Silk Smitha
-
అడల్ట్ సినిమాతో మెప్పించిన 'చంద్రికా రవి' సిల్క్ స్మితగా వచ్చేస్తుంది (ఫోటోలు)
-
సిల్క్ స్మిత బయోపిక్ గ్లింప్స్ విడుదల.. అంచనాలు పెంచేసిన మేకర్స్
సౌత్ ఇండియాలో ఒకప్పుడు స్టార్ నటిగా వెలిగిన దివంగత సిల్క్ స్మిత జీవితంపై మరో బయోపిక్ రెడీ అవుతుంది. 'సిల్క్ స్మిత - ది క్వీన్ ఆఫ్ సౌత్' పేరుతో ఈ సినిమాకు సంబంధించిన గ్లింప్స్ తాజాగా విడుదలైంది. సిల్క్ స్మిత పాత్రలో చంద్రికా రవి అనే నటి కనిపించనున్నారు. ఈ చిత్రాన్ని జయరామ్ అనే కొత్త దర్శకుడు పాన్ ఇండియా రేంజ్లో తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమాలో ఆమె వ్యక్తిత్వం సహా చాలా విషయాలను చూపిస్తామని దర్శకుడు ఇప్పటికే తెలిపాడు.1980, 1990 దశకాల్లో భారత సినీ పరిశ్రమలో సిల్క్ స్మిత పేరు మార్మోగింది. 17 ఏళ్ల పాటు పరిశ్రమలో ఉన్న ఆమె 5 భాషలలో 450కి పైగా సినిమాల్లో నటించి రికార్డ్ క్రియేట్ చేసింది. 1996 సెప్టెంబర్ 23న ఆమె ఆత్మహత్య చేసుకున్నారు. సిల్క్ మరణం ఇప్పటికీ పెద్ద మిస్టరీగానే ఉంది. ఆంధ్రప్రదేశ్‌లోని ఏలూరు ప్రాంతం నుంచి వచ్చిన సిల్క్ స్మిత.. తన గ్లామర్‌తో ఎవరికి దక్కనంత రేంజ్లో అభిమానులను సొంతం చేసుకుంది. ఎవరికీ తెలియని విషయాలను ఈ సినిమా ద్వారా ప్రపంచానికి తెలుపుతానని దర్శకుడు చెప్పడంతో ఈ ప్రాజెక్ట్‌పై భారీ అంచనాలు ఉన్నాయి. -
ఈమెని గుర్తుపట్టారా? సౌత్ ఇండస్ట్రీనే ఓ ఊపు ఊపింది.. కానీ కొన్నాళ్లకే!
సినిమా ఇండస్ట్రీ ఓ రంగుల ప్రపంచం. హీరోయిన్లు గ్లామర్ మెంటైన్ చేసినన్నీ రోజులు, హీరోలకు హిట్ సినిమాలు దక్కినన్ని రోజులు బాగానే ఉంటుంది. ఎప్పుడైతే వీటిలో మార్పులొస్తాయో.. నటీనటులు జీవితాలు అప్పుడప్పుడు తలక్రిందులవుతుంటాయి. అలాంటి ఓ నటినే ఈమె. ఈ మాత్రం చెప్పాం కదా! మరి ఈ బ్యూటీ ఎవరో కనిపెట్టారా? మమ్మల్నే చెప్పేయమంటారా?పైన ఫొటోలో సంప్రదాయబద్ధంగా చీరలో పూలు పెట్టుకుని కనిపిస్తున్న అమ్మాయి సిల్క్ స్మిత. అవును మీరు ఊహించింది కరెక్టే. పశ్చిమ గోదావరి జిలాల్లో పుట్టి పెరిగిన వడ్లపాటి విజయలక్ష్మీ.. టీనేజీలో ఉండగానే హీరోయిన్ అయిపోదామని ఇంట్లో కూడా చెప్పకుండా మద్రాసు పారిపోయింది. పేరు మార్చుకుని సిల్క్ స్మితగా మారిపోయింది. గ్రూప్ డ్యాన్సర్లలో ఒకరుగా మొదలై.. స్టార్ హీరోలతో కలిసి ఐటమ్ డ్యాన్సర్‌గా పేరు తెచ్చుకుంది.(ఇదీ చదవండి: కోట్ల రూపాయల లగ్జరీ కారు కొనేసిన ప్రముఖ సింగర్)80-90ల్లో తెలుగుతో పాటు దక్షిణాది భాషల్లో ఐటమ్ సాంగ్స్ అంటే దర్శకనిర్మాతలకు ముందు గుర్చొచ్చేది ఈమెనే. అంతలా సౌత్ ఇండస్ట్రీని ఊపు ఊపిన సిల్క్ స్మిత.. ఆ తర్వాత వచ్చిన ఫేమ్, డబ్బుని మేనేజ్ చేసుకోలేక.. కొందరు హీరోల మాయలో పడి సర్వస్వం కోల్పోయింది. ఒత్తిడి తట్టుకోలేక కేవలం 36 ఏళ్లకే ఆత్మహత్య చేసుకుని చనిపోయింది. అప్పట్లో సినిమాలు చేసినప్పటికీ.. ఈమెని ఇప్పటి జనరేషన్ కూడా గుర్తుంచుకుంటోంది.ఇలాంటి సిల్క్ స్మిత రేర్ ఫొటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇందులో చీరతో అందానికే ఆధార్‌లా ఉన్న సిల్క్‌ని చూసి తొలుత గుర్తుపట్టలేకపోయారు. తర్వాత అసలు విషయం తెలిసి ఓర్నీ.. ఈమె సిల్క్ స్మితనా అని అనుకుంటున్నారు. ఇదిలా ఉండగానే ఈమె జీవితాన్ని ఆధారంగా కొన్నేళ్ల క్రితం హిందీలో 'ద డర్టీ పిక్చర్' అనే మూవీ వచ్చింది. ఇది చూస్తే సిల్క్ స్మిత జీవితం ఎలా ఉంటుందో తెలిసే ఛాన్స్ ఉంది!(ఇదీ చదవండి: త్వరలోనే పేరెంట్స్‌గా ప్రమోషన్.. జోర్దార్ సుజాత కంటతడి) -
సిల్క్ స్మిత చేసిన పెద్ద తప్పు అదే: నటి జయమాలిని
క్షణికావేశం, విరక్తి.. మనిషి జీవితాన్ని కోల్పోవడానికి కారణం అవుతుంటాయి. మరి ఏమైందో ఏమో గానీ శృంగార తార సిల్క్ స్మిత అప్పట్లో ఇలానే బలవన్మరణానికి పాల్పడింది. 35 ఏళ్ల వయసులోనే అంటే 1996లోనే సిల్క్ స్మిత ఆత్మహత్య చేసుకుని చనిపోయింది. అయితే ఎందుకు ప్రాణాలు తీసుకుందనేది ఇప్పటికీ మిస్టరీగానే ఉండిపోయింది. అప్పట్లో స్మితతో పాటు పలు సినిమాలు చేసిన జయమాలిని.. తాజాగా స్మిత మరణం గురించి మాట్లాడింది. (ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 20 సినిమాలు.. అవి మాత్రం డోంట్ మిస్) 'అతి తక్కువ కాలంలోనే పేరు, ప్రఖ్యాతలతో పాట డబ్బు సంపాదించిన నటి సిల్క్ స్మిత. షూటింగ్ స్పాట్లో ఆమె నాతో మాట్లాడేదే కాదు. ఓ సినిమాలో హీరోతో కలిసి నేను, మా అక్క జ్యోతిలక్ష్మి, సిల్క్ స్మిత నటించాం. అయితే మంచి ఫామ్‌లో ఉన్నప్పుడే సిల్క్ స్మిత ఆత్మహత్య చేసుకోవడం బాధాకరం. అది ఆమె జీవితంలో చేసిన అతి పెద్ద తప్పు' 'ప్రేమించడం తప్పు కాదు కానీ తల్లిదండ్రులను విడిచిపెట్టి ఉండకూడదు. ఎందుకంటే సిల్క్ స్మిత.. ప్రేమించిన వాడిని గుడ్డిగా నమ్మేసింది. అతడు మోసం చేశాడు. ఒకవేళ తల్లిదండ్రులు పక్కనుంటే బాధలో అండగా ఉండేవారు. సొంతవాళ్లు లేకపోతే చాలామంది మోసం చేయడానికి రెడీగా ఉంటారు. అలానే సిల్క్ స్మిత బలైపోయింది' అని జయమాలిని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారిపోయాయి. (ఇదీ చదవండి: సింపుల్‌గా పెళ్లి చేసుకున్న టాలీవుడ్ లేడీ సింగర్ హారిక నారాయణ్) -
నెట్టింట వైరల్ అవుతున్న 'సిల్క్ స్మిత' మదర్ ఫోటో
సిల్క్ స్మిత.. తెలుగువారికి పరిచయం అక్కర్లేని పేరు. బావ బావమరిది చిత్రంలోని బావలు సయ్యా అనే పాటతో ప్రేక్షకులను ఊర్రూతలూగించింది. ఇప్పటికీ ఆ పాట రేంజ్ ఏమాత్రం తగ్గలేదని చెప్పవచ్చు. సిల్క్ స్మిత మరణించి 35 ఏళ్లు దాటింది. అయినా కూడా ఆమె పేరును ఇండస్ట్రీ మరిచిపోలేదు. ఏదో రూపంలో ఆమె పేరు తరుచూ సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంటుంది. తాజాగా సిల్క్ స్మిత అమ్మగారి ఫోటో నెట్టింట వైరల్ అవుతుంది. డిసెంబర్ 2, 1960లో ఆంధ్రప్రదేశ్‌లోని ఏలూరులో రాములు, సరసమ్మలకు జన్మించిన సిల్మ్ స్మిత అసలు పేరు విజయలక్ష్మి. తమిళ ఇండస్ట్రీలో కెరీర్ ప్రారంభించిన ఆమె తెలుగు, మలయాళం, కన్నడ, హిందీ భాషలలో 450కి పైగా చిత్రాల్లో నటించింది. అలా సినీ ఇండస్ట్రీలో 17 ఏళ్ల ఓ వెలుగు వెలిగిన సిల్క్ స్మిత జీవితం అర్ధాంతరంగా ముగిసింది. సెప్టెంబర్ 23, 1996న 35 ఏళ్లకే ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోయింది. స్టార్ హీరోలు నటించిన పెద్ద చిత్రాల్లో అవకాశాలొచ్చాయి. సిల్క్ తమిళం, మలయాళం, తెలుగు, హిందీతో సహా అన్ని భాషల్లోని చిత్రాల్లో స్పెషల్ సాంగ్స్‌తో మెరిసింది. మలయాళ స్టార్ మోహన్‌లాల్, కోలీవుడ్ స్టార్ కమల్‌హాసన్ వంటి పెద్ద స్టార్ల చిత్రాల్లో నటించింది. వెండితెరపై ఆమెకు గొప్ప ప్రశంసలు దక్కినప్పటికీ.. ఆమె తన వ్యక్తిగత జీవితంలో సంతోషంగా సాగలేదు. ఆ తర్వాత ఆమె ఓ వైద్యుడిని వివాహం చేసుకుందని.. ఆమె సంపాదన మొత్తాన్ని సినిమాల్లో పెట్టుబడి పెట్టినట్లు తెలిసింది. అతను నిర్మించిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఫెయిలవ్వడంతో కష్టపడి సంపాదించిన డబ్బు మొత్తాన్ని కోల్పోయిందని అప్పట్లో వార్తలొచ్చాయి. కానీ ఆ తర్వాత ఎవరూ ఊహించని రీతిలో సిల్క్ స్మిత సెప్టెంబరు 23, 1996న ఓ హోటల్ రూమ్‌లో ఆత్మహత్య చేసుకుంది. అప్పట్లో పోలీసులు సూసైడ్ నోట్‌ను స్వాధీనం చేసుకున్నారు. అయితే అందులో సిల్క్ స్మిత.. తన జీవితం సంతోషంగా లేదని.. నమ్మినవారే మోసం చేశారంటూ.. అందుకే ఈ లోకాన్ని విడిచివెళుతున్నట్లు రాసుకొచ్చింది. తాజాగా తన అమ్మగారి ఫోటో నెట్టింట వైరల్‌గా మారింది. -
స్టార్స్‌గా ఎదిగారు.. చిన్న వయసులోనే కెరీర్‌ను ముగించారు!
సినీ ఇండస్ట్రీ అంటేనే గ్లామర్ ప్రపంచం. ఇకపోతే సినిమాల్లో హీరోయిన్ల పాత్రకు ఎక్కువగా ప్రాధాన్యత ఉంటుంది. అలా చిన్న వయసులోనే స్టార్ హీరోయిన్గా ఎదిగిన తారలు చాలామందే ఉన్నారు. కానీ కాల కలిసిరాక కొందరు కాలగర్భంలో కలిసిపోయారు. తాజాగా ఇవాళ చిన్న వయసులోనే నటి, మోడల్ పూనమ్ పాండే క్యాన్సర్‌తో కన్నుమూసింది. 32 ఏళ్ల వయసులోనే తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయింది. ఈ విషాదంతో బాలీవుడ్, సినీ ప్రియులు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. అయితే ఇండస్ట్రీలో అడుగుపెట్టి కొద్ది రోజుల్లోనే స్టార్స్‌గా ఎదిగిన తారలు చాలామందే ఉన్నారు. కానీ కొందరు ఊహించని విధంగా ప్రాణాలు కోల్పోయారు. మరికొందరేమో వ్యక్తిగత జీవితంలో కారణాలతో చిన్న వయసులోనే తనువు చాలించి వెండితెరకు దూరమయ్యారు. అలా చిన్న వయసులో కన్నుమూసిన నటీమణుల్లో తెలుగు హీరోయిన్స్ కూడా ఉన్నారు. ఆ వివరాలేంటో తెలుసుకుందాం. టాలీవుడ్ హీరోయిన్ ఆర్తి అగర్వాల్.. టాలీవుడ్ అభిమానుల గుండెల్లో పేరు సంపాదించుకున్న హీరోయిన్ ఆర్తి అగర్వాల్. అమెరికాలో జన్మించిన బ్యూటీ 31 ఏళ్లకే తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయింది. నువ్వు నాకు నచ్చావ్ సినిమాతో పరిచయమైన ఆర్తి జూన్ 6, 2015లో కన్నుమూసింది. బరువు తగ్గడం కోసం ఆపరేషన్ చేయించుకోగా.. అది వికటించడంతో తుదిశ్వాస విడిచింది. యువనటి భార్గవి కన్నుమూత.. అనుమానాస్పద రీతిలో కన్నుమూసిన మరో నటి 'భార్గవి'. అష్టాచెమ్మా సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న ఆమె ఊహించని విధంగా హత్యకు గురైంది. డిసెంబర్ 16న, 2008లో 23 ఏళ్లకే తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయింది. గుంటూరు జిల్లా గోరంట్లలో జన్మించిన భార్గవి వైవీఎస్ చౌదరి చిత్రం దేవదాసుతోనే ఇండస్ట్రీలో అడుగుపెట్టింది. అంతకుముందు టీవీ సీరియల్స్‌లో పనిచేసింది ప్రత్యూష మృతి.. తెలుగులో రాయుడు చిత్రం ద్వారా ఎంట్రీ ఇచ్చిన నటి ప్రత్యూష. భువనగిరికి చెందిన ప్రత్యూష తెలుగుతో పాటు తమిళంలోనూ నటించింది. చిన్న వయసులోనే తెలుగు సినీ ఇండస్ట్రీలో దూసుకొచ్చిన ప్రత్యూష చిన్న వయసులోనే 23 ఫిబ్రవరి 2002న 20 ఏళ్ల వయసులోనే కన్నుమూసింది. స్టార్ హీరోయిన్ సౌందర్య తెలుగు ప్రేక్షకుల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్న హీరోయిన్ సౌందర్య. కన్నడకు చెందిన ముద్దుగుమ్మ తెలుగులో స్టార్ హీరోయిన్గా ఎదిగింది. అయితే 2004 ఎన్నికల్లో భాజపా తరఫున ప్రచారానికి వెళ్తూ హెలికాప్టర్ ప్రమాదంలో చనిపోయింది. ఆమె మృతితో తెలుగు సినీ పరిశ్రమ దిగ్భ్రాంతికి గురైంది. సిల్క్ స్మిత సూసైడ్ అప్పట్లోనే వెండితెరను ఓ ఊపు ఊపేసిన నటి సిల్క్ స్మిత. ప్రత్యేక గీతాలతో తెలుగు సినిమాల్లో మెప్పించింది. అయితే వ్యక్తిగత జీవితంలో తలెత్తిన సమస్యలతో చిన్న వయసులోనే సూసైడ్‌కు పాల్పడింది. ఏపీకి చెందిన సిల్క్ స్మిత అసలు పేరు విజయలక్ష్మి 23 సెప్టెంబర్ 1996లో 35 ఏళ్లకే కన్నుమూసింది. 19 ఏళ్లకే దివ్య భారతి ముంబైలో జన్మించిన దివ్య భారతి తెలుగు, హిందీ చిత్రాల్లో మెరిసింది. బొబ్బిలి రాజా సినిమాతో తెలుగు పరిశ్రమకు పరిచయమైంది. ఆ తర్వాత అత్యధిక పారితోషికం పొందిన హీరోయిన్లలో ఒకరిగా నిలిచింది. తన కెరీర్లో ఫిల్మ్ ఫేర్‌తో పాటు నంది అవార్డులను గెలుచుకుంది. కానీ ఊహించని విధంగా 19 ఏళ్ల వయసులోనే 5 ఏప్రిల్ 1993 కన్నుమూసింది. ఆమె మృతితో సినీ పరిశ్రమ తీవ్ర దిగ్భ్రాంతికి గురైంది. ఫటాఫట్ జయలక్ష్మి.. ఏపీకి చెందిన జయలక్ష్మి తెలుగు, తమిళ చిత్రాలతో గుర్తింపు తెచ్చుకుంది. తనదైన నటనతో ఆమెకు ముద్దుగా ఫటాఫట్ జయలక్ష్మిగా అభిమానులు పిలిచేవారు. మలయాళ సినిమాల్లో ఆమెను సుప్రియ అని పిలిచేవారు. ఆమె తన కెరీర్ సాగిన పదేళ్లలోనే తమిళం, తెలుగు, మలయాళం, కన్నడ భాషల్లో దాదాపు 66 సినిమాల్లో నటించింది. అంతులేని కథ సినిమాలో ఫటాఫట్ అంటూ సంచలనం సృష్టించింది. కానీ అప్పట్లో ఓ బడా హీరో కుమారుడితో వివాదం కారణంగా కేవలం 22 ఏళ్లకే ఆత్మహత్యకు పాల్పడి తనువు చాలించింది. బాలీవుడ్ నటి జియా ఖాన్.. రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన నిశ్శబ్ద్ సినిమాతో బాలీవుడ్లో పాపులర్ అయిన హీరోయిన్ జియా ఖాన్. ఆ తర్వాత డిప్రెషన్ కారణంగా తన ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. 1988లో అమెరికాలో జన్మించిన బ్యూటీ 25 ఏళ్ల వయసులోనే జూన్ 3,2013లో కన్నుమూసింది. తమ టాలెంట్‌లో కలల ప్రపంచంలోకి అడుగుపెట్టిన సినీ తారలు అర్ధాంతరంగా కెరీర్‌ను ముగించారు. అలా ఇచ్చి.. ఇలా వెళ్లిపోయి అభిమానులకు షాకిచ్చారు. ఎంతో టాలెంట్ ఉన్నప్పటికీ కాలం కలిసిరాకపోవడంతో వెండితెరతో పాటు ఏకంగా ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోయారు. చిన్న వయసులోనే స్టార్స్‌గా ఎదిగినా.. చివరికీ విషాదంతో తమ జీవితాలను ముగించారు. -
సిల్క్ స్మిత ఖిలాడీ.. కానీ అదొక్కటే రాదు: కమల్ హాసన్
ఆటైనా, అభినయం అయినా సిల్క్ స్మిత స్టైలే వేరు.. ఆమె సినిమాలో ఉంటే ఆ నిర్మాతలకు కాసుల పంటే, థియేటర్లు హౌస్ ఫుల్. ఈమె బయోపిక్ కూడా తెరపై మెరిసింది, నిర్మాతకు కాసుల వర్షం కురిపించింది. ఆమె పాత్రలో నటించిన విద్యాబాలన్‌కు జాతీయ అవార్డు వరించింది. అంత చరిత్ర కలిగిన సిల్క్ స్మిత ఇప్పుడు భౌతికంగా లేకపోయినా, ఆమె నటిగా చిరంజీవే. ఎందుకంటే అభిమానుల గుండెల్లో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్నారు. సిల్క్ స్మిత 63వ జయంతి ఈ సందర్భంగా తమిళనాడులో ఓ అభిమాని 100 మందికి బిర్యానీ పంచిపెట్టి ఆమైపె తరగని అభిమానాన్ని చాటుకున్నాడు. సిల్క్‌పై బయోపిక్స్.. కాగా సిల్క్ స్మిత జీవిత చరిత్రతో బాలీవుడ్లో డర్టీ పిక్చర్ పేరుతో చిత్రం రూపొంది సంచలన విజయాన్ని సాధించిన విషయం తెలిసిందే. అందులో నటి విద్యాబాలన్ నటించారు. అదే విధంగా మలయాళంలోనూ ఒక చిత్రం తెరకెక్కింది. అందులో నటి సనాఖాన్ నటించారు. తాజాగా సిల్క్ అన్ టోల్డ్ పేరుతో మరో చిత్రం తెరకెక్కుతోంది. ఇలా తరం మారుతున్నప్పుడల్లా దర్శక నిర్మాతలు పేరును, డబ్బును సంపాదించుకునేంత ఖ్యాతిని సిల్క్ స్మిత సంపాదించుకుని చాలా త్వరగా వెళ్లిపోయారు. ఈమెను దర్శక నిర్మాతలు ఎక్కువగా శృంగార తారగానే చూశారు గానీ సిల్క్ స్మితలో మంచి నటి ఉన్నారు. శృంగార పాత్రల్లో నటించడం మానేసి.. అలైగళ్ ఓయ్ వదిల్లై చిత్రంలో ఆ విషయం నిరూపణ అయ్యింది. ఈ విషయాన్ని దివంగత ముఖ్యమంత్రి, నటుడు ఎంజీఆర్ పేర్కొన్నారు. ఇకపై సిల్క్ స్మిత శృంగార పాటల్లో నటించడం మానేసి మంచి క్యారెక్టర్లలో నటించాలనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. నటి సిల్క్ స్మిత జయంతి సందర్భంగా లోకనాయకుడు కమల్ హాసన్ గతంలో మాట్లాడిన వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. అందులో కమల్ హాసన్ మాట్లాడుతూ ‘నేను కథానాయకుడిగా నటించిన మూండ్రామ్ పిరై చిత్రంలో ముందుగా నటి సిల్క్ స్మిత పాట లేదు. అయితే చిత్ర వ్యాపారం కోసం ఆమె పాటలు చేర్చారు. నేను ఆ పాటలో ఉండాల్సి వచ్చింది. (సిల్క్ స్మిత ఫోటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) సిల్క్‌కు డ్యాన్స్ చేయడం రాదు అయితే చాలా తక్కువ ఖర్చుతో ఆ పాటను దర్శకుడు బాలు మహేంద్ర చిత్రీకరించారు. ఆ పాటకు ప్రభుదేవా తండ్రి సుందరం మాస్టర్ డాన్స్ కంపోజ్ చేశారు. సిల్క్ స్మిత చేయగలిగేంతగా ఆయన నృత్యాన్ని సమకూర్చారు. ఎందుకంటే సిల్క్ స్మితకు నిజంగానే డాన్స్ చేయడం రాదు. అయితే ఆమె ఇతరులను ఇమిటేట్ చేయడంలో ఖిలాడీ. అదే సమయంలో ఫ్యాషన్‌కు తగ్గట్టుగా దుస్తులను ధరించటం ఆమెకు ఇష్టం. ఆ విషయం గురించి నేను ఆమెకు చెప్పి అభినందించాను. చాలా కష్టాలు పడి ఎదిగిన నటి సిల్క్ స్మిత’ అని పేర్కొన్నారు. చదవండి: విజయ్ దేవరకొండ, రష్మికలకు సారీ చెప్పిన నాని -
తెరపైకి సిల్క్ స్మిత జీవితం
అలనాటి గ్లామరస్ తార సిల్క్ స్మిత జీవితం ‘సిల్క్ స్మిత: ది అన్‌టోల్డ్ స్టోరీ’గా వెండితెరపైకి రానుంది. సిల్క్ స్మితలా చంద్రికా రవి నటించనున్నారు. వి. మహాస్త్రీ అమృతరాజ్ సమర్పణలో జయరామ్ దర్శకత్వంలో ఎస్బీ విజయ్ ఈ సినిమాను నిర్మించనున్నారు. శనివారం (డిసెంబరు 2) సిల్క్ స్మిత జయంతిని పురస్కరించుకుని ఈ చిత్రాన్ని ప్రకటించారు. ‘‘సిల్క్ స్మిత అసలు పేరు వడ్లపాటి విజయలక్ష్మి. 1980, 1990వ దశకాల్లో గ్లామరస్ తారగా వెలుగొందారామె. స్మిత కుటుంబ సభ్యుల ఆశీర్వాదంతో ‘సిల్క్ స్మిత: ది అన్‌టోల్డ్ స్టోరీ’ని ప్రపంచానికి చెప్పనున్నాం. త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించనున్నాం. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ఈ సినిమాను వచ్చే ఏడాది విడుదల చేస్తాం’’ అని చిత్ర యూనిట్ పేర్కొంది. -
సిల్క్ స్మిత మరో బయోపిక్.. హీరోయిన్ ఎవరంటే..?
సిల్క్ స్మిత.. సినీ ప్రేమికుల హృదయాల్లో నిలిచిపోయే పేరు ఇది. ఒకప్పుడు తన అందచందాలతో కుర్రకారును ఉర్రుతలూగించింది. చనిపోయి పాతికేళ్లు దాటినా..ఇప్పటికే సిల్క్ పేరు ఇండస్ట్రీలో మారుమోగుతూనే ఉంది. ఇప్పటికే ఈ శృంగార తారపై బాలీవుడ్లో డర్టీ పిక్చర్ అనే సినిమా వచ్చింది. తాజాగా మరో సిల్క్ జీవితం ఆధారంగా మరో చిత్రం రాబోతుంది. చంద్రికా రవి ప్రధాన పాత్రలో నటిస్తోన ఈ చిత్రాన్ని జయరామ్ అనే నూతన దర్శకుడు తెరకెక్కిస్తున్నాడు. (చదవండి: ఊహించని పేరు, డబ్బు.. చివరి క్షణాల్లో నరకం.. ‘ఐటమ్ గర్ల్’ విషాద గాథ) సిల్క్ స్మిత- ది అన్‌టోల్డ్ స్టోరీ అనే టైటిల్‌తో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. శనివారం(డిసెంబర్ 2) సిల్క్ స్మిత జయంతిని పురస్కరించుకొని ఫస్ట్ లుక్‌ని రిలీజ్ చేశారు. ఇందులో చంద్రిక..అచ్చం స్మితలా కనిపించింది. ఎవరీ రవి చంద్రికా! భారత సంతతికి చెందిన ఆస్ట్రేలియన్ మోడల్, నటి చంద్రికా రవి. ‘చీకటి గదిలో చితకొట్టుడు’ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. ఈ ఏడాది జనవరిలో విడుదలైన ‘వీర సింహారెడ్డి’ సినిమాలో 'మా మనోభావాలు దెబ్బ తిన్నాయి'పాటకు బాలయ్యతో కలిసి స్టెప్పులేసింది. ఫస్ట్ లుక్ చూస్తుంటే.. సిల్క్ పాత్రలో రవి చంద్రికా ఒదిగిపోయినట్లు కనిపిస్తుంది. సిల్క్ స్మిత జీవితం ఆధారంగా ఇప్పటికే బాలీవుడ్లో డర్టీ పిక్చర్ వచ్చింది. అందులో స్మిత జీవితం మొత్తాన్ని చూపించారు. అంతకు మించి ఈ చిత్రంలో కొత్తగా ఏం చూపిస్తారనే ఆసక్తి ప్రేక్షకుల్లో నెలకొంది. View this post on Instagram A post shared by Chandrika Ravi • ॐ (@chandrikaravi) -
ప్రేమ పేరుతో స్టార్ హీరో మోసం.. చివరి క్షణాల్లో నరకం.. ‘గ్లామర్ క్వీన్’ విషాద గాథ
సిల్క్ స్మిత.. దక్షిణాదిలో ఈ పేరు తెలియని సీనీ ప్రేమికులు ఉండరు. తన అందచందాలతో ఓ తరం కుర్రకారును ఉర్రూతలూగించిన నటి ఆమె. ఓ దశలో ఎంత పెద్ద హీరో సినిమా అయినా సరే.. సిల్క్‌తో పాట లేకుండా శుభం కార్డు పడేది కాదు. వెండితెర శృంగార తారగా నిలిచిపోయిన సిల్క్ స్మిత.. కాలే కడుపుతో రంగుల ప్రపంచంలోకి అడుపెట్టింది. ఊహించని పేరు, డబ్బు, హోదా సంపాదించి.. 36 ఏళ్ల వయసులోనే ప్రపంచానికి వీడ్కోలు చెప్పింది. నేడు(డిసెంబర్ 2) సిల్క్ స్మిత జయంతి. ఈ సందర్భంగా ఆమె గురించి.. పదేళ్లకే చదువుకు స్వస్తి సిల్క్ స్మిత అసలు పేరు విజయలక్ష్మి వడ్లపాటి. ఆంధ్రప్రదేశ్‌లోని ఏలూరు చెందిన ఓ పేద కుటుంబంలో 1960 డిసెంబర్ 2న జన్మించింది. ఆమె బాల్యమంతా కష్టాల్లోనే గడిచింది. ఆర్థిక ఇబ్బందుల కారణంగా నాలుగో తరగతిలోనే చదువు ఆపేసింది. చిన్నవయసులోనే పెళ్లి జరిగింది. అయితే అక్కడ కూడా తనకు సుఖం లేకుండా పోయింది. అలాంటి పరిస్థితుల్లో ఆమె అత్తమామల ఇంటిని వదిలి చెన్నైకి వచ్చింది. సినిమాలపై ఆసక్తితో ఇండస్ట్రీలో అడుగుపెట్టింది. మేకప్ చేస్తూనే ... ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన తొలినాళ్లలో సిల్క్ స్మిత నటీమణులకు మేకప్ వేయడం ప్రారంభించింది. తర్వాత ఆమెకు నటి కావాలనే కోరిక మొదలైంది. 1979లో వచ్చిన 'పండిచక్రమ్' తమిళ చిత్రం విజయలక్ష్మి పేరునే కాదు... ఆమె జీవనగమనాన్నే మార్చేసింది. ఆ సినిమాలో విజయలక్ష్మి పాత్ర పేరు సిల్క్. ఆ పేరు బాగా పాపులర్ కావడంతో ఆమె పేరు సిల్క్ స్మితగా మార్చుకుంది. తన 17 ఏళ్ల కెరీర్లో 450పైగా సినిమాల్లో నటించి, తన అందచందాలతో మెప్పించింది. చాలా సినిమాల్లో ఆమె ప్రత్యేక గీతాల్లో నటించింది. సిల్క్ కోసమే దర్శకనిర్మాతలు ఐటమ్ సాంగ్స్ పెట్టేవారు. ఆమె చూడడానికే ప్రేక్షకులు థియేటర్స్‌కి వచ్చేశారు. హీరోయిన్ల కంటే ఎక్కువ పారితోషికం.. ఐటమ్ సాంగ్స్‌కి పెట్టింది పేరుగా సిల్క్ స్మిత వెలుగొందింది. తన అందచందాలతో యువతను ఉర్రూతలూగించింది. అభిమానుల చేత ‘ఇండియన్ మార్లిన్ మన్రో’గా జేజేలు కొట్టించుకుంది. ఒకానొక సమయంలో కథానాయికల కంటే కూడా ఎక్కువ క్రేజ్ సంపాదించుకుంది. ఏ హీరో సినిమా అయినా సరే..అందులో సిల్క్ ఐటమ్ సాంగ్ ఉండాల్సిందే. సిల్క్ ఉంటే చాలు సినిమా హిట్టే అనేంతలా పేరు సంపాదించుకుంది.అందుకే కొన్ని సినిమాలకు హీరోయిన్లకు మించిన పారితోషికం సిల్క్‌కు అందించారు. ఇలా గ్లామర్ వరల్డ్‌లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న సిల్క్ జీవితం అర్థాంతరంగా ఆగిపోయింది. 36 ఏళ్లకే ఈ లోకాన్ని విడిచింది.. హీరోయిన్ అవుదామని వచ్చిన సిల్క్..ఇండస్ట్రీలో ‘ఐటమ్‌గర్ల్’గా మిగిలిపోయింది. అద్భుతమైన నటనతో మెప్పించినా.. నటిగా ఆమెకు తగిన గుర్తింపు రాలేదు. 90ల్లో స్మిత హవ కాస్త తగ్గింది. అవకాశాలు తగ్గడంతో నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టి తీవ్రంగా నష్టపోయింది. అలాగే వ్యక్తిగతంగా లవ్ ఫెయిల్యూరూ ఆమెను కుంగదీసింది. ఒకవైపు అప్పులు, ఇంకోవైపు ప్రేమతాలూకు మానసిక క్షోభతో ఆమె డిప్రెషన్లోకి వెళ్లిపోయి1996 సెప్టెంబర్ 23న చెన్నైలోని తన నివాసంలో ఫ్యాన్‌కు ఉరివేసుకొని చనిపోయింది. ఆమె మరణంపై ఎన్నో అనుమానాలు వ్యక్తం అయ్యాయి. ఓ స్టార్ హీరో ప్రేమ పేరుతో మోసం చేయడం తట్టుకోలేకనే స్మిత చనిపోయిందని కొంతమంది అటే.. ఆర్థిక నష్టాల వల్లే ఆత్మహత్య చేసుకుందని మరికొంతమంది అంటారు. నేటికి స్మిత ఆత్మహత్య వెనుకగల కారణాలపై స్పష్టత లేదు. సిల్క్ స్మిత జీవితం ఆధారంగా బాలీవుడ్లో డర్జీ పిక్చర్ అనే సినిమా వచ్చింది. విద్యాబాలన్ నటించిన ఈ చిత్రం భారీ విజయం సాధించింది. 👉: (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
రజనీకాంత్, సిల్క్ స్మిత మధ్య జరిగింది ఏంటి.. ఇందులో నిజమెంత?
ఒకప్పుడు వెండితెరను ఏలిన సౌందర్య రాశి సిల్క్ స్మిత.. ఆమె మరణించి ఇప్పటకి సరిగ్గా 27 ఏళ్లు పూర్తి అయ్యాయి. సిల్క్ స్మిత 80వ దశకంలో తన పెద్ద కళ్లతో, మనోహరమైన చిరునవ్వుతో, ఆవేశపూరితమైన అందంతో దక్షిణ భారత చలనచిత్ర ప్రపంచాన్ని తుఫానుగా మార్చేసిందని చెప్పవచ్చు. 80, 90 దశకాల్లో స్మిత పాటలు లేని సినిమాలు చాలా అరుదు. సిల్క్ స్మిత తన 17 ఏళ్ల నట జీవితంలో మలయాళం, తమిళం, తెలుగు, కన్నడ, హిందీ భాషల్లో 450కి పైగా చిత్రాల్లో నటించింది. సినిమా కథ కంటే ఎక్కువగా స్మిత నిజ జీవితంలో ఎక్కువ కష్టాలు ఉండేవి. నిర్మాతగా మారి సినిమాలు కూడా ఆమె తీశారు. కానీ ఆ రంగంలో పరాజయాలు అందుకోవడంతో ఒత్తిడికి గురయ్యారు. ఈ క్రమంలో మద్యానికి బానిస కావడం.. ప్రేమ వ్యవహారం దెబ్బతినడంతో తట్టుకోలేకపోయారు. 1996లో (అప్పటికి 35 ఏళ్ల వయసు) విషం తాగి ఆత్మహత్య చేసుకున్నారు. కానీ ఆమె మరణానికి పూర్తి కారణాలు ఇప్పటికీ తెలియవు. గ్లామరస్లో సిల్క్‌ను మించిన నటి మరోకరు లేరు సౌత్ ఇండియాలో పాపులారిటీ విషయంలో రజనీకాంత్, కమల్ హాసన్ వంటి సూపర్ స్టార్లతో పోటీ పడింది సిల్క్ స్మిత. అప్పట్లో ఈ నటిపై చాలా గాసిప్స్ చక్కర్లు కొట్టాయి. ముఖ్యమైన విషయం ఏమిటంటే, నటి సూపర్ స్టార్ రజనీకాంత్‌తో ప్రేమలో ఉందనే వార్త అప్పట్లో పెద్ద సంచలనం క్రియేట్ చేసింది. సిల్క్ స్మిత 80వ దశకంలో కమల్‌హాసన్‌తో పలు సినిమాలు చేసి మంచి పేరు తెచ్చుకుంది. గ్లామరస్ పాత్రలు చేయడంలో సిల్క్‌ను మించిన నటి మరోకరు లేరు. సిల్క్ అనేక బి గ్రేడ్ చిత్రాలలో కూడా నటించింది. సిల్క్ శరీరంపై సిగరెట్ మచ్చలు రజనీకాంత్, సిల్క్ 1983లో జీత్ హమారీ, 1983లో తంగా మగాన్, పాయుమ్ పులిలో కలిసి పనిచేశారు. అదే సమయంలో, ఈ చిత్రాలలో సిల్క్ యొక్క ఆకర్షణీయమైన డ్యాన్స్ అప్పట్లో పలు వివాదాలకు దారితీసింది. రజినీ, సిల్క్ ఇద్దరూ కలిసి సినిమాలు చేయడం ప్రారంభించినప్పటి నుంచి ప్రేమలో ఉన్నారని ప్రచారం జరిగింది. అంతేకాదు సిల్క్ స్మిత శరీరంపై రజనీకాంత్ సిగరెట్‌తో కాల్చాడని కూడా ఆనాడు భారీగానే రూమర్స్ వచ్చాయి. అప్పట్లో వారిద్దరి గురించే ప్రతి సినిమా సెట్లో పలురకాలుగా చర్చించుకునే వారు. ఇందులో ఎంత వరకు నిజం ఉందో తెలియరాలేదు. వారిద్దరూ కలిసి పలు రొమాంటిక్ సాంగ్స్‌లలో నటించినందుకే ఈ రూమర్స్ వచ్చాయని మరికొందరు చెప్పుకునేవారు. సిల్క్ స్మిత 1996 సెప్టెంబర్ 23న మరణించింది. సుమారు 27 ఏళ్ల తర్వాత విశాల్ 'మార్క్ ఆంటోని' చిత్రంలో స్మిత మాదిరి తమిళ నటి విష్ణుప్రియా గాంధీ కనిపించింది. మేకప్ సాయంతో ఆమెను అచ్చూ సిల్క్ మాదిరే తెరపై చూపించారు. దీంతో ఆమెకు సంబంధించిన పాత విషయాలు మరోసారి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. -
14 ఏళ్లకే పెళ్లి.. ఆపై వేధింపులు.. అర్ధాంతరంగా ముగిసిన నటి జీవితం!
తెలుగువారికి పరిచయం అక్కర్లేని పేరు. బావ బావమరిది చిత్రంలోని బావలు సయ్యా అనే పాటతో ప్రేక్షకులను ఊర్రూతలూగించింది. డిసెంబర్ 2, 1960లో ఆంధ్రప్రదేశ్‌లోని ఏలూరులో జన్మించిన సిల్మ్ స్మిత అసలు పేరు విజయలక్ష్మి. తమిళ ఇండస్ట్రీలో కెరీర్ ప్రారంభించిన ఆమె తెలుగు, మలయాళం, కన్నడ, హిందీ చిత్రాల్లోనూ నటించింది. మొదటి సిల్క్ స్మిత సహాయ నటిగా కెరీర్ ప్రారంభించింది. ఆ తర్వాత 1979లో తమిళ చిత్రం వండిచక్రంలో అద్భుతమైన నటనతో అందరి దృష్టిని ఆకర్షించింది. అలా సినీ ఇండస్ట్రీలో 17 ఏళ్ల ఓ వెలుగు వెలిగిన సిల్క్ స్మిత జీవితం అర్ధాంతరంగా ముగిసింది. సెప్టెంబర్ 23, 1996న 35 ఏళ్లకే ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోయింది. (ఇది చదవండి: విదేశాలకు ప్రభాస్.. సర్జరీ కోసమేనా!) కుటుంబ నేపథ్యం దాదాపు 450 చిత్రాల్లో కనిపించిన సిల్క్ స్మిత.. కుటుంబ ఆర్థిక పరిస్థితి బాగా లేకపోవడంతో బాల్యంలోనే చదువు వదిలేయాల్సి వచ్చింది. సిల్క్ స్మితకు 14 ఏళ్లకే పెళ్లి జరిగింది. అయితే పెళ్లి తర్వాత సిల్క్ స్మితకు భర్త, అత్తమామలు వేధింపులు ఎక్కువయ్యాయి. వీటన్నింటిని భరించలేక ఆమె ఇల్లు వదిలి వెళ్లాల్సి వచ్చింది. భర్త ఇంటి నుంచి మేకప్ ఆర్టిస్ట్ అయిన తన స్నేహితురాలి వద్దకు వెళ్లింది. తన స్నేహితురాలితో కలిసి సినిమా సెట్స్‌కి వెళ్లి మేకప్ కళను నేర్చుకుంది. కొన్ని నెలలకే మేకప్ ఆర్టిస్ట్‌గా పనిచేయడం ప్రారంభించింది. ఆ సమయంలో చిత్ర దర్శకుడు ఆంథోనీ ఈస్ట్‌మన్ ఆమెకు ఓ చిత్రంలో అవకాశమిచ్చాడు. అదే సిల్క్ జీవితాన్ని ఊహించని మలుపు తిప్పింది. ఆమె జీవితాన్ని పూర్తిగా మార్చేసింది. ఆ తర్వాత తమిళ దర్శకుడు విను చక్రవర్తి సిల్క్ స్మితకు నటన, డ్యాన్స్, ఇంగ్లీష్ నేర్చుకునేలా ఏర్పాట్లు కూడా చేశాడు. అప్పటి నుంచి సిల్క్ స్మిత తన కెరీర్లో వెనక్కి తిరిగి తీసుకోలేదు. స్టార్ హీరోలు నటించిన పెద్ద చిత్రాల్లో అవకాశాలొచ్చాయి. సిల్క్ తమిళం, మలయాళం, తెలుగు, హిందీతో సహా అన్ని భాషల్లోని చిత్రాల్లో స్పెషల్ సాంగ్స్‌తో మెరిసింది. మలయాళ స్టార్ మోహన్‌లాల్, కోలీవుడ్ స్టార్ కమల్‌హాసన్ వంటి పెద్ద స్టార్ల చిత్రాల్లో నటించింది. (ఇది చదవండి: సమాధిపై పడుకుంటూ కూతురితో ఆడుకున్న హీరో, వీడియో వైరల్) హోటల్లో సూసైడ్ వెండితెరపై ఆమెకు గొప్ప ప్రశంసలు దక్కినప్పటికీ.. ఆమె తన వ్యక్తిగత జీవితంలో సంతోషంగా సాగలేదు. ఆ తర్వాత ఆమె ఓ వైద్యుడిని వివాహం చేసుకుందని.. ఆమె సంపాదన మొత్తాన్ని సినిమాల్లో పెట్టుబడి పెట్టినట్లు తెలిసింది. అతను నిర్మించిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఫెయిలవ్వడంతో కష్టపడి సంపాదించిన డబ్బు మొత్తాన్ని కోల్పోయిందని అప్పట్లో వార్తలొచ్చాయి. కానీ ఆ తర్వాత ఎవరూ ఊహించని రీతిలో సిల్క్ స్మిత సెప్టెంబరు 23, 1996న ఓ హోటల్ రూమ్‌లో ఆత్మహత్య చేసుకుంది. అప్పట్లో పోలీసులు సూసైడ్ నోట్‌ను స్వాధీనం చేసుకున్నారు. అయితే అందులో సిల్క్ స్మిత.. తన జీవితం సంతోషంగా లేదని.. నమ్మినవారే మోసం చేశారంటూ.. అందుకే ఈ లోకాన్ని విడిచివెళుతున్నట్లు రాసుకొచ్చింది. -
వెండితెరపై మరో సిల్క్ స్మిత.. తెగ వైరలవుతున్న ఫోటో!
తమిళ స్టార్ హీరో విశాల్ నటిస్తోన్న సైన్స్ ఫిక్షన్ చిత్రం 'మార్క్ ఆంటోని'. రీతూ వర్మ, అభినయ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇటీవలే హైదరాబాద్‌లో ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను ఘనంగా నిర్వహించారు.ఈ చిత్రంలో ఎస్ జే.సూర్య ప్రతినాయకుడిగా నటించారు. విశాల్, ఎస్జే సూర్య ద్విపాత్రాభినయం చేయడం మరో విశేషం. మార్క్‌ఆంటోనీ చిత్రం నిర్మాణ కార్యక్రమాలు పూర్తిచేసుకుని ఈనెల 15న పాన్ ఇండియా స్థాయిలో విడుదల కానుంది. తమిళం, తెలుగు హిందీ భాషల్లో రిలీజ్ చేయనున్నారు. (ఇది చదవండి: ఒకే ఏడాదిలో రెండు విషాదాలు.. శోకసంద్రంలో మమ్ముట్టి కుటుంబం!) ఈ చిత్రానికి అధిక్ రవిచంద్రన్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే ట్రైలర్ రిలీజ్ కాగా.. ప్రేక్షకుల అదిరిపోయే రెస్పాన్స్ వస్తోంది. ఈ ట్రైలర్ చూసిన అభిమానులు ఈ సినిమాలో దివంగత నటి సిల్క్ స్మితను చూసి షాక్ తిన్నారు. అయితే ఈ పాత్రను ఏఐ టెక్నాలజీ రూపొందించారని అందరూ భావించారు. అసలు మార్క్ ఆంటోనీ చిత్రంలో నిజంగానే సిల్క్ స్మిత పాత్ర కనిపించనుందా? ఆ ట్రైలర్లో ఉన్న నటి ఎవరు? అదేంటో తెలుసుకుందాం. 'మార్క్ ఆంటోని' ట్రైలర్లో నటి సిల్క్ స్మితను చూసి ప్రేక్షకులు షాక్ అవుతున్నారు. మొదటగా సిల్క్ స్మితను ఏఐ టెక్నాలజీ సాయంతో రీక్రియేట్ చేసినట్లు వార్తలొచ్చాయి. కానీ వాటిలో ఎలాంటి నిజం లేదని తెలిసింది. అచ్చం సిల్క్ స్మితను పోలి ఉండే మరో తమిళ నటి మన ముందుకు రాబోతోంది. ఆమెనే విష్ణుప్రియా గాంధీ. సిల్క్ పాత్రలో విష్ణుప్రియా గాంధీ అచ్చం ఆమె పోలికతో అందరి దృష్టిని ఆకర్షించింది. ఇది చూసిన నెటిజన్స్ మాత్రం అచ్చం సిల్క్ స్మిత సిస్టర్లా ఉందంటూ కామెంట్స్ చేస్తున్నారు. (ఇది చదవండి: విశాల్ 'మార్క్ ఆంటోనీ' సినిమాపై బ్యాన్ విధించిన కోర్టు) ఈ నేపథ్యంలో దీనిపై మార్క్ ఆంటోని మేకప్ ఆర్టిస్ట్ కృష్ణవేణి బాబు సైతం సోషల్ మీడియా ద్వారా క్లారిటీ ఇచ్చారు. ఈ పాత్రకు సిల్క్ స్మితగా విష్ణుప్రియా గాంధీని తీర్చిదిద్దే అవకాశమిచ్చినందుకు సోషల్ మీడియా వేదికగా ధన్యవాదాలు తెలిపారు. గ్యాంగ్‌స్టర్ నేపథ్యంలో తెరకెక్కించిన ఈ చిత్రంలో సునీల్, సెల్వరాఘవన్ ప్రధాన పాత్రలు పోషిస్తుండగా.. జీవి ప్రకాశ్ సంగీతమందిస్తున్నారు. View this post on Instagram A post shared by Venu Chaithu (@venuchaithu28) View this post on Instagram A post shared by Venu Chaithu (@venuchaithu28) -
సిల్క్ స్మిత అరుదైన ఫొటోలు వైరల్
-
వీడియో: అచ్చం సిల్క్‌స్మితలా ఉన్న ఈ అమ్మాయి ఎవరో తెలుసా?
-
అచ్చం సిల్క్‌స్మితలా ఉన్న ఈ అమ్మాయి ఎవరో తెలుసా?
బోల్డ్ బ్యూటీ సిల్క్ స్మిత గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. ఒకప్పుడు తన అందచందాలతో దక్షిణాది చిత్ర పరిశ్రమను ఊపు ఊపేసిన ఆమె దశాబ్దానికి పైగా ఓ వెలుగు వెలిగింది. నిషా కళ్లు,హస్కీ వాయిస్, గ్లామర్‌తో హీరోయిన్లకు పోటీ ఇచ్చిన సిల్క్ స్మిత వారికి ధీటుగా స్టార్డమ్ సంపాదించుకుంది. ముఖ్యంగా ఐటెం సాంగులతో తనకంటూ ప్రత్యేకతను చాటుకున్న సిల్క్ దాదాపు స్టార్ హీరోలందరితోనూ జతకట్టింది. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో వందల సినిమాల్లో నటించి మెప్పించింది. స్టార్ హీరోస్ సైతం సిల్క్ స్మిత డేట్స్ కోసం ఎదురుచూసేవారు అంటే ఇండస్ట్రీలో ఆమె క్రేజ్ ఎలా ఉండేదో అర్థం చేసుకోవచ్చు. అయితే అంత ఇమేజ్‌ని సొంతం చేసుకన్న సిల్క్ స్మిత 1996లో ఆత్మహత్యకు పాల్పడి ప్రాణాలు వదిలింది. ఇదిలా ఉంటే తాజాగా ఓ అమ్మాయి అచ్చుగుద్దినట్లు సిల్క్ స్మితను పోలినట్లు ఉంది. ఆమె ఫోటోలు, వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. జూనియర్ సిల్క్‌గా గుర్తింపు పొందిన ఆ అమ్మాయి పేరు విష్ణుప్రియ. చూడటానికి అచ్చం జిరాక్స్ కాపీలా ఉన్న ఆమె సిల్క్ స్మితను గుర్తుచేస్తుంది. నటిగా రాణించాలన్నది తన కోరిక అని, అంతేకాకుండా సిల్క్ స్మిత తన ఫ్యామిలీకి ఎంతో సహాయం చేసిందంటూ చెప్పుకొచ్చింది. View this post on Instagram A post shared by Gandhi Vishnu Priya (@ivishnupriyagandhi) View this post on Instagram A post shared by Gandhi Vishnu Priya (@ivishnupriyagandhi) -
సిల్క్ స్మిత రాసిన చివరి ఉత్తరం ఇదే.. మోసం చేసిన సూపర్ స్టార్ ఎవరు?
సిల్క్ స్మిత.. ఈ పేరు గురించి సినీ ప్రేక్షకులకు ప్రతేకంగా చెప్పనక్కర్లేదు. ఒకప్పుడు తన అందచందాలతో దక్షిణాది చిత్ర పరిశ్రమను ఊపు ఊపేసింది. గ్లామరస్ పాత్రలు పోషిస్తూ వేలాది మంది అభిమానులను సంపాదించుకుంది. స్టార్ హీరోలు సైతం తమ సినిమాలో సిల్క్ స్మిత ఉండాలని పట్టుపట్టేవారంటే..అప్పట్లో ఆమె క్రేజ్ ఏ స్థాయిలో ఉండేదో అర్థం చేసుకోవచ్చు. అంత ఇమేజ్‌ని సొంతం చేసుకన్న సిల్క్ స్మిత.. ఆత్మహత్య చేసుకొని చనిపోవడం అందరిని కలిచివేసింది. ఓ సీనియర్ హీరో.. స్కిల్క్ స్మిత కెరీర్ నాశనం చేశారనే ఆరోపణలు ఉన్నాయి. అతని వల్లే అవకాశాలు రాలేట. దీంతో డిప్రెషన్లోకి వెళ్లిన స్మిత.. 1996లో బలవన్మరణానికి పాల్పడింది. అయితే ఆత్మహత్యకి ముందు ఓ సూసైడ్ నోట్ రాసుకుంది. అందులో ఇలా రాసుకొచ్చింది. దేవుడా నా 7వ సంవత్సరం నుంచి నేను పొట్టకూటి కోసం కష్టపడ్డాను. నేను నమ్మినవారే నన్ను మోసం చేశారు. నా వారంటూ ఎవరూ లేరు. బాబు తప్ప ఎవరూ నాపై ప్రేమ చూపలేదు. బాబు తప్ప అందరూ నా కష్టం తిన్నవారే. నా సొమ్ము తిన్నవారే నాకు మనశ్శాంతి లేకుండా చేశారు. అందరికీ మంచే చేశాను కానీ నాకు చెడు జరిగింది. నా ఆస్తిలో ఉన్నదంతా బాబు కుటుంబానికి నా కుటుంబానికి పంచాలి. నా ఆశలన్నీ ఒకరిమీదే పెట్టుకున్నా…అతను నన్ను మోసం చేశాడు. (చదవండి: సిల్మ్ స్మిత సూసైడ్.. ఆమెను చూసేందుకు వచ్చిన ఏకైన హీరో అతనే) దేవుడుంటే వాడిని చూసుకుంటాడు. రాము, రాధాకృష్ణన్ నన్ను చాలా రెచ్చగొట్టారు. వారికి ఎంతో మేలు చేశాను. కానీ వారు నాకు వారు చేసింది చాలా దారణం. నాకు ఒకడు 5సంవ్సరాల క్రితం జీవితం ఇస్తానన్నాడు. కానీ ఇప్పుడు ఇవ్వడం లేదు. నా రెక్కల కష్టం తినని వాడు లేడు బాబు తప్ప. ఇది రాయడానికి నేను ఎంత నరకం అనుభవించానో మాటల్లో చెప్పలేను’అంటూ బాధతో స్మిత రాసుకొచ్చింది. కాగా, స్మిత చనిపోయినప్పుడు.. కడసారి చూసేందుకు ఇండస్ట్రీ నుంచి ఒక్కరు కూడా వెళ్లలేదు. ఆమె కుటుంబ సభ్యులు కూడా వెళ్లలేదు. ఒక అనాథ శవంలా ఆమె అంత్యక్రియలు జరిపించారు. సిల్క్ స్మిత మరణం తర్వాత మోసం చేసిందెవరన్న దానిపై తెలుగు, తమిళ్ ఇండస్ట్రీలో చాలా చర్చ జరిగింది. స్మితను ఓ తమిళ సూపర్ స్టార్ వాడుకున్నాడని, చివరికి చేయిచ్చాడని చెప్పుకుంటారు. సూపర్ స్టార్ గా ఎంత పేరు సంపాదించినా.. స్మితకు మాత్రం అన్యాయం చేశాడని చెప్పుకుంటారు. ఆత్మహత్య చేసుకున్నప్పుడు స్మిత రాసిన చివరి లేఖలోనూ ఆ వ్యక్తి గురించే ప్రస్తావన చేసింది. స్మితకు చేసిన పాపమే ఆ వ్యక్తి రాజకీయంగా ఎదగలేకుండా చేసిందంటారు కొందరు. -
సిల్క్ స్మిత సూసైడ్... ఆమెను చూసేందుకు వచ్చిన ఏకైక హీరో అతనే!
సిల్క్ స్మిత పేరు ఇప్పటి సినీ ప్రేక్షకులను తెలియకపోవచ్చు. కానీ అప్పట్లో తెలుగు సినీ ప్రేక్షకులకు చిరకాలం గుర్తుండిపోయే పేరు. ఆ రోజుల్లో తన అందంతో అద్భుతమైన నటనతో ఆకట్టుకుంది. ఆమె చేసిన సాంగ్స్ ఇప్పటికీ కూడా మరిచిపోలేరంటే ఎంతలా పేరు సంపాదించిందో అర్థమవుతోంది. సిల్క్ స్మిత అసలు పేరు వడ్లపాటి విజయ లక్ష్మి. సిల్క్ స్మిత తమిళ చిత్ర పరిశ్రమలో తన నటన జీవితాన్ని ప్రారంభించింది. నిజం చెప్పాలంటే.. సిల్క్ స్మిత జీవితం ముళ్ల పాన్పు లాంటిది. అందరూ తెరపై ఆమె అందాన్ని చూశారే కానీ.. దాని వెనుక ఉన్న కష్టాన్ని ఎవరు గుర్తించలేకపోయారు. ఎంతోమంది అభిమానుల గుండెల్లో ఆమె శృంగార తారగానే ముద్రపడిపోయింది. తాజాగా ఆమె ఫోటోను నాని నటించిన దసరా మూవీలో ప్రదర్శించారు. దర్శకుడు శ్రీకాంత్ ఓదెల ఆమెకు వీరాభిమాని కావడం వల్లే ఆమె పోస్టర్‌ను సినిమాలో చూపించారు. తక్కువ కాలంలోనే ఎన్నో ఆవమానాలు ఎదుర్కొన్న సిల్క్ స్మిత తొందరగానే స్టార్ డమ్ తెచ్చుకుంది. అదే సమయంలో తెరమీద ఆమె అందాలను చూసిన వారే.. బయట చాలా చులకనగా చూసేవారట. వాటితో పాటు మన అనుకున్న వారే ఆస్తి కోసం మోసం చేశాడని తెలియడంతో తాను మరింత డిప్రెషన్లోకి వెళ్లిపోయింది. దీంతో వాటిని భరించలేక 1996లో బలవన్మరణానికి పాల్పడింది. అప్పట్లో సిల్క్ స్మిత మరణం ఇండస్ట్రీలో ఎంతోమందిని కలిచివేసింది. అంతే కాకుండా ఇండస్ట్రీలో ఉన్న ఏ ఒక్కరు కూడా భౌతికకాయాన్ని చూడడానికి కూడా రాలేదట. కనీసం ఆమె కుటుంబ సభ్యులు కూడా రాలేదు. ఒక అనాథలా ఆమెకు అంత్యక్రియలు జరిపించారు. కానీ సిల్క్ స్మిత భౌతికకాయాన్ని చూడడానికి ఒకే ఒక్క హీరో వచ్చాడట. అతనే యాక్షన్ కింగ్ అర్జున్. ఎవరేమనుకున్నా తనకు నష్టం లేదని.. ఆమె కడచూపు కోసం వచ్చాడట అర్జున్. అందుకు ప్రధాన కారణం సిల్క్, అర్జున్ మంచి స్నేహితులుగా ఉండేవారట. సిల్క్ స్మిత ఎప్పుడు అర్జున్ తో నేను చనిపోయాక నన్ను చూడడానికి వస్తావా అని అడిగేదని చెప్పారు. తాజాగా ఈ విషయాన్ని కోలీవుడ్‌కు చెందిన సినీ జర్నలిస్టు తోట భావనారాయణ రివీల్ చేసినట్లు చెప్తున్నారు. ప్రస్తుతం ఇది నెట్టింట వైరలవుతోంది. కాగా.. సిల్క్ స్మిత చివరిసారిగా తిరుంబి పార్ చిత్రంలో కనిపించింది. ఆ తర్వాత ఆమె నాలుగు సినిమాలు మరణానంతరం 2002లో విడుదలయ్యాయి. -
దసరా మూవీలో సిల్క్ స్మిత పోస్టర్.. ఎందుకంటే!
నాచురల్ స్టార్ నాని, కీర్తి సురేష్ జంటగా నటించిన చిత్రం 'దసరా'. రా అండ్ విలేజ్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాకు శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహిస్తున్నారు. సింగరేణి బొగ్గు గనుల నేపథ్యంలో రూపొందుతున్న ఈ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే రిలీజైన ట్రైలర్, పాటలు సినిమాపై మరింత హైప్‌ను క్రియేట్ చేస్తున్నాయి. మార్చి 30న ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో మూవీ ప్రమోషన్లలో బిజీగా ఉన్నారు చిత్రబృందం. ఇటీవల ఓ ఇంటర్వ్యూకు హాజరైన శ్రీకాంత్ ఓదెల సినిమాకు సంబంధించిన పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. దసరా పోస్టర్లో సిల్క్ స్మిత ఫోటో ఉండడంపై ఆయన అభిమానులకు క్లారిటీ ఇచ్చారు. శ్రీకాంత్ ఓదెల మాట్లాడుతూ.. 'నా చిన్నప్పుడు మా తాతకు కాళ్లు విరిగిపోయాయి. తాతా కల్లు తీసుకురామంటే వెళ్లా. కల్లు దుకాణంలో ఫస్ట్ టైమ్ సిల్క్ స్మిత ఫోటో చూశా. అప్పటి నుంచి దాదాపు 15 ఏళ్ల పాటు ఆమెను చూస్తూనే ఉన్నా. ఆ తర్వాత అనిపించింది నాకు. ఆమెలా చేయాలంటే చాలా గట్స్ ఉండాలేమో. ఆమెకు ఫ్యాషనేట్ సినిమాలంటే పిచ్చి అని విన్నాను. చిన్నప్పటి నుంచి నా బ్రెయిన్లో అలా ఉండిపోయింది. అందుకే కల్లు దుకాణం వద్దే సిల్క్ స్మిత ఫోటో పెట్టా.' అని అన్నారు. అయితే కీర్తి సురేశ్‌ను ఈ విషయంపై చాలామంది అడిగారని ఆమె చెప్పుకొచ్చారు. 'Dasara' Mass Jaathara ki sarvam siddham 🔥🔥 Natural Star @NameisNani's #Dasara Grand Release on 30 MARCH 2023 💥💥#EtlaitheGatlaayeSuskundhaam 🤙@KeerthyOfficial @Music_Santhosh @sathyaDP @NavinNooli @sudhakarcheruk5 @SLVCinemasOffl pic.twitter.com/6Fi0YN80A9 — srikanth odela (@odela_srikanth) August 26, 2022 -
రానున్న 'ది డర్టీ పిక్చర్' సీక్వెల్ ! సిల్క్ స్మితగా విద్యా బాలన్ డౌటే ?
The Dirty Picture Sequel In The Works But Not Featuring Vidya Balan: బాలీవుడ్ స్టార్ హీరోయిన్లలో విద్యా బాలన్ ఒకరు. లేడీ ఒరియెంటెడ్ చిత్రాలు, బయోపిక్‌లతో విద్యా పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ఇక ఆమె నటించిన సిల్క్ స్మిత బయోపిక్ ‘ది డర్టీ పిక్చర్’ మూవీతో ఓవర్ నైట్ స్టార్ అయిపోయింది. ఇందులో ఆమె నటనకు గానూ విమర్శకుల నుంచి ప్రశంసలు అందుకుంది. 2011లో విడుదలైన ఈ మూవీ విద్యా బాలన్‌కు విపరీతమైన క్రేజ్ తెచ్చిపెట్టడమే కాకుండా బాక్సాఫీస్ వద్ద అత్యధిక వసూళ్లను రాబట్టింది. అయితే తాజాగా ఈ సినిమా గురించి ఒక ఆసక్తకిర అప్డేట్ చక్కర్లు కొడుతోంది. సుమారు దశాబ్దం తర్వాత 'ది డర్టీ పిక్చర్' సినిమాకు సీక్వెల్ రానున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రానికి సీక్వెల్ రూపొందించే పనిలో ఉన్నట్లు దర్శకనిర్మాతలు ధ్రువీకరించినట్లు సమాచారం. అయితే ఈ సీక్వెల్ కోసం ఇంకా విద్యా బాలన్‌ను సంప్రదించలేదట. స్క్రిప్ట్ ఇంకా పూర్తి కానీ ఈ సీక్వెల్‌ను త్వరలో ప్రారంభిస్తారని సమాచారం. అయితే ఈ సినిమాకు విద్యా బాలన్నే తీసుకుంటారా? ఇంకా ఇతర హీరోయిన్‌కు అవకాశం ఇస్తారా? అనేది తెలియాల్సి ఉంది. చదవండి: నేను పెళ్లి చేసుకునే సమయానికే ఆమెకు ఒక బాబు: బ్రహ్మాజీ కాగా మిలన్ లుత్రియా దర్శకత్వం వహించిన 'ది డర్టీ పిక్చర్' చిత్రం రూ. 18 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కి బాక్సాఫీస్ వద్ద రూ. 117 కోట్లు కొల్లగొట్టింది. ఈ సినిమాలో విద్యా బాలన్‌తో పాటు ఇమ్రాన్ హష్మీ, నసీరుద్ధీన్ షా, తుషార్ కపూర్ కీలక పాత్రలు పోషించగా, ఏక్తా కపూర్, శోభా కపూర్ నిర్మాతలుగా వ్యవహరించారు. ఇక ఇప్పుడు ఈ సినిమాకు రానున్న సీక్వెల్ ఎలాంటి రికార్డు సృష్టిస్తుందో వేచి చూడాల్సిందే. చదవండి: బిగ్‌బాస్ బ్యూటీకి లైంగిక వేధింపులు.. ఆవేదనతో పోస్ట్ -
Silk Smitha: సిల్క్ స్మిత గురించి ఈ విషయాలు తెలుసా?
Silk Smitha Birth Anniversary Special Story: సిల్క్ స్మిత అసలుపేరు విజయలక్ష్మీ. 1960 డిసెంబర్2న ఏలూరులో జన్మించిన ఆమె నాల్గవ తరగతి వరకు చదువుకుంది. ఆర్థిక ఇబ్బందుల వల్ల చదువు మానేసింది. పదిహేనేళ్లకే పెళ్లి చేసేశారు. అయితే భర్త, అత్తమామలు వేధింపులతో ఇల్లు వదిలి పారిపోయింది. నటనపై ఉన్న ఇష్టంతో మద్రాసుకి వెళ్లి తొలుత టచప్ ఆర్టిస్ట్‌గా పనిచేసింది. ఆ సమయంలోనే సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు చేసింది. ‘ఘరానా గంగులు’సినిమాతో టాలీవుడ్‌కు ఎంట్రీ ఇచ్చింది. చదవండి: Silk Smitha: సిల్క్‌స్మిత మరణం.. ఇప్పటికీ ఓ మిస్టరీనే! ఎన్టీఆర్ ‘నా దేశం’ చిత్రంలో “నేనొక నెత్తురు దీపం…”సాంగ్‌లో నర్తించిన సిల్క్..ఆ తర్వాత ఐటెం గర్ల్‌గా గుర్తింపు పొందింది. అప్పటి నుంచి దాదాపు టాప్ హీరోలందరి సినిమాల్లో సిల్క్ స్మిత డ్యాన్స్ స్టెప్పులు ఉండాల్సిందే అనేంతలా క్రేజ్ దక్కించుకుంది. అప్పటికే జ్యోతిలక్ష్మీ, జయమాలిని ఐటెమ్ సాంగ్స్‌తో చెలరేగిపోతున్నా సిల్క్ స్మిత తనకంటూ ప్రత్యేక బ్రాండ్ ఇమేజ్ను సొంతం చేసుకుంది. మత్తు కళ్లతో సిల్వర్ స్క్రీన్‌కి హాట్ ఇమేజ్ తీసుకువచ్చింది. ఆ సమయంలోనే ‘గూండా, ఛాలెంజ్’, బాలకృష్ణ ‘ఆదిత్య 369’వంటి చిత్రాలలోనూ కీలక పాత్రల్లోనూ నటించి సత్తా చాటింది. కానీ అర్థాంతరంగా 1996 సెప్టెంబరు 23న ఆత్మహత్య చేసుకొని చనిపోయింది. సిల్క్ జీవితం ఆధారంగానే ఏక్తాకపూర్ ‘ద డర్టీ పిక్చర్’అనే సినిమా సైతం తెరకెక్కించిన సంగతి తెలిసిందే. సిల్క్‌స్మిత చనిపోయి నేటికి 25ఏళ్లు పూర్తైనా ఇప్పటికీ అభిమానులు ఆమెను గుర్తుచేసుకుంటున్నారు. (మరిన్ని ఫొటోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి) చదవండి: Akhanda Movie: జై బాలయ్య నినాదాలతో ఫ్యాన్స్ రచ్చ రచ్చ.. -
Silk Smitha: సిల్క్‌స్మిత మరణం.. ఇప్పటికీ ఓ మిస్టరీనే!
Silk Smitha Death Mystery In Telugu: Still Continues After 25 Years: సిల్క్ స్మిత..గ్లామర్ ప్రపంచంలో ఈ పేరు ఓ సెన్సేషన్. మత్తు కళ్లతో సిల్వర్ స్క్రీన్‌కి హాట్ ఇమేజ్ అద్దిన అందమైన స్వప్నం సిల్క్ స్మిత. అప్పటివరకు ఉన్న కమర్షియల్ హంగులను మార్చేసి తన పేరుకే సరికొత్త బ్రాండ్ ఇమేజ్ను క్రియేట్ చేసుకున్నారామే. వ్యాంప్ పాత్రలతో తనకంటూ ప్రత్యేక స్టార్డంను సొంతం చేసుకుంది. తన అందచందాలతో మత్తెక్కించిన సిల్క్..నిజజీవితం మాత్రం అంతుచిక్కని కథలానే మిగిలిపోయింది. రంగుల ప్రపంచంలో అమాయకపు చిరునవ్వుల్ని మిగిల్చి తనను తాను అంతం చేసుకుంది. ఇప్పటికీ సిల్క్ స్మిత మరణం ఒక మిస్టరీగానే మిగిలిపోయింది. సిల్క్ స్మిత అసలు పేరు విజయలక్ష్మీ. తొలి సినిమా బండి చక్రంలో తాను పోషించిన సిల్క్ పాత్రనే తన ఇంటి పేరుగా మార్చుకుంది. క్యారెక్టర్ ఆర్టిస్ట్ నుంచి సీతాకోక చిలుక, వసంత కోకిల వంటి సినిమాల్లో నటించి విమర్శకుల ప్రశంసలు అందుకుంది. అప్పట్లో సిల్క్ డ్యాన్స్ బీట్ లేనిదే స్టార్ హీరోల సినిమాలు లేవంటే అతిశయోక్తి కాదేమో. అంతలా క్రేజ్ సంపాదిచుకున్న ఆమె స్టార్ హీరోలకు సరిసమానంగా పారితోషికం తీసుకునేది. కెరీర్ పీక్ టైంలో ఉండగానే ఓ హీరోతో ప్రేమ విఫలం కావడం, సినిమాల్లో పెట్టుబడి పెట్టి ఆర్థికంగా నష్టపోవడం ఆమెను మరింత కుంగదీసిందని అంటుంటారు. తన ఆర్థిక నష్టాలను పూడ్చుకోవాలని భావించిన స్మిత.. ఎందుకో కొన్నాళ్లు గ్యాప్ కూడా తీసుకుంది. ఆ సమయంలోనే మద్యాపానానికి అలవాటు అయ్యింది. అయితే ఏమైందో తెలియదు కానీ 1996 సెప్టెంబరు 23న తన ఇంట్లోనే ఫ్యాన్‌కు ఊరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది. అప్పట్లో సిల్క్ స్మిత సూసైడ్ ఇండస్ట్రీని కుదిపేసింది. (మరిన్ని ఫొటోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి) చదవండి: Silk Smitha: సిల్క్ స్మిత గురించి ఈ విషయాలు తెలుసా? -
వెండితెర కన్నీటి చుక్క
-
వెండితెర సంచలనం... నటి సిల్క్ స్మిత (ఫోటోలు)
-
'సిల్క్ స్మిత'ను చూసి శ్రీదేవి కూడా ఫాలో అయ్యేది : బాలకృష్ణ
Balakrishna About Silk Smitha : సిల్మ్ స్మిత..ఈ పేరును ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. శృంగార తారగా స్టార్ డం తెచ్చుకున్న సిల్మ్ స్మిత రజనీకాంత్, కమల్ హాసన్, చిరంజీవి, బాలకృష్ణ వంటి స్టార్ హీరోలందరితో నటించారు. గ్లామర్ పాత్రలతో అలరించిన ఆమె తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ సహా పలు భాషల్లో 450కి పైగా సినిమాల్లో నటించారు. అప్పటివరకు కేవలం గ్లామరస్ డాల్‌గానే గుర్తింపు పొందిన ఆమె ఆదిత్య 369 సినిమాలో కీలకపాత్ర పోషించి నటిగా గుర్తింపు పొందారు. ఇటీవలె ఈ సినిమా విడుదలై 30 ఏళ్లు పూర్తైన సందర్భంగా ఈ చిత్ర విశేషాలపై బాలకృష్ణ పలు ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు. సిల్క్ స్మిత గురించి మాట్లాడుతూ..'ఆమెకు తెలుగు రాకపోవడంతో ఇంగ్లీషులో డైలాగ్ పూర్తిచేసింది. షాట్ అయ్యాక ఓకేనా సార్ అని డైరెక్టర్ని అడిగే సరికి అందరూ బిత్తరపోయారు. నువ్ మాట్లాడింది ఇంగ్లీష్ తల్లీ.. అని ఆ డైరెక్టర్ చెప్పడంతో సెట్లో అంత నవ్వుకున్నాం. ఇక మేకప్, కాస్ట్యూమ్స్ విషయంలో సిల్క్ స్మితను కొట్టిన ఆడదే లేదు. ఎందుకంటే శ్రీదేవి వంటి స్టార్ హీరోయిన్లు సైతం సిల్మ్ స్మిత కాస్ట్యూమ్స్, మేకప్‌ని ఇమిటేట్ చేసేది. ఒక డ్యాన్సర్‌ని స్టార్ హీరోయిన్లు సైతం ఫాలో కావడం అంటే అది మామూలు విషయం కాదు' అంటూ బాలకృష్ణ సిల్క్ స్మితపై ప్రశంసలు కురిపించారు. -
సిల్క్ స్మిత డైరెక్టర్ ఆంథోని ఇకలేరు
సినీ పరిశ్రమలో మరో విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ మలయాళ డైరెక్టర్, నిర్మాత ఆంథోని ఈస్ట్‌మన్(75) గుండెపోటుతో కన్నుమూశారు. శనివారం ఆయనకు గుండెపోటు రావడవంతో కుటుంబ సభ్యులు త్రిస్పూర్‌లోని మెడికల్ కాలేజీకి తరలించారు. ఈ క్రమంలో చికిత్స పొందుతు ఆయన తుదిశ్వాస విడిచారు. దీంతో ఆయన మృతికి మలయాళ సినీ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా సంతాపం వ్యక్తం చేస్తున్నారు. ఫొటోగ్రాఫర్‌గా కెరీర్ స్టార్ చేసిన ఆంథోని ఈస్టమన్ అనే స్టూడియో ప్రారంభించారు. ‘ఇనాయే తేడి’ అనే చిత్రంతో ఆయన దర్శకుడిగా మారారు. ఈ మూవీ తర్వాత అంబాడే న్జానే, ఐస్ క్రీమ్, వయల్ వంటి చిత్రాలను తెరకెక్కించి హిట్ అందుకున్నారు. ఇక సీనియర్ నటి సిల్క్ స్మితను వెండితెరకు పరిచయం చేసింది కూడా ఈయనే. గతంలో ఆయన ఓ ఇంటర్య్వూలో మాట్లాడుతూ సిల్క్ స్మితను వెండితెరకు ఎలా పరియం చేశారో వివరించారు. ‘హీరోయిన్ కోసం వెతుకుతున్న క్రమంలో కొద్ది రోజులకు కోడంబక్కంలోని కొందరూ యువతులు మేకప్ వేసుకోని ఆడిషన్స్ ఇస్తున్నారు. అక్కడే ఓ యువతి పనిమనిషిలా కుర్చోని ఉంది. ఆమెను ఫొటో తీసుకోవచ్చా అని ఆమె అమ్మ దగ్గరి అనుమతి తీసుకుని ఆ యువతిని మేకప్ లేకుండా ఫొటోలు తీసుకున్నాను. ఆ ఫొటోలను కొందరు డైరెక్టర్స్‌కు చూపించాను. అందరూ ఆమెను హీరోయిన్గా తీసుకునేందుకు ఆసక్తి చూపించారు. దీంతో ఆమెను సంప్రదించాం. ఆమె కూడా సినిమాలకు ఒకే చెప్పింది. అయితే తన పేరు మారుస్తామని చెప్పడంతో ఆమెకు ఎలాంటి అభ్యంతరం లేదని స్పష్టం చేసింది. అలా సిల్క్ మూవీకి ఆమెను హీరోయిన్గా తీసుకున్నాం. అయితే అప్పట్లో స్మిత పాటిల్ పాపులర్‌గా నటిగా ఉన్న సమయం అది. అందుకే ఆమెకు స్మిత అని పేరు పెట్టాం. చివరకు తన తొలి చిత్రం సిల్క్‌తో కలిపి సిల్క్ స్మిత విజయమాల మారిపోయింది’ అంటూ ఆయన చెప్పుకొచ్చారు. -
సిల్క్ స్మిత బయోపిక్‌లో శ్రీరెడ్డి
వివాదాస్పద నటి శ్రీరెడ్డి మరోసారి వార్తల్లో నిలిచారు. దివంగత నటి సిల్క్‌స్మిత జీవితకథ ఆధారంగా తెరకెక్కుతున్న బయోపిక్‌లో శ్రీరెడ్డి లీడ్ రోల్ పోషించనుంది. ఈ విషయాన్ని ఆమె స్వయంగా తన ఫేస్బుక్ ఖాతా ద్వారా అధికారికంగా వెల్లడించింది. గత కొన్ని రోజులుగా గుడ్‌న్యూస్ చెబుతానంటూ ఊరిస్తున్న శ్రీరెడ్డి ఎట్టకేలకు సన్సెస్‌ను రివీల్ చేసింది. దిగ్గజ నటి సిల్క్ స్మిత బయోపిక్ చేస్తున్నానని, మీ అందరి ఆశీర్వాదాలు ఉండాలని కోరుకుంటున్నట్లు పేర్కొంది. మధు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం తెలుగు, తమిళం భాషల్లో విడుదల కానుంది. మరిన్ని వివరాలు త్వరలోనే వెల్లడిస్తానని శ్రీరెడ్డి తెలిపింది. ఇక టాలీవుడ్లో కాస్టింగ్ కౌచ్‌తో తీవ్ర దుమారాన్ని రేపిన శ్రీరెడ్డి ఒక్కసారిగా వార్తల్లో నిలిచిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత కూడా ఆమెకు పెద్దగా ఆఫర్లు రాకపోవడంతో చెన్నైకి మకాం మార్చింది. (ప్రియాంక ఆత్మకథ: విస్తుపోయే విషయాలు వెల్లడి) సిల్క్ స్మితతో తనను తాను పోల్చకుంటూ ఓ ఫోటోను కూడా విడుదల చేసింది. అయితే ఈ బయోపిక్‌లో శ్రీరెడ్డి నటించడం పట్ల కొందరు నెటిజన్లు అసహనం వ్యక్తం చేస్తున్నారు. మొదట సిల్క్ స్మిత బయోపిక్‌లో యంకర్ అనసూయ నటించనున్నట్లు రూమర్స్ వచ్చాయి. ఈ సినిమాతో ఆమె కోలీవుడ్‌లో ఎంట్రీ ఇస్తున్నట్లు వార్తలు గుప్పుమనడంతో ఈ పుకార్లకు అనసూయ చెక్ పెట్టారు. సిల్క్ స్మిత బయోపిక్‌లో నటించడం లేదని తేల్చి చెప్పింది. ఇప్పటికే సిల్క్ స్మిత జీవితకథ ఆధారంగా పలు భాషల్లో బయోపిక్‌లు విడుదలైన సంగతి తెలిసిందే. బాలీవుడ్లో 2011లో డర్టీ పిక్చర్ పేరుతో విడుదలైన సిల్క్ స్మిత బయోపిక్‌లో నటి విద్యాబాలన్ నటించింది. ఈ సినిమాలో ఆమె అభినయానికి గానూ జాతీయ అవార్డును సొంతం చేసుకుంది. (కంగనా సవాల్.. నా కంటే గొప్ప నటిని చూపించగలరా?) -
సిల్క్ స్మిత బయోపిక్ చేయడం లేదు
బుల్లితెర, వెండితెర ఏదైనా అనసూయకు కొట్టిన పిండే. యాంకర్‌గా అలరిస్తూనే నటిగా మెప్పిస్తున్నారు. ఏ పాత్ర ఇచ్చినా అందులో పరకాయ ప్రవేశం చేసి దానికి నూటికి నూరు శాతం న్యాయం చేస్తారు. అలా రంగస్థలం సినిమాలో ఆమె చేసిన రంగమ్మత్త పాత్ర ప్రేక్షకులకు విపరీతంగా కనెక్ట్ అయింది. తాజాగా ఆమె ఓ కొత్త సినిమాతో కోలీవుడ్‌లో అడుగుపెట్టబోతున్నారు. ఈ విషయాన్ని ఆమె స్వయంగా వెల్లడించారు. మరో మంచి కథ.. కొత్త ఆరంభం, కోలీవుడ్ అనే క్యాప్షన్‌తో అద్దంలో తన ముఖాన్ని చూసుకుంటున్న బ్లాక్ అండ్ వైట్ ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. అంతా బాగానే ఉంది, కానీ ఆ ఫొటోకు రిఫరెన్స్ సిల్క్ స్మితగారు అని ఆమె పేరును ట్యాగ్ చేశారు. (చదవండి: అనసూయ కోలీవుడ్ చిత్రం.. సిల్క్ స్మిత బయోపిక్!) దీంతో ఆమె కోలీవుడ్‌లో తెరకెక్కనున్న సిల్క్ స్మిత బయోపిక్‌లో నటించనున్నారని వార్తలు గుప్పుమన్నాయి. ఈ బయోపిక్ షూటింగ్ కోసం ఆమె చెన్నైకు కూడా వెళ్లొచ్చినట్లు ఊహాగానాలు మొదలయ్యాయి. ఈ పుకార్లకు అనసూయ చెక్ పెట్టారు. సిల్క్ స్మిత బయోపిక్‌లో నటించడం లేదని తేల్చి చెప్పారు. ఈ మేరకు బుధవారం ట్వీట్ చేశారు. కాగా అనసూయ ప్రస్తుతం చిరంజీవి 'ఆచార్య', అల్లు అర్జున్ 'పుష్ప' సినిమాల్లో కీలక పాత్రలు పోషిస్తున్నారు. కృష్ణ వంశీ సినిమా 'రంగమార్తాండ'లోనూ ఓ ముఖ్యమైన పాత్రలో నటిస్తున్నారు. అంతేకాక రవితేజ 'ఖిలాడీ' చిత్రంలో ప్రముఖ పాత్రలో నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడమే కాక స్పెషల్ సాంగ్‌లో హీరోతో కలిసి చిందులేయనున్నారట. (చదవండి: వెయ్యి మంది... వంద రోజులు!) -
కోలీవుడ్: సిల్క్ స్మితగా అనసూయ..
సాక్షి, హైదరాబాద్: జబర్దస్త్ యాంకర్‌గా బుల్లితెరపై తళుక్కుమన్న అనసూయ భరద్వాజ్ అవకాశం వచ్చినప్పడల్లా వెండితెరపై మెరుస్తున్నారు. అయితే సినిమాల సెలక్షన్స్‌లలో ఆనసూయ ఆచితూచి అడుగు వేస్తున్నారు. గ్లామర్ అయినా డీగ్లామరైన పాత్ర నచ్చితేనే ఒకే చెబుతారు. లేదంటే ఎంత పెద్ద దర్శకుడికైన మొహమాటం లేకుండా నో అంటారు. ఈ క్రమంలో ‘రంగస్థలం’లో రంగమ్మత్త క్యారెక్టర్లో నటించి మంచి మార్కులు కొట్టెసిన అనసూయ తాజాగా కోలీవుడ్‌లో కూడా అడుగు పెడుతున్న విషయం తెలిసిందే. తమిళ సూపర్ స్టార్ విజయ్ సేతుపతితో కలిసి ఓ చిత్రంలో నటిస్తున్నారు. అయితే ఈ చిత్రానికి సంబంధించిన తాజా అప్డేట్ను ఆదివారం సోషల్ మీడియలో పోస్టు చేశారు అనసూయ. తన ఇన్‌స్టాగ్రామ్‌లో బ్లాక్ అండ్ వైట్ ఫొటో షేర్ చేస్తూ.. ‘మరో మంచి కథ.. కొత్త ఆరంభం.. కోలీవుడ్’ అనే క్యాప్షన్ జత చేశారు. అంతేగాక రిఫరెన్స్ సిల్క్ స్మిత గారు అంటూ ఆమె పేరును ట్యాగ్ చేశారు. ఈ ఫొటోలో అనసూయ అద్దంలో తన రూపాన్ని చూసుకుంటూ ఫొజు ఇచ్చి కనిపించారు. (చదవండి: సేతుపతితో రంగమ్మత్త?!) View this post on Instagram A post shared by Anasuya Bharadwaj (@itsme_anasuya) అయితే విజయ్ సేతుపతితో కలిసి నటిస్తున్న ఈ సినిమా నాటి గ్లామర్ బ్యూటీ సిల్క్ స్మిత బయోపిక్‌గా రూపొందనుందని ఇందులో అనసూయ లీడ్‌రోల్ పోషిస్తున్నట్లు సమచారం. అనసూయ ఇప్పటికే చిరంజీవి, కొరటాల శివ కాంబినేషన్లో తెరకెక్కుతున్న 'ఆచార్య' సినిమాలో కీలక పాత్ర చేస్తున్న విషయం తెలిసిందే. అంతేగాక కృష్ణవంశీ ‘రంగమార్తాండ’లో కూడా ఆమె ఓ స్పెషల్ రోల్ చేయనున్నారు. ఇప్పుడు తాజాగా మాస్ మహారాజు రవితేజ 'ఖిలాడీ' చిత్రంలో ముఖ్య పాత్రలో నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ‘రాక్షసుడు’ ఫేమ్ రమేష్ వర్మ తెరకెక్కిస్తున్న 'ఖిలాడి' చిత్రం ఫస్ట్‌లుక్ పోస్టర్ ఇటీవలే విడుదలైన విషయం తెలిసిందే. దీనికి ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించింది. రవితేజ డబుల్ రోల్ చేస్తున్న ఈ సినిమాలో మీనాక్షి చౌదరి, డింపుల్ హయాతి హీరోయిన్స్‌గా నటిస్తున్నారు. ఇందులో అనసూయ ముఖ్య పాత్ర పోషించడమే కాక ఓ స్పెషల్ సాంగ్‌లో రవితేజతో కలిసి చిందులేయన్నారంట. (చదవండి: అందుకే అనసూయ పాత్రను తిరస్కరించాను: రాశి) -
స్మితకు ఆ పాత్రలంటే ఇష్టం ఉండేవి కాదు..
సాక్షి, హైదరాబాద్: సిల్క్ స్మిత ఈ పేరును ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. దక్షిణాదిన తనకంటు ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న సిల్క్ స్మిత (డిసెంబర్ 2) జయంతి నేడు. ఈ సందర్భంగా మరోసారి ఆమెను గుర్తు చేసుకుందాం. 1960 డిసెంబర్ 2న పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో జన్మించిన ఆమె ఒక మేకప్ ఆర్టిస్ట్‌గా తన సినీ కెరీర్‌ను ప్రారంభించారు. ఆ తర్వాత సినమాల్లో సపోర్టు క్యారెక్టర్స్ చేసుకుంటున్న తరుణంలో 1979లో ఆమె నటించిన తమిళ సినిమా ‘వండిచక్రం’తో ఆమె కేరీర్ మలుపు తిరిగింది. ఇందులో బార్ డ్యాన్సర్‌గా గ్లామర్ పాత్ర పోషించి ఆమెకు రాత్రి రాత్రే స్టార్డమ్ వచ్చింది. అలా తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ సహా పలు భాషల్లో 450కి పైగా సినిమాల్లో నటించారు. రజనీకాంత్, కమల్ హాసన్, చిరంజీవి, మోహన్ లాల్, అక్కినేని నాగార్జున, మమ్ముట్టి వంటి సూపర్ స్టార్లతో కలిసి నటించిన సిల్క్ స్మిత తన జీవితం తెరపై కనిపించినంత రంగుల మయం కాదని ఎప్పుడూ ఆవేదన వ్యక్తం చేస్తూండేవారు. ఈ క్రమంలోనే ఆమె అర్థాంతరంగా తనువు చాలించి సినీ పరిశ్రమను శోకసంద్రంలోకి నెట్టారు. (చదవండి: పవన్ ఫొటో షేర్ చేసిన రేణు దేశాయ్) అయితే ఆమె మరణవార్త విని బాధపడిన వారు ఎంతమంది ఉన్నారో.. ఆమె లేదని సంతోషించిన వారు సైతం కూడా ఉన్నారు. ఎందుకంటే నటిగా ఆమె తీసుకునే ధైర్యమైన నిర్ణయాలు, వాటితో స్మితకు వచ్చిన పేరును చూసి చాలామంది అసూయపడేవారు. అయితే పరిశ్రమలో అంతటి పేరు తెచ్చుకున్న ఆమె జీవిత కథ తెలిసిన వారు మాత్రం కన్నీరు పెట్టుకోవాల్సిందే. ఓ చిన్న పల్లెటూరిలో పుట్టిన ఆమె అసలు పేరు విజయ లక్ష్మీ వడ్లపాటి. తన తల్లిదండ్రులు చదివించలేక నాలుగో తరగతిలోనే ఆమెను స్కూల్ మాన్పించారు. అంతేకాకుండా చిన్న వయసులోనే వివాహం చేసి పంపించారు. అయితే అక్కడ భర్త, అత్తమామల వేధింపులు తట్టుకోలేక రైలెక్కి చెన్నై వెళ్లిన ఆమె సినిమా అవకాశాల కోసం ఎదురుచుశారు. ఈ క్రమంలో పలు సినిమాల్లో ఐటెం సాంగ్‌లో నటించిన ఆమె ఆ తర్వాత వెండితెరను ఏలే శృంగార తారగా గుర్తింపు తెచ్చుకున్నారు. అలా బోల్డ్ క్యారెక్టర్స్‌తో స్టార్ నటిగా ఎదిగిన ఆమెకు అసలు ఆ పాత్రలంటే ఇష్టం ఉండేవి కాదని స్వయంగా ఆమె పలు ఇంటర్య్వూలో వెల్లడించారు. (చదవండి: ఆమె అంతే!) నిజానికి మంచి ఆర్టిస్టు కావాలన్న ఆమె కోరిక అందుకోసమే సినిమాల్లోకి వచ్చారు. అయితే తమిళంలో వచ్చిన ‘వండిచక్రం’ సినిమాలో సిల్క్ స్మితా అనే బార్ డ్యాన్సర్‌గా నటించిన ఆమె పాత్రకు మంచి గుర్తింపు రావడంతో అప్పటి నుంచి దర్శక నిర్మాతలు అలాంటి పాత్రలే ఇచ్చారు. ఇష్టం లేకున్న వరుసగా అలాంటి పాత్రలే చేయడంతో అలా సిల్క్ స్మిత అంటే గ్లామర్ హీరోయిన్గా పేరు తెచ్చుకున్నారు. ఈ తరుణంలోనే 1996 సెప్టెంబర్ 23న సిల్క్ స్మిత చెన్నైలోని తన అపార్ట్మెంట్లో అనుమానస్పద స్థితిలో మృతి చెందారు. అయితే ఆమె మృతి ఎన్నో అనుమానాలతో ఇప్పటికీ మిస్టరీగానే ఉండిపోయింది. ఈ క్రమంలో సిల్క్ స్మిత జీవిత కథ ఆధారంగా హిందీలో ‘ది డర్టీ పిక్చర్’ సినిమా తెరకెక్కిన విషయం తెలిసిందే. ఇందులో విద్యాబాలన్ స్మితా పాత్రను పోషించారు. -
ఆమె అంతే!
సౌతిండియా గ్లామర్ క్వీన్ సిల్క్ స్మిత జీవితం ఆధారంగా గతంలో హిందీలో ‘డర్టీ పిక్చర్’ చిత్రాన్ని తెరకెక్కించారు. విద్యా బాలన్ ముఖ్య పాత్రలో నటించారు. తాజాగా స్మిత జీవితం ఆధారంగా మరో సినిమా తెరకెక్కనుంది. తమిళంలో తెరకెక్కనున్న ఈ సినిమాకు ‘అవళ్ అప్పడిదాన్’ (ఆమె అంతే అని అర్థం) అనే టైటిల్ ఖరారు చేశారు. కేయస్ మణికందన్ దర్శకత్వం వహించనున్న ఈ చిత్రాన్ని లక్ష్మణ్, హెచ్. మురళి నిర్మించనున్నారు. నవంబర్‌లో ఈ సినిమాను సెట్స్ మీదకు తీసుకెళ్లనున్నట్టు సమాచారం. టైటిల్ రోల్లో ఎవరు నటిస్తారనేది ఇంకా ప్రకటించలేదు. ‘సిల్క్ స్మిత గ్లామర్‌ను ఇప్పటి వరకూ ఎవ్వరూ మ్యాచ్ చేయలేకపోయారు. ఆమె పాత్రను పోషించే నటి కోసం చూస్తున్నాం’’ అన్నారు దర్శకుడు మణికందన్. -
తెర వెనుక అంతులేని విషాద‘గాథలు’
పైకి ఎంతో అందంగా కనిపించే ‘రంగుల ప్రపంచం’ వెనుక అంతులేని విషాద‘గాథలు’ ఎన్నో దాగున్నాయి. వెండితెరపై తళుకులీనుతూ డ్రీమ్ గర్ల్స్‌గా, కలల రాకుమారులుగా ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్రవేసి, పేరుప్రతిష్టలతో పాటు డబ్బు సంపాదించాలని చాలా మంది ఇండస్ట్రీలో అడుగుపెడతారు. అనుకున్నది సాధిస్తే ‘స్టార్లు’గా ఉన్నత శిఖరాలకు చేరుకుంటారు. లక్ వెక్కిరిస్తే మాత్రం ఎంత ప్రతిభ ఉన్నా అధః పాతాళానికి పడిపోతారు. వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోలేక, ఒత్తిడికి లోనవుతారు. వ్యక్తిగత జీవితంలో ఆటుపోట్లు, ఆర్థిక నష్టాలు కూడా ఇందుకు తోడైతే తీవ్రమైన నిర్ణయాలు తీసుకుంటారు. అలా బలవన్మరణం చెందిన తారలు ఎంతో మంది ఉన్నారు. వారిలో ‘సిల్క్’ స్మిత కూడా ఒకరు. ఆమె ఈ లోకాన్ని వీడి నేటికి ఇరవై నాలుగేళ్లు. సిల్వర్ స్క్రీన్‌పై హీరోయిన్గా వెలిగిపోవాలని కలలుగన్న విజయలక్ష్మి అలియాస్ సిల్క్ స్మిత ఇండస్ట్రీలో ఐటంగర్ల్‌గా సెటిలైంది. తన అందచందాలు, హావభావాలతో ‘మాస్’ను ఉర్రూతలూగించి, యువ ప్రేక్షకుల మనసు దోచుకుంది. అభిమానుల చేత ‘ఇండియన్ మార్లిన్ మన్రో’గా జేజేలు కొట్టించుకుంది. ఒకానొక సమయంలో కథానాయికల కంటే కూడా ఎక్కువ క్రేజ్ సంపాదించుకుని, డిమాండ్ ఉన్న నటిగా నిర్మాతల దృష్టిని ఆకర్షించింది. సిల్క్ ఉంటే చాలు సినిమా హిట్టే అన్నంత క్రేజీ స్టార్‌గా వెలుగొంది, ‘గ్లామర్’ వరల్డ్‌లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు దక్కించుకుంది. అయితే నటనలో భాగంగా చూపుల వలవేసి అందరినీ తనవైపు తిప్పుకోగల ఆకర్షణ ఉన్న సిల్క్ నిజజీవితంలో మాత్రం, తన మనసుకు బాగా నచ్చిన అతికొద్ది మందితో మాత్రమే ఫ్రెండ్లీగా మెలిగేవారట. బహుశా అందువల్లేనేమో నేటికీ ఆమె ఆత్మహత్య వెనుక గల స్పష్టమైన కారణాలు ఇంతవరకు వెల్లడి కాలేదు. ప్రేమలో విఫలమైనందు వల్లే ఆమె ఆత్మహత్య చేసుకుందని కొంతమంది అంటే, మరికొంత మంది మాత్రం ఆర్థిక నష్టాల వల్లే తనను తాను అంతం చేసుకుందని అంటారు. కాగా ఆంధ్రప్రదేశ్‌లోని దెందలూరుకు చెందిన సిల్క్ స్మిత ఐదు భాషల్లో దాదాపు 450పైగా సినిమాల్లో నటించారు. 17 ఏళ్ల కెరీర్లో ఎన్నో ఎత్తుపళ్లాలు చవిచూసిన ఆమె.. సినీ నిర్మాణంలో అడుగుపెట్టి తీవ్రంగా నష్టపోయారు. ఈ క్రమంలో సెప్టెంబరు 23, 1996లో తన ఇంట్లో విగతజీవిగా కనిపించారు. అర్థాంతరంగా జీవితం ముగించి తన అభిమానులను విషాదంలోకి నెట్టారు. -
చిత్రసీమ
సృజన.. సృష్టిలో చిత్రాలన్నిటినీ పోగేసేదాకా ఊరుకోదు. కన్వాస్, బ్రష్ రెస్ట్ తీసుకుంటే కంప్యూటర్, ఫొటోషాప్ వర్క్ మోడ్‌లోకి వెళ్తాయి. సాంస్కృతిక పునరుజ్జీవన కాలానికి, ‘పెరియారుమ్ పెరుమాళ్’ సినిమా పోస్టర్‌కు ముడి పెడ్తాయి. విన్సెంట్ వాంగో ప్రపంచ ప్రఖ్యాత పెయింటింగ్ ‘‘వీట్ ఫీల్డ్ విత్ సైప్రెసెస్’లో అమాయకమైన చిరునవ్వుతో సిల్క్‌స్మిత ప్రత్యక్షమవుతుంది. ఎడ్వర్డ్ మూంక్ ‘ది స్క్రీమ్’కి ‘అధే కంగళ్’ సినిమా జతకూడుతుంది. కత్సుషిక హొకుసై వేసిన ‘ది గ్రేట్ వేవ్ ఆఫ్ కనగవా’’లోకి ‘ఉలగమ్ సుట్రుమ్ వాలిబన్’ హీరో ఎమ్జీ రాంచంద్రన్ దూరిపోతాడు. ఎడ్వర్డ్ హోపర్ ‘ఆటోమాట్’ ముందు వెటరన్ నటి కేఆర్ విజయ ప్రత్యక్షమవుతారు చేతిలో టీ కప్పుతో. ఇలా ఆ కాలం చిత్రాలతో బయోస్కోప్ బొమ్మలను జత చేసి విచిత్రాలు చేస్తున్న ఆ ఆర్టిస్ట్ పేరు చార్ల్స్ బ్రిటో. చైన్నై కుర్రాడు. ఇంజనీరింగ్ చదివాడు. సినిమా ఫీల్డ్‌లో కెరీర్ వెదుక్కున్నాడు. ‘రెవలేషన్స్’ అనే ఇండీ, తమిళ్ సినిమాతోపాటు కొన్ని షార్ట్ ఫిల్మ్స్కీ పనిచేశాడు. ఆర్ట్ మీదున్న ఆసక్తితో తర్వాత జేఎన్‌యూలోని ది స్కూల్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ ఈస్తటిక్స్‌లో మాస్టర్స్ చేశాడు. ఓ వైపు సినిమాలకు పనిచేస్తూనే ఇలా మాష్ అప్ ఆర్ట్‌తో మ్యాజిక్స్ చేస్తున్నాడు. ‘‘మాష్ అప్‌కి నేనేం కొత్తకాదు. హాలీవుడ్, బాలీవుడ్ సినిమాలతో చాలా మంది ఆర్టిస్ట్‌లు మాష్ అప్ చేస్తున్నారు. నేనైతే ‘తబ్రేజ్’ వర్క్స్‌తో ఇన్స్పైర్ అయ్యా. ఈ విషయాన్ని ట్విట్టర్లో పోస్ట్ చేశాను కూడా. తబ్రేజ్ వర్క్స్‌ని బయట కొనుక్కుంటున్నారు కూడా. నాకూ అలాంటి రిక్వెస్ట్‌లు వస్తున్నాయి. వాళ్ల పర్సనల్ ఫొటోగ్రాఫ్స్‌ని ఇలా వరల్డ్ ఫేమస్ పెయింటింగ్స్‌తో మాష్ అప్ చేసి ఇవ్వమని. సో.. నేను కూడా ఆ దిశగా ఆలోచిస్తున్నాను’’ అంటున్నాడు చార్ల్స్ . ఒక దర్శకుడైతే ఏకంగా మూడువందల మాష్ అప్స్ చేసివ్వమని అడిగాడట. ‘‘నా మాష్ అప్స్‌కి వచ్చిన డిమాండ్ నాకే ఆశ్చర్యంగా ఉంది. అందుకని ఎఫ్బీ, ఇన్స్టాగ్రామ్ అకౌంట్స్ కూడా తెరిచా. ఫొటోగ్రాఫర్స్, సినిమా డైరెక్టర్స్ నుంచి ఒకటే కాల్స్ వస్తున్నాయి’’ అని చెప్పాడు చార్ల్స్ బ్రిటో. చెప్పినట్టుగానే సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఈ మాష్ అప్స్ అన్నీ వైరల్ అవుతున్నాయట. -
తారాపాతం
సినిమాల్లో చనిపోతే రెండో ఆటకు బతికేస్తారు. జీవితంలో ఆడలేక చనిపోతే అదే ఆఖరి..‘షో’!ఎందుకిలా చేస్తారు ఈ అందమైన అమ్మాయిలు?పేరుండీ, డబ్బుండీ, అదృష్టం కలిసొచ్చీ‘లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్’ అనుకుంటూ ఉండకనేఈ డర్టీ లోకం వద్దనుకునిఎక్కడికో రెక్కలు కట్టుకుని వెళ్లిపోతారెందుకు?ఎవరో డైరెక్షన్ ఇస్తుంటే.. నటనలో జీవించినట్లుగా.. జీవితంలో డైరెక్ట్ చేసే వాళ్లెవరూ లేరనేనా.. వీళ్లు మరణంలోకి తొందరపడతారు?!ఇప్పుడు మరో యువ నటి రాలిపోయింది. ఈ బాధామయ ‘తారా’పాతం ముగిసేదెప్పటికి? ఆన్ స్క్రీన్.. గ్లామర్‌ను పరిచయం చేస్తుంది. గ్లామర్.. మెప్పును మాత్రమే స్వీకరిస్తుంది.మెప్పు.. తప్పును అధిగమించే తత్వాన్ని బలహీనపరుస్తుంది.ఆన్‌స్క్రీన్.. గ్లామర్.. మెప్పు... జీవితంలో షార్ట్టైమే ఉండి లాంగ్ టైమ్ లైఫ్‌ను బానిసగా మలచుకుంటాయి. డిప్రెషన్‌ను అవార్డ్‌గా ఇస్తాయి. సూసైడ్ గమ్యంగా ప్రయాణాన్ని నెట్టుతాయి!ఎంతోమంది నటీనటుల జీవితాలు రుజువు చేసిన ఫిలాసíఫీ ఇది. ఈ మధ్యకాలంలో ఈ కేస్‌స్టడీస్ పెరుగుతున్నాయి కూడా. బుధవారమే (సెప్టెంబర్ 5) బెంగాలీ వర్థమాన నటి పాయల్ చక్రవర్తి ఆత్మహత్య చేసుకొని ఈ జాబితాలోకి చేరడం తాజా సత్యం. పాయల్ చక్రవర్తి బెంగాలీ నటి. ‘దేవ్స్ కాక్‌పిట్’లో నటించింది. ‘కేలో’ అనే సినిమా విడుదల కానుంది. పలు టీవీ సీరియళ్లలోనూ స్మాల్ స్క్రీన్ షేర్ చేసుకుంది. మూడు సినిమాలకు క్లాప్‌లు.. ఆరు సినిమాలకు డబ్బింగ్‌లా ఆమె కెరీర్ రీల్ రోల్ కాలేకపోయినా.. చేతిలో పనిలేకుండా ఏమీ లేదు. అసలు ఆమె సిలుగురి వెళ్లింది కూడా అవుట్డోర్ కోసమే. మంగళవారం సాయంత్రం సిలుగురిలోని ఓ హోటల్లో బస చేసింది. అక్కడి నుంచి ఆమె షూటింగ్ నిమిత్తం గ్యాంగ్‌టక్ వెళ్లాలి . కాని ఆమె చెప్పిన సమయానికి బుధవారం ఎంతకీ హోటల్ చెక్ అవుట్ చేయకపోయేసరికి హోటల్ సిబ్బంది వెళ్లి ఆమె గది తలుపు కొట్టారు. అయినా తెరవలేదు. దాంతో పోలీసులకు సమాచారమిచ్చారు. పోలీసులు వచ్చి గది తలుపు తెరిచి చూసేసరికి పాయల్ చనిపోయి ఉంది. ఇప్పటికైతే ఆమె మరణాన్ని ఆత్మహత్యగానే భావిస్తున్నారు పోలీసులు. పాయల్‌కు పెళ్లయింది. మూడేళ్ల కొడుకూ ఉన్నాడు. కొంతకాలం కిందటే భర్తతో విడాకులు తీసుకుంది. ఇప్పుడు పాయల్.. అంతకుముందు? తెలుగు సినిమా ఇండస్ట్రీకి ఫటాఫట్ జయలక్ష్మి అనే నటీమణి ఆత్మహత్యతో షాక్ తగిలింది. ఆ తర్వాత ఉలిక్కిపడ్డది దివ్యభారతి మృతితోనే. 1990లో తెలుగు వెండితెర మీద ఓ మెరుపులా మెరిసింది దివ్యభారతి. తెలుగు, హిందీ చిత్ర పరిశ్రమను యువరాణిలా ఏలింది. మూడేళ్లకే ఆ మెరుపు మాయమైంది. 1993, ఏప్రిల్‌లో ముంబైలోని బహుళ అంతస్థుల అపార్ట్మెంట్ నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది. అప్పటికి ఆమె వయసు 19 ఏళ్లు. ఆ మూడేళ్లలోనే పద్నాలుగు సినిమాలు చేసింది. బాలీవుడ్ నిర్మాత సాజిద్ నడియడ్వాలా ప్రేమలో పడింది. చనిపోయేనాటికి అతనితో సహజీవనంలో ఉంది. అనుమానాస్పదంగా మారిన ఆమె మృతికి సాజిద్‌తో ఉన్న స్పర్థలే కారణమని అప్పుడు వదంతులూ చాలానే వచ్చాయి. ఆ టైమ్‌కి ఆమె సినీ ప్రయాణం అప్రతిహతంగా దూసుకెళ్తోంది. ఏదేమైనా.. చక్కటి భవిష్యత్ ఉన్న దివ్య అర్థంతరంగా రాలిపోయింది. సిల్క్‌స్మిత దివ్యభారతి మరణం తర్వాత అంతటి అశనిపాతం సిల్క్‌స్మిత సూసైడే. హీరోయిన్ అవుదామని వచ్చి ఐటమ్‌గర్ల్ ‘సిల్క్’గా సెటిల్ అయింది. ఒకానొక దశలో కథానాయికల కన్నా క్రేజ్, డిమాండ్‌ను సాధించిన సిల్క్ తర్వాత తర్వాత సినీ నిర్మాణంలోకీ అడుగుపెట్టి తీవ్రంగా నష్టపోయింది. అలాగే వ్యక్తిగతంగా లవ్ ఫెయిల్యూరూ ఆమెను కుంగదీసింది. ఒకవైపు అప్పులు, ఇంకోవైపు ప్రేమతాలూకు మానసిక క్షోభతో ఆమె డిప్రెషన్లోకి వెళ్లిపోయి ఇంట్లో ఫ్యాన్‌కు ఉరివేసుకుంది. అలా ఆమె నిష్క్రమణ ఆమె అభిమానులను విషాదంలో ముంచేసింది. పర్వీన్‌బాబి బాలీవుడ్ దివా. డెబ్భై, ఎనభైల్లో భారతీయ ప్రేక్షకుల కలల రాణి. ఆమె సెల్యూలాయిడ్ జర్నీ ఎంత హుషారుగా ఉండిందో పర్సనల్ ప్రయాణం అంత ఒడిదుడుకులుగా సాగింది. అమితాబ్ బచ్చన్‌తో ప్రేమ విఫలమై బాలీవుడ్ డైరెక్టర్ మహేష్‌భట్ ప్రేమతో కొంత స్వాంతన పొందింది. కాని అప్పటికే స్కీజోఫ్రీనియా బారినపడి మానసికంగా చిక్కిశల్యమైంది. దాంతో మహేష్‌భట్ కూడా ఆమెకు దూరమయ్యాడు. ఆమె కుటుంబ సభ్యులూ ఎవరూ పట్టించుకోలేదు. మధుమేహం ఆమె దేహాన్ని ఆవరించింది. వీటన్నిటి మధ్య తను ఉంటున్న అపార్ట్మెంట్లోనే విగతజీవిగా కనిపించింది పర్వీన్‌బాబి. అయితే మానసిక అస్వస్థతతో ఆత్మహత్య చేసుకుందని అంటారు. జియా ఖాన్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీని మళ్లీ ఉలిక్కిపడేలా చేసింది.. జియాఖాన్ ఆత్మహత్యే. నిశ్శబ్ద్ సినిమాతో ప్రేక్షకుల హృదయాల్లో గూడుకట్టుకొని కొలువైంది. హిందీ గజినీలో నయనతార పాత్రను పోషించింది. ఆ అమాయకమైన మొహం.. బేల చూపులు.. స్వచ్ఛమైన నవ్వు.. ఇప్పటికీ స్మృతిపథంలో స్థిరంగా ఉన్నాయి. ఆదిత్య పంచోలి, జరీనా వాహబ్ (ఒకటిప్పటి హీరో, హీరోయిన్లు)ల కొడుకు సూరజ్ పంచోలీతో పీకల్లోతు ప్రేమలో పడింది జియా. కాని సూరజ్ నిర్లక్ష్యం ఆమె ప్రాణాలు తీసుకునేలా చేసింది. సూసైడ్ నోట్ రాసి మరీ 2013, జూన్ 3న ముంబైలోని తన అపార్ట్మెంట్లో సీలింగ్ ఫ్యాన్‌కు ఉరేసుకొని ఊపిరి తీసుకుంది జియా ఖాన్. నఫీసా జోసెఫ్ ఆ పేరు వినగానే మిస్ ఇండియా గుర్తొస్తుంది. అవును నఫీసా 1997 మిస్ ఇండియా. ఆ యేడు మిస్‌యూనివర్స్ సెమీ ఫైనలిస్ట్ కూడా. మోడల్, వీడియో జాకీ అయిన నఫీసా 2004లో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. కారణం.. నఫీసాతో డేటింగ్లో ఉన్న ఆమె బాయ్‌ఫ్రెండ్ తనకు అంతకుముందే పెళ్లి అయింది కాని విడాకులు తీసుకున్నాను అని చెప్పాడట. కాని ఇంకా మొదటి భార్యతో కలిసే ఉంటున్నాడన్న నిజం తెలిసి కుప్పకూలింది నఫీసా. కలతచెంది బలన్మరణానికి పాల్పిడింది. కుల్జీత్ రాంధ్వా నటి, టాప్ మోడల్‌గా కెరీర్‌ను సక్సెస్‌ఫుల్‌గా లీడ్ చేసినా వ్యక్తిగత జీవితాన్ని సమన్వయం చేసుకోలేక ఆత్మహత్యతో అంతం చేసుకుంది. గ్లామర్ లైఫ్ ఫెయిల్యూర్‌గా నిలిచింది. అదే విషయాన్ని సూసైడ్ లేఖలో రాసి 2006, ఫిబ్రవరి 8న సీలింగ్ ఫ్యాన్‌కు ఉరేసుకొని ప్రాణం తీసుకుంది. ప్రత్యూషా బెనర్జీ బాలికా వధు.. టీవీ సీరియల్లోని ‘ఆనంది’గా ప్రతి గడపా ఆదరించిన ప్రత్యూషా బెనర్జీ కూడా జీవితంలోని గడ్డు కాలాన్ని గట్టెక్కే స్థయిర్యం లేక ఆత్మహత్యను శరణుజొచ్చింది. జంషేడ్‌పూర్‌కు చెందిన 24 ఏళ్ల ప్రత్యూషా సహనటుడు రాహుల్‌రాజ్‌తో లివ్ ఇన్ రిలేషన్షిప్లో ఉంది. అతనితో వచ్చిన కలహాల కారణంగానే ప్రాణాలు తీసుకుంది. వివేకా బాబాజీ మారిషస్‌లో పుట్టిన మహారాష్ట్రియన్ వివేకా. కమర్షియల్ ప్రొడక్ట్స్ ఎన్నింటికో మోడల్‌గా పనిచేసిన వివేకా ‘‘యే కైసీ మొహబ్బత్ హై’’ అనే సినిమాలోనూ నటించింది. బాంద్రాలోని తన ఫ్లాట్‌లో సీలింగ్ ఫ్యాన్‌కు ఉరేసుకొని చనిపోయింది. విజయ శిఖరం మీద అట్టేసేపు నిలబడ్డానికి చోటు ఉండదు. అందుకే గెలిచిన వాళ్లు గెలుపు సుస్థిరం కాదనే విషయాన్ని అర్థంచేసుకోవాలి. అంతే జాగ్రత్తగా దిగడమూ నేర్చుకోవాలి. అలాగే ఓటమి కూడా జీవితంలో భాగమే.. గ్లామర్ ఓ మేకప్ మాత్రమే అని అనుభవంలోకి రావాలి. బతకడం ఒక్కటే ప్రాక్టికాలిటీ అనే నిజం గుర్తెరగాలి. అప్పుడే సమస్యలన్నీ తేలికవుతాయి. జీవితం స్ట్రాంగ్ అవుతుంది. – శరాది -
సిరీస్‌గా సిల్క్ జీవితం
1980ల్లో హాట్ గాళ్‌గా సౌత్ ఇండస్ట్రీలను ఊపు ఊపేసిన స్టార్ సిల్క్ స్మిత. ఈ పాపులర్ స్టార్ జీవితం ఆధారంగా ఆల్రెడీ ‘డర్టీ పిక్చర్’ సినిమా తెరకెక్కింది. ఆ సినిమాతో విద్యా బాలన్ సూపర్ స్టార్ అయ్యారు. ఇప్పుడు సిల్క్ జీవితం ఆధారంగా వెబ్ సిరీస్ రూపొందించే ప్లాన్స్ జరుగుతున్నాయి. ‘కబాలీ’ ఫేమ్ పా.రంజిత్ ఈ వెబ్ సిరీస్‌ను డైరెక్ట్ చేస్తారట. ముంబైలోని ప్రముఖ నిర్మాణ సంస్థతో కలసి రంజిత్ ఈ సిరీస్‌ను ప్రొడ్యూస్ చేయనున్నారు. సిల్క్ జీవితంలో బాల్యాన్ని ఎవరూ సరిగ్గా చూపించలేదు. ఈ సిరీస్‌లో సిల్క్ బాల్యం నుంచి కథ చెప్పదలిచారట. సిల్క్‌కి ఇండియా వైడ్ పాపులారిటీ ఉంది. అందుకే వెబ్ సిరీస్ ద్వారా అన్ని భాషల వారికి ఈ కథను చూపించదలిచారట. ఇప్పటి వరకూ ఎవ్వరూ చూడని విధంగా రియలిస్టిక్‌గా చూపించాలనే ఆలోచనలో దర్శకుడు రంజిత్ ఉన్నారని సమాచారం. -
వెబ్ సిరీస్‌లో సిల్క్‌స్మిత బయోపిక్
తమిళసినిమా: ఏనుగు చచ్చినా వెయ్యే బ్రతికినా వెయ్యే అనే సామెత ఉంది. అలా కొందరు జీవించి ఉన్నప్పుడు తను లబ్ధి పొందటంతో పాటు ఇతరులకు లాభాలను అందించారు. అలాంటి వారిలో శృంగార తారగా ముద్ర వేసుకున్న బహుభాషా నటి సిల్క్‌స్మిత చేరుతుందని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఎందుకంటే ఒకప్పుడు బయ్యర్లు చిత్రాలను కొనుగోలు చేసే ముందు సిల్క్ పాట ఉందా? అని అని అడిగి మరీ చిత్రాలను కొనుగోలు చేసేవారు. ఆమె నటించిన చిత్రాలకు ప్రేక్షకుల్లో కూడా క్రేజ్ ఉండేది. అలా నిర్మాతలకు, బయ్యర్లకు లాభాలు తెచ్చిపెట్టిన సిల్క్‌స్మిత మరణానంతరం కథకు కాన్సెప్ట్‌గా మారి లాభాలను, అవార్డులను తెచ్చిపెట్టింది. అవును స్మిత జీవిత చరిత్రతో హిందిలో ది దర్టీ పిక్చర్ పేరుతో తెరకెక్కిన చిత్రం సంచలన విజయాన్ని సాధించింది. అందులో తన పాత్రలో నటించిన విద్యాబాలన్‌కు జాతీయ అవార్డును తెచ్చిపెట్టింది. అంతే కాదు మలయాళంలోనూ సిల్క్‌స్మిత బయోపిక్‌తో చిత్రం తెరకెక్కింది. ఇదిలాఉండగా ఆమె జీవిత చరిత్ర తాజాగా మరోసారి ప్రేక్షకుల ముందుకు రానుంది. సిల్క్‌స్మిత జీవితంలో చాలా మందికి తెలియని విషయాలను ఇందులో చూపించనున్నట్టు సమాచారం. అయితే ఇది వెబ్ సీరీస్‌గా రూపొందనుండటం విశేషం. మరో విశేషం ఏమిటంటే కబాలి, కాలా వంటి సంచలన చిత్రాల దర్శకుడు పా.రంజిత్ దృష్టి సిల్క్‌స్మిత బయోపిక్‌పై పడింది. ఆయన తన చిత్ర నిర్మాణ సంస్థలో సిల్క్ జీవిత చరిత్రను వెబ్ సిరీస్‌గా నిర్మించనున్నారు. ఇందులో సిల్క్‌స్మిత ఆరంభ కాలం నుంచి అంతం వరకూ తెరకెక్కించనున్నారు. దీనికి సంబధించిన పూర్తి వివరాలు వెల్లడించకపోయినా ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయట. ఇందుకు సంబంధించిన ప్రకటన త్వరలోనే వెలువడే అవకాశం ఉంది. -
హీరోయిన్
-
సిల్కీ..పిక్చర్
-
డర్టీపిక్చర్కు సీక్వెల్ రెడీ
-
మరోసారి తెరపైకి సిల్క్‌స్మిత జీవితం
తమిళసినిమా: దివంగత శృంగార తార సిల్క్‌స్మిత జీవిత కథ ఎవర్‌గ్రీన్‌గా మారింది. ఆ నటి బతికున్నప్పడు ప్రేక్షకులను అలరించారు. అర్ధాంతరంగా జీవితాన్ని చాలించి చిత్ర పరిశ్రమకు కాసుల వర్షం కురిపిస్తున్నారు. ఇప్పటికే సిల్క్‌స్మిత జీవిత ఇతివృత్తంతో తమిళం, మలయాళం, హిందీ భాషల్లో చిత్రాలు తెరకెక్కిన విషయం తెలిసిందే. హిందీలో రూపొందిన దర్టీ పిక్చర్స్ చిత్రంలో స్మిత పాత్రలో నటించిన విద్యాబాలన్ జాతీయ ఉత్తమ నటి అవార్డును గెలుచుకున్నారు. అలాగే మలయాళంలో నటి సానాఖాన్ తమిళంలో సోనియా అగర్వాల్ నటించి ప్రాచుర్యం పొందారు. కాగా తాజాగా మరో చిత్రం సిల్క్ కథతో తెరకెక్కనున్నట్టు తాజా సమాచారం. దీన్ని ఆమె రహస్య ప్రేమికుడు తెరకెక్కించడానికి సన్నాహాలు చేస్తున్నారు. స్మిత రహస్య ప్రేమికుడా? ఆయనెవరు? అంటారా? సీనియర్ దర్శకుడు వేలు ప్రభాకరన్‌కు సిల్క్‌స్మితతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయన్నది కోలీవుడ్ వర్గాల సమాచారం. ఇంతకు ముందు కొన్ని వివాదస్పద కథా చిత్రాలను తెరకెక్కించి సంచలనాలకు కారణం అయిన వేలు ప్రభాకరన్ స్మితతో తన ప్రేమానుభవాలను చిత్రంగా రూపొందించడానికి సిద్ధం అయ్యారన్నది కోడంబాక్కం వర్గాల సమాచారం. ఇందులో సిల్క్‌స్మితతో ప్రేమానుభావాలతో పాటు తనకు నచ్చిన కొందరు హీరోయిన్లకు సంబంధించిన అంశాలను ఈ చిత్రంలో పొందుపరచనున్నారట. ఈ చిత్రానికి సంగీతాన్ని అందించే విషయమై వేలుప్రభాకరన్ ఇటీవల సంగీత దర్శకుడు ఇళయరాజాను కలిసినట్టు సమాచారం. -
సిల్క్స్మితపై మరాఠీ సినిమా!
రెండు దశాబ్దాల పాటు వెండితెరను ఏలిన శృంగార సామ్రాజ్ఞి సిల్క్‌స్మిత. తన కైపు కళ్లతో సినీ ప్రపంచాన్ని ఏలగలిగినా... వాస్తవ ప్రపంచం మాత్రం ఆమెకు కన్నీరే మిగిల్చింది. ‘సినీ రంగుల ప్రపంచంలో ఎలా బతకకూడదు’ అనేదానికి నిలువెత్తు సాక్ష్యం సిల్క్ స్మిత జీవితం. ఆమెది ఫెయిల్యూర్ స్టోరీనే అయినా, ఇప్పుడదే పలువురు నిర్మాతలకు సక్సెస్ఫుల్ స్టోరీగా నిలిచింది. హిందీలో ‘డర్టీ పిక్చర్’, మలయాళంలో ‘క్లైమాక్స్’, కన్నడంలో ‘సిల్క్ సక్కత్ మగా’ అన్నవి స్మిత జీవితం ఆధారంగా రూపొందిన చిత్రాలు. ఇవన్నీ సదరు నిర్మాతలకు కాసుల వర్షాన్ని కురిపించాయి.ఇప్పుడు సిల్క్ జీవితం మరాఠీ ప్రేక్షకుల ముందుకు రానుంది. సమీర్‌ఖాన్ అనే దర్శకుడు సిల్క్ స్మిత జీవితం ఆధారంగా సినిమా చేయడానికి సన్నాహాలు చూసుకుంటున్నారు. త్వరలోనే ప్రారంభం కానున్న ఈ సినిమా గురించి సమీర్‌ఖాన్ మాట్లాడుతూ - ‘‘ఇప్పటివరకూ ‘సిల్క్’ జీవితంపై వచ్చిన ఏ సినిమాలోనూ ఆమె జీవితాన్ని పరిపూర్ణంగా ఆవిష్కరించలేదు. నేను చేయనున్న సినిమాలో సిల్క్ స్మిత జీవితంలోని అన్ని కోణాలూ ఉంటాయి. రంగుల ప్రపంచంలో ఆమె పడిన కష్టాలు, సినీలోకంలో చీకటి కోణాలు, చాలామందికి తెలియని సిల్క్ స్మితలోని పాజిటీవ్ కోణం, విధితో పోరాటలేక ఆమె ప్రాణాలు తీసుకున్న తీరు... ఇవన్నీ నా సినిమాలో ఉంటాయి. మరాఠీ భాషలో ఇప్పటివరకూ వచ్చిన సినిమాలన్నింటిలో చాలా ధైర్యంగా తెరపై దృశ్యాలు చూపే సినిమా ఇదే. పూర్తి వివరాలు త్వరలోనే తెలియజేస్తా’’ అన్నారు. -
షకీలాగా అంజలి?
సంచలన శృంగార తార షకీలా జీవిత చరిత్ర వెండితెరకెక్కనున్నట్లు తాజా సమాచారం. ఇంతకు ముందు నటి సిల్క్ స్మిత జీవితం బాలీవుడ్లో ది డర్టీ పిక్చర్స్ పేరుతో రూపొంది ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. అంతేకాదు సిల్క్ స్మిత పాత్రలో నటించిన విద్యాబాలన్‌ను జాతీయ అవార్డు వరించింది. ఇక నటి షకీలా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఒకప్పుడు మలయాళంలో ఈమె సూపర్ నటి అని చెప్పక తప్పదు. షకీలా నటించిన శృంగార భరిత చిత్రాలకు విశేష ఆదరణ ఉండేది. బయ్యర్లు కొనడానికి పోటీ పడేవాళ్లు. ఇతర భాషల్లో అనువాద హక్కులకు మంచి డిమాండ్ ఉండేది. షకీలా చిత్రం విడుదలవుతుందంటే మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్, మమ్ముట్టి చిత్రాల విడుదలను వాయిదా వేసుకునేవారు. ఒక వేళ పోటీగా, విడుదల చేసినా ఆ చిత్రాలకు కలెక్షన్లు ఉండేవి కావు. దీంతో అక్కడి నటులు కొందరు షకీలాపై కుట్రపన్ని కేరళ నుంచి బయటకు పంపించేశారనే ప్రచారం జరిగింది. ప్రస్తుతం చెన్నైలో నివశిస్తున్న షకీలా తమిళం, తెలుగు భాషల్లో హాస్యభూమికను పోషిస్తున్నారు. జీవిత చరిత్ర రాసుకున్నారు షకీలా తన జీవిత చరిత్రను రాసుకున్నారు. ఇందులో ఆమె వ్యక్తి గత విషయాలు, సినిమా సంగతులు, తానెదుర్కొన్న కిష్టపరిస్థితులు, సినిమా వ్యక్తులు తనను ఎలా వాడుకున్నారు? తదితర విషయాలను పరిపూర్ణంగా ఈ పుస్తకంలో రాసుకున్నారు. ఇంకా మార్కెట్లోకి విడుదల కాని షకీలా జీవిత చరిత్రపై ఇప్పటికే చిత్ర పరిశ్రమలో ప్రకంపనలు పుడుతున్నాయి. ఇలాంటి కథతో సినిమా రూపొందించడానికి సన్నాహాలు జరుగుతుండటం విశేషం. అంతేకాదు ఈ చిత్రం తెరకెక్కడానికి అంగీకరించరాదంటూ నటి షకీలాకు బెదిరింపులు కూడా మొదలయ్యాయట. అయినా ఇలాంటి వాటికి భయపడేది లేదంటున్నారట ఈ శృంగార తార. తమిళం, తెలుగు, మలయాళం భాషల్లో తెరకెక్కనున్న ఈ చిత్రంలో షకీలా పాత్రకు నటి అంజలి చక్కగా నప్పుతారని చిత్ర దర్శక నిర్మాతలు భావించడంతో ఆమెతో చర్చలు జరుపుతున్నారని సమాచారం. సిల్క్ స్మిత జీవిత కథలో నటించిన విద్యాబాలన్ జాతీయ అవార్డును అందుకోవడంతో నటి అంజలి కూడా షకీలా పాత్రలో నటించడానికి ఆసక్తి చూపిస్తున్నట్లు సమాచారం. ఈ చిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలోనే వెలువడనున్నట్లు తెలిసింది. -
16 భాషల్లో సిల్క్‌స్మిత జీవితకథ
నటి సిల్క్‌స్మిత జీవిత చరిత్ర చాలా ప్రాచుర్యం పొందింది. శృంగారతారగా ఆమె దక్షిణాది, ఉత్తరాది చిత్రాల్లో రాణించారు. అయితే అర్ధాంతరంగా కన్నుమూశారు. సిల్క్‌స్మిత జీవిత ఇతివృత్తంతో బాలీవుడ్లో ది దర్టీ పిక్చర్ పేరుతో రూపొందిన చిత్రం ఘన విజయం సాధించింది. ఆమె పాత్రను పోషించిన విద్యాబాలన్ జాతీయ ఉత్తమ నటి అవార్డు అందుకున్నారు. సిల్క్ జీవిత కథతో ఇటీవల మలయాళంలో క్లైమాక్స్ పేరుతో మరో చిత్రం తెరకెక్కింది. స్మిత పాత్రను సానాఖాన్ పోషించింది. ఈ చిత్రం తమిళంలో ఒరునడిగైయిన్ డైరీ పేరుతో అనువాదం అయింది. తాజాగా కన్నడంలో సిల్క్ జీవిత కథతో సిల్క్ సక్కత్ మగ పేరుతో ఒక చిత్రం తెరకెక్కుతోంది. ఇందులో పాకిస్తాన్ నటి వీణామాలిక్ నటిస్తోంది. త్రిసూల్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని 16 భాషలలో అనువదించి విడుదల చేయనున్నారు. ఈ చిత్రాన్ని పలు భాషలలో విడుదల చేయడానికి నిర్మాతలు ముందుకొస్తున్నారని త్రిసూల్ తెలిపారు.