
బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీఖాన్(Saif Ali Khan) ప్రధాన పాత్రలో రూపొందించిన చిత్రం జ్యువెల్ థీఫ్‌య ది హెయిస్ట్ బిగిన్స్ అనే ఉపశీర్షిక. ఈ సినిమాకు కూకీ గులాటి, రాబీ గ్రేవాల్ దర్శకత్వం వహించారు. ఖరీదైన వజ్రాలను దొంగతనం చేసే వ్యక్తి కథ ఆధారంగా ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఈ చిత్రాన్ని మార్ఫిక్స్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై సిద్ధార్థ్ ఆనంద్, మమతా ఆనంద్ నిర్మించారు.
తాజాగా ఈ మూవీ ట్రైలర్‌ను మేకర్స్ విడుదల చేశారు. ఈ బాలీవుడ్ యాక్షన్-ప్యాక్డ్ థ్రిల్లర్ ఏప్రిల్ 25న ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే ఈ సినిమాను నేరుగా ఓటీటీలోనే రిలీజ్ చేస్తున్నారు. ఈ చిత్రం నెట్‌ఫ్లిక్స్ వేదికగా స్ట్రీమింగ్ కానుంది. ఈ చిత్రంలో సైఫ్ అలీ ఖాన్ దొంగ పాత్రలో కనిపించనున్నారు. ఈ మూవీలో జైదీప్ అహ్లావత్,కునాల్ కపూర్ రాయ్, వికితా దత్తా ప్రధాన పాత్రలు పోషించారు.
Danger. Deception. Desire. And a diamond that's worth everything 💎🔥
Watch Jewel Thief, out 25 April, only on Netflix.#JewelThiefOnNetflix #SaifAliKhan pic.twitter.com/sg58YnJ8oz— Netflix India (@NetflixIndia) April 14, 2025