
ఓంకార్, తమన్నా, అశ్విన్‌బాబు
భయపెట్టడానికి కొత్త గదిలోకి అడుగుపెట్టారు మిల్కీ బ్యూటీ తమన్నా. ఓంకార్ దర్శకత్వంలో తమన్నా ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న సినిమా ‘రాజుగారి గది 3’. ఇదివరకు ఓంకార్ దర్శకత్వంలోనే వచ్చిన ‘రాజుగారి గది, రాజుగారి గది 2’ చిత్రాలకు ఇది సీక్వెల్ అని చెప్పుకోవచ్చు. ఓక్ ఎంటర్‌టైన్మెంట్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. గురువారం ‘ రాజుగారి గది 3’ ప్రారంభోత్సవం జరిగింది.
ముహూర్తపు సన్నివేశానికి నిర్మాత ‘దిల్’ రాజు క్లాప్ ఇచ్చారు. ‘స్టార్ మా’ బిజినెస్ హెడ్ అలోక్‌జైన్ కెమెరా స్విచ్చాన్ చేశారు. ఈ రోజు నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ జరుగుతుంది. అశ్విన్‌బాబు, అలీ, బ్రహ్మాజీ, ప్రభాస్ శ్రీను, హరితేజ, అజయ్ ఘోష్, ఊర్వశి తదితరులు నటిస్తున్న ఈ సినిమాకు మాటలు: సాయిమాధవ్ బుర్రా, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: కల్యాణి చక్రవర్తి.
Comments
Please login to add a commentAdd a comment