Sequel movie
-
అజయ్ దేవగన్– రోహిత్ శెట్టి కాంబినేషన్లో మరో సినిమా ప్రకటన
బాలీవుడ్లో అజయ్ దేవగన్–దర్శకుడు రోహిత్ శెట్టి కాంబినేషన్లో వచ్చే సినిమాలకు మంచి క్రేజ్ ఉంది. తాజాగా విడుదలైన వారి కాంబో నుంచి విడుదలైన సింగమ్ అగైన్ యాక్షన్ హంగామాతో థియేటర్స్ వద్ద సందడి చేస్తుంది. ఇప్పటికే సింగమ్ ప్రాంఛైజీలో భాగంగా 3 చిత్రాలు వచ్చాయి. అయితే, వారిద్దరి కలయికలో మరో సినిమా రాబోతుంది. గోల్మాల్ ప్రాంఛైజీ నుంచి మరో ప్రాజెక్ట్‌ను తెరకెక్కిస్తున్నట్లు దర్శకుడు రోహిత్ శెట్టి తాజాగా అధికారికంగా ప్రకటించారు.'సింగమ్' వంటి హిట్ సీక్వెల్స్ ఇచ్చిన హీరో అజయ్ దేవగన్–దర్శకుడు రోహిత్ శెట్టి కాంబినేషన్లో వచ్చిన మరో చిత్రం గోల్మాల్ (2006) ఘనవిజయం సాధించింది. ఈ చిత్రానికి సీక్వెల్‌గా వారిద్దరి కాంబినేషన్లోనే వచ్చిన గోల్మాల్ రిటర్న్స్ (2008) సూపర్ హిట్ అయింది. ఈ ఫ్రాంచైజీలో గోల్మాల్ 3 (2010), గోల్మాల్ 4 (2017) కూడా వచ్చాయి. గోల్మాల్ 5 2025లో రానుందని ఆయన ఆయన ప్రకటించారు.బాలీవుడ్ సూపర్ హిట్ చిత్రాల లిస్ట్‌లో 'గోల్మాల్' కూడా తప్పకుండా ఉంటుంది. రోహిత్ శెట్టి తెరకెక్కించిన ఈ ఫ్రాంచైజీలో వచ్చిన నాలుగు భాగాలు ప్రేక్షకులను మెప్పించాయి. ఇప్పుడు పార్ట్5 ప్రకటన రావడంతో ఫ్యాన్స్‌లో ఫుల్ జోష్ పెరిగింది. ఈ చిత్రానికి సంబంధించి ఇప్పటికే స్క్రిప్ట్ వర్క్ పూర్తయిందని ఆయన పేర్కొన్నారు. 'సింగమ్ అగైన్‌తో సినీ అభిమానులకు ఓ యాక్షన్ చిత్రాన్ని అందించాను. త్వరలో వారిని అన్‌లిమిటెడ్‌గా నవ్వించడానికి 'గోల్మాల్ 5' కోసం ప్లాన్ చేస్తున్నట్లు' అయన ప్రకటించారు. -
ఈగ సీక్వెల్.. నానితో పనిలేదన్న రాజమౌళి!
రాజమౌళి దర్శకత్వంలో నాని, సమంత జంటగా నటించిన చిత్రం ‘ఈగ’. 2012లో విడుదలైన ఈ చిత్రం బ్లాక్ బస్టర్ హిట్ కొట్టడంతో పాటు పలు అవార్డులను సొంతం చేసుకుంది. ఈ సినిమాకు సీక్వెల్ రావాలని సినీ ప్రియులతో పాటు హీరో నాని కూడా కోరుకుంటున్నాడు. తాజాగా ఈ మూవీ సీక్వెల్ గురించి నాని మాట్లాడారు. రాజమౌళి ఫిక్స్ అయితే ఈ సీక్వెల్ కచ్చితంగా వస్తుందని.. చిన్న ఈగతో మరోసారి బాక్సాఫీస్ రికార్డులను బద్దలు కొట్టడం ఖాయమని అన్నారు. అయితే ఇప్పట్లో ఈ సీక్వెల్ ఆలోచన రాజమౌళికి లేదని చెబుతూ.. వారిద్దరి మధ్య ఈగ2పై జరిగిన సరదా సంభాషణను పంచుకున్నాడు.ఓ సారి రాజమౌళితో ఈగ సీక్వెల్ గురించి మాట్లాడాను. సీక్వెల్ పనులు ఎప్పుడు మొదలుపెడదామని అడిగాను. అప్పుడు దానికి ఆయన ‘మేము ఈగ 2 చేసినా..నీతో పనిలేదు.మాకు ఈగ ఉంటే చాలు. అదే సీక్వెల్లో తిరిగి వస్తుంది’ అని చెప్పారు. ఒక చిన్న ఈగతో సినిమా తీయాలని ఆలోచన రావడమే గొప్ప విషయం. రాజమౌళి ధైర్యాన్ని ప్రతి ఒక్కరు మెచ్చుకోవాల్సిందే. ఒకవేళ ఆయన ఈగ 2 చేస్తే.. అది కచ్చితంగా మరో అద్భుతమైన విజయం సాధిస్తుంది. ప్రస్తుతం ఆయనకు అయితే సీక్వెల్ చేయాలని ఆలోచన లేదు. కానీ ఏదో ఒకరోజు కచ్చితంగా ఈగ 2 గురించి ఆలోచించి..మంచి కథతో సీక్వెల్ తీస్తాడని అనుకుంటున్నాను’ అన్నారు. నాని ప్రస్తుతం ‘సరిపోదా శనివారం’ సినిమా ప్రమోషన్స్‌లో బిజీగా ఉన్నారు. వివేక్ ఆత్రేయ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఈ నెల 29న ప్రేక్షకుల ముందుకు రానుంది. -
మురారి సీక్వెల్ కావాలంటున్న మహేష్ ఫ్యాన్స్..
-
అమ్మ బ్లాక్‌బస్టర్ చిత్రంలో జాన్వీకపూర్.. ఆమె ఏమన్నారంటే?
బాలీవుడ్ ముద్దుగుమ్మ జాన్వీ కపూర్ ప్రస్తుతం ఉలజ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రస్తుతం ఈ మూవీ ప్రమోషన్లతో బిజీగా ఉన్నారు. ఈ నేపథ్యంలో వరుస ఈవెంట్లకు హాజరవుతున్నారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో జాన్వీకపూర్‌కు ఆసక్తికర ప్రశ్న ఎదురైంది. 1987లో వచ్చి శ్రీదేవి బ్లాక్‌బస్టర్ మూవీ మిస్టర్ ఇండియాకు సీక్వెల్ తీస్తే అందులో నటిస్తారా? అని ఆమెను అడిగారు. ఈ ప్రశ్నకు జాన్వీ కపూర్ సమాధానమిచ్చింది. మిస్టర్ ఇండియా చ్తిరంలో అనిల్ కపూర్, శ్రీదేవి జంటగా నటించారు.జాన్వీ మాట్లాడుతూ.. "ఇండియన్ సినిమాల్లో వచ్చిన అత్యుత్తమ చిత్రాలలో మిస్టర్ ఇండియా ఒకటి. అలాంటి సినిమా మళ్లీ రీమేక్ చేస్తారా లేదా అనేది నాకు తెలియదు. దాని కోసం నాకు ఎలాంటి ప్లాన్స్ లేవు. ఆ సినిమా చేయాలా? వద్దా? అనేది నిర్మాతలకు బాగా తెలుసు అని నేను అనుకుంటున్నా. ఈ విషయం డైరెక్టర్ ఎవరో వారికే బాగా తెలుస్తుంది' అని తెలిపింది.తన తండ్రి బోనీ కపూర్ గురించి మాట్లాడుతూ.. "నేను ఎప్పుడూ ఆయన సినిమాలో ఇష్టం లేదని చెప్పలేదు. ఆయన తీర్పును ఎక్కువగా విశ్వసిస్తా. నేను దానిని తిరస్కరించలేను. నన్ను తన సినిమాలో తీసుకోమని నేనేప్పుడూ ఒత్తిడి చేయలేదు. ఆయన కుమార్తెగా ఉత్తమమైన నిర్ణయాలు తీసుకోవాలని నేను కోరుకుంటున్నా. నాన్నకు నచ్చిన విధంగా పనిచేయాలని నేను కోరుకుంటా. అంతేకానీ దయచేసి నన్ను మీ సినిమాలోకి తీసుకోండి అని వేడుకోను' అని పేర్కొంది.సీక్వెల్‌పై బోనీ కపూర్కాగా.. గతేడాది అనిల్ కపూర్, శ్రీదేవి నటించిన మిస్టర్ ఇండియా చిత్రానికి సంబంధించిన సీక్వెల్‌పై హింట్ ఇచ్చాడు. దీనికోసం వర్క్ జరుగుతోంది.. త్వరలోనే ప్రకటిస్తాం అని పోస్ట్ చేశారు. కానీ ఇంతవరకు ఎలాంటి అప్డేట్స్ రాలేదు. కాగా..1987లో వచ్చిన మిస్టర్ ఇండియా సినిమాకు శేఖర్ కపూర్ దర్శకత్వం వహించారు. నర్సింహా ఎంటర్ప్రైజెస్ బ్యానర్‌పై బోనీ కపూర్, సురీందర్ కపూర్లు సంయుక్తంగా నిర్మించారు. ఈ చిత్రంలో అమ్రిష్ పూరి, అన్నూ కపూర్, అజిత్ వచాని, హరీష్ పటేల్, దివంగత సతీష్ కౌశిక్, అహ్మద్ ఖాన్, అఫ్తాబ్ శివదాసాని తదితరులు నటించారు. -
డబ్బింగ్ డన్
బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తొలిసారి తెలుగులో పూర్తి స్థాయి పాత్ర పోషించిన చిత్రం ‘డబుల్ ఇస్మార్ట్’. ఈ చిత్రంలో తన పాత్రకు సంబంధించిన హిందీ వెర్షన్ డబ్బింగ్‌ని పూర్తి చేశారు సంజయ్ దత్. హీరో రామ్ పోతినేని, డైరెక్టర్ పూరి జగన్నాథ్ కాంబినేషన్లో తెరకెక్కిన హిట్ మూవీ ‘ఇస్మార్ట్ శంకర్ ’(2019)కి సీక్వెల్‌గా ఇదే కాంబినేషన్లో ‘డబుల్ ఇస్మార్ట్’ రూ΄÷ందింది. ఈ చిత్రంలో సంజయ్ దత్ విలన్‌గా చేశారు. పూరి కనెక్ట్స్‌పై పూరి జగన్నాథ్, ఛార్మీ కౌర్ నిర్మించిన ఈ సినిమా ఆగస్టు 15న తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో విడుదల కానుంది. ప్రైమ్‌షో ఎంటర్టైన్మెంట్పై నిరంజన్ రెడ్డి, చైతన్య రెడ్డి ఈ చిత్రాన్ని ఐదు భాషల్లో విడుదల చేస్తున్నారు. -
ఇండియన్ ఇండస్ట్రీకి పాఠాలు నేర్పుతున్న టాలీవుడ్...
-
అన్న దారిలో తమ్ముడు నెక్స్ట్ ఇయర్ ఖైదీ సీక్వెల్ స్టార్ట్..
-
కౌంట్‌డౌన్ స్టార్ట్
హీరో రామ్ పోతినేని, డైరెక్టర్ పూరి జగన్నాథ్ కాంబినేషన్లో తెరకెక్కుతోన్న చిత్రం ‘డబుల్ ఇస్మార్ట్’. వీరిద్దరి కలయికలో వచ్చిన బ్లాక్ బస్టర్ మూవీ ‘ఇస్మార్ట్ శంకర్’ (2019) కి సీక్వెల్‌గా ‘డబుల్ ఇస్మార్ట్’ రూపొందుతోంది. కావ్యా థాపర్ హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రంలో సంజయ్ దత్ విలన్‌గా నటిస్తున్నారు. పూరి కనెక్ట్స్‌పై పూరి జగన్నాథ్, ఛార్మి కౌర్ నిర్మిస్తున్న ఈ చిత్రం షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్‌లో జరుగుతోంది. ‘‘మాస్ యాక్షన్ ఎంటర్టైనర్గా ‘డబుల్ ఇస్మార్ట్’ రూపొందుతోంది. ఆగష్టు 15న సినిమాని విడుదల చేయనున్నాం. సినిమా రిలీజ్‌కి సరిగ్గా 50 రోజులు ఉంది. అందుకే 50 రోజుల కౌంట్‌డౌన్‌ను మార్క్ చేస్తూ రామ్ స్పెషల్ పోస్టర్‌ను విడుదల చేశాం. మణిశర్మ సంగీతం అందించిన ఈ మూవీ టైటిల్ సాంగ్ షూట్ హైదరాబాద్‌లో జరుగుతోంది. ఈ పాటకి జానీ మాస్టర్ కొరియోగ్రఫీ చేస్తున్నారు. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో మా సినిమా విడుదల కానుంది’’ అని చిత్రబృందం పేర్కొంది. -
భూతల్లి పై ఒట్టేయ్...
‘శౌర..’ అంటూ చైతన్య గీతం పాడారు సేనాపతి. హీరో కమల్‌హాసన్, దర్శకుడు శంకర్ కాంబినేషన్లో 1996లో విడుదలైన సూపర్ హిట్ ఫిల్మ్ ‘ఇండియన్’ (‘భారతీయుడు’). ఈ సినిమాకు సీక్వెల్స్‌గా ‘ఇండియన్ 2, ఇండియన్ 3’ (‘భారతీయుడు 2, 3’)’ సినిమాను తెరకెక్కించారు దర్శకుడు శంకర్. ఈ చిత్రంలో సేనాపతి పాత్రలో కనిపిస్తారు కమల్‌హాసన్. రెడ్ జెయింట్ మూవీస్, లైకా ్ర΄÷డక్షన్స్పై సుభాస్కరన్ నిర్మించిన ఈ చిత్రం ఆడియో ఆవిష్కరణ వేడుక జూన్ 1న చెన్నైలో జరగనుంది. ఈ సందర్భంగా ఈ చిత్రంలోని తొలి పాటను తెలుగు, తమిళ, హిందీ భాషల్లో విడుదల చేశారు. ‘భూతల్లి పై ఒట్టేయ్... తెలుగోడి వాడి చూపెట్టేయ్...’ అంటూ సాగే తెలుగు పాట ‘శౌర..’కు సుద్దాల అశోక్‌తేజ సాహిత్యం అందించగా, రితేష్ జి. రావ్, శ్రుతికా సముద్రాల పాడారు. ఈ సినిమాకు అనిరుధ్ రవిచందర్ మ్యూజిక్ డైరెక్టర్. జూలై 12న తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ‘ఇండియన్ 2’ చిత్రం విడుదల కానుంది. -
ఖురేషిగా ఎందుకు మారాడు?
ఖురేషి అబ్రమ్‌గా స్టీఫెన్ నెడుంపల్లి ఎందుకు మారాడు? ‘లూసిఫర్’ సినిమా చూసిన ప్రేక్షకులకు ఈ సందేహం కలగడం సహజం. ఈ సందేహానికి ‘లూసిఫర్ 2’లో సమాధానం దొరకనుంది. స్టీఫెన్ నెడుంపల్లి అలియాస్ ఖురేషి అబ్రమ్‌గా మోహన్‌లాల్ హీరోగా రూపొందిన బ్లాక్ బస్టర్ మూవీ ‘లూసిఫర్’ (2019). హీరో, డైరెక్టర్ పృథ్వీరాజ్ సుకుమారన్ దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందింది. ఈ కాంబినేషన్లోనే ‘లూసిఫర్’కి సీక్వెల్‌గా ‘ఎల్2 ఎంపురాన్’ రూపొందుతోంది.ఈ చిత్రాన్ని లైకా ప్రోడక్షన్స్ సుభాస్కరన్, ఆశీర్వాద్ సినిమాస్ ఆంటోని పెరుంబవూర్ నిర్మిస్తున్నారు. మంగళవారం (మే 21) మోహన్‌లాల్ బర్త్ డే సందర్భంగా ‘ఎల్ 2 ఎంపురాన్’లో ఖురేషి అబ్రమ్‌గా మోహన్‌లాల్ లుక్‌ను విడుదల చేశారు. స్టీఫెన్ నెడుంపల్లి అసలు ఖురేషి అబ్రమ్‌గా ఎలా మారాడు? అనే విషయాన్ని ఈ సినిమాలో చూపించనున్నారు. 2025లో మలయాళం, తెలుగు, తమిళ, కన్నడ, హిందీ భాషల్లో ఈ చిత్రం విడుదల కానుంది. -
మొన్న టిల్లు స్వ్కేర్.. ఇప్పుడు మ్యాడ్ స్వ్కేర్
డీజే టిల్లు చిత్రానికి సీక్వెల్‌గా వచ్చిన టిల్లు స్క్వేర్ బాక్సాఫీస్నిషేక్ చేసింది. చాలా రోజుల తర్వాత సితార ఎంటర్టైన్మెంట్స్కు ఓ సాలిడ్ హిట్ అదించాడు టిల్లుగాడు. ఇదే జోష్‌లో మరో హిట్ సినిమాకు సీక్వెల్ ప్రకటించింది సితార ఎంటర్టైన్మెంట్స్. గతేడాదిలో ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చి పెద్ద హిట్టయిన చిత్రం ‘మ్యాడ్’చిత్రానికి సీక్వెల్‌గా ‘మ్యాడ్ స్వ్కేర్’ ని ప్రకటించారు. 'మ్యాడ్'తో రచయిత-దర్శకుడిగా పరిచయమైన కళ్యాణ్ శంకరే ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. మ్యాడ్ ఎంతలా నవ్వులు పంచిందో, దానికి రెట్టింపు వినోదం సీక్వెల్ ద్వారా అందించబోతున్నట్లు మేకర్స్ తెలిపారు.'మ్యాడ్ స్క్వేర్' సినిమా ప్రారంభోత్సవానికి స్టార్ బాయ్ సిద్ధు జొన్నలగడ్డ, దర్శకుడు కె.వి. అనుదీప్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా దర్శకుడుకి స్క్రిప్ట్ అందజేసిన సిద్ధు జొన్నలగడ్డ, చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలిపారు. అలాగే నిర్మాత సూర్యదేవర నాగవంశీ కుమార్తె , ఆయన సోదరీమణులు హారిక సూర్యదేవర, హాసిని సూర్యదేవర కూడా 'మ్యాడ్ స్క్వేర్' ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు. -
హారర్... కామెడీ సమానంగా ఉంటాయి: అంజలి
‘‘గీతాంజలి మళ్లీ వచ్చింది’ సినిమా పాయింట్‌ను కోన వెంకట్‌గారు నాలుగేళ్ల ముందే చెప్పారు. అయితే అప్పుడు నేను బిజీగా ఉండటం, ఆ తర్వాత ఈ సినిమాలోని ఇతర నటీనటులు బిజీగా ఉండటంతో కుదరలేదు. మధ్యలో కరోనా వచ్చింది. హారర్, కామెడీని బ్యాలెన్స్ చేస్తూ చేసిన ఈ మూవీ ప్రేక్షకులకు నచ్చుతుంది’’ అన్నారు హీరోయిన్ అంజలి. ‘గీతాంజలి’కి సీక్వెల్‌గా రూపొందిన చిత్రం ‘గీతాంజలి మళ్లీ వచ్చింది’. శివ తుర్లపాటి దర్శకత్వంలో ఎంవీవీ సినిమాస్‌తో కలిసి కోన వెంకట్ నిర్మించిన ఈ మూవీ ఈ నెల 11న రిలీజవుతోంది. ఈ సందర్భంగా అంజలి మాట్లాడుతూ– ‘‘గీతాంజలి’కి ఇది సీక్వెల్ కాబట్టి పాత్రలని మార్చలేదు. కానీ, కొత్త క్యారెక్టర్స్‌ను (అలీ, సునీల్, సత్య) తీసుకొచ్చాం. రొటీన్‌గా చేస్తే నటిగా నాకు ఆసక్తి ఉండదు కాబట్టి ప్రతి సినిమాకి కొత్తగా ఉండాలనే చూస్తున్నాను. ఈ ఉగాదికి ‘గీతాంజలి మళ్లీ వచ్చింది’తో వస్తుండటం హ్యాపీ’’ అన్నారు. -
Ajay Devgn: సీక్వెల్ స్టార్
యాక్షన్ హీరోగా, ఫ్యామిలీ హీరోగా అన్ని వర్గాల ప్రేక్షకులనూ మెప్పిస్తున్నారు అజయ్ దేవగన్. ఇప్పుడు ఈ హీరోకి ‘సీక్వెల్ స్టార్’ అని ట్యాగ్ ఇవ్వొచ్చు. ఎందుకంటే ఒకటి కాదు... రెండు మూడు కూడా కాదు... ఏకంగా ఎనిమిది చిత్రాల సీక్వెల్స్ అజయ్ దేవగన్ డైరీలో ఉన్నాయి. సీక్వెల్ చిత్రాల్లో నటించడం పెద్ద విషయం కాదు కానీ వరుసగా ఎనిమిది చిత్రాలంటే మాత్రం పెద్ద విషయమే. ఇక అజయ్ సైన్ చేసిన సీక్వెల్ చిత్రాల్లో ఇప్పటికే కొన్ని చిత్రాలు షూటింగ్ దశలో ఉండగా కొన్ని ఆరంభం కావాలి. ఆ చిత్రాల విశేషాలు తెలుసుకుందాం. అజయ్ దేవగన్ కెరీర్లో ‘సింగమ్’ చిత్రానిది ప్రత్యేక స్థానం. రోహిత్ శెట్టి దర్శకత్వం వహించిన ఈ యాక్షన్ ఎంటర్టైనర్లో పోలీసాఫీసర్ సింగమ్‌గా అజయ్ దేవగన్ విజృంభించారు. 2011లో విడుదలైన ఈ చిత్రం బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. ఆ తర్వాత అజయ్ దేవగన్–రోహిత్ శెట్టి కాంబినేషన్లోనే ‘సింగమ్’కి సీక్వెల్‌గా ‘సింగమ్ రిటర్న్స్’ (2014) రూపొంది, సూపర్‌హిట్‌గా నిలిచింది. ‘సింగమ్ రిటర్న్స్’ విడుదలైన దాదాపు పదేళ్లకు ఈ ఫ్రాంచైజీలో భాగంగా ‘సింగమ్ ఎగైన్’ పేరుతో ఓ మూవీ రూపొందుతోంది. అజయ్ దేవగన్ హీరోగా ఈ చిత్రానికి కూడా రోహిత్ శెట్టియే దర్శకత్వం వహిస్తున్నారు. ప్రస్తుతం చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ సినిమా ఆగస్టులో రిలీజ్ కానుందని సమాచారం. అదే విధంగా అజయ్ దేవగన్ హీరోగా రాజ్‌కుమార్ గుప్తా దర్శకత్వంలో వచ్చిన ‘రైడ్’ (2018) మూవీ ఘనవిజయం సాధించింది. దాదాపు ఆరేళ్ల తర్వాత ఈ చిత్రానికి సీక్వెల్‌గా ‘రైడ్ 2’ తెరకెక్కుతోంది. అజయ్ దేవగన్ హీరోగా డైరెక్టర్ రాజ్‌కుమార్ గుప్తా తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో వాణీ కపూర్, రితేశ్ దేశ్‌ముఖ్ కీలక పాత్రధారులు. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా నవంబర్ 15న రిలీజ్ కానుంది. ఇదిలా ఉంటే.. ‘సింగమ్’ వంటి హిట్ సీక్వెల్స్ ఇచ్చిన హీరో అజయ్ దేవగన్–దర్శకుడు రోహిత్ శెట్టి కాంబినేషన్లో వచ్చిన మరో చిత్రం ‘గోల్మాల్’ (2006) ఘనవిజయం సాధించింది. ఈ చిత్రానికి సీక్వెల్‌గా అజయ్ దేవగన్–రోహిత్ శెట్టి కాంబినేషన్లోనే వచ్చిన ‘గోల్మాల్ రిటర్న్స్’ (2008) సూపర్ హిట్ అయింది. ‘గోల్మాల్’ ఫ్రాంచైజీలో ‘గోల్మాల్ 3’ (2010), ‘గోల్మాల్ 4’ (2017) కూడా వచ్చాయి. ‘గోల్మాల్ 5’ రానుంది. అజయ్ దేవగన్–రోహిత్ శెట్టి కాంబినేషన్లోనే రానున్న ఈ చిత్రానికి సంబంధించి ఇప్పటికే స్క్రిప్ట్ వర్క్ పూర్తయిందట. ఇకపోతే అజయ్ దేవగన్, రకుల్ ప్రీత్‌సింగ్, టబు ప్రధాన పాత్రల్లో నటించిన రొమాంటిక్ కామెడీ చిత్రం ‘దే దే ప్యార్ దే’. అకివ్ అలీ దర్శకత్వం వహించిన ఈ సినిమా 2019లో రిలీజై సూపర్ హిట్ అయింది. దాదాపు ఐదేళ్లకి ‘దే దే ప్యార్ దే 2’ సినిమాని ప్రకటించారు మేకర్స్. ఇందులోనూ అజయ్ దేవగన్ లీడ్ రోల్లో నటించనున్నారు. అయితే ‘దే దే ప్యార్ దే’కి అకివ్ అలీ దర్శకత్వం వహించగా.. ‘దే దే ప్యార్ దే 2’ మూవీని కొత్త దర్శకుడు అన్షుల్ శర్మ తెరకెక్కించనున్నారు. ఈ చిత్రాన్ని 2025 మే 1న విడుదల చేయనున్నట్లు యూనిట్ ప్రకటించింది. అలాగే అజయ్ దేవగన్ హీరోగా అశ్వినీ ధీర్ దర్శకత్వం వహించిన యాక్షన్ కామెడీ చిత్రం ‘సన్ ఆఫ్ సర్దార్’. 2012లో విడుదలైన ఈ సినిమా సూపర్ హిట్‌గా నిలిచింది. సునీల్ హీరోగా రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన ‘మర్యాద రామన్న’ (2010) చిత్రానికి ఇది రీమేక్. ఇక ‘సన్ ఆఫ్ సర్దార్’ వచ్చిన పుష్కరం తర్వాత సీక్వెల్‌గా ‘సన్ ఆఫ్ సర్దార్ 2’ తెరకెక్కనుంది. తొలి భాగానికి అశ్వినీ ధీర్ దర్శకత్వం వహించగా, మలి భాగాన్ని డైరెక్టర్ విజయ్ కుమార్ అరోరా తెరకెక్కించనున్నారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ మూవీ ఈ ఏడాదిలోనే సెట్స్‌పైకి వెళ్లనుంది. అలాగే 2025లో ఈ సినిమాని రిలీజ్ చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. అదే విధంగా మలయాళ హిట్ మూవీ ‘దృశ్యం’ హిందీ రీమేక్‌లో అజయ్ దేవగన్ హీరోగా నటించారు. నిషికాంత్ కామత్ దర్శకత్వం వహించిన క్రైమ్ థ్రిల్లర్ ‘దృశ్యం’ (2015) హిట్‌గా నిలిచింది. ఈ చిత్రం విడుదలైన దాదాపు ఏడేళ్లకు ‘దృశ్యం 2’ రిలీజైంది. అజయ్ దేవగన్ లీడ్ రోల్లో నటించిన ఈ మూవీకి అభిషేక్ పాఠక్ దర్శకత్వం వహించారు. ఇదే ఫ్రాంచైజీలో మలయాళంలో ‘దృశ్యం 3’ రానుంది. ఈ చిత్రం హిందీ రీమేక్‌లో కూడా అజయ్ దేవగన్ నటిస్తారని సమాచారం. ఇదిలా ఉంటే వికాస్ బాల్ దర్శకత్వంలో అజయ్ దేవగన్ హీరోగా నటించిన ‘సైతాన్’ చిత్రం గత నెల 8న రిలీజై బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. ఈ చిత్రానికి సీక్వెల్‌గా ‘సైతాన్ 2’ రానుంది. ఇంకా ఇంద్రకుమార్ దర్శకత్వంలో అజయ్ దేవగన్ ఓ హీరోగా నటించిన ‘ధమాల్’ (2007)తో పాటు ‘డబుల్ ధమాల్’ (2011), ‘టోటల్ ధమాల్’ (2019) మంచి విజయాన్ని సొంతం చేసుకున్నాయి. ‘ధమాల్ 4’ కూడా రానుందని సమాచారం. ఇంద్రకుమార్ దర్శకత్వంలోనే అజయ్ దేవగన్ ఓ హీరోగా ఈ నాలుగో భాగం ఉంటుందని టాక్. ఇలా వరుసగా సీక్వెల్స్‌కి సైన్ చేసిన అజయ్ దేవగన్ హీరోగా నటించిన తాజా చిత్రం ‘మైదాన్’ ఈ నెల 10న విడుదల కానుంది. ఈ చిత్రంలో ఆయన ఫుట్‌బాల్ కోచ్‌గా కనిపించనున్నారు. -
హాలీవుడ్లో సీక్వెల్ జోరు
హాలీవుడ్లో సీక్వెల్ అనగానే దాదాపు అందరి దృష్టి ‘అవతార్’ మీద ఉంటుంది. దర్శకుడు జేమ్స్ కామెరూన్ అద్భుత సృష్టి ‘అవతార్’ తొలి భాగం 2009లో రాగా, రెండో భాగం రావడానికి పదమూడేళ్లు (2022) పట్టింది. మూడు, నాలుగు, ఐదు భాగాలను ప్రకటించారు కామెరూన్. మూడో భాగం ఈ ఏడాది విడుదల కావాల్సి ఉండగా వచ్చే ఏడాదికి వాయిదా పడింది. ‘అవతార్’ అభిమానులను ఇది నిరాశపరిచే విషయమే. అయితే ఈ ఏడాది దాదాపు పది సీక్వెల్స్ రానున్నాయి. పలు హిట్ చిత్రాలకు కొనసాగింపుగా రానున్న ఆ సీక్వెల్స్ గురించి తెలుసుకుందాం. సమ్మర్లో సైన్స్ ఫిక్షన్ ఈ వేసవికి రానున్న సైన్స్ ఫిక్షన్ చిత్రం ‘కింగ్డమ్ ఆఫ్ ది ప్లానెట్ ఆఫ్ ది ఏప్స్’. ‘వార్ ఫర్ ది ప్లానెట్ ఆఫ్ ది ఏప్స్’ (2017)కి సీక్వెల్‌గా ఈ చిత్రం రూపొందింది. ‘ప్లానెట్ ఆఫ్ ది ఏప్స్’ ఫ్రాంచైజీలో ఇది నాలుగో భాగం. మూడు భాగాలూ సూపర్ హిట్టయిన నేపథ్యంలో తాజా చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి. వెస్ బాల్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో విలియమ్ టీగ్, ఫ్రెయా అలన్ తదితరులు నటించారు. మే 10న ఈ చిత్రం రిలీజ్ కానుంది. ఫుల్ యాక్షన్‌తో బ్యాడ్ బాయ్స్ జూన్‌లో బ్యాడ్ బాయ్స్ తెరపైకి రానున్నారు. బడ్డీ కాప్ యాక్షన్ కామెడీ నేపథ్యంలో రూపొందిన చిత్రం ‘బ్యాడ్ బాయ్స్: రైడ్ ఆర్ డై’. 2003లో వచ్చిన ‘బ్యాడ్ బాయ్స్’కి నాలుగో భాగం ఇది. మూడో భాగం ‘బ్యాడ్ బాయ్స్ ఫర్ లైఫ్’ (2020) విడుదలైన నాలుగేళ్లకు వస్తోన్న సీక్వెల్ ఇది. ఈ చిత్రంలో డిటెక్టివ్ ల్యూటినెంట్ మైఖేల్‌గా లీడ్ రోల్‌ని విల్ స్మిత్ చేశారు. రెండో, మూడో భాగానికి దర్శకత్వం వహించిన ఆదిల్, బిలాల్ ద్వయం తాజా చిత్రాన్ని కూడా తెరకెక్కించారు. నాలుగు భాగాల్లోనూ మైఖేల్ పాత్రను విల్ స్మిత్‌నే చేశారు. యాక్షన్, కామెడీతో రూపొందిన ఈ చిత్రం జూన్ 7న రిలీజ్ కానుంది. ఆరేళ్లకు డెడ్‌పూల్ ఈ ఏడాది అత్యంత భారీ అంచనాలు ఏర్పడ్డ సీక్వెల్ చిత్రాల్లో ‘డెడ్‌పూల్ 3’ది ప్రముఖ స్థానం. ర్యాన్ రేనాల్డ్స్ టైటిల్ రోల్లో షానీ లెవీ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ఇది. మార్వెల్ కామిక్ బుక్స్‌లోని డెడ్‌పూల్ క్యారెక్టర్ ఆధారంగా రూపొందిన తొలి చిత్రం ‘డెడ్‌పూల్’ (2016). టిమ్ మిల్లర్ దర్శకత్వం వహించిన ఈ సూపర్ హీరో ఫిల్మ్ సూపర్ హిట్టయింది. ఈ చిత్రానికి సీక్వెల్‌గా షానీ లెవీ దర్శకత్వంలో రూపొందిన ‘డెడ్‌పూల్ 2’ (2018) కూడా బంపర్ హిట్. ఆరేళ్లకు మూడో భాగం ‘డెడ్‌పూల్ అండ్ వుల్వరిన్’ వస్తోంది. మూడు భాగాల్లోనూ డెడ్‌పూల్ పాత్రను ర్యాన్ రేనాల్డ్స్ చేశారు. జూలై 26న ఈ చిత్రం రిలీజ్ కానుంది. హారర్ జూయిస్ దాదాపు మూడు దశాబ్దాల క్రితం వచ్చిన ఫ్యాంటసీ హారర్ కామెడీ మూవీ ‘బీటిల్ జూయిస్’ (1988) సంచలన విజయం సాధించింది. టిమ్ బర్టన్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో బీటిల్ జూయిస్ పాత్రను మైఖేల్ కీటన్ పోషించారు. దాదాపు 35 ఏళ్లకు ఈ చిత్రానికి సీక్వెల్‌గా టిమ్ బర్టన్ దర్శకత్వంలోనే ‘బీటిల్ జూయిస్ 2’ రూపొందింది. సీక్వెల్లోనూ బీటిల్ జూయిస్ పాత్రను మైఖేల్ కీటన్ చేశారు. సెప్టెంబర్ 6న ఈ చిత్రం విడుదల కానుంది. అక్టోబర్‌లో జోకర్ అక్టోబర్ నెల రెండు సీక్వెల్స్‌ని చూపించనుంది. ఒకటి ‘జోకర్’ సీక్వెల్... మరోటి ‘వెనమ్’ సీక్వెల్. అమెరికన్ కామిక్స్ ఆధారంగా మ్యూజికల్ సైకలాజికల్ థ్రిల్లర్‌గా రూపొందిన చిత్రం ‘జోకర్’ (2019). టాడ్ ఫిలిప్స్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో జోకర్ అనే ఆర్థర్ ఫ్లెక్స్ పాత్రను జోక్విన్ ఫీనిక్స్ పోషించారు. ఇప్పుడు ఇదే కాంబినేషన్లో ‘జోకర్’కి సీక్వెల్‌గా ‘జోకర్: ఫోలీ ఎ డ్యూక్స్’ చిత్రం రూపొందింది. అక్టోబర్ 4న ఈ జోకర్ తెరపైకి రానున్నాడు. ఇదే ఆఖరి వెనమ్ కొలంబియా పిక్చర్స్ నిర్మించిన స్పైడర్‌మేన్ యూనివర్స్‌లో ఆరో చిత్రం ‘వెనమ్: ది లాస్ట్ డ్యాన్స్. ‘వెనమ్’ (2018), ‘వెనమ్: లెట్ దేర్ బీ కార్నేజ్’ (2021) చిత్రాలకు సీక్వెల్ ఇది. ఈ మూడో భాగంతో ‘వెనమ్’ సీక్వెల్ ముగుస్తుందని టాక్. కెల్లీ మార్సెల్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్ వెనమ్ పాత్రను టామ్ హార్డీ పోషించారు. ఈ చిత్రం జూలైలోనే రిలీజ్ కావాల్సింది. అయితే వేతనాల పెంపుకి రచయితలు చేపట్టిన సమ్మె వల్ల వాయిదా పడింది. అక్టోబర్ 25న ఈ చిత్రం రిలీజ్ కానుంది. రెండు దశాబ్దాలకు గ్లాడియేటర్ రెండు దశాబ్దాల క్రితం వచ్చిన హిస్టారికల్ డ్రామా ‘గ్లాడియేటర్’ (2000) అనూహ్యమైన విజయం సాధించింది. రిడ్లీ స్కాట్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో రసెల్ క్రో, జోక్విన్ ఫీనిక్స్ తదితరులు నటించారు. పెట్టిన పెట్టుబడికి నాలుగింతలు వసూలు చేసింది. ఈ చిత్రానికి సీక్వెల్‌గా రిడ్లీ స్కాట్ దర్శకత్వంలోనే రూపొందిన ‘గ్లాడియేటర్ 2’ నవంబర్ 22న రిలీజ్ కానుంది. పౌల్ మెస్కల్, డెంజల్ వాషింగ్టన్ తదితరులు నటించారు. ఈ చిత్రాలతో పాటు యాక్షన్ అడ్వెంచర్ కామెడీ మూవీ ‘సోనిక్ ది హెడ్హాగ్ 3’ డిసెంబర్ 20న, అదే రోజున యానిమేటెడ్ మూవీ ‘హూ ఫ్రేమ్డ్ రాగర్ రాబిట్ 2’, ‘ది కరాటే కిడ్’ ఆరో భాగం డిసెంబర్ 13న... ఇంకా వీటితో పాటు ఈ ఏడాది మరికొన్ని సీక్వెల్స్ వచ్చే చాన్స్ ఉంది. -
కల నిజమైంది
హీరో విశాల్ దర్శకుడిగా మారారు. 2017లో విశాల్ హీరోగా నటించి, నిర్మించిన చిత్రం ‘తుప్పరివాలన్ ’ (తెలుగులో ‘డిటెక్టివ్’). మిస్కిన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం అప్పట్లో బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. ఈ సినిమాకు సీక్వెల్‌గా ‘డిటెక్టివ్ 2’ను ప్లాన్ చేశారు విశాల్. అయితే కొంతకాలం క్రితం క్రియేటివ్ డిఫరెన్సెస్ వల్ల ఈ ప్రాజెక్ట్ నుంచి మిస్కిన్ తప్పుకున్నారు. దీంతో ‘డిటెక్టివ్ 2’ కోసం విశాల్ దర్శకుడిగా మారారు. ‘‘డైరెక్టర్ కావాలన్న నా కల నిజమైంది. నా దర్శకత్వంలో రానున్న తొలి సినిమా ‘తుప్పరివాలన్ 2’. ఈ సినిమా కోసం లండన్ వెళ్తున్నాను. అజర్బైజాన్ , మల్తా లొకేషన్స్ లో చిత్రీకరణ జరగుతుంది. నా కలను నాకు మరింత చేరువ చేసిన మిస్కిన్ గారికి ధన్యవాదాలు’’ అంటూ ‘ఎక్స్’లో షేర్ చేశారు విశాల్. ఇక విశాల్ నటించిన లేటెస్ట్ మూవీ ‘రత్నం’ ఏప్రిల్ 26న విడుదల కానుంది. హరి దర్శకత్వం వహించిన ఈ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ డైరెక్టర్. -
లియో డైరెక్టర్ సూపర్ హిట్ మూవీ.. సీక్వెల్‌పై క్రేజీ అప్డేట్!
కోలీవుడ్ స్టార్ హీరో కార్తీ గతంలో నటించిన చిత్రం ఖైదీ. లోకేశ్ కనకరాజ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని డ్రీమ్ వారియర్స్ సంస్థ నిర్మించింది. హీరోయిన్ అంటూ ఎవరూ లేని ఈ చిత్రం రగ్గడ్ పాత్రలో నటించిన కార్తీలోని మరో నటుడిని ఆవిష్కరించింది. 2019లో విడుదలైన ఖైదీ చిత్రం బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. అయితే దీనికి సీక్వెల్ ఉంటుందని.. దర్శకుడు లోకేశ్ కనకరాజ్, కార్తీ చెబుతూ వస్తున్నారు. అయితే ప్రస్తుతం వీరిద్దరూ చాలా బిజీగా ఉన్నారు. రియో చిత్రం తరువాత దర్శకుడు లోకేశ్ కనకరాజ్ సూపర్‌స్టార్ రజనీకాంత్ 171వ చిత్రానికి దర్శకత్వం వహించడానికి సిద్ధమయ్యారు. ఈ క్రేజీ చిత్రానికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఇక నటుడు కార్తీ చేతి నిండా చిత్రాలతో బిజీగా ఉన్నారు. ఆయన ఇటీవల నటించిన జపాన్ చిత్రం నిరాశ పరిచినా.. ప్రస్తుతం నలన్ కుమారసామి దర్శకత్వంలో వావాద్థియారే అనే చిత్రంతోపాటు 96 చిత్రం ఫేమ్ ప్రేమ్‌కుమార్ దర్శకత్వంలో చేస్తున్నారు. దీని తరువాత సర్ధార్– 2 చిత్రం లైన్లో ఉన్నట్లు సమాచారం. దీంతో ఖైదీ 2 చిత్రం ఎప్పుడు ప్రారంభం అవుతుందన్న ప్రశ్నకు ఇటీవల ఒక కార్యక్రమంలో పాల్గొన్న నటుడు కార్తీ క్లారిటీ ఇచ్చారు. ప్రస్తుతం తాను అంగీకరించిన చిత్రాలను పూర్తి చేసిన తరువాత ఖైదీ-2 చిత్రంలో నటిస్తానని చెప్పారు. ఈ లోగా దర్శకుడు లోకేశ్‌కనకరాజ్ రజనీకాంత్ హీరోగా నటించే చిత్రాన్ని పూర్తి చేస్తారని పేర్కొన్నారు. కాగా ఖైదీ– 2 చిత్రం వచ్చే ఏడాది ప్రారంభం అవుతుందని కార్తీ స్పష్టం చేశారు. -
సలార్ 'శౌర్యంగపర్వం' యాక్షన్‌తో స్టార్ట్
‘సలార్’ రెండో భాగం ‘సలార్: శౌర్యంగపర్వం’ షూటింగ్‌కు రెడీ చేస్తున్నారు దర్శకుడు ప్రశాంత్ నీల్. ప్రభాస్ హీరోగా నటించిన ‘సలార్’ సినిమాలోని తొలి భాగం ‘సలార్: సీజ్ఫైర్’ గత ఏడాది డిసెంబరులో విడుదలై, సూపర్ హిట్‌గా నిలిచింది. దీంతో వెంటనే ‘సలార్’ రెండో భాగం ‘సలార్: శౌర్యంగపర్వం’ పనులను ఆరంభించారు ప్రశాంత్ నీల్. ప్రీ ప్రోడక్షన్ వర్క్ పూర్తి కావస్తుండటంతో ఏప్రిల్‌లో షూటింగ్‌ని ఆరంభించాలనుకుంటున్నారని తెలిసింది. ముందుగా యాక్షన్ సీక్వెన్స్ చిత్రీకరిస్తారట ప్రశాంత్ నీల్. శ్రుతీహాసన్ హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రంలో పృథ్వీరాజ్ సుకుమారన్, జగపతిబాబు, బాబీ సింహా, శ్రియా రెడ్డి, ఈశ్వరీ రావు కీలక పాత్రలు పోషిస్తున్నారు. విజయ్ కిరగందూర్ నిర్మిస్తున్న ఈ చిత్రం 2025 చివర్లో విడుదల కానుందని సమాచారం. -
జై హనుమాన్తో ప్రేక్షకుల రుణం తీర్చుకుంటాను
‘‘చిత్ర పరిశ్రమలో 50 రోజుల పండగ చూసి చాలా కాలమైంది. అది మా ‘హనుమాన్’ సినిమాకి జరగడం హ్యాపీగా ఉంది. ‘హనుమాన్’కి సీక్వెల్‌గా ‘జై హనుమాన్’ వర్క్ ఆరంభమైంది. ‘హనుమాన్’కి ప్రేక్షకులు ఇచ్చిన విజయాన్ని బాధ్యతగా తీసుకొని ‘జై హనుమాన్’తో వారి రుణం తీర్చుకుంటాను’’ అని డైరెక్టర్ ప్రశాంత్ వర్మ అన్నారు. తేజ సజ్జా, అమృతా అయ్యర్ జంటగా ప్రశాంత్ వర్మ దర్శకత్వం వహించిన చిత్రం ‘హనుమాన్’. కె. నిరంజన్ రెడ్డి నిర్మించిన ఈ సినిమా జనవరి 12న విడుదలై, 50 రోజులు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా యూనిట్ ‘హిస్టారిక్ 50 డేస్ సెలబ్రేషన్స్’ని హైదరాబాద్‌లో నిర్వహించింది. ప్రశాంత్ వర్మ మాట్లాడుతూ– ‘‘నిర్మాతలు, దర్శకులు, నటీనటులు, పంపిణీదారులు, థియేటర్స్.. ఇలా చాలామంది జీవితాలను ఒక సక్సెస్ఫుల్ సినిమా మారుస్తుంది. అది సెలబ్రేట్ చేసుకోవడం చాలా ముఖ్యం. ‘హనుమాన్’ లాంటి సినిమా 150 థియేటర్స్‌లో 50 రోజులు ఆడిందనే విషయం చాలామందికి మంచి సినిమాపై నమ్మకాన్ని కలిగిస్తుంది.. అందుకే ఈ వేడుక చాలా ముఖ్యం. ఈ సినిమాని త్వరలో అంతర్జాతీయ స్థాయిలో రిలీజ్ చేయనున్నాం. ఈ సినిమా ప్రపంచ దేశాల్లో కూడా తెలుగు సినిమా గొప్పతనం చాటనుంది. దీనికి కారణం మా నిర్మాత నిరంజన్‌గారి విజన్’’ అన్నారు. ‘‘మా సినిమాని ఆదరించిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు’’ అన్నారు తేజ సజ్జా. ‘‘ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ నుంచి వచ్చిన మొదటి సినిమానే (హనుమాన్) ఇంత పెద్ద విజయం సాధించడం హ్యాపీగా ఉంది. ‘హనుమాన్’కి పని చేసిన నటీనటులు, సాంకేతిక నిపుణులందరికీ ధన్యవాదాలు’’ అన్నారు నిరంజన్ రెడ్డి. -
అసలు కథ ఇప్పుడే మొదలైంది!
ఓ సినిమా ప్రేక్షకులకు కనెక్ట్ అయితే ఆ కథకు సీక్వెల్ తీసే పనిలో ఉంటారు. అయితే కొనసాగించాలంటే కథలో స్కోప్ ఉండాలి. పైగా ‘అసలు కథ ఇప్పుడే మొదలైంది’ అన్నట్లుగా ఉండాలి. అలా కొన్ని చిత్రాలకు స్కోప్ దొరికింది. ‘అసలు కథ ఇప్పుడే మొదలైంది’ అన్నట్లు తొలి భాగం చివర్లో ట్విస్ట్ ఇచ్చి, మలి భాగం రూపొందించే పనిలో ఉన్నారు. ఈ ఏడాది అరడజనుకు పైగా సీక్వెల్ చిత్రాలు రానున్నాయి. ఈ రెండు భాగాల చిత్రాల గురించి తెలుసుకుందాం... స్వాతంత్య్రం రాక ముందు... సేనాపతి వీరశేఖరన్, అతని కొడుకు చంద్రబోస్ సేనాపతిల కథలను ‘ఇండియన్’ (1996) సినిమాలో చూశాం. ఈ రెండు పాత్రల్లోనూ కమల్‌హాసన్ నటించారు. శంకర్ దర్శకత్వం వహించారు. పాతికేళ్ల తర్వాత ‘ఇండియన్’కు సీక్వెల్‌గా కమల్‌హాసన్, శంకర్ కాంబినేషన్లోనే ‘ఇండియన్ 2’ రూపొందుతోంది. ఇందులోనూ కమల్‌ది ద్విపాత్రాభినయం. ఈ చిత్రంలో సేనాపతికి, అతని తండ్రికి మధ్య జరిగే కథను చూపిస్తారట శంకర్. అంటే.. కథ దేశ స్వాతంత్య్రానికి పూర్వం ఉంటుందని తెలుస్తోంది. అలాగే ప్రస్తుత కాలాన్ని కూడా కనెక్ట్ చేశారట. ‘ఇండియన్ 2’ ఏప్రిల్‌లో విడుదల కానుందని తెలిసింది. మిత్రులే శత్రువులు ఎంతోమంది జీవితాలను మార్చిన ఖాన్సార్ (‘సలార్’ చిత్రం కోసం క్రియేట్ చేసిన ప్రాంతం) ఇద్దరు మిత్రులు దేవరథ, వరదరాజ మన్నార్లను మాత్రం శత్రువులుగా చేసింది. మరి... ఈ మిత్రులు ఎందుకు శత్రువులు కావాల్సి వచ్చిందనే కథను ‘సలార్’ మలి భాగం ‘సలార్: శౌర్యాంగ పర్వం’లో చూడాలంటున్నారు ఈ చిత్రదర్శకుడు ప్రశాంత్ నీల్. ప్రభాస్ హీరోగా దేవరథ పాత్రలో నటిస్తుండగా, దేవ మిత్రుడు వరదరాజ మన్నార్‌గా పృథ్వీరాజ్ సుకుమారన్ నటిస్తున్నారు. విజయ్ కిరగందూర్ నిర్మిస్తున్న ‘సలార్: శౌర్యాంగపర్వం’ చిత్రం ఈ ఏడాది చివర్లో లేదా వచ్చే ఏడాది ్రపారంభంలో రిలీజయ్యే చాన్స్ ఉంది. ఇక హీరో ప్రభాస్, దర్శకుడు ప్రశాంత్ నీల్ కాంబినేషన్లోని ‘సలార్’లోని తొలి భాగం ‘సలార్: సీజ్ఫైర్’ బ్లాక్‌బస్టర్‌గా నిలిచిన సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి సీక్వెల్‌గా ‘సలార్: శౌర్యాంగ పర్వం’ రానుంది. పుష్పగాడి రూల్ ‘పుష్ప’ సినిమాలో సిండికేట్ రూల్స్‌ను దాటి హెడ్ అయ్యాడు పుష్పరాజ్. మరి.. సిండికేట్ మెంబర్స్‌కు పుష్పరాజ్ ఎలాంటి రూల్స్ పాస్ చేశాడు? ఈ రూల్స్‌ను ఎవరైనా బ్రేక్ చేయాలనుకుంటే పుష్పరాజ్ ఏం చేసాడనేది ‘పుష్ప: ది రూల్’ చిత్రంలో చూడొచ్చు. పుష్పరాజ్ పాత్రలో అల్లు అర్జున్ నటిస్తున్నారు. సుకుమార్ దర్శకత్వంలో నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్‌లు నిర్మిస్తున్న ఈ చిత్రం ఆగస్టు 15న రిలీజ్ కానుంది. ‘పుష్ప: ది రైజ్’కు సీక్వెల్‌గా ‘పుష్ప: ది రూల్’ రూపొందుతోంది. డబుల్ ఇస్మార్ట్ కిరాయి రౌడీ ఇస్మార్ట్ శంకర్‌కు సీబీఐ ఆఫీసర్ అరుణ్ మెమొరీని సైంటిఫిక్‌గా ఇంజెక్ట్ చేసి, చిప్ పెడితే ఏం జరుగుతుంది? అనేది ‘ఇస్మార్ట్ శంకర్’ సినిమా కథ. ఈ చిత్రానికి పూరి జగన్నాథ్ దర్శకుడు. రామ్ టైటిల్ రోల్ చేయగా, సీబీఐ ఆఫీసర్ అరుణ్గా సత్యదేవ్ నటించారు. 2019లో విడుదలైన ‘ఇస్మార్ట్ శంకర్’కి సీక్వెల్‌గా ‘డబుల్ ఇస్మార్ట్’ చేస్తున్నారు రామ్, పూరి. కాగా అరుణ్ జ్ఞాపకశక్తి పూర్తిగా శంకర్‌కు వచ్చేస్తే ఏం జరుగుతుంది? ఓ కిరాయి రౌడీ సీబీఐ ఆఫీసర్ అయితే ఏం చేస్తాడు? శంకర్ నిజంగానే గతం మర్చిపోతాడా? ఈ ప్రశ్నలకు సమాధానం మార్చి 18న రిలీజయ్యే ‘డబుల్ ఇస్మార్ట్’ చూస్తే తెలుస్తుంది. యాత్ర 2 ఆంధ్రప్రదేశ్ దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి జీవితంలోని కొన్ని ఘటనలు, ఆయన పాద యాత్ర నేపథ్యంలో రూపొందిన హిట్ ఫిల్మ్ ‘యాత్ర’. మహి వి. రాఘవ్ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. తాజాగా ‘యాత్ర’ సినిమాకు సీక్వెల్‌గా ‘యాత్ర 2’ తెరకెక్కించారు మహి వి. రాఘవ్. వైఎస్ రాజశేఖర రెడ్డి తనయుడు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజా నేతగా ఎదిగిన తీరు, 2009 నుంచి 2019 వరకు ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన రాజకీయ ఘటనల ఆధారంగా ‘యాత్ర 2’ రూపొందింది. ఈ చిత్రంలో వైఎస్ రాజశేఖరరెడ్డి పాత్రలో మమ్ముట్టి నటించగా, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పాత్రలో తమిళ నటుడు జీవా నటించారు. శివ మేక నిర్మించిన ఈ చిత్రం ఫిబ్రవరి 9న విడుదల కానుంది. రెట్టింపు వినోదం డీజే టిల్లుగానితో ఎట్లుంటదో ‘డీజే టిల్లు’ సినిమాలో చూశారు ఆడియన్స్. 2022లో విడుదలైన ఈ సినిమా బంపర్ హిట్ సాధించింది. దీంతో ఈ సినిమాకు సీక్వెల్‌గా ‘డీజే టిల్లు స్క్వేర్’ రానుంది. ‘డీజే టిల్లు’లో టైటిల్ రోల్‌ని సిద్ధు జొన్నలగడ్డ చేయగా, విమల్ కృష్ణ దర్శకత్వం వహించారు. సీక్వెల్లో సిద్ధూనే హీరో. అయితే మల్లిక్ రామ్ దర్శకత్వం వహిస్తున్నారు. సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్న ఈ చిత్రం ఫిబ్రవరి 9న విడుదల కావాల్సింది. కానీ వాయిదా పడిందని తెలుస్తోంది. గూఢచారి 2 ఏజెంట్ గోపీ 116 అనగానే తెలుగు ప్రేక్షకులకు అడివి శేష్ స్పై థ్రిల్లర్ ‘గూఢచారి’ సినిమా గుర్తుకు వస్తుంది. 2018లో విడుదలైన ఈ సినిమా బంపర్ హిట్. శశికిరణ్ తిక్క దర్శకుడు. ప్రస్తుతం ‘గూఢచారి 2’తో బిజీగా ఉన్నారు అడివి శేష్. వినయ్ కుమార్ ఈ సినిమాకు దర్శకుడు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్, ఏకే ఎంటర్టైన్మెంట్స్ నిర్మిస్తున్న ‘గూఢచారి 2’ ఈ ఏడాది చివర్లో విడుదలయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. ► గృహిణి, యూ ట్యూబర్ అనుపమా మోహన్‌గా ‘భామా కలాపం’లో మెప్పించారు ప్రియమణి. డైరెక్ట్‌గా ఓటీటీలో విడుదలైన ఈ సినిమాకు వ్యూయర్స్ నుంచి మంచి స్పందన లభించింది. ఈ సినిమాకు సీక్వెల్‌గా ‘భామాకలాపం 2’ను రెడీ చేస్తున్నారు. బాపినీడు, సుధీర్ ఈదర నిర్మిస్తున్న ఈ సినిమాకు అభిమన్యు దర్శకుడు. అలాగే అంజలి నటించిన తొలి ఉమెన్ సెంట్రిక్ ఫిల్మ్ ‘గీతాంజలి’. రాజ్‌కిరణ్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం 2014లో విడుదలై, మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ సినిమాకు సీక్వెల్‌గా ‘గీతాంజలి మళ్ళీ వచ్చింది’ తెరకెక్కుతోంది. రచయిత, నిర్మాత కోన వెంకట్ సమర్పణలో ఎంవీవీ సత్యనారాయణ, జీవీ నిర్మిస్తున్న ఈ సీక్వెల్‌కు శివ తుర్లపాటి దర్శకుడు. అలాగే అనుష్కా శెట్టి హిట్ ఫిల్మ్ ‘భాగమతి’కు సీక్వెల్‌గా ‘భాగమతి 2’ తెరకెక్కనుంది. ► ‘బింబిసార 2’, ‘డెవిల్ 2’ ఉంటాయన్నట్లగా కల్యాణ్ రామ్ పేర్కొన్నారు. ‘మ్యాడ్ 2’ ‘మత్తు వదలరా 2’ చిత్రాల స్క్రిప్ట్ వర్క్ జరగుతోంది. ‘హను–మాన్’కు సీక్వెల్‌గా ‘జై హను–మాన్’ను ప్రశాంత్ వర్మ ప్రకటించారు. ‘రాక్షసుడు 2’ని దర్శకుడు రమేశ్ వర్మ ఆల్రెడీ ప్రకటించారు . ఇంకొన్ని సీక్వెల్ చిత్రాలున్నాయి. -
డీజే టిల్లు మూవీ సీక్వెల్..?
-
వేసవిలో వస్తున్నాడు
హీరో కమల్‌హాసన్, దర్శకుడు శంకర్ కాంబినేషన్లో రూపొందుతున్న తాజా చిత్రం ‘ఇండియన్ 2’. వీరి కాంబినేషన్లోనే 1996లో వచ్చిన ‘ఇండియన్’ సినిమాకు ఇది సీక్వెల్. కాజల్ అగర్వాల్ హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రంలో ఎస్జే సూర్య, సిద్ధార్థ్, ప్రియా భవానీ శంకర్, రకుల్‌ప్రీత్ సింగ్ కీలక పాత్రధారులు. ఈ సినిమా చిత్రీకరణ తుది దశకు చేరుకుంది. ఇటీవల చెన్నైలో మొదలైన ‘ఇండియన్ 2’ భారీ షెడ్యూల్ చిత్రీకరణ ముగిసిందని, ఈ షూటింగ్ షెడ్యూల్‌తో టాకీ పార్టు పూర్తయిందని సమాచారం. బ్యాలెన్స్ ఉన్న రెండు పాటలను కూడా చిత్రీకరిస్తే షూటింగ్ మొత్తం పూర్తవుతుందని టాక్. ఈ చిత్రాన్ని వేసవిలో విడుదల చేయాలనుకుంటున్నారట. -
'సలార్' సీక్వెల్‌కి అదిరిపోయే టైటిల్.. అసలు కథంతా ఇందులోనే!
డార్లింగ్ ప్రభాస్.. ఫ్యాన్స్ ఆకలి తీర్చేశాడు. 'సలార్' దెబ్బకు థియేటర్లన్నీ మాస్ మేనియాతో హోరెత్తిపోతున్నాయి. అయితే థియేటర్లలో 'సలార్: పార్ట్-1' చూసిన తర్వాత కొందరు ఫుల్ జోష్‌లో ఉండగా, మరికొందరు మాత్రం కథ విషయంలో కాస్త డిసప్పాయింట్ అయ్యారు. అయితే అసలు స్టోరీ అంతా సీక్వెల్లోనే ఉండనుందని తెలుస్తోంది. ఇంతకీ ఆ స్టోరీ ఏంటంటే? గత కొన్నాళ్ల నుంచి సీక్వెల్ ట్రెండ్ అనేది కొనసాగుతోంది. 'సలార్'ని కూడా అలా రెండు భాగాలుగా విడగొట్టారు. అయితే తాజాగా రిలీజైన పార్ట్-1లో దేవ పాత్రలో ప్రభాస్‌ని చూపించారు. ఆద్య(శృతి హాసన్)ని విలన్స్ బారి నుంచి కాపాడటం లాంటి సీన్స్‌తో ఫస్టాప్.. వరదరాజ మన్నార్(పృథ్వీరాజ్ సుకుమారన్) కోసం ఎంతకైనా తెగించే ప్రాణ స్నేహితుడు దేవాగా ప్రభాస్‌ని సెకండాఫ్‌లో చూపించారు. చివర్లో సీక్వెల్‌కి 'సలార్: శౌర్వంగ పర్వం' అనే క్రేజీ టైటిల్ ఫిక్స్ చేశారు. (ఇదీ చదవండి: హడావుడి లేకుండా ఓటీటీలోకి వచ్చేసిన ఆ తెలుగు సినిమా) ఇప్పుడు రిలీజైన 'సలార్ పార్ట్-1: సీజ్ఫైర్'లో చాలావరకు ప్రశ్నలు వదిలేశారు. శౌర్వంగ పర్వం అంటే ఏంటి? బెస్ట్ ఫ్రెండ్స్ అయిన దేవా-వరదా ఎందుకు బద్ధ శత్రువులుగా మారారు? ఖాన్సార్ సామ్రాజ్యానికి ఎవరు కింగ్ అవుతారు? ఆద్య(శృతిహాసన్)ని ప్రభాస్ ఎందుకు రక్షిస్తున్నాడు? ప్రభాస్ తల్లి (ఈశ్వరీ రావు) అతడిని ఎందుకు కట్టడి చేస్తోంది? ఇలాంటి చాలా కీ పాయింట్స్ అన్నింటికీ సమాధానాలన్నీ పార్ట్-2లో చూపించబోతున్నారు. అయితే 'సలార్' పార్ట్-2కి సంబంధించిన షూటింగ్ చాలా వరకు పూర్తయిందట. కొన్ని సీన్స్ మాత్రమే తీయాల్సి ఉందని తెలుస్తోంది. ప్రస్తుతం 'కల్కి' మూవీతో ప్రభాస్ బిజీగా ఉన్నాడు. ప్రశాంత్ నీల్.. తన తర్వాతి మూవీ ఎన్టీఆర్‌తో చేయాల్సి ఉంది. దీనిబట్టి చూస్తే.. 'సలార్ పార్ట్-2' రిలీజ్ ఎప్పుడవుతుందో ఏంటనేది? క్లారిటీ రావాల్సి ఉంది. అలానే ఇప్పుడొచ్చిన మూవీలో ఉన్న క్యారెక్టర్స్ కాకుండా సీక్వెల్లో కొత్తగా ఇంకేమైనా కొత్త పాత్రలు వస్తాయనేది చూడాలి? (ఇదీ చదవండి: Salaar: ఆ ఓటీటీలోనే సలార్! దిమ్మతిరిగే రేటుకు..) -
పూర్తిగా సీక్వెల్ సెంటిమెంట్ లో స్టార్ హీరోలు..
-
గీతాంజలి మళ్లీ వస్తోంది
అంజలి టైటిల్ రోల్లో, ‘సత్యం’ రాజేష్, శ్రీనివాస్ రెడ్డి కీలక పాత్రల్లో నటించిన హారర్ కామెడీ ఫిల్మ్ ‘గీతాంజలి’ (2014) హిట్‌గా నిలిచింది. ఈ సినిమాకు సీక్వెల్‌గా ‘గీతాంజలి మళ్లీ వచ్చింది’ సినిమా తెరకెక్కుతోంది. ఇందులో అంజలి, ‘సత్యం’ రాజేష్, శ్రీనివాస్ రెడ్డి, ‘షకలక’ శంకర్ ప్రధాన తారాగణంగా నటిస్తున్నారు. ‘నిన్నుకోరి’, ‘నిశ్శబ్దం’ సినిమాలకు వర్క్ చేసిన కొరియోగ్రాఫర్ శివ తుర్లపాటి ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. రచయిత, నిర్మాత కోన వెంకట్ సమర్పణలో ఎంవీవీ సినిమా, కోన ఫిల్మ్ కార్పొరేషన్ సంస్థలపై ఎంవీవీ సత్యనారాయణ, జీవీ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. హైదరాబాద్, ఊటీ నేపథ్యాల్లో ఈ సినిమా కథనం సాగుతుంది. ‘‘ఇప్పటి వరకు 80 శాతం చిత్రీకరణ పూర్తయింది. త్వరలో జరగనున్న ఊటీ షెడ్యూల్‌తో ఈ సినిమా షూటింగ్ పూర్తవుతుంది. వచ్చే ఏడాది ప్రారంభంలో ఈ సినిమాను విడుదల చేయాలనుకుంటున్నాం’’ అని చిత్రయూనిట్ పేర్కొంది. -
డబుల్ ఇస్మార్ట్‌కు మణిశర్మ స్వరాలు
హీరో రామ్, దర్శకుడు పూరి జగన్నాథ్ కాంబినేషన్లో వచ్చిన సైన్స్ ఫిక్షన్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ ‘ఇస్మార్ట్ శంకర్’ (2019) సూపర్‌హిట్‌గా నిలిచింది. ప్రస్తుతం రామ్, పూరి కాంబినేషన్లో ‘ఇస్మార్ట్ శంకర్’ కి సీక్వెల్‌గా ‘డబుల్ ఇస్మార్ట్’ తెరకెక్కుతోంది. ఈ చిత్రంలో సంజయ్ దత్ ఓ కీలక పాత్రలో నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ ముంబైలో జరుగుతోంది. కాగా ‘డబుల్ ఇస్మార్ట్’ చిత్రానికి మణిశర్మ సంగీతం సమకూర్చనున్నట్లు చిత్రయూనిట్ శనివారం వెల్లడించింది. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన ‘పోకిరి, చిరుత, ఇస్మార్ట్ శంకర్’ వంటి హిట్ సినిమాలకు మణిశర్మ సంగీతం అందించిన సంగతి గుర్తుండే ఉంటుంది. పూరి జగన్నాథ్, చార్మీ కౌర్ నిర్మిస్తున్న ‘డబుల్ ఇస్మార్ట్’ వచ్చే ఏడాది మార్చి 8న విడుదల కానుంది.