The Dirty Picture Sequel In The Works But Not Featuring Vidya Balan - Sakshi
Sakshi News home page

The Dirty Picture: సిల్క్‌ స్మిత బయోపిక్‌కు రానున్న సీక్వెల్‌.. ఈసారి ఏ హీరోయిన్‌?

Published Tue, Aug 16 2022 4:44 PM | Last Updated on Tue, Aug 16 2022 7:09 PM

The Dirty Picture Sequel In The Works But Not Featuring Vidya Balan - Sakshi

The Dirty Picture Sequel In The Works But Not Featuring Vidya Balan: బాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్లలో విద్యా బాలన్‌ ఒకరు. లేడీ ఒరియెంటెడ్‌ చిత్రాలు, బయోపిక్‌లతో విద్యా పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ఇక ఆమె నటించిన సిల్క్‌ స్మిత బయోపిక్‌ ‘ది డర్టీ పిక్చర్‌’ మూవీతో ఓవర్‌ నైట్‌ స్టార్‌ అయిపోయింది. ఇందులో ఆమె నటనకు గానూ విమర్శకుల నుంచి ప్రశంసలు అందుకుంది. 2011లో విడుదలైన ఈ మూవీ విద్యా బాలన్‌కు విపరీతమైన క్రేజ్‌ తెచ్చిపెట్టడమే కాకుండా బాక్సాఫీస్‌ వద్ద అత్యధిక వసూళ్లను రాబట్టింది. అయితే తాజాగా ఈ సినిమా గురించి ఒక ఆసక్తకిర అప్‌డేట్ చక్కర్లు కొడుతోంది. 

సుమారు దశాబ్దం తర్వాత 'ది డర్టీ పిక్చర్‌' సినిమాకు సీక్వెల్‌ రానున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రానికి సీక్వెల్ రూపొందించే పనిలో ఉన్నట్లు దర్శకనిర్మాతలు ధ్రువీకరించినట్లు సమాచారం. అయితే ఈ సీక్వెల్‌ కోసం ఇంకా విద్యా బాలన్‌ను సంప్రదించలేదట. స్క్రిప్ట్‌ ఇంకా పూర్తి కానీ ఈ సీక్వెల్‌ను త్వరలో ప్రారంభిస్తారని సమాచారం. అయితే ఈ సినిమాకు విద్యా బాలన్‌నే తీసుకుంటారా? ఇంకా ఇతర హీరోయిన్‌కు అవకాశం ఇస్తారా? అనేది తెలియాల్సి ఉంది. 

చదవండి: నేను పెళ్లి చేసుకునే సమయానికే ఆమెకు ఒక బాబు: బ్రహ్మాజీ

కాగా మిలన్‌ లుత్రియా దర్శకత్వం వహించిన 'ది డర్టీ పిక్చర్‌' చిత్రం రూ. 18 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కి బాక్సాఫీస్‌ వద్ద రూ. 117 కోట్లు కొల్లగొట్టింది. ఈ సినిమాలో విద్యా బాలన్‌తో పాటు ఇమ్రాన్ హష్మీ, నసీరుద్ధీన్‌ షా, తుషార్‌ కపూర్‌ కీలక పాత్రలు పోషించగా, ఏక్తా కపూర్‌, శోభా కపూర్‌ నిర్మాతలుగా వ్యవహరించారు. ఇక ఇప్పుడు ఈ సినిమాకు రానున్న సీక్వెల్‌ ఎలాంటి రికార్డు సృష్టిస్తుందో వేచి చూడాల్సిందే.   

చదవండి: బిగ్‌బాస్‌ బ్యూటీకి లైంగిక వేధింపులు.. ఆవేదనతో పోస్ట్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement