Urfi Javed Says She Allergic To Clothes Shares Proof - Sakshi
Sakshi News home page

Uorfi Javed: శరీరాన్ని కప్పేలా దుస్తులు ధరిస్తే నాకు పడదు

Published Sat, Jan 7 2023 4:57 PM | Last Updated on Sat, Jan 7 2023 6:11 PM

Urfi Javed Says She Allergic to Clothes Shares Proof - Sakshi

చిత్రవిచిత్ర డ్రెస్సులతో బిగ్‌బాస్ బ్యూటీ ఉర్ఫీ జావెద్‌ ఎంతో ఫేమస్‌. ఆమె వేషధారణను చూసే ఔరా అనేవాళ్లతోపాటు ఇదేం డ్రెస్సురా బాబూ అని తలలు పట్టుకునేవాళ్లు కూడా ఉన్నారు. కొందరైతే తన వేషధారణ అసభ్యంగా ఉందని పోలీస్‌ స్టేషన్‌ మెట్లెక్కారు కూడా! చాలావరకు తన శరీరాన్ని కప్పివేయని డ్రెస్సులే వేసుకోవడానికి ఇష్టపడే ఉర్ఫీ అందుకు గల కారణాన్ని తాజాగా బయటపెట్టింది. తనకు దుస్తులంటే అలర్జీ అని చెప్పింది. అంతేకాదు అందుకు సంబంధించిన సాక్ష్యాన్ని కూడా సోషల్‌ మీడియాలో షేర్‌ చేసింది. తన కాళ్లకు దద్దులు వచ్చిన ఫోటోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేసింది.

'శరీరాన్ని పూర్తిగా కప్పే ఉన్ని దుస్తులు వేసుకుంటే ఇదిగో ఇలాగే జరుగుతుంది. శరీరంపై ర్యాషెస్‌, దద్దులు వస్తాయి. ఇది చాలా సీరియస్‌ ప్రాబ్లమ్‌. నేను దుస్తులు ఎందుకు ధరించనో మీకు ఇప్పుడైనా అర్థమైందా? నిండుగా కప్పే డ్రెస్సులు వేసుకుంటే నా శరీరం ఒప్పుకోవడం లేదు. అందుకు ఈ ఫోటోనే నిదర్శనం. అందుకే నేను ఎక్కువగా నగ్నంగా కనిపిస్తుంటాను. నా శరీరానికి దుస్తులంటే అలర్జీ. మరీ ముఖ్యంగా ఉన్ని దుస్తువులు వేసుకున్నప్పుడు పరిస్థితి మరింత దారుణంగా తయారవుతోంది' అని ఇన్‌స్టాగ్రామ్‌ స్టోరీలో చెప్పుకొచ్చింది ఉర్ఫీ.

చదవండి: నాన్న చనిపోయాక నెలన్నర రోజులు గదిలో నుంచి బయటకు రాలేదు
ఎంత దారుణం? నా తండ్రితో పెళ్లి చేస్తున్నారు: శ్రీముఖి ఫైర్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement