Free
-
కొత్త ఓటీటీ ప్లాట్‌ఫామ్: ఇవన్నీ ఉచితం..
ఇప్పుడు చాలామంది సినిమాలు, ఇతర వినోద కార్యక్రమాల కోసం వివిధ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లపై ఆధారపడతారు. అయితే దీని కోసం సబ్స్క్రిప్షన్ ప్లాన్స్ తీసుకోవాల్సి ఉంటుంది. అయితే ఇప్పుడు తాజాగా ఇండియా పబ్లిక్ బ్రాడ్‌కాస్టర్.. ప్రసార భారతి ఓటీటీ ప్లాట్‌ఫామ్ తీసుకు వచ్చింది. ఇందులో కొన్ని కార్యక్రమాలు ఉచితం అంటూ ప్రకటించింది.గోవాలో జరిగిన ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా (ఐఎఫ్ఎఫ్ఐ)లో ప్రసార భారతి కొత్త స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్ 'వేవ్స్'ను ఆవిష్కరించింది. దీని ద్వారా రామాయణం, మహాభారతం వంటి వాటిని ఉచితంగా చూడవచ్చు. దీనిని ఆండ్రాయిడ్‌లో గూగుల్ ప్లే స్టోర్, ఐఓఎస్‌లో యాపిల్ యాప్ స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు.రామాయణ, మహాభారతం వంటి వాటితో పాటు.. రేడియో ప్రోగ్రామ్స్, గేమ్స్ వంటి వాటిని కూడా దీని ద్వారా ఆస్వాదించవచ్చు. ప్రస్తుతం ఈ వేవ్స్ ఓటీటీ ప్లాట్ఫామ్లో 65 లైవ్ ఛానెల్స్ అందుబాటులో ఉన్నట్లు సమాచారం. తెలుగు, హిందీ, తమిళ వంటి 12 కంటే ఎక్కువ భాషల్లో అందుబాటులో ఉన్న ఈ ప్లాట్‌ఫామ్ 10 కంటే ఎక్కువ కేటగిరీలలో కంటెంట్ అందిస్తోంది.ప్రసార భారతి కొత్త స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్ 'వేవ్స్' కేవలం పెద్ద వారికి మాత్రమే కాకుండా.. పిల్లల కోసం కూడా చోటా భీమ్, అక్బర్ బీర్బల్, మ్యూజిక్ షోలు వంటి అందుబాటులో ఉండనున్నాయి. ఇందులో అయోధ్య నుంచి రామ్ లల్లా హారతి లైవ్, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మన్ కీ బాత్ వంటి ప్రత్యక్ష లైవ్ ఈవెంట్లను కూడా చూడవచ్చు. కొన్ని కార్యక్రమాలకు మినహా ఇతర కార్యక్రమాలకు డబ్బు చెల్లించి ప్లాన్స్ తీసుకోవాల్సి ఉంటుంది.WAVES is finally here!Explore WAVES, the new OTT platform by Prasar Bharati, for FREE. Stream old Doordarshan favourites like Ramayan and Mahabharat and the latest releases like Fauji 2.O. What’s more? You can now listen to radio programs & devotional songs, read books, play… pic.twitter.com/MwBOZpuIKc— Doordarshan National दूरदर्शन नेशनल (@DDNational) November 20, 2024 -
ఇంటెల్ ఉద్యోగులకు గుడ్‌న్యూస్.. ఆ సౌకర్యాలు మళ్లీ..
ప్రముఖ మల్టీనేషనల్ టెక్నాలజీ కంపెనీ ఇంటెల్ తమ ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది. సిబ్బందికి ఉచితంగా కాఫీ, టీ వంటి పానీయాలు అందించే సౌకర్యాన్ని తిరిగి తీసుకొస్తున్నట్లు ప్రకటించింది. శ్రామికశక్తిని ఉత్తేజపరిచే ఈ నిర్ణయం అంతర్గత సందేశాల ద్వారా షేర్ చేసినట్లు తెలుస్తోంది.వ్యయ నియంత్రణ, నిర్వహణ సమస్యలతో సతమవుతున్న ఇంటెల్ దాదాపు ఏడాది తర్వాత తమ కార్యాలయ సంస్కృతిని మెరుగుపరచడానికి చేస్తున్న ప్రయత్నాల్లో భాగంగా ఈ నిర్ణయం తీసుకుంది. ఉద్యోగుల రోజువారీ జీవితంలో చిన్న సౌకర్యాల ప్రాముఖ్యతను గుర్తిస్తున్నట్లు అంతర్గత సందేశంలో ఇంటెల్ పేర్కొంది."ఇంటెల్ ఇప్పటికీ ఖర్చు సవాళ్లను ఎదుర్కొంటున్నప్పటికీ, చిన్న సౌకర్యాలు మన దినచర్యలలో ముఖ్యమైన పాత్ర పోషిస్తాయని మేము అర్థం చేసుకున్నాము. ఇది ఒక చిన్న అడుగు అని మాకు తెలుసు, కానీ మన కార్యాలయ సంస్కృతికి మద్దతు ఇవ్వడంలో ఇది అర్ధవంతమైనదని మేము ఆశిస్తున్నాము." అని వివరించింది.ఫ్రీ ఫ్రూట్స్‌కు నోఉచిత పానీయాల సౌకర్యాన్ని తిరిగి ప్రారంభిస్తున్నప్పటికీ, ఒకప్పుడు ఉద్యోగులకు అందుబాటులో ఉన్న ఉచితంగా పండ్లు అందించే సౌలభ్యాన్ని మాత్రం కంపెనీ పునఃప్రారంభించడం లేదు. కంపెనీ నిరంతర వ్యయ-తగ్గింపు ప్రయత్నాలలో భాగంగా ఈ వసతిని మళ్లీ కల్పించేందుకు ఇంటెల్ సిద్ధపడలేదు. -
మాట నిలబెట్టుకున్న టాలీవుడ్ హీరో.. చెప్పిన పని చేశాడు!
టాలీవుడ్ యంగ్ హీరో ప్రస్తుతం క మూవీతో ప్రేక్షకుల ముందుకొస్తున్నారు. 1970వ దశకంలోని విలేజ్ బ్యాక్‌డ్రాప్ యాక్షన్ థ్రిల్లర్ కథతో ఈ సినిమాను రూపొందించారు. ఈ చిత్రానికి సుజీత్, సందీప్ దర్శకత్వం వహించారు. ఇందులో నయన్ సారిక, తన్వీ రామ్ హీరోయిన్లుగా నటించారు ఈ సినిమాని దీపావళి సందర్భంగా ఈ నెల 31న తెలుగు, తమిళ, మలయాళ, కన్నడలో రిలీజ్ చేయనున్నట్లు ఇప్పటికే మేకర్స్ వెల్లడించారు.అయితే కిరణ్ ఇటీవల లవ్ రెడ్డి అనే మూవీ ప్రీ రిలీజ్‌కు హాజరయ్యారు. ఈ సందర్భంగా అభిమానుల కోసం లవ్ రెడ్డి మూవీ షోలు ఉచితంగా వేస్తానని అభిమానులకు మాటిచ్చారు. అనుకున్నట్లుగానే ఇవాళ నాలుగు థియేటర్లలో లవ్ రెడ్డి సినిమా ఫ్రీ షోలు ప్రదర్శించారు. హైదరాబాద్ జీపీఆర్ మల్టిప్లెక్స్, వైజాగ్ శ్రీరామా థియేటర్ , తిరుపతిలో కృష్ణ తేజ థియేటర్, విజయవాడ స్వర్ణ మల్టిప్లెక్స్ ఉచితంగా సినిమాను వేశారు. ఈ సందర్భంగా లవ్ రెడ్డి మూవీ టీమ్ హీరో కిరణ్ అబ్బవరంకు కృతజ్ఞతలు తెలిపింది. మంచి సినిమాకు సపోర్ట్ గా నిలబడినందుకు ప్రశంసలు కురిపించింది.కాగా.. గీతాన్స్ ప్రొడక్షన్స్, సెహెరి స్టూడియో, ఎమ్జీఆర్ ఫిలిమ్స్ బ్యానర్స్ సంయుక్తంగా నిర్మించిన చిత్రం "లవ్ రెడ్డి". ఈ సినిమాలో అంజన్ రామచంద్ర, శ్రావణి రెడ్డి హీరో హీరోయిన్లుగా నటించారు. దర్శకుడు స్మరన్ రెడ్డి ఈ చిత్రాన్ని రూపొందించారు. ఈ రోజు థియేటర్స్‌లోకి వచ్చిన లవ్ రెడ్డి ఎమోషనల్ లవ్ స్టోరీగా ప్రేక్షకుల నుంచి సూపర్ హిట్ టాక్ అందుకుంటోంది. As promised we have arranged 4 free shows.- Hyderabad : GPR Multiplex 7:45PM Show (Contact No : 8549955111)- Vizag : Srirama Theatre 6:30PM Show- Tirupathi - Krishna Teja Theatre 6:30Pm- Vijaywada - Swarna Multiplex 6:30PM Please go watch and show your support for all the…— Kiran Abbavaram (@Kiran_Abbavaram) October 18, 2024 -
ఆస్టర్ ప్రైమ్ ఆస్పత్రిలో ఉచితంగా ఫుట్ స్క్రీనింగ్
హైదరాబాద్: ఆస్టర్ ప్రైమ్ ఆస్పత్రి నెల రోజుల పాటు 500 మంది మధుమేహ బాధితులకు ఉచితంగా ఫుట్ స్క్రీనింగ్ పరీక్షలు చేయనుంది. మధుమేహ బాధితులకు కాళ్లు తొలగించాల్సిన అవసరం లేకుండా.. ముందుగానే ఫుట్ స్క్రీనింగ్ పరీక్షలు చేయించుకుంటే తగిన చికిత్సలతో నయం చేయవచ్చని ఆస్టర్ ప్రైమ్ ఆస్పత్రి వాస్క్యులర్ సర్జరీ విభాగాధిపతి, సీనియర్ కన్సల్టెంట్ డాక్టర్ జ్ఞానేశ్వర్ తెలిపారు.ఆస్పత్రి ప్రాంగణంలో మీడియాతో మాట్లాడుతూ డాక్టర్ జ్ఞానేశ్వర్ ఈ వివరాలు తెలిపారు. ఈ సేవలను వినియోగించుకోవాలనుకునేవారు 9010100536 నంబరుకు ఫోన్ చేయడం ద్వారా తమ పేర్లు నమోదుచేసుకోవచ్చు. సెప్టెంబరు 22 నుంచి నవంబరు 20వ తేదీ వరకు ప్రతిరోజూ మధ్యాహ్నం 12 నుంచి 3 గంటల వరకు ఈ ఆఫర్ ఉంటుంది. ఇంకా అదనపు పరీక్షలు అవసరమైతే వాటిమీద 50% రాయితీ వర్తిస్తుంది. ఈ పరీక్షలు చేయించుకోవడానికి మధుమేహ బాధితులు ఎవరైనా అర్హులే. అయితే తాజాగా మధుమేహం బయటపడినవారి కంటే నాలుగైదేళ్లుగా దీంతో బాధపడుతున్నవాళ్లకు అయితే వెంటనే బయటపడుతుంది. ఇప్పటికే కాళ్లలో కొంత ఇబ్బందులు ఉన్నవారు కూడా ఈ పరీక్షలు చేయించుకోవచ్చు. -
Uttar Pradesh: నేడు వందేభారత్ రైలులో ఉచిత ప్రయాణం
లక్నో: ఉత్తరప్రదేశ్‌లోని మీరట్-లక్నోల మధ్య నేటి నుంచి వందేభారత్ రైలు పరుగులు తీయనుంది. మీరట్-లక్నో-మీరట్(22490/22491) వందే భారత్ ఎక్స్‌ప్రెస్ ఛార్జీలు, రాకపోకల జాబితాను రైల్వేశాఖ విడుదల చేసింది.ఈరోజు (శనివారం) ఈ రైలు తొలిసారిగా పట్టాలు ఎక్కనుంది. నేడు అతిథి ప్రయాణికులకు రైల్వేశాఖ మీరట్-లక్నోల మధ్య ఉచితంగా ప్రయాణించే అవకాశాన్ని కల్పించింది. లక్నో-మీరట్(22491), మీరట్-లక్నో(22490) వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ల రెగ్యులర్ ఆపరేషన్ ఆదివారం నుండి ప్రారంభంకానుంది. శుక్రవారం ఐఆర్సీటీసీ వెబ్సైట్లో ఈ రైలు అప్డేట్ అయిన తర్వాత టికెట్ బుకింగ్ ప్రారంభమైంది. మీరట్-లక్నో వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ను ప్రధాని మోదీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జెండా ఊపి ప్రారంభించనున్నారు.బరేలీ జంక్షన్లో ఈ కార్యక్రమాన్ని ప్రత్యక్ష ప్రసారం చేయనున్నారు. ఈ రైలు మీరట్-లక్నో మధ్య మొరాదాబాద్, బరేలీ జంక్షన్లలో మాత్రమే ఆగుతుంది. ఈ రైలుకు సంబంధించిన బుకింగ్ ప్రారంభమైన నేపధ్యంలో సెప్టెంబర్ 5 తర్వాత తేదీల ప్రయాణం కోసం సీట్లు వేగంగా బుక్ అవుతున్నాయి. ప్రస్తుతం బరేలీ జంక్షన్లో రైలుకు స్వాగతం పలికేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. మీరట్-లక్నో వందే భారత్ మీరట్ నుండి ఉదయం 6:35 గంటలకు బయలుదేరి, 8:35 గంటలకు మొరాదాబాద్, 9:56 గంటలకు బరేలీ చేరుకుని మధ్యాహ్నం 1:45 గంటలకు లక్నో చేరుకుంటుంది. అలాగే లక్నో-మీరట్ వందే భారత్ ఎక్స్‌ప్రెస్ లక్నో నుండి మధ్యాహ్నం 2:45 గంటలకు బయలుదేరి సాయంత్రం 6:02 గంటలకు బరేలీకి చేరుకుంటుంది. ఇక్కడి నుంచి రాత్రి 7:32 గంటలకు మొరాదాబాద్, రాత్రి 10 గంటలకు మీరట్ చేరుకుంటుంది. -
నెట్‌ఫ్లిక్స్ ఫ్రీగా కావాలా? ఈ ప్లాన్లు ట్రై చేయండి..
ప్రముఖ ఓటీటీ నెట్‌ఫ్లిక్స్ సబ్‌స్క్రిప్షన్‌తో వచ్చే ప్రీపెయిడ్ ప్లాన్ కోసం చూస్తున్నారా? అయితే ఈ సమాచారం మీ కోసమే.. ప్రధాన టెలికాం కంపెనీలు రిలయన్స్ జియో, ఎయిర్ టెల్, వొడాఫోన్ ఐడియా రూ.199 విలువ చేసే నెట్‌ఫ్లిక్స్ బేసిక్ ప్లాన్‌ను ఉచితంగా అందిస్తున్నాయి.ఫ్రీ నెట్‌ఫ్లిక్స్ అందిస్తున్న ప్లాన్లు ఇవే..జియో రూ.1,299 ప్లాన్: ఈ ప్లాన్‌తో అపరిమిత వాయిస్ కాల్స్, రోజుకు 100 ఎస్ఎంఎస్లు, అపరిమిత 5జీ డేటాతో 84 రోజుల పాటు (మొత్తం 168 జీబీ మొత్తం) రోజుకు 2 జీబీ డేటాను ఆస్వాదించవచ్చు.జియో రూ.1,799 ప్లాన్: 84 రోజుల పాటు (మొత్తం 252 జీబీ) 3 జీబీ రోజువారీ డేటాతో పాటు రూ .1,299 ప్లాన్ మాదిరిగానే అపరిమిత ప్రయోజనాలను పొందండి.వొడాఫోన్ ఐడియా రూ.1,198 ప్లాన్: ఈ ప్లాన్ మొత్తం 70 రోజుల పాటు 2 జీబీ రోజువారీ డేటాను అందిస్తుంది. అంటే మొత్తం 140 జీబీ. అపరిమిత వాయిస్ కాల్స్, రోజుకు 100 ఎస్ఎంఎస్లు లభిస్తాయి.వొడాఫోన్ ఐడియా రూ.1,599 ప్లాన్: ఈ ప్లాన్‌తో 84 రోజుల పాటు 2.5 జీబీ రోజువారీ డేటాను మొత్తంగా 210 జీబీ డేటాను పొందుతారు. ఇందులో అపరిమిత వాయిస్ కాల్స్, ఎస్ఎంఎస్లు కూడా ఉన్నాయి.ఎయిర్టెల్ రూ.1,798 ప్లాన్: ఈ ప్లాన్ 84 రోజుల పాటు రోజుకు 3 జీబీ డేటాను అందిస్తుంది. మొత్తం 252 జీబీ డేటా. అపరిమిత వాయిస్ కాల్స్, రోజుకు 100 ఎస్ఎంఎస్లు, అన్లిమిటెడ్ 5జీ డేటా లభిస్తుంది. -
ఈ ఉచితం చాలా కాస్ట్లీ!
ఆక్స్ఫర్డ్ డిక్షనరీ చూసినా.. తెలుగు నిఘంటువులు,శబ్ద రత్నాకరం తిరగేసినా వాటిల్లో వాస్తవ అర్థాలే ఉంటాయి.కానీ సీఎం చంద్రబాబు డిక్షనరీ మాత్రం వేరే ఉంది. ప్రతి పదానికీ తనదైన అర్థాలు, నిర్వచనాలు ఉంటాయి! అవసరాన్ని బట్టి ఎప్పటికప్పుడు మారిపోతుంటాయి. ఎలాగంటే.. ఉచితం అంటారు.. కానీ దానికో ధర ఉందంటారు! ఇసుక ఉచితంగా ఇస్తామంటూనే ఊరికే ఏదీ రాదంటారు మరి!! ఉచితం అంటే టీడీపీ పెద్దల దృష్టిలో అమ్మకమే. రాష్ట్రవ్యాప్తంగా స్టాక్ యార్డుల వద్ద బోర్డు పెట్టి మరీ టన్నుల చొప్పున బహిరంగంగా విక్రయిస్తున్నా సరే అది ఉచితంగా ఇవ్వడమే!సీనరేజి ఫీజు, తవ్వకం, లోడింగ్, ఇతర పన్నులతోపాటు రవాణా చార్జీలు కూడా వినియోగదారుల నుంచి ముక్కుపిండి మరీ వసూలు చేస్తున్నారు. డబ్బులు చెల్లించి కొన్నా సరే ఇసుకను ఉచితంగా ఇస్తున్నారనే చెప్పాలి. లేదంటే సీఎం చంద్రబాబుకు కోపం వస్తుంది. ‘ఉచితం అంటే మీ ఇంటికి నేనే ఫ్రీగా తీసుకొచ్చి ఇవ్వాలా?’ అని ఎదురుదాడి చేస్తారు. డబ్బులిచ్చి కొంటున్నాం..కదా అని ఎవరైనా వినియోగదారుడు ఉచితం కాదని చెబితే టీడీపీ శ్రేణులు చితకబాదినా దిక్కుండదు. ఎందుకంటే అది టీడీపీ సర్కారు ఉచిత విక్రయ పథకం కాబట్టి! – సాక్షి, అమరావతి/సాక్షి, నెట్వర్క్పల్నాడులో పచ్చనేతలు చెప్పిందే ధరమాచర్లలో.. 30,000పల్నాడు జిల్లాలో ఇసుక అక్రమ డంప్‌లు పెద్ద ఎత్తున ఉన్నాయి.కృష్ణానది, గుండ్లకమ్మ, వాగుల నుంచి అక్రమంగా ఇసుకను తరలించి డంపింగ్ యార్డులలో నిల్వ ఉంచారు. ఇటీవల వినుకొండ నియోజకవర్గం నూజెండ్ల మండలం తలర్లపల్లిలో గుండ్లకమ్మ వాగు నుంచి టీడీపీ నేతలు అక్రమంగా ఇసుక తరలిస్తుండగా ఓ ట్రాక్టర్ బోల్తా పడి డ్రైవర్ మరణించిన విషయం తెలిసిందే. కొండమోడులో టన్ను ఇసుక ధర రూ.564లు ఉండగా, వినుకొండలో రూ.793లు ఉంది. వీటికి రవాణా చార్జీలు అదనం. తాళ్లాయపాలెం నుంచి గుంటూరుకు ఇసుక లారీ రావాలంటే రూ.15,000 పైనే అవుతోంది. మాచర్లలో 18 టన్నుల ఇసుక రవాణాతో కలిపి రూ.30వేలు అవుతోంది.కడపలో కొల్లగొట్టేస్తున్నారు.. మదనపల్లెలో..28,300వైఎస్సార్, అన్నమయ్య జిల్లాల్లో ఉచిత ఇసుక పేరుతో వేల రూపాయలు వసూలు చేస్తున్నారు. టీడీపీ, బీజేపీ నేతలు పోటాపోటీగా ఉచిత ఇసుకను సొమ్ము చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఎంపీ సీఎం రమేష్ వర్గీయులకు పోటీగా జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి అనుచరులు ఇసుక అక్రమ అమ్మకాలు సాగిస్తున్నారు. మదనపల్లెకు 18 టన్నుల ఇసుక తరలించాలంటే రవాణా చార్జీలతో కలిపి రూ.28,300 వరకు ఖర్చవుతోంది. జమ్మలమడుగుకు అయితే రూ.20వేలకు పైగా అవుతోంది. కృష్ణమ్మ చెంతనే ఉన్నా వేలల్లో ధరలుఎన్టీఆర్ జిల్లాలో..25,200ఉచిత ఇసుక పేరుతో రాష్ట్ర ప్రభుత్వం చుక్కలు చూపిస్తోంది. రవాణా, లోడింగ్, సీనరేజీ, జీఎస్టీ చార్జీల పేరుతో స్టాకు యార్డుల వద్ద ముక్కు పిండి వసూలు చేస్తున్నారు. ఉమ్మడి కృష్ణా జిల్లాలో ట్రక్కు బాడుగ రూ.10 వేల నుంచి రూ.12 వేల వరకు ఉంది. కంచికచర్ల మండలం మోగులూరు స్టాక్ పాయింట్ వద్ద అధికారులు నామమాత్రంగా ఉండగా, 20 మందికి పైగా టీడీపీ నాయకులు, కార్యకర్తలు వారికి దిశానిర్దేశం చేస్తున్నారు. ఒకే బిల్లుపై రెండు వాహనాల్లో లోడ్ చేసి తరలిస్తున్నారు. పెనమలూరు పరిధిలోని చోడవరంలో 50–70 లారీలకు పైగా ఇసుక నిల్వలను అధికార పార్టీ ప్రజాప్రతినిధి ఒకరు లారీ రూ.16 వేల నుంచి రూ.20 వేల చొప్పున అమ్మేశారు. స్టాకు యార్డుల్లో నిల్వలు లేవంటూ కృత్రిమ కొరత సృష్టించి ట్రాక్టరు లోడ్ రూ.6 వేల నుంచి రూ.7 వేలకు విక్రయిస్తున్నారు. దూరప్రాంతాలకు 18 టన్నుల ఇసుక లారీలో తేవాలంటే బాడుగ, పన్నులతో కలిపి రూ.20,835 నుంచి రూ.25,200 అవుతుంది. కర్నూలులో కొనలేం..శ్రీశైలంలో 32,000కర్నూలు జిల్లాలో ఇసుక ధరలు భారీగా ఉన్నాయి. ఒక్కో ప్రాంతంలో ఒక్కో రేటు పెట్టి దోచుకుంటున్నారు. మరోవైపు కౌతాళం మండలం గుడికంబాళి రీచ్‌లోని ఇసుకను టీడీపీ నాయకులు ఇతరుల ఆధార్ కార్డులతో కొల్లగొట్టి డంపింగ్ చేస్తున్నారు. కృత్రిమ కొరత సృష్టించి సొమ్ము చేసుకుంటున్నారు. శ్రీశైలం నియోజకవర్గంలో 18 టన్నులు ఇసుక గరిష్టంగా లారీ రవాణా చార్జీలతో కలిపి రూ.32వేలు వరకు అవుతోంది. ఉత్తరాంధ్రలో విచ్చలవిడిగా లూటీ.. పెందుర్తిలో.. 28,800ఉత్తరాంధ్ర జిల్లాల్లో ఉచితం పేరుతో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతున్నా.. ఆచరణలో మాత్రం అధిక ధరలు వసూలు చేస్తున్నారు. విశాఖ, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో 18 టన్నుల ఇసుక రవాణా చార్జీలతో కలిపి రూ.20వేల నుంచి 28,800 వరకు విక్రయిస్తున్నారు. ముఖ్యంగా ఇసుక డిమాండ్ ఎక్కువగా ఉండే విశాఖపట్నం నగర పరిసర ప్రాంతాల్లో రేట్లు ఎక్కువగా ఉన్నాయి. అనంతలో అతి కష్టం పెనుకొండలో..25,000అనంతపురం జిల్లా రాయదుర్గం మండలం జుంజురంపల్లి సమీపంలో వేదావతి హగరి నది వద్ద ఇసుక విక్రయాలు ప్రారంభించారు. ఇక్కడి నుంచి అనంతపురం లాంటి దూర ప్రాంతాలకు తరలించాలంటే ఖర్చులు తడిసి మోపెడు అవుతున్నాయి. శ్రీసత్యసాయి జిల్లాలోనూ ఇదే పరిస్థితి ఉంది. పెనుకొండలో గరిష్టంగా 18టన్నుల ఇసుక రవాణాచార్జీలతో కలిపి రూ.25,000 వరకు అవుతోంది. చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లో చిత్ర విచిత్రాలు.. నెల్లూరు రూరల్..23,000 ఉమ్మడి చిత్తూరు జిల్లావ్యాప్తంగా ఇసుక ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోనూ ఇదే పరిస్థితి నెలకొంది. చిత్తూరు మండలం దిగువ మాసపల్లి రీచ్‌లో టన్నుకు రూ.289 సీనరేజీ కింద చెల్లిస్తూ అదనంగా రూ200 వసూలు చేస్తున్నారు. నగరి, గంగాధర నెల్లూరు నియోజకవర్గాల ప్రజలు చిత్తూరు రూరల్ మండలంలో ఏర్పాటు చేసిన ఇసుక డిపో వద్దకు వచ్చి తీసుకెళ్లేందుకు రవాణా చార్జీలతో కలిపి ట్రాక్టర్ లోడు ఇసుక రూ.7,500 వరకు ఖర్చు అవుతోంది. కుప్పం, పుంగనూరు, పలమనేరు నియోజకవర్గాల ప్రజలు గంగవరం మండలం బైరెడ్డిపల్లి క్రాస్ రోడ్డు వద్ద ఉన్న ఇసుక డిపోనకు వచ్చి ఇసుక తీసుకెళ్లాల్సిన పరిస్థితి నెలకొంది. వారికి రవాణా ఖర్చులతో కలిపి ట్రాక్టర్ లోడు రూ.8,500 వరకు ఖర్చు అవుతోంది. గూడూరుకు వెళ్లేందుకు ట్రాక్టర్ ఇసుకకు రూ.9 వేల నుంచి రూ.10వేలు వ్యయం అవుతోంది. చంద్రగిరికి లారీ ఇసుక రవాణా చార్జీలతో కలిపి రూ.21,600 వరకు అవుతోంది. నెల్లూరు రూరల్ నియోజకవర్గానికి 18 టన్నుల ఇసుక లారీ తీసుకువెళ్లేందుకు రూ.23,000 అవుతోంది. -
ఎట్టకేలకు స్వేచ్ఛ.. లండన్ జైలు నుంచి ‘వికీలీక్స్’ జులియన్ అసాంజే విడుదల
వికీలీక్స్ వ్యవస్థాపకుడు జులియన్ అసాంజేకు ఎట్టకేలకు స్వేచ్ఛ లభించింది. లండన్ బెల్మార్ష్ జైలు నుంచి సోమవారం ఆయన విడుదల అయ్యారు. అమెరికా గూఢచర్య చట్టాన్ని ఉల్లంఘించినట్లు ఆయన నేరం ఒప్పుకున్నారని, ఈ మేరకు అమెరికా ప్రభుత్వంతో జరిగిన ఒప్పందంలో భాగంగానే ఆయన బెయిల్ మీద విడుదలయ్యారని తెలుస్తోంది. దాదాపు ఐదేళ్ల తర్వాత స్వేచ్ఛా వాయువు పీల్చిన ఆయనకు.. సొంత దేశం ఆస్ట్రేలియా వెళ్లేందుకు అనుమతి సైతం లభించినట్లు తెలుస్తోంది. జులియన్ అసాంజే(52) విడుదలను వికీలీక్స్ సంస్థ ఎక్స్ ద్వారా ధృవీకరించింది. ఈ మేరకు ఓ సుదీర్ఘమైన పోస్టును ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేసింది. ‘‘జులియన్ అసాంజే ఇప్పుడు స్వేచ్ఛా జీవి. బెల్మార్ష్ జైలులో 1901 రోజులు ఆయన గడిపారు. జూన్ 24 ఉదయం ఆయన విడుదలయ్యారు. లండన్ హైకోర్టు ఆయనకు బెయిల్ మంజూరు చేసింది. అక్కడి నుంచి ఆయన స్టాన్స్టెడ్ ఎయిర్‌పోర్ట్‌కు చేరుకున్నారు అని వికీలీక్స్ ఎక్స్ ద్వారా తెలియజేసింది. JULIAN ASSANGE IS FREEJulian Assange is free. He left Belmarsh maximum security prison on the morning of 24 June, after having spent 1901 days there. He was granted bail by the High Court in London and was released at Stansted airport during the afternoon, where he boarded a…— WikiLeaks (@wikileaks) June 24, 2024అంతేకాదు.. అసాంజే విడుదల కోసం ప్రపంచవ్యాప్తంగా మద్దతు ఇచ్చిన వాళ్లకు వికీలీక్స్ కృతజ్ఞతలు తెలియజేసింది. ఇందులో ఐక్యరాజ్య సమితి లాంటి సంస్థల కృషి కూడా ఉందని తెలిపింది. అయితే అమెరికా న్యాయవిభాగంతో ఒప్పందం జరిగిందని ధృవీకరించిన వికీలీక్స్.. ఆ ఒప్పందం తాలుకా వివరాలు అధికారికంగా ఫైనలైజ్ కాలేదని తెలిపింది. పూర్తి వివరాలను త్వరలోనే వెల్లడిస్తామని పేర్కొంది. ఈలోపు.. ఉత్తర మరియానా దీవులలోని(US) కోర్టులో దాఖలైన పత్రాల సారాంశం సోమవారం రాత్రి బయటకు వచ్చింది. అందులో.. బ్రిటన్‌లో కస్టడీలో ఉన్న అసాంజే.. అమెరికా గూఢచర్య చట్టం ఉల్లంఘనకు పాల్పడినట్లు నేరాన్ని అంగీకరించాడు అని ఉంది. అంతేకాదు ఆయనపై మోపబడ్డ 18 అభియోగాలన్నింటిని(17 అభియోగాలు+వికీలీక్స్‌పై కంప్యూటర్ దుర్వినియోగం కేసు).. ఒక్క కేసుగానే కోర్టు విచారించనున్నట్లు తెలుస్తోంది. బుధవారం ఉదయం సైపన్ కోర్టు ఎదుట అసాంజే విచారణకు హాజరవుతారని, కోర్టు ఆయనకు 62 నెలల శిక్ష విధించనుందని, అయితే బ్రిటన్‌లో ఆయన అనుభవించిన శిక్షా కాలాన్ని ఇందులో నుంచి మినహాయిస్తారని, ఆపై ఆయన్ను నేరుగా ఆస్ట్రేలియా వెళ్లేందుకు అనుమతిస్తారన్నది ఆ పత్రాల సారాంశం. అసాంజేను అమెరికాకు అప్పగించే విషయంపై బ్రిటన్ కోర్టులో ఇప్పటికే విచారణ జరుగుతోంది. మరో రెండు వారాల్లో ఈ అభ్యర్థనపై విచారణ జరగాల్సి ఉంది. ఈలోపే ఈ పరిణామం చోటు చేసుకోవడం గమనార్హం. #JulianAssange is free!!! After 14 years of being detained, today he left the UK. I can’t wait to give him a hug and go on a walk with him. pic.twitter.com/sPwVrt1U9y— Juan Passarelli (@JuanAndOnlyDude) June 25, 2024భావ స్వేచ్చప్రకటన ద్వారా ప్రపంచవ్యాప్తంగా హీరోగా జేజేలు అందుకున్న అసాంజే.. అమెరికా పాలిట మాత్రం విలన్‌గా తయారయ్యాడు. ఇరాక్, అఫ్గనిస్థాన్ యుద్ధాలకు సంబంధించిన అమెరికా రక్షణ రంగ రహస్య పత్రాలను 2010లో ఆయన స్థాపించిన విజిల్ బ్లోయర్ వెబ్సైట్ వికీలీక్స్ విడుదల చేసింది. ఏప్రిల్ 2010లో.. హెలికాప్టర్ నుంచి చిత్రీకరించిన బాగ్దాద్ వైమానిక దాడికి సంబంధించిన వీడియో విడుదల చేసింది. అమెరికా చేసిన ఈ దాడిలో ఇద్దరు రాయిటర్స్ జర్నలిస్టులు సహా అనేక మంది పౌరులు మరణించారు. జులై 2010 - వికీలీక్స్ 91,000కు పైగా పత్రాలను విడుదల చేసింది. వీటిలో ఎక్కువగా అఫ్గానిస్థాన్ యుద్ధానికి సంబంధించి అమెరికా రహస్య నివేదికలు ఉన్నాయి. అక్టోబర్ 2010లో ఇరాక్ యుద్ధాన్ని వివరించే 4,00,000 రహస్య సైనిక ఫైళ్లను వికీలీక్స్ విడుదల చేసింది.ఈ లీక్ వ్యవహారం ప్రపంచవ్యాప్తంగా కలకలం రేపింది. దీంతో అమెరికా ఆయనపై అబియోగాలు మోపి.. విచారించేందుకు సిద్ధపడింది. అయితే ఈ అభియోగాలే ప్రపంచవ్యాప్తంగా ఆయనకు మద్ధతుదారుల్ని తెచ్చిపెట్టింది. అగ్రరాజ్య సైన్యంలోని లోపాలను ఎత్తి చూపేందుకు ఆయన ఓ జర్నలిస్టులా వ్యవహరించాడంటూ ప్రపంచవ్యాప్తంగా అసాంజేకు అభిమానులు పెరిగిపోయారు. మరోవైపు అసాంజేపై అమెరికా మోపిన నేరాభియోగాల్ని వాక్ స్వేచ్చకు తీవ్ర ముప్పుగా మేధోవర్గం అభివర్ణించింది. అమెరికా మాత్రం చాలా సున్నితమైన సమాచారాన్ని చట్టవిరుద్ధంగా పొంది లీక్ చేశారని ఆరోపిస్తూ వచ్చింది. అమెరికా వాదనకు సైతం ఓ వర్గం నుంచి మద్ధతు లభించింది. చివరకు.. 14 ఏళ్ల తర్వాత.. ఒక డీల్ ప్రకారమే ఆయన్ని విడుదల చేస్తున్నట్లు స్పష్టమవుతోంది.అసాంజే మీద కేసు ఏంటంటే..2010-11 మధ్య అమెరికా రక్షణ విభాగానికి సంబంధించిన అత్యంత గోప్యమైన విషయాల్ని వికీలీక్స్ బయటపెట్టింది. అందులో బాగ్దాద్‌పై జరిపిన వైమానిక దాడుల ఫుటేజీ కూడా ఉంది. అమెరికా ఆర్మీ ఇంటెలిజెన్స్ అనలిస్ట్(మాజీ) చెల్సీ మేనింగ్ సహకారంతోనే అసాంజే ఈ లీకులకు పాల్పడ్డారని తేలింది. దీంతో ఆమెకు 2013లో 35 ఏళ్ల జైలు శిక్ష పడింది. అయితే 2017లో అప్పటి అధ్యక్షుడు బరాక్ ఒబామా ఆమె శిక్షను తగ్గించారు. 2023లో ఓ ఇంటర్వ్యూలో చెల్సీ మేనింగ్ఇక.. 2019లో డొనాల్డ్ ట్రంప్ పాలనలో అసాంజేపై 18 నేరాభియోగాలు నమోదు అయ్యాయి. అమెరికా గూఢాచర్య చట్టం ఉల్లంఘించారనేది ప్రధాన అభియోగం. ఐదేళ్లుగా జైల్లో.. ఈ వ్యవహారంతో.. అమెరికా నుంచి ప్రాణభయం ఉందన్న కారణంతో లండన్‌లోని ఈక్వెడార్ రాయబార కార్యాలయంలో కొంతకాలం ఆశ్రయం పొందారు. అదే సమయంలో స్వీడన్ నుంచి ఆయనపై లైంగిక దాడి విచారణ జరిగింది. ఇక ఈక్వెడార్ ఆశ్రయాన్ని విరమించుకున్న తర్వాత బ్రిటన్ పోలీసులు అరెస్ట్ చేశారు. 2011లో తన న్యాయ బృందంలో పని చేసిన మోరిస్‌తో అసాంజేకు చనువు పెరిగింది. లండన్‌లోని ఈక్వెడార్ రాయబార కార్యాలయంలో నివసిస్తున్నప్పుడే.. ఆమెతో డేటింగ్ చేసి ఇద్దరుపిల్లల్ని కన్నారాయన. అసాంజే 2019 ఏప్రిల్ నుంచి లండన్‌లోని బెల్మార్ష్ జైలులో ఉన్నారు. జైల్లోనే ఆయన స్టెల్లా మోరిస్‌ను వివాహం చేసుకోవడం గమనార్హం. 14 ఏళ్లుగా నాటకీయ పరిణామాలుపదేళ్ల క్రితం అమెరికా సైనిక, దౌత్య కార్యకలాపాలకు సంబంధించి వికీలీక్స్ సంస్థ బయటపెట్టిన రహస్యాలు సంచలనం సృష్టించాయి. అసాంజేపై గూఢచర్యానికి సంబంధించి 17 అభియోగాలు ఉన్నాయని.. వికీలీక్స్ సంస్థపై కంప్యూటర్ దుర్వినియోగం కేసు ఉందని అమెరికా వాదించింది. ఈ గూఢచర్యం కేసుకు సంబంధించి.. అతడిని తమ దేశానికి రప్పించాలని అమెరికా తీవ్రంగా ప్రయత్నించింది కూడా. ఈ క్రమంలో ఆయనపై అభియోగాలు నిజమని తేలితే.. ఏకంగా 175 ఏళ్ల శిక్ష పడేది. అయితే అటు ఆస్ట్రేలియా విజ్ఞప్తులు, ఇటు పాత్రికేయ సమాజం ఒత్తిళ్లకు తలొగ్గి బైడెన్ ప్రభుత్వం చివరకు ఆయన విడుదలకు సిద్ధమయ్యింది. -
ఇక ఎంత దూరం తొక్కినా నొప్పి లేని సైక్లింగ్
‘వెబ్స్ రైడర్’.. ప్రపంచంలోని మొట్టమొదటి వర్చువల్ యాక్సిస్ సైకిల్ సీటు. ఇది మరింత సౌకర్యవంతమైన రైడ్ కోసం ఉపయోగపడుతుంది. సైకిల్‌కు గల ఈ సీటుపై కూర్చుని పెడల్ తొక్కుతున్నప్పుడు శరీర బరువును ఇరువైపులా సమానంగా పంపిణీ చేసి, దానిని తొక్కుతున్న వ్యక్తి శరీరంలోని సీటు దగ్గర ఏమాత్రం నొప్పి కలుగకుండా చూస్తుంది. ఆస్ట్రేలియన్ ఇంజనీర్ రాబిన్ మకాన్ మరింత సౌకర్యవంతమైన సైకిల్ సీటును రూపొందించేందుకు ప్రయత్నిస్తుండేవాడు. మానవ శరీరంలోని స్వాభావిక నొప్పి పాయింట్లను సైకిల్‌కు ఉన్న కుషనింగ్ సీటు భర్తీ చేయలేదనే విషయాన్ని గమనించిన ఆయన శరీర బరువును ఇరువైపులా సమానంగా పంపిణీ చేసే సైకిల్ సీటును రూపొందించే దిశగా ముందుకు సాగాడు.తాను రూపొందించిన నమూనాను ‘ఇన్వెంటర్స్ అసోసియేషన్ ఆఫ్ ఆస్ట్రేలియా’ అనే సంస్థకు తెలియజేశాడు. ఇది నూతన ఆవిష్కర్తలకు మద్దతును అందించే స్వచ్ఛంద సంస్థ. అక్కడ రాబిన్ మకాన్ పారిశ్రామిక డిజైనర్ ఫిలిప్ గుయిచార్డ్ను కలుసుకున్నాడు. వీరిద్దరూ ఈ రెండేళ్ల పాటు కష్టపడి ఈ డిజైన్‌ను మరింతగా మెరుగుపరిచారు. ప్రముఖ ఇంజినీరింగ్ సంస్థ విజిల్ సహకారంతో వారు రూపొందించిన ‘వెబ్స్ రైడర్’ మార్కెట్లోకి తీసుకువచ్చారు.ఈ వెబ్రైడర్ స్ప్లిట్ సైకిల్ సీటు వినియోగదారులకు అత్యంత సౌకర్యవంతమైన సైకిల్ రైడ్ అనుభవాన్ని అందిస్తుంది. ఈ సీటుపై కూర్చుని సైకిల్ తొక్కుతున్నప్పుడు రెండు కాళ్లు సమానంగా కలిలేందుకు వీలు కల్పిస్తుంది. సీటు ఎముకల నుండి తొడ ఎముకలకు ఒత్తిడిని బదిలీ చేసి, కాళ్లకు నొప్పి కలుగుకుండా చూస్తుందని రాబిన్ మకాన్ తెలిపారు. This revolutionaly bike seat design.[🎞️ AtaraxyBSC]pic.twitter.com/cLOV3MWmuw— Massimo (@Rainmaker1973) June 11, 2024 -
ఫ్రీ పాస్‌పోర్ట్, నో ట్యాక్స్.. ఓ దేశం బంపరాఫర్!
సెంట్రల్ అమెరికా దేశం ఎల్ సాల్వడార్ అత్యంత నైపుణ్యం కలిగిన వృత్తి నిపుణులకు బంపరాఫర్ ప్రకటించింది. తమ దేశానికి వచ్చే ఇలాంటివారికి 5,000 ఉచిత పాస్‌పోర్ట్‌లను అందించనున్నట్లు ఆ దేశ అధ్యక్షుడు నయీబ్ బుకెలే ప్రకటించారు. దేశ పాస్‌పోర్ట్ ప్రోగ్రామ్‌లో ఈ సంఖ్య 5 బిలియన్ డాలర్లకు ( సుమారు రూ. 41 వేల కోట్లు) సమానం అని ఆయన తెలిపారు. "విదేశాల నుండి అత్యంత నైపుణ్యం కలిగిన శాస్త్రవేత్తలు, ఇంజనీర్లు, వైద్యులు, కళాకారులు, తత్వవేత్తలకు 5,000 ఉచిత పాస్‌పోర్ట్‌లను (మా పాస్‌పోర్ట్ ప్రోగ్రామ్‌లో 5 బిలియన్ డాలర్లకు సమానం) అందిస్తున్నాం. ఇది మా జనాభాలో 0.1 శాతం కంటే తక్కువే కాబట్టి వారికి పూర్తి పౌర హోదాను కల్పిస్తాం. ఓటింగ్ హక్కులతో సహా ఎటువంటి సమస్య లేకుండా చూసుకుంటాం" అని ఎల్ సాల్వడార్ ప్రెసిడెంట్ బుకెలే ‘ఎక్స్’లో ద్వారా ప్రకటించారు. అంతేకాకుండా విదేశాల నుంచి తమ దేశానికి తరలివచ్చే కుటుంబాలకు, ఇక్కడ వారు సంపాదించుకునే ఆస్తులపై ఎటువంటి పన్నులు, సుంకాలు లేకుండా చూసుకుంటామన్నారు. దీని గురించి త్వరలో మరిన్ని వివరాల ప్రకటిస్తామని బుకెల్ వెల్లడించారు. We're offering 5,000 free passports (equivalent to $5 billion in our passport program) to highly skilled scientists, engineers, doctors, artists, and philosophers from abroad. This represents less than 0.1% of our population, so granting them full citizen status, including… — Nayib Bukele (@nayibbukele) April 6, 2024 -
ఇక ఉచితంగా మాట్లాడను!
కొందరు వ్యక్తులు తన సమయాన్ని అనవసరంగా వృథా చేస్తున్నారని, అలాంటి వ్యక్తులతో ఇక ఉచితంగా మాట్లాడననీ అంటున్నారు బాలీవుడ్ దర్శకుడు అనురాగ్ కశ్యప్. అందుకే ఇకనుంచి ఎవరికైనా సమయం కేటాయించాలనుకుంటే అందుకు తగ్గట్టుగా ‘చార్జ్’ చేస్తానని అంటున్నారాయన. ఈ విషయంపై అనురాగ్ ఓ నోట్‌ను సోషల్ మీడియాలో షేర్ చేయగా, బాలీవుడ్లో హాట్ టాపిక్‌గా మారింది. ‘‘కొంతమంది కొత్త వ్యక్తులకు సహాయం చేయాలనుకుని వారితో సమావేశమై నేను నా సమయాన్ని చాలా కోల్పోయాను. ఆ సమావేశాలు నాకు ఏ మాత్రం వర్కౌట్ కాలేదు కూడా. చెప్పాలంటే ఇలా చాలామందితో మాట్లాడి నేను అలసిపోయాను. ఈ విధంగా జీవితంలో చాలా సమయాన్ని కోల్పోయాను. సక్సెస్‌కు షార్ట్ కట్స్ వెతికేవారితో, తాము క్రియేటివ్ జీనియస్‌లా ఫీలయ్యే కొందరు వ్యక్తులతో ఇకపై నేను ఉచితంగా మాట్లాలనుకోవడం లేదు. నేను ఓ స్వచ్ఛంద సేవా సంస్థను కాదలచుకోలేదు. ఇకపై ఎవరైనా నన్ను కలవాలనుకుంటే పది నుంచి పదిహేను నిమిషాలు అయితే లక్ష రూపాయలు, 30 నిమిషాలకు రెండు లక్షలు, గంట అయితే ఐదు లక్షలు చెల్లించాలి. ఒకవేళ ఎవరైనా ఇలా డబ్బులు చెల్లించలేని పక్షంలో వారు నన్ను కలవడానికి ప్రయత్నించవద్దు’’ అని ఆ నోట్లో పేర్కొన్నారు అనురాగ్ కశ్యప్. ఇక బాలీవుడ్లో వచ్చిన ‘బ్లాక్ ఫ్రైడే’, ‘ముంబై కటింగ్’, ‘బాంబే టాకీస్’ వంటి సినిమాలకు అనురాగ్ కశ్యప్ దర్శకత్వం వహించిన సంగతి తెలిసిందే. -
ఇసుక కొరత ఉండొద్దు
సాక్షి, హైదరాబాద్: గ్రామీణ ప్రాంతాల్లో స్థానిక అవసరాలకు ఇసుక కొరత లేకుండా చూడాలని రాష్ట్ర ప్రభుత్వం శనివారం ఆదేశాలు జారీ చేసింది. స్థానిక అవసరాలకు సరిపడే ఇసుక రవాణాకు అనుమతించాలని జిల్లా కలెక్టర్లకు ఆదేశాలిచ్చింది. ఈ మేరకు రాష్ట్ర మైన్స్ అండ్ జియాలజీ శాఖ ముఖ్య కార్యదర్శి మహేశ్‌దత్ ఎక్కా ఉత్తర్వులు జారీ చేశారు. తమ ఇళ్ల నిర్మాణాలు, స్థానిక అవసరాలకు ఇసుక రవాణాకోసం అనుమతి ఇవ్వాలని గ్రామీణుల నుంచి ప్రభుత్వానికి పలు విజ్ఞప్తులు అందాయి. ఈ నేపథ్యంలో గ్రామాల్లో నిర్మాణాలకు ఆటంకం లేకుండా సమీపంలోని వాగులు, వంకల నుంచి ఇసుకను ఉచితంగా తీసుకు వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు అవసరమున్న వారు ట్రాక్టర్లు, ఎడ్ల బండ్ల ద్వారా ఉచితంగా ఇసుకను తెచ్చుకునేందుకు అనుమతిస్తారు. అయితే నిబంధనలను ఉల్లంఘిస్తే బాధ్యులైన అధికారులపై చర్యలు తీసుకుంటామని ఆ ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు. గతంలోనూ వెసులుబాటు.. తెలంగాణ రాష్ట్ర ఇసుక వెలికితీత విధానం 2015 నిబంధనల ప్రకారం గతంలోనూ స్థానిక వనరుల నుంచి గ్రామాల్లో అవసరాలకు ఇసుకను తెచ్చుకోవడానికి వెసులుబాటు కల్పించారు. అయితే విచ్చలవిడి ఇసుక వెలికితీతతో భూగర్భ జల వనరులు దెబ్బతింటాయనే ఉద్దేశంతో అప్పటి ప్రభుత్వం స్థానిక అవసరాల కోసం ఇసుక వెలికితీత, రవాణాపై కఠినంగా వ్యవహరించడంతోపాటు ఇసుక వెలికితీత, అనుమతుల బాధ్యతను స్థానిక తహసీల్దార్లు, గ్రామపంచాయతీలకు అప్పగించింది. ఇసుక వెలికితీతకు అనువైన ప్రాంతాలను గుర్తించేందుకు రెవెన్యూ, భూగర్భ జల వనరులు, పంచాయతీ విభాగాలతో కూడిన కమిటీని ఏర్పాటు చేసి అనుమతులు తప్పనిసరి చేసింది. మరోవైపు స్థానిక అవసరాలకు ఉపయోగించే ఇసుకకు కూడా డబ్బులు చెల్లించాలనే విధానాన్ని అనుసరించింది. అయితే ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన తాజా ఉత్తర్వుల ప్రకారం ఇకపై స్థానిక అవసరాల కోసం ఎలాంటి అనుమతులు లేకుండా డబ్బు చెల్లించకుండానే ఇసుకను తీసుకు వెళ్లడానికి అవకాశం ఏర్పడుతుంది. -
మీ పేరు అదేనా?.. అయితే ఆ సినిమా టికెట్ ఫ్రీ!
కేరింతఫేమ్ పార్వతీశం హీరోగా నటిస్తున్న తాజా చిత్రం మార్కెట్ మహాలక్ష్మి. వీఎస్ ముఖేశ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం ద్వారా ప్రణీకాన్వికా హీరోయిన్గా పరిచయమవుతోంది. ప్రొడ్యూజర్ అఖిలేష్ కలారు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. బి2పి స్టూడియోస్ ద్వారా తెరకెక్కిస్తోన్న ఈ చిత్రంలో హర్ష వర్ధన్, మహబూబ్ బాషా, ముక్కు అవినాష్ ప్రధాన పాత్రలు పోషించనున్నారు. ఇప్పటికే ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ కాగా.. ఆడియన్స్ అదిరిపోయే రెస్పాన్స్ వస్తోంది. రిలీజ్ తేదీ దగ్గర పడుతుండంతో చిత్రబృందం మూవీ ప్రమోషన్లతో బిజీగా ఉంది. మార్కెట్ మహాలక్ష్మి మూవీ ప్రమోషన్లలో భాగంగా చిత్రబృందం బంపర్ ఆఫర్ ప్రకటించింది. ఆ పేరుతో ఉన్నవారికి 200 టికెట్లు ఉచితంగా ఇవ్వనున్నట్లు ప్రకటించారు. దీనికి సంబంధించిన ఓ వీడియోను సోషల్ మీడియాలో రిలీజ్ చేశారు. మీ ఇంట్లో ఎవరైనా మహాలక్ష్మి అనే పేరుతో ఉన్నారా? అంటూ హీరో, హీరోయిన్స్ ఆడియన్స్‌ను ప్రశ్నించారు. ఆ పేరుతో ఎవరైనా ఉంటే వెంటనే మీ ఐడీ ప్రూఫ్‌ను 9005500559కి వాట్సాప్ చేయండి అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. టాప్-200 మహాలక్ష్ములకు మార్కెట్ మహాలక్ష్మి టిక్కెట్స్ ఫ్రీగా ఇస్తున్నామని ప్రకటించారు. ఇంకెందుకు ఆలస్యం ఎవరైనా మహాలక్ష్ములు ఉంటే వెంటనే వాట్సాప్ చేసి టికెట్స్ ఉచితంగా పొందండి. కాగా.. ఈ చిత్రం మార్చి 29న ప్రేక్షకుల ముందుకు రానుంది. View this post on Instagram A post shared by VS MUKKHESH (@vsmukkhesh) -
పంజాబ్‌లో ‘ఉచిత రేషన్’ ఎలా అందిస్తున్నారు?
రాబోయే లోక్‌సభ ఎన్నికల సందర్భంగా దేశవ్యాప్తంగా పలు రాజకీయ పార్టీలు ఓటర్లపై వరాల జల్లు కురిపిస్తున్నాయి. ఈ నేపధ్యంలోనే పంజాబ్‌లోని భగవంత్ మాన్ ప్రభుత్వం రాష్ట్రంలోని ప్రజలకు ఉచిత రేషన్ అందిస్తోంది. పంజాబ్‌లో ఇంటింటికీ ఉచిత రేషన్ పథకాన్ని పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్, ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ ప్రారంభించారు. ఈ పథకం కింద లబ్ధిదారులు ఇంటి వద్దనే రేషన్ అందుకోవచ్చు. మొదటి దశలో పంజాబ్‌లోని 25 లక్షల మందికి ఈ పథకం ప్రయోజనాలను అందించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ పథకం కింద ఒక్కొక్కరికి ఐదు కిలోల గోధుమ పిండిని ఉచితంగా అందజేస్తారు. మిగిలిన రేషన్ సరుకులను దఫదఫాలుగా అందించనున్నారు. పంజాబ్‌లో 38 లక్షల మంది రేషన్ కార్డుదారులు ఉన్నారు. 20, 500 ప్రభుత్వ రేషన్ దుకాణాలు ఉన్నాయి. 1,500 మందికి పైగా యూత్ డెలివరీ ఏజెంట్లు ఉన్నారు. మొదటి దశలో 25 లక్షల కుటుంబాలకు రేషన్ అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ పథకం కింద లబ్ధిదారులు ప్రతి నెలా ఇంటి వద్దనే రేషన్ సరుకులు అందుకోవచ్చు. లబ్ధిదారులు గోధుమపిండి స్థానంలో ఇతర అందుబాటులో ఉన్న ఆహార ధాన్యాలు తీసుకునే అవకాశం కూడా ఉంది. పంజాబ్ ప్రభుత్వం ప్రారంభించిన ఇంటింటికీ రేషన్ పథకం కింద దారిద్య్రరేఖకు దిగువన ఉన్న వారు లబ్ధిపొందవచ్చు. -
రైతులకు ఉచితంగా పంటల బీమా!
సాక్షి, హైదరాబాద్: రైతులు పైసా ఖర్చు చేయకుండా ప్రభుత్వమే ఉచితంగా పంటల బీమాను అందుబాటులోకి తీసుకురానున్నట్లు తెలిసింది. ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన పథకం కింద రాష్ట్రంలో రైతులు చెల్లించాల్సిన వాటా ప్రీమియంను ప్రభుత్వమే భరిస్తుందని వ్యవసాయ శాఖ వర్గాలు వెల్లడించాయి. ఈ మేరకు ప్రభుత్వం సూత్రప్రాయ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపాయి. రాష్ట్రంలో ఈ ఏడాది వానాకాలం సీజన్ నుంచి ఫసల్ బీమా పథకాన్ని తిరిగి అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే. రైతులు చెల్లించాల్సిన ప్రీమియం చాలా ఎక్కువగా ఉన్నందున గత ప్రభుత్వం ఈ బీమా పథకం నుంచి బయటకు వచ్చింది. దీంతో కొంతకాలంగా రైతులకు పంటల బీమా లేకుండా పోయింది. ఈ నేపథ్యంలో కొత్త సర్కారు రైతుల ప్రీమియం వాటాను తామే చెల్లించాలని నిర్ణయించినట్లు తెలిసింది. క్లస్టర్ల వారీగా అమలు వ్యవసాయ శాఖ వర్గాల అంచనా ప్రకారం..రాష్ట్ర రైతులు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రెండు సీజన్లకు కలిపి దాదాపు రూ.2 వేల కోట్లు బీమా కంపెనీలకు ప్రీమియంగా చెల్లించాల్సి ఉంటుంది. అందులో రైతుల వాటా దాదాపు రూ.300 కోట్లు ఉంటుందని అంచనా. కాగా ఫసల్ బీమా పథకంలో చేరే విషయమై కేంద్ర ప్రభుత్వానికి త్వరలోనే తెలంగాణ ప్రభుత్వం లేఖ రాయనుంది. పంటల బీమా పథకాన్ని క్లస్టర్ల వారీగా అమలు చేయనున్నారు. రాష్ట్రంలోని జిల్లాలను ఆరు క్లస్టర్లుగా విభజిస్తారు. కాగా బీమా పథకంలో ఉన్న వివిధ రకాల అంశాలను పరిగణనలోకి తీసుకొని ఈ పథకాన్ని అమలు చేస్తారు. అకాల వర్షాలతో నష్టపోతే ఒక రకమైన ప్రీమియం, కోత కోసి కల్లాల్లో ఉన్నప్పుడు వర్షం పడి నష్టం జరిగితే మరో రకమైన ప్రీమియం, దిగుబడి తక్కువ వస్తే అందుకు సంబంధించి మరో ప్రీమియం ఇలా వివిధ రకాలుగా పథకంలో వెసులుబాట్లు ఉన్నాయి. దీంతో ఏ క్లస్టర్లలో ఎటువంటి వాతావరణం ఉంటుందన్న దానికి అనుగుణంగా పథకాన్ని అమలు చేస్తారు. బీమా కంపెనీలు కోట్ చేసే ధరలను బట్టి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని వ్యవసాయ శాఖ వర్గాలు తెలిపాయి. ఈ ప్రక్రియ పూర్తి కావడానికి మూడు నెలల సమయం పడుతుందని అధికారులు తెలిపారు. ఎన్నికల కోడ్ రావడానికి ముందే పథకానికి సంబంధించి మార్గదర్శకాలు వెలువడనున్నాయి. -
సమస్యతో బాధపడుతున్నారా..! అయితే ఇలా చేయండి..
ప్రతీరోజూ బిజీ బిజీగా గడుపుతున్న జీవితంలో మనం మన ఆరోగ్యాన్ని పట్టించుకోము. అందులో మన ముఖము, జుట్టుల గురించి అయితే అసలు ధ్యాసే ఉండదు. పలువురితో సాగుతున్న క్రమంలో వీటివలన ఎన్నో సమస్యలను ఎదుర్కుంటూ ఉంటాం. ఇతరులతో హేళనలను భరిస్తూ ఉంటాం. ఇకపై ఇలాంటి వాటికి చెక్ పెట్టేలా ఈ అద్భుతమైన బ్యూటీ టిప్స్ మీకోసమే..! పిగ్నెంటేషన్... కీరాతో కట్అరకప్పు కీరదోస గుజ్జు తీసుకుని అందులో కోడిగుడ్డులోని తెల్లసొన, చెంచా నిమ్మరసం వేసి బాగా కలుపుకోవాలి. ఈ పేస్ట్‌ను ముఖానికి పట్టించి 20 నిమిషాల పాటు ఆరనిచ్చిన తర్వాత గోరువెచ్చని నీటితో ముఖాన్ని శుభ్రం చేయాలి. కీరదోస పిగ్మెంటేషన్ సమస్యను దూరం చేస్తుంది. దీనివల్ల ముఖంపైన ముడతలు, సన్నని చారలు వంటి సమస్యలు దూరం అవుతాయి. బార్లీతో మేని మిలమిల ఒక పాత్రలో బార్లీ గింజల పొడిని తీసుకుని అందులో కొద్దికొద్దిగా గోరువెచ్చటి నీళ్లు పోసుకుంటూ ముద్దలా కలుపుకోవాలి. ఈ పేస్ట్‌ను ముఖానికి ప్యాక్‌లా అప్లై చేయాలి. పావుగంట తర్వాత గోరువెచ్చటి నీటితో ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి. ఇలా తరచు చేస్తే.. మచ్చలు, మృత కణాలు తొలగిపోయి చర్మం ప్రకాశవంతంగా తయారవుతుంది. మిరియాలతో చుండ్రుకు చెక్! మిరియాలు ఆరోగ్యానికెంతో మేలు చేస్తాయని అందరికీ తెలుసు. అయితే ఆరోగ్యానికే కాదు జుట్టు సంరక్షణకు సైతం మిరియాలు ఉపయోగపడతాయి. ముఖ్యంగా చుండ్రు సమస్యను చాలా సులువుగా పోగొట్టే సత్తా మిరియాలకు ఉంది. ఇందుకోసం ఒక ఉల్లిపాయను తీసుకుని పొట్టు తీసి ముక్కలుగా కట్ చేసుకోవాలి. వీటిని మిక్సీజార్‌లో వేసి వీటితోపాటు టేబుల్ స్పూన్ నల్ల మిరియాలు వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న మిశ్రమం నుంచి జ్యూస్‌ను సపరేట్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ జ్యూస్‌లో టేబుల్ స్పూన్ ఆవనూనె, టేబుల్ స్పూన్ అలోవెరా జెల్ వేసుకుని అన్నీ కలిసేలా బాగా కలుపుకోవాలి. దీంతో ఒక హెయిర్ టానిక్ రెడీ అవుతుంది. ఈ టానిక్‌ను మాడుకు పట్టించి 10 నిమిషాల పాటు మసాజ్ చేసుకోవాలి. గంట తర్వాత మైల్డ్‌షాంపూతో శుభ్రంగా తలస్నానం చేయాలి. ఇలా చేస్తే ఎంత తీవ్రంగా ఉన్న చుండ్రు అయినా మాయం అవడంతోపాటు తెల్ల జుట్టు త్వరగా రాకుండా ఉంటుంది. జుట్టు ఒత్తుగా పెరుగుతుంది. ఇవి చదవండి: మార్చి వచ్చింది.. బోండాం కొట్టు... -
అక్కడ ఉచిత ఇళ్లు దక్కేదెవరికి? కీలక సర్వే చేపట్టనున్న అదానీ..
ఆసియాలోనే అతిపెద్ద మురికివాడలలో ఒకటైన ముంబై ధారావి గురించి చాలా మంది వినే ఉంటారు. 640 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ధారవి మురికివాడ పునరాభివృద్ధి ప్రాజెక్టును మహారాష్ట్ర ప్రభుత్వం సహకారంతో అదానీ గ్రూప్ దక్కించుకుంది. గౌతమ్ అదానీ ద్వారా నియమించిన ఒక కంపెనీ రీ డెవలప్మెంట్ ప్రాజెక్ట్‌లో భాగంగా ఫిబ్రవరి నుంచి ముంబైలోని ధారవి స్లమ్‌లోని 10 లక్షల మంది నివాసితుల డేటా, బయోమెట్రిక్‌లను సేకరించడం ప్రారంభిస్తుంది. పునరాభివృద్ధి చేసిన ప్రాంతంలో ఉచిత గృహాలను పొందేందుకు ధారావి నివాసితుల అర్హతను నిర్ణయించడంలో ఈ సర్వే కీలకం. వీరే అర్హులు ధారావిలో చివరి సారిగా 15 సంవత్సరాల క్రితం ఓ సర్వే నిర్వహించారు. ధారావిలో 2000 సంవత్సరానికి ముందు నుంచి నివసిస్తున్నవారు మాత్రమే ఉచిత గృహానికి అర్హులు. ఈ సర్వే ఆధారంగా దాదాపు 7 లక్షల మంది పునరాస ప్రయోజనానికి అర్హత కోల్పోయి రోడ్డున పడతారని ఇక్కడి స్థానికులు ఆందోళన చెందుతున్నారు. ఈ నేపథ్యంలో అదానీ నేతృత్వంలోని సంస్థ ధారవి నివాసితులకు సంబంధించిన సమాచారాన్ని సేకరించేందుకు ఇంటింటికీ వెళ్లి పక్కాగా సర్వేను నిర్వహించనుంది. సర్వే బృందాలు ప్రతి ఇంటికి వెళ్లి బయోమెట్రిక్ డేటా సేకరిస్తాయని ప్రాజెక్ట్‌ను పర్యవేక్షిస్తున్న ధారావి రీడెవలప్మెంట్ అథారిటీ అధిపతి ఎస్వీఆర్ శ్రీనివాస్ తెలిపారు. అర్హత ఉన్న వారందరికీ ఇళ్లు రావాలని, అదే సమయంలో అనర్హులు ఎవరూ ప్రయోజనం పొందకూడదని ఆయన పేర్కొన్నారు. 9 నెలల్లో సర్వే పూర్తి ధారావిలో నివాసితుల సర్వే రెండు దశల్లో జరగనుంది. మొదటగా మూడు నుంచి నాలుగు వారాల్లో కొన్ని వందల మంది నివాసితులతో సర్వే పైలట్ దశ ప్రారంభం కానుంది. ఆ తర్వాత పూర్తి సర్వే తొమ్మిది నెలల వ్యవధిలో పూర్తవుతుందని భావిస్తున్నారు. ఉచిత గృహాలు లేదా పునరావాసం కోసం నివాసితుల తుది అర్హతను ధారావి రీడెవలప్మెంట్ అథారిటీ నిర్ణయిస్తుంది. సర్వేతోపాటు మొత్తం ప్రాజెక్ట్ నిర్వహణకు త్వరలో అదనపు సిబ్బందిని నియమిస్తామని శ్రీనివాస్ తెలిపారు. -
26న మెట్రోలో వారికి ఉచిత ప్రయాణం!
దేశంలోని వివిధ ప్రాంతాల్లో జనవరి 26, గణతంత్ర దినోత్సవానికి సన్నాహాలు ముమ్మరంగా సాగుతున్నాయి. దేశ రాజధాని ఢిల్లీలో రిపబ్లిక్ డే పరేడ్ కోసం రిహార్సల్స్ కొనసాగుతున్నాయి. గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఢిల్లీ-ఎన్సీఆర్లో నిఘా మరింతగా పెంచారు. ఢిల్లీలోని అన్ని కూడళ్లలో పోలీసులను మోహరించారు. వారు ప్రతి వాహనాన్ని తనిఖీ చేస్తున్నారు. ఇదిలా ఉండగా రిపబ్లిక్ డే పరేడ్ దృష్ట్యా, జనవరి 26న ఢిల్లీ మెట్రో రాకపోకల సమయాలను మార్చారు. ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ (డీఎంఆర్సీ) తెలిపిన వివరాల ప్రకారం గణతంత్ర దినోత్సవం నాడు ఉదయం నాలుగు గంటల నుండి మెట్రో రైళ్లు నడవనున్నాయి. ప్రజలకు పరేడ్‌ను చూసే అవకాశం కల్పించేందుకు డీఎంఆర్సీ మెట్రో రాకపోకల్లో మార్పులు చేసింది. 26న ఉదయం 4 గంటల నుంచి అన్ని రూట్లలో మెట్రో అందుబాటులో ఉండనుంది. రిపబ్లిక్ డే కార్యక్రమానికి హాజరయ్యేందుకు ఈ-టికెట్లు లేదా ఈ-ఇన్విటేషన్లు కలిగినవారికి ప్రత్యేక కూపన్లు జారీ చేయనున్నట్లు డిఎంఆర్సి ప్రిన్సిపల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అనూజ్ దయాల్ సమాచారం తెలిపారు. ఈ కూపన్లు కలిగిన ప్రయాణికులు ‘కర్తవ్య పథ్’ వరకూ మెట్రోలో ఉచితంగా ప్రయాణించవచ్చు. ఉచిత ప్రయాణం కోసం ప్రయాణీకులు తమ ఈ-టికెట్, ఈ-ఇన్విటేషన్ లేదా ఫోటో గుర్తింపు కార్డును మెట్రో స్టేషన్‌లోని సంబంధిత కౌంటర్లలో చూపించవలసి ఉంటుంది. ఇదిలావుండగా రిపబ్లిక్ డే సందర్భంగా రాజధానిలోని పలు బస్సుల రూట్లను కూడా మార్చారు. జనవరి 26న విజయ్ చౌక్, రాజ్‌పథ్, ఇండియా గేట్, తిలక్ మార్గ్-బహదూర్ షా జఫర్ మార్గ్-ఢిల్లీ గేట్-నేతాజీ సుభాష్ మార్గ్లలోకి ఎలాంటి వాహనాన్ని అనుమతించరు. Delhi Metro services to commence at 4:00 Am on 26th January. pic.twitter.com/DnK6Ak1sHh — Delhi Metro Rail Corporation (@OfficialDMRC) January 24, 2024 -
పెట్రోల్ బంకుల్లో ఈ సేవలుండాల్సిందే..! లేదంటే..
కరీంనగర్: 'కరీంనగర్‌కు చెందిన శ్రీధర్ కమాన్‌కు సమీపంలోని ఓ పెట్రోల్ బంకులో పెట్రోల్ పోయించుకునేందుకు వెళ్లాడు. పెట్రోల్ పోసుకుని, బైక్ టైర్లో గాలి నింపాలని అక్కడి సిబ్బందిని కోరగా.. ఇక్కడ అలాంటివేమీ ఉండవని, గాలి పంపు పనిచేయడం లేదని సమాధానం ఇచ్చారు. చాలాబంకుల్లో గాలి నింపేందుకు డబ్బులు వసూలు చేస్తున్నారనే ఆరోపణలు నగరంలో ఉన్నాయి. గాలే కాదు.. చాలా బంకుల్లో మరుగుదొడ్లు, మంచినీటి సదుపాయాలు కానరావడం లేదు.' పెట్రోల్ బంకుల్లో ఉచిత సేవలకు అనుచితంగా వ్యవహరిస్తున్నారా అయితే ఇది మీ కోసమే. బంకుల్లో టైర్లలో గాలి, తాగునీరు, మూత్రశాలలు, ఫోన్ సౌకర్యం తదితర సేవలు ఉచితం. వీటిపై అవగాహన లేకపోవడంతో డబ్బులు వసూలు చేస్తున్నారు. అసలే పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలతో వాహనదారులు ఇబ్బందులు పడుతుంటే అదనపు వ్యయం భారంగా మారుతోంది. చిల్లరే కదా అనుకుంటే నెలకు రూ.కోట్లలోనే సామాన్యుల జేబుకు చిల్లు పడుతోంది. మనం చెల్లించే డబ్బులే.. డీజిల్ అయినా పెట్రోలైనా లీటరుపై మనం పెట్రోలు బంక్‌కు 4 నుంచి 6 పైసలు కేవలం మరుగుదొడ్లు, మూత్రశాలల నిర్వహణ కోసం చెల్లిస్తున్నాం. ప్రతీ బంకులో టాయిలెట్, మంచినీరు, ఎయిర్ ఫ్రీగా అందించాలి. ఇలా అందిస్తేనే పెట్రోల్ బంకు నిర్వహణకు అనుమతి దొరుకుతుంది. చాలామంది ప్రయాణంలో ఉన్నవారు టాయిలెట్ అర్జంట్ అయినప్పుడు పబ్లిక్ టాయిలెట్స్ కోసమో.. నిర్మానుష్య ప్రదేశాల కోసమో వెతుకుతారు. కానీ పెట్రోల్ బంకుకు వెళ్లరు. ఇక మీద ఎమర్జెన్సీ టైంలో దర్జాగా బంక్‌లకు వెళ్లండి. అది మన హక్కు. సగటున ఒక బంకులో రోజుకు 10 వేల లీటర్ల చమురు అమ్మితే.. టాయిలెట్ మెయింటనెన్స్ కాస్ట్ కింద ఆ బంకుకు వచ్చే ఆదాయం రోజుకు రూ.600 అంటే నెలకు రూ.18వేలు. జిల్లాలో ఉన్న అన్ని బంకుల్లో కలిపి వాహనదారులు రోజువారీగా చెల్లిస్తున్న మొత్తం రూ.14లక్షలకు పైనే. ఈ డబ్బుతో టాయిలెట్, మంచినీరు అందించాల్సిన బాధ్యత ఆయా బంక్‌లదే. పెట్రోల్ పంపుల వద్ద స్వచ్ఛమైన తాగునీటి వసతి ఉండాలి. ఇందుకోసం ఆర్వోయంత్రం, వాటర్ కూలర్, వాటర్ కనెక్షన్ స్వయంగా పొందాలి. ఏ బంకుల్లోనైనా తాగునీటి వసతి లేకపోతే చమురు మార్కెటింగ్ సంస్థకు ఫిర్యాదు చేయొచ్చు. స్వచ్ఛభారత్‌లో భాగంగా అన్ని పెట్రోలు, డీజిల్ బంకుల్లో వాహనదారులు, ప్రజల సౌకర్యార్థం శుభ్రతతో కూడిన మూత్రశాలలు, మరుగుదొడ్లు ఉంచాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది. అత్యవసర పరిస్థితుల్లో చరవాణి వినియోగించుకునే సదుపాయం పంపుల్లో ఉండాల్సిందే. మీరు వెళ్లే మార్గంలో ఏదైనా సమస్యలో చిక్కుకుంటే మీ వద్ద మొబైల్ ఫోన్ అందుబాటులో లేకపోతే భయపడాల్సిన పనిలేదు. ఏదైనా పెట్రోలు పంపును సందర్శించడం ద్వారా మీరు ఏ నంబర్‌కు అయినా కాల్స్ చేసుకోవచ్చు. వాహన టైర్లలో గాలి నింపడానికి, గాలి శాతం తనిఖీ చేసుకోవడానికి యంత్రాన్ని అందుబాటులో ఉంచాలి. గాలి నింపేందుకు ఓ వ్యక్తిని అందుబాటులో ఉంచాలి. ఈ సౌకర్యం పూర్తిగా ఉచితంగా పొందొచ్చు. ఇటీవల గాలికి ప్రత్యామ్నాయంగా నైట్రోజన్ నింపుతున్నారు. ప్రతి బంకులో ఫిర్యాదు పెటె్ట్ లేదా రిజిష్టరు అందుబాటులో ఉంచాలి. అందులో వినియోగదారులు తమ ఫిర్యాదులను నమోదు చేయొ చ్చు. ప్రఽథమ చికిత్స కిట్ సౌకర్యం ప్రతీ బంకు వద్ద ఉండాలి. ప్రజలకు అవసరమైనప్పుడు వాటిని ఉపయోగించుకునే వీలుంటుంది. చమురు నాణ్యత, ప్రమాణాలను తెలుసుకునే హక్కు వినియోగదారులకు ఉంటుంది. పెట్రోలు, డీజిల్ నాణ్యత, పరిమాణాన్ని తెలుసుకునేందుకు ఫిల్టర్ పేపర్లు అందుబాటులో ఉంచాలి. వాటి ద్వారా నాణ్యతను పరీక్షించుకునే హక్కు మనకు ఉంటుంది. పెట్రోలు బంకుల్లో సంస్థ పేరు, యజమాని పేరు, సంప్రదింపుల నంబర్లు కచ్చితంగా ఏర్పాటు చేయాలి. పంపు యజమాని వాటిని ప్రజలకు కనిపించే విధంగా బంకుల ఎదుట ఏర్పాటు చేయాలి. పెట్రోలు బంకుల్లో బంకులు తెరిచే, మూసివేసే వేళలు తప్పనిసరిగా రాసి ఉంచాలి. పెట్రోలు, డీజిల్ తీసుకున్న తరువాత వినియోగదారులు వాటికి సంబంధించిన బిల్లులు తప్పనిసరిగా పొందాలి. ఇలా ఫిర్యాదు చేయండి పెట్రోలు బంకుల్లో వినియోగదారులకు అందించాల్సిన సౌకర్యాలను నిర్వాహకులు విస్మరిస్తే సెంట్రలైజ్డ్ పబ్లిక్ గ్రీవెన్స్ రిడ్రెస్ అండ్ మానిటరింగ్ సిస్టమ్ పోర్టల్‌ను సంప్రదించడం ద్వారా ఫిర్యాదు చేయొచ్చు. బంకులో కచ్చితంగా ఉండాల్సిన ఫిర్యాదు రిజిష్టరులో లిఖితపూర్వకంగా ఫిర్యాదు నమోదు చేయొచ్చు. లేదంటే సంబంధిత చమురు సంస్థ సేల్స్ మేనేజర్ పేరు, చరవాణి నంబర్లకు ఫోన్ ద్వారా ఫిర్యాదు చేయొచ్చు. ఇవన్నీ అందుబాటులో లేనట్లైతే సంబంధిత తహసీల్దారు కార్యాలయంలో ఫిర్యాదు చేయొచ్చు. -
డిసెంబరు 22 నుండి వైకుంఠ ద్వార దర్శనం ఉచిత టోకెన్ల జారీ
తిరుపతి: తిరుమల శ్రీవారి ఆలయంలో డిసెంబరు 23 నుండి జనవరి 1వ తేదీ వరకు వైకుంఠ ద్వార దర్శనానికి సంబంధించి డిసెంబరు 22వ తేదీ మధ్యాహ్నం 2 గంటల నుండి తిరుపతిలోని 9 ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన 90 కౌంటర్ల ద్వారా సర్వదర్శనం టైంస్లాట్ టోకెన్లు మంజూరు చేస్తామని టీటీడీ జేఈవో శ్రీమతి సదా భార్గవి తెలిపారు. కౌంటర్లను మంగళవారం ఆమె తనిఖీ చేశారు. ఈ సందర్భంగా జేఈవో మీడియాతో మాట్లాడుతూ తిరుపతిలోని విష్ణునివాసం, శ్రీనివాసం, గోవిందరాజస్వామి సత్రాలు, భూదేవి కాంప్లెక్స్, రామచంద్ర పుష్కరిణి, ఇందిరా మైదానం, జీవకోన హైస్కూల్, బైరాగిపట్టెడలోని రామానాయుడు హైస్కూల్, ఎంఆర్ పల్లిలోని జడ్పి హైస్కూల్లో కౌంటర్లు ఏర్పాటు చేశామని తెలిపారు. ఈ కౌంటర్లలో 4 లక్షలకు పైగా సర్వదర్శనం టోకెన్ల కోటా పూర్తయ్యేవరకు మంజూరు చేస్తామని వెల్లడించారు. కౌంటర్ల వద్ద ప్రత్యేకంగా క్యూలైన్లు, బారీకేడ్లు ఏర్పాటు చేశామని, వేచి ఉండే భక్తులకు తాగునీరు, అల్పాహారం, టీ, కాఫీ అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని వివరించారు. టోకెన్లు, టికెట్లు పొందిన భక్తులను 24 గంటలు ముందు మాత్రమే తిరుమలకు అనుమతిస్తామన్నారు. దర్శన టోకెన్లు ఉన్నవారిని మాత్రమే తిరుమల శ్రీవారి దర్శనానికి అనుమతిస్తామని, టోకెన్లు లేని భక్తులు తిరుమలకు వెళ్లవచ్చు గానీ దర్శనానికి అనుమతించబడరని, ఈ విషయాలను కౌంటర్ల వద్ద అనౌన్స్మెంట్ చేస్తామని చెప్పారు. తిరుపతిలోని అన్ని కౌంటర్ల వద్ద క్యూఆర్ కోడ్ ఏర్పాటు చేస్తామని, త్వద్వారా భక్తులు ఇతర ప్రాంతాల్లోని కౌంటర్లకు సులువుగా చేరుకోవడానికి వీలు కలుగుతుందని చెప్పారు. సర్వదర్శనం టోకెన్ల సమాచారం తెలుసుకుని ప్రణాళిక ప్రకారం తిరుమలకు వచ్చి స్వామివారి అనుగ్రహానికి పాత్రులుకావాలని కోరారు. జేఈవో వెంట ఎస్ఈలు శ్రీ సత్యనారాయణ, శ్రీ వెంకటేశ్వర్లు, డెప్యూటీ ఈవోలు శ్రీ గోవిందరాజన్, శ్రీ సుబ్రమణ్యం, ఐటి జిఎం శ్రీ సందీప్, అదనపు ఆరోగ్యశాఖాధికారి డాక్టర్ సునీల్‌కుమార్, ఎవిఎస్వో శ్రీ నారాయణ తదితరులు ఉన్నారు. -
పాపం పోయినట్లు సర్టిఫికేట్ ఇచ్చే ఆలయం! ఎక్కడుందంటే..?
ఎన్నో రకాల ఆలయాలు వాటి విశేషాల గురించి విని ఉన్నాం. కానీ ఇలాంటి ఆలయం గురించి వినే ఉండే అవకాశమే లేదు. ఇలాంటివి కూడా ఉన్నాయా?.. అని షాకింగ్ అనిపిస్తుంటుంది కూడా. పాపం పోగొట్టుకోవాలని దేవాలయాలకు వెళ్తాం. అలాగే సిద్ధాంతులు చెప్పే పరిహారాలను కోసం తెగ డబ్బు వెచ్చిస్తాం కూడా. కొన్ని రకాల దానాలతో కూడా పాపాలు పోగొట్టుకునే యత్నం కూడా చేస్తాం. కానీ అవేమీ అక్కర్లేకుండా నేరుగా ఈ ఆలయానికి వెళ్లి పాపం పోగొట్టుకోవడమే కాకుండా పోయినట్లు ఓ ధ్రువీకరణ పత్రం కూడా తెచ్చేసుకోవచ్చు. అది కూడా చాలా తక్కువ ఖర్చుతోనే. ఆ ఆలయం ఎక్కడుందంటే.. అలాంటి ఆలయం రాజస్థాన్‌లోని ప్రతాప్‌గఢ్‌లో ఉంది. శతాబ్దాలుగా తీర్థయాత్రలకు ప్రసిద్ధిగాంచిన ఆలయం. దీనిని గిరిజనుల హరిద్వార్ అని కూడా పిలుస్తారు. ఆ ఆలయంలో ఎన్నో ఏళ్లుగా పాపం పోయినట్లు ధ్రువీకరణ పత్రాలను ఇచ్చే ఆచారం ఉంది. దీన్ని గౌతమేశ్వర్ మహాదేవ్ పాపమోచన తీర్థంగా పిలుస్తారు. ఇక్కడ మందాకిని పాప మోచిని గంగా కుండ్ అనే రిజర్వాయర్ ఉంది. దీనిలో స్నానం చేస్తే సర్వపాపాలు పోతాయనేది భక్తుల ప్రగాఢ విశ్వాసం. ఈ గుడిలో కేవలం రూ. 12/-లు చెల్లించి వాటర్ ట్యాంక్‌లో స్నానం చేస్తే పాపవిమోచన పత్రం ఇస్తారు. ఈ మేరకు ఆలయ పూజారి మాట్లాడుతూ..చేసిన తప్పులకు ప్రాయశ్చిత్తం చేసుకోవడానికి గ్రామస్తులు, చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు వస్తుంటారు. వారందరికీ పాప విమోచర ధృవీకరణ పత్రం కూడా ఇస్తామని తెలిపారు. హృదయంలో పాపం చేశామన్నా భావమే ఆయా భక్తులను ఇక్కడకు రప్పిస్తుంటుందని అక్కడి గ్రామస్తులు చెబుతున్నారు. వ్యవసాయం చేస్తున్నప్పుడూ తెలిసో తెలియక మనవల్ల కొన్ని రకాల సరీసృపాలు, కీటకాలు చనిపోతాయి. దీని వల్ల కూడా ఒక జీవిని బాధించిన పాపం మనలని వెంటాడుతుంది. అందుకే చాలామంది రైతులు ఇక్కడకు వచ్చి స్వామిని దర్శించుకుని ఈ గంగా కుండ్‌లో స్నానాలు ఆచరించి సర్టిఫికేట్‌ని తీసుకుంటారని చెబుతున్నారు ప్రజలు. ప్రతి ఏడాది ఈ గౌతమేశ్వరాలయంలో దాదాపు 250 నుంచి 300 దాక పాప విమోచన ధృవీకరణ పత్రాలు ఇవ్వడం జరగుతుందని ఆలయ పూజారి తెలిపారు. ఈ ఆచారం దేశానికి స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి కొనసాగుతున్నట్లు అక్కడి దేవాలయ అధికారులు చెబుతున్నారు. ప్రతి ఏడాది వేలాదిగా భక్తులు తరలి వస్తుంటారని, కేవలం పాపం పోగొట్టుకోవడం కోసమే గాక పూజలు కూడా నిర్వహిస్తుంటారని అన్నారు. (చదవండి: ఆరేళ్లక్రితం తప్పిపోయిన బాలుడిని 'ఆ ఫేస్బుక్ సందేశం'.. కుటుంబం చెంతకు చేర్చింది!) -
సీఎం సొంతూళ్లో సంబరాలు... రెస్టారెంట్లో చాయ్ ఫ్రీ!
మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రిగా మోహన్ యాదవ్ ప్రమాణస్వీకారం చేయడంతో ఆయన సొంత ఊరు ఉజ్జయినిలో సంబరాలు అంబరాన్ని అంటాయి. మోహన్ యాదవ్ మద్దతుదారులు నగరాన్ని సీఎం అభినందనల పోస్టర్లతో నింపేశారు. మోహన్ యాదవ్ ముఖ్యమంత్రి అయినందుకు అతని అభిమాని ఒకరు తన రెస్టారెంట్లో రోజంతా ఉచితంగా టీ పంపిణీ చేశారు. ముఖ్యమంత్రి డాక్టర్ మోహన్ యాదవ్ ప్రమాణ స్వీకారోత్సవం భోపాల్‌లో జరిగినప్పటికీ, ఉజ్జయినిలో పండుగ వాతావరణం కనిపించింది. మోహన్ యాదవ్ అభిమాని ఆశిష్ రాథోడ్.. ఘాస్ మండిలోని తన హరిఓమ్ రెస్టారెంట్లో అందరికీ ఉచితంగా టీ అందించారు. మన దేశ ప్రధాని ఒకనాడు టీ విక్రయించారని, మోహన్ యాదవ్ కూడా కష్టపడి ఈ స్థానానికి చేరుకున్నారని రాథోడ్ పేర్కొన్నారు. మోహన్ యాదవ్ ముఖ్యమంత్రి కావడంతో నగర కీర్తి ప్రతిష్టలు మరింతగా పెరిగాయాన్నారు. ఈ సంబరాల నేపధ్యంలో తాను 300 లీటర్ల పాలు వినియోగించి, టీ తయారు చేసి, నగరవాసులకు ఉచితంగా అందిస్తున్నానన్నారు. ఇది కూడా చదవండి: లౌడ్ స్పీకర్లు బ్యాన్.. మాంసం విక్రయాలపై మార్గదర్శకాలు! -
Generative AI: చాట్ జీపీటీ-4కు ప్రత్యామ్నాయాలు ఇవిగో...
చాట్‌జీపీటీ.. ఆన్లైన్ సెర్చ్‌ను కొత్త పుంతలు తొక్కించిన తాజా సంచలనం. మెయిళ్లు రాయడం మొదలుకొని కథలల్లడం వరకూ ఎన్నో పనులను చిటికెలో చక్కబెట్టేయగలదీ కృత్రిమ మేధ ఆధారిత టెక్నాలజీ. అయితే జీపీటీ 4ను వాడటం పూర్తిగా ఉచితం కాదు. కొంతవరకూ ఫ్రీగా వాడుకోవచ్చు కానీ.. ఆ తరువాత మాత్రం ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది. మరి సమాచారం ఉచితంగా పొందాలంటే? ప్రత్యామ్నాయ మార్గాలు బోలెడున్నాయి. బింగ్ ఏఐ గూగుల్‌కు బదులుగా ఏఐ ఆధారిత సెర్చింజన్ బింగ్‌నూ వాడుకోవచ్చు. మైక్రోసాఫ్ట్‌కు చెందిన దీనిలో ఏఐ ఆధారిత జీపీటీ-4 కూడా ఉంది. దీని వెబ్సైట్లోకి వెళ్లి బింగ్ చాట్‌తో బోలెడన్ని విషయాలు తెలుసుకోవచ్చు. యాప్ రూపంలోనూ దీని సేవలను పొందొచ్చు. కంటెంట్‌ను సృష్టించుకోవచ్చు, డౌన్లోడ్ చేసుకోవచ్చు. బింగ్‌లోని రైటింగ్ అసిస్టెంట్ సాయంతో మెయిళ్లు రాసుకోవచ్చు. సెలవుల్లో ఎక్కడికైనా వెళ్లాలంటే ప్రయాణం సాఫీగా సాగటానికి ప్లాన్ చేసుకోవచ్చు. ఉద్యోగం కోసం ఇంటర్వ్యూను ఎదుర్కోవటానికి సన్నద్ధం కావొచ్చు. ఇక ఇమేజ్ జనరేటర్ ద్వారా ప్రాంప్ట్‌ను అందించి ఉచితంగా బొమ్మలను గీయించుకోవచ్చు. దీనిలోని ట్రాన్స్‌లేటర్ బోలెడన్ని భాషలను ఇట్టే అనువదిస్తుంది. ఇక ఏఐ ఆధారిత కోపైలట్ క్రెడబులిటీ ఉన్న సమాచారాన్ని అందిస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఏఐ సహాయంతో మన ఉద్దేశాన్ని అర్థం చేసుకొని, కచ్చితమైన సమాచారాన్ని ముందుంచుతుంది. మన ప్రాధాన్యాలు, గతంలో జరిపిన చర్చలను దృష్టిలో పెట్టుకొని వాటికి తగ్గట్టుగా స్పందిస్తుంది. మెర్లిన్ ఇదో క్రోమ్ చాట్‌జీపీటీ ఎక్స్టెన్షన్. ఏ వెబ్సైట్ మీదైనా యాక్సెస్ చేయొచ్చు. మెర్లిన్‌ను ఇన్స్టాల్ చేసుకొని, ఖాతాను ఓపెన్ చేస్తే చాలు. కంట్రోల్/ కమాండ్ ప్రాంప్ట్ రూపంలో ఆదేశాలు ఇస్తూ మనకు కావాల్సిన సమాచారాన్ని పొందవచ్చు. చిటికెలో బ్లాగులు, యూట్యూబు వీడియోలు, వెబ్సైట్ల సారాంశాన్ని ముందుంచుతుంది. సోషల్ మీడియా కంటెంట్‌నూ సృష్టించుకోవచ్చు. ఈమెయిళ్లు, కోడ్స్ రాసి పెడుతుంది. దీనిలోని చాట్‌జీపీటీ ప్లగిన్లు ఉత్పాదకత పెంచటానికి ఎంతగానో తోడ్పడతాయి. మెర్లిన్‌లోని కృత్రిమ మేధ ఎంతటి సంక్లిష్టమైన ప్రశ్నలకైనా సైడ్‌బార్‌లో సమాధానాలిస్తుంది. పోయ్ ఇది కోరాకు చెందిన ఏఐ యాప్. ఆంత్రోపోనిక్ సంస్థ రూపొందించిన క్లౌడ్ దగ్గరి నుంచి ఓపెన్ఏఐకి చెందిన జీపీటీ వరకు రకరకాల ఏఐ మోడళ్లను వాడుకోవటానికి వీలు కల్పిస్తుంది. ప్రశ్నలను సంధించి జవాబులు రాబట్టుకోవచ్చు. అత్యంత అధునాతన ఏఐ టెక్నాలజీ దీని సొంతం. అంతరాయాలులేని సంభాషణ, సృజనాత్మక కంటెంట్‌ను దృష్టిలో పెట్టుకొని పోయ్‌ను రూపొందించారు. దీని ఇంటర్ఫేస్ యూజర్ ఫ్రెండ్లీగా ఉంటుంది. ఏదైనా బాట్ లేదా ప్రాంప్ట్‌తో తేలికగా వాడుకోవచ్చు. ఇదీ చదవండి: ‘కనీసం రూ.100 చెల్లించలేకపోతున్నాం’.. మాకు వారితోనే పోటీ: సీఈఓ -
గృహజ్యోతి @ 3,431కోట్లు!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో అధికారంలోకి రాగానే గృహజ్యోతి పథకం కింద ఇళ్లకు 200 యూనిట్లలోపు విద్యుత్‌ను ఉచితంగా సరఫరా చేస్తామని కాంగ్రెస్ పార్టీ తన మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ అమలుకు(అందరికీ వర్తింపజేస్తే) ఏటా రూ.3,431.03 కోట్ల సబ్సిడీని రాష్ట్ర ప్రభుత్వం అందించాల్సి ఉంటుందని విద్యుత్ రంగ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం గృహ వినియోగదారులకు అందిస్తున్న సబ్సిడీలు, క్రాస్ సబ్సిడీలను కొనసాగిస్తూ అదనంగా ఈ మేరకు నిధులివ్వాల్సి ఉంటుందని చెబుతున్నారు. ► రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి (ఈఆర్సీ)కి డిస్కంలు సమర్పించిన వార్షిక ఆదాయ అవసరాల నివేదిక 2023–24లోని ఫారం–12 ప్రకారం రాష్ట్రంలో మొత్తం గృహ కేటగిరీ విద్యుత్ కనెక్షన్లు 1.20 కోట్లు కాగా, అందులో 1.05 కోట్ల కనెక్షన్లు నెలకు 200 యూనిట్లలోపు విద్యుత్‌ను మాత్రమే వినియోగిస్తున్నాయి. అంటే రాష్ట్రంలోని 87.9 శాతం గృహాలు నెలకు 200 యూనిట్లలోపు విద్యుత్‌ను వాడుతున్నాయి. ► ఇందులో అన్ని గృహాలూ నెలకు 200 యూనిట్ల విద్యుత్‌ను వినియోగించవు. కొన్ని గృహాలు 0–50 యూనిట్లలోపు, మరికొన్ని 51–100 యూనిట్లలోపు, ఇంకొన్ని గృహాలు 101–200 యూనిట్లలోపు విద్యుత్‌ను వాడుతున్నాయి. డిస్కంల లెక్కల ప్రకారం.. ఈ మూడు శ్లాబుల్లోని గృహాలకు 2023–24లో మొత్తం 9,021.95 మిలియన్ యూనిట్ల విద్యుత్‌ను సరఫరా చేయాల్సి ఉంటుంది. ► గృహ వినియోగదారులకు జారీ చేసే విద్యుత్ బిల్లుల్లో వాడిన విద్యుత్ మేరకు ఎనర్జీ చార్జీలతో పాటుగా మినిమమ్ చార్జీలు, ఫిక్స్డ్ చార్జీలు, కస్టమర్ చార్జీలను విధిస్తారు. ఈ నాలుగు రకాల చార్జీలు కలిపి 1.05 కోట్ల గృహ వినియోగదారులకు 200 యూనిట్లలోపు ఉచిత విద్యుత్ సరఫరా చేసేందుకు రూ.3,431.03 కోట్ల విద్యుత్ సబ్సిడీని రాష్ట్ర ప్రభుత్వం డిస్కంలకు ఇవ్వాల్సి ఉంటుంది. వ్యవసాయానికి ఉచిత విద్యుత్ సరఫరా, కాళేశ్వరం వంటి ఎత్తిపోతల పథకాల విద్యుత్ బిల్లులు, కొన్ని వర్గాల గృహాలకు సబ్సిడీ విద్యుత్ సరఫరా కోసం.. ఏటా రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్ పంపిణీ సంస్థ(డిస్కం)లకు రూ.11 వేల కోట్లకు పైగా నిధులను సబ్సిడీగా అందజేస్తోంది. గృహజ్యోతి పథకం అమలుతో విద్యుత్ సబ్సిడీల భారం రూ.15 వేల కోట్లకు చేరే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. -
చకచకా కరెంటు.. కుళాయి
సాక్షి, అమరావతి: ‘నవరత్నాలు–పేదలందరికీ ఇళ్లు’ పథకం కింద నిర్మిస్తున్న పేదల ఇళ్లకు మౌలిక సదుపాయాల కల్పనపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. నిర్మాణం పూర్తయిన ఇళ్లకు చకచకా విద్యుత్, కుళాయి కనెక్షన్లను ఇస్తోంది. ‘నవరత్నాలు–పేదలందరికీ ఇళ్లు’ పథకం కింద రాష్ట్రంలో ఇళ్లు లేని పేదలకు పక్కా గృహయోగం కల్పించేందుకు 30.75లక్షల మంది మహిళల పేరిట విలువైన ఇంటి స్థలాలను ఉచితంగా పంపిణీ చేసిన విషయం తెలిసిందే. అదేవిధంగా 21.75 లక్షల (19.13 లక్షల సాధారణ, 2.62 లక్షల టిడ్కో) ఇళ్ల నిర్మాణానికి ప్రభుత్వం అనుమతిచ్చింది. గత నెల 12వ తేదీ నాటికి 7.42 లక్షల (5.85 లక్షల సాధారణ, 1.57 లక్షల టిడ్కో) ఇళ్ల నిర్మాణాలను పూర్తిచేసి లబ్ధిదారులకు అందజేసింది. ఇక రాష్ట్రవ్యాప్తంగా పేదలకు ఇళ్లు నిర్మిస్తున్న 17వేల కాలనీల్లో శాశ్వత మౌలిక సదుపాయాల కల్పనకు ప్రభుత్వం ఏకంగా రూ.32 వేల కోట్లకు పైగా ఖర్చు చేస్తోంది. 6,655 కాలనీల్లో విద్యుత్ పనులు పూర్తి పేదల ఇళ్ల నిర్మాణాలు కొనసాగుతున్న 9,414 వైఎస్సార్–జగనన్న కాలనీల్లో విద్యుత్ ఏర్పాటు పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. ఇప్పటి వరకు 6,655 కాలనీల్లో విద్యుత్ స్తంభాలు నాటడం, వైర్లు లాగడం, ట్రాన్స్ఫార్మర్ల ఏర్పాటు పూర్తయింది. ఇక నిర్మాణం పూర్తయినవాటిలో 5,02,654 ఇళ్లకు విద్యుత్ కనెక్షన్లు ఇచ్చారు. మిగిలిన ఇళ్లకు కనెక్షన్లు ఇస్తున్నారు. అదే విధంగా నిర్మాణం పూర్తయిన ఇళ్లన్నింటికీ తాగునీటి సదుపాయం కల్పించారు. 1.15 లక్షల ఇళ్లకు ఇంకుడు గుంతలు కాలనీల్లో శాశ్వత మౌలిక సదుపాయాలైన డ్రెయిన్లు, రోడ్లు, సైడ్ కాలువలు నిర్మించాలంటే ఇళ్ల నిర్మాణాలన్నీ పూర్తికావాల్సి ఉంది. అలా కాకుండా ముందుగానే సదుపాయాలు కల్పిస్తే ఇళ్ల నిర్మాణ సమయంలో భారీ వాహనాల రాకపోకలు, ఇతర సందర్భాల్లో డ్రెయిన్లు, కాలువలు ధ్వంసమవుతాయి. అందువల్ల ప్రస్తుతం నిర్మాణం పూర్తయిన ఇళ్లకు తాత్కాలిక డ్రెయినేజీ అవసరాల కోసం ఇంకుడు గుంతలను ఏర్పాటు చేస్తున్నారు. ఇలా ఇప్పటి వరకు 1,15,973 ఇళ్లకు ఇంకుడు గుంతలను నిర్మించారు. అదేవిధంగా వైఎస్సార్, జగనన్న కాలనీలకు స్వాగత ఆర్చ్‌లను ప్రభుత్వం నిర్మిస్తోంది. 2,394 కాలనీలకు ఆర్చ్ నిర్మాణ పనులకు అనుమతులు ఇచ్చింది. ప్రస్తుతం 510 చోట్ల పనులను ప్రారంభించగా, 28 చోట్ల ఆర్చ్‌ల నిర్మాణం పూర్తయింది. మిగిలిన చోట్ల వివిధ దశల్లో నిర్మాణాలు కొనసాగుతున్నాయి. మరోవైపు నిర్మించిన ఇళ్లు అన్నింటికీ విద్యుత్, నీటి ఇంకుడు గుంతల ఏర్పాటు చేశారా.. లేదా.. అని ఆడిట్ నిర్వహించాలని ఇటీవల గృహ నిర్మాణ శాఖ అధికారులను సీఎం జగన్ ఆదేశించారు.