనకు ఒనగూరేది ఏమిటనేది మేఘన్‌కు కచ్చితంగా ముందే తెలుసని, రాజమందిరంలో ప్రవేశించినందుకు ఆమెకు లభ్యమైన సౌకర్యాలపై, హక్కులపై ఆరోపణలు చేయడానికే వీల్లేదని వీరు వాదిస్తున్నారు. సాధారణీకరించి చెప్పాలంటే, జాతివివక్ష, లైంగిక దోపిడీ, జాతిఆధిక్యతా భావం వంటి అంశాలతో వ్యవహరించడంలో సంస్థాగత మార్పులను చేయాల్సిన అవసరముందని ఉదారవాదులు చేస్తున్న వాదనను అమెరికా, బ్రిటన్‌లోని ఛాందసవాదులు తోసిపుచ్చుతున్నారు. తమను వేధింపులకు గురిచేశారని మేఘన్, హ్యారీలు చేసిన ఆరోపణపై రెండుదేశాల్లోని ఛాందసవాదులు మూసిపోసిన రీతిలో స్పందించడం గమనార్హం. ఘనత వహించిన బ్రిటిష్ సామ్రాజ్యానికి చెందిన ఒకప్పటి పౌరులుగా భారతీయులం బ్రిటిష్ రాజరికంతో ప్రేమ–ద్వేషంతో కూడిన సంబంధంతో ఉంటాం. ఒకవైపు బ్రిటిష్ సామ్రాజ్యం కొల్లగొట్టిన కోహినూర్ వజ్రం వంటి భారతీయ విలువైన సంపదలను వెనక్కి ఇచ్చేయాలని డిమాండ్ చేస్తాం. మరోవైపు ఆ రాజవంశంనుంచి ఎవరైనా సభ్యుడు భారత్ సందర్శిస్తే వారి పాదాలు తాకి పూజిస్తాం. రాజరికం వైభవాన్ని ప్రదర్శించే అన్ని కార్యక్రమాలను కళ్లప్పగించి చూస్తుంటాం. హ్యారీ, మేఘన్ వంటి గాథలను టీవీ తెరలపై ఆసక్తికరంగా తిలకించడానికి సిద్ధపడతాం కానీ ఈ దంపతులిరువురూ ఎదుర్కొన్న వివక్ష, కపటత్వం వంటివాటిని ఏమాత్రం పట్టించుకోం. అయితే జాత్యహంకారం, స్త్రీ ద్వేషం, వర్గాధిక్యత, చర్మపురంగు వంటి వాటిపట్ల ఆత్రుత వంటివి మన ఇళ్లను కూడా ఇప్పుడు సమీపిస్తున్నాయి. మనలోని ఈ అలవాట్లను మనం గుర్తించి, మారకపోతే మనల్ని మనం మోసం చేసుకున్నట్లే. ఒక్కమాటలో చెప్పాలంటే మనం కూర్చుని ఉన్న అద్దాలమేడను మనం తిరిగి చూడాల్సి ఉంది. సుమన కస్తూరి వ్యాసకర్త రచయిత, పరిశోధకురాలు (ది వైర్ సౌజన్యంతో)