Thamanna
-
మా అమ్మానాన్న కూడా అడగలేదు!
‘మీ పెళ్లెప్పుడు’ అనే ప్రశ్న లైఫ్‌లో ఒక దశలో దాదాపు అందరికీ ఎదురవుతుంటుంది. సెలబ్రిటీలను అయితే ప్రతి ఇంటర్వ్యూలో, బయటికి వెళ్లినప్పుడు.. ఇలా తరచూ ఈ ప్రశ్న వెంటాడుతుంటుంది. ఇటీవల తమన్నాని ఓ అభిమాని, ‘‘పెళ్లెప్పుడు చేసుకుంటారు? తమిళ అబ్బాయిలెవరైనా నచ్చారా?’’ అని అడిగితే.. ‘‘ఇప్పటివరకూ మా అమ్మానాన్న కూడా అడగలేదు’’ అంటూ ఈ బ్యూటీ కాస్త అసహనంగా సమాధానం ఇచ్చారు. ఇక తమిళ అబ్బాయిలు ఎవరైనా నచ్చారా? అనే ప్రశ్నని ఉద్దేశించి ‘‘ప్రస్తుతం చాలా ఆనందంగా ఉన్నాను. నా జీవితం చాలా ఆనందంగా సాగుతోంది’’ అని పేర్కొన్నారామె. నెగటివిటీని ఎలా హ్యాండిల్ చేస్తారు? అనే ప్రశ్నకు – ‘‘విమర్శలు, ప్రశంసలు.. రెండూ వస్తుంటాయి. విమర్శలు వచ్చినప్పుడు ఎందుకు అలా అన్నారా? అని ఆలోచిస్తాను. అయితే విమర్శ, ప్రశంస.. ఏదైనా వారి వ్యక్తిగత అభి్ర΄ాయమే. అందుకని పెద్దగా పట్టించుకోను’’ అన్నారు తమన్నా. -
పోలీస్ ఆఫీసర్లుగా ఆన్ డ్యూటీలో ఉన్న హీరోయిన్లు
పోలీస్ ఆఫీసర్లుగా కొందరు నాయికలు దోషులను పట్టుకునేందుకు రెడీ అయ్యారు. ఇందులో భాగంగా కేసు వివరాల కోసం లోతుగా విచారణ చేస్తూ, ఇన్వెస్టిగేషన్ మోడ్‌లోకి వెళ్లి΄ోయారు. ఈ తారల పరిశోధనల విశేషాల్లోకి వెళదాం. ఆన్ ఇన్వెస్టిగేషన్ తొలి అడుగు రెండు దశాబ్దాలుగా అగ్రకథానాయికగా త్రిష ప్రయాణం దిగ్విజయంగా కొనసాగుతోంది. ఇప్పుడు డిజిటల్ ఎంటర్టైన్మెంట్ హవా కూడా నడుస్తున్న తరుణంలో ఈ ΄్లాట్‌ఫామ్‌లో ఆమె సైన్ చేసిన తొలి వెబ్ సిరీస్ ‘బృందా’. ఇందులో త్రిషపోలీసాఫీసర్గా నటిస్తున్నారు. పూర్తి స్థాయిపోలీసాఫీసర్ పాత్రలో త్రిష నటిస్తుండటం కూడా ఇదే మొదటిసారి అనొచ్చు. క్రైమ్–ఇన్వెస్టిగేషన్ నేపథ్యంలో ఈ సిరీస్‌కు సురేష్ వంగలా దర్శకత్వం వహిస్తున్నారు. తెలుగులో రూపొందుతున్న ఈ సిరీస్ ఇతర భాషల్లో అనువాదమై, త్వరలో స్ట్రీమింగ్ కానుంది. పవర్ఫుల్ సత్యభామ హైదరాబాద్‌లో అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్‌పోలీస్ సత్యభామగా చార్జ్ తీసుకున్నారు కాజల్ అగర్వాల్. ఆమె టైటిల్ రోల్లో రూపొందుతున్న చిత్రం ‘సత్యభామ’. ఈ చిత్రంలో ఏసీపీ సత్యభామ పాత్ర చేస్తున్నారు కాజల్. ఆల్రెడీ టీజర్‌ను కూడా రిలీజ్ చేశారు. అఖిల్ డేగల ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. గతంలో కొన్ని చిత్రాల్లో కాజల్పోలీసాఫీసర్ పాత్రలో నటించినప్పటికీ ఓ పూర్తి స్థాయి ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్‌గా నటించడం ఇదే తొలిసారి. ఆఖరి నిజం ఢిల్లీలో 2018లో జరిగిన బురారి ఆత్మహత్యల ఘటన ఆధారంగా ఇప్పటికే కొన్ని వెబ్ సిరీస్‌లు రూపొందాయి. తాజాగా రూపొందిన మరో వెబ్‌సిరీస్ ‘ఆఖ్రీ సచ్’ (ఆఖరి నిజం). ఆత్మహత్యల మిస్టరీ చేధించే ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ ఆన్యగా తమన్నా నటించారు. ఈ తరహా పాత్ర చేయడం ఇదే తొలిసారి అని ఇటీవల తమన్నా పేర్కొన్నారు. రాబీ గ్రేవాల్ ఈ వెబ్ సిరీస్‌కు దర్శకత్వం వహించారు. ఇలా ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్స్‌గా మరికొందరు తారలు నటిస్తున్నారు. -
హాలీడే టూర్స్‌లో స్టార్స్ బిజీ బిజీ
స్టోరీ సిట్టింగ్స్, సినిమా షూటింగ్స్, ప్రమోషన్స్... ఇలా ఎప్పుడూ బిజీ బిజీగా ఉంటుంటారు సినిమా స్టార్స్. అందుకే అప్పుడప్పుడూ కాస్త రిలాక్స్ అవ్వాలనుకుంటారు. విహారం.. వినోదం కోసం కొంత టైమ్ కేటాయిస్తారు. ప్రస్తుతం అలా వెకేషన్ మోడ్‌లో ఏ స్టార్స్ ఎక్కడున్నారో తెలుసుకుందాం. మాల్దీవుల్లో మస్తీ వెకేషన్ స్పాట్ కోసం మాల్దీవులను ఎంచుకున్నారు రజనీకాంత్. వారం రోజుల క్రితం ఆయన మాల్దీవులకు వెళ్లిన సంగతి గుర్తుండే ఉంటుంది. అక్కడి బీచ్‌లో రజనీ నడుస్తున్న ఫొటోలు కూడా నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. ఇక వెకేషన్ నుంచి తిరిగొచ్చిన తర్వాత ‘జై భీమ్’ ఫేమ్ టీజే జ్ఞానవేల్ దర్శకత్వంలోని సినిమా, లోకేశ్ కనగరాజ్ డైరెక్షన్‌లోని సినిమాలతో రజనీకాంత్ బిజీ అవుతారు. విదేశాల్లో బర్త్ డే ఇటీవలి కాలంలో సినిమా షెడ్యూల్స్‌కి కాస్త గ్యాప్ రావడంతో మహేశ్‌బాబు హాలిడే మోడ్‌లో ఉంటున్నారు. ప్రస్తుతం ఫ్యామిలీతో కలిసి దుబాయ్ వెకేషన్లో ఉన్నారు మహేశ్‌బాబు. రెండు వారాలకు పైగానే ఈ వెకేషన్‌ను ΄్లాన్ చేసినట్లు తెలుస్తోంది. ఆగస్టు 9న మహేశ్ బర్త్ డే. ఈ పుట్టినరోజుని విదేశాల్లోనే ఫ్యామిలీతో కలిసి జరుపుకుంటారని తెలుస్తోంది. ఇక ప్రస్తుతం త్రివిక్రమ్ దర్శకత్వంలో మహేశ్‌బాబు ‘గుంటూరు కారం’ సినిమా చేస్తున్నారు. వెకేషన్ కంటిన్యూ ఈ ఏడాది సంక్రాంతి సమయంలో విడుదలైన అజిత్ తమిళ చిత్రం ‘తునివు’ (తెలుగులో ‘తెగింపు’). ఆ సినిమా తర్వాత దాదాపు హాలిడే మూడ్‌లోనే ఉన్నారు అజిత్. తనకు ఇష్టమైన బైక్స్‌పై విదేశాల్లోని బ్యూటిఫుల్ లొకేషన్స్‌ను సందర్శించారు. కాగా అజిత్ తర్వాతి చిత్రం ‘విడా ముయర్చి’ ప్రకటన వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలు కావడానికి మరికొంత సమయం ఉందట. దీంతో మరోసారి అజిత్ విదేశాలకు ప్రయాణమయ్యారని టాక్. షార్ట్ గ్యాప్ విజయ్ హీరోగా నటించిన ‘లియో’ చిత్రం ఈ దసరాకు విడుదల కానుంది. అలాగే విజయ్ నెక్ట్స్ ఫిల్మ్ వెంకట్ ప్రభు దర్శకత్వంలో ఉంటుంది. ఈ చిత్రం ఆరంభం కావడానికి కాస్త టైమ్ ఉందట. ఈ షార్ట్ గ్యాప్‌లో విజయ్ విదేశాలకు వెళ్లారని కోలీవుడ్ సమాచారం. బాలీలో జాలీగా.. ఆరోగ్య, వ్యక్తిగత కారణాల దృష్ట్యా సినిమా చిత్రీకరణలకు కాస్త దూరంగా ఉండాలని సమంత నిర్ణయించుకున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా సమంత వెకేషన్ కోసం బాలీ వెళ్లారు. అక్కడ ఐస్ బాత్ చేశారు సమంత (మెరుగైన ఆరోగ్యం కోసం ఓ ప్రక్రియ). మైనస్ 4 డిగ్రీల చలిలో ఆరు నిమిషాల ΄అటు ఐస్ బాత్ చేసినట్లుగా సోషల్ మీడియాలో షేర్ చేశారీ బ్యూటీ. ఇక సమంత హీరోయిన్గా నటించిన ‘ఖుషీ’ చిత్రం సెప్టెంబరు 1న విడుదల కానుంది. ఇందులో విజయ్ దేవరకొండ హీరో. అలాగే వరుణ్ ధావన్, సమంత లీడ్ రోల్స్‌లో నటించిన ‘సిటాడెల్’ ఇండియన్ వెర్షన్ వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ తేదీపై త్వరలోనే ఓ స్పష్టత రానుంది. దుబాయిలో హాయి హాయి.. గత నెల మాల్దీవుల్లో రకుల్ ప్రీత్ సింగ్ చాలా జోష్‌గా గడి΄ారు. ఈ హాలిడేని ఫుల్లుగా ఎంజాయ్ చేశారు. తాజాగా ఫ్యామిలీతో కలిసి దుబాయ్ రిసార్ట్స్‌లో ఫుల్ జోష్‌లో ఉన్నారు రకుల్. తన తల్లి బర్త్ డేను దుబాయ్‌లో గ్రాండ్‌గా సెలబ్రేట్ చేశారామె. ఇందుకోసమే రకుల్ అండ్ ఫ్యామిలీ దుబాయ్ వెళ్లారు. ‘భోళా శంకర్’ షూటింగ్‌ను పూర్తి చేసిన తర్వాత వెకేషన్‌కు వెళ్లొచ్చారు చిరంజీవి. ఇటీవలే హైదరాబాద్ తిరిగొచ్చిన చిరంజీవి ఆగస్టు 11న విడుదల కానున్న ‘భోళా శంకర్’ ప్రమోషన్స్‌తో బిజీ అవుతారని తెలుస్తోంది. ఇక ఇటీవలే ఆస్ట్రియా వెళ్లొచ్చారు వెంకటేశ్. అక్కడ కొంత క్వాలిటీ హాలి డే టైమ్‌ను స్పెండ్ చేసొచ్చారు. ప్రస్తుతం ‘సైంధవ్’ సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నారు వెంకటేశ్. ఈ చిత్రం డిసెంబరు 22న విడుదల కానుంది. మరోవైపు యాభై రోజులు యూఎస్‌లో స్పెండ్ చేసిన ప్రభాస్ హైదరాబాద్‌కు తిరిగి వచ్చారు. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలోని ‘సలార్’, మారుతి దర్శకత్వంలోని ‘రాజా డీలక్స్’ (ప్రచారంలో ఉన్న ఓ టైటిల్) చిత్రాలతో ప్రభాస్ బిజీ అవుతారని తెలుస్తోంది. ఇటు దర్శకుల విషయానికి వస్తే... రాజమౌళి తమిళనాడులోని ఆధ్యాత్మిక లొకేషన్స్‌లో ఎక్కవ టైమ్ స్పెండ్ చేశారు. ఇలా వెకేషన్‌కి వెళ్లొచ్చిన హీరో హీరోయిన్లు, దర్శకులు మరికొందరు ఉన్నారు. -
ఇండస్ట్రీని షేక్ చేస్తున్న చిరు తమన్నా స్టెప్స్
-
కాన్స్ చిత్రోత్సవంలో మన తారలు
ప్రతిష్టాత్మక కాన్స్ చలన చిత్రోత్సవానికి రంగం సిద్ధమైంది. 75వ కాన్స్ చలన చిత్రోత్సవం ఈ నెల 17 నుంచి 28 వరకు జరగనుంది. ఈ వేడుకల తొలి రోజు భారతదేశం తరఫున అక్షయ్ కుమార్, ఏఆర్ రెహమాన్, పూజా హెగ్డే రెడ్ కార్పెట్‌పై సందడి చేయనున్నారు. వీరితో పాటు శేఖర్ కపూర్, తమన్నా, నయన తార, నవాజుద్దీన్ సిద్ధిఖీ, సీబీఎఫ్సీ (సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్) చైర్మన్ ప్రసూన్ జోషి, సీబీఎఫ్సీ బోర్డు సభ్యురాలు వాణీ త్రిపాఠి తదితరులు కనిపిస్తారు. ఈ టీమ్‌కు కేంద్రమంత్రి అనురాగ్ ఠాకూర్ సారథ్యం వహిస్తారు. ఇక దీపికా పదుకోన్ ఈసారి కాన్స్ ఉత్సవాల్లో జ్యూరీ సభ్యురాలిగా పాల్గొననుండటం విశేషం. ఈ వేడుకల్లో ‘క్లాసిక్ సినిమా’ విభాగంలో సత్యజిత్ రే తీసిన ‘ప్రతిధ్వని’ స్క్రీనింగ్ అవుతుంది. అలాగే నటుడు మాధవన్ దర్శకత్వం వహించిన ‘రాకెట్రీ: ది నంబి ఎఫెక్ట్’ మే 19న ప్రదర్శితం కానుంది. భారత ఖగోళ శాస్త్రవేత్త నంబి నారాయణన్ జీవితం ఆధారంగా రూపొందిన ఈ చిత్రంలో నంబి నారాయణన్ పాత్రను మాధవన్ పోషించారు. అలాగే ఢిల్లీకి చెందిన షౌనక్ సేన్ రూపొందించిన డాక్యుమెంటరీ ‘ఆల్ దట్ బ్రీత్స్’ స్పెషల్ స్క్రీనింగ్ విభాగంలో ప్రదర్శితం కానుంది. కమల్‌హాసన్ నటించిన ‘విక్రమ్’ ట్రైలర్ కూడా విడుదల కానుంది. -
సంతోషం అవార్డ్స్‌లో తళుక్కుమన్న తారలు
-
తమన్నా స్పెషల్ సాంగు.. వరుణ్ మాసు స్టెప్పు
‘గని’తో మిల్కీ బ్యూటీ తమన్నా స్పెషల్ స్టెప్పులేయనున్నారా? అంటే అవుననే అంటున్నాయి ఫిల్మ్‌నగర్ వర్గాలు. వరుణ్ తేజ్ హీరోగా కిరణ్ కొర్రపాటి దర్శకత్వంలో రూపొందుతున్న తాజా చిత్రం ‘గని’. ఇందులో బాలీవుడ్ బ్యూటీ సయీ మంజ్రేకర్ హీరోయిన్గా నటిస్తున్నారు. ఈ చిత్రంలో వరుణ్ బాక్సర్‌గా కనిపించనున్నారు. ఈ సినిమా ఫైనల్ షెడ్యూల్ చిత్రీకరణ హైదరాబాద్‌లో జరుగుతోంది. కాగా ఈ సినిమాలో ఉన్న ఓ స్పెషల్ సాంగ్‌లో నర్తించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట తమన్నా. త్వరలో ఈ మాసీ సాంగ్‌ను చిత్రీకరించనున్నారట. ఇప్పటికే ‘అల్లుడు శీను’, ‘స్పీడున్నోడు’, ‘జాగ్వార్’, ‘జై లవకుశ’, ‘కేజీఎఫ్: ఛాప్టర్ వన్’, ఇటీవల ‘సరిలేరు నీకెవ్వరు’ చిత్రాల్లో తమన్నా స్పెషల్ సాంగ్స్ చేసిన సంగతి గుర్తుండే ఉంటుంది. అయితే ‘గని’ చిత్రాన్ని ఈ నెల 30న రిలీజ్ చేయాలనుకున్నారు. కోవిడ్ కారణంగా రిలీజ్ వాయిదా పడింది. -
యశ్‌కు జోడీ కుదిరిందా?
‘కేజీఎఫ్’ చిత్రంతో హీరోగా దేశవ్యాప్తంగా గుర్తింపు సంపాదించారు కన్నడ స్టార్ యశ్. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందిన విషయం తెలిసిందే. ప్రస్తుతం యశ్–ప్రశాంత్ ‘కేజీఎఫ్ 2’ చేస్తున్నారు. ఈ చిత్రం తర్వాత కన్నడ డైరెక్టర్ నార్తన్ తెరకెక్కించనున్న చిత్రంలో యశ్ ఓ సినిమా చేయనున్నారట. ఈ చిత్రంలో పవర్ఫుల్ అండ్ యాంగ్రీ ఆర్మీ ఆఫీసర్ పాత్రలో కనిపిస్తారట యశ్. ఇందులో హీరోయిన్గా తమన్నాని తీసుకోవాలనుకుంటున్నారని సమాచారం. యశ్ ‘కేజీఎఫ్’ మొదటి భాగంలో తమన్నా ఓ స్పెషల్ సాంగ్ చేసిన విషయం గుర్తుండే ఉంటుంది. నార్తన్ దర్శకత్వంలో యశ్ చేయనున్నది ప్యాన్ ఇండియా సినిమా కావడంతో ఇటు దక్షిణాది అటు ఉత్తరాది భాషల్లో మంచి గుర్తింపు ఉన్న తమన్నా అయితే కథానాయికగా బాగుంటుందని భావించారట. మరి... యశ్, తమన్నాల జోడీ కుదురుతుందా? అధికారిక ప్రకటన వస్తేనే తెలుస్తుంది. -
Tamannah Bhatia: ఆ విషయంలో నేను లక్కీ
‘‘డిజిటల్ ప్లాట్‌ఫామ్స్ హవా పెరిగిన తర్వాత ఎంటర్టైన్మెంట్ను ప్రేక్షకులు ఆస్వాదించే విధానంలో మార్పులు చోటు చేసుకున్నాయి’’ అంటున్నారు తమన్నా. అలాగే నటీనటుల స్టార్డమ్ విషయంలో కూడా ఈ తరం ప్రేక్షకుల ఆలోచనా ధోరణి మారుతోందని అంటున్నారీ బ్యూటీ. ఈ విషయం గురించి తమన్నా మాట్లాడుతూ – ‘‘ఒకప్పుడు జస్ట్ ప్రతిభ ఉంటేనే ఫ్యాన్స్ అయిపోయేవారు. కానీ ఇప్పుడు నటీనటుల ప్రతిభని మాత్రమే చూసి, ఫ్యాన్స్ అయిపోవడంలేదు. ప్రతిభతో పాటు ప్రేక్షకులు కోరుకుంటున్న కొత్తదనానికి తగ్గ పాత్రలు చేసినప్పుడే యాక్టర్స్ వారి అభిమానాన్ని మరింత పొందగలుగుతున్నారు. నేను ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో ఫ్యాన్ ఫాలోయింగ్ ఇప్పటి పరిస్థితులతో పోల్చి చూసినప్పుడు డిఫరెంట్‌గా ఉండేది. పదేళ్ల క్రితం ఫ్యాన్‌బేస్ ఆర్గానిక్‌గా ఉండేది. ఏది ఏమైనా ఆ తరం అభిమానులతో పాటు ఈ తరం ప్రేక్షకుల అభిమానాన్ని కూడా నేను పొందగలగడం నా లక్’’ అన్నారు. తమన్నా నటించిన ‘లెవెన్త్ అవర్’, ‘నవంబరు స్టోరీస్’ వెబ్ సిరీస్‌లు ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌లో స్ట్రీమింగ్ అవుతున్న సంగతి తెలిసిందే. ‘సీటీమార్’ సినిమా ను పూర్తి చేసిన తమన్నా ప్రస్తుతం ‘గుర్తుందా.. శీతాకాలం’, ‘మ్యాస్ట్రో’, ‘ఎఫ్ 3’ సినిమాల్లో నటిస్తు న్నారు. -
New Movies Updates: పాంచ్ పటాకా!
ఒకటీ.. రెండు.. మూడు... ఐదు వరకూ లెక్కపెట్టాల్సిందే. ఎందుకంటే అందాల తారలు వరుసగా ఐదు సినిమాల్లో కనిపించనున్నారు. ప్లాన్ చేసినట్లుగా సినిమాలు విడుదలయ్యుంటే.. లెక్క ఐదు వరకూ వచ్చేది కాదు. వాయిదా పడిన సినిమాలు విడుదలయ్యే నాటికి చేతిలో ఉన్న సినిమాలు రెడీ అవుతాయి. అలా ఇప్పటికే పూర్తి చేసిన సినిమాలు, చేస్తున్న సినిమాలతో కలిపి కొందరి నాయికల డైరీలో ఐదు సినిమాలు కచ్చితంగా ఉన్నాయి. ఆ ‘పాంచ్ పటాకా’ సినిమాల గురించి తెలుసుకుందాం. క్రేజీ బుట్ట బొమ్మ బుట్టబొమ్మ పూజాహెగ్డే జోరు మామూలుగా లేదు. ఉత్తరాదిలోనైనా, దక్షిణాదిలోనైనా పూజ క్రేజ్ వేరు. ఈ క్రేజే ఈ బ్యూటీకి వరుస ఆఫర్లు తెచ్చిపెడుతోంది. ఇప్పటికే ప్రభాస్ ‘రాధేశ్యామ్’, అఖిల్ ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్’, చిరంజీవి ‘ఆచార్య’లో రామ్‌చరణ్ సరసన పూజ చేస్తున్న సినిమాల చిత్రీకరణలు దాదాపు పూర్తయ్యాయి. ఇక నిర్మాణంలో ఉన్న చిత్రాల విషయానికొస్తే.. ఇటీవల తమిళ హీరో విజయ్ సరసన ఓ సినిమా కమిట్ అయ్యారు పూజ. అటు హిందీలో రణ్వీర్ సింగ్ చేస్తున్న ‘సర్కస్’ చిత్రంలో హీరోయిన్గా చేస్తున్న పూజ.. సల్మాన్ ఖాన్‌తో ‘కభీ ఈద్ కభీ దీవాలి’ సినిమాలోనూ హీరోయిన్గా కమిట్ అయ్యారు. థియేటర్స్ ఓపెన్ అయితే.. రాధేశ్యామ్, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్, సర్కస్.. ఇలా వరుసగా వెండితెరపై ప్రేక్షకులకు దర్శనం ఇస్తారు పూజ. కాజల్ తగ్గేదే లే ! ఇండస్ట్రీకి వచ్చి పదిహేనేళ్లు పూర్తయ్యాయి. కెరీర్లో యాభై చిత్రాల మైలురాయిని చేరుకున్నారు. అయినా సరే.. కాజల్ అగర్వాల్ క్రేజ్ మాత్రం తగ్గలేదు. ఆమెకు వస్తున్న అవకాశాలే ఇందుకు నిదర్శనం. తెలుగులో చిరంజీవి ‘ఆచార్య’, నాగార్జునతో ఓ సినిమా (ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో..), తమిళంలో లేడీ ఓరియంటెడ్ సినిమాలు ‘ఘోస్టీ’, డీకే దర్శకత్వంలో సినిమా, మలయాళంలో దుల్కర్ సల్మాన్ ‘హే సినామిక’ (ఒక హీరోయిన్గా.. మరో హీరోయిన్ అదితీరావ్ హైదరీ) చిత్రాల్లో హీరోయిన్గా చేస్తున్నారు కాజల్. అలాగే కమల్‌హాసన్‌తో కాజల్ అగర్వాల్ హీరోయిన్గా చేయాల్సిన ‘ఇండియన్ 2’ సినిమా ప్రస్తుతానికి ఆగిపోయింది. కాజల్ నటించిన ‘ప్యారిస్ ప్యారిస్ (హిందీ ‘క్వీన్’కు తమిళ రీమేక్) విడుదల కావాల్సి ఉంది. మిగతా హీరోయిన్లకు హిందీతో కలిపి ఐదు ప్రాజెక్ట్స్ అయితే కాజల్ మాత్రం సౌత్‌లోనే ఐదు సినిమాలు చేస్తున్నారు. అంతేకాదు.. ఇటు వెబ్ సిరీస్‌లు (కాజల్ నటించిన ‘లైవ్ టెలికాస్ట్’ ఇటీవల విడుదలైంది) కూడా చేస్తూ ‘తగ్గేదే లే’ అంటున్నారు కాజల్. తాప్సీ దూకుడు బాలీవుడ్లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్స్ జాబితాలో చేరిపోయారు తాప్సీ. గడచిన మూడేళ్ళుగా తాప్సీ ఏడాదికి నాలుగు సినిమాలకు సైన్ చేస్తున్నారు. అంతే వేగంగా ఆ సినిమాల షూటింగ్స్‌ను పూర్తి చేస్తున్నారు. ఈ ఏడాది కూడా అదే దూకుడును చూపించారు. ‘హసీన్ దిల్రుబా’, ‘రష్మీ: ది రాకెట్’, ‘లూప్ లపేటా’ (జర్మన్ థ్రిల్లర్ ‘రన్ లోలా రన్’కు హిందీ రీమేక్) ‘దో బార’ సినిమాల షూటింగ్‌లను పూర్తి చేసి, విడుదలకు సిద్ధంగా ఉంచారు. ప్రస్తుతం ‘శభాష్ మీతూ’ (క్రికెటర్ మిథాలీరాజ్ బయోపిక్), సౌత్‌లో విజయ్ సేతుపతితో ఒక సినిమా చేస్తున్నారు తాప్సీ. ‘హసీన్ దిల్రుబా’ చిత్రం ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. మిగతా చిత్రాలు థియేటర్స్‌లో విడుదలయ్యే అవకాశమే ఉంది. తమన్నా హవా మిల్కీ బ్యూటీ తమన్నా తన డైరీని ఖాళీగా ఉంచేందుకు ఇష్టపడటం లేదు. వెంకటేష్ – వరుణ్ తేజ్ ‘ఎఫ్ 3’, సత్యదేవ్ ‘గుర్తుందా..శీతాకాలం’ చిత్రాల్లో తమన్నా హీరోయిన్గా చేస్తున్నారు. నితిన్ ‘మ్యాస్ట్రో’లో కీలక పాత్రలో కనిపించనున్నారు. అలాగే తమన్నా హీరోయిన్గా నటించిన ‘సీటీమార్’ సినిమా ఈ ఏడాది ఈపాటికే విడుదల కావాల్సింది. కరోనా కారణంగా వాయిదా పడింది. సంపత్ నంది దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో గోపీచంద్ హీరోగా నటించారు. ఇక బాలీవుడ్లో తమన్నా నటించిన ‘భోలే చూడియాన్’ చిత్రీకరణ పూర్తయింది. హిందీ హిట్ ‘క్వీన్’ తెలుగు రీమేక్ ‘దటీజ్ మహాలక్ష్మీ’ చిత్రంలో టైటిల్ రోల్ చేశారు తమన్నా. ఈ సినిమా షూటింగ్ ఎప్పుడో పూర్తయినప్పటికీ విడుదల కాలేదు. ఇంకో విశేషం ఏంటంటే... ‘సీటీమార్’ (ఏప్రిల్ 2), ‘మ్యాస్రో’్ట (జూన్ 11), ‘ఎఫ్ 3’ (ఆగస్టు 27).. ఈ ఏడాది విడుదల కావాల్సిన చిత్రాలు. కానీ కరోనా వల్ల కాలేదు. వచ్చే ఏడాది తెలుగు తెరపై తమన్నా హవా తప్పక కనిపిస్తుందని అర్థం అవుతోంది. రాకెట్ వేగంతో రష్మిక దక్షిణాది అగ్రకథానాయికల్లో రష్మికా మందన్నా పేరు కూడా ఉంది. ఇదే సీన్‌ను ఉత్తరాదిలోనూ రిపీట్ చేయాలనే ఉత్సాహం ఆమెలో కనిపిస్తోంది. ఈ కన్నడ బ్యూటీ హిందీలో ఏకంగా మూడు చిత్రాలు చేజిక్కించుకున్నారు. సిద్ధార్థ్ మల్హోత్రాతో ‘మిషన్ మజ్ను’, బిగ్ బి అమితాబ్ బచ్చన్ కాంబినేషన్లో ‘గుడ్ బై’ చిత్రాలు చేస్తున్నారు రష్మిక. అలాగే మరో హిందీ సినిమా కూడా సైన్ చేశానని, త్వరలో ఆ వివరాలు చెబుతానని ఇటీవల ఇన్స్టాగ్రామ్ చాట్ సెషన్లో రష్మికా మందన్నా వెల్లడించారు. ఈ మూడు ప్రాజెక్ట్స్ కాకుండా తెలుగులో అల్లు అర్జున్ నటిస్తున్న ప్యాన్ ఇండియన్ మూవీ ‘పుష్ప’, శర్వానంద్ ‘ఆడవాళ్ళు మీకు జోహార్లు’ చిత్రాల్లో రష్మికా మందన్నా హీరోయిన్గా నటిస్తున్నారు. తెలుగులో ఈ రెండు చిత్రాలే కాకుండా మరో చిత్రంలో హీరోయిన్గా నటించేందుకు కూడా రష్మికా చర్చలు జరుపుతున్నట్లు తెలిసింది. ఇలా దక్షిణ, ఉత్తరాదిలో రాకెట్ వేగంతో కెరీర్లో దూసుకెళ్తున్నారు రష్మికా మందన్నా. రకుల్.. డైరీ ఫుల్ సౌత్‌లో హీరోయిన్గా తనదైన ముద్ర వేసిన రకుల్‌ప్రీత్ సింగ్ ఇప్పుడు బాలీవుడ్లో వరుస సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నారు. ఇప్పటికే జాన్ అబ్రహాం ‘ఎటాక్’ అజయ్ దేవగణ్ ‘మేడే’, ‘థ్యాంక్ గాడ్’ చిత్రాల్లో హీరోయిన్గా చేస్తున్న రకుల్ తాజాగా తేజస్ డియోస్కర్ దర్శకత్వంలో సినిమా చేసేందుకు ఓకే చెప్పారు. ఇందులో కండోమ్ టెస్టర్‌గా రకుల్ పాత్ర ఉంటుందనే ప్రచారం జరుగుతోంది. హిందీలో ఈ నాలుగు చిత్రాలతో పాటు తెలుగులో క్రిష్ దర్శకత్వంలో ఓ సినిమా (ఇందులో వైష్ణవ్‌తేజ్ హీరో), తమిళంలో శివ కార్తికేయన్ ‘ఆయలాన్’ చిత్రాల్లో రకుల్‌ప్రీత్ సింగ్ హీరోయిన్గా కనిపిస్తారు. ఇప్పుడు చేస్తున్న సినిమాలతో రకుల్ డైరీ ఫుల్. డిఫరెంట్ కృతీ మహేశ్‌బాబు ‘వన్: నేనొక్కడినే’ చిత్రంలో హీరోయిన్గా నటించిన కృతీ సనన్ గుర్తుండే ఉంటారు. ఇప్పుడు కృతీ హవా బాలీవుడ్లో స్పష్టంగా కనిపిస్తోంది. ‘ఇట్స్ మై టైమ్’ అంటు కృతీ ప్రస్తుతం ఐదు చిత్రాలకు సైన్ చేశారు. ప్రభాస్ మైథలాజికల్ ఫిల్మ్ ‘ఆదిపురుష్’, వరుణ్ ధావన్ హారర్ ఫిల్మ్ ‘బేడియా’, అక్షయ్ కుమార్ గ్యాంగ్‌స్టర్ డ్రామా ‘బచ్చన్ పాండే చిత్రాల్లో హీరోయిన్గా నటిస్తున్నారు కృతీ సనన్. ఈ చిత్రా లే కాకుండా... రాజ్‌కుమార్ రావ్‌తో ‘హమ్ దో హమారే దో’, టైగర్ ష్రాఫ్ యాక్షన్ ఫిల్మ్ ‘గణ్‌పత్’ చిత్రాల్లో కృతీసననే హీరోయిన్. మరోవైపు కృతీ నటించిన లేడీ ఓరియంటెడ్ ఫిల్మ్ ‘మిమి’ విడుదలకు సిద్ధమైన సంగతి తెలిసిందే. ఈ చిత్రం ఓటీటీలో విడుదల అవుతుందనే ప్రచారం సాగుతోంది. మైథాలజీ, యాక్షన్, రొమాన్స్, హారర్.. ఇలా ఒకేసారి డిఫరెంట్ జానర్స్‌లో సినిమాలు చేసే అవకాశం రావడం అంటే గొప్ప విషయం. ఈ అవకాశాలను ఛాలెంజ్‌గా తీసుకుని, నిరూపించుకోవడానికి శాయశక్తులా కృషి చేస్తున్నారు కృతీ సనన్. ట్రిపుల్ రోల్ దీపికా హెడ్డింగ్ చదివి, ఫోటో చూసి దీపికా పదుకోన్ మూడు పాత్రలతో ఓ సినిమా వస్తుందనుకుంటే పొరపాటే. ఇంతకీ విషయం ఏంటంటే... అతిథిగా, నిర్మాతగా, హీరోయిన్గా దీపికా పదుకోన్ సినిమాలు చేస్తున్నారు. ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించనున్న చిత్రం, షారుక్ ఖాన్ ‘పఠాన్’, హృతిక్ రోషన్ ‘ఫైటర్’, దర్శకుడు శకున్ బాత్రా దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రాల్లో హీరోయిన్గా కనిపిస్తారు దీపిక. ఇక తన భర్త, నటుడు రణ్వీర్ సింగ్ నటించిన ‘83, సర్కస్’ చిత్రాల్లో అతిథి పాత్రలు చేశారామె. క్రికెట్లో భారత జట్టు తొలిసారి ప్రపంచకప్పు సాధించిన 1983 సంఘటనల ఆధారంగా రూపొందిన ‘83’ చిత్రానికి దీపిక ఓ నిర్మాత. అలాగే దీపక నిర్మాతగా మహాభారతంలోని ద్రౌపది పాత్ర ఆధారంగా ఓ సినిమా రూపొందనుందని, ఇందులో ద్రౌపదిగా దీపికానే కనిపిస్తారనే వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. -
అలా పిలిస్తే కూత ఆగిపోద్ది!
‘‘నన్నెవడైనా అలా (రేయ్ కార్తి) పిలవాలంటే ఒకటి మా ఇంట్లో వాళ్లు పిలవాలి.. లేదా నా పక్కనున్న ఫ్రెండ్స్ పిలవాలి.. ఎవడు పడితే వాడు పిలిస్తే వాడి కూత ఆగిపోద్ది’.. ‘కబడ్డీ మైదానంలో ఆడితే ఆట.. బయట ఆడితే వేట’ అంటూ గోపీచంద్ చెప్పే డైలాగ్స్‌తో ‘సీటీమార్’ టీజర్ విడుదలైంది. ‘గౌతమ్‌నంద’ చిత్రం తర్వాత హీరో గోపీచంద్, డైరెక్టర్ సంపత్ నంది కాంబినేషన్ లో తెరకెక్కుతోన్న తాజా చిత్రం ‘సీటీమార్’. పవన్ కుమార్ సమర్పణలో శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ పతాకంపై శ్రీనివాసా చిట్టూరి నిర్మిస్తున్న ఈ చిత్రం టీజర్‌ని సోమవారం విడుదల చేశారు. ఈ సందర్భంగా డైరెక్టర్ సంపత్ నంది మాట్లాడుతూ– ‘‘కబడ్డీ నేపథ్యంలో తెరకెక్కుతోన్న స్పోర్ట్స్ యాక్షన్ మూవీ ఇది. మీకు తప్పకుండా నచ్చుతుంది’’ అన్నారు. తమన్నా, భూమిక, దిగంగనా సూర్యవంశీ, పోసాని కృష్ణమురళి, రావు రమేష్, తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: ఎస్. సౌందర్ రాజన్, సంగీతం: మణిశర్మ. -
తమన్నా రాకతో గ్రాఫ్ మారిపోయింది
సత్యదేవ్, తమన్నా జంటగా నటిస్తున్న చిత్రం ‘గుర్తుందా శీతాకాలం’. కన్నడంలో విడుదలై విజయం సాధించిన ‘లవ్ మాక్‌టైల్’ సినిమా ఆధారంగా తెరకెక్కుతున్న చిత్రమిది. నాగశేఖర్, భావనా రవి, ఎం.ఎస్. రెడ్డి, చినబాబు నిర్మిస్తున్నారు. నాగశేఖర్ దర్శకుడు. తొలి షెడ్యూల్ పూర్తి చేసుకుని రెండో షెడ్యూల్‌కు సిద్ధమవుతున్న సందర్భంగా చిత్రబృందం హైదరాబాద్‌లో ప్రెస్‌మీట్ నిర్వహించింది. ఈ సందర్భంగా సత్యదేవ్ మాట్లాడుతూ– ‘‘ఈ సినిమాకి నేను హీరో అయినా, తమన్నాగారు రియల్ హీరో. ఆమె ఈ సినిమాలో చేస్తున్నారని ప్రకటించినప్పటి నుండి ‘గుర్తుందా శీతాకాలం’ గ్రాఫ్ మారిపోయింది. ఈ సినిమాలో చేస్తున్న మేఘా ఆకాశ్, కావ్యా శెట్టి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తారు’’ అన్నారు. తమన్నా మాట్లాడుతూ– ‘‘లాక్డౌన్ టైమ్‌లో చాలా సినిమాలు చూశాను, ఎన్నో కథలు విన్నాను. ఈ సినిమా ఆఫర్ రాగానే ఎందుకో ఈ సినిమాలో నటించాలనుకున్నాను. రొమాంటిక్ డ్రామాలో నటించి చాలాకాలం అయింది. టాలెంటెడ్ హీరో సత్యదేవ్ ఈ సినిమాకు పర్ఫెక్ట్ హీరో’’ అన్నారు. దర్శకుడు నాగశేఖర్ మాట్లాడుతూ– ‘‘కన్నడంలో నేను స్టార్ డైరెక్టర్ అయినప్పటికీ తెలుగులో ఇది నాకు మొదటి సినిమానే. నటీనటులు, టెక్నీషియన్లు నూటికి నూరు శాతం ప్రతిభ ఉన్నవారు. ఎంతో తపనతో సినిమా చేస్తున్నారు’’ అన్నారు. ‘‘బహుశా ఈ సినిమాకు పనిచేయటం మొదలుపెట్టిన తొలి వ్యక్తి నేనే అనుకుంటున్నాను. నేను మాటలు అందించిన ‘చందమామ’, ‘అలా మొదలైంది’, ‘నేనే రాజు నేనే మంత్రి’, ‘ఓ బేబి’ సినిమాల తరహాలో పెద్ద విజయం సాధిస్తుంది’’ అన్నారు మాటల రచయిత లక్ష్మీభూపాల్. సంగీత దర్శకుడు కాలభైరవ మాట్లాడుతూ– ‘‘లక్ష్మీభూపాల్ గారు ఈ సినిమా కోసం వేసవిలో పని చేయటం ప్రారంభిస్తే, నేను వర్షాకాలంలో ప్రారంభించాను. ఈ సినిమా మంచి మ్యూజికల్ ఫీల్ గుడ్ మూవీగా మిగిలిపోతుంది’’ అన్నారు. ఈ కార్యక్రమంలో చినబాబు, సంపత్ కుమార్, నవీన్‌రెడ్డి తదితరులు పాల్గొ న్నారు. -
గోపిచంద్ ‘కూత’ మొదలైంది
సంపత్ నంది దర్శకత్వం వహిస్తున్నచిత్రం ‘సీటీమార్’. ఈ చిత్రంలో గోపిచంద్ హీరోగా నటిస్తున్నాడు. కథానాయికిగా మిల్కీ బ్యూటీ తమన్నా నటిస్తోంది. ఈ సినిమాలో గోపిచంద్ ఆంధ్రప్రదేశ్ కబడ్డీ జట్టు కోచ్ పాత్ర పోషిస్తున్నాడు. తెలంగాణ కోచ్‌గా తమన్నా నటిస్తోంది. ఈ సినిమా షూటింగ్ సోమవారం ఘనంగా పునఃప్రారంభమైంది. ఇంతక ముందే గోపిచంద్, సంపత్ నంది దర్శకత్వంలో ‘గౌతమ్ నంద’గా నటించి ప్రేక్షకులకు మంచి క్లాస్ యాక్షన్ సినిమాను అందించారు. మాస్ యాక్షన్, క్లాస్ పాత్రల్లో డబుల్ యాక్షన్‌తో మెప్పించాడు. ఇక తమన్నా ఇప్పటికే సంపత్ నంది దర్శకత్వం వహించిన బెంగాల్ టైగర్ సినిమాలో తన అందంతో ప్రేక్షకులను ఆకట్టుకుని పెద్ద విజయం సాధించింది. ఈ సినిమాలో గోపిచంద్ సరసన మరో కథనాయికగా దిగంగన నటిస్తోంది. పచ్చని పల్లెటూరులో ఉంటూ గోపిచంద్‌ని ప్రేమించే పాత్రలో అందాల దిగంగన ఓదిగిపోయిందని చిత్రబృందం చెబుతోంది. 2010లో ‘ఏమైంది ఈవేళ’ సినిమాతో దర్శకుడిగా సంపత్ నంది తెలుగు చిత్రసీమకు పరిచియమయ్యాడు. ఆ తర్వాత మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్‌తో రచ్చ సినిమా చేశాడు. రవితేజను ‘బెంగాల్ టైగర్’గా చూపించి ప్రేక్షకుల నుంచి పేరు తెచ్చుకున్నాడు. కొంతకాలంగా విజయాలు లేక వెనుకబడిన సంపత్ నంది ఇప్పుడు సీటీమార్ చిత్రంతో సూపర్ హిట్ కొట్టాలని విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాడు. 📢📢📢 Aftr a longggg warm up solid stretches n powerpacked practice Everyone’s set..fit..fab n back to do wat we love the most 🎥 wid xtra care n zeal. Wait is over! కూత మొదలు..Nov 23 నుండి... ఇక non-stop కబడ్డి..కబడ్డి..కబడ్డి!!!💥#Seetimaarr @bhumikachawlat #HappyDiwali pic.twitter.com/8WYlbXuoaQ — Sampath Nandi (@IamSampathNandi) November 14, 2020 -
వెబ్‌కి వెల్కమ్
స్టార్స్ అందరూ వెబ్‌లోకి అడుగుపెడుతున్నారు. తాజాగా కాజల్ అగర్వాల్, తమన్నా కూడా వెబ్ మీడియమ్‌లోకి ఎంటర్ అయ్యారు. త్వరలో విడుదల చేయబోయే ప్రాజెక్ట్‌లను డిస్నీ హాట్‌స్టార్ శుక్రవారం ప్రకటించింది. అందులో కాజల్ లీడ్ రోల్ చేస్తున్న ‘లైవ్ టెలీకాస్ట్’, తమన్నా ‘నవంబర్ స్టోరీ’ కూడా ఉన్నాయి. తమిళ దర్శకుడు వెంకట్ ప్రభు దర్శకత్వంలో తెరకెక్కిన హారర్ థ్రిల్లర్ ‘లైవ్ టెలీకాస్ట్’. ఒక భూత్ బంగ్లాలో చిక్కుకుపోయిన ఓ టీవీ బృందానికి ఎదురయిన సమస్యలతో ఈ సిరీస్ ఉంటుంది. చేయని నేరానికి శిక్ష అనుభవించబోతున్న తండ్రిని కాపాడే కూతురు కథాంశంతో తమన్నా ‘నవంబర్ స్టోరీ’ రూపొందింది. రామ్ సుబ్రహ్మణ్యం దర్శకత్వం వహించారు. ఈ రెండూ తమిళంలో రూపొందినప్పటికీ తెలుగులో అనువాదం కానున్నాయి. ఈ సిరీస్‌లు ఎప్పటి నుంచి స్ట్రీమ్ అవుతాయనేది హాట్‌స్టార్ ప్రకటించలేదు. -
సవాల్‌కి సై
కథని బట్టి కథలోని పాత్రను బట్టి నటీనటులకు కసరత్తు ఉంటుంది. కొన్ని అవలీలగా చేసేవి ఉంటాయి. కొన్ని కష్టపడి చేసేవి ఉంటాయి. కొన్నింటికి శారీరక శ్రమ ఉంటుంది. మరికొన్నింటికి మానసిక శ్రమ. ఏ పాత్రకు సంబంధించిన కష్టం దానికి ఉంటుంది. పాత్ర ఎంత ఛాలెంజ్ చేస్తే అంత శ్రమిస్తారు. ప్రస్తుతం కొన్ని పాత్రల కోసం కొందరు హీరోయిన్లు శారీరకంగా శ్రమిస్తున్నారు. కొత్త విద్యలు నేర్చుకుంటున్నారు. కొత్త టెక్నిక్‌లు సాధన చేస్తున్నారు. సుకుమారి భామలు చేస్తున్న కఠోర కసరత్తులు గురించి తెలుసుకుందాం. ‘భారతీయుడు’ చిత్రానికి సీక్వెల్‌గా శంకర్–కమల్‌హాసన్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న చిత్రం ‘భారతీయుడు 2’. కమల్‌హాసన్‌కు జోడీగా కాజల్ అగర్వాల్ నటిస్తున్నారు. ఈ సినిమాలో 70 ఏళ్ల వృద్ధురాలి పాత్రలో కనిపించనున్నారు కాజల్. ఈ సినిమా కోసం ప్రాచీన యుద్ధ విద్య కళరి పయ్యట్టు నేర్చుకుంటున్నారామె. ఇందులో ఆమె పలు ఫైట్ సన్నివేశాల్లో కూడా కనిపిస్తారట. సందీప్ కిషన్, లావణ్యా త్రిపాఠి జంటగా నటిస్తున్న చిత్రం ‘ఏ1 ఎక్స్‌ప్రెస్’. ఇందులో ఈ ఇద్దరూ హాకీ ప్లేయర్స్ పాత్రలో కనిపించనున్నారు. హాకీ ప్లేయర్‌గా కనిపించడానికి చిత్రీకరణ ప్రారంభం అయ్యే ముందు కొన్నిరోజుల పాటు హాకీ నేర్చుకున్నారు లావణ్యా త్రిపాఠి. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ దశలో ఉంది. ‘సీటీమార్’ సినిమా కోసం తమన్నా కబడ్డీ మెళకువలు తెలుసుకున్నారు. గోపీచంద్ హీరోగా సంపత్ నంది తెరకెక్కిస్తున్న స్పోర్ట్స్ ఫిల్మ్ ‘సీటీమార్’. ఇందులో కబడ్డీ కోచ్ పాత్రలో తమన్నా కనిపించనున్నారు. ‘రష్మీ రాకెట్’ అనే స్పోర్ట్స్ సినిమా చేస్తున్నారు తాప్సీ. ఈ సినిమాలో రన్నర్ పాత్రలో కనిపించనున్నారామె. ఇందుకోసం తన డైట్‌ని మొత్తం మార్చేశారు తాప్సీ. రన్నర్ లుక్ కోసం, రన్నర్‌గా మారడానికి ఫిట్నెస్ మీద మరింత దృష్టిపెట్టారామె. మరింత చురుకుగా పరిగెత్తడం నేర్చుకుంటున్నారట. ‘తేజస్’ అనే హిందీ సినిమాలో పైలట్‌గా కనిపించనున్నారు కంగనా రనౌత్. ఈ ఏడాది చివర్లో చిత్రీకరణ ప్రారంభం కానుంది. ఇందుకోసం ఫిజికల్ ఫిట్నెస్ మీద దృష్టిపెట్టారు. త్వరలోనే పైలట్ ట్రైనింగ్ తరగతులకు కూడా హాజరు కానున్నారట. వచ్చే ఏడాది సూపర్ హీరోయిన్గా మారనున్నారు కత్రినా కైఫ్. అలీ అబ్బాస్ జాఫర్ దర్శకత్వంలో కత్రినా ఓ సూపర్ హీరోయిన్ మూవీ చేయనున్నారు. ఇందులో భారీ యాక్షన్ ఉంటుందట. ఇందుకోసం ఆమె శిక్షణ కూడా మొదలెట్టారని తెలిసింది. వచ్చే ఏడాది ఈ సినిమా చిత్రీకరణ ప్రారంభం కానుంది. ఈ చిత్రం రెండు భాగాలుగా తెరకెక్కనుంది. చాలావరకు గ్లామరస్ రోల్స్ చేసే కథానాయికలు అవకాశం వచ్చినప్పుడల్లా ‘యాక్షన్’ పాత్రల్లో రెచ్చిపోతుంటారు. ఎంతైనా కష్టపడతారు. వీళ్లంతా ప్రేక్షకుల మెప్పు పొంది, ఫుల్ మార్కులతో పాస్ అవ్వాలని కోరుకుందాం. -
మీ ప్రేమను తిరిగి ఇస్తా!
కరోనా పాజిటివ్‌తో ఆసుపత్రిలో చేరిన హీరోయిన్ తమన్నా నెగటివ్‌తో క్షేమంగా ఇంటికి చేరుకున్నారు. ఇంట్లో కారు దిగగానే తన తల్లిదండ్రులను హత్తుకుని, ‘అమ్మయ్యా.. ఫైనల్‌గా ఇంటికి చేరాను’ అంటూ ఓ వీడియోను షేర్ చేశారు. ‘‘ఆసుపత్రిలో ట్రీట్మెంట్ తీసుకున్నన్ని రోజులు పిచ్చి పిచ్చిగా అనిపించింది. ఎప్పుడెప్పుడు నార్మల్ లైఫ్‌లోకి వస్తానా అనిపించింది. ఈ టైమ్‌లో నాకు సపోర్ట్ చేసిన అందరికీ ధన్యవాదాలు. కొన్ని రోజులు విశ్రాంతి తీసుకున్న తర్వాత మళ్లీ రొటీన్ లైఫ్‌లోకి వస్తాను. నా మీద మీరు (అభిమానులను ఉద్దేశించి) చూపించిన ప్రేమను మళ్లీ మీకు తిరిగి ఇస్తాను. త్వరలోనే షూటింగ్లో పాల్గొంటాను. ఫుల్ స్టామినాతో మీ ముందుకొస్తాను’’ అని పేర్కొన్నారు తమన్నా. వీడియోలో ఈ బ్యూటీ తన పెంపుడు కుక్కపిల్లతో ఆడుకుంటూ కనిపించారు. -
తమన్నా పాజిటివ్
భారతదేశంలో కరోనా వైరస్ వ్యాప్తి మొదలై ఆర్నెళ్లు దాటినా ఇంకా విజృంభణ కొనసాగుతూనే ఉంది. పేద, ధనిక, సామాన్యులు, సెలబ్రిటీలు, ప్రజాప్రతినిధులు... ఇలా తేడా లేకుండా అందరికీ ఈ వైరస్ సోకుతోంది. తాజాగా హీరోయిన్ తమన్నా కరోనా బారిన పడ్డారు. ఆ మధ్య తమన్నా తల్లిదండ్రులకు కరోనా సోకగా వారు కోలుకున్నారు. తాజాగా తమన్నాకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయిందని తెలిసింది. ఓ సినిమా షూటింగ్ కోసం ఆమె ఇటీవల హైదరాబాద్ చేరుకున్నారు. అధిక జ్వరంతో బాధపడుతున్న తమన్నా హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేరారు. ఆ సమయంలో నిర్వహించిన వైద్య పరీక్షల్లో కరోనా సోకినట్లు తేలింది. దీంతో ఆమె చికిత్స తీసుకుంటున్నారు. ప్రస్తుతం తమన్నా చేతిలో మూడు తెలుగు చిత్రాలున్నాయి. వాటిలో ‘గుర్తుందా శీతాకాలం, సిటీమార్, అంధాధూన్’ ఉన్నాయి. వీటితో పాటు ఓ వెబ్ సిరీస్‌లోనూ నటించనున్నారు తమన్నా. -
బీ పాజిటివ్
ప్రస్తుతం ఎటు చూసినా కరోనా పాజిటివిటీ. సామాజిక వేదికల నిండా నెగటివిటీ. ఈ ముప్పు నుంచి బయటపడాలంటే శారీరక బలంతో పాటు మానసిక బలం కూడా ముఖ్యం. కరోనాకి నెగటివ్‌గా ఉంటూ... మానసికంగా పాజిటివ్‌గా ఉండటానికి ప్రయత్నించాలి. ఎనర్జీలు మన మాట వినేలా చేసుకోవాలి. ఈ కరోనా కష్టకాలాన్ని దాటే మాత్రను కనిపెట్టే పనిలో ఉన్నారు పరిశోధకులు. ఆ మందు వచ్చేలోగా పాటించాల్సిన మంత్రం ఒకటుందంటున్నారు మన కథానాయికలు. ‘‘బీ పాజిటివ్’ – అదే మనందర్నీ ఉంచుతుంది యాక్టివ్’’ అని తమ అభిప్రాయాల్ని షేర్ చేసుకున్నారు పలువురు కథానాయికలు. ఈ అందాల తారలు ఏమంటున్నారో చూద్దాం. ప్రేమను పంచుదాం – తమన్నా ప్రస్తుతం సోషల్ మీడియాలో చాలా నెగటివ్ ఎనర్జీ కనిపిస్తోంది. ఒకరి మీద ఒకరు ద్వేషం చూపుతున్నారు. ప్రస్తుతం మనందరం సాధారణమైన పరిస్థితుల్లో లేము. అందరం ఓ విపత్తును ఎదుర్కొంటున్నాం. ఇలాంటి సమయాల్లో మనందరం ఒకరికి ఒకరం అండగా నిలబడాలి. మన తోటి వారికి ప్రేమను పంచుదాం. ద్వేషాన్ని కాదు. సోషల్ మీడియాను ఒకరితో ఒకరం కనెక్ట్ అవ్వడానికి ఉపయోగిద్దాం. నిందించడానికి, నెగటివిటీని పంచడానికి కాదు. ఒకరికి ఒకరం నిలబడితే ఎలాంటి కష్టాన్నైనా దాటొచ్చు. నిరాశను దగ్గరకు రానివ్వకండి – జాక్వెలిన్ ఫెర్నాండజ్ ఈ లాక్డౌన్లో నేను ఆచరించింది ఏంటంటే.. పాజిటివ్‌గా ఆలోచించడం, నన్ను నేను స్ట్రాంగ్‌గా ఉంచుకోవడం. మనసు పాజిటివ్‌గా ఉంటే ఏదైనా సాధించగలం అనే నమ్మకం మనకు ఏర్పడుతుంది. జీవితానికి కొత్త ఆశ కలుగుతుంది. మనం ఏదైనా చేయాలన్నా, కొత్త మనిషిగా మారాలన్నా ముందు మన ఆలోచనల నుంచి మొదలుపెట్టాలి. మన ఆలోచనలే మనం. వాటిని సక్రమంగా ఉంచుకుని, ఆచరించగలిగితే చాలు. ప్రస్తుతం అందరం ఒకలాంటి అనిశ్చితిలో ఉన్నాం. ఇలాంటి సమయంలో మనందరం మరింత ధైర్యంగా నిలబడాలి. నిరాశను దగ్గరకు రానివ్వకండి. నెగటివిటీ పంచకండి. పాజిటివ్‌గా ఉందాం. ఏది ఇస్తే అదే తిరిగొస్తుంది – కృతీ సనన్ మనందరం మన ఆలోచనల ద్వారా ఓ ఎనర్జీను మన చుట్టూ నింపుకుంటాం అని నమ్ముతాను. ఆ ఎనర్జీ ద్వారానే మరొకరితో కనెక్ట్ అవుతాం. నువ్వు పాజిటివ్‌గా ఆలోచిస్తే నీ చుట్టూ పాజిటివ్ ఎనర్జీయే ఉంటుంది. పాజిటì వ్గా ఆలోచించేవాళ్లే నీతోనూ కనెక్ట్ అవుతారు. ఒకవేళ నెగటివ్ అయితే నెగటివ్‌గా ఆలోచించేవాళ్లను ఆకర్షిస్తావు. అంటే మనం ఏది ఇస్తే అదే తిరిగి మన దగ్గరకు వస్తుంది. అందుకే ప్రతీ విషయాన్ని జాగ్రత్తగా ఆలోచించండి. తీసుకున్న నిర్ణయాన్ని బలంగా నమ్మండి. అదే ఆచరించండి. ఇదే నా మంత్రం. ప్రస్తుత పరిస్థితుల్లో చాలా అవసరమైన మంత్ర ఏంటంటే... ప్రేమను పంచండి. తిరిగి ప్రేమనే పొందండి. -
పదేళ్లకు జోడీ కుదిరింది
పదేళ్ల క్రితం విజయ్–తమన్నా జంటగా ‘సుర’ అనే తమిళ చిత్రంలో నటించారు. మంచి మాస్ మసాలా ఎంటర్టైనర్గా ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఆ తర్వాత ఈ ఇద్దరూ జంటగా సినిమా చేయలేదు. పదేళ్ల తర్వాత ఈ జోడీ ఒక సినిమాకి కుదిరిందని సమాచారం. హీరో విజయ్‌కి ‘తుపాకి’, ‘కత్తి’, ‘సర్కార్’ వంటి హ్యాట్రిక్ విజయాలను అందించిన దర్శకుడు ఏఆర్ మురుగదాస్ ఓ చిత్రాన్ని తెరకెక్కించనున్నారు. ఇది విజయ్‌కి 65వ సినిమా కావడం, మురుగదాస్–విజయ్ కాంబినేషన్లో రూపొందే చిత్రం కావడంతో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ క్రేజీ ప్రాజెక్ట్‌లోనే విజయ్ సరసన తమన్నా కథానాయికగా నటించనున్నారని తెలిసింది. ‘సర్కార్’ సినిమాను తెరకెక్కించిన సన్ పిక్చర్స్ నిర్మాణంలో ఈ చిత్రం రూపుదిద్దుకోనుంది. ఈ చిత్రానికి సంగీతం: ఎస్.ఎస్. తమన్, కెమెరా: సంతోష్ శివన్. -
శీతాకాలం ప్రేమ
సత్యదేవ్, తమన్నా జంటగా నటించనున్న చిత్రం ‘గుర్తుందా శీతాకాలం’. నాగÔó ఖర్ మూవీస్ బ్యానర్‌పై భావన, రవి నిర్మించనున్నారు. ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కాకుండానే ఆడియో హక్కులను కర్ణాటకకు చెందిన ఆనంద్ ఆడియో సంస్థ 75లక్షలకు సొంతం చేసుకుంది. కీరవాణి కుమారుడు కాలభైరవ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. నాగశేఖర్ మాట్లాడుతూ –‘‘సత్యదేవ్, తమన్నా కాంబినేసన్ అనగానే ట్రేడ్‌లో మంచి క్రేజ్ ఏర్పడింది. మా చిత్రం టైటిల్ విన్నవారంతా ప్రేమకథలు శీతాకాలంలోనే మొదలవుతాయని, తమ ప్రేమకథలను గుర్తు చేసుకుంటున్నారు. టైటిల్ పొయెటిక్‌గా ఉంది అంటుంటే ఆనందంగా ఉంది. త్వరలోనే షూటింగ్ ప్రారంభిస్తాం’’ అన్నారు. ఈ చిత్రానికి కెమెరా: సత్య హెగ్డే, లైన్ప్రొడ్యూసర్స్: సంపత్‌కుమార్, శివ్దశ్ యశోదర. -
నాలో మంచి కుక్ ఉందని తెలుసుకున్నా!
లాక్‌డౌన్‌తో దొరికిన ఖాళీ సమయం తమన్నాను వంటగదికి దగ్గర చేసింది. తనలో ఓ మంచి కుక్ దాగి ఉందని తమన్నా తెలుసుకునేలా చేసింది. ఈ విషయం గురించి తమన్నా మాట్లాడుతూ– ‘‘లాక్‌డౌన్‌కు ముందు షూటింగ్స్‌తో ఫుల్æబిజీగా ఉండేదాన్ని. మా ఇల్లు నాకు హోటల్లానే అనిపించేది. సినిమాల షూటింగ్స్ మధ్యలో కాస్త విరామం దొరికినా నేను మా ఇంట్లో ఉండేది మూడు రోజులే. అసలు మా ఇంట్లో ఏయే వస్తువులు ఎక్కడెక్కడ ఉన్నాయో? అవి నాకు ఎంత ఉపయోగపడతాయో? అని కూడా నేనెప్పుడూ ఆలోచించలేదు. ఈ లాక్డౌన్లో అవన్నీ తెలుసుకున్నాను. అవసరానికి మించిన వస్తువులు ఉన్నాయని గ్రహించాను. ఇదివరకు నేను ఎప్పుడూ వంట చేయలేదు. లాక్డౌన్ వల్ల చాలా సమయం దొరకడంతో వంటలు చేశాను. నాలో ఓ మంచి కుక్ ఉందని నాకు తెలిసింది ఈ సమయంలోనే. అయితే నేను వంట స్టార్ట్ చేసిన మొదట్లో కిచెన్ రూమ్‌లో టీ పొడి ఎక్కడుంది? పంచదార ఏ డబ్బాలో ఉంది? అనే విషయాలు తెలియక మొత్తం అల్మరా అంతా వెతికేదాన్ని. ఫస్ట్ టైమ్ వంట చేసినప్పుడు చాలా గందరగోళంగా అనిపించింది. ఆ తర్వాత మెల్లిగా అన్నీ తెలుసుకున్నాను. వంట చేయడం అంటే వంటకాలను రుచిగా చేయడమే కాదు. ఆ వంటలు వండిన పాత్రలను కూడా శుభ్రంగా కడుక్కోవాలి. వంట రూమ్‌ను శుభ్రంగా ఉంచుకోవాలి’’ అన్నారు తమన్నా. -
అర్హత ఉంటేనే అడగాలి
‘‘ఏ ఆర్టిస్ట్ పారితోషికం అయినా వాళ్ల మార్కెట్ మీద ఆధారపడి ఉంటుంది. అంతేకానీ మేం ఎంత అడిగితే అంత నిర్మాతలు ఇవ్వరు’’ అంటున్నారు తమన్నా. అడిగినంత పారితోషికం ఇవ్వని కారణంగా ఇటీవల ఆమె ఓ సినిమా వదులుకున్నారనే వార్త వచ్చింది. అయితే ఈ వార్తలో నిజం లేదన్నారు ఈ మిల్కీ బ్యూటీ. ఈ సందర్భంగా పారితోషికం గురించి తమన్నా మాట్లాడుతూ – ‘‘ఒక నిర్మాత నాకు పారితోషికం ఇస్తున్నారంటే నేను అంత అడిగానని ఇవ్వడంలేదు. నా మార్కెట్‌ని దృష్టిలో పెట్టుకునే ఇస్తారు. నా గత చిత్రాల బాక్సాఫీసు హిట్స్‌ను అంచనా వేసి, పారితోషికం ఇస్తారు. అంతేకానీ నేనేదో నాకు తోచినంత అడిగి, కచ్చితంగా అంత ఇవ్వాలని ఎదురు చూడకూడదు. అంత తీసుకునే అర్హత ఉంటేనే అడగాలి. నేను అడిగే పారితోషికం సరైనదని నాకు అనిపిస్తేనే అడుగుతాను’’ అన్నారు. -
ఆగస్ట్‌లో కబడ్డీ కబడ్డీ
‘గౌతమ్‌నంద’ వంటి విజయవంతమైన చిత్రం తర్వాత హీరో గోపీచంద్ – డైరెక్టర్ సంపత్ నంది కలయికలో తెరకెక్కుతోన్న చిత్రం ‘సీటీమార్’. తమన్నా, దిగంగన కథానాయికలుగా నటిస్తున్నారు. శ్రీనివాసా సిల్వర్ స్క్రీ¯Œ పతాకంపై శ్రీనివాసా చిట్టూరి నిర్మిస్తున్నారు. నేడు గోపీచంద్ పుట్టినరోజుని పురస్కరించుకుని ‘సీటీమార్’ టీమ్ కొత్త స్టిల్‌ని విడుదల చేసింది. ఈ సందర్భంగా శ్రీనివాసా చిట్టూరి మాట్లాడుతూ–‘‘కబడ్డీ నేపథ్యంలో నిర్మిస్తున్న చిత్రమిది. ఈ ఏడాదే షూటింగ్ మొదలుపెట్టాం. కానీ లాక్ డౌన్‌కి ముందే మూడు షెడ్యూల్స్‌లో 60 శాతం చిత్రీకరణ పూర్తి చేశాం. మిగిలిన భాగం చిత్రీకరణ ఆగస్ట్ మొదటివారంలో మొదలుపెట్టి ఒకే షెడ్యూల్లో పూర్తి చేయనున్నాం. ఒక పాట మినహా ఇప్పటికే నాలుగు పాటలు రికార్డ్ చేశారు సంగీత దర్శకుడు మణిశర్మ. మాస్ ప్రేక్షకుల కోసం ఒక ప్రత్యేక గీతాన్ని కంపోజ్ చేస్తున్నారాయన. సౌందర్ రాజన్ సినిమాటోగ్రఫీ ప్రేక్షకులకు ఐ ఫీస్ట్‌లా ఉండబోతుంది’’ అన్నారు. కాగా ‘సీటీమార్’ చిత్రంలో ఆంధ్ర కబడ్డీ టీమ్ కోచ్‌గా గోపీచంద్, తెలంగాణ కబడ్డీ టీమ్ కోచ్‌గా తమన్నా నటిస్తున్నారు. పల్లెటూరిలో ఉండి హీరోని ప్రేమించే ప్రత్యేక పాత్రలో దిగంగన నటిస్తున్నారు. ఈ సినిమాకి సమర్పణ: పవ¯Œ కుమార్. -
కన్నడ ఎంట్రీ?
తమన్నా దాదాపుగా 15 ఏళ్ల నుంచి సినిమాలు చేస్తున్నారు. నార్త్ నుంచి సౌత్ వరకు పాపులారిటీ సంపాదించారామె. కమర్షియల్ సినిమాలు, లేడీ ఓరియెంటెడ్ సినిమాలు, స్పెషల్ సాంగ్స్.. ఇలా అన్ని రకాల సినిమాలు చేశారామె. తాజాగా కథానాయికగా మొదటిసారి ఓ కన్నడ సినిమా చేయబోతున్నారని టాక్. యశ్ హీరోగా రూపొందిన కన్నడ చిత్రం ‘కె.జీ.ఎఫ్’లో చేసిన ప్రత్యేక గీతం ద్వారా తొలిసారి కన్నడ తెరపై మెరిశారు తమన్నా. యశ్ హీరోగా నర్తన్ అనే కన్నడ దర్శకుడు ఓ ప్యాన్ ఇండియా సినిమా చేయబోతున్నారట. ఈ సినిమాలో హీరోయిన్ గా తమన్నా పేరును పరిశీలిస్తున్నారని సమాచారం. ఈ సినిమాకు తమన్నా ఓకే అంటే కథానాయికగా ఇదే ఆమె చేయబోయే మొదటి కన్నడ సినిమా అవుతుంది. -
పర్ఫెక్ట్ కోచ్
‘జ్వాల’ క్యారెక్టర్‌ను ఓ చాలెంజ్‌గా తీసుకున్నానంటున్నారు తమన్నా. గోపీచంద్ హీరోగా సంపత్ నంది దర్శకత్వంలో ‘సీటీమార్’ అనే చిత్రం తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ఇందులో తెలంగాణ మహిళల కబడ్డీ జట్టు కోచ్ జ్వాల పాత్రలో నటిస్తున్నారు తమన్నా. ఈ పాత్ర కోసం తాను సిద్ధమవుతున్న విధానం గురించి తమన్నా మాట్లాడుతూ– ‘‘నా కెరీర్లో తొలిసారి ఓ స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్ సినిమా చేస్తున్నాను. కబడ్డీ ప్లేయర్స్‌కు కోచ్‌గా నేను నటిస్తానని అస్సలు ఊహించలేదు. జ్వాల పాత్రను పర్ఫెక్ట్గా చేసేందుకు ఫుల్‌గా ప్రిపేర్ అవుతున్నాను. తెలంగాణ యాస నేర్చుకోవడాన్ని ఓ సవాల్‌గా తీసుకున్నాను.వీగన్ (శాకాహారి)గా మారిపోయి గ్లూటెన్ డైట్ ఫాలో అవుతూ యోగా కూడా చేస్తున్నాను. కోచ్‌గా నా హావభావాలు, బాడీ లాంగ్వేజ్ పర్ఫెక్ట్గా ఉండేందుకు జాగ్రత్త పడుతున్నాను. సంపత్ నంది సూచనలతో పాటు మా సెట్లో ఉన్న జాతీయ స్థాయి కబడ్డీ ప్లేయర్స్ సలహాలను తీసుకుంటున్నాను. ‘జ్వాల’ క్యారెక్టర్ ప్రేక్షకులకు గుర్తుండిపోవాలనే ఇంతలా కష్టపడుతున్నాను’’ అని పేర్కొన్నారు తమన్నా. ఈ సిని మాలో ఆంధ్రా మహిళల కబడ్డీ జట్టు కోచ్‌గా కనిపించనున్నారు గోపీచంద్. -
నిజమైన స్నేహితులు వాళ్లే!
అభిమానులను ప్రత్యేకంగా పలకరించడానికి అప్పుడప్పుడు సోషల్ మీడియాలో చాట్ చేస్తుంటారు తారలు. ఫ్యాన్స్ అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెబుతుంటారు. అలా శనివారం తమన్నా తన ఫ్యాన్స్‌కి బంపర్ ఆఫర్ ఇచ్చారు. నెటిజన్ల ప్రశ్నలకు సమాధాలు, కొందరికి సలహాలు ఇచ్చారు. వాటి గురించి తెలుసుకుందాం. ► ఈ ప్రపంచంలో మీకు అత్యంత విలువైనది ఏది? ► నా కుటుంబం ఎంతో విలువైనది. ► మీ ఫేవరెట్ ప్లేస్? ► మా ఇల్లు. ► మీ నిక్ నేమ్? ► తమ్ము. ► స్నేహితుల ప్రాముఖ్యత గురించి? ► మనం డౌన్లో ఉన్నప్పుడు మనల్ని వెన్నుతట్టి ప్రోత్సహించేవారే నిజమైన స్నేహితులు. ► అపజయాలను మీరు ఎలా ఎదుర్కొంటారు? ► మన జీవితాన్ని ఒకసారి తిరిగి చూసుకునే అవకాశాన్ని కల్పించేవి అపజయాలే. ఏదైనా కొత్త విషయాన్ని స్టార్ట్ చేయడానికి కూడా అపజయాలే కొన్నిసార్లు స్ఫూర్తినిస్తాయి. అందుకని అపజయాలకు కుంగిపోకండి. ► హార్ట్‌ను ఫాలో కావాలా? బ్రెయిన్నా? ► దిల్ సే సునో... దిమాక్ సే కరో! (మనసుతో విను.. బుర్రతో చెయ్). ► మీరెప్పుడు క్రియేటివ్‌గా ఉంటారు? ► నాకు నేనులా ఉండే పరిస్థితులు ఉన్నప్పుడు క్రియేటివ్‌గా ఉంటాను. ► టెన్నిస్‌లో మీరు ఏదైనా బహుమతి అందుకున్నారా? ► ఏదో అలవాటుగా ఆడతాను కానీ పోటీల్లో పాల్గొనను. ► మీ ఫేవరెట్ డిష్? ► పావ్ బాజీ.. (గ్లూటెన్ ఫ్రీ పావ్ మాత్రమే). ► ఫిల్మ్ ఇండస్ట్రీ లైఫ్ గురించి ఒక్క మాటలో... ► సాహసోపేతమైనది. ► ఏ జానర్ అయితే నటిగా మిమ్మల్ని మీరు ఎక్స్ప్లోర్ చేసుకోగలరని భావిస్తున్నారు? ► యాక్షన్ కామెడీతో కూడుకున్న హీరోయిన్ సెంట్రిక్ ఫిల్మ్. ► నటనను వృత్తిగా తీసుకోవాలనుకున్నప్పుడు మీ ఆలోచనలు ఏంటి? ► ప్రతి రోజూ ఏదో ఒక కొత్త విషయం నేర్చుకోవాలి. కెమెరాను బాగా ఫేస్ చేయాలి. ► గుడ్ స్క్రిప్ట్స్ ఆర్ గుడ్ క్యారెక్టర్? ► సినిమాలు టీమ్ వర్క్‌పై ఆధారపడి ఉంటాయి. కాబట్టి ఆర్టిస్టుగా నేనొక మంచి టీమ్‌లో భాగం కావాలని కోరుకుంటాను. నాకొక మంచి క్యారెక్టర్ ఉన్న ఆసక్తికరమైన కథలను ఇష్టపడతాను. నటిగా నిరూపించుకోవ డానికి స్కోప్ ఉందా? అని చూస్తాను. -
కోచ్ జ్వాల
కబడ్డీ కోచ్ జ్వాలారెడ్డిగా మారిపోయారు తమన్నా. ‘గౌతమ్‌నంద’ (2017) చిత్రం తర్వాత గోపీచంద్ హీరోగా సంపత్ నంది దర్శకత్వంలో కబడ్డీ ఆట నేపథ్యంలో ‘సీటీమార్’ అనే చిత్రం తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ఇందులో కథానాయికగా తమన్నా, దిగంగనా సూర్యవన్షీ నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని శ్రీనివాసాచిట్టూరి నిర్మిస్తున్నారు. ఇందులో ఆంధ్రా మహిళల కబడ్డీ జట్టు కోచ్‌గా గోపీచంద్, తెలంగాణ మహిళల జట్టు కోచ్ జ్వాలారెడ్డి పాత్రలో తమన్నా నటిస్తున్నారు. దర్శకుడు సంపత్ నంది కుమారుడు యువ ఓ గెస్ట్ రోల్ చేస్తున్నారు. శనివారం జ్వాలారెడ్డి లుక్‌ను విడుదల చేశారు. ‘‘నా పాత్ర చాలెంజింగ్‌గా, ఆసక్తికరంగా ఉంటుంది’’ అన్నారు తమన్నా. ‘‘హైదరాబాద్‌లోని ఓ ప్రముఖ స్టూడియోలో కొత్త షెడ్యూల్ మొదలుపెట్టాం. సమ్మర్లో సినిమాను రిలీజ్ చేయాలనుకుంటున్నాం’’ అన్నారు శ్రీనివాసా చిట్టూరి. -
సీటీమార్ ఖరార్
గోపీచంద్ విజిల్ వేస్తున్నారు. సీటీ మార్ సీటీ మార్ అంటూ సందడి చేస్తున్నారు. ఫుల్ ఎనర్జీతో ప్రేక్షకుల్లో హుషారు నింపనున్నారు. ఈ మధ్యకాలంలో ఏ సినిమాలోనూ కనిపించనంత ఎనర్జిటిక్ క్యారెక్టర్లో కనిపించనున్నారు. సినిమా టైటిల్ ‘సీటీ మార్’. ‘యు టర్న్’లాంటి సూపర్ హిట్ ఇచ్చిన శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ అధినేత శ్రీనివాసా చిట్టూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సంపత్ నంది దర్శకుడు. గోపీచంద్ సరసన తమన్నా, దిగంగనా సూర్యవంశీ కథానాయికలుగా నటిస్తున్నారు. ఈ చిత్రానికి ‘సీటీమార్’ టైటిల్‌ని ఖరారు చేసిన విషయాన్ని సోమవారం అధికారికంగా ప్రకటించడంతో పాటు ఫస్ట్ లుక్‌ని కూడా విడుదల చేశారు. శ్రీనివాసా చిట్టూరి మాట్లాడుతూ – ‘‘గోపీచంద్ కెరీర్లో భారీ బడ్జెట్‌తో, ఉన్నత సాంకేతిక విలువలతో రూపొందిస్తున్న చిత్రం ఇది. హైదరాబాద్, రాజమండ్రిలోæభారీ షెడ్యూల్ పూర్తి చేశాం. ప్రస్తుతం హైదరాబాద్‌లో ప్రారంభించిన షెడ్యూల్‌ను నాన్‌స్టాప్‌గా జరుపుతాం. సమ్మర్లో సినిమాని విడుదల చేయాలనుకుంటున్నాం’’ అన్నారు. ఈ చిత్రానికి కెమెరా: సౌందర్ రాజన్, సంగీతం: మణిశర్మ, సమర్పణ: పవన్ కుమార్. -
కబడ్డీ కబడ్డీ
గోపీచంద్ హీరోగా సంపత్‌నంది దర్శకత్వంలో కబడ్డీ ఆట నేపథ్యంలో ఓ సినిమా తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ఇందులో తమన్నా కథానాయికగా నటిస్తున్నారు. మరో కథానాయికగా దిగంగన సూర్యవంశి నటిస్తుండగా, భూమిక, రావురమేష్ కీలక పాత్రలు చేస్తున్నారు. పవన్ కుమార్ సమర్పణలో శ్రీనివాసా చిట్టూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇందులో ఆంధ్రాజట్టు కబడ్డీ టీమ్ కోచ్‌గా నటిస్తున్నారు గోపీచంద్. ఇటీవల ఈ సినిమా తొలి షెడ్యూల్ ముగిసిన సంగతి తెలిసిందే. తాజాగా రెండో షెడ్యూల్ మొదలైంది. ప్రస్తుతం రాత్రివేళ వచ్చే సన్నివేశాల చిత్రీకరణ జరుగుతోంది. రాజమండ్రి, ఢిల్లీ ప్రదేశాల్లోనూ షూటింగ్ ప్లాన్ చేశారు. ఈ సినిమాకు మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. వేసవిలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. -
పర్ఫెక్ట్ బర్త్ డే గిఫ్ట్
మహేశ్‌బాబు హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘సరిలేరు నీకెవ్వరు’. ఇందులో రష్మికా మందన్నా కథానాయికగా నటించారు. ఈ సినిమాలో తమన్నా ఓ ప్రత్యేక పాటకు డ్యాన్స్ చేశారు. శనివారం (డిసెంబరు 21) తమన్నా పుట్టినరోజు. ఈ సందర్భంగా ఈ పాటలోని ఆమె లుక్‌ను విడుదల చేశారు. ఈ లుక్‌ని ఉద్దేశించి ‘పర్ఫెక్ట్ బర్త్‌డే గిఫ్ట్’ అని తమన్నా పేర్కొన్నారు. ఈ చిత్రం జనవరి 11న విడుదల కానుంది. -
ఆట ఆరంభం
గోపీచంద్ హీరోగా సంపత్ నంది దర్శకత్వంలో పవన్‌కుమార్ సమర్పణలో శ్రీనివాస చిట్టూరి నిర్మాణంలో ఓ సినిమా తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ఇందులో తమన్నా కథానాయికగా నటిస్తున్నారు. భూమిక, రావు రమేష్, దిగంగన సూర్యవంశి కీలక పాత్రధారులు. కబడ్డీ నేపథ్యంలో ఈ సినిమా కథనం సాగుతుంది. అంటే ఆరంభమైందన్నమాట. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ శనివారం ప్రారంభమైంది. ఈ సందర్భంగా శ్రీనివాస చిట్టూరి మాట్లాడుతూ–‘‘హైదరాబాద్‌లో మొదలైన తొలి షెడ్యూల్లో ముఖ్య తారాగణంపై కీలక సన్నివేశాలను ప్లాన్ చేశాం. ఆ నెక్ట్స్ రాజమండ్రి, ఢిల్లీల్లో షూటింగ్ జరుగుతుంది. వేసవిలో ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం’’ అని అన్నారు. ఈ సినిమాకు మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. -
తండ్రిని కాపాడే కూతురు
అనుకోకుండా ఓ క్రైమ్‌లో ఇరుక్కున్న తండ్రిని కాపాడటానికి కూతురిగా తన వంతు ప్రయత్నం చేస్తున్నారు తమన్నా. మరి ఈ క్రైమ్‌ని ఛేదించి, తన తండ్రిని నిర్దోషిగా ఎలా నిరూపిస్తారని తెలియడానికి కొంచెం టైమ్ ఉంది. తమన్నా తొలి ‘వెబ్ సిరీస్’ ‘ది నవంబర్స్ స్టోరీ’ కథ ఇది. ఇదొక క్రైమ్ థిల్లర్. తమిళంలో రూపొందుతున్న ఈ సిరీస్‌కు రామ్ సుబ్రమణియన్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో తండ్రిని కాపాడే కూతురి పాత్రలో నటిస్తున్నారు తమన్నా. ఈ సిరీస్ ఫస్ట్ షెడ్యూల్ చిత్రీకరణ పూర్తయింది. ‘‘తొలి షెడ్యూల్‌ను పూర్తి చేశాం. తదుపరి షెడ్యూల్ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నాను’’ అని పేర్కొన్నారు తమన్నా. ఈ వెబ్ సిరీస్‌ను ఆనంద వికడన్ సంస్థ నిర్మిస్తోంది. హాట్‌స్టార్‌లో ప్రసారం కానున్న ఈ సిరీస్ తెలుగు, హిందీ భాషల్లోనూ అందుబాటులోకి రానుంది. -
కొత్త ప్రయాణం
నటిగా 15 ఏళ్లుగా కొనసాగుతున్నారు తమన్నా. తెలుగు, హిందీ, తమిళ భాషల్లో రకరకాల పాత్రలు చేశారు. కొన్నిసార్లు స్పెషల్ సాంగ్స్ చేశారు. ఇప్పుడు నటిగా ఓ కొత్త జర్నీ ఆరంభించారని తెలిసింది. ఓ వెబ్ సిరీస్‌లో నటిస్తూ డిజిటల్ ప్లాట్ఫామ్లోకి తమన్నా ఎంట్రీ ఇస్తున్నారని సమాచారం. వికడన్ టెలీవిస్తాస్ నిర్మిస్తున్న ఓ వెబ్ సిరీస్‌లో లీడ్ రోల్ చేస్తున్నారు తమన్నా. ఈ వెబ్ సిరీస్ హాట్‌స్టార్‌లో ప్రసారం కానుంది. ఈ సిరీస్ ఏ జానర్లో ఉండబోతోంది? ఎవరు దర్శకత్వం వహిస్తున్నారనే సమాచారం బయటకు రాలేదు. ప్రస్తుతం ఈ వెబ్ సిరీస్ షూటింగ్ స్టేజ్‌లో ఉంది. ఇది కాకుండా హిందీలో ‘బోల్ చుడియా’ చిత్రీకరణలో పాల్గొంటున్నారు తమన్నా. తమిళంలో ఓ సినిమా కూడా కమిట్ అయ్యారు. -
రుద్రవీణ చూసి ఇండస్ట్రీకి వచ్చా
విశాల్ హీరోగా సుందర్. సి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘యాక్షన్’. తమన్నా కథానాయిక. ఈ చిత్రాన్ని శ్రీ కార్తికేయ సినిమాస్ పతాకంపై శ్రీనివాస్ ఆడెపు తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు. నేడు విడుదలవుతోన్న ఈ సినిమా గురించి శ్రీనివాస్ ఆడెపు విలేకరులతో మాట్లాడుతూ... ► సాఫ్ట్వేర్ ఉద్యోగం మానేసి డైరెక్టర్ అవుదామని ఇండస్ట్రీకి వచ్చా. అసిస్టెంట్ డైరెక్టర్‌గా వర్క్ చేశాను. ‘హుషారు, ఇస్మార్ట్ శంకర్, గద్దలకొండ గణేష్, రాజుగారిగది 3’ సినిమాలను డిస్ట్రిబ్యూట్ చేశాను. నేను నిర్మాతగా మా బ్యానర్లో విడుదల అవుతున్న తొలి చిత్రం ‘యాక్షన్’. 600 థియేటర్స్‌లో విడుదలవుతోంది. భవిష్యత్‌లో డైరెక్షన్ చేస్తాను. ఇండస్ట్రీలో నిర్మాతగానే కాదు.. డిస్ట్రిబ్యూటర్‌గా ఉండటం కూడా కష్టమే.. దేని పోరాటం దానిదే. ► ‘యాక్షన్’ టీజర్ చూడగానే ఎగై్జటింగ్‌గా అనిపించి హక్కులు కొన్నాను. విశాల్ అభిమానులకు ఈ సినిమా ఒక విజువల్ ట్రీట్‌లా ఉంటుంది. ఈ సినిమా సుందర్ సి. గారి దర్శకత్వ శైలికి భిన్నంగా ఉంటుంది. తమన్నాకు ఈ సినిమాతో మరింత మంచి పేరు వస్తుంది. రానాగారితో ర్యాప్ పాడించాలనే ఆలోచన విశాల్‌తో కలిసి నేనూ ఆలోచించినదే. వ్యక్తిగతంగా నాకు భావోద్వేగ చిత్రాలంటే ఇష్టం. ‘రుద్రవీణ’ సినిమా చూసి ఇండస్ట్రీకి వచ్చాను. -
నాకంత ఓర్పు లేదు
ప్రతి ఒక్కరి జీవితంలో ఎత్తు పల్లాలు ఉన్నట్లే పొగడ్తలు, విమర్శలు ఉంటాయి. నటిగా మీ కెరీర్లో ఎదురయ్యే విమర్శలను మీరు ఎలా తీసుకుంటారు? అనే ప్రశ్నను తమన్నా ముందు ఉంచితే– ‘‘నేనేం దేవుణ్ణి కాదు. మామూలు మనిషిని. అందరిలాగే నేనూ తప్పులు చేస్తాను. నా తప్పుల గురించి వచ్చిన నిజమైన విమర్శలను మాత్రమే పట్టించుకుంటాను. నన్ను నేను విశ్లేషించుకుని నాలోని లోపాలను సరిదిద్దుకుంటాను. అంతేకానీ తప్పుడు విమర్శలను పట్టించుకుని అనవసరంగా బాధపడను’’ అని పేర్కొన్నారు. భవిష్యత్‌లో దర్శకత్వం ఆలోచన ఏమైనా ఉందా? అన్నప్పుడు... ‘‘దర్శకత్వం అంటే చిన్న విషయం కాదు. సినిమా గురించిన ప్రతి విషయంపై అవగాహన ఉండాలి. పాత అంశాలను కొత్త దృష్టి కోణంలో చూడగలగాలి. అన్నింటికన్నా ముందు చాలా ఓర్పు ఉండాలి. అంత ఓర్పు నాలో లేదు. ప్రసుతం దర్శకత్వం ఆలోచన లేదు. కానీ శ్రీదేవి బయోపిక్‌ను ఎవరైనా తీస్తే అందులో నటించాలని ఉంది’’ అని పేర్కొన్నారు తమన్నా. -
గోపీచంద్ అభిమానులు గర్వపడతారు
‘‘శ్రీనివాస్, పవన్‌గార్లు నాకు చాలాకాలంగా తెలిసినా, వారితో తొలిసారి పని చేస్తున్నాను. మంచి సినిమా చేయాలనే తపన ఉన్న నిర్మాతలతో మంచి కథతో సినిమా చేయడం సంతోషంగా ఉంది’’ అని గోపీచంద్ అన్నారు. సంపత్ నంది దర్శకత్వంలో గోపీచంద్, తమన్నా జంటగా తెరకెక్కనున్న సినిమా హైదరాబాద్‌లో ప్రారంభమైంది. ‘యు టర్న్’ వంటి సూపర్‌హిట్ చిత్రాన్ని అందించిన శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ పతాకంపై శ్రీనివాసా చిట్టూరి నిర్మిస్తున్నారు. ముహూర్తపు సన్నివేశానికి రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్‌రామ్ కెమెరా స్విచ్చాన్ చేయగా, డైరెక్టర్ బోయపాటి శ్రీను క్లాప్ ఇచ్చారు. గోపీ చంద్ మాట్లాడుతూ– ‘‘గౌతమ్ నంద’ తర్వాత సంపత్ మంచి స్క్రిప్ట్‌తో వచ్చారు. తమన్నాతో ఫస్ట్ టైమ్ చేస్తున్నాను. తనది కూడా మంచి పాత్ర’’ అన్నారు. సంపత్ నంది మాట్లాడుతూ– ‘‘ఫస్ట్ టైమ్ క్రీడా నేపథ్యం ఉన్న సినిమా చేస్తున్నాను. ఆంధ్రా ఫీమేల్ కబడ్డీ టీమ్ కోచ్‌గా గోపీగారు, తెలంగాణ ఫీమేల్ కబడ్డీ టీమ్ కోచ్‌గా తమన్నా చేస్తున్నారు. చిట్టూరి శ్రీనివాస్, పవన్, శ్రీనివాస్‌గార్ల బేనర్లో పది కాలాల పాటు గుర్తుండిపోయే సినిమా అవుతుంది. గోపీచంద్‌గారి ఫ్యాన్స్ గర్వంగా చెప్పుకునేలా ఉంటుంది’’ అన్నారు. ‘‘సంపత్‌గారితో నా మూడో సినిమా ఇది. గోపీచంద్‌గారితో సినిమా చేయాలని చాలారోజులుగా ఎదురు చూస్తున్నాను. నాది నటనకు ప్రాధాన్యం ఉన్న పాత్ర’’ అన్నారు తమన్నా. ‘‘అన్ని రకాల వాణిజ్య అంశాలున్న సినిమా ఇది. నవంబర్‌లో షూటింగ్ ఆరంభించి, ఏప్రిల్‌లో సినిమా విడుదలకి ప్లాన్ చేస్తున్నాం’’ అన్నారు శ్రీనివాసా చిట్టూరి. ఈ కార్యక్రమంలో చిత్రసమర్పకులు పవన్ కుమార్, నిర్మాతలు బీవీఎస్ఎన్ ప్రసాద్, అనిల్ సుంకర, కె.కె. రాధామోహన్, దర్శకుడు ప్రశాంత్ వర్మ, కెమెరామేన్ సౌందర్ రాజన్, ఆర్ట్ డైరెక్టర్ రాజీవ్ నాయర్ తదితరులు పాల్గొన్నారు. -
తొలి పరిచయం
తెలుగు, తమిళం, కన్నడం, హిందీ ఇండస్ట్రీల్లో సినిమాలు చేసి మంచి ఫాలోయింగ్ ఏర్పరచుకున్నారు తమన్నా. నార్త్ టు సౌత్ తమన్నా అందరికీ పరిచయం. కానీ ఇప్పుడు మలయాళ ఇండస్ట్రీకి తొలి పరిచయం కాబోతున్నారు. పద్నాలుగేళ్లుగా ఇండస్ట్రీలో ఉంటున్న తమన్నా తొలిసారి మలయాళంలో స్ట్రయిట్ మూవీ చేస్తున్నారు. గతంలో డబ్బింగ్ సినిమాల ద్వారా మలయాళంలో కనిపించారామె. ఇప్పుడు తొలి స్ట్రయిట్ సినిమాతోనే ప్రేక్షకులను భయపెడతానంటున్నారు. ‘సెంట్రల్ జైలిలే ప్రేతం’ (సెంట్రల్ జైల్లో దెయ్యం అని తెలుగు అర్థం) అనే హారర్ సినిమాలో లీడ్ రోల్ చేస్తున్నారు తమన్నా. కథ మొత్తం ఓ సెంట్రల్ జైల్, అందులో ఉండే దెయ్యాల చుట్టూ తిరుగుతుందట. ఇందులో మలయాళ, తమిళ స్టార్స్ యాక్ట్ చేయనున్నారు. సంధ్యా మీనన్ దర్శకురాలు. -
గాల్లో యాక్షన్
తనపై ఎటాక్ చేసినవారికి తనదైన శైలిలో జవాబు చెబుతున్నారు విశాల్. ఇందుకోసం కత్తులు, తుపాకులతో యాక్షన్ మోడ్‌లోకి వెళ్లిపోయారు. విశాల్ హీరోగా సుందర్. సి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న సినిమాకు ‘యాక్షన్’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. అలాగే ఈ సినిమాలో విశాల్ లుక్‌ను కూడా విడుదల చేశారు. ఈ సినిమాలోని యాక్షన్ సీన్స్ చిత్రీకరణ కోసం విశాల్ అండ్ టీమ్ టర్కీ, అజర్‌బైజాన్‌కు వెళ్లొచ్చారు. టర్కీ షూటింగ్ సమయంలో ఓ యాక్షన్ ఎపిసోడ్లో భాగంగా విశాల్ గాయపడిన సంగతి తెలిసిందే. కొన్ని రోజులు విశ్రాంతి తర్వాత మళ్లీ ఈ షూటింగ్లో పాల్గొంటున్నారు విశాల్. ఇందులో తమన్నా, ఐశ్వర్యా లక్ష్మీ కథానాయికలుగా నటిస్తున్నారు. ఈ సంగతి ఇలా ఉంచితే... విశాల్–సుందర్. సి కాంబినేషన్లో ఇంతకుముందు ‘అంబల, మదగజరాజా’ అనే సినిమాలు వచ్చిన సంగతి తెలిసిందే. -
స్వాతంత్య్రానికి సైరా
నేడు స్వాతంత్య్ర దినోత్సవం. మనం ఆనందిస్తున్న ఈ ఫ్రీడమ్‌ను మనకు అందించడం కోసం ఎందరో పోరాడారు. స్వాతంత్య్రం కోసం పోరాడిన వాళ్లలో తొలి తరం యోధుల్లో తెలుగు వీరుడు ‘ఉయ్యాలవాడ నరసింహారెడ్డి’ ఒకరు. ఇప్పుడు ఆయన జీవితం ఆధారంగా ‘సైరా: నరసింహారెడ్డి’ చిత్రం తెరకెక్కుతుంది. చిరంజీవి లీడ్ రోల్లో ఈ చిత్రానికి సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించారు. సుమారు 250 కోట్ల బడ్జెట్‌తో కొణిదెల ప్రొడక్షన్స్ పతాకంపై రామ్ చరణ్ నిర్మించారు. దాదాపు 225 రోజుల పాటు చిత్రీకరణ జరిపారు. ఈ పీరియాడికల్ చిత్రాన్ని తెర మీదకు తీసుకురావడానికి చిత్రబృందం పడిన శ్రమ, మేకింగ్ ఆఫ్ ‘సైరా’ గురించి కొన్ని విశేషాలు మీకోసం. మేకింగ్ ఆఫ్ ‘సైరా’ రాజ్య వ్యవస్థలను, రాజులను ఆంగ్లేయులు తమ ఆధీనంలోకి తీసుకొని తమ అదుపులో ఉన్న ప్రాంతాలకు ‘పాలెగాళ్ల’ను ఏర్పాటు చేసేవాళ్లు. అలాంటి ఓ పాలెగాడు నరసింహారెడ్డి. ఆంగ్లేయులపై ఎలా ఎదురుతిరిగాడు? ఈ ఉద్యమంలో ఎవరెవరిని తనతో కలుపుకుంటూ పోరాటాన్ని ముందుకు తీసుకెళ్లాడు అనేది చిత్రకథ అని సమాచారం. ఈ చిత్రంలో అనుష్క ఝాన్సీ రాణిగా కనిపిస్తారు. సినిమా అనుష్క వాయిస్ ఓవర్‌తోనే మొదలవుతుందని తెలిసింది. చిరంజీవి గురువు పాత్రలో అమితాబ్ నటించారు. రాజ నర్తకి పాత్రలో తమన్నా, నరసింహారెడ్డి భార్య సిద్ధమ్మగా నయనతార నటించారు. నరసింహారెడ్డికి మద్దతుగా తమిళనాడు నుంచి వచ్చే దళ నాయకుడిగా విజయ్ సేతుపతి కనిపిస్తారు. ఎవరి పాత్రేంటి? చిరంజీవి – ఉయ్యాలవాడ నరసింహారెడ్డి నయనతార – సిద్ధమ్మ అమితాబ్ బచ్చన్ – గోసాయి వెంకన్న జగపతి బాబు – వీరారెడ్డి ‘కిచ్చ’ సుదీప్ – అవుకు రాజు విజయ్ సేతుపతి – రాజా పాండీ తమన్నా – లక్షి అనుష్క – ఝాన్సీ లక్ష్మీభాయ్ సైరా బృందం రచన : పరుచూరి బ్రదర్స్ దర్శకుడు : సురేందర్ రెడ్డి నిర్మాత : రామ్‌చరణ్ ప్రొడక్షన్ డిజైనర్ : రాజీవన్ కెమెరా మేన్ : రత్నవేలు యాక్షన్ కొరియోగ్రాఫర్స్ : గ్రెగ్ పోవెల్, రామ్ లక్ష్మణ్, లీ వైట్కర్ కాస్ట్యూమ్ డిజైనర్ : అంజూ మోడీ, సుష్మితా కొణిదెల, ఉత్తరా మీనన్ వీఎఫ్ఎక్స్ సూపర్వైజర్ : కమల్ కణ్ణన్ సంగీతం : అమిత్ త్రివేది రాజస్తాన్ స్పెషల్ కత్తి యాక్షన్ సన్నివేశాలు ఎక్కువగా ఉన్న సినిమా కావడంతో ఈ సినిమా కోసం ప్రత్యేకంగా 150కు పైగా వివిధ రకాలైన కత్తులను తయారు చేయించారట. ప్రధానంగా చిరంజీవి రెండు కత్తులు వాడారని సమాచారం. ఒక కత్తిని ప్రత్యేకంగా రాజస్థాన్ నుంచి తెప్పించారట. ఇక్కడ డిజైన్ చేసి, రాజస్తాన్ పంపించి, ఆ కత్తిని తయారు చేయించారు. మరో కత్తిని హైదరాబాద్‌లోనే తయారు చేయించారు. ఇంకా మిగతా కత్తులను ఇక్కడ డిజైన్ చేసి, చెన్నైలో తయారు చేయించారు. రెండు భారీ యుద్ధాలు! ‘సైరా’ సినిమాలో రెండు భారీ యుద్ధాలు ఉంటాయని తెలిసింది. ఈ యుద్ధ సన్నివేశాల్లో ఒకటి జార్జియా దేశంలో, మరొకటి హైదరాబాద్‌లోని కోకాపేట్ సెట్లో షూట్ చేశారు. జార్జియాలో నెల రోజుల పాటు ఈ యుద్ధ సన్నివేశాలను చిత్రీకరించగా, కోకాపేట్లో దాదాపు 35 రోజులుపైగా నైట్ షూట్ చేశారట. సినిమాలో వచ్చే ఈ మేజర్ వార్ సీన్స్ స్పెషల్ ఎట్రాక్షన్‌గా నిలుస్తాయని తెలిసింది. ఇంకా ఇవి కాకుండా పోరాట దృశ్యాలు మరిన్ని ఉంటాయి. వాటిలో నీటి లోపల తీసిన అండర్ వాటర్ ఎపిసోడ్ ఓ హైలైట్ అని తెలిసింది. ఈ ఎపిసోడ్‌ను ముంబైలో వారం రోజులు షూట్ చేశారు. పదిహేను సెట్లు ‘సైరా’ చారిత్రాత్మక చిత్రం. స్క్రీన్ మీద ఆ కాలాన్ని ప్రతిబింబించాలంటే సెట్లు కచ్చితంగా నిర్మించాల్సిందే. ‘సైరా’ చిత్రాన్ని ఎక్కువ శాతం సెట్లోనే షూట్ చేశారు. దాని కోసం అల్యూమినియం ఫ్యాక్టరీలో రెండు సెట్లు, ఆర్ఎఫ్సీలో రెండు సెట్లు, కోకాపేటలో మూడు సెట్లు (టెంపుల్ సెట్, ప్యాలెస్ సెట్‌తో పాటు మరోటి), ఇంకా హైదరాబాద్‌లోనే రెండు సెట్లు, పాండిచెరీలో ఒకటి, మైసూర్, తమిళనాడులో హోగెనకల్లో ఒకటి, కేరళలో ఒకటి, రెండు సెట్లను రూపొందించారు. ఇలా 15కు పైగా భారీ సెట్లను ఈ సినిమా కోసం రూపొందించారు ఆర్ట్ డైరెక్టర్ రాజీవన్ ఆధ్వర్యంలో అద్భుతమైన సెట్లు తయారు చేశారు. నయనతార గెరిల్లా ఫైట్ నరసింహారెడ్డి ఆంగ్లేయులతో తలపడిన విధానాల్లో గెరిల్లా ఒక పద్ధతి. శత్రువుల్లో కలిసిపోయి అనూహ్యంగా దాడి చేయడం ఈ యుద్ధ విద్య విశేషం. సినిమాలో ఓ పాటలో ఈ గెరిల్లా పోరాటాన్ని చూపించనున్నారట చిత్రబృందం. పాట బ్యాక్‌డ్రాప్‌లో సాగే ఆ ఫైట్‌లో చిత్రకథానాయకుడు చిరంజీవితో పాటు దాదాపు 500మంది పాల్గొన్నారు. కాస్ట్యూమ్స్ ఇందులో చిరంజీవి సుమారు 50 కాస్ట్యూమ్స్‌లో కనిపిస్తారని సమాచారం. చిరంజీవి కాస్ట్యూమ్స్‌ను ఆయన కుమార్తె సుష్మితా కొణిదెల డిజైన్ చేశారు. తమన్నా నర్తకి పాత్రలో కనిపించనున్నారు. ఆమె కూడా ఓ 25 కాస్ట్యూమ్స్‌లో కనిపిస్తారట. నయనతారకి 20 డ్రస్ చేంజ్‌లు ఉంటాయని తెలిసింది. సినిమాలో ఎక్కువ కాస్ట్యూమ్స్ ఈ మూడు పాత్రలకే ఉంటాయి. అంజూ మోడీ, ఉత్తరా మీనన్‌లు కూడా కాస్ట్యూమ్స్ డిజైన్ చేశారు. తమన్నా ‘‘సైరా’లో నా పాత్ర రెండు నిమిషాలు కూడా ఉండదు. కానీ మేకింగ్ వీడియోలో నా విజువల్స్ కూడా వేశారు చరణ్ (రామ్ చరణ్) అన్న. అది చాలా స్వీట్ అనిపించింది. అన్న స్టైలే అది. ఇలాంటి చిన్న చిన్న విషయాలతో మా అందర్నీ హ్యాపీగా ఉంచుతాడు. ఇది రక్షాబంధన్‌కి అడ్వాన్స్‌గా ఇచ్చిన గిఫ్ట్ అనుకుంటున్నాను’’ అని తన ఆనందాన్ని షేర్ చేసుకున్నారు నిహారిక. ఇందులో నిహారిక కాసేపు కనిపిస్తారు. నిహారిక -
ప్రేమతో...!
జైపూర్‌లో ప్రేమాయణం సాగిస్తున్నారు విశాల్. సుందర్. సి దర్శకత్వంలో విశాల్ హీరోగా ఓ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఇందులో తమన్నా కథానాయికగా నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ రాజస్థాన్‌లోని జైపూర్ పరిసర ప్రాంతాల్లో జరుగుతోంది. విశాల్, తమన్నాలపై లవ్ సీన్స్‌ను తీస్తున్నారట. ఈ షెడ్యూల్లోనే నటి ఖుష్బూ కూడా పాల్గొంటున్నారు. దాదాపు నెలరోజుల పాటు ఈ జైపూర్ షెడ్యూల్ సాగుతుందని కోలీవుడ్ టాక్. -
రీమేక్ క్వీన్
రెగ్యులర్ సినిమాలతో పాటు రీమేక్ సినిమాలను అదే సంఖ్యలో చేస్తున్నట్టున్నారు తమన్నా. లేటెస్ట్గా ఓ తమిళ సినిమా హిందీ రీమేక్‌లో తమన్నా నటించనున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. తమిళ సూపర్ హిట్ చిత్రం ‘జిగర్తండా’ హిందీలో రీమేక్ కాబోతోంది. తమిళంలో సిద్ధార్థ్ చేసిన పాత్రలో ఆర్యన్ కార్తీక్, బాబీ సింహా చేసిన పాత్రలో సంజయ్ దత్ కనిపించనున్నారు. ఈ సినిమాలో హీరోయిన్గా తమన్నా నటిస్తారని తెలిసింది. ఈ చిత్రాన్ని అజయ్ దేవగణ్ నిర్మించనున్నారు. ఇది మాత్రమే కాదు.. ఈ ఏడాది తమన్నా ఎక్కువ రీమేక్స్‌లో కనిపించనున్నారు. ఇటీవలే హిందీ ‘క్వీన్’ను తెలుగులో ‘దటీజ్ మహాలక్షి’గా రీమేక్ చేశారు. ఆ సినిమా రిలీజ్‌కు రెడీ అయింది . ఆల్రెడీ తెలుగు సూపర్ హిట్ ‘ఆనందో బ్రహ్మా’ను ‘పెట్రోమాక్స్’ టైటిల్‌తో తమిళంలో రీమేక్ చేశారు. అందులో తమన్నా లీడ్ రోల్ చేశారు. ఇప్పుడు తమిళ ‘జిగర్తండా’ హిందీ రీమేక్‌లో తమన్నా నటిస్తున్నారు. ఇలా ఒకేసారి తెలుగు టు తమిళం టు హిందీ సినిమాల రీమేక్స్‌తో ప్రస్తుతానికి ‘రీమేక్ క్వీన్’ అయ్యారు తమన్నా. -
ఇక్కడ దీపిక.. అక్కడ మెరిల్
దక్షిణాదిలో కథానాయికగా మంచి పేరు సంపాదించుకున్నారు తమన్నా. సౌత్‌లో ఫుల్ బిజీగా ఉన్న ఈ బ్యూటీ ఇటీవల హిందీలో ఓ సినిమాకు సంతకం చేసిన విషయం తెలిసిందే. ఇందులో నవాజుద్దీన్ సిద్ధిఖీ హీరోగా నటించనున్నారు. కాగా బాలీవుడ్లో ఏ హీరోయిన్ వర్కింగ్ స్టైల్ అంటే ఇష్టం? అనే ప్రశ్నను తమన్నా ముందు ఉంచితే...‘‘దీపికా పదుకోన్ వర్కింగ్ స్టైల్ అంటే చాలా ఇష్టం. ఆమె కళ్లు చాలా అందంగా ఉంటాయి. ప్రయోగాత్మక చిత్రాలను చేయడానికి ఇష్టపడుతుంటారామె’’ అన్నారు. మరి హాలీవుడ్లో? అంటే ‘‘ప్రముఖ నటి మెరిల్ స్ట్రిప్స్ అంటే విపరీతమైన అభిమానం. ప్రతి పాత్రలోనూ వైవిధ్యం చూపిస్తారామె. డెబ్భై ఏళ్ల వయసులో కూడా ఏ పాత్రలో అయినా ఇట్టే ఒదిగిపోగలరు’’ అని పేర్కొన్నారు. ప్రస్తుతం తమిళంలో ‘పెట్రోమాక్స్’ సినిమాతో బిజీగా ఉన్న తమన్నా తెలుగులో ‘దటీజ్ మహాలక్ష్మి, సైరా: నరసింహారెడ్డి’ సినిమాలను పూర్తి చేశారు. -
తలకిందుల ఇంట్లో తమన్నా!
ఇంట్లోని గడియారం, అల్మరా, అద్దం.. ఇలా అన్ని వస్తువులు తలకిందులుగా కనిపిస్తున్నాయి. అదే ఇంట్లో ఉన్న తమన్నా మాత్రం కుర్చీలో దర్జాగా కూర్చుని నవ్వుతున్నారు. విశేషం ఏంటంటే.. తమన్నా కూర్చున్న కుర్చీ మాత్రం తలకిందులుగా లేదు. ఇక్కడున్న ఫొటో చూశారుగా. తమన్నా ప్రధాన పాత్రలో నటిస్తోన్న తాజా తమిళ చిత్రంలోని స్టిల్ ఇది. రోహన్ వెంకటేశన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ ‘పెట్రోమాక్స్’ అనే టైటిల్‌ను ఖరారు చేసి, ఫస్ట్ లుక్‌ను విడుదల చేశారు. ఈ ఫస్ట్ లుక్‌ను తాప్సీ విడుదల చేశారు. ఈ సినిమాను సెప్టెంబర్‌లో విడుదల చేయాలనుకుంటున్నారు. ఈ సంగతి ఇలా ఉంచితే... తెలుగులో హిట్ సాధించిన ‘ఆనందోబ్రహ్మ’ సినిమాకు ‘పెట్రోమాక్స్’ తమిళ రీమేక్ అని టాక్. తెలుగు వెర్షన్లో తాప్సీ నటించిన విషయం తెలిసిందే. అందుకే తమిళ రీమేక్‌ని ఆమె చేతుల మీదుగా విడుదల చేయించి ఉంటారు. -
మార్పు కనిపిస్తోంది
‘‘హీరోయిన్గా 14 ఏళ్లు పూర్తి చేసుకున్నాను. ఇన్నేళ్లల్లో వివిధ రకాల సినిమాల్లో భాగమయ్యే అవకాశం లభించింది. గతంలో కొన్ని సినిమాలు చేయాలనుకున్నా ప్రేక్షకులు చూస్తారో? చూడరో? అనే సందేహం ఉండేది. కానీ ఇప్పుడు ప్రేక్షకులు సినిమాను చూసే విధానం మారింది. ఆ మార్పు బాగా కనిపిస్తోంది’’ అన్నారు తమన్నా. ప్రస్తుతం తన దగ్గరకు వస్తున్న పాత్రలు, ప్రేక్షకులు సినిమా చూస్తున్న విధానం గురించి తమన్నా మాట్లాడుతూ – ‘‘ప్రేక్షకులు భిన్నమైన సినిమాలు చూడటానికి ఇష్టపడుతున్నారు. కొత్త ఐడియాలకు స్వాగతం పలుకుతున్నారు. ఇంతకుముందు చేయలేం అనుకున్న పాత్రలు ఇప్పుడు నమ్మకంగా చేయొచ్చు. నా దగ్గరకు వచ్చే పాత్రల్లో కూడా మార్పును గమనించాను. పాత్రల్లో కొత్తదనం ఉండి, అవి మేము (హీరోయిన్లు) చేయగలమని దర్శకులు నమ్మడం యాక్టర్‌గా నాకు చాలా కాన్ఫిడెన్స్ ఇస్తోంది. చేసే ప్రతీ పాత్రలో వ్యత్యాసం చూపించే అవకాశం రావడం నిజంగా అదృష్టమే’’ అన్నారు. -
అది తప్పుడు ప్రచారం : తమన్నా
చెన్నై : నేనెందుకు అలాంటి పని చేస్తాను అంటోంది నటి తమన్నా. ఈ అమ్మడు బాలీవుడ్లో స్ట్రాంగ్‌గా పాదం మోపాలని తీవ్రంగా ప్రయత్నాలు చేస్తోంది. అడపాదడపా అక్కడ అవకాశాలు వస్తూనే ఉన్నాయి. అయితే మంచి హిట్ ఈ బ్యూటీని వరించడం లేదు. ఈ భామ ఎలాగైనా అక్కడ నిలదొక్కుకోవాలన్న దృఢ సంకల్పంతో ఉన్నట్టు సమాచారం. అందులో భాగంగా ముందుగా ముంబాయిలో స్థిర నివాసం ఏర్పరచుకోవాలని నిర్ణయించుకుని ఇటీవలే అక్కడ ఒక ఫ్లాట్‌ను కొనుగోలు చేసింది. ముంబాయిలోని వెర్సోవా ప్రాంతంలో చదరపు అడుగును రూ.80,778 చొప్పున 2,055 చదరపు అడగుల విస్తీర్ణంతో కూడిన ఈ ఫ్లాట్‌ను రూ.16.6 కోట్లకు కొనుగోలు చేసినట్లు టాక్. అంతవరకూ బాగానే ఉంది. ముందే చెప్పినట్లుగా హీరోయిన్లు ఏం చేసినా మీడియా కాస్త అతి చేస్తుంటుంది. తమన్నా నూతన ఫ్లాట్ విషయంలోనూ అత్యుత్సాహాన్ని ప్రదర్శించింది. తమన్నా మార్కెట్ రేటు కంటే డబుల్ ధర వెచ్చించి ఫ్లాట్‌ను కొనుగోలు చేసినట్లు దుమ్మురేపే ప్రచారం చేసేసింది. ఇలాంటి ప్రచారం నటి తమన్నా హింది టీచర్‌ను కూడా స్పందించేలా చేసిందట. ఆమె తమన్నాకు ఫోన్ చేసి ఎందుకు రెట్టింపు ధర చెల్లించి ఫ్లాట్ కొనుగోలు చేశావు? అని ప్రశ్నించిందట. ఆ తరువాత ఒక్కొక్కరు ఇలాంటి ప్రశ్నలే వేస్తున్నారట. ఈ విషయాన్ని నటి తమన్నానే స్వయంగా వెల్లడించింది. తన ఫ్లాట్ గురించి ఎంత చర్చ జరుగుతుండటం ఆశ్చర్యంగా ఉందని అంది. తాను రెంట్టింపు ధర చెల్లించి ఫ్లాట్ ఎందుకు కొంటానని ప్రశ్నించింది. తాను ముంబాయిలో ఫ్లాట్ కొనుగోలు చేసిన విషయం నిజమేనని, అయితే రెట్టింపు ధరను మాత్రం చెల్లించలేదని వివరించింది. ఆ ఫ్లాట్ పూర్తయిన తరువాత తన తల్లిదండ్రులతో కలిసి అందులో నివాసం ఉండనున్నట్లు తమన్నా తెలిపింది. ఈ అమ్మడు 2055 చదరపు అడుగుల విస్తీర్ణం కలిగిన ఈ ఫ్లాట్‌ను సమీర్ బోజ్వాణి అనే వ్యక్తి నుంచి రూ.16.6 కోట్లకు కొనుగోలు చేసినట్టు స్పష్టత ఇచ్చి ప్రచారానికి అడ్డుకట్ట వేసింది. కాగా ప్రస్తుతం ఈ అమ్మడు కోలీవుడ్‌లో విశాల్‌కు జంటగా ఒక చిత్రంలోనూ, హిందిలో ఒక చిత్రం చేస్తోంది. -
డబ్బుల్ పెట్టలేదు
ఇండస్ట్రీలో మంచి ఫామ్‌లో ఉన్న టాప్ లిస్ట్ హీరోయిన్ తమన్నా ఇటీవల ముంబైలో ఓ ఫ్లాట్ కొనుగోలు చేశారు. తమన్నా ముంబైలో ఇల్లు కొన్నారన్న వార్త కన్నా.. ఆమె ఆ ఫ్లాట్‌ను అక్కడ ఉన్న సాధారణ ఖరీదు కన్నా రెట్టింపు ధర చెల్లించి కొన్నారనే వార్త హాట్ టాపిక్‌గా మారింది. ఈ బ్యూటీ కొన్న ఫ్లాట్‌లోని ఏ వ్యూ నుంచి చూసినా సముద్రం కనిపిస్తుందట. అందుకే తమన్నా ఆ అపార్ట్మెంట్ కోసం అంత ఖర్చు చేశారన్నది బీ టౌన్ టాక్. ఈ విషయంపై తమన్నా స్పందిస్తూ – ‘‘నేను ముంబైలో కొత్త ఫ్లాట్ కొన్నమాట వాస్తవమే. కానీ ప్రచారంలో ఉన్నట్లు డబుల్ అమౌంట్ మాత్రం పెట్టలేదు. ఇదే విషయమై మా హిందీ టీచర్ నాకు మొబైల్లో మెసేజ్ చేశారు. కాస్త ఆశ్చర్యానికి గురయ్యాను’’ అని వాపోయారు తమన్నా. ఇంకా కొత్త ఇంటి విశేషాలను చెబుతూ– ‘‘ప్రస్తుతం ఫ్లాట్ లోపలి వర్క్ జరుగుతోంది. పూర్తి కాగానే గృహ ప్రవేశం చేస్తాం. నార్మల్ లైఫ్‌ని లీడ్ చేయడానికే నేను ఇష్టపడతాను’’ అని చెప్పుకొచ్చారు. -
త ప్లేస్‌లో తా?
మూడో రాజుగారి గదిలోకి ఇటీవల తమన్నా గృహప్రవేశం చేసిన సంగతి గుర్తుండే ఉంటుంది. అయితే తమన్నా ప్లేస్‌లోకి తాప్సీ రానున్నారని లేటెస్ట్ టాక్. ఓంకార్ దర్శకత్వంలో ఇటీవల ‘రాజుగారి గది 3’ మొదలైంది. ఈ చిత్రాన్ని ఓక్ ఎంటర్‌న్మెంట్ సంస్థ నిర్మిస్తోంది. ‘రాజుగారి గది 2’ చిత్రానికి ఇది సీక్వెల్. ఈ సినిమా స్క్రిప్ట్ పరంగా కొన్ని క్రియేటివ్ డిఫరెన్సెస్ వచ్చి తమన్నా తప్పుకున్నారట. దీంతో చిత్రబృందం తాప్సీతో సంప్రదింపులు జరుపుతున్నారన్నది తాజా సమాచారం. -
దోసేస్తారు!
షూటింగ్‌లు, ప్రమోషన్లు, కొత్త సినిమా స్క్రిప్ట్‌లు వినడం... ఇలా ఆర్టిస్టుల లైఫ్ బిజీ బిజీగా ఉంటుంది. ఎప్పుడో కానీ కాస్త టైమ్ దొరకదు. ఆ టైమ్‌లో ఎవరికి నచ్చిన పని వారు చేస్తూ పని ఒత్తిడి నుంచి రిలాక్స్ అవుతుంటారు. సోనమ్ కపూర్, శ్రుతీహాసన్ లాంటి హీరోయిన్లు ఖాళీ సమయాల్లో బొమ్మలు వేస్తారు. శ్రియ, దిశా పాట్నీ, పరిణీతి కేటగిరీ వారు సముద్రతీరాలకు వాలిపోతారు. మిల్కీ బ్యూటీ తమన్నా మాత్రం వంటింట్లోకి దూరి గరిటె చేత పట్టుకుని దోశలు వేశారు. ఇందుకు సంబంధించిన వీడియోను తన ఇన్స్టాగ్రామ్ స్టేటస్ యాప్‌లో షేర్ చేసుకున్నారు. మరి.. దోశ టేస్ట్ ఎలా ఉందనే విషయం మాత్రం ఈ బ్యూటీనే అడగాలి. వెండితెరపై తన అందం, అభినయంతో ప్రేక్షకులు మనసులు దోచేసిన తమన్నా ఇప్పుడు కావాల్సినవాళ్లకు ఇంట్లో దోసెలు వేసి, వారి మనసుని కూడా దోసేస్తున్నారేమో! ఇక సినిమాల విషయానికి వస్తే.. సౌత్‌లో వరుస సినిమాలకు సైన్ చేస్తూ జోష్ మీద ఉన్న ఈ బ్యూటీ ఇటీవల ‘బోలే ఛూడియా’ అనే హిందీ సినిమాకు సైన్ చేశారు. -
పక్కా ప్లానింగ్!
ఇటు సౌత్ అటు నార్త్‌ని బ్యాలెన్స్ చేసుకుంటున్నారు తమన్నా. ఇక్కడ సినిమాలు కమిట్ అవుతూ అక్కడి సినిమాలకు కూడా డేట్స్ ఇస్తూ పర్ఫెక్ట్ ప్లానింగ్‌తో వెళుతునాన్రు. ఇటీవల విడుదలైన హిందీ చిత్రం ‘ఖామోషి’ చిత్రంలో కనిపించిన తమన్నా ఇప్పుడు బాలీవుడ్లో మరో చిత్రానికి గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారని టాక్. విలక్షణ నటుడు నవాజుద్దీన్ సిద్ధిఖీ హీరోగా తెరకెక్కనున్న చిత్రం ‘బోలె చూడియా’లో తమన్నా నాయికగా నటించనున్నారట. ఈ సినిమాతో నవాజుద్దీన్ సిద్ధిఖీ సోదరుడు షమాస్ నవాబ్ సిద్ధిఖీ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. రొమాంటిక్ డ్రామాగా రూపొందనున్న ఈ సినిమాలో తొలుత మౌనీ రాయ్‌ను కథానాయికగా ఎంపిక చేశారు. అయితే ఆమె ఈ చిత్రం నుంచి తప్పుకోవడంతో ఆ అవకాశం తమన్నాకి దక్కింది. ప్రస్తుతం సమాజం ఎదుర్కొంటున్న ఒక సమస్యపై ఈ చిత్రకథ ఉంటుందట. కాగా, ఈ చిత్రంలో ప్రముఖ దర్శకుడు అనురాగ్ కశ్యప్ కీలక పాత్రలో నటిస్తున్నారు. ఇదిలా ఉంటే ‘రాజుగారి గది 3’ నుంచి తమన్నా తప్పుకున్నారని ఫిల్మ్ నగర్ టాక్. ‘సైరా’లో ఆమె ఓ కీలక పాత్ర చేసిన విషయం తెలిసిందే. తమిళంలో సుందర్ .సి దర్శకత్వంలో ఓ సినిమా, ‘ఆనందో బ్రహ్మ’ తమిళ రీమేక్‌లో నటిస్తున్నారు. -
నేను బొమ్మ గీస్తే..!
‘‘సినిమాలో పాత్ర పండటం కోసం ఏదేదో చేస్తాం. ఫైట్ చేస్తాం, వంట చేస్తాం, గయ్యాళిలా ప్రవర్తిస్తాం.. ఇలా పాత్రకు తగ్గట్టు చేస్తాం. అవన్నీ రియల్ లైఫ్‌లో చేయం. అసలు సినిమాల్లో కనిపించే మేం వేరు.. రియల్ లైఫ్‌లో మేం వేరు’’ అంటున్నారు తమన్నా. ఎందుకు ఇలా అంటున్నారంటే.. ఆ మధ్య విడుదలైన ‘అభినేత్రి 2’లో ఈ మిల్కీ బ్యూటీ పెయింటర్ పాత్ర చేశారు. మరి.. నిజజీవితంలో మీకు బొమ్మలు గీయడం వచ్చా? అని అడిగితే – ‘‘నేనా? బొమ్మలు గీయడమా? రానే రాదు. చిన్నప్పుడు బొమ్మలతో ఆడుకున్నాను (నవ్వుతూ). నాకెవరైనా ఖాళీ కాగితం ఇచ్చి, బొమ్మలు గీయమంటే.. ఓ సర్కిల్ (వలయం) గీసి, దానికి రెండు కాళ్లు, రెండు చేతులు గీయగలను. అవేముంది? జస్ట్ గీతలే కదా. నా బొమ్మలో ఆ గీతలే కాళ్లూ చేతులు. ఆ బొమ్మ బొమ్మలా ఉండదు. అయితే నాకు కవితలు రాయడం బాగా వచ్చు. షూటింగ్ లేనప్పుడు కవితలు రాస్తుంటాను’’ అని చెప్పారు. చిరంజీవి ‘సైరా: నరసింహారెడ్డి’ చిత్రంలో తమన్నా ఓ కీలక పాత్ర చేసిన విషయం తెలిసిందే. ఇది నెగటివ్ రోల్ అనే వార్త ప్రచారంలో ఉంది. అయితే అది నిజం కాదని సమాచారం. -
16 కోట్ల ఫ్లాట్!
దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి. డిమాండ్ ఉన్నప్పుడే డబ్బులు కూడబెట్టుకోవాలి. ఈ మంత్రాన్నే హీరోయిన్లు పాటిస్తుంటారు. కూడబెట్టడంలోనే కాదు ఖర్చుపెట్టడంలోనూ కొందరు హీరోయిన్లు ముందుంటారు. తాజాగా ఓ ఫ్లాట్ కోసం అక్షరాలా పదహారు కోట్లు ఖర్చు చేశారట తమన్నా. ఈ ఫ్లాట్‌లోంచి చూస్తే ఎగిసిపడే సముద్రం కనిపిస్తుందట. ఆ కనువిందు కోసమే ఇంత ఖర్చు. హీరోహీరోయిన్లు విలాసవంతమైన ఇళ్లు కొనుగోలు చేయడం ఇదివరకు చాలా సందర్భాల్లో చూశాం. తాజాగా తమన్నా కూడా ఈ లిస్ట్‌లోకి గృహప్రవేశం చేయబోతున్నారు. ముంబైలోని ‘బే వ్యూ’ అనే అపార్ట్మెంట్లో ఓ ఫ్లాట్‌ను మార్కెట్ రేటుకు రెండింతలు చెల్లించి సొంతం చేసుకున్నారని సమాచారం. సుమారు 16.6 కోట్లు తమన్నా ఖర్చు చేశారట. దీనికి తోడుగా 2 కోట్లతో ఇంటీరియర్ డిజైన్ చేయించాలనుకుంటున్నారని తెలిసింది. త్వరలోనే ఈ అపార్ట్మెంట్లోకి కుడి కాలు పెట్టనున్నారట. ప్రస్తుతం తమిళంలో ఓ రెండు సినిమాలు, తెలుగులో రెండు సినిమాలతో బిజీబిజీగా ఉన్నారు. -
రాజుగారి గదిలోకి ఎంట్రీ
భయపెట్టడానికి కొత్త గదిలోకి అడుగుపెట్టారు మిల్కీ బ్యూటీ తమన్నా. ఓంకార్ దర్శకత్వంలో తమన్నా ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న సినిమా ‘రాజుగారి గది 3’. ఇదివరకు ఓంకార్ దర్శకత్వంలోనే వచ్చిన ‘రాజుగారి గది, రాజుగారి గది 2’ చిత్రాలకు ఇది సీక్వెల్ అని చెప్పుకోవచ్చు. ఓక్ ఎంటర్టైన్మెంట్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. గురువారం ‘ రాజుగారి గది 3’ ప్రారంభోత్సవం జరిగింది. ముహూర్తపు సన్నివేశానికి నిర్మాత ‘దిల్’ రాజు క్లాప్ ఇచ్చారు. ‘స్టార్ మా’ బిజినెస్ హెడ్ అలోక్‌జైన్ కెమెరా స్విచ్చాన్ చేశారు. ఈ రోజు నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ జరుగుతుంది. అశ్విన్‌బాబు, అలీ, బ్రహ్మాజీ, ప్రభాస్ శ్రీను, హరితేజ, అజయ్ ఘోష్, ఊర్వశి తదితరులు నటిస్తున్న ఈ సినిమాకు మాటలు: సాయిమాధవ్ బుర్రా, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: కల్యాణి చక్రవర్తి. -
ఆమె బయోపిక్‌లో నటించాలని ఉంది
నటిగా తమన్నాకు రెండే రెండు కోరికలు ఉన్నాయట. అయితే ఇవి బాలీవుడ్‌కి సంబంధించినవి. ఒకటి ప్రముఖ నటి శ్రీదేవి జీవిత చరిత్రలో నటించాలన్న కోరిక. మరోటి హిందీలో పూర్తి స్థాయి డ్యాన్స్ బేస్డ్ మూవీలో నటించాలని కోరిక. ఇవి ఎప్పుడు తీరుతాయో చూడాలి. ఆ సంగతలా ఉంచితే.. శ్రీదేవి జీవిత చరిత్రలో తమన్నా ఎందుకు నటించాలనుకుంటున్నారంటే.. చిన్నప్పటి నుంచి ఆమె సినిమాలనూ చూస్తూ పెరిగానని, ఆమె అందం, నటన అద్భుతం అనీ తమన్నా అంటున్నారు. శ్రీదేవి పాత్రలో నటించే అవకాశం వస్తే అంతకన్నా అదృష్టం మరోటి లేదని కూడా పేర్కొన్నారు తమన్నా. అయితే గతంలో శ్రీదేవి నటించిన ‘హిమ్మత్వాలా’ రీమేక్‌లో తమన్నా నటించారు. ఆ సినిమా అపజయం పాలైంది. అది వేరే విషయం. చిన్నప్పటి నుంచి ఆరాధించిన మనిషి తిరిగి రాని లోకాలకు వెళ్లడం చాలా బాధాకరం అని కూడా తెలిపారు. ఇవన్నీ ఓ ఇంటర్వ్యూలో చెప్పారామె. అదే ఇంటర్వ్యూలో ప్రభాస్ గురించిన ప్రస్తావన వచ్చింది. ఈ యంగ్ రెబల్ స్టార్ సరసన తమన్నా ‘రెబల్’, ‘బాహుబలి’ చిత్రాల్లో నటించిన విషయం తెలిసిందే. ఆ ఇంటర్వ్యూలో ప్రభాస్ చాలా సాఫ్ట్ అని, దయాగుణం ఉన్నవాడని తమన్నా చెప్పారు. అది మాత్రమే కాదు.. దేశవ్యాప్తంగా ఎంతోమంది అమ్మాయిలు ప్రభాస్‌ని పెళ్లాడాలనుకుంటున్నారని ఈ మిల్కీబ్యూటీ చెప్పడం విశేషం. -
రెండింతలు భయపెడతాం
‘అభినేత్రి’ చిత్రంతో తమన్నా, ప్రభుదేవా ప్రేక్షకులను భయపెట్టారు. మొదటిసారి కంటే రెట్టింపు భయపెట్టడానికి ‘అభినేత్రి’ సీక్వెల్ ‘అభినేత్రి 2’తో రెడీ అయ్యారు. ప్రభుదేవా, తమన్నా జంటగా ఏ.ఎల్. విజయ్ దర్శకత్వంలో తెరకెక్కిన హారర్ థ్రిల్లర్ ‘అభినేత్రి 2’. సోనూ సూద్, నందితా శ్వేత, సప్తగిరి కీలక పాత్రల్లో నటించారు. అభిషేక్ నామా, ఆర్. రవీంద్రన్ నిర్మించారు. ఈ చిత్రాన్ని మే 31న రిలీజ్ చేయాలనుకుంటున్నారు. ఈ సందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ– ‘‘థ్రిల్ చేస్తూనే మనసును ఆకట్టుకునే సన్నివేశాలు ఈ సినిమాలో చాలా ఉంటాయి. టీజర్, ట్రైలర్‌కు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించింది. ప్రభుదేవా, తమన్నా, నందితా శ్వేతల నటన ఈ సినిమాకు హైలైట్’’ అన్నారు. ఈ చిత్రానికి కెమెరా: అయాంకా బోస్, సంగీతం: శ్యామ్ సీఎస్. -
జర్నీ ఎండ్!
సుదీర్ఘ ‘సైరా’ ప్రయాణం క్లైమాక్స్‌కు వచ్చింది. ప్యాచ్ వర్క్ మినహా షూటింగ్ దాదాపుగా పూర్తయిందని తెలిసింది. చిరంజీవి హీరోగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘సైరా’. స్వాతంత్య్ర సమర యోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితం ఆధారంగా ఈ చిత్రం రూపొందుతోంది. రామ్‌చరణ్ నిర్మాత. నయనతార, తమన్నా కథానాయికలు. ఇటీవలే చిరంజీవి, తమన్నాలపై ఓ సాంగ్‌ను షూట్‌ను పూర్తి చేశారు. ఈ నెలాఖరులో అనుష్కతో రెండు రోజులు సీన్స్ చిత్రీకరించనున్నారు. చిన్న చిన్న ప్యాచ్ వర్క్ మినహా షూటింగ్ పూర్తయిందట. వీఎఫెక్స్ వర్క్స్ కూడా అనుకున్న సమయానికి జరిగితే సినిమాను గాంధీ జయంతికి రిలీజ్ చేయాలని చిత్రబృందం ప్లాన్ చేస్తోంది. అమితాబ్ బచ్చన్, జగపతిబాబు, సుదీప్, విజయ్ సేతుపతి ముఖ్య పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమాకు సంగీతం: అమిత్ త్రివేది, కెమెరా: రత్నవేలు. -
నో బ్రేక్
ఈ రోజుల్లో సినిమా పూర్తి కావాలంటే 6 నెలల నుంచి ఏడాది, రెండేళ్ల వరకూ పడుతుంది. చిన్న సినిమాల షూటింగ్ కూడా చాలా రోజులు పడుతోంది. కానీ తమిళంలో తమన్నా నటించనున్న ఓ హారర్ సినిమా నలభై రోజుల్లోనే పూర్తి కానుందని తెలిసింది. రోహిన్ వెంకటేశన్ దర్శకత్వంలో తమన్నా ముఖ్యపాత్రలో ఓ లేడీ ఓరియంటెడ్ హారర్ థ్రిల్లర్ రూపొందనుంది. యోగిబాబు, మన్సూర్ అలీ ఖాన్, భగవతీ పెరుమాళ్ కీలక పాత్రల్లో నటించనున్నారు. ఈ సినిమా షూటింగ్ పార్ట్ మొత్తం 42 రోజుల్లో పూర్తి చేయాలనుకుంటున్నారట. ఒక్కసారి షూటింగ్ మొదలుపెట్టాక ఎటువంటి బ్రేక్స్ తీసుకోకూడని ఫిక్స్ అయ్యారట. మొదటి పది రోజులు చెన్నైలో మిగతా పోర్షన్ మొత్తం కారైకుడిలో షూట్ చేస్తారట. తమన్నా నటించిన హారర్ చిత్రాలు ‘దేవి 2’, కామోషీ’ సినిమాలు మే 31న రిలీజ్ కానున్నాయి. -
అప్పుడే పేరూ డబ్బూ వస్తాయి
నిన్న మొన్నటివరకు గ్లామరస్ క్యారెక్టర్స్‌కే పరిమితమైన మిల్కీ బ్యూటీ తమన్నా కొత్త దారిని ఎంచుకున్నారు. లేడీ ఓరియంటెడ్ సినిమాలపై (దేవి 2, రాజుగారి గది 3, ఓ కొత్త దర్శకుడితో మరో సినిమా) దృష్టి సారించారు. కథ నచ్చితే గ్లామరస్ రోల్స్‌కి కూడా సై అంటున్నారు. ఎప్పటికప్పుడు భిన్నమైన పాత్రలను ఎంచుకుంటూ ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్ల లిస్ట్‌లో తన పేరు కచ్చితంగా ఉండేలా కష్టపడుతున్నారు. నటిగా మీరు ఇంత పేరు, అభిమానాన్ని సంపాదించుకున్నారు. ఈ సక్సెస్ సీక్రెట్ ఏంటి? అనే ప్రశ్నను తమన్నా ముందు ఉంచితే – ‘‘పేరు, డబ్బు, సౌకర్యవంతమైన జీవితం కోసం మాత్రమే యాక్టింగ్ ప్రొఫెషన్‌ను ఎంచుకుంటున్నారని చాలామంది ఆలోచిస్తుంటారు. కానీ అది నిజం కాదు. నటన పట్ల తపన లేకపోతే ఇండస్ట్రీలో ఎక్కువకాలం నిలవలేం. నా సక్సెస్‌కి కారణం అదే. యాక్టర్‌గా ప్రూవ్ చేసుకున్న తర్వాత మాత్రమే పేరు, డబ్బు వస్తాయి. అప్పటివరకు అలుపెరుగని పోరాటం చేయాల్సిందే. కష్టపడకుండా ఏదీ వచ్చేయదు’’ అని చెప్పుకొచ్చారు. ఒకవేళ మీరు యాక్టర్ కాకపోయి ఉంటే ఏ రంగాన్ని ఎంచుకునేవారు అని అడగ్గా – ‘‘యాక్టింగ్ లేకుండా నా లైఫ్‌ని ఇప్పుడు ఊహించుకోలేను. అయితే మెడికల్ సెక్టార్లో మా ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారు. సో... మెడిసన్ చదివేదాన్నేమో’’ అని చెప్పారు. -
కేరళలో ఖేల్ ఖతమ్
‘సైరా’ ప్రయాణం పూర్తి కావస్తోంది. షూటింగ్ ఖేల్ ఖతమ్ చేయడానికి కేరళ అడవుల్లో షూటింగ్ చేస్తోంది చిత్రబృందం. చిరంజీవి హీరోగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘సైరా: నరసింహారెడ్డి’. స్వాతంత్య్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితం ఆధారంగా ఈ చిత్రం రూపొందుతోంది. రామ్‌చరణ్ నిర్మిస్తున్నారు. నయనతార, తమన్నా కథానాయికలుగా నటిస్తున్నారు. ఈ సినిమా ఫైనల్ షెడ్యూల్ ప్రస్తుతం కేరళలో జరుగుతోంది. ఈ షెడ్యూల్‌తో సినిమా చిత్రీకరణ దాదాపు పూర్తి కానుందని సమాచారం. అమితాబ్ బచ్చన్, జగపతిబాబు, సుదీప్, విజయ్ సేతుపతి కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి అమిత్ త్రివేది సంగీత దర్శకుడు. అక్టోబర్‌లో ఈ సినిమాను రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. -
రెండింతల థ్రిల్
ఎండలు మండిపోతున్నాయి. ఈ నెలలోనే ఇలా ఉంటే ఇక మే నెల ఎలా ఉంటుంది? ఎండలు రెండింతలు ఉంటాయి. ఎంటర్టైన్మెంట్ కోసం చల్లని థియేటర్‌కి వెళితే బోలెడంత థ్రిల్‌కి గురి చేస్తారట ప్రభుదేవా, తమన్నా. కూల్ కూల్ అంటూ హాయిగా థియేటర్లో కూర్చుని మా థ్రిల్‌ని ఎంజాయ్ చేయండి అంటున్నారు. ప్రభుదేవా, తమన్నా, సోనూ సూద్ ముఖ్య తారలుగా రెండేళ్ల క్రితం వచ్చిన ‘అభినేత్రి’ గుర్తుందా? తమిళంలో ‘అభినేత్రి’గా తెలుగులో, ‘దేవి’గా విడుదలైంది. విజయ్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రానికి సీక్వెల్‌గా ఇప్పుడు ఆయన దర్శకత్వంలోనే ‘అభినేత్రి 2 ’ రూపొందింది. ఫస్ట్ పార్ట్ కన్నా సీక్వెల్లో రెండింతల థ్రిల్ ఉంటుందని చిత్రబృందం పేర్కొంది. ట్రైడెంట్ ఆర్ట్స్, అభిషేక్ పిక్చర్స్ పతాకాలపై అభిషేక్ నామా, ఆర్. రవీంద్రన్ నిర్మించిన ఈ చిత్రంలో ప్రభుదేవా, తమన్నాలతో పాటు నందితా శ్వేత, డింపుల్ హయాతి, కోవై సరళ కీలక పాత్రలు చేశారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. మే 1న సినిమాని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ‘‘హారర్ కామెడీ జోనర్లో రూపొందిన ఈ సీక్వెల్‌పై భారీ అంచనాలు నెలకొన్నాయి. అంచాలను చేరుకునే విధంగా సినిమా ఉంటుంది’’ అన్నారు అభిషేక్ నామా, ఆర్. రవీంద్రన్. ఈ చిత్రానికి సంగీతం: సామ్ సి.ఎస్, సినిమాటోగ్రఫీ: అయాంకా బోస్, డైలాగ్స్: సత్య. -
అదుపు తప్పింది
విశాల్ చేజింగ్ రాంగ్ ట్రాక్‌లో వెళ్లింది. దీంతో ఆయన గాయపడ్డారు. విశాల్ హీరోగా సుందర్. సి దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఇందులో తమన్నా కథానాయికగా నటిస్తున్నారు. ఈ సినిమా చిత్రీకరణ ప్రస్తుతం టర్కీలో జరుగుతోంది. దాదాపు నెల రోజుల పాటు ఈ షెడ్యూల్‌ను ప్లాన్ చేశారు. అయితే ఓ యాక్షన్ సన్నివేశంలో భాగంగా విశాల్ నడుపుతున్న ఏటీవీ బైక్ అదుపు తప్పింది. దీంతో విశాల్ గాయపడ్డారు. వెంటనే చిత్రబృందం ఆయనకు చికిత్స చేయించారు అనుకోని ఈ ప్రమాదం వల్ల అనుకున్న సమయానికన్నా ఈ షెడ్యూల్ కాస్త లేట్ కావొచ్చట. -
టర్కీ పోదాం... చలో చలో
.... అంటూ బ్యాగ్ ప్యాక్చేసుకునే పనిలో ఉన్నారట విశాల్ అండ్ తమన్నా. దాదాపు యాభై రోజులు అక్కడే ఉంటారని కోలీవుడ్ టాక్. సుందర్. సి దర్శకత్వంలో విశాల్, తమన్నా హీరోహీరోయిన్లుగా ఓ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా తొలి షెడ్యూల్‌ను టర్కీలో ప్లాన్ చేశారట చిత్రబృందం. అక్కడ జరిగే మేజర్ షూటింగ్లో రెండు పాటలు, మూడు ఫైట్స్‌తో పాటు కీలక సన్నివేశాలను చిత్రీకరించడానికి సన్నాహాలు చేస్తున్నారని తెలిసింది. అలాగే ఈ సినిమాలో మలయాళ నటి ఐశ్వర్యాలక్ష్మీ మరో కథానాయికగా నటిస్తారు. ఈ చిత్రానికి యువన్ శంకర్ రాజా సంగీతం అందిస్తారు. ఇంతకుముందు ‘కత్తిసండై’ అనే సినిమాలో జంటగా కనిపించారు తమన్నా, విశాల్. ఇప్పుడు ఈ సినిమాలో మళ్లీ జోడీ కట్టారు. అలాగే ఓ కొత్త దర్శకుడు తెరకెక్కించనున్న సినిమాలో కూడా తమన్నా, విశాల్ జంటగా కనిపించనున్నారని తెలిసింది. -
చైనాలో నైరా
‘సైరా’ చిత్రానికి గుమ్మడికాయ కొట్టే సమయం వచ్చేసిందట. సినిమా చిత్రీకరణ తుది దశకు చేరుకుందని సమాచారం. స్వాతంత్య్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితం ఆధారంగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో చిరంజీవి టైటిల్ రోల్ పోషిస్తున్న చిత్రం ‘సైరా : నరసింహారెడ్డి’. రామ్‌చరణ్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో నయనతార కథానాయిక. తమన్నా, అనుష్క కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఈ చిత్రం షూటింగ్ ఫైనల్ స్టేజ్‌లో ఉందని, ఏప్రిల్ మొదటి వారంతో చిన్న చిన్న ప్యాచ్ వర్క్ మినహా షూటింగ్ పూర్తి అయిపోతుందని తెలిసింది. ఈ చిత్రం చైనాలో చిత్రీకరణ జరగుతుందనే వార్తలు ప్రచారంలో ఉన్నాయి. అయితే ఆ వార్తల్లో నిజం లేదట. చైనాలో ‘నైరా’ అంటూ చిత్ర యూనిట్ పేర్కొంది. ఈ సినిమాను దసరాకు రిలీజ్ చేసే ప్లాన్‌లో ఉందని టాక్. అమితాబ్ బచ్చన్, జగపతిబాబు, సుదీప్, విజయ్ సేతుపతి ముఖ్య పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: అమిత్ త్రివేది, కెమెరా: రత్నవేలు. -
కొత్త దారి!
కెరీర్లో తమన్నా కొత్తదారికి షిఫ్ట్ అయినట్లు తెలుస్తోంది. ఇప్పటివరకు గ్లామరస్ పాత్రలవైపే మొగ్గు చూపిన తమన్నా వీలైనప్పుడు స్పెషల్ సాంగ్స్‌లోనూ కాలు కదిపారు. కానీ ఇప్పుడు ట్రాక్ మార్చి లేడీ ఓరియంటెడ్ చిత్రాలపై దృష్టి పెట్టారామె. ఆల్రెడీ తమన్నా నటించిన రెండు కథానాయిక ప్రాధాన్యం ఉన్న చిత్రాలు హిందీ హిట్ ‘క్వీన్’ తెలుగు రీమేక్ ‘దటీజ్ మహాలక్ష్మీ’, తమిళ ‘దేవి 2’ రిలీజ్‌కు రెడీ అయ్యాయి. ఇప్పుడు ఈ మిల్కీబ్యూటీ మరో లేడీ ఓరియంటెడ్ ఫిల్మ్ ‘రాజుగారి గది 3’కి గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారు. ‘దేవి 2, రాజుగారి గది 3’ చిత్రాలు హారర్ బేస్డ్ కావడం విశేషం. తాజాగా తమన్నా మరో హారర్ సినిమాకు సై అన్నారు. ఈ చిత్రానికి రోహిన్ వెంకటేశన్ దర్శకత్వం వహించనున్నారు. ‘‘ఈ ఏడాది నేను తీసుకున్న నిర్ణయాల్లో కొత్తగా ఉండే లేడీ ఓరియంటెడ్ చిత్రాల్లో నటించాలనే నిర్ణయం ఒకటి. ‘రాజుగారి గది 3’ చిత్రంలో నా పాత్ర రెండు కోణాల్లో ఉండటమే కాకుండా స్క్రీన్ ప్లే రెండు కాలసమయాల్లో నడుస్తుంది. ఆసక్తిగా అనిపించి సైన్ చేశాను. స్క్రిప్ట్ నచ్చితే మరిన్ని లేడీ ఓరియంటెడ్ సినిమాల్లో నటించడానికి సిద్ధంగా ఉన్నాను’’ అని చెప్పుకొచ్చారు తమన్నా. ‘రాజుగారి గది 3’ చిత్రానికి ఓంకార్ దర్శకత్వం వహిస్తారు. ఇవి కాకుండా చిరంజీవి ‘సైరా’ సినిమాలో నర్తకి లక్ష్మీ అనే ఓ కీలక పాత్రను తమన్నా చేస్తున్న సంగతి తెలిసిందే. -
ఫొటోషూట్ రెడీ
కొత్త లుక్‌లోకి మారిపోవడానికి రెడీ అవుతున్నారు చిరంజీవి. ఎందుకంటే ఆయన తర్వాతి చిత్రం కోసం. కొరటాల శివ దర్శకత్వంలో చిరంజీవి హీరోగా ఓ సినిమా రూపొందనున్న సంగతి తెలిసిందే. కొణిదెల ప్రొడక్షన్స్, మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్ సంస్థలు ఈ చిత్రాన్ని నిర్మిస్తాయి. ఈ సినిమా పనులు ఊపందుకున్నాయి. ఇటీవల చిరంజీవిపై ఓ ఫొటోషూట్ జరిగిందని సమాచారం. త్వరలో చిత్రీకరణ స్టార్ట్ కానుంది. ఈ చిత్రంలోని పాత్ర కోసం చిరంజీవి బరువు కూడా తగ్గుతారని తెలిసింది. ఇందులో కథానాయికగా తమన్నా, నయనతార, శ్రుతీహాసన్ పేర్లు వినిపించాయి. వీరిలో ఎవరో ఒకరు చిరంజీవికి జోడీగా నటిస్తారా? లేక వేరే హీరోయిన్ ఎవరైనా ట్రాక్‌లోకి వస్తారా? అన్న విషయంపై స్పష్టత రావాల్సి ఉంది. ప్రస్తుతం ‘సైరా: నరసింహారెడ్డి’ సినిమాలో నటిస్తున్నారు చిరంజీవి. స్వాతంత్య్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితం ఆధారంగా రూపొందుతున్న ఈ చిత్రానికి సురేందర్‌రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. రామ్‌చరణ్ నిర్మాత. నయనతార కథానాయికగా నటిస్తున్నారు. అమితాబ్ బచ్చన్, సుదీప్, విజయ్ సేతుపతి తదితర భారీ తారాగణంతో రూపొందుతున్న ఈ సినిమా చిత్రీకరణ తుది దశకు చేరుకుంది. దసరా పండగ సందర్భంగా ఈ చిత్రాన్ని విడుదల చేయాలనుకుంటున్నారు. -
నాతో తప్పుగా ప్రవర్తించలేదు
‘మీటూ’ ఉద్యమం సమయంలో బాలీవుడ్ దర్శకుడు సాజిద్ ఖాన్ పలు ఆరోపణలు ఎదుర్కొన్నారు. తమ పట్ల సాజిద్ అభ్యంతరకరంగా ప్రవర్తించారంటూ పలువురు కథానాయికలు ఆరోపించిన విషయం తెలిసిందే. దాంతో ‘హౌస్‌ఫుల్ 4’ చిత్ర దర్శకత్వ బాధ్యతల నుంచి స్వచ్ఛందంగా తప్పుకున్నారాయన. సాజిద్ ఖాన్ తనతో ఎప్పుడూ తప్పుగా ప్రవర్తించలేదని, అతనితో పని చేయడం కంఫర్ట్‌బుల్‌గానే అనిపించిందని పేర్కొన్నారు తమన్నా. సాజిద్ ఖాన్ దర్శకత్వంలో ‘హిమ్మత్వాలా, హమ్‌షకల్స్’ చిత్రాల్లో హీరోయిన్గా నటించారు తమన్నా. సాజిద్ ఖాన్‌తో వర్కింగ్ ఎక్స్‌పీరియన్స్‌ను తమన్నా పంచుకుంటూ – ‘‘నేనెలాంటి సినిమా చేయబోతున్నా, ఆ సినిమా స్క్రిప్ట్ ఏంటి? అన్నదే నాకు ముఖ్యం. నేను, సాజిద్ ఖాన్ కలసి చేసిన రెండు సినిమాలు అనుకున్న స్థాయిలో ఆడలేదు. తనెప్పుడూ నాతో తప్పుగా ప్రవర్తించలేదు. తనతో పని చేయడం కంఫర్ట్‌బుల్‌గా ఫీల్ అవుతాను’’ అని పేర్కొన్నారామె. ఇటీవల విద్యాబాలన్ ‘మళ్లీ సాజిద్‌తో కలసి సినిమా చేయబోనని పేర్కొన్నారు’ కదా అని అడగ్గా –‘‘అందరి అనుభవాలు ఒకలా ఉండవు. ఎవరి అభిప్రాయాలు వాళ్లవి. ఒకవేళ విద్యకు బ్యాడ్ఎక్స్పీరియన్స్ ఎదురై ఉంటే ఆమె అలా రియాక్ట్ అయ్యుండొచ్చు’’ అని చెప్పారు తమన్నా. -
అడుగుపెడతారా?
‘రాజు గారి గది’ ఫస్ట్, సెకండ్ పార్ట్స్ హిట్స్‌గా నిలవడంతో, ఈ హారర్ సిరీస్‌కు మంచి క్రేజ్ ఏర్పడింది. సెకండ్ పార్ట్‌లో నాగార్జున, సమంత నటించడంతో ‘రాజుగారి గది 2’ పెద్ద సినిమా అయింది. ‘రాజుగారి గది’కి మూడో పార్ట్ తెరకెక్కిస్తా అని దర్శకుడు ఓంకార్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం అదే ప్లాన్‌లో ఉన్నారు. ఈ మూడో భాగంలో హీరోయిన్గా తమన్నాను సంప్రదించారట. ముంబై వెళ్లి తమన్నాకు కథ కూడా వినిపించారట. ఇందులో నటించేందుకు తమన్నా కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని టాక్. మరి భయంకరమైన రాజుగారి గదిలో ఏముందో తెలుసుకోవడానికి ధైర్యంగా తమన్నా అడుగుపెడతారో లేదో చూడాలి. ఇదిలా ఉంటే తమన్నా నటించిన ‘దటీజ్ మహాలక్ష్మి, దేవీ 2’ చిత్రాలు విడుదలకు సిద్ధమవుతున్నాయి. ‘సైరా : నరసింహారెడ్డి’లో కీలక పాత్ర చేస్తున్నారామె. -
అనిల్ సినిమాలు చూస్తే జిమ్‌కు వెళ్లక్కర్లేదు
‘‘డిస్ట్రిబ్యూటర్స్‌కి ఇలా షీల్డ్స్ ఇవ్వడం చూసి చాలా ఏళ్లయ్యింది. ‘దిల్’ రాజు మంచి నిర్మాత, డిస్ట్రిబ్యూటర్. ఇక అనిల్ రావిపూడి సినిమా చూస్తే చాలు జిమ్‌కు కూడా వెళ్లనక్కర్లేదు’’ అని దర్శకులు కె. రాఘవేంద్రరావు అన్నారు. వెంకటేష్, వరుణ్ తేజ్ హీరోలుగా అనిల్ రావిపూడి రూపొందించిన చిత్రం ‘ఎఫ్ 2’. తమన్నా, మెహరీన్ హీరోయిన్లు. ‘దిల్’ రాజు సమర్పణలో శిరీష్–లక్ష్మణ్ నిర్మించిన ‘ఎఫ్ 2’ చిత్రం 50 రోజులను పూర్తి చేసుకున్న సందర్భంగా, రాఘవేంద్రరావు మాట్లాడుతూ – ‘‘నా సినిమాల్లో ‘పెళ్ళిసందడి, గంగోత్రి’ సినిమాలు ఎక్కువ లాభాలను తెచ్చిపెట్టాయి. వెంకటేష్ గత సినిమాల కంటే వంద రెట్లు ఎక్కువగా నవ్వించాడు, వరుణ్ కూడా మంచి నటనను కనపరిచాడు’’ అన్నారు. ‘‘ఈ సినిమా 50 రోజుల వేడుకను జరుపుకోవడానికి ముఖ్య కారణం అనిల్. మా హీరోలిద్దరూ బిజీగా ఉండటం, అనిల్ తన నెక్ట్స్ మూవీకి, అలాగే మేం నెక్ట్స్ ప్రాజెక్ట్‌తో ఆల్రెడీ బిజీగా ఉన్నా... ఈ వేడుక చేయడానికి నిర్ణయించుకున్నాం’’ అన్నారు ‘దిల్’ రాజు. ‘‘ఎక్కడా గ్యాప్ లేకుండా కామెడీతో అనిల్ ఇరగొట్టేశాడు. టాలెంట్‌ను వెతికి పట్టుకుని, ఎంకరేజ్ చేయడం ‘దిల్’ రాజుగారికి వెన్నతో పెట్టిన విద్య. నవ్విస్తే చాలు.. ప్రేక్షకుడు లాజిక్, మేజిక్ల గురించి ఆలోచించడు’’ అన్నారు యస్వీ కృష్ణారెడ్డి. ‘‘ఈ సినిమాకు సంబంధించి ఈ షీల్డుని చూస్తే .. దీనికి సంబంధించిన జ్ఞాపకం మైండ్‌లో రీల్లా తిరుగుతుంది. అందుకనే ఈ ఫంక్షన్ చేశాం. 107 కేంద్రాల్లో 50 రోజులు పూర్తి చేసుకోవడమే కాదు.. 130 కోట్ల రూపాయల రెవెన్యూ జనరేట్ చేసిన సినిమా ఇది. ‘నువ్వునాకు నచ్చావ్’ లాంటి ఫుల్ ఎంటర్టైనింగ్ సినిమాను వెంకటేష్‌గారు చేస్తే ఎలా ఉంటుందో ఈరోజు మనకు మరోసారి తెలిసింది. వరుణ్‌తేజ్ కామెడీజోనర్లో చేసిన తొలి చిత్రమిది. అలాగే తమన్నా, మెహరీన్, రాజేంద్ర ప్రసాద్‌గారు, ఇలా ప్రతి ఆర్టిస్ట్‌కు, సాంకేతిక నిపుణలకు థాంక్స్.రాజుగారు, శిరీష్‌గారు, లక్ష్మణ్‌గారు నాకు కుటుంబతో సమానం’’ అన్నారు అనిల్ రావిపూడి. ‘‘నా 10వ సినిమా బెస్ట్ మూవీగా నిలవడం, సినిమా ఇంత పెద్ద సక్సెస్ కావడం పట్ల çసంతోషంగా ఉన్నాను’’ అన్నారు మెహరీన్. -
మా ఇద్దరి మధ్య ఏమీ లేదు
వినోద ప్రపంచంలో ఎక్కువగా ఆకర్షించేవి సినిమా, క్రీడలు. అది కూడా స్పోర్ట్స్‌లో క్రికెట్‌ది ప్రత్యేక స్థానం. సినిమా, క్రీడలను కలిపేది యాడ్స్. క్రికెటర్స్, మూవీ స్టార్స్ కలసి యాడ్ ఫిల్మ్స్‌లో కనిపించడం చాలాసార్లు చూశాం. 2012లో క్రికెటర్ విరాట్ కోహ్లీ, హీరోయిన్ తమన్నా ఓ యాడ్ ఫిల్మ్ కోసం కలిశారు. ఆ స్మార్ట్‌ఫోన్ యాడ్ చిత్రీకరణ సమయంలోనే ఇద్దరూ దగ్గరయ్యారని, డేటింగ్ చేశారని ఆ మధ్య వార్తలొచ్చాయి. కానీ ఈ ఇద్దరిలో ఎవరూ ఆ వార్తలకు సమాధానం చెప్పలేదు. చాలా కాలం తర్వాత ఆ విషయం మీద ఓ షోలో మాట్లాడారు తమన్నా. ‘‘యాడ్ షూట్ సమయంలో నేను, విరాట్ గట్టిగా నాలుగు మాటలు కూడా మాట్లాడుకోలేదు’ అని పేర్కొన్నారు తమన్నా. ‘‘ఆ యాడ్ తర్వాత మేమిద్దరం మళ్లీ కలవలేదు, మాట్లాడుకోనూ లేదు. కానీ నేను యాక్ట్ చేసిన చాలామంది యాక్టర్స్ కంటే కూడా విరాట్ చాలా బెటర్ యాక్టర్’’ అని ప్రశంసించారు. ప్రస్తుతానికి ఎవరితో రిలేషన్షిప్లో లేనన్నారామె. హృతిక్ ఒక్కరే మినహాయింపు ఇదే షోలో మరికొన్ని విశేషాలు చెబుతూ – ‘‘సాధారణంగా సినిమాల్లో లిప్‌కిస్ సన్నివేశాలను చేయను నేను. ఏదైనా సినిమాకు సంతకం చేసేటప్పుడు నా కాంట్రాక్ట్‌లో ఆ నియమం కచ్చితంగా ఉంటుంది. కానీ హృతిక్‌తో కలసి నటిస్తే మాత్రం ఆ రూల్‌ని బ్రేక్ చేస్తానని సరదాగా ఫ్రెండ్స్‌తో జోక్ చేస్తుంటాను’’ అని పేర్కొన్నారామె. -
‘సైరా’లో అనుష్క స్పెషల్ అపియరెన్స్
2006లో చిరంజీవి ‘స్టాలిన్’ సినిమాలో స్పెషల్ సాంగ్ చేశారు అనుష్క. మళ్లీ పదమూడేళ్ల తర్వాత అలాంటి స్పెషల్ అపియరెన్సే ‘సైరా’ సినిమాలో ఇవ్వబోతున్నారట. అయితే అప్పుడు పాటకు మాత్రమే పరిమితమైతే ఇప్పుడు సీన్స్‌లో కూడా కనిపిస్తారట. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో చిరంజీవి టైటిల్ రోల్ చేస్తున్న చిత్రం ‘సైరా : నరసింహారెడ్డి’. స్వాతంత్య్ర సమరయోధుడు నరసింహారెడ్డి జీవితం ఆధారంగా రూపొందుతోంది. రామ్‌చరణ్ నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో నయనతార, తమన్నా హీరోయిన్లు. అమితాబ్ బచ్చన్, జగపతిబాబు, కిచ్చా సుదీప్, విజయ్‌సేతుపతి ముఖ్యపాత్రల్లో కనిపించనున్నారు. లేటెస్ట్గా ఈ సినిమాలోకి అనుష్క కూడా జాయిన్ అవ్వనున్నారట. ఓ స్పెషల్ రోల్లో కొన్ని నిమిషాల పాటు ఈ సినిమాలో కనిపించనున్నారట అనుష్క. ప్రస్తుతం పాండిచ్చేరీ దగ్గర షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం దసరాకు రిలీజ్ కానుంది. ఈ చిత్రానికి సంగీతం: అమిత్ త్రివేది, కెమెరా: రత్నవేలు. -
స్పైతో సై
గోపీచంద్ గూఢచారిగా మారి భారతదేశం బోర్డర్లో సాహసాలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ గూఢచారికి జోడీ ఫిక్స్ అయ్యారని సమాచారం. తిరు దర్శకత్వంలో గోపీచంద్ హీరోగా స్పై థ్రిల్లర్ జానర్లో ఓ చిత్రం రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం ఇండియా, పాకిస్థాన్ బోర్డర్లో జరుగుతోంది. ఇందులో గోపీచంద్ సరసన హీరోయిన్గా తమన్నా పేరుని పరిశీలిస్తున్నారట చిత్రబృందం. గోపీచంద్‌తో తమన్నా హీరోయిన్గా యాక్ట్ చేయడం ఇదే ఫస్ట్ టైమ్. ఆల్రెడీ ఈ సినిమాలో మరో కథనాయికగా బాలీవుడ్ భామ జరైన్ ఖాన్‌ను ఎంపిక చేశారు. సమ్మర్ స్పెషల్‌గా రిలీజ్ కానున్న ఈ చిత్రాన్ని ఏకే ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌పై అనిల్ సుంకర నిర్మిస్తున్నారు. -
యాభై.. వందరోజుల వేడుకలు పోయాయి
‘‘ఇప్పటికే మా ‘ఎఫ్ 2’ సినిమా 100 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేయడం సంతోషం. ఇంకెంత వసూలు చేస్తుందో మాకు తెలీదు. ఇది చాలా గొప్ప విషయం. ఈరోజు నుంచి మరికొన్ని సీన్స్ యాడ్ చేస్తున్నాం. ప్రేక్షకులు కేరింతలు కొట్టే విధంగా ఈ కొత్త సీన్స్ ఉంటాయి’’ అని నిర్మాత ‘దిల్’ రాజు అన్నారు. వెంకటేశ్, వరుణ్ తేజ్ హీరోలుగా, తమన్నా, మెహరీన్ హీరోయిన్లుగా అనిల్ రావిపూడి తెరకెక్కించిన చిత్రం ‘ఎఫ్ 2’. ‘దిల్’ రాజు సమర్పణలో శిరీష్, లక్ష్మణ్ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 12న విడుదలై 100కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసింది. ఈ సందర్భంగా ప్రేక్షకులకు థ్యాంక్స్ చెప్పడానికి ఏర్పాటు చేసిన ప్రెస్మీట్లో ‘దిల్’ రాజు మాట్లాడుతూ– ‘‘గతంలో 50 రోజులు, 100 రోజుల వేడుకలుండేవి. ఇప్పుడు అవన్నీ పోయి 50 కోట్లు, వందకోట్ల గ్రాస్, షేర్స్ వచ్చాయి. డిస్ట్రిబ్యూటర్స్, ఎగ్జిబిటర్స్ అందరికీ మా ‘ఎఫ్2’ చిత్రం వంద కోట్ల గ్రాస్ షీల్డ్స్‌ని పంపిస్తున్నాం. ఇది మా సినిమాతో స్టార్ట్ చేయడం హ్యాపీగా ఉంది’’ అన్నారు. ‘‘వందకోట్ల సినిమా చెయ్యాలన్నది ప్రతి డైరెక్టర్ కల. అది ‘ఎఫ్2’ తో నాకు దక్కినందుకు హ్యాపీ. ప్రేక్షకులు మరింత ఎంజాయ్ చేయడానికి 5 కొత్త సీన్స్‌ని యాడ్ చేస్తున్నాం. ఈ చిత్ర విజయంలో చాలామంది కష్టం ఉంది’’ అన్నారు అనిల్ రావిపూడి. ‘‘దిల్’ రాజుగారు రిలీజ్ చేసిన ‘హ్యాపీడేస్’ సినిమా నాకు టర్నింగ్ పాయింట్. ఇప్పుడు ‘ఎఫ్ 2’ బిగ్గెస్ట్ హిట్ అవడం హ్యాపీగా ఉంది. ఈ సినిమాని బ్లాక్ బస్టర్ చేసిన ప్రేక్షకులకు థ్యాంక్స్’’ అన్నారు తమన్నా. -
సైరా.. జాతర!
హైదారాబాద్ పరిసర ప్రాంతాల్లో భారీ సెట్ వేసి వారం రోజులుగా రిహార్సల్స్ చేస్తున్నారు ‘సైరా: నరసింహారెడ్డి’ టీమ్. ప్రస్తుతానికైతే యాక్షన్ సన్నివేశాల కోసం కాదు. ఓ సాంగ్ కోసం. స్వాతంత్య్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితం ఆధారంగా రూపొందుతున్న సినిమా ‘సైరా: నరసింహారెడ్డి’. చిరంజీవి టైటిల్ రోల్ చేస్తున్నారు. సురేందర్‌రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. రేపటి నుంచి చిత్రీకరించబోయే ఈ సాంగ్‌లో చిరంజీవి, తమన్నా, జగపతిబాబు, సుదీప్ పాల్గొంటారని సమాచారం. జాతర నేపథ్యంలో సాగే ఈ సాంగ్‌ను దాదాపు వారం రోజుల పాటు చిత్రీకరిస్తారని తెలిసింది. అంతేకాదు.. వెయ్యిమంది డ్యాన్సర్లు ఈ పాటలో పాల్గొంటారట. నయనతార కథానాయికగా నటిస్తోన్న ఈ సినిమాలో అమితాబ్ బచ్చన్, విజయ్ సేతుపతి, బ్రహ్మాజీ కీలక పాత్రలు చేస్తున్నారు. రామ్‌చరణ్ నిర్మిస్తున్న ఈ సినిమా ఈ ఏడాది ఆగస్టులో రిలీజ్ కానుందని తెలుస్తోంది. -
మహాలక్ష్మి ముస్తాబు
ఓ సాధారణ యువతి అసాధారణ మహిళగా ఎలా మారిందనే కథాంశంతో తెరకెక్కిన చిత్రం ‘దట్ ఈజ్ మహాలక్ష్మి’. తమన్నా ప్రధాన పాత్రలో నటించారు. టైజాన్ ఖొరాకివాలా సమర్పణలో మెడైంటే ఇంటర్నేషనల్ పతాకంపై మను కుమరన్ నిర్మించిన ఈ చిత్రం షూటింగ్ పూర్తయింది. ఈ సందర్భంగా మను కుమరన్ మాట్లాడుతూ– ‘‘హిందీలో ఘన విజయం సాధించిన ‘క్వీన్’ చిత్రానికి రీమేక్‌గా తెరకెక్కిన చిత్రం ‘దటీజ్ మహాలక్ష్మి’. ఇటీవల విడుదలైన టీజర్‌కు అద్భుతమైన స్పందన వచ్చింది. ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటోంది. ఇప్పటికే ప్రమోషన్ పనులు మొదలు పెట్టాం. త్వరలోనే విడుదల తేదీని ప్రకటించనున్నాం. అమిత్ త్రివేది చక్కని సంగీతం అందించారు. మైఖెల్ ట్యాబ్యురియస్ సినిమాటోగ్రఫీ అద్భుతంగా ఉంటుంది’’ అన్నారు. సిద్ధు జొన్నలగడ్డ ముఖ్య పాత్రలో నటించారు. ఈ చిత్రానికి సహ నిర్మాతలు: పరుల్ యాదవ్, పంకజ్ కపూర్, కె. వెంకట్రామన్, మనోజ్ కేశవన్ లైగర్, త్యాగరాజన్, అసోసియేట్ ప్రొడ్యూసర్స్: జి. మోహన్ చంద్రన్, హేటల్ యాదవ్, యోగేష్ ఈశ్వర్ ధబువాలా. -
అందరూ నవ్వుతుంటే కన్నీళ్లొచ్చాయ్
‘‘ఈ సంక్రాంతికి ‘ఎఫ్ 2’ని హిట్ కాదు.. సూపర్ హిట్ కాదు.. సూపర్ డూపర్ హిట్ చేశారు. నిజంగా అభిమానుల కళ్లలో ఆ ఆనందం చూసి మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెబుతున్నా’’ అని వెంకటేశ్ అన్నారు. అనిల్ రావిపూడి దర్శకత్వంలో వెంకటేశ్, వరుణ్‌తేజ్ హీరోలుగా తమన్నా, మెహరీన్ హీరోయిన్లుగా తెరకెక్కిన చిత్రం ‘ఎఫ్ 2’. ‘ఫన్ అండ్ ఫ్రస్ట్రేషన్’ అన్నది ఉపశీర్షిక. ‘దిల్’ రాజు సమర్పణలో శిరీశ్, లక్ష్మణ్ నిర్మించిన ఈ సినిమా ఈనెల 12న విడుదలైంది. శుక్రవారం హైదరాబాద్‌లో నిర్వహించిన గ్రాండ్ సక్సెస్ మీట్లో వెంకటేశ్ మాట్లాడుతూ– ‘‘పదేళ్ల తర్వాత థియేటర్‌కి వెళ్లి ప్రేక్షకుల రియాక్షన్ చూసినప్పుడు అక్కడ అందరూ నవ్వుతున్నారు.. కానీ, నాకు మాత్రం కన్నీళ్లు వచ్చాయ్. చాలా రోజుల తర్వాత థియేటర్లో అంత రియాక్షన్ చూసినప్పుడు.. మేమంతా కష్టపడి పనిచేసి ఆ సినిమా మీకు చూపెట్టినప్పుడు మీరు అంత బాగా ఆదరించి ప్రేమ చూపెట్టడం నిజంగా వండ్రఫుల్ ఫీలింగ్. ఇందుకు మనస్ఫూర్తిగా ప్రేక్షకులు, ఫ్యాన్స్‌కి థ్యాక్స్ చెబుతున్నా. నావి ఎన్నో సినిమాలు సంక్రాంతికి విడుదలయ్యాయి. ‘గణేశ్, ప్రేమించుకుందాం రా... నా బిగినింగ్ సినిమా ‘బొబ్బిలి రాజా నుంచి మొన్న ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, చంటి, ఇంట్లో ఇల్లాలు వంటిట్లో ప్రియురాలు సినిమాలు కానీ, నవ్వు నాకు నచ్చావ్, మల్లీశ్వరి... ఇలా ఎన్నో సినిమాలను సూపర్ హిట్ చేశారు. అనిల్ ఈ కథ చెప్పి నన్ను ఒప్పించడం.. చాలా రోజుల తర్వాత మళ్లీ ఇలాంటి ఎంటర్టైన్మెంట్ సినిమా చేయడం.. ప్రేక్షకులు ఇంత పెద్ద సక్సెస్ చేయడం చాలా ఆనందంగా ఉంది. ఇలాంటి వండ్రఫుల్ సినిమా ఇచ్చినందుకు ‘దిల్’ రాజు, శిరీష్, లక్ష్మణ్‌లకు థ్యాంక్స్. అనిల్ చాలా మంచి ఎనర్జీ ఇచ్చాడు. వరుణ్ టెరిఫిక్ పెర్ఫార్మెన్స్ ఇచ్చాడు. ఈ సినిమాని కుటుంబంతో కలిసి మళ్లీ మళ్లీ చూసి ఎంజాయ్ చేయండి’’ అన్నారు. ‘దిల్’ రాజు మాట్లాడుతూ– ‘‘ మా సినిమా టైటిల్‌ని అనిల్ ‘ఎఫ్ 2’ అని అనౌన్స్ చేశాడు. దాని తర్వాత ‘వీ 2’ అని వెంకటేశ్‌గారు, వరుణ్‌గారు జాయిన్ అయ్యారు. సినిమా రిలీజ్ రోజు ‘ఈ 2’ అని(ఎంటర్టైన్మెంట్ ఎంటర్టైన్మెంట్) కొందరు మెసేజ్‌లు పంపించారు. ఫైనల్‌గా ‘బీ 2’ అని (బొమ్మ బ్లాక్‌బస్టర్) బిరుదు ఇచ్చేశారు. మా బ్యానర్లో ఇది 31వ సినిమా. ఈ సంక్రాంతికి అద్భుతమైన సినిమా అయినందుకు టీమ్ అంతా చాలా ఎంజాయ్ చేస్తున్నాం.ఈ సక్సెస్ అనిల్ ఒక్కడిదే కాదు.. టెక్నీషియన్స్ అందరిదీ. మీరందరూ ఉన్నారు కాబట్టే ఇంతపెద్ద సక్సెస్ వచ్చింది. ఈ సినిమా హిట్ అవుతుందనుకున్నా.. కానీ ఇంత పెద్ద హిట్ అవుతుందని నేను కూడా ఊహించలేదు. ఈ క్రెడిట్ మా టీమ్‌తో పాటు ప్రేక్షకులదే. మిమ్మల్ని కొంచెం నవ్విస్తే చాలు ఆ సినిమాకి బ్రహ్మరథం పడతారని అర్థం అయింది. వెంకటేశ్‌గారు ‘సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టు’ తో 50కోట్ల క్లబ్లో ఉన్నారు. వరుణ్ ‘ఫిదా’ సినిమాతో 50కోట్ల క్లబ్లో చేరారు. ఇద్దరూ ‘ఎఫ్ 2’ తో 50కోట్ల క్లబ్ దాటేశారు. మా బ్యానర్‌కి హయ్యస్ట్ ప్రాఫిట్ తెచ్చిన సినిమా ఇదే.. చాలా హ్యాపీ’’ అన్నారు. వరుణ్ తేజ్ మాట్లాడుతూ– ‘‘ఎఫ్ 2’ సినిమాని ఇంత పెద్ద సక్సెస్ చేసిన ప్రేక్షకులకు బిగ్ థ్యాంక్స్. ఓ సినిమా చేయాలంటే 100 నుంచి 200 మంది ఎఫర్ట్ ఉంటుంది. మా ‘ఎఫ్ 2’ సినిమాకి ఇంకా ఎక్కువ మంది పనిచేశారు. ఈ సినిమాకి అందరూ చాలా పాజిటివ్ మైండ్‌సెట్‌తో పనిచేశారు.. అందరికీ థ్యాంక్స్. నేను నిజంగా కామెడీ అంటే ఇద్దర్నే చూశా. ఒక్కరు చిరంజీవిగారు, రెండోది వెంకటేశ్‌గారు. వాళ్లను చూసి ఇలా మనం చేయగలుగుతామా? అనిపించేది. వెంకీగారి పక్కన ఎలా చేస్తాం అనే భయం, సిగ్గు ఉండేది. ఆయన ఓ బ్రదర్‌లా నా పక్కన ఉంటూ సపోర్ట్ చేశారు. వెంకీగారు నిజంగా నా కో బ్రదర్, బెస్ట్‌ఫ్రెండ్. మీతో పనిచేయడం మరచిపోలేను. వెంకీగార్ని, అనిల్గార్ని, ఈ టీమ్‌ని మిస్ అవుతున్నందుకు ఎక్కడో ఫీలింగ్ ఉండేది. కానీ, త్వరలోనే ‘ఎఫ్ 3’ సినిమా చేయబోతున్నాం. మీ అభిమాన హీరో ఎవరైనా కావొచ్చు. కానీ, వాళ్లందరికీ నచ్చే కామన్ వ్యక్తి వెంకటేశ్‌గారు’’ అన్నారు. అనిల్ రావిపూడి మాట్లాడుతూ– ‘‘ఈ సంక్రాంతికి ఇంత మంచి సినిమా తీసే అవకాశం ఇచ్చిన మా నిర్మాతలకి థ్యాంక్స్. ప్రతి సినిమా నాకు ఓ ఎత్తు అయితే ఈ సినిమా మరో ఎత్తు. నటీనటులందరూ లైఫ్పెట్టి పనిచేశారు. అందరికీ థ్యాంక్స్. తమన్నా, మెహరీన్ చాలా బాగా నటించారు. దేవిశ్రీగారు మంచి మ్యూజిక్ ఇచ్చారు. వెంకీ సార్‌తో కలిసి వరుణ్ చాలా కష్టపడి చేశాడు. మళ్లీ మళ్లీ వరుణ్‌తో పనిచేయాలనుకుంటున్నా. వెంకటేశ్‌గారి దెబ్బకి బాక్సాఫీస్ అబ్బ. ఈ చిత్రంలో వెంకీగారు లుంగీ కట్టుకుని డ్యాన్స్ చేస్తుంటే ‘ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు’ గుర్తొచ్చింది. ఆయనొక లైబ్రరీ. మనం ఏరుకోవడమే. ఆయన ఈ సినిమా కోసం ఎంతో కష్టపడ్డారు. ఈ నవ్వుల్ని మీకు ఇచ్చినందుకు మీరు నవ్వుతూ కలెక్షన్లు ఇచ్చారు. నా లైఫ్‌లో ఇది నవ్వుల సంక్రాంతి.. ఇంత పెద్ద సక్సెస్ ఇచ్చినందుకు ప్రేక్షకులకు ఎప్పుడూ రుణపడి ఉంటాం. మా టీమ్‌ని ఎంతో ఎంకరేజ్ చేసిన మహేశ్‌బాబుగారికి థ్యాంక్స్. ‘ఎఫ్ 3’ సినిమా కచ్చితంగా ఉంటుంది’’ అన్నారు. నిర్మాతలు శిరీష్, లక్ష్మణ్, కథానాయిక మెహరీన్, సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్, నటీమణులు అన్నపూర్ణ, రజిత, ప్రగతి, అనసూయ, పాటల రచయితలు శ్రీమణి, కాసర్ల శ్యాం తదితరులు పాల్గొన్నారు. -
సేనాధిపతి రాజాపాండీ
ప్రస్తుతం తమిళంలో మంచి ఫామ్‌లో ఉన్న హీరో విజయ్ సేతుపతి. రీసెంట్గా రజనీకాంత్ ‘పేట్టా’లో కూడా కనిపించారు. ఇప్పుడీ హీరో చిరంజీవి నటిస్తున్న ‘సైరా: నరసింహారెడ్డి’ చిత్రం ద్వారా తెలుగు పరిశ్రమకు పరిచయం అవుతున్నారు. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితం ఆధారంగా తెరకెక్కుతున్న చిత్రం ‘సైరా’. సురేందర్‌రెడ్డి దర్శకుడు. రామ్‌చరణ్ నిర్మిస్తున్నారు. నయనతార, తమన్నా కథానాయికలు. అమితాబ్ బచ్చన్, జగపతిబాబు, కిచ్చా సుదీప్, విజయ్ సేతుపతి ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. నిన్న విజయ్ సేతుపతి పుట్టిన రోజు. ఈ సందర్భంగా ‘సైరా’ సినిమాలో ఆయన పోషిస్తున్న ‘రాజా పాండీ’ లుక్‌ని రిలీజ్ చేసింది చిత్రబృందం. ఈ చిత్రంలో తమిళ సైన్యానికి సేనాధిపతిగా ఆయన పాత్ర ఉంటుందని సమాచారం. -
ఫెయిల్యూర్ రాకూడదని పని చేస్తాను
‘‘ఎవరైనా సక్సెస్ కోసం పని చేస్తారు. నేను ఫెయిల్యూర్ రాకూడదని పని చేస్తాను. ఫెయిల్యూర్ భయం నాకు ప్రతి క్షణం ఉంటుంది. డైరెక్టర్‌గా నేను సక్సెస్ అయ్యాను. రైటర్‌గా ఉన్నప్పుడు నేను చాలా ఫెయిల్యూర్స్ చూశా. మనం చేసిన పనికి ప్రశంస రాకపోతే ఉండే బాధను అనుభవించాను. ఇప్పుడు ఆ బాధ లేకుండా సక్సెస్‌ను ఎంజాయ్ చేస్తున్నా’’ అని అనిల్ రావిపూడి అన్నారు. వెంకటేశ్, వరుణ్ తేజ్ హీరోలుగా తమన్నా, మెహరీన్ హీరోయిన్లుగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందిన మల్టీస్టారర్ మూవీ ‘ఎఫ్ 2’. ‘ఫన్ అండ్ ఫ్రస్ట్రేషన్’ అనేది ఉపశీర్షిక. ‘దిల్’ రాజు నిర్మించిన ఈ సినిమా ఈ నెల 12న విడుదలైంది. ఈ సందర్భంగా అనిల్ రావిపూడి చెప్పిన విశేషాలు... ► ఈ సినిమాకు ముందు మూడు యాక్షన్ సినిమాలు (పటాస్, సుప్రీమ్, రాజా ది గ్రేట్) చేశాను. యాక్షన్ సన్నివేశాలు లేకుండా ఓ ఫుల్ లెంగ్త్ ఎంటర్టైన్మెంట్ సినిమా చేద్దామనుకున్నాను. ‘క్షేమంగా వెళ్లి లాభంగా రండి, పెళ్లాం ఊరెళితె’ తరహాలో ఉండే సినిమా చేద్దామని ‘ఎఫ్ 2’ చేశాను. ‘రాజా ది గ్రేట్’ సినిమా చిత్రీకరణ చివరి దశలో ‘ఎఫ్ 2’ ఆలోచన వచ్చింది. ► జంధ్యాలగారు గొప్ప రైటర్. గొప్ప దర్శకులు. బోర్ కొడితే ఆయన సినిమాలు చూస్తాను. ఆయన్ను ఫాలో అవుతాను కానీ ఆయన్ని కాపీ కొట్టను. అలాగే ఈవీవీగారు, కృష్ణారెడ్డిగారి సినిమాలు కూడా బాగా ఇష్టం. వీరిని ఇన్‌ప్లూయెన్స్ అవుతున్నానన్న మాట మాత్రం వాస్తవం. కానీ నా స్టైల్ ఆఫ్ నరేషన్ ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటాను. ► నాది తక్కువ.. నీది ఎక్కువ, ఒకరికి ఎక్కువ డైలాగ్స్ ఉన్నాయి. ఒకరికి తక్కువ ఉన్నాయి అన్న తలనొప్పి నాకు లేదు ఈ సినిమా సెట్లో. అందరూ నమ్మి ఈ సినిమా చేశారు. మంచి ఫలితం వచ్చింది. వెంకటేశ్‌గారు కొన్ని ఐడియాస్ ఇచ్చారు. సినిమాలో వెంకీ ఆసనం, డాగ్ ఎపిసోడ్‌కి ఆడియన్స్ బాగా కనెక్ట్ అయ్యారు. వెంకీగారు గ్రేట్ యాక్టర్. రిజల్ట్ పట్ల ఆయన ఫుల్‌హ్యాపీ. వరుణ్ ఇప్పటివరకు కామెడీ జానర్ చేయలేదు. వెంకీగారితో వరుణ్ కామెడీ టైమింగ్ ఎలా ఉంటుందా? అనుకున్నాం. బాగా చేశారు. తెలంగాణ డైలాగ్స్ బాగా పలికారు. సినిమాలో ప్రకాష్‌రాజ్‌గారికి ‘గుండమ్మ కథ’ అంటే ఎంత పిచ్చో నాకు అంత పిచ్చి. అదే సినిమాలో పెట్టాను. ఈ సినిమాలో ముందుగా ‘అంతేగా.. అంతేగా..’ డైలాగ్స్ అనుకోలేదు. ► నీ సినిమాల్లో గ్లామర్ ఉండదేంటి? అన్నారు కొందరు. అలాంటి ఆడియన్స్ కూడా ఉన్నారని రియలైజ్ అయ్యి ఈ సినిమాలో కొంచెం గ్లామర్ సీన్స్ పెంచాను. కానీ బోర్డర్ దాటి చేయలేదు. నా పెళ్లి తర్వాతే రాసుకున్నాను ఈ సినిమా స్క్రిప్ట్‌ని (నవ్వుతూ). నా వైఫ్ చూసి చాలా స్పోర్టివ్‌గా తీసుకుంది. ► నేను న్యూస్, కరెంట్ అఫైర్స్ బాగా ఫాలో అవుతాను. సినిమానే నాకు లైబ్రరీ. సినిమానే నాకు పుస్తకం. అందుకే నేను చేసే సినిమాల్లో కరెంట్ అఫైర్స్ ట్రెండ్ కనిపిస్తుంది. బాల్యంలో ఎంత బాగా చదివేవాడినో అంతే బాగా సినిమాలు చూసేవాడిని. నా గురించి ఇప్పుడు అరుణ్ ప్రసాద్‌గారు గర్వంగా ఫీల్ అవుతున్నారు. ఆయన తీసిన ‘గౌతమ్ ఎస్ఎస్సి’ సినిమాకు నేను వర్క్ చేశాను. ఆయనంటూ లేకపోతే నేనూ ఇండస్ట్రీలో లేను. కాస్త టైమ్ తీసుకుని తర్వాత సినిమా స్టార్ట్ చేస్తా. బాలకృష్ణ, వెంకటేశ్ గార్లకు ఐడియాలు చెప్పాను. బయోపిక్స్ పట్ల ఆసక్తి ఉంది. ప్రస్తుతం బాలీవుడ్‌కు వెళ్లే ఆలోచన లేదు. ► ‘ఎఫ్ 3’ చేయాలనే కోరిక ఉంది. ‘ఎఫ్ 2’ కి ఆడియన్స్ సక్సెస్ ఇచ్చారు కాబట్టి నా కోరికకు బలం కూడా వచ్చింది. వెంకీగారు, వరుణ్ కూడా ఎగై్జట్‌గా ఉన్నారు. వెంకీగారు, వరుణ్‌కి తోడుగా ఇంకో హీరో వస్తారా? లేక అసలు ఎలా ఉండబోతుందన్న వివరాలు భవిష్యత్‌లో తెలుస్తాయి. -
నేను పెద్ద హీరోని అనుకోను
‘‘సాధారణంగా పండగలకు వచ్చే ఫ్యామిలీ ఎంటర్‌టైనర్స్‌ను ప్రేక్షకులు ఆదరిస్తారు. ఈ సంక్రాంతికి ‘ఎఫ్ 2’ సినిమా రావడం చాలా ఆనందంగా ఉంది. నేను, వరుణ్ సంక్రాంతి అల్లుళ్లుగా వస్తున్నాం’’ అని వెంకటేశ్ అన్నారు. అనిల్ రావిపూడి దర్శకత్వంలో వెంకటేశ్, వరుణ్‌తేజ్ హీరోలుగా తమన్నా, మెహరీన్ హీరోయిన్లుగా ‘దిల్’ రాజు నిర్మించిన చిత్రం ‘ఎఫ్ 2’. ‘ఫన్ అండ్ ఫ్రస్ట్రేషన్’ అన్నది ఉపశీర్షిక. ఈ సినిమా ఈ రోజు విడుదలవుతోంది. హైదరాబాద్‌లో జరిగిన ప్రీ రిలీజ్ ఫంక్షన్లో వెంకటేశ్ మాట్లాడుతూ– ‘‘నేను పెద్ద హీరోని అని ఎప్పుడూ అనుకోను. కథ, దర్శకుడు అనిల్‌ని నమ్మి ఈ సినిమా చేశా. ‘దిల్’ రాజుగారితో మంచి అనుబంధం ఉంది’’ అన్నారు. ‘దిల్’ రాజు మాట్లాడుతూ– ‘‘కలియుగ పాండవులు’ చిత్రంతో వెంకటేశ్‌గారి అభిమానిని అయ్యా. ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ తర్వాత ఆయనతో రెండోసారి పనిచేసే అవకాశం దక్కింది. పూర్తి స్క్రిప్టు లేకుండా సినిమా తీయడానికి నేను ఒప్పుకోను. అలాంటి నన్ను కేవలం సన్నివేశాలు చెప్పి ఒప్పించేస్తాడు అనిల్’’ అన్నారు. వరుణ్‌తేజ్ మాట్లాడుతూ– ‘‘ఫస్ట్ టైమ్ ఓ మాస్ క్యారెక్టర్ చేశాను. అది కూడా కామెడీ క్యారెక్టర్. ‘ఎఫ్ 2’తో అనిల్‌లాంటి మంచి ఫ్రెండ్ దొరికినందుకు ఆనందంగా ఉంది. ‘దిల్’ రాజు, శిరీష్, లక్ష్మణ్‌గారితో ‘ఫిదా’ తర్వాత మరోసారి పనిచేయడం హ్యాపీ. మా పెదనాన్నగారి (చిరంజీవి) కాన్టెంపరరీ హీరో వెంకటేశ్‌గారితో సినిమా చేయాలంటే ఎక్కడో చిన్న భయం ఉండేది. కానీ ఆయన మాతో ఫ్రెండ్‌లా, మెంటర్‌లా ఉన్నారు. నెక్ట్స్ టైమ్ ఆయనతో స్టోరీ కూడా అడగకుండానే సినిమా చేయడానికి రెడీ’’ అన్నారు. ‘‘ఎఫ్ 2’ సినిమా ప్రేక్షకుల్ని నవ్వుల్లో ముంచెత్తుతుంది. టైమింగ్ ఉన్న గొప్ప నటులు ఈ సినిమాలో పనిచేశారు’’ అన్నారు అనిల్ రావిపూడి. నటులు రాజేంద్రప్రసాద్, కథానాయికలు తమన్నా, మెహరీన్, నిర్మాత శిరీష్ తదితరులు పాల్గొన్నారు. -
సడన్‌గా సంక్రాంతికి రిలీజ్ అంటే ఎలా?
‘‘నిన్న ఒక సినిమా ప్రీ–రిలీజ్ ఈవెంట్లో వాళ్లు తొందరపడి స్టేట్మెంట్ ఇచ్చారేమో నాకు తెలియదు. పండక్కి›వస్తున్న 3 సినిమాలు 6 నెలల క్రితం అనౌన్స్ అయ్యాయి. 3 పెద్ద సినిమాలకు థియేటర్స్ ఎలా సెట్ చేసుకోవాలని స్ట్రగుల్ అవుతున్నాం. అలాంటిది 20 రోజుల ముందు సినిమాను కొనుక్కొచ్చి సంక్రాంతికి రిలీజ్ అంటే ఎలా? 3 తెలుగు సినిమాలున్నప్పుడు పక్క రాష్ట్రం నుంచి వచ్చే సినిమాకు థియేటర్స్ ఎలా అడ్జస్ట్ అవుతాయి?’’ అని ‘దిల్’ రాజు అన్నారు. వెంకటేశ్, వరుణ్ తేజ్ హీరోలుగా అనిల్ రావిపూడి తెరకెక్కించిన మల్టీస్టారర్ మూవీ ‘ఎఫ్ 2’. (ఫన్ అండ్ ఫ్రస్ట్రేషన్). తమన్నా, మెహరీన్ కథానాయికలు. ‘దిల్’ రాజు నిర్మాత. ఈ చిత్రం ఈ నెల 12న రిలీజ్ కానున్న సందర్భంగా ట్రైలర్ రిలీజ్ చేసి, ‘దిల్’ రాజు మాట్లాడుతూ – ‘‘రాజా ది గ్రేట్’ తర్వాత అనిల్ ఈ ఐడియా చెప్పాడుæ. బాగా నచ్చింది. జర్నీ అంతా ఫన్‌గా సాగిపోయింది. మొన్న ఇద్దరం మాట్లాడుకుంటూ ‘ఏంటి అనిల్.. 3 సినిమాలు చేసేశాం. చిన్న క్లాష్ కూడా రాలేదు’ అని నవ్వుకున్నాం. తను అనుకున్నట్టు సినిమా చేశాడు. పండక్కి మా సినిమా ఫన్ ఇస్తుందని నమ్ముతున్నాం. అలాగే థియేటర్స్ ఇష్యూలో రెండో పాయింట్.. ఆ నిర్మాతే గత నాలుగు నెలల్లో ‘నవాబ్, సర్కార్’ సినిమాలు రిలీజ్ చేశారు. ‘సర్కార్’కు ఎన్ని థియేటర్స్ కావాలో అన్ని థియేటర్స్‌లో వేసుకున్నారు. ఇప్పుడు దొరకడం లేదంటే? తెలుగు సినిమాలను తగ్గించుకుని రిలీజ్ చేయలేం కదా. ఈ సీజన్లో మన తెలుగు సినిమా కాకుండా వేరే భాష చిత్రాలకు థియేటర్స్ ఇచ్చే పరిస్థితి లేదు. 18న రిలీజ్ చేయొచ్చుగా? అలా చేస్తే రెండు రాష్ట్రాల్లో థియేటర్స్ దొరుకుతాయిగా. ఇలాంటివి ఆలోచించకుండా కాంట్రవర్సీ స్టేట్మెంట్స్ ఇచ్చి, నోరు జారారు. అలా మేమూ మాట్లాడగలం. కానీ ఇక్కడ మనం చేస్తున్నది వ్యాపారం. డబ్బు సంపాదించడానికే. డిస్ట్రిబ్యూషన్లో ఎన్నో డబ్బులు పోయాయి. అయినా సినిమా మీద ఉన్న ప్యాషన్‌తో సినిమాలు చేస్తున్నాం. ఎవరి మీదా స్టేట్మెంట్లు ఇవ్వాలన్నది నా ఉద్దేశం కాదు. 6 నెలల క్రితం అనౌన్స్ అయిన సినిమాలకు థియేటర్స్ ఉండాలా వద్దా? మూడూ క్రేజీ సినిమాలకు థియేటర్స్ అడ్జస్ట్ చేసుకుంటున్నాం. అది తెలియకుండా స్టేట్మెంట్స్ ఇస్తున్నారు’’ అన్నారు. ‘‘ఈ మధ్యలో ‘ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు, మల్లీశ్వరి, నువ్వు నాకు నచ్చావ్’ స్టైల్లో ఫుల్ కామెడీ సినిమా చేయలేదు. అనిల్ కథ చెప్పిన విధానం నాకు బాగా నచ్చింది. మల్టీస్టారర్ అయితే ఇంకా ఫన్ ఉంటుందనుకుని చేశాం. వరుణ్‌తో పని చేయడం మంచి ఎక్స్పీరియన్స్. ఎంటర్టైన్ చేసిన ప్రతిసారీ నన్ను ఆదరించారు. ఈ చిత్రం పెద్ద హిట్ అవుతుందనుకుంటున్నాను’’ అన్నారు వెంకటేశ్. ‘‘నా కెరీర్లో చేయాల్సిన కామెడీ అంతా ఈ సినిమాలో చేయించాడు అనిల్. ఇలాంటి టీమ్‌తో పని చేయడం హ్యాపీగా ఉంది. వెంకీగారితో పని చేయాలంటే టెన్షన్ పడ్డా. ఫ్రేమ్‌లో ఆయనతో పోటీపడటం పెద్ద చాలెంజ్. ఆయన ఇచ్చిన కంఫర్ట్ వల్లే బాగా చేయగలిగాను. సీట్లో కూర్చోకుండా సినిమాను ఎంజాయ్ చేస్తారు’’ ఆన్నారు వరుణ్ తేజ్. ‘‘ఈ బ్యానర్లో ఇది నాకు మూడో సినిమా. నిర్మాతలు ఫ్యామిలీలా మారిపోయారు. వాళ్లతో ఓ ఎమోషనల్ బాండింగ్ ఏర్పడింది. మా కాంబినేషన్ మంచి సక్సెస్ సాధించాలని కోరుకుంటున్నాను. రెండు నిమిషాల ట్రైలర్లో కొన్ని నవ్వులే. రెండు గంటల ఇరవై నిమిషాల సినిమాలో చాలా నవ్వులుంటాయి. వెంకటేశ్, వరుణ్, తమన్నా మెహరీన్‌లు ఈ సినిమాకు 4 పిల్లర్స్’’ అన్నారు అనిల్ రావిపూడి. ‘‘కెరీర్ స్టార్టింగ్‌లో రాజుగారు నాదో సినిమా చూసి డిస్ట్రిబ్యూట్ చేశారు. ఆ రోజు నుంచి నా లైఫ్‌లో ‘హ్యాపీడేస్’ వచ్చేశాయి. అప్పటి నుంచి ఆయనతో ఎప్పుడు సినిమా చేస్తానా అనుకున్నాను. ఈ సినిమా చేయడం ఆనందంగా ఉంది. అనిల్‌గారు ఓన్లీ ఫన్ నో ఫ్రస్ట్రేషన్. వెంకీ సార్ ఎన్ని పాత్రలు చేసినా అంత ఫ్రెష్‌గా, ముద్దుగా ఎలా కనిపిస్తారో అర్థం కాదు. వరుణ్ చేస్తున్న సినిమాలు నాకు ఇష్టం. మెహరీన్ నా హనీ’’ అన్నారు తమన్నా. ‘‘200 శాతం ఈ సినిమాకు ఇచ్చాను. వెంకటేశ్ సార్, వరుణ్, తమన్నాలతో కలసి పని చేయడం మంచి ఎక్స్పీరియన్స్. ఫస్ట్ టైమ్ డబ్బింగ్ చెప్పుకున్నాను’’ అన్నారు మెహరీన్. -
తెలుగు సినిమా మరోసారి సత్తా చాటాలి
‘‘హలో వైజా........గ్.. సౌండ్ అంటే అదమ్మా. మీ సౌండ్‌తో నాకు గొంతు పోయినట్టుంది (నవ్వుతూ). వైజాగ్ ఉత్సవాల్లో మా ‘ఎఫ్ 2’ సినిమా ఆడియో రిలీజ్ చేయడం చాలా ఆనందంగా ఉంది. ‘ఎఫ్ 2’ వండర్ఫుల్ స్క్రిప్ట్. నా గత సినిమాలన్నీ జాగ్రత్తగా చూసిన అనిల్ వాటన్నిటికంటే చాలా బాగా రెచ్చిపోయాలా నన్ను చూపించాడు’’ అన్నారు వెంకటేశ్. అనిల్ రావిపూడి దర్శకత్వంలో వెంకటేశ్, వరుణ్‌తేజ్ హీరోలుగా తమన్నా, మెహరీన్ హీరోయిన్లుగా తెరకెక్కిన చిత్రం ‘ఎఫ్ 2’. ‘ఫన్ అండ్ ఫ్రస్ట్రేషన్’ అన్నది ఉపశీర్షిక. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై ‘దిల్’ రాజు నిర్మించిన ఈ సినిమా జనవరి 12న విడుదలవుతోంది. దేవిశ్రీ ప్రసాద్ స్వరపరచిన ఈ చిత్రం పాటలను ఆదివారం వైజాగ్‌లో మంత్రి గంటా శ్రీనివాసరావు రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా వెంకటేశ్ మాట్లాడుతూ– ‘‘వైజాగ్ నాకెంతో క్లోజ్. నా తొలి సినిమా ‘కలియుగ పాండవులు’ నుంచి ఎన్నో సినిమాలు నేను ఇక్కడ చేశాను. ‘స్వర్ణకమలం, సుందరకాండ, గురు’... ఇన్‌ఫ్యాక్ట్ ‘మల్లీశ్వరి’ సినిమాలో కత్రినాకైఫ్‌తో ఇదే బీచ్‌లో అలా నడుస్తూ ఉన్నాను కదా (నవ్వుతూ). వైజాగ్ నాకెంతో లక్కీ ప్రదేశం. మా పెళ్లాలు (తమన్నా, మెహరీన్) రాలేదు. దానికే కొంచెం అందరం ఫ్రస్ట్రేట్ అయి ఉన్నాం (నవ్వుతూ). మంచి మ్యూజిక్ ఇచ్చిన దేవిశ్రీకి థ్యాంక్స్. ‘ఎఫ్ 2’ లాంటి మంచి సినిమా ఇస్తున్నందుకు ‘దిల్’రాజుగారు, శిరీష్, లక్ష్మణ్‌లకు థ్యాంక్స్. వారితో చేసిన ‘సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టు’తో బ్రదర్ మహేశ్‌ని సంపాదించుకున్నా.. ‘ఎఫ్ 2’ సినిమాకి మరో బ్రదర్ వరుణ్ని సంపాదించుకున్నా. మా సినిమాతో పాటు రిలీజ్ అవుతున్న బాలయ్య బాబు (యన్.టి.ఆర్. కథానాయకుడు), చరణ్ (వినయ విధేయ రామ), రజనీకాంత్‌సార్ (పేట) సినిమాలన్నీ బాగా ఆడాలి.. మరోసారి తెలుగు సినిమా సత్తా చాటాలి’’ అన్నారు. ‘దిల్’ రాజు మాట్లాడుతూ– ‘‘కరెక్టుగా 2014 డిసెంబరు 31న నేను, బన్నీ (అల్లు అర్జున్) ఇక్కడే వైజాగ్‌లో న్యూ ఇయర్ సెలబ్రేట్ చేసుకున్నాం. 2017లో సంక్రాంతికి మూడు సినిమాలు రిలీజ్ అయినప్పుడు చాలా పెద్ద పోటీ అని అందరం భావించాం. బాలకృష్ణగారి ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ క్లాసిక్ సినిమా అయింది.. చిరంజీవిగారి ‘ఖైదీ నంబర్ 150’ సినిమా ఇండస్ట్రీ రికార్డ్ అయింది. మా ‘శతమానం భవతి’ మంచి సినిమా అయ్యి జాతీయ అవార్డు వరకూ వెళ్లింది. 2019 సంక్రాంతికి మళ్లీ మూడు సినిమాలు పోటీపడుతున్నాయి. ఈ మూడు సినిమాలు పెద్ద హిట్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. వెంకటేశ్‌గారితో మా బ్యానర్లో ‘సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టు, వరుణ్‌తో ‘ఫిదా’ సినిమాలు చేశాం. వారిద్దరితో మల్టీస్టారర్‌గా ఇప్పుడు తీసిన ‘ఎఫ్ 2’ సంక్రాంతికి రాబోతోంది. ఇద్దరూ నిర్మాతకి కంఫర్టబుల్ హీరోలు. థ్యాంక్యూ వెంకీ సార్. మంచి కథ కుదిరితే మీతో మరో సినిమా చేయాలనే కోరిక ఉంది. వరుణ్ ఆల్మోస్ట్ ఓ ఫ్యామిలీ మెంబర్. చిరంజీవిగారిలోని లక్షణాలు తీసుకుని మంచి సినిమాలు చేస్తూ ఎదుగుతున్న వరుణ్ ఈ సినిమాతో ఫ్యామిలీ ఆడియన్స్‌కి దగ్గరవుతాడు. అనిల్ ఈ సినిమా కథ చెబుతున్నప్పుడు నవ్వుతూనే ఉన్నా. మా బ్యానర్‌కి మరో సూపర్ హిట్‌గా నిలుస్తుందని అప్పుడే తెలుసు. అనిల్ గత చిత్రాలు ‘పటాస్, సుప్రీమ్, రాజా ది గ్రేట్’ కమర్షియల్ ఎంటర్టైనర్స్ అయితే ‘ఎఫ్ 2’ పక్కా ఫ్యామిలీ ఎంటర్టైనర్. అందుకే ఈ సినిమాకి ‘సంక్రాంతి అల్లుళ్లు’ వస్తున్నారని మరో ట్యాగ్‌లైన్ పెట్టాడు. సినిమాలో ఒకరు ఆంధ్ర అల్లుడు.. మరొకరు తెలంగాణ అల్లుడు. మా బ్యానర్లో అనిల్‌కి వరుసగా మూడో సినిమా. కచ్చితంగా హ్యాట్రిక్ కొట్టబోతున్నాం. దేవిశ్రీతో ‘ఆర్య’ నుంచి మా జర్నీ మొదలైతే ‘ఎఫ్ 2’ పదో సినిమా. ఇప్పటి వరకూ 9 సినిమాలు సూపర్ హిట్స్ అయ్యాయి. మా కాంబినేషన్ ఇలాగే కొనసాగుతుంది’’ అన్నారు. వరుణ్ తేజ్ మాట్లాడుతూ– ‘‘నా యాక్టింగ్ కెరీర్ ఇక్కడి నుంచే మొదలైంది. వైజాగ్ సత్యానంద్‌గారి వద్ద నటనలో శిక్షణ తీసుకున్నా. ‘ఎఫ్ 2’కి దేవి వండర్ఫుల్ మ్యూజిక్ ఇచ్చారు. నా గత సినిమాలు చూసి ఈ పాత్ర ఎవరూ నాకు ఇవ్వరేమో? కానీ అనిల్ చాలా ధైర్యం చేసి ఇచ్చాడు.. బాగానే చేశా. ఓ ఫ్రెండ్‌లా, మెంటర్‌లా వెంకటేశ్ సార్ నన్ను ప్రోత్సహించడంతో ఈ జర్నీ చాలా హ్యాపీగా సాగింది’’ అన్నారు. అనిల్ రావిపూడి మాట్లాడుతూ– ‘‘మా ఫన్, ఫ్రస్ట్రేషన్ వైజాగ్ బీచ్‌కి బాగా తెలుసు. ఎందుకంటే ఈ కథ ఇక్కడే రాశాం. వెంకటేశ్‌గారితో పనిచేసే గొప్ప అవకాశం దొరికింది. ఈ సినిమాతో వెంకీగారు మిమ్మల్ని టైమ్ మెషీన్లో ‘అబ్బాయిగారు, ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు, నువ్వునాకు నచ్చావ్, మల్లీశ్వరి’.. అక్కడికి తీసుకెళ్లిపోతారు. వరుణ్ తొలిసారి ఈ సినిమాలో మంచి కామెడీ చేశారు. వీరిద్దరి మధ్య సన్నివేశాలు మిమ్మల్ని నవ్విస్తాయి. దేవిశ్రీగారు ఆరు పాటలూ మంచివి ఇచ్చారు. జీవితంలో ఎన్ని ఉన్నా నవ్వులు లేకపోతే అదో వెలితి. సంక్రాంతికి మీ కుటుంబంతో వచ్చి మా సినిమా చూడండి.. తప్పకుండా నవ్వుకుని బయటికెళతారు’’ అన్నారు. దేవిశ్రీ ప్రసాద్ మాట్లాడుతూ– ‘‘సినిమా చూస్తే మీలోని ఫ్రస్ట్రేషన్ వదిలేసి ఫన్‌తో ఇంటికెళతారు. వెంకటేశ్‌గారికి విక్టరీ అలవాటైపోయింది. మీరు చాలామందికి స్ఫూర్తి సార్. వరుణ్‌తో తొలిసారి చేస్తున్నా. వైవిధ్యమైన సినిమాలు చేస్తున్నాడు. అనిల్‌తో చాలా సరదాగా ఉంటుంది. ‘దిల్’ రాజుగారితో నా జర్నీ ఇంకా ఇంకా సాగాలని కోరుకుంటున్నా’’ అన్నారు. ఈ వేడుకలో పాటల రచయితలు కాసర్ల శ్యాం, శ్రీమణి, బాలాజీ, నటుడు ‘సత్యం’ రాజేశ్, నటి హరితేజ, లైన్ ప్రొడ్యూసర్ రత్నకుమార్ తదితరులు పాల్గొన్నారు. -
స్క్రీన్ టెస్ట్
2018 పలు విజయాలు, ఘన విజయాలతో పాటు పలువురు తారలను ఒకింటివాళ్లను కూడా చేసింది. తమ టాలెంట్‌ను నిరూపించుకున్న నటీనటులు, సాంకేతిక నిపుణులు ఎందరో ఉన్నారు. ఈ వారం ఇయర్ ఎండింగ్ స్పెషల్ క్విజ్.... 1. 2018లో ఈ ప్రముఖ హీరో సినిమా ఒక్కటి కూడా విడుదల కాలేదు. ఎవరా హీరో కనుక్కోండి? ఎ) మహేశ్‌బాబు బి) రామ్‌చరణ్ సి) ప్రభాస్ డి) యన్టీఆర్ 2. 2018లో 200 కోట్ల గ్రాస్‌ను కలెక్ట్ చేసిన తెలుగు సినిమా ఏదో తెలుసా? ఎ) భరత్ అనే నేను బి) రంగస్థలం సి) గీత గోవిందం డి) అరవింద సమేత వీర రాఘవ 3. ఈ సంవత్సరం విడుదలైన ‘గీత గోవిందం’ చిత్రంలోని టాప్ సాంగ్ ‘ఇంకేం ఇంకేం.. ఇంకేం కావాలే...’ అనే పాట పాడిన గాయకుడెవరో తెలుసా? ఎ) సిథ్ శ్రీరామ్ బి) కైలాష్ ఖేర్ సి) యాసిన్ నజార్ డి) శ్రీరామచంద్ర 4. ఈ సంవత్సరం ఎక్కువ తెలుగు సినిమాలకు సంగీత దర్శకత్వం వహించిన సంగీత దర్శకుడెవరో తెలుసా? ఎ) దేవిశ్రీ ప్రసాద్ బి) యస్.యస్. తమన్ సి) యం.యం. కీరవాణి డి) మిక్కీ జే మేయర్ 5. ‘ఆర్ఎక్స్–100’ చిత్రంతో హీరోగా ప్రయాణాన్ని మొదలు పెట్టిన నటుని పేరేంటి? ఎ) తేజస్ కంచర్ల బి) కార్తి్తకేయ సి) కల్యాణ్ దేవ్ డి) వైష్ణవ్ తేజ్ 6. ఈ సంవత్సరం మూడు తెలుగు హిట్ సినిమాల్లో నటించిన నటి ఎవరో కనిపెట్టండి? ఎ) సమంత బి) లావణ్యా త్రిపాఠి సి) రాశీ ఖన్నా డి) త్రిష 7. ఓ అసిస్టెంట్ ఆర్ట్ డైరెక్టర్ 2018లో దర్శకునిగా మారారు. ‘కేరాఫ్ కంచరపాలెం’ సినిమాతో అందరి మనసులూ దోచుకున్నారు. ఆయనెవరు? ఎ) అజయ్ భూపతి బి) రాహుల్ సంకృత్యాన్ సి) వెంకటేశ్ మహా డి) శశికిరణ్ తిక్క 8. 2018లో ఓ కన్నడ నటుడు తెలుగు ప్రేక్షకులను తొలిసారి పలకరించారు. ఆ సినిమా పేరు ‘కె.జీ.ఎఫ్’. ఈ కన్నడ నటుని పేరేంటి? ఎ) గణేశ్ బి) యష్ సి) పునీత్ రాజ్‌కుమార్ డి) దునియా విజయ్ 9. 2018లో అకాల మరణం పొందిన కన్నడ రెబెల్‌స్టార్ ఎవరో తెలుసా? ఎ) రాజ్‌కుమార్ బి) విష్ణువర్థన్ సి) అంబరీష్ డి) దృవ్ శర్మ 10. నటునిగా అంతకుముందు చాలా సినిమాల్లో నటించారు. 2018లో ‘బ్లఫ్ మాస్టర్’ సినిమాతో సోలో హీరోగా వచ్చిన ఆ నటుని పేరేంటి? ఎ) సత్యదేవ్ బి) శ్రీనివాసరెడ్డి సి) చైతన్య కృష్ణ డి) సత్యం రాజేశ్ 11. ఈ ఏడాది విడుదలైన ‘మహానటి’తో అందరి దృష్టినీ తన వైపుకు తిప్పుకున్న దర్శకుడెవరు? ఎ) నాగ్అశ్విన్ బి) వెంకీ కుడుముల సి) పరశురాం డి) విక్రమ్.కె.కుమార్ 12. రజనీకాంత్, శంకర్ల విజువల్ వండర్ ‘2.ఓ’. ఆ విజువల్ వండర్‌కు పనిచేసిన కెమెరామెన్ ఎవరో తెలుసుకుందామా? ఎ) పి.సి. శ్రీరామ్ బి) కబీర్ లాల్ సి) నిరవ్ షా డి) కె.కె. సెంథిల్‌కుమార్ 13. ఈ ఏడాది మూడు చిత్రాల ద్వారా ప్రేక్షకులకు కనిపించిన హీరో ఎవరో తెలుసా? (అందులో ఓ చిత్రం ద్వారా తమిళ పరిశ్రమలోకి ఎంటరయ్యారా హీరో) ఎ) నాని బి) విజయ్ దేవరకొండ సి) నాగచైతన్య డి) అఖిల్ 14. ‘కలర్స్’ స్వాతి ఈ ఏడాది వివాహం చేసుకుంది. అతని పేరు వికాస్ వాసు. మరి స్వాతి భర్త ఏం చేస్తారో తెలుసా? ఎ) డాక్టర్ బి) యాక్టర్ సి) బిజినెస్‌మేన్ డి) పైలెట్ 15. ఈ సంవత్సరం బాలీవుడ్ నటీనటులు దీపికా, రణ్వీర్ వివాహ బంధంతో ఒక్కటయ్యారు. వారు ఏ తేదీన వివాహం చేసుకున్నారో చెప్పుక్కోండి? (క్రింద ఇచ్చిన తేదీల్లో ఈ హీరోయిన్ మ్యారేజ్ డేట్‌తోపాటు ఈ ఏడాది పెళ్లయిన వేరే హీరోయిన్లవీ ఉన్నాయి) ఎ) డిసెంబర్ 1 బి) డిసెంబర్ 13 సి) నవంబర్ 14 డి) ఆగస్టు 30 16. బాలీవుడ్ ప్రముఖ నటి ప్రియాంకా చోప్రా ఈ ఏడాది అమెరికన్ సింగర్ నిక్ జోనస్‌ను వివాహమాడారు. ఆమెకంటే వయసులో అతను ఎంత చిన్నవాడో తెలుసా? ఎ) ఏడేళ్లు బి) పదేళ్లు సి) రెండేళ్లు డి) ఐదేళ్లు 17. ఈ ఏడాది ఒకే హీరోతో రెండు విజయాలను సొంతం చేసుకున్న ప్రముఖ నిర్మాణ సంస్థ ఏది? ఎ) గీతా ఆర్ట్స్ బి) వైజయంతీ మూవీస్ సి) మైత్రీ మూవీ మేకర్స్ డి) సురేశ్ ప్రొడక్షన్స్ 18. ‘రంగస్థలం’ చిత్రంలోని ‘జిల్ జిల్ జిల్ జిల్ జిగేల్ రాణి...’ అనే ఐటమ్ సాంగ్‌లో మొదటిసారి నటించిన టాప్ హీరోయిన్ ఎవరు? ఎ) తమన్నా బి) కాజల్ అగర్వాల్ సి) పూజా హెగ్డే డి) కియారా అద్వానీ 19. ‘దారి చూడు దుమ్ము చూడూ మామా...’ అనే పాటతో సినీ పరిశ్రమలోకి ఎంటర్ అయ్యారీయన. 2018లో సిల్వర్ స్క్రీన్‌పై తన రచనతో, యాసతో వెలుగులోకొచ్చిన ఈ రాయలసీమ రైటర్ ఎవరో కనుక్కోండి? ఎ) మేర్లపాక గాంధీ బి) పెంచల్ దాస్ సి) జి.ఆర్ మహర్షి డి) ప్రసన్నకుమార్ బెజవాడ 20. 2018లో తెలుగు తెరపై కనిపించని టాప్ హీరోయిన్ ఎవరో కనుక్కోండి? ఎ) సాయిపల్లవి బి) నయనతార సి) రకుల్ ప్రీత్ సింగ్ డి) అనుపమా పరమేశ్వరన్ మీరు 6 సమాధానాల కంటే తక్కువ చెబితే... మీకు సినిమా అంటే ఇష్టం 10 సమాధానాల వరకూ చెప్పగలిగితే... మీకు సినిమా అంటే ఇంట్రెస్ట్ 15 సమాధానాల వరకూ చెప్పగలిగితే... మీకు సినిమా అంటే పిచ్చి 20 సమాధానాలూ చెప్పగలిగితే... ఇంకోసారి ఈ క్విజ్ చదవకండి! సమాధానాలు 1) సి 2) బి 3) ఎ 4) బి 5) బి 6) ఎ 7) సి 8) బి 9) సి 10) ఎ 11) ఎ 12) సి 13) బి 14) డి 15) సి 16) బి 17) ఎ 18) సి 19) బి 20) సి నిర్వహణ: శివ మల్లాల