
ప్రస్తుతం సినీ ప్రియులు ఎక్కువగా ఓటీటీలకు అడిక్ట్ అయిపోయారు. ఏ సినిమా అయినా.. వెబ్ సిరీస్ అయినా ఓటీటీలోనే చూసేందుకు మొగ్గు చూపుతున్నారు. ఈ నేపథ్యంలోనే సరికొత్త కంటెంట్‌తో వెబ్ సిరీస్‌లు రూపొందిస్తూ ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. అయితే ఓటీటీల్లోనూ కంటెంట్ బాగుంటేనే ఆడియన్స్ ఆదరిస్తున్నారు. అలా ప్రేక్షకుల అభిమానం దక్కించుకున్న వెబ్ సిరీస్‌లు చాలా తక్కువగానే ఉన్నాయి. వాటిలో పంచాయత్ వెబ్ సిరీస్ ఒకటి.
ఇప్పటికే విడుదలైన మూడు సీజన్స్‌కు సినీ ప్రియుల నుంచి ఆదరణ దక్కింది. 2020లో మొదటి సీజన్ విడుదలైతే.. 2022లో రెండో సీజన్.. 2024లో మూడో భాగం ప్రేక్షకులను అలరించాయి. ఈ వెబ్ సిరీస్‌కు ఉన్న క్రేజ్ దృష్ట్యా మేకర్స్ మరో సీజన్‌కు రెడీ అయిపోయారు. సరికొత్త కామెడీ డ్రామా సిరీస్‌గా వస్తోన్న నాలుగో సీజన్ ఈ ఏడాదిలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఈ విషయాన్ని ప్రత్యేక వీడియో రిలీజ్ చేస్తూ వెల్లడించారు. ఈ వెబ్ సిరీస్ తొలి సిరీస్ విడుదలై ఐదేళ్లు పూర్తి కావడంతో మేకర్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా నాలుగో సీజన్ స్ట్రీమింగ్ తేదీని రివీల్ చేశారు. పంచాయత్ సీజన్- 4 ఈ ఏడాది జూలై 2న అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ కానుందని వెల్లడించారు.
కాగా.. ఈ సిరీస్‌లో జితేంద్ర కుమార్, నీనా గుప్తా, రఘుబీర్ యాదవ్, చందన్ రాయ్, సాన్వికా, ఫైసల్ మాలిక్, దుర్గేష్ కుమార్, సునీతా రాజ్వార్, పంకజ్ ఝా కీలక పాత్రల్లో నటించారు. ఈ కామెడీ-డ్రామా సిరీస్‌ను ఉత్తరప్రదేశ్‌లోని ఫూలేరా గ్రామంలో పంచాయతీ కార్యదర్శిగా చేరిన ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ కథగా తెరకెక్కించారు. ఈ సిరీస్‌కు దీపక్ కుమార్ మిశ్రా, అక్షత్ విజయవర్గీయ దర్శకత్వం వహించారు.