ప్రిన్స్‌ హ్యారీ, భార్య మేఘన్‌ల మధ్య విభేదాలు తలెత్తాయా? | Growing Rift Between Prince Harry And Meghan Markle | Sakshi
Sakshi News home page

ప్రిన్స్‌ హ్యారీ, భార్య మేఘన్‌ల మధ్య విభేదాలు తలెత్తాయా?

Published Sun, Jul 7 2024 10:01 PM | Last Updated on Sun, Jul 7 2024 10:10 PM

Growing Rift Between Prince Harry And Meghan Markle

బ్రిటన్‌ రాజు చార్లెస్‌ III చిన్న ​కుమారుడు ప్రిన్స్‌ హ్యారీ, అతడి భార్య మేఘన్‌ మర్క్లేల మధ్య విభేదాలు తలెత్తాయా? అందుకే వారిద్దరి మధ్య దూరం ఏర్పడిందా? అంటే అవుననే అంటున్నాయి అంతర్జాతీయ మీడియా సంస్థలు.

అందుకు ఊతం ఇచ్చేలా మేఘన్‌ తన జీవితం ‘తాను అనుకున్నట్లుగా లేదని’, కాబట్టే ఆమె ఆందోళన చెందుతోందని నివేదికలు వెలుగులోకి వచ్చాయి.

ప్రముఖ ఆథర్‌ టామ్ క్విన్ ఓ మీడియా ఛానెల్‌తో మాట్లాడుతూ..  ప్రిన్స్‌ హ్యారీ, అతడి భార్య మేఘన్‌ మార్క్లేల  మధ్య దూరం పెరిగిపోతుంది. మేఘన్‌ తాను కోరుకున్నట్లు తన జీవితం లేదని బాధపడుతోంది. ఎందుకంటే తనకు మీడియా అటెన్షన్‌ అంటే బాగా ఇష్టం. అయితే ఇటీవల కాలంలో పలు సర్వేలు హ్యారీని,మేఘన్‌ను పెద్దగా పట్టించుకోవడం లేదనే రిపోర్ట్‌లపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారని తెలిపారు.  

దీనికి తోడు 2020లో హ్యారీ దంపతులు రాజకుంటుంబ సభ్యలు హోదాను వదులుకుని అమెరికాలో కాలిఫోర్నియాలో సెటిల్‌ అయ్యారు. అయినప్పటికీ మొదట్లో కాలిఫోర్నియాలో హ్యారీ దంపతులకు అపూర్వ ఆదరణ లభించిందని, సినీరంగానికి చెందిన (హాలీవుడ్‌) ప్రముఖులు వారితో స్నేహం కోసం క్యూకట్టినట్లు పలు మీడియా రిపోర్ట్‌లు వెలుగులోకి వచ్చాయి. అయినప్పటికీ, వారి ప్రజాదరణ తగ్గుముఖం పట్టిందని సర్వేలు హైలెట్‌ చేశాయి.  

మేఘనా మార్క్లే ‘అమెరికాలో రివేరా ఆర్చర్డ్’ అనే ఆహార ఉత్పత్తుల బ్రాండ్‌ను లాంచ్‌ చేశారు. ఆ సమయంలో ఆమె కన్నీటి పర్యంతరమయ్యారు. ఎందుకంటే ఆమె రివే ఆర్చర్డ్స్‌ ఆహార ఉత్పత్తులు చాలా ఖరీదైనవి. కానీ వాటిల్లో అంత నాణ్యత లేదనే విమర్శలు వెల్లువెత్తాయి. ఆ విమర్శల్ని తాను తట్టుకోలేకపోయారు.  

అమెరికాలో మేఘన్‌ విలాసవంతమైన జీవనశైలిపై ఎప్పుడూ విమర్శలు వస్తుంటాయి. ఈ అంశం ఆమెకు అస్సలు మింగుడు పడడం లేదు. ఈ వరుస పరిణామాలు తాను అనుకున్నట్లు తన జీవితం లేదని మేఘన బాధపడుతుందని ఆథర్‌ టామ్ క్విన్ చెప్పారు.  

దీనికి తోడు ప్రిన్స్‌ హ్యారీని మేఘన్‌ను విసిగిస్తుందనే ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. హ్యారీకి యూకేలోని తన స్నేహితులు అంటే చాలా ఇష్టం. వారిని కలుసుకునేందుకు ప్రయత్నాలు చేస్తుండేవారు. కానీ హ్యారీ వారిని కలుసుకోవడం మేఘన్‌కు అస్సలు ఇష్టం ఉండదు. బహుశా ఈ తరహా వ్యక్తిగత భేదాభిప్రాయాల కారణంగా ప్రిన్స్‌ హ్యారీ అతడి భార్య మేఘన్‌ మర్క్లేల మధ్య దూరం పెరిగిపోతుందని పరోక్షంగా అభిప్రాయం వ్యక్తం చేశారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement