first look launch
-
వీణా రావుకి ఈ అవకాశం రావడం అదృష్టం: నిర్మాత సుప్రియ
‘‘నా తొలి సినిమాని అశ్వినీదత్‌గారి బేనర్లోనే చేయాలి. కానీ అన్నపూర్ణ స్టూడియోస్‌లో నాగార్జునగారు డైరెక్టర్‌గా తొలి అవకాశం ఇచ్చారు. ఈ ఇద్దరూ నాకు చిరస్మరణీయులు. వారి కుటుంబం నుంచి వచ్చి, మహిళా శక్తులుగా ఎదిగారు సుప్రియ, స్వప్నా దత్. నేను కథానాయికగా పరిచయం చేస్తున్న తెలుగు అమ్మాయి వీణా రావు ఫస్ట్ లుక్ దర్శన్‌ని సుప్రియ, స్వప్న విడుదల చేయడం నా అదృష్టంగా భావిస్తున్నాను వీణా రావు మంచి కూచిపూడి డ్యాన్సర్. తనకి ఇండస్ట్రీలో మంచి భవిష్యత్తు ఉండాలి’’ అని డైరెక్టర్ వైవీఎస్ చౌదరి అన్నారు. తారక రామారావు హీరోగా, తెలుగు అమ్మాయి వీణా రావుని హీరోయిన్గా పరిచయం చేస్తూ వైవీఎస్ చౌదరి ఓ సినిమాని ప్రకటించిన సంగతి తెలిసిందే.న్యూ టాలెంట్ రోర్స్ బ్యానర్‌పై యలమంచిలి గీత ఈ చిత్రం నిర్మిస్తున్నారు. శనివారం హైదరాబాద్‌లో జరిగిన ప్రెస్మీట్లో వీణా రావు ఫస్ట్ దర్శన్‌ని నిర్మాతలు సుప్రియ యార్లగడ్డ, స్వ΄్నా దత్ లాంచ్ చేశారు. ఈ సందర్భంగా స్వప్నా దత్ మాట్లాడుతూ– ‘‘వీణారావు చాలా అందంగా ఉంది. తెలుగు అమ్మాయిలు హీరోయిన్లుగా రావాల్సిన సమయం ఇది. చౌదరి అన్న ఈ విషయంలో ఓ అడుగు ముందుకేయడం ఆనందంగా ఉంది’’ అన్నారు.సుప్రియ యార్లగడ్డ మాట్లాడుతూ– ‘‘వైవీఎస్ చౌదరిగారు డైరెక్టర్‌గా తీసిన తొలి చిత్రం ‘సీతారాముల కళ్యాణం చూతము రారండి’ చూసిన తర్వాత తాతగారు (అక్కినేని నాగేశ్వరరావు) చాలా సంతోషపడ్డారు. కొత్తవారిని పరిచయం చేయడంలో ఆయనెప్పుడూ ముందుంటారు. వీణా రావుకి ఈ అవకాశం రావడం అదృష్టం’’ అని చెప్పారు. ‘‘వీణా రావు ఫస్ట్ దర్శన్‌ని లాంచ్ చేసిన సుప్రియ, స్వప్నగార్లకు థ్యాంక్స్’’ అన్నారు యలమంచిలి గీత. ఈ చిత్రానికి సంగీతం: ఎంఎం కీరవాణి. -
సంక్రాంతికి మజాకా
సందీప్ కిషన్ హీరోగా నక్కిన త్రినాధరావు దర్శకత్వంలో రూపొందుతున్న తాజా చిత్రానికి ‘మజాకా’ అనే టైటిల్ ఖరారైంది. ఏకే ఎంటర్టైన్ మెంట్స్, హాస్య మూవీస్, జీ స్టూడియోస్ పతాకాలపై రాజేష్ దండా ఈ సినిమా నిర్మిస్తున్నారు. సోమవారం ఈ సినిమా టైటిల్‌ని ప్రకటించి, ఫస్ట్‌లుక్‌ని విడుదల చేయడంతో పాటు సినిమాని సంక్రాంతికి రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు.‘‘మాస్ ఫ్యామిలీ ఎంటర్టైనర్గా రూపొందుతోన్న చిత్రం ‘మజాకా’. ఈ సంక్రాంతికి పర్ఫెక్ట్ మూవీగా అలరిస్తుంది’’ అని చిత్ర యూనిట్ పేర్కొంది. రావు రమేశ్ కీలక పాత్రలో నటిస్తున్న ఈ సినిమాకు సంగీతం: భీమ్స్ సిసిరోలియో, సహ–నిర్మాత: బాలాజీ గుత్తా. -
మహాశివరాత్రికి జటాధర
సుధీర్‌బాబు హీరోగా నటించనున్న ద్విభాషా (తెలుగు, హిందీ) చిత్రం ‘జటాధర’. సూపర్ నేచురల్ ఫ్యాంటసీ అంశాలతో వెంకట్ కల్యాణ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నారు. హిందీలో ‘రుస్తుమ్, టాయ్‌లెట్: ఏక్ ప్రేమ్‌కథ, ప్యాడ్‌మ్యాన్, పరి’లాంటి చిత్రాలను నిర్మించిన ప్రేరణ అరోరాతో కలిసి శివిన్ నారంగ్, నిఖిల్ నందా, ఉజ్వల్ ఆనంద్‌లు ఈ సినిమాను నిర్మించనున్నారు.‘జటాధర’ను శనివారం ప్రకటించి, ఫస్ట్ లుక్‌ను విడుదల చేయడంతో పాటు ఈ సినిమాను వచ్చే ఏడాది మహాశివరాత్రి సందర్భంగా విడుదల చేయనున్నట్లు వెల్లడించారు మేకర్స్. ‘‘ఈ చిత్రంలో సుధీర్‌బాబు ఓ పవర్ఫుల్ రోల్లో కనిపిస్తారు. త్వరలోనే షూటింగ్ ఆరంభిస్తాం’’ అని చిత్రబృందం పేర్కొంది. -
క్రైమ్... థ్రిల్
విశ్వంత్, శిల్పా మంజునాథ్ హీరో హీరోయిన్లుగా నటించిన క్రైమ్ థ్రిల్లర్ మూవీ ‘హైడ్ న్ సిక్’. బసిరెడ్డి రానా దర్శకత్వంలో నిశాంత్, ఎంఎన్ఓపీ సమర్పణలో సహస్ర ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై నరేంద్ర బుచ్చిరెడ్డి నిర్మించిన చిత్రం ఇది. తాజాగా ఈ సినిమా మోషన్ పోస్టర్‌ను ఆవిష్కరించిన నటుడు శివాజీ మాట్లాడుతూ– ‘‘ఇటీవల ఇండస్ట్రీకి కొత్త ప్రతిభ ఎక్కువగా వస్తోంది.ఇది మంచి పరిణామం. ‘హైడ్ న్ సిక్’ సినిమాకు ప్రేక్షకులు విజయం చేకూర్చాలి’’ అన్నారు. ‘‘ఈ సినిమా విజయం సాధిస్తుంది’’ అని తెలిపారు విశ్వంత్. ‘‘ఎన్ని కష్టాలొచ్చినా ఈ సినిమాను ఆపేది లేదని నిర్మాత భరోసా ఇచ్చారు. ఆ ధైర్యంతో ఈ సినిమాను పూర్తి చేశాం’’ అని పేర్కొన్నారు బసిరెడ్డి రానా. దర్శకులు మల్లి అంకం, ఆదిత్యా హాసన్, నవీన్ మేడారం అతిథులుగా హాజరై, ‘హైడ్ న్ సిక్’ విజయాన్ని ఆకాంక్షించారు. -
లవ్ స్కోర్ ఎంత?
లవ్ స్కోర్ ఎంత ఉందో చెక్ చేసుకుంటున్నారు కృతీ శెట్టి. మరి... స్కోర్ ఎంత అంటే ‘లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ’లో చూడాలంటున్నారు. ఇంతకీ విషయం ఏంటంటే... ‘లవ్ టుడే’ ఫేమ్ ప్రదీప్ రంగనాథన్, కృతీ శెట్టి హీరో హీరోయిన్లుగా నటిస్తున్న సినిమా ‘లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ’. విఘ్నేష్ శివన్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. హీరోయిన్, విఘ్నేష్ భార్య నయనతార ఈ సినిమాను నిర్మిస్తున్నారు.ఇప్పటికే ఈ సినిమాలోని ప్రదీప్ ఫస్ట్ లుక్‌ను రిలీజ్ చేశారు. తాజాగా కృతీ శెట్టి ఫస్ట్ లుక్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. ఈ ఫస్ట్ లుక్ పోస్టర్‌ను చూస్తుంటే 2035 సెప్టెంబరు 9న ఓ హై ఎండ్ టెక్నాలజీ మొబైల్ ఫోన్లో కృతీ శెట్టి లవ్ స్కోర్‌ను చెక్ చేసుకుంటున్నట్లుగా తెలుస్తోంది. దీన్నిబట్టి భవిష్యత్‌లో సోషల్ మీడియా ప్రభావం, యువతీ యువకుల తీరు, మానవీయ సంబంధాలు వంటి అంశాలను ఈ చిత్రంలో దర్శకుడు విఘ్నేష్ ప్రస్తావించనున్నట్లు తెలుస్తోంది. -
సమ్మర్లో ఎఫ్1 రేసింగ్
హాలీవుడ్ ప్రముఖ నటుడు బ్రాడ్ పిట్ తాజా చిత్రంగా ‘ఎఫ్1’ ఖరారైంది. ‘ఓన్లీ ది బ్రేవ్, టాప్‌గన్: మేవరిక్’ వంటి హాలీవుడ్ చిత్రాలకు దర్శకత్వం వహించిన జోసెఫ్ కొసిన్క్సి ఈ స్పోర్ట్స్ డ్రామా సినిమాను తెరకెక్కించనున్నారు. ‘ఎఫ్1’ని అధికారికంగా ప్రకటించి, ఫస్ట్ లుక్‌ను విడుదల చేశారు మేకర్స్. ఫార్ములా వన్ రేసింగ్ నేపథ్యంలో ఓ రేసర్ కథగా ఈ సినిమా రూపొందనుంది. ఫార్ములా వన్ రేసింగ్‌లో ఉండే సవాళ్లు, రేసర్ల వ్యక్తిగత, వృత్తిపరమైన జీవన విధానాలను ఈ సినిమాలో చూపించనున్నారట జోసెఫ్. జెర్నీ బ్రూక్హైమర్, బ్రాడ్ పిట్ ఈ సినిమాను నిర్మించనున్నారు. ‘ఎఫ్1’ చిత్రం వచ్చే ఏడాది సమ్మర్లో విడుదల కానుంది. -
డబ్బు ఎవరిది?
ఇక్కడ రష్మికా మందన్నా చేతిలో ఉన్న పెద్ద సూట్ కేసును చూశారుగా! ఈ సూట్‌కేసు నిండా డబ్బు కట్టలే. ఈ సూట్‌కేసును రాత్రి వేళ తవ్వి బయటకు తీశారు రష్మిక. మరి... ఈ డబ్బు ఎవరిది? రష్మికా మందన్నా ఇంత రహస్యంగా డబ్బును ఎందుకు తవ్వి తీశారు? అనే విషయాలు ‘కుబేర’ సినిమాలో తెలుస్తాయి.నాగార్జున, ధనుష్ హీరోలుగా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ఇది. ఈ చిత్రంలో రష్మికా మందన్నా హీరోయిన్గా, జిమ్ సర్ఫ్ ఓ కీలక పాత్రలో నటిస్తున్నారు. తమిళ, తెలుగు, హిందీ భాషల్లో ఏకకాలంలో ఈ సోషల్ డ్రామాను సునీల్ నారంగ్, పుస్కూర్ రామ్మోహన్ రావు నిర్మిస్తున్నారు. శుక్రవారం రష్మికా మందన్నా ఫస్ట్ లుక్ వీడియోను విడుదల చేశారు మేకర్స్. -
ఫస్ట్ లుక్ చూసి ఆశ్చర్యపోతారు: వరుణ్ సందేశ్
‘‘నా 17 ఏళ్ల కెరీర్లో చేయని ఒక డిఫరెంట్ మూవీ ‘విరాజి’. ఈ చిత్రంలో ఓ క్రేజీ పాత్ర చేస్తున్నాను. ఈ నెల 10న విడుదల చేయనున్న ‘విరాజి’ ఫస్ట్ లుక్ చూడగానే అందరూ ఆశ్చర్యపోతారు. మీ అందరికీ తప్పకుండా నచ్చే సినిమా అవుతుంది. ఈ మూవీ రిలీజ్ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నాను’’ అని హీరో వరుణ్ సందేశ్ అన్నారు. ఆయన హీరోగా నటించిన చిత్రం ‘విరాజి’. ఈ చిత్రంతో ఆద్యంత్ హర్ష దర్శకుడిగా పరిచయమవుతున్నారు.మహా మూవీస్‌తో కలిసి ఎమ్ 3 మీడియా బ్యానర్‌పై మహేంద్రనాథ్ కూండ్ల నిర్మించిన ఈ చిత్రం ఆగస్టు 2న రిలీజ్ కానుంది. మంగళవారం జరిగిన ‘విరాజి’ టైటిల్ ప్రకటన కార్యక్రమంలో ఆద్యంత్ హర్ష మాట్లాడుతూ– ‘‘విరాజి’కి చాన్స్ ఇచ్చిన మా మూవీ ప్రాజెక్ట్ హెడ్ సుకుమార్ కిన్నెర, నిర్మాత మహేంద్రగారు, వరుణ్ సందేశ్లకు కృతజ్ఞతలు’’ అన్నారు. ‘‘వరుణ్ సందేశ్‌ని కొత్త అవతారంలో చూపించే చిత్రమిది. మాలాంటి కొత్తవాళ్లు ఇండస్ట్రీలో నిలదొక్కుకోవాలంటే ప్రేక్షకుల సపోర్ట్ కావాలి’’ అన్నారు మహేంద్రనాథ్ కూండ్ల. సంగీతదర్శకుడు ఏబీ నెజర్ పాల్ (ఏబీ), నటీనటులు ప్రమోదిని, రఘు కారుమంచి, ఫణి తదితరులు పాల్గొన్నారు. -
సింహాసనం దక్కాలి కానీ...
ఉత్పలదేవిగా మారిపోయారు మీరా జాస్మిన్. ఉత్పలదేవి దయాగుణం వల్ల రాణి కావాల్సిన ఆమెకు సింహాసనం దక్కదు. ఆ తర్వాత ఏం జరిగిందనేది ‘శ్వాగ్’ సినిమా చూసి తెలుసుకోవాల్సిందే. శ్రీవిష్ణు హీరోగా హసిత్ గోలీ దర్శకత్వంలో ‘శ్వాగ్’ అనే సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే.ఈ చిత్రంలో వింజమర వంశంలోని రాణి రుక్మిణి దేవిగా రీతూ వర్మ ఓ లీడ్ రోల్లో నటిస్తుండగా, మరో లీడ్ రోల్లో ఉత్పలదేవిగా మీరా జాస్మిన్ కనిపిస్తారు. ఆదివారం ఆమె ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు. ఈ చిత్రాన్ని టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్నారు. -
ఆకట్టుకుంటున్న 'శివం భజే' ఫస్ట్ లుక్
అశ్విన్‌బాబు హీరోగా అప్సర్ దర్శకత్వంలో మహేశ్వర్ రెడ్డి మాలి నిర్మించిన చిత్రం ‘శివం భజే’. దిగంగనా సూర్యవన్షీ హీరోయిన్గా నటించిన ఈ సినిమాలో అర్బాజ్ ఖాన్, మురళీ శర్మ, బ్రహ్మాజీ, కాశీ విశ్వనాథ్ కీలక పాత్రల్లో నటించారు.తాజాగా ఈ సినిమా నుంచి అశ్విన్‌బాబు ఫస్ట్ లుక్ పోస్టర్‌ను విడుదల చేశారు మేకర్స్. ‘‘ఇటీవలే చిత్రీకరణ పూర్తయింది. సరికొత్త కథతో ఈ సినిమాను రూపొందించాం. త్వరలోనే ఈ సినిమా టీజర్, ట్రైలర్, రిలీజ్ డేట్ వివరాలను వెల్లడిస్తాం’’ అని చిత్ర యూనిట్ పేర్కొంది. ఈ సినిమాకు వికాస్ బాడిస స్వరకర్త. -
సైంటిఫిక్ థ్రిల్లర్
శ్రీకాంత్ (శ్రీరామ్) ప్రధాన పాత్రలో సుగి విజయ్, రూపాలీ భూషణ్ జంటగా రూపొందిన చిత్రం ‘మాత్రు’. జాన్ జక్కీ దర్శకత్వంలో శ్రీ పద్మినీ సినిమాస్‌పై బి. శివప్రసాద్ నిర్మించారు. తాజాగా ఈ చిత్రం ఫస్ట్ లుక్పోస్టర్ని రచయిత, దర్శకుడు విజయేంద్ర ప్రసాద్ లాంచ్ చేసి, సినిమా విజయం సాధించాలని ఆకాంక్షించారు.‘‘యాక్షన్ సైంటిఫిక్ థ్రిల్లర్‌గా రూపొందిన చిత్రం ‘మాత్రు’.పోస్ట్ ప్రోడక్షన్ పనులు పూర్తయ్యాయి. త్వరలోనే సినిమా రిలీజ్ డేట్‌ని ప్రకటిస్తాం’’ అన్నారు మేకర్స్. అలీ, ఆమని ఇతర కీలక పాత్రలుపోషించిన ఈ చిత్రానికి సంగీతం: శేఖర్ చంద్ర, కెమెరా: రాహుల్ శ్రీవాస్తవ్. -
‘లక్కీ భాస్కర్’తో దుల్కర్ అసాధారణమైన ప్రయాణం
మలయాళ హీరో దుల్కర్ సల్మాన్ కెరీర్ ఆరంభమై పుష్కర కాలం అయింది. ఇన్నేళ్లల్లో మలయాళంతో పాటు తెలుగు, తమిళ, హిందీ భాషల్లో వినూత్న చిత్రాలు, పాత్రలు చేస్తూ వస్తున్నారు దుల్కర్. ఇక పన్నెండేళ్లయిన సందర్భంగా దుల్కర్ హీరోగా రూపొందుతున్న తాజా చిత్రం ‘లక్కీ భాస్కర్’ ఫస్ట్ లుక్‌ని విడుదల చేశారు చిత్ర నిర్మాతలు సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య. వెంకీ అట్లూరి దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందుతోంది. మీనాక్షి చౌదరి కథానాయిక. ‘‘ఈ చిత్రంలో మగధ బ్యాంక్‌లో క్యాషియర్‌గా పని చేసే దుల్కర్ లుక్‌ని విడుదల చేశాం. 1980ల నాటి బొంబాయి నేపథ్యంలో ఈ సినిమా ఉంటుంది. ఒక సాధారణ మనిషి తాలూకు అసాధారణమైన ప్రయాణమే ఈ సినిమా. ప్రస్తుతం షూటింగ్ శరవేగంగా జరుగుతోంది’’ అని యూనిట్ పేర్కొంది. తెలుగు, మలయాళ, తమిళ, హిందీ భాషల్లో ఈ చిత్రం విడుదల కానుంది. -
తెలుగు, నేపాలీ భాషల్లో...
ప్రముఖ నటుడు బ్రహ్మానందం కీలక పాత్ర పోషిస్తున్న తొలి తెలుగు, నేపాలీ చిత్రం ‘హ్రశ్వదీర్ఘ’. చంద్ర పంత్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో హరిహర్ అధికారి, నీతా దుంగన లీడ్ రోల్స్ చేస్తున్నారు. నీతా ఫిలిమ్స్ ప్రోడక్షన్‌పై నీతా దుంగన ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కాగా ఫిబ్రవరి 1న బ్రహ్మానందం పుట్టినరోజు. ఈ సందర్భంగా ‘హ్రశ్వదీర్ఘ’లోని ఆయన పాత్రకి సంబంధించిన ఫస్ట్ లుక్‌ని విడుదల చేయడంతో పాటు ఈ చిత్రాన్ని సెప్టెంబర్ 27న విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. -
సస్పెన్స్ బహుముఖం
హర్షివ్ కార్తీక్ హీరోగా నటించి, రచించి, స్వీయ దర్శకత్వంలో నిర్మించిన చిత్రం ‘బహుముఖం’. ‘గుడ్, బ్యాడ్ – యాక్టర్’ అనేది ట్యాగ్‌లైన్. క్రిస్టల్ మౌంటైన్ ప్రోడక్షన్స్పై రూపొందిన ఈ చిత్రంలో స్వర్ణిమా సింగ్, మరియా మార్టినోవా హీరోయిన్లుగా నటించారు. ఈ చిత్రం నుంచి హర్షివ్ కార్తీక్ ఫస్ట్ లుక్‌ని విడుదల చేశారు మేకర్స్. ఈ సందర్భంగా హర్షివ్ కార్తీక్ మాట్లాడుతూ– ‘‘సస్పెన్స్, డ్రామా, థ్రిల్లర్ నేపథ్యంలో రూపొందిన చిత్రం ‘బహుముఖం’. ఈ చిత్రాన్ని త్వరలోనే విడుదల చేస్తాం’’ అన్నారు. ఈ చిత్రానికి సహ నిర్మాత: అరవింద్ రెడ్డి, కెమెరా: ల్యూక్ ఫ్లెచర్, నేపథ్య సంగీతం: శ్రీచరణ్ పాకాల, సంగీతం: ఫణి కల్యాణ్. -
నవ్విస్తూ...భయపెడుతూ..
అంజలి టైటిల్ రోల్ చేసిన తాజా చిత్రం ‘గీతాంజలి మళ్ళీ వచ్చింది’. ‘గీతాంజలి’ సినిమాకు ఇది సీక్వెల్. శ్రీనివాస్ రెడ్డి, ‘సత్యం’ రాజేశ్, ‘షకలక’ శంకర్, అలీ, సునీల్, సత్య ఇతర ప్రధాన పాత్రలు పోషించారు. రచయిత–నిర్మాత కోన వెంకట్ సమర్పణలో ఎంవీవీ సత్యనారాయణ, జీవీ నిర్మించిన ఈ చిత్రం ఈ ఏడాది ప్రథమార్ధంలో విడుదల కానుంది. శనివారం ఈ సినిమాలోని క్యారెక్టర్స్‌ను పరిచయం చేస్తూ విలేకర్ల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అంజలి మాట్లాడుతూ– ‘‘గీతాంజలి మళ్ళీ వచ్చింది’ అంతా ఒక ఎత్తైతే.. క్లైమాక్స్ మరో రేంజ్లో ఉంటుంది. ‘గీతాంజలి’ని ఫ్రాంచైజీగా చేస్తూ, కోనగారు ‘గీతాంజలి మళ్ళీ వచ్చింది’ చేశారు. కోనగారి కామెడీ ట్రాక్, ఈ సినిమాను ఆయన డిజైన్ చేసిన తీరు ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి. దర్శకుడు శివగారికి ఈ సినిమాతో పెద్ద బ్రేక్ వస్తుంది’’ అన్నారు. ‘‘గీతాంజలి మళ్ళీ వచ్చింది’’ని అమెరికాలో చేద్దామనుకున్నాం. కొన్ని ్రపాక్టికల్ కారణాల వల్ల ఊటీ బ్యాక్‌డ్రాప్‌కి మార్చాం. ప్రేక్షకులు వారి అంచనాలకు మించి ఈ సినిమాను ఎంజాయ్ చేస్తారు’’ అన్నారు కోన వెంకట్. ‘‘ప్రేక్షకులను భయపెడుతూ, నవ్విస్తూ ఎంజాయ్ చేసేలా ఈ సినిమా ఉంటుంది’’ అన్నారు శ్రీనివాస్ రెడ్డి. ‘‘బ్లాక్‌బస్టర్ మూవీ ‘గీతాంజలి’కి సీక్వెల్ చేసే అవకాశాన్ని కల్పించిన కోనగారికి, ఎంవీవీగారికి థాంక్స్’’ అన్నారు శివ తుర్లపాటి. నటుడు రవికృష్ణ, ఎడిటర్ చోటా కె. ప్రసాద్, సినిమాటోగ్రాఫర్ సుజాత సిద్ధార్థ్, మ్యూజిక్ డైరెక్టర్ ప్రవీణ్ లక్కరాజు మాట్లాడారు. -
వినోదాల పొట్టేల్
యువ చంద్రకృష్ణ, అనన్య నాగళ్ల ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘పొట్టేల్’. ‘బందం రేగడ్’, ‘సవారీ’ చిత్రాల ఫేమ్ సాహిత్ మోతుకూరి దర్శకత్వంలో నిశాంక్ రెడ్డి కుడితి, సురేష్ కుమార్ సడిగే నిర్మిస్తున్నారు. హైదరాబాద్‌లో జరిగిన ఈ సినిమా ఫస్ట్ ఇంపాక్ట్ లాంచ్ ఈవెంట్‌కు అతిథిగా హాజరైన నిర్మాత ప్రణయ్ రెడ్డి వంగా మాట్లాడుతూ– ‘‘పొట్టేల్’ సినిమా ఫస్ట్ లుక్ వీడియో చాలా ఇంపాక్ట్‌ఫుల్‌గా అనిపించింది. ఈ సినిమా షూటింగ్‌ను చూసేందుకు సెట్స్‌కు వెళ్లాను. ప్రేక్షకులకు ఓ మంచి కథని చూపించడానికి టీమ్ చాలా కష్టపడి పని చేసింది. ఈ సినిమా ప్రేక్షకులకు నచ్చి, పెద్ద విజయం సాధిస్తుందని నమ్ముతున్నా’’ అన్నారు. ‘‘వినోదంతో పాటు మంచి ప్రయోజనం కోసం చేసిన చిత్రమిది’’ అన్నారు యువ చంద్రకృష్ణ. ‘‘పొట్టేల్’ కథ రాసినప్పుడు ఎంత హై ఫీలయ్యానో అదే హై ఈ రోజు వరకూ వుంది. నిశాంక్, సురేష్ చాలా ఫ్రీ హ్యాండ్ ఇచ్చారు. యువ చంద్ర, అనన్య బెస్ట్ ఫెర్ఫార్మెన్స్ ఇచ్చారు. ఈ చిత్రంలో అజయ్‌గారు కీ రోల్ చేశారు’’ అన్నారు సాహిత్ మోతుకూరి. ‘‘సినిమా అద్భుతంగా వచ్చింది. త్వరలో రిలీజ్ డేట్ ప్రకటిస్తాం’’ అన్నారు నిశాంక్, సురేష్. ‘‘అందరూ గుర్తుంచుకునే చిత్రం అవుతుంది’’ అన్నారు అనన్య. -
శబ్దంతో థ్రిల్
దాదాపు పదిహేనేళ్లకు హీరో ఆది పినిశెట్టి–డైరెక్టర్ అరివళగన్–మ్యూజిక్ డైరెక్టర్ తమన్ల కాంబినేషన్ కుదిరింది. గతంలో ఈ ముగ్గురి కాంబినేషన్లో వచ్చిన సూపర్ నేచురల్ క్రైమ్ థ్రిల్లర్ ‘ఈరమ్’ (2009) మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. తెలుగులో ‘వైశాలి’గా విడుదలైంది. ఇక తాజాగా వీరి కాంబోలో తెలుగు, తమిళ ద్విభాషా చిత్రంగా ‘శబ్దం’ తెరకెక్కుతోంది. ఇది కూడా సూపర్ నేచురల్ క్రైమ్ థ్రిల్లర్ కావడం విశేషం. 7ఎ ఫిలింస్ శివ, ఆల్ఫా ఫ్రేమ్స్ నిర్మిస్తున్న ఈ చిత్రం ఫస్ట్ లుక్‌ని హీరో నాని విడదల చేశారు. ‘‘ఈ ‘శబ్దం’లో శబ్దానికి సంబంధించి ప్రత్యేక సన్నివేశాలు ఉంటాయి. ఇంటర్వెల్ సీక్వెన్స్ కోసమే రూ. 2 కోట్లతో 120 ఏళ్ల నాటి లైబ్రరీ సెట్‌ను నిర్మించాం. ఈ సినిమా కోసం తమన్ ప్రత్యేకమైన సౌండ్ ఎఫెక్ట్స్, ఆర్ఆర్ చేయడానికి హంగేరీకి వెళ్లాలని ప్లాన్ చేస్తున్నారు’’ అని యూనిట్ పేర్కొంది. సిమ్రాన్, లైలా, లక్ష్మీ మీనన్ తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్న ఈ చిత్రానికి కెమెరా: అరుణ్ పద్మనాభన్, సహనిర్మాత: భానుప్రియ శివ, ఎగ్జిక్యూటివ్ ్ర΄÷డ్యూసర్: ఆర్. బాలకుమార్. -
గ్యాంగ్‌స్టర్ రాక్షస రాజా
రానా హీరోగా తేజ దర్శకత్వంలో వచ్చిన ‘నేనే రాజు నేనే మంత్రి’ (2017) సూపర్ హిట్ అయిన సంగతి గుర్తుండే ఉంటుంది. ఈ కాంబినేషన్లో రెండో చిత్రం రూపొందనున్న విషయం తెలిసిందే. రానా పుట్టినరోజు (డిసెంబర్ 14) సందర్భంగా ఈ చిత్రం టైటిల్‌ని ‘రాక్షస రాజా’గా ప్రకటించి, రానా ఫస్ట్ లుక్‌ని విడుదల చేశారు. ‘‘ఇప్పటివరకూ చూడని క్రైమ్ వరల్డ్‌ని ఆవిష్కరిస్తూ ఇంటెన్స్ ఎమోషన్స్, ఫ్యామిలీ డ్రామాల సమ్మేళనంతో ఈ చిత్రం ఉంటుంది. గ్యాంగ్‌స్టర్ డ్రామాగా రూపొందించనున్న ఈ చిత్రం ప్రేక్షకులను ఓ అద్భుతమైన అనుభూతికి గురి చేస్తుంది. గ్రిప్పింగ్ కథనం, వండర్ఫుల్ విజువల్స్‌తో ‘రాక్షస రాజా’ తెలుగు పరిశ్రమలో కొత్త బెంచ్ మార్క్‌ను సెట్ చేయడానికి రెడీ అవుతోంది’’ అని చిత్ర యూనిట్ పేర్కొంది. -
నవ్వుల నమో
విశ్వంత్ దుద్దంపూడి, అనురూప్ కటారి హీరోలుగా, విస్మయ శ్రీ హీరోయిన్గా నటించిన చిత్రం ‘నమో’. ఈ చిత్రం ద్వారా ఆదిత్య రెడ్డి కుందూరు దర్శకునిగా పరిచయమవుతున్నారు. ఎ. ప్రశాంత్ నిర్మించిన ఈ సినిమా విడుదలకు సిద్ధమవుతోంది. ఈ మూవీ ఫస్ట్ లుక్‌ను దర్శకుడు భీమనేని శ్రీనివాసరావు విడుదల చేసి, మాట్లాడుతూ– ‘‘ఆదిత్య నా దగ్గర అసిస్టెంట్‌గా చేశాడు. ఏదో చేయాలనే, నేర్చుకోవాలనే తపన తనలో ఉంది. ‘నమో’ పేరు వినగానే ప్రధాని నరేంద్ర మోదీగారి మీద కథ అనుకున్నాను. హీరోల పాత్రల పేర్లలోని (నగేశ్, మోహన్) తొలి అక్షరాలతో టైటిల్ పెట్టినట్లు చెప్పాడు. ఈ సినిమా విజయం సాధించాలి’’ అన్నారు. ‘‘నమో’ ప్రేక్షకులు హాయిగా నవ్వుకునేలా ఉంటుంది’’ అన్నారు ఆదిత్య రెడ్డి కుందూరు. ‘‘ఇదొక వైవిధ్యమైన చిత్రం’’ అన్నారు విశ్వంత్ దుద్దంపూడి, అనురూప్ కటారి, విస్మయ. -
స్నేహానికి హద్దు లేదురా
ఆశిష్ గాంధీ, అశోక్, వర్ష, హ్రితిక హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం ‘హద్దు లేదురా..’. రాజశేఖర్ రావి దర్శకత్వంలో వీరేష్ గాజుల బళ్లారి నిర్మించారు. ఈ మూవీ టైటిల్, ఫస్ట్ లుక్‌ని దర్శకుడు క్రిష్ విడుదల చేసి, మాట్లాడుతూ– ‘‘హద్దు లేదురా..’ టైటిల్ బాగుంది. ఫస్ట్ లుక్, సినిమా థీమ్ వైవిధ్యంగా ఉన్నాయి. సినిమా హిట్ అవ్వాలి’’ అన్నారు. ‘‘అలనాటి కృష్ణార్జునులు స్నేహితులు అయితే ఎలా ఉంటారో తెలిపే కథ, కథనంతో ‘హద్దు లేదురా..’ రూ΄పొందింది. ఫైట్స్, పాటలు, సెకండ్ హాఫ్‌లో వచ్చే ట్విస్టులు, క్లైమాక్స్ ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి’’ అన్నారు రాజశేఖర్ రావి. ‘‘జనవరిలో మా సినిమాను విడుదల చేస్తాం’’ అన్నారు గాజుల వీరేశ్. ‘‘స్నేహం నేపథ్యంలో రూ΄పొందిన ‘హద్దు లేదురా..’ మా యూనిట్‌కి మంచి పేరు తీసుకొస్తుంది’’ అన్నారు ఆశిష్ గాంధీ. తనికెళ్ల భరణి, రాజీవ్ కనకాల ఇతర పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి సహ నిర్మాత: రావి మోహన్ రావు. -
కిడ్నాప్ చేయడం ఓ కళ
చైతన్యా రావు, సునీల్, శ్రద్ధా దాస్, మాళవికా సతీశన్ ముఖ్య తారలుగా రూపొందుతున్న చిత్రం ‘పారిజాత పర్వం’. కిడ్నాప్ ఈజ్ ఏన్ ఆర్ట్ అనేది ట్యాగ్ లైన్ (కిడ్నాప్ చేయడం అనేది ఓ కళ). సంతోష్ కంభంపాటి దర్శకత్వంలో మహిధర్ రెడ్డి, దేవేష్ నిర్మిస్తున్న ఈ క్రైమ్ కామెడీ ఎంటర్టైనర్ ఫస్ట్ లుక్ పోస్టర్స్ విడుదలయ్యాయి. ఒక పోస్టర్లో చైతన్యా రావు, సునీల్, శ్రద్ధా దాస్, శ్రీకాంత్ అయ్యంగార్లు చేతిలో గన్‌తో, ఇతర పాత్రలు ఆశ్చర్యంగా చూస్తున్నట్లు కనిపించారు. ఇంకో పోస్టర్లో శ్రద్ధా దాస్ చేతిలో గన్‌తో స్టయిలిష్‌గా కనిపించారు. -
యూత్‌ఫుల్ ప్రేమకథ
కిశోర్ కేఎస్డీ, దియా సితెపల్లి జంటగా నటిస్తున్న చిత్రం ‘ప్రేమకథ’. టాంగాప్రోడక్షన్స్ ఎల్ఎల్పీ, సినీ వ్యాలీ మూవీస్ పతాకాలపై విజయ్ మట్టపల్లి, సుశీల్ వాజపిల్లి, శింగనమల కల్యాణ్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమా ఫస్ట్ లుక్‌ను దర్శకుడు హరీష్ శంకర్ విడుదల చేసి, లుక్ బాగుందని, ఈ సినిమా విజయం సాధించాలని చిత్రబృందానికి శుభాకాంక్షలు తెలిపారు. ‘‘వైవిధ్యమైన లవ్‌స్టోరీతో నేటితరం యువ ప్రేక్షకులకు నచ్చేలా ఈ చిత్రం ఉంటుంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ చివరి దశలో ఉంది’’ అని చిత్ర యూనిట్ పేర్కొంది. ఈ చిత్రానికి సంగీతం: రథన్ , సహనిర్మాత: ఉపేంద్ర గౌడ్ ఎర్ర. -
ఒక్కటి గుర్తు పెట్టుకోండి!
దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి పాదయాత్ర నేపథ్యంలో దర్శకుడు మహి వి.రాఘవ్ తెరకెక్కించిన చిత్రం ‘యాత్ర’. వైఎస్ఆర్ పాత్రలో మమ్ముట్టి నటించారు. 2019 ఫిబ్రవరి 8న విడుదలైన ఈ చిత్రం ఘన విజయం సాధించింది. ఈ చిత్రానికి కొనసాగింపుగా ‘యాత్ర 2’ మూవీని తెరకెక్కిస్తున్నారు మహి వి.రాఘవ్. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి జీవితంలోని కొన్ని ఘటనల నేపథ్యంలో ఈ సినిమా రూపొందుతోంది. ఈ మూవీలో వైఎస్ జగన్ పాత్రలో తమిళ హీరో జీవా నటిస్తున్నారు. ‘యాత్ర’లో వైఎస్ఆర్ పాత్ర పోషించిన మమ్ముట్టి ‘యాత్ర 2’ లోనూ అదే పాత్ర పోషిస్తున్నారు. ఈ సినిమాలోని వైఎస్ రాజశేఖర రెడ్డి, వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాత్రలకు సంబంధించిన ఫస్ట్ లుక్‌ను మేకర్స్ విడుదల చేశారు. ‘నేనెవరో ఇంకా ఈ ప్రపంచానికి తెలియకపోవచ్చు. కానీ, ఒక్కటి గుర్తు పెట్టుకోండి... నేను వైఎస్ రాజశేఖర రెడ్డి కొడుకుని’ అనే అనే డైలాగ్స్ ఫస్ట్ లుక్ పోస్టర్లో ఉన్నాయి. మహి వి.రాఘవ్ మాట్లాడుతూ–‘‘వైఎస్ జగన్‌గారు ప్రజా నాయకుడిగా ఎదిగిన తీరు, 2009 నుంచి 2019 వరకు ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన రాజకీయ ఘటనల నేపథ్యంలో ‘యాత్ర 2’ రూపొందుతోంది. ఈ సినిమాని 2024 ఫిబ్రవరి 8న రిలీజ్ చేస్తాం’’ అన్నారు. త్రీ ఆటమ్ లీవ్స్, వీ సెల్యులాయిడ్‌పై శివ మేక నిర్మిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: మధి, సంగీతం: సంతోష్ నారాయణన్. -
ఫైట్.. హైలైట్
మంచు లక్ష్మి లీడ్ రోల్లో నటించిన చిత్రం ‘ఆదిపర్వం’. సంజీవ్ మేగోటి దర్శకత్వం వహించారు. రావుల వెంకటేశ్వర రావు సమర్పణలో అన్వికా ఆర్ట్స్–అమెరికా ఇండియా ఎంటర్టైన్మెంట్స్పై రూ΄పొందింది. కాగా ఆదివారం (అక్టోబర్ 8) మంచు లక్ష్మి పుట్టినరోజుని పురస్కరించుకుని ‘ఆదిపర్వం’లోని ఆమె ఫస్ట్ లుక్ విడుదల చేశారు మేకర్స్. ఈ సందర్భంగా సంజీవ్ మేగోటి మాట్లాడుతూ– ‘‘1974–1990 మధ్యకాలంలో జరిగిన వాస్తవ ఘటనలతో ఈ చిత్రం రూపొందింది. హై ఓల్టేజ్ యాక్షన్ డ్రామాతో పాటు ఎమోషనల్ లవ్ స్టోరీగా తెరకెక్కిన ఈ చిత్రంలో మంచు లక్ష్మి పాత్ర ఆమె కెరీర్లోనే చిరస్థాయిగా నిలిచిపోతుంది. తను చేసిన రెండు ఫైట్స్ సినిమాకి హైలెట్‌గా నిలుస్తాయి. ‘అమ్మోరు, అరుంధతి’ చిత్రాల తరహాలో కథ, గ్రాఫిక్స్ ఉంటాయి’’ అన్నారు. ‘‘రెట్రో ఫీల్‌తో ఫీల్ గుడ్ లవ్ స్టోరీగా మొదలై కంప్లీట్ యాక్షన్ థ్రిల్లర్‌గా ఈ చిత్రం అలరిస్తుంది’’ అన్నారు చిత్ర ఎగ్జిక్యూటివ్‌ప్రోడ్యూసర్ ఘంటా శ్రీనివాస రావ్, సహనిర్మాత గోరెంట శ్రావణి. ఈ చిత్రంలో ఆదిత్య ఓం, ఎస్తేర్, సుహాసిని తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో నటించారు. -
థ్రిల్ చేసే విధి
రోహిత్ నందా, ఆనంది జంటగా శ్రీకాంత్ రంగనాథన్, శ్రీనాథ్ రంగనాథన్ రచన, దర్శకత్వంలో ఎస్. రంజిత్ నిర్మించిన చిత్రం ‘విధి’. ఈ సినిమా ఫస్ట్ లుక్ లాంచ్ ఈవెంట్లో హీరో రోహిత్ నందా మాట్లాడుతూ– ‘‘విధి’ మాకెంతో స్పెషల్ మూవీ. ఆడియో డిస్క్రిప్టివ్ టెక్నాలజీతో ఈ సినిమాను చేశాం. దీంతో కంటి చూపు లేనివాళ్లు కూడా మా సినిమాను అనుభూతి చెందగలరు. ఈ చిత్రానికి శ్రీ చరణ్ పాకాలగారు అద్భుతమైన ఆర్ఆర్, సంగీతం ఇచ్చారు’’ అన్నారు. ‘‘ఓ డిఫరెంట్ కాన్సెప్ట్‌తో రూపొందిన మూవీ ‘విధి’’ అన్నారు నిర్మాత రంజిత్. ‘‘మాకు ఇది తొలి సినిమా. ప్రేక్షకులు ఆదరించాలి’’ అన్నారు శ్రీకాంత్, శ్రీనాథ్. ‘‘వినోదం మాత్రమే కాదు.. థ్రిల్లింగ్ అంశాలు కూడా ఈ సినిమాలో ఉన్నాయి’’ అన్నారు హీరోయిన్ ఆనంది. ‘‘ఈ సినిమాలో ట్విస్ట్‌లు బాగుంటాయి’’ అన్నారు శ్రీ చరణ్ పాకాల. నటుడు ‘రంగస్థలం’ మహేశ్ మాట్లాడారు.