యువరాజుతో డేటింగ్‌లో ఉన్నా: నటి | I am dating Prince Harry, says Meghan Markle | Sakshi
Sakshi News home page

యువరాజుతో డేటింగ్‌లో ఉన్నా: నటి

Published Wed, Sep 6 2017 7:12 PM | Last Updated on Sun, Sep 17 2017 6:29 PM

యువరాజుతో డేటింగ్‌లో ఉన్నా: నటి

యువరాజుతో డేటింగ్‌లో ఉన్నా: నటి

లండన్‌: బ్రిటన్‌ యువరాజుతో ప్రేమలో పడిపోయిందన్న ప్రచారం నటి మేఘన్ మార్కెల్‌కు విపరీతమైన పాపులారిటీని తెచ్చిపెట్టింది. ఎంతగా అంటే.. ఏకంగా మోస్ట్ సెర్చ్‌డ్‌ నటిగా 2016 ఏడాదికి గానూ మేఘన్ తన పేరు లిఖించుకుంది. బ్రిటన్‌ యువరాజు హ్యారీతో ఆమె ప్రేమ వ్యవహారంతో ఒక్కసారిగా పాపులర్ సెలబ్రిటీగా మారిపోయింది. తనకంటే వయసులో మూడేళ్లు పెద్దదైన నటి మేఘన్‌ తో ప్రిన్స్ డేటింగ్ చేస్తున్నట్లు ఇప్పటికే చాలా కథనాలు వచ్చాయి. అయితే తొలిసారిగా నటి మేఘన్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తాను యువరాజు హ్యారీని ప్రేమిస్తున్నట్లు తొలిసారిగా చెప్పారు. ప్రస్తుతం మేమిద్దరం ప్రేమించుకుంటున్నాం.. ఎంతో సంతోషంగా ఉన్నామంటూ తమ ప్రేమ విషయాన్ని షేర్ చేసుకున్నారు.

గతేడాది జూలై నెలలో 'సూట్స్‌' షూటింగ్ సమయంలో టోరంటోలో తొలిసారి వీరి చూపులు కలిశాయి. అక్కడి నుంచి వీరు తరచుగా కలుసుకోవడంతో వీరి మధ్య సాన్నిహిత్యం పెరిగిపోయిందని వదంతులు వ్యాపించాయి. అయితే ప్రిన్స్ హ్యారీగానీ, నటిగానీ ఈ విషయంపై స్పందించలేదు. 'మేం అందరిలాగే ప్రేమలో ఉన్నటువంటి ఇద్దరు సాధారణ వ్యక్తులం. గత ఆరు నెలలుగా గాఢమైన ప్రేమలో ఉన్నాం. ఇతరులతో రిలేషన్ షిప్ ద్వారా నన్ను నేను పలానా వ్యక్తిని అంటూ చెప్పుకోవడం ఇష్టముండదంటూ' నటి మేఘన్ మార్కెల్ వివరించారు.

ప్రొడ్యూసర్ ట్రెవర్ ఇంగెల్సన్ తో మూడేళ్ల వైవాహిక జీవితం తర్వాత విడాకులు తీసుకున్న మేఘన్ మార్కెల్ ప్రస్తుతం ఒంటరిగా ఉంటున్నారు. ఆమె గత కొంతకాలం నుంచి హ్యారితో అనుబంధం కొనసాగిస్తున్నారు. మరోవైపు హ్యారీ, మార్కెల్‌ త్వరలో వివాహబంధంతో ఒక్కటి కానున్నారని ప్రచారం జరుగుతోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement