సౌత్ ఇండియాలో ఒకప్పుడు స్టార్ నటిగా వెలిగిన దివంగత సిల్క్ స్మిత జీవితంపై మరో బయోపిక్ రెడీ అవుతుంది. 'సిల్క్ స్మిత - ది క్వీన్ ఆఫ్ సౌత్' పేరుతో ఈ సినిమాకు సంబంధించిన గ్లింప్స్ తాజాగా విడుదలైంది. సిల్క్ స్మిత పాత్రలో చంద్రికా రవి అనే నటి కనిపించనున్నారు. ఈ చిత్రాన్ని జయరామ్ అనే కొత్త దర్శకుడు పాన్ ఇండియా రేంజ్‌లో తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమాలో ఆమె వ్యక్తిత్వం సహా చాలా విషయాలను చూపిస్తామని దర్శకుడు ఇప్పటికే తెలిపాడు.
1980, 1990 దశకాల్లో భారత సినీ పరిశ్రమలో సిల్క్ స్మిత పేరు మార్మోగింది. 17 ఏళ్ల పాటు పరిశ్రమలో ఉన్న ఆమె 5 భాషలలో 450కి పైగా సినిమాల్లో నటించి రికార్డ్ క్రియేట్ చేసింది. 1996 సెప్టెంబర్ 23న ఆమె ఆత్మహత్య చేసుకున్నారు. సిల్క్ మరణం ఇప్పటికీ పెద్ద మిస్టరీగానే ఉంది. ఆంధ్రప్రదేశ్‍లోని ఏలూరు ప్రాంతం నుంచి వచ్చిన సిల్క్ స్మిత.. తన గ్లామర్‌తో ఎవరికి దక్కనంత రేంజ్‌లో అభిమానులను సొంతం చేసుకుంది. ఎవరికీ తెలియని విషయాలను ఈ సినిమా ద్వారా ప్రపంచానికి తెలుపుతానని దర్శకుడు చెప్పడంతో ఈ ప్రాజెక్ట్‌పై భారీ అంచనాలు ఉన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment