Silk Smitha Last Letter Before Committing Suicide Goes Viral On Social Media - Sakshi
Sakshi News home page

Silk Smitha Last Letter Before Death: సిల్క్ స్మిత రాసిన చివరి ఉత్తరం ఇదే.. ఇంత నరకాన్ని అనుభవించిందా?

Published Sun, Apr 30 2023 4:56 PM | Last Updated on Sun, Apr 30 2023 9:02 PM

Silk Smitha Last Letter Before Committing Suicide - Sakshi

సిల్క్‌ స్మిత.. ఈ పేరు గురించి సినీ ప్రేక్షకులకు ప్రతేకంగా చెప్పనక్కర్లేదు. ఒకప్పుడు తన అందచందాలతో దక్షిణాది చిత్ర పరిశ్రమను ఊపు ఊపేసింది. గ్లామరస్‌ పాత్రలు పోషిస్తూ వేలాది మంది అభిమానులను సంపాదించుకుంది. స్టార్ హీరోలు సైతం త‌మ సినిమాలో సిల్క్ స్మిత ఉండాలని పట్టుపట్టేవారంటే..అప్పట్లో ఆమె క్రేజ్‌ ఏ స్థాయిలో ఉండేదో అర్థం చేసుకోవచ్చు. అంత ఇమేజ్‌ని సొంతం చేసుకన్న సిల్క్‌ స్మిత.. ఆత్మహత్య చేసుకొని చనిపోవడం అందరిని కలిచివేసింది. ఓ సీనియ‌ర్ హీరో.. స్కిల్క్ స్మిత కెరీర్ నాశ‌నం చేశారనే ఆరోపణలు ఉన్నాయి. అతని వల్లే అవకాశాలు రాలేట. దీంతో డిప్రెషన్‌లోకి వెళ్లిన స్మిత.. 1996లో బలవన్మరణానికి పాల్పడింది. అయితే ఆత్మహత్యకి ముందు ఓ సూసైడ్‌ నోట్‌ రాసుకుంది. అందులో ఇలా రాసుకొచ్చింది. 

దేవుడా నా 7వ సంవత్స‌రం నుంచి నేను పొట్టకూటి కోసం క‌ష్ట‌ప‌డ్డాను. నేను న‌మ్మినవారే న‌న్ను మోసం చేశారు. నా వారంటూ ఎవ‌రూ లేరు. బాబు త‌ప్ప ఎవ‌రూ నాపై ప్రేమ చూప‌లేదు. బాబు త‌ప్ప అందరూ నా క‌ష్టం తిన్న‌వారే. నా సొమ్ము తిన్న‌వారే నాకు మ‌న‌శ్శాంతి లేకుండా చేశారు. అంద‌రికీ మంచే చేశాను కానీ నాకు చెడు జ‌రిగింది. నా ఆస్తిలో ఉన్న‌దంతా బాబు కుటుంబానికి నా కుటుంబానికి పంచాలి. నా ఆశ‌ల‌న్నీ ఒక‌రిమీదే పెట్టుకున్నా…అత‌ను నన్ను మోసం చేశాడు.

(చదవండి: సిల్మ్‌ స్మిత సూసైడ్‌.. ఆమెను చూసేందుకు వచ్చిన ఏకైన హీరో అతనే)

దేవుడుంటే వాడిని చూసుకుంటాడు. రాము, రాధాకృష్ణన్‌ నన్ను చాలా రెచ్చగొట్టారు. వారికి ఎంతో మేలు చేశాను. కానీ వారు నాకు వారు చేసింది చాలా దారణం. నాకు ఒక‌డు 5సంవ్స‌రాల క్రితం జీవితం ఇస్తానన్నాడు. కానీ ఇప్పుడు ఇవ్వ‌డం లేదు. నా రెక్క‌ల క‌ష్టం తిన‌ని వాడు లేడు బాబు త‌ప్ప‌. ఇది రాయ‌డానికి నేను ఎంత న‌ర‌కం అనుభ‌వించానో మాట‌ల్లో చెప్ప‌లేను’అంటూ బాధతో స్మిత రాసుకొచ్చింది. కాగా, స్మిత చనిపోయినప్పుడు.. కడసారి చూసేందుకు ఇండస్ట్రీ నుంచి ఒక్కరు కూడా వెళ్లలేదు. ఆమె కుటుంబ సభ్యులు కూడా వెళ్లలేదు. ఒక అనాథ శవంలా ఆమె అంత్యక్రియలు జరిపించారు. 

సిల్క్ స్మిత మరణం తర్వాత మోసం చేసిందెవరన్న దానిపై తెలుగు, తమిళ్ ఇండస్ట్రీలో చాలా చర్చ జరిగింది. స్మితను ఓ తమిళ సూపర్ స్టార్ వాడుకున్నాడని, చివరికి చేయిచ్చాడని చెప్పుకుంటారు. సూపర్ స్టార్ గా ఎంత పేరు సంపాదించినా.. స్మితకు మాత్రం అన్యాయం చేశాడని చెప్పుకుంటారు. ఆత్మహత్య చేసుకున్నప్పుడు  స్మిత రాసిన చివరి లేఖలోనూ ఆ వ్యక్తి గురించే ప్రస్తావన చేసింది. స్మితకు చేసిన పాపమే ఆ వ్యక్తి రాజకీయంగా ఎదగలేకుండా చేసిందంటారు కొందరు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement