‘పెట్రోమాక్స్’ ఫస్ట్ లుక్
ఇంట్లోని గడియారం, అల్మరా, అద్దం.. ఇలా అన్ని వస్తువులు తలకిందులుగా కనిపిస్తున్నాయి. అదే ఇంట్లో ఉన్న తమన్నా మాత్రం కుర్చీలో దర్జాగా కూర్చుని నవ్వుతున్నారు. విశేషం ఏంటంటే.. తమన్నా కూర్చున్న కుర్చీ మాత్రం తలకిందులుగా లేదు. ఇక్కడున్న ఫొటో చూశారుగా. తమన్నా ప్రధాన పాత్రలో నటిస్తోన్న తాజా తమిళ చిత్రంలోని స్టిల్ ఇది. రోహన్ వెంకటేశన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ ‘పెట్రోమాక్స్’ అనే టైటిల్‌ను ఖరారు చేసి, ఫస్ట్ లుక్‌ను విడుదల చేశారు. ఈ ఫస్ట్ లుక్‌ను తాప్సీ విడుదల చేశారు. ఈ సినిమాను సెప్టెంబర్‌లో విడుదల చేయాలనుకుంటున్నారు. ఈ సంగతి ఇలా ఉంచితే... తెలుగులో హిట్ సాధించిన ‘ఆనందోబ్రహ్మ’ సినిమాకు ‘పెట్రోమాక్స్’ తమిళ రీమేక్ అని టాక్. తెలుగు వెర్షన్‌లో తాప్సీ నటించిన విషయం తెలిసిందే. అందుకే తమిళ రీమేక్‌ని ఆమె చేతుల మీదుగా విడుదల చేయించి ఉంటారు.
Comments
Please login to add a commentAdd a comment