అవును.. ప్రభుత్వాధికారులంతా మళ్లీ స్కూళ్లకు వెళ్తున్నారు. కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వశాఖ వచ్చేవారం నుంచి దాదాపు 35 మంత్రిత్వశాఖల్లోని అధికారుల కోసం సోషల్ మీడియా గురించిన పాఠాలు చెప్పబోతోంది. కేబినెట్ కార్యదర్శి అజిత్ సేథ్ లాంటి ఉన్నతాధికారులు ఈ సెషన్లలో మాట్లాడి, సోషల్ మీడియాను ఎలా ఉపయోగించుకోవాలి, కమ్యూనికేషన్ ఎలా ఉండాలన్న విషయాలపై శిక్షణ ఇస్తారు.
సమాచార ప్రసారశాఖ మంత్రి ప్రకాష్ జవదేకర్ చెప్పడంతో వెంటనే ఈ సోషల్ మీడియా శిక్షణ తరగతులను నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. ఇప్పటివరకు 39 మంత్రిత్వ శాఖలు ఈ శిక్షణకు ముందుకొచ్చాయి. వీటిలో క్రీడలు, యువజన వ్యవహారాలు, మహిళా శిశు సంక్షేమం, ఆరోగ్యం, పంచాయతీరాజ్, పెట్రోలియం, రసాయనాలు ఎరువులు, తాగునీరు - పారిశుధ్యం లాంటి శాఖలున్నాయి.
ప్రభుత్వ అధికారులంతా.. మళ్లీ బడికి!!
Published Sat, Jul 5 2014 12:44 PM | Last Updated on Mon, Oct 22 2018 6:02 PM
Advertisement
Advertisement