
బాలీవుడ్ స్టార్ అక్షయ్‌కుమార్ నటించిన చిత్రం స్కై ఫోర్స్. ఈ యాక్షన్ మూవీని దర్శక ద్వయం సందీప్ కెవ్లానీ– అభిషేక్ అనిల్ కపూర్ తెరకెక్కించారు. జియో స్టూడియోస్, మాడ్‍డాక్ ఫిల్మ్స్, లియో ఫిల్మ్స్ యూకే ప్రొడక్షన్స్ పతాకాలపై జ్యోతి దేశ్‍పాండే, అమర్ కౌశిక్, భౌమిక్, దినేశ్ విజన్ దాదాపు రూ. 160 కోట్ల భారీ బడ్జెట్‌తో ఈ మూవీని నిర్మించారు. 1965లో జరిగిన ఇండియా–పాకిస్తాన్ వార్ నేపథ్యంలో భారతదేశపు మొదటి వైమానిక దాడి సంఘటనల ఆధారంగా ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. భారీ అంచనాల మధ్య రిపబ్లిక్ డే కానుకగా జనవరి 24న విడుదలైంది. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద రూ. 200 కోట్లకు వరకు కలెక్షన్లు రాబట్టింది.
ప్రస్తుతం ఈ మూవీ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. అయితే కేవలం రెంటల్ పద్ధతిలో మాత్రమే అందుబాటులో ఉంది. ఈ మూవీని చూడాలంటే అదనంగా రూ.249 అద్దె చెల్లించాల్సిందే. ఈ మూవీ కేవలం హిందీ వర్షన్‌లో మాత్రమే అందుబాటులో ఉంటుంది. సబ్‌టైటిల్స్‌తో ఇతర భాషల వారు కూడా చూడొచ్చు.
అయితే ఈ సినిమాను ప్రేక్షకులకు ఉచితంగా అందుబాటులోకి తీసుకు రానున్నట్లు ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ ప్రకటించింది. ఈనెల 21 నుంచి ఉచితంగా స్ట్రీమింగ్ చేయనున్నట్లు వెల్లడించింది. కాగా... ఈ సినిమాలో వీర్ పహారియా, సారా అలీఖాన్, నిమ్రత్ కౌర్ ఇతర ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ చిత్రంలో కమాండర్ కేవో అహుజా పాత్రలో అక్షయ్ కుమార్, టి. విజయ పాత్రలో వీర్ పహారియా నటించారు.
Comments
Please login to add a commentAdd a comment