back to school
-
Kudumbashree Mission: బడి రెక్కలతో మళ్లీ బాల్యంలోకి...
ఆ క్లాసురూమ్‌లో చిన్న శబ్దం కూడా పెద్దగా వినిపించేంత నిశ్శబ్దం. స్కూల్ యూనిఫామ్‌లో మెరిసిపోతున్న విద్యార్థులు టీచర్ చెప్పే పాఠాన్ని శ్రద్ధగా వింటున్నారు. పాఠం పూర్తయిన తరువాత ‘ఏమైనా డౌట్స్ ఉన్నాయా?’ అని టీచర్ అడిగితే ఒక్కొక్కరు తమ డౌట్స్‌ను అడగడం మొదలు పెట్టారు...‘ఈ దృశ్యంలో విశేషం ఏముంది... అన్ని స్కూళ్లలో కనిపించేదే కదా’ అనే డౌటు రావచ్చు. అయితే ఈ క్లాస్‌రూమ్‌లో కూర్చున్న విద్యార్థులు పిల్లలు కాదు. ముప్ఫై నుంచి డెబ్బై ఏళ్ల వయసు వరకు ఉన్న మహిళలు. ఏవో కారణాల వల్ల చదువును మధ్యలోనే మానేసిన వీరు ‘బ్యాక్–టు–స్కూల్’ ప్రోగ్రామ్‌తో మళ్లీ బడిపిల్లలయ్యారు.... దేశంలోనే పెద్దదైన స్వయం సహాయక బృందం ‘కుదుంబశ్రీ మిషన్’ చదువును మధ్యలోనే మానేసిన మహిళలను తిరిగి స్కూల్‌కు తీసుకువచ్చే విధంగా రెండు నెలల పాటు విస్తృత ప్రచారం చేసింది. మెసేజ్‌లు, పోస్టర్లు, వీడియోల రూపంలో సోషల్ మీడియాలోనూ ప్రచారం నిర్వహించింది. వాట్సాప్ గ్రూప్‌లు ఏర్పాటు చేసింది. కేరళలోని 14 జిల్లాలలోని రెండువేలకు పైగా స్కూల్స్‌లో తిరిగే స్కూల్లిల్ (బ్యాక్ టు స్కూల్) కార్యక్రమంలో భాగంగా వందలాది మంది మహిళలు వీకెండ్ క్లాస్‌లకు హాజరవుతున్నారు. ‘నా వయసు యాభై సంవత్సరాలు దాటింది. పెళ్లివల్ల పదవతరగతి పూర్తి కాకుండానే చదువు మానేయవలసి వచ్చింది. బ్యాక్ టు స్కూల్ కార్యక్రమంలో భాగంగా వీకెండ్ క్లాస్‌కు హాజరయ్యే ముందు అందరూ నవ్వుతారేమో అనిపించింది. నవ్వడానికి నేను చేస్తున్న తప్పేమిటి? అని నాకు నేనే ధైర్యం చెప్పుకున్నాను. ఈ క్లాసులకు హాజరవడానికి ముందు మామూలు సెల్‌ఫోన్‌ను ఆపరేట్ చేయడం ఎలాగో నాకు తెలియదు. ఇప్పుడు మాత్రం డిజిటల్‌కు సంబంధించి చాలా విషయాలు నేర్చుకున్నాను. బ్యాంకు వ్యవహారాల్లో నేర్పు సంపాదించాను. ఒకప్పుడు ఇతరులు ఎవరైనా నాతో వస్తేనే బ్యాంకుకు వెళ్లేదాన్ని. ఇప్పుడు మాత్రం సొంతంగా బ్యాంకింగ్ వ్యవహారాలను చక్కబెడుతున్నాను. సొంతంగా వ్యాపారం మొదలు పెట్టడానికి రెడీ అవుతున్నాను. స్కూల్ ద్వారా ఎన్నో విలువైన సలహాలు తీసుకున్నాను’ అంటుంది కొట్టాయం జిల్లాకు చెందిన నీల. ‘బ్యాక్ టు స్కూల్’ వీకెండ్ క్లాస్‌లు అకడమిక్ పాఠాలకే పరిమితం కావడం లేదు. సుపరిపాలన, స్త్రీ సాధికారత, కష్టాల్లో ఉన్న వారికి కలిసికట్టుగా సహాయం చేయడం... ఇలా ఎన్నో సామాజిక, సేవా సంబంధిత చర్చలు క్లాస్‌రూమ్‌లో జరుగుతుంటాయి. ఈ చర్చలేవీ వృథా పోలేదు అని చెప్పడానికి ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి. ఈ క్లాసులకు హాజరవుతున్న ఒక మహిళ భర్తకు కిడ్నీ మార్పిడి చేయాల్సి వచ్చింది. ఇందుకోసం మహిళలు అందరూ కలిసి ఇందుకు అవసరమైన డబ్బును సేకరించారు. ‘తరగతులకు హాజరు కావడం ద్వారా ఆర్థిక స్వతంత్రత, డిజిటల్ అక్షరాస్యత, వ్యాపారదక్షత ప్రాముఖ్యత గురించి తెలుసుకున్నారు. ఎంతోమంది సొంతంగా వ్యాపారం ప్రారంభించారు’ అంటుంది శ్రీష్మ అనే ట్రైనర్. ‘యాభై దాటిన వారు స్కూల్‌కు రారేమో అనుకున్నాం. అయితే యాభై నుంచి అరవైఏళ్ల మధ్య వయసు ఉన్నవాళ్లే ఎక్కువ సంఖ్యలో ఉండడం ఆశ్చర్యాన్ని, ఆనందాన్ని కలిగించింది. వారి ఉత్సాహం చూస్తుంటే ముచ్చటేస్తుంది’ అంటుంది హసీనా అనే టీచర్. స్కూల్‌కు హాజరవుతున్న వాళ్లలో భిన్నమైన సామాజిక నేపథ్యాల నుంచి వచ్చిన వాళ్లు, భిన్నమైన ప్రతిభాపాటవాలు ఉన్న మహిళలు ఉన్నారు. పాలక్కాడ్ జిల్లా పుదుక్కోడ్ గ్రామానికి చెందిన రాధ రెండున్నర సంవత్సరాలుగా క్యాంటీన్ నడుపుతోంది. వీకెండ్ క్లాసులకు క్రమం తప్పకుండా హాజరవుతుంది. ‘ఎన్నో కొత్త విషయాలు నేర్చుకోగలిగాను అనేది ఒక సంతోషం అయితే, నేర్చుకున్న వాటి ద్వారా వ్యాపారాన్ని మరింత అభివృద్ధి చేయడం మరో సంతోషం’ అంటుంది రాధ. ‘ఫైనాన్సియల్ ప్లానింగ్, మహిళకు కొత్త జీవనోపాధి అవకాశాలు పరిచయం చేయడం, డిజిటల్ అక్షరాస్యత, సామాజిక ఐక్యత మొదలైన అంశాలకు సంబంధించి మాడ్యుల్ తయారు చేశాం’ అంటున్నాడు కుదుంబ శ్రీ మిషన్ స్టేట్ ప్రోగ్రామ్ కో–ఆర్డినేటర్ నిషాద్. ‘డిజైనింగ్‌కు సంబంధించి ఎన్నో క్లాసులు తీసుకున్నాను. క్లాసుకు హాజరవుతున్న మహిళల్లో కనిపిస్తున్న ఉత్సాహం చూస్తుంటే వారు భవిష్యత్‌లో తప్పకుండా విజయం సాధిస్తారనే నమ్మకం కలుగుతుంది’ అంటుంది మనప్పదం గ్రామానికి చెందిన పుష్పలత. ఫ్యాషన్ డిజైనింగ్ యూనిట్‌ను నెలకొల్పి ఎంతోమందికి ఉపాధి కల్పిస్తోంది పుష్పలత. -
విద్యార్థులకు గుడ్‌న్యూస్..! ఆపిల్ బంపర్ ఆఫర్..!
అమెజాన్ విద్యార్థుల కోసం బ్యాక్ టూ కాలేజ్ పేరిట బంపర్ ఆఫర్‌ను ప్రకటించిన విషయం తెలిసిందే. తాజాగా ‘బ్యాక్ టూ స్కూల్’ పేరిట విద్యార్థుల కోసం ఆపిల్ బంపర్ సేల్‌ను ప్రకటించింది. ఈ సేల్‌లో భాగంగా విద్యార్థులు ఆపిల్ మాక్ బుక్ లేదా ఐప్యాడ్ కొనుగోలు చేసిన వారికి ఉచితంగా ఎయిర్‌పాడ్స్‌ను అందించనుంది. ఈ ఆఫర్‌ను భారత అధికారిక ఆపిల్ ఆన్లైన్ స్టోర్‌లో పొందవచ్చును. ఆపిల్ అందిస్తోన్న సేల్ ప్రకారం.. విద్యార్థులు మాక్ బుక్‌ను కొనుగోలు చేస్తే ఉచితంగా వైర్డ్ ఛార్జింగ్ వెర్షన్ ఎయిర్‌పాడ్స్‌ను అందించనుంది. ఒక వేళ విద్యార్థులు వైర్ లెస్ ఛార్జింగ్ ఎయిర్‌పాడ్స్‌ను కోరితే అదనంగా రూ. 4000 ను చెల్లించాల్సి ఉంది. ఎయిర్‌పాడ్స్ ప్రోపై ఆసక్తి ఉన్న వారు అదనంగా రూ. 10,000 చెల్లిస్తే విద్యార్థులు వాటిని పొందవచ్చును. కాగా ఆపిల్ ఎయిర్‌పాడ్స్ ధరలు వరుసగా రూ. 14,900, ఎయిర్‌పాడ్స్ వైర్లెస్ ఛార్జింగ్ రూ. 18,900, ఎయిర్‌పాడ్స్ ప్రో రూ. 24, 900గా ఉన్నాయి. అంతేకాకుండా విద్యార్థులు మాక్‌బుక్ ఎయిర్, మాక్‌బుక్ ప్రో, ఐమాక్, మాక్ ప్రో, మాక్ మినీ, ఐప్యాడ్ ప్రో, ఐప్యాడ్ ఎయిర్ లాంటి ఆపిల్ ఉత్పత్తులపై 20 శాతం వరకు డిస్కౌంట్ ఆఫర్‌ను పొందవచ్చును. విద్యార్థులకు ఆపిల్ పెన్సిల్, కీ బోర్డుపై ఎల్లప్పుడు డిస్కౌంట్లను అందించనుంది. అంతేకాకుండా విద్యార్థులు కేవలం నెలకు రూ. 49 చొప్పున ఆపిల్ మ్యూజిక్ సబ్స్క్రిప్షన్ తీసుకుంటే ఆపిల్ టీవీ ప్లస్ సబ్‌స్క్రిప్షన్‌ను ఉచితంగా పొందగలరు. దాంతో పాటుగా ఈ సబ్‌స్క్రిప్షన్‌పై ఆపిల్ ఆర్కేడ్‌ను మూడు నెలల పాటు విద్యార్థులకు ఆపిల్ అందించనుంది. కాగా ఈ ఆఫర్ కేవలం ప్రస్తుతం ఉన్న, కొత్త కాలేజీలో ఉన్న విద్యార్థులకు వర్తించనుంది. బ్యాక్ టూ స్కూల్ ఆఫర్‌ను కాలేజీల ఐడీనుపయోగించి విద్యార్థుల అర్హతను ధృవీకరిస్తారని ఆపిల్ తన కంపెనీ అధికారిక వెబ్సైట్లో తెలిపింది. -
బ్యాక్ టు స్కూల్
చిన్నప్పుడు చదువుకున్న స్కూల్ అందరికీ స్పెషలే. అక్కడికి ఎప్పుడు వెళ్లినా మళ్లీ ఆ స్కూల్ స్టూడెంట్ అయిపోవడం కామన్. ఇప్పుడు అలానే బ్యాక్ టు స్కూల్ వెళ్లిపోయారు రామ్‌చరణ్. తను చదువుకున్న లారెన్స్ స్కూల్‌ను ఇటీవల సందర్శించారు. ఆ స్కూల్‌తో తనకున్న జ్ఞాపకాలను నెమరువేసుకున్నారు. ఆ ఫోటోలను చరణ్ భార్య ఉపాసన సోషల్ మీడియాలో అప్లోడ్ చేశారు. ‘‘జ్ఞాపకాలు ఎప్పటికీ ఉంటాయి. స్కూల్ క్యాంటీన్, హాస్టల్, క్లాస్ గ్రూప్ ఫోటో ఇవన్నీ చూసినప్పుడు పాత జ్ఞాపకాలు చటుక్కున గుర్తొసాయి. స్కూల్‌ని మిస్ అయిన ఫీలింగ్ కలిగిస్తాయి. చరణ్‌కి కూడా తన స్కూల్ జ్ఞాపకాలు చాలానే ఉన్నాయి. తనలోని చిన్నపిల్లోడిని మళ్లీ బయటకు తీసుకొచ్చాయి’’ అన్నారు ఉపాసన. ‘ఆర్ఆర్ఆర్’ సినిమా కోసం వర్కవుట్స్ చేస్తూ రామ్‌చరణ్ గాయపడిన సంగతి తెలిసిందే. దాంతో షూటింగ్‌కి చిన్ని బ్రేక్ ఇచ్చారు. ఆ బ్రేక్‌లో సరదాగా స్కూల్‌ను సందర్శించారనుకోవచ్చు. కొన్ని రోజుల్లో ‘ఆర్ఆర్ఆర్’ కొత్త షెడ్యూల్ స్టార్ట్ కానుంది. ఎన్టీఆర్, రామ్‌చరణ్ హీరోలుగా రాజమౌళి దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. -
ప్రభుత్వ అధికారులంతా.. మళ్లీ బడికి!!
అవును.. ప్రభుత్వాధికారులంతా మళ్లీ స్కూళ్లకు వెళ్తున్నారు. కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వశాఖ వచ్చేవారం నుంచి దాదాపు 35 మంత్రిత్వశాఖల్లోని అధికారుల కోసం సోషల్ మీడియా గురించిన పాఠాలు చెప్పబోతోంది. కేబినెట్ కార్యదర్శి అజిత్ సేథ్ లాంటి ఉన్నతాధికారులు ఈ సెషన్లలో మాట్లాడి, సోషల్ మీడియాను ఎలా ఉపయోగించుకోవాలి, కమ్యూనికేషన్ ఎలా ఉండాలన్న విషయాలపై శిక్షణ ఇస్తారు. సమాచార ప్రసారశాఖ మంత్రి ప్రకాష్ జవదేకర్ చెప్పడంతో వెంటనే ఈ సోషల్ మీడియా శిక్షణ తరగతులను నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. ఇప్పటివరకు 39 మంత్రిత్వ శాఖలు ఈ శిక్షణకు ముందుకొచ్చాయి. వీటిలో క్రీడలు, యువజన వ్యవహారాలు, మహిళా శిశు సంక్షేమం, ఆరోగ్యం, పంచాయతీరాజ్, పెట్రోలియం, రసాయనాలు ఎరువులు, తాగునీరు - పారిశుధ్యం లాంటి శాఖలున్నాయి.