
విశాల్, తమన్నా
మాస్ హీరో విశాల్, మిల్కీ బ్యూటీ తమన్నాకి రెండోసారి జోడీ కుదిరిందా? అంటే అవుననే అంటున్నాయి కోలీవుడ్ వర్గాలు. ‘పందెం కోడి 2’ తర్వాత విశాల్ నటిస్తున్న చిత్రం ‘అయోగ్య’. తెలుగు హిట్ మూవీ ‘టెంపర్’ తమిళ రీమేక్ ఇది. వెంకట్ మోహన్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ఇటీవలే ప్రారంభమైంది. ఈ చిత్రం తర్వాత సుందర్.సి దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నారు విశాల్. ఇందులో ఆయనకి జోడీగా తమన్నాని తీసుకున్నారనే వార్తలు హల్‌చల్ చేస్తున్నాయి. విశాల్–తమన్నా రెండేళ్ల క్రితం ‘కత్తి సండై’(తెలుగులో ‘ఒక్కడొచ్చాడు) చిత్రంలో నటించి, ప్రేక్షకులను అలరించారు. తాజా చిత్రం రెగ్యులర్ షూటింగ్ డిసెంబరులో మొదలు కానుంది.
Comments
Please login to add a commentAdd a comment