Actress Simran Sister Monal Naval Death Mystery, Details Inside - Sakshi
Sakshi News home page

Simran Sister Death Mystery: సిమ్రాన్‌ చెల్లెలి సూసైడ్‌కి ఆ కొరియోగ్రాఫర్‌కి సంబంధం ఉందా?

Published Mon, Aug 8 2022 12:49 PM | Last Updated on Mon, Aug 8 2022 1:37 PM

Actress Simran Sister Monal Navel Death Mystery - Sakshi

హీరోయిన్‌ సిమ్రాన్‌ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. తెలుగుతో పాటు తమిళంలో స్టార్‌ హీరోయిన్‌గా సత్తాచాటిన సిమ్రాన్‌కు ఎంతోమంది అభిమానులున్నారు. అయితే సిమ్రాన్‌కు ఒక చెల్లెలు ఉందని, ఆమె కూడా హీరోయిన్‌గా నటించింది అన్న విషయం మీకు తెలుసా? ఇంద్రధనస్సు సినిమాతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన సిమ్రాన్‌ చెల్లెలు మోనాల్‌ నావెల్‌ తెలుగులో ఇష్టం చిత్రంతో అరంగేట్రం అయ్యింది.

చదవండి: Bimbisara: హీరో కల్యాణ్‌ రామ్‌ భార్య గురించి ఈ విషయాలు తెలుసా?

స్టార్‌ హీరోయిన్‌ చెల్లెలిగా ఎంట్రీ ఇవ్వడంతో అతి తక్కువ సమయంలోనే క్రేజ్‌ అందుకుంది.పలు వాణిజ్య సంస్థల ప్రకటనల్లోనూ మెరిసింది. అయితే ఆ తర్వాత ఆశించిన స్థాయిలో రాణించలేకపోయింది. వరుస ఫ్లాపులతో అపజయాలను చవిచూసింది. హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన రెండేళ్లకే సిమ్రాన్‌ చెల్లెలు మోనాల్‌ సూసైడ్‌ చేసుకుంది. 2002, ఏప్రిల్‌ 14న తన ఫ్లాట్‌లోనే ఉరివేసుకుని చనిపోయింది.దీనికి కారణం ఓ డ్యాన్స్‌ మాస్టర్‌ అని అప్పట్లో ఇండస్ట్రీ అంతా కోడై కూసింది.

కోలీవుడ్‌కు చెందిన సుజిత్‌ అనే కొరియోగ్రాఫర్‌తో పీకల్లోతు ప్రేమలో మునిగిన మోనాల్‌ ఆ తర్వాత అతడు మోసం చేయడంతో సూసైడ్‌ చేసుకుందని అప్పట్లో కథనాలు వెలువడ్డాయి. దీనిపై ఇప్పటికీ క్లారిటీ లేకపోవడంతో ఆమె ఆత్మహత్య మిస్టరీగానే మిగిలిపోయింది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement