
Silk Smitha Death Mystery In Telugu: Still Continues After 25 Years: సిల్క్ స్మిత..గ్లామర్ ప్రపంచంలో ఈ పేరు ఓ సెన్సేషన్. మత్తు కళ్లతో సిల్వర్ స్క్రీన్‌కి హాట్ ఇమేజ్ అద్దిన అందమైన స్వప్నం సిల్క్ స్మిత. అప్పటివరకు ఉన్న కమర్షియల్ హంగులను మార్చేసి తన పేరుకే సరికొత్త బ్రాండ్ ఇమేజ్‌ను క్రియేట్ చేసుకున్నారామే. వ్యాంప్ పాత్రలతో తనకంటూ ప్రత్యేక స్టార్‌డంను సొంతం చేసుకుంది. తన అందచందాలతో మత్తెక్కించిన సిల్క్..నిజజీవితం మాత్రం అంతుచిక్కని కథలానే మిగిలిపోయింది. రంగుల ప్రపంచంలో అమాయకపు చిరునవ్వుల్ని మిగిల్చి తనను తాను అంతం చేసుకుంది. ఇప్పటికీ సిల్క్ స్మిత మరణం ఒక మిస్టరీగానే మిగిలిపోయింది.
సిల్క్ స్మిత అసలు పేరు విజయలక్ష్మీ. తొలి సినిమా బండి చక్రంలో తాను పోషించిన సిల్క్ పాత్రనే తన ఇంటి పేరుగా మార్చుకుంది. క్యారెక్టర్ ఆర్టిస్ట్ నుంచి సీతాకోక చిలుక, వసంత కోకిల వంటి సినిమాల్లో నటించి విమర్శకుల ప్రశంసలు అందుకుంది. అప్పట్లో సిల్క్ డ్యాన్స్ బీట్ లేనిదే స్టార్ హీరోల సినిమాలు లేవంటే అతిశయోక్తి కాదేమో. అంతలా క్రేజ్ సంపాదిచుకున్న ఆమె స్టార్ హీరోలకు సరిసమానంగా పారితోషికం తీసుకునేది.
కెరీర్ పీక్ టైంలో ఉండగానే ఓ హీరోతో ప్రేమ విఫలం కావడం, సినిమాల్లో పెట్టుబడి పెట్టి ఆర్థికంగా నష్టపోవడం ఆమెను మరింత కుంగదీసిందని అంటుంటారు. తన ఆర్థిక నష్టాలను పూడ్చుకోవాలని భావించిన స్మిత.. ఎందుకో కొన్నాళ్లు గ్యాప్ కూడా తీసుకుంది. ఆ సమయంలోనే మద్యాపానానికి అలవాటు అయ్యింది. అయితే ఏమైందో తెలియదు కానీ 1996 సెప్టెంబరు 23న తన ఇంట్లోనే ఫ్యాన్‌కు ఊరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది. అప్పట్లో సిల్క్ స్మిత సూసైడ్ ఇండస్ట్రీని కుదిపేసింది.
(మరిన్ని ఫొటోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి)
చదవండి: Silk Smitha: సిల్క్ స్మిత గురించి ఈ విషయాలు తెలుసా?