హాలీవుడ్ ప్రముఖ నటుడు బ్రాడ్ పిట్ తాజా చిత్రంగా ‘ఎఫ్1’ ఖరారైంది. ‘ఓన్లీ ది బ్రేవ్, టాప్‌గన్: మేవరిక్’ వంటి హాలీవుడ్ చిత్రాలకు దర్శకత్వం వహించిన జోసెఫ్ కొసిన్క్సి ఈ స్పోర్ట్స్ డ్రామా సినిమాను తెరకెక్కించనున్నారు. ‘ఎఫ్1’ని అధికారికంగా ప్రకటించి, ఫస్ట్ లుక్‌ను విడుదల చేశారు మేకర్స్.
ఫార్ములా వన్ రేసింగ్ నేపథ్యంలో ఓ రేసర్ కథగా ఈ సినిమా రూపొందనుంది. ఫార్ములా వన్ రేసింగ్‌లో ఉండే సవాళ్లు, రేసర్ల వ్యక్తిగత, వృత్తిపరమైన జీవన విధానాలను ఈ సినిమాలో చూపించనున్నారట జోసెఫ్. జెర్నీ బ్రూక్‌హైమర్, బ్రాడ్ పిట్ ఈ సినిమాను నిర్మించనున్నారు. ‘ఎఫ్1’ చిత్రం వచ్చే ఏడాది సమ్మర్‌లో విడుదల కానుంది.
Comments
Please login to add a commentAdd a comment