Urfi Javed
-
నాపై దిగజారుడు వ్యాఖ్యలు.. ఫేమస్ అవడానికేనా?: ఉర్ఫీ
కామెడీ ఒకర్ని నవ్వించేలా ఉండేలా కానీ అవతలివ్యక్తిని చులకన చేసేదిగా ఉండకూడదు. ఈ మధ్య వల్గర్, డార్క్, డబుల్ మీనింగ్ కామెడీలు ఎక్కువైపోయాయి. హాస్యం నెపంతో అసభ్యంగా మాట్లాడుతున్నారు. తాజాగా ఓ షోలోని కమెడియన్స్ కూడా అదే పని చేశారంటోంది నటి, సోషల్ మీడియా ఇన్ఫ్లూయెన్సర్ ఉర్ఫీ జావెద్.పిచ్చి జోకులు'ఇండియాస్ గాట్ లాటెంట్' అనే షోకు ఇటీవల ఉర్ఫీ జావెద్ గెస్ట్‌గా వెళ్లింది. కానీ అక్కడి కంటెస్టెంట్లు తనపై పిచ్చి జోకులు వేస్తూ చౌకబారు వ్యాఖ్యలు చేయడంతో షో మధ్యలోనే వెళ్లిపోయింది. తాజాగా ఈ చేదు అనుభవం గురించి ఆమె సోషల్ మీడియా వేదికగా స్పందించింది. 'వ్యూస్ కోసం ఇతరులపై అభ్యంతర వ్యాఖ్యలు చేయడం ఈ రోజుల్లో సామాన్యమైపోయింది. కానీ నన్ను అవమానిస్తుంటే, వేధిస్తుంటే, అవకాశాల కోసం ఎంతమందితో ఉన్నానని ఏవేవో లెక్కలు వేస్తుంటే నేను ఒప్పుకోను. ఫేమస్ అవడానికేనా?ఇదంతా ఎందుకు చేస్తున్నారు? క్షణాలపాటు ఫేమస్ అవడానికేనా? అక్కడ స్టేజీపై ఓ వ్యక్తిని ఎందుకు వికలాంగుడిగా నటిస్తున్నావని అడిగాను. అందుకతడు అందరి ముందు దుర్భాషలాడాడు. కోపంతో పిచ్చిగా ఏదేదో వాగాడు.ఈ సంఘటనకు సమ్ రైనాకు ఎటువంటి సబంధం లేదు. అతడు నాకు మంచి స్నేహితుడు. నేను కేవలం అక్కడున్న కంటెస్టెంట్ల గురించే మాట్లాడుతున్నాను' అని ఉర్ఫీ చెప్పుకొచ్చింది.చదవండి: భార్యాభర్తలే కానీ ఒక గదిలో ఉండరట.. ఎంత టార్చర్ పెట్టారో!: సింగర్ -
‘ఎల్లే గ్రాడ్యుయేట్స్ అవార్డ్స్–2024’ లో మెరిసిన బాలీవుడ్ తారలు, సెలబ్రిటీలు
-
ఎంత ఘోరంగా స్టెప్పులేసిందో! డ్యాన్స్ క్లాసులకు వెళ్లాల్సింది: ఉర్ఫీ
చిత్రవిచిత్ర వేషధారణతో ఎప్పుడూ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతూనే ఉంటుంది ఉర్ఫీ జావెద్. ఈ బుల్లితెర నటి ఇటీవలే ఫాలో కర్లో యార్ అనే సిరీస్‌లో మెరిసింది. ఇందులో ఉర్ఫీ పడ్డ కష్టాలను, తన జర్నీని, సోషల్ మీడియా సెన్సేషన్‌గా ఎలా ఎదిగిందన్నదీ చూపించారు.ఆ స్టెప్పయితే ఘోరంఇకపోతే ఏదైనా ముక్కుసూటిగా మాట్లాడే ఉర్ఫీ జావెద్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో హీరోయిన్ తృప్తి డిమ్రికి డ్యాన్స్ రాదనేసింది. ఉర్ఫీ మాట్లాడుతూ.. తృప్తి మంచి నటి.. అందులో సందేహమే లేదు. కానీ డ్యాన్స్ విషయానికి వచ్చేసరికి మాత్రం తను చాలా వీక్. ఎందుకు తృప్తి ఇలా చేశావ్? మేరే మెహబూబ్ పాటలో ఆ ఫ్లోర్ స్టెప్పయితే అస్సలు బాగోలేదు. నువ్వు డ్యాన్స్ క్లాసులకు వెళ్లి ఉండాల్సింది అని విమర్శించింది. నిజమే..ఈ కామెంట్లపై నెటిజన్ల నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఉర్ఫీ చెప్తోంది నిజమే.. నాకు తృప్తి అంటే చాలా ఇష్టం. కానీ ఆమెకు సరిగా డ్యాన్స్ చేయరాదు అని కొందరు కామెంట్లు చేస్తున్నారు. మరికొందరేమో ఆమె నటి.. డ్యాన్సర్ కాదు, మరొకరి గురించి చెప్పేముందు నువ్వు సరిగ్గా దుస్తులు ధరించడం నేర్చుకో అని కౌంటర్లు ఇస్తున్నారు.సినిమాకాగా యానిమల్ సినిమాతో నేషనల్ క్రష్‌గా మారిన తృప్తి డిమ్రి గత నెలలో 'విక్కీ విద్యాకో వో వాలా వీడియో' సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇందులో రాజ్ కుమార్ రావు హీరోగా నటించాడు. ఈ మూవీలోని మేరే మెహబూబ్ పాటలో రాజ్ కుమార్ ఎనర్జిటిక్ పర్ఫామెన్స్‌కు మంచి మార్కులు పడగా.. తృప్తి వేసిన స్టెప్పులకుగానూ ట్రోలింగ్‌కు గురైంది.చదవండి: Vijay Devarakonda: కిందపడ్డ విజయ్ దేవరకొండ.. వీడియో వైరల్! -
గుర్తు పట్టలేని విధంగా మారిపోయిన బిగ్‌బాస్ బ్యూటీ.. అసలేం జరిగింది?
సోషల్ మీడియాలో హల్చల్ చేస్తూ ఫేమస్ అయిన బ్యూటీ ఉర్ఫీ జావెద్. ఈ బాలీవుడ్ భామకు బిగ్‌బాస్‌తోనే గుర్తింపు వచ్చింది. ఆ తర్వాత బోల్డ్ ఫ్యాషన్ దుస్తులతో సోషల్ మీడియాలో సెన్సేషన్‌గా మారింది. విచిత్రమైన ఫ్యాషన్ డ్రెస్సులు ధరించి ఎప్పుడు వార్తల్లో నిలుస్తూనే ఉంటుంది. ఇదిలా ఉండగా.. తాజాగా తన ఇన్‌స్టాలో ఫోటోలు షేర్ చేసింది ముద్దుగుమ్మ. గుర్తు పట్టలేని విధంగా ఉన్న ఫోటోలు పంచుకున్న భామ.. తనకెదురైన సమస్యను ఫ్యాన్స్‌తో పంచుకుంది. ఇంతకీ అదేంటో తెలుసుకుందాం.తాను అధికంగా ఫిల్లర్స్ వాడినందు వల్లే మొహం ఇలా మారిపోయిందంటూ ఉర్ఫీ రాసుకొచ్చింది. వాటి వల్లే అలర్జీ బారిన పడినట్లు తెలిపింది. ప్రతి రోజు ఇదే సమస్యతో నిద్ర లేస్తానంటూ ఆవేదన వ్యక్తం చేసింది. వీటితో తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నట్లు పేర్కొంది. ఉర్ఫీ తన ఇన్‌స్టాలో రాస్తూ.. 'అధికస్థాయిలో ఫిల్లర్స్ వల్ల నా ముఖంలో ఇలా మారిపోయింది. నాకు అలెర్జీలు ఉన్నాయి. అంతే కాదు నా ముఖం చాలాచోట్ల ఉబ్బినట్లు కనిపిస్తుంది. నేను ప్రతి రోజు ఇలానే నిద్రలేస్తాను. నా ముఖం ఎప్పుడూ వాచి ఉంటుంది. ఎప్పుడూ తీవ్రమైన అసౌకర్యంగా ఉంటా. ఇవేమీ ఫిల్లర్స్ కాదు అబ్బాయిలు.. అలెర్జీ వల్లే ఏర్పడిందే. ఇమ్యునోథెరపీ తర్వాత ఇలా వాచిపోయిన ముఖంతో చూస్తే.. నేను అలర్జీతో బాధపడుతున్నా. నాకు 18 ఏళ్ల వయస్సు నుంచి ఉపయోగిస్తున్న సాధారణ ఫిల్లర్లు, బొటాక్స్ వల్ల ఏం కాలేదు. కానీ మీకు నా ముఖం ఉబ్బినట్లు కనిపిస్తే, ఎక్కువ ఫిల్లర్స్ తీసుకోమని మాత్రం సలహా ఇవ్వకండి. కాస్తా దయ చూపండి చాలు' అంటూ పోస్ట్ చేసింది. ఇది చూసిన ఫ్యాన్స్ గెట్ వెల్ సూన్ అంటూ కామెంట్స్ పెడుతున్నారు. View this post on Instagram A post shared by Uorfi (@urf7i) -
ఏమోయి? తెలుసునా మోయి మోయి!
‘ఇంటర్నెట్టున ఏ నిమిషానికి ఏ ట్రెండు వచ్చునో ఎవరు ఊహించెదరు’ అని పాడుకోవాల్సిన టైమ్ ఇది. ప్రస్తుతం ‘మోయి మోయి’ అనేది వైరల్ ట్రెండ్‌గా మారింది.‘టిక్‌టాక్’లో వైరల్ అయిన సెర్బియన్ పాట నుంచి ఈ ట్రెండ్ వచ్చింది. ఈ ట్రెండ్‌లో భాగంగా రకరకాల మీమ్స్, పేరడీలు, రీల్స్ వస్తున్నాయి. ‘మోయి మోయి’కి సొంత డ్యాన్స్‌ను కూడా క్రియేట్ చేశారు. సెర్బియన్ సింగర్–సాంగ్‌రైటర్ టెయా డోర ‘మోయి మోయి’ సాంగ్ యూట్యూబ్‌లో 60 మిలియన్ల వ్యూస్ సొంతం చేసుకుంది. నిజానికి పాటలో ‘మోయి మోర్’ అని ఉంటుంది. అయితే మిస్టేక్ వల్ల‘మోర్’ కాస్త ‘మోయి’గా మారింది. తన పాట ట్రెండ్ కావడంతో టెయా డోర ఆనందంతో తబ్బిబ్బైపోతూ‘థ్రెడ్స్’లో ఇలా స్పందించింది... ‘సెర్బియన్ మ్యూజిక్ ప్రపంచవ్యాప్తం కావడం సంతోషంగా ఉంది. ప్రతిరోజూ ప్రపంచం నలుమూలల నుంచి అభినందన సందేశాలు వస్తున్నాయి. ఐ లవ్ యూ’ ‘మోయి మోయి’ ట్రెండ్ నేపథ్యంలో బాలీవుడ్ నటీమణులు ఉర్ఫీ జావెద్, డాలీ సింగ్‌లు ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన వీడియో వైరల్ అయింది. ఈ వీడియోలో ఉర్వీ, డాలీసింగ్ల ‘మోయి మోయి’ డ్యాన్స్‌కు ప్రేక్షకులు ‘వావ్’ అంటున్నారు. -
ఫేక్ అరెస్ట్ వీడియో.. నటిపై క్రిమినల్ కేసు నమోదు
ఉర్ఫీ జావెద్ గురించి బాలీవుడ్ ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేదు. సినిమాల కంటే సోషల్ మీడియా ద్వారానే ఆమె పాపులారిటీ సంపాదించుకుంది. విచిత్రమైన డ్రెస్సులు ధరించి.. ఆ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తు అభిమానులను అలరిస్తుంది. ఆమెకు ఉన్న వింత ఫ్యాషన్ పిచ్చి కారణంగా అప్పుడప్పుడు విమర్శల పాలవుతుంటుంది. కొన్నిసార్లు అయితే ఆమె షేర్ చేసే ఫోటోలు కాంట్రవర్సీకి దారి తీస్తాయి. ఈ మధ్యే ఆమె భూల్ భులయ్యలోని ఛోటా పండిత్ పాత్ర గెటప్‌లో ఫోటో షూట్ చేసి.. వాటిని నెట్టింట్లో పెట్టగా..ఓ వర్గం బెదిరింపులకు దిగింది. ఆ ఫోటోలు డిలీట్ చేయకపోతే చంపేస్తామని సోషల్ మీడియా వేదికగా బెదిరింపులకు దిగారు. అయినప్పటికీ.. ఉర్ఫీ మాత్రం వాటిని తొలగించలేదు. ఇదిలా ఉంటే.. తాజాగా ఉర్ఫీ షేర్ చేసిన ఓ వీడియా కారణంగా..ఆమెపై కేసు నమోదైంది. ఏం జరిగింది? తనను ముంబై పోలీసులు అరెస్ట్ చేస్తున్నట్లు ఉర్ఫీ తన ఇన్‌స్టా ఖాతాలో ఓ వీడియోని పోస్ట్ చేసింది. అందులో ఓ కేఫ్ వద్ద ఉర్ఫీని ఇద్దరు మహిళా పోలీసులు అరెస్ట్ చేస్తున్నట్లు ఉంది. నన్నుందుకు అరెస్ట్ చేస్తున్నారని ఉర్ఫీ ప్రశ్నించగా.. ‘చిన్న చిన్న దుస్తులు ధరించి ఎవరైనా తిరుగుతారా? అంటూ పోలీసులు ఫైర్ అవుతున్నారు. కాసేపు వాదనలు జరిగాక.. ఉర్ఫీ వెళ్లి పోలీసు వాహనంలో ఎక్కింది. ఈ వీడియో నెట్టింట బాగా వైరల్ అయింది. ‘చిన్న దుస్తులు ధరిస్తే అరెస్ట్ చేస్తారా’ అని నెటిజన్స్ ముంబై పోలీసులను ట్రోల్ చేశారు. ఫేక్ వీడియో.. కేసు నమోదు అయితే ఉర్ఫీని అరెస్ట్ చేసినట్లు వచ్చిన వీడియో ఫేక్‌ది. ప్రచారం కోసం ఉర్ఫీనే ఆ వీడియో రెడీ చేయించుకుంది. ముంబై పోలీసులు స్పందించేవరకు ఆ విషయం బయటకు రాలేదు. వీడియో వైరల్ కావడంతో ముంబై పోలీసులు విచారణ చేపట్టారు. ఉర్ఫీని అరెస్ట్ చేసింది నకిలీ పోలీసులని విచారణలో తేలింది. ఈ ఘటనను సీరియస్‌గా తీసుకున్న పోలీసులు.. ఉర్ఫీతోపాటు, వీడియోలో ఉన్న వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేశారు. పబ్లిసిటీ కోసం ఇలా చట్టంతో ఆటలాడటం మంచిదికాదని అన్నారు. ఈ వీడియోలో పోలీస్ యూనిఫాం, సింబల్స్‌ను దుర్వినియోగపరిచినందుకు గానూ వారిపై ఐపీసీ 171, 419, 500, 34 సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు ముంబై పోలీసులు వెల్లడించారు -
ఆ ఫోటోలు డిలీట్ చేయకపోతే చంపేస్తాం... ఉర్ఫికి బెదిరింపులు!
సినిమాల కంటే సోషల్ మీడియా ద్వారనే ఎక్కువ పాపులారిటీ సొంతం చేసుకుంది బాలీవుడ్ భామ ఉర్ఫీ జావెద్. విచిత్రమైన వేషధారణతో ఫోటో షూట్ చేసి..వాటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ అభిమానులను అలరిస్తుంది. అయితే కొన్నిసార్లు అవి వివాదానికి దారి తీస్తుంటాయి. తాజాగా ఈ బిగ్‌బాస్ భామకు హత్యా బెదరింపులు వచ్చాయి. సోషల్ మీడియాలో ఫోస్ట్ చేసిన ఫోటోలు డిలీట్ చేయకపోతే.. చంపేస్తామని కొంతమంది బెదిరిస్తున్నారట. ఈ విషయాన్ని స్వయంగా ఉర్ఫీనే ఎక్స్ వేదికగా చెప్పింది. అసలేం జరిగింది? విచిత్ర వేషధారణతో ట్రెండింగ్‌లో నిలిచే మోడల్, నటి ఉర్ఫీ జావేద్. నిత్యం ఏదో ఒక విచిత్రమైన డ్రెస్‌తో ఫోటోషూట్ చేసి వాటిని తన సోషల్ మీడియా ఖాతాల్లో పోస్ట్ చేయడం ఆమెకు అలవాటు. అలా తాజాగా భూల్ భులయ్యలోని ఛోటా పండిత్ క్యారెక్టర్ డ్రెస్ ధరించి.. ఫోటోషూట్ చేసింది. అంతేకాదు అదే గెటప్‌లో ఓ పార్టీకి కూడా హాజరైంది. దీంతో ఆమె ఫోటోలు నెట్టింట వైరల్ అయ్యాయి. చంపేస్తామని బెదరింపులు వింత ఫ్యాషన్‌తో విమర్శలకు కేంద్రబిందువుగా మారే ఉర్పీకి ఛోటా పండిత్ గెటప్ లేనిపోని తలనొప్పిని తెచ్చిపెట్టింది. ఛోటా పండిత్ గెటప్‌లో పార్టీకి హాజరవ్వడం పట్ల ఓ వర్గం ప్రజలు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. తమ మతాన్ని కించపరిచేలా చేస్తున్నావని, ఇలాగే కంటిన్యూ చేస్తే చంపేస్తామని కొంతమంది ఆమెను బెదరిస్తున్నారట. అంతేకాదు సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఫోటోలు, వీడియోలను డిలీట్ చేయలని, లేదంటే చంపడం తమకు పెద్ద పనే కాదంటూ బెదిరింపు మెయిల్స్ పంపిస్తున్నారట. ఈ విషయాన్ని స్వయంగా ఉర్ఫీనే సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది. అయితే ఉర్ఫీకి ఇలాంటి బెదిరింపులు రావడం పరిపాటే. గతంలో కూడా అనేకసార్లు ఉర్ఫీకి ఈ తరహా బెదిరింపులు వచ్చాయి. I’m just shocked and appalled by this country mahn , I’m getting death threats in recreating a character from a movie where as that character didn’t get any backlash :/ pic.twitter.com/pOl9FvTYzT — Uorfi (@uorfi_) October 30, 2023 -
నువ్వు నా డ్రెస్ గురించి మాట్లాడతావా?.. శిల్పాశెట్టి భర్తపై బిగ్‌బాస్ బ్యూటీ ఫైర్!
తన విచిత్రమైన వేషధారణతో సోషల్ మీడియాలో ఓ రేంజ్లో హల్చల్ చేస్తోన్న బిగ్‌బాస్ బ్యూటీ ఉర్ఫీ జావెద్. సినిమాల కంటే తన డ్రెస్సులతోనే పాపులారిటీ దక్కించుకుంది. ప్రతి రోజు ఏదో ఒక వెరైటీ దుస్తులతో వివాదాలతో వార్తల్లో నిలుస్తూ ఉంటోంది. అయితే ఈ మాజీ బిగ్ బాస్ కంటెస్టెంట్ డ్రెస్సింగ్ సెన్స్‌పై శిల్పాశెట్టి భర్త, వ్యాపారవేత్త రాజ్ కుంద్రా కామెంట్స్ చేసిన సంగతి తెలిసిందే. అతను చేసిన కామెంట్స్‌పై ఉర్ఫీ జావెద్ తీవ్రస్థాయిలో మండిపడింది. తన ఇన్‌స్టా స్టోరీస్‌లో రాస్తూ అతనిపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇటీవల రాజ్ కుంద్రా తన ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకున్న వీడియోలో ఉర్ఫీ జావెద్ గురించి ప్రస్తావించారు. రాజ్ కుంద్రా ఏం ధరిస్తాడు.. అలాగే ఉర్ఫీ జావెద్ ఏం ధరించదు? అనే విషయాన్ని మీడియా ఎక్కువగా ఫోకస్ చేస్తుందని కామెంట్స్ చేశారు. అయితే అతను తన డ్రెస్సింగ్‌పై చేసిన కామెంట్స్ ఉర్ఫీకి ఆగ్రహం తెప్పించాయి. 'ఇతరుల శరీరంతో వ్యాపారం చేసిన వ్యక్తి.. నా దుస్తులపై మాట్లాడతాడా అంటూ.. క్షమించండి పోర్న్ కింగ్' అంటూ ఘాటుగానే స్పందించింది. కాగా.. ఉర్ఫీ పంచ్ బీట్ సీజన్- 2, బడే భయ్యా కి దుల్హనియా, మేరీ దుర్గా, బేపన్నా వంటి షోలలో కనిపించింది. కరణ్ జోహార్ హోస్ట్ చేసిన బిగ్ బాస్ ఓటీటీ సీజన్లో పాల్గొంది. రాజ్‌కుంద్రాపై కేసు శిల్పాశెట్టి భర్త, రాజ్‌కుంద్రా పోర్న్ రాకెట్ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్నారు. మొబైల్ యాప్‌ల ద్వారా అశ్లీల వీడియోలను పంపిణీ చేయడం వంటి ఆరోపణలపై వ్యాపారవేత్తను జూలై 2021లో రాజ్‌కుంద్రాను ముంబయి పోలీసులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసులో రెండు నెలల తర్వాత అతనికి బెయిల్ మంజూరైంది. View this post on Instagram A post shared by Raj Kundra (@onlyrajkundra) -
సీక్రెట్‌గా బిగ్‌బాస్ బ్యూటీ ఎంగేజ్మెంట్.. ఎవరా మిస్టరీ మ్యాన్?
ఉర్ఫీ జావెద్.. పెద్దగా సినిమాలు చేయకపోయినా హీరోయిన్ రేంజ్లో ఫ్యాన్స్, పాపులారిటీ ఉంది. అదే రేంజ్లో ఆమెను తిట్టిపోసేవాళ్లు కూడా ఉన్నారు. కారణం.. తన వేషధారణ. తను సాంప్రదాయంగా, మోడ్రన్‌గా దుస్తులు ధరించాలనుకోదు. వినూత్నంగా.. ఈ రెండింటి కోవలోకి రానివిధంగా బట్టలు డిజైన్ చేయించుకుని వాటినే ధరిస్తుంది. కాదేదీ కవితకనర్హం అన్నట్లుగా పనికిరాని పాతసామానును కూడా డ్రెస్సులుగా ధరిస్తూ ఉంటుంది. ఇలా చిత్రవిచిత్ర వేషధారణతో అందరినీ అవాక్కయ్యేలా చేసే ఉర్ఫీ జావెద్ త్వరలో బ్యాచిలర్ లైఫ్‌కు ఫుల్స్టాప్ పెట్టనున్నట్లు తెలుస్తోంది. ఓ వ్యక్తితో ఆమె పూజలో పాల్గొన్న ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. దీంతో ఆమె ఎంగేజ్మెంట్ అయిందంటూ పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ఇంతకీ ఉర్ఫీతో జీవితం పంచుకోవాలనుకుంటున్న ఆ వ్యక్తి ఎవరా? అని నెటిజన్లు ఆరా తీస్తున్నారు. నిజంగానే నిశ్చితార్థం జరిగిందా? మరి ఇంతవరకు ఉర్ఫీ ఒక్క పోస్ట్ కూడా చేయలేదేంటబ్బా.. అని కామెంట్లు చేస్తున్నారు. కాగా ఉర్ఫీ మొదట్లో సీరియల్స్‌లో నటించింది. యే రిష్తా క్యా కెహ్లాతా హై, కసౌటీ జిందగీ కే వంటి ధారావాహికల్లో మెరిసింది. అయితే ఎప్పుడైతే బిగ్‌బాస్ ఓటీటీ షోలో అడుగుపెట్టిందో ఒక్కసారిగా ఫేమస్ అయింది. అనంతరం స్ప్లిట్స్‌విల్లా అనే రియాలిటీ షో 14వ సీజన్లోనూ పాల్గొంది. చదవండి: రతికలాంటి అమ్మాయి భార్యగా రావాలి.. హీరో రిప్లై ఏంటో తెలుసా? -
ఆడిషన్ కోసం ఇంటికి రమ్మన్నాడు.. ఉర్ఫీ షాకింగ్ కామెంట్స్!
బిగ్ బాస్ నటి ఉర్ఫీ జావెద్ పరిచయం అక్కర్లేని పేరు. తన విచిత్రమైన ఫ్యాషన్ డ్రెస్సులతో వార్తల్లో నిలుస్తూ ఉంటోంది. అంతే కాకుండా సోషల్ మీడియాలో ఎప్పుడు యాక్టివ్‌గా ఉంటోంది. ఇటీవల ముంబయిలో ఓ ఇంటరాక్షన్ సందర్భంగా పలు ఆసక్తికర కామెంట్స్ చేసింది. ముంబయిలో తొలినాళ్లలో ఎదురైన ఇబ్బందులను గురించి నోరు విప్పింది. సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేసిన ఉర్ఫీ.. కెరీర్ ఆరంభం ఎదురైన క్యాస్టింగ్ కౌచ్ అనుభవాలను వెల్లడించింది. (ఇది చదవండి: నాకున్న జబ్బు ఇదే, ఎక్కువ రోజులు బతకనని చెప్పారు: నటి) ముంబయికి వచ్చిన తర్వాత సినిమాల్లో అవకాశాల కోసం చాలా ఆడిషన్స్‌కు హాజరైనట్లు తెలిపింది. అయితే ఓ దర్శకుడు మాత్రం తనను నీ లవర్‌లా భావించి సన్నిహితంగా మెలగాలని కోరినట్లు ఉర్ఫీ తన అనుభవాన్ని పంచుకుంది. అంతే కాకుండా తనను కౌగిలించుకోవాలని బలవంతం చేశాడని పేర్కొంది. అయితే తాను మాత్రం అయిష్టంకానే కౌగిలించుకుని.. అక్కడే అతనికి గుడ్ బై చెప్పానని తెలిపింది. అయితే ఆ గదిలో కెమెరా లేకపోవడంపై అతన్ని నిలదీస్తే.. నా తలే నా పర్సనల్ కెమెరా అని బదులిచ్చాడని వివరించింది. ఇలాంటి వారి బారిన పడకుండా యువతులను హెచ్చరించడానికి కాస్టింగ్ కౌచ్ అనుభవాలను పంచుకున్నట్లు వివరించింది. ఆ తర్వాత ముంబయికి చెందిన ఓ దర్శకుడు ఆడిషన్ కోసం ఏకంగా తన ఇంటికి పిలిచాడని ఉర్ఫీ గుర్తు చేసుకుంది. కాగా.. ప్రస్తుతం బిగ్ బాస్-16 ఫేమ్ నిమృత్ కౌర్ అహ్లువాలియా నటిస్తోన్న ఏక్తా కపూర్ చిత్రం 'లవ్, సెక్స్ ఔర్ ధోఖా 2'లో ఉర్ఫీ కనిపించనుంది. ఇటీవలే ముగిసిన బిగ్ బాస్ ఓటీటీ-2 సీజన్లో గెస్ట్‌గా కనిపించింది. అంతేకాకుండా 'బడే భయ్యా కి దుల్హనియా', 'మేరీ దుర్గా', 'బేపన్నా' లాంటి సీరియల్స్‌లో కూడా నటించింది. (ఇది చదవండి: రీఎంట్రీలో చిరంజీవి ఆ తప్పులు చేస్తున్నారా?) -
వికటించిన సర్జరీ.. అందవిహీనంగా బిగ్‌బాస్ బ్యూటీ.. ఫోటోలు వైరల్
సోషల్ మీడియా వాడేవారికి బిగ్‌బాస్ బ్యూటీ, నటి ఉర్ఫీ జావెద్ సుపరిచితమే! చిత్రవిచిత్ర వేషధారణతో వార్తల్లోకెక్కే ఈ బ్యూటీ ఓ సర్జరీ వల్ల తన ముఖం ఎంత అందవిహీనంగా మారిందో చెప్పుకొచ్చింది. పెదాలు అందంగా కనిపించేందుకు లిప్ ఫిల్లర్ సర్జరీ చేయించుకున్న ఆమె అవి తన ముఖారవిందాన్ని పాడు చేశాయంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో రాసుకొచ్చింది. సర్జరీ వికటించడంతో తన పరిస్థితి ఎలా తయారైందనేది చెప్పుకొచ్చింది. 'పెదాల కోసం చేసుకున్న సర్జరీ ప్రయాణాన్ని ఇప్పుడు మీతో పంచుకుంటున్నాను.. 18 ఏళ్ల వయసు నుంచి లిప్ ఫిల్లర్ సర్జరీ చేయించుకుంటున్నాను. అప్పుడు నా దగ్గర ఎక్కువగా డబ్బులుండేవి కావు. కానీ నా పెదాలు చాలా సన్నగా ఉండటంతో దాన్ని ఎలాగైనా సరే లావుగా కనబడేలా చేయాలనుకున్నాను. ఓ వైద్యుడి దగ్గరకు వెళ్తే తక్కువ ఖర్చుతో చేసేస్తా అన్నాడు. కానీ ఫలితం.. ఇదిగో ఇక్కడ కనిపిస్తున్న ఫోటోలా తయారైంది. కొంతకాలానికి వీటిని ఆపేయాల్సి వచ్చింది. అది చాలా ప్రమాదకరం, దాని పరిణామాలు ఎంతో బాధాకారంగా ఉంటాయి. మీరు ఇలా చేయించుకోవద్దని చెప్పడం లేదు. కానీ ఫిల్లర్స్, బొటాక్స్ వాడేటప్పుడు జాగ్రత్తగా ఉండమని చెప్తున్నా. ఇప్పటికీ నేను లిప్ ఫిల్లర్స్ వాడుతున్నాను. నా ముఖానికి ఏది సరిపోతుంది? ఏది ఎంత మోతాదులో సూటవుతుందనేది నాకిప్పుడు బాగా తెలుసు. మీరెవరైనా డాక్టర్ దగ్గరకు వెళ్లేముందు అన్నింటి గురించి క్షుణ్ణంగా తెలుసుకోండి. మీ ముఖం బాగోలేదని, మీ శరీరాకృతి సరిగా లేదని మిమ్మల్ని మీరు ద్వేషించుకునే బదులు ఇలాంటి ఫిల్లర్స్, సర్జరీ ఎంచుకోవడమే మంచిదని చెప్తాను. కాకపోతే మంచి డాక్టర్ దగ్గర మాత్రమే ట్రీట్మెంట్ తీసుకోండి' అని రాసుకొచ్చింది ఉర్ఫీ జావెద్. View this post on Instagram A post shared by Uorfi Javed (@urf7i) చదవండి: చంద్రముఖి 2 ప్రాణభయం.. నిద్రలేని రాత్రులు.. -
టమాటా చిత్ర కథ: అహ నా టమాటంట
‘చికెన్ తినాలంటే చికెన్ మాత్రమే తిననక్కర్లేదు. గాల్లో వేలాడుతున్న కోడిని చూస్తూ, ఊహించుకుంటూ బ్రహ్మాండంగా తినవచ్చు’ అనే గొప్ప సత్యాన్ని ‘అహ నా పెళ్లంట’ సినిమాలో లక్ష్మీపతి (కోట శ్రీనివాసరావు) జనులకు చెప్పకనే చెప్పారు. ‘ఇప్పుడు ఆ సినిమాని రీమేక్ చేస్తే గాలిలో వేలాడుతున్న కోడికి బదులు టమాటాలు ఉంటాయి’ అని నెటిజనులు ఒకటే జోకులు! ఒక మహిళ దుబాయ్‌కి వెళ్లింది. ఇండియాకు తిరిగి వచ్చే ముందు...‘నీ కోసం ఏం తీసుకురమ్మంటావు?’ అని తల్లిని అడిగింది. ‘బంగారు నగలో, లగ్జరీ గిఫ్టో అడిగి ఉంటుంది’ అని అనుకుంటారు చాలామంది. కానీ ఆ తల్లి బంగారం కంటే విలువైన టమాటాలను అడిగింది. ఒకటి కాదు రెండు కాదు...‘పది కిలోల టమాటాలు తీసుకురామ్మా’ అని కూతురిని అడిగింది. పదికిలోల టమాటాలను పెరల్పెట్ స్టోరేజ్ జార్లలో ప్యాక్ చేసి ఇండియాకు తీసుకువచ్చింది కూతురు. ఈవిడ సోదరి ట్విట్టర్లో షేర్ చేసిన దుబాయ్ టమాటాల స్టోరీ వైరల్ అయింది. ∙∙ బంగారు నగలు అంటే ఎవరికి మాత్రం మక్కువ ఉండదు? అయితే టమాటాలేమో బంగారం కంటే విలువైపోయాయి. ఇట్టి విషయాన్ని దృష్టిలో పెట్టుకొని బాలీవుడ్ నటి ఉర్ఫీ జావెద్ ‘యూరేకా... టమాటాలతో ఆభరణాలు’ అని అరిచింది. టమాటాలను చెవిరింగులుగా ధరిస్తూ ‘న్యూ గోల్డ్’ కాప్షన్‌తో ఇన్‌స్టాగ్రామ్‌లో ఫొటో షేర్ చేసింది. ∙∙ శిల్పాశెట్టి షేర్ చేసిన ఇన్స్టాగ్రామ్ రీల్ 11 మిలియన్ల వ్యూస్ సొంతం చేసుకుంది. ఇక వీడియో విషయానికి వస్తే... టమాటాల కోసం సూపర్‌మార్కెట్‌కు వెళుతుంది శెట్టి. టమాటాలన్నీ కూడబలుక్కొని ‘టచ్‌మీ నాట్’ అన్నట్లుగా చూస్తుంటాయి. టమాటాలను చేతిలో తీసుకున్న ప్రతిసారీ ఆమె నటించిన ‘దడ్కన్’ సినిమాలోని ‘ఖబడ్దార్. హౌ డేర్ యూ’ అనే డైలాగ్ ప్లే అవుతుంటుంది! -
విమానంలో బిగ్‌బాస్ బ్యూటీకి వేధింపులు.. అది కూడా తప్పతాగి!
బాలీవుడ్ నటి ఉర్ఫీ జావేద్ బీ టౌన్లో పరిచయం అక్కర్లేని పేరు. బిగ్ బాస్ షోతో ఫేమ్ తెచ్చుకున్న భామ ఎప్పుడు ఏదో ఒకరకంగా వార్తల్లో నిలుస్తూ ఉంటుంది. తన ఫ్యాషన్ డ్రెస్సులతో నెటిజన్స్‌ను అలరిస్తోంది. అంతే కాదు.. కొన్ని సార్లు ఆమె చేసిన పనులు వివాదాస్పదం అవుతూనే ఉన్నాయి. వింత ఫ్యాషన్‌తో విమర్శలకు కేంద్రబిందువుగా మారింది ఉర్ఫీ. (ఇది చదవండి: సమంత ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. ఆ లిస్ట్‌లో నెంబర్ వన్ ప్లేస్!) ఇటీవల టమాటాలను చెవి దిద్దులుగా పెట్టుకుని అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. అయితే తాజాగా ఈ అమ్మడు మరోసారి వార్తల్లోకెక్కింది. అయితే ఈసారి తన డ్రెస్‌తో కాదండోయ్. తాను విమానంలో వేధింపులకు గురైనట్లు ఇన్‌స్టాలో స్టోరీస్‌లో పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఇది సోషల్ మీడియాలో తెగ వైరల్‌గా మారింది. అసలేం జరిగిందో ఓ సారి తెలుసుకుందాం. ఉర్ఫీ జావేద్ ఇన్‌స్టాలో రాస్తూ.. 'నేను ముంబయి నుంచి గోవా వెళ్తుండగా నన్ను ఓ వ్యక్తి వేధింపులకు గురి చేశాడు. నన్ను ఉద్దేశించి చాలా అసభ్యకరంగా మాట్లాడాడు. నేను వారితో వాదనకు దిగా. ఆ సమయంలో వాళ్లలో ఒకరు మా ఫ్రెండ్ తాగి ఉన్నాడు. వదిలేయండి అని వేడుకున్నాడు. తాగితే మహిళలను వేధిస్తారా? అంటూ గట్టిగానే మాట్లాడా. అంతే కాదు.. నేను పబ్లిక్ ఫిగర్‌నే కానీ.. పబ్లిక్ ప్రాపర్టీనైతే కాదు కదా. ' అని రాసుకొచ్చింది. కాగా.. బడే భయ్యా కి దుల్హానియా, మేరీ దుర్గా, బేపన్నా, పంచ్ బీట్ సీజన్ 2, బిగ్ బాస్ వంటి షోలతో ఫేమ్ తెచ్చుకుంది. ఎప్పుడు వింత వింత ఫ్యాషన్ డ్రెస్సులు ధరిస్తూ ఎప్పుడు తరచుగా వివాదాల్లో నిలుస్తోంది. (ఇది చదవండి: బాలీవుడ్లోనే కాదు, సౌత్‌లో కూడా.. కాంప్రమైజ్ అడిగారు: సీరియల్ నటి) -
25 ఏళ్ల నుంచి అవకాశాలే రాలే, అందుకే ఇలా తయారైంది: ఉర్ఫీ
ఓటీటీలో ఏముందని? అంతా గే, స్వలింగ సంపర్కానికి సంబంధించిన కంటెంట్‌తోనే నిండిపోయింది. అంతకుమించి అక్కడేం లేదు అని నటి అమీషా పటేల్ చేసిన వ్యాఖ్యలపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. తాజాగా నటి వ్యాఖ్యలపై సోషల్ మీడియా ఇన్ఫ్లూయెన్సర్ ఉర్ఫీ జావెద్ ఫైర్ అయింది. 'అసలు గేయిజం, లెస్బియినిజం అంటే అర్థం తెలుసా? మీ పిల్లలను వాటికి దూరంగా ఉంచాలనుకుంటున్నారా? ఇలాంటి తారలు ఇటువంటి సున్నితమైన అంశాల గురించి ముందుగా కొంత చదువుకుని వచ్చి మాట్లాడితే బాగుంటుంది. అలా కాకుండా ఏదీ తెలియకపోయినా ఏదో ఒకటి వాగితే నాకు చెడ్డ చిరాకు పుడుతుంది. బహుశా 25 ఏళ్లుగా ఏ పనీ దొరక్కపోవడం వల్ల ఆమె ఇలా తయారైనట్లుంది' అని వ్యంగ్యాస్త్రాలు సంధించింది. కాగా అమీషా పటేల్ త్వరలో గదర్ 2 సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సందర్భంగా ఓ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ.. ఈ మధ్య కాలంలో వస్తున్న సినిమాలు, సిరీస్‌లు కుటుంబమంతా కలిసి చూసేలా ఉండట్లేదు. కానీ మా సినిమా మాత్రం అమ్మమ్మ-తాతయ్యలతోనూ కలిసి చూడవచ్చు. జనాలు ఒక మంచి సినిమా కోసం ఎదురుచూస్తున్నారు. అమ్మమ్మ, నానమ్మ, తాతయ్యలతో కలిసి సినిమా చూసే రోజులు పోయాయి. ఓటీటీలో అయితే అసలే చూడలేం. ఓటీటీలో స్వలింగ సంపర్కం, గేకు సంబంధించిన సన్నివేశాలే ఉంటున్నాయి. పిల్లలతో కలిసి చూడలేని అభ్యంతరకర రీతిలో కంటెంట్ ఉంటోంది. ఒక మంచి సినిమా కావాలని కోరుకుంటున్న ప్రేక్షకులకు గదర్ 2 తప్పకుండా ఒక మంచి సమాధానం అవుతుంది అని చెప్పుకొచ్చింది ఉర్ఫీ జావెద్. కాగా 2001లో వచ్చి గదర్: ఏక్ ప్రేమ్ కథ సినిమాకు ఈ చిత్రం సీక్వెల్‌గా తెరకెక్కింది. ఈ మూవీ ఆగస్టు 11న విడుదల కానుంది. చదవండి: నైట్ క్లబ్లో హీరోయిన్‌తో ముద్దులాట.. హీరో ప్రైవేట్ వీడియో లీక్ -
ఫ్యాషన్ ఉసురు తీస్తున్న ఉర్ఫీ!
-
ఆ డ్రెస్ ఆవుపేడతో తయారు చేశారా? నటిపై విమర్శలు
విభిన్నమైన దుస్తులు ధరిస్తూ వార్తల్లో నిలుస్తుంది బాలీవుడ్ నటి ఉర్ఫీ జావేద్. హిందీలో ఓ సీరియల్ ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్న ఉర్ఫీ.. బిగ్‌బాస్ ఓటీటీలో పాల్గొని ఫేమస్ అయింది. ఆ తర్వాత విచిత్రమైన డ్రెస్సులు ధరిస్తూ.. సోషల్ మీడియా స్టార్‌గా ఎదిగింది. ముంబైలో ఉర్ఫీ ఏ ప్రాంతానికి వెళ్లినా కెమెరాల కన్ను ఆమె వైపు తిరుగుతాయి. దానికి కారణం ఆమె ధరించిన డ్రెస్సే. ఒంటి నిండా దుస్తులు ధరించడం ఆమెకు అస్సలు నచ్చదు. తాజాగా ఉర్ఫీ ధరించిన డ్రెస్ ఒక్కటి నెట్టింట వైరల్ అవుతోంది. చెట్టు బెరడుతో తయారు చేసిన డ్రెస్ వేసుకొని ఫోటో షూట్ చేసింది ఉర్ఫీ. ఈ అవుట్‌ఫిట్ తయారు చేసే క్రమంలో ఏ చెట్టుకు హానీ కలగలేదని చెప్పింది. ఉర్ఫీ తాజా ఫోటోలపై నెటిజన్స్ స్పందిస్తూ.. ‘నువ్వు ధరించిన ఆ డ్రెస్ ఆవు పేడతో తయారు చేసినట్లు ఉంది. ప్రతిదీ ట్రెండ్ అవుతుందని ఊహించుకోకు’ అని విమర్శిస్తున్నారు. (చదవండి: రాత్రికి రాత్రే రూ. 40కోట్లు నష్టపోయాను: కంగనా రనౌత్) గతంలోనూ ఉర్ఫీపై ఇలాంటి విమర్శలే వచ్చాయి. ఓ సారి నెమలి డ్రెస్ అంటూ నెమలి డ్రెస్ అంటూ అర్ధనగ్నంగా ఫోటోలకు పోజులు ఇచ్చింది. అలాగే ఓ సారి చూయింగ్ డ్రెస్ అంటూ నమిలి ఊసిన చూయింగ్ గమ్‌లను శరీరానికి అంటించుకొని ఫోటో షూట్ చేసింది. ఇలా ఫ్యాషన్ పేరుతో ఒక్కోసారి ఒక్కో వెరైటీ దుస్తులు ధరిస్తూ పరువు తీస్తుందని కొంతమంది నెటిజన్స్ కామెంట్ చేస్తున్నారు. View this post on Instagram A post shared by Uorfi (@urf7i) -
బూతు సైట్లో నా ఫోటో.. కన్నతండ్రే అడల్ట్ స్టార్ అని పిలిచాడు: నటి
అదిరేటి డ్రెస్సు నే వేస్తే మీకు దడ.. అంటుంది బిగ్‌బాస్ బ్యూటీ ఉర్ఫీ జావెద్. నిజంగానే చిత్రవిచిత్ర వస్త్రధారణతో దడ పుట్టిస్టూ ఉంటుంది. కుక్కపిల్ల, అగ్గిపుల్ల, సబ్బు బిళ్ల.. కాదేదీ కవితకనర్హం అన్నట్లుగా తాళ్లు, గడ్డిపరక, మల్లెపూలు, చెత్త కవర్, చైన్, ప్లాస్టర్.. ఇలా అన్నింటినీ డ్రెస్సులుగా మార్చేసి ధరిస్తుంది ఉర్ఫీ. అందుకే ఆమె సోషల్ మీడియా సెన్సేషన్ అయింది. చిన్నతనంలో ఎన్నో కష్టాలు పడ్డ ఉర్ఫీ వాటిని అధిగమిస్తూ సెలబ్రిటీ స్థాయికి ఎదిగింది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో తన కుటుంబమే తనను ద్వేషించిందని చెప్పుకొచ్చింది నటి. 'ఒక ట్యూబ్‌ను టాప్‌గా ధరించిన ఫోటోను నా ఫేస్బుక్లో అప్లోడ్ చేశాను. కొందరు దాన్ని తీసుకువెళ్లి యదాతథంగా అడల్ట్ సైట్లో వదిలారు. దాన్ని ఎలాంటి మార్ఫింగ్ చేయలేదు కాబట్టి చాలామంది అది నేనేనని సులువుగా గుర్తుపట్టారు. నన్ను అడల్ట్ స్టార్ అని పిలిచారు. అలా అన్నప్రతిసారి నా వీడియో ఏది? చూపించండని నిలదీసేదాన్ని. కానీ కన్నతండ్రే నన్ను అడల్ట్ స్టార్ అని ముద్ర వేశాడు. అడల్ట్ సైట్ వాళ్లు మమ్మల్ని రూ.50 లక్షలు అడుగుతున్నారని అందరికీ చెప్పేవాడు. బహుశా నా తండ్రి నన్ను చెడ్డదాన్ని చేసి సింపథీ కోరుకున్నాడేమో! నా తండ్రి, బంధువులు అందరూ నన్ను దారుణమైన మాటలన్నారు. కొన్నిసార్లు చేయి చేసుకున్నారు కూడా!' అని చెప్పుకొచ్చింది ఉర్ఫీ. ఈ అవమానాలు, హింస భరించలేక 17 ఏళ్ల వయసులో తన చెల్లెళ్లను తీసుకుని పోలీసు మెట్లెక్కింది ఉర్ఫీ. కానీ అక్కడ తనకు ఎలాంటి సహాయం దొరక్కపోవడంతో లక్నో వెళ్లింది. ఎన్నో కష్టాలు పడి ఈ స్థాయికి చేరుకుంది. కాగా ఉర్ఫీ ఇటీవలె స్ప్లిట్స్‌విల్లా రియాలిటీ షోలో మెరిసింది. -
'నన్ను క్షమించండి.. ఇకపై అలాంటి డ్రెస్సులు వేసుకోను'
బాలీవుడ్ నటి, బిగ్ బాస్ కంటెస్టెంట్ ఉర్ఫీ జావేద్ బీ టౌన్లో పరిచయం అక్కర్లేని పేరు. ఎప్పుడు తన విచిత్రమైన వస్త్రాధారణతో వార్తల్లో నిలుస్తూ ఉంటుంది. ఉర్ఫీ బోల్డ్ దుస్తులతో వివాదాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారింది. తాజాగా ఉర్ఫీ మరోసారి వార్తల్లో నిలిచింది. తాను చేసిన ఒక ట్వీట్ అభిమానులను ఆశ్చర్యానికి గురిచేసింది. ఉర్పీ తన ట్వీట్లో రాస్తూ.. 'నేను వేసుకున్న దుస్తుల వల్ల అందరి మనోభావాలను దెబ్బతీసినందుకు క్షమాపణలు కోరుతున్నా. ఇప్పటి నుంచి మీరు కొత్త ఉర్ఫీని చూస్తారు. ఇకపై అలాంటి దుస్తులు ధరించను' అంటూ పోస్ట్ చేశారు. ఇది చూసిన నెటిజన్స్ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. అసలు ఈ ట్వీట్ చేసింది ఆమెనేనా అంటూ అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఉర్ఫీ జావేద్ చేసిన ఈ ట్వీట్‌పై చాలా మంది నెటిజన్లు ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు. ఉర్ఫీ ఏప్రిల్ ఫూల్ చేయడానికి ఇలా చేసి ఉంటుందని భావిస్తున్నారు. I apologise for hurting everyone’s sentiments by wearing what I wear . From now on you guys will see a changed Uorfi . Changed clothes . Maafi — Uorfi (@uorfi_) March 31, 2023 నెటిజన్స్ ఊహించినట్లే ఏప్రిల్ ఫూల్ అంటూ ఉర్ఫీ మరో ట్వీట్ చేసింది. నా గురించి నాకు తెలుసంటూ నెటిజన్లకు షాకిచ్చింది. పొట్టి పొట్టి డ్రెస్సులు ధరించి ఎప్పుడు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తూ ఉంటుంది బాలీవుడ్ భామ. తన డ్రెస్ సెన్స్‌తో పలుసార్లు విమర్శలకు గురైంది. April fool 🤓🤓🤓 I know so kiddish of me — Uorfi (@uorfi_) April 1, 2023 -
అమ్మాయిలు అలా కోరుకోవడంలో తప్పేముంది.. సోనాలిపై ఉర్ఫీ ఫైర్
బాలీవుడ్ సోనాలి కులకర్ణి భారతీయ మహిళలపై చేసిన కామెంట్స్ సంచలనంగా మారాయి. ప్రస్తుత అమ్మాయిలు సోమరిపోతులుగా తయారయ్యారని ఘాటు వ్యాఖ్యలు చేసింది. తాజాగా ఆమె వ్యాఖ్యల పట్ల మరో నటి ఉర్ఫీ జావేద్ ఆగ్రహం వ్యక్తం చేసింది. మంచి సంపాదన ఉన్న భర్త కావాలని కోరుకోవడంలో తప్పేముందని ప్రశ్నించింది. సోనాలి మాట్లాడిన వీడియోను ట్విటర్లో పోస్ట్ చేసింది. పురుషులు శతాబ్దాలుగా స్త్రీలను కేవలం పిల్లలు కనే యంత్రాలుగా చూస్తున్నారని తీవ్రస్థాయిలో మండిపడింది. ఉర్పీ తన ట్విట్లో రాస్తూ..'ఆధునిక మహిళలు తమ పనితో పాటు ఇంటి పనులను కూడా చేస్తున్నారు. అలాంటి వారిని మీరు సోమరిపోతులు అని పిలుస్తున్నారా? మంచి సంపాదన ఉన్న భర్తను కోరుకోవడంలో తప్పేంటి? శతాబ్దాలుగా పురుషులు స్త్రీలను పిల్లలు కనే యంత్రంగా మాత్రమే చూశారు. వివాహానికి ప్రధాన కారణం కట్నం. మహిళలు కట్నం అడగడానికి భయపడకండి. అవును మీరు చెప్పింది నిజమే.. మహిళలు పని చేయాలి కానీ అది అందరికీ లభించని ప్రత్యేకమైన హక్కు.'. అంటూ పోస్ట్ చేసింది. How insensitive , whatever you said ! You’re calling modern day women lazy when they are handling their work as well as household chores together ? What’s wrong in wanting a husband whose earning good ? Men for centuries only saw women as child vending machine and yes the main… https://t.co/g1rQGyuSDg — Uorfi (@uorfi_) March 17, 2023 -
మోడ్రన్ డ్రెస్సులు వేసుకోనిచ్చేవారు కాదు, ఎన్నో చిత్రహింసలు : నటి
బాలీవుడ్ నటి ఉర్ఫీ జావేద్ గురించి పరిచయం అక్కర్లేదు. వెరైటీ డ్రెస్సులతో ఎప్పుడూ వార్తల్లో నిలిచే ఈ భామ తన డ్రెస్సింగ్ స్టైల్‌తో చేస్తున్న రచ్చ అంతా ఇంతా కాదు. చిరిగిన బట్టలు, పగిలిన గ్లాస్ ముక్కలు, గోనెసంచి.. ఇలా ఒకటేమిటి ఫ్యాషన్‌కు కాదేదీ అనర్హం అన్నట్లు రకరకాల కాస్ట్యూమ్స్‌తో దర్శనం ఇస్తుంది. తన బోల్డ్ ఫ్యాషన్‌తో సోషల్ మీడియాను షేక్ చేసే ఉర్ఫీ తాజాగా చిన్నతనంలో తాను ఎదుర్కొన్న చేదు అనుభవాలను గుర్తుచేసుకుంది. ఓ మ్యాగజైన్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ.. చిన్నప్పటి నుంచి నాకు ఫ్యాషన్‌పై మక్కువ ఉండేది, టీవీ షోస్ చూస్తున్నప్పుడు అలాంటి మోడ్రన్ డ్రస్సులు వేసుకోవాలని, ఇంకా అందంగా తయారవ్వాలని అనిపించేది. కానీ మా నాన్న అందుకు అంగీకరించేవాడు కాదు. పైపెచ్చు మమ్మల్ని హింసించేవాడు. అమ్మను ఎప్పుడూ తిడుతూ, కొడుతూ చిత్రహింసలు పెట్టేవాడు. తండ్రి చేస్తున్న అరాచాకలను భరించలేక రెండుసార్లు ఆత్మహత్యాయత్నం కూడా చేశాను. కానీ ఇప్పుడు నాకు నచ్చిన బట్టలు వేసుకుంటూ నాకు తెలిసిన ఫ్యాషన్‌ను ఫాలో అవుతున్నా అంటూ చెప్పుకొచ్చింది. -
నటి లగేజీ ఎత్తుకెళ్లైన క్యాబ్ డ్రైవర్.. తాగి ఫోన్ చేసి వేధింపులు
చిత్రవిచిత్ర డ్రెస్సులతో సోషల్ మీడియాను ఆగం చేసే బిగ్‌బాస్ బ్యూటీ ఉర్ఫీ జావెద్‌కు చేదు అనుభవం ఎదురైంది. ఇటీవల ఢిల్లీలో ఓ క్యాబ్ డ్రైవర్ తనతో అనుచితంగా ప్రవర్తించాడని ట్విటర్లో రాసుకొచ్చింది. 'ఢిల్లీ ఎయిర్‌పోర్టుకు వెళ్లడానికి ఓ క్యాబ్ బుక్ చేసుకున్నాను. దాదాపు ఆరు గంటల కోసం దాన్ని బుక్ చేసుకున్నా. మధ్యలో లంచ్ చేద్దామని ఆగాను. ఇంతలో ఆ కారు డ్రైవర్ నా లగేజీతో ఉడాయించాడు. నేను వెంటనే నాకు తెలిసిన ఫ్రెండ్ సాయం కోరాను. అతడు కల్పించుకోవడంతో ఆ క్యాబ్ డ్రైవర్ ఓ గంట తర్వాత పూటుగా తాగి వచ్చాడు. నిజానికి అతడు పార్కింగ్ ఏరియాలోనే ఉన్నాడు. కానీ తన లొకేషన్ మాత్రం నేనున్న చోటుకు దూరంగా ఉన్నట్లు చూపించింది. పైగా ఆ డ్రైవర్‌కు ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఎత్తలేదు. అతడు తిరిగి వచ్చాక ఎందుకిలా చేశావంటే సరైన సమాధానం ఇవ్వకుండా నిర్లక్ష్యంగా మాట్లాడాడు' అని రాసుకొచ్చింది. దీనిపై ఉబర్ యాజమాన్యం స్పందిస్తూ తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చింది. అయితే ఇక్కడే మరో సమస్య మొదలైంది. ఉర్ఫీకి సదరు డ్రైవర్ తాగి ఫోన్లు చేస్తున్నాడట. ఈ విషయాన్ని సైతం ఉర్ఫీ ట్విటర్లో తెలియజేసింది. 'ఉబర్‌కు ఫిర్యాదు చేసిన తర్వాత ఆ డ్రైవర్ తాగి మరీ ఫోన్లు చేస్తున్నాడు. ఇప్పటివరకు 17 మిస్డ్ కాల్స్ వచ్చాయి. ఇంకా ఫోన్ చేస్తూ నన్ను వేధిస్తూనే ఉన్నాడు. ఇంత ఫిర్యాదు చేసినా మళ్లీ ఇలా జరుగుతోందంటే మీరసలు ఏమాత్రం పట్టించుకోలేదని అర్థమవుతోంది' అంటూ ఉబర్‌పై ఆగ్రహం వ్యక్తం చేసింది నటి. Had the worst experience with @UberINSupport @Uber in delhi,booked a cab for 6 hours,on my way to airport stopped to have lunch, the driver vanished with my luggage in the car. After interference from my male friend the driver came back completely drunk after 1 hour @Uber_India pic.twitter.com/KhaT05rsMQ — Uorfi (@uorfi_) February 21, 2023 Cont- @Uber_India That guy couldn’t even walk properly , at first he kept lying about his location that he was in the parking but his location showed 1 hour further from ours. Had to call my male friend to intervene cause he wasn’t moving at all despite calling him so many times — Uorfi (@uorfi_) February 21, 2023 The fact that your driver still kept drunk calling me even after complaining it to you , 17 miss calls , kept calling and abusing me . I complained to the Uber safety team , they were useless. @Uber_India Girls avoid using Uber — Uorfi (@uorfi_) February 22, 2023 చదవండి: నన్ను కిందకు లాగుతున్నారు, డబ్బులిచ్చి మరీ... కిరణ్ -
నా డ్రెస్సింగ్ వల్ల ఎవరూ ఇల్లు అద్దెకివ్వడం లేదు: బిగ్‌బాస్ బ్యూటీ
బిగ్‌బాస్ బ్యూటీ ఉర్ఫీ జావెద్ చిత్రవిచిత్ర డ్రెస్సులతో వెరీ ఫేమస్. రీయూజ్ అనే పదాన్ని బాగా వంటపట్టించుకున్న ఆమె వస్తువులను కూడా వస్త్రధారణ కింద మార్చేస్తూ సరికొత్త అవతారాల్లో దర్శనమిస్తుంటుంది. అయితే ఈ నటికి ఉండటానికి ఇల్లే దొరకడం లేదట. అద్దె ఎక్కువిస్తానన్నా సరే ఎవరూ తలదాచుకోవడానికి ఇల్లు ఇవ్వడం లేదని సోషల్ మీడియాలో విచారం వ్యక్తం చేసింది ఉర్ఫీ. 'నా వస్త్రధారణ చూసి హిందూముస్లింలెవరూ నాకు ఇల్లు అద్దెకివ్వడం లేదు. కొందరు రాజకీయ నేతల నుంచి నాకు బెదిరింపులు వస్తుండటంతో ఆ భయంతో మరికొందరు యజమానులు వారి ఇల్లు అద్దెకివ్వడానికి వెనకడుగు వేస్తున్నారు. ముంబైలో అద్దె ఇంటిని పొందడం ఎంతో కష్టం' అని ట్విటర్లో రాసుకొచ్చింది. గతంలో కూడా ఉర్ఫీకి ఇలాంటి పరిస్థితే ఎదురైందని ఓ నెటిజన్ కామెంట్ చేయగా దీనికి ఉర్ఫీ స్పందించింది. 'ఒకసారి కాదు ప్రతిసారి ఇదే పరిస్థితి.. నటిని, అందులోనూ సింగిల్‌గా ఉన్నాను.. నాలాంటి వాళ్లకు ఇల్లు దొరకడం కష్టమే' అని రిప్లై ఇచ్చింది. Muslim owners don’t want to rent me house cause of the way I dress, Hindi owners don’t want to rent me cause I’m Muslim. Some owners have an issue with the political threats I get . Finding a rental apartment in mumbai is so tuff — Uorfi (@uorfi_) January 24, 2023 It’s literally Everytime mahn , single , Muslim , actress - impossible to find a house — Uorfi (@uorfi_) January 24, 2023 చదవండి: -
దుస్తులపై అసభ్య వ్యాఖ్యలు.. బీజేపీ నాయకురాలిపై ఉర్ఫి జావేద్ ఫిర్యాదు
సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే వారికి బిగ్‌బాస్ ఓటీటీ ఫేం, బుల్లితెర నటి ఉర్ఫి జావేద్ పేరును ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. నిత్యం ఏదో ఒక పోస్ట్‌తో వార్తల్లో నిలవడం ఉర్ఫికి అలవాటు.బాదే భయ్యా కీ దుల్హనియా’సీరియల్‌తో బుల్లితెరపై అడుగుపెట్టిన ఉర్ఫి.. ‘దుర్గా’, ప్రముఖ రియాల్టీ షో ‘బిగ్‌బాస్ ఓటీటీ’లో పాల్గొన్న మంచి పేరు తెచ్చుకుంది. ముఖ్యంగా ఢిఫరెంట్ డ్రెస్‌లతో అందరినీ అట్రాక్ట్ చేస్తుంటుంది 25 ఏళ్ల ఈ భామ. తాజాగా ఉర్ఫి జావేద్.. బీజేపీ మహిళా నేత చిత్ర కిషోర్ వాఘ్కు వ్యతిరేకంగా మహారాష్ట్ర మహిళా కమిషన్‌ను ఆశ్రయించింది. తను ధరించే దుస్తులపై వాఘే అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు ఆమెపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర మహిళ కమిషన్‌కు ఫిర్యాదు చేసింది. పబ్లిక్ డొమైన్లో ఉన్న నటిపై బెదిరింపులకు పాల్పడినందుకు వాఘ్‌పై ఫిర్యాదు నమోదైందని ఉర్ఫి తరపు న్యాయవాది నితిన్ సత్పుటే తెలిపారు. ప్రజల్లో గుర్తింంపు పొందిన మోడల్/నటికి హాని కలిగించేలా బీజేపీ నేత చిత్ర కిషోర్ వాఘ్‌పై ఐపీసీ సెక్షన్ U/s 153(A)(B), 504, 506, 506(ii) కింద ఫిర్యాదు చేశాను. మహిళా కమిషన్ చైర్ పర్సన్ రుపలీ చకంకర్‌ను కలిసి రాతపూర్వకంగా ఫిర్యాదు చేస్తాను. ఆమెపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. అలాగే చిత్ర వాఘే వ్యాఖ్యల అతనంరం నటి ప్రాణాలకు ముప్పు ఉందని, ఆమెకు రక్షణ కల్పించాలని కోరాను’ అని జావేద్ తరపు న్యాయవాది నితిన్ సత్పుటే అన్నారు. भाषा नको तर कृती हवी.. सार्वजनिक ठिकाणी उघडंनागडं फिरणं हि आपल्या महाराष्ट्राची संस्कृती आहे का ? मुंबईतल्या भर रस्त्यात उर्फीच्या या शरीरप्रदर्शनाचं जे अतिशय बिभत्स आहे @Maha_MahilaAyog समर्थन करतंय का ? आणि हो …कायदा कायद्याचं काम करणारंच महिला आयोग काही करणार की नाही ? pic.twitter.com/O0KSb9A5r7 — Chitra Kishor Wagh (@ChitraKWagh) January 4, 2023 కాగా జనవరి 4న బీజేపీ నేత కిషోర్ వాఘే ఉర్ఫి జావేద్‌పై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఆమె డ్రెస్సింగ్‌పై మహిళా కమిషన్ ఏమైనా చేస్తుందా? అని ప్రశ్నించారు. వీధుల్లో బహిరంగంగా అర్ధనగ్నంగా మహిళలు నడుస్తున్నారని ఈ విషయాన్ని మహిళా కమిషన్ ఎందుకు పట్టించుకోవడం లేదని విమర్శించారు.. ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు అని ప్రశ్నించారు. ఈ నిరసన ఉర్ఫిజావేద్పై కాదని అలా అర్ధనగ్నంగా బహిరంగ ప్రదేశాల్లో నడవడంపై మాత్రమే అని పేర్కొన్నారు. ఈ మేరకు ట్విటర్లో వీడియో విడుదల చేశారు. ఈ ట్వీట్లపై స్పందించిన ఉర్ఫి జావేద్ తన న్యాయవాది ద్వారా మహారాష్ట్ర మహిళా కమిషన్‌కు ఫిర్యాదు చేశారు. -
అవంటేనే అలర్జీ, అందుకే దుస్తులు లేకుండా కనిపిస్తా: నటి
చిత్రవిచిత్ర డ్రెస్సులతో బిగ్‌బాస్ బ్యూటీ ఉర్ఫీ జావెద్ ఎంతో ఫేమస్. ఆమె వేషధారణను చూసే ఔరా అనేవాళ్లతోపాటు ఇదేం డ్రెస్సురా బాబూ అని తలలు పట్టుకునేవాళ్లు కూడా ఉన్నారు. కొందరైతే తన వేషధారణ అసభ్యంగా ఉందని పోలీస్ స్టేషన్ మెట్లెక్కారు కూడా! చాలావరకు తన శరీరాన్ని కప్పివేయని డ్రెస్సులే వేసుకోవడానికి ఇష్టపడే ఉర్ఫీ అందుకు గల కారణాన్ని తాజాగా బయటపెట్టింది. తనకు దుస్తులంటే అలర్జీ అని చెప్పింది. అంతేకాదు అందుకు సంబంధించిన సాక్ష్యాన్ని కూడా సోషల్ మీడియాలో షేర్ చేసింది. తన కాళ్లకు దద్దులు వచ్చిన ఫోటోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. 'శరీరాన్ని పూర్తిగా కప్పే ఉన్ని దుస్తులు వేసుకుంటే ఇదిగో ఇలాగే జరుగుతుంది. శరీరంపై ర్యాషెస్, దద్దులు వస్తాయి. ఇది చాలా సీరియస్ ప్రాబ్లమ్. నేను దుస్తులు ఎందుకు ధరించనో మీకు ఇప్పుడైనా అర్థమైందా? నిండుగా కప్పే డ్రెస్సులు వేసుకుంటే నా శరీరం ఒప్పుకోవడం లేదు. అందుకు ఈ ఫోటోనే నిదర్శనం. అందుకే నేను ఎక్కువగా నగ్నంగా కనిపిస్తుంటాను. నా శరీరానికి దుస్తులంటే అలర్జీ. మరీ ముఖ్యంగా ఉన్ని దుస్తువులు వేసుకున్నప్పుడు పరిస్థితి మరింత దారుణంగా తయారవుతోంది' అని ఇన్స్టాగ్రామ్ స్టోరీలో చెప్పుకొచ్చింది ఉర్ఫీ. చదవండి: నాన్న చనిపోయాక నెలన్నర రోజులు గదిలో నుంచి బయటకు రాలేదు ఎంత దారుణం? నా తండ్రితో పెళ్లి చేస్తున్నారు: శ్రీముఖి ఫైర్ -
'నన్నెవరు కొట్టలేదు.. అదో పెద్ద స్కామ్': నటి ఆవేదన
హిందీ బిగ్‌బాస్ ఓటీటీ ఫేం ఉర్ఫీ జావెద్ బాలీవుడ్లో పరిచయం అక్కర్లేదు. ఎప్పుడు వివాదాలతో వార్తల్లో నిలుస్తూ ఉంటుంది బాలీవుడ్ భామ. ఆమెపై పలువురు పోలీసులకు సైతం ఫిర్యాదులు చేశారు. తాజాగా మరోసారి వార్తల్లో ఉర్ఫీ జావెద్. అయితే ఈసారి తనకు ఎదురైన సమస్యను సోషల్ మీడియాలో ప్రస్తావించింది. ఈసారి ఆమె కంటి వద్ద గాయాన్ని ప్రస్తావిస్తూ ఇన్‌స్టాలో స్టోరీలో పోస్ట్ చేసింది. ఆ ఫోటోలు సోషల్ మీడియాలో వైరలయ్యాయి. దీంతో ఉర్ఫీ మొహానికి ఏమైందంటూ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఉర్ఫీ జావేద్ తన ఇన్‌స్టాలో ప్రస్తావిస్తూ.. 'నేను కళ్ల కింద డార్క్ సర్కిల్స్ పోయేందుకు ఓ క్రీమ్ వాడాను. అది నాకు చాలా ఎఫెక్ట్ అయింది. మీరనుకున్నట్లు నన్నెవరూ కొట్టలేదు. దయచేసి ఎవరూ కూడా డార్క్ సర్కిల్స్ క్రీమ్స్ వాడొద్దు. అదంతా ఓ స్కామ్. ప్రపంచంలోని ఏ క్రీమ్ కూడా పనికిరాదు. డార్క్ సర్కిల్స్ కోసం క్రీములు వాడొద్దంటూ' ఉర్ఫీ పోస్ట్ చేసింది. కేవలం అండర్ ఐ ఫిల్లర్లు లేదా ఇతర కాస్మెటిక్ విధానాలతో మాత్రమే నల్లటి వలయాలను నివారించవచ్చని ఆమె తెలిపారు. ఉర్ఫీ కెరీర్: బాలీవుడ్ 'బిగ్ బాస్ ఓటీటీ సీజన్‌తో ఉర్ఫీ ఫేమస్ అయ్యారు. ప్రస్తుతం ఆమె 'స్ప్లిట్స్‌విల్లా 14' అనే రియాల్టీ షోలో కంటెస్టెంట్‌గా ఉన్నారు. అంతే కాకుండా ఆమె 'బడే భయ్యాకి దుల్హనియా', 'చంద్ర నందిని', 'మేరీ దుర్గా', 'బేపన్నా', 'జిజీ మా', 'యే రిష్తా క్యా కెహ్లతా హై', 'కసౌతీ జిందగీ కే' వంటి టెలివిజన్ షోలలో కూడా నటించారు. -
నాతోనే మీకు సమస్య, ఆ మగాళ్లతో ప్రాబ్లమ్ లేదు కదా!
తను ఒక్క ఫోటో వదిలిదంటే చాలు సోషల్ మీడియా షేక్ అయిపోతుంది. వావ్ అంటూ ఆమె అందాన్ని పొగిడేవాళ్లు ఎంతమందో.. అదే సమయంలో ఇదేం పోయేకాలం అని ఆమెను తిట్టేవాళ్లు కూడా చాలామందే ఉన్నారు. అదేంటి? ఫోటో షేర్ చేస్తే తిట్టడమేంటి? అనుకుంటున్నారా? అలా ఉంటాయి మరి ఈ బిగ్‌బాస్ బ్యూటీ ధరించే డ్రెస్సులు. ఇంతకీ ఆమె మరెవరో కాదు సోషల్ మీడియా సెన్సేషన్ ఉర్ఫీ జావెద్. రీయూజ్ అనే మాటను బాగా జీర్ణించుకున్న ఉర్ఫీ నిత్యం వెరైటీ డ్రెస్సులతో దర్శనమిస్తుంటుంది. సైకిల్ చైన్, ప్లాస్టిక్ పైప్, క్యాసెట్ టేప్, ఫోటోలు, తాళ్లు.. ఆఖరికి గోనె సంచిని కూడా వదల్లేదు. ఇలా దేన్నీ వదిలిపెట్టుకుండా డిఫరెంట్‌గా డ్రెస్ డిజైన్ చేయించుకుని నిత్యం ఏదో ఒక అవతారంలో కనిపిస్తూ ఉంటుందీ భామ. ఇలా డ్రెస్సింగ్ స్టైల్‌తో అందరినీ ఆశ్చర్యపరిచే ఉర్ఫీ ఎక్కడపడితే అక్కడ నాన్సెన్స్ చేస్తుందంటూ ఆమెపై కేసు నమోదైంది. దీనిపై ఉర్ఫీ ఆగ్రహం వ్యక్తం చేసింది. 'నాపై ఇంకా ఎన్ని ఫిర్యాదులు చేస్తారో అర్థం కావట్లేదు. అయినా మీరు గ్రేటబ్బా! నన్ను అత్యాచారం చేసి చంపుతానని బెదిరింపులు వస్తుంటే ఏ ఒక్కరికీ అభ్యంతరం లేదు.. ఏ బాధా లేదు. నేను వేసుకునే దుస్తువులే మీకు సమస్య.. అంతేకానీ నన్ను అత్యాచారం చేసి చంపుతానన్న వాళ్లతో మీకే ప్రాబ్లమ్ లేదు కదా!' అని ఉర్ఫీ మండిపడింది. చదవండి: అబ్బా.. నీ ముఖం చూడలేకపోతున్నాం.. స్టార్ కిడ్‌పై ట్రోలింగ్ మోడల్‌తో డిన్నర్‌కు వెళ్లిన టైటానిక్ హీరో -
'ఇంకోసారి ఆ డ్రెస్సులు వేసుకుంటే చంపేస్తాం'... నటికి వార్నింగ్
పొట్టి పొట్టి డ్రెస్సులతో ఎప్పుడు వివాదాల్లో వినిపించే నటి, బిగ్‌బాస్ మాజీ కంటెస్టెంట్ ఉర్ఫీ జావెద్. మరీ ఆమె వేసుకున్న డ్రెస్సులు అలా ఉంటాయి. ఆమె ఫ్యాషన్‌ను మరెవ్వరూ కూడా ఫాలో కాలేరు. ఆమె డ్రెస్సింగ్ చూసి ఇదేం ఫ్యాషన్ రా బాబు ముక్కున వేలేసుకోవడం ఖాయం. ఆ డ్రెస్సులతో అంతలా ఫేమస్ అయింది ఈ భామ. కాగితాలతో, వైర్లతో, చైన్లతో, అద్దాలతో, గోనె సంచితో ఇలా ఒక్కటేమిటి.. రకరకాల డ్రెస్సులతో కళ్లకు కనిపించిన దేన్నీ వదిలిపెట్టలేదు ఈ బిగ్ బాస్ బ్యూటీ. (చదవండి: Urfi Javed: అందరి కళ్లు ఉర్ఫీ డ్రెస్సుల మీదే, డిజైనర్ ఎవరో తెలుసా?) తాజాగా ఆమె విచిత్రమైన ఫ్యాషన్ దుస్తులపై హిందుస్థానీ భావు అనే వ్యక్తి ఆగ్రహం వ్యక్తం చేశారు. బోల్డ్ దుస్తుల్లో కనిపించడం మానేయాలని ఓ వీడియోలో ఆమెను బెదిరించారు. ఇది భారతీయ సంస్కృతికి విరుద్ధమంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉర్ఫీని బెదిరించడంతో హిందుస్థానీ భావుపై ఆమె ఆగ్రహం వ్యక్తంచేసింది. సోషల్ మీడియా వేదికగా ఆమె అతనికి వార్నింగ్ ఇచ్చింది. సోషల్ మీడియాలో అందరూ నన్ను చంపేస్తామని బెదిరిస్తున్నారని, మానసికంగా వేధిస్తున్నారని హిందుస్తానీ భావును ఉద్దేశించి ఉర్ఫీ ఆగ్రహం వ్యక్తం చేసింది. నటి తన ఇన్‌స్టాగ్రామ్‌లో రాస్తూ.. 'ఇప్పుడు మీరు నన్ను బహిరంగంగా బెదిరించారు. నేను తలచుకుంటే మిమ్మల్ని కటకటాల వెనక్కి నెట్టగలనని మీకు తెలుసు. ఏది ఏమైనా నాకు ఏది నచ్చిదే అది వేసుకుంటూనే ఉంటా.' అంటూ రాసుకొచ్చింది ఈ భామ. ఇలాంటి పరిణామాలతో తన భద్రతపై ఆందోళన కలిగిస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తోంది. -
ఆల్భమ్ సాంగ్‌లో రెచ్చిపోయిన ఉర్ఫీ జావేద్.. తీవ్ర వ్యతిరేకత.. కేసు నమోదు
సోషల్ మీడియా సెన్సేషన్, హిందీ బిగ్‌బాస్ ఓటీటీ ఫేం ఉర్ఫీ జావేద్ తన తీరుతో మరోసారి వివాదంలో నిలిచింది. తాజాగా ఆమె నటించిన ఓ అల్బమ్ సాంగ్‌పై పలు సామాజిక సంఘాల నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తోంది. ఈ పాటలో ఉర్ఫీ చీరకట్టు, డాన్స్‌పై అభ్యంతరం వ్యక్తం అవుతోంది. ఈ మేరకు న్యూఢిల్లీ పోలీస్ స్టేషన్లో అక్టోబర్ 23న ఆమెపై ఫిర్యాదు కూడా నమోదైంది. ఈ వీడియోలో ఉర్ఫీ తీరు లైంగిక చర్యలను ప్రోత్సహించేలా ఉందంటూ సదరు ఫిర్యాదు దారుడు పేర్కొన్నారు. చదవండి: పెళ్లిలో నటి పూర్ణ వేసుకున్న బంగారం ఎంతో తెలుసా? కాగా ఉర్పీ జావేద్ నటించిన ‘హాయే హాయే యే మజ్బూరీ’ అనే అల్భమ్ సాంగ్ అక్టోబర్ 11న రిలీజ్ అయ్యింది. ఇందులో ఆమె రెడ్ కలర్ చీర కట్టులో కనిపించింది. ఉర్ఫీ విభిన్న వస్త్రాధారణ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. చిత్రవిచిత్రమైన డ్రెస్సింగ్‌తో ఆమె తరచూ ట్రోల్స్ బారిన పడుతుంది. తాజాగా ఈ పాటలో సైతం ఆమె చీరకట్టులో ఫుల్ గ్లామర్ షో చేసింది. దీంతో ఉర్పీ తీరుపై అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ వీడియోలో ఆమె డ్రెస్సింగ్, డాన్స్ తీరు లైంగిక పరంగా రెచ్చగొట్టెలా ఉందంటూ పలువురి నుంచి వాదనలు వినిపిస్తున్నాయి. చదవండి: ఆర్థిక ఇబ్బందులు.. నగలు అమ్మి ఆ గడ్డు పరిస్థితుల నుంచి బయటపడ్డా: ప్రగతి ఇదిలా ఉంటే సోషల్ మీడియాలో తనపై వచ్చే నెగిటివిటిపై గతంలో ఉర్ఫీ జావేద్ స్పందిస్తూ ఇవేవి తనని బాధించలేవంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ వివాదంపై సైతం స్పందిస్తూ తన డ్రెస్సెంగ్, ఫ్యాషన్ పట్ల చాలా గర్వంగా ఉన్నానంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ‘ఈ ట్రోల్స్ నాపై ఎలాంటి ప్రభావం చూపలేవు. నా ఫ్యాషన్ తీరు పట్ల నేను చాలా గర్వంగా ఉన్నాను. విమర్శలు, వివాదాలు నన్ను ఆపలేవు. ఎందుకంటే నేను ఏం చేసినా, ఏం పోస్ట్ చేసిన దాన్ని అందరు పెద్ద సమస్యగా చిత్రీకరిస్తూనే ఉంటారు’ అంటూ ఆమె చెప్పుకొచ్చింది. -
చిత్రవిచిత్ర డ్రెస్సులు, ఉర్ఫీ వెనకాల ఉన్నది ఎవరంటే?
అదిరేటి డ్రెస్సు మేమేస్తే బెదిరేటి లుక్కు మీరిస్తే దడ.. ఆ మీకు దడ.... ఈ పాట ఇప్పుడున్న సెలబ్రిటీలలో ఉర్ఫీ జావెద్‌కు కరెక్ట్‌గా సరిపోతుంది. అవును, ఆమె వేసుకున్న డ్రెస్సులు అలా ఉంటాయి మరి! ఆమె ఫ్యాషన్‌ను మరెవ్వరూ ఫాలో కాలేరు. కొందరు ఆమె డ్రెస్సింగ్ చూసి వారెవ్వా అనుకుంటే మరికొందరికేమో ఇదేం ఫ్యాషన్ అని దడ పుడుతుంది. అది అందమో, అరాచకమో అర్థం కాక జుట్టు పీక్కుంటున్నారు జనాలు. వేస్ట్‌లో నుంచి కూడా బెస్ట్ బయటకు తీస్తూ రకరకాల డ్రెస్సులు ట్రై చేసింది ఉర్ఫీ. కాగితాలతో, వైర్లతో, చైన్లతో, అద్దాలతో, గోనె సంచితో ఇలా ఒక్కటేమిటి.. కళ్లకు కనిపించిన దేన్నీ వదిలిపెట్టలేదు. మరి ఇలా ఆమెకు చిత్రవిచిత్ర డ్రెస్సులు డిజైన్ చేసేది ఎవరో తెలుసా? ముంబైకి చెందిన శ్వేత శ్రీవాస్తవ. ఉర్ఫీ బోల్డ్‌గా కనిపిస్తే ఆమె బోల్డ్‌గా మాట్లాడుతుంది. తమ ఆలోచనలను వేసుకునే దుస్తుల ద్వారా వ్యక్తపరుస్తున్నామంటున్నారు. ఏదైనా గాజువస్తువుతో డ్రెస్ చేస్తే ఎలా ఉంటుంది? అని ఉర్ఫీ అడిగితే.. పగిలిన గాజు అద్దంతోనే తయారు చేసేస్తే పోలా అని వత్తాసు పలుకుతుంది శ్వేత. వీళ్లిద్దరి మధ్య 15 ఏళ్ల పరిచయం ఉంది. ఆ చనువుతోనే ఒకరికొకరు కొత్త కొత్త ఐడియాలు చెప్పుకుంటారు. వెంటనే దాన్ని శ్వేత అమల్లోకి తీసుకువస్తే ఆ డ్రెస్ వేసుకుని కెమెరాల ముందుకు వచ్చేస్తుంది ఉర్ఫీ. అలా శ్వేత డిజైన్ చేసిన ఎన్నో డ్రెస్సులు సోషల్ మీడియాలో వైరల్ అయిన విషయం తెలిసిందే! వీరి ఫ్యాషన్‌ను మెచ్చుకున్నా, బాలేదని తిట్టిపోసినా అన్నింటినీ ఒకేలా తీసుకున్నారిద్దరూ. ఎవ్వరేమనుకున్నా డోంట్ కేర్ అంటున్నారు. View this post on Instagram A post shared by Uorfi (@urf7i) చదవండి: ఆదిరెడ్డి ముఖంపై కాలు పెట్టిన గీతూ విష్ణుప్రియ ఫేస్బుక్ అకౌంట్లో అశ్లీల వీడియోలు, ఫొటోలు -
అప్పుల పాలైన బిగ్‌బాస్ బ్యూటీ? ఆర్థిక పరిస్థితి బాలేదంటూ నటి ఆవేదన
ఉర్ఫీ జావేద్.. సోషల్ మీడియా యూజర్లకు పెద్ద పరిచయం అక్కర్లేని పేరు. హిందీ బిగ్‌బాస్ ఓటీటీలో మెరిసిన ఈ బ్యూటీ బయటకు వచ్చాక తన డ్రెస్సింగ్ స్టైల్‌తో చేస్తున్న రచ్చ అంతా ఇంతా కాదు. ఉర్ఫీ పేరు వింటే చాలు వెంటనే ఆమె భిన్నమైన వస్త్రశైలి గుర్తుకు వస్తుంది. ఆమె వేసే దుస్తులను చూసి ఇలా కూడా డిజైన్ చేయోచ్చా అని నోళ్లు వెళ్లబెట్టిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. చిరిగిన బట్టలు, పగిలిన గ్లాస్ ముక్కలు, బికినీలతో అందాలను ప్రదర్శిస్తూ అనేక సార్లు ట్రోల్స్ బారిన పడింది. అయితే బిగ్‌బాస్‌తో పాపులర్ అయిన ఈ బ్యూటీ ఈ రియాలిటీ షో అడుగు పెట్టేందుకు చాలా కష్టపడ్డానంటోంది. చదవండి: ‘లైగర్’ ఎఫెక్ట్.. రెంట్ కట్టలేక ఆ ఫ్లాట్ ఖాళీ చేసిన పూరీ? ఇటీవల ఓ చానల్‌తో ముచ్చటించిన ఆమె ఎనిమిదేళ్లకు తీవ్ర ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నానంటూ ఆవేదన వ్యక్తం చేసింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. తన జీవితంలో ఎన్నో చేదు అనుభవాలు ఉన్నాయంటూ ఎమోషనల్ అయ్యింది. ‘8 సంవత్సరాలుగా పీకల్లోతూ అప్పుల్లో కురుకపోయాను. కనీసం బిగ్‌బాస్ ఓటీటీ షోకి వచ్చేందుకు నా దగ్గర డబ్బులు కూడా లేకుంటే. షో వేసుకునేందుకు కావాల్సిన దుస్తులను కూడా అప్పు చేసి కొన్నాను. అంత కష్టపడి బిగ్‌బాస్ హౌజ్‌లో అడుగుపెడితే కనీసం అవసరాలు తీర్చే డబ్బు కూడా రాలేదు. మొదటి వారంలోనే బయటకు వచ్చాను. దీంతో నా ఆర్థిక పరిస్థితి మరింత దారుణంగా మారింది. ఇప్పటికీ అప్పులు తీర్చలేక చాలా ఇబ్బందులు పడుతున్నాను’ అంటూ ఆమె భావోద్యేగానికి లోనయ్యింది. చదవండి: త్వరలో పెళ్లి పీటలు ఎక్కబోతున్న హీరోయిన్? వరుడు ఎవరంటే.. -
బిగ్‌బాస్ బ్యూటీకి లైంగిక వేధింపులు.. ఆవేదనతో పోస్ట్
ఉర్ఫీ జావేద్.. సోషల్ మీడియా యూజర్లకు పెద్ద పరిచయం అక్కర్లేని పేరు. హిందీ బిగ్‌బాస్ ఓటీటీలో మెరిసిన ఈ బ్యూటీ బయటకు వచ్చాక తన డ్రెస్సింగ్ స్టైల్‌తో చేస్తున్న రచ్చ అంతా ఇంతా కాదు. ఉర్ఫీ పేరు వింటే చాలు వెంటనే ఆమె భిన్నమైన వస్త్రశైలి గుర్తుకు వస్తుంది. ఆమె వేసే దుస్తులను చూసి ఇలా కూడా డిజైన్ చేయోచ్చా అని నోళ్లు వెళ్లబెట్టిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. చిరిగిన బట్టలు, పగిలిన గ్లాస్ ముక్కలు, బికినీలతో అందాలను ప్రదర్శిస్తూ అనేక సార్లు ట్రోల్స్ బారిన పడింది. అయితే తాజాగా ఉర్ఫీ జావేద్ మరో సమస్యను ఎదుర్కొంటోంది. ఒక అబ్బాయి తనను లైంగికంగా వేధిస్తున్నాడని ఆవేదన వ్యక్తం చేసింది. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా తెలియజేస్తూ అతని ఫొటోను షేర్ చేసింది ఉర్ఫీ జావేద్. ''ఈ వ్యక్తి నన్ను రెండేళ్లుగా వేధిస్తున్నాడు. నా ఫొటోను మార్ఫింగ్ చేసి నాకు పంపించి తనతో శృంగారపు వీడియో చాట్ చేయమని బలవంతం చేస్తున్నాడు. తనతో శృంగారం చేయడం ఒప్పుకోకపోతే ఆ ఫొటోను అనేక బాలీవుడ్ పేజీలలో పోస్ట్ చేసి, నా కెరీర్‌ను నాశనం చేస్తానని రెండేళ్లుగా నరకం చూపిస్తున్నాడు'' అని తెలిపింది. అలాగే ఈ విషయంపై పోలీసులకు ఫిర్యాదు చేసిన పట్టించుకోవట్లేదని అసహనం వ్యక్తం చేసింది. చదవండి: నెట్టింట్లో అంజలి అసభ్యకర వీడియో వైరల్.. కన్నీరు పెట్టుకున్న నటి ''నేను 1 తేదిన గోరేగావ్ పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ నమోదు చేశాను. 14 రోజులు గడిచినా ఇంతవరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. నేను తీవ్ర నిరాశకు గురయ్యాను. ముంబయి పోలీస్ గురించి చాలా మంచి విషయాలు విన్నాను. కానీ, ఈ వ్యక్తి పట్ల వారు ఇలా ఎందుకు చేస్తున్నారో అర్థం కావట్లేదు. అతను ఎంతో మంది మహిళలతో ఇలా చేశాడని తెలిసినా, ఇప్పటికీ ఎలాంటి చర్య తీసుకోలేదు. అతని వల్ల సమాజానికి, ముఖ్యంగా మహిళలకు ప్రమాదం. ఇప్పటికైన పోలీసులు తగిన చర్యలు తీసుకుంటారని భావిస్తున్నా'' అని ఉర్ఫీ రాసుకొచ్చింది. అలాగే తనను వేధిస్తున్న వ్యక్తి పంజాబీ చిత్రసీమలో స్వేచ్ఛగా తిరుగుతున్నాడని కూడా తెలిపింది. అంతేకాకుండా ఆ వ్యక్తి ఉర్ఫీకి చేసిన వాట్సాప్ చాట్ స్క్రీన్షాట్లను సైతం షేర్ చేసింది. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్ అవుతోంది. చదవండి: 1947లో పుట్టుక.. స్వాతంత్య్ర దినోత్సవం రోజునే మరణించిన నటి View this post on Instagram A post shared by Uorfi (@urf7i) -
హాస్పిటల్ బెడ్‌పై బోల్డ్ బ్యూటీ.. ఫోటో వైరల్
ఉర్ఫీ జావెద్.. సోషల్ మీడియా యూజర్లకు పరిచయం అరక్కర్లేని పేరు. చిత్రవిచిత్ర వేషధారణతో నిత్యం వార్తల్లో నిలిచే ఉర్ఫీ నెట్టింట చేసే రచ్చ అంతా ఇంతా కాదు.డిఫరెంట్ ఫ్యాషన్ వేర్‌తో ఎన్నోసార్లు ట్రోలింగ్ బారిన పడిన ఉర్ఫీ అయినా తీరు మార్చుకోకుండా తనదైన స్టైల్లోనే దర్శనమిస్తుంటుంది.అయితే ఈమధ్యకాలంలో ఈ బ్యూటీ సోషల్ మీడియాలో ఎలాంటి ఫోటోలు, వీడియోలు షేర్ చేయడం లేదు. ఇందుకు కారణం ఉర్ఫీ హాస్పిటల్ పాలవడమే. ఈ విషయాన్ని స్వయంగా ఆమె తన ఇన్‌స్టా స్టోరీలో షేర్ చేస్తూ.. ఆరోగ్యంపై అశ్రద్దను వహించడమే ఇందుకు కారణమంటూ హాస్పిటల్ బెడ్‌పై ఉన్న ఫోటోలను పంచుకుంది. ఇది చూసిన నెటిజన్లు గెట్ వెల్ సూన్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. View this post on Instagram A post shared by Uorfi (@urf7i) -
Viral Video: పగిలిన గాజు ముక్కలతో డ్రెస్.. 20 కేజీల బరువు..
Urfi Javed Wear Broken Glass Dress Weighing 20 Kgs Video Viral: హిందీ బిగ్‌బాస్ ద్వారా చాలా ఫేమస్ అయింది ఉర్ఫీ జావేద్. బిగ్‌బాస్ తర్వాత బయటకొచ్చిన ఉర్ఫీ విభిన్నమైన, విచిత్రమైన డ్రెస్టింగ్ స్టైల్స్‌తో సోషల్ మీడియాలో అంతకన్నా ఎక్కువ పాపులర్ అయింది. డ్రెస్సింగ్ స్టైల్స్‌లో కొత్త కొత్త వెరైటీలను ట్రై చేస్తూ కొన్నిసార్లు ప్రశంసలు పొందితే, మరికొన్ని సార్లు తీవ్ర విమర్శల పాలైంది ఈ బ్యూటీ. ఇంతకుముందు మెర్మేయిడ్ స్పాట్డ్ వేర్లో కనిపించిన ఉర్ఫీ జావేద్ మరోసారి సరికొత్త డ్రెస్‌లో దర్శనమిచ్చింది. దీనికి సంబంధించిన వీడియోను సోషల్ మీడియా ద్వారా పంచుకుంది. ఈ వీడియోలో ఉర్ఫీ పగిలిన గాజు ముక్కలతో చేసిన డ్రెస్‌ను వేసుకుంది. ఈ పోస్ట్‌కు 'అవును, నేను పగిలిన గాజు ముక్కల డ్రెస్ వేసుకున్నాను. ఇది అద్భుతంగానే కనిపిస్తుందని అనుకుంటున్నాను. కానీ ప్రజలు ఇలాంటివి చూసి నాకు వెర్రి, పిచ్చి అనుకుంటారు. నిజానికి మనమందరం క్రేజీగా, పిచ్చిగా ఉన్నామని తెలుసుకోండి. కానీ నన్ను నేను చూసుకోడానికి నాకు తగినంత తెలివి, శక్తి ఉన్నాయి.' అని రాసుకొచ్చింది. దీంతో ఈ వీడియో నెట్టింట తెగ వైరల్ అయింది. ఈ వీడియోకు నటి రాఖీ సావంత్ ఫైర్ ఎమోజీని కామెంట్ పెట్టగా, పలువురు ప్రశంసిస్తున్నారు. కొందరు విమర్శిస్తున్నారు. ఇన్‌స్టా గ్రామ్‌లో 3 మిలియన్ల ఫాలోవర్లను చేరుకోవడంతో చిన్న పార్టీ ఏర్పాటు చేసింది ఉర్ఫీ జావేద్. ఆ పగిలి గాజు ముక్కల డ్రెస్ వల్ల గాయాలు అవుతుండటంతో దాన్ని తీసేసింది. అంతేకాకుండా ఈ డ్రెస్ 20 కేజీల బరువు ఉంటుందని ఉర్ఫీ జావేద్ తెలిపింది. చదవండి: 👇 ప్యాంట్ వేసుకోలేదురా బాబూ.. ఉర్ఫీ పరుగోపరుగు సమంత చేస్తే ఒప్పు, నేను చేస్తే తప్పా? స్క్రీన్‌షాట్ షేర్ చేసిన ఉర్ఫీ View this post on Instagram A post shared by Uorfi (@urf7i) -
సమంత చేస్తే ఒప్పు, నేను చేస్తే తప్పా? స్క్రీన్‌షాట్ షేర్ చేసిన ఉర్ఫీ
సెలబ్రిటీలు ఏం చేసినా చెల్లుతుంది అనే కాలం కాదిది. వారి మాట, వ్యవహారం, తీరు అన్నింటినీ ఓ కంట కనిపెడుతూనే ఉంటారు జనాలు. సెలబ్రిటీల వ్యవహారం ఏమాత్రం నచ్చకపోయినా సోషల్ మీడియా వేదికగా నోటికొచ్చినట్లు విమర్శిస్తారు. మరీ ముఖ్యంగా తారల డ్రెస్సింగ్ విషయంలో ఈ ట్రోలింగ్ విపరీతంగా ఉంటుంది. అందుకు బిగ్‌బాస్ ఓటీటీ భామ ఉర్ఫీ జావెద్‌ను ఉదాహరణగా చెప్పుకోవచ్చు. ఆమె డ్రెస్సింగ్ స్టైల్ చాలా విభిన్నంగా ఉంటుంది. అందాల ఆరబోతకు పెద్దపీట వేసేలా దుస్తులు ధరిస్తుంటుంది. దీనివల్ల నిత్యం సోషల్ మీడియాలో ట్రోలింగ్‌ను ఎదుర్కొంటోందామె. అయితే తనలా పలుచటి బట్టలు వేసుకున్నవారిని పొగిడి, తనను మాత్రం ఎందుకు తిడతారని ఇన్స్టాగ్రామ్ వేదికగా ప్రశ్నించింది ఉర్ఫీ. 'పలుచని షర్ట్ వేసుకున్న సమంత ఈ లుక్‌లో ఇంటర్నెట్ టెంపరేచర్ పెంచేలా ఉంది' అని రాసిన వార్తను, 'దోమల జాలి కంటే పలుచని డ్రెస్ వేసుకున్న ఉర్ఫీ స్టైల్ దరిద్రంగా ఉందని జనాలు తిడుతున్నారు' అంటూ రాసి ఉన్న మరో వార్త స్క్రీన్షాట్లను పోస్ట్ చేసింది. నేనేం చెప్పాలనుకున్నానో మీకీపాటికే అర్థమై ఉంటుంది. సమంత అంటే నాకూ ఇష్టమే, నేను కేవలం పైన రాసి ఉన్న హెడ్‌లైన్స్ గురించి మాత్రమే మాట్లాడుతున్నాను అని చెప్పుకొచ్చింది. ఒకరిని పొగుడుతూ మరొకరిని మాత్రం ఎందుకు తిడతారో అర్థం కావడం లేదని ఆవేదన వ్యక్తం చేసింది. చదవండి: ఉత్కంఠగా సమంత ‘యశోద’ మూవీ ఫస్ట్‌గ్లింప్స్ ఓటీటీలో పాన్ ఇండియా సినిమాల సందడి.. మేలో ఎన్ని చిత్రాలంటే.. -
అడల్ట్ సైట్లో ఫోటో లీక్, 15ఏళ్లకు చేదు అనుభవం: నటి
చిత్రవిచిత్ర వేషధారణతో నిత్యం వార్తల్లో నిలుస్తోంది ఉర్ఫీ జావెద్. సోషల్ మీడియా యూజర్లకు పెద్ద పరిచయం అక్కర్లేని ఉర్ఫీ తన డ్రెస్సింగ్‌తో నెట్టింట చేసే రచ్చ అంతా ఇంతా కాదు. వెరైటీ డ్రెస్సులతో సోషల్ మీడియా సెన్సేషన్‌గా మారిన ఉర్ఫీ డిఫరెంట్ ఫ్యాషన్ వేర్‌తో ఎన్నోసార్లు ట్రోల్స్ బారిన పడింది. అయినా తీరు మార్చుకోకపోగా రోజుకో వేషధారణలో దర్శనమిస్తుంటుంది. ఇదిలా ఉండగా తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ చిన్నప్పుడు తనకు ఎదురైన చేదు అనుభవాన్ని పంచుకుంది. 15ఏళ్ల వయసులో ఓసారి హాఫ్ షోల్డర్ టాప్ వేసుకొని పోటో తీసి ఫేస్బుక్లో పోస్ట్ చేశాను. అది కాస్తా ఎవరో మార్ఫింగ్ చేసి పోర్న్సైట్లో పెట్టేశారు. దీంతో మా కుటుంబం సహా ఊర్లో రచ్చ రచ్చ అయిపోయింది. అయితే తన తప్పు లేకపోయినా ఆఖరికి కుటుంబసభ్యులు కూడా నన్నే తప్పుబట్టారు అని పేర్కొంది. కాగా సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే ఉర్ఫీ నటన కంటే బోల్డ్ డ్రెస్సింగ్‌తోనే ఎక్కువగా వార్తల్లో నిలిచిన సంగతి తెలిసిందే. ఇక హిందీ బిగ్‌బాస్ ఓటీటీతో మరింత పాపులారిటీ దక్కించుకుంంది. -
ఏదో ఒకరోజు సూసైడ్ చేసుకుని చచ్చిపోదామనుకున్నా
చిత్రవిచిత్ర వేషధారణతో నిత్యం వార్తల్లో నిలుస్తోంది ఉర్ఫీ జావెద్. ఆమె డ్రెస్సింగ్ స్టైల్‌ను చూసి మెచ్చుకునేవాళ్లకంటే బుగ్గలు నొక్కుకునేవాళ్లే ఎక్కువ. వెరైటీ డ్రెస్సులతో సోషల్ మీడియా సెన్సేషన్‌గా మారిన ఉర్ఫీ తాజాగా ఓ ఇంటర్వ్యూలో మానసిక ఒత్తిడి గురించి మాట్లాడింది. తనను నటిగా కాదు కదా, కనీసం ఫ్యాషన్ డిజైనర్‌గా చూసేందుకు కూడా ఇంటిసభ్యులు ఇష్టపడలేదని చెప్పుకొచ్చింది. తనకున్న ప్యాషన్‌ను వదిలేయలేక ఇంటిని వదిలేసి వచ్చానంది. అలా బుల్లితెర ధారావాహికల్లో చిన్నచిన్న పాత్రలు పోషించానంది. ఈ క్రమంలో కొన్ని సంవత్సరాలపాటు మానసిక వేదనను అనుభవించానంది. ఎప్పటికీ ఇలానే బతకాలా? లేదంటే ఏదో ఒకరోజు ఆత్మహత్య చేసుకుని చచ్చిపోదామా? అనిపించిందని చెప్తూ బాధపడింది. అలాంటి స్థితి నుంచి బయటపడేందుకు చాలా కాలమే పట్టిందని తెలిపింది. జీవితంలో ఏవైనా అద్భుతాలు జరగాలని కోరుకున్నాను, కానీ పరిస్థితుల వల్ల చిన్న చిన్నపాత్రలు చేయాల్సి వస్తోందని విచారం వ్యక్తం చేసింది ఉర్ఫీ. తనపై జరిగే ట్రోలింగ్ గురించి స్పందిస్తూ.. 'నా ఫొటోలు వైరల్ అయినా, ఎవరైనా నా పిక్స్ పోస్ట్ చేసినా చాలు కొందరు నటీమణులు తెగ ఉడికిపోతుంటారు. వల్గర్‌గా ఉంది, అసహ్యమేస్తోంది అని కామెంట్లు చేస్తుంటారు. అది చూసినప్పుడు అసలు నేను మిమ్మల్ని ఏమన్నానని ఇలా మాట్లాడుతున్నారు? అనిపిస్తుంటుంది. డ్రెస్సింగ్ విషయంలో నేనెప్పుడూ బోల్డ్‌గానే ఉంటాను. నన్ను ప్రేమించినా, ద్వేషించినా అస్సలు పట్టించుకోను. మీరు పాజిటివ్‌గా, నెగెటివ్‌గా మాట్లాడినా అది నాకు మంచే చేస్తుంది' సమాధానమిచ్చింది ఉర్ఫీ జావెద్. చదవండి: నన్ను రావణాసురుడితో పోలిస్తే బాగుంటుంది: ఆర్జీవీ రాఖీభాయ్‌తో విజయ్, షాహిద్ ఢీ.. ఏప్రిల్ 14న ఏం జరగబోతోంది? -
ఫొటో క్యూబ్ డ్రెస్‌లో నటి ఉర్ఫీ, ఇదేం పిచ్చి.. అంటూ ట్రోల్స్
ఉర్ఫీ జావెద్.. సోషల్ మీడియా యూజర్లకు పెద్ద పరిచయం అక్కర్లేని పేరు. హిందీ బిగ్‌బాస్ ఓటీటీలో మెరిసిన ఈ బ్యూటీ బయటకు వచ్చాక తన డ్రెస్సింగ్ స్టైల్‌తో చేస్తున్న రచ్చ అంతా ఇంతా కాదు. ఉర్ఫీ పేరు వింటే చాలు వెంటనే ఆమె భిన్నమైన వస్త్రశైలి గుర్తుకు వస్తుంది. ఆమె వేసే దుస్తులను చూసి ఇలా కూడా డిజైన్ చేయోచ్చా అని నోళ్లు వెళ్లబెట్టిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. ఈ క్రమంలో డిఫరెంట్ ఫ్యాషన్ వేర్‌తో ఈ భామ ఎన్నోసార్లు ట్రోల్స్ బారిన పడింది. చదవండి: అలనాటి స్టార్ హీరోయిన్ రీఎంట్రీ, 16 ఏళ్ల తర్వాత వెండితెరపై సందడి అయినప్పటికీ ఉర్ఫీ తీరు మార్చుకోకపోగా.. రోజుకో వేషధారణలో దర్శనమిస్తోంది.ఎప్పుడు కట్ కట్ డ్రెస్సింగ్ స్టైల్లో వచ్చే ఉర్ఫీ.. ఈసారి తన ఫ్యాషన్‌లో పీక్స్‌కు వెళ్లింది. తాజాగా ఆమె షేర్ చేసిన ఇన్స్టాగ్రామ్ రిల్ వీడియోలో.. ఉర్ఫీ తన ప్రింటెడ్ ఫొటోలతో చేసిన క్యూబ్ డ్రెస్‌ను ధరించి మరోసారి నెటిజన్లు నోళ్లు వెళ్లబెట్టేలా చేసింది. కాగా అమెరికన్ ర్యాపర్ నిక్కీ మినాజ్ స్వల్లా పాటకు లిప్‌సింక్ ఇస్తూ ఓ రీల్ చేసింది ఉర్ఫీ. చదవండి: సౌత్ ఇండస్ట్రీపై రాశీ ఖన్నా షాకింగ్ కామెంట్స్ ఈ రీల్లో తన ఫొటోలను కొన్నింటిని తీసుకుని వాటిని జత చేసి ఫొటో క్యూబ్ డ్రెస్‌గా మలుచుకుంది. దీనిపై రీల్ చేస్తూ ఉర్ఫీ వీడియో షేర్ చేసింది. ‘దయచేసి రియల్ ఉర్ఫీ కోసం నిలబడతారా? ఇంటర్నేట్లో చూశాను. దీన్ని మళ్లీ రీక్రియేట్ చేయాలని అనుకున్నా, అదే ఇది’ అంటూ క్యాప్షన్ ఇచ్చింది. ఇక ఇది చూసిన నెటిజన్లు ఆమె లుక్‌పై రకరకాలుగా స్పందిస్తున్నారు. ఆమె తీరు తెలిసిన కొందరూ ఉర్ఫీ లుక్‌పై వ్యంగ్యాస్త్రాలు సందిస్తున్నారు. ‘ఆమె ఫ్యాషన్ పిచ్చి పీక్స్ వెళ్లిందని, ఇదేం స్టైల్ రా బాబు?’ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. View this post on Instagram A post shared by Urrfii (@urf7i) -
రివర్స్ చొక్కాతో ఉర్ఫీ ఫొటోషూట్, ట్రోల్ చేస్తున్న నెటిజన్లు
ఉర్ఫీ జావెద్.. ఈమె పేరు వినగానే చాలామందికి ఆమె వేసిన డ్రెస్సులే గుర్తొస్తాయి. డిఫరెంట్ డ్రెస్సింగ్ స్టైల్‌తో సోషల్ మీడియాలో హల్చల్ చేసే ఈ బ్యూటీ పలుమార్లు ట్రోలింగ్ బారిన పడింది. పాపా.. నీ డ్రెస్సులు నువ్వే డిజైన్ చేసుకుంటావా? లేదా ఎవరైనా మహానుభావులు వాటిని కత్తిరించి నీకిస్తారా? అని రకరకాలుగా కామెంట్లు చేస్తుంటారు నెటిజన్లు. తాజాగా ఆమె హ్యాపీ వాలంటైన్స్ డే అంటూ షేర్ చేసిన ఫొటోషూట్ మరోసారి నెట్టింట హాట్ టాపిక్‌గా మారింది. చొక్కాను తిరగేసి ధరించినట్లుగా ఉన్న ఓ డ్రెస్సుతో ఆమె ఫొటోలను పోజులిచ్చింది. ఇది చూసిన నెటిజన్లు.. ఈ స్టైల్ పేరేంటో తెలుసా? ఉల్టా షర్ట్, ఈమె మెదడు మోకాలిలో ఉందని మరోసారి నిరూపించింది, చొక్కా రివర్స్‌లో ధరిస్తే దాన్ని మోడలింగ్ అనరు, పిచ్చి అంటారు అని కామెంట్లు చేస్తున్నారు. ఇదిలా ఉంటే ఉర్ఫీ జావెద్ లాకప్ షో చేస్తుందని గత కొంతకాలంగా ఊహాగానాలు ఊపందుకున్నాయి. అయితే అదంతా వుట్టి పుకార్లేనని, తాను ఈ షో చేయడం లేదని క్లారిటీ ఇచ్చిందీ భామ. View this post on Instagram A post shared by Urrfii (@urf7i) -
ప్యాంట్ వేసుకోలేదురా బాబూ.. ఉర్ఫీ పరుగోపరుగు
ఉర్ఫీ జావెద్... డిఫరెంట్ డ్రెస్సింగ్ స్టైల్స్‌తో సోషల్ మీడియాలో బాగా పాపులర్ అయిందామె. హిందీ బిగ్‌బాస్ ఓటీటీ ద్వారా ఫేమస్ అయిన ఉర్ఫీ బయటకు వచ్చాక నానా రచ్చ చేస్తోంది. రోజుకో వేషధారణలో కనిపిస్తూ అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తుతోంది. కొన్నిసార్లు ఆమె వేసుకునే దుస్తులను చూసిన నెటిజన్లు ఇలా కూడా డిజైన్ చేస్తారా? అవేం డ్రెస్సులురా బాబూ.. అని తలలు పట్టుకున్న సందర్భాలు కోకొల్లలు. తాజాగా ఆమెకు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఇందులో ఉర్ఫీ ప్యాంట్ వేసుకోలేదు. దీంతో కెమెరామెన్లు ఆమె వెనకాల పడగా వారిని చూసి ఉర్ఫీ పరుగులు తీసింది. కింద ప్యాంట్ వేసుకోలేదు, రాకండిరా బాబూ అంటూ ఆగకుండా పరుగెత్తింది. అయినా సరే కెమెరామన్లు వదిలిపెట్టలేదు. ప్యాంట్ లేకపోయినా మీరు బాగానే ఉన్నారంటూ ఆమెను షూట్ చేసేందుకు నానారకాలుగా ప్రయత్నించారు. ఇక మరో వీడియోలో ఓ వ్యక్తి సెల్ఫీ అడగ్గా సరేనంటూ అతడి పక్కన నిల్చుందా భామ. కానీ అతడు పాన్ తింటూ ఫొటోలు తీస్తుండటంతో ఫక్కున నవ్వేసింది. View this post on Instagram A post shared by video editor (@thelallantopmemes18) View this post on Instagram A post shared by Bollywood Celebrities (@bollycelebrities_) -
పేరున్న వ్యక్తుల నుంచి కాస్టింగ్ కౌచ్ ఎదుర్కొన్నా: నటి
Bigg Boss OTT Fame Urfi Javed Revealed Shocking Details About Her Casting Couch: బాలీవుడ్ నటి ఉర్ఫీ జావేద్.. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటుందన్న సంగతి తెలిసిందే. నిజానికి నటన కంటే బోల్డ్ డ్రెస్సింగ్‌తోనే ఎక్కువగా వార్తల్లో నిలిచింది. ఇక హిందీ బిగ్‌బాస్ ఓటీటీతో మరింత పాపులారిటీ దక్కించుకుంంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన ఉర్ఫీ.. ఇండస్ట్రీపై షాకింగ్ కామెంట్స్ చేసింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. 'ఇండస్ట్రీలో చాలా మంది అమ్మాయిల్లాగే నేను కూడా కాస్టింగ్ కౌచ్ బాధితురాలినే. ఒకతను నన్ను బలవంతం చేశాడు. కానీ అదృష్టం కొద్ది బయటపడ్డాను. ఇండస్ట్రీలో పెద్ద మనుషులుగా పేరున్న వ్యక్తుల నుంచే నేను కాస్టింగ్ కౌచ్‌ను ఎదుర్కొన్నాను. వాళ్లు తలుచుకుంటే ఎవరినైనా, ఎప్పుడైనా ఇండస్ట్రీ నుంచి బయటకి నెట్టగలిగే శక్తి ఉంది. అందుకే నేను వాళ్ల పేర్లు బయట పెట్టడం లేదు' అంటూ చెప్పుకొచ్చింది. -
ఆమాత్రం దానికి దుస్తులు ఎందుకు వేసుకున్నావ్?.. నెటిజన్ల ఫైర్
సోషల్ మీడియా వచ్చాక సెలబ్రిటీలు ట్రోలింగ్‌కు గురవడం సర్వసాధారణమైపోయింది. తాజాగా ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ ఉర్ఫీ జావెద్ సైతం ట్రోలింగ్ బారిన పడింది. లేటెస్ట్ ఫ్యాషన్ డ్రెస్సులతో సందడి చేసే ఈ బిగ్‌బాస్ భామ ఓ కొత్తరకం డ్రెస్సుతో దర్శనమిచ్చింది. ఓపెన్‌కట్ టాప్, పొట్టి స్కర్ట్‌తో బోల్డ్‌గా దిగిన ఫోటోలను తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. ఈ డిజైనర్ డ్రెస్‌లో ఆమె అందాల ఆరబోతకు అడ్డు లేకుండా పోయింది. ఈ ఫొటోను చూసిన నెటిజన్లు ఉర్ఫీని ఆడేసుకుంటున్నారు. అసలు ఏ బట్టలు వేసుకోవాలనుకున్నావ్..అని ఒకరు ప్రశ్నించగా ‘ఆ మాత్రం దుస్తులు కూడా ఎందుకు వేసుకున్నావ్..’ అంటూ మరికొందరు సెటైర్లు వేస్తున్నారు. ఇలాంటి బట్టలు వేసుకోవడానికి కొంచెం కూడా సిగ్గనిపించడం లేదా? అని ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. కాగా ఉర్ఫీకి ఈ ట్రోలింగ్ కొత్తేమీ కాదు. ప్రియాంక చోప్రా పోనీటైల్ హెయిర్ స్టైల్‌ను కాపీ చేసిందంటూ ఆమెను ట్రోల్ చేశారు. జడ అల్లుకోవడం కూడా కాపీయే అంటే ఈ సమాజం తలదించుకోవాలంటూ ట్రోలింగ్‌కు ఘాటు రిప్లై ఇచ్చింది ఉర్ఫీ జావెద్. చదవండి: అలాంటి అమ్మాయి దొరకాలంటే రాసిపెట్టుండాలి: సన్నీ