వాట్సాప్‌లో ఆయన మార్ఫింగ్‌ ఫొటో వైరల్‌ | Fact Check Subhas Chandra Bose Reading News of His Own Death | Sakshi
Sakshi News home page

Factcheck: బోస్‌ మరణవార్తని చదువుతున్న బోస్‌!!.. ఇదీ అసలు విషయం

Published Wed, Sep 29 2021 9:08 AM | Last Updated on Wed, Sep 29 2021 9:08 AM

Fact Check Subhas Chandra Bose Reading News of His Own Death - Sakshi

Subhas Chandra Bose Morphing Photo Viral: స్వాతంత్ర సమరయోధుడు,  ఆజాద్ హింద్ ఫౌజ్ వ్యవస్థాపకుడైన సుభాష్‌ చంద్రబోస్‌ మరణం.. నేటికి ఓ వీడని మిస్టరీనే. 1945, ఏప్రిల్‌ 23న జరిగిన ఓ విమాన ప్రమాదంలో ఆయన చనిపోయారని ప్రకటనలు వెలువడినప్పటికీ.. అవశేషాలు దొరకకపోవడంతో ఆయన మరణం అధికారికంగా ధృవీకరణ కాలేదు. 


అయితే ఆ క్రాష్‌లో ఆయన చనిపోలేదని చాలాకాలం జీవించే ఉన్నారని చెబుతూ రకరకాల కథనాల్ని ప్రచారం చేస్తుంటారు.  అయితే తాజాగా సోషల్‌ మీడియాలో సర్క్యులేట్‌ అవుతున్న ఓ ఫొటో, దాని మీద సందేశం.. ఆయన అభిమానుల్ని విపరీతంగా ఆకట్టుకుంటోంది.

విమాన ప్రమాదంలో బోస్‌ చనిపోయారనే వార్త కాంగ్రెస్‌ ఆడిన అబద్ధమని, తన మరణం మీద వచ్చిన వార్తను ఓ పత్రికలో బోస్‌ చదివారంటూ సదరు ఫొటో వైరల్‌ అవుతోంది.  అయితే 2019లో ఇదే ఫొటో ఓ బంగ్లా వ్యక్తి ఫేస్‌బుక్‌ అకౌంట్‌లో వైరల్‌ అయ్యింది. రివర్స్‌ ఇమేజ్‌ సెర్చ్‌లో ఆ ఫొటోపై అసలు విషయం తేలింది. ఆ సమయంలో జపాన్‌లో ప్రధాన పత్రికగా ఉన్న ఇంగ్లిష్‌ పత్రిక నిప్పన్‌ టైమ్స్‌ను బోస్‌ చదువుతుండగా తీసిన ఫొటో అది. 

మే 27, 2018లో అంజుధార్‌ అనే వ్యక్తి ట్విటర్‌  అకౌంట్‌ నుంచి ఈ విషయం ధృవీకరించడం జరిగింది. అంతేకాదు 2019లో బిప్లబ్‌సీ2 అనే వ్యక్తి ట్విటర్‌ అకౌంట్‌ నుంచి ఈ మార్ఫింగ్‌ ఫొటో వైరల్‌ అయ్యిందని అంజుధార్‌ బయటపెట్టాడు కూడా. ఆ తర్వాత ట్విటర్‌ ఆ అకౌంట్‌ను తొలగించింది. ప్రస్తుతం కాంగ్రెస్‌ను బద్నాం చేసేలా ఆ మార్ఫింగ్‌ ఫొటోనే వాట్సాప్‌లో వైరల్‌ అవుతోంది.

చదవండి: బోస్‌ బతికున్నారో లేదో చెప్పండి: సీఐసీ

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement