బ్రిటీష్ రాజ కుటుంబానికి శాశ్వతంగా వీడ్కోలు చెప్పి బ్రిటీష్ కొలంబియా ప్రాంతంలోని కెనడాలో ఓ విలాసవంతమైన భవంతిని కొనుగోలు చేసి అందులో ప్రిన్స్ హ్యారీ, మేఘన్ మార్కెన్ దంపతులు తమ కుమారుడితో సహా నివసిస్తున్న విషయం తెల్సిందే. వారు కెనడాకు వచ్చి మకాం పెట్టినప్పటి నుంచి వారి భద్రతకయ్యే ఖర్చును ఎవరి భరిస్తారన్న విషయం చర్చనీయాంశంగా మారింది. ఈ ఖర్చులను కెనడా ప్రభుత్వం భరిస్తుందని వార్తలు తొలుత వెలువడగా, అందుకు ప్రజలు అభ్యంతరం వ్యక్తం చేశారు. తాము చెల్లిస్తున్న పన్నులతో నడుస్తున్న ప్రభుత్వ ఖజానా నుంచి ఎలా సొమ్మును వృధా చేస్తారంటూ పలు వర్గాల ప్రజల నుంచి అభ్యంతరాలు వ్యక్తం అయ్యాయి. (రాజదంపతుల కొత్త జీవితం!)
ఈ నేపథ్యంలో సీటీవీ కోసం ‘నానోస్ రిసెర్చ్ సెంటర్’ ప్రజాభిప్రాయాన్ని సేకరించింది. ప్రిన్స్ హ్యారీ దంపతుల భద్రతకయ్యే ఖర్చును కెనడా ప్రభుత్వం భరించడానికి వీల్లేదంటూ 77 శాతం మంది అభ్యంతం వ్యక్తం చేశారు. 19 శాతం మంది అనుకూలంగా స్పందించారు. మిగతా వారు తటస్థంగా ఉన్నారు. బ్రిటీష్ రాణి వారసులుగా తమ దేశంలో నివసించడం లేదన్న కారణంగానే 77 శాతం మంది ప్రజలు అభ్యంతరం వ్యక్తం చేశారు. (కోటను విడిచినా వారు మా కుటుంబ సభ్యులే..)
బ్రిటీష్ రాజ కుటుంబంతో ఎలాంటి తెగతెంపులు చేసుకోకుండా వారంతట వారొచ్చి తమ దేశంలో ఉన్నట్లయితే వారి భద్రతకయ్యే ఖర్చును భరించేందుకు అభ్యంతరం లేదన్నారు. అసలు రాజకుటుంబం వారసులుగా వారు కెనడాలో ఉన్నట్లయితే రాజ కుటుంబమే ఆ ఖర్చులను భరించేది. ఏదేమైనా హ్యారీ దంపతుల భద్రతకు ఏటా మూడు కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందని అంచనా వేశారు. (భార్య మేఘన్ ఫొటోలపై హ్యారీ ఆగ్రహం)
Comments
Please login to add a commentAdd a comment