
అమెజాన్ విద్యార్థుల కోసం బ్యాక్ టూ కాలేజ్ పేరిట బంపర్ ఆఫర్‌ను ప్రకటించిన విషయం తెలిసిందే. తాజాగా ‘బ్యాక్ టూ స్కూల్’ పేరిట విద్యార్థుల కోసం ఆపిల్ బంపర్ సేల్‌ను ప్రకటించింది. ఈ సేల్‌లో భాగంగా విద్యార్థులు ఆపిల్ మాక్ బుక్ లేదా ఐప్యాడ్ కొనుగోలు చేసిన వారికి ఉచితంగా ఎయిర్‌పాడ్స్‌ను అందించనుంది. ఈ ఆఫర్‌ను భారత అధికారిక ఆపిల్ ఆన్‌లైన్ స్టోర్‌లో పొందవచ్చును. ఆపిల్ అందిస్తోన్న సేల్ ప్రకారం.. విద్యార్థులు మాక్ బుక్‌ను కొనుగోలు చేస్తే ఉచితంగా వైర్డ్ ఛార్జింగ్ వెర్షన్ ఎయిర్‌పాడ్స్‌ను అందించనుంది.
ఒక వేళ విద్యార్థులు వైర్ లెస్ ఛార్జింగ్ ఎయిర్‌పాడ్స్‌ను కోరితే అదనంగా రూ. 4000 ను చెల్లించాల్సి ఉంది. ఎయిర్‌పాడ్స్ ప్రోపై ఆసక్తి ఉన్న వారు అదనంగా రూ. 10,000 చెల్లిస్తే విద్యార్థులు వాటిని పొందవచ్చును. కాగా ఆపిల్ ఎయిర్‌పాడ్స్ ధరలు వరుసగా రూ. 14,900, ఎయిర్‌పాడ్స్ వైర్‌లెస్ ఛార్జింగ్ రూ. 18,900, ఎయిర్‌పాడ్స్ ప్రో రూ. 24, 900గా ఉన్నాయి. అంతేకాకుండా విద్యార్థులు మాక్‌బుక్ ఎయిర్, మాక్‌బుక్ ప్రో, ఐమాక్, మాక్ ప్రో, మాక్ మినీ, ఐప్యాడ్ ప్రో, ఐప్యాడ్ ఎయిర్ లాంటి ఆపిల్ ఉత్పత్తులపై 20 శాతం వరకు డిస్కౌంట్ ఆఫర్‌ను పొందవచ్చును.
విద్యార్థులకు ఆపిల్ పెన్సిల్, కీ బోర్డుపై ఎల్లప్పుడు డిస్కౌంట్లను అందించనుంది. అంతేకాకుండా విద్యార్థులు కేవలం నెలకు రూ. 49 చొప్పున ఆపిల్ మ్యూజిక్ సబ్‌స్క్రిప్షన్ తీసుకుంటే ఆపిల్ టీవీ ప్లస్ సబ్‌స్క్రిప్షన్‌ను ఉచితంగా పొందగలరు. దాంతో పాటుగా ఈ సబ్‌స్క్రిప్షన్‌పై ఆపిల్ ఆర్కేడ్‌ను మూడు నెలల పాటు విద్యార్థులకు ఆపిల్ అందించనుంది. కాగా ఈ ఆఫర్ కేవలం ప్రస్తుతం ఉన్న, కొత్త కాలేజీలో ఉన్న విద్యార్థులకు వర్తించనుంది. బ్యాక్ టూ స్కూల్ ఆఫర్‌ను కాలేజీల ఐడీనుపయోగించి విద్యార్థుల అర్హతను ధృవీకరిస్తారని ఆపిల్ తన కంపెనీ అధికారిక వెబ్‌సైట్‌లో తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment