సీక్రెట్‌గా బిగ్‌బాస్‌ బ్యూటీ ఎంగేజ్‌మెంట్‌.. ఎవరా మిస్టరీ మ్యాన్‌? | Is Urfi Javed Secretly Engaged? Photo Goes Viral - Sakshi
Sakshi News home page

Urfi Javed: సీక్రెట్‌గా బిగ్‌బాస్‌ బ్యూటీ ఎంగేజ్‌మెంట్‌? ఎవరా మిస్టరీ మ్యాన్‌?

Published Wed, Oct 4 2023 12:13 PM | Last Updated on Wed, Oct 4 2023 1:21 PM

Is Urfi Javed Secretly Engaged? Photo Goes Viral - Sakshi

ఉర్ఫీ జావెద్‌.. పెద్దగా సినిమాలు చేయకపోయినా హీరోయిన్‌ రేంజ్‌లో ఫ్యాన్స్‌, పాపులారిటీ ఉంది. అదే రేంజ్‌లో ఆమెను తిట్టిపోసేవాళ్లు కూడా ఉన్నారు. కారణం.. తన వేషధారణ. తను సాంప్రదాయంగా, మోడ్రన్‌గా దుస్తులు ధరించాలనుకోదు. వినూత్నంగా.. ఈ రెండింటి కోవలోకి రానివిధంగా బట్టలు డిజైన్‌ చేయించుకుని వాటినే ధరిస్తుంది. కాదేదీ కవితకనర్హం అన్నట్లుగా పనికిరాని పాతసామానును కూడా డ్రెస్సులుగా ధరిస్తూ ఉంటుంది. 

ఇలా చిత్రవిచిత్ర వేషధారణతో అందరినీ అవాక్కయ్యేలా చేసే ఉర్ఫీ జావెద్‌ త్వరలో బ్యాచిలర్‌ లైఫ్‌కు ఫుల్‌స్టాప్‌ పెట్టనున్నట్లు తెలుస్తోంది. ఓ వ్యక్తితో ఆమె పూజలో పాల్గొన్న ఫోటోలు ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. దీంతో ఆమె ఎంగేజ్‌మెంట్‌ అయిందంటూ పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ఇంతకీ ఉర్ఫీతో జీవితం పంచుకోవాలనుకుంటున్న ఆ వ్యక్తి ఎవరా? అని నెటిజన్లు ఆరా తీస్తున్నారు. నిజంగానే నిశ్చితార్థం జరిగిందా? మరి ఇంతవరకు ఉర్ఫీ ఒక్క పోస్ట్‌ కూడా చేయలేదేంటబ్బా.. అని కామెంట్లు చేస్తున్నారు.

కాగా ఉర్ఫీ మొదట్లో సీరియల్స్‌లో నటించింది. యే రిష్తా క్యా కెహ్లాతా హై, కసౌటీ జిందగీ కే వంటి ధారావాహికల్లో మెరిసింది. అయితే ఎప్పుడైతే బిగ్‌బాస్‌ ఓటీటీ షోలో అడుగుపెట్టిందో ఒక్కసారిగా ఫేమస్‌ అయింది. అనంతరం స్ప్లిట్స్‌విల్లా అనే రియాలిటీ షో 14వ సీజన్‌లోనూ పాల్గొంది.

చదవండి: రతికలాంటి అమ్మాయి భార్యగా రావాలి.. హీరో రిప్లై ఏంటో తెలుసా?

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement