Morphing Photo
-
విశాఖలో లోన్ యాప్ వేధింపులకు యువకుడు బలి
-
అడల్ట్ సైట్లో ఫోటో లీక్, 15ఏళ్లకు చేదు అనుభవం: నటి
చిత్రవిచిత్ర వేషధారణతో నిత్యం వార్తల్లో నిలుస్తోంది ఉర్ఫీ జావెద్. సోషల్ మీడియా యూజర్లకు పెద్ద పరిచయం అక్కర్లేని ఉర్ఫీ తన డ్రెస్సింగ్‌తో నెట్టింట చేసే రచ్చ అంతా ఇంతా కాదు. వెరైటీ డ్రెస్సులతో సోషల్ మీడియా సెన్సేషన్‌గా మారిన ఉర్ఫీ డిఫరెంట్ ఫ్యాషన్ వేర్‌తో ఎన్నోసార్లు ట్రోల్స్ బారిన పడింది. అయినా తీరు మార్చుకోకపోగా రోజుకో వేషధారణలో దర్శనమిస్తుంటుంది. ఇదిలా ఉండగా తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ చిన్నప్పుడు తనకు ఎదురైన చేదు అనుభవాన్ని పంచుకుంది. 15ఏళ్ల వయసులో ఓసారి హాఫ్ షోల్డర్ టాప్ వేసుకొని పోటో తీసి ఫేస్బుక్లో పోస్ట్ చేశాను. అది కాస్తా ఎవరో మార్ఫింగ్ చేసి పోర్న్సైట్లో పెట్టేశారు. దీంతో మా కుటుంబం సహా ఊర్లో రచ్చ రచ్చ అయిపోయింది. అయితే తన తప్పు లేకపోయినా ఆఖరికి కుటుంబసభ్యులు కూడా నన్నే తప్పుబట్టారు అని పేర్కొంది. కాగా సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే ఉర్ఫీ నటన కంటే బోల్డ్ డ్రెస్సింగ్‌తోనే ఎక్కువగా వార్తల్లో నిలిచిన సంగతి తెలిసిందే. ఇక హిందీ బిగ్‌బాస్ ఓటీటీతో మరింత పాపులారిటీ దక్కించుకుంంది. -
మార్పింగ్ కు సచిన్ టెండూల్కర్ బలి
-
ఏ ‘క్లిక్’లో ఏ ‘కీడు’ దాగుందో!
అంతర్జాలం (ఇంటర్నెట్)లో ఉన్న విచిత్రం ఏమిటంటే... ‘మాకేమీ తెలియదు’ అనేవాళ్లే కాదు... ‘మాకంతా తెలుసు’ అనుకునేవాళ్లు కూడా బోల్తా పడుతుంటారు. ఎందుకంటే కొత్త ప్రమాదాలు సరికొత్త రూపాల్లో వస్తుంటాయి. అందుకే అంతర్జాలం అంటే ఆసక్తి మాత్రమే కాదు అనేక రకాలుగా అప్రమత్తంగా ఉండాలి... బెంగళూరుకు చెందిన ఒక అమ్మాయి ఆత్మహత్య చేసుకుంది. పోలీసుల దర్యాప్తులో తేలిన విషయమేమిటంటే కొందరు ఆకతాయిలు ఆన్లైన్లో ఆమెను వేధించడం మొదలు పెట్టారు. ఆమె ఫోటోలను అసభ్యంగా మార్ఫింగ్ చేసి బ్లాక్మెయిల్ చేయడంతో ఆమె తట్టుకోలేక ఆత్మహత్యకు పాల్పడింది. ముంబైకి చెందిన శ్వేత పెళ్లికి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. రేపోమాపో పెళ్లి. ఈలోపు అబ్బాయి తండ్రి నుంచి కబురు వచ్చింది. ‘పెళ్లి క్యాన్సిల్’ అని! అమ్మాయి తరపు వాళ్లు ఆవేశంతో అతడిని నిలదీయబోతే కొన్ని ఫొటోలు చూపించాడు. శ్వేత ఎవరో అబ్బాయితో ఉన్న ఫోటోలు అవి. అంతే! ఆవేశంగా వచ్చిన వారు సైలెంటైపోయారు. వచ్చిన దారినే తిరిగి వెనక్కి వెళ్లారు. ‘మా పరువంతా తీశావు’ అని కూతురిని తిట్టడం మొదలు పెట్టారు తల్లిదండ్రులు. ‘ఈ బతుకు వృథా. ఆత్మహత్య చేసుకోవడం తప్ప వేరే దారి లేదు’ అనుకుంది శ్వేత. కాని అలా చేస్తే నిందను నిజం చేసినట్లవుతుంది కాబట్టి తనకు జరిగిన అన్యాయంపై పోలీసులతో మాట్లాడింది. వాళ్లు దర్యాప్తు చేయగా తెలిసిన విషయం ఏమిటంటే, అవి మార్ఫింగ్ ఫోటోలని. తామంటే గిట్టని బంధువులే ఈ పని చేశారు! ఒక్క మార్ఫింగ్ అనేకాదు... ఆర్థిక మోసాలు, సైబర్ బుల్లింగ్... మొదలైనవి అంతర్జాలం అంటే అంతులేని భయాన్ని సృష్టిస్తున్నాయి. అందుకే కొందరు మహిళలు అంతర్జాలానికి అందనంత దూరంలో ఉంటున్నారు. కాని ఇది సమస్యకు పరిష్కారం కాదు. ఎందుకంటే మన జీవితంలో ఇప్పుడు ప్రతిదీ ఇంటర్నెట్తోనే అనుసంధానమై ఉంది. దీన్ని దృష్టిలో పెట్టుకొని దిల్లీకి చెందిన ‘సోషల్‌మీడియా మ్యాటర్స్’ అనే స్వచ్ఛంద సంస్థ ‘మోసం జరిగాక అయ్యో! అని నిట్టూర్చడం కంటే మోసం జరిగే అవకాశమే ఇవ్వకుంటే బాగుంటుంది కదా!’ అనే విధానంతో రంగంలోకి దిగింది. పన్నెండుమంది యువతీ యువకులు ఉన్న బృందం సోషల్ మీడియా మ్యాటర్స్. సేఫ్ ఇంటర్నెట్ గురించి అవగాహన తరగతులు నిర్వహిస్తున్న ‘సోషల్ మీడియా మ్యాటర్’ సంస్థ సభ్యులు స్కూల్, కాలేజీ, యూనివర్శిటీ, కార్పొరేట్, ప్రభుత్వ కార్యాలయాలు... మొదలైన వాటిలో ఇంటర్నెట్ సెక్యూరిటీ గురించి అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నారు. ఈ క్లాసులు బోర్ కొట్టకుండా ఉండటానికి ఎమోజీకేషన్ టెక్నిక్ ఉపయోగించడంతోపాటు మన సంస్కృతి, సంప్రదాయాలకు సంబంధించిన విషయాలను సందర్భోచితంగా ఉదహరిస్తారు, పిట్టకథలు చెబుతారు. ఆకట్టుకునే చిత్రాలను ప్రదర్శిస్తారు. ‘రూల్స్ అండ్ టూల్స్ వితిన్ సైబర్‌స్పేస్’లో భాగంగా డాటా ప్రొటెక్షన్, ప్రైవసీ కాపాడుకోవడం, సెక్యూరిటీ ఆఫ్ కనెక్షన్స్... మొదలైన వాటిపై వర్క్‌షాప్‌లు నిర్వహిస్తోంది సోషల్ మీడియా మ్యాటర్స్. వర్క్‌షాప్‌కు వెళ్లడానికి మొదట్లో ఆసక్తిగా అనిపించలేదు. ఫ్రెండ్‌తో కలిసి వెళ్లా. ఇంటర్నెట్ విషయంలో అప్రమత్తంగా ఉండకపోతే ఎంత ప్రమాదమో తెలుసుకున్నాను. అక్కడ తెలుసుకున్న విషయాలు ఇప్పుడు నాకు ఎంతో ఉపయోగపడుతున్నాయి. – ఆనంది, నాగ్‌పూర్ -
మహిళపై అసభ్యకర పోస్టులు.. అమ్మకానికి పెడుతున్నట్లు..
సాక్షి, హిమాయత్‌నగర్(హైదరాబాద్): తమపై బుల్లి బాయ్స్ పేరుతో అసభ్యకరమైన పోస్టులు పెట్టడమే కాకుండా, అమ్మకానికి పెడుతున్నట్లు పోస్టులు పెట్టిన వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ టోలిచౌకికు చెందిన ఓ మహిళ సీసీఎస్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. గిట్‌హాబ్ అనే సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో సులీ డీల్స్ పేరుతో ఖాతా తెరిచి ఆ తరువాత దానిని బుల్లీ బాయ్స్‌గా పేరు మార్చారు. ఇందులో ముస్లిం మహిళలను విక్రయిస్తున్నట్లు పోస్టులు పెట్టారు. దీనిపై ట్విట్టర్లో దుమారం రేగడంతో ఢిల్లీ, ముంబాయి సైబర్ సెల్ పోలీసులు కేసు నమోదు చేశారు. సామాజిక కార్యకర్తగా పనిచేస్తున్న బాధితురాలి ఫోటోను కూడా అలాగే ఆ పోస్టులో పెట్టడంతో బాధితురాలు తాజాగా సీసీఎస్ సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించింది. దీనిపై 509, 354డీ, 67 ఐటీ యాక్ట్ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టామని ఏసీపీ కేవీఎం ప్రసాద్ తెలిపారు. ఇదిలా ఉండగా మరో మహిళ సైబరాబాద్‌లో ఫిర్యాదు చేసింది. -
వాట్సాప్‌లో ఆయన మార్ఫింగ్ ఫొటో వైరల్
Subhas Chandra Bose Morphing Photo Viral: స్వాతంత్ర సమరయోధుడు, ఆజాద్ హింద్ ఫౌజ్ వ్యవస్థాపకుడైన సుభాష్ చంద్రబోస్ మరణం.. నేటికి ఓ వీడని మిస్టరీనే. 1945, ఏప్రిల్ 23న జరిగిన ఓ విమాన ప్రమాదంలో ఆయన చనిపోయారని ప్రకటనలు వెలువడినప్పటికీ.. అవశేషాలు దొరకకపోవడంతో ఆయన మరణం అధికారికంగా ధృవీకరణ కాలేదు. అయితే ఆ క్రాష్‌లో ఆయన చనిపోలేదని చాలాకాలం జీవించే ఉన్నారని చెబుతూ రకరకాల కథనాల్ని ప్రచారం చేస్తుంటారు. అయితే తాజాగా సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతున్న ఓ ఫొటో, దాని మీద సందేశం.. ఆయన అభిమానుల్ని విపరీతంగా ఆకట్టుకుంటోంది. Original picture with some reimagination by @BiplabC2.#Netaji #DeathThatWasnt #TheBoseMystery #Gumnaami @prosenjitbumba @srijitspeaketh @chandrachurg @PanickarS @koushikzworld @SayakSen6 @Sayani_Pandit pic.twitter.com/ep8T70g6Uj — Anuj Dhar (@anujdhar) August 18, 2019 విమాన ప్రమాదంలో బోస్ చనిపోయారనే వార్త కాంగ్రెస్ ఆడిన అబద్ధమని, తన మరణం మీద వచ్చిన వార్తను ఓ పత్రికలో బోస్ చదివారంటూ సదరు ఫొటో వైరల్ అవుతోంది. అయితే 2019లో ఇదే ఫొటో ఓ బంగ్లా వ్యక్తి ఫేస్బుక్ అకౌంట్లో వైరల్ అయ్యింది. రివర్స్ ఇమేజ్ సెర్చ్‌లో ఆ ఫొటోపై అసలు విషయం తేలింది. ఆ సమయంలో జపాన్‌లో ప్రధాన పత్రికగా ఉన్న ఇంగ్లిష్ పత్రిక నిప్పన్ టైమ్స్‌ను బోస్ చదువుతుండగా తీసిన ఫొటో అది. Subhas Chandra Bose reading Nippon Times (now The Japan Times), Japan's largest and oldest English-language daily newspaper @japantimes pic.twitter.com/6A7YMXGEkW — Anuj Dhar (@anujdhar) May 27, 2018 మే 27, 2018లో అంజుధార్ అనే వ్యక్తి ట్విటర్ అకౌంట్ నుంచి ఈ విషయం ధృవీకరించడం జరిగింది. అంతేకాదు 2019లో బిప్లబ్సీ2 అనే వ్యక్తి ట్విటర్ అకౌంట్ నుంచి ఈ మార్ఫింగ్ ఫొటో వైరల్ అయ్యిందని అంజుధార్ బయటపెట్టాడు కూడా. ఆ తర్వాత ట్విటర్ ఆ అకౌంట్‌ను తొలగించింది. ప్రస్తుతం కాంగ్రెస్‌ను బద్నాం చేసేలా ఆ మార్ఫింగ్ ఫొటోనే వాట్సాప్‌లో వైరల్ అవుతోంది. చదవండి: బోస్ బతికున్నారో లేదో చెప్పండి: సీఐసీ -
సోషల్ మీడియా స్నేహం.. ఫోటోలు మార్పింగ్ చేసి!
సాక్షి, సింగరేణి(కొత్తగూడెం): ఫొటోలు మార్ఫింగ్ చేసి బాలికను బ్లాక్మెయిల్ చేసిన నలుగురు వ్యక్తులను కొత్తగూడెం టూ టౌన్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఠాణాలో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో భద్రాచలం ఏఎస్పీ రాజేష్‌చంద్ర సీఐ బి.సత్యనారాయణతో కలిసి వివరాలు వెల్లడించారు. పోలీసుల కథనం ప్రకారం.. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మండలం ఖానాపూర్ గ్రామానికి చెందిన అక్కినపెల్లి శివకృష్ణ కొత్తగూడెంలోని గౌతంపూర్‌కు చెందిన బాలికను ఇన్‌స్ట్రాగామ్ ద్వారా పరిచయం చేసుకున్నాడు. మాయమాటలు చెప్పి వాట్సాప్ ద్వారా ఆమె ఫొటోలు సేకరించాడు. ఫొటోలను మార్ఫింగ్ చేసి తిరిగి బాలిక వాట్సాప్‌కు పంపాడు. డబ్బులు, బంగారం ఇవ్వాలని లేకపోతే మార్ఫింగ్ ఫొటోలను సోషల్ మీడియాలో పెడతానని బెదిరించాడు. దీంతో బాలిక భయపడి అంగీకరించింది. చదవండి : ఆ నది రక్తంతో ఎరుపెక్కుతోంది.. సెప్టెంబర్ 19న తన స్నేహితులు పాతకుంట సందీప్‌కుమార్, సుద్దపల్లి కార్తీక్, గిందమ్ విజయ్‌కుమార్‌లను గౌతంపూర్‌కు పంపాడు. వారు బాలిక నుంచి రెండు తులాల బంగారు ఆభరణం తీసుకుని, బెదిరించి వెళ్లారు. మళ్లీ ఈ నెల 3న శివకృష్ణ బాలికతో చాటింగ్ చేసి, రూ.3 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశాడు. తాము రుద్రంపూర్‌లోని ప్రగతివనం పార్కు వద్ద ఉన్నామని, వెంటనే డబ్బులు తెచ్చి ఇవ్వాలని బెదిరించాడు. విశ్వసనీయ సమాచారంతో టూ టౌన్ ఎస్హెచ్ఓ బి.సత్యనారాయణ తన సిబ్బందితో కలిసి చాకచక్యంగా శివకృష్ణను, అతని మిత్రులు పాతకుంట సందీప్‌కుమార్, సుద్దపల్లి కార్తీక్, గిందమ్ విజయ్‌కుమార్‌లను అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి కారు, సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నిందితులను రిమాండ్‌కు తరలించనున్నట్లు ఏఎస్పీ తెలిపారు. చాకచక్యంగా వ్యవహరించి నిందితులను పట్టుకున్న సీఐ సత్యనారాయణను, సిబ్బందిని అభినందించారు. ఈ సందర్భంగా ఏఎస్పీ మాట్లాడుతూ విద్యార్థులకు ఆన్లైన్ తరగతులు నడుస్తున్న నేపథ్యంలో తల్లిదండ్రులు ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉండాలని చెప్పారు. ఎస్ఐలు రాజేందర్, రాంబాబు, ఏఎస్ఐ రామకృష్ణ, సిబ్బంది పాల్గొన్నారు. చదవండి: విషాదం: ప్రేమికులిద్దరూ మృతి -
మార్ఫింగ్ ఫొటోతో దుష్ప్రచారం
సాక్షి, అమరావతి బ్యూరో: మహిళల పట్ల పోలీసులు అసభ్యకరంగా ప్రవర్తించారంటూ మార్ఫింగ్ ఫొటోలను సృష్టించి దుష్ప్రచారం చేస్తున్న వ్యవహారంలో పోలీసులు నిజానిజాలను వెలికి తీశారు. ఫేక్ ఫొటోలను సామాజిక మాధ్యమాల్లో వైరల్ చేయడానికి ప్రయత్నించిన ఆంధ్ర మేధావుల ఫోరం కన్వీనర్ చలసాని శ్రీనివాసరావు, చలసాని అజయ్‌కుమార్, అమ్మినేని శివప్రసాద్, కొత్తపల్లి సీతాంశులతోపాటు మరికొందరిపై కేసులు నమోదు చేశారు. వివరాల్లోకి వెళితే.. మూడు రాజధానులు వద్దని, అమరావతిలోనే అన్నీ ఉంచాలంటూ ఈ నెల 10న బందరు రోడ్డుపై నిరసన ప్రదర్శన చేస్తున్న మహిళల పట్ల పోలీసులు అసభ్యకరంగా ప్రవర్తించినట్లుగా సోషల్ మీడియాలో ఓ ఫొటో వైరల్ అవుతోంది. ఈ వ్యవహారంపై పోలీస్ అసోసియేషన్ ఆదివారం రాత్రి విజయవాడలో ఫిర్యాదు చేసింది. దీన్ని సీరియస్‌గా తీసుకున్న పోలీసులు.. ఆ ఫొటో వెనుక ఉన్న నిజాలను వెలికి తీశారు. ఆక్వా ఫుడ్ పార్క్ ఏర్పాటుకు వ్యతిరేకంగా తూర్పుగోదావరి జిల్లాకు చెందిన కొందరు రైతులు 2017లో విజయవాడలోని ధర్నా చౌక్ వద్ద ధర్నా నిర్వహించారు. ఆ సందర్భంలో ఒక మహిళను మహిళా పోలీసులు అరెస్టు చేసి వాహనంలో తరలిస్తున్న దృశ్యాన్ని కొందరు వీడియో, ఫొటోలు తీశారు. ఆ ఫొటోను అప్పట్లో కాంగ్రెస్ నేతలు కొందరు మార్ఫింగ్ చేసి పోలీసులపై దుష్ప్రచారం చేశారు. ఇప్పుడదే ఫొటోను మరోసారి మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో అప్లోడ్ చేసి వైరల్ అయ్యేలా ప్రయత్నిస్తున్నట్లు పోలీసులు తేల్చారు. -
ట్రంప్ ఛాతి చూస్తే మూర్చపోవాల్సిందే!
‘నా ఛాతిని చూశారా! ఇలాంటి బ్రహ్మండమైన ఛాతిని ఇంత వరకు తాము చూడలేదంటూ డాక్టర్లే ముచ్చటపడ్డారు’ అని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బుధవారం నాడు సోషల్ మీడియాలో తన మార్ఫింగ్ ఫొటోను ట్వీట్ చేశారు. అందులో హాలీవుడ్ సినిమా ‘రాఖీ’లో నటించిన సిల్వస్టర్ స్టాలోన్ బాక్సింగ్ ఫొటోకు తన తలను మార్ఫింగ్‌తో అతికించారు. ‘వాల్టర్ రీడ్ మెడికల్ సెంటర్’కు గత వారం ట్రంప్ అనుకోకుండా సందర్శించడం పట్ల జర్నలిస్టులు ఆయనకు గుండెపోటు వచ్చి ఉండవచ్చంటూ ఊహాగానాలను ప్రచురించారు. దానికి సమాధానంగా ట్రంప్ తన మార్ఫింగ్ ఫొటోను ట్వీట్ చేశారు. ఆయన గురువారం నాడు వెస్ట్‌పామ్ బీచ్‌లోని ‘ట్రంప్ ఇంటర్నేషనల్ గోల్ఫ్ క్లబ్’కు వచ్చారు. ఆయన అక్కడే ‘థ్యాంక్స్ గివింగ్ హాలీడే’ జరుపుకోనున్నారు. ఆయన భార్య, కూతురు కూడా అక్కడ కనిపించడం ఈ విషయాన్ని రుజువు చేస్తోంది. థ్యాంక్స్ గివింగ్ హాలీడే పేరును మార్చాలని పలు వర్గాల నుంచి తనపై ఒత్తిడి వస్తున్నప్పటికీ మార్చడం లేదని ఆయన ఈ సందర్భంగా స్పష్టం చేశారు. పంటలు ఇంటికి వచ్చినందుకు జరుపుకునే వ్యవసాయ పండుగే ‘థ్యాంక్స్ గివింగ్ హాలీడే’. ప్రతి సంవత్సరం నవంబర్ నాలుగో గురువారం నాడు అమెరికన్లు ఈ పండుగను పెద్ద ఎత్తున జరుపుకుంటారు. 1789 నుంచి ఈ ఆనవాయితీని వారు పాటిస్తున్నారు. -
నేవీ కమాండర్ వికృత చేష్ట
న్యూఢిల్లీ : భార్య ఫోటోలను అభ్యంతరకరంగా మార్ఫింగ్ చేసి ఆన్లైన్ ఫోటో యాప్‌లో అప్లోడ్ చేసిన ఓ నేవీ కమాండర్‌పై పూణే పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రస్తుతం ఢిల్లీలో పనిచేస్తున్న తన భర్త పోర్నోగ్రఫీకి బానిసయ్యాడని బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసిందని ఖండ్వా పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ మహదేవ్ కుంభర్ తెలిపారు. భర్త అశ్లీల సైట్లకు అలవాటుపడి ఎంతకీ వాటిని వదిలేయకపోవడంతో తాను పిల్లలను తీసుకుని పుట్టింటికి వచ్చేశానని గతంలో సైనిక అధికారిగా పనిచేసిన బాధితురాలు వెల్లడించారు. తాను, కుటుంబ సభ్యులు పలుమార్లు చెప్పినా ఆయన మారలేదని ఆవేదన వ్యక్తం చేశారు. భర్త ప్రవర్తనలో మార్పు రాకపోవడంతో విసిగిన మహిళ పూణేకు తిరిగివచ్చి ఇక్కడి ఫ్యామిలీ కోర్టులో గత నెలలో విడాకుల కేసును దాఖలు చేసినట్టు పోలీసు అధికారి మహదేవ్ వెల్లడించారు. ఆమె భర్త బాధితురాలి ఫోటోలను అప్లోడ్ చేయడంతో పాటు, తన కొలీగ్ భార్య, మరికొందరు ఇతర మహిళల అభ్యంతరకర ఫోటోలను ఆ యాప్‌లో అప్లోడ్ చేశాడని తెలిపారు. ఈమెయిల్ ఖాతా ద్వారా నిందితుడు ఫోటో యాప్‌లో తన భార్య చిత్రాలను అప్లోడ్ చేశాడని వెల్లడించారు. నిందితుడికి తన కొలీగ్ భార్యతో వివాహేతర సంబంధం కూడా ఉందని బాధితురాలు ఫిర్యాదులో పేర్కొన్నారని చెప్పారు. నిందితుడిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామన్నారు. కేసులో నిందితుడిని ప్రశ్నించేందుకు అనుమతి కోసం నేవీ అధికారులకు లేఖ రాస్తామని చెప్పారు. -
మోదీ మార్ఫింగ్ చిత్రం యువకుడు అరెస్ట్
తమిళనాడు, టీ.నగర్: ఫేస్బుక్లో ప్రధాని మోదీ చిత్రాన్ని మార్ఫింగ్ చేసి చిత్రించిన యువకుడిని తిరుపూర్‌లో పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు. తిరుపూర్ ఉత్తర జిల్లా బీజేపీ నేత చిన్నస్వామి ఈనెల రెండో తేదీన తిరుపూర్ నార్త్ పోలీసుస్టేషన్లో ఒక ఫిర్యాదు చేశారు. అందులో ప్రభాకరన్ అనే యువకుడు తన ఫేస్బుక్లో ప్రధాని మోదీ చిత్రాన్ని మార్ఫింగ్ చేసి విడుదల చేశారని అతనిపై చర్యలు తీసుకోవాల్సిందిగా కోరారు. దీనిపై సీఐ పిచ్చయ్య ఆధ్వర్యంలోని పోలీసులు విచారణ జరుపుతూ వచ్చారు. ఇలావుండగా ఫేస్బుక్లో మోదీ చిత్రాన్ని మార్ఫింగ్ చేసిన ప్రభాకరన్ (23) అని, అతను తిరుపూర్ ఎస్వీ కాలనీలో నివశిస్తున్నట్లు, ఒక అద్దకపు పరిశ్రమలో సూపర్వైజర్గా పనిచేస్తున్నట్లు తెలిసింది. ఇతని సొంతవూరు సేలం జిల్లా ఆత్తూరు తాలూకా వలయమాదేవి గ్రామానికి చెందిన వ్యక్తిగా కనుగొన్నారు. అతన్ని పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు. -
మియా-మలాల.. మార్ఫింగ్ ఫోటో రగడ
సాక్షి, సినిమా : మియా ఖలీఫా.. యూత్‌కి పెద్దగా పరిచయం అక్కర్లేని పేరు. అడల్ట్ చిత్రాల్లో నటించే ఈ నటి చుట్టూ వివాదాలు కూడా ముసురుకుంటూనే ఉన్నాయి. బుర్ఖా ధరించి నీలి చిత్రాల్లో నటించటంతో ఐసిస్ ఈ లెబనీస్ అమెరికన్ స్టార్‌ను చంపుతామని బెదిరించటం తెలిసిందే. దీంతో పోలీసులు కొంత కాలం ఆమెకు భద్రతా కూడా కల్పించారు. ఈ మధ్య తన ఆదాయంలో 5వేల డాలర్లను హర్వే తుఫాన్ విరాళంగా ఇవ్వగా.. అదీ వివాదాస్పదం అయ్యింది. ఇక ఇప్పుడు మరో మతపరమైన వివాదం ఆమె మెడకు చుట్టుకుంది. వర్జిన్ మేరీ ఫోటోలో ఆమె ముఖం ఎడిట్ చేసి ఉన్న ఫోటోను తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఆమె పోస్ట్ చేసింది. ఓ న్యూస్ అవుట్లెట్ పొరపాటున మలలా స్థానంలో తన ఫోటోను ఇలా ముద్రించిందంటూ సందేశం ఉంచింది. జీసస్ తల్లి మేరీ మాతగా తనను తాను చూపించుకోవటంపై మియాపై సోషల్ మీడియాలో విరుచుకుపడుతున్నారు. గత వారం పాక్ ఉద్యమకారిణి, నోబెల్ బహుమతి గ్రహీత మలాల యూసఫ్ఝై ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ తరగతులకు జీన్స్.. హైహీల్స్ ధరించి హాజరుకాగా.. ఆమె మలాలనా? లేక మియా ఖలీఫానా? అంటూ కొందరు కామెంట్లు చేయటం చూశాం. మరి ఇప్పుడు ఆమె పోస్ట్ చేసిన ఫోటోకు ఏ స్థాయిలో తిట్లు పడతాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. -
పాపులర్ సింగర్ ఫోటోను మార్ఫింగ్ చేసి...
అహ్మదాబాద్: పాపులర్ సింగర్ ఫోటోను మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో అప్లోడ్ చేసిన ఓ వ్యక్తిని గుజరాత్ పోలీసులు అరెస్ట్ చేశారు. ‘‘ఛార్ ఛార్ బంగడీవాలీ’’ సాంగ్ ఫేమ్ కింజాలీ దేవీ ఈ కేసులో బాధితురాలు కావటం విశేషం. అమరైవాడికి చెందిన నీరజ్ మక్వానా అనే 30 ఏళ్ల వ్యక్తి గాయని కింజాలీ దవే ఫోటోను మార్ఫింగ్ చేసి తన భార్యేనంటూ ఫేస్ బుక్‌లో అప్లోడ్ చేశాడు. ఈ విషయం గమనించిన సింగర్ తండ్రి స్నేహితుడొకరు ఆమెకు సమాచారం అందించారు. వెంటనే రంగంలోకి దిగిన కింజాలీ తండ్రి సైబర్ సెల్ అధికారులకు ఫిర్యాదు చేశారు. ‘మక్వానాను మేము అరెస్ట్ చేశాం. నిందితుడు నేరం ఒప్పుకున్నాడు. ఆమెను అసలు ఎప్పుడూ కలవలేదని విచారణలో వెల్లడించిన మక్వానా, మార్ఫింగ్ చేసినట్లు తెలిపాడు’ అని సైబర్ సెల్ అధికారులు తెలియజేశారు. అయితే ఆమె ఫోటోలనే ఎందుకు మార్ఫింగ్ చేశాడన్నదానిపై మాత్రం స్పష్టత రావాల్సి ఉంది. సైబర్ నేరగాళ్లు తరచూ ఇలా తమ ఫోటోలను మార్ఫింగ్ చేస్తుండటంతో పలువురు సెలబ్రిటీలు ఇబ్బంది పాలవుతున్న విషయం తెలిసిందే. -
ఫోటో మార్ఫింగ్ చేస్తూ దొరికిపోయారు!