అదిరేటి డ్రెస్సు మేమేస్తే బెదిరేటి లుక్కు మీరిస్తే దడ.. ఆ మీకు దడ.... ఈ పాట ఇప్పుడున్న సెలబ్రిటీలలో ఉర్ఫీ జావెద్‌కు కరెక్ట్‌గా సరిపోతుంది. అవును, ఆమె వేసుకున్న డ్రెస్సులు అలా ఉంటాయి మరి! ఆమె ఫ్యాషన్‌ను మరెవ్వరూ ఫాలో కాలేరు. కొందరు ఆమె డ్రెస్సింగ్ చూసి వారెవ్వా అనుకుంటే మరికొందరికేమో ఇదేం ఫ్యాషన్ అని దడ పుడుతుంది. అది అందమో, అరాచకమో అర్థం కాక జుట్టు పీక్కుంటున్నారు జనాలు. వేస్ట్‌లో నుంచి కూడా బెస్ట్ బయటకు తీస్తూ రకరకాల డ్రెస్సులు ట్రై చేసింది ఉర్ఫీ. కాగితాలతో, వైర్లతో, చైన్లతో, అద్దాలతో, గోనె సంచితో ఇలా ఒక్కటేమిటి.. కళ్లకు కనిపించిన దేన్నీ వదిలిపెట్టలేదు. మరి ఇలా ఆమెకు చిత్రవిచిత్ర డ్రెస్సులు డిజైన్ చేసేది ఎవరో తెలుసా?
ముంబైకి చెందిన శ్వేత శ్రీవాస్తవ. ఉర్ఫీ బోల్డ్‌గా కనిపిస్తే ఆమె బోల్డ్‌గా మాట్లాడుతుంది. తమ ఆలోచనలను వేసుకునే దుస్తుల ద్వారా వ్యక్తపరుస్తున్నామంటున్నారు. ఏదైనా గాజువస్తువుతో డ్రెస్ చేస్తే ఎలా ఉంటుంది? అని ఉర్ఫీ అడిగితే.. పగిలిన గాజు అద్దంతోనే తయారు చేసేస్తే పోలా అని వత్తాసు పలుకుతుంది శ్వేత. వీళ్లిద్దరి మధ్య 15 ఏళ్ల పరిచయం ఉంది. ఆ చనువుతోనే ఒకరికొకరు కొత్త కొత్త ఐడియాలు చెప్పుకుంటారు. వెంటనే దాన్ని శ్వేత అమల్లోకి తీసుకువస్తే ఆ డ్రెస్ వేసుకుని కెమెరాల ముందుకు వచ్చేస్తుంది ఉర్ఫీ. అలా శ్వేత డిజైన్ చేసిన ఎన్నో డ్రెస్సులు సోషల్ మీడియాలో వైరల్ అయిన విషయం తెలిసిందే! వీరి ఫ్యాషన్‌ను మెచ్చుకున్నా, బాలేదని తిట్టిపోసినా అన్నింటినీ ఒకేలా తీసుకున్నారిద్దరూ. ఎవ్వరేమనుకున్నా డోంట్ కేర్ అంటున్నారు.
చదవండి: ఆదిరెడ్డి ముఖంపై కాలు పెట్టిన గీతూ
విష్ణుప్రియ ఫేస్‌బుక్ అకౌంట్‌లో అశ్లీల వీడియోలు, ఫొటోలు
Comments
Please login to add a commentAdd a comment