death mystery
-
సుచీర్ బాలాజీ కేసులో షాకింగ్ ట్విస్ట్!
ఓపెన్ఏఐ విజిల్‌బ్లోయర్ సుచీర్ బాలాజీ కేసులో అనూహ్యపరిణామం చోటు చేసుకుంది. భారత సంతతికి చెందిన ఈ యువ టెక్ పరిశోధకుడి మృతిపై మిస్టరీ వీడడం లేదు. ఓపక్క అతను బలవన్మరణానికి పాల్పడ్డాడని అధికారులు ప్రకటించగా.. మరోవైపు తల్లిదండ్రులు బాలాజీ రమణమూర్తి, పూర్ణిమరావ్ మాత్రం అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. తాజాగా.. అది హత్యేనంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.‘‘రెండో అటాప్సీ రిపోర్ట్‌ను మేం చదివాం. తలకు గాయంతో మా అబ్బాయి విలవిలలాడిపోయినట్లు సంకేతాలున్నట్లు ఆ నివేదికలో పేర్కొన్నారు. అందులో మరిన్ని వివరాలు అది హత్య అనే చెప్తున్నాయి’’ అని తల్లి పూర్ణిమరావ్ అంటున్నారు... ‘‘ఏఐ ఇండస్ట్రీలో టాప్-10 వ్యక్తుల్లో నా బిడ్డ ఉంటాడు. అలాంటివాడు ఓపెన్ఏఐ(OpenAI) కంపెనీని.. ఉన్నపళంగా ఎందుకు ఏఐ ఇండస్ట్రీని వదిలేస్తాడు. న్యూరా సైన్స్, మెషిన్‌లెర్నింగ్ వైపు ఎందుకు మళ్లాలనుకుంటాడు?. ఓపెన్ఏఐ మా అబ్బాయిని అణచివేసి ఉండొచ్చు.. బెదిరించి ఉండొచ్చు.. అనేదే మా అనుమానం’’ అని పూర్ణిమ చెబుతున్నారు . ‘‘లాస్ ఏంజెల్స్‌లో జరిగిన మిత్రుడి పుట్టినరోజు పార్టీ నుంచి తిరిగి వచ్చినట్లు మా వాడు చెప్పాడు. వచ్చే నెలలో లాస్ వెగాస్ టెక్ షోలో పాల్గొనబోతున్నట్లు చెప్పాడు అని తండ్రి రమణమూర్తి బాలాజీతో జరిగిన చివరి సంభాషణను వివరించారు. వాడెంతో సంతోషంగా ఉన్నాడు. అలాంటివాడెందుకు ఆత్మహత్య చేసుకుంటాడు అని ఆయన అనుమానం వ్యక్తం చేశారు.సుచీర్ కెరీర్ ఎంపిక విషయంలో ఏనాడూ మేం అడ్డు చెప్పలేదు. వాడి పరిశోధనలకు ఏఐ ఇండస్ట్రీకే టర్నింగ్ పాయింట్ అవుతుందని భావించాం. ఏఐ మానవాళికి మేలు చేస్తుందనుకుంటే.. అది మరింత ప్రమాదకారిగా మారబోతుందని సుచీర్ గుర్తించాడు. చాట్‌జీపీటీ లోపాలను ఎత్తి చూపాడు. కళాకారుల, జర్నలిస్టుల శ్రమను దోపిడీ చేయడం అనైతిక చర్యగా భావించాడు. వాడి పోరాటం ఓపెన్ఏఐకి వ్యతిరేకంగా జరిగింది కాదు. కేవలం మానవత్వానికి మద్దతుగా నిలిచాడు. అందుకే వాడి అభిప్రాయంతో మేం ఏకీభవించాం... కానీ, ఏదో జరిగింది. మా దగ్గర శవపరీక్ష నివేదిక ఉంది. అందులో బలవనర్మణం కాదని స్పష్టంగా ఉంది. ఇక తెలుసుకోవాల్సింది.. దీనికి కారకులెవరు? ఎందుకు చేశారనే?.. మా అబ్బాయి మృతిపై ఎఫ్‌బీఐ దర్యాప్తు జరగాలి. ఇప్పటికే ఇక్కడి భారత అధికారులను కలిశాం. ఈ విషయంలో భారత ప్రభుత్వ మద్దతు కోరుతున్నాం. ఇక్కడ బలైంది నా బిడ్డ మాత్రమే కాదు. ఓ మేధావి జీవితం అర్ధాంతంగా ముగిసింది. టెక్ ఇండస్ట్రీ ఓ విలువైన జీవితం పొగొట్టుకుంది. ఓపెన్ ఏఐ ఇప్పుడు మాకు మద్దతుగా నిలుస్తాని ప్రకటించడం ఆశ్చర్యంగా ఉంది’’ అని సుచీర్ పేరెంట్స్ ప్రకటించారు.కార్నిఫోలియా ఎన్నారై దంపతులు బాలాజీ రమణమూర్తి-పూర్ణిమలకు సుచీర్ బాలాజీ(Suchir Balaji) జన్మించాడు. బర్కేలీ కాలిఫోర్నియా యూనివర్సిటీలో కంప్యూటర్ సైన్స్ చేశాడు. ఏఐ రీసెర్చర్ అయిన బాలాజీ ఓపెన్ఏఐ కంపెనీ కోసం నాలుగేళ్లుగా(2020-2024) పని చేశాడు. అయితే కిందటి ఏడాది ఆగష్టులో కంపెనీని వీడిన ఈ యువ రీసెర్చర్.. అక్టోబర్‌లో సంచలన వ్యాఖ్యలు చేశాడు. తాను ఓపెన్ఏఐని వీడడానికి గల కారణం తెలిస్తే.. ఎవరూ తట్టుకోలేరంటూ.. న్యూయార్క్ టైమ్స్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో సుచీర్ బాలాజీ షాకింగ్ కామెంట్లు చేశాడు. డాటా కలెక్షన్ కోసం ఓపెన్ఏఐ కంపెనీ అనుసరిస్తున్న విధానం ఎంతో ప్రమాదకరమైందని.. దీనివల్ల వ్యాపారాలు, వ్యాపారవేత్తలకు మంచిది కాదని పేర్కొన్నాడతను. అలాగే ఛాట్జీపీటీలాంటి సాంకేతికతలు ఇంటర్నెట్ను నాశనం చేస్తున్నాయని, చాట్‌జీపీటీని అభివృద్ధి చేయడంలో ఓపెన్ఏఐ అమెరికా కాపీరైట్ చట్టాన్ని ఉల్లంఘించిందని ఆరోపించాడు. అయితే సుచీర్ ఎత్తిచూపిన లోపాలను తాము ఇదివరకే సవరించామని ఓపెన్ఏఐ ప్రకటించుకుంది. మరోవైపు.. శాన్ ఫ్రాన్సిస్కోలోని బుచానన్ స్ట్రీట్ అపార్ట్మెంట్లోని తన అపార్ట్మెంట్లో నవంబర్ 26వ తేదీన సుచీర్ శవమై కనిపించాడు. అతనిది ఆత్మహత్యే అయి ఉండొచ్చని.. తమ ప్రాథమిక విచారణలో మృతి పట్ల ఎలాంటి అనుమానాలు లేవని శాన్ఫ్రాన్సిస్కో పోలీసులు ప్రకటించారు. అయినప్పటికీ అతని పేరెంట్స్‌తో పాటు పలువురు బాలాజీ మృతిపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఇదిలాఉంటే ఇంతకు ముందు.. ఇలాన్ మస్క్(Elon Musk)కు సైతంసుచీర్ బాలాజీ మృతిపై అనుమానాలు వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. కొసమెరుపు ఏంటంటే.. ఓపెన్‌ఏఐను 2015లో మస్క్-శామ్ అల్ట్మన్ కలిసి ప్రారంభించారు. అయితే మూడేళ్ల తర్వాత మనస్పర్థలతో ఇద్దరూ విడిపోయారు. ఓపెన్ఏఐకు పోటీగా X ఏఐను మస్క్ స్థాపించాడు. అప్పటి నుంచి ఇలాన్ మస్క్‌కు ఓపెన్ఏఐ సీఈవో శామ్ అల్ట్‌మన్‌కు వైరం కొనసాగుతోంది.చదవండి👉🏾 బాలాజీ తల్లి ట్వీట్, మస్క్ ఏమన్నారంటే.. -
కుమురం భీం: టైగర్ డెత్ కేసులో నలుగురు అరెస్ట్
-
సుమారు 12 ఏళ్లుగా అదే కల అతడ్ని వెంటాడుతూనే ఉంది..
‘అమీ చెప్పు.. నా తిమొతీ ఎక్కడున్నాడు.. చెప్పు ప్లీజ్..’ భార్య అమీ పిట్జన్ భుజాలను కదుపుతూ నిలదీస్తున్నాడు జేమ్స్ పిట్జన్ . అమీ మౌనంగానే ఉంది. ఆమె నోరు విప్పకపోవడంతో అతడికి ఇంకా దుఃఖం ముంచుకొచ్చింది. ‘దయచేసి నిజం చెప్పు.. నా కొడుకును నేను చూడాలి.. చెప్పు ప్లీజ్..!’ అని అరుస్తూ తన కలవరింతలకు తనే ఉలికిపడి లేచాడు. సుమారు పన్నెండేళ్లుగా అదే కల అతడ్ని వెంటాడుతూ ఉంది. ఎందుకంటే నిజంగా నిలదీయడానికి అతడి భార్య అమీ పిట్జన్ ప్రాణాలతో లేదు. 2011 మే 11 ఉదయాన్నే.. అమెరికాలోని అరారోలో ‘గ్రీన్ మన్ ఎలిమెంటరీ స్కూల్’లో తన ఆరేళ్ల కొడుకు తిమొతీని డ్రాప్ చేసి.. అటు నుంచి అటే ఆఫీస్‌కి వెళ్లిపోయాడు జేమ్స్. తన కొడుకుని కళ్లారా చూసుకోవడం అదే చివరిసారని అప్పుడు అతడికి తెలియదు. యథావిధిగా ఆ రోజు సాయంత్రం బాబును ఇంటికి తీసుకెళ్లడానికి స్కూల్‌కి వచ్చినప్పుడు.. తిమొతీ ఎప్పుడో వెళ్లిపోయాడనే సమాధానం అతణ్ణి చాలా కంగారుపెట్టింది. అయితే తీసుకుని వెళ్లింది తన భార్యేనని తెలిసి కాస్త రిలాక్స్ అయ్యాడు. ఆ తర్వాత నుంచి అమీకి చాలాసార్లు ఫోన్ ట్రై చేశాడు. కలవలేదు. పైగా స్కూల్ టీచర్‌కి అమీ.. బాబుని తీసుకుని వెళ్లేటప్పుడు ‘ఫ్యామిలీ ఎమర్జెన్సీ’ అని ఎందుకు అబద్ధం చెప్పింది? అదే ప్రశ్న జేమ్స్‌ని కుదురుగా ఉండనివ్వలేదు. అమీ తీరుపై అవగాహన ఉన్న జేమ్స్ వెంటనే పోలీసుల్ని ఆశ్రయించాడు. విచారణ మొదలైంది. మూడు రోజులు గడచినా.. ఎలాంటి సమాచారం రాలేదు. సరిగ్గా మూడోరోజు (మే 13) మధ్యాహ్నం 2 అయ్యేసరికి.. అమీ తన తల్లికి, చెల్లికి, బావమరిదికి కాల్ చేసి.. ‘మేము క్షేమంగానే ఉన్నాం, కంగారు పడొద్దు’ అని చెప్పింది. ఆ సమయంలో చెల్లెలు కారా.. ఫోన్లో అమీ మాటతో పాటు తిమొతీ మాట కూడా విన్నది. కొడుకు క్షేమమేనని తెలియడంతో జేమ్స్ ఊపిరి పీల్చుకున్నాడు. వెంటనే పోలీసులు.. అమీ ఫోన్ సిగ్నల్స్ ట్రేస్ చేసి.. అరారోకి 14 మైళ్ల దూరంలో ఉన్న ఇల్లినాయీ ప్రాంతాన్ని నిఘాలోకి తీసుకున్నారు. అక్కడున్న ప్రధాన సీసీ ఫుటేజ్‌లను ఒక్కొక్కటిగా పరిశీలించడం మొదలుపెట్టారు. కానీ ఈ లోపే జరగరాని అనర్థం జరిగిపోయింది. ఇల్లినాయీ లోని రాక్‌ఫోర్డ్‌లోని రాక్‌ఫోర్డ్ ఇన్ హోటల్లో మే 14న మధ్యాహ్నం 12 దాటేసరికి అమీ శవమై కనిపించింది. మణికట్టు, మెడ కోసుకుని ఆత్మహత్య చేసుకుంది. తను రాసిన సూసైడ్ నోట్లో.. ‘అంతా నన్ను క్షమించండి.. తిమొతీ ప్రాణాలతో ఉన్నాడు.. తనను కంటికిరెప్పలా చూసుకునే వారి దగ్గర సురక్షితంగా ఉన్నాడు. తన కోసం వెతకొద్దు.. వెతికినా మీకు ఎప్పటికీ దొరకడు’ అని రాసి పెట్టింది. జేమ్స్ గుండెలవిసేలా ఏడ్చాడు. పంచప్రాణాలైన కొడుకు ఏమయ్యాడో తెలియదు. నిజం తెలిసిన భార్య ప్రాణాలతో లేదు. ఆరేళ్ల బాబును ఎక్కడని వెతికాలి? ఎవరినని అడగాలి? తెలియక గుండెలు బాదుకున్నాడు. పోలీసులు తక్షణమే తిమొతీ కోసం వెతకడం మొదలుపెట్టారు. మే 11 నుంచి మే 14 లోపు అమీ కదలికలు స్పష్టంగా ఉన్న సీసీ ఫుటేజ్‌లు సేకరించారు. మే 11న ఉదయం 8 తర్వాత అమీ.. స్కూల్ నుంచి తిమొతీని తీసుకుని బయలుదేరింది. పది అయ్యేసరికి తన కారుని ఒక మెకానిక్ షాప్‌లో రిపేర్‌కి ఇచ్చి.. సమీపంలోని బ్రూక్‌ఫీల్డ్ జూకి తీసుకువెళ్లింది. మధ్యాహ్నం 3 అయ్యేసరికి తిరిగి వచ్చి కారు తీసుకుని.. తిమొతీతో పాటు గుర్నీలోని కీలైమ్ కోవ్ రిసార్ట్‌కి వెళ్లింది. అక్కడ నుంచి మరునాడు (మే 12న) విస్కాన్సిన్ డెల్స్, విస్కాన్సిన్ లోని కలహారీ రిసార్ట్‌కి వెళ్లారు. ఆ రోజంతా అక్కడే ఉండి.. ఆ మరునాడు (మే 13న) ఉదయం పది గంటలకు అక్కడి నుంచి చెకౌట్ చేశారు. ఆ తర్వాత తిమొతీ ఏ ఫుటేజ్‌లోనూ కనిపించలేదు. (అదే రోజు మధ్యాహ్నం అమీ తన చెల్లెలికి కాల్ చే సినప్పుడు తిమొతీ స్వరం విన్నానని చెప్పింది.) అయితే ఆ రోజు రాత్రి 11 అయ్యేసరికి రాక్‌ఫోర్డ్ ఇన్ హోటల్‌కి అమీ ఒంటరిగా వచ్చినట్లు కెమెరాలు తేల్చాయి. అంటే మే 13న ఉదయం పది నుంచి రాత్రి 11 లోపు ఏం జరిగింది? అమీ ఎవరిని కలిసింది? తిమొతీని ఏం చేసింది? ఎవరికి అప్పగించింది? అనేది మాత్రం మిస్టరీగా మారింది. నిజానికి 2008 నుంచి అమీకి, జేమ్స్‌కి మధ్య చాలా పొరపొచ్చాలున్నాయి. ఆమె చనిపోయేనాటికి విడాకుల కేసు కోర్టులో నడుస్తోంది. మొదటి నుంచి మానసిక సమస్యలతో బాధపడుతున్న అమీ.. తిమొతీ సంరక్షణకు అనర్హురాలనేది జేమ్స్ తరపు లాయర్ వాదన. అందుకే తను చనిపోతూ.. తిమొతీని జేమ్స్‌కి దక్కకుండా చేసిందని కొందరి అభిప్రాయం. మరోవైపు అమీ కారులో తిమొతీ బ్లడ్ శాంపిల్స్ దొరకడంతో.. తిమొతీని చంపి ఎక్కడైనా పారేసి.. హోటల్‌కి వచ్చి తాను ఆత్మహత్య చేసుకుని ఉంటుందని అంచనా వేశారు అధికారులు. అయితే దాన్ని అమీ కుటుంబం ఖండించింది. కొడుకుని చంపేంత క్రూరత్వం అమీకి లేదని.. కారులో దొరికిన బ్లడ్ శాంపిల్స్ కేవలం అప్పుడెప్పుడో తిమోతికి దెబ్బ తగిలినప్పుడు కారిన రక్తమని వాదించారు. ఆ వాదనను జేమ్స్ ఇప్పటికీ నమ్ముతున్నాడు. ఇక 2019లో బ్రియాన్ మైకేల్ అనే వ్యక్తి ‘నేనే తిమొతీ’నని సంచలనం రేపి యావత్ ప్రపంచాన్నే తనవైపు చూసేలా చేశాడు. అయితే డీఎన్ఏ పరీక్షల్లో కాదని తేలడంతో అతడికి రెండేళ్లు జైలు శిక్షపడింది. ఇప్పటికీ జేమ్స్.. తిమొతీ గురించి ఎదురు చూస్తూనే ఉన్నాడు. తనతో గడిపిన వీడియోలు, జ్ఞాపకాలుగా మిగిలిన ఫొటోలను చూసుకుంటూ జీవిస్తున్నాడు. ఏదేమైనా తిమొతీ ప్రాణాలతో ఉన్నాడో లేదో నేటికీ మిస్టరీనే. ప్రాణాలతో ఉంటే ఇప్పటికి ఆ బాబుకి 18 ఏళ్లు నిండి ఉంటాయి. తనవాళ్లని ఎప్పటికీ కలవనని.. ఆనాడే తల్లికి మాట ఇచ్చి అజ్ఞాతంలో మిగిలిపోయాడా? తండ్రి ఆశల్ని నిజం చేయడానికి ఏరోజుకైనా తిరిగి వస్తాడా? కాలమే సమాధానం చెప్పాలి. ఇది నాలుగో పెళ్లి.. అమీ చిన్నప్పటి నుంచి ఎన్నో మానసిక ఒత్తిళ్లను ఎదుర్కొంది. జేమ్స్‌ని కలవక ముందు చనిపోవడానికి రైల్వే ట్రాక్ మధ్యలో కారు ఆపి.. చివరి నిమిషంలో నిర్ణయం మార్చుకుని తిరిగొచ్చింది. ఆ తర్వాత కూడా కౌన్సెలింగ్, ట్రీట్మెంట్ అంటూ మందులు వాడేది. తనకంటే ముందు ముగ్గురితో విడాకులు తీసుకుందన్న విషయం జేమ్స్‌కి తర్వాత తెలిసింది. ఇక జేమ్స్‌తో డేట్లో ఉన్నప్పుడు కూడా ఉద్యోగం రాలేదని డ్రిప్రెషన్తో ఆత్మహత్యాయత్నం చేసింది. తర్వాత నుంచి మానసిక వైద్యులు ఇచ్చిన టాబ్లెట్స్ వాడుతూ ఉండేది. మొదట వాళ్లు డేట్లో ఉన్నప్పుడు అమీ ఉన్న మానసిక సమస్య తీరే వరకూ పిల్లలు వద్దు అనుకున్నారు. కానీ ఏడాది తర్వాత పిల్లల కోసం కలలు కనడం మొదలుపెట్టారు. 2004లో అమీ నాలుగో నెల కడుపుతో ఉన్నప్పుడు జేమ్స్ తనని పెళ్లి చేసుకున్నాడు. ఇక తిమొతీ చాలా చలాకీ పిల్లాడు. చాలా తెలివిగా ఆలోచించేవాడు. ఎప్పుడూ సరదగా నవ్వుతూ ఉండేవాడు. తండ్రితో అతడికి మంచి అనుబంధం ఉండేది. ఎప్పుడైనా ఆడుకోవడానికి వెళ్లి కాస్త లేటుగా తిరిగి వస్తే.. ‘నన్ను మిస్ అయ్యావా డాడీ’ అని అడిగేవాడట! అమీ కూడా కొడుకుని ప్రాణంగా చూసుకునేది. అలాంటి తల్లి కొడుకు ప్రాణాలు తీస్తుందంటే నేను నమ్మలేను. నిజానికి జేమ్స్ విడాకులు అనేసరికి అమీ మానసిక పరిస్థితి మళ్లీ మొదటికి వచ్చిందని నాకు అర్థమైంది. పైగా మందులు కూడా సరిగా వేసుకునేది కాదు. దానికి తోడు ఆర్థిక సమస్యలు కూడా ఎక్కువ అయ్యాయి. కారా జాకబ్స్, అమీ సోదరి -∙సంహిత నిమ్మన -
పార్క్‌లో సహాయ కలెక్టర్ సస్మిత డెడ్‌బాడీ.. ఆత్మహత్య లేక హత్యా?
భువనేశ్వర్: అదనపు కలెక్టర్ కార్యాలయంలో సహాయ కలెక్టర్‌గా విధులు నిర్వహిస్తున్న మహిళ మృతిచెందడం కలకలం సృష్టించింది. ఈ ఘటన ఒడిషాలో చోటుచేసుకుంది. అయితే, ఆమె మృతికి ఒత్తిడే కారణమని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు వెల్లడించారు. వివరాల ప్రకారం.. రుర్కెలాలో అదనపు కలెకర్ట్ ఆఫీసులో రాజగంగపూర్ ప్రాంతానికి చెందిన సస్మిత మింజ్ (35) సహాయ కలెక్టర్‌గా పనిచేస్తున్నారు. అయితే, పార్కులో ఉన్న జలాశయంలో మహిళ మృతదేహం తేలుతూ కనిపించడం పలు అనుమానాలకు తావిస్తోంది. కాగా, ఈ నెల 15న సస్మిత విధులకు వెళ్లి తిరిగి ఇంటికి రాలేదు. 17వ తేదీన ఆమె నగరంలో ఒక హోటల్లో ఉన్నట్లు తెలిసింది. తల్లి, సోదరుడు హోటల్‌కి వెళ్లి ఆమెను కలవాలని ప్రయత్నించినా అందుకు ఆమె నిరాకరించారు. అయితే, కార్యాలయంలో ఒత్తిడి ఎక్కువగా ఉందని, తనకు విశ్రాంతి కావాలని, తాను ఎవరినీ కలుసుకోనని తెలిపారు. ఇదిలా ఉండగా.. మంగళవారం సాయంత్రం పార్కులో ఉన్న జలాశయంలో ఓ మహిళ మృతదేహం తేలుతూ కనిపించడంతో సెక్యూరిటీ గార్డు పోలీసులకు సమాచారం అందించాడు. దీంతో అగ్నిమాపక సిబ్బందిని తీసుకుని వచ్చి మృతదేహాన్ని ఒడ్డుకు చేర్చారు. మృతదేహం సహాయ కలెక్టర్‌ది అని గుర్తించారు. జలాశయం తీరంలో ఆమె హ్యాండ్‌బ్యాగ్, చెప్పులు లభించాయి. ఆమె కుటుంబ సభ్యులు మృతి చెందిన సస్మిత మృతదేహాన్ని చూసి కన్నీరుమున్నీరవుతున్నారు. అనంతరం, మృతదేహాన్ని పరీక్షల కోసం ఆసుపత్రికి తరలించి దర్యాప్తు ప్రారంభించారు. కాగా, అదనపు కలెక్టర్ కార్యాలయంలో కొంతమంది అధికారులు ఆమెను మానసికంగా వేధించడం వల్ల ఆత్మహత్య చేసుకుని ఉంటుందని లేదా హతమార్చి జలాశయంలో విసిరేసి ఉంటారని కుటుంబ సభ్యులు ఆరోపించారు. దీంతో, కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్టు తెలిపారు. పార్క్ పరిసరాల్లో ఉన్న సీసీ టీవీ ఫుటేజీని పరిశీలిస్తున్నట్టు స్పష్టం చేశారు. ఇది కూడా చదవండి: యూపీలో మరో ఎన్కౌంటర్.. మహిళా కానిస్టేబుల్‌పై దాడిలో.. -
పంజాబ్‌ను ఓ ఊపు ఊపిన సింగర్.. అతడి హత్య ఇప్పటికీ మిస్టరీనే!
మనసులో పుట్టిన మాటలకు బాణీ కట్టి రాగం అందుకుంటే, అది మహామహ జనసందోహాలను కూడా ఏకం చేసి ఉరకలేయిస్తుంది. సై.. సై.. అంటూ ఉర్రూతలూగిస్తుంది. విప్లవాలను, ఉద్యమాలను, సంస్కరణలను జతచేర్చి.. తరతరాలకు పాఠమవుతుంది. అయితే అదే రాగం కొందరికి చేదును, మరికొందరికి చికాకును ఇంకొందరిలో అసూయనూ రగిలించి నిప్పు రాజేస్తుంది. ఆ నిప్పే కాల్చేసిందో, లేక అంతటి ఔదార్యమున్న కలానికి కులం రంగు అద్దిన ఉన్మాదమే కడతేర్చిందో.. తెలియదు కానీ అమర్ సింగ్ చమ్కీలా జీవితంలో పెద్ద ఉపద్రవమే ముంచుకొచ్చింది. అసలు ఎవరీ చమ్కీలా? ఏం జరిగింది? దుస్తుల మిల్లులో చేరి.. భారతీయ సంగీత చరిత్రలో చమ్కీలా కథకు ప్రత్యేకమైన అధ్యాయముంది. చమ్కీలా అంటే పంజాబీలో ప్రకాశవంతమైనదని అర్థం. పంజాబ్, లూథియానా సమీపంలోని దుగ్రీ గ్రామంలో చమార్ (దళిత్) కులానికి చెందిన కర్తార్ కౌర్, హరిరామ్ సింగ్ దంపతులకు 1960 జూలై 21న చమ్కీలా జన్మించాడు. అతని అసలు పేరు ధనీరామ్. చిన్నవయసులోనే గుర్మైల్ కౌర్ అనే బంధువుల అమ్మాయితో పెళ్లి జరిగింది. వీరికి అమన్‌దీప్ కౌర్, కమన్ చమ్కీలా (ప్రస్తుతం ఫోక్ సింగర్) అనే ఇద్దరు ఆడపిల్లలు పుట్టారు. మరో కొడుకు పుట్టి.. అనారోగ్యంతో చనిపోయాడు. మొదటి నుంచి ఎలక్ట్రీషియన్ కావాలని ఆశపడిన ధనీరామ్.. ఆ ఆలోచనను పక్కనపెట్టి.. ఆర్థిక కష్టాలను ఎదుర్కోవడానికి దుస్తుల మిల్లులో చేరాడు. అక్కడ ఓ స్నేహితుడు ఇతని రాతకు ముగ్ధుడై.. సురీందర్ షిండా అనే ఓ సంగీతవిద్వాంసుడి దగ్గరకు తీసుకెళ్లాడు. ధనీరామ్ కథలో, పేరులో మార్పులు అక్కడి నుంచే మొదలయ్యాయి. పంజాబ్‌ను ఓ ఊపు ఊపిన చమ్కీలా చమ్కీలా (ధనీరామ్) టీమ్‌లో చేరినప్పటి నుంచి షిండా పేరు దేశవిదేశాలకు పాకింది. చమ్కీలాకు మాత్రం గుర్తింపు దక్కలేదు. పైగా ఇతర దేశాల్లో ప్రదర్శనలకు చమ్కీలాను తీసుకెళ్లడానికి షిండా ఇష్టపడేవాడు కాదు. 1980లో ఒకసారి షిండా.. కెనడా పర్యటనకు వెళ్లినప్పుడు ఆ గ్రూప్‌లోని సోనియా అనే మరో గాయని చమ్కీలాను కలిసింది. ‘షిండాను దాటి నీకు గుర్తింపు రావాలంటే.. నేను కొత్తగా ప్రారంభిస్తున్న బృందంలో చేరు’ అని చెప్పడంతో చమ్కీలా సరే అన్నాడు. సోనియా పెట్టుబడి పెడితే.. చమ్కీలా తన ఆలోచనలకు మరింత పదునుపెట్టి.. ఆమె దగ్గరే జీతానికి కుదిరాడు. అనుకున్నట్లే షిండా కెనడా నుంచి పంజాబ్ వచ్చేలోపు.. సోనియా ఆధ్వర్యంలో ఎనిమిది యుగళగీతాలను విడుదల చేసి పంజాబ్‌ని ఓ ఊపు ఊపాడు చమ్కీలా. రిలీజ్ చేసిన ప్రతి ఆల్బమ్ హిట్.. అయితే ఆ ఏడాది చివరికి.. సోనియా, ఆమె భర్త కలసి.. తన కారణంగా లక్షలు సంపాదిస్తూ, తనకు నెల జీతం మాత్రమే ఇస్తున్నారని గ్రహించాడు. దాంతో చమ్కీలా.. తానే ఒక రంగస్థలాన్ని ఏర్పాటు చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు. అనుకున్నట్లే హార్మోనియం, ఢోలక్ వాయించగలిగే బృందంతో పాటు.. అమర్‌జోత్ కౌర్ అనే ఒక మహిళా గాయనినీ తన టీమ్‌లోకి తీసుకుని.. ఆల్బమ్స్ రిలీజ్ చేయడం మొదలు పెట్టాడు. రిలీజ్ చేసిన ప్రతి ఆల్బమ్ హిట్ కొట్టడంతో చమ్కీలా పంజాబ్ సూపర్ స్టార్ అయ్యాడు. ఆ సమయం లోనే అతనికి అమర్ జోత్‌తో స్నేహం కుదిరింది. ఆ స్నేహం ప్రేమగా మారి.. పెళ్లిదాకా వెళ్లింది. రెండో పెళ్లి.. ఊరూరా ప్రదర్శనలు మొదటి భార్య గుర్మైల్ని ఒప్పించి (విడాకులు తీసుకున్నాడని కొందరంటారు).. 1983లో అమర్జోత్ని రెండో పెళ్లి చేసుకున్నాడు. వీరికి జైమన్ (ప్రస్తుత ఫోక్ సింగర్) అనే కొడుకు పుట్టాడు. వివాహేతర సంబంధాలు, మత సంఘర్షణలు, మద్యపానం, వరకట్నాలు, మాదకద్రవ్యాలు.. ఇలా ప్రతి సమస్యపైనా పాట కట్టి.. ప్రజలను ఆలోచింపచేసేవాడు చమ్కీలా. వేడుక ఏదైనా.. ప్రతి ఊళ్లో అతని దరువు వినిపించాల్సిందే. ఏడాదికి ఊరూరా 366 ప్రత్యక్ష ప్రదర్శనలు చేసేవారంటే చమ్కీలా దంపతులు ఎంత బిజీగా ఉండేవారో అర్థం చేసుకోవచ్చు. 1988 మార్చి 8న మధ్యాహ్నం 2 గంటలకు మెహసంపూర్ సమీపంలోని ప్రదర్శనకు వెళ్తుంటే.. ముసుగులేసుకున్న కొందరు దుండగులు బైక్స్ మీదొచ్చి చమ్కీలా కారుకు అడ్డుపడ్డారు. తూటాల వర్షం.. మరుక్షణమే తుపాకులతో తూటాల వర్షం కురిపించారు. ఆ దాడిలో చమ్కీలా(27), అమర్‌జోత్ అక్కడికక్కడే కన్నుమూశారు. ఆ సమయంలో అమర్‌జోత్ గర్భవతి. సంఘటనా స్థలంలో ఉన్న కొందరు గ్రామస్థులు.. ఆ దుండగులను వెంబడించినా దొరకలేదు. దాంతో ఎవరు చంపారు? అనేది నేటికీ మిస్టరీగా మిగిలిపోయింది. నిజానికి ఈ హత్యకేసుపై చాలా ఊహాగానాలున్నాయి. అప్పటి ఖలిస్తాన్ ఉద్యమానికి వ్యతిరేకంగా పాటలు రాసినందుకే సిక్కు ఉగ్రవాదులు చమ్కీలాను చంపేశారని కొందరి అభిప్రాయం. చమ్కీలా గొంతు మూగబోయి 35 ఏళ్లు కొన్ని సంగీత బృందాలు కేవలం చమ్కీలా వల్లే మరుగున పడ్డాయని.. ఆ అక్కసుతోనే వారంతా కలసి అతనిని చంపించారని మరి కొందరి ఊహ. మరోవైపు చమ్కీలా రెండో భార్య అమర్‌జోత్ ఉన్నత వర్గానికి చెందిన స్త్రీ కావడంతో.. ఇది పరువు హత్య అని.. అమర్‌జోత్ కుటంబీకులే ఈ నేరానికి పాల్పడి ఉంటారని ఇంకొందరి వాదన. ఇతడి జీవితకథపై చాలా సినిమాలు, పుస్తకాలూ విడుదలయ్యాయి. వాటిలో కొన్ని వివాదాలపాలయ్యాయి. ఏది ఏమైనా చమ్కీలా గొంతు మూగబోయి 35 ఏళ్లు దాటింది. అయినా నేటికీ జానపద సంగీత ప్రియులకు అతడి పాట వినిపిస్తూనే ఉంది. చమ్కీలా కూతురు, కొడుకు కూడా సింగర్లే చమ్కీలా కుమార్తె కమల్. యూట్యూబ్‌లో ఈమె వీడియోలు, పాటలు ట్రెండింగ్‌లో ఉన్నాయి. చమ్కీలా కుమారుడు జైమన్ చమ్కీలా, కోడలు రియా. (వీరిద్దరూ జోడీగా చేసే ఫోక్ సాంగ్స్ కూడా ట్రెండింగ్‌లో నడుస్తున్నాయి.. చమ్కీలా పాటల్లో కొన్ని.. ‘పెహెలే లల్కార్ నాల్ (తొలుత బాకా మోగింది)’ ఇది పెళ్ళైన జంట గురించి పాడిన పాట. ‘బాబా తేరా నన్కానా (బాబా నీ మందిరం, నీ గురువు గురునానక్)’ ఇది సిక్కులకు ధైర్యం చెప్పే పాట. ‘భూల్ గయీ మై ఘుండ్ కడ్నా (ముసుగు వేసుకోవడం మరచాను)’.. లాంటి పాటలూ ఎంతో ప్రాచుర్యం పొందాయి. - సంహిత నిమ్మన చదవండి: ఒక్కరోజుకు నాలుగు వందలా? అవసరం లేదన్న హీరోయిన్ -
ఫోన్ లో భర్తతో గొడవపడిన శ్వేత
-
మిస్టరీగా మారిన విశాఖ శ్వేత డెత్ కేస్
-
ఆయనను చంపేశారు.. బాలీవుడ్ నటుడి మృతిపై సంచలన ఆరోపణలు!
రెండు రోజుల క్రితమే బాలీవుడ్ ప్రముఖ నటుడు, దర్శకుడు సతీశ్ కౌశిక్ మృతి చెందిన సంగతి తెలిసిందే. అయితే ఆయన మృతిపై రోజు రోజుకు అనుమానాలు పెరిగిపోతున్నాయి. ఆయన మరణంపై సంచలన విషయాలు బయటకొస్తున్నాయి. ఢిల్లీకి చెందిన ఓ వ్యాపారవేత్త కౌశిక్‌ను హత్య చేశారని తాజాగా ఓ మహిళ పోలీసులకు ఫిర్యాదు చేయడం కలకలం సృష్టిస్తోంది. ఇప్పటికే ఆయన మరణాన్ని అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. తాజాగా మహిళ వ్యాఖ్యలతో ఈ కేసు మరిన్నీ మలుపులు తిరగనుంది. కాగా.. హోలీ వేడుకల్లో సతీష్ కౌశిక్ గుండెపోటుకు గురయ్యారని వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. నా భర్తే చంపేశారు: మహిళ ఇక్కడే మరో ట్విస్ట్ ఇచ్చింది ఆ మహిళ. అయితే ఆ మహిళ ఓ బిజినెస్ మ్యాన్ భార్య. తన భర్తకు సతీశ్ కౌశిక్ రూ.15 కోట్లు ఇచ్చారని ఫిర్యాదులో తెలిపింది. డబ్బులు తిరిగి ఇవ్వాలని అడిగినందుకే ప్లాన్ చేసి చంపేశారంటూ మహిళ ఆరోపిస్తోంది. సతీష్ కౌశిక్‌ను చంపేందుకు తన భర్త కొన్ని ట్యాబ్లెట్స్ ఏర్పాటు చేశారని కూడా తెలిపింది. ఇప్పటికే సతీష్ కౌశిక్ మరణించిన ఫామ్ హౌజ్‌లో పోలీసులకు నిషేధ ఉత్ప్రేరక డ్రగ్స్ లభ్యమైన సంగతి తెలిసిందే. కాగా.. సతీష్ కౌశిక్ అదే వ్యాపారవేత్త ఫామ్‌హౌస్‌లో హోలీ పార్టీకి హాజరైన తర్వాతే మరణించాడు. ఫామ్‌హౌస్‌లో హోలీ పార్టీకి వచ్చిన అతిథుల జాబితాను కూడా పోలీసులు సిద్ధం చేశారు. మొత్తం 10 నుంచి 12 మంది పార్టీకి వచ్చినట్టు తెలుస్తోంది. ఈ ఫామ్ హౌస్ సతీష్ కౌశిక్ స్నేహితుడు వికాస్ మాలూది కాగా.. అక్కడ లభ్యమైన ఔషధాలు ఎవరికోసం, ఎందుకు తీసుకొచ్చారన్న దానిపై లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. తాజాగా మహిళ ఫిర్యాదుతో సతీష్ కౌశిక్ మరణంపై అనుమానాలను మరింత పెరుగుతున్నాయి. అలాంటిదేం లేదు: సతీశ్ కౌశిక్ భార్య ఈ ఆరోపణలపై సతీష్ కౌశిక్ భార్య శశి కౌశిక్ స్పందించింది. తన భర్త హోలీ పార్టీకి హాజరయ్యేందుకు ఢిల్లీకి వచ్చారని.. కానీ ఆర్థిక లావాదేవీలపై వచ్చిన ఆరోపణలు నిరాధారమని పేర్కొన్నారు. వ్యాపారవేత్తను సమర్థిస్తూ సతీష్ కౌశిక్ మంచి స్నేహితులని అన్నారు. వ్యాపారవేత్త ధనవంతుడని..తన భర్త నుంచి డబ్బు తీసుకోవాల్సిన అవసరం లేదని ఆమె పేర్కొంది. ఆయన శాంపిల్స్‌లో మందులు లేవని పోస్ట్‌మార్టం నివేదిక నిర్ధారించిందని శశి కౌశిక్ తెలిపారు. మహిళను ఉద్దేశి శశి న్యూస్ ఛానెల్‌తో మాట్లాడుతూ తన భర్తను హత్య చేసినట్లు ఎందుకు చెబుతుందో నాకర్థం కావడం లేదని తెలిపింది.నా భర్త చనిపోయిన తర్వాత ఆమె పరువు తీయడానికి ఎందుకు ప్రయత్నిస్తుందో అర్థం కావడం లేదు. ఆమెకు తన భర్త నుంచి డబ్బు రాబట్టడం కోసం సతీష్ కౌశిక్‌ను లాగుతోందని శశి ఆరోపిస్తున్నారు. కాగా.. సతీష్ కౌశిక్ హరియాణాలోని మహేంద్రఘడ్‌లో 1956లో జన్మించారు. 1983లో వచ్చిన 'మాసూమ్'తో నటుడుగా కెరీర్ ప్రారంభించిన ఆయన అనుపమ్ ఖేర్‌తో కలిసి పలు సినిమాలు నిర్మించారు. ఆ తర్వాత రచయితగా, దర్శకుడిగా, నిర్మాతగా మారారు. సుమారు 15 సినిమాలకు ఆయన దర్శకత్వం వహించారు. దర్శకుడిగా ఆయన తీసిన చివరి సినిమా 'కాగజ్'. -
వీడిన చిన్నారి ఇందు మృతి మిస్టరీ
-
జవహర్ నగర్ బాలిక మృతి కేసులో కొనసాగుతున్న దర్యాప్తు
-
జయలలిత మరణం...శశికళను విచారణకు ఆదేశించాలన్న కమిషన్
చెన్నై: తమిళనాడు దివగంత మాజీ ముఖ్యమంత్రి జయలలిత డిసెంబర్ 5, 2016న మృతి చెందిన సంగతి తెలిసిందే. ఐతే ఆమె మృతిపై పలు అనుమానాలు ఉన్నాయంటూ ఆర్మగస్వామి కమిషన్ని ఏర్పాటు చేయడం, ఐదేళ్ల తదనంతరం కమిషన్ 600 పేజీల నివేదికను స్టాలిన్‌కి సమర్పిచడం జరిగింది. ఐతే ఆ నివేదిక తోపాటు అదనంగా సమర్పించిన 200 పేజీల్లో కొన్ని కీలక విషయాలను వెల్లడించిన సంగతి కూడా తెలిసిందే. ఐతే ప్రస్తుతం ఆ కమిషన్ తన ముగింపు వ్యాఖ్యలలో జయలలిత నెచ్చలి, స్నేహితురాలు శశికళను దోషిగా పేర్కొంటూ విచారణకు ఆదేశించాలని పేర్కొంది. ఇందులో డాక్టర్ శివకుమార్(జయలలిత వ్యక్తిగత వైద్యుడు, శశికళ బంధువు), మాజీ ఆరోగ్య కార్యదర్శి రాధకృష్ణన్ , మాజీ ఆరోగ్య మంత్రి సి విజయ భాస్కర్లను కూడా దోషులుగా చేరుస్తూ దర్యాప్తుకు అభ్యర్థించింది. అంతేగాదు కమిషన్ వివిధ కోణాలను పరిగణలోనికి తీసుకుంటే వారందర్నీ దోషులుగా గుర్తించి దర్యాప్తు చేస్తేగాని ఒక నిర్ధారణకు రావడం సాధ్యం కాదని స్పష్టం చేసింది. పైగా జయలలిత మరణాన్ని అధికారికంగా ప్రకటించడాన్ని కూడా తప్పుపట్టింది కమిషన్. అలాగే జయలలిత డిసెంబర్ 4, 2016న మధ్యాహ్నాం 3.50 నిమిషాలకు గుండెపోటుకు గురైన తర్వాత సీపీఆర్, స్టెర్నోటమీ వంటి ప్రయత్నాలు ఫలించలేదు. అయితే నిందితులు దీన్నీ సాకుగా చూపిస్తూ అధికారికంగా ప్రకటించడానికి జాప్యం చేసినట్లు చెబుతున్నారని కమిషన్ ఆరోపిస్తోంది. ఆమె చనిపోయింది డిసెంబర్ 4, 2016 అయితే ఆస్పత్రి వర్గాలు డిసెంబర్ 5, 2016గా ప్రకటించడాన్ని తప్పుపట్టింది. అలాగే జస్టిస్ అరుణ జగదీశన్ కమీషన్ ఆఫ్ ఎంక్వైరీ 2018లో రాష్రంలోని తూత్తుకూడిలో జరిగిన పోలీస్ కాల్పుల ఘటనలో పోలీసుల తీరుని తప్పుపట్టింది. ఈ మేరకు స్టాలిన్ ప్రభుత్వం మాజీ ముఖ్యమంత్రి జయలలిత మరణం, 2018 తూత్తుకుడి ఘటన సంబంధించిన విచారణ నివేదికలను మంగళవారం అసెంబ్లీకి సమర్పించింది. (చదవండి: : ఐదేళ్లకు.. ‘అమ్మ’ మరణంపై కమిషన్ విచారణ పూర్తి -
పాలిన్ చనిపోయిందంటున్నారు.. ఇంటికి వచ్చిందెవరు?
అది 1922, ఏప్రిల్ నెల. నార్త్–వెస్ట్ ఫ్రాన్స్.. బ్రిటనీ ప్రాంతంలోని గోవాస్ అల్ లూడూ. ఆ గ్రామంలో ఊహించని అలజడి మొదలైంది. వందల మంది సందుగొందుల్లో పరుగులు తీస్తున్నారు. గుంతల్నీ, చెట్టు తొర్రల్నీ వేటినీ వదిలిపెట్టకుండా అణువణువు వెతుకుతున్నారు. ‘పాలిన్.. పాలిన్..’ ఇదే పేరు ప్రతి ఒక్కరి నోట. పక్కనే ఉన్న అడవినీ జల్లెడ పట్టేశారు. ఎటు చూసినా పాలిన్ పేరే మారుమోగసాగింది. కానీ పాలిన్ మాత్రం దొరకలేదు. పాలిన్ పికార్డ్.. రెండేళ్ల చిన్నారి. పొలంలో ఆడుతూ ఆడుతూ ఉన్నట్టుండి మాయమైంది. అడవివైపు వెళ్లిందా? అక్కడ తప్పిపోయి.. చలికి తట్టుకోలేక ఎక్కడైనా పడిపోయిందా? లేక అడవి పందులేమైనా లాక్కెళ్లాయా? అనుకుంటూ పాలిన్ కుటుంబంతో పాటు చుట్టుపక్కల జనమంతా వెతుకుతూనే ఉన్నారు. లాభం లేదని పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులతో పాటు సైనిక బృందం కూడా రంగంలోకి దిగింది. ఎవరెన్ని ప్రయత్నాలు చేసినా.. పాలిన్ ఆచూకీ దొరకలేదు. దాంతో ‘ఎవరైనా ఎత్తుకెళ్లారా?’ అనే అనుమానాలు బలపడ్డాయి. ఆ దిశగా విచారణ మొదలుపెడితే.. పాలిన్ మిస్ అయిన రోజు.. పొలానికి సమీపంలో ఇద్దరు అపరిచితుల్ని చూశామంటూ పొరుగువారు గుర్తుచేసుకున్నారు. మరోవైపు కెరమాన్ అనే గొడుగులు అమ్మే వ్యక్తిని అరెస్ట్ కూడా చేశారు. పాలిన్ అంటే కెరమాన్ చాలా ఇష్టంగా ఉండేవాడని.. పాలిన్ అదృశ్యమైన రోజు అతడు పాపని కలిశాడని తేలడంతో అతడ్ని గట్టిగానే విచారించారు. సరైన ఆధారాలు లేక విడిచిపెట్టారు. గోవాస్ అల్ లూడూ గ్రామంలో పాలిన్ కుటుంబం ఉండే ఇల్లు ఊరికి దూరంగా సింగిల్‌గా ఉండేది. మే నెల చివర్లో పోలీసులు ఒక చిన్న పాప ఫొటోతో వచ్చి.. పాలిన్ కుటుంబాన్ని కలిశారు. ‘ఈమేనా మీ పాప?’ అని అడిగారు. ఫొటోని బాగా పరికించి చూసిన పికార్డ్ దంపతులు.. ‘అవును’ అంటూ ఏడ్చేశారు. ‘ఈ పాప రూ కోయ్పెల్లో దొరికింది. చినిగిన బట్టలతో ఉన్న ఓ మహిళ ఈ పాపని వదిలేసి పారిపోయింది, పాపని షెర్బోర్గ్లోని ధర్మశాలకు తరలించారు’ అంటూ జరిగింది చెప్పుకొచ్చారు పోలీసులు. నిజానికి పాప దొరికిన ప్రాంతం.. గోవాస్ అల్ లూడూ గ్రామానికి 217 మైళ్ల (350 కిమీ) దూరంలో ఉంది. అంత దూరం పాలిన్ ఎలా వెళ్లిందో? ఎవరికీ అంతుపట్టలేదు. పోలీసులు చెప్పింది విన్న వెంటనే పాలిన్ పేరెంట్స్ షెర్బోర్గ్కు రైలెక్కారు. పాప ఉన్న ధర్మశాలకు వెళ్లారు. అక్కడ పాపని చూస్తే.. గుర్తుపట్టలేనంతగా చిక్కిపోయింది. తనే పాలిన్ అంటే.. పాప తల్లిదండ్రులు నమ్మలేకపోయారు. అయితే అదే జుట్టు, అవే నీలి కళ్ళు కావడంతో ఏడుస్తూ గుండెలకు హత్తుకున్నారు. ‘ఇన్నిరోజులుగా సరైన ఆహారం అందకపోవడం వల్లే పాలిన్ అలా అయ్యింది’ అని వైద్యులు చెప్పారు. పాప పోషకాహార లోపంతో బాధపడుతోందని, వైద్యపరమైన ఎలాంటి సమస్యలు లేవని తేల్చేశారు. తల్లిదండ్రులు పాపతో స్థానిక భాషలో మాట్లాడటానికి ప్రయత్నించినప్పుడు.. పాప వాళ్లని గుర్తుపట్టలేదు. మొత్తానికీ పాపని ఇంటికి తెచ్చుకున్నారు. పాప దొరికిన రోజు పాప ఒంటి మీదున్న దుస్తులు పాలిన్వి కాకపోవడంతో.. బహుశా పాపని ఎత్తుకెళ్లినవాళ్లు దుస్తులు మార్చి ఉంటారని అనుకున్నారు. రావడం రావడమే పాపను చూసిన తోబుట్టువులు ఆమెను పాలిన్గానే గుర్తించారు. అయితే పాప మాత్రం మౌనంగానే ఉండేది. తినడానికి రొట్టెలు అడుగుతుందని, స్థానిక భాషలో పెంపుడు పిల్లిని పిలుస్తుందని నెమ్మదిగా.. పాత పాలిన్ లా యాక్టివ్ అవుతుందని కుటుంబసభ్యులంతా నమ్మడం మొదలుపెట్టారు. కొన్ని రోజులకు.. గోవాస్ అల్ లూడూలో మరో అలజడి రేగింది. పాలిన్ ఇంటికి మైలు దూరంలో ఉన్న పొలంలో.. ఓ రైతుకు.. తల, చేతులు, కాళ్లు లేని కుళ్ళిపోయిన చిన్న శరీరం కనిపించింది. ఆ పక్కనే పొందిగ్గా మడతపెట్టిన బట్టలు కనిపించాయి. వెంటనే ఆ రైతు పోలీస్ స్టేషన్ కి పరుగుతీశాడు. పోలీసులు వచ్చి పరిశీలించగా ఆ బట్టలు పాలిన్ వేనని తేలాయి. దాంతో అది పాలిన్ శవమని గుర్తించారు. డెడ్ బాడీకి కాస్త దూరంలో పూర్తిగా రూపురేఖలు లేని తల కనిపించింది. అయితే అప్పటికే పాలిన్‌ని వెతికే క్రమంలో.. మృతదేహం దొరికిన ఆ ప్రాంతాన్ని పోలీసులు, ప్రజలు పలుమార్లు వెతికారు. అప్పుడు దొరకని మృతదేహం, బట్టలు ఇప్పుడు దొరికాయంటే.. ఎవరో కావాలనే వాటిని అక్కడ వేశారని అర్థమైంది. అది కచ్చితంగా పాలిన్ ని మాయం చేసిన నేరస్తుల పనేనని తేలిపోయింది. కానీ నేరగాడు మాత్రం పట్టుబడలేదు. తీరా వైద్యపరీక్షలు చేస్తే.. ఆ తల, శరీరం ఒకే వ్యక్తివి కావని.. శరీరం చిన్న పాపదే కానీ తల మాత్రం ఒక పురుషుడిదని, తలను నక్కలు పాక్షికంగా తినడం వల్లే అలా తయారైదని తేలింది. కేసులో ట్విస్ట్‌ల మీద ట్విస్ట్‌లు కనిపిస్తుండడంతో పోలీసులు తలలు పట్టుకున్నారు. పాలిన్ శరీరంలో కాళ్లు, చేతులు, తల ఏమయ్యాయి? తల మాత్రమే దొరికిన పురుషుడు ఎవరు? అతడి శరీరం ఏమైంది? అసలు ధర్మశాల నుంచి తెచ్చుకున్న పాప ఎవరు? ఇలా అన్నీ ప్రశ్నలే మిగిలాయి. మరణానికి గల సరైనకారణం వైద్యపరీక్షల్లో తేలలేదు. అయితే పాలిన్‌ని కిడ్నాప్ చేసిన వారు.. పాపను దాచిపెట్టి కేసును తప్పుదోవ పట్టించడానికే ఇలా మృతదేహాలతో ఆడుకుంటున్నారని నమ్మడం మొదలుపెట్టారు కొందరు. షెర్బోర్గ్లో దొరికిన పాప.. పారిపోయిన ఆ మహిళ కూతురేనని.. పోషించలేకే పాపను వదిలి, ఆమె తన భర్తతో కలసి అమెరికా వలసపోయిందని ఊహాగానాలు వచ్చాయి. ఇక జూన్ నెల మధ్యలో పికార్డ్ దంపతులు.. ఆ పాపను దత్తత తీసుకోవడానికి సిద్ధపడ్డారు. కొన్ని రోజులకు వైవ్స్ మార్టిన్ అనే మతి చలించిన వ్యక్తి.. పికార్డ్ దంపతుల్ని కలసి.. వారి దగ్గరున్న చిన్నపాపను చూపిస్తూ.. ‘ఇది పాలిన్ అని మీరు నమ్ముతున్నారా? దేవుడా నన్ను క్షమించు, నేను దోషిని’ అని పెద్దగా నవ్వుతూ అడవిలోకి పారిపోయాడు. ఆ మరుసటి రోజు అతణ్ణి పిచ్చి ఆసుపత్రికి తరలించారు. అతడే పాలిన్‌ను హత్య చేసి ఉంటాడని చాలా మంది నమ్మారు. ఏది ఏమైనా పాలిన్ కథలో అసలు నేరగాడు ఎవరు? ఆ మృతదేహాలు ఎవరివి? అక్కడకి ఎలా వచ్చాయి? మతిచలించిన ఆ వ్యక్తే నేరం చేశాడా? వంటివన్నీ మిస్టరీగానే మిగిలాయి. - సంహిత నిమ్మన -
ఆత్మహత్యా లేక క్షుద్ర బలా..? చైనాను కుదిపేసిన డెత్ మిస్టరీ
సరిగ్గా 13 ఏళ్ల క్రితం.. యావత్ చైనానే అల్లాడించిన కథ ఇది. చైనా, బనాన్ జిల్లాలోని షుయాంగ్జింగ్ అనే మారుమూల గ్రామం అది. సుమారు 3 వేల మంది నివసించే ఆ గ్రామంలో కుయాంగ్ జీ అనే వలస కూలీకి ఓ పాత ఇల్లు ఉంది. తన 13 ఏళ్ల కొడుకు జిజున్ కువాంగ్ అదే ఇంట్లో ఒంటరిగా ఉంటూ సమీపంలోని స్కూల్లో చదువుకునేవాడు. కుయాంగ్ జీ దంపతులు.. ఆ గ్రామానికి దూరంగా ఉన్న మెగాసిటీలో వలస కూలీలుగా బతికేవారు. ప్రతి శనివారం తల్లిదండ్రుల దగ్గరకు వెళ్లి.. కాసింత డబ్బు, కావాల్సిన సరుకులు తెచ్చుకోవడం జిజున్కి అలవాటే. అయితే అక్టోబర్ చివరిలో ‘ఈ వారం రావట్లేదు’అని తల్లిదండ్రులకు జిజున్ కాల్ చేసి చెప్పాడు. ఆ తర్వాత రోజుల గడుస్తున్నా జిజున్ నుంచి ఎలాంటి స్పందన లేదు. ఫోన్ కూడా కలవలేదు. దాంతో కుయాంగ్ జీ పనులన్నీ మానుకుని.. నవంబర్ 5, ఉదయం 11 అయ్యేసరికి.. పాతింటికి చేరుకున్నాడు. తలుపులు వేసి ఉండటంతో.. జిజున్ చదువుకునే స్కూల్‌కి పరుగుతీశాడు. అయితే అక్టోబర్ 25 నుంచే ఫ్లూ కారణంగా జిజున్ స్కూల్‌కి రావట్లేదని స్కూల్ వాళ్లు చెప్పారు. దాంతో కువాంగ్ జీకు గుండె ఆగినంత పనైంది. ఒకవేళ తన కొడుకు అనారోగ్యంతో ఒంటరిగా ఇంట్లోనే ఉన్నాడా? అనే అనుమానమొచ్చింది. వెంటనే పాతింటికి చేరుకున్నాడు. ముందు తలుపు, పక్క తలుపు వేసే ఉండటంతో.. ఎందుకైనా మంచిదని ఇంటి వెనక్కి వెళ్లి చూశాడు. అటు తలుపులు తీసే ఉన్నాయి. లోపల లైట్స్ వెలుగుతూనే ఉన్నాయి. తన కొడుకు జిజున్.. దూలానికి వేలాడుతూ కనిపించాడు. అయితే అది ఉరికాదు. తాడు మెడకు చుట్టుకుని లేదు.. చేతులకు బలంగా ముడి వేసి ఉంది. మెడ వెనక్కి వాలిపోయి ఉంది. చేతులకు కట్టి ఉన్న తాడే.. ఒళ్లంతా బిగుతుగా చుట్టి, అక్కడక్కడా ముడులు వేసి ఉంది. పాదల మధ్య పెద్ద బరువు వేలాడుతోంది. నిర్జీవంగా దూలానికి వేలాడుతున్న తన కొడుకుని చూడగానే.. గుండెలు బాదుకుంటూ అరవసాగాడు కుయాంగ్ జీ. అతడి అరుపులకు ఊరుఊరంతా పోగయింది. నెమ్మదిగా జిజున్ని పైనుంచి కిందకు దించారు. చనిపోయిన బాలుడు.. స్త్రీలు ధరించే స్విమ్మింగ్ సూట్లో ఉండటమే ఇక్కడ షాకింగ్ ట్విస్ట్. స్విమ్మింగ్ సూట్ ఎరుపు రంగులో ఉంది. బికినీలో రెండు (నకిలీ వక్షోజాలు)నల్లటి గుడ్డ పోగులు ఉన్నాయి. బాలుడి నుదుట మీద పిన్‌హోల్ (గుండుసూది అంత రంధ్రం) ఉంది. ఇక ఒంటి మీద తాడు ఆనవాళ్లు తప్ప మరే గాయాలు లేవు. ఊపిరి అందక.. నరాలు చిట్లి.. కాళ్లమధ్యకు చేరిన రక్తం గడ్డకట్టుకుపోయింది. ఇది కచ్చితంగా లైంగిక దాడే అని కొందరంటే.. లేదు క్షుద్ర బలి అని మరికొందరు వాదించారు. చైనీస్ క్షుద్ర పూజల్లో లోహం, కలప, నీరు, అగ్ని ఇవే ప్రాథమిక అంశాలట. కాళ్ల కింద బరువు లోహాన్ని, పైదూలం కలపని, స్మిమ్మింగ్ సూట్ నీటిని, ఎరుపు రంగు దుస్తులు అగ్నిని సూచిస్తున్నాయని.. పైగా నుదుటి మీద పిన్‌హోల్.. ఆత్మను శరీరం నుంచి బయటకు పంపించడానికే చేస్తారని నమ్మేవారి సంఖ్య పెరిగిపోయింది. బాలుడు నవంబర్ 3, అర్ధరాత్రి ఒంటిగంట సమయంలో ప్రాణాలు విడిచాడని రిపోర్టులు తేల్చాయి. ఇది హత్య కాదు, ఆత్మహత్య కాదు, ప్రమాదవశాత్తు ఏర్పడిన మరణమని నిర్ధారించారు పోలీసులు. నవంబర్ 3కి.. బాలుడికి 13 ఏళ్లు పూర్తి అయ్యి 13వ రోజు అని.. అది క్షుద్రపూజలు చేసేవారి లెక్కల్లో సరైన రోజని.. వాదించేవారంతా గొంతు పెంచారు. అయితే పోలీసుల వాదనలోనూ నిజం లేకపోలేదు. బాలుడి మరణానికి ఆర్థోస్టాటిక్ అస్పిక్సియా (శ్వాసకోస వైఫల్యం) కారణమని, బాలుడు తానే రోప్ బైండింగ్ మెథడ్ (తాడుతో బంధించే పద్ధతి)ను ప్రయోగించుకునే క్రమంలో ఊపిరాడక చనిపోయాడని చెప్పుకొచ్చారు. 1990లో 14 ఏళ్ల బాలుడు ఇలానే చనిపోయాడని.. 1994, 96లో కూడా ఇలాంటి కేసుల్లో కొందరి ప్రాణాలు పోయాయని పాత రికార్డ్స్ చూపించారు. అయితే విచారణలో ఆ స్మిమ్మింగ్ సూట్ జిజున్ బంధువుల అమ్మాయిదని తేలింది. ఇదిలా ఉండగా బాలుడు చనిపోయే రెండు రోజుల ముందు తల్లికి ఓ విచిత్రమైన కలొచ్చిందట. ఆ కలలో ఒక పొడవాటి వ్యక్తి పెద్ద టోపీ ధరించి, బ్యాగ్ తగిలించుకుని వెనక్కి తిరిగి ఉన్నాడని, వికృతంగా నవ్వాడని, అతడు.. ఎప్పుడూ తెరవని పాత ఇంటి వెనుక తలుపును తెరవడం తీవ్ర ఆందోళనకు గురి చేసిందని.. ఆ కల రావడం వల్లే.. నవంబర్ 5న తన భర్తను బలవంతంగా ఇంటికి పంపించానని బాలుడి తల్లి చెప్పుకొచ్చింది. అయితే.. టోపీ ధరించి, బ్యాగ్ తగిలించుకున్న ఓ అపరిచితుడిని.. బాలుడి మరణానికి ముందు మేము చూశామని గ్రామస్థుల్లో కొందరు చెప్పారు. మరోవైపు బాలుడి తండ్రి.. తన భార్య మాజీ భర్తే ఈ హత్య చేసి ఉంటాడని అనుమానం వ్యక్తం చేశాడు. ‘నా భార్యకు, ఆమె మాజీ భర్తకు ఓ ఆడపిల్ల ఉండేది. వాళ్ల విడాకుల తర్వాత అతడు జైలుకి వెళ్లాడు. ఆ సమయంలోనే ఆ పాప కనిపించకుండా పోయింది. అయితే ఆ పాపను మేమే దాచిపెట్టామని ఆమె మాజీ భర్త గట్టిగా నమ్మాడు. మూడేళ్ల క్రితం తన బిడ్డను అప్పగించకుంటే ప్రతీకారం తీర్చుకుంటానని హెచ్చరించాడు. నా కొడుకుని అతడే హత్య చేసి ఉంటాడు’ అని చెప్పాడు బాలుడు తండ్రి. అయితే ఈ అభియోగంపై ఎలాంటి ఆధారాలు లభించలేదు. జిజున్ ఎప్పుడూ ఒంటరిగా ఉండటానికే ఇష్టపడేవాడని.. పైగా అతడికి ఇష్టమైన పుస్తకం ‘లియావోజై’ అని బాలుడి స్నేహితులు చెప్పారు. ‘లియావోజై’ చైనాలో పాపులర్ అయిన దెయ్యం కథల పుస్తకం. దాంతో ఆ ఇంట్లో దెయ్యం ఉందనే ఊహాగానాలు పుట్టుకొచ్చాయి. కేసుని పోలీసులు తేల్చేసినా.. పుకార్లు, నమ్మకాలు తేల్చనివ్వలేదు. దాంతో ఇన్నేళ్లు గడిచినా బాలుడి మరణానికి అసలు కారణం మిస్టరీగానే మిగిలిపోయింది. -సంహిత నిమ్మన -
Sonal Phoghat: మత్తుమందిచ్చి అత్యాచారం.. ఆమెది ముమ్మాటికీ హత్యే!
ఛండీగఢ్: బీజేపీ నేత, నటి సోనాల్ ఫోగట్ హఠాన్మరణంపై అనుమానాల నేపథ్యంలో తీవ్ర ప్రకటనలు ఇస్తోంది ఆమె కుటుంబం. తాజాగా సోదరుడు రింకు ధాక, సంచలన ఆరోపణలకు దిగాడు. ఆమెపై ఏళ్ల తరబడి అత్యాచారం జరుగుతోందని, ఆస్తి కోసమే ఆమెను హత్య చేసి ఉంటారని ఆరోపిస్తున్నాడతను. సోనాల్ ఫోగట్ పీఏ సుధీర్ సంగ్వాన్, అతని స్నేహితుడు సుఖ్విందర్‌లు కలిసి ఆమెకు గత మూడేళ్లుగా మత్తు మందు కలిపిన ఆహారం ఇచ్చేవాళ్లని, ఆమెపై హిస్సార్‌లోని ఇంట్లో అఘాయిత్యానికి పాల్పడి వీడియో తీసేవాళ్లని, వాటి ఆధారంగా ఆమెను బ్లాక్ మెయిల్ చేసి లోబర్చుకున్నారని రింకు చెబుతున్నాడు. సినీ, రాజకీయ జీవితాన్ని నాశనం చేస్తానని సోనాలిని వాళ్లిద్దరూ బెదిరించేవారని, డబ్బు.. ఇతర సౌకర్యాలను అనుభవించేవాళ్లని, పరువుపోతుందనే భయంతోనే ఆమె ఇంతకాలం మౌనంగా ఉండిపోయిందని రింకు పోలీసులకు తెలిపాడు. చోరీ వంకతో.. తన భర్త చనిపోయాక.. కుటుంబం కంటే నటన, రాజకీయాల మీదే దృష్టిసారిస్తూ వచ్చింది సోనాలి ఫోగట్. 2019 ఎన్నికల సమయంలో సంగ్వాన్, సుఖ్విందర్‌లు సోనాలికి పరిచయం అయ్యారు. అప్పటి నుంచి ఆమె ప్రతీ విషయంలోనూ వీళ్లిద్దరి జోక్యం ఎక్కువైంది. ఆ సమయంలోనే ఆమెపై అత్యాచారం జరిగింది. ఇక కొంతకాలం కిందట సోనాలి ఇంట్లో చోరీ జరిగింది(ఇదీ కూడా సంగ్వాన్ ప్లాన్ అనేది రింకు ఆరోపణ). అది సాకుగా చూపి.. ఇంట్లో పని మనుషులను తొలగించారు. అప్పటి నుంచి ఆమె భోజనం బాధ్యతలన్నీ సుధీర్ చూసుకుంటున్నాడు. ఈ క్రమంలో ఆ భోజనంలో మత్తు మందు కలిపి.. నిత్యం ఆమెపై అఘాయిత్యానికి పాల్పడ్డారని రింకు ఆరోపిస్తున్నాడు. అంతేకాదు ఈ విషయాన్ని తమ దగ్గరి బంధువైన అమన్‌కు స్వయంగా సోనాలినే వెల్లడించిందని అంటున్నాడు. అంతేకాదు.. షూటింగ్ వంకతో.. గోవాలో షూటింగ్ పేరుతో సోనాలి ఫోగట్‌ను తీసుకెళ్లారని, తీరా అక్కడికెళ్లాక షూటింగ్ లేదని చెప్పారని, ఈ క్రమంలోనే భోజనం చేశాక ఏదోలా ఉందని, అక్కడేదో జరుగుతోందని సోనాలి తమ కుటుంబ సభ్యులకు ఫోన్ ద్వారా తెలియజేసిందని, ఫోన్ ట్రేస్ చేసే ఛాన్స్ ఉండడంతో వాట్సాప్ కాల్ మాట్లాడాలని ప్రయత్నించిందని రింకూ చెప్తున్నాడు. సోనాలి ఇంటి తాళాల దగ్గరి నుంచి ఫోన్, బ్యాంక్ కార్డులు, ఆర్థిక లావాదేవీలన్నీ సుధీర్ దగ్గరే ఉండేవని, సోనాలి మరణం వార్త తెలిశాక ఆమె ఫోన్లతో పాటు తన ఫోన్లను సుధీర్ స్విచ్ఛాప్ చేసుకోవడం అనుమానాలకు తావిస్తోందని రింకు పోలీసులు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నాడు. గోవా డీజీపీ పర్యవేక్షణ ఆస్తి కోసమే కాదు.. ఆమె హత్య వెనుక రాజకీయ కుట్ర కోణం కూడా దాగి ఉండొచ్చని అనుమానాలు వ్యక్తం చేస్తున్నాడు రింకు. ఈ మేరకు గోవా పోలీసులకు ఫిర్యాదు చేసిన రింకు.. సుధీర్, సుఖ్విందర్లను అరెస్ట్ చేయాలని, తన సోదరికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నాడు. ఇదిలా ఉంటే.. గుండెపోటుతో సోనాలి ఫోగట్ హఠాన్మరణం చెందిందని భావిస్తుండగా.. ఆమె మరణంపై కుటుంబ సభ్యుల అనుమానాల నేపథ్యంలో గోవా సీఎం ప్రమోద్ సావంత్ అత్యున్నత దర్యాప్తునకు ఆదేశించారు. గోవా డీజీపీ స్వయంగా ఈ కేసును పర్యవేక్షిస్తున్నారు. ఇదీ చదవండి: ‘శ్రీమతి’ మృతి.. న్యాయం కోసం పాదయాత్ర..! -
హీరోయిన్ సిమ్రాన్ చెల్లెలి సూసైడ్‌కి కారణం అతడేనా?
హీరోయిన్ సిమ్రాన్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. తెలుగుతో పాటు తమిళంలో స్టార్ హీరోయిన్గా సత్తాచాటిన సిమ్రాన్‌కు ఎంతోమంది అభిమానులున్నారు. అయితే సిమ్రాన్‌కు ఒక చెల్లెలు ఉందని, ఆమె కూడా హీరోయిన్గా నటించింది అన్న విషయం మీకు తెలుసా? ఇంద్రధనస్సు సినిమాతో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చిన సిమ్రాన్ చెల్లెలు మోనాల్ నావెల్ తెలుగులో ఇష్టం చిత్రంతో అరంగేట్రం అయ్యింది. చదవండి: Bimbisara: హీరో కల్యాణ్ రామ్ భార్య గురించి ఈ విషయాలు తెలుసా? స్టార్ హీరోయిన్ చెల్లెలిగా ఎంట్రీ ఇవ్వడంతో అతి తక్కువ సమయంలోనే క్రేజ్ అందుకుంది.పలు వాణిజ్య సంస్థల ప్రకటనల్లోనూ మెరిసింది. అయితే ఆ తర్వాత ఆశించిన స్థాయిలో రాణించలేకపోయింది. వరుస ఫ్లాపులతో అపజయాలను చవిచూసింది. హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చిన రెండేళ్లకే సిమ్రాన్ చెల్లెలు మోనాల్ సూసైడ్ చేసుకుంది. 2002, ఏప్రిల్ 14న తన ఫ్లాట్‌లోనే ఉరివేసుకుని చనిపోయింది.దీనికి కారణం ఓ డ్యాన్స్ మాస్టర్ అని అప్పట్లో ఇండస్ట్రీ అంతా కోడై కూసింది. కోలీవుడ్‌కు చెందిన సుజిత్ అనే కొరియోగ్రాఫర్‌తో పీకల్లోతు ప్రేమలో మునిగిన మోనాల్ ఆ తర్వాత అతడు మోసం చేయడంతో సూసైడ్ చేసుకుందని అప్పట్లో కథనాలు వెలువడ్డాయి. దీనిపై ఇప్పటికీ క్లారిటీ లేకపోవడంతో ఆమె ఆత్మహత్య మిస్టరీగానే మిగిలిపోయింది. -
అసలు ఆమెను చంపిందెవరు? పోస్ట్‌మార్టమ్ నివేదికలోనూ..
పదహారేళ్ల జేనెట్ బయటకు వెళ్లడానికి రెడీ అయింది. ‘మమ్మీ! ఫ్రెండ్‌ను కలవడానికి ట్రెయిన్లో వెళుతున్నా... తొందరగానే వచ్చేస్తాలే’ చెప్పింది జేనెట్. ‘సరేనమ్మా! జాగ్రత్త!’ సాగనంపింది తల్లి. ఇది జరిగి నేటికి సరిగ్గా యాభయ్యేళ్లు. అంటే, 1972 ఆగస్టు 7న తల్లితో చెప్పి ఇంటి నుంచి బయటకు వెళ్లింది జేనెట్ డి పామా. వెళ్లడమైతే వెళ్లింది గాని, ఇంటికి తిరిగి రాలేదు. ఇంటి నుంచి వెళ్లిన అమ్మాయి తిరిగి రాకపోవడంతో తల్లిదండ్రులు వెదుకులాడారు. ఆరాతీశారు. ఫ్రెండ్ దగ్గరకు కూడా చేరలేదని తెలియడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. అమెరికాలోని న్యూజెర్సీలో యూనియన్ కౌంటీ స్ప్రింగ్ఫీల్డ్ టౌన్షిప్ క్లియర్‌వ్యూ రోడ్డులో ఉంటుందా ఇల్లు. స్ప్రింగ్ఫీల్డ్ పోలీసులు ఇంటికి వచ్చి, తల్లిదండ్రుల నుంచి వివరాలు తెలుసుకున్నారు. కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు ప్రారంభించారు. స్ప్రింగ్ఫీల్డ్ పోలీసులు రోజుల తరబడి చాలాచోట్ల గాలించారు. ఫలితం కనిపించలేదు. ఆరువారాలు గడిచాక ఒకరోజు– సెప్టెంబర్ 19న ఒక కుక్క కుళ్లిపోయే దశలో ఉన్న అమ్మాయి మోచేతిని నోట కరుచుకుని వచ్చింది. దాని ఆధారంగా పోలీసులు వెదుకులాట మొదలుపెట్టారు. కుక్క వచ్చిన దారిలో వెదుకులాడుతూ స్ప్రింగ్ఫీల్డ్లోని హూడై క్వారీ కొండ శిఖరం మీదకు చేరుకున్నారు. అక్కడ కనిపించిన దృశ్యం ఒళ్లు జలదరించేలా ఉంది. అర్ధగోళాకారంలో పేర్చి ఉన్న చెట్ల కొమ్మలు, కలప దుంగల కింద అమ్మాయి మృతదేహం కుళ్లిపోయిన స్థితిలో కనిపించింది. మృతదేహం ఒక ముగ్గులాంటి ఆకారం మీద పడి ఉంది. మృతదేహం చుట్టూ జంతువులను బలిచ్చినట్లుగా జంతు కళేబరాల అవశేషాలు కనిపించాయి. పరిసరాల్లోని దృశ్యాన్ని బట్టి క్షుద్రపూజల కోసం ఎవరో తాంత్రికులు అమ్మాయిని బలి ఇచ్చి ఉండవచ్చని స్థానికులు చెవులు కొరుకున్నారు. అయితే, పోలీసులు ఆ వాదనలను కొట్టి పారేశారు. చకచకా చెట్ల కొమ్మలను, దుంగలను తొలగించి, మృతదేహాన్ని బయటకు తీశారు. మృతదేహం కనిపించకుండా పోయిన జేనెట్దేనని గుర్తించారు. నిబంధనల ప్రకారం అక్కడ జరగాల్సిన తతంగాన్ని పూర్తి చేశాక, పోస్ట్‌మార్టమ్ కోసం తరలించారు. పోస్ట్‌మార్టంలో ఆమె మరణానికి దారితీసిన కారణాలేవీ బయటపడలేదు. శరీరంపై కత్తిపోట్లు, తూటాల గాయాలు ఏవీ లేవు. అఘాయిత్యం జరిపి, హింసించి గాయపరచిన ఆధారాల్లేవు. ఎముకలు విరిగిన గుర్తుల్లేవు. కనీసం మాదక ద్రవ్యాలు లేదా విషపదార్థాల ఆనవాళ్లు కూడా శవపరీక్షలో దొరకలేదు. కచ్చితమైన ఆధారాలు దొరకకున్నా, బహుశ గొంతు నొక్కేయడం వల్ల ఆమె మరణించి ఉంటుందని పోస్టుమార్టం జరిపిన డాక్టర్లు నివేదిక ఇచ్చి, అంతటితో చేతులు దులిపేసుకున్నారు. జేనెట్ చనిపోయిన రెండువారాల నుంచి పత్రికల్లో రకరకాల కథనాలు మొదలయ్యాయి. క్షుద్ర తాంత్రికుల నరబలికి ఆమె బలైపోయి ఉంటుందనే వాదనతో ఈ పత్రికలు ప్రచురించిన కథనాలు అమెరికా అంతటా కలకలం రేపాయి. యూనియన్ కౌంటీలోని వాచుంగ్ అభయారణ్యం క్షుద్రతాంత్రికులకు అడ్డాగా పేరు మోసింది. జేనెట్ మృతదేహం వాచుంగ్ అభయారణ్యానికి చేరువలోనే ఉన్న క్వారీ కొండపై లభించడంతో జనాలు కూడా పత్రికల వాదనను నమ్మారు. అంతేకాదు, జేనెట్ మరణానికి కొద్దినెలల ముందు జాన్ లిస్ట్ అనే ఉన్మాది యూనియన్ కౌంటీలో తన భార్యను, తల్లిని, ముగ్గురు పిల్లలను చంపేసి పారిపోయాడు. దాంతో యూనియన్ కౌంటీ జనాలు సాయంత్రమైతే చాలు ఇంటి బయటకు అడుగు పెట్టాలంటేనే వణికిపోయేవాళ్లు. అయితే, జేనెట్ మరణానికి పోస్ట్‌మార్టంలో కూడా కారణాలు బయట పడకపోవడంతో కేసు మూలపడింది. దశాబ్దాలు గడిచాక ఈ కేసు మళ్లీ చర్చలోకి వచ్చింది. అదెలాగంటే, ‘వీయర్డ్ ఎన్జే మేగజైన్’ కార్యాలయానికి 1990ల చివర్లోను, 2000 ప్రారంభంలోను జేనెట్ మరణానికి సంబంధించి వరుసగా ఆకాశ రామన్న ఉత్తరాలు వచ్చాయి. ఆ పత్రిక ఎడిటర్ మార్క్ మోరాన్ ఈ కేసుపై పరిశోధన ప్రారంభించాడు. తన పరిశోధనలో కనుగొన్న అంశాలతో, పలు అనుమానాలతో వరుస కథనాలను ప్రచురించాడు. ఈ కేసు ఫైలును స్ప్రింగ్ఫీల్డ్ పోలీసులు పోగొట్టుకుని ఉంటారని లేదా నాశనమైనా చేసి ఉంటారనే అనుమానం కూడా ఆయన తన కథనాల్లో వ్యక్తం చేయడంతో దీనిపై మళ్లీ కలకలం మొదలైంది. మీడియా గట్టిగా నిలదీయడంతో 1999 నాటి ఫ్లాయిడ్ తుపానులో ఈ కేసు ఫైలు గల్లంతైందని పోలీసులు అంగీకరించారు. అయితే, దాని ప్రతి మాత్రం పదిలంగానే ఉందని చెప్పారు. దరిమిలా జేనెట్ మరణంపై ఎడిటర్ మోరాన్ తన పత్రికలోనే పనిచేసే కరస్పాండెంట్ జెస్సీ పోలాక్‌తో కలసి ‘డెత్ ఆన్ ది డెవిల్స్ టీత్’ అనే పుస్తకం రాశాడు. ఈ పుస్తకం స్థానికంగా సంచలనం కలిగించింది. జేనెట్కు న్యాయం జరిపించాలంటూ స్థానికులు ఏకంగా ‘జస్టిస్ ఫర్ జేనెట్ డి పామా’ పేరుతో ఒక సంస్థనే ప్రారంభించి, న్యాయ పోరాటానికి రంగంలోకి దిగారు. జేనెట్ దుస్తులను డీఎన్ఏ పరీక్షలకు పంపాలంటూ కోర్టుకు వెళ్లారు. అధునాతనమైన డీఎన్ఏ పరీక్షల ద్వారా ఈ సంఘటనకు గల కారణాలు బయటపడవచ్చని భావిస్తున్నామని ఈ సంస్థ ప్రతినిధులు ఆశాభావంతో ఉన్నారు. ఈ కేసులో నిజం ఎప్పటికైనా బయటపడుతుందా? జేనెట్ను చంపిందెవరో వెలుగులోకి వస్తుందా? ఈ ప్రశ్నలకు కాలమే సమాధానం చెప్పాలి. చదవండి: 1991 Austin Yogurt Shop Killings: యోగర్ట్ షాప్ హత్యలు.. ఇప్పటికీ మిస్టరీ గానే..! -
సెప్టిక్‌ట్యాంక్ శ్యామ్.. ఇప్పటికీ అంతుచిక్కని డెత్ మిస్టరీ
ముగింపునకు నిర్వచనమైన మరణం కూడా కొన్నిసార్లు సరికొత్త కథ ఆరంభానికి కారణమవుతుంది. ఎన్నో చిక్కు ప్రశ్నలతో ముందుకు సాగుతుంది. 44 ఏళ్ల క్రితం కెనడాలోని టోఫిల్డ్ నగరంలో మొదలైన సెప్టిక్‌ట్యాంక్ శ్యామ్ కథ అలాంటిదే. అది 1977.. ఏప్రిల్ నెల. చార్లీ మెక్లియోడ్ అనే వ్యక్తి.. కెనడాకు పశ్చిమంగా ఉన్న అల్బెర్టాలోని టోఫిల్డ్లో.. తన కొత్త ఇంటి నిర్మాణపనుల్లో బిజీగా ఉన్నాడు. ఆ ఇంటికి కొద్ది దూరంలోనే తన ఫామ్‌హౌస్ ఉండటంతో.. కొత్త ఇంటికి ప్రత్యేకంగా సెప్టిక్ ట్యాంక్ ఎందుకు? ఫామ్‌హౌస్‌లోని పాత సెప్టిక్ ట్యాంక్ వాడితే సరిపోతుంది కదా? అనుకున్నాడు. అనుకున్నదే తడవుగా పాత సెప్టిక్ ట్యాంక్‌ను రిపేర్ చేయించే పనిలో పడ్డాడు. ఫామ్‌హౌస్‌లోని సెప్టిక్ ట్యాంక్ ఓపెన్ చేయించి.. క్లీనింగ్ కార్యక్రమాలు మొదలుపెట్టించాడు. అయితే తవ్వకాల్లో ఒక సాక్స్, ఒక షూ బయటికి వచ్చాయి. లోపల గమనిస్తే.. పసుపు రంగు బెడ్ షీట్లో ఏదో చుట్టి, నైలాన్ తాడుతో దాన్ని కట్టి ఉన్నట్లుగా కనిపించింది. దాంతో వెంటనే చార్లీ పోలీస్ స్టేషన్‌కు పరుగుతీశాడు. ప్రెస్ వాళ్లకూ సమాచారం ఇచ్చాడు. రంగంలోకి దిగిన పోలీసులు.. 6.5 అడుగుల లోతులో ఉన్న ఆ పసుపు రంగు మూటను (1977 ఏప్రిల్ 13న) వెలికి తీయించారు. అందులో నీలిరంగు జీన్స్, నీలిరంగు వర్కర్స్ యూనిఫామ్ ధరించిన ఓ మృతదేహం ఉందని గుర్తించారు. సుమారు 50 కేజీల కాల్షియం ఆక్సైడ్ (బాడీని త్వరగా డీకంపోజ్ చేసే రసాయన మిశ్రమం) మధ్యలో ఉందా కాయం. మరునాడు ఉదయాన్నే.. ‘సెప్టిక్ ట్యాంక్‌లో గుర్తు తెలియని మృతదేహం..’ అనే హెడ్డింగ్‌తో పత్రికలు ఆ విషయాన్ని సంచలనం చేశాయి. ఆ వ్యక్తికి 23 నుంచి 32 మధ్య వయసు ఉండొచ్చని.. యూరోపియన్ సంతతికి చెందినవాడని, వలస కూలీ అయి ఉంటాడని, 5.8 అడుగుల ఎత్తు, 82 కేజీల బరువు ఉండొచ్చని అంచనాకొచ్చారు అధికారులు. పోస్ట్‌మార్టమ్ రిపోర్ట్‌లో చాలా విషయాలు బయటపడ్డాయి. అతడు చనిపోయే ముందు చిత్రహింసలకు గురయ్యాడని.. ఒంటిపై చాలా చోట్ల కాలిన గాయాలు ఉన్నాయని.. జననాంగాలు కత్తిరించి, వికృతంగా, క్రూరంగా హింసించారని.. చివరికి తుపాకీతో రెండు సార్లు కాల్చి చంపేశారని, చంపిన తర్వాతే సెప్టిక్ ట్యాంక్‌లో పడేశారని.. అందులో పడేసి అప్పటికే.. ఏడాది కావస్తుందని నిర్ధారించారు. అతడు ఎవరో తెలుసుకోవడానికి ఒకే ఒక్క ఆధారం దొరికింది. అదేంటంటే.. బాధితుడు చనిపోయే ముందు పంటికి ట్రీట్మెంట్ చేయించుకున్నాడు. దాంతో అల్బెర్టాలోని దాదాపు 800 మంది దంతవైద్యులను సంప్రదించారు పోలీసులు. ఓ వైద్యుడి దగ్గర బాధితుడితో సరిపోలిన రికార్డులున్నాయి. కానీ అక్కడ పేషెంట్ వివరాలు స్పష్టంగా లేవు. దాంతో కేసు నీరుగారింది. విచారణలో భాగంగా ఊహా చిత్రాలు వెలుగులోకి వచ్చాయి. పోలీసులు, విలేఖర్లతో పాటు ప్రజలు కూడా.. ‘అసలు ఈ అజ్ఞాత వ్యక్తి ఎవరు?’ అనే దానిపై ఆసక్తి కనబరచడం మొదలుపెట్టారు. కాలక్రమేణా ఈ కేసు కెనడాలో మోస్ట్ పాపులర్ క్రైమ్ స్టోరీలో ఒకటిగా మారిపోయింది. దాంతో పోలీసులు 1988లో చనిపోయిన వ్యక్తికి ‘సెప్టిక్ ట్యాంక్ శ్యామ్’ అని నామకరణం కూడా చేశారు. చాలా మిస్సింగ్ కేసుల్ని ఈ కేసు అంశాలతో పోల్చి.. కాదని తేల్చారు. అయినా అతడు ఎవరు? అతడ్ని చంపింది ఎవరు? ఎందుకు చంపారు? అనే ఎన్నో ప్రశ్నలకు ఒక్క ఆధారం కూడా చిక్కలేదు. అతడి వయసు, బరువులపై మాత్రం అంచనాలు మారుతూ వచ్చాయి. అధికారులు భావించినట్లు ‘సెప్టిక్‌ట్యాంక్ శ్యామ్’.. అంత బరువు ఉండడని, అంత ఎత్తు ఉండడని.. డాక్టర్ క్లైడ్ స్నో భావించాడు. ఎన్ని అంచనాలు వేసినా.. ఎన్ని ప్రయత్నాలు చేసినా అతడు ఎవరు అనేది తేలకపోవడంతో కేసు కోల్డ్ కేసుల సరసన చేరిపోయింది. దాంతో ఊహాగానాలు ఊపందుకున్నాయి. ‘సెప్టిక్‌ట్యాంక్ శ్యామ్’.. ఎవరో అమ్మాయిని మోసం చేసి ఉంటాడని.. అందుకే అతడి జననాంగాలు కత్తించి, లైగికంగా హింసించి చంపేశారని, చేసిన తప్పుకి శిక్ష అనుభవించాడని.. నమ్మడం మొదలుపెట్టారు చాలామంది. 2017లో కెనడియన్ పోలీసులు.. మిస్ అయిన వారి కోసం జాతీయస్థాయిలో డీఎన్ఏ సేకరణ కార్యక్రమం ప్రారంభించాలని నిర్ణయించుకున్నారు. 2019 నాటికి ఆ ప్రయోగం చాలా విజయవంతం అయ్యింది. 2012తో పోల్చుకుంటే.. ఎన్నో మిస్సింగ్ కేసులను పరిష్కరించగలిగారు. కానీ సెప్టిక్‌ట్యాంక్ శ్యామ్ కేసులో ఏ కదలికా రాలేదు. చివరికి 2021, జూన్ 30న సెప్టిక్‌ట్యాంక్ శ్యామ్ కెనడా దేశస్థుడేనని, అసలు పేరు గోర్డాన్ ఎడ్విన్ శాండర్సన్ అని, 1950 అక్టోబర్ 22న మానిటోబాలో జన్మించాడని, అతడు చనిపోయేనాటికి 26 ఏళ్ల వివాహితుడని.. అతడికి ఒక కూతురు కూడా ఉందని తేలింది. అతడ్ని గుర్తించడానికి అతడి సోదరి డీఎన్ఏ ఉపయోగపడింది. అతడు చివరిసారిగా.. కాల్గరీలో నివాసముంటున్న సోదరుడి దగ్గరకు వెళ్తున్నట్లు ఇంట్లో చెప్పి వెళ్లాడు. ఆ తర్వాత కనిపించకుండా పోయాడు. ఇప్పటికే శాండర్సన్ కేసు నిమిత్తం పది లక్షల డాలర్లకు పైగా ఖర్చు అయ్యిందని అధికారులు లెక్కలేశారు. అయితే ఇంకా ఈ కేసు తేలలేదు. శాండర్సన్ను ఎవరు చంపారు? ఎందుకు చంపారు? అంత క్రూరంగా హింసించి చంపడానికి గల కారణం ఏంటీ? ఇలా ఎన్నో ప్రశ్నలకు సమాధానం దొరకలేదు. -సంహిత నిమ్మన -
మిస్టరీ.. ఎలిసా లామ్ డెత్ స్టోరీ
సరైన సాక్ష్యాధారాలు లేని నేరాలన్నీ మిస్టరీలుగానే మిగిలిపోతాయి. ఆత్మలు, దెయ్యాలు అంటూ హారర్ కోణాన్ని తలపిస్తాయి. ఎలిసా లామ్ అనే 21 ఏళ్ల అమ్మాయి మరణోదంతం కూడా అలాంటిదే. అది 2013, ఫిబ్రవరి 19.. లాస్ఏంజెలెస్ (అమెరికా)లోని సెసిల్ అనే హోటల్ రిసెప్షన్‌కి.. వరుసగా ఫోన్ కాల్స్ వస్తున్నాయి. చేస్తోంది ఎవరో కాదు.. ఆ హోటల్లో దిగిన గెస్టులే. ‘హోటల్ సర్వీస్ అంతా బాగానే ఉంది కానీ.. ట్యాప్ వాటర్ మురికిగా, కాస్త కుళ్లిన వాసనతో వస్తున్నాయి’ ఇదే వారందరి కంప్లైంట్. దాంతో హోటల్ సిబ్బంది రంగంలోకి దిగింది. 14 ఫ్లోర్లు, 700 గెస్ట్ రూములతో ఉన్న తొంభై ఏళ్లనాటి సెసిల్ హోటల్‌కి దేశవిదేశాల టూరిస్టులు, పెద్దపెద్ద బిజినెస్ మేగ్నెట్స్ చాలా మంది వస్తూపోతూ ఉంటారు. ఉన్న నాలుగు ట్యాంకుల్నీ ఒక్కోటిగా చెక్ చేస్తూ వస్తున్నారు సిబ్బంది. వాటిలో ఒక ట్యాంక్ మూత తీయగానే గుప్పుమంది దుర్గంధం. తొంగి చూస్తే.. అందులో బాగా కుళ్లిన యువతి శవం తేలియాడుతోంది. ఆ దుర్వార్త మీడియాను చేరింది. అప్పటికే ఆ హోటల్ మీద యువతి మిస్సింగ్ కేసు నమోదు కావడంతో అక్కడికి చేరుకోవడానికి.. పోలీసులకు, మీడియాకి ఎంతో సమయం పట్టలేదు. ట్యాంక్‌లో దొరికన శవం చైనా సంతతికి చెందిన కెనడా దేశస్తురాలిదని గుర్తించడానికి పెద్దగా సమయం పట్టలేదు. ఆ అమ్మాయి పేరు ఎలీసా లామ్. ఎవరీ ఎలిసా? ఎలిసా లామ్.. 1991, ఏప్రిల్ 30న కెనడా, బ్రిటిష్ కొలంబియాలోని వాంకోవర్‌లో.. డేవిడ్, యెన్నా లామ్ దంపతులకు జన్మించింది. ఆమెకు సారా అనే ఒక సోదరి కూడా ఉంది. ఉద్యోగానికి ముందే ప్రపంచాన్ని చుట్టిరావాలనేది ఎలిసా కల. అదే విషయాన్ని తన గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక ఇంట్లో చెప్పింది. మొదట వాళ్లు ససేమిరా అన్నారు. ‘ప్రతి రోజు కాల్ చేస్తుంటాను’ అనే ఒప్పందం మీద ఎలిసా ఒంటరిగానే లాస్ ఏంజెలెస్ బయలుదేరింది. 2013 జనవరి 26న లాస్ఏంజెలెస్లోని సెసిల్ హోటల్లో దిగింది. నాలుగు రోజుల పాటు ప్రతి చిన్న విషయాన్ని ఫోన్లో తల్లిదండ్రులతో పంచుకునేది. అలా జనవరి 31 ఉదయం పూటా చాలాసేపు మాట్లాడింది. ఆ తర్వాతే ఆమె నుంచి ఫోన్‌కాల్స్ లేవు. తల్లిదండ్రులు ప్రయత్నించినా ఫోన్ స్విచ్ ఆఫ్ అని వచ్చేది. రోజులు గడుస్తున్నా ఎలిసా నుంచి ఎలాంటి సమాచారం లేదు. దాంతో ఆమె తల్లిదండ్రులు పోలీసుల్ని ఆశ్రయించారు. ఎలిసా అదృశ్యం కేసు నమోదైంది. వెంటనే సెసిల్ హోటల్ వైపు తిరిగాయి పోలీస్ జీప్‌లు, మీడియా ఓబీ వ్యాన్లు. విదేశీ యువతి ఎలిసా మాయం అంటూ వార్తా కథనాలు, గోడలపై పోస్టర్లు వెలిశాయి. సోషల్ మీడియాలోనూ ప్రచారం విస్తృతమైంది. అప్పుడే ఓ వీడియో ప్రపంచాన్ని వణికించింది. అది సెసిల్ హోటల్ లిఫ్ట్‌లోని సీసీ ఫుటేజ్. పోలీసుల దర్యాప్తులో ఫిబ్రవరి 13న బయటపడిన ఆ వీడియో ఎలిసా చివరి క్షణాలను కళ్లకు కట్టింది. ఆ వీడియోలో.. ఎలిసా పరుగున ఎవరో తరుముతున్నట్లు లిఫ్ట్‌లోకి వచ్చింది. బయటికి తొంగి తొంగి చూస్తూ.. మళ్లీ లిఫ్ట్ లోపలకు వచ్చేస్తూ.. అక్కడ నుంచి తప్పించుకోవాలనే తాపత్రయంతో లిఫ్ట్‌లోని అన్ని అంతస్తుల బటన్లు నొక్కేసింది. ఎంతసేపటికీ లిఫ్ట్ కదలకపోయేసరికి.. చాలా సేపు లిఫ్ట్ గోడలకు ఆనుకుని, దాక్కుంది. అదేమిటో చిత్రం.. లిఫ్ట్ తలుపుల్ని ఏదో అతీంద్రియ శక్తి ఆపుతున్నట్లుగా వెంటనే మూతపడలేదు. దాంతో ఎలిసా లిఫ్ట్ బయటికి వెళ్లి.. ఎదురుగా ఎవరూ లేకపోయినా ఎవరో ఉన్నట్లుగా స్పందించింది. చేతులు తిప్పుతూ, కంగారుపడుతూ.. ఏదో మాట్లాడుతూ.. కనిపించింది. ఎలిసా లిఫ్ట్ నుంచి బయటకి వెళ్లిపోవడంతో కొన్ని క్షణాల్లోనే లిఫ్ట్ తలుపులు మూసుకున్నాయి. ఆ తర్వాత ఎలిసాకు ఏమైందో ఎవరికీ తెలియదు. ఆ వీడియో చూసిన చాలా మంది ఆమెను దెయ్యం వెంబడించిందని నమ్మారు. అయితే కొందరు మాత్రం ఆమె మానసిక స్థితి సరిగా లేదని వాదించారు. సరిగ్గా 6 రోజులకు వాటర్ ట్యాంక్‌లో ఎలిసా శవమై తేలడంతో.. బాడీ పోస్ట్‌మార్టమ్‌కు వెళ్లింది. ఎలిసా బైపోలార్ డిజార్డర్‌తో బాధపడుతోందని, దాని నుంచి బయటపడేందుకు కొన్ని మందులు వాడుతోందని తేల్చాయి రిపోర్టులు. అయితే చనిపోయిన రోజు ఆమె ఆ మందులను తీసుకోకపోవడం వల్ల, ఆ సమస్య ఎక్కువై, ఎవరో తనని వెంటాడుతున్నట్లు భావించి లిఫ్ట్‌లో దాక్కోడానికి (సీసీ ఫుటేజ్‌లో చూసినట్లు) ప్రయత్నించి ఉంటుందని, ఆ భయంతోనే వాటర్ ట్యాంక్‌లో దూకి ఉండొచ్చని, ఈత తెలియక పైకి రాలేక అందులోనే మునిగి చనిపోయి ఉండవచ్చని అంచనా వేశారు నిపుణులు. అయితే ఇక్కడే మరో ట్విస్ట్ ఉంది. హోటల్ వాటర్ ట్యాంక్‌ని ఎవరు తెరిచినా రిసెప్ష¯Œ లో అలారం మోగుతుంది. మరి ఎలిసా ట్యాంక్‌లో పడినప్పుడు అలా ఎందుకు జరగలేదనే ప్రశ్న తలెత్తింది. ఇదే ప్రశ్న హోటల్ చీఫ్ ఇంజినీర్ పెడ్రో తోవర్ను వేసినప్పుడు .. ‘అలారం మోగకుండా డియాక్టివేట్ చేసి.. వాటర్ ట్యాంక్ మూతను తెరవడం మా సిబ్బందికి మాత్రమే సాధ్యం. మూత తెరవగానే రిసెప్ష¯Œ తో పాటు పైరెండు ఫ్లోర్లలో కూడా అలారం మోగి.. అక్కడి సిబ్బందిని అప్రమత్తం చేస్తుంది. ప్రతిసారి మూత తెరిచే సిబ్బంది వివరాలు కచ్చితంగా రికార్డ్ అవుతాయి’ అని చెప్పాడు. దాంతో రికార్డులు పరిశీలించారు పోలీసులు. ఏ ఆధారం దొరకలేదు. పైగా అంత ఎల్తైన ట్యాంక్ ఎక్కాలంటే ఇంకొకరి సాయం లేనిదే సాధ్యం కాదని అక్కడి సిబ్బంది మాట. హోటల్ పక్కనే ఉన్న బుక్ స్టోర్ యజమాని కాటీ ఆర్పాన్.. ‘ఎలిసాని నేను చూశాను. వాళ్లింట్లో వారి కోసం కొన్ని పుస్తకాలు, మ్యూజిక్ సీడీలు మా షాప్‌లోనే కొన్నది’ అని తెలిపాడు. కాటీ మాటల ప్రకారం ఆమె ఆత్మహత్య చేసుకోవాలనే ఆలోచనలో లేదని స్పష్టమైంది. ఎలిసా గురించి తెలుసుకున్న ప్రతి ఒక్కరూ హోటల్ సెసిల్ చరిత్రను తవ్వారు. అప్పుడే తెలిసింది.. ఆ హోటల్‌కు ‘అమెరికన్స్ హోటల్ డెత్’ అనే మరో పేరుందని. 1920లో స్థాపించిన ఈ హోటల్ చరిత్రలో హత్యలు, ఆత్మహత్యలు కలుపుకుని మరణాల సంఖ్య పదహారుకు పైమాటేనట. 1927లో పెర్సీ ఆర్మాండ్ అనే వ్యక్తి తనని తాను తుపాకీతో కాల్చుకుని చనిపోయాడు. అప్పటి నుంచి ఆ హోటల్లో ఏదొక ప్రమాదం జరుగుతూనే ఉందట. 1944లో 19 ఏళ్ల బాలింత అప్పుడే పుట్టిన తన బిడ్డను ఈ హోటల్ కిటికీలోంచి విíసిరేసిందని అప్పట్లో ప్రతికలు రాశాయి. బ్లాక్ డాలియా అనే నటి ఈ హోటల్‌కు వెళ్లి రాగానే హత్యకు గురైంది. ఆ కేసు ఇప్పటికీ అపరిష్కృతంగానే ఉంది. రిచర్డ్ రామిరేజ్ అనే సీరియల్ రేపిస్ట్ 1980లో చాలాకాలం ఈ హోటల్లోనే తలదాచుకున్నాడట. అనంతరం పోలీసులకు భయపడి మారిన్ హెల్త్ మెడికల్ సెంటర్ దగ్గర ఆత్మహత్య చేసుకున్నాడు. అతడి ఆత్మ ఈ హోటల్లోనే తిరుగుతుందని చాలామంది నమ్ముతారు. ఆ ఆత్మే ఎలిసాని చంపేసిందనీ అంటారు. ఏదిఏమైనా ఎలిసా ఎలా చనిపోయింది? ఎందుకు చనిపోయింది? హత్యా? ఆత్మహత్యా? అనే ప్రశ్నలు నేటికీ తేలలేదు. -సంహిత నిమ్మన -
సంచలనం రేపిన ఎస్సై గోపాలకృష్ణ ఆత్మహత్య.. అదే కారణమా..?
కాకినాడ సిటీ/నవాబుపేట (పెనుగంచిప్రోలు): సర్పవరం ఎస్సై ముత్తవరపు గోపాలకృష్ణ ఆత్మహత్య సంఘటన జిల్లాలో శుక్రవారం తీవ్ర సంచలనం కలిగించింది. మృదుస్వభావిగా పోలీసు శాఖలో ముద్ర వేసుకున్న ఆయన తన సర్వీసు పిస్టల్‌తో కాల్చుకుని విషాదకర రీతిలో జీవితానికి ముగింపు పలకడం దారుణమని సహచర ఉద్యోగులు దిగ్భ్రమ చెందారు. గోపాలకృష్ణ మరణ వార్త తెలియగానే కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరయ్యారు. ఈ సంఘటనపై వివిధ కోణాల్లో దర్యాప్తు ప్రారంభించామని, ప్రత్యేకంగా స్పెషల్ బ్రాంచి డీఎస్పీ వెంకటేశ్వరరావును విచారణాధికారిగా నియమించామని జిల్లా ఎస్పీ ఎం.రవీంద్రనాథ్‌బాబు వెల్లడించారు. కాకినాడ జీజీహెచ్ మార్చురీ వద్ద ఆయన విలేకర్లతో మాట్లాడారు. ఎస్సై గోపాలకృష్ణ ఆత్మహత్య చాలా బాధాకరమన్నారు. ఎంసీఏ చదివి, కొన్నాళ్లు వీఆర్వోగా పని చేసి, తరువాత ఎస్సైగా ఎంపికైన ఈయన సున్నిత మనస్కుడని అన్నారు. తన స్వభావానికి పోలీస్ ఉద్యోగం సరికాదని, ఇది మానేసి వ్యాపారం చేసుకుంటే బాగుంటుందనే ఆలోచనలో ఉండేవారని తెలిపారు. ఆ డిప్రెషన్లోనే ఉన్న ఎస్సైకి కొందరు అధికారులు కౌన్సెలింగ్ కూడా ఇచ్చారన్నారు. పోలీసు ఉద్యోగం ఇష్టం లేదంటూ ముభావంగానే ఉండేవారని భార్య కూడా చెప్పారని ఎస్పీ వివరించారు. విలేకర్లతో మాట్లాడుతున్న ఎస్పీ రవీంద్రనాథ్‌బాబు విలపించిన బంధువులు ఎస్సై గోపాలకృష్ణ భార్య పావని, తల్లిదండ్రులు శ్రీనివాసరావు, భారతమ్మతో పాటు బంధువులు కాకినాడ జీజీహెచ్‌కు తరలివచ్చారు. మార్చురీ వద్ద కన్నీరుమున్నీరుగా విలపించారు. గోపాలకృష్ణ 36 ఏళ్లకే తనువు చాలించడం దారుణమంటూ రోదించారు. ఆసుపత్రి వద్ద గోపాలకృష్ణ మృతదేహాన్ని ఏలూరు రేంజి డీఐజీ పాలరాజు, ఎస్పీ రవీంద్రనాథ్‌బాబు, డీఎస్పీ వి.భీమారావు తదితరులు పరిశీలించి, దగ్గరుండి పోస్టుమార్టం నిర్వహించి, బంధువులకు అప్పగించారు. చదవండి: పామును రక్షించబోయి ఎమ్మెల్యే కారుకు ప్రమాదం కుమారుడి మృతితో రోదిస్తున్న తండ్రి శ్రీనివాసరావు నవాబుపేటలో విషాదం గోపాలకృష్ణ స్వస్థలమైన ఎన్టీఆర్ జిల్లా పెనుగంచిప్రోలు మండలం నవాబుపేటలో విషాదఛాయలు అలముకున్నాయి. శ్రీనివాసరావు, సరోజని దంపతుల రెండో కుమారుడు గోపాలకృష్ణ, మొదటి కుమారుడు వెంకటేశ్వరరావు. వెంకటేశ్వరరావు బెంగళూరులోని ఒక ప్రైవేటు కంపెనీలో పనిచేస్తున్నాడు. గోపాలకృష్ణకు భార్య పావని, నాలుగేళ్ల కుమార్తె భవిష్య, రెండేళ్ల కుమారుడు శర్వాన్ ఉన్నారు. ఈయన 2014 బ్యాచ్‌కు చెందిన ఎస్సై. వ్యవసాయ కుటుంబానికి చెందిన గోపాలకృష్ణ మొదటి నుంచీ చదువులో ముందుండేవారు. అందరితో ఎంతో సౌమ్యంగా ఉండేవారని గ్రామస్తులు చెప్పారు. ఎస్సైగా ఉంటూనే ఉన్నత పరీక్షలకు కూడా సిద్ధమవుతున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. గోపాలకృష్ణ అంత్యక్రియలు శనివారం చేయనున్నామని కుటుంబ సభ్యులు తెలిపారు. -
జయలలిత మరణం మిస్టరీ: పన్నీరుకు సమన్లు..
సాక్షి, చెన్నై: అన్నాడీఎంకే సమన్వయ కమిటీ కన్వీనర్ పన్నీరు సెల్వంకు ఆర్ముగ స్వామి కమిషన్ సమన్లు జారీ చేసింది. అలాగే, జయలలిత నివాసంలో సుదీర్ఘ కాలం ఉన్న చిన్నమ్మ శశికళ వదిన ఇలవరసికి కూడా సమన్లు జారీ అయ్యాయి. దివంగత సీఎం జే జయలలిత మరణం మిస్టరీ నిగ్గు తేల్చేందుకు ఆర్ముగ స్వామి కమిషన్ మళ్లీ విచారణకు శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. రెండో రోజుగా అపోలో వైద్యులు పలువురు విచారణకు హాజరయ్యారు. జయలలిత గుండెపోటు రావడంతోనే మరణించారని వైద్యులు స్పష్టం చేశారు. అయితే, ఆమెకు రక్తనాళాల మార్పిడి శస్త్ర చికిత్స విషయంగా జయలలిత నెచ్చెలి శశికళ తరపు న్యాయవాది రాజ చెందూర్ పాండియన్‌క్రాస్ ఎగ్జామిన్‌లో ప్రశ్నలు సంధించారు. ఇక, ఈ కేసులో ఇప్పటికే విచారణకు హాజరు కావాలని పన్నీరుసెల్వంకు ఆ కమిషన్ సమ న్లు జారీ చేసింది. అయితే, ఆ సమయంలో ఆయన డిప్యూటీ సీఎంగా ఉండటంతో విచారణకు డుమ్మా కొడుతూ వచ్చారు. తాజాగా ఆయన్ని ఈనెల 21వ తేది విచారణకు హాజరు కావాలని ఆదేశిస్తూ కమిషన్ నోటీసులు జారీ చేసింది. అలాగే, కేసు విచారణ సమయంలో శశికళ వదిన ఇలవరసి అక్రమాస్తుల కేసులో జైల్లో ఉన్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆమెను కూడా విచారించేందుకు కమిషన్ నిర్ణయించింది. శశికళతో పాటుగా జయలలిత నివాసం పోయేస్ గార్డెన్లో సుదీర్ఘ కాలం ఇలవరసి కూడా ఉన్న విషయం అందరికీ తెలిసిందే. -
జయలలిత మృతిపై వెలుగులోకి కొత్త అంశం
సాక్షి, చెన్నై : అసెంబ్లీ ఎన్నికల్లో (2016) విజయానందం దివంగత సీఎం జయలలితకు ఎంతో సేపు మిగల్చలేదనే విషయం తాజాగా వెలుగు చూసింది. ఆరోగ్యం బాగో లేకున్నా.. తాత్కాలిక ఉపశమనం పొందే మందులను తీసుకుని ఆమె ప్రమాణ స్వీకారానికి హాజరైనట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని ఆర్ముగస్వామి కమిషన్ ముందు నలుగురు వైద్యులు వెల్లడించినట్లు సమాచారం. దివంగత సీఎం జయలలిత మరణం మిస్టరీ నిగ్గుతేల్చేందుకు రిటైర్డ్ న్యాయమూర్తి ఆర్ముగ స్వామి కమిషన్ రంగంలోకి దిగిన విషయం తెలిసిందే. ఆదిలో శరవేగంగా విచారణ సాగినా, అపోలో యాజమాన్యం సుప్రీంకోర్టును ఆశ్రయించడంతో మూడేళ్లు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లు విచారణ ఆగింది. ఎట్టకేలకు సుప్రీం ఆదేశాలతో సోమవారం విచారణ ముమ్మరం చేసింది. ఢిల్లీ నుంచి ఎయిమ్స్ వైద్య బృందం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సహకారం అందించారు. విశ్రాంతి తీసుకోవాలన్నా.. తొలిరోజు విచారణకు అపోలో నుంచి నలుగురు వైద్యులు విచారణకు వచ్చారు. జయలలిత ఆస్పత్రికి వచ్చిన సమయంలో స్పృహలో లేరని పేర్కొంటూ, ఆమెకు అందించిన చికిత్స వివరాలను వెల్లడించారు. ఈ సందర్భంగా జయలలిత నెచ్చెలి, చిన్నమ్మశశికళ తరపు న్యాయవాది రాజా చెందూర్‌పాండియన్ ఈ వైద్యుల వద్ద క్రాస్ ఎగ్జామిన్ చేశారు. ఈ సందర్భంగా డాక్టర్ బాబు మనోహర్ కొత్త విషయాన్ని కమిషన్ ముందు ఉంచినట్టు వెలుగు చూసింది. ఈ మేరకు అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన తరువాత జయలలిత వ్యక్తిగత వైద్యుడు శివకుమార్ తనను సంప్రదించినట్లు బాబు మనోహర్ పేర్కొన్నారు. ప్రమాణ స్వీకారానికి ముందు రోజు కూడా కళ్లు తిరగడం, నీరసంగా ఉండటం, ఎవరో ఒకరి సాయం లేకుండా నడవ లేకపోవడం వంటి సమస్యలు జయలలిలలో గుర్తించినట్లు తెలిపారు. తాత్కాలిక చికిత్సతో ఎక్కువ సమయం విశ్రాంతి అవసరం అని జయలలితకు సూచించగా.. రోజుకు 16 గంటలు తాను ప్రజల కోసం శ్రమించాల్సిన అవసరం ఉందని ఆమె పేర్కొన్నట్టుగా తెలిసింది. ఇక, మరో ఏడుగురు వైద్యులు మంగళవారం విచారణకు రానున్నారు. వీరందర్నీ రాజా చెందూర్ పాండియన్ క్రాస్ ఎగ్జామిన్ చేసే అవకాశం ఉంది. అనారోగ్యంతోనే ‘అమ్మ’ మరణం: దినకరన్ అమ్మ జయలలిత అనారోగ్యంతోనే మరణించారని, అయితే, దీనిని రాజకీయం చేశారని అమ్మ మక్కల్ మున్నేట్ర కళగం నేత దినకరన్ అన్నారు. సోమవారం చెన్నైలో మీడియాతో ఆయన మాట్లాడుతూ, ఆరోగ్య కార్యదర్శిగా ఉన్న రాధాకృష్ణన్ గతంలోనే అమ్మ మరణం గురించి స్పష్టమైన వివరాలు ఇచ్చారని, అపోలో వైద్యులు సైతం ఇదే విషయాన్ని స్పష్టం చేసినట్టు తెలిపారు. రాధాకృష్ణన్ నిజాయితీ గల అధికారి అని, అందుకే ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా, ఆయనకు ఆరోగ్య శాఖ కార్యదర్శి పదవిని అప్పగిస్తున్నారనే విషయాన్ని గుర్తుంచుకోవాలని సూచించారు. అనారోగ్యంతోనే అమ్మ మరణించారని, అయితే, దీనిని రాజకీయం చేసి, విచారణ కమిషన్ పేరిట ప్రజాధనాన్ని దుర్విని యోగం చేస్తున్నారని ఆరోపించారు. -
జయలలిత మరణం మిస్టరి.. అపోలో వైద్యులకు సమన్లు
సాక్షి, చెన్నై: ఆర్ముగస్వామి కమిషన్ ఎయిమ్స్ వైద్యుల సహకారంతో ఈనెల 7వ తేదీ నుంచి దర్యాప్తును వేగవంతం చేయనుంది. ఇందులో భాగంగా బుధవారం అపోలో వైద్యులకు సమన్లు జారీ అయ్యాయి. జయలలిత మరణం మిస్టరి నిగ్గుతేల్చేందుకు రిటైర్డ్ న్యాయమూర్తి ఆర్ముగ స్వామి నేతృత్వంలో ఏక సభ్య కమిషన్‌ను గత అన్నాడీఎంకే ప్రభుత్వం నియమించిన విషయం తెలిసిందే. వాయిదాల పర్వంతో ఏళ్ల తరబడి ఈ విచారణ కొనసాగుతోంది. అదే సమయంలో తమను విచారణ పరిధిలోకి ఈ కమిషన్ తీసుకురావడాన్ని వ్యతిరేకిస్తూ అపోలో యాజమాన్యం సుప్రీంకోర్టును ఆశ్రయించడంతో రెండేళ్ల కాలం వృథా అయ్యింది. గత ఏడాది పగ్గాలు చేపట్టిన డీఎంకే సర్కారు సైతం ఈ కమిషన్ పదవీ కాలాన్ని పొడిగించి విచారణను త్వరితగతిన ముగించాలని ఆదేశించింది. అదే సమయంలో సుప్రీంకోర్టులో విచారణ ముగిసింది. ఆర్ముగ స్వామికి సహకారంగా ఎయిమ్స్ వైద్యులను సుప్రీంకోర్టు రంగంలోకి దించింది. గత నెల ఈ వైద్య బృందంతో కమిషన్ వర్గాలు సమావేశమయ్యాయి. వైద్యపరంగా తమకు ఉన్న అనుమానాల్ని నివృతి చేసుకున్నారు. ఇక, వీరి సహకారంతో విచారణను వేగవంతం చేసి ప్రభుత్వానికి మరికొన్ని నెలల్లో నివేదిక సమర్పించేందుకు కార్యచరణ సిద్ధం చేసింది. ఇందులో భాగంగా అప్పట్లో జయలలితకు చికిత్స అందించిన అపోలో వైద్యులను ఈ కమిషన్ క్రాస్ ఎగ్జామిన్ చేయనుంది. -
ఇంకా వీడని జీడిమెట్ల బాలిక డెత్ మిస్టరీ
-
హైదరాబాద్: రాజేంద్రనగర్‌లో యువతి మృతదేహం కలకలం
సాక్షి, హైదరాబాద్: రాజేంద్రనగర్ పోలీసు స్టేషన్ పరిధిలో ఓ యువతి మరణం కలకలం రేపుతోంది. చింతల్మెట్లోని ఓ అపార్టుమెంట్ రూమ్ నంబర్ 201లో ఓ యువతి మృతదేహం వెలుగు చూసింది. స్థానికులు ద్వారా సమాచారం అందుకున్న పోలీసుల ఘటన స్థలానికి చేరుకొని పరిశీలించారు. యువతి మృతిపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. డాగ్ స్క్వాడ్, క్లూస్ టీమ్ బృందాలు రంగంలోకి దిగాయి. అయితే వారం క్రితం ఈ ఘటన జరిగినట్లు పోలీసులు అనుమానం వ్యక్తంచేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు వేగవంతం చేస్తున్నారని తెలిపారు. మృతురాలు సుమేర బేగంగా పోలీసులు గుర్తించారు. ఆమె బ్యూటీషియన్‌గా పనిచేస్తున్నట్లు తెలుస్తోంది. ఆమెది హత్య? ఆత్మహత్య? అన్న విషయం తెలియాల్సి ఉంది. చదవండి: ఒకే స్పాట్లో మూడు ప్రమాదాలు.. ఐదుగురు మృతి -
Silk Smitha: సిల్క్ స్మిత గురించి ఈ విషయాలు తెలుసా?
Silk Smitha Birth Anniversary Special Story: సిల్క్ స్మిత అసలుపేరు విజయలక్ష్మీ. 1960 డిసెంబర్2న ఏలూరులో జన్మించిన ఆమె నాల్గవ తరగతి వరకు చదువుకుంది. ఆర్థిక ఇబ్బందుల వల్ల చదువు మానేసింది. పదిహేనేళ్లకే పెళ్లి చేసేశారు. అయితే భర్త, అత్తమామలు వేధింపులతో ఇల్లు వదిలి పారిపోయింది. నటనపై ఉన్న ఇష్టంతో మద్రాసుకి వెళ్లి తొలుత టచప్ ఆర్టిస్ట్‌గా పనిచేసింది. ఆ సమయంలోనే సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు చేసింది. ‘ఘరానా గంగులు’సినిమాతో టాలీవుడ్‌కు ఎంట్రీ ఇచ్చింది. చదవండి: Silk Smitha: సిల్క్‌స్మిత మరణం.. ఇప్పటికీ ఓ మిస్టరీనే! ఎన్టీఆర్ ‘నా దేశం’ చిత్రంలో “నేనొక నెత్తురు దీపం…”సాంగ్‌లో నర్తించిన సిల్క్..ఆ తర్వాత ఐటెం గర్ల్‌గా గుర్తింపు పొందింది. అప్పటి నుంచి దాదాపు టాప్ హీరోలందరి సినిమాల్లో సిల్క్ స్మిత డ్యాన్స్ స్టెప్పులు ఉండాల్సిందే అనేంతలా క్రేజ్ దక్కించుకుంది. అప్పటికే జ్యోతిలక్ష్మీ, జయమాలిని ఐటెమ్ సాంగ్స్‌తో చెలరేగిపోతున్నా సిల్క్ స్మిత తనకంటూ ప్రత్యేక బ్రాండ్ ఇమేజ్ను సొంతం చేసుకుంది. మత్తు కళ్లతో సిల్వర్ స్క్రీన్‌కి హాట్ ఇమేజ్ తీసుకువచ్చింది. ఆ సమయంలోనే ‘గూండా, ఛాలెంజ్’, బాలకృష్ణ ‘ఆదిత్య 369’వంటి చిత్రాలలోనూ కీలక పాత్రల్లోనూ నటించి సత్తా చాటింది. కానీ అర్థాంతరంగా 1996 సెప్టెంబరు 23న ఆత్మహత్య చేసుకొని చనిపోయింది. సిల్క్ జీవితం ఆధారంగానే ఏక్తాకపూర్ ‘ద డర్టీ పిక్చర్’అనే సినిమా సైతం తెరకెక్కించిన సంగతి తెలిసిందే. సిల్క్‌స్మిత చనిపోయి నేటికి 25ఏళ్లు పూర్తైనా ఇప్పటికీ అభిమానులు ఆమెను గుర్తుచేసుకుంటున్నారు. (మరిన్ని ఫొటోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి) చదవండి: Akhanda Movie: జై బాలయ్య నినాదాలతో ఫ్యాన్స్ రచ్చ రచ్చ.. -
Silk Smitha: సిల్క్‌స్మిత మరణం.. ఇప్పటికీ ఓ మిస్టరీనే!
Silk Smitha Death Mystery In Telugu: Still Continues After 25 Years: సిల్క్ స్మిత..గ్లామర్ ప్రపంచంలో ఈ పేరు ఓ సెన్సేషన్. మత్తు కళ్లతో సిల్వర్ స్క్రీన్‌కి హాట్ ఇమేజ్ అద్దిన అందమైన స్వప్నం సిల్క్ స్మిత. అప్పటివరకు ఉన్న కమర్షియల్ హంగులను మార్చేసి తన పేరుకే సరికొత్త బ్రాండ్ ఇమేజ్ను క్రియేట్ చేసుకున్నారామే. వ్యాంప్ పాత్రలతో తనకంటూ ప్రత్యేక స్టార్డంను సొంతం చేసుకుంది. తన అందచందాలతో మత్తెక్కించిన సిల్క్..నిజజీవితం మాత్రం అంతుచిక్కని కథలానే మిగిలిపోయింది. రంగుల ప్రపంచంలో అమాయకపు చిరునవ్వుల్ని మిగిల్చి తనను తాను అంతం చేసుకుంది. ఇప్పటికీ సిల్క్ స్మిత మరణం ఒక మిస్టరీగానే మిగిలిపోయింది. సిల్క్ స్మిత అసలు పేరు విజయలక్ష్మీ. తొలి సినిమా బండి చక్రంలో తాను పోషించిన సిల్క్ పాత్రనే తన ఇంటి పేరుగా మార్చుకుంది. క్యారెక్టర్ ఆర్టిస్ట్ నుంచి సీతాకోక చిలుక, వసంత కోకిల వంటి సినిమాల్లో నటించి విమర్శకుల ప్రశంసలు అందుకుంది. అప్పట్లో సిల్క్ డ్యాన్స్ బీట్ లేనిదే స్టార్ హీరోల సినిమాలు లేవంటే అతిశయోక్తి కాదేమో. అంతలా క్రేజ్ సంపాదిచుకున్న ఆమె స్టార్ హీరోలకు సరిసమానంగా పారితోషికం తీసుకునేది. కెరీర్ పీక్ టైంలో ఉండగానే ఓ హీరోతో ప్రేమ విఫలం కావడం, సినిమాల్లో పెట్టుబడి పెట్టి ఆర్థికంగా నష్టపోవడం ఆమెను మరింత కుంగదీసిందని అంటుంటారు. తన ఆర్థిక నష్టాలను పూడ్చుకోవాలని భావించిన స్మిత.. ఎందుకో కొన్నాళ్లు గ్యాప్ కూడా తీసుకుంది. ఆ సమయంలోనే మద్యాపానానికి అలవాటు అయ్యింది. అయితే ఏమైందో తెలియదు కానీ 1996 సెప్టెంబరు 23న తన ఇంట్లోనే ఫ్యాన్‌కు ఊరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది. అప్పట్లో సిల్క్ స్మిత సూసైడ్ ఇండస్ట్రీని కుదిపేసింది. (మరిన్ని ఫొటోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి) చదవండి: Silk Smitha: సిల్క్ స్మిత గురించి ఈ విషయాలు తెలుసా? -
వివాహేతర సంబంధం.. ప్రశ్నిస్తోందనే హత్య!
సాక్షి, కందుకూరు: లింగసముద్రంలో అత్యంత దారుణంగా హత్యకు గురైన విద్యార్థిని ప్రశాంతి(15) హత్య కేసు మిస్టరీని పోలీసులు ఛేదించారు. తమ వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉందని, ఆర్థిక లావాదేవీలను ప్రశ్నిస్తుందనే కారణంతో తల్లితో సహజీవనం చేస్తున్న శ్రీకాంత్ అనే వ్యక్తే ఈ దారుణానికి ఒడిగట్టినట్లు తేల్చారు. ఈ మేరకు శనివారం స్థానిక కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డీఎస్పీ కండే శ్రీనివాసులు కేసుకు సంబంధించిన వివరాలు వెల్లడించారు. డీఎస్పీ కథనం ప్రకారం.. వేటపాలేనికి చెందిన ఈసునూరి మాధవి 15 ఏళ్లుగా లింగసముద్రం మండలం తిమ్మారెడ్డిపాలెంలో ఏఎన్ఎంగా పనిస్తోంది. విభేదాల కారణంగా భర్తతో పాటు ఇతర కుటుంబ సభ్యులకు దూరంగా కూతురు ప్రశాంతితో కలిసి లింగసముద్రతో నివాసం ఉంటోంది. తన ఇంటి కింద పోర్షన్లో నివాసం ఉంటున్న జంగారెడ్డిపాలేనికి చెందిన వివాహితుడైన సుంకర శ్రీకాంత్‌తో ఏర్పడిన పరిచయం కాస్త వివాహేతర సంబంధానికి దారితీసింది. ప్రస్తుతం ఇద్దరూ కలిసి సహజీవనం సాగిస్తున్నారు. చదవండి: కూతురు కర్కశం.. కన్నతల్లి అని కనికరం లేకుండా.. దీనికి శ్రీకాంత్ కుటుంబ సభ్యుల నుంచి కూడా ఎటువంటి అభ్యంతరం లేకపోవడంతో కలిసే జీవిస్తున్నారు. మాధవికి వచ్చే జీతాన్ని సైతం శ్రీకాంత్ కాజేయడం, ఆమె అకౌంట్లోని డబ్బులు డ్రా చేసుకొని తన అవసరాలు తీర్చుకోవడం శ్రీకాంత్‌కు పరిపాటిగా మారింది. ఈ విషయంలో ప్రశాంతి ఇటీవల తల్లిని ప్రశ్నించడం ప్రారంభించింది. 10వ తరగతి పూర్తి చేసిన ప్రశాంతి మంచి మార్కులతో నూజివీడు ట్రిపుల్ ఐటీలో సీటు సాధించింది. అక్కడ రూ.60 వేలు కట్టాల్సి వచ్చింది. మాధవి ఆ డబ్బును శ్రీకాంత్‌ను అడిగింది. ప్రశాంతి ఉంటే మాధవితో తన సంబంధం కొనసాగదని, ఆర్థిక విషయాల్లో తన బాగోతం బయటపడుతుందని భావించిన శ్రీకాంత్ ప్రశాంతిని చంపేందుకు నిర్ణయించుకున్నాడు. ఈ నెల 23వ తేదీన ఉదయం 7గంటల సమయంలో ఇంట్లో నిద్రపోతున్న ప్రశాంతిని గొంతునులుమి చంపేశాడు. చదవండి: ఆయుర్వేద మెడిసిన్ పేరిట అమెజాన్ ద్వారా భారీగా గంజాయి రవాణా శవాన్ని ఏం చేయాలో తెలియక ఆ రోజంతా ఇంట్లోనే ఉంచుకున్నారు. అర్ధరాత్రి సమయంలో తన స్నేహితుడైన గురుబ్రహ్నం, మాధవి, శ్రీకాంత్ కలిసి అటవీ ప్రాంతానికి శవాన్ని తరలించి పెట్రోల్, డీజిల్ పోసి తలగబెట్టారు. మరుసటి రోజు వెళ్లి శవం పూర్తిగా కాలకపోవడంతో మట్టివేసి కప్పి వచ్చారు. తల్లి సహకారంతోనే... ప్రశాంతి కనిపించకపోవడంతో అనుమానం వచ్చిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. రంగంలోకి దిగిన పోలీసులు మాధవి, శ్రీకాంత్‌లను అదుపులోకి తీసుకొని ప్రశ్నించడంతో విషయం వెలుగులోకి వచ్చింది. ఈ కేసులో ప్రధాన నిందితుడు శ్రీకాంత్ తల్లి ధనమ్మ ప్రోత్సాహం కూడా ఉంది. మాధవితో వివాహేతర సంబంధం కొనసాగింపు, ప్రశాంతిని హత్యచేసి తగలబెట్టడం వరకు శ్రీకాంత్‌కు ఆయన తల్లి ధనమ్మ సహకరించినట్లు పోలీసులు తేల్చారు. -
పంజాగుట్ట బాలిక అనుమానాస్పద మృతి కేసులో విచారణ వేగవంతం
-
వాట్సాప్‌లో ఆయన మార్ఫింగ్ ఫొటో వైరల్
Subhas Chandra Bose Morphing Photo Viral: స్వాతంత్ర సమరయోధుడు, ఆజాద్ హింద్ ఫౌజ్ వ్యవస్థాపకుడైన సుభాష్ చంద్రబోస్ మరణం.. నేటికి ఓ వీడని మిస్టరీనే. 1945, ఏప్రిల్ 23న జరిగిన ఓ విమాన ప్రమాదంలో ఆయన చనిపోయారని ప్రకటనలు వెలువడినప్పటికీ.. అవశేషాలు దొరకకపోవడంతో ఆయన మరణం అధికారికంగా ధృవీకరణ కాలేదు. అయితే ఆ క్రాష్‌లో ఆయన చనిపోలేదని చాలాకాలం జీవించే ఉన్నారని చెబుతూ రకరకాల కథనాల్ని ప్రచారం చేస్తుంటారు. అయితే తాజాగా సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతున్న ఓ ఫొటో, దాని మీద సందేశం.. ఆయన అభిమానుల్ని విపరీతంగా ఆకట్టుకుంటోంది. Original picture with some reimagination by @BiplabC2.#Netaji #DeathThatWasnt #TheBoseMystery #Gumnaami @prosenjitbumba @srijitspeaketh @chandrachurg @PanickarS @koushikzworld @SayakSen6 @Sayani_Pandit pic.twitter.com/ep8T70g6Uj — Anuj Dhar (@anujdhar) August 18, 2019 విమాన ప్రమాదంలో బోస్ చనిపోయారనే వార్త కాంగ్రెస్ ఆడిన అబద్ధమని, తన మరణం మీద వచ్చిన వార్తను ఓ పత్రికలో బోస్ చదివారంటూ సదరు ఫొటో వైరల్ అవుతోంది. అయితే 2019లో ఇదే ఫొటో ఓ బంగ్లా వ్యక్తి ఫేస్బుక్ అకౌంట్లో వైరల్ అయ్యింది. రివర్స్ ఇమేజ్ సెర్చ్‌లో ఆ ఫొటోపై అసలు విషయం తేలింది. ఆ సమయంలో జపాన్‌లో ప్రధాన పత్రికగా ఉన్న ఇంగ్లిష్ పత్రిక నిప్పన్ టైమ్స్‌ను బోస్ చదువుతుండగా తీసిన ఫొటో అది. Subhas Chandra Bose reading Nippon Times (now The Japan Times), Japan's largest and oldest English-language daily newspaper @japantimes pic.twitter.com/6A7YMXGEkW — Anuj Dhar (@anujdhar) May 27, 2018 మే 27, 2018లో అంజుధార్ అనే వ్యక్తి ట్విటర్ అకౌంట్ నుంచి ఈ విషయం ధృవీకరించడం జరిగింది. అంతేకాదు 2019లో బిప్లబ్సీ2 అనే వ్యక్తి ట్విటర్ అకౌంట్ నుంచి ఈ మార్ఫింగ్ ఫొటో వైరల్ అయ్యిందని అంజుధార్ బయటపెట్టాడు కూడా. ఆ తర్వాత ట్విటర్ ఆ అకౌంట్‌ను తొలగించింది. ప్రస్తుతం కాంగ్రెస్‌ను బద్నాం చేసేలా ఆ మార్ఫింగ్ ఫొటోనే వాట్సాప్‌లో వైరల్ అవుతోంది. చదవండి: బోస్ బతికున్నారో లేదో చెప్పండి: సీఐసీ -
చిన్నారి సింధు శ్రీ మృతి పై వీడని మిస్టరీ
-
నేను సుశాంత్ గర్ల్‌ఫ్రెండ్‌ని...
‘‘సుశాంత్‌సింగ్ రాజ్‌పుత్ మరణంపై సీబీఐ (సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్) దర్యాప్తునకు ఆదేశించాలి’’ అని కేంద్ర హోంమంత్రి అమిత్ షాను సోషల్ మీడియా వేదికగా కోరారు బాలీవుడ్ నటి రియా చక్రవర్తి. గత నెల 14న సుశాంత్‌సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. ‘‘గౌరవనీయులైన అమిత్ షాగారికి.. నేను సుశాంత్ గర్ల్‌ఫ్రెండ్ రియా చక్రవర్తి. సుశాంత్ మనందరికీ దూరమై నెలరోజులు గడిచిపోయాయి. ప్రభుత్వంపై నాకు పూర్తి నమ్మకం ఉంది. న్యాయాన్ని విశ్వసిస్తాను. సుశాంత్ మృతిపై సీబీఐ పరిశోధన జరిపించాలని నేను మిమ్మల్ని చేతులెత్తి వేడుకుంటున్నాను. సుశాంత్ ఆత్మహత్య చేసుకునేందుకు ఎటువంటి కారణాలు ప్రేరేపించాయో నేను తెలుసుకోవాలనుకుంటున్నాను. సత్యమేవ జయతే’’ అని పేర్కొన్నారు రియా. సుశాంత్ మరణంపై సీబీఐ పరిశోధన జరిపాలని ఇప్పటికే పలువురు రాజకీయ నాయకులు, కొంతమంది సినీవాసులు డిమాండ్ చేశారు. మరోవైపు సుశాంత్ ఆత్మహత్య చేసుకోవడానికి రియా ఓ కారణం అంటూ కొందరు నెటిజన్లు సోషల్ మీడియాలో అసభ్యంగా కామెంట్స్ చేస్తున్నారు . వీరిపై తగిన చర్యలు తీసుకోవాలని సైబర్ క్రైమ్ పోలీసులకు సోషల్ మీడియా వేదికగా రియా ఫిర్యాదు చేశారు. -
రాయబార కార్యాలయానికి వెళ్లి అదృశ్యమైన విలేకరి
వాషింగ్టన్: వాషింగ్టన్ పోస్ట్‌కు విలేకరి (కంట్రిబ్యూటర్)గా పనిచేస్తున్న, సౌదీ అరేబియాకు చెందిన జమాల్ ఖషొగ్గీ కనిపించకుండా పోవడం వెనుక సౌదీ అరేబియా హస్తం ఉండొచ్చనీ, ఖషొగ్గీ హత్యకు గురై ఉంటే అందుకు కారకులను కఠినంగా శిక్షిస్తామంటూ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పరోక్షంగా సౌదీని హెచ్చరించారు. ఖషొగ్గీ సౌదీ ప్రభుత్వంపై విమర్శనాత్మక కథనాలను అమెరికాకు చెందిన వాషింగ్టన్ పోస్ట్‌లో రాసేవారు. తన వ్యక్తిగత పనిపై ఈ నెల 2న టర్కీలోని ఇస్తాంబుల్‌లో ఉన్న సౌదీ రాయబార కార్యాలయానికి వెళ్లిన తర్వాత ఖషొగ్గీ కనిపించకుండా పోయారు. కార్యాలయం లోపలే ఖషొగ్గీ్గని హత్య చేసి ఉంటారని టర్కీ అధికారులు ఆరోపిస్తున్నారు. ఈ అంశంలో సత్వరమే చర్యలు చేపట్టాలని ట్రంప్‌పై కాంగ్రెస్ సభ్యులు ఒత్తిడి తెస్తున్నారు. దీంతో ఖషొగ్గీ ఆచూకీ విషయమై సౌదీ రాజు సల్మాన్‌తో మాట్లాడతానని ట్రంప్ చెప్పారు. ఏమయ్యాడో మేం కనిపెడతాం.. ‘టర్కీలో ఏం జరిగిందో, ఖషొగ్గీ ఏమయ్యాడో మేం కనిపెడతాం. ఈ విషయంలో ఎవ్వరికీ వివరాలు తెలియవు’ అని ట్రంప్ అన్నారు. అయితే సౌదీ రాజుతో తన చర్చలు ఏ విధంగా ఉంటాయో చెప్పేందుకు ఆయన నిరాకరించారు. సీబీఎస్ వార్తా చానల్ ‘60 మినిట్స్’ కార్యక్రమంలోనూ.. ఖషొగ్గీ్గని సౌదీనే హత్య చేసిందంటారా? అని ట్రంప్‌ను ప్రశ్నించగా ‘ వాళ్లే అయ్యుంటారా? అవునేమో!’ అని అన్నారు. ఒకవేళ ప్రచారం జరగుతున్నట్లుగా సౌదీనే ఖషొగ్గీని హత్య చేసిందని తేలితే ఏం చర్యలు తీసుకుంటారని ప్రశ్నించగా, గతంలో తాను ప్రకటించినట్లు సౌదీకి ఆయుధాల సరఫరాను మాత్రం ఆపననీ, ఇప్పుడు తన నిర్ణయం మార్చుకున్నట్లు ట్రంప్ చెప్పారు. ‘ఆయుధాల సరఫరాపై ఆంక్షల వల్ల ఇక్కడి ఉద్యోగాలు పోతాయి. ఆ దేశంతో మనకు ఉన్న ఒప్పందాలు రద్దవుతాయి. దేశంలో నిరుద్యోగాన్ని పెంచే ఈ చర్యను తీసుకోను. అయితే హత్యకు కారకులపై తీవ్ర చర్యలుంటాయి. ఆంక్షలుంటాయి’ అని చెప్పారు. అన్నీ నిరాధార ఆరోపణలే: సౌదీ ఇస్తాంబుల్‌లోని తమ రాయబార కార్యాలయంలోనే ఖషొగ్గీ హత్యకు గురయ్యాడన్న ఆరోపణలను సౌదీ అరేబియా శనివారం తోసిపుచ్చింది. అవన్నీ అబద్ధాలు, ఆధారాల్లేని ఆరోపణలేనని కొట్టిపారేసింది. ఖషొగ్గీ్గని సౌదీ అధికారులు రాయాబార కార్యాలయంలోనే చంపేశారనేందుకు భవనం లోపల తీసిన వీడియో రికార్డులు ఉన్నాయని టర్కీ అధికారులు చెప్పినట్లు వాషింగ్టన్ పోస్ట్ పేర్కొంది. ఈ విషయంపై టర్కీ ప్రభుత్వంతో మాట్లాడేందుకు సౌదీ నుంచి ఓ బృందం శుక్రవారమే టర్కీకి చేరుకుంది. అక్కడ సౌదీ హోం మంత్రి అబ్దుల్ అజీజ్ మాట్లాడుతూ ఖషొగ్గీ్గని చంపేందుకు సౌదీ ప్రభుత్వం ఆదేశాలిచ్చిందంటూ జరుగుతున్న ప్రచారాలన్నీ అబద్ధాలు, నిరాధార ఆరోపణలేనని చెప్పారు. రికార్డర్ ఆన్ చేసి వెళ్లాడా? సౌదీ రాయబార కార్యాలయంలోకి వెళ్లే ముందు ఖషొగ్గీ తన చేతికున్న యాపిల్ గడియారంలో రికార్డింగ్ ఆన్ చేశారనీ, ఆయనను సౌదీ అధికారులు విచారించి, హింసించి, హత్య చేస్తున్నప్పుడు వారు మాట్లాడిన మాటలన్నీ రికార్డయ్యి, ఆ ఫైల్స్ ఆయన ఫోన్‌కు, ఐ క్లౌడ్‌కు వెళ్లాయని టర్కీ పత్రిక సబా పేర్కొంది. ఖషొగ్గీ్గ నాడు తన ఫోన్‌ను భార్యకు ఇచ్చి రాయబార కార్యాలయానికి వచ్చారని తెలిపింది. గడియారంలో రికార్డర్ ఆన్‌లో ఉండటాన్ని ఆలస్యంగా గుర్తించిన సౌదీ అధికారులు అనేక పాస్‌వర్డ్‌లతో ప్రయత్నించినప్పటికీ వాచ్‌లో ఉన్న ఫైల్స్‌ను ఓపెన్ చేయలేకపోయారనీ, చివరకు ఖషొగ్గీ వేలిముద్రతో వాచ్‌ను అన్‌లాక్ చేసి కొన్ని ఫైళ్లను మాత్రం డిలీట్ చేయగలిగారని సబా పేర్కొంది. అయితే యాపిల్ గడియారాలను వేలిముద్రతో లాక్, అన్‌లాక్ చేసే సదుపాయం లేదని యాపిల్ ప్రతినిధి ఒకరు వెల్లడించడం గమనార్హం. -
అమ్మ మిస్టరీ.. బాంబు పేల్చిన పన్నీర్!
సాక్షి ప్రతినిధి, చెన్నై: తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, దివంగత జయలలిత మరణ మిస్టరీ అటు ఇటూ తిరిగి చివరకు అపోలోకు చుట్టుకుంది. అనారోగ్యంతో అపోలో ఆసుపత్రిలో అమ్మ గడిపిన 74 రోజుల సీసీటీవీ పుటేజీ దృశ్యాలపై విచారణ కమిషన్ పట్టుబట్టడం, అవి చెరిగిపోయాయని, అసలు రికార్డేకాకుండా ఒక అధికారి స్విచ్ఆఫ్ చేయమన్నాడని భిన్నమైన వాంగ్మూలాలు చోటుచేసుకోవడంతో అపోలో ఆసుపత్రిని సందర్శించేందుకు కమిషన్ చైర్మన్ ఆర్ముగస్వామి సిద్ధమవుతున్నారు. జ్వరం, డీహైడ్రేషన్...కేవలం ఈ రెండు వ్యాధులతో బాధపడుతూ అపోలోలో చేరారని 2016 సెప్టెంబర్ 22వ తేదీన అపోలో ఆసుపత్రి బులెటిన్ విడుదల చేసింది. జయ స్వల్ప అనారోగ్యంతో బాధపడుతున్నారు, త్వరలో ఆరోగ్యం కుదుటపడుతుంది, డిశ్చార్జ్ అవుతారని ప్రకటించారు. అయితే బులెటిన్‌లో పేర్కొన్నదానికి భిన్నంగా అదే ఏడాది డిసెంబర్ 5న జయ కన్నుమూశారు. దీంతో అందరిలోనూ అనుమానాలు తలెత్తాయి. ప్రతిపక్షాలు సైతం సీబీఐ విచారణకు పట్టుబట్టాయి. అప్పట్లో అన్నాడీఎంకే నుంచి బహిష్కృతుడైన పన్నీర్‌సెల్వం సైతం విచారణకు పట్టుబట్టారు. ఈ తరుణంలో రాష్ట్ర ప్రభుత్వం విచారణ కమిషన్‌ను నియమించింది. కమిషన్ చైర్మన్ ఆర్ముగస్వామి ఎదుట సుమారు వందమందికి పైగా వాంగ్మూలం ఇచ్చారు. ఈ దశలో అపోలో ఆసుపత్రిలోని సీసీటీవీ కెమెరాల పుటేజీ కావాలని కమిషన్ ఇటీవల కోరినపుడు అవి చెరిగిపోయాయని బదులువచ్చింది. అయితే ఆర్కేనగర్ ఉప ఎన్నికల సమయంలో టీటీవీదినకరన్ వర్గ ఎమ్మెల్యే వెట్రివేల్ జయ చికిత్స పొందుతున్న దృశ్యాలను బైటపెట్టాడు. అవి మార్ఫింగ్ దృశ్యాలను కొందరు కొట్టిపారేసినా స్వయంగా శశికళ చిత్రీకరించారని నమ్మబలికారు. పుటేజీలపైనే పట్టుబట్టి ఉన్న కమిషన్ అపోలో ఆసుపత్రి చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ (సీఓఓ) సుబ్బయ్య విశ్వనాథన్, వైద్యులు పద్మావతి, భువనేశ్వరి, అరుళ్సెల్వన్, మాజీ ఎంపీ మనోజ్‌పాండియన్, శశికళ తరఫు న్యాయవాది సెంధూరపాండి వేర్వేరుగా మంగళవారం పిలిపించి విచారించింది. ఈ సందర్భంగా అనేక అనుమానాస్పద అంశాలు వెలుగులోకి వచ్చాయని కమిషన్ వర్గాలు తెలిపాయి. ముఖ్యంగా, చికిత్సలో భాగంగా వార్డు నుంచి జయను బైటకు తీసుకొచ్చినపుడు సీసీ టీవీ కెమెరాల స్విచ్ ఆఫ్ చేయాల్సిందిగా ఒక అధికారి ఆదేశించినట్లు విచారణ కమిషన్ ముందు అపోలో చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ (సీఓఓ) సుబ్బయ్య విశ్వనాథన్ ఇచ్చిన వాంగ్మూలం కలకలానికి కారణమైంది. జయ చికిత్సకు సంబంధించిన బులెటిన్లు వేరేవారు సిద్ధం చేయగా, తాను సంతకం మాత్రమే చేశాను అని సీఓఓ చెప్పారు. అయితే ఆ బులెటిన్ తయారు చేసినవారు ఎవరని కమిషన్ ప్రశ్నించగా ఆయన వారంరోజుల గడువు కోరడంతో కమిషన్ మంజూరు చేసింది. జయ చేరిన 2016 సెప్టెంబర్ 22వ తేదీ నుంచి 29వ తేదీ వరకు విడుదలైన బులెటిన్లలో పొంతనలేదు, వాటిని కూడా వివరించాలని కమిషన్ ఆదేశించింది. సీసీటీవీ కెమెరాలు స్వీచ్‌ఆఫ్ చేయాలని ఒక అధికారి ఆదేశించినట్లుగా అపోలో సెక్యూరిటీ అధికారి తనతో అన్నాడని సుబ్బయ్య చెప్పడంతో సదరు అధికారి ఎవరని కమిషన్ ప్రశ్నించింది. ఈ ప్రశ్నకు సైతం తెలియదనే సమాధానమే వచ్చింది. సెక్యూరిటీ అధికారి ఇళంగోవన్ మృతిచెందడం వల్ల స్విచ్ ఆఫ్ చేయమని చెప్పిన అధికారిని గుర్తించేందుకు ఎవరిని అడగాలో తెలియడం లేదని కూడా ఆయన అన్నాడని కమిషన్ వర్గాలు చెప్పాయి. ఈ జవాబుకు ఆగ్రహించిన కమిషన్ చైర్మన్ ఆర్ముగస్వామి ‘చనిపోయిన వారిని అడ్డుపెట్టుకుని వాస్తవాన్ని కప్పిపుచ్చే ప్రయత్నం చేస్తున్నారా’ అని గద్ధించగా ఆయన మౌనం పాటించినట్లు తెలిసింది. 2016 సెప్టెంబర్ 22న పోయెస్‌గార్డెన్‌లో ఏమి జరిగిందో తెలుసుకునేందుకు పుటేజీలను సేకరించాలని, అపోలో ఆసుపత్రిలో అదే నెల 23,24 తేదీల పుటేజీని పరిశీలించాలని, పోయెస్‌గార్డెన్ నుంచి అపోలో ఆసుపత్రి వరకున్న 17 సీసీటీవీ కెమెరాల పుటేజీని పరిశీలించాలని మాజీ ఎంపీ మనోజ్ పాండియన్ మంగళవారం కమిషన్ ముందు హాజరై ఆర్ముగస్వామిని కోరాడు. కమిషన్ సైతం ఆయా పుటేజీలను సేకరించాలని నిర్ణయించుకుంది. పోయెÜగార్డెన్, అపోలో ఆసుపత్రిని సైతం పరిశీలించాలని కమిషన్ భావిస్తున్నట్లు సమాచారం. మరోబాంబు పేల్చిన పన్నీర్: సీసీటీవీ పుటేజీల వివాదం ఇలా ఉండగా, డిప్యూటీ ముఖ్యమంత్రి పన్నీర్‌సెల్వం మరిన్ని అనుమానాలు రేకెత్తించే వ్యాఖ్యలతో బాంబుపేల్చారు. చెన్నై తమిళనాడు రాష్ట్రం తేనీలో మంగళవారం రాత్రి జరిగిన అన్నాడీఎంకే బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ, అపోలో ఆసుపత్రిలో జయను చూసేందుకు చేసిన అనేక ప్రయత్నాలు విఫలమయ్యాయి. ఎంత ప్రయత్నించినా చూడలేక పోయాను. అమ్మ చికిత్స పొందిన 74 రోజులూ ఆసుపత్రి కిందకే పరిమితమైనా. రోజులు గడుస్తున్నా జయ ఆరోగ్యం మెరుగుపడక పోవడంతో మెరుగైన చికిత్సకు అమెరికాకు పంపాలని నిర్ణయించుకున్నా. అమ్మకు ఏమైనా జరిగితే ప్రజల తమను రోడ్లపైకి రానీయరని భయపడ్డా. ఇదే విషయాన్ని తాను ప్రస్తావించి బతిమాలా. ‘మాపై నమ్మకం లేదా’ని అపోలో యాజమాన్యం నన్ను ఎదురుప్రశ్నించి నిరాకరించిందని అన్నారు. -
జయలలిత చికిత్స వీడియో దృశ్యాలు లేవు!!
దివంగత ముఖ్యమంత్రి జయలలిత మరణ మిస్టరీ వీడేనా? పలువురిలో చోటుచేసుకున్న అనుమానపు మేఘాలు విచారణ కమిషన్ నివేదికతో తొలగిపోయేనా?.. అన్న ప్రశ్నలకు సమా«ధానం దొరకని పరిస్థితులు నెలకొన్నాయి. జయ విచారణలో కీలకమైన జయకు చికిత్స వీడియో దృశ్యాలు చెరిగిపోయినట్లు అపోలో ఆస్పత్రి చెప్పడంతో కమిషన్‌కు కొత్త చిక్కు వచ్చి పడింది. సాక్షి ప్రతినిధి, చెన్నై: దేవుళ్లలా కొలుచుకునే రాజకీయ నేతలకు అస్వస్థత చేకూరినపుడు ప్రజలు తల్లడిల్లిపోవడం సహజమే. తమిళనాడు ముఖ్యమంత్రిగా ఉన్నపుడే ఎంజీ రామచంద్రన్ తీవ్ర అనారోగ్యానికి గురై ఆస్పత్రి పాలయ్యారు. చెన్నై అపోలో ఆస్పత్రిలో, ఆ తరువాత అమెరికాలో ఆయన చికిత్స పొందారు. ప్రజల కోరిక మేరకు ఆస్పత్రిలో ఎంజీఆర్ చికిత్స పొందుతున్న దృశ్యాలను మీడియాకు విడుదల చేశారు. అమెరికాలో చికిత్స పొందుతూనే ఎంజీఆర్ మరణించినా ప్రజలు ఎలాంటి అనుమానాలు వ్యక్తంచేయలేదు. అయితే అదే తీరులో జయలలిత సైతం ముఖ్యమంత్రి హోదాలోనే 2016 సెప్టెంబరు 22వ తేదీన అపోలో ఆస్పత్రిలో అడ్మిటయ్యారు. జ్వరం, డీహైడ్రేషన్ వంటి స్వల్ప అనారోగ్యమే, రెండు మూడు రోజుల్లో ఆమె డిశ్చార్జ్ అవుతారని వైద్యులు, ప్రభుత్వం ప్రకటించడంతో అమ్మ అభిమానులు ఊరట చెందారు. అయితే వైద్యులు చెప్పినట్లుగా అమ్మ విడుదల కాలేదు. జయ చికిత్స పొందుతున్న వీడియో లేదా ఫొటోలు విడుదల చేయాలని అన్నాడీఎంకే కార్యకర్తలు, అభిమానులు అనేకసార్లు కోరారు. ఆరోగ్యం కుదుటపడిందనే రోజుల తరబడి ప్రచారాలు సాగుతుండగానే అదే ఏడాది డిసెంబరు 5వ తేదీన జయ కన్నుమూయడం చర్చనీయాంశమైంది. అన్నాడీఎంకేలోని వారేగాక ప్రతిపక్షాలు సైతం అనేక అనుమానాలు వ్యక్తంచేశాయి. సీబీఐ విచారణకు డిమాండ్ చేశాయి. పలుచోట్ల నుంచి ఒత్తిడి పెరగడంతో రిటైర్డు న్యాయమూర్తి ఆరుముగస్వామి చైర్మన్‌గా తమిళనాడు ప్రభుత్వం గత ఏడాది సెప్టెంబరు విచారణ కమిషన్‌ను నియమించింది. జయ మరణంపై అనుమానాలు వ్యక్తం చేసిన సుమారు వందమందికి పైగా కమిషన్ ముందు హాజరై వాంగ్మూలం ఇచ్చారు. జయకు చికిత్స చేసిన అపోలో, ఢిల్లీ నిమ్స్ వైద్యులను సైతం కమిషన్ విచారించింది. ఈ దశలో అపోలో ఆస్పత్రిలో జయకు చికిత్స చేసిన వీడియో దృశ్యాలను కమిషన్ అనేకసార్లు కోరింది. అయితే వీవీఐపీలు చికిత్స పొందుతున్న గదుల్లో సీసీటీవీ కెమెరాలు ఉండవని అపోలో బదులిచ్చింది. అయితే అపోలో మాటలకు భిన్నంగా ఆర్కేనగర్ ఉప ఎన్నికల సమయంలో స్వతంత్య్ర అభ్యర్థి టీటీవీ దినకరన్ అనుచరుడు వెట్రివేల్ జయ చికిత్స పొందుతున్న వీడియో దృశ్యాలను విడుదల చేసి కలకలం రేపాడు. అవన్నీ గ్రాఫిక్ దృశ్యాలని కొందరు ఆక్షేపించినా శశికళే స్వయంగా చిత్రీకరించారని చెప్పడంతో అందరూ నమ్మారు. దీంతో అపోలో మరో వివరణ ఇవ్వాల్సి వచ్చింది. చెరిగిపోయాయని వివరణ అపోలో ఆస్పత్రి న్యాయవాది మైనాబాష మాట్లాడుతూ, వీడియో దృశ్యాలపై కమిషన్‌కు వివరణ ఇచ్చామని తెలిపారు. ఆస్పత్రిలోని ముఖ్యమైన ప్రాంతాల్లో మాత్రమే సీసీటీవీ కెమెరాలు అమరుస్తామని, వీటిల్లోని దృశ్యాలు సైతం వీవీఐపీలు ఉండేచోట కెమెరాలు ఉండవని తెలిపామని అన్నారు. ఈ కెమెరాల ద్వారా నమోదైన దృశ్యాలు నెలరోజులకు మించి ఉండవని, మరో దృశ్యాలు నమోదు కాగానే పాతవి ఆటోమేటిక్‌గా చెరిగిపోతాయని, ఇలానే జయ చికిత్స దృశ్యాలు సైతం చెరిగిపోయాయని పేర్కొంటూ ఈనెల 11వ తేదీన కమిషన్‌కు లిఖితపూర్వకంగా తెలియజేశామని అన్నారు. నిపుణులను పంపాలని నిర్ణయం అపోలో ఇచ్చిన వివరణ, ఆస్పత్రిలో సీసీటీవీ సర్వర్లను పరిశీలించి చెరిగిపోయిన దృశ్యాలను సేకరించే వీలుందా తెలుసుకునేందుకు ఒక నిపుణుల బృందాన్ని అపోలో ఆస్పత్రికి పంపాలని కమిషన్ నిర్ణయించింది. వీవీఐపీలు చికిత్స పొందుతున్న చోట్ల సీసీటీవీ కెమెరాలు ఉండవని అపోలో ఇచ్చిన సమాధానంపై ఆస్పత్రి సిబ్బంది నుంచి సమాచారం రాబట్టాలని ఆదేశించింది. ఈ విషయపై అపోలో ఆస్పత్రి సీవోవో సుబ్బయ్య విశ్వనాథన్‌ను ఈనెల 25వ తేదీన మరోమారు హాజరు కావాలని కమిషన్ ఆదేశించింది. జయ మరణంపై ఇప్పటికే అనుమాన మేఘాలు కమ్ముకుని ఉండగా సీసీటీవీ దృశ్యాలు అందుబాటులో లేకపోవడం, శశికళ తదితరులను ఇంకా విచారించాల్సి ఉండడంతో మిస్టరీ వీడేనా అని ఆలోచనలో పడ్డారు. -
శాస్త్రి మరణ వివరాలు వెల్లడించాలి
చండీగఢ్: మాజీ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి మరణానికి సంబంధించిన పత్రాలను బహిర్గతం చేయాలని ఆయన కొడుకు, కాంగ్రెస్ నేత అనిల్ శాస్త్రి కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శాస్త్రి మరణంపై ప్రజలకు ఎన్నో సందేహాలున్నాయనీ, వాటిని పోగొట్టాలంటే పత్రాలను బహిర్గతపరచాలని ఆయన కోరారు. ‘లాల్ బహదూర్ శాస్త్రి: లెసన్స్ ఇన్ లీడర్షిప్’ అనే పుస్తకం పంజాబీ అనువాదం విడుదల సందర్భంగా శుక్రవారం అనిల్ శాస్త్రి ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రధాని పదవిలో ఉండగానే 1966 జనవరి 11న తాష్కెంట్లో లాల్‌బహదూర్ శాస్త్రి మరణించారు. గుండెపోటుతోనే ఆయన చనిపోయారని ప్రకటించగా ఏదో కుట్ర జరిగిందని అప్పట్లోనే ఆరోపణలు వచ్చాయి. శాస్త్రి మరణానికి సంబంధించిన పత్రాలు రహస్యమైనవంటూ గత ప్రభుత్వం వాటిని బహిర్గతపరచలేదని అనిల్ శాస్త్రి పేర్కొన్నారు. -
వీడని మిస్టరీ
పాలకొండ: పాలకొండ టీచర్స్ కాలనీలో కలకలం రేపిన డైట్ విద్యార్థిని పావని అనుమానాస్పద మృతిపై మిస్టరీ వీడలేదు. జనావాసల మధ్య ఉన్న ఇంట్లో ఆమె రక్తపు మడుగులో విగతజీవిగా పడి ఉండటంపై పోలీసులు మంగళవారం దర్యాప్తు ప్రారంభించారు. ఎస్పీ తివిక్రమ వర్మ సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. డాగ్‌స్క్వాడ్ అణువణువూ తనిఖీ చేశాయి. అనంతరం పావని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఏరియా ఆస్పత్రికి తరలించారు. ఆమెది హత్య అని పోస్టుమార్టం నివేదికలో ప్రాథమికంగా తేలింది. గొంతును విచక్షణ రహితంగా కోసేసినట్లు వైద్యులు చెబుతున్నారు. నిశితంగా పరిశీలించిన ఎస్పీ కేసుకు సంబంధించిన ప్రతి అంశాన్ని ఎస్పీ తివిక్రమవర్మ నిశితంగా పరిశీలించారు. సంఘటనా స్థలంలో గంటకు పైగా దర్యాప్తు చేశారు. ప్రతి ఆధారాన్ని ఆయన సేకరించారు. ఇప్పటికే కేసుపై ఒక అంచనాకు వచ్చిన ఆయన డీఎస్పీ స్వరూపారాణికి సూచనలిచ్చారు. ప్రస్తుతం పావని, శిరీషల ఫోన్ కాల్స్ ద్వారా కేసును ఛేదించేందుకు ప్రయత్నిస్తున్నారు. అక్క శిరీషను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. విచారణలో శిరీష పొంతన లేని సమాధానాలు చెబుతున్నట్లు గుర్తించారు. కేసుపై పోలీసులు పలు కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. వివరాలు బయటకు రాకుండా చూస్తున్నారు. మనస్పర్థలే హత్యకు దారితీశాయా? సీతంపేట మండలం పెద్దూరుకు చెందిన పావని, శిరీష తల్లిదండ్రులు చనిపోవడంతో పాలకొండలోని టీచర్స్ కాలనీలో నివసిస్తున్నారు. స్థానిక తమ్మినాయుడు కళాశాలలో పావని డైట్ రెండో సంవత్సరం చదువుతోంది. కొంతకాలం నుంచి అక్క శిరీషతో పావనికి గొడవలు జరుగుతున్నాయని కాలనీవాసులు చెబుతున్నారు. అక్క శిరీషతో పాటు ఆమె స్నేహితులు ఇంటికి వస్తుండేవారని, దీంతో పావని వారితో ఇంటికి రావొద్దని వారించేదన్నారు. ఈ నేపథ్యంలో 15 రోజుల క్రితం పావని వేరే చోటకి వెళ్లిపోయినట్లు చెబుతున్నారు. నరసన్నపేటకు సోమవారం ఉద్యోగ రీత్యా వెళ్లిన శిరీష సాయంత్రం ఇంటికి వచ్చే సమయానికి పావని రక్తపు మడుగులో పడిఉండటం, చుట్టూ కత్తులు ఉండటంతో.. వివాదాల నేపథ్యంలోనే పావనిని కావాలనే హత్య చేశారనే అనుమానాలు వ్యక్తంచేస్తున్నారు. మృతదేహం ఉన్న పరిస్థితి, అక్కడ లభ్యమైన ఆధారాలతో పాటు మెడపై లోతుగా గాయమవడంతో ఆమెది హత్యే అని అభిప్రాయపడుతున్నారు. -
రెండోసారి ఫోరెన్సిక్ నివేదిక కోరిన పబ్లిక్ ప్రాసిక్యూటర్
-
సూపర్ స్టార్
-
కాటేసే ‘కాస్మొటిక్’!
సాక్షి, హైదరాబాద్: అతిలోక సుందరి దివికేగింది.. మరణానికి కారణం గుండెపోటని వార్తలొచ్చినా సమయం గడుస్తున్న కొద్దీ అనేక అనుమానాలు ముసురుకుంటున్నాయి.. కాస్మొటిక్ సర్జరీలు కారణమని కొందరు.. బరువు తగ్గేందుకు వాడిన మందులని ఇంకొందరు అనుమానిస్తున్నారు.. ఆరోపిస్తున్నారు కూడా.. వాస్తవం రహస్యంగానే ఉండిపోవచ్చుగానీ సౌందర్య శస్త్ర చికిత్సలు, బరువు తగ్గించే మాత్రలు ప్రాణాలు తీసేంత హానికరమైనవే! గ్లామర్ ప్రపంచంలో అందంగా కనిపించడం అనివార్యం. కడుపు కట్టుకోవడం, ద్రవ ఆహారమే తీసుకోవడం, గంటల తరబడి వ్యాయామం చేస్తూ అందాన్ని కాపాడుకోవడం ఓ రకమైతే.. పెరుగుతున్న వయసు, ఒళ్లు దాచుకోడానికి శస్త్ర చికిత్సలు, మందులు మింగి ఆకలిని అణచుకొని నాజూకుగా కనిపించే ప్రయత్నం చేయడం ఇంకో రకం. శ్రీదేవి రెండో రకం వ్యక్తి అని కొన్ని వార్తలు చెబుతున్నాయి. చిన్న వయసులోనే ముక్కు ఆకారం సరిచేసుకోడానికి రైనోప్లాస్టీ చేయించుకున్న శ్రీదేవి.. తరువాత అమెరికా కాలిఫోర్నియాలోని ఓ ఆస్పత్రిలో చిన్నాచితకా కలిపి మొత్తం దాదాపు 29 ఆపరేషన్లు చేయించుకున్నారని వార్తలొస్తున్నాయి. శ్రీదేవికి దగ్గరి స్నేహితురాలు ఒకరు ఈ విషయమై ఫేస్బుక్లో ఓ పోస్ట్ కూడా పెట్టారు. అన్ని సర్జరీలూ ప్రమాదకరమే.. కాస్మొటిక్ సర్జరీలతో అందం మాటేమోగానీ.. ఆరోగ్యం నాశనమవడం ఖాయమన్నది నిపుణుల మాట. రైనోప్లాస్టీ మొదలుకొని.. వక్ష సౌందర్యాన్ని పెంచుకోడానికి చేసుకునే శస్త్ర చికిత్స.. శరీరంలోని కొన్ని భాగాల నుంచి కొవ్వులు తొలగించేందుకు చేసే లైపోసక్షన్, తినే ఆహారం మోతాదును కృత్రిమంగా తగ్గించేందుకు బేరియాట్రిక్ సర్జరీ.. ఇలా అన్ని రకాల సర్జరీలతోనూ దుష్ప్రభావాలు బోలెడు. శస్త్ర చికిత్స జరిగిన ప్రాంతాల్లో రక్తం గడ్డకట్టడం మొదలుకుని.. రెండో గుండెగా చెప్పుకునే పిక్కల్లోని నరాల్లో రక్తప్రసరణ ఆగిపోయేంతగా అడ్డంకులు ఏర్పడటం వీటిల్లో కొన్ని మాత్రమే. కొన్నిసార్లు పిక్కల్లో ఏర్పడిన రక్తపు గడ్డలు పైకి ప్రవహించి ఊపిరితిత్తుల్లోకి చేరి ప్రాణాలూ తీయొచ్చు. వక్ష సంపదను పెంచేందుకు సర్జరీ చేయించుకున్న వారిలో కనీసం 15 శాతం మంది నాడులు దెబ్బతిని కొన్ని స్పందనలు కోల్పోతారని గణాంకాలు చెబుతున్నాయి. శస్త్ర చికిత్సల కోసం తరచూ మత్తుమందులు తీసుకోవాల్సి రావడమూ ఆరోగ్యాన్ని పాడు చేస్తుంది. కొవ్వులు తొలగించేందుకు వాడే లైపోసక్షన్‌తో శరీరం లోపల ఉండే అవయవాలు దెబ్బతినేందుకు అవకాశాలెక్కువ. కొవ్వు తొలగించేందుకు ఉపయోగించే పరికరాలు అవయవాలను తాకడం వల్ల ఇలా జరుగుతుంటుంది. మాత్రలతోనూ చిక్కులెక్కువే.. బరువు తగ్గేందుకు హైడ్రాక్సిల్ ఆధారిత మందులు శ్రీదేవి వాడారని వార్తలొచ్చాయి. బరువు తగ్గేందుకు లేదా ఆకలి మందగించేలా చేసేందుకు ఈ రకం మందులు వాడుతుంటారు. అనెరొక్సోరెంట్స్ రకం మందులు తీసుకుంటే కడుపు నిండుగా ఉందన్న భావన కలిగించేలా ఇవి మెదడులో కొన్ని మార్పులు చేస్తాయి. ఇలాంటి మందులతో రక్తపోటు, గుండె కొట్టుకునే వేగం పెరగడం. వాంతులు, అతిసారం, నిద్రలేమి, మలబద్దకం, ఛాతి నొప్పి, చూపు మసకబారడం వంటి దుష్ప్రభావాలు ఉంటాయి. సర్జరీలు చేయించుకోలేదన్న శ్రీదేవి పదిహేనేళ్ల విరామం తరువాత ‘ఇంగ్లిష్ వింగ్లిష్’ సినిమాతో శ్రీదేవి మళ్లీ తెరంగేట్రం చేసిన విషయం తెలిసిందే. చిత్రం విడుదల సమయంలో తన పెదవుల ఆకారాన్ని మార్చుకోడానికి శ్రీదేవి ప్లాస్టిక్ సర్జరీ చేయించుకున్నారని వార్తలు గుప్పుమన్నాయి. ఈ విషయమై అనేక సందర్భాల్లో విలేకరులు శ్రీదేవిని ప్రశ్నించారు కూడా. అయితే ప్లాస్టిక్ సర్జరీల విషయాన్ని శ్రీదేవి పూర్తిగా ఖండించారు. తనకు ఆ అవసరం లేదని.. మంచి ఆహారం, వ్యాయామాలతోనే ముఖం కళకళలాడుతోందిగానీ.. కృత్రిమ సర్జరీలతో కాదని అప్పట్లో ఆమె వ్యాఖ్యానించారు. ఆమె మరణం తరువాత కూడా.. శస్త్ర చికిత్సలు మాత్రమే మరణానికి కారణం కాకపోవచ్చునని ఓ కాస్మొటిక్ సర్జరీ నిపుణుడు అనడం గమనార్హం. రజనీ కోసం శ్రీదేవి వ్రతం తమిళ సినిమా: సినిమా వాళ్లు ఏం చేసినా స్వార్థంతోనే అనే అపవాదు ఉంది. కానీ ఈ పరిశ్రమలోనూ మానవత్వం ఉన్న వాళ్లు, స్నేహానికి గౌరవం ఇచ్చేవారూ ఉన్నారు. అందుకు నిదర్శనం శ్రీదేవియే. 2011లో రజనీకాంత్ అనారోగ్యానికి గురై చికిత్స నిమిత్తం సింగపూర్‌కు వెళ్లారు. రజనీ త్వరగా కోలుకోవాలని అప్పట్లో శ్రీదేవి వారం రోజులు వ్రతం ఆచరించి పూజలు చేశారట. రజనీ కోలుకున్న తరువాత షిర్డీ సాయిబాబా ఆలయానికి వెళ్లి వ్రతాన్ని పూర్తి చేసుకున్నారు. ఈ విషయాన్ని స్వయంగా ఆమెనే ఇటీవల ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. ‘కమల్, రజనీ ఇద్దరు నాకు మంచి మిత్రులు. రజనీకి మా అమ్మంటే చెప్పలేనంత అభిమానం. రజనీ అంటే మా అమ్మకూ అంతే. కమల్లాగే తానూ పెద్ద స్టార్ కావాలని, అందుకు ఏం చేయాలని రజనీ మా అమ్మను అడిగేవారు. నువ్వు కచ్చితంగా పెద్ద స్టార్‌వి అవుతావని ఆమె చెప్పేది’ అని ఇంటర్వ్యూలో శ్రీదేవి చెప్పారు. రూ.30వేలు పారితోషికం తీసుకోవాలనేది తన ఆశ అని అప్పట్లో రజనీ అంటుండేవారనీ, అది తలచుకుంటే ఇప్పుడూ నవ్వొస్తుందన్నారు. శ్రీదేవి స్వగ్రామంలో విషాద ఛాయలు సాక్షి, చెన్నై: శ్రీదేవి మరణ వార్తతో ఆమె స్వగ్రామమైన తమిళనాడులోని విరుదునగర్ జిల్లా శివకాశి సమీపంలోని మీనంపట్టిలో విషాద ఛాయలు అలుముకున్నాయి. బాల్యంలోనే శ్రీదేవి మీనంపట్టి నుంచి చెన్నైకి వెళ్లినప్పటి ఫొటోను, ఆమె తల్లిదండ్రుల చిత్రపటాలను వీధుల్లో ఉంచి కొవ్వొత్తులు వెలిగించి అక్కడి ప్రజలు నివాళులర్పించారు. శ్రీదేవి గొప్ప నటిగా చెన్నైలో స్థిరపడిన తర్వాత కూడా మీనంపట్టి నుంచి తనను చూడడానికి ఎవరైనా వస్తే మంచి మర్యాదలతో స్వాగతం పలికి ఇంట్లో ఏ లోటూ రాకుండా చూసుకునేవారని గ్రామస్తులు గుర్తు చేసుకుంటూ విలపిస్తున్నారు. శ్రీదేవి జీవిత ఇతివృత్తంతో డాక్యుమెంటరీ తీయడానికి ఆమె అభిమాన సంఘాలు ఇటీవలే అనుమతి తీసుకుని ఆ పనులను వేగవంతం చేశాయి. ఇంతలోనే ఆమె కన్నుమూశారు. చెన్నై ఆళ్వార్‌పేట సీఐటీ కాలనీలోని శ్రీదేవి స్వగృహం ఒకప్పుడు అభిమానుల తాకిడితో నిత్యం కళకళలాడేది. ముంబైకి మకాం మార్చాక కూడా ఆమె ఎప్పుడు చెన్నైకి వచ్చినా ఈ ఇంట్లోనే ఉండేవారు. మాజీ సీఎం జయలలిత మరణం తర్వాత గత ఏడాది జనవరిలో ఆమె చివరిసారిగా చెన్నైకి వచ్చి శశికళను పరామర్శించి వెళ్లారు. ఆ ఇంటి ముందు అభిమానులు శ్రీదేవి చిత్రపటాన్ని ఉంచి నివాళులర్పించారు. రంగీలా.. బాజీగర్! బాలీవుడ్లో బ్లాక్బస్టర్లుగా నిలిచిన రంగీలా, బాజీగర్, మొహబ్బతే, బాఘ్బాన్ చిత్రాల్లోని ప్రధాన పాత్ర కోసం శ్రీదేవినే ఆయా చిత్ర నిర్మాతలు సంప్రదించారు. అయితే ఆమె వాటిని తిరస్కరిం చడంతో ఆ పాత్రలు కాజోల్, ఉర్మిలా మతోండ్కర్, ఐశ్వర్యారాయ్ తదితరుల్ని వరించాయి. గతంలో స్టార్‌డస్ట్ మ్యాగజీన్‌కు శ్రీదేవి ఇచ్చిన ఓ ర్యాపిడ్‌ఫైర్ ఇంటర్వ్యూలోని ముఖ్యాంశాలు: ► నేను ప్రేమించేది– పచ్చగా ఉన్న ఈ సుందరమైన ప్రపంచాన్ని ► మర్చిపోవాలనుకునే విషయం– ఈ ప్రపం చాన్ని మనం ఎలా నాశనం చేసుకుంటున్నామో అన్న విషయాన్ని ► నేను సినిమాల్లో కోరుకునేది– మంచి స్క్రీన్‌ప్లే ► నాకు ఆసక్తి కలిగించే అంశం– మంచి స్క్రీన్‌ప్లే ► నాకున్న అతిపెద్ద ఆస్తి– నా కుటుంబం ► నా సెక్స్ అప్పీల్‌కు గల కారణం– జన్యువులే ► నాకు ఇష్టమైనవి– పాంపియన్ కుక్కపిల్లలు, పైనాపిల్ ఐస్‌క్రీం, సినిమా ప్యాకప్ సమయం ► తెలుసుకోవాలనుకునేది– చనిపోయిన తర్వాత అక్కడా మేకప్ రూమ్స్ ఉంటాయా అని. ► నా భయం, బాధ – చనిపోయాక మరో జీవితం అంటూ ఉండదేమోనని ► నా అధీనంలో ఉన్నవాటిలో ఇష్టమైనవి– నా భావోద్వేగాలు ► నా జీవితంలో మర్చిపోలేని అనుభవం– ఛాల్‌బాజ్ సినిమాకు ఫిలింఫేర్ అవార్డు అందుకోవడం ► నా బలం– జీవితంలో జరగబోయేవాటిని ముందుగానే పసిగట్టగలగడం ► నేను అలసిపోయేలా చేసేవి– రీటేక్‌లు, రీమేక్‌లు ► ఎక్కువగా ఆనందపడేది– నా రీమేక్ సినిమా సూపర్‌హిట్ అయినప్పుడు ► నా పుట్టినరోజు– మృత్యువుకు మరో రోజు దగ్గరవ్వడం. గురుగ్రామ్‌లో శ్రీదేవికి నివాళులర్పిస్తున్న నాటకరంగ కళాకారులు -
జాన్వీ తన కాళ్ల మీద తను నిలబడాలి
ఇటీవల ‘సాక్షి’కి శ్రీదేవి ఇచ్చిన ఇంటర్వ్యూలోని కొన్ని విశేషాలు ► నాలుగేళ్ల క్రితం ‘ఇంగ్లీష్ వింగ్లీష్’ సినిమా ప్రమోషన్ కోసం హైదరాబాద్ వచ్చినప్పుడు ఎలా ఉన్నారో ఇప్పుడూ అలానే ఉన్నారు. వయసు పెరుగుతున్నట్టే అనిపించడం లేదు! (నవ్వుతూ...) ఏం చెప్పమంటారు? ఎవరైనా నా గురించి ఇలా చెబుతున్నప్పుడు సంతోషంగా ఉంటుంది. హెల్దీ లైఫ్, హెల్దీ థింకింగ్, బీయింగ్ హ్యాపీ... ఈ మూడూ చాలు! మనం ఎప్పుడూ సంతోషంగా ఉంటే అది ముఖంలో కనిపిస్తుంటుంది. ► ‘మామ్’ తల్లీకూతుళ్ల రిలేషన్ మీద సినిమా కాబట్టి, ఈ సినిమా చేస్తున్నప్పుడు మీ అమ్మగారు గుర్తొచ్చారా? లేదండీ! ‘మామ్’ చేసినప్పుడు మా అమ్మగారు గానీ, నా పిల్లలు గానీ గుర్తు రాలేదు. దేవకి (సినిమాలో శ్రీదేవి పాత్ర పేరు) మనసులో ఎంత బాధ ఉంది? పిల్లల కోసం ఏం చేస్తుంది? ఎంత దూరం వెళ్తుంది? అనేవి నా మనసులో ఉన్నాయి. దేవకి పాత్రలో ఉన్నంతసేపూ నా ఫ్యామిలీ మెంబర్స్ గుర్తు రాలేదు. ► మీ చిన్నప్పటి నుంచి స్టార్ హీరోయిన్గా ఎదిగే వరకూ.. మీ అమ్మగారు మిమ్మల్ని గైడ్ చేశారు.. ఆమె గురించి కొన్ని మాటలు... తప్పకుండా! ఈ రోజు నేను ఏమాత్రం కొంచెం ఎఛీవ్ చేశానన్నా... ఆ క్రెడిట్ మా అమ్మకే ఇవ్వాలి. అమ్మ నన్ను కూర్చోబెట్టి ఏం నేర్పలేదు. కానీ, ఆమె నుంచి జీవితం అంటే ఏంటనేది నేర్చుకున్నాను. లైఫ్‌లో ఏం చేసినా వంద శాతం కష్టపడాలి. ఊరికే చేయాలని చేయకూడదు. హార్డ్ వర్కింగ్. బీయింగ్ పంక్చువల్ – ఈ లక్షణాలన్నీ అమ్మ దగ్గర్నుంచి నేర్చుకున్నా. ‘కష్టే ఫలి. నో పెయిన్–నో గెయిన్’ – ఇలాంటివి నాకు నేర్పించింది. అమ్మ దగ్గర నేను నేర్చుకున్న దాంట్లో ఒక యాభై శాతం నేను నా పిల్లలకు ఇవ్వగలిగితే చాలు. అదే పెద్ద ఎచీవ్మెంట్ అనుకుంటా. ► నేను కొంచెమే ఎచీవ్ చేశాననడం మీ గొప్పతనం. 50 ఏళ్ల కెరీర్... 300 సినిమాలంటే జోక్ కాదు. మీరు చాలా ఎచీవ్ చేశారు. ఎప్పుడూ అలసిపోలేదా? ఇప్పుడీ ‘మామ్’ నా ఫస్ట్ ఫిల్మ్‌లా ఉంది (నవ్వులు). ఇప్పటికీ కొత్తగా చిత్రసీమలో అడుగు పెట్టినట్టు ఫీలవుతున్నా! మీరు చెబుతుంటే ‘300 సినిమాలు చేశానా?’ అనిపిస్తోంది. అదర్ వైజ్... ఐ ఫీల్ లైక్ థిస్ ఈజ్ మై ఫస్ట్ ఫిల్మ్. ► మీరెలాంటి మదర్? స్ట్రిక్టా, ఫ్రెండ్లీయా? ఫుల్ ఫ్రెండ్లీ. యాక్చువల్‌గా ఎప్పుడూ స్ట్రిక్ట్‌గా ఉండాల్సిన పరిస్థితి నా పిల్లలు తీసుకు రాలేదు. చాలా తక్కువ సార్లు స్ట్రిక్ట్‌గా ఉంటాను. ► ‘మామ్’ ట్రైలర్లో ‘వచ్చాను రా దానమ్మను’ అనే డైలాగ్ చెప్పే టైమ్‌లో మీ కళ్లలో ఆగ్రహం కనిపించింది. మీ పిల్లల గురించి రాకూడని వార్తలు వచ్చినప్పుడు ఓ మదర్‌గా మీరెలా ఫీలవుతారు? అమ్మ ఎక్కడైనా అమ్మే కదా. ఐయామ్ వెరీ ప్రొటెక్టివ్ అబౌట్ మై చిల్డ్రన్. మా అమ్మాయి ఓ పార్టీకి వెళ్లొచ్చి, నాకు ఫొటోలు చూపించింది. ‘ఇంగ్లీష్ వింగ్లీష్’ చిత్రదర్శకురాలు గౌరీ షిండేతో ఆ ఫొటోలు దిగింది. గౌరీ కూడా నాకు ఫోన్ చేసి ‘పాపతో పార్టీలో మాట్లాడాను. తనతో చాలా టైమ్ స్పెండ్ చేశా’ అని చెప్పింది. తర్వాత రోజు పేపర్లో మా పాప ఎవరో హీరో వెనకాల, అతను ఎక్కడికి వెళితే అక్కడే తిరుగుతుందని రాశారు. పాప చాలా అప్సెట్ అయ్యింది. కానీ, నా పాప గురించి నాకు తెలుసు. నేను అలాంటి వార్తలు చూసి నవ్వుకుంటా. కానీ, కొన్ని వార్తలు మాత్రం నిజంగా బాధకు గురిచేస్తాయి. అలాంటి వార్తలు రాసేవాళ్లు ‘వాళ్ల ఫ్యామిలీ ఎఫెక్ట్ అవుతుంది. తల్లి మనసు ఎంత బాధపడుతుంది’ అనేది అర్థం చేసుకోవాలి. ► ‘మామ్’ ట్రైలర్ చూసి, మీ పిల్లలేమన్నారు? వాళ్లు సినిమా కూడా చూశారు. జాన్వీ అయితే నన్ను గట్టిగా కౌగలించుకుంది. తను అలా చేయడం అదే మొదటిసారి. మా పిల్లలకు సినిమా బాగా నచ్చింది. ► జాన్వీ ఎవరితోనో లవ్‌లో ఉందని, మీరు పెళ్లికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారని ఇంకో న్యూస్ వచ్చింది... ఇక వాటన్నిటి గురించి మాట్లాడడం వేస్ట్. ముంబయ్‌లో ఇటీవల ఓ పత్రికలో ‘మా పాపకు పెళ్లి చేయాలి’ అని నేను చెప్పినట్టు రాశారు. ప్రతి అమ్మ తన కూతురికి పెళ్లి చేయాలనుకుంటుంది కదా! నేనూ అదే చెప్పా. కానీ, అంతకు ముందు ‘జాన్వీ ఇండిపెండెంట్‌గా ఎదగాలి. తన కాళ్లపై తను నిలబడాలి. ఊరికే పెళ్లి చేసి కుక్కేయడం కాదు. తనకూ ఓ కెరీర్ ఉండాలి’ అని చెప్పా. అదంతా వదిలేసి ‘శ్రీదేవి తన కూతురికి పెళ్లి చేయాలనుకుంటుంది’ అని రాశారు. దాన్నే హెడ్లైన్ చేశారు. ► ఇంట్లో ఆల్రెడీ ఓ సక్సెస్ఫుల్ స్టార్ ఉన్నారు కాబట్టి, జాన్వీని మీతో కంపేర్ చేస్తారు. మీరేమంటారు? జాన్వీ ఎంత పెద్ద స్టార్ అవుతుందనేది మన చేతుల్లో లేదు. తన టాలెంట్, హార్డ్‌వర్క్ బట్టి పైకొస్తుంది. తనింకా ఒక్క అడుగు కూడా వేయలేదు. నాతో తనను కంపేర్ చేయడమనేది చాలా రాంగ్. ఎందుకంటే... నేను చైల్డ్ ఆర్టిస్ట్‌గా ఇండస్ట్రీకి వచ్చాను. హీరోయిన్గా పరిచయమయ్యే టైమ్‌కి చైల్డ్ స్టార్‌గా సుమారు 50 సినిమాలు చేశా. హీరోయిన్గా ఫస్ట్ సినిమా చేసే టైమ్‌కి షూటింగ్ ఎలా ఉంటుంది? కెమెరా... వంటివన్నీ తెలుసు. మా పాపకు మాత్రం ‘ఇట్స్ జస్ట్ ఎ ఫస్ట్ ఫిల్మ్’ అన్నమాట. సో, తననూ, నన్నూ కంపేర్ చేయడమనేది న్యాయం కాదు. తనని ఇండివిడ్యువల్‌గా చూస్తే బాగుంటుంది. ► మీ పిల్లలిద్దరూ చాలా అందంగా ఉన్నారు. చిన్నమ్మాయి మీకంటే హైట్ అనుకుంటా! అవునండీ. జాన్వీ కంటే... నాకంటే చిన్న పాప ఖుషీ ఇంకా హైట్! ► ఈ వయసులోనూ మీరింత స్లిమ్‌గా ఉన్నారు. మీ పిల్లలకు మీరేమైనా టిప్స్ ఇస్తారా? నేనా? అయ్యో... లేదండీ! వాళ్లే నాకు టిప్స్ ఇస్తున్నారు. నేనెప్పుడైనా కొంచెం ఎక్కువ తింటే... ‘మమ్మా! ప్లీజ్ ఆపు’ అంటారు. ఇప్పుడు నాకంటే వాళ్లే ఎక్కువ కేర్ తీసుకుంటున్నారు. ► తెలుగు నుంచి మీ పెద్దమ్మాయికి చాలా ఆఫర్స్ వస్తున్నాయి కదా? ఏయే ఆఫర్స్ వచ్చాయి. ఎవరెవరు మా అమ్మాయిని నటించమని అడిగారు? అనేవి చెప్పడం నాకిష్టం లేదు. ఏదైనా దర్శక–నిర్మాతలు అఫిషియల్‌గా ఎనౌన్స్ చేస్తారు. ► మీరు ఓ స్ట్రయిట్ తెలుగు ఫిల్మ్ చేస్తే చూడాలనుంది? నేను తెలుగమ్మాయినే. తెలుగు ఇండస్ట్రీ నాకెంతో ఆప్యాయత, అనురాగం, అభిమానం ఇచ్చింది. నేను ఏనాడూ దాన్ని మర్చిపోను. తెలుగులో చేయాలని నాకూ ఉంది. -
శ్రీదేవి ఇబ్బందుల్లో ఉందని విన్నాం
శ్రీదేవి చిన్నప్పుడు ఇష్టపడి ఏం తినేది? శ్రీదేవి తల్లి రాజేశ్వరి కూతురు సన్నగా ఉండటం కోసం కడుపు మాడ్చిందా? చెల్లెలు శ్రీలత, శ్రీదేవికి మధ్య విభేదాలు ఏంటి? ఎన్నిసార్లు ముక్కుకి సర్జరీ చేయించుకుంది? స్టార్ అయ్యాక బంధువులను చూసిందా? పెళ్లయ్యాక శ్రీదేవి బంధువులను దూరం పెట్టిందా? సవతి కొడుకు అర్జున్ కపూర్.. శ్రీదేవిని ఒత్తిడికి గురి చేసేవాడా? ... అతిలోక సుందరి శ్రీదేవి మరణం తర్వాత రేకెత్తిన ప్రశ్నలివి. గుండెపోటుతో ఆకస్మిక మరణం అనే వార్త నుంచి ‘డెత్ మిస్టరీ’ అనే టాక్ మొదలైంది. ఆమె మరణం పట్ల బంధువులకు ఏమైనా అనుమానాలున్నాయా? శ్రీదేవి బాబాయ్ ఎం. వేణుగోపాల్‌తో ‘సాక్షి’ ఎక్స్‌క్లూజివ్ ఇంటర్వ్యూ. ► శ్రీదేవిగారికి మీరు బాబాయ్ అవుతారు కదా.. ఆ బంధుత్వం గురించి వివరంగా చెబుతారా? శ్రీదేవి అమ్మ రాజేశ్వరమ్మ మా అమ్మకు అన్న కూతురు. నాకు వదిన అవుతుంది. శ్రీదేవి వాళ్ల పిన్నమ్మ అనసూయమ్మను మా అన్న (పెదనాన్న కొడుకు)కు చేసుకున్నాం. రాజేశ్వరమ్మ తమ్ముడికి మా చెల్లెల్ని ఇచ్చి పెళ్లి చేశాం. రాజేశ్వరమ్మ సినిమాల్లో సైడ్ క్యారెక్టర్స్ చేసేవారు. అప్పుడే శివకాశీలో అయ్యప్పన్‌ని పెళ్లి చేసుకున్నారు. రాజేశ్వరమ్మ పెళ్లికి మేం బంధువలమంతా వెళ్లాం. ► తిరుపతిలో మీ ఇంటి పక్కనే రాజేశ్వరమ్మ ఉండేవారా? అందరి ఇళ్లు దగ్గర దగ్గరే ఉండేవి. శ్రీదేవి వాళ్ల ఇంటికి ఒక నాలుగు ఇళ్లు అవతల శ్రీదేవి వాళ్ల పిన్ని (అనసూయమ్మ) ఇల్లు ఉండేది. చిన్నప్పుడు అందరి ఇళ్లల్లో శ్రీదేవి ఆడుకునేది. ► శ్రీదేవి అసలు పేరు ‘శ్రీ అమ్మయ్యంగార్ అయ్యప్పన్’ కదా. మరి శ్రీదేవిగా ఎవరు మార్చారు? వాళ్ల నాన్నగారు తమిళియన్. కాబట్టి అమ్మయ్యంగార్ అని ఏదో పేరు పెట్టారు. మేం మాత్రం ఆ పేరుతో ఎప్పుడూ పిలిచింది లేదు. బంధువులమంతా తనని ‘పప్పీ’ అని పిలిచేవాళ్లం. పప్పీ సినిమాల్లోకి వెళ్లాక తన అమ్మానాన్న ఇద్దరూ కలసి ‘శ్రీదేవి’ అని పెట్టారు. ► శ్రీదేవిగారు యాక్ట్ చేసిన సినిమా షూటింగ్స్‌కు మీరు వెళ్లేవారా? ‘గోవిందా గోవిందా’ షూటింగ్ తిరుపతిలో జరిగినప్పుడు మేం వెళ్లాం. అప్పుడు శ్రీదేవి గెస్ట్ హౌస్‌లో ఉండేది. మేమంతా గెస్ట్‌హౌస్‌కు వెళ్లి రాత్రి వరకు మాట్లాడి వచ్చేవాళ్లం. ఆ సినిమా తప్ప వేరే ఏ సినిమా షూటింగ్‌కూ వెళ్లలేదు. ► స్టార్ అయ్యాక శ్రీదేవి బంధువుల ఇంటికి వచ్చేవారా? ప్రతి సంవత్సరం ఆగస్ట్ 13 తన పుట్టినరోజుకు తిరుపతి వస్తుంది. అప్పుడు బంధువులందర్నీ పిలుస్తుంది. అందరం కలిసి దర్శనానికి వెళ్తాం. ఆ రోజు తిరుపతిలోనే స్టే చేస్తుంది. వీలుంటే ఇంటికి వస్తుంది. ఏదైనా సెక్యూరిటీ ప్రాబ్లమ్ అయితే హోటల్లో ఉంటుంది. అయితే అంతకు ముందు ఇంటికి వస్తుండేది. క్రమంగా పెద్ద యాక్టర్ అయ్యే కొద్దీ ఇంటికి వస్తే.. జనం బాగా వస్తున్నారని హోటల్లో ఉండేది. మేమే తనని కలవటానికి వెళ్లేవాళ్లం. ఆ రోజంతా అక్కడే ఉండేవాళ్లం. ► శ్రీదేవి పెద్ద స్టార్ కాబట్టి బంధువులను పట్టించుకునేవారు కాదేమో అనే సందేహం చాలామందికి ఉంది.. ఒక వ్యక్తి గురించి బయటవాళ్ల కంటే వాళ్ల బంధువులకే ఎక్కువ తెలుస్తుంది. నా కొడుకు (ఉమేశ్)ని బాగా చూసేది. బాగా ముద్దు చేసేది. మద్రాస్ వెళ్లే వరకు వాణ్ణి బాగా చూసుకునేది. వెళ్లిన తర్వాత కూడా ఉమేశ్ మద్రాసు వెళుతుండేవాడు. ఇప్పుడు మా ఉమేశ్ అమెరికాలో ఉన్నాడు. తనకు కూడా శ్రీదేవి అంటే చాలా ఇష్టం. మేం ఇల్లు కట్టుకుంటుంటే సాయం చేసింది. మార్బుల్స్ అవీ పంపించింది. మావాళ్లు ఎవరు ఎప్పుడు వెళ్లినా అంతో ఇంతో సాయం కచ్చితంగా చేస్తుండేది. ► శ్రీదేవిగారి తల్లిదండ్రుల మధ్య మనస్పర్థలు ఉండేవని, శ్రీదేవిగారు స్టార్‌గా ఎదగడానికి ఆమె తల్లి మాత్రమే కారణమని ఇప్పుడు వార్తలు వినిపిస్తున్నాయి. నిజమా? ఆ మాటలు నిజం కాదు. రాజేశ్వరమ్మ, అయ్యప్పన్ బాగుండేవాళ్లు. శ్రీదేవిని షూటింగ్స్‌కి తీసుకెళ్లేవారాయన. భార్య, కూతురిని బాగా చూసుకునేవారు. ► తండ్రి చనిపోయినప్పుడు శ్రీదేవిగారు షూటింగ్లో ఉండి రాలేదని ఇప్పుడు అనుకుంటున్నారు. మాకు ఆవిడ హాజరైనట్లుగానే తెలుసు.. అప్పుడు శ్రీదేవి హిందీ సినిమా ‘లమ్హే’ షూటింగ్లో ఉంది. తండ్రిని చివరిసారిగా చూడ్డానికి మద్రాసు వచ్చింది. దాదాపు పదీ పదిహేను రోజులు షూటింగ్స్‌కి వెళ్లలేదు. ► శ్రీదేవిగారి పెళ్లికి వెళ్లారా ? చెన్నైలో పెళ్లి రిసెప్షన్ ఏర్పాటు చేశారు. అప్పుడు అందరం వెళ్లాం. ► బోనీ కపూర్గారితో శ్రీదేవిగారి పెళ్లయ్యాక మీకు రాకపోకలు ఉండేవా? పెళ్లి అవ్వకముందు వరకు బాగానే కలిసేది. పెళ్లయి బాంబేకు వెళ్లిపోయాక కొంచెం రాకపోకలు తగ్గిపోయాయి. మేము వెళ్లడం తగ్గిపోయింది. మేం బాంబే వెళ్లినప్పుడు తను ఉండకపోవచ్చు. బిజీగా ఉండేది. ఏమైనా గానీ ఆగస్ట్ 13న తిరుమల వస్తుంది. అప్పుడు తప్పనిసరిగా అందరి బంధువులను కలిసేది. లాస్ట్ ఇయర్ కూడా మా వాళ్లందరూ వెళ్లారు. ► శ్రీదేవిగారి కుమార్తెలు బంధువులందరికీ పరిచయమేనా? కూతుళ్లకు మా బాబాయ్, పిన్ని అంటూ మమ్మల్నందర్నీ పరిచయం చేసింది. ముఖ పరిచయం అంతే. వాళ్లకు మన భాష రాదు కదా. అంతా హిందీ, ఇంగ్లీష్. అందుకే పిల్లలు, మేం మాట్లాడుకునేవాళ్లం కాదు. ► బోనీ కపూర్‌గారు ఎలా ఉంటారు మీతో? ఆయన బాగానే మాట్లాడతారు. కొంచెం భాష ప్రాబ్లమ్ అంతే. కానీ చాలా బాగా మర్యాద ఇచ్చేవాడు. మమ్మల్ని చూడగానే నమస్కారం పెడతాడు. ► మీ ముందు పెరిగిన అమ్మాయి ‘ఆల్ ఇండియా స్టార్ అవుతుంది’ అని ఊహించారా? అనుకోలేదు. మా రంగంపేటలో ఉన్నప్పుడు చిన్న పాపగా ఉండేది. నాలుగేళ్ల వయసులోనే సినిమాలు చేయడం మొదలుపెట్టింది కదా. అప్పుడు మద్రాసు వెళ్లిపోయారు. శ్రీదేవి నటిగా ఎంత పెద్ద రేంజ్‌కి వెళుతుందని ఊహించడానికి మేం తన షూటింగ్స్‌కి వెళ్లలేదు కదా. అయితే మన బిడ్డ అంత పెద్ద పొజిషన్‌కి వెళ్లిందంటే మాకు సంతోషం. శ్రీదేవి బంధువులం అని చెప్పుకోవటం మాకు గొప్ప. ► చిన్నారి శ్రీదేవి ఇష్టపడి ఏం తినేది? చికెన్, మటన్ బాగా తినేది. నాన్ వెజ్ అంటే బాగా ఇష్టపడేది. ► కానీ శ్రీదేవి తల్లి ఆమెను సరిగ్గా తిననిచ్చేవారు కాదట.. నిజమేనా? సిటీల్లో దాదాపు అందరూ తక్కువే తింటారు కదా. మాకు తెలిసి కూతుర్ని మరీ అంత కట్టడి చేయలేదు. అయితే ఆపరేషన్లు అవీ చేయించుకున్నాక శ్రీదేవి తిండి బాగా తగ్గించింది. ► ఆపరేషన్లు అంటున్నారు. ఏం ఆపరేషన్లు. ఎన్ని? ముక్కు ఆపరేషన్ చేయించుకుంది కదా. మాకు తెలిసి మూడుసార్లు చేయించుకుంది. అవి చేయించుకున్నాక తిండి తగ్గించింది. ► సర్జరీలు వద్దు అని చెప్పే అవకాశం మీకు ఉండేది కాదేమో? రాజేశ్వరమ్మ ఉన్నప్పుడు కష్ట సుఖాలు మాట్లాడుకునేవాళ్లం. ఆవిడ పోయాక రాకపోకలు కూడా తగ్గాయి కాబట్టి, సలహాలు ఇచ్చే అవకాశం మాకు లేకుండాపోయింది. ► శ్రీదేవిగారి మరణ వార్త విన్న తర్వాత మీ బంధువులెవరైనా బాంబే వెళ్లారా? మా ఆవిడ, ఇంకొంతమంది బంధువులు వెళ్లారు. ముందు శ్రీదేవి వాళ్ల ఇంటికి వెళ్లారు. కొంతసేపు ఉండి హోటల్లో రూమ్ తీసుకుని ఉంటున్నారు. ► శ్రీదేవిగారి మరణం పట్ల చాలామందికి అనుమానాలున్నాయి. మీకేమైనా అనుమానం? అక్కడ ఏం జరిగిందో మాక్కూడా తెలియదు. అందరిలాగా టీవీల్లో చూడటమే. ► ఎప్పుడైనా శ్రీదేవిగారు బాధపడుతున్నట్లు అనిపించిందా? మీతో ఏమైనా చెప్పుకున్నారా? మా దగ్గరేం చెప్పలేదు కానీ, బోనీ కపూర్‌గారి పెద్ద భార్య కొడుకు (అర్జున్ కపూర్) కొంచెం ఇబ్బంది పెడతాడని బంధువులతో ఓసారి చెప్పి, బాధపడిందని విన్నాం. ► అంటే.. పైకి నవ్వుతూ కనిపించిన శ్రీదేవిగారి మనసులో బాధ ఉందంటారా? ఉండేదేమో అనిపిస్తోంది. ముఖ్యంగా భర్త ఆరోగ్యం విషయంలో చాలా ఆందోళన పడేదట. ఒకసారి ఆయనకు బాగా షుగర్ పెరిగిపోతే ఏమైపోతాడో.. పిల్లలు, తనూ ఏమైపోతామేమోనని చాలా బాధపడిందట. అలా అని మా బంధువులు చెబితే తెలిసింది. ► శ్రీదేవిగారు సున్నిత మనస్కురాలని చాలామంది అన్నారు.. మీరేమంటారు? మంచి అమ్మాయి. ఎవరితోనూ గొడవలున్నట్లు మాకు తెలియదు. ► మరి.. చెల్లెలు శ్రీలతకూ, శ్రీదేవిగారికీ మధ్య ఆస్తి గొడవలు వచ్చాయి కదా. అసలప్పుడు ఏం జరిగింది? అవి ఆస్తి గొడవలు కాదు. రాజేశ్వరమ్మ ఆరోగ్యం పాడైపోయినప్పుడు ఆపరేషన్ జరిగింది కదా. అప్పుడు ఒకచోట చేయాల్సిన ఆపరేషన్ని మరోచోట చేశారు. దాంతో ఆవిడ చనిపోయింది. ఆ తర్వాత ఆ హాస్పటల్‌పై కేస్ పెట్టారు. హాస్పటల్ డబ్బు విషయంలో అక్కచెల్లెళ్లిద్దరికీ ఏవో మనస్పర్థలు వచ్చాయి. అంతకు మించి ఏమీ లేదు. ► ఆ తర్వాత ఇద్దరూ మామూలుగానే ఉండేవారా? బాగానే ఉండేవారు. మొన్న బోనీ కపూర్‌గారి బంధువు పెళ్లికి శ్రీలత కూడా దుబాయ్ వెళ్లింది. ఆ ఫంక్షన్ అయ్యాక శ్రీలత వచ్చేసింది. అక్క చనిపోయిందని తెలిసి బాంబే వెళ్లింది. ► శ్రీదేవిగారు చాలా త్వరగా చనిపోయారు. మీ కళ్ల ముందు పెరిగిన పిల్ల ఇలా ఆకస్మిక మరణం పొందడం బాధగా ఉండి ఉంటుంది.. మేమంతా చాలా బాధపడ్డాం. చనిపోదగ్గ వయసు కాదు. ఎంతో పేరు సంపాదించుకుంది. ఇప్పుడు పిల్లలు ఎదుగుతున్నారు. కూతురి సినిమాని కళ్లారా చూసుకోలేకపోయింది. అందరూ ఆరాధించే శ్రీదేవి మా కుటుంబానికి చెందిన అమ్మాయి కావడం మాకు గర్వకారణం. తన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నాం. ‘‘బంధువులను చూడ్డానికి వచ్చినప్పుడు శ్రీదేవిగారు గిఫ్ట్స్ అవీ తెచ్చేవారా? తెచ్చేది. అలాంటి విషయాల్లో వెనకాడేది కాదు. దేవుడి దయ వల్ల మేం బాగానే ఉన్నాం. ఆర్థిక ఇబ్బందులు ఏవీ లేవు. మా కుటుంబానికి చెందిన అమ్మాయి ఇలా దేశం కాని దేశంలో హఠాత్తుగా చనిపోవడం మా అందరికీ ఎప్పటికీ తీరని బాధ మిగిల్చింది. – డి.జి. భవాని -
ఆ నలుగురు జడ్జీలు చెప్పినా నమ్మరా?
న్యూఢిల్లీ : సీబీఐ జడ్జి బీహెచ్ లోయా మరణించిన రోజున అతనితో ఉన్న నలుగురు న్యాయమూర్తులు.. అది సహజ మరణమేనని చెప్పారని, వారి వాంగ్మూలాల్ని సందేహించాల్సిన అవసరం లేదని సుప్రీంకోర్టుకు మహారాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. లోయా కేసులో మహారాష్ట్ర తరఫున సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గీ వాదిస్తూ.. ‘లోయాది సహజ మరణమేనంటూ నలుగురు జడ్జీలు(కులకర్ణి, బార్దే, మోదక్, ఆర్ఆర్ రతి) ఇచ్చిన వాంగ్మూలాలు నమ్మదగినవి. 2014 నవంబర్ 29 – డిసెంబర్ 1 మధ్య వారు లోయాతోనే ఉన్నారు. వాంగ్మూలాలపై ఆ నలుగురి సంతకాలు ఉన్నాయి. అలాంటప్పుడు అవి నమ్మదగినవి కావా?’ అని రోహత్గీ ప్రశ్నించారు. ఒకవేళ ఆ వాంగ్మూలాల్ని మీరు(కోర్టు) తిరస్కరించాలనుకుంటే.. వారిని సహకుట్రదారులుగా ప్రాథమికంగా అంగీకరిస్తున్నట్లేనని అన్నారు. -
రెండేళ్ల పోరాటం.. దిగొచ్చిన ప్రభుత్వం!
అది ఉద్యోగమైనా.. ఉన్నత పదవులైనా.. చివరకు న్యాయం కోసం చేసే పోరాటమైనా.. ఎదుటివారు దిగిరావాల్సిందే. మనది ప్రజాస్వామ్యమే అయినప్పటికీ న్యాయం కోసం అడుగడుగునా పోరాటాలు దేశంలో సాధారణమే. అందుకే ఇలాంటి పోరాటాలను ప్రభుత్వాలు కూడా పెద్దగా పట్టించుకోవడంలేదు. ఓ యువకుడి విషయంలో కూడా ప్రభుత్వం తన పాతవైఖరినే ప్రదర్శించింది. అయితే ఆ యువకుడు మాత్రం పట్టుదలగా పోరాడాడు. రోజులు.. వారాలు.. నెలలు కాదు, ఏకంగా రెండేళ్లపాటు పోరాటాన్ని కొనసాగించాడు. దీంతో ఎట్టకేలకు ప్రభుత్వమే దిగొచ్చింది. వివరాల్లోకెళ్తే... సాక్షి, స్కూల్ ఎడిషన్ అన్యాయంపై చేసే పోరాటానికి అలుపు ఉండకూడదనేది మొదటి లక్షణంగా చెబుతారు. అందుకే కేరళకు చెందిన శ్రీజిత్.. తన కుటుంబానికి జరిగిన అన్యాయానికి వ్యతిరేకంగా రాష్ట్ర సచివాలయం ముందు పోరాటాన్ని ప్రారంభించాడు. ఓ దోపిడీ కేసులో నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న శ్రీజిత్ సోదరుడు శ్రీజీవ్‌ను 2014, మేలో పోలీసులు అరెస్ట్ చేశారు. ఆ తర్వాత కొన్ని రోజులకే అతను పోలీస్ కస్టడీలో మరణించాడు. శ్రీజీవ్ ఆత్మహత్య చేసుకున్నాడని పోలీసులు వాదించారు. కానీ శ్రీజిత్ మాత్రం అంగీకరించలేదు. తన సోదరుడిని పోలీసులే చంపారని, దీనికి బాధ్యులైన ఇద్దరు పోలీసులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశాడు. ఇదే డిమాండ్‌తో తిరువనంతపురంలోని సెక్రటేరియట్ దగ్గరికి వెళ్లడం, రోజంతా అక్కడ కూర్చోవడం.. న్యాయం చేయాలని డిమాండ్ చేయడం.. అలా 765 రోజులపాటు పోరాడి, చివరకు అనుకున్నది సాధించాడు. ఈ నెల 14న సీఎం పినరయి విజయన్ శ్రీజిత్‌ను కలిసి మరోసారి సీబీఐకి లేఖరాస్తానని హామీ ఇచ్చారు. దీంతో అతను తన నిరసనను విరమించుకున్నాడు. -
జస్టిస్ లోయా మృతిపై కుమారుడు ఏమన్నాడంటే..
సాక్షి, న్యూఢిల్లీ : తమ తండ్రి మృతిపై ఎలాంటి అనుమానాలు లేవని దివంగత సీబీఐ న్యాయమూర్తి జస్టిస్ బీహెచ్ లోయా కుమారుడు అనుజ్ లోయా చెప్పారు. ఈ విషయంలో తమ కుటుంబాన్ని వేధించవద్దని మీడియాకు, ఎన్జీవోలకు విజ్ఞప్తి చేశారు. కొద్ది రోజులుగా తమ కుటుంబం బాధాకరమైన ఘటనలను ఎదుర్కొందని అన్నారు. బీజేపీ చీఫ్ అమిత్ షా నిందితుడిగా ఉన్న సొహ్రబుద్దీన్ బూటకపు ఎన్కౌంటర్ కేసును విచారిస్తున్న జస్టిస్ లోయ 2014 డిసెంబర్లో మరణించారు. ఈ కేసు నుంచి అమిత్ షాను ఆ తర్వాత కోర్టు నిర్ధోషిగా నిర్ధారించింది. అయితే జస్టిస్ లోయా అనుమానాస్పద పరిస్థితిల్లో మరణించారంటూ దీనిపై స్వతంత్ర విచారణ చేపట్టాలని పలువురు న్యాయవాదులు, సామాజిక కార్యకర్తలు డిమాండ్ చేశారు. ఈ అంశం తీవ్రతను గమనించిన సుప్రీం కోర్టు దీనిపై సంబంధిత పత్రాలను సమర్పించాలని, సోమవారం ఈ అంశాన్ని చేపడతామని పేర్కొంది. అయితే ఈ కేసు ఇప్పటికే బాంబే హైకోర్టు వద్ద పెండింగ్‌లో ఉందని,దీన్ని సుప్రీం కోర్టు విచారించరాదని ప్రముఖ న్యాయవాది దుష్యంత్ దవే బాంబే లాయర్స్ అసోసియేషన్ తరపున సుప్రీం కోర్టును కోరారు. -
యాంకర్ అనుమానాస్పద మృతి
ముంబై: యాంకర్ అర్పితా తివారి(24) అనుమానాస్పద మృతిపై మిస్టరీ వీడలేదు. ఆమెను హత్య చేసివుండొచ్చ అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పోస్టుమార్టం నివేదిక ఈ అనుమానాలకు బలం చేకూరుస్తోంది. గాయాల కారణంగా ఆమె చనిపోయినట్టు పోస్టుమార్టం నివేదిక వెల్లడించింది. అయితే ఆమెపై లైంగిక దాడి జరగలేదని తెలిపింది. ఊపిరి ఆడకుండా చేయడం లేదా గొంతు నులిమిన ఆనవాళ్లు కూడా లేవని వివరించింది. అర్పితను హత్య చేసివుంటారన్న అనుమానాలను కొట్టిపారేయలేమని పోలీసులు అన్నారు. క్రైమ్ సీన్‌ను రీక్రియేట్ చేసినప్పటికీ పోలీసులు ఎటువంటి ఆధారం లభించలేదు. ముంబైలోని మాల్వావ్ ప్రాంతంలోని ఒక భవనంపై ఆమె మృతదేహాన్ని సోమవారం కనుగొన్నారు. అపార్ట్మెంట్ 15వ అంతస్తు నుంచి దూకడంతో ఆమె చనిపోయింది. ఆమె ఆత్మహత్య చేసుకుందని మొదట భావించారు. అయితే అక్కడ ఎటువంటి సూసైడ్ లభించకపోవడంతో అనుమానాలు వచ్చాయి. పంకజ్ జాధవ్ అనే యువకుడిని ప్రేమిస్తున్న అర్పిత అతడితో తెగతెంపులు చేసుకోవాలని అనుకున్నట్టు సన్నిహిత వర్గాలు వెల్లడించాయి. పంకజ్ నివసిస్తున్న మానవస్తల్ అపార్ట్‌మెంట్‌కు ఆదివారం రాత్రి అర్పిత వెళ్లింది. రాత్రి భోజనం చేసిన తర్వాత నిద్రపోయారు. పొద్దున 7 గంటలకు లేచిచూస్తే ఆమె కనిపించలేదు. బాత్రూమ్ తలుపు లోపలి నుంచి వేసివుండటం, షవర్ ఆన్‌చేసి ఉండడంతో పంకజ్ మళ్లీ పడుకున్నాడు. ఉదయం 9 గంటలకు కూడా ఆమె జాడ లేకపోవడంతో స్నేహితుల సహాయంతో బాత్రూమ్ తలుపు తెరిచాడు. అక్కడ అర్పిత కనబడలేదు. కిటికీ తలుపు అద్దాలు తీసేసి ఉండటంతో అక్కడి నుంచి ఆమె దూకేసి ఉంటుందని గమనించి వెతకడం మొదలుపెట్టారు. రెండో ఫ్లోర్లో రక్తపు మడుగులో పడివున్న ఆమెను గుర్తించి వెంటనే ఆస్పత్రికి తరలించారు. అప్పటికే ఆమె మరణించినట్టు డాక్టర్లు తేల్చారు. అర్పిత మరణానికి కారణాలు తెలుసుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. ఆమె సెల్‌ఫోన్, సోషల్ మీడియా ఖాతాలను పరిశీలిస్తున్నట్టు పోలీసులు తెలిపారు. -
మిస్టరీని ఛేదిస్తా
♦ అధికారంలోకి వస్తే అమ్మ మృతిపై విచారణ కమిషన్ ♦ బినామీ ప్రభుత్వానికి ఇక చెల్లు ♦ అవినీతి అక్రమాలతో ఉత్పత్తి నిల్ ♦ డీఎంకే కార్యనిర్వాహక అధ్యక్షుడు స్టాలిన్ వెల్లడి సాక్షి ప్రతినిధి, చెన్నై: రాష్ట్ర చరిత్రలో గతంలో ఎన్నడూ లేనివిధంగా బలమైన ప్రధాన ప్రతిపక్ష డీఎంకే నేత స్టాలిన్ సోమవారం సంచలనాత్మక వ్యాఖ్యలు చేశారు. అధికార అన్నాడీఎంకేలో వైరివర్గాల నినాదంగా ఉన్న దివంగత జయలలిత మరణ మిస్టరీ ఛేదించే బాధ్యతను భుజాలకెత్తుకున్నారు. గత ఏడాది సెప్టెంబరు 22వ తేదీ రాత్రి చెన్నై అపోలో ఆస్పత్రిలో అడ్మిటైన జయలలిత ఇక ప్రజా జీవితంలోకి రాకుండానే డిసెంబరు 5వ తేదీన కన్నుమూశారు. జయకోసం ఎదురుచూసిన రాష్ట్ర ప్రజలు ఒక్కసారిగా ఖిన్నులైనారు. 74 రోజులు ఆస్పత్రిలో చికిత్స పొందిన కాలంలో జయ కోలుకుంటున్నట్లుగా ప్రచారం చేయడం, చికిత్స పొందుతున్నట్లు జయ ఫొటోను బయటపెట్టక పోవడం, ఇన్చార్జ్ సీఎం పన్నీర్‌సెల్వం, ఇన్చార్జ్ గవర్నర్ విద్యాసాగర్‌రావులను సైతం జయను చూసేందుకు అనుమతించకపోవడం పలు అనుమానాలకు దారితీసింది. శశికళపై తిరుగుబాటుచేసిన పన్నీర్సెల్వంతోపాటూ పలువురు జయ మరణంలో మర్మం ఉందని ఆరోపించారు. సీబీఐ, న్యాయస్థాన విచారణకు డిమాండ్ చేశారు. అన్నాడీఎంకేతో విలీనం చర్చల ఆరంభ దశలో జయ మరణంపై విచారణకు ఆదేశించాలని పన్నీర్‌సెల్వం తన ప్రధాన డిమాండ్‌గా ఎడపాడి వర్గం ముందు ఉంచారు. అలా అన్నాడీఎంకే వరకే పరిమితమైన జయ మరణ మిస్టరీలో సోమవారం అకస్మాత్తుగా స్టాలిన్ జోక్యం చేసుకున్నారు. అన్నాడీఎంకేలోని కుమ్ములాటలతో విసిగిపోయి ఉన్న ప్రజలు అమ్మను పదేపదే గుర్తు చేసుకుంటున్నారు. అమ్మపై చెరిగిపోని అభిమానాన్ని గుర్తించిన స్టాలిన్ ఆమెను పొగడడం ప్రారంభించారు. స్వయంశక్తి కలిగిన నాయకురాలుగా జయలలిత అధికారంలోకి వస్తే ఆమె మరణం తరువాత నేడు బినామీలు రాజ్యం ఏలుతున్నారని వ్యాఖ్యానించారు. అన్నాడీఎంకేలోని ఎమ్మెల్యేలు రేసు గుర్రాల్లా అమ్ముడుపోయారని ఎద్దేవాచేశారు. అమ్మ మరణం వెనుక దాగి ఉన్న మర్మాన్ని అన్నాడీఎంకే వర్గాలు దాదాపు మరిచిపోతున్న దశలో స్టాలిన్ ప్రస్తావించడం విశేషం. పైగా డీఎంకే అధికారంలోకి వస్తే దివంగత ముఖ్యమంత్రి జయలలిత మృతిపై విచారణ కమిషన్ వేస్తామని చెప్పడం ద్వారా రాబోయే ఎన్నికల్లో ఇదే ప్రధాన అస్త్రంగా మలుచుకుంటున్నారు. వేలూరు జిల్లా రాణిపేటలో సోమవారం జరిగిన పార్టీ సమావేశంలో స్టాలిన్ మాట్లాడుతూ ‘‘రాష్ట్రంలో ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం లేదు. రూ.5 కోట్ల నుంచి రూ.10 కోట్లవరకు చెల్లించి కొనుగోలు చేసిన ఎమ్మెల్యేల మద్దతుతో బినామీ ప్రభుత్వం సాగుతోంది’’ అని వ్యాఖ్యానించారు. రాష్ట్రపతి ఎన్నికలు ముగియగానే అన్నాడీఎంకే ప్రభుత్వం పడిపోవడం, ప్రజాదరణతో డీఎంకే అధికారంలోకి రావడం ఖాయమని ఆయన ధీమా వ్యక్తంచేశారు. జయలలిత మరణం వెనుక కుట్ర దాగి ఉన్నట్లు తేలితే దోషులను కఠినంగా శిక్షిస్తామని ఆయన తెలిపారు. పార్టీలోని కుమ్ములాటలతో పాలన కుంటుబడి పోగా, అవినీతి పెరిగిపోయి, అభివృద్ధి తరిగిపోయిందని విమర్శించడం ద్వారా అధికార పార్టీపై ప్రజల్లో అసహనాన్ని రేకెత్తించే ప్రయత్నం చేయడం గమనార్హం. -
డిగ్రీ విద్యార్థిని అనుమానాస్పద మృతి
-
డిగ్రీ విద్యార్థిని అనుమానాస్పద మృతి
సిద్ధిపేట: డిగ్రీ విద్యార్థిని సంతోషిణి అనుమానాస్పద మృతిపై ఎలాంటి అపోహలకు తావులేదని, నిస్పక్షపాతంగా విచారణ జరుపుతున్నామని సిద్ధిపేట పోలీసు కమిషనర్ శివకుమార్ తెలిపారు. వైద్యబృందం పర్యవేక్షణలో పోస్టుమార్టం నిర్వహించామని చెప్పారు. మృతురాలి ఒంటిపై పైకి కనిపించే గాయాలు లేవని, పోస్టుమార్టం నివేదికతో పాటు ఫోరెన్సిక్ ల్యాబ్ రిపోర్ట్ వస్తేనే అసలు విషయం తెలుస్తుందన్నారు. ఈ కేసులో ఇప్పటికే 16 మందిని విచారించినట్టు వెల్లడించారు. ఎవరికి ఎలాంటి సందేశాలు, సమాచారం ఉన్నా ఏసీపీకి తెలియజేయవచ్చని చెప్పారు. మరోవైపు పోలీసుల విచారణపై తమకు నమ్మకం లేదని సిరిసినగండ్ల గ్రామస్తులు పేర్కొన్నారు. అత్యాచారం చేసి చంపేసారని ఆరోపించారు. సంతోషిణి మృతికి పద్మావతి అనే మహిళ ఆమె కుమారుడు కారణమని అంటున్నారు. వీరిపై నిర్భయ కేసు నమోదు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. -
యాక్సిడెంటా?హత్యా ?
-
జయ మృతిపై అనుమానం.. డాక్టర్ అరెస్టు
చెన్నై: తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత మరణంపై అనుమానాలు వ్యక్తం చేసిన డాక్టర్ రామసీతను శనివారం చెన్నై సైబర్ క్రైం పోలీసులు అరెస్టు చేశారు. జయలలిత మృతిపై అనుమానం వ్యక్తం చేస్తున్న అనేక మంది దీనిపై న్యాయ విచారణ జరపాలని పట్టుబడుతున్నారు. అన్నాడీఎంకేలో విభేదాల నేపథ్యంలో తెరపైకి వచ్చిన రామసీత జయలలిత మేన కోడలు దీప, మాజీ సీఎం పన్నీరుసెల్వంలను వేర్వేరుగా కలిసి తన మద్దతు ప్రకటించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఒక డాక్టర్‌గా జయలలిత మరణంపై తనకు అనేక అనుమానాలు ఉన్నాయని ఆరోపణలు గుప్పించారు. ఇంటి నుంచి అపొలో ఆస్పత్రికి వచ్చే సమయంలో జయలలితకు స్పృహ కూడా లేదని, ఆమె వెంట బంధువులు ఎవ్వరూ రాలేదని పేర్కొన్నారు. జయలలిత చికిత్స పొందిన ప్రత్యేక గది వైపు ఏ ఒక్క డాక్టర్నీ అనుమతించలేదని ఆరోపించారు. జయలలిత జయంతి సందర్భంగా శుక్రవారం మరోమారు ఆమె తీవ్రమైన ఆరోపణలు చేశారు. దీంతో సైబర్ క్రైం పోలీసులు ఆమెపై మూడు రకాల సెక్షన్ల కింద కేసు నమోదు చేసి శనివారం అరెస్టు చేశారు. రామసీత అసలు డాక్టరే కాదని సైబర్‌క్రైం వర్గాలు వాదిస్తుండడం గమనార్హం. -
క్యాబ్‌లో వెళితే బతికుండేదేమో!
పుణె: ఆమె ఎప్పుడూ కంపెనీ క్యాబ్‌లో వెళుతుండేది.. దురదృష్టం కొద్ది ఆరోజు క్యాబ్‌లో కాకుండా వేరే విధంగా వెళదామనుకుంది. పొంచి ఉన్న ప్రమాదం పసిగట్టలేకపోయింది. తాను పని చేస్తున్న కంపెనీ నుంచి బయటకు వచ్చిన కొద్ది సేపటికే భయంతో పరుగులు పెట్టడం ప్రారంభించింది. కానీ హత్యకు కుట్ర చేసిన వ్యక్తి నుంచి బయటపడలేకపోయింది. వేగంగా ఆమెను అందుకొని కత్తితో పొడిచాడు. అప్పటికీ వదిలించుకొని గాయంతోనే పరుగెత్తే ప్రయత్నం చేసినా మరోసారి అందుకొని వరుస కత్తిపోట్లు పొడిచాడు. దీంతో ఆమె కుప్పకూలిపోయింది. ఈ ఘటన పుణెలో మహిళా టెకీపై జరిగిన హత్య తీరు. ఈ సంఘటను స్వయంగా బైక్‌పై వెళుతున్న వ్యక్తి చూశాడు. ఆమెకు సహాయం చేసేందుకు అతడు వేగంగా వెళ్లేలోగానే హంతకుడు కత్తిపోట్లు పొడిచి పరారయ్యాడు. దీంతో ఆమె వద్దకు వెళ్లిన ఆ బైకిస్టు నేరుగా ఆస్పత్రికి తీసుకెళ్లాడు. అప్పటికే ఆమె చనిపోయినట్లు పోలీసులు చెప్పారు. శుక్రవారం సాయంత్రం పుణెలోని క్యాప్‌జెమిని అనే కంపెనీలో సాఫ్ట్వేర్ గా పనిచేస్తున్న కోల్‌కతాకు చెందిన అంతార దాస్ దారుణ హత్యకు గురైన విషయం తెలిసిందే. ఈ సంఘటనకు సంబంధించి పలు వివరాలు తెలిశాయి. హంతకుడు బ్లూ, బ్లాక్ డ్రెస్సులో ఉన్నాడని బైకిస్టు చెప్పాడు. తాను పట్టుకునే లోగానే పారిపోయాడని చెప్పాడు. మరోపక్క, అంతారా తండ్రి దేబానందదాస్ స్పందిస్తూ తన కూతురు హత్య విషయం తెలిసి దిగ్భ్రాంతికి గురైనట్లు తెలిపాడు. గత కొద్ది నెలలుగా తన కూతురుని వెంబడిస్తున్న వ్యక్తే ఈ హత్య చేశాడని, అతడి వివరాలు కూడా పోలీసులకు చెప్పినట్లు తెలిపారు. తన కూతురు బెంగళూరులో శిక్షణ తీసుకునే సమయంలో ఓ యువకుడు వెంటపడ్డాడని, అతడే పుణెకు వెళ్లి ఈ దారుణానికి దిగాడని అన్నారు. అయితే, ఎప్పుడూ క్యాబ్‌లో వెళ్లే ఆమె ఆరోజు ఎందుకు క్యాబ్‌లో వెళ్లలేదనే విషయం తెలిస్తే కొన్ని వివరాలు తెలిసే అవకాశం ఉందని పోలీసులు చెప్పారు. -
మహిళా టెకీ మృతి.. శరీరమంతా గాయాలు
-
మహిళా టెకీ మృతి.. శరీరమంతా గాయాలు
కోల్‌కతా: పుణెలో దారుణం చోటు చేసుకుంది. ఓ సాఫ్ట్వేర్ కంపెనీలో పని చేస్తున్న మహిళ అనుమానాస్పద స్థితిలో చనిపోయింది. ఆమె ఒంటి నిండా తీవ్ర గాయాలయ్యాయి. పుణెలోని దేహు రోడ్డులో ఆమె మృతదేహం పడి ఉంది. ప్రాథమిక సమాచారం ప్రకారం ఆమెను పశ్చిమ బెంగాల్‌లోని 24 పరగణాలు జిల్లాకు చెందిన అంతార దాస్‌గా పోలీసులు గుర్తించారు. మరిన్ని వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. -
శాస్త్రి మరణం మిస్టరీనా..?
1965 భారత్-పాక్ యుద్ధం తర్వాత మన దేశానికి పెద్ద కుదుపు లాల్ బహదూర్ శాస్త్రి మరణం. ‘జై జవాన్.. జై కిసాన్’ నినాదంతో ఆ యుద్ధాన్ని గెలుచుకు వచ్చిన మన ప్రధాని ఆకస్మిక మరణం పౌరులందరినీ కలచివేసింది. దాయాదిపై విజయానందాన్ని పూర్తిగా ఆస్వాదించకముందే ఆయన కన్నుమూయడం భారతీయులను కంటతడి పెట్టించింది. దేశం కాని దేశంలో అత్యంత నాటకీయంగా మరణించడం ఎన్నో అనుమానాలకు తావిచ్చింది. ఆయన మరణానికి సంబంధించి సవాలక్ష ప్రశ్నలు నేటికీ మన మెదళ్లను దొలిచేస్తాయి. కానీ, సమాధానాలే దొరకవు! భారత రెండో ప్రధానిగా ఖ్యాతి గడించిన లాల్ బహదూర్ శాస్త్రి.. ఇండో-పాక్ యుద్ధం తర్వాత యూఎస్‌ఎస్‌ఆర్‌లోని తాష్కెంట్‌కు వెళ్లాల్సివచ్చింది. దాయాదుల మధ్య శాంతి ఒప్పందం కోసం సోవియెట్ దేశంలో ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. 1966 జనవరి 10న ఒప్పందం మీద సంతకాలు కూడా చేశారు. దీంతో అధికారికంగా యుద్ధం ముగిసినట్టైంది. అయితే, దురదృష్టవశాత్తూ ఆ తర్వాతి రోజే తాష్కెంట్‌లోని తన గదిలో శాస్త్రి మరణించారు. గుండెపోటు కారణంగానే ఆయన మరణించారని సోవియెట్ అధికారులు స్పష్టం చేశారు. కానీ, ఇందులో నిజమెంత..? అప్పటినుంచే బోలెడన్ని అనుమానాలు పుట్టుకొచ్చాయి. దీనికి తోడు ఏ విషయంలోనూ స్పష్టతనివ్వని మన ప్రభుత్వం వాటిని మరింత పెంచింది. లాల్ బహదూర్ శాస్త్రి మరణానికి సంబంధించి రాజ్‌నారాయణ్ విచారణ కమిటీ ఎలాంటి ముగింపునూ ఇవ్వలేదు. అంతేకాదు, ఈ విచారణ కమిటీ గురించి ఒక్క పత్రమూ మన పార్లమెంటు లైబ్రరీలో దొరకలేదు. దీంతో నిజంగానే కమిటీ ప్రభుత్వానికి నివేదిక అందించలేదా? లేక, వాటిని ఎవరైనా దాచిపెట్టడమో, ధ్వంసం చేయడమో చేశారా అన్నది చాలామంది వ్యక్తపరిచే మొదటి సందేహం! మరణించిన వ్యక్తులకు పోస్టుమార్టం చేయడం అనేది ఆనవాయితీ. కానీ, శాస్త్రి మృతదేహానికి పోస్టుమార్టం చేయలేదని కేంద్రం స్పష్టం చేసింది. సోవియెట్ యూనియన్‌లో పోస్టుమార్టం జరపకుండానే మనదేశానికి తీసుకొచ్చారు. అయితే, శాస్త్రి భార్య లలిత వాదన మరోలా ఉంది. ఆయన మృతదేహం నీలిరంగులోకి మారిందని, శరీరంపై కోసిన గాయాలు ఉన్నాయని ఆమె చెప్పారు. అంటే.., పోస్టుమార్టం జరిపినప్పటికీ ఆ విషయాన్ని దాచాలని చూశారా? ఒకవేళ చేసినట్టైతే ఆ రిపోర్టులు ఏమయ్యాయి? శాస్త్రి వ్యక్తిగత వైద్యుడు ఆర్.ఎన్.చుఘ్ కథనం ప్రకారం.. శాస్త్రి అత్యంత ఆరోగ్యంగా ఉండేవారు. అంతేకాదు, గతంలో ఆయనకు హృదయ సంబంధ జబ్బులే ఉండేవి కాదు. అలాంటిది ఒక్కసారిగా గుండెపోటుతో ఎలా మరణిస్తారు? ఒకవేళ ఆయన మీద విష ప్రయోగం జరిగిందా..? మృతదేహానికి పోస్టుమార్టం జరపలేదని కేంద్ర ప్రభుత్వం చెప్పడం, శరీరంపై నీలిరంగు మచ్చలు కనిపించడం ఈ అనుమానానికి ఊతమిచ్చాయి. లాల్ బహదూర్ శాస్త్రి తాష్కెంట్లో మరణించిన రాత్రి ఆయనతో పాటు ఇద్దరు ఉన్నారు. వారే డాక్టర్ ఆర్.ఎన్.చుఘ్, వ్యక్తిగత సహాయకుడు రామ్‌నాథ్‌లు. వీరిద్దరినీ సాక్షులుగా పరిగణించి, విచారణకు హాజరు కావాల్సిందిగా పార్లమెంటరీ సంఘం 1977లో కోరింది. అయితే, విచిత్రంగా డాక్టర్ చుఘ్ ట్రక్ ఢీకొట్టడంతో మరణించగా, రామ్‌నాథ్ కూడా కార్ ఢీకొట్టిన ఘటనలో రెండు కాళ్లూ కోల్పోయాడు. అంతేకాదు, అతడి జ్ఞాపకశక్తి కూడా పూర్తిగా దెబ్బతింది. శాస్త్రి కుటుంబ సభ్యుల ప్రకారం, ‘ఎన్నాళ్లుగానో ఈ బరువును మోస్తున్నా. ఇక దింపేసుకుంటా’ అని విచారణకు వెళ్లేముందు రామ్‌నాథ్ వారితో చెప్పాడు. గ్రెగరీ డగ్లస్ అనే జర్నలిస్టు అమెరికా నిఘా సంస్థ సీఐఏ ఏజెంట్ రాబర్ట్ క్రోలేతో టెలిఫోన్లో జరిపిన సంభాషణలను ఓ పుస్తకంగా తీసుకొచ్చాడు. ‘కన్వర్జేషన్స్ విత్ క్రో’ అనే ఈ పుస్తకంలో నమ్మశక్యం కాని నిజాలను పొందుపరిచాడు గ్రెగరీ. భారత శాస్త్రవేత్త హోమీ భాభాతో పాటు, శాస్త్రి హత్యకూ సీఐఏనే ప్రణాళికలు వేసిందని, వారిని తామే హత్య చేశామని రాబర్ట్ పేర్కొన్నాడు. అణు పరీక్షల విషయంలో శాస్త్రి దూకుడు చూపడం, రష్యాతో చనువుగా వ్యవహరించడం వల్లే ఇలా చేయాల్సివచ్చిందని చెప్పాడు. మరణించిన రోజు రాత్రి శాస్త్రి గదిలోకి వెళ్లిన రష్యా వంటవాడిపై సైతం అనుమానాలున్నాయి. భారత ప్రధానికి విషం పెట్టి చంపగలిగే అవకాశం అతనికే ఉందని భావించి తొలుత అతడిని అరెస్టు కూడా చేశారు. కానీ, శాస్త్రి గుండెపోటుతో మరణించారని ప్రకటించడంతో అధికారులు అతడిని వదిలేశారు. ఇక, శాస్త్రి మరణం మిస్టరీకి సంబంధించి ఫైళ్ల విషయంలో కేంద్ర ప్రభుత్వం ఎంతో గందరగోళానికి కారణమైంది. ప్రధానమంత్రి కార్యాలయం, కేంద్ర హోం శాఖ, విదేశీ వ్యవహారాల శాఖ, ఢిల్లీ పోలీసులు.. ఇలా వేర్వేరు శాఖలు ప్రజలను అయోమయానికి గురిచేశాయి. చివరకు ఎవరిదగ్గరా సమాచారం లేదని తేలింది. సమాచార హక్కు చట్టం ఉపయోగించి విషయం రాబట్టడానికి ప్రయత్నించినా సాధ్యం కాలేదు. ఈ ఘటనకు సంబంధించి ఒకే ఒక్క ఫైలు తమ దగ్గర ఉందనీ, కానీ అది బయటపడితే విదేశీ వ్యవహారాలకు భంగం కలుగుతుందనీ కేంద్రం పేర్కొంది. చివరకు ఆర్టీఐ పరిధి నుంచి కూడా దాన్ని తప్పించింది. దేశ చరిత్రలోనే గొప్ప ప్రధానుల్లో ఒకరిగా నిలిచిపోయిన లాల్ బహదూర్ శాస్త్రి మరణంపై అనుమానాలు చాలానే ఉన్నాయి. సమాధానాలు కరవైనప్పుడు అవి మిస్టరీలుగానే మిగిలిపోతాయి! -
ఆ ప్రమాదంలో బోస్ చనిపోకపోయి ఉండొచ్చు!
న్యూఢిల్లీ: భారత స్వాతంత్ర్య పోరాట యోధుడు సుభాష్ చంద్రబోస్ మరణం.. ఎన్నివిచారణలు జరిగినా, ఎన్నికమిటీలు వేసినా, మరెన్ని నివేదికలు బహిర్గతం చేసినా ఇప్పటికీ అంతుపట్టని ఓ రహస్యం. ఆయన గురించి వార్తా కథనాలు వెలువడినప్పుడల్లా అందులో ఏదో ఉందని తెలుసుకునే ఆసక్తి. నేతాజీ అదృశ్యానికి సంబంధించి ఇటీవల ఎప్పటి నుంచో రహస్యంగా ఉన్న ఫైళ్లను బయటపెట్టిన విషయం తెలిసిందే. 1945 ఆగస్టు 18న ఆయన విమాన ప్రమాదంలో మరణించారని చెబుతున్నా.. తాజాగా బయటపెట్టిన ఫైళ్లు మాత్రం ఆ విషయంపై ఓ స్పష్టతను ఇవ్వలేక తిరిగి పాత ప్రశ్ననే మిగిల్చాయి. ఆ విమాన ప్రమాదం నుంచి నేతాజీ బతికి బయటపడ్డారని అప్పట్లో కొన్ని వార్తా సంస్థలు తెలిపాయి. 1992నాటి ఒక ఐదు పేజీల నోట్ లో సుభాష్ బతికే ఉన్నట్లుగా వెల్లడించాయి. అలా వెల్లడించిన నోట్ పై ఎలాంటి పేరుగానీ, తేదిగానీ లేదు. అది ప్రభుత్వానికి ఒక వినతి పత్రం ఇచ్చినట్లుగా ఉంది. నాటి బెంగాల్ గవర్నర్ ఆర్జీ కేసీ కార్యాలయంలో విధులు నిర్వహించే పీసీ ఖర్ అనే ఉద్యోగి చెప్పిన ప్రకారం నేతాజీకి సంబంధించి మూడు పత్రికా కథనాలను(డిసెంబర్ 1945, జనవరి, ఫిబ్రవరి 1946) గవర్నర్ కార్యాలయ పర్యవేక్షణ సిబ్బంది స్వీకరించింది. అందులోని ఒక కథనంలో ' భారత దేశ స్వాతంత్ర్యం కోసం నా గుండె రగులుతోంది. అహింసతో స్వాతంత్ర్యం రానట్లయితే మనం రెండేళ్లలో స్వాతంత్ర్యం తెచ్చుకోవాల్సిందే' నేతాజీ చెప్పినట్లు ఉండగా నేతాజీ మహాత్మాగాంధీ పట్ల గౌరవంతో ఉండేవారని కూడా చెప్పింది. 1946 ఫిబ్రవరి నెలలో వెలువడిన కథనం మాత్రం నేతాజీ భారత మాత గౌరవించదగిన పుత్రుడని తెలిపింది. అలాగే, అసలు విమాన ప్రమాదం జరిగినట్లు ఆధారాలు లేవని, ఆయన అంత్యక్రియల నివేదిక సర్టిఫికెట్ బోస్ జపాన్ సైన్యంలో ఒక హోదా లేని ఉద్యోగి అని తెలిపిందని, చనిపోయిన వ్యక్తి పుట్టిన తేదికి నేతాజీ పుట్టిన తేదికి అస్సలు పోలికలేదని పేర్కొంది. దీంతోపాటు నేతాజీకి ముస్సోలిని, స్టాలిన్ ఇష్టం అని, అంతేకాకుండా నేతాజీ మంచి భోజన ప్రియుడని, బీఫ్ కూడా తినేవాడని పేర్కొంది. నేతాజీ గొప్ప హిందుత్వ వాదని కూడా నాటి వార్త కథనాలు వెల్లడయ్యాయి. -
డెత్ మిస్టరీ.
-
ఆ రోజు ఏం జరిగింది!
-
ఆ రోజు ఏం జరిగింది!
తాండూరు /యాలాల: జిల్లాలోని యాలాల ఎస్ఐ రమావత్ రమేష్ చనిపోవడానికి కొన్ని గంటల ముందు ఆయన కదలికలపై పోలీసులు ఆరా తీసే పనిలో పడ్డారు. గత మంగళవారం సాయంత్రం కారులో ఆయన తాండూరు పట్టణంలో ఎక్కడెక్కడికి వెళ్లారు.. ఏం చేశారు.. ఎవరెవరిని కలిశారనే కోణంలో పోలీసు అధికారులు వివరాలు సేకరిస్తున్నారు. భార్య గీతతో కలిసి ఎస్ఐ (టీఎస్07ఈజీ7082) మారుతి ఆల్టో తెలుపు రంగు కారులో మంగళవారం సాయంత్రం సుమారు 4.52 గంటలకు తాండూరు పట్టణంలోకి ప్రవేశించినట్టు సీసీ టీవీ పుటేజీలో పోలీసులు గుర్తించినట్లు సమాచారం. బస్టాండ్ సమీపంలోని ఓ పండ్ల దుకాణం కారును ఆపారు. అక్కడ పండ్లు కొన్నట్లు, ఆ సమయంలో వెంట వచ్చిన కానిస్టేబుల్ వేణు కూడా ఉన్నట్లు సీసీ టీవీ పుటేజీలో గుర్తించారు. పండ్ల దుకారణం వద్ద సుమారు 9 నిమిషాల పాటు ఆగిన తర్వాత అక్కడి నుంచి.. పండ్ల దుకాణం పక్కన ఉన్న ట్వీల్స్ బట్టల దుకాణం, చైతన్య కళాశాల మార్గం మీదుగా శాంత్‌మహల్ చౌరస్తా వైపు సాయంత్రం 5.01 గంటలకు ఎస్ఐ ప్రయాణించిన కారు వెళ్లినట్టు పుటేజీలో గుర్తించారని తెలుస్తోంది. వెళ్లిన మార్గంలోనే కారు తిరిగి సాయంత్రం సుమారు 5.25 గంటలకు అంబేద్కర్ చౌక్ మీదుగా బస్టాండ్ ఫ్లైఓవర్ వైపు వెళ్లినట్టు పోలీసులు గుర్తించారు. దాదాపు 5 నిమిషాల తర్వాత కారు ఫ్లైఓవర్ వైపు నుంచి అంబేద్కర్ చౌక్ వైపు వస్తుండగా ఆర్టీసీ బస్సులు బయటకు వెళ్లే ప్రవేశ ద్వారం ఎదురుగా ఓ బస్సు రావడంతో ఆగిపోయినట్లు కూడా సీసీ టీవీ పుటేజీలో గుర్తించారు. కాగా.. కారును మళ్లీ స్టార్ట్ చేసుకొని అంబేద్కర్ చౌక్ మీదుగా ఇందిరాచౌక్ వైపు సాయంత్రం సుమారు 5.30 గంటలకు వెళ్లినట్టు అధికారులు గుర్తించారు. ఇలా సీసీ టీవీ పుటేజీల ఆధారంగా ఎస్ఐ మంగళవారం పట్టణంలో ఎటు వెళ్లారనే కోణంలోనూ పోలీసులు ఆరా తీస్తున్నారు. ఎస్ఐ క్వార్టర్స్‌కు తాళం.. యాలాలలో ఎస్ఐ రమేష్ ఉన్న క్వార్టర్స్‌కు పోలీసులు తాళం వేసి తమ ఆధీనంలోకి తీసుకున్నారు. అక్కడ ప్రత్యేకంగా కానిస్టేబుల్‌ను బందోబస్తుకు ఏర్పాటు చేశారు. సర్వీసు రివాల్వర్ క్వార్టర్స్‌లోనే ఉండొచ్చనే కోణంలో బయటి వ్యక్తులు ఎవరూ రాకుండా నిషేధం విధించారు. సెల్ఫోన్ల స్వాధీనం.. ఎస్ఐకి చెందిన డిపార్టుమెంట్‌తోపాటు ఆయన వ్యక్తిగత సెల్ఫోన్లను పోలీసు అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ రెండు సెల్ఫోన్ల కాల్‌డేటాపై ఎస్పీ ఆధ్వర్యంలో పోలీసు బృందాలు కూపీ లాగుతున్నాయి. చనిపోవడానికి కొన్ని రోజుల ముందు ఎస్ఐ సెల్ఫోన్ల నుంచి ఎవరిరెవరికి ఫోన్ కాల్స్ వెళ్లాయి, ఎవరు ఫోన్లు చేశారు. ఎస్ఎంఎస్ సమాచారాలు కూడా సేకరించే పనిలో నిమగ్నమయ్యారని సమాచారం. ఆయన భార్య ఫోన్ కాల్స్‌పై కూడా అధికారులు దృష్టిసారించినట్టు తెలుస్తోంది. అనుమానితులపై నిఘా.. ఎస్‌ఐది ఆత్మహత్య అని పోస్టుమార్టం నివేదికలో వెల్లడైన నేపథ్యంలో దీనికి ఉసిగొల్పిన కారణాలపై పోలీసు అధికారులు లోతుగా విచారణ చేపడుతున్నారు. ఇందులో భాగంగా పెద్దేముల్, యాలాల మండలాల్లో ఎస్ఐతో సంబంధం ఉన్న వ్యక్తులు, అధికారులు, స్నేహితులు, రాజకీయ నాయకుల వివరాలను సేకరిస్తున్నట్టు సమాచారం. కొందరు అనుమానితులను కూడా పోలీసులు పిలిచి విచారిస్తున్నట్టు సమాచారం. వెంట ఉన్న కానిస్టేబుల్ నుంచి అన్ని కోణాల్లో వివరాలు సేకరిస్తున్నట్టు తెలుస్తోంది. ఆరోగ్య సమస్యలు వస్తే ఆయన ఏ ఆస్పత్రిలో చికిత్స కోసం వెళ్లేవారనే దానిపైనా ఆరా తీస్తున్నారు. ఇసుక అక్రమ రవాణా నేపథ్యంలో వేధింపుల వ్యవహారంపైనా అధికారులు దృష్టి సారించారు. -
అంతులేని కథ!