చిత్రవిచిత్ర వేషధారణతో నిత్యం వార్తల్లో నిలుస్తోంది ఉర్ఫీ జావెద్. సోషల్ మీడియా యూజర్లకు పెద్ద పరిచయం అక్కర్లేని ఉర్ఫీ తన డ్రెస్సింగ్‌తో నెట్టింట చేసే రచ్చ అంతా ఇంతా కాదు. వెరైటీ డ్రెస్సులతో సోషల్ మీడియా సెన్సేషన్‌గా మారిన ఉర్ఫీ డిఫరెంట్ ఫ్యాషన్ వేర్‌తో ఎన్నోసార్లు ట్రోల్స్ బారిన పడింది. అయినా తీరు మార్చుకోకపోగా రోజుకో వేషధారణలో దర్శనమిస్తుంటుంది.
ఇదిలా ఉండగా తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ చిన్నప్పుడు తనకు ఎదురైన చేదు అనుభవాన్ని పంచుకుంది. 15ఏళ్ల వయసులో ఓసారి హాఫ్ షోల్డర్ టాప్ వేసుకొని పోటో తీసి ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేశాను. అది కాస్తా ఎవరో మార్ఫింగ్ చేసి పోర్న్‌సైట్‌లో పెట్టేశారు. దీంతో మా కుటుంబం సహా ఊర్లో రచ్చ రచ్చ అయిపోయింది. అయితే తన తప్పు లేకపోయినా ఆఖరికి కుటుంబసభ్యులు కూడా నన్నే తప్పుబట్టారు అని పేర్కొంది.
కాగా సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే ఉర్ఫీ నటన కంటే బోల్డ్ డ్రెస్సింగ్‌తోనే ఎక్కువగా వార్తల్లో నిలిచిన సంగతి తెలిసిందే. ఇక హిందీ బిగ్‌బాస్ ఓటీటీతో మరింత పాపులారిటీ దక్కించుకుంంది.
Comments
Please login to add a commentAdd a comment