Hollywood
-
ఇండియన్ పాప్ మ్యూజిక్.. టాలెంట్ హంట్ మొదలుపెట్టిన సవన్
ఇండియన్ పాప్ మ్యూజిక్‌లో అద్భుతాలు సృష్టించడానికి ఇండో అమెరికన్ గేయ రచయిత సవన్ కొటేచా (Savan Kotecha) ముందడుగు వేశాడు. యూనివర్సల్ మ్యూజిక్ ఇండియా , రిపబ్లిక్ రికార్డ్స్, రిప్రజెంటేట్లతో భాగస్వామ్యం కుదుర్చుకున్నాడు. కొత్త టాలెంట్ వెలికితీయడంతోపాటు దేశంలో పాప్ బ్యాండ్ (Pop Boy Band)ను ఏర్పరచడమే వీరు లక్ష్యంగా పెట్టుకున్నారు.ఎవరీ సవన్ కొటేచా?సవన్ ఎన్నో పాటలకు రచయితగా పని చేశాడు. ఈయన రాసిన ఎన్నో పాటలు.. అరియానా గ్రాండె, ద వీకెండ్, జస్టిన్ బీబర్, వన్ డైరెక్షన్ (పాప్ బ్యాండ్)లు ఆలపించాయి. పాటలరచయితగా సవన్ 17 సార్లు గ్రామీ అవార్డుకు నామినేట్ అయ్యాడు. అలాగే ఆస్కార్, గోల్డెన్ గ్లోబ్ పురస్కారాలకు సైతం నామినేట్ అయ్యాడు. బిల్బోర్డ్ మ్యూజిక్ అవార్డును అందుకున్నాడు. అదే అసలైన లక్ష్యంతాజాగా సవన్ కొటేచా మాట్లాడుతూ.. భారత్‌లోని యువతలో ఉన్న మ్యూజిక్ టాలెంట్‌ను వెలికితీయడమే తన లక్ష్యమని చెప్తున్నాడు. ఇక్కడి యంగ్ జనరేషన్ అంతా కూడా పాప్ సాంగ్స్ కోసం, సింగర్ల కోసం విదేశాలపై ఆధారపడుతోంది. ఇకమీదట ఆ అవసరం రాకుండా చేయాలన్నదే మా ఉద్దేశ్యం. భారత్‌లో ఓ సరికొత్త పాప్ బ్యాండ్ గ్రూప్ సృష్టించే దిశగా అడుగులు వేస్తున్నాం అని పేర్కొన్నాడు.చదవండి: ఓటీటీలోకి ఎమర్జెన్సీ.. సింపుల్‌గా డేట్ చెప్పేసిన కంగనా -
హాలీవుడ్లో ఎంట్రీ ఇస్తున్న స్టార్ హీరో.. ఆటో డ్రైవర్‌గా?
బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ (Salman Khan) హాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమయ్యాడు. సెవెన్ డాగ్స్ అనే అర్జెంటీనా సినిమాను హాలీవుడ్లో రీమేక్ చేస్తున్నారు. ఈ అమెరికన్ యాక్షన్ థ్రిల్లర్ మూవీలోముఖ్య పాత్ర కోసం సల్లూ భాయ్‌ను సంప్రదించగా ఆయన పచ్చజెండా ఊపారట! ఈ క్రమంలోనే సినిమా షూటింగ్ సైతం మొదలుపెట్టినట్లు తెలుస్తోంది.దుబాయ్‌లో షూటింగ్!ఇందుకోసం సల్మాన్ ఖాన్ కొద్దిరోజుల క్రితమే దుబాయ్ పయనమయ్యాడు. ప్రస్తుతం సల్మాన్ ఖాన్, సంజయ్ దత్‌లకు సంబంధించిన సన్నివేశాలపై చిత్రీకరణ జరుపుతున్నారంటూ కొన్ని వీడియో క్లిప్స్ నెట్టింట వైరల్‌గా మారాయి. అందులో సల్మాన్ ఆటో డ్రైవర్ వేషంలో ఉన్నాడు. ఆటో దగ్గర సల్మాన్ నిల్చోగా అతడి పక్కనే సంజయ్ దత్ సూటూబూటు వేసుకుని ఠీవీగా కనిపిస్తున్నాడు. సల్మాన్ పాత్రకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. సినిమాకాగా సల్మాన్ ఖాన్ చివరగా టైగర్ 3 సినిమాలో కనిపించాడు. ప్రస్తుతం సికందర్ మూవీ చేస్తున్నాడు. రష్మికా మందన్నా హీరోయిన్గా నటిస్తున్న ఈ మూవీలో కాజల్ అగర్వాల్, సత్యరాజ్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఏఆర్ మురుగదాస్ దర్శకత్వంలో సాజిద్ నడియాద్వాలా నిర్మిస్తున్నారు. ఈ చిత్రం ఈ ఏడాది రంజాన్ సందర్భంగా రిలీజ్ కానుంది. ఈ చిత్రం రంజాన్ పండగకు విడుదల కానుంది. Bhai and Baba are in Saudi Arabia to shoot cameo for a Hollywood movie 🎥... #Salmankhan #Sanjaydutt #Sikandar pic.twitter.com/ZoTZ6mNae4— Adil Hashmi👁🗨 (@X4SALMAN) February 19, 2025MEGASTAR SALMAN KHAN in Saudi Arabia today #Sikandar #SalmanKhan pic.twitter.com/pUVl8WMvoc— Lokendra Kumar (@rasafi24365) February 19, 2025చదవండి: ఓటీటీలోకి ఎమర్జెన్సీ.. సింపుల్‌గా డేట్ చెప్పేసిన కంగనా -
ఓటీటీలో చిన్నారులను మెప్పించే 'సైన్స్ ఫిక్షన్' సినిమా
పిల్లలను ఎంతగానో ఆలరించిన యానిమేటెడ్ సైన్స్ ఫిక్షన్ మూవీ 'ది వైల్డ్ రోబోట్' ఓటీటీలోకి వచ్చేసింది. క్రిస్ సాండర్స్ దర్శకత్వం వహించిన ఈ మూవీ గతేడాది సెప్టెంబర్ 27న ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. సినిమాలో సైన్స్ ఫిక్షన్ కాన్సెప్ట్‌కు బాగా కనెక్ట్ అయ్యారు. దీంతో బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్స్ వచ్చాయి. సుమారు రూ. 2800 కోట్లకు పైగానే కలెక్షన్స్ వచ్చినట్లు అంచనా ఉంది.ప్రపంచవ్యాప్తంగా ఎంతో గుర్తింపు తెచ్చుకున్న 'ది వైల్డ్ రోబోట్' చిత్రం తాజాగా జియో హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ అవుతుంది. తెలుగుతో పాటు తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో స్ట్రీమింగ్కు అందుబాటులోకి వచ్చింది. ఇప్పటికే ఇంగ్లీష్ వర్షన్ అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అవతుంది. డ్రీమ్ వర్క్స్ యానిమేషన్ పతాకంపై జెఫ్ హెర్మాన్ ఈ చిత్రాన్ని రూ. 670 కోట్లతో నిర్మించారు. అయితే, సుమారుగా రూ. 2000 కోట్లకు పైగానే లాభాలు వచ్చాయి. సైన్స్ ఫిక్షన్ మూవీ ఇష్టపడే పెద్దలతో పాటు చిన్నారలను ఈ చిత్రం బాగా మెప్పిస్తుంది. -
వాలంటైన్స్ వీక్.. ఓటీటీలో ఏకంగా 16 సినిమాలు రిలీజ్
ఈ వారం ప్రేమికులకు ఎంతో స్పెషల్. చాక్లెట్ డే, కిస్ డే, ప్రపోజ్ డే, టెడ్డీ డే, హగ్ డే, వాలంటైన్స్‌డే అని రోజుకో రకంగా సెలబ్రేషన్స్ చేసుకుంటారు. మరి ఈ వారం (ఫిబ్రవరి 10- 16 వరకు) అటు థియేటర్లో, ఇటు ఓటీటీలో రిలీజయ్యే సినిమాలేంటో చూసేద్దాం..థియేటర్లో విడుదలయ్యే చిత్రాలు..లైలా - ఫిబ్రవరి 14బ్రహ్మా ఆనందం - ఫిబ్రవరి 14ఇట్స్ కాంప్లికేటెడ్ (గతంలో ఇది కృష్ణ అండ్ హిజ్ లీలా టైటిల్‌తో ఓటీటీలో రిలీజైంది) - ఫిబ్రవరి 14తల - ఫిబ్రవరి 14ఛావా - ఫిబ్రవరి 14ఓటీటీలో రిలీజయ్యే సినిమాలు, సిరీస్‌లు..అమెజాన్ ప్రైమ్ వీడియోమై ఫాల్ట్: లండన్ - ఫిబ్రవరి 13నెట్ఫ్లిక్స్బ్లాక్ హాక్ డౌన్ - ఫిబ్రవరి 10కాదలిక్క నేరమిల్లై - ఫిబ్రవరి 11ద విచర్: సైరెన్స్ ఆఫ్ ద డీప్ (యానిమేటెడ్ సిరీస్) - ఫిబ్రవరి 11డెత్ బిఫోర్ ద వెడ్డింగ్ - ఫిబ్రవరి 12ద ఎక్స్చేంజ్ సీజన్ 2 - ఫిబ్రవరి 13కోబ్రా కై సీజన్ 6, పార్ట్ 3 - ఫిబ్రవరి 13ధూమ్ ధామ్ - ఫిబ్రవరి 14మెలో మూవీ - ఫిబ్రవరి 14ఐయామ్ మ్యారీడ్.. బట్! - ఫిబ్రవరి 14హాట్స్టార్బాబీ ఔర్ రిషికి లవ్‌స్టోరీ - ఫిబ్రవరి 11ఆహాడ్యాన్స్ ఐకాన్ 2 (డ్యాన్స్ షో) - ఫిబ్రవరి 14జీ5ప్యార్ టెస్టింగ్ - ఫిబ్రవరి 14సోనీలివ్మార్కో - ఫిబ్రవరి 14హోయ్చోయ్బిషోహోరి - ఫిబ్రవరి 13లయన్స్‌గేట్ ప్లేసబ్సర్వియన్స్ - ఫిబ్రవరి 14చదవండి: హీరోలతో వన్స్‌మోర్.. హీరోయిన్లతో మాత్రం... అదన్నమాట సంగతి! -
పుష్ప2 'అల్లు అర్జున్' యాక్షన్ సీన్‌పై హాలీవుడ్ కామెంట్స్
అల్లు అర్జున్- సుకుమార్‌ల పుష్ప2(Pushpa 2 Movie) సినిమా ఓటీటీలో కూడా సంచలన రికార్డ్స్‌ను క్రియేట్ చేస్తుంది. గ్లోబల్ రేంజ్లో సినీ అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటుంది. బాక్సాఫీస్ వద్ద సుమారు రూ. 1850 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టి సత్తా చాటిన పుష్పరాజ్.. ఇప్పుడు రీలోడెడ్ వర్షన్ పేరుతో జనవరి 30 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో(Netflix ) స్ట్రీమింగ్ అవుతుంది. ఇక్కడ కూడా పలు రికార్డ్స్‌ను క్రియేట్ చేస్తూ.. ప్రపంచ సినీ అభిమానుల చేత అల్లు అర్జున్ ప్రశంసలు అందుకుంటున్నారు.పుష్ప2 ఓటీటీలో ఎంట్రీ ఇచ్చిన తర్వాత వ్యూస్ పరంగా ట్రెండింగ్‌లో ఉంది. ఏడు దేశాల్లో నంబర్ వన్ స్థానాన్ని దక్కించుకుంది. 21 దేశాల్లో టాప్-10లో ఉంది. పాకిస్థాన్, శ్రీలంక, బంగ్లాదేశ్, ఆస్ట్రేలియా,జపాన్, అమెరికా,దుబాయ్ వంటి దేశాల్లో ఈ చిత్రాన్ని ఎక్కువగా చూస్తున్నారు. 'పుష్ప అంటే నేషనల్ అనుకుంటివా.. ఇంటర్నేషనల్' అనే సినిమా డైలాగ్ నిజం అయ్యేలా బన్నీ చేశాడని అభిమానులు చెబుతున్నారు. గ్లోబల్ రేంజ్లో ఈ చిత్రం దుమ్మురేపుతుండటంతో టాలీవుడ్ పేరు వైరల్ అవుతుంది. ఓటీటీ వెర్షన్లో సినిమా నిడివి 3 గంటల 40 నిమిషాలు ఉంది.హాలీవుడ్ నుంచి ప్రశంసలుపుష్ప2 ఓటీటీలో చాలా భాషల్లో స్ట్రీమింగ్ అవుతుండటంతో విస్తృతంగా ప్రేక్షకులకు చేరువైంది. ఈ చిత్రానికి సంబంధించిన పలు సన్నివేశాలు ఇప్పుడు ఇంటర్నెట్లో వైరల్‌గా మారాయి. దీంతో మన సినిమా గురించి హాలీవుడ్(Hollywood ) సినీ అభిమానులను మాట్లాడుకునేలా చేసింది. ఈ మూవీకి ప్రధాన ఆకర్షణగా నిలిచిన సీన్.. అల్లు అర్జున్(Allu Arjun) చీర కట్టుకుని డ్యాన్స్ చేస్తున్న 'జాతర' సీక్వెన్స్‌కు వారు ఫిదా అయ్యారు. క్లైమాక్స్‌లో భారీ యాక్షన్ సీక్వెన్స్‌లో కూడా బన్నీ అలాగే కనిపిస్తాడు. దీన్ని చూసిన అంతర్జాతీయ ప్రేక్షకులు ఆశ్చర్యపోతున్నారు.. చూస్తున్నంత సేపు గూస్బంప్స్ వచ్చాయని కామెంట్లు చేస్తున్నారు. అవెంజర్స్ వంటి సినిమాలకు మించి యాక్షన్ సీన్స్‌లో అల్లు అర్జున్ దుమ్మురేపాడని వారు ప్రశంసలు కురిపించడం విశేషం. ఇలాంటి సీన్స్ తీయడం హాలీవుడ్‌కు ఎప్పటికీ సాధ్యం కాదని వారు అంటున్నారు. ప్రస్తుతం వస్తున్న అమెరికన్ సినిమాలకంటే పుష్ప2 చాలా బెటర్ అంటూ వారు చెప్పడంతో పుష్ప2 రేంజ్ ఏంటో తెలుపుతుంది. భారీ బడ్జెట్‌తో తీస్తున్న మార్వెల్ వంటి సినిమాల్లో కూడా ఇంతటి సృజనాత్మకత లేదని అక్కడి రివ్యూవర్లు చెబుతున్నారు. జాతర ఎపిసోడ్లో బన్నీ చేసిన సీన్‌తో పాటు ఫైనల్లో చేసిన యాక్షన్ ఎపిసోడ్ చూసిన వారు.. అదంతా గ్రాఫిక్స్ ఉండొచ్చని అభిప్రాయపడ్డారు. సినిమా ఎంట్రీలో జపాన్‌కు వెళ్లిన బన్నీ చేతులకు రెక్కలు లేకుండా అంత ఎత్తుకు ఎలా ఎగురుతున్నాడు..? అంటూ కొందరు విమర్శలు చేశారు. కొన్ని సీన్లు చూస్తుంటే హాలీవుడ్లో ఎప్పుడో ఆపేసిని కుంగ్‌ఫూ సినిమాలు గుర్తుకొచ్చాయిని కొందరు చెప్పారు. ఇలా పుష్ప2 గ్లోబల్ స్థాయిలో ఎక్కువగా పాజిటీవ్ టాక్‌తో దూసుకుపోతుంది. Action scene from an Indian movie pic.twitter.com/k9lhfXDIdp— non aesthetic things (@PicturesFoIder) February 3, 2025 -
భారత సంతతి సింగర్‌ను వరించిన గ్రామీ అవార్డ్
ప్రపంచ సంగీత రంగంలో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా భావించే ‘గ్రామీ’ అవార్డును భారత సంతతికి చెందిన అమెరికన్ సింగర్, వ్యాపారవేత్త చంద్రికా టాండన్ అందుకున్నారు. లాస్ ఏంజెలెస్ వేదికగా 67వ గ్రామీ అవార్డ్స్ కార్యక్రమం ఘనంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో ప్రపంచవ్యాప్తంగా పేరుపొందిన సింగర్స్‌తో పాటు సంగీత దర్శకులు పాల్గొని సందడి చేశారు. అయితే, చంద్రికా టాండన్(Chandrika Tandon) రూపొందించిన ‘త్రివేణి’ ఆల్బమ్ బెస్ట్ న్యూ ఏజ్ యాంబియంట్ ఆర్ చాంట్ ఆల్బమ్‌గా అవార్డు దక్కించుకుంది. ఆమెకు గతంలో కూడా గ్రామీ అవార్డ్ వరించింది.చెన్నైలో పెరిగిన చంద్రిక ప్రస్తుతం అమెరికాలో స్థిరపడ్డారు. పలు దేశాల్లో వ్యాపారవేత్తగా ఆమె రాణిస్తున్నారు. పెప్సీకో మాజీ సీఈఓ ఇంద్రా నూయీకి చంద్రిక సోదరి అవుతారని తెలిసిందే. చెన్నైలోని తమిళ బ్రాహ్మణ కుటుంబంలో జన్మించిన ఆమెకు చిన్నతనం నుంచే సంగీతంపై ఎక్కువ మక్కువ చూపారు . ఆమె తల్లి సంగీత విద్వాంసురాలు కావడంతో శిక్షణ తీసుకోవడంలో చంద్రికా టాండన్‌కు మరింత సులువు అయింది. వ్యాపార రంగంలో రాణిస్తూనే సంగీత ప్రపంచంలో ఎందరినో మెప్పిస్తున్నారు. తాజాగా ఆమెకు మరోసారి గ్రామీ-2025 (Grammy Awards 2025) అవార్డ్ దక్కడంతో అభిమానులతో పాటు కుటంబ సభ్యులు శుభాకాంక్షలు చెబుతున్నారు. -
హాలీవుడ్ ఫ్యామిలీ యాక్షన్ ఎంటర్టైనర్!
ఓటీటీలో ఇది చూడొచ్చు అనేప్రాజెక్ట్స్ చాలా ఉంటాయి. ప్రస్తుతం స్ట్రీమ్ అవుతున్న వాటిలో హాలీవుడ్ చిత్రం బ్యాక్ ఇన్ యాక్షన్(Back in Action) ఒకటి. ఈ చిత్రం గురించి తెలుసుకుందాం.హాలీవుడ్ సినిమాలన్నీ ఏదైనా ఒక జోనర్‌కి సంబంధించనవి మాత్రమే ఎక్కువగా ఉంటాయి. అలాంటిది ఓ యాక్షన్ జోనర్‌ని ఫ్యామిలీతో కలిపి హాలీవుడ్లో సినిమా రావడమంటే అదో వింత. అదే ‘బ్యాక్ ఇన్’ యాక్షన్ సినిమా. నెట్‌ఫ్లిక్స్ వేదికగా స్ట్రీమ్ అవుతోంది. తెలుగు వెర్షన్ కూడా లభ్యమవుతోంది. ఈ సినిమాకి సేత్ గార్డన్ దర్శకుడు . కేమరన్ డియాజ్, జెమీ ఫాక్స్ వంటి ప్రముఖ నటులతో పాటు జేమ్స్ బాండ్ సినిమాలలో సుపరిచితురాలైన గ్లెన్ క్లోజ్ ఈ సినిమాలో ఓ ప్రత్యేక పాత్రలో కనిపించడం విశేషం. ఇక కథ విషయానికొస్తే... అమెరికాలోని ప్రముఖ సీఐఎ సంస్థలో ప్రతినిధులుగా పని చేస్తున్న ఎమిలీ, మాట్ ప్రేమించుకుంటుంటారు. వారి ప్రేమకు ఫలితంగా ఎమిలీ గర్భవతి అవుతుంది. ఆ విషయాన్ని ఓ ఆపరేషన్‌లో భాగంగా మాట్కు చెబుతుంది ఎమిలీ. ఆ ఆపరేషన్ ఏంటంటే ప్రపంచంలోని ప్రముఖ పారిశ్రామిక, వాణిజ్య మరియు ప్రభుత్వ అధికార యంత్రాంగానికి సంబంధించిన ఓ డేటా డ్రైవ్‌ను తీసుకురావడం. ఈ దశలో ఇద్దరూ ఓ ఘోర విమాన ప్రమాదం నుండి తప్పించుకుంటారు. అలా తప్పించుకున్నవాళ్లు ఇక ప్రపంచానికి తమ ఉనికి తెలియకుండా దూరంగా పుట్టబోయే పిల్లలతో సంతోషంగా ఉండాలనుకుంటారు. అందుకే వాళ్లిద్దరూ 12 ఏళ్ళ దాకా అటు సీఐఎకి ఇటు ప్రపంచానికి తమ అసలు ఉనికి తెలియకుండా జాగ్రత్త పడతారు. ఈ 12 ఏళ్లలో వాళ్లకి ఇద్దరు పిల్లలు పుడతారు. తమ పిల్లలకు కూడా తమ అసలు ఐడెంటిటీ తెలియనివ్వరు. అయితే ఏ ఆపరేషన్ కోసం వీళ్లిద్దరూ అజ్ఞాతానికి వచ్చారో ఆ ఆపరేషన్ వల్లే మళ్లీ కథ మొదలవుతుంది. ఆ ఆపరేషన్‌లో శత్రువులకు దొరకకుండా ఉండాలని మాట్ తనతో పాటు ఆ డేటా డ్రైవ్‌ని ఎమిలీకి కూడా తెలియకుండా దాస్తాడు. ఆ డ్రైవ్ కోసం విలన్స్ వీళ్లిద్దరినీ మళ్లీ ట్రాక్ చేసి ఎటాక్ చేస్తారు. మరి విలన్స్ ఆ డ్రైవ్ చేజిక్కించుకుంటారా? తమ పిల్లలకు, సమాజానికి తమ ఐడెంటీటీని దాచి పెట్టిన ఎమిలీ, మాట్ విలన్స్ ఎటాక్ నుండి తప్పించుకున్నారా? లేదా అన్నది సినిమాలోనే చూడాలి. పైన చెప్పుకున్నట్టు ఇదో చక్కటి ఫ్యామిలీ యాక్షన్ ఎంటర్టైనర్. మంచి స్టంట్స్, విజువల్స్‌తో పాటు చక్కని కామెడీని ఈ సినిమాలో చూసి ఎంజాయ్ చేస్తారు. మరింకెందుకు ఆలస్యం... గ్రాబ్ యువర్ రిమోట్ టు ‘బ్యాక్ ఇన్ యాక్షన్’ ఫర్ వాచింగ్ దిస్ వీకెండ్.– ఇంటూరు హరికృష్ణ -
ఈ వారం ఓటీటీలో 18 చిత్రాలు.. ఆ రెండు స్పెషల్!
కొత్త ఏడాదికి తెలుగు సినిమా గ్రాండ్‌గా వెల్కమ్ చెప్పింది. జనవరి 14న విడుదలైన విక్టరీ వెంకటేశ్ 'సంక్రాంతికి వస్తున్నాం' మూవీ (Sankranthiki Vasthunam Movie)తో బాక్సాఫీస్ ఇప్పటికీ కళకళలాడుతోంది. జనవరి 12న విడుదలైన నందమూరి బాలకృష్ణ 'డాకు మహారాజ్' సినిమా సైతం మంచి వసూళ్లు రాబట్టింది. జనవరి 10న ప్రేక్షకుల ముందుకు వచ్చిన రామ్‌చరణ్ 'గేమ్ ఛేంజర్' ఆరంభంలో అదరగొట్టినా తర్వాత మాత్రం తడబడింది. ఈ సినిమాలు ఇప్పుడప్పుడే ఓటీటీ (OTT)లో వచ్చే సూచనలు కనిపించట్లేదు. అయితే జనవరి చివరి వారంలో అటు థియేటర్లో, ఇటు ఓటీటీలో సందడి చేసేందుకు కొన్ని సినిమాలు, సిరీస్‌లు రెడీ అయ్యాయి. అందులో అల్లు అర్జున్ 'పుష్ప 2', త్రిష 'ఐడెంటిటీ' వంటి ఆసక్తికరమైన సినిమాలున్నాయి. ఆ పూర్తి జాబితా ఓసారి చూసేద్దాం..థియేటర్లో విడుదలమదగజరాజ (తెలుగు వర్షన్) - జనవరి 31రాచరికం - జనవరి 31మహిహ - జనవరి 31ఓటీటీనెట్ఫ్లిక్స్అమెరికన్ మ్యాన్‌హంట్: ఓజే సింప్సన్ (డాక్యుమెంటరీ సిరీస్) - జనవరి 29పుష్ప 2 - జనవరి 30ద రిక్రూట్ సీజన్ 2 (వెబ్ సిరీస్) - జనవరి 30లుక్కాస్ వరల్డ్ - జనవరి 31ది స్నో గర్ల్ సీజన్ 2 (వెబ్ సిరీస్) - జనవరి 31 హాట్స్టార్ద స్టోరీటెల్లర్ - జనవరి 28యువర్ ఫ్రెండ్లీ నైబర్‌హుడ్ స్పైడర్‌మ్యాన్ (కార్టూన్ సిరీస్) - జనవరి 29ద సీక్రెట్ ఆఫ్ ద షిలేదార్స్ (వెబ్ సిరీస్) - జనవరి 31జీ5ఐడెంటిటీ - జనవరి 31 అమెజాన్ ప్రైమ్ర్యాంపేజ్ - జనవరి 26ట్రిబ్యునల్ జస్టిస్ సీజన్ 2 (రియాలిటీ కోర్ట్ షో) - జనవరి 27బ్రీచ్ - జనవరి 30ఫ్రైడే నైట్ లైట్స్ - జనవరి 30యు ఆర్ కార్డియల్లీ ఇన్వైటెడ్ - జనవరి 30 యాపిల్ టీవీ ప్లస్మిథిక్ క్వెస్ట్ సీజన్ 4 (వెబ్ సిరీస్) - జనవరి 29సోనీలివ్సాలే ఆషిక్ - ఫిబ్రవరి 1లయన్స్ గేట్ప్లేబ్యాడ్ జీనియస్ - జనవరి 31ముబిక్వీర్ - జనవరి 31చదవండి: రాజమౌళిపై ట్రోలింగ్.. 'మీరు ఇండియన్స్ కాదా?' -
బీ కేర్‌ఫుల్...
ఓటీటీలో ఇది చూడొచ్చు అనే ప్రాజెక్ట్స్ చాలా ఉంటాయి. ప్రస్తుతం స్ట్రీమ్ అవుతున్న వాటిలో హాలీవుడ్ చిత్రం డేంజరస్ వాటర్స్ (Dangerous Waters)ఒకటి. ఈ చిత్రం గురించి తెలుసుకుందాం.జీవితమన్నది క్షణభంగురం. ఏ క్షణానికి ఏమి జరుగుతుందో ఎవరూ ఊహించలేరు. కాబట్టి అనుక్షణం అప్రమత్తత అవసరం. ఈ నేపథ్యంలోనే రూ΄పొందిన హాలీవుడ్ సినిమా ‘డేంజరస్ వాటర్స్’(Dangerous Waters ). ఇదో పూర్తి థ్రిల్లర్ జోనర్ మూవీ. సినిమా మొత్తం ఓ మూడు పాత్రలతో 90 శాతం సముద్రంలోనే జరిగిన కథ. సినిమాలో ఉన్నది మూడు పాత్రలే అయినా మంచి స్క్రీన్‌ప్లేతో చూసే ప్రేక్షకులను మాత్రం కట్టిపడేసే ప్రయత్నం చేశారు దర్శకుడు జాన్ బర్.ఈ సినిమా లయన్స్ గేట్ ఓటీటీ వేదికగా స్ట్రీమ్ అవుతోంది. ఇది పెద్దవాళ్లు మాత్రమే చూసే సినిమా. ఇక ఈ చిత్రకథ విషయానికొస్తే... అల్మా తన కూతురు కోసం ఓ సూపర్ వెకేషన్ ప్లాన్ చేస్తుంది. తన బాయ్ ఫ్రెండ్ డెరెక్‌తో కలిసి కూతురుతో పాటు బోట్లో బెర్ముడా వరకు ట్రావెల్ చేసి, సముద్రం మధ్యలో తన బర్త్ డే సెలబ్రేట్ చేసుకోవాలన్నది ప్లాన్. దీనికి కూతురు రోజ్ అయిష్టంగానే ఒప్పుకుంటుంది. ప్రయాణం మొదలైనపుడు అంతా బాగానే ఉంటుంది. దారి మధ్యలో వేరే ఒక బోట్ వీళ్లకు ఎదురుగా వచ్చి అల్మాను చంపేసి డెరెక్‌ను గాయపరుస్తారు. అనుకోకుండా జరిగిన ఈ సంఘటనలో నడి సంద్రంలో రోజ్ ఒంటరిదైపోతుంది.దాడి చేయడానికి వచ్చినవాళ్లు బోట్లోని రేడియోను అలాగే బోట్ ఇంజన్‌ను ధ్వంసం చేసి వెళతారు. చుట్టూ నీళ్లు తప్ప ఏమీ లేని ఆ ప్రాంతం నుండి రోజ్ ఎలా బయటపడిందనేది సినిమాలోనే చూడాలి. ఈ సినిమా చాలా నెమ్మదిగా ప్రారంభమై, ఉత్కంఠభరితంగా సాగుతూ ఊహకందని క్లైమాక్స్ ట్విస్టులతో అద్భుతంగా ముగుస్తుంది. గంటా నలభై నిమిషాల నిడివితో సాగే ఈ సినిమా ఎక్కడా బోర్ కొట్టదు. థ్రిల్లర్ జోనర్ ఇష్టపడేవాళ్లకి ఇదో సూపర్ సినిమా. మరింకేం... ఈ వీకెండ్ ‘డేంజరస్ వాటర్స్’లోకి మీరూ ట్రావెల్ చేయండి. – ఇంటూరు హరికృష్ణ -
అద్భుతాలు చూపిస్తాం: జేమ్స్ కామెరూన్
‘‘అవతార్, అవతార్ 2’ చిత్రాల తర్వాత ఈ ఫ్రాంచైజీలో రానున్న మూడో చిత్రంపై ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ అభిమానుల్లో ఎన్నో అంచనాలుంటాయి. ఆ అంచనాలను మించి మా సినిమా ఉంటుంది’’ అని ప్రముఖ హాలీవుడ్ డైరెక్టర్ జేమ్స్ కామెరూన్ అన్నారు. ఆయన దర్శకత్వం వహించిన ‘అవతార్’ (2009), ‘అవతార్: ది వే ఆఫ్ వాటర్’ (2022) సినిమాలు ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకాదరణ పొందిన విషయం తెలిసిందే.ఈ ఫ్రాంచైజీలో రానున్న మూడో చిత్రం ‘అవతార్–ఫైర్ అండ్ యాష్’. ఈ చిత్రానికి కూడా జేమ్స్ కామెరూన్ దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ‘అవతార్–ఫైర్ అండ్ యాష్’ గురించి జేమ్స్ కామెరూన్ మాట్లాడుతూ– ‘‘వెండితెరపై ఈ విజువల్ వండర్‌ను చూసి ఆడియన్స్ ఆశ్చర్యపోతారు. తొలి, ద్వితీయ చిత్రాల్లో చూపినవి రిపీట్ కాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నాం. ధైర్యం చేసి సరికొత్తవి తీసుకొస్తున్నాం.ఇలా ధైర్యం చేసి కొత్తవాటిని సృష్టించకపోతే ప్రేక్షకుల సమయాన్ని, డబ్బును వృథా చేసినవాడిని అవుతాను. ‘అవతార్, అవతార్: ది వే ఆఫ్ వాటర్’ చిత్రాల్లో లేని అద్భుతాలను ‘అవతార్–ఫైర్ అండ్ యాష్’లో చూస్తారు. అంచనాలకు మించిన లైవ్ యాక్షన్‌ని ప్రేక్షకులకు చూపించనున్నాం. ఓ కొత్త ప్రపంచంతో పాటు వైవిధ్యమైన కథ, పాత్రలు ఇందులో కనిపిస్తాయి’’ అని పేర్కొన్నారు. ఈ చిత్రం డిసెంబరు 19న విడుదల కానుంది. -
తను..టైగర్ అన్న హాలీవుడ్ డైరెక్టర్... ఎన్టీయార్‌తో సినిమా?
జానియర్ ఎన్టీయార్(JR NTR) టాలీవుడ్లో టాప్ హీరో. త్వరలోనే హాలీవుడ్ సినిమాల్లో(Hollywood Movie) అడుగుపెట్టనున్నాడా? ఈ ప్రశ్నకు సమాధానం అప్పుడే అవునని చెప్పలేకపోయినా... ఆ అవకాశాలు కనిపిస్తున్నాయని ఖచ్చితంగా చెప్పొచ్చు. ఓ ప్రఖ్యాత హాలీవుడ్ దర్శకుడి మాటలే అందుకు నిదర్శనం. ఇలాంటి చర్చకు కారణం ఆర్ఆర్ఆర్ సినిమా అని చెప్పక తప్పదు. హాలీవుడ్ చిత్ర ప్రముఖులపై ’ఆర్ఆర్ఆర్’ ఎంత ప్రభావం చూపిందో దీనిని బట్టి అర్ధం చేసుకోవచ్చు. సక్సెస్ ఫుల్ డైరెక్టర్ రాజమౌళి ఈ సినిమాలో ఎన్టీయార్‌లోని మహోన్నత నటరూపాన్ని ఆవిష్కరించాడు. నిజానికి ఎన్టీయార్‌తో ఎలాంటి సినిమా అయినా చేయవచ్చునని తెలిసిన దర్శకుడు రాజమౌళి. ’సింహాద్రి’ ’యమ దొంగ’ వంటి చిత్రాలు పెద్ద హిట్ కొట్టడానికి ఆర్ఆర్ఆర్ ప్రపంవచ్యాప్తంగా ఆదరణకు నోచుకోవడానికి అదే కారణం. వీరిద్దరి కాంబోలో వచ్చిన ఆర్ఆర్ఆర్ జూనియర్, రాజమౌళిలకు హ్యాట్రిక్ హిట్‌తో పాటు ఇంటర్నేషనల్ పాప్యులారిటీని కూడా అందించింది. టాలీవుడ్ టూ బాలీవుడ్ టూ హాలీవుడ్...ఆర్ఆర్ఆర్ తో తెచ్చుకున్న క్రేజ్ జూనియర్ ఎన్టీఆర్‌ను బాలీవుడ్ కూడా కోరుకునేలా చేసింది. ప్రస్తుతం జా.ఎన్టీయార్ ’వార్ 2’ సినిమా ద్వారా బాలీవుడ్లో అరంగేట్రం చేస్తున్నాడు. బాలీవుడ్ స్టార్ హృతిక్‌తో కలిసి జూనియర్ నటిస్తున్న ఈ సినిమా ఈ ఏడాది అత్యధిక కలెక్షన్లు రాబట్టే సినిమాగా సినీ పండితులు అంచనా వేస్తున్నారు. మరోవైపు ప్రశాంత్ నీల్‌తో తన తదుపరి యాక్షన్ అడ్వెంచర్‌కు కూడా యంగ్ టైగర్ సిద్ధమవుతున్నాడు. ఈ నేపధ్యంలోనే హాలీవుడ్ చిత్రంలో ఎన్టీయార్ అనే వార్త రావడంతో అభిమానులు ఫుల్ జోష్‌లో ఉన్నారు.నేను రెడీ అంటున్న సూపర్ మ్యాన్ డైరెక్టర్...ప్రముఖ హాలీవుడ్ చిత్రనిర్మాత జేమ్స్ గన్ (James Gunn) ’సూపర్‌మ్యాన్,’ ’సూసైడ్ స్క్వాడ్,’ గార్డియన్స్ ఆఫ్ ది గెలాక్సీ వంటి గొప్ప అంతర్జాతీయ చిత్రాలకు దర్శకత్వం వహించారు. సూపర్‌మ్యాన్ సినిమా ప్రపంచవ్యాప్తంగా ఎంత పాప్యులర్ అనేది అందరికీ తెలిసిందే. అలాంటి సినిమాకి దర్శకత్వం వహించిన ఆయన ఇటీవల ఆయన ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఆర్ ఆర్ ఆర్ చిత్రం గురించి ప్రస్తావించారు మరీ ముఖ్యంగా తెలుగు స్టార్ జూనియర్ ఎన్టీఆర్ గురించి ఆయన నటన గురించి గొప్పగా మాట్లాడారు. ఆర్ఆర్ఆర్లోని కొన్ని సన్నివేశాలను ప్రస్తావించి మరీ ఆయన జూనియర్‌పై పొగడ్తల వర్షం కురిపించడం విశేషం. ముఖ్యంగా ‘బోనులలో నుంచి పులులతో పాటు బయటకు దూకిన ఆ నటుడు (ఎన్టీయార్)తో నేను పని చేయాలనుకుంటున్నాను. అతను అద్భుతమైన నటుడు. నేను అతనితో ఏదో ఒక రోజు పని చేయాలనుకుంటున్నాను‘ అని ఆయన చెప్పారు.ఎన్టీఆర్ ఎంతగానో ఆకట్టుకున్నాడని జేమ్స్ అన్నారు. ఇప్పటి దాకా టాప్ హాలీవుడ్ ఫిల్మ్ మేకర్ ఓ తెలుగు హీరోని ఉద్దేశించి మాట్లాడడం ఇదే ప్రధమం కావడం గమనార్హం. -
ఆస్కార్ నామినేషన్స్ మరోసారి వాయిదా.. అదే కారణం!
అమెరికాలోని లాస్ ఏంజెల్స్‌లో కార్చిచ్చు చెలరేగింది. ఈ ప్రకృతి ప్రకోపానికి లక్షలాది మంది నిరాశ్రయులయ్యారు. వేల సంఖ్యలో ఇళ్లు కాలి బూడిదైపోయాయి. ఈ ఘటనతో ఆస్కార్ నామినేషన్స్ ప్రక్రియ వాయిదా పడింది.ప్రతి ఏడాది నామినేషన్స్ ప్రక్రియ జనవరి 8 నుంచి 14 వరకు జరుగుతుంది. కార్చిచ్చు వల్ల జనవరి 17న ప్రకటించాల్సిన నామినేషన్స్‌ను వాయిదా వేశారు. ఈనెల 23న పూర్తి నామినేషన్స్ చిత్రాల జాబితా వెల్లడిస్తామని ఆస్కార్ అకాడమీ ప్రకటించింది. మంటల వ్యాప్తి ఇంకా తగ్గకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. ఈ విషయాన్ని అకాడమీ సీఈవో బిల్ క్రేమర్, అకాడమీ అధ్యక్షుడు జానెట్ యాంగ్ తెలిపారు.భారత్ నుంచి ఆరు చిత్రాలుకాగా.. ఈ ఏడాది భారత్ నుంచి ఆరు చిత్రాలు నామినేషన్ల బరిలో చోటు దక్కించుకున్నాయి. సూర్య హీరో నటించిన కంగువా (తమిళం), ది గోట్ లైఫ్ (మలయాళం), స్వాతంత్ర్య వీర్ సావర్కర్ (హిందీ), ఆల్ వి ఇమాజిన్ యాజ్ లైట్ (మలయాళం), సంతోష్ (హిందీ), గర్ల్స్ విల్ బి గర్ల్స్( హిందీ, ఇంగ్లిష్) నామినేషన్స్ ప్రక్రియలో నిలిచాయి.బాక్సాఫీస్ వద్ద ఫెయిల్..సూర్య హీరోగా నటించిన కంగువాను శివ దర్శకత్వంలో తెరకెక్కించారు. గతేడాది నవంబర్ 14న విడుదలైన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద పెద్దగా రాణించలేకపోయింది. అభిమానుల అంచనాలను అందుకోవడంలో విఫలమైంది. తాజాగా ఈ మూవీ 2025 ఆస్కార్ నామినేషన్స్‌లో పోటీ పడుతోంది. సుమారు రూ. 350 కోట్లతో తెరకెక్కిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఇప్పటి వరకు కేవలం రూ. 160 కోట్ల వరకు రాబట్టినట్లు తెలుస్తోంది.పాయల్ కపాడియా మూవీకి చోటు..పాయల్ కపాడియా తెరకెక్కించిన చిత్రం 'ఆల్ వి ఇమాజిన్ యాజ్ లైట్'. ఈ ఏడాది నవంబర్ 22న థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద పాజిటివ్ టాక్‌ను సొంతం చేసుకుంది. తెలుగులో టాలీవుడ్ హీరో– నిర్మాత రానా స్పిరిట్ మీడియా సంస్థ ఈ చిత్రాన్ని విడుదల చేసింది.ముంబయిలోని ఇద్దరు మలయాళీ నర్సుల స్టోరీనే సినిమాగా ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. రిలీజ్‌కు ముందే ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా పలు అవార్డులను సాధించింది. ప్రతిష్టాత్మక కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్- 2024లో గ్రాండ్ ప్రిక్స్ గెలుచుకున్న మొదటి భారతీయ చిత్రంగా నిలిచింది. అంతేకాకుండా 82వ గోల్డెన్ గ్లోబ్స్ అవార్డ్స్‌లో ఏకంగా రెండు విభాగాల్లో చోటు దక్కించుకుంది. ఉత్తమ దర్శకుడు (మోషన్ పిక్చర్), బెస్ట్ నాన్-ఇంగ్లీష్ లాంగ్వేజ్ మోషన్ పిక్చర్ విభాగాల్లో నామినేషన్స్ సాధించింది. ప్రస్తుతం ఆస్కార్ నామినేషన్స్‌లోనూ పోటీలో నిలిచింది. త్రంలో కని కస్రుతి, దివ్య ప్రభ, ఛాయా కదమ్, హృధు హరూన్ ప్రధాన పాత్రలు పోషించారు.పృథ్వీరాజ్ సుకుమారన్ ది గోట్ లైఫ్..గతేడాది వచ్చిన హిట్ చిత్రాల్లో మలయాళ మూవీ ది గోట్ లైఫ్ కూడా ఒకటి. ఈమూవీ తెలుగులో ఆడుజీవితం పేరిట విడుదలైంది. పృథ్వీరాజ్ సుకుమారన్ హీరోగా నటించిన ఈ చిత్రానికి బ్లెస్సీ దర్శకత్వం వహించాడు. కేరళకు చెందిన నజీబ్ మహ్మద్ డబ్బు సంపాదించేందుకు సౌదీ అరేబియాకు వలస వెళ్లి అక్కడ ఎన్నో కష్టాలు పడ్డాడు. వీటన్నింటినీ బెన్యమిన్ అనే రచయిత గోట్ లైఫ్ అనే నవలలో రాసుకొచ్చాడు. దీన్ని ఆధారంగా చేసుకుని ఆడు జీవితం మూవీ తెరకెక్కింది. ప్రస్తుతం ఈ మూవీ ఆస్కార్ నామినేషన్స్‌లో పోటీ పడుతోంది. -
ప్రతిష్టాత్మక గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్.. ఇండియాలో ఎక్కడ చూడాలంటే?
ప్రతిష్టాత్మక సినీ అవార్డుల వేడుకకు రంగం సిద్ధమైంది. ప్రపంచవ్యాప్తంగా ఆదరణ పొందిన చిత్రాలకు ఇచ్చే గోల్డెన్ గ్లోబ్ అవార్డుల వేడుక జనవరి 6న జరగనుంది. ఈ 82 వ గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్-2025 కార్యక్రమానికి హోస్ట్‌గా నటి, కమెడియన్ నిక్కీ గ్లేజర్ వ్యవహరించనున్నారు. గోల్డెన్ గ్లోబ్స్ వేడుకకు హోస్ట్ చేసిన మొదటి మహిళగా ఆమె చరిత్ర సృష్టించనున్నారు. అంతే కాకుండా ఈ ఈవెంట్లో ప్రజెంటర్స్‌గా పలువురు హాలీవుడ్ తారలు పాల్గొననున్నారు.ఈ ప్రతిష్టాత్మక ఈవెంట్‌ను ఓటీటీలోనూ ప్రత్యక్ష ప్రసారం చేయనున్నారు. ఈ వేడుక ఇండియాలో లయన్స్‌గేట్ ప్లే అనే ఓటీటీ లైవ్ స్ట్రీమింగ్ కానుంది. జనవరి 6న ఉదయం 05:30 గంటలకు లైవ్ అందుబాటులోకి రానుంది.ఇండియా నుంచి ఓకే చిత్రం..ఈ ఏడాది గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్‌కు ఇండియా నుంచి ఒక్క సినిమానే ఎంపికైంది. పాయల్ కపాడియా తెరకెక్కించిన ఆల్ వి ఇమాజిన్ యాజ్ లైట్ రెండు విభాగాల్లో నామినేట్ అయింది. రెండు నామినేషన్లు సాధించిన తొలి చిత్రంగా చరిత్ర సృష్టించింది. ఇప్పటికే ఈ సినిమా కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లోనూ అవార్డ్‌ను సొంతం చేసుకుంది. బెస్ట్ నాన్ ఇంగ్లీష్ మోషన్ పిక్చర్, బెస్ట్ డైరెక్టర్(మోషన్ పిక్చర్) విభాగాల్లో నామినేషన్స్ దక్కించుకుంది. మరి ఈ సినిమాను అవార్డ్ వరిస్తుందో లేదో తెలియాలంటే ఆరో తేదీ వరకు ఆగాల్సిందే. View this post on Instagram A post shared by Golden Globes (@goldenglobes) -
హాలీవుడ్ స్టార్ జంటకు విడాకులు.. ఎనిమిదేళ్ల తర్వాత సెటిల్మెంట్!
ప్రముఖ హాలీవుడ్ జంట ఏంజెలీనా జోలీ, బ్రాడ్ పిట్ తమ బంధానికి గుడ్ బై చెప్పేశారు. దాదాపు 8 ఏళ్ల తర్వాత ఈ దంపతులకు కోర్టు విడాకులు మంజూరు చేసింది. సెప్టెంబరు 2016లో ఎంజెలీనా జోలీ విడాకుల కోసం కోర్టును అశ్రయించారు. సుదీర్ఘమైన విచారణ తాజాగా వీరిద్దరు ఓ సెటిల్మెంట్కు వచ్చారు. దీంతో వీరిద్దరు అధికారికంగా విడాకులు తీసుకున్నట్లు ఎంజెలీనా తరఫు న్యాయవాది ధ్రువీకరించారు.కాగా.. 2014లో ఎంజెలీనా, బ్రాడ్ పిట్ పెళ్లి చేసుకున్నారు. ఈ జంట దాదాపు 12 ఏళ్ల పాటు కలిసి ఉన్నారు. హాలీవుడ్లో అత్యంత ప్రజాదరణ పొందిన జంటల్లో ఏంజెలినా జోలీ, బ్రాడ్ పిట్ ఒకరు. కాగా... విడాకుల సెటిల్మెంట్కు సంబంధించిన వివరాలను గోప్యంగా ఉంచారు. ఈ కేసు కోసం దంపతులు ఒక ప్రైవేట్ న్యాయమూర్తిని నియమించారు.2016లో జోలీ యూరప్ ట్రిప్ తర్వాత విడాకుల కోసం దాఖలు చేసింది. పిట్ తన పట్ల, తన పిల్లల పట్ల అనుచితంగా ప్రవర్తించాడని ఆమె పేర్కొంది. అయితే ఈ జంటకు న్యాయమూర్తి వారికి 2019లో విడాకులు మంజూరు చేశారు. కానీ పిల్లలు, ఆస్తుల విభజన, పిల్లల సంరక్షణ సెటిల్మెంట్ కోసం కోసం మరో ఐదేళ్లు పట్టింది. ఇక నుంచి వీరిద్దరు అధికారికంగా విడిపోయినట్లే. ఇక సినిమాల విషయానికొస్తే ఎంజెలీనా జోలీ చివరిసారిగా మారియాలో కనిపించింది. -
హాలీవుడ్ హిట్ సినిమా సీక్వెల్.. మరింత ఆలస్యం
బ్యాట్‌మ్యాన్ విన్యాసాలను చూసేందుకు ఎదురుచూస్తున్న అభిమానులకు నిరాశే ఎదురైంది. 2022లో విడుదలైన ‘బ్యాట్‌మ్యాన్’ చిత్రాన్ని హాలీవుడ్ దర్శకుడు మాట్ రీవ్స్ తెరకెక్కించారు. ప్రపంచవ్యాప్తంగా ఈ మూవీ బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. దాంతో ఈ చిత్రానికి సీక్వెల్ ప్రకటించినప్పటి నుంచి విడుదల కోసం బ్యాట్‌మేన్ అభిమానులు ఎదురు చూస్తున్నారు. జెఫ్రీ రైట్, రాబర్ట్ ప్యాటిన్సన్, ఆండీ సెర్కిస్ ప్రధాన పాత్రధారులుగా రూపొందుతున్న ఈ చిత్రాన్ని 2025 రిలీజ్ చేయాలనున్నట్లు చిత్ర యూనిట్ ఇప్పటికే ప్రకటించింది. అయితే, ఆ సమయంలో విడుదల కావడంలేదని తెలుపుతూ చిత్ర నిర్మాన సంస్ధ అధికారికంగా ప్రకటించింది.సూపర్ హీరో చిత్రాలను ఇష్టపడే వారికి 'ది బ్యాట్‌మ్యాన్' తెగ నచ్చేస్తుంది. ప్రపంచవ్యాప్తంగా ఈ మూవీ అభిమానులు ఉన్నారు. ఫిక్షనల్ పాత్ర బ్యాట్‌మ్యాన్‌ను ఆధారంగా చేసుకొనే ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. వార్నర్ బ్రదర్స్ పిక్చర్స్ సంస్థ సీక్వెల్‌ను కూడా భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. అయితే, 2025లో విడుదల కానున్నట్లు మొదట ప్రకటించారు. ఆపై 2026లో రిలీజ్ చేస్తామని తెలిపారు. కానీ, తాజాగా ఈ చిత్రాన్ని 2027 అక్టోబరు 1న ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నట్లు నిర్మాణ సంస్థ తెలిపింది. దీంతో అభిమానులు ఆశ్చర్యానికి లోనయ్యారు. ఇప్పటికే పలుసార్లు వాయిదా పడుతూ వస్తోన్న ఈ సినిమా కోసం అభిమానులు ఇంకొన్ని రోజులు వేచి చూడాల్సిందేనని తేలిపోయింది. మొదటి భాగం ఎంత హిట్ అయిందో అంతకు మించి ఈ సినిమా ఉండాలని, అందుకోసం ఆలస్యం అయినా పర్వాలేదని మేకర్స్ ఆలోచిస్తున్నారట. కథ, స్క్రీన్ ప్లే విషయంలో దర్శకుడు మాట్ రీవ్స్ కొత్తగా కొన్ని మార్పులు అనుకున్నారని, వీటిని సెట్స్‌లో చిత్రీకరించేందుకు టైమ్ పడుతుందని, అందుకే ‘బ్యాట్‌మేన్ 2’ చిత్రం విడుదల వాయిదా పడిందని హాలీవుడ్ సమాచారం. -
జాగ్రత్త... టోర్నడోల్లో ఎగిరిపోతారు
ఓటీటీలో ‘ఇది చూడొచ్చు’ అనే ప్రాజెక్ట్స్ చాలా ఉంటాయి. ప్రస్తుతం స్ట్రీమ్ అవుతున్న వాటిలో హాలీవుడ్ చిత్రం ట్విస్టర్స్ ఒకటి. ఈ చిత్రం గురించి తెలుసుకుందాం.ఎంత పెద్ద విపత్తయినా, వివాదమైనా ముందుగా అమెరికా హాలీవుడ్ దర్శకుల మెదళ్లలో పుట్టి, దాని తరువాత వీలైతే అది జరుగుతుంది, లేదంటే ఆ హాలీవుడ్ దర్శకుడి ఊహల్లోనే ఉండిపోతుంది. చిన్నపాటి ఈగ నుండి ఇప్పటిదాకా కనీసం ప్రత్యక్షంగా కనిపించని గ్రహాంతరవాసి దాడుల వరకు హాలీవుడ్ దర్శకుల ఊహకు కాదేదీ అనర్హం, ఇది జగమెరిగిన సత్యం. కానీ ప్రకృతి మాత్రం అమెరికాలో భౌగోళిక ప్రాతిపదికన నిజంగానే కాస్తంత ప్రచండంగానే ఉంటుంది. వాటిలో ముఖ్యంగా తరచూ కనిపించే టోర్నడోలు. మన పరిభాషలో చెప్పాలంటే సుడిగుండపు తుఫానులు.వీటి మీద హాలీవుడ్ దర్శకుల కన్ను దాదాపు 28 సంవత్సరాల క్రితమే పడింది. 1996లో జెన్ డి బాంట్ ‘ట్విస్టర్’ అనే సంచలనాత్మక సినిమా తీశారు. ఆ రోజుల్లో ఈ సినిమా ప్రపంచ సినీ పరిశ్రమలో పెద్ద హాట్ టాపిక్. అప్పట్లో 88 మిలియన్లు పెట్టి ఈ సినిమా తీస్తే దాదాపు 500 మిలియన్లు సంపాదించి పెట్టింది. ఇప్పుడు దానికి కొనసాగింపుగా జోసెఫ్ కోసిన్సి్క కథ ఆధారంగా మార్క్ ఔ. స్మిత్ స్క్రీన్‌ప్లేతో లీ ఐజాక్ చుంగ్ దర్శకత్వం వహించిన 2024 అమెరికన్ చిత్రం ట్విస్టర్స్’. ప్రస్తుతం ఈ సినిమా జియో సినిమా ఓటీటీ వేదికగా స్ట్రీమ్ అవుతోంది. ‘ట్విస్టర్స్’ సినిమా పూర్తిగా టోర్నడోల కథాంశంతోనే తెరకెక్కింది. అమెరికా దేశంలో ఒక్లాహామా రాష్ట్రం ఎక్కువగా టోర్నడోలు ప్రభావితమయ్యే ప్రాంతం. ఓ టోర్నడో వస్తుందంటే దాని ప్రభావం ఎంతవరకు ఉంటుంది? అది ఎప్పుడు ఆగిపోతుంది అన్న లోతైన విశ్లేషణలు చేయడానికి ప్రభుత్వంతో పాటు అనేక ప్రైవేటు సంస్థలు పని చేస్తుంటాయి. ‘ట్విస్టర్స్’ సినిమా కథ అటువంటి సంస్థ గురించే. స్ట్రామ్ పార్ అనే ఈ సంస్థలో ఎంతో అవగాహన ఉన్న కేట్ తన సహచరుడు జావి ద్వారా చేరుతుంది. ఓ టోర్నడో ఆపరేషన్‌లో కేట్ తన ప్రియుడిని పోగొట్టుకుంటుంది. ఆ బాధలో ఉన్నా ఓ వారం వరకు తాను జావీకి తోడుగా ఉంటానని స్ట్రామ్ పార్ టీమ్‌లోకి వస్తుంది. కానీ జావి ఇదంతా ఓ స్వార్థం కోసం చేస్తున్నాడని తెలిసి ఇదే టోర్నడో ఆపరేషన్‌లో భాగంగా టోర్నడో వ్రాంగ్లర్ అనే యూట్యూబ్ సంస్థలోకి టైలర్ ఆహ్వానిస్తే వెళుతుంది. టోర్నడో ప్రమాదకర కేటగిరీ ఈయఫ్ 5ని వీళ్ళు ఛేజ్ చేస్తూ చిక్కుకుంటారు. మరి... వాళ్లు ఆ టోర్నడో నుండి బయటపడ్డారా? లేదా అన్నది మాత్రం సినిమాలోనే చూడాలి. మంచి ఇన్ఫర్మేషన్తో చక్కటి థ్రిల్లింగ్ మూడ్‌లోకి తీసుకువెళ్లే సినిమా ఈ ‘ట్విస్టర్స్’. వర్త్‌ఫుల్ టు వాచ్.– ఇంటూరు హరికృష్ణ -
కదలకుండా కట్టిపడేసే థ్రిల్లర్
ఓటీటీలో ‘ఇది చూడొచ్చు’ అనే ప్రాజెక్ట్స్ చాలా ఉంటాయి. ప్రస్తుతం స్ట్రీమ్ అవుతున్న వాటిలో హాలీవుడ్ చిత్రం ‘క్యారీ ఆన్’ ఒకటి. ఈ చిత్రం గురించి తెలుసుకుందాం.థ్రిల్లర్ జోనర్ అనేది సినిమా మొత్తం క్యారీ చేయడం దర్శకుడికి కత్తి మీద సాము లాంటిది. సినిమా ఓ లైన్లో వెళుతున్నపుడు దాని జోనర్‌ని కమర్షియల్ యాంగిల్లో కూడా బ్యాలెన్స్ చేస్తూ క్యారీ చేయడం చాలా కష్టం. ఒకవేళ అలా పట్టు సడలకుండా క్యారీ చేస్తే మాత్రం ఆ సినిమా సూపర్ హిట్ అయినట్టే. ‘క్యారీ ఆన్’ ఆ కోవకు చెందిన సినిమానే. ఇదో హాలీవుడ్ యాక్షన్ థ్రిల్లర్. ఈ మధ్య కాలంలో థ్రిల్లింగ్ జోనర్లో వచ్చిన అరుదైన సినిమా అని చెప్పాచ్చు.ఈ సినిమాకి జేమ్ కలెక్ట్ సేరా దర్శకుడు. ప్రముఖ హాలీవుడ్ నటులు టారన్, సోఫియా లీడ్ రోల్స్‌లో నటించారు. ఇక ఈ సినిమా కథ విషయానికొస్తే... భార్యాభర్తలైన ఈథన్ కోపెక్, నోరా పార్సీ అమెరికాలోని ఎయిర్‌పోర్టులలో లగేజ్ సెక్యురిటీ తనిఖీ సంస్థ అయిన టీఎస్ఎలో పని చేస్తూ ఉంటారు. అది క్రిస్మస్ కాలం. ఎయిర్‌పోర్టు పండగ వాతావరణంలో ప్రయాణీకులతో రద్దీగా ఉంటుంది. కొపెక్ తన ప్రమోషన్ కోసం ప్రయత్నిస్తుంటాడు. అందుకని ఆ రోజు వేరే వాళ్లు ఉండాల్సిన స్థానంలో తన పోస్ట్ వేయించుకుంటాడు. అది లగేజ్ స్క్రీన్ స్పెషలిస్ట్ డ్యూటీ. తాను రొటీన్‌గా ప్రయాణీకుల లగేజ్ స్క్రీన్ చేస్తుండగా అనూహ్యంగా ఓ బ్లూటూత్ దొరుకుతుంది. ఆ బ్లూటూత్ కొపెక్ ధరించడంతో అసలు కథ మొదలవుతుంది.ఓ అనామకుడు కొపెక్ను బ్లూటూత్ ద్వారా తాను చెప్పింది చెయ్యకుంటే అదే ఎయిర్‌పోర్టులో పని చేస్తున్న అతని భార్య నోరాని చంపుతానని బెదిరిస్తాడు. ఆ ఆగంతకుడు ఓ బాంబుని ఫ్లైట్‌లోకి తరలించడానికి ప్రయత్నిస్తుంటాడు. ఆ బాంబు బ్యాగేజీని లగేజ్ స్క్రీన్ దగ్గర అడ్డుకోకూడదని అజ్ఞాత వ్యక్తి హెచ్చరిస్తూ బ్లూటూత్ ద్వారా కొపెక్కు సూచనలిస్తుంటాడు. అసలే పండగ కాలం... ఎయిర్‌పోర్టు నిండా జనం. ఒకవేళ ఏదైనా జరగ రానిది జరిగితే పెద్ద సంఖ్యలో అపార ప్రాణ నష్టం. అందుకే కొపెక్ ఓ పక్క ఆ లగేజ్‌ని ఆపాలని మరో పక్క తన భార్యను కాపాడుకోవాలని చేసిన ప్రయత్నం సినిమాకే హైలైట్. ముందుగా తనకు కనపడకుండా తనను లక్ష్యంగా చేసుకుని ఇంతటి దారుణానికి ఒడిగడుతున్న అతడ్ని వెతకడానికి ప్రయత్నిస్తుంటాడు. కొపెక్ ఆ ఆగంతకుడితో పాటు బాంబుని కనుక్కున్నాడా? అలాగే తన భార్యని కాపాడుకున్నాడా... ఈ ప్రశ్నలకు సమాధానం నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమ్ అవుతున్న ‘క్యారీ ఆన్’ సినిమాని చూడడం. ఈ సినిమా స్క్రీన్‌ప్లే ప్రేక్షకుడిని కట్టిపడేస్తుంది. సినిమాలో పాత్రలు పరిచయం అయ్యే దాకా రొటీన్ సినిమా అనిపించినప్పటికీ బ్లూటూత్ దొరికినప్పటి నుండి కథ వేగంగా పరిగెడుతూ ప్రేక్షకుడిని కదలకుండా చేస్తుంది. తెలుగు డబ్బింగ్ వెర్షన్ నెట్‌ఫ్లిక్స్‌లో లభ్యమవుతోంది. ఈ ‘క్యారీ ఆన్’ వర్త్ టు వాచ్. సో యూ ఆల్సో క్యారీ ఆన్ ఫర్ క్యారీ ఆన్. – ఇంటూరు హరికృష్ణ -
హంటర్ వస్తున్నాడు
హాలీవుడ్ నటుడు ఆరోన్ టేలర్ జాన్సన్ హీరోగా నటించిన తాజా చిత్రం ‘క్రావెన్: ది హంటర్’. అరియానా డిబోస్, ఫ్రెడ్ హెచింగర్, అలెశాండ్రో నివోలా, క్రిస్టోఫర్ అబాట్, రస్సెల్ క్రోవ్ ఇతర లీడ్ రోల్స్‌లో నటించిన ఈ చిత్రం ఈ నెల 13న అమెరికాలో విడుదలైంది. అవి అరద్ , మాట్ టోల్మాచ్, డేవిడ్ హౌస్హోల్టర్ నిర్మించిన ఈ చిత్రాన్ని సోనీ పిక్చర్స్ రిలీజ్ చేసింది. అలాగే ‘క్రావెన్: ది హంటర్’ సినిమాను 2025 జనవరి 1న ఇండియాలో ఇంగ్లిష్, హిందీ, తమిళ, తెలుగు భాషల్లో రిలీజ్ చేసేందుకు సోనీ పిక్చర్స్ సంస్థ సన్నాహాలు చేస్తోందని తెలుస్తోంది. కాగా క్రావెన్ రోల్‌కి తాను ప్రిపేర్ అయిన విధానం గురించి టేలర్ జాన్సన్ మాట్లాడుతూ – ‘‘మార్వెల్ కామిక్ బుక్స్‌లో కనిపించే క్రావెన్ క్యారెక్టర్‌నే ఆడియన్స్ అందరూ స్క్రీన్‌పై కూడా చూడాలనుకుంటున్నారు.సో... ఈ క్యారెక్టర్ కాస్ట్యూమ్స్‌కి తగ్గట్లుగా నా గెటప్‌ను రెడీ చేసుకోవాలనుకున్నాను. ఇందుకు బాడీ ట్రాన్స్‌ఫార్మ్ చేయాలని డిసైడ్ అయ్యాను. కానీ ఇదేమీ అంత సులభమైన పని కాదు. కానీ మేం ఆరు నెలలో చేశాం’’ అని తెలిపారు. ‘‘చాలా చాలెంజ్‌లను ఫేస్ చేశాం. మొబైల్ జిమ్‌ను ఉపయోగించేవాళ్లం. ఎక్కువ ట్రైనింగ్ వల్ల మజిల్ డ్యామేజ్ అవుతుందని, కొన్ని ప్రత్యేకమైన వర్కౌట్స్ మాత్రమే చేశాం’’ అని తెలిపారు ఫిజికల్ ట్రైనర్ కింగ్స్ బరీ.ఇక ఈ చిత్రకథ విషయానికి వస్తే... క్రావినోఫ్ (రస్సెల్ క్రోవ్) ఒక క్రూరమైన గ్యాంగ్‌స్టర్. కొన్ని పరిణామాల వల్ల క్రావెన్ కూడా కొన్ని క్రూరమైన పరిణామాలతో ప్రతీకారం తీర్చుకోవాలనుకుంటాడు. ఈ క్రమంలో అతను ప్రపంచంలోనే గొప్ప హంటర్‌గా మారడమే కాకుండా అందరూ భయపడే వ్యక్తిగా ఎలా మారాడు? అన్నదే కథ. -
Mufasa Review: ముఫాసా మూవీ రివ్యూ
మనం చూసే ప్రతి సినిమాలో నిజ జీవిత పాత్రలు మనలోనివారు కొంతమంది తెర మీద పోషించి మనల్ని మెప్పించడం సహజమే. కాని మనలోని భావావేశాలను జంతువులచే డిజిటల్ రూపంలో పలికించి మన మనస్సులను కదిలించడమంటే సామాన్యమైన విషయం కాదు. ఈ విషయంలో హాలీవుడ్‌ను నిజంగా అభినందించాలి. కానీ హాలీవుడ్ కన్నా మన టాలీవుడ్ 40 ఏళ్ళ క్రితమే అంటే డిజిటల్ సాంకేతికత మనకు పరిచయమవ్వని రోజుల్లోనే ఇటువంటి కోవలో మనకు ఓ సినిమా పరిచయం చేసింది. దాని పేరే మాకూ స్వాతంత్రం కావాలి. ఇక్కడ టాలీవుడ్, హాలీవుడ్ చేసిందా అన్నది కాదు, మనుషులకు జంతువులతో కూడా భావావేశాలు పలికించవచ్చన్నదే విషయం. ముఫాసా సినిమా 2019వ సంవత్సరంలో 'ది లయన్ కింగ్' సినిమా సిరీస్‌లో వచ్చిన రెండవ భాగం. ముఫాసా ప్రపంచ వ్యాప్తంగా దాదాపు అన్ని దేశాలలో ప్రతి భాషలో విడుదలైంది. ముఫాసా సినిమాకి అన్ని భాషల్లో పేరున్న గొప్ప నటీనటులు డబ్బింగ్ చెప్పడం మరో విశేషం. తెలుగులో ప్రముఖ నటులు మహేశ్‌బాబు, బ్రహ్మానందం, అలీ తదితరులు వాయిస్ ఇచ్చారు. కాబట్టి సినిమా చూస్తున్నంతసేపు మన నేటివిటీ ఎక్కడా తగ్గదు ఒక్క పేర్లలో తప్ప.ఈ సినిమాకి దర్శకుడు బారీ జెర్కిన్స్. కథాపరంగా లయన్ కింగ్‌కు కొనసాగింపైన ఈ ముఫాసాలో సింబా - నాలా సింహాలకు కియారా అనే ఆడ సింహం పుడుతుంది. ఆ తర్వాత సింబ- నాలా జంట టిమన్, పంబ దగ్గర కియారాను వదిలేసి ఇంకో బిడ్డకు జన్మనివ్వడానికి సెరేన్ ఒయాసిస్కు బయలుదేరతాయి. అప్పుడు రఫీకి అనే కోతి కియారాకు తాను సింబ వయస్సులో ఉన్నపుడు జరిగిన ముఫాసా కథ గురించి చెప్తుంది. ప్రముఖ డబ్బింగ్ ఆర్టిస్ట్ ఆర్ సి యం రాజు ఈ కోతికి గాత్రదానం చేశారు. కథంతా ఈ రఫీకీయే చెప్తాడు. ముఫాసా అనే పిల్ల సింహం ఓ తుఫానులో చిక్కుకుని తన తల్లిదండ్రుల నుంచి విడిపోతుంది. అలా నీళ్లలో ముఫాసా కొట్టుకుపోతూ టాకా అనే మరో సింహం పిల్లను కలుస్తుంది. టాకా తల్లిదండ్రులు ఒబాసీ, ఇషా. వీళ్ళిద్దరూ వారి ప్రాంతంలో రాజు, రాణి. టాకాని యువరాజును చేయాలనుకుంటారు. ఇంతలో తెల్ల సింహాల గుంపు వీరి రాజ్యం మీద దాడి చేస్తుంది. వాటి నుండి ముఫాసా, టాకా తప్పించుకుంటారు. ముఫాసా తన తల్లిదండ్రులను వెతుక్కుంటూ మిలేలే అనే ప్రాంతానికి వెళ్లాలనుకుంటాడు. తరువాత సినిమా అంతా ముఫాసా తన తల్లిదండ్రులను చేరుకుంటాడా లేదా అన్నదే. పైన చెప్పుకున్నట్టు ఈ సినిమా స్క్రీన్ ప్లే పిల్లలకు చాలా బాగా నచ్చుతుంది. అలానే పెద్దల మనసును సైతం కదిలిస్తుంది. ఎక్కడా గ్రాఫిక్స్ అన్నదే తెలియకుండా నిజజీవితంలో జంతువుల కథను దగ్గరగా చూసినట్టుంది. వర్త్‌ఫుల్ మూవీ ఫర్ ఫ్యామిలీ.- హరికృష్ణ ఇంటూరు -
జనవరి 1న థియేటర్లలో 'క్రావెన్: ది హంటర్' రిలీజ్
హాలీవుడ్ నుంచి వస్తున్న మరో యాక్షన్ డ్రామా 'క్రావెన్: ది హంటర్'. మరో రెండు వారాల్లో థియేటర్లలో విడుదల కానుంది. సోనీ సంస్థ నుంచి రానున్న సూపర్ హీరో సినిమాల్లో ఇదొకటి. ఈ సినిమాకు ఆర్ రేటింగ్ వచ్చిన నేపథ్యంలో డైరెక్టర్ చందూర్ మీడియాతో మాట్లాడారు.(ఇదీ చదవండి: సంధ్య థియేటర్‌కి పోలీసులు షోకాజ్ నోటీసు)'కోపం, ఆవేశంతో సెర్గీ.. ఇద్దరు పిల్లలని టీనేజ్‌లో చంపేస్తాడు. ఆ తర్వాత అతను సులభంగా తప్పించుకునే అవకాశం ఉన్నప్పటికీ అలా చేయడు. అందుకు కూడా ఓ జస్టిఫికేషన్ ఉంది. చనిపోయిన ఇద్దరూ చెడ్డ వ్యక్తులని అతను భావించడంతో, ఆపుకోలేనటువంటి కోపావేశంతో అతను ఈ భూమి మీద నుంచి ఇద్దరిని చంపేశా అని భావించాడు. ఆ కోపమే ఈ కథకి ఆయువుపట్టు' అని దర్శకుడు చెప్పాడు.ఈ సినిమాలో అరియానా డీ బోస్, ఫ్రెడ్ హెచ్చింగర్, అలెసాండ్రో నీవోలా, క్రిస్టోఫర్ అబ్బాట్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. జనవరి 1న ఇంగ్లీష్, హిందీ, తమిళ, తెలుగు భాషల్లో విడుదల కానుంది.(ఇదీ చదవండి: జైలు నుంచి రిలీజ్.. వెంటనే దర్శన్‌పై ప్రేమ బయటపెట్టిన పవిత్ర గౌడ) -
వింటేజ్ హాలీవుడ్ స్టైల్లో రజినీకాంత్.. వీడియో వైరల్
సూపర్‌స్టార్ రజినీకాంత్.. గురువారం 75వ వసంతంలోకి అడుగుపెట్టారు. ఈ క్రమంలోనే దేశవ్యాప్తంగా టాప్ సెలబ్రిటీలు చాలామంది పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పారు. అయితే కొందరు మాత్రం టెక్నాలజీ ఉపయోగించి తలైవాని సరికొత్తగా చూపించారు. ఇప్పుడు అలాంటి వీడియో ఒకటి వైరల్ అవుతోంది.(ఇదీ చదవండి: సినీ హీరో అల్లు అర్జున్ అరెస్ట్)ఇప్పుడంతా ఏఐ టెక్నాలజీ ట్రెండ్ నడుస్తోంది. సాధ్యం కాని వాటిని కూడా ఈ సాంకేతికత ఉపయోగించి సృష్టిస్తున్నారు. ఇలానే ఇప్పుడు రజినీకాంత్‌ని కూడా హాలీవుడ్ క్లాసిక్ సినిమాలు-వెబ్ సిరీసులైన 'పీకీ బ్లండర్స్', 'రాకీ', 'టాప్ గన్', 'గ్లాడియేటర్', 'గాడ్ ఫాదర్', 'స్టార్ వార్స్', 'గేమ్ ఆఫ్ థ్రోన్స్', 'టైటానిక్', 'మ్యాట్రిక్స్' సినిమాల హీరోల గెటప్స్‌లో రజినీ కనిపించడం ఇంట్రెస్టింగ్గా ఉంది.(ఇదీ చదవండి: మీడియాపై దాడికి క్షమాపణ చెప్పిన మోహన్ బాబు)Mass😍😍😍😍#Thalaivar #ThalaivarBirthday #Superstar #SuperstarRajinikanth #ThalaivarForLife pic.twitter.com/I6lbDKjLqw— Dr.Ravi (@imravee) December 12, 2024 -
ప్రియుడితో స్టార్ సింగర్ ఎంగేజ్మెంట్ : డైమండ్ రింగ్ స్పెషల్ ఎట్రాక్షన్
అమెరికన్ స్టార్ సింగర్ సెలెనా గోమెజ్ తన అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పింది. త్వరలో పెళ్లి కూతురు కాబోతోంది ఈ హాలీవుడ్ బ్యూటీ. ప్రియుడు బెన్నీ బ్లాంకోతో ఎంగేజ్మెంట్ ఫోటోలను ఇన్‌స్టాలో షేర్ చేసింది. ఫరెవర్ బిగిన్స్ నౌ అంటూ షేర్ చేసిన సెలెనా గోమెజ్ ఎంగేజ్మెంట్ ఫొటోలు వైరల్ అవుతున్నాయి. మరీ ముఖ్యంగా ఆమె చేతి డైమండ్ రింగ్ స్పెషల్ ఎట్రాక్షన్‌గా నిలుస్తోంది.సెలెనా గోమెజ్, బెన్నీ బ్లాంకో రిలేషన్ ఎప్పటినుంచో వార్తల్లో ఉన్నప్పటికీ తాజాగా నిశ్చితార్థం చేసుకున్నట్లు ఇద్దరూ అధికారికంగా ప్రకటించారు. చిరకాల ప్రయాణం షురూ(ఫరెవర్ బిగిన్స్ నౌ) గురువారం (డిసెంబర్ 12) ఎంగేజ్మెంట్ ఫోటోలను పోస్ట్ చేసింది ‘సింగిల్ సూన్’ సింగర్ . దీనికి స్పందించిన ఆమె కాబోయే భర్త బెన్నీ బ్లాంకో ఈ పోస్ట్‌పై ‘హే వెయిట్... ఆమె నా భార్య’ అంటూ వ్యాఖ్యానించాడు. దీంతో ఈ లవ్‌బర్డ్స్‌కు శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. అద్భుతమైన మార్క్విస్ సాలిటైర్ డైమండ్ రింగ్‌తో సెలెనా గోమెజ్ షేర్ చేసిన ఫొటోలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. View this post on Instagram A post shared by Selena Gomez (@selenagomez) బెన్నీ బ్లాంకో ఎవరు?బెన్నీ బ్లాంకో ప్రసిద్ధ హాలీవుడ్ నిర్మాత , రచయిత. ప్రధానంగా బీటీఎస్ , స్నూప్ డాగ్, హెల్సే, ఖలీద్, ఎడ్ షీరాన్, జస్టిన్ బీబర్, ది వీకెండ్, అరియానా గ్రాండే, బ్రిట్నీ స్పియర్స్ , సెలీనా గోమెజ్ వంటి కళాకారులతో కలిసి పనిచేశాడు. బెన్నీ సెలీనా ట్రాక్ ఐ కాంట్ గెట్ ఎనఫ్‌ను కూడా నిర్మించారు. సెలెనా గోమెజ్ బెన్నీ బ్లాంకో 2023 డిసెంబర్లో తమ సంబంధాన్ని ధృవీకరించారు. -
ఎంజాయ్ చేయడానికి వెళ్లి ప్రాణాలు పోగొట్టుకున్న నటి
చావు అనేది ఎప్పుడు ఎలా ఎందుకు వస్తుందో చెప్పడం కష్టం, ఊహించడం అంతకంటే అసాధ్యం. ఓ నటి కూడా సరదాగా ఎంజాయ్ చేద్దామని తనకు బాగా అచొచ్చిన ఓ టూరిస్ట్ ప్లేసుకి వెళ్లింది. కానీ విధిని మార్చలేక ప్రాణాలు కోల్పోయింది. ప్రస్తుతం ఈ విషయం, ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.(ఇదీ చదవండి: కవలలకి జన్మనిచ్చిన టాలీవుడ్ హీరోయిన్)రష్యన్ నటి కమిల్లా బెల్యట్సకయా.. రీసెంట్గా థాయ్‌లాండ్‌లోని కోహ్ సముయి అనే టూరిస్ట్ ప్రాంతానికి ప్రియుడితో కలిసి వెళ్లింది. ఎప్పటికప్పుడు ఇక్కడికి వెళ్లడం ఈమెకు అలవాటు. కాకపోతే ఈసారి అలా యోగా చేస్తుండగా.. భారీ రాకాసి అలలు వచ్చాయి. అవి ఈమెని సముద్రంలోకి లాక్కుపోయాయి. 15 నిమిషాల్లో రెస్క్యూ టీమ్ వచ్చినప్పటికీ వాతావరణ పరిస్థితుల వల్ల ఫలితం లేకుండా పోయింది. చాలా కిలోమీటర్ల దూరంలో నటి మృతదేహం లభ్యమైంది.గతంలో ఇదే ప్రాంతాన్ని తన ఇల్లు, భూమ్మీదే బెస్ట్ ప్లేస్ అని సదరు నటి కమిల్లా చెప్పుకొచ్చింది. ఇప్పుడే అదే చోటులో ప్రాణాలు విడిచింది. ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది.(ఇదీ చదవండి: 'పుష్ప 3'.. అసలు ఉన్నట్టా? లేనట్టా?) View this post on Instagram A post shared by Daily Mail (@dailymail) -
ముఫాసా: ది లయన్ కింగ్.. మహేశ్ బాబు స్పెషల్ పోస్టర్ రిలీజ్
చిన్నా, పెద్దా అనే తేడా అందరినీ అలరించిన చిత్రం లయన్ కింగ్. ఈ చిత్రంలో రాజ్యాన్ని పాలించే ముఫాసా, అతని తమ్ముడు స్కార్ పాత్రలు ఎప్పటికీ గుర్తుండిపోతాయి. అడవికి రాజుగా ముఫాసా తన రాజ్యాన్ని కాపాడుతూ ఉంటారు. అతనికి సింబా అనే కుమారుడు జన్మిస్తాడు. ఈ సిరీస్‌లో ఇప్పటికే లయన్ కింగ్-2 కూడా వచ్చింది. తాజాగా లయన్ ప్రీక్వెల్తో మరోసారి ప్రేక్షకుల ముందుకొస్తున్నారు మేకర్స్.అయితే ముఫాసా ది లయన్ కింగ్ పేరుతో ప్రీక్వెల్ ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రంలో ముఫాసా క్యారెక్టర్‌కు ప్రిన్స్ మహేశ్ బాబు వాయిస్ అందిస్తున్నారు. ఈ సందర్భంగా స్పెషల్ పోస్టర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. మహేశ్ బాబు వెనకాల ముఫాసా ఉన్న ఫోటోలను నిర్మాణ సంస్థ వాల్ట్ డిస్నీ స్డూడియోస్ ఆఫ్ ఇండియా ట్విటర్లో పోస్ట్ చేసింది. ఇప్పటికే ట్రైలర్ రిలీజ్ కాగా.. అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది.కాగా.. అకాడమీ అవార్డ్ విజేత, దర్శకుడు బారీ జెంకిన్స్ లయన్ కింగ్ ప్రీక్వెల్‌ను తెరకెక్కించనున్నారు. ముఫాసా ఎదగడానికి చేసిన ప్రయాణాన్ని ఈ చిత్రంలో చూపించనున్నారు. ఈ చిత్రంలో రఫీకిగా జాన్ కనీ, పుంబాగా సేథ్ రోజెన్, టిమోన్‌గా బిల్లీ ఐచ్నర్, సింబాగా డోనాల్డ్ గ్లోవర్, నాలాగా బియాన్స్ నోలెస్-కార్టర్ కనిపించనున్నారు. ఈ చిత్రం డిసెంబర్ 20న థియేటర్లలోకి రానుంది. 1994లో వచ్చిన ది లయన్ కింగ్ యానిమేటెడ్ క్లాసిక్ ఆధారంగా రూపొందిస్తున్నారు. 2019లో జోన్ ఫావ్రూ దర్శకత్వంలో ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు.When @urstrulyMahesh s̶p̶e̶a̶k̶s̶ ROARS, the pride listens! 🦁🔥Presenting special poster for Mufasa: The Lion King, featuring superstar Mahesh Babu!Watch the film in cinemas on 20th December! pic.twitter.com/LDU6IyXObX— Walt Disney Studios India (@DisneyStudiosIN) December 1, 2024 -
ఆరేళ్లకే యూట్యూబ్ సంచలనం.. 16 ఏళ్లకే రూ.50 కోట్ల సంపద.. ప్రపంచంలోనే సంపన్నుడిగా!
ఈ రోజుల్లో మిలియనీర్ కావాలంటే మాటలు కాదు. బిజినెస్‌లో రాణించేవారికే ఆ ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. కోట్ల సంపాదన కూడబెట్టాలన్న వ్యాపారంలో రాణిస్తేనే సాధ్యమవుతుంది. కానీ 16 కోటీశ్వరుడైతే ఎలా ఉంటుంది. ఆ ఆనందం మాటల్లో చెప్పలేనిది. అలా చిన్న వయసులోనే కోట్లు సంపాదించిన బాలనటుడు ఒకరు ఉన్నారు. అతని పేరే ఇయాన్ ఆర్మిటేజ్. ఇంతకీ అతను ఎలా సంపాదించాడో తెలుసుకుందాం.ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడైన బాలనటుడిగా ఇయాన్ ఆర్మిటేజ్ నిలిచారు. ఆరేళ్లకే తన యూట్యూబ్ వీడియో సిరీస్ ఇయాన్ లవ్స్ థియేటర్ ద్వారా యూట్యూబ్ స్టార్‌గా సంచలనం సృష్టించాడు. ఆ తర్వాత తొమ్మిదేళ్లకే ప్రైమ్‌టైమ్ టీవీ షోలో లీడ్ రోల్లో కనిపించాడు. 2008లో జార్జియాలో జన్మించిన ఇయాన్ ఆర్మిటేజ్ 2017లో నటనలో ఎంట్రీ ఇచ్చాడు. ది గ్లాస్ కాజిల్, అవర్ సోల్స్ ఎట్ నైట్, ఐయామ్ నాట్ హియర్ లాంటి చిత్రాలతో పాటు లా అండ్ ఆర్డర్: స్పెషల్ విక్టిమ్స్ యూనిట్, బిగ్ లిటిల్ లైస్ లాంటి టీవీ షోల్లో మెరిశాడు.అయితే యంగ్ షెల్డన్ అనే సిట్కామ్తోనే ఇయాన్ ఆర్మిటేజ్ మరింత ఫేమస్ అయ్యాడు. తొమ్మిదేళ్లకే లీడ్ రోల్ పోషించిన బాలనటుడిగా నిలిచాడు. దాదాపు ఏడేళ్ల పాటు ఈ సిట్‌కామ్‌లో కనిపించాడు. ఈ సిరీస్ ఏడు సీజన్ల తర్వాత ఈ ఏడాది ప్రారంభంలో ముగిసింది.16 ఏళ్లకే రూ.50 కోట్ల సంపద..యంగ్ షెల్డన్లో పాత్రకు గానూ ఇయాన్ ఒక ఎపిసోడ్‌కు 30 వేల డాలర్లు పారితోషికం అందుకున్నాడు. సీజన్ -1 కోసం ఏకంగా రూ.4.6 కోట్లు సంపాదించాడు. ఈ సిట్కామ్ సీజన్ -5 నాటికి ఒక్కో సీజన్‌కు దాదాపు రూ.8 కోట్లు పారితోషికం తీసుకున్నాడు. దీంతో 13 ఏళ్లకే ప్రపంచంలో మిలినీయర్లలో ఒకరుగా నిలిచాడు. అతని నికర ఆస్తుల విలువ దాదాపు రూ.50 కోట్లుగా ఉన్నట్లు తెలుస్తోంది. 2024 నాటికి ప్రపంచంలోనే అత్యంత సంపన్న బాల నటుడి రికార్డ్ సృష్టించాడు.యూట్యూబ్ నుంచి మొదలైన ఇయాన్ ఆర్మిటేజ్ ఏకంగా టీవీ స్టార్‌గా ఎదిగారు. యంగ్ షెల్డన్ సిరీస్‌తో స్టార్డమ్ తెచ్చుకున్న ఇయాన్ మరో రెండు చిత్రాలలో నటించాడు. స్కూబ్, పా పెట్రోల్: ది మూవీస్‌లో కనిపించాడు. -
OTT Review: నిశ్శబ్దం ఎంత భయంకరంగా ఉంటుందో తెలుసా?
ఓటీటీలో ‘ఇది చూడొచ్చు’ అనే ప్రాజెక్ట్స్ చాలా ఉంటాయి. ప్రస్తుతం స్ట్రీమ్ అవుతున్న వాటిలో హాలీవుడ్ చిత్రం ‘ఎ క్వైట్ ప్లేస్ డే వన్’ ఒకటి. ఈ చిత్రం గురించి...ప్రతి మనిషికీ ఆలోచనలుంటాయి. కానీ కొంతమందికి ప్రత్యేక ఆలోచనలొస్తాయి. మరీ ముఖ్యంగా హాలీవుడ్ దర్శకులకు విపరీత ధోరణితో ఆలోచనలొస్తాయి. అవి వాళ్లు సినిమాల రూపంలో ప్రేక్షకుల ముందుంచుతారు. ఆ నేపథ్యంలో వచ్చిన సినిమానే ‘ఎ క్వైట్ ప్లేస్ డే వన్’. ఈ సినిమా సిరీస్‌లో మూడవది. ఈ సిరీస్‌లో వచ్చిన మూడు సినిమాలూ సూపర్ డూపర్ హిట్. ఇప్పుడు వచ్చిన ‘ఎ క్వైట్ ప్లేస్ డే వన్’ నెల రోజుల క్రితమే ప్రైమ్ వీడియో ఓటీటీ వేదికగా పెయిడ్ ఫార్మెట్లో విడుదలవగా... ఈ వారమది అందరికీ అందుబాటులోకి వచ్చింది. దాదాపు ముప్పైఏడేళ్ల క్రితం ప్రముఖ దర్శకులు సింగీతం శ్రీనివాసరావు ‘పుష్పక విమానం’ అనే ప్రత్యేకమైన సినిమా తీశారు. ఒక్క డైలాగ్ లేకుండా చక్కటి కామెడీతో చూడముచ్చటగా ఉంటుందా చిత్రం. దాదాపు అలాంటి కోవకే చెందిన ఇంగ్లిష్ చిత్రం ‘ఎ క్వైట్ ప్లేస్ డే వన్’ చూసేవాళ్లకు చెమటలు పట్టించడం ఖాయం. మాటలు తక్కువున్నా ప్రేక్షకులకు దడ పుట్టిస్తుంది. జాన్ క్రసింస్కీ ఈ సిరీస్‌లో వచ్చిన చిత్రాలన్నిటికీ రచయిత. మొదటి రెండు చిత్రాలకు తాను దర్శకత్వం వహించగా తాజా చిత్రానికి మైఖేల్ సర్నోస్కీ దర్శకత్వం వహించారు.ఈ సినిమా కథ ప్రకారం... న్యూయార్క్‌లో హాస్ స్పైస్ అనే ఫెసిలిటీలో క్యాన్సర్ పేషంట్‌గా ఉన్న సామ్ తన కుక్క పిల్లతో వాలంటీర్ రూబెన్‌తో కలిసి ఓ ప్లే చూడడానికి సిటీలోకి వెళ్తుంది. సామ్‌కి సంగీతం అంటే ఇష్టం. ఎప్పుడూ ఏదో ఒకటి వింటుంటుంది. అప్పుడే మాన్హాట్టన్ నగరంపై ఏలియన్స్ దాడి జరుగుతుంది. ఈ ఏలియన్స్ ఎక్కడైనా శబ్దం వస్తే చాలు కనిపించిన మనుషులపై దాడి చేస్తూ ఉంటాయి.నగరమంతా వాటి దాడి వల్ల క్షణాల్లో నిర్మాణుష్యమై΄ోతుంది. అక్కడక్కడా శబ్దం చేయకుండా బ్రతికున్నవాళ్లు ఏలియన్స్ నుండి తప్పించుకుంటూ ఉంటారు. అసలే క్యాన్సర్ బారిన పడిన సామ్ ఈ ఏలియన్స్ దాడిని ఎలా ఎదుర్కొందనేది మిగతా కథ. పైన చెప్పుకున్నట్టు ఈ నిశ్శబ్దం ఎంత భయంకరంగా ఉంటుందో ఈ సినిమా చూశాక తెలుస్తుంది. ఇంకెందుకు ఆలస్యం... ఈ వీకెండ్ చూసెయ్యండి. – ఇంటూరు హరికృష్ణ -
విషాదం.. ఆ స్వీట్ వాయిస్ ఇక వినిపించదు!
పెద్దలకు సినిమాలంటే ఎంత ఇష్టమో.. పిల్లలకు కార్టూన్ చిత్రాలంటే ఇష్టం. అలా చిన్నపిల్లలు ఇష్టపడేవాటిలో డోరమాన్, నింజా హటోరి పాత్రలు ప్రధానంగా వినిపిస్తాయి. ఆ క్యారెక్టర్స్‌కు చిన్నపిల్లల్లో ప్రత్యేకమైన క్రేజ్ ఉంది. ఈ పాత్రలకు కిడ్స్ అంతలా కనెక్ట్ అయ్యారు. ఈ కార్టూన్ సిరీస్‌లకు యానిమేషన్ ఇండస్ట్రీలో మంచి క్రేజ్ ఉంది.ఇంత క్రేజ్ ఉన్న నింజా హట్టోరి, డోరేమాన్ల పాత్రలకు వాయిస్ అందించిన యానిమేషన్ లెజెండ్ జుంకో హోరీ మరణించారు. జపాన్‌కు చెందిన ఆమె నవంబర్ 18న మరణించినట్లు ఆమె టాలెంట్ ఏజెన్సీ ప్రొడక్షన్ బావోబాబ్ ఈ వారంలో ప్రకటించింది. వృద్ధాప్య సమస్యలతోనే జుంకో హోరీ మరణించినట్లు వెల్లడించింది. ఈ విషయాన్ని నవంబర్ 25న తెలిపారు. ఈ విషాద సమయంలో ఆమె కుటుంబ సభ్యుల కోరిక మేరకే ఆలస్యంగా ప్రకటన విడుదల చేశామని పేర్కొన్నారు. దయచేసి అభిమానులు ఆమె ఇంటిని సందర్శించడం మానుకోవాలని ప్రకటనలో వెల్లడించారు. -
హకునా.. మటాటా... మరో నెలరోజులే అంటోన్న మహేశ్ బాబు!
ది లయన్ కింగ్ పేరు వినగానే అందరికీ గుర్తుకొచ్చే పేరు ముఫాసా. చిన్నపిల్లలే కాదు.. పెద్దలు కూడా ఈ లయన్ కింగ్ సినిమాకు మంచి క్రేజ్ ఉంది. హాలీవుడ్లో తెరకెక్కించిన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకుంది. ప్రస్తుతం ఈ మూవీ డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో అందుబాటులో ఉంది. అయితే సూపర్ హిట్ అయిన చిత్రానికి ప్రీక్వెల్‌ను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు మేకర్స్. ముఫాసా: ది లయన్ కింగ్ పేరుతో ఈ మూవీని తెరకెక్కించారు. ఈ మూవీ తెలుగు ప్రేక్షకులకు మరింత స్పెషల్ కానుంది. ఎందుకంటే సూపర్ స్టార్ మహేశ్ బాబు ముఫాసా పాత్రకు తన వాయిస్ అందించారు. దీంతో ఈ చిత్రంపై ఆడియన్స్‌లో మరింత క్యూరియాసిటీ పెరిగింది. తాజాగా ఈ మూవీ తెలుగు ఫైనల్ ట్రైలర్‌ను మేకర్స్ విడుదల చేశారు.ఈ మూవీలో ఆరోన్ స్టోన్, కెల్విన్ హ్యారిసన్ జూనియర్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ మూవీకి బేరీ జెంకిన్స్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే ట్రైలర్ రిలీజ్ కాగా.. క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 20న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ సందర్భంగా ప్రిన్స్ మహేశ్ బాబు ట్వీట్ చేశారు. మరో నెల రోజుల్లో హకునా.. మటాటా..ముఫాసా అంటూ టిమోన్, పుంబా డైలాగ్‌ను షేర్ చేశారు. ప్రస్తుతం మహేశ్ చేసిన నెట్టింట వైరల్‌గా మారింది. ఈ చిత్రాన్ని వాల్ట్ డిస్నీ స్టూడియోస్ నిర్మించింది. Hakuna ̶M̶a̶t̶a̶t̶a̶ ̶ Mufasa it is!🦁 The new roar. 🎵1 Month from now, get ready to watch Mufasa: The Lion King in cinemas from 20th Dec.#MufasaTheLionKing @DisneyStudiosIN pic.twitter.com/pjdeugoXec— Mahesh Babu (@urstrulyMahesh) November 20, 2024 -
మనుషులను తినే వైరస్.. ఓటీటీలో ఈ మూవీ చూశారా?
టైటిల్: అపోకాలిప్స్ జెడ్: ది బిగినింగ్ ఆఫ్ ది ఎండ్డైరెక్టర్: కార్లెస్ టోరెన్స్విడుదల తే:దీ 05 అక్టోబర్ 2024ఓటీటీ: అమెజాన్ ప్రైమ్నిడివి: 119 నిమిషాలుఇప్పుడంతా ఓటీటీల హవానే కొనసాగుతోంది. ప్రపంచవ్యాప్తంగా తెరెకెక్కించిన చిత్రాలు సైతం మన ఇంట్లోనే కూర్చుని చూసేస్తున్నాం. ఈ డిజిటల్ యుగంలో మనకు నచ్చిన సినిమాను వీలైన టైమ్‌లో చూసే అవకాశం ఉంది. కంటెంట్ భాషతో సంబంధం లేకుండా సినిమాలను చూసేస్తున్నారు. ఓటీటీలో అన్ని రకాల జోనర్స్ అందుబాటులో ఉన్నాయి. అయితే ఇటీవల విడుదలైన భయపెట్టే జాంబీ యాక్షన్ థ్రిల్లర్ అపోకలిప్స్ జెడ్ ది బిగినింగ్ ఆఫ్ ది ఎండ్. స్పానిష్‌లో తెరకెక్కించిన మూవీ ఎలా ఉందో రివ్యూలో చూద్దాం.స్పానిష్ ప్రజలు ఓ మహమ్మారి వైరస్ బారిన పడతారు. ప్రశాంతంగా ఉన్న ఆ దేశంలో ఒక్కసారిగా అలజడి మొదలవుతుంది. దీంతో ప్రజలంతా తమ ప్రాణాలు కాపాడుకోవడానికి ఇళ్లను, నగరాలను వదిలిపారిపోతారు. ఇంతకీ ఆ వైరస్ ఏంటి? అలా తప్పిపోయిన తన ఫ్యామిలీని కలుసుకోవడానికి ఓ వ్యక్తి చేసిన సాహసమే అసలు కథ.ఇలాంటి జాంబీ యాక్షన్ చిత్రాలు గతంలోనూ చాలా వచ్చాయి. కాకపోతే ఈ మూవీ కాస్తా డిఫరెంట్‌గా ఉంటుంది. ఎలాంటి హడావుడి లేకుండా కథనం సాగుతుంది. అంతుచిక్కని వైరస్ బారిన పడినవారు.. కనపడిన ప్రతి ఒక్కరిని తినేస్తుంటారు. దీంతో ప్రభుత్వం, పోలీసులు, ఆర్మీ సైతం ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించి హెచ్చరికలు జారీచేస్తుంది. అలా వాటిని పట్టించుకోకుండా బయటికెళ్లిన వ్యక్తి వారి నుంచి తప్పించుకోవడానికి చేసే పోరాట సన్నివేశాలు ఆకట్టుకుంటాయి. ఇందులో అతనితో పాటు పిల్లి కూడా ఉంటుంది. ఇందులో ఆ వ్యక్తి ప్రాణాలు దక్కించుకోవడానికి చేసే యాక్షన్ సీన్స్ అద్భుతంగా అనిపిస్తాయి. అయితే కథ నెమ్మదిగా సాగడం కాస్తా బోరింగ్‌గా అనిపిస్తుంది. కానీ కొన్ని చోట్ల ఆడియన్స్‌లో క్యూరియాసిటీ పెంచేలా ఉన్నాయి. హారర్, యాక్షన్ జోనర్ ఇష్టపడేవాళ్లు ఈ మూవీ ట్రై చేయొచ్చు. కాకపోతే కేవలం హిందీ, ఇంగ్లీష్‌లో మాత్రమే అందుబాటులో ఉంది. సబ్ టైటిల్స్‌తో చూసేయాల్సిందే. -
వాస్తవ ఘటనతో ఆఫ్టర్ మాత్
ఓటీటీలో ‘ఇది చూడొచ్చు’ అనే ప్రాజెక్ట్స్ చాలా ఉంటాయి. ప్రస్తుతం స్ట్రీమ్ అవుతున్న వాటిలో హాలీవుడ్ చిత్రం ‘ఆఫ్టర్ మాత్’ ఒకటి. ఈ చిత్రం గురించి తెలుసుకుందాం.ఈ ప్రపంచంలో తరచూ అనేక సంఘటనలు జరుగుతూనే ఉంటాయి. ఆ సంఘటనల్లో కొన్ని మాత్రం మనల్ని అనునిత్యం వెంటాడుతుంటాయి. ఆ సంఘటనకు, మనకు సంబంధం లేకపోయినా వాటి బాధితుల బాధను మనమూ అనుభవిస్తాం. కొంతమంది ఆ బాధను అలా భరిస్తూనే ఉంటారు, మరికొంతమంది ఇంకోలా వ్యక్తపరుస్తూ ఉంటారు. అలా 2004లో జరిగిన ఓ వాస్తవ ఘటనకు సినిమా రూపమిచ్చారు హాలీవుడ్ దర్శకుడు ఎలియట్ లెస్టర్. 2004లో ఓ రష్యా ఆర్కిటెక్ తన కుటుంబాన్ని ఘోర విమాన ప్రమాదంలో ΄పోగొట్టుకున్నాడు.దానికి ప్రతిగా ఎయిర్ లైన్ ట్రాఫిక్ సిబ్బందిని హత్య చేశాడు. ఈ ఘటన ఆధారంగా ‘ఆఫ్టర్ మాత్’ సినిమా తీశారు. ఈ సినిమా కథపరంగా రోమన్ ఓ కన్స్ట్రక్షన్ వర్కర్. ఫ్లైట్‌లో వస్తున్న తన కుటుంబాన్ని రిసీవ్ చేసుకోవడానికి ఎయిర్ ΄కోర్టుకి బయలుదేరడంతో ప్రారంభం అవుతుంది సినిమా. ఎయిర్ ΄కోర్టులో అడుగుపెట్టగానే తన భార్య, కూతురు విమాన ప్రమాదంలో మరణించారని రోమన్‌కి తెలుస్తుంది. దాంతో అతను కుంగిపోతాడు. అసలు ఈ విమాన ప్రమాదం ఎలా జరిగింది? అనే విషయం తెలుసుకునే క్రమంలో ఆ ప్రమాదం వెనక ఉన్నది ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్ జేక్ బనోస్ అనే విషయం రోమన్‌కి తెలుస్తుంది.ఎలాగైనా సరే రోమన్ జేక్ బనోస్ని కలవాలని ప్రయత్నిస్తాడు. జేక్‌ని కలిశాక రోమన్ ఏం చేశాడన్నదే ‘ఆఫ్టర్ మాత్’ సినిమా. ఈ సినిమా ఓ ఎమోషనల్ రోలర్ కోస్టర్. తన కుటుంబం మొత్తాన్ని ΄పోగొట్టుకుని దానికి కారణమైన వారి మీద పోరాటమన్నది అంత చిన్న విషయం కాదు. ఎన్నో భావావేశాలతో కూడుకున్న చిత్రం ఇది. ముఖ్యంగా రోమన్ ΄పాత్రలో ఓ విశిష్ట నటుడు మనకు కనిపిస్తాడు. దాదాపు రెండు తరాల నుండి హాలీవుడ్ యాక్షన్ రారాజుగా పిలవబడే ఆర్నాల్డ్ స్క్వాజ్‌నెగ్గర్ రోమన్ పాత్రను చేశారు. ఆర్నాల్డ్ ఆ పాత్రను చేశారనే కన్నా జీవించారని చెప్పవచ్చు. సినిమా మొత్తం కాస్త స్లోగా ఉన్నా సినిమా అయిపోయాక కొన్ని గంటలు మనం రోమన్ పాత్రతోనే ప్రయాణం చేస్తాం. ‘లయన్స్ గేట్’ ఓటీటీలో స్ట్రీమ్ అవుతున్న ఈ ఎమోష నల్ రోలర్ కోస్టర్‌ని చూసేయండి. – ఇంటూరు హరికృష్ణ -
ప్రభాస్ సలార్ 2 లో కొరియన్ సూపర్ స్టార్..
-
యశ్ ‘టాక్సిక్’ కోసం రంగంలోకి ‘అవతార్’ ఫైటర్స్
‘కేజీఎఫ్: చాప్టర్ 1, కేజీఎఫ్: చాప్టర్ 2’ వంటి బ్లాక్‌బస్టర్ ఫిల్మ్స్ తర్వాత కన్నడ స్టార్ హీరో యశ్ నటిస్తున్న తాజా చిత్రం ‘టాక్సిక్: ఏ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్ అప్స్’. మలయాళ నటుడు గీతూ మోహన్ దాస్ దర్శకత్వం వహిస్తున్నారు. కేవీఎన్ ప్రొడక్షన్స్ నిర్మిస్తోంది. ఈ చిత్రంలో యశ్ సోదరి పాత్రలో నయనతార, యశ్ ప్రేయసిగా కియారా అద్వానీ నటిస్తున్నారని టాక్. ఇప్పటికే ఈ సినిమా చిత్రీకరణ జరుగుతోంది. ఇటీవల నయనతార, యశ్‌లు పాల్గొనగా కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరించారు గీతూమోహన్ దాస్. కాగా ఈ సినిమా కొత్త షెడ్యూల్లో యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరించాలనుకుంటున్నారు. ఇందుకు హాలీవుడ్లో ‘జాన్ విక్: చాఫ్టర్2, ఎఫ్ 9, అవతార్: ద వే ఆఫ్ వాటర్’ వంటి భారీ బడ్జెట్ యాక్షన్ సినిమాలకు పని చేసిన జేజే ఫెర్రీ ‘టాక్సిక్’ సినిమాలోని యాక్షన్ సీక్వెన్స్‌ను డిజైన్ చేస్తున్నారు. ఇప్పటికే ఆయన ముంబైలో వాలిపోయారు. డ్రగ్స్ మాఫియా నేపథ్యంతో సాగే ఈ చిత్రాన్ని 2025 ఏప్రిల్ 10న రిలీజ్ చేయనున్నట్లు తొలుత మేకర్స్ ప్రకటించారు. అయితే ఆ తేదీకి సినిమా విడుదల కావడం లేదని, త్వరలోనే కొత్త రిలీజ్ డేట్‌ని ప్రకటిస్తామని యశ్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో స్పష్టం చేశారు. ప్రస్తుతం ‘టాక్సిక్’ తో ΄ాటుగా హిందీలో ‘రామాయణ’ అనే సినిమా చేస్తున్నారు యశ్. -
అక్కడ సౌండ్ చేస్తే చచ్చిపోతారు.. ఓటీటీలోనే క్రేజీ మూవీ
విచిత్రమైన సినిమాల లిస్ట్ తీస్తే దాదాపుగా ఇంగ్లీష్ సినిమాలే ఉంటాయి. ఎందుకంటే భయపెట్టలన్నా, కవ్వించాలన్నా, గ్రాఫిక్స్‌తో మాయ చేయాలన్నా సరే వాళ్ల తర్వాతే ఎవరైనా అని చెప్పొచ్చు. మరీ ముఖ్యంగా ప్రపంచం అంతమయ్యే పరిస్థితులు వస్తే భూమిపై ఏం జరగొచ్చే అనే కాన్సెప్ట్‌తో లెక్కలేనన్ని మూవీస్ వచ్చాయి. అలాంటి ఓ సినిమానే 'ద సైలెన్స్'. 2019లో రిలీజైన ఈ మూవీ ఏ ఓటీటీలో ఉంది? నిజంగా ఇది అంత బాగుందా అనేది చూద్దాం.(ఇదీ చదవండి: ఓటీటీలోనే ది బెస్ట్... సలార్, కేజీఎఫ్‌కి బాబు లాంటి సినిమా)కథేంటి?ఓ పరిశోధనా బృందం.. 800 అడుగుల లోతున్న ఓ గుహని పగలగొట్టినపుడు వింత శబ్దాలు వినిపిస్తాయి. అక్కడ నుంచి 'వెస్ప్స్' అని పిలిచే కొన్ని వింత జీవులు.. సదరు సైంటిస్ట్లని క్రూరంగా చంపి బయటి ప్రపంచంలోకి వస్తాయి. వీటికి శబ్దం వస్తే నచ్చదు. అలాంటిది బయట ప్రపంచంలో మనుషులు చేసే శబ్దాలకు అల్లకల్లోలం అయిపోతాయి. మనుషుల్ని పీక్కుతింటుంటాయి. మరోవైపు అల్లీ ఆండ్రూస్ అనే అమ్మాయి తల్లిదండ్రులతో కలిసి జీవిస్తుంటుంది. వెస్ప్ అనే జీవులు అందరినీ చంపేస్తున్నాయని వీళ్ల కుటుంబానికి తెలుస్తుంది. దీంతో సౌండ్ చేయకుండా ఎక్కడికైనా వెళ్లి తలదాచుకోవాలని అనుకుంటారు. మరి వింత జీవుల నుంచి వీళ్ల తప్పించుకున్నారా? లేదా అనేదే మిగతా స్టోరీ.ఎలా ఉందంటే?తీసింది కల్పిత కథే అయినప్పటికీ 'ద సైలెన్స్' చూస్తున్నంతసేపు మనకు వణుకు పుడుతుంది. ఒకవేళ మనకు కూడా ఇలాంటి పరిస్థితి ఎదురైతే ఏంటా అని భయమేస్తుంది. జస్ట్ గంటన్నర నిడివి ఉండే ఈ మూవీలో ఫ్యామిలీ ఎమోషన్స్‌ని చక్కగా చూపించారు. అలానే ఓ ప్రమాదకర పరిస్థితి వచ్చినప్పుడు కుటుంబం ఒకరికరు ఎలా అండగా నిలబడాలో చూపించారు. ప్రధాన పాత్రధారి ఫ్రెండ్ క్యారెక్టర్‌తో ఫ్రెండ్షిప్ విలువ కూడా చెప్పకనే చెప్పారు.(ఇదీ చదవండి: ఓటీటీలోనే బెస్ట్ జాంబీ మూవీ.. ప్యాంటు తడిచిపోవడం గ్యారంటీ!)ప్రస్తుతం మనలో చాలామంది పర్యావరణాన్ని దెబ్బతీస్తున్నాం. అడవుల్ని నరికేసి ఎన్నో జీవరాశులకు నిలువనీడ లేకుండా చేస్తున్నాయి. అవి ఏం చేయలేవు కాబట్టి సరిపోయింది. ఒకవేళ అవే గనకు వికృత రూపాల్ని సంతరించుకుని మనుషులపై తిరగబడితే ఏమవుతుంది అనే కాన్సెప్ట్‌తో తీసిన మూవీ ఇది. ఎక్కడో 800 అడుగుల లోతులో వాటి మానాన అవి ఉంటే, పరిశోధనల పేరుతో వాటిని ఇబ్బంది కలిగించడంతోనే వింత జీవులు భూమ్మీదకి వస్తాయి. మనిషికి కంటిపై కునుకు లేకుండా చేస్తాయి.ఇందులో ప్రధాన పాత్ర కుటుంబంపై ఎప్పటికప్పుడు వింత జీవులు ఎటాక్ చేస్తూనే ఉంటాయి. ప్రతిసారి వాటి నుంచి ఎలా తప్పించుకుని బయటపడ్డారనేది మీరు మూవీ చూసి తెలుసుకోవాల్సిందే. ప్రతి నిమిషం ఉత్కంఠభరితంగా సాగే విజువల్స్, కూర్చున్న చోటు నుంచి కదలనివ్వకుండా స్టోరీ ఉన్న 'ద సైలెన్స్' మూవీ.. ఈ వీకెండ్ మీకు బెస్ట్ ఆప్షన్ అవ్వొచ్చు. ఇంకెందుకు లేటు నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతున్న ఈ సినిమాపై ఓ లుక్కేసేయండి.- చందు డొంకాన -
'ఈ గేమ్ ఆడితే అందరం చస్తాం'.. భయపెట్టిస్తోన్న టీజర్!
ప్రస్తుతం సినీ ప్రియులు ఓటీటీలపైనే ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. అందుకు తగ్గట్టుగానే ఓటీటీ ఫ్లాట్‌ఫామ్స్ సైతం సరికొత్త కంటెంట్‌తో ప్రేక్షకులను అలరిస్తున్నాయి. ప్రముఖ ఓటీటీ సంస్థ మరో క్రేజీ వెబ్ సిరీస్‌తో సిద్ధమైంది. 2021లో విడుదలైన స్క్విడ్ గేమ్ వెబ్ సిరీస్‌కు ప్రపంచవ్యాప్తంగా విశేష ఆదరణ దక్కించుకుంది. కొరియన్లో తెరకెక్కించిన ఈ సిరీస్ ఇండియాలో క్రేజ్‌ను దక్కించుకుంది.ఈ వెబ్ సిరీస్ దక్కిన ఆదరణతో స్క్విడ్ గేమ్ సీజన్-2ను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. తాజాగా సీజన్-2 టీజర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. తెలుగులోనూ విడుదలైన ఈ టీజర్ మరింత ఆకట్టుకుంటోంది. గ్రీన్ లైట్, రెడ్ లైట్ వంటి గేమ్స్ ఈ సీజన్లో చూపించనున్నారు. టీజర్లో సన్నివేశాలు చూస్తుంటే హారర్ థ్రిల్లర్ లాంటి ఫీలింగ్ వస్తోంది. గేమ్‌లో పాల్గొన్న వారంతా ప్రాణాలతో బయటపడతారా లేదా అన్నది తెలియాలంటే రిలీజ్ వరకు వేచి చూడాల్సిందే. కాగా.. ఈ స్క్విడ్ గేమ్ సీజన్- 2 డిసెంబర్ 26 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుంది. -
ఓటీటీకి భారీ యాక్షన్ చిత్రం.. తెలుగులో ఉచితంగా స్ట్రీమింగ్!
హాలీవుడ్ యాక్షన్ చిత్రాలకు ఎక్కడైనా సరే ఫ్యాన్ క్రేజ్ ఓ రేంజ్లో ఉంటుంది. అలాంటి భారీ యాక్షన్ అడ్వెంచర్ సినిమానే ఇండియన్ ఫ్యాన్స్‌కు అందుబాటులోకి రానుంది. గత జూలై 26న బాక్సాఫీస్ వద్ద రిలీజైన డెడ్‌పూల్ అండ్ వాల్వరైన్ భారీగా వసూళ్లు రాబట్టింది. మార్వెల్ స్టూడియోస్ బ్యానర్లో తెరకెక్కించిన ఈ సినిమా ఆల్ టైమ్ అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచింది. ఇందులో ర్యాన్ రేనాల్డ్స్, హ్యూ జాక్మన్ కీలక పాత్రల్లో నటించారు. ఇప్పటికే ఈ మూవీ అమెజాన్ ప్రైమ్, యాపిల్ టీవీప్లస్, వుడు ఓటీటీల్లో స్ట్రీమింగ్ అవుతోంది.తాజాగా ఇండియన్ ఫ్యాన్స్ కోసం ఈ యాక్షన్ ప్యాక్డ్ మూవీ అందుబాటులోకి రానుంది. ఈ సినిమా నవంబర్ 12 నుంచి డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ కానుంది. ఈ మూవీ ఇండియాలో ఇంగ్లష్తో పాటు హిందీ, తమిళం, తెలుగులోనూ విడుదల కానుంది. ఈ విషయాన్ని ఓటీటీ సంస్థ తన వీడియోను షేర్ చేస్తూ వెల్లడించింది. ఈ సినిమాను ఉచితంగానే స్ట్రీమింగ్ చేయనున్నట్లు తెలిపింది. దీంతో హాలీవుడ్ యాక్షన్ సినిమాలు ఇష్టపడే ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కాగా.. ఈ చిత్రానికి షాన్ లెవీ దర్శకత్వం వహించారు. -
ఓటీటీలో 'ఈ కలయిక కాస్త ఘాటు గురూ'.. తెలుగులో స్ట్రీమింగ్
ఓటీటీలో ‘ఇది చూడొచ్చు’ అనే ప్రాజెక్ట్స్ చాలా ఉంటాయి. ప్రస్తుతం స్ట్రీమ్ అవుతున్న వాటిలో హాలీవుడ్ చిత్రం ‘ది యూనియన్’ ఒకటి. ఈ చిత్రం గురించి తెలుసుకుందాం. ఎక్కడైనా ప్రేమికులు చాలా ఏళ్ల తరువాత కలిస్తే, చాలా హాట్ హాట్‌గా ఉంటుంది. కానీ ఈ ‘ది యూనియన్’ సినిమాలో ΄పాత ప్రేమికులు కలిసిన తరువాత ఇంత ఘాటా అని చూసే ప్రేక్షకుడు నోరెళ్లబెట్టాల్సిందే. అంతలా ఏముందీ సినిమాలో ఓసారి విశ్లేషించుకుందాం. జూలియన్ ఫరియానో దర్శకత్వం వహించిన స్పై కామెడీ థ్రిల్లర్ సినిమా ‘ది యూనియన్’. నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలో తెలుగులోనూ ఈ సినిమాని చూడవచ్చు. హేమాహేమీలైన హాలీబెర్రీ, మార్క్ వాబర్గ్, మైక్ కాల్టర్ నటించిన ఈ సినిమా పెద్దలకు మాత్రమే. ఇక ఈ సినిమా కథాంశానికొస్తే... కథానాయకుడు మైక్ మెకన్నా న్యూజెర్సీ నగరంలో ఓ సాధారణ బిల్డింగ్ కార్మికుడు. రోజువారీ కష్టంతో తన పనేదో తాను చూసుకుపోయే మనస్తత్వం గలవాడు. కాకపోతే కాస్తంత అమ్మాయిల పట్ల పిచ్చి ఎక్కువ. హాయిగా సాగుతున్న మైక్ జీవితంలో అనుకోని ఓ అవాంతరం తన హైస్కూల్ క్రష్ అయిన రోక్సేన్ హాల్ ద్వారా ఎదురవుతుంది. 25 ఏళ్ల తరువాత కలిసిన తన ప్రేమను గుర్తు చేసుకుంటూ డాన్స్ చేస్తూ స్పృహ తప్పుతాడు మైక్. అలా న్యూజెర్సీలో స్పృహ తప్పిన మైక్ తిరిగి కళ్లు తెరిచేసరికి లండన్‌లో ఉంటాడు. మరోపక్క ఓ బ్రీఫ్‌కేస్ కోసం ఇరాన్ తీవ్రవాదులు, నార్త్ కొరియా ఏజెంట్లు, రష్యన్ గూఢచారులు తెగ వెతికేస్తుంటారు. ఆ బ్రీఫ్‌కేస్‌లో చాలా సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. దాని కోసం యూనియన్ అనే సంస్థ తమ ప్రతినిధులను చాలా మందినే పొగొట్టుకుంటుంది. అసలు ఆ బ్రీఫ్‌కేస్‌కి, కథానాయకుడు మైక్‌కి సంబంధం ఏంటి? 25 ఏళ్ల తరువాత మైక్ ప్రియురాలు రోక్సేన్ హేల్ అతన్ని ఎందుకు కలిసింది? కలిసిన తరువాత అతను లండన్‌లో ఉండడం ఏంటి? అయినా ఓ ప్రేమికుల కలయికలో ఇంత ఘాటైన ట్విస్టులా? వీటి సమాధానాల కోసం ‘ది యూనియన్’ సినిమా చూడాల్సిందే. ఈ సినిమా ప్రేక్షకుడిని గిలిగింతలు పెట్టిస్తూ ఆద్యంతం థ్రిల్లింగ్ కలిగిస్తుందనడంలో సందేహం లేదు. వీకెండ్ మస్ట్ వాచ్ మూవీ ‘ది యూనియన్’.– ఇంటూరు హరికృష్ణ -
షాషాంక్ రెడింప్షన్ సినిమా రివ్యూ
ఆశ.. చిన్నదో, పెద్దదో ప్రతి మనిషికీ ఉంటుంది. కష్టాల్లో ఉన్నవాడికి ఏదో ఒకరోజు అవి గట్టెక్కపోవన్న ఆశ.. సంతోషాల్లో ఉన్నవానికి ఎప్పటికైనా ఈ సంతోషం తనతోనే ఉండిపోవాలన్న ఆశ! ఈ ఆశే మనిషిని బతికిస్తుంది. చుట్టూ గాఢాంధాకారలు కమ్ముకున్నా వెలుగు వైపు నడిపిస్తుంది. అలాంటి సినిమానే ద శశాంక్ రెడింప్షన్.ఈ సినిమా ఇప్పటిది కాదు. 1994లో వచ్చింది. స్టీఫెన్ కింగ్ రాసిన రిటా హేవర్త్ అండ్ షాషాంక్ రిడంప్షన్ అనే నవల ఆధారంగా ఈ సినిమా తెరకెక్కించారు. చేయని తప్పుకు నిందిస్తేనే కయ్యిమని లేస్తాం. అలాంటిది చేయని నేరానికి రెండు జీవితకాలాల జైలుశిక్ష విధిస్తే..? ఈ సీన్‌తోనే కథ మొదలవుతుంది.బ్యాంకర్ ఆండీ (టిమ్ రాబిన్స్).. భార్య తనను వదిలేసి ప్రియుడే కావాలనుకోవడాన్ని తట్టుకోలేకపోతాడు. ఆమెను చంపడానికి పూటుగా తాగి గన్ లోడ్ చేసుకుని వెళ్తాడు. కానీ మనసొప్పక తిరిగొచ్చేస్తాడు. అయితే అక్కడ నిజంగానే హత్య జరుగుతుంది. హీరో భార్య, ప్రియుడు ఇద్దరూ చనిపోతాడు. అక్కడ దొరికిన ఆనవాళ్ల ఆధారంగా ఆండీని జైల్లో వేస్తారు. చంపాలనుకున్నమాట వాస్తవమే కానీ చంపలేదని చెప్తే ఎవరూ నమ్మరు. తాను నిర్దోషినని చెప్తే ఎగతాళి చేస్తారు. తన మాట ఎవరూ లెక్కచేయరని తెలసుకున్న అతడు నాలుగుగోడల మధ్య ఇమిడేందుకు అలవాటుపడతాడు. ఒంటరిని అన్న భావం దగ్గరకు రాకూడదని ఫ్రెండ్స్‌ను ఏర్పరుచుకుంటాడు. అయితే ఎప్పటికైనా బయటకు వెళ్లి ప్రశాంతమైన జీవితం గడపాలన్నది తన కోరిక. అది చూసి ఇతరులు నవ్వుకున్నా తను మాత్రం ఆశ చంపుకోలేదు. ఆ ఆశే అతడిని జైలు నుంచి పారిపోయేలా చేస్తుంది. అతడి స్నేహితుడు ఆత్మహత్య వైపు అడుగులు వేయకుండా స్వేచ్ఛా జీవితం కోసం తపించేలా చేస్తుంది. ఐఎమ్‌డీబీలో 9.3 రేటింగ్ ఉన్న ఈ మూవీ నెట్‌ఫ్లిక్స్‌లో అందుబాటులో ఉంది. జైల్లో ఉన్నవారిదే కాక అక్కడి నుంచి బయటకు వచ్చినవారి మానసిక స్థితి ఎలా ఉంటుందన్నది చక్కగా చూపించారు. ఏళ్లు గడుస్తున్నా వారి జీవనవిధానంలో ఎటువంటి మార్పు ఉండదు. ఈ సినిమా హత్య, హింస, తిరుగుబాటును చూపించలేదు.. కేవలం విముక్తి, ఆశ చుట్టూ మాత్రమే తిరిగింది. అలాగే నిజమైన స్నేహం ఎలా ఉంటుందనేది ఆకట్టుకునేలా ఆవిష్కరించారు. రెండు జీవితకాలాల జైలుశిక్ష పడ్డా కుంగిపోకుండా స్వేచ్ఛ కోసం హీరో పడే తపన చూస్తుంటే ముచ్చటేయక మానదు. సినిమా ముగిసినప్పుడు మనకూ జీవితం మీద కొత్త ఆశలు చిగురించిన భావన కలుగుతుంది. డైరెక్టర్ ఫ్రాంక్ డారాబాంట్ ఈ చిత్రాన్ని అద్భుత కళాఖండంగా మలిచాడు. ఈ మూవీని అందరికీ ఒక ఫిలాసఫీగా అందించాడు. -
IF Movie Review: ఇఫ్ మూవీ రివ్యూ.. మన ఊహే నిజమైతే!
ఈ ప్రపంచంలో మన తల్లిదండ్రుల తరువాత మనకు నియర్ అండ్ డియర్ ఎవరైనా ఉన్నారంటే వాళ్ళే మన ఫ్రెండ్స్. పిల్లల్లో కొంతమంది వాళ్ళ ఫ్రెండ్స్ గురించి అద్భుతంగా ఊహించుకుంటారు. ఇంకా చెప్పాలంటే వాళ్ళ దగ్గర ప్రస్తుతం లేని ఫ్రెండ్స్ గురించి గొప్పగా ఊహించుకుంటారు. అంటే ఆ ఊహలోని ఫ్రెండ్స్ కి గొప్ప పవర్స్, పవర్ ఫుల్ మేకోవర్ ఉంటాయి. మరి అలాంటి ఊహలు నిజమైతే...అలాంటి థాట్ లోంచి వచ్చిన సినిమానే ఇఫ్ చిత్రం. ఇదో ఫాంటసీ కామెడీ మూవీ. దీనిని జాన్ క్రసింస్కీ తీశారు. ప్రముఖ నటులు రేయాన్ రెనాల్డ్స్ తో పాటు కాలే ఫ్లెమ్మింగ్ తమ పాత్రలకు అద్భుతమైన న్యాయం చేశారు.ఇఫ్ సినిమా కథేంటంటే...పన్నెండేళ్ళ బీ తన డాడీ ఆపరేషన్ వల్ల గ్రాండ్ మదర్ మార్గరేట్ అపార్ట్ మెంట్ కు వస్తుంది. బీ మమ్మీ చిన్నప్పుడే చనిపోతుంది. ఓ రోజు రాత్రి బీ తనకు బిల్డింగ్ లో ఎవరో రేర్ క్రియేచర్ వెళ్తున్నట్టు అనిపిస్తుంది. ఆ తరువాత రోజు కూడా ఆ క్రియేచర్ ఓ మనిషితో పాటు వెళ్తున్నట్టు మళ్ళీ కనిపిస్తుంది. ఆ మనిషి ఎవరో కాదు తన గ్రాండ్ మదర్ బిల్డింగ్ చివరి పై ఫ్లోర్ లో వున్న కాల్ అని తెలుస్తుంది. కాల్ తో వున్న క్రియేచర్ బ్లూ. కాని ఈ సారి బ్లూ తో పాటు సీతాకోకచిలుక రూపంలో వున్న బ్లాసమ్ ని చూడగానే బీ మూర్ఛపోతుంది. ఆ తరువాత కొన్ని రోజులకు బీ కాల్ తో కలిసి ఈ క్రియేచర్స్ అన్ని ఉన్న చోటికి వెళ్ళి తన ఇమేజినేషన్ తో వాటన్నిటిని తనకు నచ్చిన విధంగా మార్చి చూసుకుని ముచ్చటపడుతుంది. అసలు బీకి కనిపించిన ఈ క్రియేచర్స్ ఏంటి, తన ఇమేజినేషన్ తో సృష్టించుకున్న క్రియేచర్స్ తో బీ ఇంకెన్ని మాజిక్స్ చేసిందో ప్రైమ్ లో స్ట్రీమ్ అవుతున్న ఇఫ్ చూస్తే తెలిసిపోతుంది. ఈ సినిమా మొత్తంలో గ్రాఫిక్స్ చాలా బావుంటాయి. మనకు కనిపించే క్రియేచర్స్ ని చాలా బాగా చూపించారు. ఇట్స్ ఎ వర్త్ మూవీ ఫర్ కిడ్స్. - ఇంటూరు హరికృష్ణ -
OTT: హాలీవుడ్ మూవీ ‘ట్రబుల్’ రివ్యూ
ఓటీటీలో ‘ఇది చూడొచ్చు’ అనే ప్రాజెక్ట్స్ చాలా ఉంటాయి. ప్రస్తుతం స్ట్రీమ్ అవుతున్న వాటిలో హాలీవుడ్ చిత్రం ‘ట్రబుల్’ ఒకటి. ఈ చిత్రం గురించి తెలుసుకుందాం.వినోదానికి భాష, ప్రాంతం ముఖ్యం కాదు. ప్రాంతాల సరి హద్దులు చెరిపేసి, భాషల హద్దులు మరిచి నవరసాల్లో హాస్యరసానికి పెద్ద పీట వేసే దర్శకులు ఈ ప్రపంచంలో చాలామందే ఉన్నారు. అందుకే వారు రూపొందించిన సినిమాలకు ప్రేక్షకాదరణ ఎక్కువ. స్వీడిష్ దర్శకుడు జాన్ హాంబర్గ్ ఇటీవల తీసిన ‘ట్రబుల్’ సినిమా ఇందుకు ఓ ఉదాహరణ. అంతలా ఏముందీ సినిమాలో ఓసారి విశ్లేషించుకుందాం. ఒక ఎలక్ట్రానిక్స్ షాపులో సేల్స్‌మేన్‌గా పని చేస్తున్న కాణీకి సంబంధించిన కథ ఈ ‘ట్రబుల్’. కాణీకి ఒక్కటే కూతురు. భార్య విడాకులిచ్చింది. కాణీకి సాధారణంగా సమస్యలు రావు, అయితే సమస్యలను తానే కొని తెచ్చుకునే కన్ఫ్యూజ్డ్ పర్సన్. కానీ కాణీ మంచి తెలివైనవాడు. ఓ టీవీని అమర్చేందుకు ఒకరి ఇంటికి వెళ్లినప్పుడు ఇతగాడి అత్యుత్సాహం ఓ హత్య కేసులో ఇరుక్కునేలా చేస్తుంది. కోర్టు అతనికి 18 సంవత్సరాల జైలు శిక్ష విధిస్తుంది. జైల్లో వేరేవాళ్లు తవ్విన సొరంగం గుండా బయటపడి తన సమస్యను ఎలా అధిగమించుకుంటాడో నెట్‌ఫ్లిక్స్ ఓటీటీ వేదికగా స్ట్రీమ్ అవుతున్న ‘ట్రబుల్’లోనే చూడాలి. ఈ సినిమాలో కాణీ పాత్రకు ప్రముఖ నటుడు ఫిలిప్ బర్గ్ ప్రాణం పోశారు. తన కన్ఫ్యూజింగ్ భావాలతో ప్రేక్షకులను కితకితలు పెట్టిస్తాడు. అలాగే హీరోయిన్ ప్రాత్రలో ఎమీ, విలన్ పాత్రలో ఇవా తమ పాత్రలకు సరైన న్యాయం చేశారు. పైన చెప్పినట్టు పేరుకు స్వీడిష్ సినిమా అయినా చక్కగా మన తెలుగులో డబ్ అయి ఉంది. వీకెండ్ మూవీ వాచర్స్‌కు మంచి హ్యూమరస్ మూవీ ఇది. ఈ ‘ట్రబుల్’ చూసి కాసేపు మీ ట్రబుల్స్ మరిచిపోకండి. – ఇంటూరు హరికృష్ణ -
హాలీవుడ్ టార్జాన్ రాన్ ఎలీ ఇకలేరు
ప్రముఖ హాలీవుడ్ నటుడు రాన్ ఎలీ (86) ఇకలేరు. ఆయన మరణించిన విషయాన్ని సోషల్ మీడియా ద్వారా రాన్ ఎలీ కుమార్తె క్రిస్టెన్ వెల్లడించారు. ‘‘ఓ గొప్ప వ్యక్తి ఈ ప్రపంచానికి దూరమయ్యారు. అలాగే నేను నా తండ్రిని కోల్పోయాను. నటుడిగా, రచయితగా, కుటుంబంలోని వ్యక్తిగా, కోచ్‌గా, గురువుగా, నాయకుడిగా ఆయన రాణించారు’’ అని క్రిస్టెన్ పేర్కొన్నారు. ఇక అమెరికాలోని టెక్సాస్‌లో 1938లో జన్మించారు రాన్ ఎలీ. కెరీర్ ఆరంభంలో ‘సౌత్ పెసిఫిక్’, ‘ది ఫిన్డ్ హూ వాక్డ్ ది వెస్ట్’ వంటి చిత్రాల్లో నటించిన తర్వాత టెలివిజన్ సిరీస్ ‘టార్జాన్’లో నటించే అవకాశం రాన్ ఎలీకి దక్కింది. టార్జాన్‌గా అద్భుతమైన ప్రతిభ కనబరిచిన రాన్ ఎలీకి విపరీతమైనపాపులారిటీ వచ్చింది.ఇంకా ‘ప్లే హౌస్ 90, థ్రిల్లర్, ఫేస్ ది మ్యూజిక్’ వంటి సిరీస్‌లలో నటించారు రాన్. అలాగే ‘డాక్ సావేజ్: ది మ్యాన్ ఆఫ్ బ్రాంజ్, వన్స్ బిఫోర్ ఐ డై’ వంటి చిత్రాల్లోనూ నటించారాయన. ‘షీనా’ సిరీస్ తర్వాత కొంతకాలం నటనకు దూరంగా ఉన్న రాన్ ‘ఎక్స్‌పెక్టింగ్ ఆమిష్’ (2014) అనే సినిమాలో ఓ లీడ్ రోల్ చేశారు. ఇదే ఆయనకు చివరి సినిమా. ఈ సంగతి ఇలా ఉంచితే... రాన్ ఎలీ ఎప్పుడు మరణించారనే విషయంపై క్రిస్టెన్ క్లారిటీ ఇవ్వలేదు. కానీ ఆయన కొన్ని రోజుల క్రితమే మరణించారని, మరణ వార్తను క్రిస్టెన్ కాస్త ఆలస్యంగా బయటపెట్టారని వార్తలు వస్తున్నాయి. -
'టార్జాన్' హీరో కన్నుమూత.. నెల రోజులకు ప్రకటించిన కుమార్తె
హాలీవుడ్ ప్రముఖ నటుడు రాన్ ఎలీ (86) అనారోగ్యంతో మరణించారు. 1966 నుంచి 1968 సమయంలో టార్జాన్ షో NBC టెలివిజన్ నెట్‌వర్క్‌లో ప్రసారం అయింది. ఈ షో అప్పట్లో భారీగా పాపులర్ కావడంతో ఆయన పేరు తెరపైకి వచ్చింది. టార్జాన్ చిత్రంలో తన పాత్రకు ఎనలేని గుర్తింపు వచ్చింది. దీంతో ఆయనకు భారీ సంఖ్యలో ఫ్యాన్స్ అయిపోయారు. అయితే, రాన్ ఎలీ మరణించారని ఆయన కుమార్తె కిర్‌స్టెన్ ఎలీ సోషల్‌మీడియా ద్వారా తెలిపింది.తన తండ్రి మరణంతో ఆమె ఒక పోస్ట్‌ను కూడా పెట్టారు. ఈ ప్రపంచం ఒక గొప్ప వ్యక్తిని కోల్పోయిందని ఆమె పేర్కొన్నారు. ' నా తండ్రి ఒక రోల్‌మోడల్.. ఆయన్నూ అందరూ హీరోగా పిలుస్తారు. నటుడిగా, రచయితగా, కోచ్‌గా ఎందరికో ఆదర్శంగా నిలిచారు. ఎంతో కష్టపడి తన చుట్టూ ఒక బలమైన ప్రపంచాన్ని ఏర్పాటు చేసుకున్నారు. ఆయన మరణం మాకు తీరని లోటుగా ఎప్పటికీ ఉండిపోతుంది.' అని ఆమె తెలపింది.2001లో తన నటనకు గుడ్‌బై చెప్పిన రాన్ ఎలీ ఆపై రచయితగా మారారు. ఈ క్రమంలో రెండు మిస్టరీ నవలలను ఆయన రాశారు. తన కెరియర్లో సుమారు 100కు పైగా చిత్రాల్లో నటించి మెప్పించారు. 1938లో అమెరికాలోని టెక్సాస్‌లో జన్మించిన ఎలీ.., 1959లో తన స్కూల్మెట్ను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వారికి ముగ్గురు సంతానం. సెప్టెంబరు 29న కాలిఫోర్నియాలోని శాంటా బార్బరాలోని లాస్ అలమోస్లోని తన ఇంట్లో ఎలీ మరణించారు. అయితే, ఈ విషయాన్ని ఆయన కుమార్తె చాలా ఆలస్యంగా ప్రపంచానికి తెలిపారు. -
స్వీయ వివాహం చేసుకున్న హాలీవుడ్ పాప్ సింగర్
ప్రముఖ హాలీవుడ్ పాప్ సింగర్ బ్రిట్నీస్పియర్స్ 42 ఏళ్ల వయసులో నాలుగో పెళ్లి చేసుకుంది. అయితే ఈసారి తనను తానే పెళ్లాడింది. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది. ఈ రోజు నాతో నాకే పెళ్లి జరిగింది. మీకిది తెలివి తక్కువ పనిలా అనిపించవచ్చు. కానీ నాకు మాత్రం ఇప్పటివరకు నేను చేసినవాటిలో ఇదొక గొప్ప విషయం అని భావిస్తున్నాను అని ఇన్‌స్టాగ్రామ్‌లో రాసుకొచ్చింది. స్వీయ వివాహం చేసుకున్న బ్రిట్నీస్పియర్ను చూసి నెటిజన్లు నోరెళ్లబెడుతున్నారు.మూడు పెళ్లిళ్లు పెటాకులుకాగా బ్రిట్నీస్పియర్స్ మొదటగా చిన్ననాటి స్నేహితుడు జాసన్ అలెగ్జాండర్‌ను పెళ్లాడింది. 2004లో వీరి వివాహం జరగ్గా కొద్ది రోజులకే విడిపోయారు. తర్వాత అదే ఏడాది డ్యాన్సర్, నటుడు కెవిన్ ఫెడెర్‌లైన్‌ను పెళ్లి చేసుకుంది. వీరికి ఇద్దరు కుమారులు సంతానం. అయితే ఈ దాంపత్యం కూడా సజావుగా సాగలేదు. దీంతో 2007లో విడిపోయారు. అనంతరం బ్రిట్నీ.. 2016లో నటుడు సామ్ అస్గారితో డేటింగ్ చేసింది. 2022లో వీరు పెళ్లి చేసుకోగా గతేడాది విడిపోయారు. ఈ మధ్యే విడాకులు సైతం మంజూరయ్యాయి.చదవండి: అప్పుడేమో సినిమాలతో బిజీ.. ఇప్పుడేమో పిల్లలుంటే బాగుండని ఫీలవుతున్న నటుడు -
ఓటీటీలో 'మంజుమ్మల్ బాయ్స్'ను మించిన సినిమా.. క్షణక్షణం ఉత్కంఠ
యథార్థ సంఘటనల ఆధారంగా స్ఫూర్తి పొంది తెరకెక్కిన ఎన్నో చిత్రాలు వెండితెరపై భారీ విజయాన్ని అందుకున్నాయి. ఈ క్రమంలోనే రీసెంట్గా వచ్చిన 'మంజుమ్మల్ బాయ్స్' దీనిని నిరూపించింది. అయితే, అలాంటి సంఘటనే 2018లో థాయ్‌లాండ్‌లో జరిగింది. 12మంది ఫుట్‌బాల్ టీమ్ పిల్లలతో 'థామ్ లువాంగ్' గుహలోకి కోచ్ వెళ్తాడు. అక్కడ అనుకోకుండా జరిగిన ఘటనతో వారు ప్రమాదంలో చిక్కుకుంటారు. ఆ సమయంలో ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ ఘటన 'థర్టీన్ లైవ్స్' పేరుతో సినిమాగా వచ్చింది. రెస్క్యూ ఆపరేషన్ బ్యాక్‌డ్రాప్‌లో దర్శకుడు రోన్ హోవార్డ్ ఈ సినిమాను అద్భుతంగా తెరకెక్కించారు. యథార్థ ఘటనను కళ్లకు కట్టినట్లుగా చూపించారు. అమెజాన్ ప్రైమ్‌లో తెలుగులో కూడా స్ట్రీమింగ్ అవుతున్న ఈచిత్రం కథ తెలుసుకుందాం.కథేంటంటేథాయ్లాండ్లో ఎంతో ప్రసిద్ధి చెందిన 'థామ్ లువాంగ్' గుహలను చూసేందుకు 12 మంది ఫుట్‌బాల్ జూనియర్ టీమ్ సభ్యులతోపాటు కోచ్ కూడా వెళ్తాడు. వారు గుహ లోపలికి వెళ్లిన కొంత సమయం గడిచాక ఆ పర్వత ప్రాంతమంతా విపరీతమైన మేఘాలు కమ్ముకుని భారీ వర్షం కురుస్తుంది. దీంతో గుహ ప్రారంభం వద్ద భారీగా వరద నీరు వచ్చి చేరటంతో పిల్లలందరూ తమ ప్రాణాలు కాపాడుకునేందుకు గుహ లోపలికి వెళ్లిపోతారు. తిరిగి బయటకొచ్చే దారి వారికి కనిపించదు. అలా వారందరూ అక్కడ చిక్కుకుపోతారు. భారీ వర్షం వల్ల గుహ లోపలికి వెళ్లే దారి నీటితో పూర్తిగా మూసుకుపోతుంది. ఇదే సమయంలో చిన్నారులు ఇంటికి రాకపోవడంతో వారి తల్లిదండ్రులు అందరూ ఆందోళన చెందుతుంటారు. బయటి ప్రంపంచంతో ఎలాంటి కనెక్టివిటీ లేని ఆ ప్రాంతంలో చిన్నారులు చిక్కుకుపోయారని అందరికీ ఎలా తెలిసింది..? సుమారు 18 రోజుల పాటు థాయ్‌లాండ్ ప్రభుత్వం ఛాలెంజింగ్‌గా చేసిన రెస్క్యూ ఆపరేషన్ ఫలించిందా..? పది కిలోమీటర్ల పొడవైన గుహ మొత్తం నిళ్లతో నిండిపోతే ఆ రెస్క్యూ టీమ్ ఎలా వెళ్లింది..? చిన్నారులందరూ అన్నిరోజుల పాటు సజీవంగా ఎలా ఉండగలిగారు..? అన్నది తెలియాలంటే 'థర్టీన్ లైవ్స్' సినిమా చూడాల్సిందే!ఎలా ఉందంటే..2018లో థాయ్ గుహల్లో చిన్నారులు చిక్కుకున్న సంఘటన ప్రపంచదేశాల అందరి దృష్టిని ఆకర్షించింది. ఆ చిన్నారులను కాపాడేందుకు దాదాపు పదిహేడు దేశాలకు చెందిన ఐదు వేల మంది రెస్క్యూ టీమ్ ఆ ఆపరేషన్ కోసం థాయ్‌లాండ్ చేరుకుంటారు. ఈ ఆపరేషన్‌లో బ్రిటీష్ రెస్క్యూ టీమ్ రిచర్డ్ స్టాంటాన్, జాన్ వొలేథాన్ ప్రాణాలకు తెగించి ఆ పిల్లలను కాపాడటానికి ఎలా ప్రయత్నాలు చేశారనేది చాలా సాహసంతో కూడుకొని ఉంటుంది. సుమారు 18 రోజుల తర్వాత ఆ చిన్నారులను బయటకు తీసుకొచ్చినప్పుడు ప్రపంచవ్యాప్తంగా అందరూ చాలా ఉద్వేగంతో ఫీల్ అయ్యారు. ఆ సమయంలో పిల్లలు క్షేమంగా తిరిగిరావాలని ప్రతి ఒక్కరూ దేవుడిని ప్రార్థించారు. అవన్నీ ఫలించాయి. ఎంతో భావోద్వేగంతో కూడుకున్న ఈ ఘటనను తెరకెక్కించడంలో దర్శకుడు రాన్ హోవర్డ్ విజయం సాధించారు.సినిమా ప్రారభంమే కథలోకి వెళ్లిపోతాడు దర్శకుడు. ఫుట్‌బాల్ ఆడుతున్న చిన్నారులు గుహ చూద్దామని అక్కడికి చేరుకోవడంతో స్టోరీ ప్రారంభమవుతుంది. ఆ వెంటనే భారీ వర్షం.. చిన్నారుల్లో భయం.. అలా ఒక్కో సీన్ ప్రేక్షకులకు చూపుతూ దర్శకుడు ఆసక్తి పెంచుతాడు. కొన్ని నిమిషాల్లోనే ఆ గుహ మొత్తం నీటితో నిండిపోతుంది. లోపల వారు ఉన్న విషయం ఎవరికీ తెలియదు. అయితే, వారిని ఎలా కనిపెడుతారనేది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. సుమారు 9 రోజుల తర్వాత సీడైవింగ్లో నిష్ణాతులైన ఇద్దరు బ్రిటిష్ డైవర్లు (రిచర్డ్ స్టాంటాన్, జాన్ వొలేథాన్) ఎంతో శ్రమించి చిన్నారులను కనిపెట్టినప్పుడు వాళ్లు ఎంత సంతోష పడ్డారో సినిమా చూస్తున్న ప్రేక్షకుడు కూడా అంతే స్థాయిలో భావోద్వేగానికి గురవుతాడు. మరోవైపు బయట జోరు వాన.. పిల్లలను రక్షించుకొందామనుకుంటే ఆ నీరు అంతా మళ్లీ గుహలోకే వెళ్తుంది. దీంతో ఆ నీటిని పంట పొలాల్లోకి మళ్లిస్తారు. అక్కడి రైతులు కూడా అందుకు సహకరిస్తారు. ఆ సీన్ అందరి కంట కన్నీరు తెప్పిస్తుంది. ఇలాంటి సీన్లు అన్నీ చాలా ఉద్విగ్నంగా ఉంటాయి.పిల్లలు ఎక్కడున్నారో కనిపెట్టారు సరే.. సుమారు 10 కిలోమీటర్లు దూరం పాటు చాలా లోతుగా ఉన్న నీటిలో నుంచి వారిని ఎలా రక్షించాలి అనేది పెద్ద సమస్యగా ఉంటుంది. ఇక అసలు కథ ఇక్కడే మొదలవుతుంది. ఎదురుగా నీటి ప్రవాహం వస్తుంటే.. దానిని అదిగమించి చిన్నారులను బయటకు చేర్చాలి. అప్పటికే 18 రోజులు కావడంతో వారందరూ మరణించి ఉంటారని కనీసం తమ బిడ్డల శవాలు అయినా తీసుకొస్తే చాలు అని వారి తల్లిదండ్రులు గుహ బయటే కన్నీటితో ఎదురుచూస్తున్నారు. అలాంటి సీన్లు ప్రేక్షకుల చేత కన్నీరు తెప్పిస్తాయి. ఎంతో సాహసంతో కూడుకున్న ఈ కథ ఎలా ముగిసిందో తెలుసుకున్నాక ప్రతి ఒక్కరిలో ఉద్వేగం కట్టలు తెంచుకుంటుంది. అలాంటి మజానే ఈ 'థర్టీన్ లైవ్స్' తప్పకుండా ఇస్తుంది. అమెజాన్ ప్రైమ్‌లో తెలుగులో కూడా ఈ చిత్రం స్ట్రీమింగ్ అవుతుంది.ఎవరెలా చేశారంటేసినిమా మొత్తం రెస్క్యూ ఆపరేషన్ నేపథ్యంలోనే సాగుతుంది. ఇందులో తెలిసిన నటుడు ఒక్కరూ లేరు. అయినా ప్రతి పాత్ర మనకు కనెక్ట్ అవుతుంది. ఈ చిత్రం కోసం పనిచేసిన సాంకేతిక విభాగం ప్రధాన్ ఆకర్షణగా నిలుస్తుంది. ముఖ్యంగా అండర్ వాటర్ సీన్స్ చాలా చక్కగా తీశారు. రియల్ ఇన్సిడెంట్ కళ్ల తెరపైన చూస్తున్నామనే ఫీలింగ్ కలిగేలా సినిమా సాగుతుంది. ఇందులో ఫైట్స్ వంటివి లేకున్నా చాలా సన్నివేశాల్లో విజిల్స్ వేసేలా ఉంటాయి. ఈ సినిమాకు ప్రధాన బలం దర్శకుడు రాన్ హోవర్డ్.. ఈ కథను ఉత్కంఠభరితంగా చెప్పడమే కాకుండా.. ఎంతో భావోద్వేగభరితంగా ప్రేక్షకులకు చూపించారు. -
వేలకోట్లు ఉండి ఏం లాభం? సాయం చేసేందుకు చేతులే రావట్లేదుగా!
హాలీవుడ్ పాప్ సింగర్, నటి సెలీనా గోమెజ్ మంచి చేయబోయి విమర్శలపాలైంది. న్యూయార్క్‌లో తను కారు ఎక్కేముందు ఓ వ్యక్తి తనకు దానం చేయమని కోరాడు. తలదాచుకోవడానికి నిలువ నీడ కూడా లేని అతడికి కేవలం 20 డాలర్లు దానం చేసి బాగా భోజనం చేయు అని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోయింది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.పాప్ సింగర్‌పై ట్రోలింగ్ఇంకేముంది, నెటిజన్లు ఆమెపై విమర్శల బాణాలు ఎక్కుపెడుతున్నారు. దాదాపు పదివేల కోట్ల సామ్రాజ్యానికి మహారాణివి, ఇల్లు లేని వ్యక్తికి కేవలం రూ.1600 చిల్లర (20 డాలర్లు) ఇస్తావా? నువ్వు తల్చుకుంటే నిరాశ్రయుడైన వ్యక్తికి ఏకంగా ఒక ఇల్లే కొనివ్వచ్చు, కానీ మరీ చిల్లర ఇవ్వడం బాగోలేదు, అంత డబ్బు ఏమాత్రం సరిపోతాయో.. అని కామెంట్లు చేస్తున్నారు. ఆమె అభిమానులు మాత్రం.. తను ఆ మాత్రమైనా చేసిందని వెనకేసుకొస్తున్నారు. హడావుడిగా వెళ్లిపోకుండా ఆగి మరీ తనకు తోచింది సాయం చేయడం గొప్ప విషయమేనని చెప్తున్నారు.చదవండి: రజనీకాంత్ ఫోటో షేర్ చేసి పెద్ద తప్పు చేశా: రాహుల్ సిప్లిగంజ్ -
పిల్లలను మెప్పించే 'హెరాల్డ్ అండ్ ది పర్పుల్ క్రేయాన్' సినిమా
చిన్న పిల్లలకు గీతలు గీయడమన్నా, బొమ్మలు వేయడమన్నా ఎంతో ఇష్టం. పూర్వం బలపాలు, పెన్సిళ్లు వాడేవాళ్ళు. ఇప్పటి జెనరేషన్ క్రేయాన్స్ వాడుతున్నారు. పిల్లలు ఒక్కోసారి పిచ్చి గీతలు గీస్తారు. ఒక్కోసారి పేరు లేని ఆకారాలను వేస్తారు. ఏది గీసినా, రాసినా వాటికి జీవమొస్తే..? అన్న చిలిపి ఆలోచన హాలీవుడ్ దర్శకుడు కార్లోస్‌కు వచ్చింది. ఇంకేముంది ‘హెరాల్డ్ అండ్ ది పర్పుల్ క్రేయాన్‘ అనే సినిమాను రూపొందించాడు. కథాపరంగా ‘హెరాల్డ్ అండ్ ది పర్పుల్ క్రేయాన్’లో హెరాల్డ్ అనే బాలుడు ఓ పుస్తకంలోని పాత్ర. అతనితో పాటు మూస్, పోర్క్పైన్ అనే మరో రెండు పాత్రలు ఉంటాయి. హెరాల్డ్ తన మానాన తాను ఉండగా బయటి ప్రపంచంలో అతనికి తెలిసిన ఓ వృద్ధుడు కనిపించకుండా పోతాడు. దాంతో హెరాల్డ్ ఆ వృద్ధుణ్ణి వెతకడానికి పర్పుల్ క్రేయాన్‌తో ఓ తలుపు బొమ్మ గీసి పుస్తకంలో నుంచి మానవ ప్రపంచంలోకి అడుగుపెడతాడు. అతనితో పాటు తోడుగా మూస్, పోర్క్పైన్ కూడా బయటకు వస్తాయి. ఇక అక్కడ నుండి మానవ ప్రపంచంలో అతడు ఏది గీస్తే అది నిజమైపోయి కథను నడిపిస్తుంది. హెరాల్డ్ ఆ ముసలివాడిని కనుగొంటాడా, మానవ ప్రపంచంలో తన మాయాజాలంతో ఎదుర్కోన్న ఇబ్బందులేంటి అన్నది మాత్రం సినిమా చూస్తేనే తెలుస్తుంది. ఈ సినిమాలో కారు బొమ్మ, హెలికాప్టర్ బొమ్మ ఇలా ఏది క్రేయాన్‌తో గీసినా అది నిజంగా అయిపోవడం పిల్లలకు బాగా నచ్చుతుంది. విజువల్‌గా గ్రాఫిక్స్ పిల్లలకే కాదు పెద్దవాళ్ళను ఆకట్టుకుంటాయి. పండుగ సెలవలకు పిల్లలతో పాటు పెద్దలు కూడా సరదాగా చూడగలిగిన సినిమా ‘హెరాల్డ్ అండ్ ది పర్పుల్ క్రేయాన్‘. వర్త్ టు వాచ్ ఇట్. అమెజాన్ ప్రైమ్‌తో పాటు జీ5లో స్ట్రీమింగ్ అవుతుంది. – ఇంటూరు హరికృష్ణ -
మూడు నెలలకోసారైనా ఆర్ఆర్ఆర్ చూస్తా: హాలీవుడ్ నటి
ఆర్ఆర్ఆర్ మూవీ ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు సంపాదించుకుంది. హాలీవుడ్ దర్శకనటులు సైతం ఈ కళాఖండాన్ని చూసి అబ్బురపడిపోయారు. అయితే హాలీవుడ్ నటి మిన్నీ డ్రైవర్ ఇంకా ఆర్ఆర్ఆర్ మేనియా నుంచి బయటకు రాలేకపోతోంది. తాజాగా ఆమె ఓ ఇంటర్వ్యూలో ఇండియన్ సినిమా గురించి ఇలా మాట్లాడింది.మా ఆల్‌టైమ్ ఫేవరెట్ మూవీఆర్ఆర్ఆర్ నా ఫేవరెట్ సినిమా. నా కుమారుడితో కలిసి ఈ సినిమా చూడటమంటే నాకెంతో ఇష్టం. మాకు ఇది ఆల్‌టైమ్ ఫేవరెట్ మూవీ. అందుకే మూడు నెలలకోసారి కచ్చితంగా ఈ చిత్రాన్ని చూస్తుంటాం. ఎంతో అందమైన, అద్భుతమైన చిత్రాల్లో ఇదీ ఒకటి అని చెప్పుకొచ్చింది.భారత్‌కు రావాలనుంది..ఇండియన్ చెఫ్ రోమీ గిల్‌తో స్నేహం గురించి మాట్లాడుతూ.. రోమీ నాకు మంచి స్నేహితురాలు. తను చాలా బాగా వంట చేస్తుంది. భారత్‌కు వచ్చి, ఇక్కడ సంస్కృతి, సాంప్రదాయాలను చూడాలనుందని తనతో తరచూ అంటూ ఉంటాను అని తెలిపింది. కాగా మిన్నీ డ్రైవర్.. ఇటీవలే ద సెర్పంట్ క్వీన్ రెండో సీజన్లో నటించింది. ఇందులో క్వీన్ ఎలిజబెత్‌గా యాక్ట్ చేసింది. ఈ సిరీస్ ఓటీటీ ప్లాట్‌ఫామ్ లయన్స్‌గేట్ ప్లేలో అందుబాటులో ఉంది.చదవండి: Bigg Boss 8 Telugu: వీటి గురించి ఎవరు మాట్లాడుకోరేం.. -
ప్రపంచంలోనే అత్యంత సంపన్న నటి ఎవరో తెలుసా?
ప్రపంచంలోనే అత్యంత సంపన్న నటి ఎవరో చెప్పగలరా? మీరు ఊహించినట్టు టేలర్ స్విఫ్ట్, రిహన్న, సెలీనా గోమెజ్ అయితే కాదు. ఎందుకంటే ఈ ముగ్గురి మొత్తం సంపద కలిపినా కూడా ఆ నటి సంపదకు సరితూగదు. ఆశ్చర్యంగా అనిపించినా ఇది అక్షరాల నిజం. అంతేకాదు అందరి కంటే ఎక్కువ సంపద కలిగివున్నప్పటికీ ఆమె ఏమీ పాపులర్ నటి కాదు. ఆమె ఖాతాలో ఒక్క బాక్సాఫీస్ విజయం కూడా లేదు. మరి ఆమెకు అంత సంపద ఎలా వచ్చింది?ఫోర్బ్స్ ప్రకారం.. అత్యంత సంపన్న నటుడు టైలర్ పెర్రీ. అమెరికాకు చెందిన ఆయన నటుడిగా, నిర్మాతగా, నాటక రచయితగా ప్రసిద్ధుడు. ఆయనకు సొంత స్టూడియోతో పాటు, మాడియా హిట్ ఫ్రాంచైజీ ఉండడంతో అతడు 1.4 బిలియన్ డాలర్ల సంపద కలిగివున్నాడు. అత్యంత సంపన్న నటిగా ఈ జాబితాలో ముందున్న అమెరికన్ యాక్ట్రస్-ఆంట్రప్రెన్యూర్ జామీ గెర్టజ్.. ఆస్తుల ఎంతో తెలిస్తే అవాక్కవడం పక్కా. టైలర్ పెర్రీ సంపద కంటే 5 రెట్లు కంటే ఎక్కువని ఫోర్బ్స్ అంచనా వేసింది. జామీ గెర్టజ్ ఆస్తుల నికర విలువ 8 బిలియన్ డాలర్లు. అంటే 66 వేల కోట్ల రూపాయల పైమాటే. ప్రపంచంలోని సెలబ్రిటీలందరిలోనూ ఆమె అత్యంత సంపన్నురాలు. టేలర్ స్విఫ్ట్ (1.6 బిలియన్ డాలర్లు), రిహన్న (1.4 బిలియన్ డాలర్లు), సెలీనా గోమెజ్ (1.3 బిలియన్ డార్లు) తరువాతి స్థానంలో ఉన్నారు. మడోన్నా.. నాన్-బిలియనీర్‌గా టాప్-5లో చోటు దక్కించుకుంది.టాప్ 10లో జూహీ చావ్లాటాప్-5లో మిగిలిన నలుగురి మొత్తం సంపద కంటే కూడా జామీ గెర్టజ్ సంపదే ఎక్కువని ఫోర్బ్స్ అంచనా వేసింది. టాప్-5లో నిలిచిన ఐదుగురు నటీమణులు నటనతో పాటు ఇతర వ్యాపకాలతో ఆస్తులు కూడబెట్టారు. టేలర్ స్విఫ్ట్, రిహన్న, సెలీనా గోమెజ్, మడోన్నా.. యాక్టింగ్‌తో పాటు మ్యూజిక్ కెరీర్, మేకప్ బ్రాండ్లతో సంపద పోగేశారు. జామీ గెర్టజ్ విషయానికి వస్తే ఆమె వ్యాపార పెట్టుబడులతో అందరి కంటే ఎక్కువగా సంపాదించారు. మెయిన్ స్ట్రీమ్ నటి రీస్ విథర్స్పూన్ ఏడవ స్థానంలో ఉంది. టాప్ 10లో ఉన్న ఏకైక భారతీయ నటి జూహీ చావ్లా మాత్రమే. హురున్ రిచ్ లిస్ట్ ప్రకారం ఆమె సంపద సుమారు రూ.4600 కోట్లు.చదవండి: టిన్ అండ్ టీనా మూవీ రివ్యూఎవరీ జామీ గెర్టజ్?జామీ గెర్టజ్.. అమెరికాలోని షికాగోలో 1965లో జన్మించారు. 80వ దశకంలో నటనా జీవితాన్ని ప్రారంభించారు. 1981లో ఎండ్లెస్ లవ్‌తో సినీ రంగ ప్రవేశం చేశారు. 1987లో లెస్ దేన్ జీరో సినిమాలో రాబర్ట్ డౌనీ జూనియర్‌కి జోడీగా నటించడంతో ఆమెకు గుర్తింపు దక్కింది. అదే సంవత్సరం ది లాస్ట్ బాయ్స్ సినిమాలో ప్రముఖ పాత్రను పోషించి ప్రశంసలు అందుకున్నారు. 90 దశకంలో ట్విస్టర్ వంటి సినిమాల్లో నటించారు. ప్రధాన నటిగా విజయాలు దక్కకపోవడంతో తర్వాత సహాయ పాత్రలకు పరిమితమయ్యారు. అల్లీ మెక్‌బీల్ టీవీ షోతో ప్రేక్షుకులకు దగ్గరయి ఎమ్మీ నామినేషన్ సాధించారు. చివరిసారిగా 2022 చిత్రం ఐ వాంట్ యు బ్యాక్ సినిమాలో అతిథి పాత్రలో ఆమె కనిపించారు.చదవండి: ఓటీటీలో హాలీవుడ్ రొమాంటిక్ మూవీ.. 20 భాషల్లో స్ట్రీమింగ్అంత సంపద ఎలా వచ్చింది?జామీ గెర్టజ్ నటనా జీవితంలో పెద్దగా విజయాలు లేకపోయినా ఆమె అత్యంత సంపన్న నటిగా ఎలా ఎదిగారనేది అందరికీ ఆసక్తి కలిగించే విషయం. అమెరికన్ బిలియనీర్ వ్యాపారవేత్త టోనీ రెస్లర్ను వివాహం చేసుకోవడంతో ఆమె దశ తిరిగింది. భర్తతో కలిసి వివిధ వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టడంతో ఆమె సంపద బాగా పెరిగింది. వీరిద్దరూ నేషనల్ బాస్కెట్‌బాల్ అసోసియేషన్ (NBA)లో అట్లాంటా హాక్స్, మేజర్ లీగ్ బేస్‌బాల్‌లో మిల్వాకీ బ్రూవర్స్ జట్లకు సహ-యజమానులుగా ఉన్నారు. వీటితో పాటు ఇతర వ్యాపారాల్లోనూ జామీ గెర్టజ్ పెట్టుబడులు కలిగివుండడంతో రిచెస్ట్ యాక్ట్రస్‌గా ఆమె టాప్‌లో ఉన్నారు. -
ఓటీటీలోనే ది బెస్ట్... సలార్, కేజీఎఫ్‌కి బాబు లాంటి సినిమా
ఓటీటీలో అన్ని జానర్స్‌లో కొన్ని బెస్ట్ ఆఫ్ ది బెస్ట్ మూవీస్ ఉన్నాయి. మరీ ముఖ్యంగా వయలెన్స్ అంటే ఇష్టపడేవాళ్లు బోలెడుమంది. అలాంటి ఆడియెన్స్ కోసమా అన్నట్లు గ్యాంగ్‌స్టర్, యాక్షన్ చిత్రాలు లెక్కలేనన్ని ఉన్నాయి. వాటిలో టాప్ ప్లేసులో ఉండే మూవీ 'సిటీ ఆఫ్ గాడ్'. అయితే ఇది ఇంగ్లీష్ సినిమా కాదు. పోర్చుగీస్ భాషలో తీసిన బ్రెజిల్ మూవీ. కానీ ఇంగ్లీష్‌లో కూడా అందుబాటులో ఉంది. ఈ మూవీలో అంతలా ఏముంది? అనేది రివ్యూలో చూద్దాం.కథేంటి?బ్రెజిల్ రాజధాని రియో డి జనీరో శివారులో ఉండే సిడాడె డె డెవుస్ మురికివాడ. కనీస అవసరాలైన విద్యుత్తు, రవాణా సదుపాయాలు అస్సలు ఉండవ్. చాలామంది కటిక పేదరికంలో ఉంటారు. ఇక్కడే 'టెండర్ ట్రయో' పేరుతో ముగ్గురు కుర్రాళ్లు.. దొంగతనం, దోపీడీలు చేస్తూ పోలీసుల నుంచి తప్పించుకు తిరుగుతుంటారు. పెద్ద హోటల్లో దోపీడీ చేస్తే ఇంకా ఎక్కువగా దోచుకోవచ్చని లిటిల్ డైస్ అనే పిల్లాడు సలహా ఇస్తాడు. రాత్రి అక్కడికే దొంగతనానికి వెళ్లిన ముగ్గురు కుర్రాళ్లు.. పోలీసులు వస్తే సిగ్నల్ ఇవ్వమని లిటిల్ డైస్‌ని బయట కాపలా ఉంచుతారు.దోపీడి మాత్రమే చేయాలని ఎవరినీ చంపకూడదని కుర్రాళ్లు అనుకుంటారు. కానీ లిటిల్ డైస్ సిగ్నల్ ఇవ్వడంతో వీళ్లు పారిపోతారు. తీరా మరుసటి రోజు పత్రికల్లో మాత్రం హోటల్లో చాలామంది చనిపోయినట్లు వార్తలు వస్తాయి. ఇంతకీ వాళ్లని ఎవరు చంపారు? చివరకు సిటీ ఆఫ్ గాడ్ అయిందెవరు అనేదే మిగతా స్టోరీ.ఎలా ఉందంటే?పూర్తిగా రా అండ్ రస్టిక్‌గా తీసిన ఈ సినిమా.. ఫొటోగ్రాఫర్ అవ్వాలని కలలు కనే బుస్కేప్ అనే కుర్రాడి పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి సాగుతుంది. గ్యాంగ్‌స్టర్ ముఠా, పోలీసులకు మధ్య ఇతడు ఇరుక్కునే సీన్‌తో సినిమా మొదలవుతుంది. అక్కడి నుంచి 1960లోకి వెళ్లి సిడాడె డె డెవుస్ అనే ఊరు. అక్కడి వాతావరణం, మనషులు ఎలా ఉంటారనేది చూపిస్తారు.అప్పుడే యవ్వనంలోకి వచ్చిన కుర్రాళ్లంతా డ్రగ్స్ వ్యాపారంలోకి రావడం, ఇబ్బడిముబ్బడిగా డబ్బు పోగేసుకోవడం, వీటితో తుపాకులు కొని హత్యలతో చెలరేగడం ఇలా చాలా వయలెంట్‌గా ఉంటుంది. ఆధిపత్యం కోసం మొదటి రెండు తరాలు ఇలానే ఒకరిని ఒకరు కాల్చుకుని చనిపోతారు. మూడో తరం కూడా అలానే తయారవబోతుందని చూపించడంతో సినిమా ముగుస్తుంది.ప్రాంతం గానీ, మనుషులు గానీ మనకు అస్సలు పరిచయం లేనివాళ్లు. కానీ చూస్తున్నంతసేపు బ్రెజిల్ శివారులోని మురికివాడల్లో ఉన్నామా అనే ఫీలింగ్ కలుగుతుంది. ఊపిరి సలపనంత స్పీడుగా ఉండే స్క్రీన్ ప్లే, దానికి తగ్గట్లే ఉండే బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అదరగొట్టేస్తుంది. ఇప్పుడంటే 'సలార్', 'కేజీఎఫ్' లాంటి సినిమాలు చూసి ఆహా ఓహో అంటున్నారు. కానీ 2002లో గ్యాంగ్‌స్టర్ జానర్లోనే వన్ ఆఫ్ ది బెస్ట్ మూవీ ఇదని చెప్పొచ్చు.ఇక సినిమా చాలా సహజంగా ఉంటుంది. ఎందుకంటే స్థానికులనే లీడ్ యాక్టర్స్‌గా పెట్టారు. 100 రోజులు ట్రైనింగ్ ఇచ్చి మరీ నటింపజేశారు. దాని ఫలితం మీకు సినిమాలో కనిపిస్తుంది. అయితే ఈ సినిమాతో ఫ్యామిలీతో కలిసి చూడకండి. ఎందుకంటే బూతులు, న్యూడ్ సన్నివేశాలు ఉంటాయి. మీకు వయలెన్స్ ఎక్కువగా ఉండే గ్యాంగ్‌స్టర్ మూవీ చూడాలనుకుంటే దీన్ని అసలు మిస్సవొద్దు. అమెజాన్ ప్రైమ్, నెట్‌ఫ్లిక్స్ రెండింటిలోనూ ఇది స్ట్రీమింగ్ అవుతోంది.-చందు డొంకాన -
ఓటీటీలో హాలీవుడ్ రొమాంటిక్ మూవీ.. 20 భాషల్లో స్ట్రీమింగ్
హాలీవుడ్లో ఈ ఏడాదిలో విడుదలైన అమెరికన్ రొమాంటిక్ స్పోర్ట్స్ డ్రామా చిత్రం ఛాలెంజర్స్. లూకా గ్వాడాగ్నినో దర్శకత్వం వహించిన ఈ సినిమా ఏప్రిల్ 26న ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. సుమారు ఐదు నెలల తర్వాత ఇప్పుడు ఈ మూవీ ఓటీటీలో స్ట్రీమింగ్కు రానుంది. రూ. 450 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సుమారుగా వెయ్యి కోట్లు రాబట్టింది.ఇదీ చదవండి: ఐఫా వేదికపై ఆర్జీవీకి కృతజ్ఞతలు చెప్పిన సందీప్ రెడ్డి.. మియా మాల్కోవాపై ఒట్టేసిన వర్మహాలీవుడ్లో మంచి విజయం సాధించిన చిత్రాలు ప్రాంతీయ భాషలలో విడుదల చేయడం పరిపాటిగానే జరుగుతుంది. ఈ క్రమంలో తాజాగా హాలీవుడ్ రొమాంటిక్ స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కిన 'ఛాలెంజర్స్' మూవీ ఓటీటీలోకి వచ్చేసింది. హాలీవుడ్లో పాపులర్ నటిగా గుర్తింపుతెచ్చుకున్న జెండాయ ఈ సినిమాలో ప్రధాన పాత్రలో మెరిసింది. అయితే, ఎలాంటి ముందస్తు ప్రకటన లేకుండానే ఈ మూవీ అమెజాన్ ప్రైమ్‌లోకి వచ్చేసింది. తెలుగుతో పాటు ఏకంగా 20 భాషలలో స్ట్రీమింగ్కు తీసుకొచ్చింది.టెన్నిస్ గేమ్ బ్యాక్‌డ్రాప్‌లో ఈ సినిమా కథ సాగుతుంది. టెన్నిస్ ఛాంపియన్‌గా గుర్తింపు తెచ్చుకున్న తాషి (జెండాయా) కోచ్‌గా మారి తన భర్తను ఎలా ఛాంపియన్‌గా తీర్చిదిద్దారనేదే ఈ కథాంశం. ఈ క్రమంలో తాషి మాజీ బాయ్‌ఫ్రెండ్ వారి జీవితాల్లోకి ఎంట్రీ ఇచ్చాక కథ అనేక మలుపులు తిరుగుతుంది. సినిమాలో అక్కడక్కడా కాస్త బోల్డ్ సీన్స్ ఉంటాయి. కాబట్టి కుటుంబంతో పాటు చూడటం ఇబ్బందిగా ఉండొచ్చు. -
టిన్ అండ్ టీనా మూవీ రివ్యూ
టైటిల్: టిన్ & టీనాకథలోలా - అడాల్ఫొ దంపతులు పుట్టబోయే బిడ్డ కోసం వేయి కళ్లతో ఎదురుచూస్తారు. కానీ వారి కలలను నీరుగారుస్తూ పెళ్లిరోజే లోలాకు గర్భస్రావం అవుతుంది. అంతేకాదు, ఇంకెప్పుడూ తను తల్లి కాలేదని వైద్యులు నిర్ధారిస్తారు. దీంతో ఆమె డిప్రెషన్లోకి వెళ్లిపోతుంది. తననలా చూడలేకపోయిన భర్త దగ్గర్లో ఓ కాన్వెంట్ ఉందని, అందులో ఎవర్నైనా దత్తత తీసుకుందామని చెప్తాడు. మొదట లోలా అందుకు అంగీకరించదు. కానీ తర్వాత ఒప్పుకుని ఏడేళ్ల వయసున్న కవలలు టిన్ అండ్ టీనాను దత్తత తీసుకుంటారు.అప్పుడు అసలు కథ మొదలవుతుంది. పిల్లలు అందరిలా కాకుండా వింతగా ప్రవర్తిస్తుంటారు. భగవంతుడిపై ఎక్కువ విశ్వాసంతో తానేం చేసినా దేవుడిపైనే భారం వేస్తారు. అప్పుడే ఒక మిరాకిల్ జరుగుతుంది. లోలా మల్లీ ప్రెగ్నెంట్ అవుతుంది. పిల్లల వింత ప్రవర్తనతో భయపడిపోయిన ఆమె కడుపులో బిడ్డను వారి నుంచి కాపాడుకోవాలని చూస్తుంది. డెలివరీ తర్వాత కూడా క్షణక్షణం భయంగానే గడుపుతుంది. ఆమె భయానికి కారణం ఏంటి? ఆ పిల్లలు ఏం చేశారు? వారిని తిరిగి ఎందుకు కాన్వెంట్లో వదిలేశారు? అనేది తెలియాలంటే ఓటీటీలో మూవీ చూడాల్సిందే!విశ్లేషణలోలాకు దేవుడంటే నమ్మకం ఉండదు. కానీ తను పెంచుకుంటున్న కవలలకు అపారమైన భక్తి. బైబిల్లో ఉన్నవన్నీ యదాతథంగా అమలు చేయాలనుకుంటారు. ఈ క్రమంలోనే పెంపుడు కుక్కను చంపేస్తారు. స్కూలులో తమను ఆటపట్టిస్తున్న కుర్రాడిని సైతం దారుణంగా టార్చర్ పెట్టి చంపుతారు. వీటిని సహించని లోలా చివరకు వారిని అమాయకులుగా భావించడం వింతగా అనిపిస్తుంది. పిల్లల రాక్షస ప్రవర్తనకు ఇంకేమైనా కారణాలున్నాయా? అని అనిపించకమానదు. క్లైమాక్స్‌లో లోలా భర్తను కోల్పోవడం... ఎవరివల్లయితే తన కొడుక్కి హాని అనుకుందో ఆ కవలల్ని ఇంటికి తీసుకురావడం అందరికీ మింగుడుపడకపోవచ్చు.లోలాగా మెలీనా స్మిత్, టిన్ అండ్ టీనాగా కార్లోస్ జి మోరోలాన్, అనటాసియా రుస్సో నటించారు. వీరి పర్ఫామెన్స్ బాగుంది. కొన్ని సన్నివేశాలు చూసినప్పుడు మనకే కంగారు వచ్చేస్తుంటుంది. బిడ్డను కాపాడుకోవడానికి తల్లి పడే ఆరాటం మనల్ని కదిలించివేస్తుంది. వీకెండ్లో ఓసారి చూసేయొచ్చు! టిన్ అండ్ టీనా మూవీ నెట్‌ఫ్లిక్స్‌లో అందుబాటులో ఉంది. -
'హ్యారీ పోటర్' నటి- ఆస్కార్ విజేత కన్నమూత
'హ్యారీ పోటర్' పేరు చెప్పగానే అద్భుతమైన సినిమాలు గుర్తొస్తాయి. దాదాపు ఇరవై ఏళ్ల క్రితమే అదిరిపోయే గ్రాఫిక్స్‌తో తీసిన చిత్రాలు చాలామందికి ఫేవరెట్. ఇందులో పాత్రధారులకు కోట్లాది మంది అభిమానులున్నారు. గత కొన్నాళ్లుగా 'హ్యారీ పోటర్' నటీనటులు ఒక్కొక్కరుగా చనిపోతున్నారు. గతేడాది మైఖేల్ గ్యాంబెన్ అలియాస్ ప్రొఫెసర్ డంబెల్ డోర్ చనిపోయారు. ఇప్పుడు ఆయన మృతి చెందిన సరిగ్గా ఏడాదికి మరో నటి చనిపోయారు.(ఇదీ చదవండి: 'దేవర' పార్ట్ 2లో స్టోరీ ఏం ఉండొచ్చు?)'హ్యారీ పోటర్' సిరీస్‌లో ప్రొఫెసర్ మెక్ గొనగల్ పాత్రలో అలరించిన మ్యాగీ స్మిత్ (89) అనారోగ్య కారణాలతో శుక్రవారం తుదిశ్వాస విడిచారు. కెరీర్లో మంచి మంచి సినిమాలు చేసిన ఈమె.. ప్రతిష్టాత్మక ఆస్కార్ అవార్డుని కూడా రెండు సార్లు అందుకున్నారు. అలానే 'డౌన్ టౌన్ అబే' అనే టీవీ సిరీస్‌తోనూ ఈమె పాపులారిటీ సొంతం చేసుకున్నారు.(ఇదీ చదవండి: కేసు పెట్టిన సంగీత దర్శకుడు ఆర్పీ పట్నాయక్)One year ago today: Michael Gambon passed away.Today: Maggie Smith passed away.Two legendary people who played two of our favorite Harry Potter characters. 😢#RIPMichaelGambon#RIPMaggieSmith pic.twitter.com/TE8nmaVSqS— Harry Potter Universe (@HPotterUniverse) September 27, 2024All four of them have passed away 💔💔💔💔 pic.twitter.com/4B2D7bNBnP— Harry Potter Universe (@HPotterUniverse) September 27, 2024 -
ఒకే ఫ్రేమ్‌లో సమంత, ప్రియాంక.. థియేటర్లో సందడి (ఫోటోలు)
-
కన్నుకొట్టిన అనసూయ.. భర్తతో కలిసి పార్టీలో అలా.. (ఫొటొలు)
-
జేమ్స్ కామెరూన్ లాస్ట్ ట్రైన్ ఫ్రమ్ హిరోషిమా
హాలీవుడ్ ప్రముఖ దర్శకుడు జేమ్స్ కామెరూన్ ‘లాస్ట్ ట్రైన్ ఫ్రమ్ హిరోషిమా’ పేరుతో ఓ సినిమా చేయనున్నారనే టాక్ వినిపిస్తోంది. అమెరికన్ ప్రముఖ రచయిత చార్లెస్ ఆర్. పెల్లెగ్రినో రాసిన ‘ఘోస్ట్స్ ఆఫ్ హిరోషిమా’ బుక్ హక్కులను సొంతం చేసుకున్నారు జేమ్స్ కామెరూన్. రెండో ప్రపంచ యుద్ధం సమయంలో జపాన్‌లోని హిరోషిమా, నాగసాకి నగరాలపై అమెరికా అణు బాంబులతో దాడి చేసింది. ఆ సమయంలో ్రపాణాలతో బతికి బయటపడ్డ జపాన్ ఇంజనీర్ సుటోము యమగుచి జీవితం ఆధారంగా ‘లాస్ట్ ట్రైన్ ఫ్రమ్ హిరోషిమా’ సినిమా తెరకెక్కనుందని హాలీవుడ్లో వార్తలు వస్తున్నాయి. చార్లెస్ రాసిన ‘ఘోస్ట్స్ ఆఫ్ హిరోషిమా’, ‘లాస్ట్ ట్రైన్ ఫ్రమ్ హిరోషిమా’... ఈ రెండు బుక్స్‌ని కలిపి సినిమా తీయనున్నారట జేమ్స్ కామెరూన్. ప్రస్తుతం ‘అవతార్’ ఫ్రాంచైజీతో జేమ్స్ కామెరూన్ బిజీగా ఉన్నారు. ఈ ఫ్రాంచైజీ నుంచి ఇప్పటికే ‘అవతార్ (2019), అవతార్: ద వే ఆఫ్ వాటర్’ (2022) చిత్రాలు విడుదల అయ్యాయి. ‘అవతార్: ఫైర్ అండ్ యాష్’ (అవతార్ 3) చిత్రం 2025లో రిలీజ్ కానుంది. ఇంకా ‘అవతార్ 4, అవతార్ 5’ చిత్రాలు కూడా ఉన్నాయి. మరి... ‘అవతార్’ ఫ్రాంచైజీని పక్కన పెట్టి జేమ్స్ కామెరూన్ ‘లాస్ట్ ట్రైన్ ఫ్రమ్ హిరోషిమా’ చేస్తారా? లేదా అనే అంశంపై ఓ స్పష్టత రావాల్సి ఉంది. ఒకవేళ ‘అవతార్’ ఫ్రాంచైజీలకన్నా ముందే ‘లాస్ట్ ట్రైన్ ఫ్రమ్ హిరోషిమా’ సినిమాను సెట్స్‌పైకి తీసుకువెళితే 1997లో వచ్చిన ‘టైటానిక్’ తర్వాత జేమ్స్ కామెరూన్ దర్శకత్వం వహించే నాన్ అవతార్ ఫిల్మ్ ‘లాస్ట్ ట్రైన్ ఫ్రమ్ హిరోషిమా’నే అవుతుంది. -
అడవుల్లో బుల్లెట్ల వర్షం.. ల్యాండ్ ఆఫ్ బ్యాడ్ ఎలా ఉందంటే?
టైటిల్: ల్యాండ్ ఆఫ్ బ్యాడ్డైరెక్టర్: విలియమ్ యూబ్యాంక్నిర్మాణ సంస్థలు: ఆర్ యూ రోబోట్ స్టూడియోస్, హైలాండ్ ఫిల్మ్ గ్రూప్నిడివి: 113 నిమిషాలుఓటీటీ: అమెజాన్ ప్రైమ్కథేంటంటే..యాక్షన్ సినిమాలకు పేరు పెట్టింది అంటే హాలీవుడ్. కానీ డిఫరెంట్ కాన్సెప్ట్‌లతో ప్రేక్షకులను కట్టిపడేసేలా కొన్ని చిత్రాలు మాత్రమే ఉంటాయి. అలాగే మనవద్ద కూడా స్పై యాక్షన్ చిత్రాలు చాలానే వచ్చాయి. ఇలాంటి వాటిలో ముఖ్యంగా టెర్రరిస్టులను అంతం చేయడమే ప్రధాన కాన్సెప్ట్. అలా ప్రత్యేక ఆపరేషన్ పేరుతో ప్రేక్షకుల ముందుకొచ్చిన చిత్రమే 'ల్యాండ్ ఆఫ్ బ్యాడ్'. ఓ వైమానిక అధికారి కుటుంబాన్ని కిడ్నాప్ చేసిన టెర్రరిస్టులను అంతమొందించారా? లేదా? అన్నదే అసలు కథ. కేవలం నలుగురు కమాండోలతో చేపట్టిన టెర్రరిస్ట్ ఆపరేషన్ సక్సెస్ అయిందా? లేదా? అన్నది రివ్యూలో చూద్దాం.ఎలా ఉందంటే..అమెరికా ఎయిర్‌ఫోర్స్ నేపథ్యంలో ఈ కథ సాగుతుంది. యూఎస్‌లో ఉన్న ఎయిర్‌బేస్ నుంచే కథ మొదలవుతుంది. ఈ ఆపరేషన్ కోసం నలుగురు ఎయిర్‌ఫోర్స్‌కు చెందిన కమాండోలు బయలుదేరుతారు. అయితే ఆపరేషన్ మొత్తం సముద్రంలోని డెల్టా అడవుల్లోనే జరుగుతుంది. టార్గెట్ ప్రాంతానికి చేరుకున్న కమాండోలకు ఊహించని పరిస్థితి ఎదురవుతుంది. అక్కడ వారు అనుకున్న ప్లాన్ బెడిసికొట్టి.. ముందుగానే వార్‌లోకి దిగాల్సి వస్తుంది. ఆ తర్వాత జరిగే యుద్ద సన్నివేశాలు కట్టిపడేస్తాయి. ఒకవైపు టెర్రరిస్టుల నుంచి బుల్లెట్ల వర్షం, వైమానికి దాడులు అబ్బుర పరిచేలా అనిపిస్తాయి. అయితే ఈ కథలో కాన్సెప్ట్ కొత్తగా లేనప్పటికీ ఈ ఆపరేషన్ చేపట్టిన తీరు ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. అద్భుతమైన లోకేషన్స్ మధ్య భీకరమైన బాంబు దాడులు, బుల్లెట్ల వర్షం ఆడియన్స్‌కు అద్భుతంగా ఉన్నాయి. ఎయిర్‌బేస్, కమాండోల మధ్య కమ్యూనికేషన్ అంత రోటీన్‌గానే ఉంటుంది. ఆపరేషన్ అంతా అడవుల్లోనే సాగడంతో ఎక్కడా బోర్ అనిపించదు. టెర్రరిస్టులతో ఎయిర్‌ఫోర్స్ కమాండోల పోరాడే సీన్స్ ఫుల్ యాక్షన్ ఫీస్ట్‌గా అనిపిస్తాయి. అయితే ఎయిర్‌బేస్ వైమానిక అధికారుల్లో ఆపరేషన్ పట్ల సీరియస్‌నెస్ లేకపోవడం ఈ కథకు పెద్ద మైనస్. యాక్షన్ సినిమాలు ఇష్టపడేవారికి ల్యాండ్ ఆఫ్ బ్యాడ్ మూవీ మంచి ఆప్షన్. ఈ చిత్రం అమెజాన్ ప్రైమ్‌లో తెలుగులోనూ అందుబాటులో ఉంది. -
ది లయన్ కింగ్.. మహేశ్‌బాబు వచ్చేస్తున్నాడు.. తెలుగు ట్రైలర్ చూశారా!
చిన్నా, పెద్దా అనే తేడా అందరినీ అలరించిన చిత్రం ది లయన్ కింగ్. ఈ చిత్రంలో రాజ్యాన్ని పాలించే ముఫాసా, అతని తమ్ముడు స్కార్ పాత్రలు ఎప్పటికీ గుర్తుండిపోతాయి. అడవికి రాజుగా ముఫాసా తన రాజ్యాన్ని కాపాడుతూ ఉంటారు. అతనికి సింబా అనే కుమారుడు జన్మిస్తాడు. ఈ సిరీస్‌లో ఇప్పటికే లయన్ కింగ్-2 కూడా వచ్చింది. తాజాగా లయన్ ప్రీక్వెల్తో మరోసారి ప్రేక్షకుల ముందుకొస్తున్నారు మేకర్స్.తాజాగా ఈ మూవీ తెలుగు ట్రైలర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఇందులో ముఫాసా పాత్రలో మహేశ్ బాబు వాయిస్‌తో అభిమానులను అలరించనున్నారు. గతంలో లాగే బ్రహ్మనందం, అలీ వాయిస్ పాత్రలతో టాలీవుడ్ ఫ్యాన్స్‌ను మరోసారి మెప్పించనున్నారు. అకాడమీ అవార్డ్ విజేత, దర్శకుడు బారీ జెంకిన్స్ లయన్ కింగ్ ప్రీక్వెల్‌ను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ముఫాసా ఎదగడానికి చేసిన ప్రయాణాన్ని ఈ చిత్రంలో చూపించనున్నారు. 1994లో వచ్చిన ది లయన్ కింగ్ యానిమేటెడ్ క్లాసిక్ ఆధారంగా రూపొందిస్తున్నారు. కాగా.. ముఫాసా: ది లయన్ కింగ్ డిసెంబర్ 20న థియేటర్లలోకి రానుంది. A new dimension to the character we know and love! Extremely excited to be the voice of Mufasa in Telugu and having been a massive fan of the classic, this is a special one for me! Long live the king ♥️@DisneyStudiosIN pic.twitter.com/9LdAX6qexT— Mahesh Babu (@urstrulyMahesh) August 26, 2024 -
లవ్‌బర్డ్స్ కొత్త ప్రయాణం: సిగ్గులమొగ్గైన కొత్త పెళ్లికూతురు అమీ
నటి, మోడల్ అమీ జాక్సన్ ఎట్టకేలకు తన ప్రియుడిని పెళ్లాడింది. తాజాగా (ఆగస్ట్ 25, 2024న), నటుడు మ్యూజీషియన్ ఎడ్వర్డ్ వెస్ట్ విక్‌ను వివాహం చేసుకుంది. ఈ విషయాన్ని స్వయంగా ఈ లవ్‌బర్డ్స్ స్వయంగా సోషల్ మీడియా ద్వారా ప్రకటించారు. సరికొత్త ప్రయాణం మొదలైంది అంటూ తమ సంతోషాన్ని వెల్లడించారు. ఇటలీలో జరిగిన ఈ వివాహ వేడుకలో ఎడ్ వెస్ట్విక్ అమీని ఎత్తుకొని ముద్దుపెట్టుకోవడంతో అమీ జాక్సన్ సిగ్గుల మొగ్గయింది. ఈ ఫోటోలు ఇంటర్నెట్లో సందడి చేస్తున్నాయి.అంతకుముందు బ్రిటిస్ వ్యాపారవేత్త ఆండ్రియాస్ పనాయోటౌతో కొన్నిరోజులు సహజీవనం చేసింది. ఈ క్రమంలోనే వీరికి ఒక మగబిడ్డకూడా పుట్టాడు.కానీ ఆ తరువాత విభేదాల కారణంగా ఇద్దరూ విడిపోయారు. పనాయోటౌతో తన బంధం ముగిసినట్లు స్వయంగా అమీ జాక్సన్ 2021లో ప్రకటించిన సంగతి తెలిసిందే. View this post on Instagram A post shared by Ed Westwick (@edwestwick) -
టారోట్ మూవీ.. ధైర్యవంతులు మాత్రమే చూడండి!
ఓటీటీలో ‘ఇది చూడొచ్చు’ అనే ప్రాజెక్ట్స్ చాలా ఉంటాయి. ప్రస్తుతం స్ట్రీమింగ్ అవుతున్న వాటిలో హాలీవుడ్ చిత్రం ‘టారో’ ఒకటి. ఈ చిత్రం గురించి తెలుసుకుందాం.బ్లాక్ అండ్ వైట్ నుంచి డిజిటల్ కలర్ కాలం వరకు ప్రపంచ సినిమా చరిత్రలో ఆల్ టైమ్ ఫేవరెట్ ఎలిమెంట్ ఏదైనా ఉంది అంటే అదే ‘దెయ్యం’. ఓ మనిషి భయానికి కారణం తన కన్నా బలవంతుడు ఎదురు పడినపుడు లేదా ప్రాణం లేని ఆత్మ కనపడినపుడు... నాటి నుంచి నేటి సినిమా దర్శకుల వరకు తమ సినిమాల్లో దెయ్యాన్ని వాడుకోవడంలో ఒక్కొక్కరిది ఒక్కో శైలి. ఆ కోవలే రిలీజైన హాలీవుడ్ మూవీనే ‘టారో’. కథఈ సినిమాకి ఇద్దరు దర్శకులు స్పెన్సర్ కొహెన్–అన్నాహెల్ బర్గ్. కథాంశానికొస్తే... కాలేజ్ స్నేహితులైన ఓ గ్రూప్ హాలిడే ట్రిప్కని ఓ మారుమూల ఇంటికి వెళ్తారు. అక్కడ వాళ్ళకు అనుకోకుండా ఓ బాక్స్... అందులో కొన్ని టారో కార్డ్స్ కనబడతాయి. ఇక్కడ టారో కార్డ్స్ అంటే చూడటానికి పేకముక్కల్లా ఉండి, ఇంకా చెప్పాలంటే మన చిలక జోస్యంలో చిలక తీసేలాంటివన్నమాట. ఆ టారో కార్డ్స్‌తో ఓ అమ్మాయి... గ్రూప్‌లో మిగతా అందరికీ వాళ్ళ వాళ్ళ భవిష్యత్తు చెప్తుంది.ఎలా ఉందంటే?ట్విస్ట్ ఏంటంటే ప్రతి ఒక్కరి భవిష్యత్తు చెప్తూ వాళ్ళ మరణం ఎలా ఉంటుందో చెప్తుంది. ఇంకా చెప్పాలంటే అలా ఆ కార్డ్స్‌లో ఉన్న దెయ్యం ఆ అమ్మాయి చేత అలా చెప్పిస్తుంది. ఆ తరువాత వాళ్లు ఆ కార్డ్స్ వల్ల ఎటువంటి ప్రమాదాలు ఎదుర్కొన్నారు? చివరకు ఆ దెయ్యాన్ని ఏం చేశారన్నదే ‘టారో’ సినిమా. గొప్ప విషయం ఏమిటంటే ఈ హారర్ హాలీవుడ్ సినిమాలో తెలుగమ్మాయి అవంతిక నటించడం. హారర్ జోనర్ ఇష్టపడేవాళ్ళకి ‘టారో’ మంచి ఛాయిస్... ఒక్క భయపడేవాళ్ళకు తప్ప. నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమ్ అవుతోంది. గో వాచ్ ఇట్. – ఇంటూరు హరికృష్ణ -
ఒక యువతిని కాపాడేందుకు ఇద్దరు హీరోల పోరాటమే 'బాడ్‌ల్యాండ్ హంటర్స్' రివ్యూ
స్టార్ హీరో డాన్ లీ.. హాలీవుడ్ సినిమా లవర్స్‌కు అభిమాన నటుడు. సౌత్ కొరియన్ సినిమాలతో ప్రపంచవ్యాప్తంగా ఆడియెన్స్‌కు దగ్గరయ్యాడు. ఆయన నటించిన బాడ్‌ల్యాండ్ హంటర్స్ చిత్రం ఈ ఏడాది ప్రారంభంలో విడుదలైంది. హియో మ్యుంగ్-హేంగ్ దర్శకత్వం వహించాడు. యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కిన ఈ సినిమా జనవరి 26, 2024న నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలైంది.సౌత్ కొరియాలో ఒక భారీ భూకంపంతో కథ ప్రారంభం అవుతుంది. ఒక్కసారిగా భూకంపం రావడంతో అక్కడి ప్రాంతంలోని ప్రజలు తీవ్రమైన కష్టాలను ఎదుర్కొంటారు. అతికష్టం మీద కొందరు ప్రాణాలతో బయటపడినప్పటికీ వారికి సరైన ఆహారం దొరకదు. కనీసం తాగేందుకు నీళ్లు కూడా దొరకవు. ఆకలితో ప్రాణాలను గుప్పెట్లో పెట్టుకుని వారు జీవిస్తుంటారు. సరిగ్గా అదే ప్రాంతంలో నామ్‌సామ్ (డాన్ లీ) జంతువుల్ని వేటాడుతూ జీవిస్తుంటాడు. అతనితో పాటుగా నామ్‌సామ్, చోయ్ జీ వాన్ (లీ జున్ యంగ్) ఉంటారు. వీరిద్దరూ కూడా మంచి స్నేహితులు. భూకంపం వల్ల నామ్‌సామ్ కూతురు చనిపోతుంది. ఆ బాధ నుంచి బయటపడేందుకు హన్ సునా (రోహ్ జియోంగ్) అనే యువతిని తన కూతురిగా భావిస్తుంటాడు. ఇదే క్రమంలో ఆ అమ్మాయిని చోయ్ జీ వాన్ ప్రేమిస్తుంటాడు.అలా వారి జీవితాల్లోకి వెల్ఫేర్ ఆర్గనైజేషన్ పేరుతో కొందరు ఎంట్రీ ఇస్తారు. దీంతో వారి లైఫ్ ప్రమాదంలో పడుతుంది. వారి నమ్మించి హన్ సునా (రోహ్ జియోంగ్) అనే యువతిని తమ వెంట తీసుకెళ్తారు. ఆ సమయంలో ఆమె అమ్మమ్మను క్రూరంగా చంపేస్తారు. యాంగ్ జీ సు (లీ హీ జూన్) అనే డాక్టర్ యుక్త వయసులో ఉన్న అమ్మాయిలపై ప్రమాదకర ప్రయోగాలు చేస్తుంటాడు. మనిషికి మరణం లేకుండా ఉండేందుకు సైన్స్‌కు పదునుపెడుతాడు. ఈ క్రమంలో అనేకమంది యువతులపై ప్రయోగాలు చేస్తూ ఉండలం వల్ల వారందరూ కూడా భయంకరమైన జాంబీలుగా మారిపోతుంటారు.కూతురుగా భావించిన హన్సునా ప్రమాదంలో చిక్కుకుందని తెలుసుకున్న నామ్‌సామ్ కాపాడేందుకు ప్లాన్ వేస్తాడు. తన మిత్రుడు అయిన చోయ్ జీ వాన్‌ను కూడా సాయంగా తీసుకెళ్తాడు. ఆమెను ఆ సైకో డాక్టర్ నుంచి వారిద్దరూ ఎలా కాపాడారు? డాక్టర్‌తో పాటు పనిచేస్తున్న లీ యూన్ హో ఎలా సాయపడింది? ఆమె వారికి ఎందుకు సాయం చేసింది..? డాక్టర్‌గా మంచి పేరున్న యాంగ్ జీ సు ఇదంతా ఎవరిని కాపాడేందుకు చేస్తున్నాడు..? ఆ డాక్టర్ బారి నుంచి హన్ సునా ప్రాణాలతో బయటపడిందా..? ఇవన్నీ ప్రశ్నలకు సమాధానం తెలియాలంటే నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతున్న బ్యాడ్‌లాండ్ హంటర్ మూవీ చూడాల్సిందే.బ్యాడ్‌లాండ్ హంటర్స్ సినిమా అంతా కూడా భూకంపంతో శిథిలమైన నగరం చూట్టే సాగుతుంది. వాస్తంగా దానిని సెట్ వేసి ప్రేక్షకులకు చూపించారు. అయినా చాలా రియలిస్టిక్‌గా సినిమాను డైరెక్టర్ మలిచాడు. ఎక్కువగా ఈ సినిమాలోని యాక్షన్ సీక్వెన్స్‌లు ప్రేక్షకులను భారీగా మెప్పిస్తాయి.డైరెక్టర్ హియో మయాంగ్ స్టంట్ కొరియోగ్రాఫర్ కావడంతో ఈ సినిమా యాక్షన్ ఎపిసోడ్స్ అదిరిపోయాయి. మార్షల్ ఆర్ట్స్ బ్యాక్‌డ్రాప్‌లో వచ్చే ఎపిసోడ్స్ ఆకట్టుకుంటాయి. క్లైమాక్స్ అయితే ప్రేక్షకుల అంచనాలకు మించి పీక్స్‌లో ఉంటుంది. నామ్ సామ్ పాత్రలో డాన్ లీ అదరగొట్టాడు. కేవలం ఆయన చేస్తున్న స్టంట్స్ కోసం సినిమా చూడొచ్చు. ఇదే సమయంలో లీహీజూన్ విలనిజం కూడా అంతే బలంగా ఉంటుంది. ఇందులో లవ్‌స్టోరీతో పాటు యాక్షన్, సస్పెన్స్ థ్రిల్లర్ అంశాలు ఎవరినీ నిరుత్సాహపరచవని చెప్పవచ్చు. ఒక సైకో డాక్టర్ నుంచి ఒక అమ్మాయిని ఇద్దరు ఎలా కాపాడారు అనేది ఈ సినిమా కథ. -
అక్కడ షారూఖ్ ఖాన్.. ఇక్కడ మహేశ్ బాబు?
సూపర్‌స్టార్ మహేశ్ బాబు.. ప్రస్తుతం రాజమౌళి సినిమా కోసం ప్రిపేర్ అవుతున్నాడు. పొగడాటి జుత్తు, ఒత్తయిన గడ్డంతో ఈ మధ్యే ఎయిర్‌పోర్ట్‌లో కనిపించాడు. ప్రీ ప్రొడక్షన్ జరుగుతోంది. షూటింగ్ వచ్చే ఏడాది నుంచి ఉండొచ్చు. ఇక రాజమౌళితో మూవీ అంటే ఏ హీరో అయినా సరే ఇది పూర్తయ్యేంత వరకు వేరే ప్రాజెక్ట్ ఏం చేయడానికి వీలు పడదు. కానీ మహేశ్ మాత్రం మరో క్రేజీ చిత్రంలో భాగం కానున్నాడని తెలుస్తోంది.2019లో హాలీవుడ్లో రిలీజైన 'ద లయన్ కింగ్'.. ప్రపంచవ్యాప్తంగా యాక్షన్ సినిమాలకు మించి వసూళ్లు సాధించింది. ఇప్పుడే ఈ సిరీస్‌లోని మరో మూవీ 'ముఫాసా'. ఈ ఏడాది డిసెంబరు 20న ఇంగ్లీష్‌తో పాటు తెలుగు, తమిళ, హిందీ లాంటి బోలెడన్ని భాషల్లో రిలీజ్ కానుంది.(ఇదీ చదవండి: పొరపాటు తెలుసుకున్న 'మిస్టర్ బచ్చన్'.. నిడివి తగ్గించి)ఈ మూవీ కోసం చిత్ర నిర్మాతలు పెద్ద ప్లానే వేస్తున్నారు. ఇప్పటికే ప్రధాన పాత్ర ముఫాసాకు బాలీవుడ్లో షారూఖ్ ఖాన్‌తో డబ్బింగ్ చెప్పించారు. ఇతడి కొడుకులు ఆర్యన్, అబ్రామ్తోనూ సింబా, బుల్లి ముఫాసా పాత్రలకు డబ్బింగ్ చెప్పించారు. ఇప్పుడు తెలుగులో మహేశ్‌తో ముఫాసా పాత్రకు డబ్బింగ్ చెప్పించాలనుకుంటున్నారట.ఒకవేళ ఇదే నిజమైతే మాత్రం తెలుగులో 'ముఫాసా'కి క్రేజ్ ఏర్పడచ్చు. అలానే తెరపై కనిపించనప్పటికీ ఓ కొత్త సినిమాతో ప్రేక్షకుల్ని మహేశ్ పలకరించే అవకాశముంటుంది. ఈ డబ్బింగ్ చెప్పేందుకుగానూ మంచి మొత్తమే ఆఫర్ చేశారట.(ఇదీ చదవండి: జాతీయ ఉత్తమ చిత్రంగా 'ఆట్టమ్'.. ఏంటి దీని స్పెషాలిటీ?) -
హాలీవుడ్ సినిమాకు షారూఖ్ ఫ్యామిలీ మాట సాయం
హాలీవుడ్లో అప్పుడప్పుడు కార్టూన్ సినిమాలు వస్తుంటాయి. ఇందులో పాత్రలకు ఏ భాషకు ఆ భాషలో ఫేమస్ నటీనటులు డబ్బింగ్ చెబుతుంటారు. గతంలో రానా, మహేశ్ కూతురు సితార.. ఇలా తమ గాత్రాన్ని అందించారు. ఇప్పుడు ఓ హాలీవుడ్ మూవీ కోసం బాలీవుడ్ స్టార్ హీరో షారూఖ్ ఖాన్ తన కొడుకులతో కలిసి మాట సాయం చేశాడు.(ఇదీ చదవండి: ఇది నిజంగా వింతే.. సినిమా కోసం కుక్కతో డబ్బింగ్!)అడవి బ్యాక్ డ్రాప్ కథతో తీసిన 'ద లయన్ కింగ్' సినిమా చాన్నాళ్ల క్రితమే వచ్చింది. ఇందులోనే ముఫాసా అనే పాత్ర కాస్త ఫేమస్. ఇప్పుడు దీన్ని మెయిన్ లీడ్‌గా తీసుకుని ముఫాసా చిన్నప్పుడు ఏం జరిగింది? ఎలా రాజుగా ఎదిగింది అనే స్టోరీతో ఓ మూవీ తీశారు. ఈ ఏడాది డిసెంబరు 20న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేయబోతున్నారు.రీసెంట్గా 'ముఫాసా' ట్రైలర్ రిలీజ్ చేయగా.. బాగానే రెస్పాన్స్ వచ్చింది. తాజాగా హిందీ ట్రైలర్ రిలీజ్ చేశారు. ఇందులో పెద్ద ముఫాసా పాత్రకు షారూఖ్, చిన్నప్పటి ముఫాసా పాత్రకు షారూఖ్ చిన్న కొడుకు అబ్రామ్, సింబా పాత్రకు ఆర్యన్ ఖాన్ డబ్బింగ్ చెప్పడం విశేషం. దీని వల్ల హిందీ మార్కెట్లో వసూళ్లు బాగానే వచ్చే అవకాశాలు ఉన్నాయి.(ఇదీ చదవండి: సూర్య 'కంగువ' ట్రైలర్ రిలీజ్.. ఎలా ఉందంటే?) -
వానరాలు నటించిన అచ్చ తెలుగు కథ
ఓటీటీలో ‘ఇది చూడొచ్చు’ అనే ప్రాజెక్ట్స్ చాలా ఉంటాయి. ప్రస్తుతం స్ట్రీమింగ్ అవుతున్న వాటిలో హాలీవుడ్ చిత్రం ‘కింగ్డమ్ ఆఫ్ ది ప్లానెట్ ఆఫ్ ది ఏప్స్’ ఒకటి. ఈ చిత్రం గురించి తెలుసుకుందాం.భాష ఏదైనా భావం ముఖ్యమన్న నానుడి ‘కింగ్డమ్ ఆఫ్ ది ప్లానెట్ ఆఫ్ ది ఏప్స్’ సినిమాకి సరిగ్గా సరిపోతుంది. ఒకటి రెండు పాత్రల మినహా పూర్తిగా చింపాంజీలు నటించిన సినిమా ఇది. ఈ సినిమాకి వెస్ బాల్ దర్శకుడు. ‘కింగ్డమ్ ఆఫ్ ది ప్లానెట్ ఆఫ్ ది ఏప్స్’ సినిమా మునుపటి ఏప్స్ సిరీస్‌కు కొనసాగింపుగా తీసింది. సీజర్ అనే ప్రధాన పాత్రధారి తదనంతరం జరిగే కథ ఇది. సీజర్కు వారసుడిగా ప్రకటించుకుని తనకు తానుప్రాక్సిమస్ సీజర్గా ప్రకటించుకుంటాడు ఓ నాయకుడు. మోవా, అతని సమూహం పై దాడి చేసి బందీలుగా తన రాజ్యానికి తెచ్చుకుంటాడుప్రాక్సిమస్ సీజర్. తన రాజ్యంలో మనుషులకు సంబంధించిన ఓ బంకర్‌ను మందీ మార్బలంతో తెరవడానికి ప్రయత్నిస్తుంటాడు. ఈ ప్రయత్నంలో బంకర్‌కు సంబంధించిన ఓ మనిషితో కలిసిప్రాక్సిమస్ రాజ్యంలోకి ప్రవేశిస్తాడు మోవా. తరువాత కొన్ని ట్విస్టులతోప్రాక్సిమస్ సీజర్‌ను మోవా ఎలా అంతమొందించాడు అన్నది హాట్ స్టార్ ఓటీటీ వేదిక మీద చూడాలి. కథ పరంగా చూస్తే మనకు పాత తెలుగు సినిమా కథ వాసనలు రావచ్చు. టెక్నాలజీని ఉపయోగించి టాలీవుడ్ నుండి హాలీవుడ్ దాకా ఈగ నుండి డైనాసరస్ వరకు అన్ని జంతువులను మన కథకు తగ్గట్టుగా మలుచుకుంటున్నారు నేటి దర్శకులు. కాకపోతే ఇక్కడ ఇంకో విషయం చెప్పుకోవాలి. ఇంతటి సాంకేతికత అందుబాటులోకి రాని 80వ దశకంలోనే ‘మాకు స్వాతంత్య్రం కావాలి’ అన్న పేరుతో తెలుగులో ఓ సినిమా వచ్చింది. అప్పట్లో పూర్తిగా జంతువుల మీద తీసిన సినిమా అది. నాటి ప్రేక్షకులకు అదో వింత, నేటి ప్రేక్షకులకు ‘కింగ్డమ్ ఆఫ్ ది ప్లానెట్ ఆఫ్ ది ఏప్స్’ సినిమా అనేది ఓ పెద్ద వండర్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే జంతువులలో కూడా మనిషి భావాలు స్పష్టంగా చూపించడం, అలాగే అద్భుతమైన టేకింగ్ విత్ విజువల్ ఫీస్ట్ స్క్రీన్ల్పేతో ‘కింగ్డమ్ ఆఫ్ ది ప్లానెట్ ఆఫ్ ది ఏప్స్’ సినిమా వర్త్ టూ వాచ్. – ఇంటూరు హరికృష్ణ -
అవతార్ 3 టైటిల్ రివీల్..
-
100 'కేజీఎఫ్'లు కలిపి తీస్తే ఈ సినిమా.. ఓటీటీలోనే బెస్ట్ యాక్షన్ మూవీ
కొన్ని సినిమాలు క్లాసిక్స్. వీటిని మ్యాచ్ చేయడం సంగతి అటుంచితే.. ఇలాంటివి మళ్లీ తీయడం ఎవరి వల్ల కాదు. ఇప్పుడంటే మన ప్రేక్షకులు 'బాహుబలి', 'కేజీఎఫ్' అని మురిసిపోతున్నారు. కానీ వీటికి బాబులాంటి మూవీ హాలీవుడ్లో దాదాపు 20 ఏళ్ల క్రితమే వచ్చింది. అదే 'అపోకలిప్టో' (2006). శతాబ్దాల క్రితం కథతో మొత్తం అడవిలో తీసిన ఈ సినిమా చూస్తుంటే ఒక్కో సీన్ దెబ్బకు మన మైండ్ బ్లాస్ట్ అయిపోవడం గ్యారంటీ. అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అవుతున్న ఈ మూవీ ఎలా ఉందనేది ఇప్పుడు రివ్యూలో చూద్దాం!కథేంటి?ఉత్తర అమెరికాలోని మెసో అమెరికన్ అడవులు. మాయన్ తెగకు చెందిన జాగ్వర్ పా.. ఓ రోజు వేటకు వెళ్తాడు. దొరికిన మాంసంతో రాత్రి విందు చేసుకుని కుటుంబ సభ్యులు, స్నేహితులతో కలిసి వేడుక చేసుకుంటాడు. మరుసటి రోజు ఉదయం వీళ్లపై వేరే తెగకు చెందిన కొందరు దాడి చేస్తారు. ముందే పసిగట్టిన జాగ్వర్ పా.. తన భార్య, కొడుకుల్ని ఓ బావిలో సురక్షితంగా దాచేస్తాడు. దాడి చేసిన వాళ్లు కొందరిని అతి కృూరంగా చంపేసి జాగ్వర్ పాతో పాటు మిగిలిన ఆడవాళ్లు-మగవాళ్లని బానిసలుగా చేసుకుని తమ రాజ్యంలో బలిచ్చేందుకు తీసుకెళ్తారు. ఇంతకీ జాగ్వర్ పా ఫ్యామిలీ, ఫ్రెండ్స్‌పై దాడి చేసిందెవరు? చివరకు పా తన భార్య-కొడుకుని కలుసుకున్నాడా? అనేదే స్టోరీ.ఎలా ఉందంటే?ఉత్తర అమెరికాలో శతాబ్దాల క్రితం అంతరించిపోయిన మాయన్ నాగరికత ఆధారంగా 'అపోకలిప్టో' సినిమా తీశారు. ఇప్పటివరకు వచ్చిన యాక్షన్ మూవీస్‌లో ఇది బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ మూవీ. ఎందుకంటే ఎప్పుడో అంతరించిపోయిన మాయన్ తెగ, నాగరికతని స్టోరీగా ఎంచుకోవడమే పెద్ద సాహసం అనుకుంటే.. అసాధారణ రీతిలో తెరపై చూపించిన విధానం అయితే నెక్స్ట్ లెవల్ ఉంటుంది. పేరుకే హాలీవుడ్ సినిమా గానీ ఒక్క ఇంగ్లీష్ పదం కూడా వినిపించదు. పాత్రలన్నీ మాయన్ భాషలోనే మాట్లాడుతుంటాయి.ప్రధాన పాత్రల భాష, గెటప్, ఆహారపు అలవాట్లు, నిర్మాణాలు, సంస్కృతి.. ఇలా ప్రతి విషయాన్ని ఎంతో డీటైల్డ్‌గా పరిశీలించి ఈ సినిమాలో చూపించారు. సినిమా మొదలైన కాసేపటికే ప్రధాన కథానాయకుడు జాగ్వర్ పా ఉంటున్న చోటపై మరో తెగ దాడి చేయడంతో అసలు కథలోకి దర్శకుడు తీసుకెళ్లిపోయాడు. అక్కడి నుంచి ఒక్కో సీన్ అద్భుతం అనేలా ఉంటుంది. ఇక సెకండాఫ్‌లో హీరో.. విలన్ చోటు నుంచి తప్పించుకుని పరుగెడతాడు. అతడు ఎంత స్పీడుగా రన్నింగ్ చేస్తాడో.. సినిమా కూడా అంతకంటే స్పీడుగా వెళ్తుంది. చూస్తున్న మనకు కూడా ఊపిరి ఆగిపోతుందేమో అనేలా సీన్లు ఉంటాయి.దర్శకుడు మెల్ గిబ్సన్ తన మాయాజాలంతో తీసిన 'అపోకలిప్టో'.. ఇప్పటి జనరేషన్ డైరెక్టర్లకు ఓ టెక్స్ట్ బుక్ లాంటిది అని చెప్పొచ్చు. మన దగ్గర వస్తున్న 'బాహుబలి', 'కేజీఎఫ్' సినిమాలు.. దీని దరిదాపుల్లోకి కూడా రావు. ఇంతలా హైప్ ఇస్తున్నానంటే మూవీ ఎలా ఉంటుందే మీకే అర్థమైపోతుంది. అప్పటి కథ కాబట్టి మహిళా పాత్రల శరీరం కాస్త కనిపిస్తుంటుంది. కాబట్టి కుదిరితే ఒంటరిగానే చూడండి. ఓటీటీలోనే ఏదైనా మంచి యాక్షన్ మూవీ చూద్దామనుకుంటే ఇది బెస్ట్ ఆప్షన్.-చందు డొంకాన, సాక్షి వెబ్ డెస్క్ -
అవతార్ త్రీకి టైటిల్ ఫిక్స్
పండోరా ప్రపంచంలోకి మళ్లీ వెళ్లడానికి సిద్ధంగా ఉండండి అంటున్నారు దర్శకుడు జేమ్స్ కామెరూన్. ఆయన దర్శకత్వంలో వచ్చిన ‘అవతార్’ ఫ్రాంచైజీ సినిమాలకు ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. ‘అవతార్’ ఫ్రాంచైజీ నుంచి ఇప్పటికే ‘అవతార్’, ‘అవతార్: ది వే ఆఫ్ వాటర్’ సినిమాలు వచ్చాయి. తాజాగా ‘అవతార్’ ఫ్రాంచైజీలోని మూడో సినిమాకు ‘అవతార్:ఫైర్ అండ్ యాష్’ అనే టైటిల్‌ను ఖరారు చేసినట్లు, ఈ సినిమాను 2025 డిసెంబరు 19న రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. సామ్ వర్తింగ్టన్, జో సల్దాన, కేట్ విన్స్లెట్ తదితరులు ‘అవతార్: ఫైర్ అండ్ యాష్’ సినిమాలో లీడ్ రోల్స్‌లో నటిస్తున్నారు. ఇక పండోరా అనే కల్పిత గ్రహం నేపథ్యంలో ‘అవతార్’ ఫ్రాంచైజీ చిత్రాలు వస్తున్న సంగతి తెలిసిందే. -
ఒక అనాథ రాజు ఎలా అయ్యాడు?.. ఆ క్రేజీ మూవీ ట్రైలర్ వచ్చేసింది!
చిన్నపిల్లలు ఎంతో ఇష్టపడే చిత్రాల్లో ది లయన్ కింగ్ ఒకటి. ఈ సిరీస్‌లో వచ్చిన హాలీవుడ్ చిత్రాలకు విపరీతమైన క్రేజ్ ఉంది. ఇందులో ముఫాసాను కుట్రలతో అతని తమ్ముడు స్కార్ అంతమొందిస్తాడు. ఆ తర్వాత ముఫాసా తనయుడు సింబా.. తన బాబాయ్ అయిన స్కార్ను రాజ్యం నుంచి తరిమేస్తాడు. అలా మళ్లీ ముఫాసా వారసుడిగా సింబా మళ్లీ అడవికి కింగ్ అవుతాడు. తాజాగా ఈ మూవీకి ప్రీక్వెల్‌గా ముఫాసా ది లయన్ కింగ్ తీసుకొస్తున్నారు.ఆరోన్ స్టోన్, కెల్విన్ హ్యారిసన్ జూనియర్, టిఫానీ బూనే, కగిసో లేడిగా, ప్రెస్టన్ నైమన్ కీలక పాత్రల్లో నటిస్తోన్న చిత్రం ముఫాసా: ది లయన్ కింగ్. ఈ ప్రీక్వెల్‌కు బేరీ జెంకిన్స్ దర్శకత్వం వహిస్తున్నారు. ఓ అనాథగా ఉన్న ముఫాసా అడవికి రాజు ఎలా అయ్యాడు అనేది ఈ సినిమాలో చూపించనున్నారు. ఈ ఏడాదిలో క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 20న ముఫాసా: ది లయన్ కింగ్ ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. తాజాగా ఈ సినిమా ట్రైలర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఎలా ఉందో మీరు చూసేయండి. -
'అవతార్ 3' క్రేజీ అప్డేట్.. టైటిల్‌తో పాటు రిలీజ్ డేట్ ప్రకటన
90స్ జనరేషన్ పిల్లల్ని అవాక్కయ్యేలా చేసిన హాలీవుడ్ సినిమా 'అవతార్'. అప్పుడెప్పుడో 2009లో తొలి భాగం రిలీజ్ కాగా.. మళ్లీ 2022లో సీక్వెల్ రిలీజ్ చేశారు. మొత్తంగా వీటిని ఐదు భాగాలుగా తెరకెక్కిస్తున్నట్లు చాన్నాళ్ల క్రితమే ప్రకటించారు. ఇప్పుడు మూడో పార్ట్ పేరుతో పాటు విడుదల తేదీని తాజాగా అధికారికంగా ప్రకటించారు.(ఇదీ చదవండి: నిన్న ఎంగేజ్మెంట్.. ఇప్పుడు పెళ్లిలో కనిపించిన నాగచైతన్య)దిగ్గద దర్శకుడు జేమ్స్ కామెరూన్ తీసిన 'అవతార్' తొలి భాగం అప్పట్లో వసూళ్లలో ప్రపంచ రికార్డులు సృష్టించింది. దీన్ని పండోరా గ్రహంలో భూమిపై తీయగా.. 'అవతార్: ద వే ఆఫ్ వాటర్' అనే పేరుతో వచ్చిన రెండో భాగాన్ని పూర్తిగా నీటిలో తీశారు. ఇప్పుడు మూడో భాగానికి 'అవతార్: ఫైర్ అండ్ యాష్' అనే టైటిల్ నిర్ణయించారు. పంచ భూతాల్లో మూడోది అయిన అగ్ని కాన్సెప్ట్ బేస్ చేసుకుని దీన్ని తీస్తారని క్లారిటీ వచ్చేసింది.'అవతార్ 3' సినిమాని 2025 డిసెంబరు 19న థియేటర్లలో రిలీజ్ చేస్తామని తాజాగా ప్రకటించారు. అంటే మరో ఏడాది టైమ్ ఉంది. ఇది కాకుండా మరో రెండు పార్ట్స్ కూడా ఉన్నాయి. వీటిని 2027, 29లో విడుదల చేయనున్నట్లు ఇదివరకే అనౌన్స్ చేశారు. కాకపోతే వాటి పేర్లు, రిలీజ్ డేట్స్ ఇంకా ప్రకటించాల్సి ఉంది.(ఇదీ చదవండి: తమిళ స్టార్ హీరో సూర్యకు గాయం) View this post on Instagram A post shared by Avatar (@avatar) -
మరో హాలీవుడ్ అవకాశం?
హాలీవుడ్ మూవీ ‘అవెంజర్స్’ సిరీస్‌లో తమిళ నటుడు ధనుష్ భాగమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. మార్వెల్ ఫ్రాంచైజీలోని ‘అవెంజర్స్’ సిరీస్‌లో తర్వాతి చిత్రాలుగా ‘అవెంజర్స్: డూమ్స్ డే, అవెంజర్స్: సీక్రెట్ వార్’ రానున్నాయని, ‘అవెంజర్స్: ఎండ్ గేమ్’ చిత్రానికి దర్శకత్వం వహించిన రూసో బ్రదర్స్ (ఆంథోనీ రూసో, జోసెఫ్ రూసో) ఈ చిత్రాలను తెరకెక్కించనున్నారని మార్వెల్ సంస్థ ప్రకటించింది.‘అవెంజర్స్: డూమ్స్ డే’లో రాబర్ట్ డౌనీ జూనియర్ ఓ లీడ్ రోల్లో నటించనున్నారు. మరో లీడ్ రోల్లో ధనుష్ నటించనున్నారనే టాక్ వినిపిస్తోంది. రూసో బ్రదర్స్ దర్శకత్వం వహించిన హాలీవుడ్ మూవీ ‘ది గ్రే మ్యాన్’లో ధనుష్ ఓ లీడ్ రోల్ చేశారు. మరి... ‘అవెంజర్స్: డూమ్స్ డే’లోనూ ఈ ఇండియన్ హీరో నటిస్తారా? వేచి చూడాలి. -
ఈ వారం ఓటీటీలో 21 సినిమాలు/ సిరీస్‌లు రిలీజ్
ఆగస్టులో భారీ సినిమాలు రిలీజవుతున్నాయి. అందుకింకా వారం ఉంది. ఈ రెండో వారంలో చిన్నాచితకా చిత్రాలతో పాటు డబ్బింగ్ సినిమాలు ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. అటు ఓటీటీలోనూ కామెడీ, యాక్షన్, సస్పెన్స్ థ్రిల్లర్ చిత్రాలు, వెబ్ సిరీస్‌లు అందుబాటులోకి రానున్నాయి. మరి ఆగస్టు 2వ వారంలో అటు థియేటర్లలో, ఇటు ఓటీటీలో సందడి చేసే సినిమాలేంటో చూసేద్దాం..థియేటర్లో రిలీజయ్యే మూవీస్..🎬 కమిటీ కుర్రోళ్లు - ఆగస్టు 9🎬 సింబా - ఆగస్టు 9🎬 భవనమ్ - ఆగస్టు 9🎬 తుఫాన్ - ఆగస్టు 9ఓటీటీ రిలీజెస్..నెట్ఫ్లిక్స్ద అంబ్రెల్లా అకాడమీ సీజన్ 4 - ఆగస్టు 8భారతీయుడు 2 (సినిమా) - ఆగస్టు 9ఫిర్ ఆయి హసీన్ దిల్రుబా (సినిమా) - ఆగస్టు 9కింగ్స్‌మెన్ గోల్డెన్ సర్కిల్ (ఇంగ్లీష్) ఆగస్టు 9మిషన్ క్రాస్ (కొరియన్ సినిమా) - ఆగస్టు 9ఇన్సైడ్ ది మైండ్ ఆఫ్ ది డాగ్ (ఇంగ్లీష్) ఆగస్టు 9రొమాన్స్ ఇన్ ది హైస్ (కొరియన్) ఆగస్టు 1జియో సినిమామేఘ బర్సేంగే (వెబ్ సిరీస్) - ఆగస్టు 6గుడ్చడి (సినిమా) - ఆగస్టు 9జీ5భీమా: అధికార్ సే అధికార్ తక్ (హిందీ) ఆగస్టు 5అమర్ సంగి (సీరియల్) - ఆగస్టు 5గ్యారా గ్యారా (వెబ్ సిరీస్) - ఆగస్టు 9హాట్స్టార్ఆర్ యు షోర్ (ట్రావెల్ సిరీస్) - ఆగస్టు 8లైఫ్ హిల్ గయి (వెబ్ సిరీస్) - ఆగస్టు 9ఖాటిల్ కౌన్? (వెబ్ సిరీస్) - ఆగస్టు 9ది జోన్: సర్వైవల్ మిషన్, మూడో సీజన్ (రియాలిటీ షో) ఆగస్టు 7ఆర్ యూ ష్యూర్ (కొరియన్) ఆగస్టు 8సోనీలివ్టర్బో (సినిమా) - ఆగస్టు 9 చదవండి: ఉత్తమ నటుడిగా ఫిలింఫేర్ అవార్డ్.. అయినా సంతోషం లేదట! -
తెరపైకి బ్రిట్నీ జీవితం
ప్రముఖ అమెరికన్ పాప్ స్టార్ బ్రిట్నీ స్పియర్స్ జీవితం వెండితెరపైకి రానుంది. తన జీవితం ఆధారంగా బ్రిట్నీ స్పియర్స్ ‘ది ఉమెన్ ఇన్ మీ’ (మెమొర్) అనే పుస్తకం రాశారు. ఇందులో బ్రిట్నీ ప్రేమ విశేషాలు, చేదు అనుభవాలు, కుటుంబ విశేషాలు.. ఇలా చాలా అంశాలు ఉన్నాయట. ఇరవైఆరు భాషల్లో రిలీజ్ అయిన ఈ పుస్తకానికి ప్రపంచవ్యాప్తంగా ఆదరణ దక్కింది. అంతేకాదు.. ఈ పుస్తకం ఆడియో వెర్షన్‌కు ప్రముఖ హాలీవుడ్ నటి మిచెల్ విలియమ్స్ వాయిస్ ఇచ్చారు. ఈ బుక్ హక్కులను యూనివర్సల్ పిక్చర్స్ దక్కించుకుంది. దీంతో బ్రిట్నీ బయోపిక్ ప్రస్తుతం హాలీవుడ్లో హాట్‌టాపిక్‌గా మారింది. దర్శకుడు జోన్ ఎమ్ చు ఈ బయోపిక్‌ను తెరకెక్కించనున్నారని, మార్క్ ప్లాట్ నిర్మించనున్నారని టాక్. ఇక ‘నా ఫేవరెట్ మూవీస్ తీసిన మార్క్ ప్లాట్‌తో ఓ సీక్రెట్ ్రపాజెక్ట్ చేస్తున్నానని నా ఫ్యాన్స్‌కు చెప్పడానికి హ్యాపీగా ఉంది’ అని ‘ఎక్స్’లో పేర్కొన్నారు బ్రిట్నీ. -
'డెడ్‌పుల్ అండ్ వాల్వరిన్' సినిమాకు భారీ కలెక్షన్స్
హాలీవుడ్ సూపర్ హీరో సినిమా 'డెడ్‌పుల్ అండ్ వాల్వరిన్' బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్లతో దుమ్మురేపుతుంది. కేవలం మూడు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ. 3650 కోట్ల వసూళ్లను రాబట్టి రికార్డ్ క్రియేట్ చేసిన చిత్రంగా నిలిచింది. భారత్‌లో కూడా ఇప్పటి వరకు రూ. 65 కోట్లకు పైగానే కలెక్షన్స్ రాబట్టింది. అయితే ఈ సినిమా నిర్మాణం కోసం రూ. 1675 కోట్లు ఖర్చు చేసినట్లు తెలుస్తోంది.డెడ్‌పుల్, డెడ్‌పుల్ 2 సినిమాలకు సీక్వెల్‌గా 'డెడ్‌పుల్ అండ్ వాల్వరిన్' జులై 26న విడుదలైంది. సూపర్ బ్లాక్ బస్టర్ టాక్‌తో విజయవంతంగా తెలుగునాట థియేటర్లలో సందడి చేస్తుంది. మార్వెల్ స్టూడియోస్ వారు నిర్మించిన ఈ సినిమాలో రయన్ రెనాల్డ్స్, హుయ్ జాక్ మెన్ ముఖ్య పాత్రలలో నటించారు. ఈ సినిమా విడుదలైన మూడు రోజుల్లోనే ప్రపంచ మూవీ బాక్స్ ఫీస్‌ని షేక్ చేస్తుంది.దాదాపుగా మూడు రోజుల్లో రూ. 3650 కోట్లు కలెక్ట్ చేసి కాసుల వరద సృష్టించింది. ఇండియాలో కూడా డెడ్ పుల్ అండ్ వాల్విరిన్ కలెక్షన్ల హవా కొనసాగుతుంది. మరీ ముఖ్యంగా తెలుగులో ఈ సినిమాకు మార్వెల్ మూవీ అభిమానుల అదరణ దక్కింది. తెలుగు డబ్బింగ్ వెర్షన్ లో ఉన్న టైమ్లీ డైలాగులు అభిమానుల్ని విశేషంగా ఆకట్టుకున్నాయి. డెడ్ పుల్ పాత్రదారు రయన్ రెనాల్డ్స్ పలికిన ప్రతి సంభాషణకి సంబంధించిన తెలుగు డబ్బింగ్ ఆద్యంతం హాస్యాన్ని పండించింది. దీంతో ఈ సినిమాకు విడుదలైన రోజు నుంచి తెలుగులో విశేషాదరణ లభిస్తుంది. -
'అవెంజర్స్' కొత్త సినిమా.. సూపర్ విలన్‌గా ఐరన్ మ్యాన్ రీఎంట్రీ
మార్వెల్ సినిమాలు చూసేవాళ్లకు ఐరన్ మ్యాన్ గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. ఈ పాత్ర పోషించడం వల్ల రాబర్డ్ డౌనీ జూనియర్ వరల్డ్ వైడ్ అద్భుతమైన క్రేజ్ సొంతం చేసుకున్నాడు. అయితే 'అవెంజర్స్: ఎండ్ గేమ్' సినిమాలో ప్రపంచాన్ని కాపాడుతూ చనిపోయాడు. దీంతో ఆ పాత్రని అభిమానించే ఫ్యాన్స్ చాలా డిసప్పాయింట్ అయ్యారు.(ఇదీ చదవండి: హీరో రవితేజని అన్ ఫాలో చేసిన ఛార్మీ.. ఏమైందంటే?)కానీ ఇప్పుడు ఐరన్ మ్యాన్ సరికొత్త పాత్రతో మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు. ఇన్నాళ్లు సూపర్ హీరోగా సాహసాలు చేసిన రాబర్ట్.. రాబోయే 'అవెంజర్స్ డూమ్స్ డే' చిత్రంలో డాక్టర్ డూమ్ అనే విలన్‌గా కనిపించబోతున్నాడు. 'ఎండ్ గేమ్' మూవీకి దర్శకత్వం వహించిన రూసో బ్రదర్స్... కొత్త ప్రాజెక్టుని తెరకెక్కిస్తున్నారు. తాజాగా మూవీ లాంచ్ జరగ్గా.. 2026 మేలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుందని ప్రకటించారు. ఏదేమైనా ఐరన్ మ్యాన్ రీఎంట్రీ మాత్రం మార్వెల్ ఫ్యాన్స్‌కి ఫుల్ కిక్ ఇస్తోంది.(ఇదీ చదవండి: ఓటీటీలోనే బెస్ట్ కొరియన్ మూవీస్.. ఏ సినిమా ఎక్కడ చూడొచ్చంటే?)"New mask, same task.”Robert Downey Jr. surprises Hall H to announce his return to the MCU as Doctor Doom in Avengers: Doomsday, in theaters May 2026. #SDCC#PVRINOX #Doomsday #robertdowneyjr #MarvelStudios pic.twitter.com/HN0oOIrHm8— INOX Movies (@INOXMovies) July 28, 2024 -
రేపటి కోసం యుద్ధం.. ఉత్కంఠతతో సాగే 'ది టుమారో వార్'
చిత్రం: ది టుమారో వార్విడుదల: జులై 02,2021నటీనటులు: క్రిస్ ప్రాట్, వైవోన్నే స్ట్రాహోవ్స్కీ, సిమన్స్, గిల్పిన్, సామ్ రిచర్డ్సన్, ఎడ్విన్ హాడ్జ్, జాస్మిన్ మాథ్యూస్, ర్యాన్ కీరా ఆర్మ్‌స్ట్రాంగ్, కీత్ పవర్స్ తదితరులుదర్శకుడు : క్రిస్ మెక్కేసంగీతం: లోర్మీ బ్లాఫీసినిమాటోగ్రఫీ: ల్యారీ ఫాంగ్నిర్మాతలు: డేవిడ్ ఎల్లిసన్, డానా గోల్డ్బెర్గ్, డాన్ గ్రాంజెర్, జులెస్ డాలీ, డేవిడ్ ఎస్.గోయర్, ఆడమ్ కోల్బెర్నర్ఓటీటీ భాగస్వామి: అమెజాన్ ప్రైమ్ వీడియో (తెలుగు)స్ట్రీమింగ్ భాషలు: తెలుగు,ఇంగ్లీష్,హిందీ,తమిళ్,కన్నడ,మలయాళంహాలీవుడ్ చిత్రాలను తెలుగు ప్రేక్షకులు భారీగానే ఆదరిస్తారు. అందుకే అవన్నీ తెలుగులో కూడా డబ్ అవుతుంటాయి. సైన్స్ ఫిక్షన్ చిత్రాలతో పాటు యాక్షన్ అడ్వెంచర్ చిత్రాలను టాలీవుడ్ ప్రేక్షకులు ఎక్కువగా ఇష్టపడుతుంటారు. మార్వెల్ చిత్రాలతో పాటు ఏలియన్స్ సబ్జెక్ట్‌తో వచ్చిన సినిమాలు ఎన్నో థియేటర్లలో సందడి చేశాయి. ఈ క్రమంలో తెరకెక్కిన మిలటరీ సైన్స్ ఫిక్షన్ సినిమానే 'ది టుమారో వార్'. 2021 కోవిడ్ సమయంలో డైరెక్ట్‌గా అమెజాన్ ప్రైమ్ వీడియోలో విడుదలైన ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. హలీవుడ్లో తెరకెక్కిన ఈ సినిమా అమెజాన్‌లో తెలుగులో కూడా అందుబాటులో ఉంది. ఈ సినిమా కథేంటో తెలుసుకుందాం. భవిష్యత్ కాలంలో భూమి మీద ఎలాంటి ఇబ్బందులు రావచ్చేనే కాన్సెప్ట్‌తో 'ది టుమారో వార్' కథ ఉంటుంది. గ్రహాంతర వాసులకు.. జీవరాశులకు మధ్య జరిగే భారీ యాక్షన్ వార్‌గా చాలా ఉత్కంఠతో కూడుకొని కథ ఉంటుంది.కథ ఎంటి..?డాన్ ఫారెస్టర్ (క్రిస్ ప్రాట్) మాజీ ఇరాక్ సైనికాధికారి. రిటైర్డ్ అయ్యాక స్కూల్ పిల్లలకు బయాలజీ చెబుతూ తన భార్య (బెట్టీ గ్లిపిన్), కూతురు (రియాన్ కైరా)తో కలిసి జీవితం గడుపుతుంటాడు. ఒకరోజు ఆకాశం నుంచి ఓ ఆర్మీ యూనిట్ ఆయనముందు ప్రత్యక్షమవుతుంది. తామందరం భవిష్యత్ కాలం నుంచి వచ్చామని చెబుతూ ఎలియన్స్‌తో యుద్ధం చేసేందుకు సైన్యం అవసరం ఉందని చెబుతారు. ఆయనొక ఆర్మీ అధికారి కాబట్టి ఎలియన్స్ మీద పోరాటం చేసేందుకు తీసుకెళ్తారు. భవిష్యత్తు యుద్ధం కోసం అతను చేసిన త్యాగం ఏమిటి? ఒక బృందంగా వెళ్లిన డాన్ ఫారెస్టర్ ఏం చేశాడు..? ఏలియన్స్ ఎలా అంతమయ్యాయి..? డాన్ ఫారెస్టర్ కోసమే భవిష్యత్ కాలం నుంచి వారు ఎందుకు వచ్చారు..? ఇవన్నీ తెలియాలంటే అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అవుతున్న 'ది టుమారో వార్' చూడాల్సిందే.ఎలా ఉందంటే..?గ్రహాంతర వాసులకు.. జీవరాశులకు మధ్య జరిగే యుద్ద నేపథ్యంలో వచ్చిన ఈ యాక్షన్ సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ చాలా అంశాల్లో ప్రేక్షకులను మెప్పిస్తుంది. ఏలియన్స్ కాన్సెప్ట్‌తో వచ్చిన ప్రతి సినిమా బాక్సాఫీస్ వద్ద విజయాన్ని అందుకుంది. అన్నీ సినిమాల మాదిరి కాకుండా ది టామారో వార్ సినిమాను చాలా ప్రత్యేకంగా తెరకెక్కించారు. దర్శకుడు ఎంచుకున్న పాయింట్ భిన్నమైనది. ఎలియన్స్‌ను ఎదుర్కొనేందుకు భవిష్యత్ తరం వారు సాయం కోసం వర్తమాన కాలానికి చెందిన వారిని కలవడం అనేది చాలా ఆసక్తి తెప్పించే అంశం. ఈ పాయింట్‌తో సినిమాను తెరకెక్కించిన డైరెక్టర్ క్రిస్ మెకే భారీ విజయం సాధించారు.డాన్ ఫారెస్టర్ ఆర్మీ నుంచి వచ్చిన తర్వాత ఎలా భవిష్యత్ కాలంలో అడుగుపెట్టాడో చూపించిన విధానం బాగుంది. అక్కడ ఎలియన్స్ మీద రీసెర్చ్ చేస్తున్న ఆ యూనిట్లో డాన్ ఫారెస్టర్ ఎలా కీలకం అయ్యాడో చూపించిన తీరు ప్రేక్షకులను మెప్పిస్తుంది. అప్పటికే చాలామంది ఏలియన్స్ మరణించి ఉంటారు. అలాంటి సమయంలో ఎంట్రీ ఇచ్చిన డాన్ ఫారెస్టర్ యూనిట్ మీద ఏలియన్స్ ఎటాక్ చేస్తాయి. చాలా ఉత్కంఠతతో ఆ సీన్స్ ఉంటాయి.ఈ క్రమంలో ఓ ఏలియన్‌ను డాన్ ఫారెస్టర్ యూనిట్ పట్టుకుంటుంది. ఆ సమయంలో ప్రతి ప్రేక్షకుడిని చూపుతిప్పనివ్వకుండా దర్శకుడు చిత్రీకరించాడు. సరిగ్గా ఈ సమయంలోనే మరో ఆర్మీ యూనిట్‌కు నాయకత్వం వహిస్తున్న మ్యూరి ఫారెస్టర్ తన కుమార్తె అని తెలుసుకుని డాన్ ఫారెస్టర్ చాలా సంతోషిస్తాడు. చాలా ఎమెషనల్‌గా కొన్ని సీన్లు వారి మధ్య ఉంటాయి. భవిష్యత్ కాలానికి వెళ్లి తన కుమార్తెను కలుసుకున్న ఒక తండ్రి కాన్సెప్ట్ అందరినీ మెప్పిస్తుంది. ఎలియన్స్‌ను అంతం చేయాలంటే దానితోనే వాటిని చంపాలని డాన్ ఫారెస్టర్ ఒక వ్యూహం వేస్తాడు. వారి చేతికి చిక్కిన ఎలియన్ శరీరం నెంచి టాక్సిన్ను తయారు చేసి దానితోనే వాటిని అంతం చేయాలని స్కెచ్ వేస్తాడు. అయితే, వారి చేతికి చిక్కిన ఏలియన్‌ను కాపాడుకునేందుకు మిగిలిన ఏలియన్స్ చేసిన పోరాటంతో ప్లాన్ ఫెయిల్ అవుతుంది. అలాంటి సమయంలో డాన్ ఫారెస్టర్ వేసిన మరో అద్భుతమైన ప్లాన్ ఎంటి..? అనేది చాలా ఆసక్తిని పెంచుతుంది. యాక్షన్ చిత్రాలను ఆదరించేవారికి ఈ సినిమా మంచి థ్రిల్‌ను తప్పకుండా ఇస్తుంది.ఎవరెలా చేశారంటే..?డాన్ ఫారెస్టర్ పాత్రలో క్రిస్ ప్రాట్ అదరగొట్టేశాడు. ఆయన కూతురి పాత్రలో స్ట్రావోస్కీ కూడా మెప్పించింది. సిమన్స్, సామ్ రిచర్డ్సన్ వారి పాత్రలకు సరైన న్యాయం చేశారు. 'ది టుమారో వార్' చిత్రానికి ప్రధాన బలం విజువల్స్ అని చెప్పవచ్చు. ల్యారీ ఫాంగ్ సినిమాటోగ్రఫీ సినిమాను మరో రేంజ్‌కు చేర్చుతుంది. ఇలాంటి సినిమాలు బిగ్ స్క్రీన్ మీద చూస్తే ఆ మజానే వేరు అనేలా ఉంటుంది. ముఖ్యంగా యాక్షన్ సీన్స్‌లను ఎలివేట్ చేయడానికి అద్భుతమైన విఎఫెక్స్, క్వాలిటీ సీజిఐను ఉపయోగించడంతో ఈ సినిమా విజువల్ వండర్‌గా తెరకెక్కింది. అయితే దర్శకుడు కథ చెప్పే తీరు కాస్త నెమ్మదిగా ఉంటుంది. ముఖ్చంగా తండ్రీ, కూతుళ్ల మధ్య వచ్చే సన్నివేశాలు కాస్త సాగదీతగా అనిపిస్తాయి. స్క్రీన్ ప్లే విషయంలో ఇంకాస్త బలంగా ఉండాల్సింది. ఫైనల్‌గా ‘ది టుమారో వార్’ అద్భుతాన్ని చూడాల్సిందే. అమెజాన్ ప్రైమ్‌లో తెలుగులో కూడా అందుబాటులో ఉంది. -
ఓటీటీలో సైన్స్ ఫిక్షన్ యాక్షన్ ఫిల్మ్.. ప్రకటన వచ్చేసింది
హాలీవుడ్ స్టార్స్ ఓవెన్ టీగ్, ఫ్రెయా అల్లన్, కెవిన్ డురాండ్, పీటర్ మకాన్, విలియమ్ హెచ్. మేసీ ప్రధాన పాత్రల్లో నటించిన హాలీవుడ్ సైన్స్ ఫిక్షన్ యాక్షన్ ఫిల్మ్ ‘కింగ్డమ్ ఆఫ్ ది ప్లానెట్ ఆఫ్ ది ఏప్స్’. వెస్ బాల్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం ఈ ఏడాది మే 10న థియేటర్స్‌లో విడుదల అయింది. అయితే, ప్రేక్షకులను మెప్పించిన ఈ సినిమా ఇప్పుడు ఓటీటీలో విడుదల కానుంది. ఈమేరకు అధికారికంగా ప్రకటన కూడా వెలువడింది.ప్రపంచవ్యాప్తంగా 'కింగ్డమ్ ఆఫ్ ద ప్లానెట్ ఆఫ్ ద ఏప్స్' సినిమాకు మంచి ఆదరణ ఉంది. బాక్సాఫీస్ వద్ద వసూళ్ల వర్షం కురిపించిన తర్వాత ఇప్పుడు ఓటీటీలోకి వస్తోంది. విడుదలైన రెండున్నర నెలల తర్వాత ఓటీటీలోకి రానుంది. ఈ సినిమా ఆగష్టు 2 నుంచి డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ కానుంది. ఇంగ్లీష్, తెలుగు,హిందీ, తమిళ్లో ఈ చిత్రం విడుదల కానుంది.‘ప్లానెట్ ఆఫ్ ది ఏప్స్’ రీ బూట్ సిరీస్‌లో వస్తోన్న నాలుగో చిత్రం ఇది. ఈ సిరీస్ నుంచి గతంలో వచ్చిన ‘రైజ్ ఆఫ్ ది ప్లానెట్ ఆఫ్ ది ఏప్స్ (2011)’, ‘డ్వాన్ ఆఫ్ ది ప్లానెట్ ఆఫ్ ది ఏప్స్ (2014), ‘వార్ ఫర్ ది ప్లానెట్ ఆఫ్ ది ఏప్స్’ (2017) చిత్రాలు ప్రేక్షకులను అలరించాయి. ఈ ఏడాది రిలీజైన సినిమాల్లో అత్యధిక వసూళ్లు సాధించిన టాప్ 10 సినిమా లిస్ట్‌లో ‘కింగ్డమ్ ఆఫ్ ది ప్లానెట్ ఆఫ్ ది ఏప్స్’ ఉండటం విశేషం.రూ. 1350 కోట్ల బడ్జెట్‌తో రూపొందిన ఈ సినిమా మొత్తంగా రూ. 3,300 కోట్లు రాబట్టి రికార్డ్ క్రియేట్ చేసింది. ఐఎండీబీలో కూడా ఈ సినిమాకు 7.2 రేటింగ్ లభించడం విశేషం. ఆగష్టు 2 నుంచి డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో ఉచితంగానే ఈ చిత్రాన్ని చూసేయండి. -
జెన్నిఫర్ బర్త్‌డే స్పెషల్.. ఓటీటీలో ఈ యాక్షన్ సినిమాలు చూడొచ్చు!
'జెన్నిఫర్ లోపెజ్' అనగానే.. మనకు ముందుగా గుర్తుకొచ్చేది తెలుగు సినిమా పాట. అయితే, హాలీవుడ్ సినీపరిశ్రమలో జెన్నిఫర్ లోపెజ్ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్న స్టార్ నటి. జులై 24, 1969న న్యూయార్క్‌లో జన్మించిన జెన్నిఫర్ లోపెజ్ మొదట స్కెచ్ కామెడీ TV సిరీస్ 'ఇన్ లివింగ్ కలర్'లో ఫ్లై గర్ల్ జాజ్-ఫంక్ డాన్సర్‌గా గుర్తింపు పొంది, సంగీత పరిశ్రమలో కూడా చెరగని ముద్రగా ఎదిగింది.తాను కేవలం డ్యాన్సింగ్, సింగింగ్లకే పరిమితం కాకుండా నటనలో కూడా ప్రతిభ కనబరిచి తనను తాను పరిచయం చేసుకుంది. తాను నటించిన యాక్షన్ చిత్రాలు ఇప్పటికీ ప్రపంచవ్యాప్తంగా ఇష్టపడతారు. నటిగా మారిన తన కెరీర్ అన్ని రకాల జోనర్ల చిత్రాలను నటించి, అడ్వెంచర్ యాక్షన్ పాత్రలతో ప్రేక్షకులను ఉర్రూతలూగించింది. జెన్నిఫర్ తన హాలీవుడ్ మూవీ కెరీర్లో అన్నీ రకాల పాత్రలను పోషించినప్పటికీ, అందులో అద్భుతమైన యాక్షన్ సినిమాలను కొన్నింటిని చూసినట్లయితే..అనకొండ..హారర్ అండ్ యాక్షన్‌గా 1997లో విడుదలైన 'అనకొండ' మూవీ ఇప్పటికీ ప్రజల అభిమాన చిత్రాల్లో ఒకటి. దట్టమైన అడవిలో అనకొండ నుంచి తప్పించుకోవడానికి టెర్రీ (జెన్నిఫర్ లోపెజ్) తన స్నేహితులతో కలిసి ఎలా పోరాడుతుందో చూడటం ఆసక్తికరంగా ఉంటుంది. మీరు ఈ మూవీని జియో సినిమాలో చూడవచ్చు.ఎనాఫ్..2002లో విడుదలైన యాక్షన్ అండ్ థ్రిల్లర్ మూవీ 'ఎనాఫ్'. స్లిమ్ (జెన్నిఫర్ లోపెజ్) తన బెదిరింపు భర్త నుండి తనను తాను ఎలా రక్షించుకుంటుందో మనం ఇందులో చూడవచ్చు. ఈ చిత్రం హాట్‌స్టార్ ప్రైమ్ వీడియోలో అందుబాటులో ఉంది.షాట్‌గన్ వెడ్డింగ్..జెన్నిఫర్ లోపెజ్ నటించినటువంటి చిత్రం 'షాట్‌గన్ వెడ్డింగ్' (2022). యాక్షన్‌తో పాటు కామెడీని ఆస్వాదించాలనుకునేవారికి ఈ మూవీ నచ్చుతుంది. దీనిని మీరు హాట్‌స్టార్ ప్రైమ్ వీడియోలో చూడవచ్చు.ది మదర్..2023లో విడుదలైన 'ది మదర్' చిత్రంలో జెన్నిఫర్ లోపెజ్ కథానాయికగా నటించింది. యాక్షన్, థ్రిల్లర్‌గా కొనసాగే ఈ చిత్రం ఓటీటీ ప్లాట్‌ఫారమ్ నెట్‌ఫ్లిక్స్‌లో చూడవచ్చు. -
నువ్వు సిద్ధమా..?
హాలీవుడ్ సూపర్‌హీరో హిట్ ఫ్రాంచైజీ ‘డెడ్‌పూల్’ నుంచి వస్తున్న తాజా సినిమా ‘డెడ్‌పూల్ అండ్ వుల్వరీన్’. ర్యాన్ రేనాల్డ్స్, హ్యూ జాక్మన్, ఎమ్మా కోరిన్, మాథ్యా మాక్ఫాడ్యేయన్ లీడ్ రోల్స్‌లో నటించిన ఈ సినిమాకు షాన్ లేవీ దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో డెడ్‌పూల్‌గా ర్యానే రేనాల్డ్స్, వుల్వరీన్గా హుయ్జాక్మెన్ కనిపిస్తారు.వాల్ట్ డిస్నీ స్టూడియోస్ మోషన్ పిక్చర్స్ ఈ చిత్రాన్ని ఈ నెల 26న విడుదల చేస్తోంది. తెలుగులోనూ విడుదల కానున్న ఈ మూవీ ట్రైలర్‌ను విడుదల చేశారు మేకర్స్. ‘‘నా కంటూ ఉంది ఈ తొమ్మిదిమందే... నా ప్రపంచం మొత్తం ఈ ఫోటోలో ఉంది. ఒక్కడ్నే వీళ్లను ఎలా కాపాడాలో తెలియడం లేదు. కానీ.. నువ్వు వీళ్లను కాపాడగలవు’, ‘నువ్వు సిద్ధమా..?’, ‘ఎల్లప్పుడూ సిద్ధం’ వంటి డైలాగ్స్ ఈ ట్రైలర్లో ఉన్నాయి. -
అదిరిపోయే తెలుగు డైలాగ్స్‌తో 'డెడ్ పుల్ అండ్ వాల్వరిన్' ట్రైలర్
హాలీవుడ్ నుంచి మార్వెల్ మూవీ యూనీవర్స్లో మరో కొత్త సినిమా ఫ్యాన్స్‌ను ఉర్రూతలుగించేందుకు రెడీ అయింది. 'డెడ్ పుల్' మూవీ ఫ్రాంఛైజ్ నుంచి మూడో సినిమాగా 'డెడ్ పుల్ అండ్ వాల్వరిన్' సినిమా ఈ జూలై 26న విడుదల కానుంది. ఈ సినిమాలో సూపర్ హీరో డెడ్ పుల్తో పాటు మిలీనియమ్ సూపర్ హీరో ఎక్స్ మెన్లో మోస్ట్ ఫెవరేట్ వాల్వరిన్ కూడా సిల్వర్ స్రీన్‌పై ఫైట్లు చేయబోతున్నాడు. దీంతో ఒకేసారి ఇద్దరు హీరోలు చేయబోయే అద్భుతమైన విన్యాసాలను మూవీ లవర్స్ డెడ్ పుల్ అండ్ వాల్వరిన్ ద్వారా వీక్షించబోతున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా టీజర్, ట్రైలర్స్ కు వరల్డ్ వైడ్ విపరీతంగా క్రేజ్ ఏర్పడింది, ఈ నేపథ్యంలో మార్వెల్ టీమ్ ఈ సినిమాను అన్ని భాషల్లో ఉన్న సినీ అభిమానులను మరింత అలరించే విధంగా తీర్చిదిద్దేందుకు డబ్బింగ్ వెర్షన్స్ ను సిద్ధం చేస్తున్నారు. తెలుగులో ఈ సినిమా డబ్బింగ్ ఫ్యాన్స్‌ను అత్యంత ఆకట్టుకుందనే విషయం తెలుగు ట్రైలర్ చూస్తే అర్ధం అవుతుంది. తెలుగులో ఉన్న ట్రెండింగ్ పదాలను, యూత్ మధ్య విపరీతంగా వినిపించే పదాలతో ఉన్న డైలాగ్స్ ఈ సినిమాకు హైలెట్ అవ్వనున్నాయి. తెలుగు సినీ అభిమానులు ఇటీవల ఇష్టపడిన కుర్చీమడతపెట్టి, కెవ్వుకేక, రింగ రింగ ఇలా అనేక అన్లైన్ ట్రెండింగ్ కీ వర్డ్స్‌తో డెడ్ పుల్ అండ్ వాల్వరిన్ తెలుగు వెర్షన్ సిద్ధం అయింది. ఈ చిత్రంలో వాల్వరిన్గా హుయ్ జాక్ మెన్, డెడ్ పుల్గా రయన్ రెనాల్డ్స్ కనిపించబోతున్నారు. ప్రపంచవ్యాప్తంగా జూలై 26న ఈ సినిమా భారీ స్థాయిలో విడుదల అవుతుంది. -
మార్వెల్ యూనివర్స్ లేటెస్ట్ సినిమా.. తెలుగు ట్రైలర్ రిలీజ్
రోజుకో స్పెషల్ సర్ప్రైజ్తో మార్వెల్ మూవీ ఫ్యాన్స్‌ని 'డెడ్ పుల్ & వాల్వరిన్' టీమ్ ఉక్కిరిబిక్కిరి చేస్తున్నారు. రైన్ రెనాల్డ్స్, హుయ్ జాక్ మెన్ ప్రథాన పాత్రల్లో నటించిన సినిమా ఇది. వరల్డ్ వైడ్ జూలై 26న థియేటర్లలో రిలీజ్ కానుంది. తెలుగులోనూ వస్తుండటం విశేషం. ఇప్పటికే ప్రమోషనల్ కంటెంట్ మూవీపై హైప్ పెంచగా.. తాజాగా డబుల్ చేసేలా ఫైనల్ ట్రైలర్‌ని విడుదల చేశారు.(ఇదీ చదవండి: ఓటీటీలో దూసుకుపోతున్న తెలుగు సినిమా.. ఎందులో ఉందంటే?)ప్రతి మూవీలో కొత్త కొత్త క్యారెక్టర్స్‌ని పరిచయం చేసే మార్వెల్.. ఈ ట్రైలర్లో లేడీ డెడ్ పుల్, వాల్వరిన్ కూతుర్ని పరిచయం చేశారు. డెడ్ పుల్ చేసే విన్యాసాలుని ఎంజాయ్ చేసే మార్వెల్ మూవీ లవర్స్.. ఇప్పుడు లేడీ డెడ్ పుల్ చేసే యాక్షన్‌ని కూడా చూడబోతున్నారు. (ఇదీ చదవండి: 'యానిమల్' బ్యూటీ కొత్త సినిమా ఎలా ఉందంటే?) -
ఇద్దరు సూపర్ హీరోల సినిమా.. విడుదల ఎప్పుడంటే
హాలీవుడ్ నుంచి మార్వెల్ సినిమాలు రిలీజ్ అవుతున్నాయంటే చాలు ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తారు. ఈ సినిమాల్లో కనిపించే సూపర్ హీరోలు వెండితెరపై కనిపిస్తే సంబరాల్లో మునిగితేలుతుంటారు. ఈ క్రమంలో మార్వెల్ యూనీవర్స్ నుంచి డెడ్ పుల్ సిరీస్‌లో భాగంగా జూలై 26న డెడ్ పుల్ & వాల్వరిన్ మూవీ విడుదలకు సిద్ధంగా ఉన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించిన ట్రైలర్ యూట్యూబ్‌లో మిలియన్స్ కొద్దీ వ్యూస్ అందుకోవడంతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న మార్వెల్ ఫ్యాన్స్ లో ఉత్కంఠ రేపుతోంది. ఈసారి డెడ్ పుల్తో పాటు వాల్వరిన్ కూడా వెండితెరపై అద్భుత విన్యాసాలు చేయబోతున్నాడు. ఇద్దరు సూపర్ హీరోలు ఒకేసారి అభిమానులు ముందుకు రానున్న నేపథ్యంలో డెడ్ పుల్ అండ్ వాల్వరిన్ మోస్ట్ ఫెవరేట్ మార్వెల్ మూవీగా రికార్డులు క్రియేట్ చేస్తుంది. తాజాగా ఈ సినిమాకు ఉన్న క్రేజ్ రీత్య హైదరబాద్‌లో మార్వెల్ సినిమాలు అభిమానులు సంబరాలు చేసుకున్నారు. ఇటీవలే డెడ్ పుల్ & వాల్వరిన్ టికెట్లు బుకింగ్ మొదలైన సందర్భంగా తమ అభిమానాన్ని పెద్ద ఎత్తున సంబరాలు చేశారు. ఈ సెలబ్రేషన్ వీడియోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి. డెడ్ పుల్ & వాల్వరిన్లో ప్రధానపాత్రధారులుగా రయన్ రెనాల్డ్స్, హుయ్ జాక్ మెన్ నటిస్తున్నారు. జూలై 26న ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో ఈ సినిమా విడుదల కానుంది. -
Thanksgiving Movie: వయొలెన్స్.. వయొలెన్స్.. ధైర్యం ఉంటే చూసేయండి!
ఆఫర్.. ఆఫర్.. ఈ పేరు వినిపిస్తే చాలు జనాలు చేతిలో డబ్బులున్నాయా? లేవా? అని కూడా చూసుకోరు. ఆఫర్లో వస్తున్నాయంటూ ఎగబడి మరీ కొనేస్తారు. అలాగే అమెరికాలో బ్లాక్ ఫ్రైడే సేల్స్ కోసం ఓ షాపింగ్ స్టోర్ సిద్ధమైంది. మొదట వచ్చిన 100 మంది కస్టమర్ల కోసం ప్రత్యేక బహుమతులు కూడా ప్రకటించింది. ఇంకేముంది.. జనాలు షాపు చుట్టూ గుమిగూడారు. వారిని ఆపడం అక్కడి సెక్యూరిటీ వల్ల కూడా కావడం లేదు.కథఇంతలో ఆ షాపు యజమాని కూతురు జెస్సికా (నెల్ వర్లఖ్) తన ఫ్రెండ్స్ గ్యాంగ్‌తో అక్కడికి వస్తుంది. ఆమె ప్రియుడు కొత్త ఫోన్ తీసుకోవాలంటూ దర్జాగా షాపులోకి వెళ్తాడు. ఇది చూసిన జనాలు ఆగ్రహానికి లోనవుతారు. వారిని ఎందుకు లోనికి వెళ్లనిచ్చారు? మమ్మల్ని ఎందుకు ఆపుతున్నారు? అని మండిపడ్డారు. ఇంతలో జనం సునామీలా ముందుకు వచ్చారు. స్టోర్ తలుపు తెరిచేవరకు ఆగకుండా దూసుకొచ్చేయడంతో తొక్కిసలాట జరిగింది. పలువురూ ప్రాణాలు కోల్పోయారు. దాంతో బ్లాక్ ఫ్రైడే విషాదంగా మారిపోయింది. సరిగ్గా ఏడాదికి..అయితే దీన్ని హీరోయిన్ బాయ్‌ఫ్రెండ్ లైవ్‌లో వీడియో తీడయంతో అది వైరల్‌గా మారుతుంది. ఏడాది తర్వాత మరోసారి అదే స్టోర్‌లో బ్లాక్ ఫ్రైడే సేల్స్ పెట్టాలని షాపు యజమాని డిసైడ్ అవుతాడు. అంతలోనే గతేడాది విషాదానికి కారణమైన ఒక్కొక్కరూ అత్యంత దారుణంగా చనిపోతారు. ఈ హత్యల వెనుక ఉన్నదెవరు? ఫ్రెండ్స్ గ్యాంగ్‌లో అందరూ చనిపోయారా? ఎవరైనా ప్రాణాలతో బతికి బట్టకట్టారా? మళ్లీ బ్లాక్ ఫ్రైడే సేల్స్ జరిగాయా? లేదా? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే!ఆ సీన్ హైలైట్సినిమా ప్రారంభమైన కొద్ది సేపటికే బ్లాక్ ఫ్రైడే సేల్స్.. ఎంత విధ్వంసంగా మారిందో చూపించారు. ఆ దారుణాన్ని చూస్తున్నప్పుడు మనసు చివుక్కుమంటుంది. సినిమా మొత్తంలో ఈ సీనే హైలైట్‌గా ఉంటుంది. తర్వాత విలన్ చేసే హత్యలు కొన్ని కామెడీగా ఉంటే, మరికొన్ని సీరియస్‌గా ఒళ్లు గగుర్పొడిచేలా ఉంటాయి. సెకండాఫ్‌లో అదుర్స్ అని చెప్పుకునేలా ఏ సన్నివేశమూ ఉండదు. కిల్లర్ నెక్స్ట్ టార్గెట్ ఎవరన్న ఉత్సుకత మాత్రం మనలో కలగక మానదు.ఆ ఓటీటీలో స్ట్రీమింగ్ఎలి రోత్ దర్శకత్వం వహించిన ఈ మూవీలో పాట్రిక్ డింప్సే, జీనా జెర్షన్, టై ఒల్సన్, నెల్ వెర్లాక్.. తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు. ఎలి రోత్‌తో పాటు జెఫ్ రెండల్ డైలాగ్స్ రాశాడు. జనాలకు షాపింగ్, ఆఫర్స్ మీద ఉన్న పిచ్చిని.. అలాగే సోషల్ మీడియాలో వైరలవ్వాలన్న తాపత్రయాన్ని సినిమాలో సెటైరికల్‌గా చూపించారు. దాని పరిణామాలు ఎలా ఉంటాయో చక్కగా చూపించారు. మిస్టరీ థ్రిల్లర్స్ సినిమాలను ఇష్టపడేవారు ఈ సినిమా చూడొచ్చు. ఈ మూవీ నెట్‌ఫ్లిక్స్‌లో హిందీ, ఇంగ్లీష్ భాషల్లో అందుబాటులో ఉంది. చదవండి: అనంత్ అంబానీ పెళ్లి.. ఆ హీరోలకు గిఫ్ట్‌గా కోట్ల విలువైన వాచీలు