నా భర్త వేధించాడు, పిల్లలే సాక్ష్యం: ప్రముఖ‌ నటి‌‌ | Angelina Jolie Claims She Has Proof Of Domestic Violence Against Brad Pitt | Sakshi
Sakshi News home page

నా భర్త వేధించాడు, పిల్లలే సాక్ష్యం: ప్రముఖ‌ నటి

Mar 18 2021 2:19 PM | Updated on Mar 18 2021 4:53 PM

Angelina Jolie Claims She Has Proof Of Domestic Violence Against Brad Pitt - Sakshi

ఏంజెలినా జోలి తన భర్త బ్రాడ్‌ పిట్‌ నుంచి విడాకులు కోరుతూ 2016 కోర్టులో పిటిషన్‌ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం వీరి విడాకుల కేసుపై కోర్టులో విచారణ జరుగుతునే ఉంది. ఈ నేపథ్యంలో తాజాగా ఎంజెలినా కోర్టులో..

లాస్‌ఎంజిల్స్‌: ప్రముఖ హాలీవుడ్‌ నటి ఏంజెలినా జోలి తన భర్త బ్రాడ్‌ పిట్‌ నుంచి విడాకులు కోరుతూ 2016 కోర్టులో పిటిషన్‌ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం వీరి విడాకుల కేసుపై కోర్టులో విచారణ జరుగుతునే ఉంది. ఈ నేపథ్యంలో తాజాగా ఎంజెలినా కోర్టులో భర్త పిట్‌పై గృహ హింస కేసు పెడుతూ పిటిషన్‌ దాఖలు చేసింది. పిట్‌ తనను వేధించాడని చెప్పేందుకు ఆధారాలు ఉన్నాయని, తన పిల్లలే ఇందుకు సాక్ష్యం అని ఆమె పేర్కొంది. వారు కోర్టుకు వచ్చి సాక్ష్యం ఇచ్చేందుకు కూడా సిద్దంగా ఉన్నారని ఆమె పటిషన్‌లో స్పష్టం చేసింది.

కాగా 2004లో వచ్చిన ‘మిస్టర్‌ అండ్‌ మెసెస్‌ స్మిత్‌’ మూవీ సమయంలో ఎంజెలినా-బ్రాడ్‌ పట్‌లు ప్రేమలో పడ్డారు. పదేళ్ల సహజీవనం అనంతరం వీరిద్దరూ 2014లో వివాహం చేసుకున్నారు. అయితే పెళ్లైయిన రెండేళ్లకే విడిపోయిన బ్రాడ్‌, ఎంజెలినాలు అప్పటి నుంచి కోర్టు వేదికగా కొట్లాడుకుంటున్నారు. ఇప్పటికి వీరికి విడాకులు రాలేదు. కానీ 2019లో నుంచి వీరిద్దరూ విడిగానే జీవిస్తున్నారు. అయితే వారి ఆరుగురి పిల్లల బాధ్యతను జాయింట్‌ కస్టడిలో ఉంచాలని వీరిద్దరూ డిమాండ్‌ చేస్తున్నారు. 

చదవండి: 
ఏంజెలినా విడాకుల కేసు: ఆ లాయర్‌ను తొలగించండి
రంగ్‌దే ప్రీ రిలీజ్‌ బిజినెస్‌ ఎంతో తెలుసా!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement