ప్రముఖ హాలీవుడ్ జంట ఏంజెలీనా జోలీ, బ్రాడ్ పిట్ తమ బంధానికి గుడ్ బై చెప్పేశారు. దాదాపు 8 ఏళ్ల తర్వాత ఈ దంపతులకు కోర్టు విడాకులు మంజూరు చేసింది. సెప్టెంబరు 2016లో ఎంజెలీనా జోలీ విడాకుల కోసం కోర్టును అశ్రయించారు. సుదీర్ఘమైన విచారణ తాజాగా వీరిద్దరు ఓ సెటిల్‌మెంట్‌కు వచ్చారు. దీంతో వీరిద్దరు అధికారికంగా విడాకులు తీసుకున్నట్లు ఎంజెలీనా తరఫు న్యాయవాది ధ్రువీకరించారు.
కాగా.. 2014లో ఎంజెలీనా, బ్రాడ్ పిట్ పెళ్లి చేసుకున్నారు. ఈ జంట దాదాపు 12 ఏళ్ల పాటు కలిసి ఉన్నారు. హాలీవుడ్‌లో అత్యంత ప్రజాదరణ పొందిన జంటల్లో ఏంజెలినా జోలీ, బ్రాడ్ పిట్ ఒకరు. కాగా... విడాకుల సెటిల్‌మెంట్‌కు సంబంధించిన వివరాలను గోప్యంగా ఉంచారు. ఈ కేసు కోసం దంపతులు ఒక ప్రైవేట్ న్యాయమూర్తిని నియమించారు.
2016లో జోలీ యూరప్ ట్రిప్ తర్వాత విడాకుల కోసం దాఖలు చేసింది. పిట్ తన పట్ల, తన పిల్లల పట్ల అనుచితంగా ప్రవర్తించాడని ఆమె పేర్కొంది. అయితే ఈ జంటకు న్యాయమూర్తి వారికి 2019లో విడాకులు మంజూరు చేశారు. కానీ పిల్లలు, ఆస్తుల విభజన, పిల్లల సంరక్షణ సెటిల్‌మెంట్ కోసం కోసం మరో ఐదేళ్లు పట్టింది. ఇక నుంచి వీరిద్దరు అధికారికంగా విడిపోయినట్లే. ఇక సినిమాల విషయానికొస్తే ఎంజెలీనా జోలీ చివరిసారిగా మారియాలో కనిపించింది.
Comments
Please login to add a commentAdd a comment